• TFIDB EN
  • కస్టడీ
    UATelugu2h 28m
    శివ (నాగ చైతన్య) నిజాయితీ గల కానిస్టేబుల్. ఎంతగానో ప్రేమించిన రేవతి(కృతి శెట్టి)ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాల‌ని అనుకుంటాడు. అయితే పోలీస్ స్టేషన్లో రాజన్న(అరవింద్ స్వామి)ని అరెస్ట్ చేసి ఉంచుతారు. డ్యూటీలో ఉన్న శివకి రాజన్నని ఎవరో చంపేస్తున్నారు అనే సమాచారం అందుతుంది. మ‌రోవైపు రేవ‌తికి వేరే పెళ్లి నిశ్చయించార‌ని తెలుస్తుంది. ఎలాగైనా న్యాయం గెలవాలని చెప్పి రాజన్నని కోర్టులో అప్పగించేందుకు తీసుకెళ్తాడు. అసలు రాజన్న ఎవరు? అతన్ని చంపాలనుకున్నది ఎవరు? శివ తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అనేది అసలు కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నాగ చైతన్య
    ఎ. శివ
    అరవింద్ స్వామి
    రాజు
    కృతి శెట్టి
    రేవతి
    ప్రియమణి
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ధాక్షాయణి
    ఆర్. శరత్‌కుమార్
    ఐజీ నటరాజ్
    రామ్కి
    మేజర్ జనరల్ ఫిలిప్స్ సత్య రాజ్
    జయసుధ కపూర్
    న్యాయమూర్తి
    ప్రేమి విశ్వనాథ్
    వెన్నెల కిషోర్
    ప్రేమ్
    సంపత్ రాజ్
    సీబీఐ అధికారి జార్జ్
    జయప్రకాష్
    సీబీఐ ఇన్వెస్టిగేటివ్ హెడ్ వర్గీస్
    Y. G. మహేంద్రన్
    పార్టీ అధ్యక్షుడు
    రవి ప్రకాష్
    ఎస్‌ఐ రంగప్ప
    అన్నపూర్ణ
    జూలీ
    రజిత
    రేవతి తల్లి
    సిబ్బంది
    వెంకట్ ప్రభు
    దర్శకుడు
    శ్రీనివాస చిట్టూరినిర్మాత
    యువన్ శంకర్ రాజా
    సంగీతకారుడు
    ఇళయరాజా
    సంగీతకారుడు
    అబ్బూరి రవి
    డైలాగ్ రైటర్
    SR కతీర్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Custody Review: ప్రేక్షకులను నాగచైతన్య తన ‘కస్టడీ’లో బంధించాడా? అక్కినేని ఫ్యామిలీకి హిట్‌ వచ్చిందా?
    Custody Review: ప్రేక్షకులను నాగచైతన్య తన ‘కస్టడీ’లో బంధించాడా? అక్కినేని ఫ్యామిలీకి హిట్‌ వచ్చిందా?
    అక్కినేని నాగ చైతన్య-కృతి శెట్టి హీరో హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియమణి, అరవింద స్వామి కీలక పాత్రల్లో నటించారు. చైతూ కానిస్టేబుల్‌గా కనిపిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అక్కినేని ఫ్యామిలీకి సరైన హిట్‌ లేని సమయంలో కస్టడీతో చై ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి, భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం హిట్‌ తెచ్చిపెట్టిందా? కానిస్టేబుల్‌ పాత్రలో నాగచైతన్య ఆకట్టుకున్నాడా? కస్టడీ క‌థ ఏంటి, ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నటీనటులు: నాగ చైతన్య, కృతిశెట్టి, ప్రియమణి, అరవింద స్వామి, శరత్‌కుమార్, సంపత్‌ రాజ్‌, వెన్నెల కిషోర్ దర్శకుడు: వెంకట్‌ ప్రభు సంగీతం: ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా సినిమాటోగ్రఫీ: S.R కతిర్‌, సుమేర్‌ వర్మ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి కథ:  శివ (నాగ చైతన్య) నిజాయితీ గల కానిస్టేబుల్. ఎంతగానో ప్రేమించిన రేవతి(కృతి శెట్టి)ని వివాహం చేసుకొని సంతోషంగా ఉండాల‌ని అనుకుంటాడు. సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్లో రాజన్న(అరవింద్ స్వామి) ని అరెస్ట్ చేసి ఉంచుతారు. డ్యూటీలో ఉన్న శివకి రాజన్నని ఎవరో చంపేస్తున్నారు అనే సమాచారం అందుతుంది. మ‌రోవైపు రేవ‌తికి వేరే పెళ్లి నిశ్చ‌యించార‌ని తెలుస్తుంది. ఎలాగైనా న్యాయం గెలవాలని చెప్పి రాజన్నని కోర్టులో అప్పగించేందుకు అదే రాత్రి రేవతితో పాటు రాజన్నని కూడా తీసుకెళ్తాడు. అసలు రాజన్నను ఎందుకు అరెస్టు చేశారు? చంపాలనుకున్నది ఎవరు? శివ తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అనేది అసలు కథ.  ఎలా ఉందంటే సినిమా ఓ యాక్సిడెంట్‌తో మెుదలై కథలోకి వెళ్తోంది. దాదాపు 15 నిమిషాల పాత్రల పరిచయానికే సమయం పడుతుంది. ప్రియమణి, నాగ చైతన్య, కృతి శెట్టి ఇంట్రో, ఫ్యామిలీ సన్నివేశాలతో స్లోగా సాగుతుంది. క్రూరమైన విలన్‌గా అరవింద్ స్వామి ఇంట్రోతో అసలు కథ ప్రారంభమవుతుంది. ప్రీ ఇంటర్వెల్ ముందు కథనంలో వేగం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌ యాక్షన్ ఎపిసోడ్‌ అదిరిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్‌తో సెకాండాఫ్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు. సెకాండాఫ్‌ స్లోగా స్టార్ట్‌ అవ్వటంతో పాటు కొన్ని సాగదీత సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్‌ను కొట్టిస్తాయి. కొన్ని సీన్లు ఇప్పటికే చూసేశాం అన్నట్లుగా అనిపిస్తాయి. కృతి శెట్టితో లవ్ ట్రాక్‌ కూడా పెద్దగా ఆకట్టుకోదు.  యాక్షన్ ఎపిసోడ్‌లు, ట్విస్ట్‌లు మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయి. వెంకట్ ప్రభు తరహా స్క్రీన్‌ ప్లే కనిపిస్తుంది. బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ మాత్రం యువన్ ఇరగదీశాడు. ఎవరెలా చేశారంటే? కస్డడీ సినిమాలో నాగచైతన్య అదరగొట్టాడు. శివ పాత్రలో పరకాయప్రవేశం చేసి అలరించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివ పాత్రనే కనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్‌ చైతూ లుక్‌ సెట్‌ అవ్వలేదేమో అనిపించినా.. కథలో లీనమయ్యేకొద్ది శివపాత్రతో కనెక్ట్‌ అవ్వకుండా ఉండలేం. యాక్షన్‌ సీన్లలో చైతూ తనదైన మార్క్‌ చూపించాడు. హీరోయిన్‌ కృతి శెట్టి కూడా నాగ చైతన్య కి సమానంగా స్క్రీన్ షేర్‌ చేసుకుంది. కొన్ని సీన్లలో శృతి తన గ్లామర్‌తో ప్రేక్షకులను ముగ్దులను చేస్తుంది. అరవింద్ స్వామి నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటిలాగే ఆయన తన పాత్రని అద్భుతంగా పండించాడు. శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిషోర్‌ మిగిలిన తారాగణం కూడా వారి పాత్రల మేరకు బాగానే చేశారు. సాంకేతికంగా తమిళ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు తన మార్క్ కథనంతో తెరకెక్కిస్తారు. మానాడు చిత్రం ఇందుకు ఉదాహరణ.చై విషయంలో మంచి కథనే ఎంచుకున్నప్పటికీ కొన్ని చోట్ల తడబడ్డాడు.కథనం మరింత గ్రిప్పింగ్ రాసుంటే బాగుండేది. ఇళయ రాజా, యువన్ శంకర్ ఇద్దరు కలిసి పనిచేయడంతో మ్యూజిక్‌పై అంచనాలు పెరిగాయి. కానీ, పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పెద్ద అసెట్ అని చెప్పాలి. కొన్ని సీన్లను BGM బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. బలాలు నాగ చైత‌న్య న‌ట‌న‌బ్యాక్ గ్రౌండ్ స్కోర్యాక్ష‌న్ సీన్స్ బలహీనతలు పాటలురొటీన్‌ కథసాగదీత సీన్లు రేటింగ్‌: 2.5/5
    మే 12 , 2023
    UPCOMING MOVIES: మూవీ లవర్స్‌కి సమ్మర్ ట్రీట్.. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలుసా?
    UPCOMING MOVIES: మూవీ లవర్స్‌కి సమ్మర్ ట్రీట్.. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలుసా?
    కస్టడీ (మే 12) నాగచైతన్య - కృతి శెట్టి జంటగా చేసిన సినిమా  ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌ చేశారు భువన విజయం (మే 12) భువన విజయంలో సునీల్‌ లీడ్‌ రోల్‌లో చేశారు. యలమంద చరణ్‌ దర్శకత్వం వహించారు. కథ వెనుక కథ (మే 12) సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘కథ వెనుక కథ’ను తెరకెక్కించారు. సునీల్‌, విశ్వంత్‌ లీడ్ రోల్స్‌ చేశారు మ్యూజిక్ స్కూల్ (మే 12) ఈ సినిమాలో  శ్రియ శరణ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు ఛత్రపతి (మే 12) ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. V.V వినాయక్ డైరక్టర్ ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ (మే 12)  క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కింది. నిహాల్, దృషికా జంటగా నటించారు. ఫర్హానా (మే 12) ఐశ్వర్య రాజేశ్‌ కీ రోల్‌లో డైరెక్టర్‌ నెల్సన్‌ వెంకటేశన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఫర్హానా’. అన్నీ మంచి శకునములే (మే 18) సంతోష్‌ శోభన్, మాళవిక నాయర్‌ జంటగా డైరెక్టర్‌ నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం. సామజవరగమన (మే 18) శ్రీవిష్ణు హీరోగా రామ్‌ అబ్బరాజు డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందింది. రెబా మోనికా కథానాయిక బిచ్చగాడు 2 (మే 19) ఇందులో విజయ్ ఆంటోనీ, కావ్య తాపర్ జంటగా చేశారు. బిచ్చగాడు మూవీకి సీక్వెల్ ఇది. మళ్ళీ పెళ్లి (మే 26) న‌రేష్, పవిత్ర లోకేష్ జంట‌గా చేసిన చిత్రం మ‌ళ్ళీ పెళ్లి. MS రాజు దర్శకత్వం వహించారు. టక్కర్ (మే 26) సిదార్థ్‌, దివ్యాంశ కౌశిక్‌ జంటగా చేసిన చిత్రం ‘టక్కర్‌'.  కార్తీక్‌.జి.క్రిష్‌ దర్శకత్వం వహించారు. మేమ్ ఫేమస్ (మే 26) మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య కీలక పాత్రలు పోషించారు. సుమంత్ ప్రభాస్ డైరెక్షన్ చేశారు. అహింస (జూన్ 02) రాణా బ్రదర్‌ అభిరామ్‌ హీరోగా తేజ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. హీరోయిన్‌గా గీతిక చేసింది. విమానం (జూన్ 02) స‌ముద్రఖ‌ని నటించిన ద్విభాషా చిత్రం ‘విమానం’. అన‌సూయ కీలక పాత్ర పోషించింది. ఆదిపురుష్ (జూన్ 16) రాముడి పాత్రలో ప్రభాస్‌ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్‌  డైరెక్షన్‌ చేశాడు. స్పై (జూన్ 29) హీరో నిఖిల్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పై'. ఎడిటర్ ‘గ్యారీ. BH డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు.
