ఆ దగ్గు మందులను నిషేధించండి; డబ్ల్యూహెచ్ఓ
కలుషిత దగ్గు మందుపై చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను కోరింది. ఐదేళ్లలోపు చిన్నారులు 300 మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఉజ్బెకిస్తాన్, జాంబియా, ఇండోనేషియా తదితర దేశాల్లో ఎక్కువగా పిల్లలు చనిపోయినట్లు వెల్లడించింది. కొన్ని దగ్గు మందుల్లో డైథలిన్ గ్లైకాల్, ఇథలిన్ గ్లైకాల్ అథిక స్థాయిలో ఉన్నట్లు తెలిపింది. ఇవి ప్రాణాంతకమని, సిరప్లలో వాడకూడదని సూచించింది. కలుషిత మందులపై చర్యలు తీసుకోవాలని తెలుపుతోంది.