UTelugu2h 9m
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. అయితే మూడో రోజు, ఐదో రోజు పిట్ట ముట్టదు. ఆ తర్వాత ఏం జరిగింది? పిట్ట ముట్టేందుకు సాయులు కుటుంబ సభ్యులు ఏం చేశారు? అప్పుల ఊబిలో చిక్కుకున్న సాయిలు ఎలా బయటపడ్డాడు? సాయిలు తండ్రి తన చెల్లెలకు ఎందుకు దూరంగా ఉన్నాడు? అనేది మిగిలిన కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
ప్రియదర్శి పులికొండ
కొమురయ్య మనవడుకావ్య కళ్యాణ్ రామ్
సంధ్యమురళీధర్ గౌడ్నారాయణ మరియు సంధ్య తండ్రి మరియు కొమురయ్య అల్లుడు
రూప లక్ష్మి లక్ష్మి మరియు సంధ్య తల్లి మరియు కొమురయ్య కుమార్తె
కృష్ణ తేజరవి మరియు సాయిలు స్నేహితుడు
రాచ రవిరాజేష్ మరియు సాయిలు స్నేహితుడు
రోహిణిసుశీల మరియు నర్సి భార్య
విద్యాసాగర్ కలంపురి వడ్డీ వ్యాపారి కొడుకు
సుధాకర్ రెడ్డిగాజుల కొమురం (కొమురయ్య) మరియు సాయిలు తాత
కోట జయరామ్గాజుల ఐలయ్య అండ్ శైలు ఫాదర్ అండ్ కొమురయ్య ఎల్డర్ సొన్
కొమ్ము సుజాతగాజుల స్వరూప అండ్ శైలు మదర్
సిబ్బంది
వేణు యేల్దండిదర్శకుడు
హర్షిత్ రెడ్డినిర్మాత
హన్షిత రెడ్డినిర్మాత
వేణు యేల్దండిరచయిత
భీమ్స్ సిసిరోలియో
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
CHIRANJEEVI: బలగం నటుడు మెుగిలయ్యకు చిరంజీవి సాయం… కంటి చూపుకోసం ఎంత ఖర్చైనా ఇస్తానని భరోసా
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరికీ సాయం కావాలాన్న ముందుండేది మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎంతోమందికి అండగా నిలబడ్డాడు చిరు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక చేయూతనందిస్తూ నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఆయన సహాయం ఇంకా ఎంతోమంది కళాకారులకు చేరుతూనే ఉంది. ఇటీవల ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్న బలగం మెుగిలయ్యకు సహాయం అందిస్తున్నాడు మెగాస్టార్.
మెుగిలయ్యకు అండగా
బలగం సినిమాలో నీ తోడుగా నా తోడు ఉండి అనే పాటను పాడిన మెుగిలయ్య అనారోగ్యం బారిన పడ్డారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపుడుతున్న ఆయనకి కంటి చూపు మందగించింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి మెుగిలయ్యకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దర్శకుడు వేణు ఎల్దండికి ఫోన్ చేసి మెుగిలయ్య కంటి చూపు రావటానికి ఎంత ఖర్చైనా తానే భరిస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని వేణు వారికి చెప్పినట్లు మెుగిలయ్య దంపతులు వెల్లడించారు.
https://twitter.com/i/status/1647889777688190976
విలన్‌కు సాయం
చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించిన విలన్ పొన్నాంబలమ్. ఆయనకి కూడా కిడ్నీలు పాడైపోతే చిరుకి మెసేజ్ చేశాడు. ఏదైనా సాయం చేయాలని కోరాడు. ఐదు నిమిషాల్లో ఫోన్ చేసిన మెగాస్టార్… చెన్నైలోని అపోలోకి తరలించి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం దాదాపు రూ. 40 లక్షలు చెల్లించాడు. ఈ విషయాన్ని పొన్నాంబలమ్ స్వయంగా పంచుకున్నారు.
https://twitter.com/i/status/1636009396437393409
కెమెరామెన్‌కు చేయూత
అక్కినేని నాగేశ్వరరావు, ఎంజీఆర్, బాలకృష్ణ, నాగార్జున వంటి సూపర్ స్టార్లతో పనిచేసిన కెమెరామెన్ దేవరాజ్. చిరంజీవితో నాగు, పులిబెబ్బులి వంటి సినిమాలు తీశాడు. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు వచ్చిన వార్తలు తెలుసుకున్న చిరు… దేవరాజ్‌ను ఇంటికి పిలిచి రూ. 5 లక్షలు ఇచ్చారు. అంతేకాదు, ఎప్పుడు అవసరం ఉన్నా అండగా ఉంటానని భరోసా కల్పించారు.
దటీజ్ మెగాస్టార్
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది పేద కళాకారులను ఆదుకున్నాడు చిరంజీవి. వారికి ఆర్థిక సాయం చేయడంతో పాటు హెల్త్ కార్డులు మంజూరు చేయించారు. కొంతమంది నటులకు అపోలో ఆస్పత్రిలో ఉచిత చికిత్స అందించినట్లు చాలామంది చెప్పారు. ఏళ్ల తరబడి ఆయన మెగాస్టార్‌గా కొనసాగుతున్నాడంటే ఇదే కారణమని నటులు చిరంజీవిని కొనియాడుతున్నారు.
ఏప్రిల్ 18 , 2023
Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
కమెడియన్ వేణు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు దర్శకుడిగా మారి తీసిన సినిమా ‘బలగం’. తొలి సినిమానే ప్రతిష్టాత్మక నిర్మాత దిల్‌రాజు కాంపౌండ్‌లో తెరకెక్కడం విశేషం. తెలంగాణలో బలగం అంటే బంధుగణం. బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల ప్రేమలు, పల్లెటూరి మనస్తత్వాలు ఇలా అన్ని రంగరించి ఓ ఎమోషనల్ డ్రామాగా వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి తన ప్రయత్నం ఎంతమేరకు విజయవంతమైందో చూద్దాం.
చిత్రబృందం
నటీనటులు: ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు తదితరులు
దర్శకత్వం: వేణు ఎల్దండి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత
https://www.youtube.com/watch?v=8R3Vcy5CaPc
కథ:
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. దీనికి తోడు చావు ఇంట్లో జరిగిన గొడవతో పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇదే సమయంలో 20 ఏళ్ల క్రితమే ఊరి నుంచి వెళ్లిపోయిన కొమురయ్య చిన్న కొడుకు, కూతురు (సాయిలు మేనత్త) తండ్రి మరణవార్త విని ఊరికి వస్తారు. సాయిలు మేనత్త తన కూతురు సంధ్యను తీసుకుని వస్తుంది. సంధ్యను చూసి ఇష్టపడిన సాయిలు, తనకు బాగా ఆస్తి కూడా ఉందని తెలుసుని ఎలాగైనా తనని ప్రేమలో పడేయాలనుకుంటాడు. కానీ కర్మ రోజున కొమురయ్య పిండాన్ని ఏ కాకీ ముట్టుకోదు. అక్కడ సాయిలు మామ,బాబాయ్‌ల మధ్య గొడవ జరుగుతుంది. కాకి ముట్టకపోవడం ఊరికి అరిష్టమని భావించిన గ్రామ పెద్దలు.. కొమురయ్య కోరిక తీరకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అనుకుంటారు. 11వ రోజు కాకి ముట్టకపోతే వారిని ఊరి నుంచి వెలివేస్తామని హెచ్చరిస్తారు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాలు, తాత చావును సాయిలు ఎలా వాడుకున్నాడు. చివరికి ఏం జరిగింది అనేదే కథ.
ఎలా ఉంది:
చక్కటి తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. పల్లెటూరి యాస, సంస్కృతి, అమాయకత్వం, మొండితనం, మూర్ఖత్వం ఇలా అన్ని కోణాలను దర్శకుడు వేణు చక్కగా తెరకెక్కించాడు. తొలి సినిమానే అయినా అలా ఎక్కడా అనిపించదు. ప్రతి పాత్రా చాలా సహజంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ ఊరిలో ఉండి సాయిలును చూస్తున్నట్లు ఉంటుంది. భావోద్వేగాలు, కామెడీ చాలా సహజంగా ఉంటాయి. తెలంగాణ పల్లెటూరిలో ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఉండే పరిస్థితిని చాలా సహజంగా తెరకెక్కించాడు. తాత చావు, ఓ కాకి చుట్టూ కథ నడిపిస్తూ.. కామెడీ పండిస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడు. ఫస్టాఫ్ పాత్రల పరిచయం, కామెడీ ఉంటుంది. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో చివరి 15 నిమిషాల సినిమా కంటతడి పెట్టిస్తుంది. మన ఇంట్లో ఉండే తాత, నాయినమ్మ, అమ్మమ్మలను గుర్తుచేసేలా ఉంటుంది. భావోద్వేగాలు ఎంత చక్కగా పండాయో, కామెడీ కూడా అంతే చక్కగా పండింది.
నటీ నటులు:
సాయిలు పాత్రలో ప్రియదర్శి జీవించాడనే చెప్పాలి. నిజంగా మన ఇంటి పక్క సాయిలును చూసినట్టే ఉంటుంది. హీరోయిన్‌గా కావ్య బాగా నటించింది. సుధాకర్ రెడ్డి పాత్ర కాసేపే ఉన్నా చాలా బాగా చేశారు. రచ్చ రవి తన కామెడీతో మెప్పించాడు. ఇతర నటీ నటులు కూడా తమ పరిధిమేరకు నటించారు.
సాంకేతిక పనితీరు:
దర్శకుడు వేణు తొలి సినిమా అయినా చాలా చక్కగా తెరకెక్కించాడు. స్టార్ క్యాస్ట్ లేకపోయినా సినిమాలో ఉన్న నటులంతా సహజంగా నటించారు. కథనం విషయంలో కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియే సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ మెచ్చుకోవాలి. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సినిమా చాలా సహజంగా కనిపించడానికి వేణు సినిమాటోగ్రఫీ చాలా సాయపడింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి. చివరి 15 నిమిషాలు చక్కటి ఎమోషన్స్ పండాయంటే అందుకు కారణంగా చివర్లో వచ్చే బుర్ర కథ. దీనికి కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రొడక్షన్ పరంగా సినిమాకు ఏ లోటు లేదు.
బలాలు
కథ
కథా నేపథ్యం
భావోద్వేగాలు
కామెడీ
పాటల్లో సాహిత్యం
బలహీనతలు
కొన్ని చోట్ల సాగదీత సీన్లు
స్టార్ క్యాస్ట్ లేకపోవడం
ఒక్కమాటలో
చక్కటి భావోద్వేగాలతో ఉండే పల్లెటూరి కుటుంబ కథా చిత్రం బలగం. ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలనుకుంటే ‘బలగం’ మిస్ కాకూడని సినిమా.
రేటింగ్
3/5
మార్చి 03 , 2023
Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Download Our App
మార్చి 03 , 2023
Yellamma: యంగ్ హీరోతో బలగం వేణు ప్రాజెక్ట్ లాక్.. నాని, తేజ సజ్జా స్థానంలో రీప్లేస్!
