• TFIDB EN
  • Editorial List
    Venkatesh- Soundarya: వెంకటేష్- సౌందర్య జంటగా ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
    Dislike
    2k+ views
    6 months ago

    విక్టరీ వెంకటేష్- సౌందర్యకు తెలుగులో హిట్ పేయిర్‌ అని గుర్తింపు ఉంది. వీరిని సిల్వర్ స్క్రీన్ భార్య భర్తలుగా అభిమానులు ఆరాధించేవారు. వెంకటేష్- సౌందర్య కాంబోలో మొత్తం 7 సినిమాలు వచ్చాయి. వాటిలో పవిత్రబంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా వంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . సూపర్ పోలీస్(జూన్ 23 , 1994)
    U|150 minutes|డ్రామా,థ్రిల్లర్
    ఒక పోలీసు నేరస్థులందరినీ నిర్మూలించి, దేశంలో ప్రజలు జీవించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాలనుకుంటాడు. ఈక్రమంలో అతను ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటాడు.

    విక్టరీ వెంకటేష్- సౌందర్య జంటగా నటించిన తొలి చిత్రం సూపర్ పోలీస్. ఈ చిత్రాన్ని కే. మురళి మోహన్‌రావు డైరెక్ట్ చేయగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో జయసుధ కీలక పాత్రలో నటించారు.

    2 . ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు(మే 22 , 1996)
    U|147 minutes|డ్రామా,ఫ్యామిలీ
    శ్రీరామ్‌ సీతను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమెకు పిల్లలు కలగరు. బిజినెస్ పని మీద నేపాల్‌ వెళ్లిన శ్రీరామ్ అనుకోని పరిస్థితుల్లో అక్కడ మనీషాను పెళ్లి చేసుకుంటాడు. ఓ బిడ్డకు జన్మనిస్తాడు. ఇంటి పనిమనిషిగా మనీషాను తీసుకొచ్చినప్పుడు కథ మలుపు తిరుగుతుంది. సీతకు తెలియకుండా శ్రీరామ్ ఎలా మెనేజ్ చేశాడు. సీతకు నిజం తెలిసిందా? లేదా? అన్నది మిగతా కథ.

    ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్- సౌందర్య మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో వెంకటేష్- సౌందర్య హిట్ పేయిర్‌గా గుర్తింపు పొందారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.

    3 . పవిత్ర బంధం(అక్టోబర్ 17 , 1996)
    U|147 minutes|డ్రామా,ఫ్యామిలీ
    పెద్ద పారిశ్రామిక వేత్త కుమారుడైన విజయ్‌కు పెళ్లి పట్ల ఆసక్తి ఉండదు. తండ్రి పట్టుదలతో పెళ్లికి ఒప్పుకుంటాడు. అయితే ఇందుకు ఓ షరతు పెడతాడు. 12 నెలలు మాత్రమే కాపురం చేస్తానని అప్పటికీ పెళ్లిపై తన అభిప్రాయం మారకపోతే విడాకులు ఇస్తానని తండ్రికి చెబుతాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల రిత్యా విజయ్‌తో పెళ్లికి రాధ ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

    వెంకటేష్- సౌందర్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. టాలీవుడ్‌లో ఈ సినిమా ఆల్‌టైం క్లాసిక్ కల్ట్‌ మూవీల్లో ఒకటిగా నిలిచింది. పవిత్ర బంధం సినిమాను ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్‌ బాస్టర్ హిట్ సాధించింది.

    4 . పెళ్లి చేసుకుందాం(అక్టోబర్ 09 , 1997)
    U|141 minutes|డ్రామా
    అత్యాచారానికి గురైన ఒక యువతికి ఓ వ్యక్తి ఆశ్రయమిస్తాడు. ఆమెకి మళ్లీ బ్రతకాలనే ఆశ కల్పిస్తాడు. ఈక్రమంలో ఒకరికొకరు ప్రేమలో పడుతారు.

    ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో మరోసారి వెంకటేష్- సౌందర్య జత కట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన సౌందర్యతో పాటు లైలా కూడా నటించింది.

    5 . రాజా(మార్చి 18 , 1999)
    U|166 minutes|డ్రామా,రొమాన్స్
    రాజా తన స్నేహితుడు బాలుతో కలిసి అంజలి ఇంటికి దొంగతనానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు వారం పాటు ఇంట్లో అంజలి చెప్పిన పనులు చేసేందుకు అంగీకరిస్తాడు. ఈ క్రమంలో అంజలి గతాన్ని తెలుసుకున్న రాజా ఆమెకు సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. మరి రాజా ఆమెకు చేసిన సాయం ఏమిటి? ఈక్రమంలో అతను ఎదుర్కొన్న అవమానాలు ఏమటి అన్నది మిగతా కథ.

    ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. మరోసారి వెండితెర పర్ఫెక్ట్ పేయిర్ సౌందర్య- వెంకటేష్ జోడీగా నటించారు. ముప్పలనేని శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఎస్‌ఏ రాజ్‌కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది. ఈ సినిమా మొత్తం మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది.

    6 . జయం మనదేరా(అక్టోబర్ 07 , 2000)
    U/A|152 minutes|యాక్షన్,డ్రామా
    థమ్సప్ యూరప్‌ ట్రిప్‌కు వచ్చిన ఉమను చూసిన అభిరామ్ తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. ఉమ కూడా అభిరామ్‌ను ప్రేమిస్తుంది. అయితే వీరిద్దరు ఒకరికొకరు తమ ప్రేమను చెప్పుకోరు. ఉమ ఇండియాకి వచ్చేస్తుంది. తన ప్రేమను ఉమకు చెప్పేందుకు వచ్చిన అభిరామ్‌కు తన గతం గురించి తెలుస్తుంది.

    ఎన్‌ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్-సౌందర్య మధ్య వచ్చే కామెడీ పంచ్‌లు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఈ చిత్రంలో వెంకటేష్ డ్యుయల్ రోల్ చేయగా... ఆయన సరసన భానుప్రియ, సౌందర్య నటించారు.

    7 . దేవి పుత్రుడు(జనవరి 14 , 2001)
    U/A|162 minutes|డ్రామా,ఫాంటసీ
    బలరాం ఒక పురాతత్వ శాస్త్రవేత్త. దేవుడంటే నమ్మకం ఉండదు. అయితే సముద్రం నుంచి శ్రీకృష్ణుడి కాలం నాటి ఒక పెట్టెను వెలికి తీస్తాడు. ఆ పెట్టె ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకున్న బలరాం తిరిగి సముద్రంలోకి పంపించాలని ప్రయత్నిస్తాడు. అయితే కొంతమంది ఆ పెట్టె కోసం అతన్ని హింసిస్తారు.

    వెంకటేష్- సౌందర్య నటించిన చివరి చిత్రమిది. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. వెంకటేష్ సరసన సౌందర్యతో పాటు అంజలా జావేరి కూడా నటించింది.


    @2021 KTree