    మే 11 , 2023
    Telugu OTT Releases: ఈ వారం (మే 8) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    Telugu OTT Releases: ఈ వారం (మే 8) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 8-14వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, అనువాద చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.  అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: కస్టడీ నాగ చైతన్య (Naga Chaitanya) - కృతిశెట్టి (Krithi Shetty) జంటగా చేసిన కస్టడీ (Custody) చిత్రం ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా మే 12 (శుక్రవారం)న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇందులో చైతూ శివ అనే నిజాయతీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌గా కనిపించనున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు ప్రేమకథకు ప్రాధాన్యమున్నట్లు ప్రచార చిత్రాన్ని తీర్చి దిద్దిన తీరును బట్టి అర్థమవుతోంది. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించగా.. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన కస్టడీ పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఛత్రపతి (హిందీ) ఛత్రపతి (Chatrapathi) సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Sreenivas) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మే 12 (శుక్రవారం)న రిలీజ్‌ కానుంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాకు ఇది రీమేక్‌.  భాగ్యశ్రీ, శరద్‌ కేల్కర్‌, శివం పాటిల్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జయంతిలాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు.   భువన విజయమ్‌  సునీల్ ప్రధాన పాత్రలో చేసిన భువన విజయమ్(Bhuvana Vijayam) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. మే 12 (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భువన విజయమ్‌తో  యలమంద చరణ్‌ దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఈ సినిమా 30 ఇయర్స్‌ పృథ్వీ, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్‌, ధనరాజ్‌ తదితర హాస్యనటులు నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.  ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌ ‘ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌’ (The Story Beautiful Girl) సినిమా కూడా ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఇందులో నిహాల్‌ కోదాటి, దృషికా చందర్‌ హీరో హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి రవి ప్రకాష్ బోడపాటి దర్శకత్వం వహించగా ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్‌ తో పాటు, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది. కళ్యాణమస్తు శేఖర్‌ అయాన్‌ వర్మ, వైభవి రావ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణమస్తు’ (Kalyana Masthu). ఈ చిత్రానికి సాయి దర్శకత్వం వహించారు. బోయపాటి రఘుబాబు నిర్మాత. మే 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమతో మొదలైన ఓ జంట ప్రయాణం... పెళ్లి వరకూ ఎలా సాగిందనేది అసలు కథ అని చిత్ర యూనిట్‌ తెలిపింది. మ్యూజిక్‌ స్కూల్‌  శ్రియ శరణ్‌, శర్మాన్‌ జోషి, షాన్‌ కీలక పాత్రల్లో నటించిన మ్యూజిక్‌ స్కూల్‌ (Music School) చిత్రం మే 12న రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రానికి బియ్యాల పాపారావు దర్శకత్వం వహించారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌ న్యూసెన్స్‌ నవదీప్‌ (Navdeep), బిందు మాధవి (Bindu Madhavi) కీలక పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్‌సిరీస్‌ ‘న్యూసెన్స్‌’. శ్రీ ప్రవీణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో మే 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మీడియా, రాజకీయం ఇతివృత్తంగా చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. దహాద్‌ బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలో చేసిన ‘దహాద్‌’ (Dahaad) వెబ్‌సిరీస్‌ కూడా ఈ శుక్రవారమే స్ట్రీమింగ్‌ కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ సిరీస్‌ వీక్షించవచ్చు. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించనుంది. పబ్లిక్‌ బాత్‌రూమ్‌లలో అనుమానాస్పదంగా చనిపోయిన కొందరు మహిళల హత్య కేసును ఛేదించడానికి అంజలి భాటి చేసిన ప్రయత్నాలు, కథలో ఊహించని మలుపులను ఇందులో ఆసక్తికరంగా చూపించనున్నారు. ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…  TitleCategoryLanguagePlatformRelease DateThe Muppets Mayhemseries EnglishDisney+ HotstarMay 10Soppana SundariMovieTamilDisney+ HotstarMay 12AirMovieenglishAmazon PrimeMay 12Justice LeagueSeriesEnglishNetflixMay 08Spirit Rangers, season 2SeriesEnglishNetflixMay 08Documentary Now!, season 4SeriesEnglishNetflixMay 09Black Knight SeriesEnglishNetflixMay 12Faithfully Yours MovieEnglishNetflixMay 17Yakitori: Soldiers of MisfortuneSeriesEnglishNetflixMay 18SeriesHindiZee5May 12Triangle of SadnessMovieEnglishSonyLIVMay 12Vikram vedaMovieHindiJio CinemaMay 12
    మే 08 , 2023
    Pooja Hegde: పూజా హెగ్డేతో నాగచైతన్య రొమాన్స్‌.. మరి హైట్ సెట్‌ అవుతుందా?
    Pooja Hegde: పూజా హెగ్డేతో నాగచైతన్య రొమాన్స్‌.. మరి హైట్ సెట్‌ అవుతుందా?
    టాలీవుడ్‌లో కొన్ని కాంబోలకు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. అలాంటి వాటిలో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), అందాల భామ పూజా హెగ్డే (Pooja Hegde) జోడీ కూడా ఒకటి. వీరి కాంబోలో వచ్చిన ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. వీరి కెమెస్ట్రీ అద్భుతంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత నుంచి వీరు కలిసి నటించలేదు. వీరి కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ త్వరలోనే ఈ జంట కలిసి నటించబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీంతో ఈ జంటను మరోమారు తెరపై చూసేందుకు అక్కినేని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. విరూపాక్ష డైరెక్టర్‌తో.. సాయిధరమ్‌ తేజ్ నటించిన విరూపాక్ష (Virupaksha) చిత్రం టాలీవుడ్‌లో ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ కార్తిక్‌ వర్మ దండుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు ఈ డైరెక్టర్‌తోనే నాగ చైతన్య ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది రాబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను పరిశీలిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ కార్తిక్‌ వర్మ త్వరలోనే ఆమెను కలిసి కథ వినిపిస్తారని అంటున్నారు. చైతూతో నటించేందుకు ఆమె ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చిత్ర బృందం అంచనా వేస్తోంది. మూవీ అనౌన్స్‌మెంట్‌తో పాటే హీరో, హీరోయిన్ల పేరు ప్రకటించాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే నాగచైతన్య కంటే పూజా కాస్త ఎత్తు ఎక్కువ ఉండటంతో రొమాన్స్ పరంగా కాస్త ఇబ్బంది కలగొచ్చేమోనని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు.  పూజా హెగ్డే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ గత మూడేళ్లుగా పూజా హెగ్డే (Pooja Hegde)కు అసలు కలిసి రావడం లేదు. ప్రభాస్‌తో చేసిన రాధేశ్యామ్​ (Radhe Shyam)తో మొదలైన ఆమె ఫ్లాపుల పరంపర ‘బీస్ట్’ (Beast)​, ‘ఆచార్య’ (Acharya), ‘సర్కస్’ (Circus)​, ‘కిసి కా భాయ్​ కిసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan)​ వరకూ కొనసాగింది. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు హ్యాపీగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపింది. అటు మేకర్స్‌ సైతం ఆమెను కాస్త పక్కన పెట్టారు. అయితే ఈ మధ్యే మళ్లీ పూజాకు ఆఫర్లు మొదలయ్యాయి. ‘దేవా’, ‘సూర్య 44’, ‘దళపతి 69’ సినిమాల్లో ఆమెకు అవకాశాలు దక్కాయి. ఇక చైతూతో ప్రాజెక్ట్​ ఓకే అయితే ఆచార్య తర్వాత ఆమె చేయబోయే మెుదటి తెలుగు సినిమా ఇదే కానుంది.  ‘తండేల్‌’తో వస్తోన్న చైతూ ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య 'తండేల్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతడికి జోడీగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తోంది. లవ్‌ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్‌’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య ఆశలన్నీ ఈ మూవీపైనే ఉంది. ‘బంగార్రాజు’, ‘థ్యాంక్‌ యూ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, గతేడాది వచ్చిన ‘కస్టడీ’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందాయి. దీంతో ‘తండేల్‌’ ద్వారా ఎలాగైన గెలుపు బాట పట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 7న రిలీజ్‌ కానుంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది.  డిసెంబర్‌లో చై - శోభిత పెళ్లి! టాలీవుడ్‌ స్టార్‌ నటుడు అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల అనంతరం నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)తో ఏడడుగులు వేయబోతున్నాడు. డిసెంబర్‌ 4న వీరు గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. డిసెంబర్‌ 2న సంగీత్‌, 3న మెహందీ, 4న పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 10న గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేసినట్లు టాక్‌. వీరి వివాహం హైదరాబాద్‌ (Hyderabad)లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ (Annapurna Studios)లోనే జరగబోతోనున్నట్లు సమాచారం. ఈ మేరకు పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సెట్టింగ్‌, డెకరేషన్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. పెళ్లికి అతి తక్కువ మందిని మాత్రమే పిలబోతున్నట్లు తెలిసింది. రిసెప్షన్‌కు మాత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానించనున్నారు. 
    నవంబర్ 16 , 2024
    <strong>Thandel Movie: శివ పార్వతుల్లా నాగ చైతన్య - సాయిపల్లవి.. ‘తండేల్‌’ నుంచి అదిరిపోయే పోస్టర్స్‌!&nbsp;</strong>
    Thandel Movie: శివ పార్వతుల్లా నాగ చైతన్య - సాయిపల్లవి.. ‘తండేల్‌’ నుంచి అదిరిపోయే పోస్టర్స్‌!&nbsp;
    అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘తండేల్‌’ చిత్రంపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘లవ్‌ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్‌’పై&nbsp; అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్‌ కోసం సినీ లవర్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఇది చేసిన సినీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.&nbsp; శివరాత్రి స్పెషల్ సాంగ్‌ నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో రూపొందుతున్న ‘తండేల్‌’ చిత్రానికి చందు మెుండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. శివరాత్రి థీమ్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ చిత్రీకరిస్తోంది. ఇందుకోసం భారీ సెట్‌ను సైతం వేశారు. పాట విజువల్‌ ట్రీట్‌లా ఉండేందుకు మేకర్స్‌ రూ.4 కోట్లు ఖర్చు చేశారని టాక్‌. అంతేకాదు వందలాది మంది డ్యాన్సర్లు ఈ పాటలో భాగం కాబోతున్నారట. సాయిపల్లవి, నాగచైతన్య శివపార్వతులను తలపించే నృత్యరీతులతో అలరించబోతున్నారని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. శివరాత్రి థీమ్‌తో ఓ పాటను ఈ స్థాయిలో కంపోజ్ చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారని టాక్‌. షూటింగ్‌ స్పాట్‌ ఫొటోలను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇందులో చైతు-సాయిపల్లవి శివ పార్వతులను తలపిస్తున్నారు.&nbsp; https://twitter.com/ThandelTheMovie/status/1840612058691183016 తండేల్‌ స్టోరీ ఇదే నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. గుజరాత్‌ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ అంటే గుజరాతి భాషలో బోటు నడిపే ఆపరేటర్‌ అని అర్థం. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని డైరెక్టర్‌ చందూ మెుండేటి ఓ ఇంటర్యూలో వెల్లడించారు.&nbsp; చైతూ ఆశలన్నీ తండేల్‌ పైనే! ప్రస్తుతం నాగ చైతన్య తన&nbsp; ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత అతడికి సరైన హిట్‌ లభించలేదు. ‘బంగార్రాజు’, ‘థ్యాంక్‌ యూ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, గతేడాది వచ్చిన ‘కస్టడీ’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందాయి. దీంతో ‘తండేల్‌’ ద్వారా ఎలాగైన గెలుపు బాట పట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. మత్స్యకారుడి పాత్ర కోసం ఆయన ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది.&nbsp; సాయిపల్లవి ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. తమిళ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌తో కలిసి 'అమరన్‌' అనే చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్‌ 31 థియేటర్లలోకి రానుంది. అలాగే బాలీవుడ్‌లో ‘రామాయణం’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. ఇందులో సీతగా ఆమె కనిపించనుంది. ఈ పాత్ర కోసం రూ.15 కోట్లకు పైనే రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే హీరో నాని, శేఖర్‌ కమ్ములా కాంబోలో రానున్న చిత్రంలోనూ సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి.&nbsp;
    సెప్టెంబర్ 30 , 2024
    <strong>Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?</strong>
    Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?
    టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్‌ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్‌ హీరోలు ఫ్లాప్స్‌ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో టాలీవుడ్‌లో వచ్చిన గణనీయమైన మార్పులు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. ఒక మూవీకి ఏళ్లకు ఏళ్ల సమయం! టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటులు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు. వీరి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంటటేష్‌, బాలకృష్ణ సైతం ఈ పరంపరను కొనసాగిస్తూ ఏడాదిలో ఒక సినిమాకు తగ్గకుండా రిలీజ్‌ చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌ వంటి స్టార్‌ హీరోల నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు దాటిపోయింది. ఓ వైపు ప్రభాస్‌ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా ప్లాన్‌ చేసుకుంటే ఈ ముగ్గురు స్టార్స్‌ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. సైంటిఫిక్‌, మైథాలజీ, ఫ్యూచరిక్‌ సినిమాలంటే కొంత ఆలస్యం జరిగిన ఓ అర్థం ఉంది. ప్రస్తుతం తారక్‌ (దేవర), రామ్‌చరణ్‌ (గేమ్‌ ఛేంజర్‌), అల్లు అర్జున్‌ (పుష్ప 2) చేస్తున్న కమర్షియల్‌ చిత్రాలకు కూడా ఇంత ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది.&nbsp; ఫ్లాప్స్‌తో పోటీపడుతున్న కుర్ర హీరోలు! యంగ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నాగచైతన్య (Naga Chaitanya), రామ్‌ పోతినేని (Ram Pothineni)లకు గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో అసలు కలిసి రావడం లేదు. వారి నుంచి సాలిడ్‌ హిట్‌ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు హిట్‌ సినిమాలతో పోటీ పడిన ఈ ముగ్గురు హీరోలు అనూహ్యంగా గత ఐదేళ్ల నుంచి ఫ్లాప్స్‌తో పోటీ పడుతున్నారు. విజయ్‌ నటించిన రీసెంట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’తో పాటు గతంలో వచ్చిన ‘లైగర్‌’, ‘ఖుషి’, ‘డియర్ కామ్రేడ్‌’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అలాగే నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, ‘థ్యాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని చేసిన లేటెస్ట్‌ చిత్రం 'డబుల్‌ ఇస్మార్ట్‌' కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అంతకుముందు వచ్చిన ‘స్కంద’, ‘వారియర్‌’, ‘రెడ్‌’ సినిమాలు హిట్స్‌ అందుకోలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. మార్కెట్‌ కోల్పోయే దిశగా సీనియర్లు ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి గత ఐదేళ్ల వ్యవధిలో దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవికి ఇప్పటివరకూ సరైన కమ్‌బ్యాక్‌ లభించలేదని చెప్పాలి. ఓవైపు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ తమ వయసుకు తగ్గ స్టోరీలు ఎంచుకొని ‘జైలర్‌’, ‘విక్రమ్‌’ సినిమాలతో సాలిడ్‌ విజయాలను అందుకున్నారు. అయితే చిరు ఇప్పటికే కమర్షియల్ పాత్రలనే ఎంచుకుంటూ పోవడం ఆయనకు మైనస్‌గా మారుతోంది. అటు నాగార్జున, వెంకటేష్‌ పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. నాగార్జున గత చిత్రాలు ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’లోని పాత్రలు ఏమాత్రం నాగార్జునకు సెట్ అయ్యేవిగా కనిపించవు. ఇక వెంటేష్‌ ‘రానా నాయుడు’ సిరీస్‌తో విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పటిలాగే మాస్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. అయితే కొత్త కథలు ఎంచుకోకపోవడం, వయసు తగ్గ పాత్రలు చేయకపోవడం, సరైన హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి స్టార్‌ హీరోలుగా వెలిగిన ఈ హీరోల కలెక్షన్స్‌ కుర్రహీరోలతో పోలిస్తే పడిపోతూ వస్తున్నాయి. మార్కెట్‌ను పూర్తిగా కోల్పేయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; ప్రభాస్‌, నాని సూపర్బ్‌! గత ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీరోలుగా ప్రభాస్‌, నానిలను చెప్పవచ్చు. ఓవైపు వేగంగా సినిమాలు చేస్తూనే ప్రతీ మూవీకి కథ, పాత్ర పరంగా వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నారు. క్వాలిటీ పరంగానూ మంచి సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు తమ క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్‌ గత చిత్రాలను పరిశీలిస్తే ‘బాహుబలి 1 &amp; 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కథ, పాత్ర పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. అటు నాని రీసెంట్ చిత్రాలైన ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ కూడా విభిన్నమైనవే. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిందే. అటు ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ‘రాజాసాబ్‌’, సలార్‌ 2, ‘కల్కి 2’, ‘స్పిరిట్‌’, ‘ఫౌజీ’ కథ, పాత్ర పరంగా ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించనున్నాయి.&nbsp; రీరిలీజ్‌లతో ఫ్యాన్స్‌ సంతృప్తి! గతంలో లేని విధంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్‌ హీరోల బర్త్‌డేల సందర్భంగా గతంలో వారు చేసిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలకు లాంగ్‌ గ్యాప్‌ వస్తుండటంతో రీరిలీజ్‌ మూవీస్‌లోనే తమ హీరోను చూసుకొని ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ సంతోష పడుతున్నారు. అయితే రీరిలీజ్‌ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలను హీరోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీరిలీజ్‌ రూపంలో తమ ఫేవరేట్‌ చిత్రాలను మళ్లీ చూసుకొని అభిమానులు సంతోష పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.&nbsp; ఆ స్టార్‌ డైరెక్టర్లకు ఏమైంది? టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్‌కు హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. గతంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్‌ మ్యాన్‌’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్స్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అటువంటి పూరి గత కొంత కాలంగా హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత చిత్రం ‘లైగర్‌’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తాజాగా వచ్చిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అటు హరీష్‌ శంకర్‌ పరిస్థితి కూడా ఇంచుమించు పూరి లాగానే ఉంది. ‘మిరపకాయ్‌’, ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి సూపర్‌ హిట్స్‌తో మాస్‌ డైరెక్టర్‌గా హరీష్‌ శంకర్‌ ఇటీవల సరైన హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దల కొండ గణేష్‌’ ప్లాప్స్‌తో లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’పై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మిస్టర్‌ బచ్చన్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హరీష్‌ శంకర్‌ టేకింగ్‌ సాదా సీదాగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి.&nbsp;
    ఆగస్టు 17 , 2024
    Tollywood Biggest Disasters 2023: ఈ ఏడాది డిజాస్టర్లుగా నిలిచిన స్టార్‌ హీరోల చిత్రాలు ఇవే!
    Tollywood Biggest Disasters 2023: ఈ ఏడాది డిజాస్టర్లుగా నిలిచిన స్టార్‌ హీరోల చిత్రాలు ఇవే!
    2023వ సంవత్సం కొందరి హీరోలకు ఊహించని విజయాలను అందిస్తే మరికొందరికి మాత్రం పీడకలను మిగిల్చింది. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని చిత్రాలు భాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుని ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇంతకి ఆ చిత్రాలు ఏవి? అందులో నటించిన స్టార్‌ హీరోలు ఎవరు? ఇతర విశేషాలను ఇప్పుడు చూద్దాం.&nbsp; శాకుంతలం గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘శాకుంతలం’. సమంత లీడ్‌ రోల్‌ చేసిన చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద చతికలపడింది. తీవ్ర నష్టాలను చవిచూసింది. సినిమాపై సామ్‌ పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసింది. ఏజెంట్‌ యంగ్‌ హీరో అక్కినేని అఖిల్‌కు ఇండస్ట్రీలో ఇప్పటివరకూ సరైన హిట్‌ లేదు. దీంతో అతడు ‘ఏజెంట్’ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుంది. అఖిల్‌ కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; ఆదిపురుష్‌ ప్రభాస్‌ రాముడిగా తెరకెక్కిన 'ఆదిపురుష్‌' చిత్రం ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఓం రౌత్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. విడుదల తర్వాత అనేక విమర్శలను మూటగట్టుకుంది.&nbsp; కస్టడీ ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీకి కలిసిరాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే నాగ చైతన్య హీరోగా చేసిన ‘కస్టడీ’ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తొలిసారి కానిస్టేబుల్‌ పాత్రలో చేసిన చైతూ.. సినిమాను విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో నిర్మాతలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.&nbsp; రావాణాసుర రవితేజ తొలిసారి విలన్‌ షేడెడ్‌ పాత్రలో నటించిన చిత్రం 'రావణాసుర'. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. అయితే థియేటర్లలో ఈ చిత్రం ఊహించని విధంగా ఫ్లాప్‌ టాక్ సొంతం చేసుకుంది. రవితేజ నటనకు మంచి మార్కులే పడినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపించలేకపోయింది.&nbsp; గాండీవదారి అర్జున వరణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కిన 'గాండీవదారి అర్జున' చిత్రం కూడా ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూసింది.&nbsp; రామబాణం ఈ మధ్య సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న స్టార్‌ హీరో గోపిచంద్‌.. ఈ ఏడాది ‘రామబాణం’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం గోపిచంద్ ఆశలను అడియాశలు చేసింది. ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడింది. డిజాస్టర్‌గా నిలిచి హీరో గోపిచంద్‌కు అసంతృప్తిని మిగిల్చింది.&nbsp; భోళాశంకర్‌ మెగాస్టార్‌ హీరోగా మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోళాశంకర్‌’. భారీ అంచనాలు, ప్రమోషన్స్‌తో ఊదరగొట్టిన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.&nbsp; ఆదికేశవ మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్, శ్రీలీల జంటగా చేసిన ‘ఆదికేశవ’ చిత్రం కూడా ఇటీవల విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది.&nbsp;
    డిసెంబర్ 20 , 2023
    Tollywood Roundup 2023: గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
    Tollywood Roundup 2023: గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
    టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. వారిలో ఎంత మంది సక్సెస్‌ అవుతారో చెప్పలేం. అందం, అభినయం, నటన వంటివి మాత్రమే వారిని హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామంది కథానాయికలు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారు. వీరిలో ఎవరు టాప్‌ అంటే చెప్పటం కష్టమే. అయితే 2023 ఏడాదిలో గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌లో ఉన్న తెలుగు హీరోయిన్స్‌ జాబితా బయటకొచ్చింది. అందులోని హీరోయిన్స్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; రష్మిక మందన్న గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన తెలుగు హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల ఈ భామ నటించిన యానిమల్‌ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో రష్మిక పేరు మారుమోగింది. అంతకుముందు ఆమె డీప్‌ ఫేక్‌ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం ‌అయ్యాయి. దీంతో రష్మిక గురించి ఎక్కువ మంది నెట్టింట శోధించారు. మృణాల్‌ ఠాకూర్‌ ‘సీతారామం’ మూవీతో మృణాల్‌ ఠాకూర్‌ స్టార్‌ హీరోయిన్ల సరసన చేరిపోయింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌తో సెల్ఫీ సినిమాలో నటించింది. అలాగే గుమ్రా, లస్ట్‌ స్టోరీస్‌-2, పిప్పా వంటి చిత్రాల్లో కనిపించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. దీంతో పాటు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా మోస్ట్‌ సెర్చ్‌డ్‌ హీరోయిన్ల జాబితాలో ఆమె రెండోస్థానంలో నిలిచింది.&nbsp; శ్రీలీల ఈ ఏడాది టాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్‌గా శ్రీలీల నిలిచింది. ఈ సంవత్సరం ఆమె నటించిన నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్కంద, భగవంత్‌ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ చిత్రాల ద్వారా ఈ భామ ప్రేక్షకులను పలకరించింది. మరో నాలుగు భారీ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో ఆమె పేరు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేయబడింది.&nbsp; తమన్న భాటియా మిల్కీ బ్యూటీ తమన్న గురించి కూడా ఎక్కువ మంది శోధించారు. బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో ఆమె ప్రేమాయణం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. లస్ట్‌ స్టోరీస్‌-2 వెబ్‌ సిరీస్‌లో వీరిద్దరు స్క్రీన్ షేర్‌ చేసుకోవడంతో పాటు ఒకరిపైఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. వాటికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి. సమంత ఈ ఏడాది సమంత గురించి కూడా చాలా మందే శోధించారు. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడంతో సమంత పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అలాగే సామ్ రీసెంట్‌ మూవీ ‘ఖుషి’ హిట్‌ కావడంతో ఆమె పాపులారిటి మరింత పెరిగింది. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫొటోలను పెడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తుండటంతో ఎక్కువ మంది సమంత పేరును సెర్చ్‌ చేశారు.&nbsp; అనుష్క శెట్టి అనుష్క శెట్టి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాదే వెండితెరపై తళ్లుక్కుమంది. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి' సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. సినిమా షూట్ మెుదలైనప్పటి నుంచి రిలీజ్‌ అయ్యేవరకూ ఏదోక రూపంలో ఆమె వార్తల్లో నిలుస్తూనే వచ్చారు.&nbsp; కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన కాజల్‌.. ఈ ఏడాది స్ట్రాంగ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. బాలయ్య సరసన ఆమె చేసిన ‘భగవంత్‌ కేసరి’ మంచి విజయాన్ని సాధించింది. అలాగే కాజల్‌ చేసిన ఘోస్ట్‌, కరుంగపియం వంటి చిత్రాలు కూడా ఈ ఏడాదే వచ్చాయి.&nbsp; కీర్తి సురేష్‌ ఈ ఏడాది దసరా సినిమా ద్వారా కీర్తి సురేష్‌ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకుంది. వెన్నెల పాత్రలో అద్భుత నటన కనబరిచి అందర్ని ఆశ్చర్యపరిచింది. పాన్‌ ఇండియా స్థాయిలో దసరా రిలీజ్‌ కావడంతో కీర్తి సురేష్‌ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దీంతో కీర్తి గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది నెటిజన్లు శోధించారు.&nbsp; రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. ఈ ఏడాది తెలుగులో ఒక్క సినిమా కూడా ఆమె చేయలేదు. కానీ ఈ భామ పోస్టు చేసే గ్లామర్‌ ఫోటోలు కారణంగా రకుల్‌ తరుచూ ట్రెండింగ్‌లో నిలుస్తూ వచ్చారు.&nbsp; కృతి శెట్టి ఉప్పెన సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా మారిన కృతి శెట్టి వరుసగా సినిమా అవకాశాలను దక్కించుంది. ఈ భామ గురించి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్‌ చేశారట. ఈ ఏడాది నాగ చైతన్య సరసన ఆమె చేసిన ‘కస్టడీ’ మూవీ ఫ్లాప్ టాక్‌ తెచ్చుకుంది.&nbsp;
    డిసెంబర్ 14 , 2023
    POLICE MOVIES: పోలీస్ యూనిఫామ్‌పై హీరోల మోజు.. పెరుగుతున్న సినిమాల హవా
    POLICE MOVIES: పోలీస్ యూనిఫామ్‌పై హీరోల మోజు.. పెరుగుతున్న సినిమాల హవా
    టాలీవుడ్‌లో పోలీసు సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్‌ ఇష్టపడుతుంటారు. అందుకే కథానాయకులు సైతం పోలీస పాత్రలు చేసేందుకు మక్కువ చూపిస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పోలీసు ట్రెండ్‌ నడుస్తోంది. దీంతో కథానాయకులు మళ్లీ పోలీసు కథలపై తమ దృష్టి కేంద్రీకరించారు. ఖాకీ దుస్తుల్లో కనిపించి తమ అభిమానులను అలరిస్తున్నాారు. అటు డైరెక్టర్లు సైతం పోలీసు స్టోరీలను సిద్దం చేయడంలో బిజీబిజీగా ఉన్నారు. మరి ఆ హీరోలు ఎవరు? ఏ సినిమాలో ఇప్పుడు చూద్దాం. 1. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) సమంతతో కలిసి ఖుషీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఖుషీ తర్వాత గీతా గోవిందం డైరెక్టర్‌ పరుశురామ్, జెర్సీ డైరెక్టర్‌ గౌతం తిన్ననూరితోనూ విజయ్‌ సినిమాలు చేయనున్నాడు. గౌతం డైరెక్షన్‌లో విజయ్‌ VD12 సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ కనిపిస్తాడని టాక్‌. ఇప్పటికీ సినిమా కథను గౌతం తిన్ననూరి&nbsp; చెప్పగా అది రౌడీబాయ్‌కు విపరీతంగా నచ్చేసిందని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. తమ హీరోను ఖాకీ దుస్తుల్లో చూసేందుకు ఇప్పటినుంచే ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; 2. నాని హిట్ -3 సినిమాతో నాని (NANI) కూడా మొద‌టిసారి పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో అర్జున్ స‌ర్కార్ అనే పోలీస్‌గా నాని క‌నిపించ‌బోతున్నాడు. హిట్ -2 క్లైమాక్స్‌లో పోలీస్‌గా నాని లుక్ ఎలా ఉండ‌బోతుందో రివీల్ చేసి సినిమాపై ఇంట్రెస్ట్‌ను పెంచేశారు. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది. 3. నాగ చైతన్య నాగ చైతన్య (Naga Chaitanya) – కృతిశెట్టి (Krithi Shetty) జంటగా చేసిన కస్టడీ చిత్రం ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ ఇందులో చైతూ శివ అనే నిజాయతీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌గా కనిపించనున్నారు. చై తొలిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తుండటంతో ఇప్పటినుంచే ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి.&nbsp; 4. అల్లరి నరేష్‌ అల్లరి నరేష్‌ (Allari Naresh) లేటెస్ట్‌ మూవీ ‘ఉగ్రం’.. ఇటీవలే విడుదలై మంచి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇందులో నరేష్‌ సీఐగా కనిపించి మెప్పించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా నరేష్‌ కనిపించాడు. యాక్షన్‌ సీన్లలోనూ ఇరగదీయగలనని నిరూపించుకున్నాడు. ఉగ్రంలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం నరేష్ అందుకున్నాడు.&nbsp; 5. కిరణ్‌ అబ్బవరం యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తాడు. ఎప్పుడూ ప్రేమికుడిగా, పక్కింటి కుర్రాడి పాత్రల్లో కనిపించే కిరణ్‌ అబ్బవరం మీటర్‌ సినిమాలో పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఎస్సైగా మెప్పించాడు. ఇందులో కిరణ్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మీటర్ స్ట్రీమింగ్ అవుతోంది.&nbsp; 6. రామ్‌ పోతినేని యంగ్‌ హీరో రామ్‌ పోతినేని (Ram pothineni) - కృతి శెట్టి (Krithi Shetty)&nbsp; జంటగా చేసిన చేసిన సినిమా వారియర్‌. ఈ సినిమాలో రామ్‌ తొలిసారి పోలీసు గెటప్‌లో కనిపించాడు. మామూలుగానే యాక్షన్‌ సీన్లలో అదరగొట్టే రామ్‌.. ఒంటిపైన ఖాకీ దుస్తులతో ఈ సినిమాలో మరింత ఇరగతీశాడు. అయితే ఆశించిన రేంజ్‌లో వారియర్‌ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా.. పోలీసు పాత్రలోనూ మెప్పించగలనని రామ్‌ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం రామ్‌.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.&nbsp; 7. సుధీర్‌ బాబు విల‌క్ష‌ణ‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధీర్ బాబు (Sudheer Babu). ఆయన చేసిన రీసెంట్‌ మూవీ ‘హంట్‌’ మిశ్రమ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో సుధీర్‌బాబు కూడా పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. గతంలో ‘V’ సినిమాలోనూ సుధీర్ బాబు పోలీసాఫీసర్‌గా చేశాడు. యాక్షన్‌ సీన్స్‌లో తనదైన మార్క్‌ను చూపిస్తూ అదరగొట్టాడు. ఇందులో సుధీర్‌బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి.
    మే 08 , 2023
    VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!
    VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!
    అక్కినేని నట వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మధ్య రిలేషన్‌ ఉందంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. శోభిత హైదరాబాద్‌ వచ్చినపుడు పూర్తిగా చైతూతోనే ఉందని అతడి కొత్త ఇంటికి కూడా వెళ్లిందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు వీరు కలిసి దిగిన ఫోటో ఒకటి గతంలో వైరల్‌ అయింది. తాజాగా మరో ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినట్లుగా తెలుస్తున్న ఈ ఫోటోతో ఇప్పుడు వీరు డేటింగ్‌లో ఉన్న వార్తలు నిజమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వీరు డిన్నర్‌ డేట్‌కే వెళ్లారంటూ చర్చించుకుంటున్నారు. సమంత అభిమానులు నాగచైతన్యను ట్రోల్‌ చేయడం కూడా మొదలు పెట్టారు. సామ్‌-చై విడిపోయినప్పుడు అందరూ సమంతనే నిందించారని ఇప్పుడు గురుడి అసలు రూపం భయటపడుతోందంటూ విమర్శిస్తున్నారు. గతంలో దిగిన ఓ ఫొటో లండన్‌లో దిగినట్లు సమాచారం.&nbsp; ఈ ఇద్దరి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా వీళ్లు ఇలా కలిసి ఫొటోలకు పోజులిచ్చారని సినిమా ఇండస్ట్రీలోని కొందరు చెప్పారు. కానీ చైతూ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికే యూకే వెళ్లినట్లు అప్పట్లో చర్చ జరిగింది.&nbsp;&nbsp; అయితే చైతూ అభిమానులు అప్పట్లో ఈ వార్తలను బలంగా తిప్పికొట్టారు. సమంత కావాలనే ఈ పుకార్లు సృష్టిస్తోందంటూ ఎదురుదాడి చేశారు. సోషల్‌ మీడియా వేదికగా చైతూ-సమంత ఫ్యాన్స్‌ మధ్య పెద్ద వార్‌ జరిగిందని చెప్పొచ్చు. శోభిత ధూళిపాళ్ల కూడా మిడిల్‌ ఫింగర్‌ చూపించి ఈ వార్తల పట్ల ఘాటుగా స్పందించారు.&nbsp; https://twitter.com/PrasadAGVR/status/1540383278166814720?s=20 ప్రస్తుతం నాగచైతన్య ‘కస్టడీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌&nbsp; కూడా ఆసక్తికరంగా ఉంది.&nbsp; మరోవైపు సమంత ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..ఈ మైథాలాజికల్‌ డ్రామా 14 ఏప్రిల్‌న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
    మార్చి 29 , 2023
    <strong>HBD Sri Gouri Priya: మంచి నటే కాదు.. గొప్ప గాయని కూడా.. శ్రీ గౌరి ప్రియ టాప్‌ సీక్రెట్స్‌ ఇవే?</strong>
    HBD Sri Gouri Priya: మంచి నటే కాదు.. గొప్ప గాయని కూడా.. శ్రీ గౌరి ప్రియ టాప్‌ సీక్రెట్స్‌ ఇవే?