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు యెల్దండి (Venu Yeldandi) కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. ఆ తర్వాత బజర్దస్త్ కామెడీ షాలో టీమ్ లీడర్‌గా మారి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్‌గా మారిన వేణు గతేడాది ‘బలగం’ అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. తెలంగాణ గ్రామీణం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో వేణు తర్వాతి ప్రాజెక్ట్‌పై సహజంగానే అందరి దృష్టి ఏర్పడింది. అయితే బలగం వచ్చి ఏడాది దాటిన ఒక్క ప్రాజెక్ట్ వేణు అనౌన్స్ చేయకపోవడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ యంగ్ హీరోతో వేణు సినిమా ఓకే అయినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
వేణు డైరెక్షన్‌లో నితిన్!
బలగం చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు బ్యానర్‌లోనే తన రెండో చిత్రం ఉంటుందని గతంలోనే కమెడియన్, దర్శకుడు వేణు యెల్దండి ప్రకటించారు. రెండో చిత్రానికి సంబంధించిన కథను ఎప్పుడో సిద్దం చేసిన వేణు త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరో నితీన్‌తో తన తర్వాతి చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్టోరీ గురించి నితీన్‌కు చెప్పగా కొన్ని మార్పులతో ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పాడని సమాచారం. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి 'యల్లమ్మ' (Yellamma Movie) అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేసినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
నాని, తేజ సజ్జా రిజెక్ట్!
వాస్తవానికి నేచురల్ స్టార్ నానితో వేణు యెల్డండి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే 'యల్లమ్మ' స్టోరీని నానికి వేణు వినిపించారు. కానీ సెకండ్ హాఫ్ పట్ల నాని సంతృప్తి చెందలేదని తెలిసింది. వేణు కూడా కథ పరంగా వెనక్కి తగ్గకపోవడంతో నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత తేజ సజ్జకు స్టోరీ వినిపించగా ఈ యంగ్ హీరో ఓకే కూడా చెప్పారని తెలిసింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ కాంబో కూడా సెట్ కాలేదు. ఫైనల్‌గా నితీన్ వద్దకు కథను తీసుకెళ్లిన వేణు ఫైనల్‌గా అతడ్ని ఒప్పించినట్లు తెలుస్తోంది.
షూటింగ్ ఎప్పుడంటే?
ఇక వేణు యెల్దండి డైరెక్ట్ చేయనున్న ‘ఎల్లమ్మ’ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన ‘జనక అయితే గనక’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు వేణు కూడా హాజరయ్యారు. అతడు స్టేజ్ పైకి వెళ్లగానే కింద కూర్చున్న దిల్ రాజు ‘ఎల్లమ్మ’ ఎప్పుడు అని అడిగాడు. దీనికి వేణు స్పందిస్తూ ‘అదేదో సామెత చెప్పినట్లు ఉంది. కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే.. మీరే చెప్పాలి. నేను రేపు మొదలు పెట్టమన్నా రెడీ. చెప్పండి.. నవంబర్‌లో చేద్దామా అని అన్నాడు. దీనికి దిల్ రాజు బదులిస్తూ ‘వద్దులే ఫిబ్రవరిలో మొదలుపెడదాం’ అని స్పష్టం చేశారు.
https://twitter.com/i/status/1844354638587498984
‘బలగం’కు అవార్డుల పంట
హాస్య నటుడు ప్రియదర్శి (Priyadarsi), కావ్యా కళ్యాణ్‌రామ్ (Kavya Kalyanram) జంటగా వేణు యెల్దండి తెరకెక్కించిన ‘బలగం’ (Balagam) చిత్రం గతేడాది మార్చి 3న విడుదలైంది. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళిధర్ గౌడ్, కోటా జయరామ్, మైమ్ మధు ముఖ్యపాత్రలు పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. పల్లెల్లో స్పెషల్ షోలను సైతం వేశారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ‘బలగం’ చిత్రం ఏకంగా మూడు అవార్డులు కొల్లగొట్టింది. అలాగే ఒక సైమా అవార్డు, సంతోషం అవార్డ్‌ను సొంతం చేసుకుంది.
అక్టోబర్ 15 , 2024
Bachhala Malli Review: మూర్ఖుడిగా అల్లరి నరేష్ సూపర్బ్.. ‘బచ్చలమల్లి’తో హిట్ కొట్టాడా?
నటీనటులు: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు
కథ, దర్శకత్వం: సుబ్బు మంగదేవి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎమ్.నాథన్
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
నిర్మాతలు: రాజేష్ దండా, బాలాజీ గుత్తా
నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2024
అల్లరి నరేష్ (Allari Naresh) మాస్ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా డిసెంబర్ 20న (Bachhala Malli Movie Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? నరేష్ నటన బాగుందా? అతడి ఖాతాలో మరో విజయం పడిందా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
కథ 1995 - 2005 మధ్య (Bachhala Malli Review) తుని, సూరవరం ప్రాంతంలో సాగుతుంటుంది. బచ్చలమల్లి (అల్లరి నరేశ్) చిన్నప్పుడు చదువులో బాగా చురుగ్గా ఉండేవాడు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించి తండ్రి గర్వపడేలా చేస్తాడు. తనకు ఎంతో ఇష్టమైన తండ్రి తీసుకున్న ఓ నిర్ణయం మల్లిని ఎంతగానో బాధిస్తుంది. దాంతో చదువుకు స్వస్థి పలికి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. ట్రాక్టర్ నడుపుతూ మూర్ఖుడిగా మారిపోతాడు. మద్యం తాగుతూ ఊరిలో ఏదోక గొడవలో తలదూరుస్తూ బేవర్స్‌గా మారిపోతాడు. అప్పుడే అతడి లైఫ్‌లోకి కావేరి (అమృత అయ్యర్) వస్తుంది. ఆమె రాకతో మల్లీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఇంతకీ ఏంటా మార్పులు? కావేరితో అతడి ప్రేమ కథ ఎలా మెుదలైంది? చివరికీ సుఖాంతం అయ్యిందా? లేదా? అసలు తండ్రితో మల్లికి ఉన్న సమస్య ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
బచ్చల మల్లి పాత్రలో అల్లరి నరేష్ (Bachhala Malli Review) పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. గమ్యం సినిమాలో చేసిన గాలి శీను పాత్ర తరహాలో బచ్చలమల్లి రోల్ కూడా అతడి కెరీర్‌లో గుర్తుండిపోతుంది. మూడు వేరియేషన్స్ కలగలిసిన ఆ పాత్రలో నరేష్ అదరగొట్టాడు. హావ భావాలు చక్కగా పలికించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో పరిణితి చూపించాడు. హీరోయిన్ కావేరి పాత్రలో అమృత అయ్యర్ (Amritha Aiyer) బాగా చేసింది. అమాయకంగా కనిపిస్తూనే మంచి నటన కనబరిచింది. రావు రమేశ్ (Rao Ramesh) పాత్ర సినిమాకి కీలకం. అల్లరి నరేష్‌తో వచ్చే సీన్స్‌లో ఆయన అదరగొట్టారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రావు రమేష్ నటన ఆకట్టుకుంటుంది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ సాదాసీదాగా కనిపిస్తూనే విలనిజం బాగా పండించాడు. రోహిణి, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు బలమైన పాత్రల్లో కనిపించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సుబ్బు మంగదేవి కంచెలు తెంచుకున్న మూర్ఖుడి కథగా 'బచ్చలమల్లి'ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచే హీరో పాత్రను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. చాలా రఫ్‌గా ఉండే హీరో ప్రేమలో పడిన విధానం, ప్రేయసి రాకతో అతడి లైఫ్‌లో వచ్చిన మార్పులు చక్కగా చూపించాడు. తన మూర్ఖత్వంతో ఏమేమి తప్పులు చేశానో హీరో రియలైజ్ అయ్యే సీన్స్ మెప్పిస్తాయి. బంధాలు తెంచుకోవడం చాలా తేలిక.. నిలుపుకోవడంలోనే మన గొప్పతనం దాగుందన్న సందేశాన్ని దర్శకుడు ఇచ్చాడు. అయితే స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలోనే దర్శకుడు తడబడ్డాడు. కొన్ని సీన్స్‌కు లాజిక్స్ ఉండవు. హీరో పాత్రను ప్రభావితం చేసే సన్నివేశాలు చాలా పేవలంగా అనిపిస్తాయి. మూడు పార్శ్వాలుగా కథ చెప్పడం కాస్త గందరగోళానికి గురిచేసింది. అయితే క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ టచ్ మాత్రం హృదయాలకు హత్తుకుంటుంది.
సాంకేతికంగా..
టెక్నికల్ విషయాలకు వస్తే (Bachhala Malli Review) సినిమా ఉన్నతంగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటల్లో ‘మా ఊరి జాతర్లో’ మెప్పిస్తుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రిచర్డ్ ఎమ్.నాథన్ కెమెరా పనితనం గ్రామీణ నేపథ్యాన్ని పక్కాగా ఆవిష్కరించింది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. నిర్మాణం పరంగా లోటుపాట్లేమీ కనిపించవు.
ప్లస్ పాయింట్స్
నరేష్ నటనకథా నేపథ్యంసంగీతం
మైనస్ పాయింట్స్
ఆసక్తిలేని కథనంలాజిక్స్‌కు అందని సీన్స్‌అక్కడక్కడ పండని ఎమోషన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
డిసెంబర్ 20 , 2024
KA Movie Review: ‘ క’ సినిమాను హిట్ చేసిన టాప్ 5 అంశాలు
విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్ తదితరులుదర్శకత్వం: సందీప్, సుజిత్నిర్మాత: చింతా గోపాల్ కృష్ణ రెడ్డిసంగీతం: సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ: సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్
టాలీవుడ్‌లోని టాలెండెడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. తొలి చిత్రం 'రాజా వారు రాణి గారు'తో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ కుర్ర హీరో కెరీర్ పరంగా సత్తా చాటేలా అనిపించాడు. ఆ తర్వాత చేసిన ఏడు చిత్రాల్లో ఎస్.ఆర్. కళ్యాణమండపం మినహా ఏ మూవీ ఆకట్టుకోలేదు. దీంతో కిరణ్ అబ్బవరం పని అయిపోయినట్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో ‘క’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ కుర్ర హీరో. ప్రమోషన్లతతో బాగా హైప్ తీసుకొచ్చాడు. ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
సినిమా ఎలా ఉందంటే?
ఈ చిత్రంలో ప్రధానంగా తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉంది. కథనం, థ్రిల్లర్ మూమెంట్స్, క్లైమాక్స్ బాగున్నాయి.. కథలో ఉన్న బలమైన క్యారెక్టర్లు, వాటి నిర్మాత్మక శైలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నాయి. కథనంలో ట్విస్టులు కొత్తదనాన్ని జోడించాయి. కిరణ్ అబ్బవరం అభినయ్ పాత్రలో రెండు భిన్న వేరియేషన్స్‌లో చాలా బాగా నటించాడు. నయన్ సారిక హీరోయిన్ పాత్రలో బాగా న్యాయం చేసింది, ఆమె నటన ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. బలగం జయరామ్ అద్భుతంగా నటించాడు. ఇతర ముఖ్య పాత్రలలో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
డైరెక్టర్స్ సందీప్, సుజిత్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో కొత్తదనాన్ని రాబట్టడంలో కొంతవరకు విజయం సాధించారు. స్క్రీన్ ప్లేలో మరింత మెరుగులు దిద్దే అవకాశం ఉన్నప్పటికీ కొంత విస్మరించారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ముఖ్యమైన కాంప్లిక్ట్ పాయింట్ పూర్తిగా క్లారిటీగా వ్యక్తం కాకుండా సస్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొనసాగిన కారణంగా కథలో లోపాలు కనిపిస్తాయి. కథనంలో కొన్ని అనవసర సన్నివేశాలు సస్పెన్స్‌ని దెబ్బతీసినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయాలు సినిమాకి కొంత మైనస్‌గా మారాయి. స్క్రీన్‌ప్లేను ఇంకా మెరుగ్గా మలచి ఉంటే సినిమాకి మరింత ప్రభావవంతంగా ఉండేది.
