• TFIDB EN
  • అభిలాష
    ATelugu2h 25m
    మరణశిక్షను రద్దు చేయాలనే ఆలోచనతో ఒక న్యాయవాది ఓ హత్య కేసులో కావాలని అరెస్ట్ అవుతాడు. అయితే ఆ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే క్రమంలో పెద్ద సమస్యను ఎదుర్కొంటాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    చిరంజీవి
    రాధిక శరత్‌కుమార్
    అర్చన
    రావు గోపాల్ రావు
    సర్వోత్తమరావు
    రాళ్లపల్లి
    విష్ణు శర్మ
    గొల్లపూడి మారుతీ రావు
    ఓబులేసు
    రాజ్యలక్ష్మి
    సర్వోత్తమరావు కూతురు
    భీమ రాజుభీమ రాజు
    మాడా వెంకటేశ్వరరావు
    ఉయ్యూరు రామకృష్ణ
    సిఎస్ రావు
    సత్యేంద్ర కుమార్
    PJ శర్మ
    విజయరామ్
    కృష్ణ చైతన్య
    తాం
    KLN రావు
    మల్లిఖార్జునరావు
    జి. మూర్తి
    ఎం. జగదీష్ బాబు
    సిబ్బంది
    ఎ. కోదండరామి రెడ్డి
    దర్శకుడు
    కెఎస్ రామారావు
    నిర్మాత
    ఇళయరాజా
    సంగీతకారుడు
    లోక్ సింగ్
    సినిమాటోగ్రాఫర్
    కోటగిరి వెంకటేశ్వరరావు
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్‌ జర్నీ.. సుధీర్‌ బాబు హిట్‌ కొట్టినట్లేనా?</strong>
    Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్‌ జర్నీ.. సుధీర్‌ బాబు హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు : సుధీర్‌ బాబు, షియాజీ షిండే, హర్షిత్ రెడ్డి, ఆమని, రాజ్‌ సుందరం, శశాంక్‌, సాయి చంద్‌, ఆర్నా, చంద్ర వేంపతి తదితరులు దర్శకత్వం : అభిలాష్ కంకర సంగీతం : జై కృష్ణ సినిమాటోగ్రఫీ : సమీర్ కల్యాణి ఎడిటింగ్‌ : అనిల్‌ కుమార్‌. పి నిర్మాత : సునీల బలుసు విడుదల తేదీ: 11-10-2024 సుధీర్‌ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa Nanna Super Hero Review). ఆర్ణా కథానాయికగా చేసింది. షాయాజీ షిండే, సాయిచంద్‌ కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ఈ మూవీ రిలీజ్‌ కానుండగా ఒక రోజు ముందే ప్రీమియర్స్‌ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తండ్రి సెంటిమెంట్‌ ప్రేక్షకులను మెప్పించిందా? వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సుధీర్‌ బాబుకు సక్సెస్‌ అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి ప్రకాష్‌ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోవడంతో రోజుల బిడ్డను అనాథశ్రమంలో ఉంచి పనికోసం బయటకు వెళ్తాడు. అనూహ్యంగా అరెస్టై 20 ఏళ్లు జైల్లో ఉండిపోతాడు. మరోవైపు ఆ పిల్లాడు జానీ (సుధీర్‌ బాబు)ని స్టాక్‌ బ్రోకర్‌ శ్రీనివాస్‌ (షియాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. జానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్‌ జీవితం తలకిందులు అవుతుంది. వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులపాలవుతాడు. ఈ కష్టాలన్నీ జానీ వల్లే అని భావించి అతడిపై ద్వేషం పెంచుకుంటాడు. ఊరంతా అప్పులు చేస్తుంటాడు. కానీ జానీకి మాత్రం శ్రీనివాస్ అంటే చాలా ప్రేమ. తండ్రి చేసిన అప్పులు కడుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ పవర్‌ఫుల్‌ రాజకీయ నాయకుడికి శ్రీనివాస్‌ రూ.కోటి బాకీ పడతాడు. అదే సమయంలో తన అసలైన తండ్రి ప్రకాష్‌ను జానీ కలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శ్రీనివాస్‌ అప్పు తీర్చడానికి జానీ ఎన్ని పాట్లు పడ్డాడు? జానీ ప్రేమను శ్రీనివాస్‌ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ఇప్పటివరకూ చేసిన చిత్రాలతో పోలిస్తే ఇందులో డిఫరెంట్‌ సుధీర్‌ బాబుని చూడవచ్చు. గతంలో బాడీ చూపిస్తూ యాక్షన్‌ సినిమాలు చేసిన అతడు ఇందులో మెచ్యూర్డ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. చక్కగా భావోద్వేగాలు పలికించాడు. పరిపూర్ణ నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. పెంపుడు తండ్రిగా షాయాజీ షిండే మంచి నటన కనబరిచాడు. అయితే అతడి క్యారెక్టర్‌లో డెప్త్‌ మిస్‌ అయ్యింది. మరోవైపు అసలు తండ్రిగా చేసిన సాయి చంద్‌ తనదైన యాక్టింగ్‌తో పాత్రలో జీవించేశాడు. సినిమాలో మేజర్‌ సన్నివేశాలన్నీ ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతాయి. హీరోయిన్‌గా ఆర్ణా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అక్కడక్కడ తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే తమిళం, మలయాళ భాషల చిత్రాలు చూసి తెలుగులో ఎందుకు ఇలాంటి ఫీల్‌గుడ్‌ చిత్రాలు రావని భావించేవారికి ఈ చిత్రం గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. దర్శకుడు అభిలాష్‌ కంకర ఎమోషనల్‌ టచ్‌ ఉన్న కథను ఈ సినిమాకు ఎంచుకున్నారు. చిన్నప్పుడే కొడుకును దూరం చేసుకున్న తండ్రి, పక్కనే ఉన్నా పట్టించుకొని పెంపుడు తండ్రి ఇలా భావోద్వేగాల నడుమ కథను నడిపించారు. అయితే నాన్నపై కొడుకుకి ఉన్న ప్రేమను ఎస్టాబ్లిష్‌ చేయడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. ఎమోషన్‌ క్యారీ అయిన తర్వాతే అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. ఫస్టాఫ్‌ మెుత్తం సుధీర్‌ బాబు, షాయాజీ షిండేల మధ్య కథ నడిపిన దర్శకుడు సెకాండాఫ్‌లో సాయి చంద్‌ పాత్రను తెరపైకి తీసుకొచ్చారు. సెకాండాఫ్‌ను మరింత ఎమోషనల్‌గా నడిపే ప్రయత్నం చేశారు. లాస్ట్‌ 20 నిమిషాలు ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు. నెమ్మదిగా సాగే కథనం, కమర్షియల్‌ హంగులు లేకపోవడం మైనస్‌గా మారాయి.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే జై కృష్ణ నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఎడిటింగ్‌ మాత్రం ఇంకాస్త బెటర్‌గా చేసి ఉంటే బాగుండేది. ల్యాగ్‌ సీన్లను తొలగించి సినిమాను ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథసుధీర్ బాబు నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్లో న్యారేషన్‌కమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5 
    అక్టోబర్ 10 , 2024
    <strong>Maa Nanna Super Hero: ఇదెక్కడి క్రేజీ ప్రమోషన్స్‌రా అయ్యా.. స్టార్లనే బురిడి కొట్టించారుగా!</strong>
    Maa Nanna Super Hero: ఇదెక్కడి క్రేజీ ప్రమోషన్స్‌రా అయ్యా.. స్టార్లనే బురిడి కొట్టించారుగా!
    ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయడంలో ప్రమోషన్స్‌ కీలక భూమిక పోషిస్తాయి. ప్రచార కార్యక్రమాలు ఎంత బాగా జరిగితే సినిమాపై అంత భారీగా హైప్‌ వస్తుంది. ఆడియన్స్‌లో సినిమా చూడాలన్న కోరిక బలపడుతుంది. అందుకే మేకర్స్‌ తమ సినిమాను ప్రమోట్‌ చేసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఆడియో ఫంక్షన్స్, ఇంటర్వూలు, సోషల్‌ మీడియా ప్రకటనలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే యంగ్‌ హీరో సుధీర్‌ బాబు నటించిన మా నాన్న సూపర్‌ హీరో చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్‌ చేస్తోన్న వినూత్న ప్రమోషన్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు అంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. క్రేజీ ప్రమోషన్స్‌! టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యంగ్‌ హీరోల్లో సుధీర్‌ బాబు (Sudheer Babu) ఒకరు. ఇటీవల ‘హరోం హరా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్‌ ఇప్పుడు మరో సినిమాతో ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాడు. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa Nanna Super Hero) చిత్రం అక్టోబర్‌ 11న రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ వినూత్న ప్రమోషన్స్‌కు తెర లేపింది. సినిమా బ్యానర్‌ను సిద్ధం చేసి పలువురు సెలబ్రిటీలు ఫొటోలు తీసుకుంటున్న టైమ్‌లో పోస్టర్‌ కనిపించేలా ప్రమోషన్స్ చేస్తోంది. యంగ్‌ హీరోలు వరుణ్‌ తేజ్‌, మంచు మనోజ్‌తో పాటు స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కూడా ఈ వినూత్న ప్రమోషన్స్‌లో తమకు తెలియకుండానే భాగమయ్యారు. దీంతో ఈ ప్రమోషన్స్‌కు నెట్టింట విశేష స్పందన వస్తోంది. స్టార్లను భలే బురిడి కొట్టించారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. సింపుల్ అండ్‌ న్యాచురల్‌గా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇది సెలబ్రిటీలకు తెలిసే జరిగిందా? లేదా? అన్నది మాత్రం సస్పెన్స్.&nbsp; https://twitter.com/isudheerbabu/status/1843218217977966798 https://twitter.com/i/status/1842791222047367544 https://twitter.com/i/status/1842084097621164229 అవాక్కైనా మంచు మనోజ్‌! తనకు తెలియకుండానే మా నాన్న సూపర్‌ హీరో ప్రమోషన్స్‌లో భాగం కావడంపై మంచు మనోజ్‌ నెట్టింట స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సుధీర్‌ బాబు తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేయగా దానికి అయోమయంగా చూస్తున్న బ్రహ్మీ జిఫ్‌ను జత చేశాడు. స్మైలీ ఎమోజీ ట్యాగ్‌ చేస్తూ తాను బాగా ఎంజాయ్‌ చేసినట్లు సంకేతం ఇచ్చారు. దీనిపై సుధీర్‌ బాబు కూడా ఆసక్తికర రిప్లే ఇచ్చారు. సారి బ్రో ఇంకో ఆప్షన్‌ దొరకలేదు అంటూ మనోజ్‌ను ట్యాగ్ చేశాడు. మొత్తానికి మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్ మాత్రం చాలా వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. https://twitter.com/HeroManoj1/status/1842102892628509031 ట్రైలర్‌పై మహేష్ ఏమన్నారంటే! ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero Promotions) ట్రైలర్‌ చూసి సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు చాలా మెచ్చుకున్నట్లు నటుడు సుధీర్‌ బాబు తెలిపారు. ‘మహేష్‌ బాబు సాధారణంగా ఏదైనా ఎక్కువ ఎక్స్‌ప్రెస్‌ చేయరు. ఆయనకు నేను తొలుత రఫ్‌ కట్‌ ట్రైలర్‌ పంపిస్తే బాగుందని మెసేజ్‌ పెట్టారు. ఆ తర్వాత ఫైనల్‌ ట్రైలర్‌ పంపా. అది చూశాక మాత్రం చాలా మెచ్చుకున్నారు. హార్ట్‌ టచ్చింగ్‌గా ఉందన్నారు. ఆఖర్లో వచ్చే మహేష్‌ పేరున్న డైలాగ్‌ ఫన్నీగా ఉందన్నారు. ఇలా తన నుంచి చాలా కొత్త మాటలు విన్నా. అలా తను సినిమా గురించి అంత ఎక్కువగా మాట్లాడేసరికి మా నమ్మకం రెట్టింపయ్యింది’ అంటూ తాజా ఇంటర్వ్యూలో సుధీర్‌ చెప్పుకొచ్చారు.&nbsp;
    అక్టోబర్ 08 , 2024
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.&nbsp; ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు కింగ్‌ ఆఫ్‌ కొత్త దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King of Kotha). ఆయన చిన్ననాటి మిత్రుడైన అభిలాష్‌ జోషిలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 24న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. గాండీవధారి అర్జున వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). సాక్షి వైద్య కథానాయిక. BVSN ప్రసాద్‌ నిర్మాత. వరుణ్‌తేజ్‌ ఇందులో సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న (శుక్రవారం) ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఏం చేశాడు? అన్నది సినిమా కథ. &nbsp; బెదురు లంక 2012 కార్తికేయ, నేహా శెట్టి జంటగా చేసిన చిత్రం ‘బెదురు లంక 2012’ (Beduru Lanka 2012). ఈ సినిమాకు క్లాక్స్‌ దర్శకత్వం వహించాడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించాడు. ఎల్బీ శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఏం చేస్తున్నావ్‌ విజయ్‌ రాజ్‌ కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌’ (Em chestunnav). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ కూడ ఆగస్టు 25న విడుదల కానుంది. హాలీవుడ్‌ సీన్లను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ప్రతీ 10 నిమిషాలకు కథ మలుపు తిరుగుతుంటుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.&nbsp; బాయ్స్‌ హాస్టల్‌ కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’ తెలుగులో&nbsp; ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు తెలుగులో ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాయి. నితిన్‌ కృష్ణమూర్తి దర్శకుడు కాగా.. ప్రజ్వల్‌, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్‌, శ్రీవత్స, తేజస్‌ జయన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 26న విడుదలవుతోంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లివే! బ్రో పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)- సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకుడు. తమిళంలో వచ్చిన ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. బేబీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమ కథ ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో (Baby the movie On Aha) స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు. ‘ఆహా గోల్డ్‌’ సభ్యత్వం కలిగిన వారు ఈ సినిమాను 12 గంటల ముందు నుంచే చూడొచ్చు. TitleCategoryLanguagePlatformRelease DateRagnarokWeb SeriesEnglishNetflixAugust 24Killer book clubMovieEnglishNetflixAugust 25LiftMovieEnglishNetflixAugust 25Aakhri sachWeb SeriesHindiDisney+HotstarAugust 25Somewhere queensMovieEnglishBook My ShowAugust 21Lakhan leela bhargavWeb SeriesHindiJio CinemaAugust 21Bajao&nbsp;MovieHindiJio CinemaAugust 25Invasion 2&nbsp;SeriesEnglishApple Tv PlusAugust 23 APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
    ఆగస్టు 21 , 2023
    <strong>OTT Releases Telugu: దీపావళి కానుకగా రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!</strong>
    OTT Releases Telugu: దీపావళి కానుకగా రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    ఈ వారం దీపావళి (Diwali Festival)ని పురస్కరించుకొని పలు కొత్త చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మీ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు రెడీ అవుతున్నాయి. వెలుగుల పండగ సందర్భంగా ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచేందుకు తాము సిద్ధమంటున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు క కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా సుజిత్‌ - సుదీప్‌ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘క’ (KA Movie). నయన సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్‌ 31న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఇందులో కిరణ్ అబ్బవరం పోస్టుమ్యాన్‌ పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలై ‘క’ ట్రైలర్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.&nbsp; లక్కీ భాస్కర్‌ మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'లక్కీ భాస్కర్' (Lucky Bhaskar).&nbsp; మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఒక సాధారణ ఉద్యోగి కోటీశ్వరుడిగా ఎలా మారాడు అన్న ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. సింగమ్‌ అగైన్‌ భారీ అంచనాలతో దీపావళి కానుకగా రాబోతున్న బాలీవుడ్‌ చిత్రం ‘సింగమ్‌ అగైన్‌’ (Singam Again). డీసీపీ బాజీరావు సింగమ్‌గా అజయ్‌ దేవ్‌గన్‌ నటించాడు. నవంబర్‌ 1న ఈ చిత్రం రిలీజ్‌ కాబోతోంది. ఇందులో అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌, రణ్‌వీర్‌సింగ్‌, కరీనా కపూర్‌, దీపికా పదుకొణె లాంటి స్టార్‌లు నటించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.&nbsp; అమరన్‌ తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'అమరన్‌' (Amaran). ఉగ్రదాడిలో మరణించిన ఆర్మీ ఉద్యోగి మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దిగ్గజ నటుడు కమల్‌ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 31న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది.&nbsp; బఘీర స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ అందించిన కథతో రూపొందిన కన్నడ చిత్రం 'బఘీర' (Bagheera). ఈ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణీ వసంత్‌ జంటగా నటించారు. సూరి దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా స్థాయిలో అక్టోబర్‌ 31న ఈ చిత్రం రిలీజ్‌ కాబోతోంది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు తంగలాన్‌ తమిళ నటుడు చియాన్ విక్రమ్‌ నటించిన రీసెంట్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా 'తంగలాన్‌' (Thangalan). ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రిలీజైన ఈ చిత్రం యావరేజ్‌ టాక్ తెచ్చుకుంది. చాలా రోజుల జాప్యం తర్వాత ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. అక్టోబర్‌ 31 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు.&nbsp; మా నాన్న సూపర్‌ హీరో సుధీర్‌బాబు హీరోగా న‌టించిన ‘మా నాన్న సూప‌ర్ హీరో’ (Ma Nanna Super Hero) మూవీ ఈ వారం స్ట్రీమింగ్‌లోకి రానుంది. అక్టోబర్‌ 31 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 వేదికగా ప్రసారం కానుంది. అభిలాష్ కంక‌ర ద‌ర్శ‌కత్వం వహించిన ఈ చిత్రంలో సాయిచంద్‌ షాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. ఆర్ణ హీరోయిన్‌గా చేసింది. అక్టోబ‌ర్ 11న థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. అర్థమైందా అరుణ్‌కుమార్‌ 2 హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ 'అర్ధమయ్యిందా..? అరుణ్‌ కుమార్‌'. సీజన్‌ 1కు విశేష స్పందన రావడంతో సీజన్ 2 (Arthamainda Arun Kumar Season 2)ను అక్టోబర్‌ 31న తీసుకొస్తున్నారు. ఆహాలో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సిరీస్‌లో పవన్‌ సిద్దు మెయిన్‌ లీడ్‌గా నటించాడు. TitleCategoryLanguagePlatformRelease DateTime Cut&nbsp;MovieEnglishNetflixOct 30Murder MindfullyMovieEnglishNetflixOct 31The Diplomat Season 2&nbsp;SeriesEnglishNetflixOct 31Love Mocktail Season 2SeriesTeluguETV WinOct 31Wizards Beyond Waverly PlaceSeriesEnglishHotstarOct 30Lubber PandhuMovieTelugu DubHotstarOct 31Koshkinda KandamMovieTelugu DubNetflixNov 1Joker: Folie à DeuxMovieEnglishAmazon&nbsp;Oct 29AnjamaiMovieTamilAha&nbsp;Oct 31Somebody Somewhere S3SeriesHindiAmazon&nbsp;Oct 25VettaiyanMovieTelugu/TamilAmazon&nbsp;Nov 7Mithya: The Dark ChapterSeriesTelugu, HindiZee 5Nov 1
    అక్టోబర్ 28 , 2024
    <strong>New Ott Releases This Week: దసరా స్పెషల్‌.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే!</strong>
    New Ott Releases This Week: దసరా స్పెషల్‌.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే!
