వైసీపీ ప్రభుత్వంపై వంగలపూడి అనిత విమర్శలు
వైసీపీ ప్రభుత్వంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోరెంట్ల మాధవ్ వీడియోపై మాట్లాడిన ఆమె… రేపు చేశారు అంటే రేపు రా అన్నట్లుగా పోలీసుల తీరు ఉందని విమర్శించారు. డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే పబ్లిక్ హాలిడే అని వెనక్కి పంపిస్తారా అని ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన ఐదురోజుల తర్వాత హోంమంత్రి బయటకు వచ్చి గోరెంట్లపై కుట్ర చేశారని అని అంటారా అని విమర్శించారు.