    టాలీవుడ్‌కు టాలెంటెడ్‌ యంగ్‌ నటీమణుల్లో శ్రీ గౌరి ప్రియ ఒకరు. కెరీర్‌ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ అమ్మడు ఈ ఏడాది ‘మ్యాడ్‌’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయంతో మంచి మార్కులు సంపాదించింది. ఫ్యూచర్‌లో స్టార్‌ హీరోయిన్‌ కాగల సత్తా తనలో ఉందని చాటి చెప్పింది. ఇదిలా ఉంటే ఇవాళ శ్రీ గౌరి ప్రియ పుట్టిన రోజు. 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకోసం. శ్రీ గౌరి ప్రియ మన హైదరాబాదీ అమ్మాయే. 1998 నవంబరు 13న ఆమె జన్మించింది. ఆమె తల్లిదండ్రుల పేర్లు శ్రీనివాస్‌ రెడ్డి, వసుంధర. శ్రీ గౌరి ప్రియ విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. బేగంపేట్‌లోని సెంట్‌ ఫ్రాన్సిస్‌ ఉమెన్స్‌ కాలేజీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ పూర్తి చేసింది.&nbsp; స్కూల్‌ డేస్‌ నుంచే కల్చరల్‌ యాక్టివిటీస్‌లో శ్రీగౌరి చురుగ్గా ఉండేది. స్కూల్‌, కాలేజ్‌లో జరిగే వినోద కార్యక్రమాల్లో పాల్గొని మంచి ప్రశంసలు అందుకుంది. శ్రీగౌరిలో మంచి నటితో పాటు బెస్ట్‌ సింగర్‌ కూడా దాగుంది. బాల్యంలోనే పలు టెలివిజన్‌ షోలలో ఈ అమ్మడు పాటల ప్రదర్శన చేసింది. విన్నర్‌గా నిలిచి సత్తా చాటింది. ప్రముఖ టెలివిజన్‌ షో ‘బోల్‌ బేబీ బోల్‌’ (Bol Baby Bol)లో చిన్నప్పడు శ్రీగౌరి పాల్గొంది. సెకండ్‌ సీజన్‌లో రన్నరప్‌గా, మూడో సీజన్‌లో విన్నర్‌గా నిలిచి ప్రశంసలు అందుకుంది.&nbsp; సినిమాల్లోకి రాకముందు జెమినీ టీవీలో యాంకర్‌గానూ చేసింది. తన వాక్‌ చాతుర్యంతో టెలివిజన్‌ ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేసింది.&nbsp; 2016లో వచ్చిన 'నిర్మలా కాన్వెంట్‌' మూవీతో ఈ అమ్మడు సినిమాల్లోకి అడుగుపెట్టింది. కానీ అందులో పెద్దగా ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయలేదు.&nbsp; ఆ తర్వాత చేసిన 'మనలో ఒకడు', 'ఫిదా' చిత్రాల్లోనూ గుర్తుంచుకోతగ్గ రోల్స్‌ చేయలేదు. దీంతో మూడు సినిమాలు చేసిన శ్రీగౌరి పేరు పెద్దగా ఎవరికీ తెలియలేదు. దీంతో మోడలింగ్‌ వైపు అడుగులు వేసిన ఈ అమ్మడు 2018లో మిస్‌ హైదరాబాద్‌ టైటిల్‌ గెలిచి సినీ పెద్దల దృష్టిలో పడింది.&nbsp; View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) ఆహాలో వచ్చిన ‘మెయిల్‌’ వెబ్‌సిరీస్‌లో తొలిసారి లీడ్ రోల్ యాక్ట్రెస్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో రోజా అనే పల్లెటూరి అమ్మాయిగా అదరగొట్టింది.&nbsp; ఆ తర్వాత సుహాస్‌ నటించిన 'రైటర్‌ పద్మభూషణ్‌' సినిమాలో కన్నా అనే పాత్రలో కనిపించి మెప్పించింది. తన నటనతో మంచి మార్కులు సంపాదించింది.&nbsp; గతేడాది వచ్చిన 'మ్యాడ్‌' చిత్రం శ్రీగౌరి కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్ అని చెప్పవచ్చు. ఇందులో శ్రుతి పాత్రలో కనిపించి యూత్‌ను ఎంతగానో ఇంప్రెస్‌ చేసింది.&nbsp; ఈ ఏడాది తమిళంలో 'ట్రూ లవర్‌' అనే చిత్రంలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇందులో దివ్య అనే పాత్రతో శభాష్‌ అనిపించుకుంది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) ప్రస్తుతం మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా సరసన ఓ సినిమాలో నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో 'ప్రొడక్షన్ నెం.27' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ రూపొందుతోంది. సింగర్‌గా గౌరి ప్రియ రెండు సినిమాల్లో పాటలు కూడా పాడింది. తేజ దర్శకత్వంలో వచ్చిన 'హోరాహోరీ', 'మనలో ఒక్కడు' చిత్రాలకు గాయనిగా పనిచేసి అభిమానులను మెప్పించింది.&nbsp; తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రజనీ.. తన ఆల్‌టైమ్ ఫేవరేట్ అంటూ చెప్పుకొచ్చింది.&nbsp; ఏ కాస్త సమయం దొరికినా డ్యాన్స్ చేస్తుంటానని శ్రీగౌరి తెలిపింది. అలాగే పుస్తకాలు చదవం, పెయింటింగ్‌ వేయడం, ఫొటోగ్రఫీ తన హాబీస్‌ అని స్పష్టం చేసింది.&nbsp; ఫుడ్‌ విషయానికి వస్తే భారతీయ వంటకాలను ఈ అమ్మడు ఎంతగానో ఇష్టపడుతుంది. అలాగే చైనీస్‌, జపనీస్‌ ఫుడ్‌ను సైతం ఇష్టంగా తింటుంది.&nbsp; ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ శ్రీగౌరి చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.&nbsp; శ్రీగౌరి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ప్రస్తుతం 510K మంది ఫాలో అవుతున్నారు. ఆమె పోస్టు చేసిన ఫొటోలను వెంటనే షేర్ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు.
    నవంబర్ 13 , 2024
    <strong>Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్‌ పెట్టకుంటే ముప్పు తప్పదా!&nbsp;</strong>
    Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్‌ పెట్టకుంటే ముప్పు తప్పదా!&nbsp;
    ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అనగానే బాలీవుడ్‌ మాత్రమే గుర్తుకువచ్చేది. హిందీ స్టార్లను మాత్రమే పాన్‌ ఇండియా సెలబ్రిటీలుగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సౌత్‌ ఇండస్ట్రీ కూడా ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతూ జాతీయ స్థాయిలో అలరిస్తోంది. ముఖ్యంగా సౌత్‌ నుంచి టాలీవుడ్‌ (Tollywood), కోలివుడ్‌ (Kollywood) ఇండస్ట్రీల నుంచి మంచి కంటెంట్‌ ఉన్న పాన్‌ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అవి బాలీవుడ్ ఆదిపత్యానికి చెక్‌ పెడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏకత్రాటిపై ఉండాల్సిన సౌత్‌ ఇండస్ట్రీస్‌ అభిమానులు చేస్తోన్న ఫ్యాన్‌ వార్స్‌ కారణంగా బలహీన పడుతోంది. దీనిని కట్టడి చేయకపోతే మున్ముందు రోజుల్లో సౌత్‌ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; టాలీవుడ్‌ vs కోలీవుడ్‌ గతంలో ఫ్యాన్‌ వార్‌ అంటే ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేది. హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు పోస్టుల రూపంలో విమర్శలు చేసుకునేవారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాల హవా కారణంగా ఇది పక్క ఇండస్ట్రీలపైకి కూడా పాకింది. తమ హీరో తీసిన సినిమా కంటే పక్క ఇండస్ట్రీ స్టార్‌ చేసిన చిత్రం ఎక్కువ కలెక్షన్స్‌ సాధించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ పోకడ సౌత్‌లో టాలీవుడ్‌, కోలివుడ్‌ ఇండస్ట్రీలో ప్రధానంగా కనిపిస్తోంది. తమిళ హీరో విజయ్‌ చేసిన చిత్రాలు రిలీజ్‌ అయితే తెలుగు ఆడియన్స్‌ పెద్ద ఎత్తున ట్రోల్స్‌ చేస్తున్నారు. అదే సమయంలో మన హీరోల సినిమాలు వచ్చినప్పుడు అంతే స్థాయిలో తమిళులు సైతం నెట్టింట యాంటీ ప్రచారం చేస్తున్నారు. https://twitter.com/iammvengence/status/1758435868799377642 https://twitter.com/RAO_Offl/status/1759121949656318267 నష్టం ఏంటంటే? కొద్దిమంది మాత్రమే చేసే ఈ ఫ్యాన్ వార్ వల్ల హీరోలకు, సినిమా ఇండస్ట్రీలకు వచ్చే నష్టం ఏముందిలే అని చాలా మంది భావించవచ్చు. కానీ అది పొరపాటు. కొద్ది మంది ఫ్యాన్స్‌ చేస్తున్న ఈ ట్రోల్స్‌ చూసి ఆయా ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది ఆడియన్స్‌ ప్రభావితమవుతున్నారు. దాని వల్ల సహజంగానే పక్క ఇండస్ట్రీకి చెందిన హీరోపై వారిలోనూ తెలియకుండానే ద్వేషం ఏర్పడుతోంది. ఫలితంగా పక్క ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా రిలీజైనప్పుడు దానిని చూడకుండా రిజెక్ట్‌ చేస్తున్నారు. సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్‌ టాక్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల నార్త్‌లో బాగా రాణించిన సినిమాలు ఎంతో కీలకమైన సౌత్‌లో దెబ్బతింటున్నాయి. అది మూవీ ఓవరాల్‌ కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. సినిమా ఎంత బాగున్నప్పటికీ మనం చేసుకుంటున్న నెగిటివ్‌ ట్రోల్స్‌ కారణంగా ఆ సినిమా హిందీ మూవీస్‌ కంటే కలెక్షన్స్‌ పరంగా వెనకబడిపోతున్నాయి.&nbsp; ఆ సినిమాలకు దెబ్బ! త్వరలో రిలీజ్‌ అయ్యేందుకు సౌత్‌ నుంచి పలు పాన్ ఇండియా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్‌ నుంచి ‘పుష్ప 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకోగా కోలీవుడ్‌ నుంచి సూర్య నటించిన ‘కంగువా’, శివకార్తికేయన్‌ నటించిన ‘అమరన్‌’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు భారీ ఖర్చుతో పాన్‌ ఇండియా స్క్రిప్ట్‌తో రూపొందినవే. గతంలో లాగే ఈ సినిమాల విషయంలోనూ ఫ్యాన్స్ ఇండస్ట్రీల పరంగా విడిపోయి ట్రోల్స్‌ దిగితే గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా బాగుంటే ఇండస్ట్రీలకు అతీతంగా వాటిని ఆదరించాలని కోరుతున్నాయి. అప్పుడు మాత్రమే ఆయా చిత్రాలు మంచి వసూళ్లు సాధించి పాన్‌ ఇండియా స్థాయిలో ఘనమైన కలెక్షన్స్‌ సాధించగలుగుతాయని పేర్కొంటున్నాయి. అలా కాకుండా మళ్లీ ఫ్యాన్‌ వార్‌కు దిగితే పరోక్షంగా లాభపడేది బాలీవుడ్‌యే అని స్పష్టం చేస్తున్నాయి.&nbsp; టైటిల్స్‌ రచ్చకు చెక్‌ పెట్టాల్సిందే! సౌత్‌లో బిగ్‌ ఇండస్ట్రీలుగా ఉన్న టాలీవుడ్‌, కోలీవుడ్‌కి చెందిన దర్శక, నిర్మాతలు తమ వైఖరితో ఫ్యాన్‌ వార్‌కు ఆజ్యం పోయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇటీవల కాలంలో కోలీవుడ్‌ చిత్రాలు నేరుగా తమిళ టైటిల్స్‌తో తెలుగులోనూ రిలీజ్‌ కావడం ఎక్కువగా చూస్తున్నాం. కంగువా, వేట్టయన్‌తో పాటు అంతకుముందు వచ్చిన ‘తంగలాన్‌’, ‘రాయన్‌’, ‘వెలిమై’ తమిళ పేర్లను పెట్టడం వల్ల ఇది తెలుగు ఆడియన్స్‌లో ఆగ్రహానికి కారణమైంది. కొందరు చేసిన తప్పిదాలు కారణంగా మెుత్తం తమిళ ఇండస్ట్రీపైనే ద్వేషం వచ్చే ప్రమాదం తలెత్తుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమిళ ఇండస్ట్రీ జాగ్రత్తపడాలి.&nbsp; పొలిటికల్‌ టర్న్‌ ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టించాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ పవన్‌ చేసిన పరోక్ష కామెంట్స్‌ తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్‌ తరహాలోనే ఉదయనిధి స్టాలిన్‌ తమిళ నటుడు కావడంతో ఈ వివాదం తెలుగు, తమిళ ఇండస్ట్రీల మధ్య వార్‌గా కూడా మారిపోయింది. ఇరువురు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పరస్పరం మాటల దాడి చేసుకున్నారు. పవన్‌ కల్యాణ్ సినీ కెరీర్‌తో ఉదయనిధిని పోలుస్తూ దారుణంగా ట్రోల్‌ చేశారు. అటు ఉదయనిధి విద్యార్హతను తెరపైకి తీసుకొచ్చి పవన్‌పై తమిళ నెటిజన్లు విమర్శలు చేశారు.&nbsp; https://twitter.com/i/status/1841876236840374698 పవన్‌ కల్యాణ్‌ vs అల్లు అర్జున్‌ టాలీవుడ్‌లోని అతిపెద్ద సినీ నేపథ్యమున్న కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఆ ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా నటులు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఆ కుటుంబానికి చెందిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌కు అసలు పడటం లేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో(Pawan Kalyan vs Allu Arjun) పవన్‌ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్‌ మద్దతు తెలపడంతో ఈ వివాదం ఆజ్యం పోసుకుంది. అప్పటి నుంచి బన్నీని మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. అటు అల్లు ఆర్మీ సైతం వారికి దీటుగా బదులిస్తూ తమ హీరోకు అండగా నిలుస్తోంది. అయితే ఇటీవల ఓ ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ టాలీవుడ్‌కు చెందిన హీరోలతో పాటు అల్లు అర్జున్‌ పేరును ప్రస్తావించారు. ఆ హీరోలంటే తనకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ వివాదానికి చెక్‌ పెట్టే ఉద్దేశ్యంతోనే బన్నీ పేరును పవన్‌ తీసుకొచ్చినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 చిత్రాన్ని ప్రమోట్ చేయమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.&nbsp;