    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి నెలకొంది. ఈ పండగను పురస్కరించుకొని తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద అలరించనున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు వేట్టయాన్‌ (Vettaiyan) తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్‌’.&nbsp; ‘జై భీమ్‌’ వంటి సోషల్‌ మెసేజ్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విశ్వం (Viswam) ప్రముఖ నటుడు గోపిచంద్‌ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా చేసింది. అక్టోబరు&nbsp; 11న (Viswam Movie Release Date) విడుదలవుతోంది. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన శ్రీను వైట్లతో నటుడు గోపిచంద్‌ గతకొంత కాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్‌ కొట్టాలని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన విశ్వం ట్రైలర్‌, టీజర్‌ ఆకట్టుకున్నాయి. మా నాన్న సూపర్‌ హీరో (Maa Nanna Super Hero) సుధీర్‌ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa Nanna Super Hero). ఆర్ణ కథానాయికగా చేసింది. షాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో అంచనాలను రేకెత్తించాయి. జనక అయితే గనక (Janaka Ithe Ganaka) యంగ్‌ హీరో సుహాస్‌ వరుసగా చిత్రాలు రిలీజ్‌ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘జనక అయితే గనక’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంకీర్తన కథానాయక. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. సందీప్‌ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ విడుదల కానుంది.&nbsp; జిగ్రా (Jigra) అలియా భట్, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్‌ బాలా రూపొందించిన బాలీవుడ్‌ చిత్రం ‘జిగ్రా’.&nbsp; అక్టోబరు 11న (Jigra Release Date) థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కలయికతో వచ్చిన ఈ చిత్రం అన్నివర్గాలు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.&nbsp; మార్టిన్‌ (Martin) కన్నడ నటుడు ధ్రువ సర్జా ఈ వారం మార్టిన్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎ.పి. అర్జున్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైభవి శాండిల్య కథానాయిక.ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని అక్టోబరు 11న (Martin Movie Release Date) విడుదల చేస్తున్నారు. యాక్షన్ చిత్రాల ప్రేమికులను ఈ మూవీ తప్పక మెప్పిస్తుందని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు లెవెల్ క్రాస్ అమ‌లాపాల్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెలల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్‌ అయూబ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆసిఫ్‌ అలీ హీరోగా న‌టించాడు. అక్టోబర్‌ 11 నుంచి ఆహాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ప్లాట్‌ ఏంటంటే చైతాలి (అమ‌లాపాల్‌) ట్రైన్ ప్ర‌మాదంలో గాయ‌ప‌డుతుంది. ఆమెను రైల్వే గేట్‌మెన్ ర‌ఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి త‌న‌కు పెళ్లి అయిన‌ట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateYoung SheldonMovieEnglishNetflixOct 08Monster High 2MovieEnglishNetflixOct 10Khel Khel MeinMovieHindiNetflixOct 09Starting 5SeriesEnglishNetflixOct 10Tomb Raider: Lara CroftAnimationEnglishNetflixOct 10Lonely PlanetMovieEnglishNetflixOct 10Outer Banks 4SeriesEnglishNetflixOct 10Up RisingSeriesEnglish/KoreanNetflixOct 11ChuckyMovieEnglishNetflixOct 15SurfiraMovieHindiHotstarOct 11WarieMovieTamilHotstarOct 11Pailan PillagaMovieTeluguETV WinOct 10Thatva&nbsp;MovieTeluguETV WinOct 10Guter GuMovieHindiJio CinemaOct 11Tea cupMovieEnglishJio CinemaOct 11Jai MahendranMovieMalayalamSonyLIVOct 11Raat Jawan HieMovieHindiSonyLIVOct 11
    అక్టోబర్ 07 , 2024
    <strong>Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!</strong>
    Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!
    టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు, బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్‌, కోదండరామిరెడ్డి, గుణశేఖర్‌, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్‌ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్‌, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. డ్యాన్స్‌కు కేరాఫ్‌! ‘పునాది రాళ్లు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగాస్టార్‌, కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తన టాలెంట్‌తో అధిగమించారు. నటనతో పాటు డ్యాన్స్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. డ్యాన్స్ అంటే చిరు.. చిరు అంటే డ్యాన్స్ అనే స్థాయిలో టాలీవుడ్‌పై బలమైన ముద్ర వేశారు. 1980 నుంచి 2005 మధ్య దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు డ్యాన్స్‌లో రారాజుగా వెలుగొందారు. చిరుతో డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్లే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. రీఎంట్రీ తర్వాత 60 ప్లస్‌ వయసులోనూ అదిరిపోయే డ్యాన్స్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. డ్యాన్స్‌లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సాధించిన నేపథ్యంలో చిరంజీవి అద్భుతమైన డ్యాన్స్ చేసిన టాప్‌-15 సాంగ్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రగులుతోంది మొగలిపొద (ఖైదీ) చిరంజీవిని సుప్రీం హీరోను చేసిన చిత్రం ఖైదీ. ఈ మూవీ సక్సెస్‌తో చిరంజీవి రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయారు. ముఖ్యంగా ఇందులోని ‘రగులుతుంది మొగలిపొద’ సాంగ్ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. చిరులోని గొప్ప డ్యాన్సర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. మాధవితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. పాములా మెలికలు తిరుగుతూ చిరు వేసిన స్టెప్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సాంగ్ షూట్‌ తర్వాత దాదాపు వారం రోజుల పాటు చిరు ఒళ్లు నొప్పులతో బాధపడ్డారట. ఈ సాంగ్‌ ఓసారి మీరూ చూసేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=nyxj1TAjn8Q చక్కని చుక్క (పసివాడి ప్రాణం) కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ‘చక్కని చుక్కలా’ సాంగ్‌ ద్వారా చిరు కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఈ సాంగ్‌ ద్వారానే చిరు బ్రేక్‌ డ్యాన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ పాటలో హీరోయిన్‌ విజయశాంతితో చిరు వేసిన స్టెప్స్‌ను నాటి తరం ఎప్పటికీ మరిచిపోలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=q5aetbezCqM నవ్వింది మల్లె చెండు (అభిలాష) ‘అభిలాష’ చిత్రంలోని ఈ పాటలో చిరు హుషారైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. లవ్‌ను ప్రేయసి&nbsp; ఓకే చేస్తే ఆ ప్రియుడు సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో చిరు చూపించారు. ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను కట్టిపడేసింది.&nbsp; https://www.youtube.com/watch?v=82hUDmPYazk హే పాప (త్రినేత్రుడు) ‘త్రినేత్రుడు’లోని ‘హే పాప’ అంటూ వచ్చే సాంగ్‌లో చిరంజీవి మరోసారి తన బ్రేక్ డ్యాన్స్‌ స్కిల్స్‌ను చూపించారు. ఓ క్లబ్‌లోని బ్రేక్‌ డ్యాన్సర్‌కు సవాలు విసిరిమరి చిరు నృత్యం చేస్తాడు. హీరోయిన్‌ భానుప్రియ కూడా అదిరిపోయే స్టెప్పులతో చిరుకు సహకారం అందించింది. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె చిరుకు పోటీగా సాంగ్‌ చేసింది.&nbsp; https://www.youtube.com/watch?v=1vOAj1HaG1Y పదహరేళ్ల వయసు (లంకేశ్వరుడు) ‘లంకేశ్వరుడు’ మూవీలోని ‘పదహరేళ్ల వయసు’ పాటకు అప్పట్లో సూపర్‌ రెస్పాన్స్ వచ్చింది. క్లాప్‌ క్లాప్‌ అంటూ సాంగ్‌ను స్టార్ట్‌ చేసిన చిరు తన హుషారైన స్టెప్పులతో విజిల్స్‌ వేయించారు. ఈ సాంగ్‌లోని చిరు గెటప్ చాలా ఏళ్ల పాటు యువతను ఒక ఊపు ఊపింది. ఈ సాంగ్‌లో చిరు వేసిన స్టెప్స్‌ అభిమానులు ఎప్పుడు గుర్తుంచుకుంటారు. రీసెంట్‌గా ‘మత్తు వదలరా 2’ చిత్రంలో కమెడియన్‌ సత్య ఈ సాంగ్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని స్టెప్పులు వేయడం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=fsnOGypjHI0 గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రం మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఇందులో గ్యాంగ్ లీడర్ అంటూ సాగే టైటిల్ సాంగ్‌లో చిరంజీవి వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ ఆ పాట చూస్తే మెగా ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. https://www.youtube.com/watch?v=KUZ4e7t4u5k స్టార్‌ స్టార్‌ మెగాస్టార్‌ (కొదమ సింహం) కొదమ సింహం సినిమాలోని 'స్టార్‌ స్టార్‌ మెగాస్టార్‌' సాంగ్‌ చిరంజీవిని డ్యాన్సర్‌గా మరో మెట్టు ఎక్కించింది. సుప్రీం హీరో ట్యాగ్‌ను దాటి మెగా స్టార్‌ ట్యాగ్‌ను అందించింది. ఇందులో ఆద్యంతం కౌబాయ్‌ కాస్ట్యూమ్స్‌లో కనిపించిన చిరు తన యునిక్‌ స్టెప్పులతో అదరగొట్టారు. ముఖ్యంగా తలపై టోపీని ఉపయోగిస్తూ ఆయన చేసిన డ్యాన్స్ తెలుగులో ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. అప్పటివరకూ టోపీని ఉపయోగించి ఏ తెలుగు హీరో స్టెప్స్‌ వేయలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=cFKyIHvudzI బంగారు కోడిపెట్ట (ఘరానా మొగుడు) రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఘరానా మొగుడు’ చిత్రం చిరంజీవి ఇమేజ్‌ని ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ సినిమాకు గాను రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకుని దేశంలో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఇక ఇందులోని 'బంగారు కోడిపిట్ట' సాంగ్‌ ఏ స్థాయిలో సెన్సేషన్‌ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుదేవా కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌లో డిస్కో శాంతిని టీజ్‌ చేస్తూ చిరు స్టెప్పులు వేశారు. డ్యాన్స్‌తో పాటు తన హావభావాలతో ఆకట్టుకున్నారు. చిరు కుమారుడు రామ్‌చరణ్‌ మగధీర చిత్రంలో ఈ సాంగ్‌ను రీమేక్‌ చేయడం విశేషం. https://www.youtube.com/watch?v=hxvUiz6s4Gk రూపుతేరా మస్తానా (రిక్షావోడు) రిక్షావోడు చిత్రంలోని ‘రూపుతేరా మస్తానా’ మ్యూజిక్‌ ప్రియులకు పూనకాలు తెప్పిస్తుంది. సంగీత దర్శకుడు కోటీ ఇచ్చిన వెస్టర్న్‌ బీట్‌ను మ్యాచ్‌ చేస్తూ చిరు ఇరగదీశారు. మెలికలు తిరుగుతూ వెస్టర్న్‌ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. హీరోయిన్‌ నగ్మాతో కలిసి మెస్మరైజ్ చేశారు.&nbsp; https://www.youtube.com/watch?v=mugdo_VO9pY నడక కలిసిన నవరాత్రి (హిట్లర్) ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘హిట్లర్’ మూవీలోని నడక కలిసిన నవరాత్రి సాంగ్ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీనికి లారెన్స్ కొరియోగ్రఫి చేశారు. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్‌ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా చేశాయి. హీరోయిన్‌ రంభ చిరుతో పోటీపడి మరి డ్యాన్స్ చేయడం గమనార్హం. https://www.youtube.com/watch?v=j2HY4G63qaE ఈ పేటకు నేనే మేస్త్రీ (ముఠా మేస్త్రి) ఈ సాంగ్‌లో చిరు వేసిన హుక్ స్టెప్స్‌ ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఈ పేటకు నేనే మేస్త్రీ అంటూ చేతిలో టవల్‌తో బాడిని బెండ్‌ చేసి భుజాలు ఎగరేసే స్టెప్‌ చాలా మందికి పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్‌ మెుత్తం చిరు లుంగీలోనే కనిపిస్తారు. తలకు టవల్‌ చుట్టుకొని మాస్‌ స్టెప్పులతో ఆద్యంతం అలరించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=oppz5I9KeQA దాయి దాయి దామ్మ (ఇంద్ర) ‘ఇంద్ర’ సినిమాలోని దాయి దాయి దామ్మ సాంగ్ చిరంజీవిలోని డ్యాన్సింగ్ స్కిల్స్‌ను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లింది. ఇందులోని వీణ స్టెప్‌ చిరు కెరీర్‌లోనే ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిచింది. లారెన్స్ కంపోజ్ చేసిన ఈ స్టెప్‌ను ఎంతో గ్రేస్‌తో చిరు చేశారు. అతి కష్టమైన ఆ స్టెప్‌ను అలవోకగా వేసి ఆశ్చర్యపరిచారు. ఈ స్టెప్‌ను ఇప్పటికీ చాలా మంది ట్రై చేస్తూ ఆనందిస్తుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=39W78Hp4E8A ఆటకావాలా పాటకావాలా (అన్నయ్య) ‘అన్నయ్య’ సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’ సాంగ్‌లో చిరు మాస్‌ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. చిరు డ్యూయల్‌ రోల్‌లో కనిపించిన ఏకైక సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్ అప్పట్లో ఎక్కడా చూసిన వినిపించేది.&nbsp; https://www.youtube.com/watch?v=9NGgI8OHTLY మన్మథ మన్మథ (ఠాగూర్) వి.వి. వినాయక్‌ డైరెక్షన్‌లో చిరు హీరోగా వచ్చిన ‘ఠాగూర్‌’ చిత్రం తెలుగు రికార్డు విజయాన్ని అందుకుంది. ఇందులోని ‘మన్మథ మన్మథ మామ పుత్రుడా’ పాట అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఇందులో చిరు నిలబడి వేసే వీణ స్టెప్‌ మెస్మరైజ్‌ చేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=FUnaQaxJNuQ అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు (ఖైదీ నెంబర్ 150) ‘ఖైదీ నెంబర్‌ 150’ చిరంజీవి రీఎంట్రీ చిత్రంగా వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరు తనదైన స్టెప్పులతో ఈ సినిమాలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’ అంటూ చిరు వేసిన హుక్‌ స్టెప్‌ ఫ్యాన్స్‌ను మునుపటి రోజులకు తీసుకెళ్లింది. ఆ సాంగ్‌ను మరోమారు చూసి ఎంజాయ్‌ చేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=7jHMP7J6tRs
    సెప్టెంబర్ 23 , 2024
    Chiranjeevi and Radhika Sarathkumar Movies List: చిరంజీవి- రాధికను హిట్ పేయిర్‌గా నిలిపిన సినిమాలు ఇవే!
