• TFIDB EN
  • ధూమం
    UATelugu2h 22m
    అవినాష్ ఓ సిగరెట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఆ కంపెనీ లాభాల్లోకి వచ్చేందుకు కృషి చేస్తాడు. ఈ క్రమంలో యజమానితో భేదాభిప్రాయాలు రావడంతో కంపెనీ నుంచి బయటకు వస్తాడు. ఓ రోజు కారులో తన భార్యతో వెళ్తున్న క్రమంలో అతనిపై కొంతమంది దాడి చేస్తారు. ఇంతకు అతనిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరు? అవినాష్ భార్యకు వచ్చిన ప్రమాదం ఏమిటన్నది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    ఇన్ ( Telugu )
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఫహద్ ఫాసిల్
    అవినాష్ అవి
    రోషన్ మాథ్యూ
    అచ్యుత్ కుమార్
    ప్రకాష్
    అపర్ణ బాలమురళి
    వినీత్
    అను మోహన్
    జాయ్ మాథ్యూ
    నందు
    భానుమతి పయ్యనూర్
    ఉమా వై జి
    కిరణ్ నాయక్
    సంతోష్ కర్కి
    సిబ్బంది
    పవన్ కుమార్
    దర్శకుడు
    విజయ్ కిరగందూర్నిర్మాత
    పూర్ణచంద్ర తేజస్విసంగీతకారుడు
    ప్రీతా జయరామన్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Dhoomam OTT Review: సిగరేట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ధూమం’ ఎలా ఉందంటే?</strong>
    Dhoomam OTT Review: సిగరేట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ధూమం’ ఎలా ఉందంటే?
    నటీనటులు : ఫహద్ ఫాజిల్‌, అపర్ణ బాలమురళి, రోషన్‌ మ్యాథ్యూ, వినీత్‌, అను మోహన్‌, అచ్యుత్‌ కుమార్‌, విజయ్‌ మీనన్‌ తదితరులు రచన, దర్శకత్వం : పవన్‌ కుమార్‌ సంగీతం : పూర్ణచంద్ర తేజస్వి సినిమాటోగ్రఫీ : ప్రీతా జయరామన్‌ ఎడిటింగ్‌ : సురేష్‌ అరుముగన్‌ నిర్మాతలు : విజయ్‌ కిరగందూర్‌, విజయ్‌ సుబ్రహ్మణియన్‌ విలక్షణ నటుడిగా దక్షిణ చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు నటుడు 'ఫహద్‌ ఫాజిల్‌'. హీరో, విలన్‌ అనే భేదాలు లేకుండా తన అద్భుత నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మలయాళంలో అతడు నటించిన 'ధూమం' (Dhoomam) చిత్రం గతేడాది థియేటర్లలో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో తాజాగా ఈ సినిమాను తెలుగు వెర్షన్‌లో ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఆహా వేదికగా జులై 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? ఫహద్‌ ఫాజిల్‌ మరోమారు తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడా? అసలు 'ధూమం' కాన్సెప్ట్ ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి అవినాష్‌ (ఫహాద్‌ ఫాజిల్‌) ఓ సిగరేట్‌ కంపెనీలో పనిచేస్తుంటాడు. సేల్స్‌ హెడ్‌గా తన తెలివితేటలతో అమ్మకాలను అమాంతం పెంచేస్తాడు. కంపెనీ ఎండీ సిధ్‌ (రోషన్‌ మ్యాథ్యు)తో ఓ రోజు అవినాష్‌కు గొడవ జరుగుతుంది. దీంతో జాబ్‌కి రిజైన్‌ చేస్తాడు. ఒక రోజు భార్య దియా (అపర్ణ బాలమురళి)తో కలిసి కారులో వెళ్తుండగా అతడిపై ఓ ముసుగు వ్యక్తి అటాక్‌ చేస్తాడు. భార్యను ఎత్తుకెళ్లి తను చెప్పింది చేస్తే విడిచిపెడతానని వార్నింగ్‌ ఇస్తాడు. ఇంతకీ ఆ ముసుగు వ్యక్తి ఎవరు? అవినాష్‌ ఓ మర్డర్‌ కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు? ముసుగు వ్యక్తికి కంపెనీ ఎండీకి ఏమైనా సంబంధం ఉందా? ఆ ట్రాప్‌ నుండి అవినాష్‌ ఎలా బయటపడ్డాడు? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే 'ధూమం' సినిమాలో ఫహద్‌ ఫాజిల్‌ వన్‌మ్యాన్‌ షో చేశాడు. అవినాష్‌ పాత్రలో పూర్తిగా జీవించేశాడు. భార్యను కాపాడుకునే భర్తగా, తప్పును సరిద్దుకునే వ్యక్తిగా అద్భుత నటన కనబరిచాడు. ఇక దియా పాత్రలో అపర్ణ బాలమురళి ఆకట్టుకుంది. సహజమైన నటనతో మెప్పించింది. అటు నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో రోషన్‌ మ్యాథ్యూ కనిపించాడు. అతడితో పాటు ప్రవీణ్‌గా చేసిన వినీత్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు చక్కటి నటన కనబరిచాడు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే సిగరేటు, పొగాకు ఉత్పుత్తుల వల్ల సమాజానికి జరుగుతున్న నష్టం ఏంటో డైరెక్టర్‌ పవన్‌ కుమార్‌ ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. లాభాల కోసం సిగరేట్‌ కంపెనీలు వేసే ఎత్తులను కళ్లకు కట్టాడు. ఓ ట్రాప్‌లో ఇరుక్కున్న యువకుడు తన భార్యను కాపాడునేందుకు చేసిన పోరాటాన్ని థ్లిల్లింగ్‌గా చూపించాడు. హీరో హీరోయిన్ల ప్రజెంట్‌, పాస్ట్‌ను సమాంతరంగా నడిపిస్తూ అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విరామ సమయానికి ఇచ్చిన ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా విభిన్నమైన క్లైమాక్స్‌తో ముగించిన తీరు మెప్పిస్తుంది. అయితే కమర్షియల్ హంగులు లేకపోవడం, తక్కువ పాత్రలే ఉండటం, సెకండాఫ్‌ మరి నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్‌గా మారింది. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే పూర్ణచంద్ర తేజస్వి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. ఎడిటర్‌ పనితీరు ఓకే. సెకండాఫ్‌ను ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ఫహద్‌ ఫాజిల్‌ నటనసందేశంవిభిన్నమైన క్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ నెమ్మదిగా సాగే కథనంసెకండాఫ్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    జూలై 11 , 2024
    Telugu Movies: ఈవారం (June 23) థియేటర్లు/OTTల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ ఇదే..!
    Telugu Movies: ఈవారం (June 23) థియేటర్లు/OTTల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ ఇదే..!