    అక్టోబర్ 17 , 2024
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్‌ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
    Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్‌ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
    టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్‌’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి ఆ సినిమాతో ఎనలేని పేరును సంపాదించింది. ఫిదా చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌ హృదయాలను గెలుచుకుంది. అద్భుతమైన నటన, మిస్మరైజింగ్‌ డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకుంది. అయితే హీరోయిన్‌కు ఒక హిట్టు వస్తే అవకాశాలు క్యూ కట్టడం కామన్‌గా మారిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ తరం హీరోయిన్లు ఎడపెడా సినిమాలు చేస్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. అయితే ఈ ధోరణికి సాయి పల్లవి దూరంగా ఉంది. ఎంత పెద్ద సినిమా ఆఫర్‌ వచ్చిన కథ నచ్చితేనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. పాత్రలో గ్లామర్‌ డోస్‌ ఎక్కువైనా, నటనకు ప్రాధాన్యం తగ్గినా సాయి పల్లవి సున్నితంగా రిజెక్ట్‌ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్‌. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఈ మలయాళీ భామ వదులుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. 1. భోళా శంకర్‌ (Bhola Shankar) చిరంజీవి హీరోగా, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్‌. ఇందులో చిరంజీవి సరసన తమన్న నటిస్తుండగా చెల్లెలిగా కీర్తి సురేష్‌ చేస్తోంది. అయితే కీర్తి సురేష్‌ పాత్రకు తొలుత సాయిపల్లవిని చిత్రం బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఈవెంట్‌లో సాయిపల్లవే చెప్పింది. తానే ఆ రోల్‌ను రిజెక్ట్‌ చేశానని స్పష్టం చేసింది. రీమేక్‌ సినిమాలపై ఉన్న భయంతోనే ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది. కాగా, తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వేదాలం సినిమాకు రీమేక్‌గా ‘భోళా శంకర్‌’ వస్తోంది.&nbsp; 2. లియో (Leo) తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కథానాయకుడు ‌అంటే ఏ హీరోయిన్‌ ‌అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ సాయి పల్లవి మాత్రం విజయ్‌ సినిమాను సున్నితంగా తిరస్కరించింది. విజయ్‌ లేటెస్ట్‌ మూవీ ‘లియో’లో హీరోయిన్‌గా తొలుత సాయి పల్లవినే అనుకున్నారట. ఇందుకోసం చిత్ర యూనిట్ సాయి పల్లవిని కూడా సంప్రదించింది. అయితే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె రిజెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత త్రిషను సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.&nbsp; 3. ఛత్రపతి (Chatrapathi) యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఛత్రపతి సినిమాతో హిందీలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన రాజమౌళి ‘ఛత్రపతి’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కూడా సాయిపల్లవినే సంప్రదించారని అప్పట్లో టాక్‌ వినిపించింది. గ్లామర్‌ షో ఎక్కువగా చేయాల్సి ఉండటంతో సాయి పల్లని ఈ ఆఫర్‌ రిజెక్ట్‌ చేశారని సమాచారం. దీంతో ఆ పాత్రకు బాలీవుడ్‌ నటి నుస్రత్‌ భరుచ్చాను ఎంపికచేశారు. కాగా, ఈ సినిమా మే 12 రిలీజ్‌ కానుంది.&nbsp; 4. వారసుడు (Varasudu) విజయ్‌ రీసెంట్ మూవీ వారసుడు / వారిసు సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్‌ చేసిందట. ఇందులో కూడా హీరోయిన్‌ పాత్రకు ప్రియారిటీ లేకపోవడంతో సున్నితంగా నో చెప్పిందని సమాచారం. దీంతో సాయిపల్లవి చేయాల్సిన పాత్రకు రష్మిక మందన్నను ఎంపిక చేశారు.&nbsp; 5. సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) మహేష్‌ బాబు, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్‌ పాత్రను సైతం సాయిపల్లవినే చేయాల్సి ఉండగా ఆమె రిజెక్ట్‌ చేసింది. దీంతో ఆ అవకాశం మళ్లీ రష్మికకే దక్కింది. హీరోయిన్ పాత్రకు యాక్టింగ్‌ స్కోప్‌ ఎక్కువగా లేకపోవడంతోనే ఈ భామ తిరస్కరించినట్లు తెలుస్తోంది.&nbsp; 6. డియర్ కామ్రేడ్ (Dear Comrade) విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం దారుణంగా ఫెయిల్‌ అయింది. అయితే ఈ సినిమా హీరోయిన్‌ ఆఫర్‌ కూడా ముందుగా సాయిపల్లవికే వెళ్లింది. అయితే ముద్దు సన్నివేశాలు, గ్లామర్ షో ఉన్న పాత్ర కావడంతో ఈ భామ తిరస్కరించినట్లు అప్పట్లో వార్తల్లో వచ్చాయి. తొలి నుంచి కిస్సింగ్‌ సీన్లకు దూరంగా ఉండే సాయిపల్లవి.. ఇందులో హీరోయిన్, హీరోయిన్ల ఘాటు రొమాన్స్‌ ఉండటంతో నో చెప్పింది.&nbsp; 7. చెలియా (Cheliya) లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నంతో కనీసం ఒక సినిమాలోనైనా వర్క్‌ చేయాలని హీరో, హీరోయిన్లు కలకలలు కంటారు. ఒక చిన్న పాత్ర దొరికినా చాలు అని సంబరపడుతుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఏకంగా హీరోయిన్ ఆఫర్‌నే తిరస్కరించింది. కార్తిక్‌ హీరోగా తెరకెక్కిన చెలియా సినిమా కోసం తొలుత సాయిపల్లవినే మూవీ యూనిట్‌ సంప్రదించింది. అయితే సినిమా కథతో సంతృప్తి చెందని ఈ భామ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. దీంతో సాయిపల్లవి ప్లేసులో అదితిరావు హైదరినీ తీసుకున్నారు.&nbsp;
    మే 09 , 2023
    Allu Arjun: బ్రాండ్ వాల్యూలో ‘పుష్ప’ తగ్గేదేలే.. అల్లు అర్జున్, రష్మిక, పీవీ సింధులకు టాప్ 25లో చోటు&nbsp;
    Allu Arjun: బ్రాండ్ వాల్యూలో ‘పుష్ప’ తగ్గేదేలే.. అల్లు అర్జున్, రష్మిక, పీవీ సింధులకు టాప్ 25లో చోటు&nbsp;
    ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటుడు అల్లు అర్జున్. ఈ సినిమా అనంతరం ఐకాన్ స్టార్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో క్రమక్రమంగా బన్నీ బ్రాండ్ వాల్యూ ఎక్కువైపోయింది. తాజాగా దేశంలో బ్రాండ్‌ వాల్యూ పరంగా టాప్ 25 సెలబ్రిటీల జాబితాలో అల్లు అర్జున్ చోటు సంపాదించాడు. పుష్పరాజ్‌తో పాటు శ్రీవల్లిగా నటించిన రష్మిక బ్రాండ్ వాల్యూ కూడా పెరిగిపోయింది. ఈ కన్నడ కుట్టికి టాప్ 25లో చోటు లభించింది. తెలుగు తేజం బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. 2022 సంవత్సరానికి గాను కన్సల్టింగ్ సంస్థ ‘క్రోల్’(kroll) ‘సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ స్టడీ’ని విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.&nbsp; అల్లు అర్జున్&nbsp; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశంలో టాప్ 20వ సెలబ్రిటీగా నిలిచాడు. 3.14 కోట్ల డాలర్ల బ్రాండ్ వాల్యూతో టాప్ 25లో చోటు సంపాదించాడు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప2’ సినిమా షూటింగులో బిజీబిజీగా ఉన్నాడు.&nbsp; పీవీ సింధు బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఈ జాబితాలో 23వ స్థానం దక్కించుకుంది. ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ బ్రాండ్ వాల్యూ 2.65 కోట్ల డాలర్లు.&nbsp; రష్మిక మందన్న పుష్ప బ్యూటీ రష్మిక మందన్న కూడా టాప్ 25 జాబితాలో చోటు సంపాదించింది. 2.53 కోట్ల డాలర్లతో 24వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో పలు సినిమాలతో రష్మిక బిజీబిజీగా ఉంది.&nbsp; రణ్‌వీర్ సింగ్&nbsp; 18.17 కోట్ల డాలర్లతో రణ్‌వీర్ సింగ్ తొలి స్థానంలో నిలిచాడు. ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న విరాట్ కోహ్లీని అధిగమించాడు. 2021లో రణ్‌వీర్ బ్రాండ్ వాల్యూ 15.83 కోట్ల డాలర్లు ఉండగా 2022కి 18.17కోట్ల డాలర్లకు చేరుకుంది.&nbsp;&nbsp; విరాట్ కోహ్లీ&nbsp; కెప్టెన్సీ వదులుకున్నాక విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ తగ్గిపోతోంది. 2020లో కోహ్లీ బ్రాండ్ వాల్యూ 23.77 కోట్ల డాలర్లు కాగా, 2022 సంవత్సరానికి 17.69 కోట్ల డాలర్లకు పడిపోయింది. దీంతో దేశంలో సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ జాబితాలో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.&nbsp; అక్షయ్ కుమార్&nbsp; బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. ఇతడి బ్రాండ్ వాల్యూ 15.36 కోట్ల డాలర్లు.&nbsp; అలియా భట్ లేడీ సెలబ్రిటీల జాబితాలో దేశంలో తొలి స్థానంలో నిలిచిన నటి అలియా భట్. ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ బ్యూటీ బ్రాండ్ వాల్యూ 10.29 కోట్ల డాలర్లు.&nbsp; దీపిక పదుకొణె 8.29 కోట్ల డాలర్లతో దీపిక పదుకొణె 5వ స్థానంలో నిలిచింది. 2021లో 5.16 కోట్ల డాలర్లుగా ఉండేది. ఎం.ఎస్.ధోనీ&nbsp; రిటైర్మెంట్ తర్వాత బ్రాండ్ వాల్యూ కాస్త తగ్గింది. 8.03 కోట్ల డాలర్లతో ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.&nbsp; అమితాబ్ బచ్చన్&nbsp; బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఏడో స్థానంలో నిలిచాడు. అమితాబ్ బ్రాండ్ వాల్యూ 7.9 కోట్ల డాలర్లుగా ఉంది.&nbsp; సచిన్ తెందుల్కర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ బ్రాండ్ వాల్యూ అదేరీతిలో కొనసాగుతోంది. 7.36 కోట్ల డాలర్లతో సచిన్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. హృతిక్ రోషన్ 7.16 కోట్ల డాలర్లతో హృతిక్ రోషన్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.&nbsp; షారూక్ ఖాన్ కింగ్ షారూక్ ఖాన్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. 5.57 కోట్ల డాలర్లుతో పదో స్థానంలో నిలిచాడు.&nbsp; సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ వెంబడి సల్మాన్ ఖాన్ బ్రాండ్ వాల్యూ ఉంది. 5.45 కోట్ల డాలర్లతో 11వ స్థానం సంపాదించాడు.&nbsp; రణ్‌బీర్ కపూర్ సల్మాన్ ఖాన్‌తో సమానంగా రణ్‌బీర్ కపూర్ బ్రాండ్ వాల్యూ ఉంది. 5.45 కోట్ల డాలర్లతో సల్లు భాయ్‌తో 11వ స్థానాన్ని పంచుకున్నాడు రణ్‌బీర్.&nbsp; రోహిత్ శర్మ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్రాండ్ వాల్యూ 4.95 కోట్ల డాలర్లు. కోహ్లీతో పోల్చితే చాలా తక్కువ. మొత్తంగా జాబితాలో 13వ స్థానంలో ఉన్నాడీ హిట్ మ్యాన్. ఆయుష్మాన్ ఖురానా ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ వాల్యూ 4.95 కోట్ల డాలర్లు. బ్రాండ్ వాల్యూ లిస్ట్‌లో 14వ స్థానంలో ఉన్నాడీ హీరో.&nbsp; అనుష్క శర్మ&nbsp; సినిమాలు తక్కువ చేసినప్పటికీ అనుష్క శర్మ బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. 4.17 కోట్ల డాలర్లతో అనుష్క 15వ స్థానంలో నిలిచింది.&nbsp; కియారా అడ్వాణీ&nbsp; ఇటీవలే పెళ్లి పీటలెక్కింది షేర్షా బ్యూటీ కియారా అడ్వాణీ. 3.83 కోట్ల డాలర్ల బ్రాండ్ వాల్యూతో 16వ స్థానంలో ఉంది.&nbsp; కరీనా కపూర్, కార్తీక్ ఆర్యన్&nbsp; కరీనా కపూర్, కార్తీక్ ఆర్యన్‌ల బ్రాండ్ వాల్యూ 3.65 కోట్ల డాలర్లు. వీరిద్దరూ కలిసి 17వ స్థానాన్ని పంచుకున్నారు.&nbsp; హార్దిక్ పాండ్యా భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 18వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఆల్‌రౌండర్ బ్రాండ్ వాల్యూ 3.48 కోట్ల డాలర్లు.&nbsp; సారా, వరుణ్.. సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్ 21వ స్థానంలో ఉన్నారు. వీరిద్దరి బ్రాండ్ వాల్యూ 2.8 కోట్ల డాలర్లుగా ఉండటం విశేషం.&nbsp; నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ 2.65 కోట్ల డాలర్లు. పీవీ సింధుతో సమానమైన బ్రాండ్ వాల్యూతో ఈ ఒలింపిక్ ఛాంపియన్ 23వ స్థానంలో ఉన్నాడు.
