శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠ కాంప్లెక్సుల్లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కంపార్టుమెంట్ల వెలుపల క్యూలైన్లలలో సైతం స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. నిన్న వెంకన్నను 68 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 35 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.