సాంకేతిక విభాగం:
ఈ చిత్రం సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ ల సినిమాటోగ్రఫీ, ముఖ్యమైన సన్నివేశాలకు ప్రాణం పోసింది. సామ్ సీఎస్ సంగీతం సినిమాకి బలాన్ని ఇచ్చింది. ఎడిటింగ్ చాలా బాగుంది. చింతా గోపాల్ కృష్ణ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
చివరగా
మొత్తం గా చెప్పాలంటే, "క" అనే ఈ చిత్రం ప్రధానంగా సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో సాగుతూ మంచి కథా నేపథ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాన్సెప్ట్ బలంగా ఉండటంతో పాటు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాని బాగా లేపాయి. సస్పెన్స్ కథలకు ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
రేటింగ్ : 3.5/5
నవంబర్ 01 , 2024
Letterboxd: ‘అతడు’, ‘జెర్సీ’, ‘ఖలేజా’ చిత్రాలకు గ్లోబల్ స్థాయిలో క్రేజ్.. టాప్-100లో చోటు!
భారతీయ చిత్ర పరిశ్రమలో టాలీవుడ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు చిత్ర పరిశ్రమ అందిస్తుందని దేశంలో ఏ సినీ ప్రేక్షకుడిని అడిగినా చెబుతాడు. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘బలగం’ వంటి చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. ఇదిలా ఉంటే ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్ లెటర్స్‌బాక్స్డ్ (Letterboxd) తాజా ప్రకటించిన ప్రపంచంలోని టాప్ 100 చిత్రాల్లో టాలీవుడ్‌కు చెందిన నాలుగు సినిమాలకు చోటు దక్కాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ర్యాంకులు ఇవే!
న్యూజిలాండ్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ నెట్‌వర్క్ లెటర్‌బాక్స్‌డ్.. అత్యంత ప్రజాధరణ పొందిన చిత్రాల గురించి చర్చను ఆహ్వానిస్తుంటుంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ తమకు నచ్చిన సినిమా గురించి ఈ వేదికపై తమ అభిప్రాయాలు తెలియజేస్తుంటారు. రేటింగ్స్ కూడా ఇస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా అత్యధిక మంది అభిమానుల ఆదరణ పొందిన ‘టాప్-100’ చిత్రాల జాబితాను లెటర్‌బాక్స్‌డ్ ప్రకటించింది. ఆ వంద చిత్రాల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నాలుగు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. అతడు (42), జెర్సీ (57), సాగర సంగమం (75), ఖలేజా (85) చిత్రాలు ఎక్కువ మంది ఇష్టపడ్డ మూవీస్‌గా నిలిచాయి.
ఫుల్ జోష్‌లో మహేష్ ఫ్యాన్స్!
లెటర్‌బాక్స్డ్ ప్రకటించిన వరల్డ్ టాప్ 100 చిత్రాల్లో.. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు చేసిన అతడు, ఖలేజా చోటు దక్కించుకున్నాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇందుకు ఓ కారణం ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లతోనే అతడు, ఖలేజాలు సర్దుకోవాల్సి వచ్చింది. అయితే బుల్లితెరపై మాత్రం ఈ సినిమాలు అత్యధిక టీఆర్పీతో టెలికాస్ట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమాలను టీవీలో చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాలు టాప్100లో నిలవడంతో మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.
‘SSMB29’ ముహోర్తం ఫిక్స్!
మహేష్ తన తర్వాతి చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్నాడు. దీంతో అందరి దృష్టి SSMB29 పైనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. మహేష్ కూడా ఈ మూవీ కోసం పలు దేశాలు తిరుగుతూ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం 'SSMB29' చిత్రాన్ని మే 31న అధికారికంగా లాంచ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. మహేష్ తండ్రి, దివంగత స్టార్ హీరో కృష్ణ పుట్టిన రోజు నేపథ్యంలో ఆ రోజున సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.
ఏప్రిల్ 25 , 2024
Hidimba Movie Review: ఊహకందని ట్విస్ట్‌లతో ‘హిడింబ’.. మరి అశ్విన్‌బాబు బ్లాక్‌బాస్టర్ కొట్టినట్లేనా?
నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు.
దర్శకత్వం: అనిల్ కన్నెగంటి
సంగీతం: వికాస్ బాడిస
ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్
నిర్మాత: గంగపట్నం శ్రీధర్
విడుదల తేదీ: 20-07-2023
టాలీవుడ్ యువదర్శకులు సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆసక్తిరేపే కథాంశాన్ని సినిమాగా ఎంచుకొని బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన విరూపాక్ష, బలగం, బేబి సినిమాలే ఇందుకు ఉదాహరణ. కాగా, తాజాగా విడుదలైన ‘హిడింబ’ సైతం ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే ఉద్దేశంతో తెరకెక్కింది. అశ్విన్‌బాబు హీరోగా అనిల్ కన్నెగంటి తెరకెక్కించిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటం, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ దీన్ని సమర్పిస్తుండటంతో ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై పడింది. మరి ఈ ‘హిడింబ’ కథేంటి? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచింది? వంటి అంశాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
కథేంటి
అభయ్ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత) పోలీస్ శిక్షణలో ఉండగా ఒకరినొకరు ఇష్టపడతారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. వీళ్లిద్దరూ ఓ కేసు విషయమై మళ్లీ కలిసి పని చేయాల్సి వస్తుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాప్‌లకు సంబంధించిన కేసది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో బోయ అనే కరుడుగట్టిన ముఠాను పట్టుకుంటారు. అయినప్పటికీ కిడ్నాప్‌లు ఆగవు. ఈ నేపథ్యంలోనే డిపార్ట్‌మెంట్‌కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసును ఆద్య, అభయ్ ఎలా ఛేదించారు? అసలు ఈ కిడ్నాప్‌లు చేస్తున్న నేరస్థుడెవరు? అండమాన్ దీవుల్లో ఉన్న ఓ ఆదిమ తెగకు ఈ కథకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే..
ఎవరెలా చేశారంటే
నటుడిగా అశ్విన్‌ను మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రమిది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి దీటైన పాత్రలో నందితా నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇక మకరంద్ దేశ్ పాండే పాత్ర సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. ఆ పాత్రను దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. రఘు కుంచె, సంజయ్ స్వరూప్, షిజ్జు, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ పిళ్లై తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
ఎలా సాగిందంటే
టైటిల్స్ కార్డ్స్‌తోనే దర్శకుడు అనిల్ కన్నెగంటి నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. నగరంలో అమ్మాయిలు వరుసగా కిడ్నాప్ అవ్వడం, ఆ కేసును ఛేదించేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆద్యను రంగంలోకి దింపడం.. ఇలా చకచకా కథ పరుగులు తీస్తుంది. కానీ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆరంభమైనప్పటి నుంచి సినిమా ఒక్కసారిగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా మారిపోతుంది. పెద్దగా కష్టపడకుండానే కేసుకు సంబంధించిన క్లూలు తెలిసిపోతుంటాయి. ఇది ప్రేక్షకులకు అంతగా రుచించదు. మధ్యలో ఓ పాటతో నాయకానాయికల ప్రేమకథను చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. దాంట్లో పెద్దగా ఫీల్ కనిపించదు. ప్రీక్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం సర్‌ప్రైజ్. హీరోలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ఎపిసోడ్ అది. పతాక సన్నివేశాలు ఊహలకు అందని రీతిలో ఉన్నా ముగింపు సంతృప్తికరంగా అనిపించదు.
డైరెక్షన్ & టెక్నికల్ అంశాలు
దర్శకుడు అనిల్ కన్నెగంటి ఎంచుకున్న కథలో కొత్తదనమున్నా, దాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తెరపై చూపించడంలో తడబడ్డాడు. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నా, మొత్తంగా చూసినప్పుడు దీంట్లో ఏదో వెలితి కనిపిస్తుంది. చాలా సన్నివేశాలు లాజిక్కుకు దూరంగా ఉన్నాయి. ప్రథమార్ధంలో మానవ అవయవాల అక్రమ రవాణా ఎపిసోడ్‌ను టచ్ చేశారు. దానికి ముగింపు ఇవ్వలేదు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథా నేపథ్యంట్విస్ట్‌లుపోరాట ఘట్టాలు,నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
స్క్రీన్‌ప్లేపాటలులవ్‌ట్రాక్
రేటింగ్ 2.5/5
https://www.youtube.com/watch?v=MK-pFLfPmyk
ఆగస్టు 08 , 2023
Telangana Background Songs: సినిమాల్లో తెలంగాణ నేపథ్య పాటలు.. ఈ సాంగ్స్‌ని మీరెప్పుడైనా విన్నారా..!
తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు ఎన్నో వస్తున్నాయి. బాక్సాఫీస్ ముందు భారీ విజయం సాధిస్తున్నాయి. అయితే, కొన్ని పాటలు అచ్చమైన తెలంగాణను ప్రతిబింబిస్తాయి. అందులోని సాహిత్యాన్ని పరీక్షించినా, విజువల్స్‌ని చూసినా, మ్యూజిక్ బీట్ విన్నా.. తెలంగాణమే గుర్తొస్తుంది. ఏదో ఒక రూపంలో తెలంగాణ ఆచార, సంప్రదాయాలను యావత్ ప్రజలకు చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి పాటలేంటో ఓసారి చూద్దాం.