    పోయిన వీకెండ్.. థియేటర్‌లలో ఆదిపురుష్ హవా కొనసాగింది. ఈ వారం పలు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అలాగే OTT వేదికలపైనా.. కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. 1920 అవికా గోర్ లీడ్‌ రోల్‌లో నటించిన 1920 హారర్స్ ఆఫ్‌ ది హార్ట్ మూవీ జూన్ 23న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విక్రమ్‌భట్ తెరకెక్కించారు. 2008లో విడుదలై హిట్ సాధించిన '1920' సినిమాకు కొనసాగింపుగా '1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్' సీక్వెల్ రానుంది. ఈ చిత్రం విక్రమ్ భట్ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో అవికా గోర్‌తో పాటు రాహుల్ దేవ్, దానిష్ పాండర్, రణధీర్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. ధూమం (Dhoomam) పుష్ప ఫేమ్ ఫహద్‌ఫాజిల్ ముఖ్య పాత్రలో సరికొత్త కథతో ధూమం మూవీ ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని 'యూ టర్న్ దర్శకుడు పవన్ కూమర్ డైరెక్ట్ చేశారు. ఫహద్‌ఫాజిల్ సరసన అపర్ణ బాలమురళి కృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. ధూమం సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తమిల్, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. మనుచరిత్ర మేఘా ఆకాష్(Megha Akash), శివ కందుకూరి(Shiva kandukuri) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మను చరిత్ర'(Manu Charitra). ఈ సినిమా జూన్ 23న థియేటర్లలో విడుదల కానుంది. భరత్ పెదగాని డైరెక్ట్ చేస్తున్నారు. రాన్ సన్ జోసెఫ్, శ్రీనివాస్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తుండగా.. కాజల్ అగర్వల్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, పోస్టర్లు మను చరిత్రపై హైప్‌ను పెంచాయి. భారీ తారా గణం యూత్‌ ఫుల్ లవ్ స్టోరీగా జూన్ 23న అలరించేందుకు వస్తున్న చిత్రం 'భారీ తారాగణం'. ఈ చిత్రంలో సదన్, రేఖా నిరోషా, దీపికా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ ముత్యాల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. BVR పిక్చర్స్ బ్యానర్‌పై బీవీ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంటింటి రామాయణం ఇప్పటికే థియేటర్లలో కామెడీ పంచిన 'ఇంటింటి రామాయణం' చిత్రం.. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో జూన్ 23నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna), నవ్య స్వామి(Navya Swami) లీడ్ రోల్స్‌లో నటించారు.&nbsp; టీకూ వెడ్స్ షేరు ఫస్ట్‌ టైం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి నిర్మిస్తున్న చిత్రం టీకూ వెడ్స్ షేరు(Tiku Weds Sheru). ఈ సినిమాలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui), అవనీత్‌ కౌర్‌ (Avneet Kaur) ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సాయి కబీర్‌ శ్రీవాస్తవ డైరెక్ట్ చేశారు. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 23న నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈనెల 23నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేరళ క్రైమ్ ఫైల్స్(Kerala Crime Files) ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌ మలయాళంలో 'కేరళ క్రైమ్‌ ఫైల్స్‌' అనే కొత్త వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఓ లాడ్జ్‌లో జరిగిన హత్యను ఛేదించడానికి విచారణ చేపట్టిన ఆరుగురు పోలీస్‌ అధికారులు ఏం చేశారు? షిజు, పరయల్‌ వీడు, నీందకర అనే క్లూను వాళ్లు ఎలా ఛేదించారు? అనే కథాంశంగా ఈ సిరీస్ తెరకెక్కింది. లాల్‌, అజు వర్గీస్‌ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 23నుంటి స్ట్రీమింగ్ కానుంది.&nbsp; మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ వారంలో OTTల్లో రిలీజ్ కానున్న మరికొన్ని చిత్రాలు TitleCategoryLanguagePlatformRelease DateTake Care of MayaMovieEnglishNetflixJune 19GlamorousWeb SeriesEnglishNetflixJune 21Sleeping DogWeb SeriesEnglishNetflixJune 22Social CurrencyWeb SeriesHindiNetflixJune 22Kisika Bhai Kisiki JaanMovieHindiZEE5June 23Class of 09&nbsp;Web SeriesEnglishDisney + HotstarJune 19Secret InvasionMovieEnglishDisney + HotstarJune 21The Kerala StoryMovieHindiDisney + HotstarJune 23World's Best&nbsp;MovieEnglishDisney + HotstarJune 23AgentMovieTeluguSony LivJune 23Lions Gate PlayMovieEnglishSony LivJune 23
    జూన్ 19 , 2023
    <strong>Telugu OTT Movies: ‘భారతీయుడు 2’ వచ్చేస్తున్నాడు.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!</strong>
    Telugu OTT Movies: ‘భారతీయుడు 2’ వచ్చేస్తున్నాడు.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత రెండు వారాల్లో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మినహా ఏ కొత్త సినిమా థియేటర్లలోకి రాలేదు. ప్రభాస్‌ చిత్రానికి పోటీగా తమ మూవీని రిలీజ్‌ చేసేందుకు దర్శక నిర్మాతలు సాహసించకపోవడమే ఇందుకు కారణం. అయితే తొలి వారంలోనే కల్కి సినిమాను వీక్షించిన వారు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరో భారీ చిత్రం ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో అలరించనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు భారతీయుడు 2 కమల్‌ హాసన్‌ (Kamal Haasan), డైరెక్టర్‌ శంకర్‌ (Shankar) కాంబోలో పాతికేళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' (Bharateeyudu) చిత్రం సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అవినీతి, లంచగొండతనంపై భారతీయుడు చేసిన పోరాటం అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందింది. 'భారతీయుడు 2' (Bharateeyudu 2 Release Date) టైటిల్‌తో జులై 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో కమల్‌తో పాటు సిద్ధార్థ్‌ (Siddharth), రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), ఎస్‌.జె.సూర్య (S.J Surya), బాబీ సింహా (Bobby Simha), బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని (Samuthirakani) తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సారంగదరియా రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సారంగదరియా’ (Sarangadariya). పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. ఉమాదేవి, శరత్‌చంద్ర నిర్మాతలు. మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. జులై 12న ఈ చిత్రం థియేటర్‌లో విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు మహారాజా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన రీసెంచ్‌ చిత్రం మహారాజా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసింది. జులై 12 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చని పేర్కొంది. విజయ్‌ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రంగా వచ్చిన మహారాజా.. థియేటర్లలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. రూ.100 వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. థియేటర్‌లో ఈ మూవీని చూడలేకపోయినవారు ఓటీటీలో వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు.&nbsp; ధూమం మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) నటించిన చిత్రం ‘ధూమం’. అపర్ణ బాలమురళి కథానాయిక. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రం గతేడాది విడుదలై పర్వాలేదనిపించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ఆహాలో జులై 11వ (Dhoomam Telugu OTT) తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateReceiverSeriesEnglishNetflixJuly 10Wild Wild PunjabMovieHindiNetflixJuly 10Vikings : Wall HallaSeriesEnglishNetflixJuly 11Commander Karan SaxenaSeriesHindiHotstarJuly 8MastermindSeriesEnglishHotstarJuly 10Agni SakshiSerial SeriesTeluguHotstarJuly 12Show TimeSeriesEnglishHotstarJuly 1236 DaysSeriesTelugu/HindiSonyLIVJuly 12Pil&nbsp;MovieHindiJio CinemaJuly 12 గత 15 రోజుల్లో విడుదలైన చిత్రాలు &amp; వెబ్‌ సిరీస్‌లు.. గత 15 రోజుల్లో చాలా చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అయితే కొన్ని మాత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి. అత్యధిక వీక్షణలు సాధిస్తూ ఆయా ఓటీటీ వేదికల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ చిత్రాలు, సిరీస్‌లపై ఓ లుక్కేయండి.&nbsp; TitleCategoryLanguagePlatformMirzapur 3SeriesTelugu/ HindiAmazon PrimeMalayali From IndiaMovieTelugu/ MalayalamSonyLIVFuriosa: A Mad Max SagaMovieEnglish/ TeluguAmazon PrimeSasi MadanamSeriesTeluguETV WinMarket MahalakshmiMovieTeluguAhaBhaje Vayu VegamMovieTeluguNetflixSathyabamaMovieTeluguAmazon PrimeLove MouliMovieTeluguAhaVindu BhojanamMovieTeluguAhaGuruvayoor AmbalanadayilMovieTelugu/ MalayalamAhaAham RebootMovieTeluguAha
    జూలై 08 , 2024
    <strong>Dhoom Dhaam Review: ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అద్దం పట్టిన ‘ధూం ధాం’.. మరి హిట్‌ కొట్టినట్లేనా?</strong>
    Dhoom Dhaam Review: ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అద్దం పట్టిన ‘ధూం ధాం’.. మరి హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు : చేతన్ కృష్ణ, చేతన్ మద్దినేని, వెన్నెల కిషోర్, సాయికుమార్, వినయ్ వర్మ, ప్రవీణ్, నవీన్ నేని, గోపరాజు రమణ తదితరులు. దర్శకత్వం :&nbsp; సాయి కిషోర్ మచ్చా సంగీతం:&nbsp; గోపీ సుందర్&nbsp; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి నిర్మాత : ఎం.ఎస్‌ రామ్ కుమార్&nbsp; విడుదల తేదీ: నవంబర్‌ 8, 2024 చేతన్ మద్దినేని (Chetan Maddineni), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా చేసిన తాజా చిత్రం ‘ధూం ధాం’ (Dhoom Dhaam Review). సాయి కిశోర్ మచ్చ దర్శకుడు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎం.ఎస్ రామ్ కుమార్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పిందించిందా? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; కథేంటి కార్తిక్‌ (చేతన్ మద్దినేని)కు తన తండ్రి రామరాజు (సాయికుమార్‌) అంటే చాలా ఇష్టం. నాన్నపై విపరీతమైన ప్రేమాభిమానాలను చూపిస్తుంటాడు. అటు రామరాజు సైతం కొడుకుపై అంతే ప్రేమ చూపిస్తుంటాడు. ఏ విషయాన్నైనా ఇద్దరు పంచుకుంటారు. ఇదిలా ఉంటే ఓ రోజు సుహానా (హెబ్బా పటేల్‌)ను చూసి కార్తిక్‌ తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ, ఆమె పట్టించుకోదు. కోపంతో పోలాండ్‌కు వెళ్తాడు. అక్కడికి వెళ్లిన సుహానా తిరిగి కార్తిక్‌ ప్రేమను దక్కించుకుంటుంది. మరోవైపు కార్తీక్‌కు సుహానా పెద్దనాన్న (రామరాజు), అతడి తమ్ముడు (బెనర్జి)తో వైరం ఉంటుంది. కార్తీక్‌ను చంపాలని వారు చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? సుహానా ఫ్యామిలీతో కార్తిక్‌కు వైరం ఎందుకు వచ్చింది? కార్తీక్‌ వాటిని ఎలా పరిష్కరించాడు? చివరికీ సుహానా - కార్తిక్‌ ఒక్కటయ్యారా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే హీరో కార్తిక్‌ పాత్రలో చేతన్‌ కృష్ణ పర్వాలేదనిపించాడు. నటన పరంగా గతంతో పోలిస్తే పరిణితి చూపించాడు. అయితే ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలో మరింత వర్క్‌ చేసి ఉంటే బాగుండేది. కీలక సన్నివేశాల్లో అతడి నటన తేలిపోయింది. ఇక హీరోయిన్‌ సుహానా పాత్రలో హెబ్బా పటేల్ ఎప్పటిలాగే మెప్పించింది. చాలా రోజుల తర్వాత కమర్షియల్ పాత్రలో ఆమె ఆకట్టుకుంది. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. వీరిద్దరి జోడి బాగా కుదిరింది. హీరో కజిన్‌గా సుహాస్‌ పాత్రలో వెన్నెల కిషోర్ అదరగొట్టాడు. అతడి కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. వీరితోపాటు సాయికుమార్‌, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్‌, ప్రవీణ్‌, గిరిధర్‌ తదిరులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సాయికిషోర్‌ మచ్చా ఎంచుకున్న కథ సాదాసీదాగా ఉంది. అయితే మంచి రొమాంటిక్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అందించాలనే ప్రయత్నం మాత్రం అభినందనీయం. లవ్‌ట్రాక్‌ ఉన్నా ఎక్కడా వల్గారిటీ లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. తండ్రీ కొడుకుల ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల బాండింగ్‌తో పాటు ఫ్యామిలీ అనుబంధాలను చక్కగా చూపించారు. ఫస్టాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌, వారి మధ్య వచ్చే గొడవలు, అలకలు చూపించారు. ఇవి కాస్త రొటీన్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ప్రవీణ్‌ చేసే కామెడీ రిలీఫ్ ఇస్తుంది. ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌ను ఆసక్తికరంగా మార్చారు డైరెక్టర్‌. హీరోయిన్ ఫాదర్‌ గురించి తెలిసి హీరో షాకవ్వడం, ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సెకండాఫ్‌ మెుత్తాన్ని వెన్నెల కిషోర్‌ తన భుజాలపై నడిపించాడు. స్లో న్యారేషన్‌, గొప్ప క్యాస్టింగ్‌ ఉన్నా సరిగా వాడుకోకపోవడం, అక్కడక్కడ హీరో ఇచ్చే అర్థంకాని ఎక్స్‌ప్రెషన్స్‌ సినిమాకు మైనస్‌గా మారాయి. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాలకు వస్తే గోపి సుందర్‌ అందించిన మ్యూజిక్‌ ప్రధాన అసెట్ అయ్యింది. పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా కొత్త ఫీల్‌ను అందించింది. అలాగే సిద్ధార్థ్‌ రామస్వామి కెమెరా వర్క్‌ మెప్పించింది. విజువల్స్‌ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎడిటిర్‌ సినిమాను మరింత షార్ట్‌గా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వెన్నెల కిషోర్ కామెడీఫ్యామిలీ ఎమోషన్స్సంగీతం మైనస్ పాయింట్స్‌ రొటీన్ స్టోరీరెగ్యులర్‌ లవ్‌ట్రాక్‌స్లో న్యారేషన్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 08 , 2024
    <strong>Surya In Dhoom 4: షారుక్‌కి విలన్‌గా సూర్య.. బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత ఖాయమేనా!</strong>
    Surya In Dhoom 4: షారుక్‌కి విలన్‌గా సూర్య.. బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత ఖాయమేనా!
