నేడు ఇండియాలో 10,273 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో 10,273 కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. కరోనా కారణంగా మరో 243 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 0.25 శాతానికి పడిపోయాయి. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య 10 శాతానికి తగ్గిపోయింది.