    మార్చి 22 , 2023
    Vishwambhara: జపాన్‌ వీధుల్లో త్రిషతో చిరంజీవి రొమాన్స్‌.. ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు! 
    Vishwambhara: జపాన్‌ వీధుల్లో త్రిషతో చిరంజీవి రొమాన్స్‌.. ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు! 
    మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌ త్రిష (Trisha) చిరుకి జోడీగా న‌టిస్తోంది. ‘అమిగోస్’&nbsp; ఆషికా రంగనాథ్, ర‌మ్య ప‌సుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జపాన్‌లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; త్రిషతో చిరు రొమాంటిక్‌ సాంగ్‌! ‘విశ్వంభర’ (Viswambhara) టీమ్‌ ప్రస్తుతం జపాన్‌లో ఉంది. 15 రోజుల షూటింగ్‌ షెడ్యూల్‌తో హీరో చిరంజీవి సహా దర్శకుడు విశిష్ట ఇతర టీమ్‌ సభ్యులు రీసెంట్‌గా జపాన్‌లో అడుగుపెట్టారు. షెడ్యూల్‌లో భాగంగా ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను మూవీ టీమ్‌ చిత్రీకరించింది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ప్రస్తుతం చిరు, త్రిష కాంబోలో ఓ డ్యూయేట్‌ సాంగ్‌ను షూట్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్‌లో చిరు, త్రిష జోడీ అదరగొడుతుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిరు మేకోవర్‌ చూస్తే ఆయన 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లు అనిపిస్తుందని అంటున్నారు. త్రిష - చిరంజీవి కెమెస్ట్రీ కూడా సాంగ్‌లో నెక్స్ట్‌ లెవల్లో వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. ఈ సాంగ్ షూట్ అయిపోగానే చిత్ర బృందం హైదరాబాద్‌లో అడుగుపెడుతుందని సమాచారం. ఇదిలా ఉంటే చిరు-త్రిష సాంగ్‌పై వస్తోన్న హైప్‌ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.&nbsp; 18 ఏళ్ల క్రితం ఇదే మ్యాజిక్‌! చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్‌’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్‌’ సమయంలోనే వీరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్‌ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్‌ తొలుత త్రిషనే హీరోయిన్‌గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది. https://twitter.com/i/status/1849101610762522837 2025 సమ్మర్‌ బరిలో.. చిరంజీవి - వశిష్ట కాంబోలో రూపొందుతున్న ‘విశ్వంభర’ (Viswambhara) చిత్రం 2025 సమ్మర్‌లో రానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కావాలి. జనవరి 10న రాబోతున్నట్లు గతంలోనే విశ్వంభర టీమ్ అనౌన్స్ చేసింది. అయితే తనయుడు రామ్‌ చరణ్‌ (Ram Charan) నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) కోసం చిరు వెనక్కి తగ్గారు. దీంతో గేమ్‌ ఛేంజర్‌ సంక్రాంతి బరిలో నిలవగా ‘విశ్వంభర’ సమ్మర్‌కు పోస్టుపోన్‌ అయినట్లు 2025 మే (Viswambhara Release Date)లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో చిరు నటించిన&nbsp; ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది. 2024లో చిరుకి గుర్తుండిపోయే మోమోరీస్‌! అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్‌ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్‌ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్‌, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.&nbsp;
    నవంబర్ 20 , 2024
    <strong>Suriya: సూర్యతో జక్కన్న తీయాలనుకున్న సినిమా అదేనా!</strong>
    Suriya: సూర్యతో జక్కన్న తీయాలనుకున్న సినిమా అదేనా!
    తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించి 'కంగువా' (Kanguva) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నవంబర్ 14న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండంతో నటుడు సూర్యతో పాటు కంగువా టీమ్‌ చురుగ్గా ప్రమోషన్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సైతం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి గతంలో సూర్యతో సినిమా చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆ సినిమా ఏమై ఉంటుందా? అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట ఆసక్తికర చర్చ మెుదలైంది. గతంలో రాజమౌళి తీసిన ఆ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాన్ని తొలుత సూర్యతోనే తీద్దామని అనుకున్నట్లు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆ మూవీ ఏదంటే? మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) కెరీర్‌లో ‘మగధీర’ (Magadheera) ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాతో చరణ్‌ క్రేజ్‌ తారాస్థాయికి చేరింది. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ సినిమాను తొలుత సూర్యతో చేయాలని జక్కన్న భావించినట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రానికే సూర్యను తీసుకోవాలని భావించినట్లు స్ట్రాంగ్‌గా రూమర్లు వచ్చినా అందులో వాస్తవం లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్‌ కటౌన్‌ను చూసే ‘బాహుబలి’ స్టోరీ సిద్ధం చేసినట్లు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు. కాబట్టి ‘మగధీర’ కోసమే రాజమౌళి సూర్యను సంప్రదించి ఉండొచ్చని అంటున్నారు. ‘కంగువా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సూర్య చేసిన ‘గజిని’ చిత్రాన్ని రాజమౌళి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ లెక్కన చూసినా ‘గజిని’ 2005లో రిలీజైంది. 2009లో మగధీర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మగధీర చిత్రీకరణ మూడేళ్లపాటు జరిగింది కాబట్టి 2006 సమయంలోనే మగధీర స్క్రిప్ట్‌ను రాజమౌళి సిద్ధం చేశారు. ఈ లాజిక్స్‌ పరంగా చూస్తే ‘మగధీర’ సినిమానే సూర్య చేయాల్సిందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. అదే జరిగి ఉంటే? ఒకవేళ నిజంగానే మగధీర చిత్రాన్ని గనుక రామ్‌చరణ్‌ చేయకుండా ఉండుంటే అతడి ఇంకోలా ఉండేదని చెప్పవచ్చు. ఎందుకంటే ‘మగధీర’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ లేకుండా చరణ్‌ సినీ జీవితాన్ని ఊహించుకోలేము. తొలి చిత్రం ‘చిరుత’ ఓ మోస్తరు టాక్‌ తెచ్చుకోవడంతో ఫ్యాన్స్‌ దృష్టిలో చరణ్‌ పెద్దగా రిజిస్టర్‌ కాలేదు. ఆ తర్వాత చేసిన సెకండ్‌ ఫిల్మ్‌ ‘మగధీర’తోనే చిరు తనయుడిగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు చరణ్‌. మగధీర తర్వాత చాలా చిత్రాలే చేసినప్పటికీ ‘రంగస్థలం’ (2018) వరకూ సరైన బ్రేక్ రాలేదు. అప్పటివరకూ మగధీరతో వచ్చిన ఫేమ్‌తోనే చరణ్‌ నెట్టుకు వచ్చాడు. అటువంటి ‘మగధీర’ సినిమా చరణ్‌ కెరీర్‌లో లేకపోయి ఉంటే అతడి కెరీర్‌లో కచ్చితంగా డౌన్‌ఫాల్‌లో ఉండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు మెగా ఫ్యాన్స్‌ సైతం బయటకు చెప్పకపోయిన ఇదే ఫీలింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.&nbsp; ‘సూర్యతో చేసే ఛాన్స్ మిస్ అయ్యా’ కంగువా’ (Kanguva) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కోలీవుడ్‌ నటుడు సూర్య (Suriya)పై దర్శకుడు రాజమౌళి (Rajamouli) ప్రశంసలు కురిపించారు. ఆ నటుడి స్ఫూర్తితోనే పాన్‌ ఇండియా చిత్రాలను తెరకెక్కించానని తెలిపారు. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడంలో సూర్యనే తనకు స్పూర్తి అని జక్కన్న అన్నారు. ‘గజిని’ చిత్ర సమయంలో ఆయన చేసిన ప్రచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. వేరే చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు తెలుగువారికి ఎలా దగ్గర కాగలిగాడు? అనే దాన్న కేస్‌ స్టడీగా తీసుకోమని మన హీరోలు, నిర్మాతలకు చెప్పినట్లు తెలిపారు. అలా తన పాన్‌ ఇండియా మూవీ బాహుబలికి సూర్య ప్రేరణగా నిలిచాడని గుర్తుచేశారు. సూర్య సినిమా చేయాలనుకున్నామని కానీ అది కుదర్లేదని స్పష్టం చేశారు. సూర్యతో చేసే ఛాన్స్‌ తాను మిస్‌ అయ్యాయని పేర్కొన్నారు. https://twitter.com/AadhanTelugu/status/1854710204740309097 ‘కథ చెప్పారు.. వర్కౌట్‌ కాలేదు’ తమిళ స్టార్‌ హీరో కార్తీ ఇటీవల ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సత్యం సుందరం’ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో కార్తీ ఇంటర్యూ చేశారు. ఇందులో సూర్య (Suriya), కార్తీ (Karthi) కలిసి నటించడంపై గౌతమ్ మీనన్ ప్రశ్నించగా గతంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని కార్తీ పంచుకున్నాడు. 'నేను కార్తిక్‌ కలిసి నటిస్తాం. అందుకు తగ్గ స్క్రిప్ట్‌ రావాలి. గతంలో రాజమౌళి సర్‌ మాకు ఒక కథ వినిపించారు. అది బాగానే ఉంది కానీ ఆ సినిమా వర్కౌట్‌ కాలేదు' అని తెలిపాడు. ఇది విన్న సినీ లవర్స్‌ ఆశ్చర్యపోయారు. రాజమౌళి కథ చెబితే ఎలా వదులుకున్నారంటూ ప్రశ్నించారు. ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే సూర్య, కార్తీ రేంజ్‌ మరోలా ఉండేదని అంచనా వేస్తున్నారు.&nbsp; https://twitter.com/adarshtp_offl/status/1835533193111392319
    నవంబర్ 08 , 2024
    <strong>Raksha Bandhan 2024: తోబుట్టువులతో రాఖీ కట్టించుకున్న సెలబ్రిటీలు.. ఓ లుక్కేయండి!</strong>
    Raksha Bandhan 2024: తోబుట్టువులతో రాఖీ కట్టించుకున్న సెలబ్రిటీలు.. ఓ లుక్కేయండి!
