• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆన్‌లైన్‌లో భారత్‌, కివీస్‌ మ్యాచ్‌ టికెట్లు

    హైదరాబాద్‌ ఉప్పల్‌లో జరగబోయే భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. మెుత్తం 39 వేల టికెట్లను హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ ఆన్‌లైన్‌లో ఉంచింది. అంతకముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌కు సంబంధించి సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 16 వరకు టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ నెల 18న మ్యాచ్ జరగనుంది.

    రేపటి నుంచే ఉప్పల్ టికెట్లు; ఎంతంటే?

    ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరగబోయే తొలి వన్డేకు సంబంధించి రేపటి నుంచి టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ తెలిపాడు. జనవరి 13వ తేదీ 6 వేలు, 14న 7 వేలు, 15న 7 వేలు, 16న 9417 టికెట్లను పేటీఎం ద్వారా విక్రయించనున్నట్లు వివరించారు. టికెట్ రేట్లు రూ.850 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఒక్కో వ్యక్తికి 4 టికెట్లు మాత్రమే ఇస్తామని.. బుక్ చేసుకున్నవారు ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో టికెట్లు తీసుకోవచ్చని చెప్పారు.

    గతంలో మాదిరిగా శ్రీవారి సర్వదర్శనం టికెట్లు

    ఈ నెల 12వ తేదీ నుంచి శ్రీవారి సర్వదర్శనం టికెట్లు గతంలో మాదిరిగానే జారీ చేయనున్నారు. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, గోవిందరాజస్వామి రెండో సత్రంలో ఇవ్వనున్నారు. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లు ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తితిదే వెల్లడించింది. వైకుంఠద్వారా దర్శనానికి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు జారీ పూర్తయ్యింది. ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజులపాటు జరగనుంది.

    వచ్చే నెల 11న ఫార్ములా రేసింగ్; టికెట్ల జారీ

    హైదరాబాద్‌లో ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ జరుగుతుందని తెలంగాణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ తెలిపారు. ఈ రేసింగ్‌కు ప్రజలను అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. నేటి నుంచి టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. ‘బుక్ మై షో’ వెబ్‌సైట్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. కేటగిరీలవారీగా టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రూ.10 వేలు, రూ.6 వేలు, రూ.3,500, రూ.1,000 టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు.

    24 నుంచి దివ్యాంగుల దర్శనం కోటా టికెట్లు

    తిరుమల శ్రీనివాసుని సన్నిధికి వెళ్లేందుకు దివ్యాంగుల దర్శనం కోటా టికెట్లను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు TTD ప్రకటించింది. వృద్ధులు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు తిరుమలేశుని దర్శించుకునేందుకు ఈ ఉచిత టికెట్ల ద్వారా అవకాశం లభిస్తుంది. 24న ఉదయం 10 గంటలకు టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. భక్తులు ఈ మేరకు బుక్‌ చేసుకోవాలని TTD సూచించింది.

    హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

    వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 టోర్నమెంట్‌కు సంబంధించి 5 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు ఐసీసీ ప్రకటించింది. 16 దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీని వీక్షించడానికి మొత్తం 82 దేశాల నుంచి ప్రేక్షకులు టికెట్లు రిజర్వ్ చేసుకున్నారు. ఎంసీజేలో జరిగే ఫైనల్ మ్యాచ్‌ను 86,174 మంది వీక్షించనున్నారు. కాగా 23న జరిగే ఇండో-పాక్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయినట్లు ఐసీసీ తెలిపింది.

    ALERT: రాత్రి 8తర్వాతే టికెట్లు

    హైదరాబాద్ వేదికగా జరిగే భారత్, ఆస్ట్రేలియా మూడో టీ20 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ టికెట్ల విక్రయం ఈరోజు ఉదయం ప్రారంభమవుతుందని అంతా అనుకున్నారు. కానీ, రాత్రి 8గంటల నుంచి PAYTMinsiderలో అందుబాటులోకి రానున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి.. ప్రజలను మభ్యపెట్టే అవకాశం ఉంది. కాబట్టి, టికెట్ కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

    IND Vs AUS.. టికెట్ల విక్రయం నేటినుంచే

    భారత్ Vs ఆస్ట్రేలియా సిరీస్‌లో మూడో టీ20 మ్యాచ్‌కి ఉప్పల్ వేదిక కానుంది. ఈనెల 25న జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లు నేడు ఉదయం 11గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి.. PAYTM యాప్ ద్వారా టికెట్‌ను కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.. టికెట్ ధర రూ.300 నుంచి రూ.10వేల వరకు ఉంది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతోంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

    TTD: రేపట్నుంచి జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్లు

    రేపట్నుంచి 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ తెలియజేసింది. రోజుకు 600 చొప్పున జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఈ టికెట్ ధరను రూ. 400 గా టీటీడీ నిర్ణయించింది. బయోమెట్రిక్ విధానం ద్వారా తిరుమలలోని సీఆర్వో కార్యాలయ కౌంటర్ లో నమోదు చేసుకోవచ్చునని టీటీడీ తెలిపింది.

    తిరుమ‌ల‌లో తొక్కిస‌లాట‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న భ‌క్తులు

    గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ విప‌రీతంగా ఉంది. టోకెన్ల కోసం ఎగ‌బ‌డ‌టంతో తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో ప‌లువురికి గాయాలయ్యాయి. దీంతో టీటీడీ అధికారులు ఎలాంటి స్లాట్‌లు లేకుండా సర్వ దర్శ‌నానికి అనుమ‌తించారు. దీంతో ప‌రిస్థితి కాస్త స‌ద్దుమ‌ణిగింది. తిరుపతిలో ఉదయం నుంచి క్యూలైన్లలో వేచి ఉండడంతో దాదాపు 10 వేల మంది భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం పరుగులు తీశారు. పోలీసులు కూడా ప‌రిస్థితిని నియంత్రించ‌లేక‌పోయారు. ఈ తోపులాటలో కొందరు భక్తులు తమ బంగారు ఆభరణాలను కూడా పోగొట్టుకున్నారు. దీనిపై భ‌క్తులు ఆవేద‌న … Read more