ఊరు పల్లెటూరు
ఓ కుటుంబంలోని బంధాల నేపథ్యంలో తీసిన సినిమా బలగం. ఇందులోని ‘ఊరు పల్లెటూరు’ సాంగ్ తెలంగాణ నేటివిటీని పరిచయం చేస్తుంది. ‘వంద గడపల మంద నా పల్లె.. గోడ కట్టని గూడు నా పల్లె’ అంటూ కాసర్ల శ్యాం అందించిన లిరిక్స్ అచ్చమైన తెలంగాణ పల్లెల స్వభావాన్ని తెలియజేస్తాయి. మామా అత్త బావ బాపు వరసల్లె.. అంటూ సాగే లిరిక్స్ ప్రజల మధ్య అన్యోన్య బంధాన్ని చాటిచెప్తాయి. ఇక్కడ అందరినీ ఏదో ఒక బంధుత్వంతో పిలుస్తారని చెప్పేందుకు ఈ లిరిక్స్ సాక్ష్యం. పాట చిత్రీకరణ కూడా తెలంగాణ తనాన్ని రుచి చూపిస్తుంది. వేణు ఎల్దండి డైరెక్ట్ చేశాడు.
https://www.youtube.com/watch?v=KpBksxKsrIU
బతుకమ్మ
సల్మాన్ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలోని ఓ పాట పూర్తిగా తెలంగాణ సంప్రదాయాన్ని చూపిస్తుంది. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ నేపథ్యంలోనే సాంగ్‌ని తీర్చిదిద్దారు. బతుకమ్మ పేరుతో చేసిన ఈ సాంగ్ ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా, పండుగ సమయంలో తెలంగాణ ఆడపడుచుల వస్త్రాలంకరణను కళ్లకు కట్టినట్లు ఇందులో చూపించారు. బతుకమ్మ తయారీ విధానంపై కూడా ఫోకస్ పెట్టారు. కిన్నల్ రాజ్, హరిని ఇవతూరి పాటకు లిరిక్స్ అందించారు.
https://www.youtube.com/watch?v=tdOg8X0RV9I
చమ్కీల అంగీలేసి
దసరా మూవీని పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో జరిగే సినిమాగా తీర్చిదిద్దారు. కాబట్టి, ఇందులో ప్రతీ పాట తెలంగాణను ప్రస్ఫుటీకరిస్తుంది. ‘చమ్కీల అంగీలేసి ఓ వదినె చాకు లెక్కుండేటోడే’ అంటూ ఈ గీతం సాగుతుంది. కాసర్ల శ్యాం ఈ పాటకు ప్రాణం పోశాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ పాటను రామ్ మిరియాల, ధీతో పాడించారు. తెలంగాణ పల్లెల్లో పెళ్లైన భార్య, భర్తలు ఇరువురిపై ఫిర్యాదులు చేసుకుంటే ఎలా ఉంటుందో పాటలో చూపించారు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించాడు.
https://www.youtube.com/watch?v=XeGdY8RoxQY
దండికడియాల్
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ధమాకా. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఇందులోని ‘దండకడియాల్.. దస్తిరుమాల్’ సాంగ్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. భీమ్స్ స్వయంగా ఈ పాటను రాశాడు. ఈడు మీదున్న అబ్బాయి, అమ్మాయి కలిసి సరదాగా మాట్లాడుకునే సంభాషణనే పాటగా మార్చారు. మధ్యలో అల్లో మల్లో రాములమల్లో.. అనే లైన్‌ని తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ పాడుకుంటుంటారు.
https://www.youtube.com/watch?v=K0p3Mx_GNsY
దిల్ కుష్
తెలంగాణలో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. రాజధాని నగరానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. నైజాం పాలనకు కేంద్రంగా నిలిచింది. దీంతో హైదరాబాదీలు ఎక్కువగా ఉర్దూ, తెలుగు కలగలిపి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా పాతబస్తీలో మాట్లాడే ప్రతి వాక్యంలో ఒక తెలుగు, మరొక ఉర్దూతో కూడిన హిందీ పదం ఉంటుంది. ఇదే విషయాన్ని చెబుతూ సెల్పిష్ సినిమాలో ‘దిల్‌కుష్’ సాంగ్‌ని కంపోజ్ చేశారు. తనకు హీరోయినే సర్వస్వం అంటూ హీరో పాడుకునే పాట ఇది. తెలుగు, హిందీ భాషలను కలగలిపి లిరిక్ రైటర్ సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు.
https://www.youtube.com/watch?v=kPU4FXB7pNE
సౌ శర(పరేషాన్)
పరేషాన్ సినిమాలోని సౌ శర పాట కూడా పూర్తిగా తెలంగాణ యాసలో ఉంటుంది. పనీ, పాట లేని పోరగాళ్లు మాట్లాడుకునే మాటల్లాగే పాట ఉంటుంది. అక్కాల చంద్రమౌలి ఈ పాటను రాశారు. ఈ సాంగ్‌తో పాటు ‘అత్తరు బుత్తరు’, ‘గాంధారి ఖిల్లా’ పాటలు తెలంగాణ నేటివిటీని చెబుతున్నాయి.
https://www.youtube.com/watch?v=M7uR7cQoUQI
గల్లీ చిన్నది(మేమ్ ఫేమస్)
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరేటి వెంకన్న రచించిన ‘గల్లీ చిన్నది’ పాటను మేమ్ ఫేమస్ సినిమాలో రీమిక్స్ చేశారు. మళ్ళీ గోరేటి వెంకన్నతోనే పాడించారు. తెలంగాణ పల్లెల్లోని ప్రజల జీవన శైలికి ఈ పాట అద్దం పడుతుంది. ఇందులోని మిగతా పాటలు కూడా తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగుతాయి.
https://www.youtube.com/watch?v=O_9tnIOvKYk
జూన్ 07 , 2023
Pareshan Review: కామెడీ ఓకే.. ‘పరేషాన్’తో మసూద హీరో హిట్ కొట్టినట్లేనా!
నటీనటులు : తిరువీర్, పావని, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్, శ్రుతి రయాన్
దర్శకత్వం: రోనాల్డ్ రూపక్ సన్
సంగీతం: యశ్వంత్ నాగ్
సినిమాటోగ్రఫీ: వాసు
నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి
సమర్పణ: రానా దగ్గుబాటి
టాలీవుడ్‌లో తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. తెలంగాణ యాస, భాషతో పాటు సంస్కృతి సంప్రదాయల మేళవింపుతో వచ్చి ఘన విజయాలు సాధిస్తున్నాయి. ఫిదా, బలగం, జాతి రత్నాలు, దసరా వంటి చిత్రాలు అలా వచ్చి భారీ హిట్ అందుకున్నవే. తాజాగా రూపొందిన ‘పరేషాన్’ మూవీ సైతం తెలంగాణ నేపథ్యంలోనే తెరకెక్కింది. రోనాల్డ్ రూపక్ సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించాడు. ఈ సినిమాని సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించగా, హీరో దగ్గుబాటి రానా సమర్పిస్తుండటంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (జూన్ 2) పరేషాన్ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అందరినీ ఆకట్టుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ:
ఐజాక్(తిరువీర్) ITI చదివి పనిపాట లేకుండా స్నేహితులతో ఖాళీగా తిరుగుతుంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి విపరీతంగా తాగుతూ గొడవలు పడుతుంటాడు. ఐజాక్‌ను చూసి విసిగిపోయిన తండ్రి సమర్పణం (మురళీధర్ గౌడ్) తన సింగరేణి ఉద్యోగం కుమారుడికి ఇప్పించాలని భావిస్తాడు. అందుకోసం భార్య నగలు అమ్మి లంచం డబ్బు సిద్ధం చేస్తాడు. అయితే ఆ డబ్బును ఆపదలో ఉన్న ఫ్రెండ్స్‌కు ఐజాక్ ఇస్తాడు. డబ్బు కనిపించకపోవడంతో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది. మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయి శిరీష (పావని కరణం) గర్భవతి కావడం ఐజాక్ చిక్కులు తెచ్చిపెడుతుంది. అబార్షన్ కోసం సిద్దం చేసిన డబ్బును ఎవరో కాజేయడంతో ఐజాక్ కొత్త సమస్యల్లో చిక్కుకుంటాడు. దీంతో డబ్బు కోసం ఐజాక్ తెగ పరేషాన్ అవుతుంటాడు. డబ్బు కోసం ఐజాక్ ఏం చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
ఐజాక్ పాత్రలో తిరువీర్ అద్భుత నటన కనబరిచాడు. సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రలో జీవించేశాడు. మసూద తర్వాత నటనలో మరింత మెరుగైనట్లు కనిపించాడు. అటు ఫ్రెండ్స్ పాత్రలైన ఆర్జీవీ, మైదాక్, సత్తి(అర్జున్ కృష్ణ) ప్రేక్షకులను చాలా బాగా కనెక్ట్ అవుతాయి. డబ్బు కోసం వారు పడే బాధలు థియేటర్‌లో నవ్వులు పూయించాయి. ముఖ్యంగా సత్తి పాత్ర సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక తండ్రి పాాత్రలో మురళీధర్ గౌడ్ ఎప్పటిలాగే తన మార్క్ చూపించాడు. కొడుకు ఫ్యూచర్ కోసం తాపత్రయపడే తండ్రిగా అలరించాడు. హీరోయిన్ శిరీష పాత్రలో పావని తన పరిధిమేరకు నటించిం మెప్పించింది. సినిమాలో చాలావరకు కొత్తవారే ఉన్నప్పటికీ ఆ నటనలో మాత్రం చాలా అనుభవం ఉన్నట్లు చేశారు. అయితే కొన్ని సీన్లలో మాత్రం అనుభవలేమి కనిపిస్తుంది.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ రోనాల్డ్ రూపక్ సన్ మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దానిని తెరకెక్కించడంలో తడబడ్డాడు. స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉంది. నవ్వుల కోసమే సీన్లు చేసుకుంటూ పోయినట్లు అనిపిస్తుంది. ఒకదానికొకటి కనెక్షన్ ఉండదు. సినిమాలో ఎక్కువ భాగం తాగుడే ఉండటం వల్ల ప్రేక్షకుడికి కాస్త విసుగ్గా అనిపిస్తుంది. అయితే ప్రధాన పాత్రల మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ను మాత్రం డైరెక్టర్ చాలా చక్కగా తెరకెక్కించాడు. ఆ కామెడీ చాలా ఫ్రెష్ ఫీలింగ్‌ను తీసుకొస్తుంది. అయితే సీన్లను మరింత క్వాలిటీగా రాసుకుని మేకింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటే సినిమాకు తిరుగుండేది కాదు.
టెక్నికల్‌గా
సినిమాటోగ్రఫీ పరేషాన్ చిత్రానికి ప్లస్ అని చెప్పొచ్చు. వాసు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. పల్లెటూరు వాతావరణాన్ని ఆయన చక్కగా తన కెమెరాతో చూపించారు. ఎడిటింగ్ పరంగా ఇంకా కేర్ తీసుకుంటే బాగుండేది. యశ్వంత్ నాగ్ సంగీతం పర్వాలేదు. అయితే BGM సో సోగా అనిపిస్తుంది. కొన్ని సీన్లకు నేపథ్య సంగీతం మరీ ఓవర్‌గా అనిపిస్తుంది. అసలు సింక్ అయినట్లు అనిపించదు. నిర్మాణ పరంగా మేకర్స్ రాజీ పడినట్లు కనిపిస్తుంది. ఆచి తూచి ఖర్చు పెట్టినట్లు కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్
హీరో నటనకామెడీసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
స్క్రీన్‌ప్లేఎడిటింగ్నేపథ్య సంగీతం
రేటింగ్ : 2.5/5
జూన్ 02 , 2023
Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్ ఫేమస్’...కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
నటీనటులు: సుమంత్ ప్రభాస్, సిరి రాశి, మురళిధర్ గౌడ్, అంజి, నరేంద్ర రవి, మౌర్య చౌదరి,
డైరెక్టర్: సుమంత్ ప్రభాస్
సంగీతం: కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దూపాటి
నిర్మాతలు: చంద్రు మనోహరన్, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, సూర్య చౌదరి
ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా వరకూ సినిమాలు తెలంగాణ నేపథ్యంతోనే తెరకెక్కుతున్నాయి. ఇలా వచ్చిన బలగం, జాతిరత్నాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ సాధించాయి. తాజాగా ఇదే కోవలో తెరకెక్కిన సినిమా ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. `రైటర్ పద్మభూషణ్` వంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించిన ఛాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ వాళ్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. అంతేగాక టాలీవుడ్ స్టార్స్‌తో చేసిన విభిన్న ప్రమోషన్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (మే 26) రిలీజ్ అయిన ‘మేమ్ ఫేమస్’ అందరి అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ
తెలంగాణలోని ఓ విలేజ్‌కు చెందిన మయి(సుమంత్ ప్రభాస్), దుర్గ(మణి ఏగుర్ల), బాలి(మౌర్య చౌదరి) మంచి స్నేహితులు. తెల్లారితే గొడవలు, రాత్రి అయితే తాగుడు అన్నట్లు జీవితాన్ని గడుపుతుంటారు. మయి తన మరదలు మౌనిక (సార్య లక్ష్మణ్)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. మయి ఫ్రెండ్ బాలి కూడా ఊరిలోని ఇంకో అమ్మాయిని ఇష్టపడుతుంటాడు.
