హైదరాబాద్ చేరుకున్న మహేశ్ ఫ్యామిలీ
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫ్యామిలీతో కలిసి ఇటీవల అమెరికా టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. నేడు అందరూ ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్న మహేశ్ ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆగస్ట్ 9న మహేశ్ బర్త్‌డే సందర్భంగా పోకిరీ స్పెషల్ షోలు వేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో వచ్చిన డబ్బును మొత్తం మహేశ్‌బాబు ఫౌండేషన్‌కు అందించనున్నారు. ఇటీవల మహేశ్ చిన్న గడ్డంతో కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. త్రివిక్రమ్ సినిమా కోసమే ఆ లుక్‌లోకి మారినట్లు వార్తలు వస్తున్నాయి.