    బాలీవుడ్‌లో వచ్చిన యాక్షన్‌ చిత్రాల సిరీస్‌లో 'ధూమ్‌' (Dhoom)కి ప్రత్యేక స్థానం ఉంది. 2004లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే పలు సీక్వెల్స్‌ వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద అవన్నీ సూపర్‌ హిట్స్‌ అందుకున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో ‘ధూమ్‌ 4’ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణసంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ (Yash Raj Films) ఈమేరకు సన్నాహాలు కూడా మెుదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సూర్య ఈ చిత్రంలో నటించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.&nbsp; సూర్య పాత్ర అదే? హిందీలో వచ్చిన ధూమ్‌, ధూమ్‌ 2, ధూమ్‌ 3 చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. త్వరలోనే 'ధూమ్‌ 4' పట్టాలెక్కించేందుకు నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ సన్నాహాలు చేస్తోంది.&nbsp; ‘ధూమ్‌, పార్ట్‌ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే (Aditya chopra) ఈ సినిమాకీ వర్క్‌ చేస్తున్నారని సమాచారం. ఇందులో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కోలీవుడ్‌ నటుడు సూర్యను అతడికి ప్రతినాయకుడిగా తీసుకోవాలని చిత్ర వర్గాలు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే సూర్యను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోల్‌లో యాక్ట్‌ చేేసేందుకు ఆయన ఆసక్తి చూపారని టాక్‌. దీంతో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సూర్య ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.&nbsp; రోలెక్స్‌గా మార్క్‌! కమల్‌ హాసన్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్ట చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. డ్రగ్స్‌ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో తమిళనటుడు విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు. మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే క్లైమాక్స్‌లో డ్రగ్‌ డీలర్లకు హెట్‌గా సూర్య కనిపించిన సర్‌ప్రైజ్‌ చేశారు. రోలెక్స్‌ పాత్రలో అతడి లుక్‌ ఎంతో క్రూరంగా కనిపించింది. 'విక్రమ్ 2' చిత్రంలో సూర్య విలన్‌ పాత్రలో కనిపించనున్నట్లు ఈ క్లైమాక్స్‌ ద్వారా డైరెక్టర్‌ స్పష్టం చేశారు. అంతకుముందు ‘24’ చిత్రంలోనూ సూర్య విలన్‌గా చేశాడు. ఇందులో రెండు పాత్రలు పోషించగా అందులో ఒకటి నెగిటివ్‌ రోల్. చరణ్‌కు విలన్‌గా సూర్య! గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ (Ram Charan), తమిళ స్టార్‌ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ రాబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్‌ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో హను రాఘవపూడి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ సినిమా తర్వాతే రామ్‌-సూర్య సినిమాలు పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; 12 వేల థియేటర్లలో ‘కంగువా’! సూర్య ప్రస్తుతం 'కంగువా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ సూర్య కెరీర్‌లో 42వ ప్రాజెక్ట్‌గా రానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్ట‌ర్‌లు విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర‌బృందం ప్రకటించింది. అయితే దసరాకు కాకుండా నవంబర్‌ 15న కంగువాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ప్రపంచ వ్యాప్తంగా 10భాషల్లో 12 వేల థియేటర్లలో దీన్ని రిలీజ్‌ చేయాలని నిర్ణయించారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.
    సెప్టెంబర్ 16 , 2024
    రియల్‌ లైఫ్‌ క్రైమ్స్‌కు స్ఫూర్తినిచ్చిన 10 సినిమాలు/వెబ్‌ సిరీస్‌లు
    రియల్‌ లైఫ్‌ క్రైమ్స్‌కు స్ఫూర్తినిచ్చిన 10 సినిమాలు/వెబ్‌ సిరీస్‌లు
    ]జాన్‌ అబ్రహం, అభిషేక్ బచ్చన్‌ ‘ధూమ్‌’ సినిమా స్ఫూర్తితో కేరళలో నలుగురు యువకులు బ్యాంక్‌ చోరీకి ప్లాన్‌ చేశారు. ఈ నలుగురు బైకర్స్‌ను పోలీసులు చేజ్‌ చేసి పట్టుకున్నారు.ధూమ్‌
    ఫిబ్రవరి 14 , 2023
    <strong>Vikrant Massey Net worth: సినిమా కెరీర్‌లో విక్రాంత్‌ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా?&nbsp;</strong>
    Vikrant Massey Net worth: సినిమా కెరీర్‌లో విక్రాంత్‌ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా?&nbsp;
    బాలీవుడ్‌ యంగ్‌ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 37 ఏళ్ల ఈ టాలెంటెడ్‌ నటుడు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవలే ‘12th ఫెయిల్‌’ చిత్రంతో విక్రాంత్‌ మాస్సే పేరు మార్మోగింది. ఈ చిత్రం పలు అవార్డులను సైతం కొల్లగొట్టింది. దీంతో బాలీవుడ్‌లో విక్రాంత్‌కు ఒక్కసారిగా ఆఫర్లు పెరిగాయి. చేతినిండా ప్రాజెక్ట్స్‌తో అతడు బిజీగా మారిపోయారు. అలాంటి సమయంలో సినిమాలకు బిగ్‌ బ్రేక్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.&nbsp; కారణం ఏంటంటే? సినిమాలకు కొంత కాలం బ్రేక్‌ ఇస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విక్రామ్‌ మాస్సే (Vikrant Massey Net worth) ప్రకటించాడు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులు చూపిస్తున్న అసాధారణ ప్రేమ, అభిమానానికి విక్రాంత్‌ థ్యాంక్స్‌ చెప్పారు. ఇకపై కుటుంబ సభ్యులకు టైమ్‌ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. అందుకే ఇకపై కొత్త ప్రాజెక్ట్స్‌ అంగీకరించనని స్పష్టం చేశారు. 2025లో విడుదలయ్యే చిత్రమే తన చివరిదని స్పష్టం చేశాడు. ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలంటూ తన నోట్‌ను ముగించాడు. అయితే విక్రాంత్‌ నిర్ణయాన్ని ఆయన అభిమానులు తీసుకోలేకపోతున్నారు. మరోసారి ఆలోచించుకోవాలని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు సాగమని సూచిస్తున్నారు.&nbsp; విక్రాంత్‌ సినీ నేపథ్యం సినిమాలకు బ్రేక్‌ ఇవ్వడంతో విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అతడి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. విక్రాంత్‌ (Vikrant Massey) 1987 ఏప్రిల్‌ 3న ముంబయిలో జన్మించాడు. అక్కడి ఆర్‌.డి. నేషనల్‌ కాలేజీలో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశాడు. 2007లో వచ్చిన 'ధూమ్‌ మచావో ధూమ్‌' సీరియల్‌తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ధరమ్‌ వీర్‌ (2008), ‘బాలిక వధు’, ‘కుతుబ్‌ హై’ సీరియల్స్‌లో చేశాడు. 2013లో వచ్చిన ‘లూతేరా’ ఫిల్మ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా బ్రేక్‌ రాలేదు. 2018లో వచ్చిన 'మీర్జాపుర్‌' సిరీస్‌ నటుడిగా అతడికి గుర్తింపు తెచ్చిపెట్టింది. గతేడాది చేసిన '12th ఫెయిల్‌' మూవీ విక్రాంత్‌ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఏడాది వచ్చిన 'సెక్టార్‌ 36' ఫిల్మ్‌ సైతం నటుడిగా విక్రాంత్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఈ ఏడాదే వచ్చిన 'ది సబర్మతి రిపోర్ట్‌' సైతం విక్రాంత్‌కు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో 'యార్‌ జిగ్రి', 'టీఎంఈ', 'అన్‌కౌన్‌ కి గుస్తాఖియాన్‌' ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. కొడుకు కోసం స్పెషల్ టాటూ! విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) కుటుంబానికి చాలా విలువ ఇస్తాడు. బాలీవుడ్‌ నటి షీతల్‌ థాకూర్‌ (Sheetal Thakur) ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2022 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున తొలుత రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 18న కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. విక్రాంత్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబు పుట్టాడు. అతడికి వర్ధన్ పేరు పెట్టాడు. కొడుకుపై ప్రేమకు గుర్తుగా చేతిపై పుట్టిన తేదీతో సహా వర్ధన్‌ అనే పేరును టాటూ వేసుకున్నాడు. దీన్ని బట్టి కుటుంబానికి, కుమారుడికి విక్రాంత్ ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అర్థమవుతుంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్‌ ఉండటంతో వారితో సమయం గడపడం కుదరట్లేదని సినిమాలకు లాంగ్‌ బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆ హీరోయిన్‌కు బిగ్‌ ఫ్యాన్‌ విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey) ఇష్టా ఇష్టాలకు వస్తే బాలీవుడ్‌లో అతడికి చాలా మంది ఫేవరేట్ హీరోలు ఉన్నారు. అజయ్‌ దేవగన్‌, కె.