అయితే జులాయిగా తిరిగే స్నేహితులంతా కలిసి ఓ టెంట్ హౌజ్ పెడతారు. అది బాగా నడుస్తున్న సమయంలో షాట్ సర్య్కూట్‌కి టెంట్ హౌజ్ మొత్తం కాలిపోతుంది. దీంతో యూట్యూబ్ ఛానెల్ పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ వీడియోల వల్ల గ్రామానికి ఎలాంటి మేలు జరిగింది? మయి, బాలి ప్రేమ కథలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? అనేది మిగతా కథ. ఇది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
ఎలా సాగిందంటే..
ముగ్గరు ఫ్రెండ్స్ ఎడాపెడా తప్పులు చేస్తూ పంచాయతీలో నిలబడటం ఫస్టాఫ్ అంతా రిపీట్ మోడ్‌లో కనిపిస్తుంది. అది చూసేవారికి కాస్త బోరింగ్ అనిపిస్తుంది. అసలు సినిమాలో కథ ఉందా అన్న ప్రశ్నను కూడా రేకెత్తిస్తుంది. ఊరి ప్రజల సూటిపోటీ మాటలతో టెంట్ హౌజ్ పెట్టుకొని స్నేహితులు బాధ్యత తెలుసుకున్నట్లు కనిపిస్తారు. ఈ క్రమంలో వచ్చే లవ్ ఇష్యూస్, టెంట్‌హౌజ్ అగ్నిప్రమాదానికి గురికావడం సెకాండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకాండాఫ్ అంతా యూట్యూబ్ వీడియోస్ చుట్టే తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ పంచ్‌లు నవ్విస్తాయి. అలాగే సుమంత్ ప్రభాస్, సార్య లక్ష్మణ్ మధ్య లవ్ ట్రాక్ యూత్‌కి కనెక్ట్ అవుతుంది. సుమంత్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇక మణి, సార్య లక్ష్మణ్, మణి ఏగుర్ల, మురళీధర్ తదితరులు వారి వారి పాత్రల మేరకు నటించారు.
ఎవరెలా చేశారంటే?
నటన పరంగా సుమంత్ ప్రభాస్ ఫర్వాలేదనిపించాడు. నటనలో ఇంకాస్తా రాటుదేలాల్సి ఉంది. అతని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన మణి, మౌర్య పాత్రల పరిధి మేరకు నటించారు. అంజిమామ, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చా పాత్రలు గుర్తిండి పోతాయి. లిప్‌స్టిక్ స్పాయిలర్ రోల్‌లో యాక్ట్ చేసిన శివనందన్ కామెడీ బాగుంది. అనవసర సన్నివేశాలు సినిమాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
మేమ్ ఫేమస్ సినిమా చూస్తున్నంత సేపు ‘పెళ్లిచూపులు’, ‘జాతిరత్నాలు’ చిత్రాలే గుర్తుకువస్తాయి. సుమంత్ ప్రభాస్ కథను తన స్టైల్‌లో అద్భుతంగా రాసుకున్నప్పటికీ దానిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో విఫలమైనట్లు కనిపించింది. సుమంత్ రాసుకున్న స్టోరీలో ఏమాత్రం బలం లేదు. రోటీన్‌గా ఉంది. కామెడీ, భావోద్వేగాల్ని తాను రాసుకున్న విధంగా తెరపై చూపించలేకపోయాడు. షార్ట్‌ఫిల్మ్‌ను తలపిస్తుంది. సినిమాను సరదాగా తీసుకెళ్తూనే మధ్య మధ్యలో ఎమోషనల్ సీన్స్‌ను ఇరికించారు. ఇక రైతు పడే కష్టం గురించి చెప్పే సీన్లు సందర్భానుసారంగా అనిపించదు. అయితే కొన్ని సీన్లు చాలా కొత్తగా అన్నిపిస్తాయి. కామెడీ కూడా నచ్చుతుంది. అయితే కొన్ని సీన్లు మినహా సినిమా ఓవరాల్‌గా మెప్పించలేకపోయింది.
టెక్నికల్‌గా
సాంకేతికంగా చూస్తే శ్యామ్ దూపాటి కెమెరా వర్క్ బావుంది. కళ్యాణ్ నాయక్ పాటల కంటే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కూడా సో సో గానే ఉన్నాయి. సినిమాకు ఎక్కువ బడ్జెట్ ఎందుకని భావించినట్లు అనిపించింది.
ప్లస్ పాయింట్స్
కామెడీనేపథ్య సంగీతంఇంటర్‌వెల్‌కు ముందు సీన్లు
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీసాగదీతపాటలు
రేటింగ్: 2.75/5
మే 26 , 2023
FAMILY MOVIES: ఈ మధ్యకాలంలో కుటుంబ విలువలు చాటి చెప్పిన టాప్ 5 తెలుగు సినిమాలు
సినిమాల ప్రభావం జనాలపై ఎంతో కొంత కచ్చితంగా ఉంటుంది. చిత్రంలో వచ్చే సన్నివేశాలు కొన్ని సందర్భాల్లో కదిలిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు కుటుంబాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లు, ఓటీటీ అనే తేడా లేకుండా ఆదరించారు ప్రేక్షకులు. కుటుంబాలపై ప్రభావం చూపించిన టాప్ 5 చిత్రాలు ఇవే !
బలగం
ఈ ఏడాది విడుదలైన కుటుంబ కథా చిత్రాల్లో మెుదటిది బలగం. చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన కుటుం మళ్లీ ఎలా కలుస్తుందనే కథను అద్భుతంగా తెరకెక్కించడంతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించిన ఈ చిత్రం కారణంగా ఎన్నో విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలుసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
రంగ మార్తాండ
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులు, ఇప్పటి జనరేషన్ పిల్లల మధ్య జరిగిన సంఘర్షణలే రంగ మార్తాండ. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ నుంచి వచ్చింది ఈ సినిమా. ఈ చిత్రం నేటితరం యువతకు మంచి పాఠంగా నిలుస్తుంది. తల్లిదండ్రులు మనకు ఏం చేశారో తెలుసుకొని వారిని ఎలా గౌరవించాలో తెలుసునేందుకు ఉపయోగపడుతుంది రంగ మార్తాండ.
రైటర్ పద్మభూషణ్
యంగ్ హీరో సుహాస్ లీడ్ రోల్ చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్. సినిమా మెుత్తం ఓ యువకుడు కెరీర్‌లో నిలదొక్కుకోవటానికి పడే కష్టాల గురించి వివరించినా… అతడికి తల్లిదండ్రులు ఎలా మద్దతుగా నిలబడ్డారనేది అసలు అంశం. కలల్ని వదిలి వంటింటికే పరిమితమైన తల్లి కుమారుడి కోసం రచనలు చేయడం ప్రారంభించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. అంతేకాదు, మహిళల కలల్ని అర్థం చేసుకొని వారి ఆలోచనల్ని గౌరవించాలనే విషయాన్ని చాలామందికి చెబుతుంది ఈ సినిమా.
మట్టి కుస్తీ
భార్య, భర్తల మధ్య సమస్యలను ఓ చిన్న కథతో ముడి పెట్టి తీశారు. భర్త ఆధిపత్యమే కొనసాగాలనే వ్యక్తికి.. మగవాళ్లకు మేము ఏం తక్కువ కాదనే భార్య. కానీ, ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే జీవితం ముందుకు సాగుతుందని కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా చాలామందిలో మార్పు తీసుకువచ్చింది. ఇల్లాలికి తగిన గౌరవం ఇస్తామని చెప్పినవారు కూడా ఉన్నారు.
ది గ్రేట్ ఇండియన్ కిచెన్
సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలను ఇంటి పనులకే పరిమితం చేస్తున్నారనేది సింపుల్ కథ. ఓ మహిళకు కొత్తగా పెళ్లై అత్తారింటికి వెళ్తుంది. మగవాళ్ల ఆధిపత్యం ఉన్న ఇంట్లో ఆమె ఇమడలేకపోతుంది. ఇళ్లు, వంటపని మెుత్తం చేస్తూ విసిగిపోయి శివమెత్తుతుంది. పురుషాధిక్యాన్ని ఎదురించి స్వతంత్రంగా తన లక్ష్యం వైపు సాగుతుంది. పురుషాధిక్య సమాజంలో మహిళలు ఇంకా ఎదుర్కొంటున్న అంశాలను సినిమాలో చక్కగా ప్రస్తావించారు. కొందరికి కళ్లు తెరిపిస్తే.. మరికొందరికి సమస్యగా మారింది ఈ చిత్రం. అన్ని పనులు షేర్ చేసుకోవాలంటూ ఆఫీసుల నుంచి వచ్చిన భర్తల్ని భార్యలు ఆటపట్టిస్తున్నారంట ఈ సినిమా చూసి…!
జయ జయ జయ జయ జయహే
ఈ సినిమా కూడా భార్య భర్తల మధ్య వచ్చే ఇగో ప్రాబ్లమ్స్‌తో తెరకెక్కించారు. అన్ని తను అనుకున్నట్లుగా సాగాలనుకునే భర్త.. అనుకోని సందర్భంలో భార్యపై చేయిచేసుకుంటాడు. ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవటంతో తానే అన్ని చూసుకోవాలని ఆమె తైక్వాండో నేర్చుకుంటుంది. ఈ క్రమంలో ఇబ్బందులు రావటం, వాళ్లు విడిపోవడం జరుగుతుంది. అబ్బాయిపై ఆధారపడకుండా కూడా అమ్మాయిలు జీవిస్తారు. కానీ, అలా మగవారు ఉండలేరని చూపించారు. ఇది కూడా చాలామంది కపుల్స్‌పై ప్రభావం చూపించింది. ఇందులో భర్తను తైక్వాండోతో ఆటాడుకునే రీల్ తెగ వైరల్ అయ్యింది. ఆ పరిస్థితుల్లో మీరుంటే ఒక్కసారి ఊహించుకోండి.
ఏప్రిల్ 27 , 2023
Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్‌బస్టర్ కొట్టు!
టాలివుడ్ ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు కామెడీ పాత్రలు, విలన్ రోల్స్‌కు మాత్రమే పరిమితమైన తెలంగాణ భాష, యాస ఇప్పుడు లీడ్ రోల్స్‌కు చేరింది. తెలంగాణ సంస్కృతి, యాస ఉంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. భారీ సినిమాలో పాత్రలకు తెలంగాణ పల్లె యాస ఉందంటే సెన్సేషనల్ అవుతోంది. స్టార్ హీరోలు సైతం సినిమాలోనే గాక వేదికలపై తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు. తెలంగాణ యాస, కట్టూ, బొట్టూ వెండితెరపై వెలుగులీనుతున్నాయి.
