• TFIDB EN
  • Editorial List
    Balakrishna- Akkineni Nageswara Rao Movies: బాలకృష్ణ- నాగేశ్వరరావు కలిసి ఎన్ని సినిమాల్లో నటించారంటే?
    Dislike
    2k+ views
    5 months ago

    అక్కినేని నాగేశ్వరరావు అంటే తనకు తండ్రి సమానులు అని అనేక వేదికలపై నందమూరి బాలకృష్ణ చెప్పేవారు. వీరిద్దరి మధ్య అనుబంధం కేవలం బయటి జీవితానికి మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లోనూ ప్రతిబింబించింది. నాగేశ్వరరావు, బాలకృష్ణ మొత్తం మూడు సినిమాల్లో నటించారు. మరి ఆ సినిమాలు ఏమిటో ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . గాండీవం(ఆగస్టు 18 , 1994)
    U|154 minutes|యాక్షన్,డ్రామా
    ఒక వ్యక్తి తన శత్రువు వల్ల తప్పుడు కేసులో జైలుకు వెళ్తాడు. విడుదలైన తర్వాత తన మనవరాలి సాయంతో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు

    అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణ కాంబోలో వచ్చిన రెండో సినిమా ఇది. ఈ చిత్రంలో బాలయ్య నాగేశ్వరరావు కొడుకుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను ప్రియదర్శన్ డైరెక్ట్ చేశారు. బాలకృష్ణ సరసన రోజా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపిస్తారు. 'గోరువంక వాలగానె గోపురానికి' అనే సూపర్ హిట్ సాంగ్‌లో నాగేశ్వరరావు, బాలకృష్ణతో ఆడి పాడుతారు.

    2 . భార్య భర్తల బంధం(మార్చి 28 , 1985)
    U/A|డ్రామా
    విడాకులు తీసుకున్న జంట సంజీవి (అక్కినేని నాగేశ్వరరావు), అర్చన (జయసుధ), అర్చన కంపెనీలో సంజీవి వాటాలున్న కారణంగా కలుస్తూంటారు. ఈ దంపతులకు కృష్ణ (రజని) అనే కుమార్తె ఉంది, ఆమె తల్లితో నివసిస్తుంది. తల్లివద్ద ఆమెకు ఎటువంటి స్వేచ్ఛ ఉండదు రాధా (నందమూరి బాలకృష్ణ) సంజీవి సోదరి కుమారుడు. అమెరికాలో స్థిరపడిన భారతీయుడితో తమ కుమార్తెకు పెళ్ళి చేసేందుకు అర్చన ప్రయత్నిస్తోందని తెలిసి, రాధా కృష్ణలకు పెళ్ళి చెయ్యాలని సంజీవి ప్రయత్నిస్తాడు. ఆ పెళ్ళి జరుగుతుందా, సంజీవి, అర్చనలు ఏకమౌతారా అనేది మిగతా కథ.

    అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణ తొలిసారి "భార్యభర్తల బంధం" అనే సినిమాలో నటించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. నాగేశ్వరరావు మేనల్లుడిగా నటించారు. నాగేశ్వరరావు సరసన జయసుధ, బాలయ్య సరసన రజని నటించింది. ఈ చిత్రాన్ని వి.బి రాజేంద్రప్రసాద్ నిర్మించి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

    3 . శ్రీరామ రాజ్యం(నవంబర్ 17 , 2011)
    U|172 minutes|మైథలాజికల్
    రాముడి వనవాసం పూర్తైన తర్వాత సీతకు లవ-కుశలు జన్మిస్తారు. వారు తమ తండ్రి ఎవరో తెలియకుండా పెరుగుతారు. వాల్మీకి మహర్షి మార్గదర్శకత్వంలో వారు అయోధ్యలో రామాయణాన్ని బోధించడానికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

    అక్కినేని, బాలకృష్ణ నటించిన మూడో సినిమా ఇది. వీరిద్దరి కాంబోలో ఇదే చివరి సినిమా. ఈ చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ 'బాపు' గారు డైరెక్ట్ చేశారు. బాలకృష్ణ శ్రీరామచంద్రుడిగా నటించగా, నాగేశ్వరరావు వాల్మీకి పాత్ర పోషించారు. సీత క్యారెక్టర్‌లో నయనతార నచించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.


    @2021 KTree