• TFIDB EN
  • Editorial List
    ANR - Nagarjuna Movies: నాగార్జున- అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన చిత్రాలు ఇన్ని ఉన్నాయా?
    Dislike
    4k+ views
    1 year ago

    అక్కినేని నాగార్జున.. టాలీవుడ్‌లో లెజెండరీ హీరో నాగేశ్వరరావు నట వారసుడిగా వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన తండ్రిలాగే ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా రాణించారు. అంతేకాదు నాగేశ్వరావు గారితో నటించి సిల్వర్ స్క్కీన్‌పై కనుల విందు చేశారు. మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలను ఓసారి చూసేద్దామా..

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . మనం(మే 23 , 2014)
    UA|163 minutes|డ్రామా,ఫ్యామిలీ
    పునర్జన్మలు - ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ.

    అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల వారసులు ఈ చిత్రంలో నటించడం విశేషం. అక్కినాగేశ్వరరావు ఆయన కొడుకు నాగార్జున, మనవళ్లు.. నాగచైతన్య, అఖిల్ ఈ సినిమాలో నటించారు. అయితే ఈసినిమాను చూడకుండానే నాగేశ్వరరావు కనుమూశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై ఈసినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన శ్రియ, నాగచైతన్య సరసన సమంత నటించారు.

    2 . శ్రీరామదాసు(మార్చి 30 , 2006)
    U|150 minutes|డ్రామా,మ్యూజికల్
    గోపన్న కమలను వివాహం చేసుకుని హుస్నాబాద్‌కు తహశీల్దార్‌గా వెళ్తాడు. అక్కడ రామదాసు రాముడికి గుడి కట్టడంతో గొల్కొండ నవాబు అతన్ని బందీగా చేస్తాడు

    ANR- నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన ఐదో చిత్రం శ్రీరామదాసు. ఈ చిత్రాన్ని కే. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో నాగార్జున రామదాసుగా.. నాగేశ్వరరావు కబీర్‌గా నటించారు.

    3 . ఇద్దరు ఇద్దరే(సెప్టెంబర్ 05 , 1990)
    U|141 minutes|యాక్షన్,థ్రిల్లర్
    జడ్జి మధుసూదన్ రావు కుమారుడు రవి చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి విడిపోయి దొంగగా పెరుగుతాడు. ఇద్దరూ ఉమ్మడి శత్రువుతో పోరాడవలసి వచ్చినప్పుడు తండ్రీ కొడుకులు ఏకమవుతారు.

    ఎ. కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. నాగేశ్వరరావు జడ్జి పాత్రలో, నాగార్జున పనిపాటలేని రోడ్‌సైడ్ రోమియో పాత్రలో నటించారు. వీరిద్దరు తండ్రికొడుకులుగా నటించారు. ఈ చిత్రంలోని పాటలను రాజ్‌-కోటి స్వరపరచగా.. సూపర్‌హిట్‌గా నిలిచాయి.

    4 . రావుగారిల్లు(జూన్ 06 , 1988)
    U|166 minutes|డ్రామా
    న్యాయవాది అయిన ఆనంద్ రావు తన భార్య మరియు ఐదుగురు పిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే ప్రమాదంలో భార్య చనిపోవడంతో అతని జీవితం మారిపోతుంది.

    ANR- నాగార్జున కాంబోలో వచ్చిన మూడో చిత్రమిది. ఈ సినిమాలో నాగార్జున తన నిజ జీవితంలోని పాత్రను చేశారు. గెస్ట్ రోల్‌లో కనిపించారు. ఈ సినిమాను తరణి డైరెక్ట్ చేశారు.

    5 . అగ్ని పుత్రుడు(ఆగస్టు 14 , 1987)
    U|133 minutes|డ్రామా
    కాళిదాసు మత పెద్ద అయిన హరి హర బరద్వాజ కుమారుడు. కాళిదాసు తన గ్రామంలో ఉన్న మూఢ నమ్మకాలను ప్రశ్నించడం ప్రారంభించిన తర్వాత, అతనికి తన తండ్రితో తీవ్రమైన విభేదాలు ఏర్పడతాయి.

    కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో నాగార్జున- నాగేశ్వరరావు మధ్య డైలాగ్‌ వార్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

    6 . కలెక్టర్ గారి అబ్బాయి(ఏప్రిల్ 08 , 1987)
    U|170 minutes|డ్రామా
    ఒక కలెక్టర్, అతని కొడుకు వివిధ విషయాలలో పరస్పరం విభేదిస్తారు. అయితే, తండ్రి చివరకు తన కుమారుడి గొప్పతనాన్ని గుర్తించి, అతనిని మెచ్చుకుంటాడు.

    బి.గోపాల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో మొదటి సారి అక్కినేని నాగేశ్వరరావు- నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది.


    @2021 KTree