కె. మీనన్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, పంకజ్‌ కపూర్‌ తన అభిమాన నటులని విక్రాంత్‌ చెబుతుంటాడు. అయితే హీరోయిన్‌ విషయంలో మాత్రం విక్రాంత్‌కు చాలా స్పష్టత ఉంది. ప్రముఖ నటి టబు విక్రాంత్‌కు ఫేవరేట్ యాక్ట్రెస్‌. అటు ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ (1999), ‘వాస్తవ్‌’ (1999), ‘యువ’ (2004) చిత్రాలు విక్రాంత్‌కు ఆల్‌టైమ్‌ ఫేవరేట్ అని చెప్పవచ్చు. స్పోర్ట్స్‌ విషయానికి వస్తే క్రికెట్‌ను విక్రాంత్‌ బాగా ఇష్టపడతాడు. ఫుడ్‌ విషయానికి వస్తే రాజ్మా చావల్‌, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్‌ తింటాడు. డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌, క్రికెట్‌ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్‌ చేయడం వంటివి విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు. ఫుడ్‌ విషయానికి వస్తే రాజ్మా చావల్‌, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్‌ తింటాడు. డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌, క్రికెట్‌ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్‌ చేయడం విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు.&nbsp; విక్రాంత్‌ ఆస్తుల విలువ ఎంతంటే? విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) 2007 నుంచే నటన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో మాత్రం ఆస్తులు కూడబెట్టలేకపోయాడు. వాస్తవానికి ‘12th ఫెయిల్‌’ (2023) చిత్రం తర్వాతే రెమ్యూనరేషన్‌ భారీగా పెరిగిందని చెప్పవచ్చు. ఆ సినిమాకు ముందు వరకూ రూ.30-40 లక్షలు మాత్రమే తీసుకున్న విక్రాంత్‌, ప్రస్తుతం రూ.2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అతడి నెట్‌ వర్త్‌ రూ.20-26 కోట్ల వరకూ ఉండొచ్చని బాలీవుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అతడికి రూ.60 లక్షలు విలువైన Volvo S90 కారు, డుకాటి మాన్‌స్టర్ (రూ.12 లక్షలు), మారుతీ సుజుకీ డిజైర్‌ (రూ.8.4లక్షలు) ఉన్నాయి. అలాగే ముంబయిలో సొంతిల్లు కూడా ఉన్నట్లు సమాచారం.&nbsp;
    డిసెంబర్ 02 , 2024
    <strong>OTT Releases Telugu: ఈ వారం వచ్చేస్తోన్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!</strong>
    OTT Releases Telugu: ఈ వారం వచ్చేస్తోన్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    దీపావళి సందర్భంగా ‘క’, ‘లక్కీ భాస్కర్‌’, ‘అమరన్‌’ వంటి ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఈ వారం కూడా అదే తరహాలో ఎంటర్‌టైన్‌ చేసేందుకు పలు సినిమాలు రెడీ అయ్యాయి. అయితే ఈసారి చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ బరిలో దిగబోతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర మూవీస్‌, వెబ్‌సిరీస్‌ రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo) యంగ్ హీరో నిఖిల్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo). నిఖిల్‌తో ‘స్వామిరారా’, ‘కేశవ’ తీసిన దర్శకుడు సుధీర్‌ వర్మ ఈ సినిమా రూపొందించారు. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. రుక్మిణీ వసంత్‌ కథానాయిక. దివ్యాంశ కౌశిక్‌ కీలక పాత్ర పోషించింది. నవంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.&nbsp; ధూం ధాం (Dhoom Dhaam) చేతన్ కృష్ణ (Chethan Krishna), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా చేసిన తాజా చిత్రం ‘ధూం ధాం’ (Dhoom Dhaam). సాయి కిశోర్ మచ్చ దర్శకుడు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎం.ఎస్ రామ్ కుమార్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. జితేందర్‌రెడ్డి (Jithender Reddy) రాకేశ్‌ వర్రే కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ పొలిటికల్‌ యాక్షన్‌ చిత్రం ‘జితేందర్‌రెడ్డి’ (Jithender Reddy). ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్‌ ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ ఈ సినిమాను రూపొందించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8నప్రేక్షకుల ముందుకు రానుంది. బ్లడీ బెగ్గర్‌ (Bledy Beggar)&nbsp; ఈ వారం ఓ తమిళ డబ్బింగ్‌ ఫిల్మ్‌ కూడా థియేటర్లలోకి రాబోతోంది. ఇటీవల దీపావళికి విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ‘బ్లడీ బెగ్గర్‌’ (Bledy Beggar) చిత్రాన్ని నవంబర్‌ 7న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కవిన్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి శివ బాలన్‌ ముత్తుకుమార్‌ దర్శకత్వం వహించారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ నిర్మించారు.&nbsp; జాతర (Jathara) సతీష్‌బాబు రాటకొండ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జాతర’ (Jathara). రాధాకృష్ణారెడ్డి, శివశంకర్‌ రెడ్డి నిర్మాతలు. నవంబర్‌ 8న ఈ మూవీ బాక్సాఫీస్‌ ముందుకు రానుంది. చిత్తూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌ డ్రామా చిత్రంగా దీనిని రూపొందించినట్లు మేకర్స్‌ తెలియజేశారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు దేవర (Devara) జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ సుమారు 40 రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం (నవంబర్ 8) నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం.&nbsp; వేట్టయన్ (Vettaiyan) రజనీకాంత్ (Rajinikanth), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నటించిన తమిళ హిట్ మూవీ వేట్టయన్ కూడా ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 8) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ సినిమాలో రజనీ, అమితాబ్‌తోపాటు రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ కీలక పాత్రలు చేశారు. ఏఆర్ఎం (ARM) మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏఆర్‌ఎం’ (ARM). ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ మూవీ నవంబర్ 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం. సిటడెల్: హనీ బన్నీ (Citadel: Honey Bunny) సమంత (Samantha), వరుణ్ ధావన్ (Varun Dhawan) నటించిన మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ 'సిటడెల్: హనీ బన్నీ'. ఈ సిరీస్‌ ఈ వారమే ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అమెజాన్‌ వేదికగా నవంబర్‌ 7 నుంచి స్టీమింగ్ కాబోతోంది. హిందీతోపాటు తెలుగులోనూ ఈ వెబ్‌సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సిరీస్‌పై అంచనాలను అమాంతం పెంచేసింది.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateMeet Me Next ChristmasMovieEnglishNetflixNov 6Outer Banks 4SeriesEnglishNetflixNov 7Mr. PlanktonMovieEnglish/ KoreanNetflixNov 8The Buckingham MurdersMovieHindiNetflixNov 8Vijay 69MovieHindiNetflixNov 8Its end with usMovieEnglishNetflixNov 9Countdown: Paul vs. TysonSeriesTelugu DubAmazon&nbsp;Nov 1Investigation AllienSeriesEnglishAmazon&nbsp;Nov 8Despicable Me 4MovieTeluguJio CinemaNov 5Explorer: EnduranceMovieEnglishHotstarNov 3Janaka Ithe GanakaMovieTeluguAhaNov 8
    నవంబర్ 04 , 2024
    <strong>Kanguva Movie: ‘కంగువా’ టీమ్‌ వినూత్న నిర్ణయం.. ఇది కదా టెక్నాలజీని వాడుకోవడం అంటే!</strong>
    Kanguva Movie: ‘కంగువా’ టీమ్‌ వినూత్న నిర్ణయం.. ఇది కదా టెక్నాలజీని వాడుకోవడం అంటే!
    సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). శివ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఏఐ (ఆర్టిఫిషయల్‌ ఇండిలిజెన్స్‌)తో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఏఐతో డబ్బింగ్‌ ‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్‌ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్‌ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్‌’లో అమితాబ్‌బచ్చన్‌ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్‌ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు. చైనీస్‌, జపనీస్‌ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు.&nbsp; రూ.1000 కోట్ల లక్ష్యం! రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ సాధించడమే లక్ష్యంగా 'కంగువా'ను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత జ్ఞానవేల్‌ చెప్పారు. పార్ట్‌ 2, పార్ట్‌ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పారు. తొలి భాగం విజయం సాధిస్తే మిగితా భాగాలను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ నటించింది. యానిమల్‌ ఫేమ్‌ బాబీ డియోల్‌ విలన్‌ పాత్ర పోషించాడు. కంగ అనే ఓ పరాక్రముడి పాత్రలో సూర్య కనిపించనున్నాడు.&nbsp; ధూమ్‌ 4 విలన్‌గా సూర్య! హిందీలో వచ్చిన ధూమ్‌, ధూమ్‌ 2, ధూమ్‌ 3 చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. త్వరలోనే 'ధూమ్‌ 4' పట్టాలెక్కించేందుకు నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ సన్నాహాలు చేస్తోంది. ‘ధూమ్‌, పార్ట్‌ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే (Aditya chopra) ఈ సినిమాకీ వర్క్‌ చేస్తున్నారని సమాచారం. ఇందులో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కోలీవుడ్‌ నటుడు సూర్యను అతడికి ప్రతినాయకుడిగా తీసుకోవాలని చిత్ర వర్గాలు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే సూర్యను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ రోల్‌లో యాక్ట్‌ చేేసేందుకు సూర్య ఆసక్తి చూపారని కూడా టాక్‌ వినిపించింది. దీంతో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సూర్య ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.&nbsp; రోలెక్స్‌గా మార్క్‌! కమల్‌ హాసన్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్‌ చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. డ్రగ్స్‌ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు. మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే క్లైమాక్స్‌లో డ్రగ్‌ డీలర్లకు హెడ్‌గా సూర్య కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. రోలెక్స్‌ పాత్రలో అతడి లుక్‌ ఎంతో క్రూరంగా కనిపించింది. 'విక్రమ్ 2' చిత్రంలో సూర్య విలన్‌ పాత్రలో కనిపించనున్నట్లు ఈ క్లైమాక్స్‌ ద్వారా డైరెక్టర్‌ స్పష్టం చేశారు. అంతకుముందు ‘24’ చిత్రంలోనూ సూర్య విలన్‌గా చేశాడు. ఇందులో రెండు పాత్రలు పోషించగా అందులో ఒకటి నెగిటివ్‌ రోల్.
    అక్టోబర్ 14 , 2024
    <strong>Devara Record: విదేశాల్లో చరిత్ర సృష్టించిన ‘దేవర’.. ఫస్ట్ ఇండియన్‌ మూవీగా మరో రికార్డు!</strong>
    Devara Record: విదేశాల్లో చరిత్ర సృష్టించిన ‘దేవర’.. ఫస్ట్ ఇండియన్‌ మూవీగా మరో రికార్డు!
    యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రం కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. మరో రెండ్రోజుల్లో సెప్టెంబర్‌ 27న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్‌ నటించింది. బాలీవుడ్‌ స్టార్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఈ సినిమాలో విలన్‌ పాత్ర పోషించారు. దీనికి తోడు తారక్‌ ద్విపాత్రాభినయం చేస్తుండటంతో ఈ సినిమా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే రిలీజ్‌కు ముందే దేవర పలు రికార్డులను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. తాజాగా తన పేరిట మరో రికార్డును లిఖించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ సినిమాగా నిలిచింది.&nbsp; ఆ రెండు దేశాల్లో అరుదైన ఘనత ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘దేవర’ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ యాక్షన్‌ డ్రామా తాజాగా మరో ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్‌మోస్‌ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ (Devara) నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్స్‌లో, న్యూజిలాండ్‌లో 3 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఇటీవలే నార్త్‌ అమెరికా టికెట్ల ప్రీసేల్‌లో దేవర రికార్డు సృష్టించింది. ప్రీ సేల్‌ టికెట్ల విక్రయాల్లో అత్యంత వేగంగా 1 మిలియన్‌ డాలర్ల మార్క్‌ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.&nbsp; బాహుబలి స్థాయిలో క్లైమాక్స్‌ ‘దేవర’ సినిమాలో చివరి 40 నిమిషాలు హైలైట్‌ అని ఎన్టీఆర్‌ (NTR) ఇటీవల స్వయంగా చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్‌ దేవర క్లైమాక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు మాట్లాడుతూ దేవర క్లైమాక్స్‌ బాహుబలిని పోలి ఉంటుందని తెలిపారు.&nbsp; ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్‌గా మారింది. మరోవైపు ఈ మూవీపై వస్తోన్న ఫేక్‌ న్యూస్‌పైనా రత్నవేలు స్పందించారు. ఇందులో తారక్‌ మూడు పాత్రలు పోషించారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.&nbsp; ఫ్యాన్స్‌కు నాగవంశీ రిక్వెస్ట్‌ దేవర డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన నిర్మాత నాగవంశీ అభిమానులకు ఎక్స్‌ వేదికగా ఓ రిక్వెస్ట్‌ చేశారు. ఈ సినిమాతోనైనా ఫ్యాన్‌ వార్‌కు ముంగింపు పలకాలని కోరారు. అలాగే ఫస్ట్‌ స్క్రీనింగ్‌లో సినిమా చూసే వారు సినిమాకు సంబంధించిన సీన్లను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టవద్దని కోరారు. మీ తర్వాత చూసే అభిమానులూ సినిమాని ఎంజాయ్‌ చేయనివ్వాలని విజ్ఞప్తి చేశారు. తారక్‌ అన్నకు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్ అందిద్దామని పిలుపునిచ్చారు. పోస్ట్ చివర్లో 'దేవర సెప్పిండు అంటే సేసినట్టే' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. నాగవంశీ విజ్ఞప్తిని నెటిజన్లు స్వాగతిస్తున్నారు.&nbsp; https://twitter.com/vamsi84/status/1838795481406726608 రన్‌టైమ్‌లో మార్పులు ‘దేవర’ (Devara) సినిమా నిడివిలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్‌ బోర్డు ఫైనల్‌ చేసిన నిడివిలో దాదాపు 7 నిమిషాలు ట్రిమ్‌ చేసినట్లు సమాచారం. 170.58 నిమిషాల (2: 50 గంటలు) రన్‌టైమ్‌తో (Devara Movie RunTime) ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.&nbsp; సురక్షిత ప్రయాణ సందేశం, ధూమపానం హెచ్చరికలాంటివి మినహాయిస్తే ఈ మూవీ లెంగ్త్‌ 2:42 గంటలుగా ఉండనుంది. సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసిన ఈ సినిమా నిడివి ఇంతకుముందు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు ఉంది. ప్రాధాన్యం లేని సన్నివేశాలను తీసివేసినట్లు తెలుస్తోంది.&nbsp; టికెట్ల రేటు పెంపు తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర టికెట్ల ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లపై రూ.25 , మల్టీప్లెక్స్‌ల‌లో టికెట్ రేట్లపై రూ .50 ల పెంచుకోవ‌చ్చ‌ని తెలిపింది. అంతేకాకుండా సెప్టెంబరు 27 న 29 థియేటర్ల‌లో మిడ్ నైట్ 1గం.కు బెనిఫిట్ షోస్‌కు, అదేవిధంగా ఉదయం 4 గంటలకు రాష్ట్రంలోని అన్ని థియేటర్ల‌లో స్పెషల్ షోస్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాకుండా తొలిరోజున వేసే అన్ని షోలపై రూ.100 పెంచుకోవచ్చని సూచించింది. అటు ఏపీ ప్రభుత్వం టికెట్‌పై రూ.60 నుంచి రూ.135 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.&nbsp; మొదటి రోజు ఆరు షో లు.. అక్టోబరు 9వరకూ ఐదు షోల చొప్పున ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పించింది. దేవర ప్రీ-రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు విక్రయించారని అంటున్నారు. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్​లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్​లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్‌ వసూలు చేస్తే బ్రేక్‌ ఈవెన్ అవుతుంది.&nbsp;
    సెప్టెంబర్ 25 , 2024
    <strong>OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!</strong>
    OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!
    సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు స్మాల్‌ హీరోల సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు&nbsp; భలే ఉన్నాడే (Bhale Unnade) రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఇందులో మనీషా కంద్కూర్‌ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్‌ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్‌ సమర్పణలో రవికిరణ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మత్తు వదలరా 2 (Mathu Vadalara 2) శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది.&nbsp; ధూం ధాం (Dhoom Dhaam) చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్‌ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీమోహన్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. రామ్‌కుమార్‌ నిర్మాత. సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, గోపీమోహన్‌ కథ ఆకట్టుకుంటుందని నిర్మాత ఎం.ఎస్‌.రామ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్‌ సంగీతం సమకూర్చారు.&nbsp; ఉత్సవం (Utsavam) దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్‌ తెలిపారు.&nbsp; ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu) మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ 'కమిటీ కుర్రోళ్లు'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టింది. ఇందులో సందీప్ సరోజ్, పి సాయి కుమార్, గోపరాజు రమణ, శరణ్య సురేష్, యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) రవితేజ, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబోలో రూపొందిన లేటెస్ట్‌ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 2018లో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్ దేవగన్ నటించిన 'రైడ్'కి రీమేక్‌గా ఇది రూపొందింది. పంద్రాగస్టు రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో సెప్టెంబర్‌ 12న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఓటీటీలోకి రాబోతోంది. ఇందులో రవితేజతో పాటు భాగ్యశ్రీ బోర్సే. జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఆయ్‌ (Aay) నార్నే నితిన్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘ఆయ్‌’ (Aay). తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఆగస్టు 15 విడుదలైన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకొని సినీ తారల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా సెప్టెంబర్ 12 నుంచి ప్రసారం కానుంది.&nbsp; తలవన్‌ (Thalavan) జిస్‌ జాయ్‌ దర్శకత్వంలో బిజు మేనన్‌, ఆసిఫ్‌ అలీ నటించిన మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘తలవన్‌’. మేలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సెప్టెంబర్ 12 నుంచి ‘సోనీలివ్‌’(SonyLIV)లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ ఇలా మొత్తం ఏడు భాషల్లో సినిమాను వీక్షించవచ్చు. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateSector 36MovieHindiNetflixSept 13Breaking Down The WallDocumentaryEnglishNetflixSept 12Emily In Paris S4SeriesEnglishNetflixSept 12Midnight At The Pera Palace S2SeriesEnglishNetflixSept 12Uglies&nbsp;MovieEnglishNetflixSept 13ThangalaanMovieTelugu/TamilNetflixSept 20The Money GameDocumentaryEnglishAmazonSept 10Stree 2MovieHindiAmazonSept 27BerlinMovieHindiZee 5Sept 13NunakijiMovieMalayalamZee 5Sept 13Bench LifeSeriesTeluguSonyLIVSept 12Goli Soda RaisingMovieTamilHotstarSept 13How To Die AloneMovieEnglishHotstarSept 13In Vogue: The 90sDocumentaryEnglishHotstarSept 13Kalbali RecordsMovieHindiHotstarSept 12Late Night With DevilMovieEnglishLions GateSept 13VisfotMovieTeluguJio CinemaSept 7
    సెప్టెంబర్ 09 , 2024
    Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
    Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
    ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; సరిపోదా శనివారం నాని హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్‌ రిలీజైంది. ప్రముఖ నటుడు సాయికుమార్‌ నానితో పాటు ఈ పోస్టర్‌లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్‌ కానున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.&nbsp; RT 75 ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. తన తర్వాతి ప్రాజెక్టును ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్‌ మౌళి ప్రముఖ నటుడు నవదీప్ (Navdeep) హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ ట్రైలర్‌ వీక్షకులను ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/i/status/1777920829575078381 అరణ్మనై 4&nbsp; రాశీ ఖన్నా (Rashi Khanna), తమన్నా (Tamannaah), సుందర్. సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరణ్మనై 4’ (Aranmanai 4) చిత్రం నుంచి కూడా ఉగాది కానుకగా ఓ పోస్టర్‌ విడుదలైంది. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్‌ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. కమిటీ కుర్రోళ్లు నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్‌ నెం.1 చిత్రానికి ఉగాది సందర్భంగా టైటిల్‌ ఎనౌన్స్ చేశారు. 'కమిటీ కుర్రోళ్లు' అనే పేరును ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను సుప్రీమ్‌ హీరో సాయి దుర్గా తేజ్‌ అనౌన్స్‌ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు యదు వంశీ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. https://twitter.com/i/status/1777941376782786758 ధూం ధాం చైతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ (Hebha Patel) జంటగా నటిస్తున్న 'ధూం ధాం' (Dhoom Dhaam) చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కనిపించింది. ఈ మూవీని దర్శకుడు సాయి కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు.&nbsp; ఏ మాస్టర్‌ పీస్‌&nbsp; సుకు పూర్వజ్‌ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్‌ పీస్‌' (A Master Peace). అరవింద్‌ కృష్ణ, జ్యోతి పుర్వాజ్‌, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పండగ సందర్భంగా పోస్టర్‌ రిలీజైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేవకి నందన వాసుదేవ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్‌ గల్లా (Ashok Galla) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vaasudeva). మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇందులో అశోక్‌ గల్లా లుక్ ఆకట్టుకుంటోంది. భలే ఉన్నాడే! యువ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tharun) హీరోగా రూపొందుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి ఓ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో రాజ్‌ తరుణ్‌ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించాడు.&nbsp; ప్రతినిధి 2 నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Pratinidhi 2). ఈ మూవీ పోస్టర్‌ కూడా ఉగాది సందర్భంగా విడుదలై సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.&nbsp; కృష్ణమ్మ&nbsp; సత్యదేవ్‌ (Satya Dev) లేటెస్ట్‌ మూవీ ‘కృష్ణమ్మ’ (Krishnamma) నుంచి ఉగాది సందర్భంగా ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీలోని దుర్గమ్మ పాటను ఏప్రిల్‌ 11న ఉ.11.11 గం.లకు రిలీజ్‌ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో సత్యదేవ్‌ త్రిశూలం పట్టుకొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు.&nbsp;
    ఏప్రిల్ 10 , 2024
    Telangana Folk Singers: తెలంగాణలో గద్దర్ లాంటి విప్లవ కళాకారులు ఉన్నారా?