    Chiranjeevi and Radhika Sarathkumar Movies List: చిరంజీవి- రాధికను హిట్ పేయిర్‌గా నిలిపిన సినిమాలు ఇవే!
    తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి- రాధిక జంటకు సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరు కలిసి 16 చిత్రాల్లో నటించారు. వీటిలో చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిపై ఓలుక్ వేద్దాం. కిరాయి రౌడీలు(1981) ఏ. కోదండ రామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మోహన్ బాబు కూడా నటించారు. చిరంజీవి సరసన రాధిక (Chiranjeevi- Radhika Movies) నటించిన తొలి చిత్రమిది. న్యాయం కావాలి(1981) డి. రామేశ్వరి నవల కొత్త మలుపు ఆధారంగా ఏ. కోదండరామిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధిక నటించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఇది పెళ్లంటారా( 1982) విజయ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. చిరంజీవి సరసన రాధిక హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరితో పాటు గొల్లపూడి మారుతీరావు నటించారు. పట్నం వచ్చిన పతివ్రతలు(1982) చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక(Chiranjeevi- Radhika Movies) నటించగా.. మోహన్ బాబు సరసన గీత నటించింది. ఈ సినిమాను మౌళి డైరెక్ట్ చేశారు. బిల్లా రంగా(1982) కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక హీరోయిన్‌గా నటించింది.&nbsp; ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటించారు. యమకింకరుడు(1982) రాజ్‌ భరత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధిక నటించింది. పులి బెబ్బులి(1983) చిరంజీవి- కృష్ణం రాజు కాంబోలో వచ్చిన ఈ చిత్రం హిట్ అయింది. చిరంజీవి సరసన రాధిక(Chiranjeevi- Radhika Movies), కృష్ణం రాజుకు జోడీగా జయప్రద నటించారు. ఈ చిత్రాన్ని KSR దాస్ డైరెక్ట్ చేశారు. ప్రేమ పిచ్చోలు (1983) ఏ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చిరంజీవి జోడీగా రాధిక నటించింది. పల్లెటూరి మొనగాడు(1983) చిరంజీవి రాధిక కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్లాప్ అయింది. ఈ సినిమాను SA చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు. అభిలాష(1983) ఉరిశిక్షను రద్దు చేయాలన్న ఇతివృత్తంతో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ సినిమాను ఏ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. చిరంజీవి సరసన రాధిక నటించింది. గూడచారి నెం.1 (1983) చిరంజీవి- రాధిక నటించిన ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. హీరో (1984) విజయ బాపినీడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక నటించింది. జ్వాలా(1985) చిరంజీవి, రాధిక జంటగా నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాను రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. దొంగ మొగుడు(1987) చిరంజీవి, రాధిక, భానుప్రియ, మాధవి కాంబోలో వచ్చిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రాన్ని ఏ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఆరాధన(1987) భారతీ రాజా డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన సుహాసిని, రాధిక నటించారు. హీరో రాజశేఖర్ ముఖ్య పాత్రలో నటించారు. రాజా విక్రమార్క(1990) చిరంజీవి- రాధిక, అమల కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం చిరంజీవితో రాధిక నటించిన చివరి చిత్రం.
    నవంబర్ 09 , 2023
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.&nbsp; ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 31 నుంచి ఆగస్టు 6వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు LGM భారత మాజీ క్రికెటర్‌ ఎం.ఎస్‌.ధోని నిర్మాణం నుంచి వస్తున్న తొలి చిత్రం ‘ఎల్‌జీఎం’ (LGM). లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’ అన్నది ఉపశీర్షిక. హరీష్‌ కల్యాణ్‌, ఇవానా జంటగా నటించిన ఈ సినిమాని రమేష్‌ తమిళమణి తెరకెక్కించారు. సాక్షి ధోని, వికాస్‌ హస్జా నిర్మించారు. నదియా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 4న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మన జీవితంలోని బంధాలు, బంధుత్వాల ప్రాముఖ్యత గురించి ఈ మూవీ తెలియజేస్తుందని మేకర్స్‌ తెలిపారు.&nbsp; రాజుగారి కోడిపులావ్ ‘రాజుగారి కోడిపులావ్‌’ (Rajugari kodipulao) చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో&nbsp;శివ కోన, ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి కీలక పాత్రలు పోషించారు. శివ కోన స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఒక వైవిధ్యమైన కథతో సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ చెబుతోంది.&nbsp; విక్రమ్‌ రాథోడ్‌ విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా బాబు యోగేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’ (Vikram Rathode). ఎస్‌.కౌశల్య రాణి నిర్మాత. సురేష్‌ గోపి, సోనూసూద్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న థియేటర్‌లలో విడుదల కానుంది. ప్రచార చిత్రాలను చూస్తే, దీన్నొక యాక్షన్‌ మూవీగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. మిస్టేక్‌ అభినవ్‌ సర్దార్‌ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘మిస్టేక్‌’ (Mistake). భరత్‌ కొమ్మాలపాటి దర్శకుడు. ఆగస్టు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; యాక్షన్‌, కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్‌.. ఇలా అన్ని రకాల అంశాలు ఉన్న మూవీ మిస్టేక్‌ అని చిత్ర బృందం చెబుతోంది. మెగ్‌ 2 హాలీవుడ్‌ మూవీ 'మెగ్‌ 2' (Meg 2) కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. 1999 నాటి ‘ది ట్రెంచ్‌’ అనే నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. బెన్ వీట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్‌ జాసన్ స్టాథమ్ హీరోగా నటించాడు. ఈ శుక్రవారం (ఆగస్టు 4) మెగ్‌ 2 థియేటర్స్‌లోకి రానుంది.&nbsp; మరికొన్ని చిత్రాలు అభివ‌న్‌మేడిశెట్టి, స్నేహా సింగ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ‘దిల్ సే’ కూడా ఆగ‌స్ట్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే డ‌బ్బింగ్ సినిమాలు బ్ల‌డ్ అంట్ చాకోలెట్‌, కిచ్చా సుదీప్(Kiccha Sudeep) నటించిన హెబ్బూలి కూడా ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాయి. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు రంగబలి నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘రంగబలి’ ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఆగస్టు 4 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. జులై 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీతో సాగి సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి సీరియస్‌గా మారుతుంది. ఈ సినిమా కథ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఇందులో నాగశౌర్య యాక్టింగ్, సత్య కామెడి హైలెట్ అని చెప్పొచ్చు. TitleCategoryLanguagePlatformRelease DateChoonaWeb SeriesHindiNetflixAugust 3The Hunt for VeerappanDocumentary SeriesTamil / EnglishNetflixAugust 4Guardians of the Galaxy Vol. 3MovieEnglishDisney+HotsterAugust 2DayaaWeb SeriesTeluguDisney+HotsterAugust 5PareshanMovieTeluguSonyLIVAugust 4DhoomamMovieTelugu / KannadaAmazon PrimeAugust 4
    జూలై 31 , 2023
    <strong>Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?</strong>
    Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
    మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. [toc] భోళా శంకర్ ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు. గాడ్ ఫాదర్ చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది. ఖైదీ నంబర్ 150 చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంజి చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది. శంకర్ దాదా జిందాబాద్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. శంకర్ దాదా M.B.B.S "మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. ఠాగూర్ తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు. మృగరాజు హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. స్నేహం కోసం కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది. హిట్లర్ మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది. ముగ్గురు మొనగాళ్లు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు. మెకానిక్ అల్లుడు "శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆజ్ కా గూండా రాజ్ "గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఘరానా మొగుడు "అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. పసివాడి ప్రాణం&nbsp; &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.&nbsp; చక్రవర్తి&nbsp; రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆరాధన&nbsp; భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; దొంగ మొగుడు&nbsp; ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్‌’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.&nbsp; వేట&nbsp; &nbsp;ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్&nbsp; &nbsp;యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; రాజా విక్రమార్క &nbsp;రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; ప్రతిబంధ్&nbsp; &nbsp;రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. త్రినేత్రుడు &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; ఖైదీ నంబర్ 786 &nbsp;విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అడవి దొంగ &nbsp;చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.&nbsp; చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; నాగు&nbsp; తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.&nbsp; ఇంటిగుట్టు &nbsp;చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.&nbsp; దేవాంతకుడు దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.&nbsp; హీరో విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్‌ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు. ‘ఖైదీ’ &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది. అభిలాష&nbsp; ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.&nbsp; ప్రేమ పిచ్చోళ్లు&nbsp; &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; బంధాలు అనుబంధాలు&nbsp; ‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.&nbsp; మంచు పల్లకీ&nbsp; &nbsp;వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.&nbsp; యమ కింకరుడు&nbsp; యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. పట్నం వచ్చిన పతివ్రతలు పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. చట్టానికి కళ్లులేవు చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. 47 రోజులు కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మొగుడు కావాలి చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు. మోసగాడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రేమ తరంగాలు 'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్‌. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. పున్నమి నాగు 'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఇది కథ కాదు కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు. మనవూరి పాండవులు బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