    అన్నను కొండంత అండగా స్త్రీలు భావిస్తుంటారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రేమను, వారి యోగ క్షేమాలను చూసుకునేది కూడా అన్న లేదా తమ్ముడు మాత్రమే. కష్టసుఖాల్లో పాలుపంచుకునే తొలి మిత్రుడిగా సోదరుడ్ని చెబుతుంటారు. అన్న-చెల్లెళ్లు, అక్క-తమ్ముడి మధ్య ఉండే అప్యాయతలకు ప్రతీకగా ప్రతీ ఏటా రాఖీ పండగను జరుపుకుంటారు. ఒకరికొకరు అండగా ఉంటామని ఈ పండగ ద్వారా చాటి చెప్పుకుంటారు. అటు సెలబ్రిటీలు సైతం రాఖీ పండగను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం (ఆగస్టు 19) సందర్భంగా సెలబ్రిటీలు తమ సోదరులకు రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకున్నారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో సైతం పంచుకున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మెగా డాటర్స్‌ సుస్మిత కొణిదెల, నిహారిక కొణిదెల యంగ్‌ హీరో వరుణ్‌తేజ్‌కు రాఖీ కట్టారు. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కు కూడా మెగా డాటర్‌ నిహారిక కొణిదెల రాఖీ కట్టి అతడి ఆశీస్సులు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను చరణ్‌ స్వయంగా పంచుకున్నారు.&nbsp; View this post on Instagram A post shared by RamCharan.k 🔵 (@ramcharankonidella.k) యువ నటుడు సుధీర్‌ బాబు కూడా తన సోదరితో కలిసి రాఖీ వేడుకులను ఘనంగా జరుపుకున్నారు. తన అక్కతో సెల్ఫీ దిగి తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు.&nbsp; నటుడు సందీప్‌ కిషన్‌ సైతం సోదరి మౌనికతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. చెల్లెలితో చిన్నప్పుడు దిగిన ఫొటోను పంచుకున్నారు.&nbsp; బాలీవుడ్‌ నటి పరిణితి చోప్రా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సోదరులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపింది. వారితో వీడియోకాల్‌లో మాట్లాడిన ఫొటోను షేర్ చేసింది.&nbsp; స్టార్‌ నటి రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ తన తమ్ముడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.&nbsp; ప్రముఖ నటి జెనీలియా, సోదరుడు నిగెల్‌ డిసౌజాకు రాఖీ పర్వదినంగా సందర్భంగా విష్‌ చేశారు. అవసరం వచ్చిన ప్రతీ చోట అతడు అండగా నిలిచాడంటూ కొనియాడారు.&nbsp; రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కూడా రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. చెల్లెళ్లు ప్రసీద, ప్రదీప్తి ప్రభాస్‌కు రాఖీ కట్టి శుభాంకాక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; అల్లు అర్జున్‌ భార్య స్నేహా రెడ్డి రక్షాబంధన్‌ సందర్భంగా సోదరులతో దిగిన ఫోటోలను షేర్‌ చేసింది. అలాగే బన్నీ కూతురు అల్లు అర్హా తన సోదరుడు అయాన్‌కు రాఖీ కడుతున్న ఫొటోలను కూడా పంచుకుంది. అల్లు అర్హ ఓ బేబీ డాగ్‌కు కూడా రాఖీ కట్టడం ఫొటోల్లో చూడవచ్చు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇంట్లో రాఖీ వేడుకలు జరిగాయి. మహేష్‌ బాబు కూతురు సితార తన అన్న గౌతమ్‌కు రాఖీ కట్టి విషెస్‌ తెలియజేసింది.
    ఆగస్టు 20 , 2024
    Top 5 Telugu Serial Actress: సీరియల్స్‌ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్‌ అవుతున్నట్లే!
    Top 5 Telugu Serial Actress: సీరియల్స్‌ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్‌ అవుతున్నట్లే!
    ఈ జనరేషన్‌ యూత్‌కు సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై ఉన్న ఆసక్తి.. టెలివిజన్‌లో వచ్చి సీరియళ్లపై ఉండదు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్‌ వారికి పెద్దగా రుచించదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్‌ తీసుకొని ఛానెల్‌ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్‌-5 సీరియల్ భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; Ayesha Zeenath స్టార్‌ మా (Star maa)లో వస్తున్న ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) సీరియల్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ప్రగతి నటించగా.. ఆమెను ఢీకొట్టే హీరోయిన్‌ దుర్గ పాత్రలో అయేషా జీనత్ (Ayesha Zeenath) నటిస్తోంది.&nbsp;ప్రస్తుతం ఈ సీరియల్‌ మంచి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకెళ్తోంది. కేరళకు చెందిన ఈ బ్యూటీ 'రెడీ స్టడీ పో' అనే రియాలిటీ షోతో బుల్లితెరపై కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత జీ తమిళ్‌ లో వచ్చిన ‘సత్య’ అనే సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు సంపాందించింది. సూపర్ క్వీన్ అనే జీ తమిళం రియాలిటీ షోలోనూ పాల్గొన్న అయేషా.. అందులో రెండో స్థానంలో నిలిచి మరింత పాపులర్ అయ్యింది.&nbsp; అలాగే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా మంచి పేరు తెచ్చుకుంది. హోస్ట్ కమల్‌తో గొడవ పెట్టుకుని అప్పట్లో అయేషా బాగా పాపులర్ అయింది. Raksha Goud కన్నడ నటి రక్ష గౌడ్‌ (Raksha Goud).. తెలుగులో వస్తోన్న 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu) సీరియల్ ద్వారా చాలా పాపులర్‌ అయ్యింది. ఇందులో వసుధార పాత్రలో అందరి మనసులను దోచుకుంది.&nbsp; ఈమె లీడ్‌ రోల్‌లో చేస్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ రీసెంట్‌గా 1000 ఎపిసోడ్‌లను పూర్తి చేసింది. ఇందులో ఈమె క్రెడిట్ ఎంతగానో ఉందని చెప్పవచ్చు.&nbsp; 2017లో కన్నడ సీరియల్‌ 'రాధా రమణ'తో రక్ష తన బుల్లితెర కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగులో కృష్ణవేణి అనే సీరియల్‌ చేసినప్పటికీ రక్షకు పెద్దగా పేరు రాలేదు. గుప్పెడంత మనసు సీరియల్‌తో ఈ భామ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా తనను గుర్తుపడుతున్నారని ఆమె ఓ ఇంటర్యూలో చెప్పారు.&nbsp; Jyothi Rai ‘గుప్పెడంత మనసు’ (Guppedantha Manasu) సీరియల్ ద్వారా పాపులర్ అయిన మరో కన్నడ నటి జ్యోతి రాయ్‌ (Jyothi Rai). ఇందులో జగతి పాత్రపై ఆమె చెరగని ముద్ర వేసింది.&nbsp; కర్ణాటకకు చెందిన జ్యోతి రాయ్‌.. తెలుగు, కన్నడ సీరియల్స్‌లలో నటిస్తూ మంచి పేరు సంపాదించింది. ముచ్చటైన చీరకట్టులో తల్లి పాత్రలు పోషిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం జ్యోతి రాయ్‌ను ఫైర్ బ్రాండ్‌గా చెప్పవచ్చు. ఆమె ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్‌ చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటుంది. ప్రస్తుతం ఈ భామ కన్నడ సినిమాలతో పాటు.. ‘ప్రెట్టి గర్ల్‌’ (Pretty Girl) అనే సిరీస్‌లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; Preethi Sharma తెలుగులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో పాపులర్‌ నటి ప్రీతి శర్మ (Preethi Sharma). 'పడమటి సంధ్యా రాగం' (Padamati Sandhya Ragam) సీరియల్‌లో ఆధ్య పాత్ర ద్వారా ఈ భామ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ప్రీతి శర్మ.. కలర్స్ తమిళ్‌ సీరియల్‌ 'ఒరు కాదయి పాడతుమా, సార్‌?' ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.&nbsp; తెలుగులోకి 'కావ్యాంజలి' అనే సీరియల్‌ ద్వారా అడుగుపెట్టింది. ఇందులో అంజలి పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; ఈ క్రమంలోనే ‘పడమటి సంధ్యా రాగం’ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ సంపాదించి గృహిణుల ఫేవరేట్‌ నటిగా మారిపోయింది.&nbsp; Soundarya Reddy ‘పడమటి సంధ్యా రాగం’ (Padamati Sandhya Ragam) అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి ‘సౌందర్య రెడ్డి’ (Soundarya Reddy). ఈ భామ తన అందం, అభినయం, నటనతో బుల్లితెరపై హల్‌చల్‌ చేస్తోంది.&nbsp; కర్ణాటకలోని బెంగళూరు నగరానికి చెందిన ఈ భామ.. 'రాజీ' అనే కన్నడ సీరియల్ ద్వారా టెలివిజన్‌లోకి అరంగేట్రం చేసింది.&nbsp; ఆ తర్వాత ‘పడమటి సంధ్యా రాగం’ సీరియల్‌లో అవకాశం దక్కించుకొని.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.&nbsp; బుల్లితెర కెరీర్‌లో ఆమెకు ఇది రెండో సీరియల్ అయినప్పటికీ.. 10 సీరియళ్లకు సరిపడ క్రేజ్‌ను ఈ సుందరి దక్కించుకుంది. తన అందంతో చిన్న స్క్రీన్‌పై మాయ చేస్తోంది.&nbsp;
    ఫిబ్రవరి 20 , 2024
    Suhani Bhatnagar: ‘దంగల్‌’ నటి ప్రాణం తీసిన చిన్న గాయం.. ఏం జరిగిందంటే?
    Suhani Bhatnagar: ‘దంగల్‌’ నటి ప్రాణం తీసిన చిన్న గాయం.. ఏం జరిగిందంటే?
    బాలీవుడ్‌ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'దంగల్‌'లో బాల నటిగా చేసిన ‘సుహాని భట్నాగర్’ (Suhani Bhatnagar) కన్నుమూసింది. 19 ఏళ్ళ వయసులోనే సుహాని మరణించి అందర్నీ షాక్‌కి గురి చేసింది. https://twitter.com/kadak_chai_/status/1758784936247746905?s=20 కొన్నేళ్ల క్రిందట సుహానికి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె కాలుకి గాయమైంది. చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మందులు సుహానిపై దుష్ప్రభావం చూపాయి.&nbsp; సుహాని శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటీన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సుహానీ ఈ ఉదయం ప్రాణాలు విడిచింది.&nbsp; సుహానికి సంబంధించిన అంత్యక్రియలను ఫరిదాబాద్‌ సెక్టార్‌ 15లోని అజ్రోండా శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు ఉదయం ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. సుహానీ 2016లో వచ్చిన ‘దంగల్‌’ (Dangal) సినిమా ద్వారానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో అమీర్‌ఖాన్‌తో పాటు కూతుళ్లుగా నటించిన ఫాతిమా, సన్యా, సుహాని భట్నాగర్‌కు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు వచ్చింది.&nbsp; ఈ సినిమా తరువాత ఈ ఫాతిమా, సన్యాస, సుహానిలకు ఇండస్ట్రీలో చాలా ఆఫర్లు వచ్చాయి. ఆ ఆఫర్స్‌ని ఫాతిమా, సన్యా అందిపుచ్చుకున్నారు.&nbsp; కానీ సుహాని (Suhani Bhatnagar) మాత్రం.. యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకోని స్టడీస్‌పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే సినిమాలకు దూరమై చదువులో బిజీ అయ్యింది. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను సుహాని పలకరిస్తూనే ఉండేది. ఎప్పటికప్పుడు తన సమాచారాన్ని వారితో పంచుకునేది.&nbsp; ఈ క్రమంలో సుహాని పోస్టు చేసిన ఫొటోలను చూసి నెటిజన్లు ఫిదా అయ్యేవారు. సుహాని ట్రాన్స్‌ఫార్మేషన్‌, అందం చూసి ఆశ్చర్యపోయేవారు.&nbsp; సుహాని అందాన్ని కచ్చితంగా వెండితెరపై చూడాల్సిందేనని బాలీవుడ్ ఆడియన్స్‌ భావించారు. ఆమె ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న క్రమంలోనే ఈ షాకింగ్ న్యూస్ ఎదురైంది.&nbsp; సుహాని అకస్మిక మరణంతో బాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.&nbsp;
    ఫిబ్రవరి 17 , 2024

    @2021 KTree