బలం చూపిన ‘బలగం’
వెండితెరపై తెలంగాణం చేసే అద్భుతాన్ని ఇటీవల చూపించిన సినిమా ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తెలంగాణ పల్లెల్లో అంత్యక్రియల సంస్కృతి, పరిస్థితులు కళ్లకు కట్టినట్లు అత్యంత భావోద్వేగంగా చూపించారు. అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటింది. లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో రెండు అవార్డులు సొంతం చేసుకుంది.
గుండు గుత్తగా బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘దసరా’
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో మార్చి 30న విడుదలైన దసరా బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది. నాని కెరీర్‌లోనే ఎన్నడూ లేనంతగా… తొలిరోజే రూ.38 కోట్లు వసూలు చేసి ఈ సినిమా సంచలనం సృష్టించింది. సింగరేణి బొగ్గు గనుల్లో ఒక్కప్పుడు ఉన్న పరిస్థితులను శ్రీకాంత్ ఓదెల వెండితెరపై కళ్లకు గట్టాడు. తెలంగాణ భాష పరిమళంతో బ్లాక్‌బస్టర్‌ను కొట్టాడు.
చిన్న సినిమాలతో మొదలై..
అప్పట్లో వెకిలి పాత్రలకే పరిమితమై తెలంగాణ యాసను పూర్తి స్థాయిలో సినిమాలో చూపించడం చిన్న సినిమాలతోనే మొదలైంది. విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులో తెలంగాణ యాసలోనే మాట్లాడిన విజయ్… బయట కూడా అదే తీరుతో అందరి మనసులూ ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి కూడా ఆ సినిమాలో మెప్పించాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమాలోనే ఓ నయా ట్రెండ్‌కు ‘అర్జున్ రెడ్డి’ తెరలేపింది. ఇలా తెలంగాణ యాస, సంస్కృతితో హిట్ కొట్టిన టాప్ మూవీస్ చాలానే ఉన్నాయి.
ఫిదా
లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్‌గా వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా ‘ఫిదా’. సినిమా షూటింగ్ మొదలుకుని టైటిల్ దాకా అంతా తెలంగాణమే. తెలంగాణ యాసలోనే రాసిన ‘వచ్చిండే’ పాట మొత్తం యూట్యూబ్‌నే షేక్ చేసింది. తెలంగాణ ప్రకృతి సౌందర్యాన్ని, పల్లెల అందాన్ని తెరమీద ఆవిష్కరించిన సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు ‘ ముసురు’ అనే టైటిల్ అనుకున్నారట.
ఈ నగరానికి ఏమైంది?
పెళ్లి చూపులు తర్వాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. పక్కా హైదరాబాదీ కుర్రాళ్లు నలుగురిని తీసుకుని సింపుల్‌గా ఉండే ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. విశ్వక్ సేన్, అభినవ్ పాత్రలు చాలా అద్భుతంగా పండాయి.
డీజే టిల్లు
2022లో వచ్చిన డీజే టిల్లు గురించి అయితే అందరికీ తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డను స్టార్‌ను చేసింది. ఇందులో ప్రతి డైలాగ్ అదిరిపోయాయి. విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండో పార్ట్ కూడా త్వరలోనే రాబోతోంది.
మల్లేశం
ఆసుయంత్రం కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాలో ప్రియదర్శి తెలంగాణ మాండలికాన్ని మనసుకు హత్తుకునేలా పలికించాడు. చేనేతల జీవన స్థితిగతులను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది.
లవ్ స్టోరీ
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మరో సినిమా ‘లవ్ స్టోరీ’. తెలంగాణ పల్లెటూరి పేదోళ్ల పరిస్థితితో పాటు కొన్ని సున్నితమైన విషయాలను స్పృశిస్తూనే శేఖర్ కమ్ముల మరోసారి తెలంగాణ పరిమళాన్నివెండితెరపై వెలుగులీనేలా చేశాడు.
ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ పూరీకి కమ్‌బ్యాక్ మూవీ అయ్యింది. రామ్ తెలంగాణ మాండలికంలో అదరగొట్టాడు. వరంగల్ పిల్లగా హీరోయిన్ నభా నటేశ్ అమితంగా ఆకట్టుకుంది.
విరాట పర్వం
నక్సలిజం ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టిన సినిమా ‘విరాటపర్వం’. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా విమర్శకుల ప్రసంసలు అందుకుంది.
NBK108లోనూ..
నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావుపూడి కాంబినేషన్‌లో వస్తున్న NBK108లోనూ.. తెలంగాణ సంస్కృతినే కథ నేపథ్యంగా తీసుకున్నట్లు తెలిసింది. ఈసారి తెలంగాణ యాసలో బాలయ్య అలరించనున్నారు.
ఆస్కార్ స్థాయికి
పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు కూడా తెలంగాణ యాసలో పలుకుతున్నారంటే తెలుగు సినిమా ట్రెండ్ ఎలా మారుతుందో తెలుస్తోంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన RRRలో ఎన్టీఆర్ తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ సాహిత్యం కూడా తెలంగాణమే. ‘ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు’ అంటూ చంద్రబోస్ తెలంగాణ జీవన విధానాన్ని చెప్పాడు. ఒకప్పుడు ‘తొక్కు’ అంటేనే వెక్కిరించి చూసే స్థాయి నుంచి అదే మాటతో ఉన్న పాటకు ఆస్కార్ వచ్చే స్థాయికి తెలంగాణం తెలుగు సినిమాలో చేరింది. నాటు నాటు మాత్రమే కాదు ఇటీవల తెలుగు సినిమాలో తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యత పెరిగిందనే చెప్పాలి. ‘బలగం’లో కన్నీరు పెట్టించిన పాటలన్నీ కాసర్ల శ్యామ్ రాసినవే. కాసర్ల శ్యామ్ ఇప్పుడు టాప్ లిరిసిస్ట్‌గా ఎదుగుతున్నాడంటే మన యాసకు పెరుగుతున్న ప్రాధాన్యతే.
ఏప్రిల్ 01 , 2023
KAVYA KALYAN RAM: నటన సరే.. మరి అక్కడ రాణిస్తుందా?
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసిన ఓ హీరోయిన్ గురించే చర్చ. ఆమె ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చింది? అంటూ ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరో కాదు కావ్య కల్యాణ్ రామ్. బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కావ్య…మసూద, బలగం సినిమాలతో హీరోయిన్‌గా మారి గుర్తింపు తెచ్చుకుంది.
అచ్చమైన తెలుగమ్మాయి
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ తెలుగమ్మాయి నాగార్జున హీరోగా వచ్చిన స్నేహమంటే ఇదేరా చిత్రంతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి ఎన్నో చిత్రాల్లో చిన్నప్పట్నుంచే క్యారెక్టర్లు చేసింది కావ్య.
హీరోయిన్ ఛాన్స్
గతేడాది చివర్లో వచ్చిన హార్రర్ చిత్రం మసూదలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది కావ్య కళ్యాణ్ రామ్. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కమేడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగంలోనూ కావ్యకు కథానాయికగా మెరిసింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవటంతో కావ్య గురించి అందరూ వెతుకుతున్నారు.
ఫాలోయింగ్ ఎక్కువే
సినిమాల్లో చేస్తూనే చదువుపై కూడా శ్రద్ధ పెట్టింది కావ్య. B.A, L.L.B పూర్తి చేసింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో 95.5k ఫాలోవర్స్ ఉన్నారు. అటు ఫిట్‌నెస్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అందాల భామ. ఉదయాన్నే కసరత్తులు చేస్తూ గ్లామర్ మెయింటెన్ చేస్తోంది.
దశ మారుతుందా?
వరుసగా రెండు సినిమాలు హిట్ కొట్టడంతో ఆమెకు అవకాశాలు చాలా పెరగొచ్చు. అందులోనూ దిల్ రాజు వంటి బడా నిర్మాతతో పనిచేయడం కలిసి వస్తుందని ఆశిస్తోంది. ఇప్పటికే మరో సినిమా షూటింగ్‌లోనూ బిజీగా గడుపుతోంది కావ్య. మత్తు వదలరా చిత్రంతో హీరోగా మారిన శ్రీ సింహా సరసన నటిస్తోంది. బడ్జెట్ కాస్త తక్కువ ఉండే సినిమాల్లో హీరోయిన్‌గా కావ్యను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మార్చి 17 , 2023
ఈ వారం(March 3) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు
ఫిబ్రవరి నెలలో సినిమా రిలీజ్‌లు ముగిశాయి. ఈ వారం(మార్చి 3)లో పెద్ద సినిమాల సందడేమీ లేదు. పరీక్షల సమయం కావడంతో బిగ్ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేయట్లేదు. ఈ శుక్రవారం 5 చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వీటితో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో విడుదల కాననున్నాయి. అవేంటో చూద్దాం.
బలగం
కమెడియన్ వేణు ఎల్దండి డైరెక్టర్‌గా వ్యవహరించిన చిత్రమే ‘బలగం’. తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌రామ్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత రెడ్డి, హన్షిత్ నిర్మించారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. మార్చి 3న సినిమా విడుదల కానుంది.
ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. బిగ్‌బాస్ కంటెస్టెంట్ సొహైల్, మృణాళిని రవి జంటగా నటించారు. మీనా, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. 44 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ని పూర్తిచేయడం విశేషం. ఈ సినిమాను మార్చి 3న విడుదల చేయనున్నారు.
సాచి
బిందు అనే యువతి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రచార చిత్రాలను బట్టి చూస్తే మహిళా సాధికారతను ప్రోత్సహించే సినిమాగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. వివేక్ పోతగోని డైరెక్షన్ వహించి, నడిపల్లి ఉపేన్‌తో కలిసి నిర్మించారు. మార్చి 3న ఈ సినిమా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
రిచిగాడి పెళ్లి
బాల్యంలో ఆడుకున్న ఆటల్ని మనల్ని మరచిపోలేం. ఇలాంటి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘రిచిగాడి పెళ్లి’. కేఎస్ ఫిల్మ్‌వర్క్స్ నిర్మాణంలో వస్తోందీ చిత్రం. కేఎస్ హేమరాజ్ దర్శకత్వం వహించారు. సత్య, చందన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా మార్చి 3న విడుదల కానుంది. మానవ సంబంధాల్ని ఆవిష్కరించే కథతో తెరకెక్కించినట్లు మూవీ యూనిట్ వెల్లడించింది.
గ్రంథాలయం
విన్ను మద్దిపాటి ప్రధాన పాత్రధారిగా చేసిన చిత్రం ‘గ్రంథాలయం’. యాక్షన్ త్రిల్లర్ జానర్‌గా తెరకెక్కింది. వైష్ణవి శ్రీ.ఎస్ నిర్మాతగా వ్యవహరించారు. జంపన సాయి శివన్ డైరెక్షన్ వహించారు. ఈ సినిమా మార్చి 3న థియేటర్లలో విడుదల కానుంది.