    సెప్టెంబర్ 25 , 2024
    Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్
    Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్
    నటీనటులు: అభిరామ్‌ దగ్గుబాటి, గీతికా తివారి, సదా, కమల్‌ కామరాజ్‌, కల్పలత, రవి కాలే, రజత్ బేడి దర్శకత్వం: తేజ సంగీతం: R.P పట్నాయక్‌ సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎంతో పేరు ఉంది. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు వారసులుగా వచ్చిన సురేష్‌బాబు, వెంకటేష్‌ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. సురేష్‌ బాబు విజయవంతమైన సినిమాలు నిర్మిస్తే.. వెంకటేష్‌ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వారి వారసుడుగా వచ్చిన రానా కూడా తనకంటూ ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ‘అహింస’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (జూన్‌ 2) రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?. అభిరామ్‌ తొలి హిట్‌ అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ రఘు (దగ్గుబాటి అభిరామ్) అహింసావాది. చీమకు కూడా హాని తలపెట్టని మనస్తత్వం అతనిది. రఘు అంటే అతని మరదలు అహల్య (గీతికా తివారి)కి ఎంతో ప్రేమ. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థమైన రోజే ఆమెపై ధనలక్ష్మి దుష్యంత రావు (రజత్ బేడీ) ఇద్దరు కుమారులు దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. పూర్తి అహింసావాదైన రఘు వారిపై న్యాయపోరాటానికి దిగుతాడు. అతడికి లాయర్‌ లక్ష్మీ (సదా) సాయం చేస్తుంది. ఈ క్రమంలో లక్ష్మీ కుటుంబాన్ని దుష్యంతరావు చంపేస్తాడు. దీంతో న్యాయంగా, అహింస మార్గంలో దుష్యంతరావును గెలవలేమని భావించిన హీరో ఏం చేశాడన్నది అసలు కథ. ఇది తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే హీరోగా అభిరామ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. కీలకమైన సన్నివేశాల్లో తన శక్తిమేరకు నటించాడు. ఇదే తొలి సినిమా కావడంతో నటన పరంగా ఓకే అని చెప్పొచ్చు. హీరోయిన్‌ గీతికా తివారి తన నటనతో ఆకట్టుకుంది. అందం, అభినయంతో మెప్పించింది. కొన్ని సీన్లలో అందాలు సైతం ఆరబోసింది. ఇక లాయర్‌ పాత్రలో సదా పర్వాలేదనిపించింది. రవి కాలె సహా మిగతా ఆర్టిస్టులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ తేజ మంచి కథనే ఎంచుకున్నాడు. కానీ, దాన్ని సరిగ్గా ప్రజెంట్‌ చేయలేకపోయారు. సినిమా చూస్తున్నంత ప్రేక్షకుడికి ఏమాత్రం ఆసక్తి ‌అనిపించదు. కొన్ని సీన్లు చూస్తే జయం, నువ్వు నేను సినిమాలే గుర్తుకు వస్తాయి. సినిమా మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. లాజిక్స్‌లతో సంబంధం లేకుండా ఈ సినిమాను తేజ తెరకెక్కించాడు. సినిమా పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు ఐటెమ్ సాంగ్ రావడం ఆడియన్స్‌కు రుచించదు. కొడుకుల శవాలు ఇంట్లో ఉండగా విలన్‌ ఇంట్లో ఐటెమ్‌ సాంగ్ ఎందుకు పెట్టడం అసలు అర్థం కాదు. దీంతో మూవీ త్వరగా ముగిస్తే బాగుంటుందన్న ఫీలింగ్‌ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. మెుత్తంగా సినిమాలో తేజ మార్క్‌ ఉన్నా రొటీన్‌ సన్నివేశాలతో బోర్ అనిపిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్‌ విషయాలకు వస్తే ఆర్పీ పట్నాయక్‌ సంగీతం పర్వాలేదనిపించిది. కొన్ని పాటలు బాగున్నాయి. ‘ఉందిలే’ పాట ఆకట్టుకుంది. చంద్రబోస్‌ అందించిన సాహిత్యం.. లోతైన భావంతో అర్థవంతంగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్‌రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ సినిమాటోగ్రఫీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీతరొటీన్‌ సీన్స్లాజిక్‌ లేని సన్నివేశాలు రేటింగ్‌: 2/5
    జూన్ 02 , 2023
    <strong>OG Movie: ఒక్క ట్వీట్‌తో మెగా అభిమానుల్లో జోష్‌ పెంచిన థమన్‌.. ‘ఓజీ ఇండస్ట్రీ హిట్‌ పక్కా’!</strong>
    OG Movie: ఒక్క ట్వీట్‌తో మెగా అభిమానుల్లో జోష్‌ పెంచిన థమన్‌.. ‘ఓజీ ఇండస్ట్రీ హిట్‌ పక్కా’!
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆగిపోయిన తన సినిమాలను ఇటీవలే మెుదలు పెట్టారు. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్ త్వరలోనే 'ఓజి' (OG) మూవీ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే పవన్‌ ప్రాజెక్ట్స్‌లో అన్నిటికంటే 'ఓజీ'పైనే ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ మూవీ అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ తాజాగా అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థమన్ ఏమన్నారంటే? పవన్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో 'ఓజీ' చిత్రం రూపొందుతోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌ డ్రామాగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో 'ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్‌ మరింత జోష్ పెంచారు. థమన్‌ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.&nbsp; https://twitter.com/MusicThaman/status/1842245316252209456 పాన్‌ ఇండియా స్థాయిలో పవన్‌ కల్యాణ్‌ ఓజీ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్‌ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్‌ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి. గతంలో వచ్చిన గ్లింప్స్‌ సైతం ఓజీ హైప్‌ క్రియేట్‌ చేసింది.&nbsp; https://twitter.com/tollymasti/status/1822184749072294337 అప్‌డేట్స్‌కు కేరాఫ్‌గా థమన్‌! సంగీత దర్శకుడు థమన్‌ తను పనిచేస్తున్న చిత్రాలకు సంబంధించి వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులకు తన వరుస అప్‌డేట్స్‌తో గ్రాండ్ ట్రీట్ ఇస్తున్నారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) నటిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) చిత్రానికి కూడా థమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆ మూవీకి సంబంధించి వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తూ దాదాపు మూవీ రిలీజ్‌ డేట్‌ను సైతం కన్ఫార్మ్‌ చేశారు. ఇప్పుడు 'ఓజీ' అప్‌డేట్స్‌ కూడా ఇచ్చి మెగా ఫ్యాన్స్‌ మరింత ఇష్టుడిగా మారిపోయారు.&nbsp; సమ్మర్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ ప్రస్తుతం పవన్‌ చేతిలో ఓజీతో పాటు ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustad Bhagat Singh) ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu Release Date) రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది.&nbsp;
    అక్టోబర్ 05 , 2024
    Samantha: సినిమాల నుంచి సడెన్‌గా తప్పుకున్న సమంత… ఆందోళనలో  అభిమానులు, హీరోలు.. కారణం ఇదే!
    Samantha: సినిమాల నుంచి సడెన్‌గా తప్పుకున్న సమంత… ఆందోళనలో  అభిమానులు, హీరోలు.. కారణం ఇదే!
    Samantha Ruth Prabhu: ఈ వార్త నిజంగా సమంత ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూసే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో సామ్ నటిస్తున్న ఖుషి( Kushi ) సినిమా చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుంది. ఈ షూటింగ్ మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సమంత తాజాగా వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్(Citadel) వెబ్‌సిరీస్ షూటింగ్ చివరి షెడ్యూల్‌ సైతం సెర్బియాలో పూర్తైంది. ఈ క్రమంలో భవిష్యత్‌లో ఏ సినిమాకు కమిట్ కావొద్దని నిర్ణయించుకుంది. సమంత చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ... ఇప్పటికే ఒప్పుకున్న  చిత్రాలకు తీసుకున్న ఆడ్వాన్స్ పేమెంట్‌ను సైతం నిర్మాతలకు సమంత తిరిగిచ్చేస్తోందని తెలిసింది. దాదాపు ఒక ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని సామ్ భావిస్తోందట.  Courtesy Instagram: samantha ఆదే కారణమా? గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ వ్యాధితో సామ్ ఆరు నెలలు పోరాడింది.  ఆ సమయంలో సమంత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. చికిత్స తీసుకుంటూ స్నేహితులతో కలిసి దేశ విదేశీ టూర్లు చేసి ఆ బాధ నుంచి ఉపశమనం పొందింది. అయితే ఇప్పుడు అదే మయోసైటిస్(Myositis) వ్యాధి తిరగబడినట్లు సమాచారం. శరీరం, ముఖంపై వస్తున్న మార్పులు గమనించిన సామ్.. పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావించింది. అందుకే కొద్దికాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కోలుకున్నాకే మూవీస్‌పై ఫొకస్ పెట్టాలని నిశ్చయించుకుంది. సమంత రాబోయే సినిమాలు శివ నిర్వాణ డైరెక్షన్‌లో సమంత-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న  మూవీ ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న రిలీజ్ కానుంది. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో సమంత చేస్తున్న వెబ్‌ సిరీస్ సిటాడెల్. ఈ వెబ్‌ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. అభిమానుల అండ ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత... కొద్దికాలంలోనే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. మహేష్ బాబు, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు  కోలివుడ్‌లోనూ అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ చైతు- సామ్ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఇరువురి మధ్య అభిప్రాయ భేదంతో విడాకులు తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఏ పని చేసినా హైలెట్ అవుతూ వస్తుంది. ఎంత మంది ట్రోల్ చేసిన.. ధైర్యం కోల్పోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఆమెను అభిమానించే ఫ్యాన్ ఎల్లప్పుడూ సామ్‌కు అండగా ఉంటూ మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సమంత త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించి అందర్ని అకట్టుకోవాలని సామ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
    జూలై 05 , 2023
    <strong>Devara Trailer Review: దేవర దెబ్బకు ఎరుపెక్కిన ఎర్ర సముద్రం.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న ట్రైలర్‌!</strong>
    Devara Trailer Review: దేవర దెబ్బకు ఎరుపెక్కిన ఎర్ర సముద్రం.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న ట్రైలర్‌!
    నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. జూనియర్‌ ఎన్టీఆర్‌గా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ నుంచి ట్రైలర్‌ విడుదలైంది. అందరి అంచనాలను అందుకుంటూ ట్రైలర్‌ వీక్షకులను ఎంతగానో అలరిస్తోంది. దేవర ట్రైలర్‌పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. దర్శకుడు కొరటాల శివ మార్క్‌ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది. కొన్ని డైలాగ్స్‌ చాలా బాగా పేలాయి.&nbsp; ట్రైలర్‌ రిలీజ్‌..! ముంబైలో గ్రాండ్‌గా ఎన్టీఆర్ ‘దేవర’ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, అనిల్ త‌డాని స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. మొత్తం 2 నిమిషాల 39 సెక‌న్లున్న ఈ ట్రైల‌ర్ మాస్ ఎలిమెంట్స్ ప్యాక్డ్‌గా ఉంది. ఎన్టీఆర్ అభిమానుల‌కు, యాక్ష‌న్ మూవీ ల‌వ‌ర్స్ కోరుకునే అంశాల‌ు పుష్కలంగా ఉన్నాయి. ఈ మూవీ కోసం ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ క్రియేట్ చేసిన ప్ర‌త్యేక‌మైన ప్ర‌పంచం, ఆయ‌న విజ‌న్ అద్భుతంగా ఉన్నాయి. ఆద్యంతం ఈ ట్రైలర్‌ యాక్షన్‌తో నిండిపోయింది. ఇందులో ఎన్టీఆర్‌ నట విశ్వరూపం చూపించారు.&nbsp; https://www.youtube.com/watch?v=5cx7rvMvAWo ఎలా సాగిందంటే? ట్రైల‌ర్‌ను పరిశీలిస్తే ప్ర‌కాష్ రాజ్ గంభీర‌మైన వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్‌గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది.&nbsp; ట్రైలర్‌లో అవే హైలెట్స్‌! ట్రైలర్‌ చూశాక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ట్రైలర్‌లో తారక్ డైలాగ్స్, నటన, మాస్ లుక్ తెగ ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కూడా చాలా క్యూట్‌గా పల్లెటూరి పిల్లగా కనిపించింది. 'వాడికి వాడి అయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే' అని తారక్‌ను జాన్వీ కపూర్ అంటుంది. దీంతో ఎన్టీఆర ఆశ్చర్యంగా చూస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌ ఆకట్టుకుంది. ట్రైల‌ర్ చివ‌ర‌లో ఎన్టీఆర్ షార్క్‌పై ఉండి రైడ్ చేసే సీన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. అటు ట్రైలర్‌లోని విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్‌ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అనిరుధ్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాలో మరో లెవల్లో ఉంటాయని ట్రైలర్‌ని బట్టే తెలిసిపోతుంది. అనిరుధ్‌ మార్క్‌ బీజీఎంతో సెప్టెంబర్‌ 27న థియేటర్లు మోతమోగనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.&nbsp;
    సెప్టెంబర్ 10 , 2024
    <strong>HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;</strong>
    HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;
    నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అధికారికంగా సినీ రంగ ప్రవేశం చేశాడు. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఈ అరంగేట్ర చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ (సెప్టెంబర్‌ 6) మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ఎగిరిగంతేసే న్యూస్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోక్షజ్ఞ పోస్టర్ ఎలా ఉందంటే నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ తాజాగా విడుదలైంది. ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్‌ లుక్‌లో స్మైలింగ్‌ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌ మోక్షజ్ఞకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407 తారక్‌ స్పెషల్‌ విషెస్‌ నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డేతో పాటు ఆయన డెబ్యూ ఫిల్మ్‌ పోస్టర్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) స్పందించారు. మోక్షజ్ఞను విష్‌ చేస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్‌డే మోక్షూ’ అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్‌ చేశారు. మరోవైపు నందమూరి హీరో కల్యాణ్‌ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘టిన్సెల్ టౌన్‌కు నీకు స్వాగతం మోక్షూ. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్స్‌ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు. రెండ్రోజులుగా వరుస హింట్స్‌ రెండు రోజులుగా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి హింట్స్‌ ఇస్తూనే వచ్చారు. ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని తొలుత అతడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ పెట్టిన మరో పోస్టు కూడా నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ. https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368 https://twitter.com/PrasanthVarma/status/1831604468355391886 ‘జై హనుమాన్‌’తో లింకప్‌! ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ ఫస్ట్‌ ఫిల్మ్‌ రూపొందనుంది. ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్‌ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన (Prasanth Varma) స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి&nbsp; తొలుత హనుమాన్‌ను ప్రశాంత్ వర్మ రిలీజ్‌ చేశారు. సెకండ్‌ ఫిల్మ్‌గా మోక్షజ్ఞ ఫిల్మ్‌ రాబోతోంది. ఈ విషయాన్ని ‘సింబా ఈజ్‌ బ్యాక్‌’ అనే పోస్టర్‌లో 'PVCU 2' ప్రాజెక్ట్‌ అంటూ ప్రశాంత్‌ వర్మనే స్పష్టం చేశారు. తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్‌ ఉంటుందని గతంలో ప్రశాంత్‌ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్‌ తర్వాత ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్‌'తో కనెక్షన్‌ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్‌ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌ మామా ఏం ప్లాన్‌ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/theBuzZBasket/status/1831944240831852919 శ్రీకృష్ణుడిగా బాలయ్య! మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్‌, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్‌ తరహాలోనే ఈ సినిమాలో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని, చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్‌ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; హీరోయిన్‌ ఫిక్స్ అయ్యిందా? మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్‌. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్‌ జోడీ మరో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.
    సెప్టెంబర్ 06 , 2024
    Pushpa 3: నో డౌట్‌.. ‘పుష్ప 3’ సినిమా పక్కా.. మైండ్‌ బ్లోయింగ్ అప్‌డేట్స్‌ మీకోసం!
    Pushpa 3: నో డౌట్‌.. ‘పుష్ప 3’ సినిమా పక్కా.. మైండ్‌ బ్లోయింగ్ అప్‌డేట్స్‌ మీకోసం!
    సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప’ (Pushpa) ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా వస్తోన్న ‘పుష్ప 2’ అందరి దృష్టి పడింది. అయితే సినిమాకు కొనసాగింపుగా ‘పార్ట్‌ 3’ (Pushpa 3) కూడా ఉండొచ్చని ఇటీవలే బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాటిని నిజం చేస్తూ తాజాగా ‘పుష్ప 3’పై సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకొచ్చింది.&nbsp; వచ్చే ఏడాది సమ్మర్‌లో.. ఈ ఏడాది ఆగస్టు 15న 'పుష్ప 2' విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో డే అండ్‌ నైట్‌ షూటింగ్‌ చేస్తూ పుష్ప టీమ్‌ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే తాజా బజ్‌ ప్రకారం.. 'పుష్ప 3'కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా డైరెక్టర్‌ సుకుమార్‌ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. 'పుష్ప 3' లో వచ్చే సీన్లకు ప్రస్తుత షూటింగ్‌ లోకేషన్స్‌ సరిగ్గా సరిపోతాయని భావించి ఈ షూట్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇక ‘పుష్ప 3’ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేసే యోచనలో సుకుమార్‌ టీమ్ ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.&nbsp; జాన్వీ కపూర్‌తో ఐటెం సాంగ్‌! ‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా.. ఉ ఊ అంటావా’ ఐటెం సాంగ్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ‘పుష్ప 2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ పెట్టాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం బాలీవుడ్ హీరోయిన్‌ దిశా పటాని (Disha Patani) ఎంపికచేసినట్లు మెున్నటి వరకూ వార్తలు వచ్చాయి. అయితే తాజా బజ్‌ ప్రకారం.. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) పేరును ఐటెం సాంగ్‌ కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్టులో కన్నాపెద్దగా ఈ రెండో పార్టులో ఈ ఐటెం సొంగ్ ఉండాలని చిత్ర నిర్వాహకులు, దర్శకుడు భావిస్తున్నారట. కాబట్టి జాన్వీ కపూర్‌కు ఉన్న ఫేమ్‌ దృష్ట్యా ఆమె అయితేనే సరిగ్గా ఉంటుందని పుష్ప టీమ్ అభిప్రాయపడుతోందట. మరి జాన్వీ కపూర్ ఈ ఐటెం సాంగ్ చెయ్యడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.&nbsp; ‘పుష్ప 3’పై బన్నీ ఏమన్నాడంటే! ఇటీవల జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘బెర్లిన్‌ యూరోపియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో అల్లు అర్జున్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ ‘పుష్ప 3’ సినిమా గురించి తొలిసారి బన్నీ మాట్లాడాడు. పార్ట్‌-3కి అన్నీ అనుకూలంగా ఉంటే తీసే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. కథను కొనసాగించాలని అనుకుంటున్నామని, తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలు కూడా ఉన్నాయని చెప్పాడు. మరోవైపు మొదటి భాగంతో పోలిస్తే ‘పుష్ప 2’లో పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటాయని బన్నీ తెలిపాడు. ముఖ్యంగా పుష్పరాజ్‌, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ల క్యారెక్టరైజేషన్‌, తెరపై వాటి ఎగ్జిక్యూషన్‌, వారికి ఎదురయ్యే పరిస్థితులు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయని వివరించాడు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో వైరల్‌గా మారాయి.&nbsp; బన్నీ నా రోల్‌ మోడల్‌: సమంత ఇదిలాఉంటే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై స్టార్‌ హీరోయిన్‌ సమంత తాజాగా ప్రశంసల వర్షం కురిపించింది. తమిళనాడులోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన కల్చరల్ కార్నివాల్‌లో పాల్గొన్న సమంత అక్కడ బన్నీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించింది. అల్లు అర్జున్ తన యాక్టింగ్ రోల్ మోడల్ అంటూ ఆకాశానికెత్తింది. ‘బన్నీ ఓ పవర్ హౌజ్ పర్ఫార్మర్‌గా మారాడు. అతని నుంచి నేర్చుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాను’ అని సమంత చెప్పింది. కాగా గతంలో వీరిద్దరూ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో నటించిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది.&nbsp;
