అజిత్ దోవల్‌కి వైట్ హౌజ్ స్వాగతం
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ అజిత్ దోవల్‌కు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారు చర్చలు జరిపారు. డిఫెన్స్ పార్ట్నర్షిప్, స్ట్రాటజిక్ టెక్నాలజీలో మరో మైల్‌స్టోన్‌ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జేక్ సల్లివాన్ వెల్లడించారు. ఇరు దేశాల ప్రజలు, ఆర్థిక వ్యవస్థల కోసం కలిసి పనిచేస్తామని పిలుపునిచ్చారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పురోగతి సాధించడానికి ప్రయత్నాలను కొనసాగిస్తామని జేక్ తెలిపారు.