OTT విడుదలలు
Title CategoryLanguagePlatformRelease DateWalteir VeerayyaMovieTeluguNetflixFebruary 27HeatWaveMovieEnglishNetflixMarch 1The Mandalorian S3Web SeriesEnglishDisney HotstarMarch 1Sex/Life S2Web SeriesEnglishNetflixMarch 2ThalaikoothalMovieTamilNetflixMarch 3AloneMovieMalayalam/TeluguDisney HotstarMarch 3Daisy Jones & The SixWeb SeriesEnglishAmazon PrimeMarch 3Taj: Divided by BloodWeb SeriesEnglishZee5March 3Gulmohar MovieHindiDisney HotstarMarch 3
ఫిబ్రవరి 27 , 2023
EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్ చిత్రాలు ఇవే!
సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మరికొన్ని సినిమాలు స్థానికతను బేస్ చేసుకొని వచ్చి మంచి ఆదరణ పొందాయి. స్థానిక ప్రజల భాష, మనుషుల వ్యక్తిత్వాలు, చుట్టుపక్కల పరిస్థితులను ఆడియన్స్‌కు తెలియజేశాయి. టాలీవుడ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జిల్లాలను ప్రతిబింబించేలా ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
[toc]
పుష్ప (Pushpa)
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల చుట్టు తిరుగుతుంది. అంతేకాదు చిత్తూరు దాని పరిసర ప్రాంతాల ప్రభావం కూడా సినిమాలో కనిపిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు శ్లాంగ్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను రిప్రజెంట్ చేశాడు.
గుంటూరు కారం (Guntur Karam)
మహేష్ బాబు (Mahesh Babu) రీసెంట్ చిత్రం.. ‘గుంటూరు కారం’ పేరుకు తగ్గట్లే ఏపీలోని ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసింది. ఈ సినిమాలో గుంటూరు దాని పరిసర ప్రాంతాలను చూపించారు. ఇందులో మహేష్‌ది గుంటూరు కావడంతో పదే పదే ఆ ఊరి పేరు సినిమాలో వినిపించడం గమనార్హం.
బలగం (Balagam)
ప్రియదర్శి (Priyadarsi) హీరోగా జబర్దస్త్ ఫేమ్ వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ‘బలగం’ చిత్రం గతేడాది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ గ్రామాలకు అద్దం పట్టింది. ఊర్లో ప్రజల మధ్య ఉండే అనుబంధాలను తెలియజేసింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో అనుసరించే విధానాలను కళ్లకు కట్టింది
రంగస్థలం (Rangasthalam)
రామ్‌చరణ్-సుకుమార్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం 1980ల నాటి గోదావరి పరివాహక గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇందులో రామ్‌చరణ్ చిట్టిబాబు పాత్రలో గోదావరి జిల్లాల అబ్బాయిగా కనిపించాడు. తన యాస, భాషతో ఆకట్టుకున్నాడు.
దసరా (Dasara)
హీరో నాని నటించిన దసరా సినిమాను గమనిస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి/రామగుండం ఏరియాల ప్రభావం కథపై కనిపిస్తుంది. నాని కూడా స్థానిక భాషలో డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సింగరేణి బొగ్గుగనుల సమీపంలో జీవించే వారి జీవితాలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరరూపం ఇచ్చారు. ఈ సినిమాను చూసి ఆ ప్రాంత వాసులు అప్పట్లో సంతోషం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు.
కలర్‌ఫొటో (Colour Photo)
కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమా కథ మెుత్తం కోనసీమ చుట్టూ తిరుగుతుంది. అక్కడి అందాలను డైెరెక్టర్ తెలుగు ఆడియన్స్‌కు చూపించారు. ఈ సినిమా ద్వారానే హాస్య నటుడు సుహాస్ హీరోగా మారాడు.
ఉప్పెన (Uppena)
యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej), డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాకినాడ తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల జీవన స్థితులను డైరెక్టర్ కళ్లకు కట్టాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు వారు ఎంత కష్టపడతారో చూపించారు.
కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam)
వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాను 50 శాతానికి పైగా రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో దర్శకుడు చూపించారు. అక్కడ వారి మనసులు ఎంత స్వచ్చంగా ఉంటాయో తెలియజేశారు.
విరాట పర్వం (Virata parvam)
హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’.. నక్సల్ ప్రభావిత ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 1990-92 ప్రాంతంలో మలుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎలా జీవించారో తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, మావోయిస్టులు, పోలీసులు ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించారు.
ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar)
రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ను పరిశీలిస్తే.. ఇందులో హీరో ఓల్డ్ సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తన మాటలు, హావ భావాలు కూడా ఆ ప్రాంత వాసులను గుర్తుచేస్తాయి. ఇందులో హీరోయిన్‌గా చేసిన నభా నటేష్.. వరంగల్ పోరీ అంటూ పదే పదే చెప్పుకోవడం గమనార్హం.
కేర్ ఆఫ్ కంచరపాలెం (C/o కంచరపాలెం)
మహా వెంకటేష్ (Maha Venkatesh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. పాత్రల మాటతీరు కూడా విజయనగరం జిల్లా యాసను పోలి ఉంటాయి. కార్తిక్ రత్నం, రాజు, రాధా బెస్సీ, ప్రణీ పట్నాయక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.
రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru)
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా చేసిన 'రాజావారు రాణిగారు'.. ఒక అహ్లాదకరమైన సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లాలను ప్రతిబింబిస్తుంది. అక్కడి గ్రామాల్లో ఉండే కల్మషంలేని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. గోదావిరి నేటివిటీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
గోదావరి ఆధారంగా వచ్చిన చిత్రాలు
టాలీవుడ్ చాలా సినిమాలు ఉభయ గోదావరి జిల్లాలను ఆధారంగా చేసుకొని వచ్చాయి. గల గలపారే గోదావరి నది ఆయా చిత్రాల్లో చాలవరకూ సన్నివేశాల్లో ప్రతింబింబిస్తుంది. ‘సితారా’, ‘లేడీస్ టైలర్’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బెండు అప్పారావు’, ‘శతమానం భవతి’ తదితర చిత్రాలన్నీ గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చినవే.
.
అక్టోబర్ 22 , 2024
Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
ఈ ఏడాది టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు, వందల సంఖ్యలో పాటలు విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కొన్ని తెలుగు పాటలు జాతీయస్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. యూట్యూబ్‌ను షేక్ చేస్తూ అత్యధిక ఆదరణను సంపాదించాయి. 2023లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న పాటలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
మా బావ మనోభావాలు..
ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించిన ఐటెం సాంగ్.. 'మా బావ మనోభావాలు..'. వీరసింహారెడ్డి సినిమాలోని ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. ఈ సాంగ్‌లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసి అదరగొట్టారు. సాహితి, యామిని, రేణు కుమార్ ఆలపించిన ఈ పాటను రామ జోగయ్యశాస్త్రి రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
https://www.youtube.com/watch?v=DCrO12C5oho
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
'బేబీ' చిత్రం ఈ ఏడాది ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట గుండెల్ని పిండేస్తుంది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సాంగ్.. యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలను పొందింది.
https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI
మాస్టారు మాస్టారు
ధనుష్ హీరోగా రూపొందిన 'సార్' చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని 'మాస్టారు మాస్టారు' సాంగ్ సంగీత ప్రియులను కట్టిపడేసింది. ఈ పాటను ప్రముఖ కన్నడ గాయని శ్వేతా మోహన్ ఆలపించారు.
https://www.youtube.com/watch?v=AXSm49NGkg8
పొట్టిపిల్ల
జబర్దస్త్ వేణు డైరెక్ట్ చేసిన ‘బలగం’ సినిమాలోని ‘పొట్టిపిల్ల’ సాంగ్ ఈ ఏడాది బాగా వినిపించింది. చాలా ఫంక్షన్లు, యూత్ ఈవెంట్లలో మారుమోగింది. ముఖ్యంగా యువత ఈ పాటపై రీల్స్ చేసుకొని షేర్ చేసుకున్నారు. పొట్టిపిల్ల పాటను సింగర్ రామ్ మిరియాల ఆలపించారు.
https://www.youtube.com/watch?v=CDNb6zyybDg
చంకీల అంగీలేసి
హీరో నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఈ సినిమాలోని 'చంకీల అంగిలేసి' అప్పట్లో విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు పెద్ద ఎత్తున రీల్స్ చేసి సందడి చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ పాటపై అద్భుత రీల్స్ చేసి అలరించారు.
https://www.youtube.com/watch?v=9O-mBYAqM1c
నచ్చావులే నచ్చావులే
సాయిధరమ్ తేజ్, సంయుక్త జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'విరూపాక్ష'. ఈ సినిమాతో పాటే ఇందులోని 'నచ్చావులే నచ్చావులే' సాంగ్ మంచి ఆదరణను సంపాదించింది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను కార్తిక్ ఆలపించగా.. అజనీశ్ లోక్‌నాథ్ స్వరపరిచారు.
https://www.youtube.com/watch?v=TUGfWIO_fFI
ఆరాథ్య
విజయ్ దేవరకొండ, సమంత జంటగా చేసిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఆరాథ్య’ సాంగ్ యూత్‌కు మరింత బాగా కనెక్ట్ అయ్యింది. చాలా మందికి ఫేవరేట్ సాంగ్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లోనూ అధిక వీక్షణలు పొందింది.
https://www.youtube.com/watch?v=wlC_eFbxwDo
సమ్మోహనుడా..
రూల్స్ రంజన్ సినిమాలోని ‘సమ్మోహనుడా’ సాంగ్ ఈ ఏడాది సోషల్ మీడియాను షేక్ చేసింది. అమ్‌రిష్ ఇచ్చిన ట్యూన్.. శ్రీయా గోషల్ వాయిస్ అందర్నీ కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గానూ నిలిచింది. సాంగ్ రిలీజ్ అనంతరం ట్రెండ్ అయిన పది రీల్స్‌లో ఐదు ఈ పాటకు సంబంధించినవే కావడం విశేషం.
https://www.youtube.com/watch?v=aJQcn34K_S8
నిజమే నే చెబుతున్నా
ఊరి పేరు భైరవకోన సినిమాలోని 'నిజమే నే చెబుతున్నా' సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని సమకూర్చారు.
https://www.youtube.com/watch?v=2pgx-tajxwE
జమల్ జమాలో
యానిమల్ సినిమాలోని ‘జమల్ జమాలో’ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన పదిహేను గంటల్లోనే ఏడు మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. జమల్ జమాలో పాట నిజానికి ఒక ఇరాన్ సాంగ్. ఈ పాటను ఇరానియన్ కవి బిజాన్ సమాందర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచి ఇరాన్‌లో పెళ్లి వేడుకలతో పాటు ఇతర పంక్షన్స్‌లో ఈ పాట తప్పకుండా ఉండటం ఆనవాయితీగా వస్తోంది.
https://www.youtube.com/watch?v=PmdyY38g6Rg
డిసెంబర్ 28 , 2023
Tollywood Controversies 2023: ఈ ఏడాది టాలీవుడ్‌ను కుదిపేసిన వివాదాల గురించి తెలుసా?
ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా పలు వివాదాలు టాలీవుడ్‌ను షేక్ చేశాయి. తారలు, సినీ ప్రముఖుల మధ్య తలెత్తిన ఈ వివాదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మాటాల తూటాలను పేల్చేలా చేశాయి. ఇంతకీ ఆ కాంట్రవర్సీస్ ఏంటి? అందుకు కారణమైన నటీనటులు ఎవరు? తదితర అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
నందమూరి బాలకృష్ణ
ఈ ఏడాది ప్రారంభంలో 'వీరసింహారెడ్డి' చిత్ర ప్రమోషన్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'అక్కినేని తొక్కినేని' అంటూ నోరు జారారు. ఇది అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. నాగచైతన్య, అఖిల్ సైతం ఈ అంశంపై ట్విటర్ (X) వేదికగా స్పందించారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై జూ.ఎన్టీఆర్ స్పందించకపోవడం పైనా బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఐ డోంట్ కేర్’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు కూడా వివాదం అయ్యాయి.
సమంత vs చిట్టిబాబు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మయోసిటిస్ (Myositis) వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే 'శాకుంతలం' సినిమా విడుదల సందర్భంగా దీనిపై నిర్మాత చిట్టిబాబు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సామ్‌కు వచ్చిన వ్యాధి సాధారణమైనదేదని వ్యాఖ్యానించారు. సినిమా విడుదలకు ముందు ఆమె సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. అయితే దీనిపై సమంత పరోక్షంగా స్పందించింది. కొందరికి చెవుల్లో జుట్టు పెరగడానికి కారణం టెస్టోస్టిరాన్ అని చిట్టిబాబును ఉద్దేశిస్తూ కౌంటర్ ఇచ్చింది.
విష్ణు vs మనోజ్
మంచు బ్రదర్స్ అయిన విష్ణు, మనోజ్ మధ్య గొడవలు ఈ ఏడాది తారా స్థాయికి చేరినట్లు కనిపించాయి. మనోజ్ పెళ్ళికి కూడా విష్ణు రాలేదు. వివాహం జరిగిన కొద్దిరోజులకు విష్ణు తన మనుషుల మీద దాడి చేస్తున్నాడని మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అది క్షణాల్లో వైరల్ అయ్యింది. వెంటనే ఆ వీడియో డిలీట్ చేశాడు. అప్పటి వరకు వచ్చిన పుకార్లకు ఆ వీడియో బలం చేకూర్చింది. అయితే రియాలిటీ షో కోసం చేసిన ఫ్రాంక్ అని విష్ణు నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ జనాలు నమ్మలేదు. కారణం విష్ణు ఇప్పటివరకూ ఎలాంటి రియాలిటీ షో చేయకపోవడమే.
https://twitter.com/TeluguBitlu/status/1639265933175713800
పవన్ vs అంబటి
పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన చిత్రం 'బ్రో' (Bro). ఈ సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీ ఓ పాత్ర పోషించాడు. ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైంది. ఆ పాత్రను తనను ఉద్దేశించే పెట్టారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ప్రెస్‌మీట్‌లు పెట్టి మరి పవన్‌పై విమర్శలు గుప్పించారు. అయితే ఆ పాత్ర ఎవరినీ ఉద్దేశించి పెట్టలేదని చిత్ర నిర్మాత, నటుడు పృథ్వీ స్పష్టం చేశారు.
విజయ్ దేవరకొండ vs అనసూయ
అనసూయ భరద్వాజ్- విజయ్ దేవరకొండల వివాదం కూడా ఈ ఏడాది టాలీవుడ్‌ని షేక్ చేసింది. ‘ఖుషి’ చిత్ర పోస్టర్‌పై 'ది విజయ్ దేవరకొండ' అని రాయడాన్ని ఆమె పరోక్షంగా ఎగతాళి చేశారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. విజయ్‌ని ఉద్దేశపూర్వకంగానే తాను టార్గెట్ చేశానని అనసూయ స్పష్టం చేసింది. విజయ్ వద్ద పనిచేసే వ్యక్తి డబ్బులు ఇచ్చి నాపై దుష్ప్రచారం చేయించాడని ఆమె ఆరోపించింది. విజయ్ ప్రమేయం లేకుండా ఇది జరగదని చెప్పింది. అందుకే తాను విజయ్‌పై విమర్శలు చేసినట్లు వివరించింది.
దిల్‌రాజు vs సి.కళ్యాణ్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు దిల్ రాజు - సి.కళ్యాణ్ మధ్య మాటల యుద్దానికి దారి తీశాయి. చిన్న నిర్మాతలను తొక్కేస్తూ వాళ్ళను దిల్ రాజు ఎదగనీయడం లేదని సి. కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు దిల్ రాజుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సి కళ్యాణ్ వీడియో బైట్ సైతం విడుదల చేశారు. ఇది అప్పట్లో చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. కాగా ఈ ఎన్నికల్లో దిల్‌రాజు ప్యానెల్ విజయం సాధించింది.
బలగం స్టోరీ వివాదం
ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్ర కథ తనదేనంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఆరోపణలు చేశారు. వేణు తన స్టోరీని కాపీ చేశాడని ఆరోపించారు. అయితే వేణు ఈ కామెంట్స్ ఖండించారు. తన సొంత అనుభవాలతో రాసుకున్న కథ అని సమాధానం ఇచ్చారు. కోర్టులో తేల్చుకోమని సవాలు సైతం విసిరారు.
పుష్ప నటుడు అరెస్టు
పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ ఫ్రెండ్‌గా నటించి పాపులర్ అయిన జగదీష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసే ఓ యువతి ఆత్మహత్య కేసులో అతడ్ని డిసెంబర్ 6న పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను తన దారికి తెచ్చుకోవడం కోసం ఫొటోలతో బెదిరించినట్లు పోలీసుల వద్ద జగదీష్ అంగీకరించాడు. ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని తాను ఊహించలేదని చెప్పుకొచ్చాడు.
డిసెంబర్ 18 , 2023
Tollywood Debut Directors in 2023: తొలి చిత్రంతోనే సంచనాలు సృష్టించిన కొత్త దర్శకులు వీరే!
ప్రతీ సంవత్సరం స్టార్ డైరెక్టర్ల చిత్రాలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తుంటాయి. కనీసం రెండు లేదా మూడు చిత్రాలు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అయితే ఈ ఏడాది స్టార్ డైరెక్టర్ల హవా టాలీవుడ్‌లో పెద్దగా కనిపించలేదు. అయితే కొత్త దర్శకులు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించారు. మరి ఆ దర్శకులు ఎవరు? వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.
శౌర్యువ్
నాని హీరోగా తెరక్కిన హాయ్ నాన్న చిత్రం రీసెంట్‌గా విడుదలై బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమాలో భావోద్వేగాలను చక్కగా పలికించి తొలి సినిమాతోనే అందరి మన్ననలు పొందాడు.
కళ్యాణ్ శంకర్
కొత్త నటీనటులను, కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ ని పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తెరకెక్కించిన సినిమా ‘మ్యాడ్’. కాలేజీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సుమంత్ ప్రభాస్
షార్ట్ ఫిలిమ్స్‌తో ఫేమ్‌ని సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్.. హీరోగా, దర్శకుడిగా చేస్తూ వెండితెరపై అరంగేట్రం చేసిన సినిమా ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాకు ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి.
క్లాక్స్
చిన్న సినిమాగా విడుదలైన ‘బెదురులంక 2012’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ క్లాక్స్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక యునిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.
వేణు యెల్దండి
ఈ ఏడాది సంచలనం సృష్టించిన కొత్త దర్శకుల్లో వేణు యెల్దండి ముందు వరుసలో ఉంటారు. ఆయన తెరకెక్కించిన 'బలగం' అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. అంతేగాక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. గ్రామాల్లో తెరలు పెట్టి మరి సినిమాను ప్రదర్శించారంటే ఈ చిత్రం ఏ స్థాయిలో ఆదరణ సంపాదించిందో అర్థమవుతుంది.
శ్రీకాంత్ ఓదెల
నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు ఓదెల. గొప్ప సినిమాలు చేయగల సత్తా తనలో ఉందని నిరూపించుకున్నాడు.
షణ్ముఖ ప్రశాంత్
ఈ ఏడాది విడుదలైన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా షణ్ముఖ ప్రశాంత్ డైరెక్టర్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.12 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
మురళి కిషోర్
కిరణ్ అబ్బవరం హీరోగా నూతన దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర డైరెక్ట్ చేసిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే డైరెక్టర్‌గా తనకు మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకున్నారు మురళి కిషోర్.
డిసెంబర్ 16 , 2023
Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 7 నుంచి 13వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
జైలర్
రజనీకాంత్ కాంత్ లేటెస్ట్ మూవీ జైలర్ ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 10న (గురువారం) ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో తమన్నా కథానాయికగా చేసింది. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. జైలర్‌లో రజనీకాంత్ స్టైల్, యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తుంటే పాత రజనీని గుర్తు చేస్తున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ అందించిన నేపథ్య సంగీతం ప్రచార చిత్రాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేసింది.
భోళాశంకర్
వాల్తేరు వీరయ్యగా ఈ ఏడాది వినోదాలు పంచిన మెగాస్టార్ చిరంజీవి.. ‘భోళా శంకర్’గా మరోమారు సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులోనూ తమన్నానే హీరోయిన్‌గా చేసింది. కీర్తి సురేష్ చిరు చెల్లెలిగా నటించింది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబైన ఈ చిత్రంలో చిరు స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు.
ఓ మై గాడ్
అక్షయ్‌కుమార్ (Akshay Kumar) దేవుడి పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘ఓ మై గాడ్ 2’ (OMG 2) రూపొందిన సంగతి తెలిసిందే. అమిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద నామ్‌దేవ్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఉస్తాద్
శ్రీసింహా హీరోగా ఫణిదీప్ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్’. బలగం ఫేమ్ కావ్యా కల్యాణ్‌రామ్ హీరోయిన్‌గా చేసింది. గౌతమ్ మేనన్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 12న (శనివారం) ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీసింహా మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. జోసెఫ్ డిసౌజా అనే పైలట్ పాత్రలో గౌతమ్ మేనన్ నటించారు.
గదర్ 2
ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్ హీరోగా చేసిన ‘గదర్ 2’ చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. ఆగస్టు 11 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో సన్నీ దేవోల్.. తారా సింగ్ పాత్రలో నటించారు. సకీనాగా అమీషా పటేల్ నటించింది. ఈ చిత్రానికి అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. చరణ్‌జీత్‌గా ఉత్కర్ష్ శర్మ కనిపించనున్నారు. జీ స్టూడియోస్‌తో అనిల్ శర్మ, కమల్ ముకుట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లివే!
హిడింబ
ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా చేసిన రీసెంట్ చిత్రం హిడింబ. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఆహా వేదికగా ఆగస్టు 10 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీవిఘ్నేష్ సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించాడు. అశ్విన్‌కు జోడీగా నందితా శ్వేత నటించింది.
TitleCategoryLanguagePlatformRelease DateGabby's DollhouseWeb SeriesEnglishNetflixAugust 7ZombieverseWeb SeriesEnglishNetflixAugust 8Heart of StoneMovieHindiNetflixAugust 11In another world with my smartphoneMovieEnglishNetflixAugust 11Pending TrainMovieEnglishNetflixAugust 11The kashmir files unreportedDocument SeriesHindiZee 5August 11Abar ProloySeriesBengaliZee 5August 11The Jengaburu CurseSeriesHindiSonyLIVAugust 9Por ThozhilSeriesTelugu/TamilSonyLIVAugust 11Made in HeavenSeriesEnglishAmazon primeAugust 10
ఆగస్టు 07 , 2023