    మార్చి 07 , 2024
    ఈ వారం (April 03) థియేటర్లు, OTTలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    ఈ వారం (April 03) థియేటర్లు, OTTలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఏప్రిల్‌ 3 నుంచి ఏప్రిల్‌ 9 మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: రావణాసుర: మాస్‌ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం ఈ వారంలోనే థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 7) థియేటర్లలో రచ్చ రచ్చ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్, టీజర్‌, సినిమా పోస్టర్లు ఈ చిత్రంపై భారీగా అంచనాలను పెంచేశాయి. రవితేజ సైతం ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఎంతో ధీమాగా ఉన్నారు. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమస్ సిసిరోలియో సంగీతం ఇచ్చారు.&nbsp; మీటర్‌: యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘మీటర్‌’ చిత్రం కూడా ఈ శుక్రవారమే (ఏప్రిల్‌ 7) థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వనుంది.&nbsp; కామెడీ, యాక్షన్‌తో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా మీటర్‌ అలరించనుంది. రమేష్‌ కడూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో అతూల్య రవి హీరోయిన్‌గా చేసింది. పోసాని కృష్ణ మురళి, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషించారు. సాయికార్తిక్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు.&nbsp; గుమ్రా: ఆదిత్య ఠాకూర్‌, సీతారామం ఫేమ్‌ మృణాల్‌ జంటగా నటించిన బాలీవుడ్‌ మూవీ గుమ్రా శుక్రవారం రిలీజ్ అవుతోంది. వర్ధన్‌ కేట్కర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా అలరించనుంది. తమిళ హిట్‌ చిత్రం తడంకు రీమేక్‌గా ఈ చిత్రం తెరక్కెక్కింది. ఇందులో మృణాల్‌ పోలీసు ఆఫీసర్‌గా నటించింది. కాగా ఈ సినిమా రామ్‌ హీరోగా రెడ్‌ పేరుతో తెలుగు రిలీజ్‌అయింది.&nbsp; ఛిప్‌కలి: ఈ వారం మరో బాలీవుడ్‌ ఛిప్‌కలి కూడా థియేటర్లలో రిలీజ్ కానుంది. కౌషిక్‌ కర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా కూడా శుక్రవారం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమైంది. నటులు యాష్‌పాల్‌ శర్మ, యోగేష్‌ భరద్వాజ్‌, తనిస్తా బిస్వాస్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మర్డర్‌ చుట్టూ సినిమా కథ తిరుగుతుందని చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; వీరం: కన్నడ మూవీ వీరం సైతం ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. కుమార్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో ప్రజ్వాల్‌ దేవరాజ్‌, శ్రీనగర కిట్టీ, రిచిత రామ్‌, దీపక్‌, అచ్యుత్‌ కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వీరం రాబోతోంది. ఓటీటీలో సందడి చేయనున్న మూవీస్ అసలు: నటి పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అసలు చిత్రం ఏప్రిల్‌ 5 బుధవారం రోజున ఓటీటీలోకి రాబోతోంది. రవిబాబు డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది.&nbsp;అసలు కథేంటి? అసలు సినిమా దేని గురించి? అసలు ఎక్కడ చూడాలి? అని ఈటీవీ విన్‌ తన ట్విటర్ ఖాతాలో హైప్‌ క్రియేట్ చేసింది.&nbsp; యాంట్‌ మాన్‌ అండ్‌ ది వాస్ప్‌ క్వాంటుమేనియా: ఈ మూవీ హాట్‌స్టార్‌లో ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది. యానిమేటెడ్‌ సైంటిఫిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ మూవీని నిర్మించారు. ఇందులో పాల్‌ పాల్ రూడ్, ఎవాంజెలిన్ లిల్లీ, జోనాథన్ మేజర్స్ వంటి స్టార్‌ క్యాస్ట్ నటించింది.&nbsp; ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateThe Crossoverseries&nbsp;EnglishDisney+ HotstarApril 5Tiny Beautiful Thingsseries&nbsp;EnglishDisney+ HotstarApril 07Redefined: J.R. Smith&nbsp;TV seriesenglishAmazon PrimeApril 4Bros (2022)movieenglishAmazon PrimeApril 4Lizzy Hoo: Hoo Cares!? (2023)movieenglishAmazon PrimeApril 4On a Wing and a Prayer (2023)MovieHindiAmazon PrimeApril 7Gangs of Lagos (2023)MovieEnglishAmazon PrimeApril 7Magic MixiesSeriesEnglishNetflixApril 03“Surviving R. Kelly: Part III: The Final ChapterSeriesEnglishNetflixApril 03Mo’Nique: My Name Is Mo’NiqueSeriesEnglishNetflixApril 04BeefSeriesEnglishNetflixApril 06The Last StandMovieEnglishNetflixApril 06On a Wing and a Prayer (2023)MovieEnglishNetflixApril 06Thicker Than WaterSeriesEnglishNetflixApril 07TransatlanticSeriesEnglishNetflixApril 07ChupaMovieEnglishNetflixApril 07Oh BelindaMovieEnglishNetflixApril 07Holy SpiderMovieEnglishNetflixApril 07HungerMovieEnglishNetflixApril 08The Lady in DignityMovieMovieMX PlayerApril 05My Debate Opponent Season 2&nbsp;SeriesEnglishMX PlayerApril 08The Song of GloryMovieMovieMX PlayerApril 12
    ఏప్రిల్ 03 , 2023
    <strong>War 2: ‘వార్‌ 2’ షూటింగ్ నుంచి మళ్లీ తారక్‌ ఫొటో లీక్!&nbsp;</strong>
    War 2: ‘వార్‌ 2’ షూటింగ్ నుంచి మళ్లీ తారక్‌ ఫొటో లీక్!&nbsp;
    భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌, టాలీవుడ్‌ స్టార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై బజ్‌ ఏర్పడింది. ‘RRR’, 'దేవర' లాంటి బ్లాక్‌ బాస్టర్స్‌ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్‌ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీగా హైప్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ ముంబయిలో శరవేగంగా సాగుతోంది. ఇటీవలే తారక్‌ సైతం షూటింగ్‌ జాయిన్‌ అయ్యాడు. ఈ క్రమంలోనే షూటింగ్‌ స్పాట్‌ నుంచి తారక్‌కు సంబంధించిన ఫొటో లీకయ్యింది. ప్రస్తుతం అది నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.&nbsp; స్టైలిష్‌ లుక్‌లో అదరహో ప్రస్తుతం తారక్‌ ‘వార్‌ 2’ (War 2) షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. తన పాత్రకు సంబంధించిన సీన్స్‌లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే షూటింగ్‌ స్పాట్‌ నుంచి తారక్ ఫొటో ఒక్కసారిగా నెట్టింట ప్రత్యక్షమైంది. అందులో తారక్‌ స్టైలిష్‌ లుక్‌తో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. లీకైన ఫొటోలో తారక్‌ సైడ్‌ లుక్‌ కనిపించింది. టీషర్ట్‌ మీద మిలటరీ తరహా గళ్ల చొక్క వేసి కనిపించాడు. అంతేకాదు షూటింగ్‌ కోసం వినియోగిస్తున్న గన్స్‌ను కూడా లీకైన ఫొటోల్లో గమనించవచ్చు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారింది. తారక్‌ లుక్‌ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే గతంలోనూ ‘వార్‌ 2’ షూటింగ్‌కి సంబంధించి తారక్ ఫొటోలు లీకయ్యాయి.&nbsp; https://twitter.com/Brajm10/status/1849731080183513184 హాలీవుడ్‌ రేంజ్‌ ఎంట్రీ 'వార్‌ 2'లో తారక్ ఇంట్రడక్షన్‌ సీన్‌కు సంబంధించి బీ టౌన్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పైరేట్‌ తరహా థీమ్‌తో తారక్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ను దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఈ సీన్‌లో యాక్షన్‌ డోస్‌ కూడా భారీగా ఉంటుందని తెలుస్తోంది. తారక్‌ చేసే ఫైట్స్ హాలీవుడ్‌ స్థాయిలో ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆడియన్స్‌ తప్పకుండా సర్‌ప్రైజ్‌ అవుతారని అంచనా వేస్తున్నాయి. అలాగే హృతిక్‌ను ఎదుర్కొనే సన్నివేశాలు కూడా గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయని సమాచారం. యశ్‌రాజ్‌ సంస్థ ఇప్పటివరకూ నిర్మించిన స్పై యూనివర్స్‌లో 'వార్‌ 2' స్పెషల్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. కాగా, ఇందులో తారక్‌ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్.&nbsp; షారుక్‌ స్పెషల్‌ రోల్‌? ‘వార్ 2’ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ వార్త కూడా బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్ (Shah Rukh Khan) ఈ సినిమాలో స్పెషల్ క్యామియో ఇవ్వనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దాదాపు 15 నిమిషాల పాటు షారుక్‌ రోల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి షూట్‌ కూడా మెుదలైనట్లు చెబుతున్నారు. అంతేకాదు తారక్‌-షారుక్‌ మధ్య ఫేస్‌ టు ఫేస్ యాక్షన్ ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. హిందీలో ఫస్ట్ ఫిల్మ్‌తోనే హృతిక్‌, షారుక్‌ వంటి స్టాన్‌ నటులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే ఛాన్స్ తారక్‌ రావడం నిజంగా గొప్ప విషయమే.&nbsp; ‘NTR 31’ లోడింగ్‌! ‘దేవర’ (Devara: Part 1) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr NTR), ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్‌ నీల్‌ ఎవరూ ఊహించని విధంగా ‘NTR 31’ సింగిల్‌ పార్ట్‌గా తీసుకురావాలని నిర్ణయించారట. అంతేకాదు ఇందులో బంగ్లాదేశ్‌ రైతుగా తారక్‌ కనిపిస్తారని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. కథ మెుత్తం బంగ్లాదేశ్‌ నేపథ్యంలోనే ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు హీరోయిన్‌ను కూడా ఈ మూవీ కోసం లాక్‌ చేశారని తెలుస్తోంది. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ ఇందులో తారక్‌కు జోడీగా నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె నిఖిల్‌తో ‘అప్పుడో ఇప్పుడో’ అనే సినిమా చేస్తోంది.&nbsp;
    అక్టోబర్ 25 , 2024
    <strong>#BoycottVettaiyan: తెలుగంటే అంత చిన్నచూపా? నెటిజన్ల ట్రోల్స్!</strong>
    #BoycottVettaiyan: తెలుగంటే అంత చిన్నచూపా? నెటిజన్ల ట్రోల్స్!
