తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు
తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రంలో భర్తీ అయ్యే ప్రతి పదో ఉద్యోగం ఎస్టీలకు దక్కనుంది. ఇందుకనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సవరించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి రోస్టర్ పాయింట్లను కూడా ఖరారు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో గిరిజనులకు మరింత లబ్ధి చేకూరనుంది. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో గిరిజనులకు సరైన ప్రాతినిధ్యం దొరుకుతుంది.