    భాషతో సంబంధం లేకుండా అభిమానులకు సంపాందించుకున్న హీరో రజనీకాంత్‌. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయనకు జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ స్టైల్‌ అన్నా, డైలాగ్‌ డెలీవరి అన్నా ఇప్పటికీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు. అటువంటి రజనీకాంత్‌ నుంచి ‘వేట్టయన్‌’ సినిమా రానుండటంతో సహజంగానే దేశవ్యాప్తంగా మంచి హైప్ ఏర్పడింది. దసరా కానుకగా అక్టోబర్‌ 10న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై తెలుగు ఆడియన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ #BoycottVettaiyanInTelugu హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp; ‘తెలుగు ప్రేక్షకులంటే లోకువా’ రజనీకాంత్‌ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వేట్టయన్'. ఈ మూవీలో రజినీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు. ‘వేట్టయన్’ అంటే తెలుగులో వేటగాడు అని అర్థం. అయితే తమిళంలో పెట్టిన వేట్టయన్‌ టైటిల్‌నే తెలుగులోనూ మక్కీకి మక్కీ దించారు. దీనిని తెలుగు ఆడియన్స్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో వేటగాడు అనే పదం ఉన్నప్పటికీ తమిళ టైటిల్‌నే తెలుగులో పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు అంత లోకవయ్యారా? అంటూ నిలదీస్తున్నారు. బాషాభిమానం ఉన్నది మేకేనా? తెలుగు వారికి లేదనకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేట్టయన్‌ను తెలుగు బహిష్కరించాలంటూ ఎక్స్‌ వేదికగా హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/thenaani29/status/1843888854568431666 https://twitter.com/Kadirodu/status/1843694483508211884 https://twitter.com/kannayyaX/status/1843899836732743696 https://twitter.com/Jyotheshkum/status/1843844509123391639 ఆ సినిమాలు కూడా అంతే! కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారని తెలుగు ఆడియన్స్‌కు పేరుంది. తమిళంలో ఫ్లాప్‌ అయిన చిత్రాలు సైతం తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ‘డబ్బింగ్‌’ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేవారు. ఇతర భాషలలో ఉండే బోర్డులని చక్కగా తెలుగులోకి మార్చేవారు. ఇప్పుడు అదంతా మానేసి నేరుగా సినిమాలను రిలీజ్‌ చేస్తున్నారు. ‘కంగువ’, ‘వేట్టయన్‌’, ‘తంగలాన్‌’, ‘రాయన్‌’ ‘వలిమై’ వంటి తమిళ టైటిల్స్‌ను తెలుగులో అదే పేరుతో తీసుకురావడాన్ని తెలుగు ఆడియన్స్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు. చక్కగా తెలుగు టైటిల్స్‌ పెట్టొచ్చు కదా అని కామెంట్స్‌ చేస్తున్నారు. తెలుగును గౌరవించని వారిని తెలుగు ఆడియన్స్‌ ఆదరించరని స్పష్టం చేస్తున్నారు.&nbsp; తెలుగు భాష వద్దా! గతంలో తమిళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తుంటే మణిరత్నం లాంటి దర్శకులు తెలుగు డైలాగులు, పాటలు దగ్గరుంచి రాయించుకునేవారు. నేరుగా తెలుగు సినిమా చూస్తున్న భావన కలిగేది. ఘర్షణ, సఖి, యువ, చెలియా లాంటి మంచి మంచి టైటిళ్లు పెట్టడం చూశాం. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం మారిపోయింది. డబ్బింగ్, పాటల విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు. తమిళ వాసనలు గుప్పుమంటున్నాయి. ఇక టైటిల్స్ సంగతి సరే సరి. రజినీకాంత్ లాంటి హీరో కూడా ‘వేట్టయాన్‌’ టైటిల్ విషయంలో అభ్యంతరం పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు ఆడియన్స్‌ డబ్బు కావాలి కానీ భాష వద్దా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
    అక్టోబర్ 09 , 2024
    War 2: ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ న్యూస్‌.. ఊగిపోతున్న ఫ్యాన్స్‌!
    War 2: ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ న్యూస్‌.. ఊగిపోతున్న ఫ్యాన్స్‌!
    భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌.. టాలీవుడ్‌ స్టార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై బజ్‌ ఏర్పడింది. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్‌ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీగా హైప్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ ముంబయిలో శరవేగంగా సాగుతోంది. తారక్ గత కొన్నిరోజులుగా ముంబయిలోనే ఉంటూ షూట్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ‘వార్‌ 2’కు సంబంధించిన క్రేజీ న్యూస్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.&nbsp; సిక్స్‌ ప్యాక్‌లో తారక్‌! ‘వార్‌ 2’ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య భారీ ఫైట్ సీన్ వుండనుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ ఫైట్ సీన్‌లో ఎన్టీఆర్ మరోసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఫైట్‌ సీన్ మునుపెన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. దీంతో తారక్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు గ్రాండ్‌ ఎంట్రీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ‘వార్‌ 2’ చిత్రానికి అయాన్ ముఖ‌ర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ&nbsp; YRF (Yash Raj Films) స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.&nbsp; ‘వార్‌ 2’లో మరో బాలీవుడ్‌ బ్యూటీ! ‘వార్‌ 2’ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కియా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు మరో స్టార్‌ హీరోయిన్‌ ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హీరోయిన్‌ను కత్రీనా కైఫ్‌ ఈ మూవీలో భాగం కాబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ స్పెషల్‌ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయమే మేకర్స్‌ సంప్రదించగా ఇందుకు కత్రీనా గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇదే నిజమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే హృతిక్‌, తారక్‌ లాంటి టాప్‌ డ్యాన్సర్లు ఉన్న సినిమాలో ఐటెం సాంగ్‌ను కత్రినా చేస్తుందంటే ఫ్యాన్స్‌కు ఇక పండగే అని చెప్పవచ్చు. దేవర నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ప్రస్తుతం తారక్‌ 'వార్‌ 2'తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల కాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే మే 20న తారక్‌ పుట్టిన రోజు పురస్కరించుకొని ఒక రోజు ముందే ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ను లాంఛ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తాజాగా ప్రకటించారు. మే 19న సా. 7.02 ని.లకు ఈ పాట విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేయగా.. అది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/UrsVamsiShekar/status/1791707613316763915
    మే 18 , 2024
    War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్&nbsp;
    War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్&nbsp;
    భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). YRF (Yash Raj Films) స్పై యూనివ‌ర్స్‌లో 6వ చిత్రంగా రానుండటంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇటీవల ‘బ్ర‌హ్మ‌స్త’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అయాన్ ముఖ‌ర్జీ.. ‘వార్‌ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోష‌న్‌, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాలో నటించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వార్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. అయితే తాజాగా హృతిక్‌, తారక్‌లకు సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.&nbsp; హృతిక్‌, తారక్‌ షూట్‌ ఎప్పుడంటే! ‘వార్‌ 2’ (War 2) చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), తారక్‌ (Jr NTR) షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం 'వార్‌ 2'లో హృతిక్‌కు సంబంధించిన సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించనున్నారు. షావోలిన్‌ టెంపుల్‌ దగ్గర హృతిక్ ఎంట్రీ సీన్స్‌ తెరకెక్కిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మార్చి 7 నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక తారక్ విషయానికి వస్తే అతడు ఏప్రిల్‌లో షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి తారక్‌-హృతిక్‌కు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తారని అంటున్నారు.&nbsp; గాయం నుంచి కోలుకున్న హృతిక్‌! బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌.. వార్ 2 చిత్రం కోసం గత కొంతకాలం నుంచి వర్కౌట్స్‌ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఆయన జిమ్‌ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అనుకున్న దానికంటే ‘వార్‌ 2’ షూట్‌ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం హృతిక్‌ పూర్తి ఫిట్‌గా ఉండటంతో మార్చి 7 నుంచి ఆయనకు సంబంధించిన సన్నివేశాలను షూట్‌ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హృతిక్‌ కూడా ఓకే చెప్పడంతో మూవీ యూనిట్‌ జపాన్‌లో వాలిపోయేందుకు సిద్ధమవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1764908346640040382 ‘వార్‌ 2’లో తారక్‌ గెటప్‌ అదేనా? కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (Devara) చిత్రంలో ప్రస్తుతం తారక్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటిస్తోంది. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి తారక్‌ సతీసమేతంగా హాజరయ్యాడు. అక్కడ తారక్‌ లుక్‌ చూసి అంతా ఫిదా అయ్యారు. మెున్నటి వరకూ కాస్త లావుగా కనిపించిన తారక్‌.. లేటెస్ట్‌ ఫొటోల్లో బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యారు. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేస్తున్నారని వార్తలొస్తున్న తరుణంలో ఎన్టీఆర్‌ ఇలా మారి ఆ గాసిప్స్‌ను కన్ఫార్మ్‌ చేశారని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరోవైపు ‘వార్‌ 2’లోనూ తారక్‌ ఇదే గెటప్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ‘వార్‌ 2’ రిలీజ్ ఎప్పుడంటే? భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'వార్‌ 2' చిత్రం విడుదల తేదీని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 2025 ఆగ‌ష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు సమాచారం ఉంది. హృతిక్ రోష‌న్‌కు ధీటుగా ప‌వ‌ర్‌ఫుల్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం. అటు బాలీవుడ్‌ స్టార్‌ హీరో జాన్‌ అబ్రహం కూడా ‘వార్‌ 2’లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌నుంది.&nbsp;
    మార్చి 05 , 2024

    @2021 KTree