    Telangana Folk Singers: తెలంగాణలో గద్దర్ లాంటి విప్లవ కళాకారులు ఉన్నారా?
    ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇటీవల కన్నుమూశారు. విప్లవానికి కళం, గళం తోడైతే అది గద్దర్‌లా ఉంటుంది. గద్దరన్న ఎన్నో పాటలతో జాతిని జాగృతం చేశాడు. ఆయన చూపించిన విప్లవ పంథా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. గద్దరన్నతో పాటు ఎంతో మంది విప్లవ కళాకారులు ప్రజలను ఏకం చేసేందుకు ప్రయత్నించారు. పాట, ఆట రూపంలో ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించిన వారున్నారు. మరి, ఆ కళాకారులు ఎవరో తెలుసుకుందాం.&nbsp;&nbsp; ఎపూరు సోమన్న అయోధ్య అంటే గుర్తొస్తడు రామన్న. పల్లె పాట అంటే యాదికొస్తడు ఏపూరు సోమన్న. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం వెలిశాలలో జన్మించాడు ఏపూరు సోమన్న. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినా నానమ్మ సంరక్షణలో పెరిగాడు. సోమన్న పాటలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఏ పాట పాడినా అది శ్రోతలను ఆకట్టుకుంటుంది. పాటే తన జీవితంగా బతుకుతున్నాడు. ‘జోరు సాగుతుందిరా కొడకా.. తెలంగాణ హోరు సాగుతుందిరా’, ‘ఎవడిపాలైందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నాడురో తెలంగాణ?’ అంటూ రాగమెత్తితే ఉద్యమ స్ఫూర్తి&nbsp; రగలాల్సిందే.&nbsp; https://www.youtube.com/watch?v=JigfoYaKt5Y&amp;t=33s గోరేటి వెంకన్న గోరేటి వెంకన్న కవి, గాయకుడు. ప్రస్తుతమున్న నాగర్ కర్నూల్ జిల్లా గౌరారంలో జన్మించాడు గోరేటి వెంకన్న. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది’ అంటూ తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించాడు. వివిధ సినిమాల్లో పాటలు రాసి కుబుసం సినిమాలోని ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అంటూ గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించాడు. వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ లభించింది. ప్రస్తుతం వెంకన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=kU344_l7S-U&amp;t=4s రసమయి బాలకిషన్ గజ్జె కట్టి, మైకు పట్టి.. గొంతెత్తి కాలు కదిపిన రసమయి బాలకిషన్ విప్లవ కళాకారుడే. రసమయి సిద్దిపేట జిల్లాలోని రావురూకులలో జన్మించాడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. ‘తెలంగాణ ధూం ధాం’ కార్యక్రమానికి పురుడు పోసింది రసమయినే. ‘ఓ యమ్మ నా పల్లె సీమ.. ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామా?’ అంటూ ఎన్నో పాటలకు జీవం పోశాడు. తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి ప్రజలను ఏకం చేశాడు.&nbsp; Oyamma Telangana- Rasamayi Balakishan Telangana Song || Folk Song Telugu || Folk songs ఆర్.నారాయణమూర్తి సామాజిక కళాకారుడిగా ఆర్ నారాయణ మూర్తి అందరికీ సుపరిచితం. క్రోనీ క్యాపిటలిజం, నిరుద్యోగిత, సామాజిక సమస్యలపై తన గళం విప్పిన వ్యక్తి. తన సినిమాలతో వివిధ అంశాలను స్పృశిస్తూ ప్రజలను మేల్కొలిపాడు. అందుకే ఈయణ్ను పీపుల్స్ స్టార్ అని పిలుస్తుంటారు. నటుడిగా, గాయకుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా సేవలు అందించాడు. ఎన్నో సినిమాలను తీశాడు. ‘బంజారే బంజో’, ‘ఆపుర రిక్షోడా’, ‘ఎర్ర జెండ.. ఎర్ర జెండ’ వంటి పాటలతో పోరాట స్ఫూర్తిని రగిల్చాడు.&nbsp; https://www.youtube.com/watch?v=pwV92lAeq_w&amp;t=1119s విమలక్క భువనగిరి జిల్లా ఆలేరులో జన్మించింది విమలక్క. తెలంగాణను జాగృతం చేసే ఎన్నో పాటలను పాడింది. ‘అసైదులా హారతి’, ‘పల్లె పల్లెనా’, ‘ఏడు గడిసి పాయె.. దినము ఒడిసి పాయె’ వంటి పాటలను పాడి ప్రజల మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది. మానవ హక్కుల సంరక్షణకు కదం తొక్కారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కళాకారులతో కలిసి కార్యక్రమాలను నిర్వహించినందుకు నాలుగు నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించింది.&nbsp; https://www.youtube.com/watch?v=e33k9zFzk18&amp;t=5s బెళ్లి లలిత&nbsp; ‘తెలంగాణ గాన కోకిల’గా బిరుదు పొందిన బెళ్లి లలిత ఉద్యమ కళాకారిణి. అణచివేతకు, అధికారానికి వ్యతిరేకంగా గొంతెత్తి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వనిత. తెలంగాణ కళా సమితి వ్యవస్థాపకురాలు. నాడు ఈమె ఎలుగెత్తిన తీరుకు అధికార నేతలే హడలిపోయారు. ప్రజలను సంఘటితం చేయడాన్ని చూసి వణికిపోయారు. &nbsp;సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. అయితే, పుట్టిన భువనగిరిలోనే లలితక్కను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి 18 ముక్కులుగా నరికేశారు. ఈమె మరణంపై ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నాయి.&nbsp; https://www.youtube.com/watch?v=wLsc-0JvUf4 పయిలం సంతోష్&nbsp;&nbsp; తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా పనిచేశాడు పయిలం సంతోష్. సంతోష్ అసలు పేరు అడూరి బ్రహ్మయ్య. జానపద కళాకారుడు. ఉద్యమ సమయంలో గొంతెత్తి ప్రజలను సంఘటితం చేశాడు. తెలంగాణ నుంచి బొంబాయికి వలస పోతున్న ప్రజలను ఉద్దేశించి సంతోష్ ‘పైలం’ అనే ఆల్బమ్ విడుదల చేశాడు. అప్పటి నుంచి పైలం సంతోష్‌గా పేరుపొందాడు. సూర్యాపేట వెలిదండలో పుట్టిన సంతోష్.. నల్గొండలోని దుగునెల్లిలో పెరిగాడు. 2020లో అకాల మరణం పొందాడు.&nbsp; https://www.youtube.com/watch?v=XXQTnLMJP6g&amp;t=3s సాయిచంద్ తెలంగాణ ఉద్యమ సమయంలో గొంతుకు సానబెట్టిన కళాకారుడు సాయిచంద్. వనపర్తి జిల్లాలోని అమరచింతలో జన్మించిన సాయిచంద్ ఎంతో చురుగ్గా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం, అధికార పార్టీకి పనిచేశాడు. చనిపోయేంత వరకు వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్నాడు. https://www.youtube.com/watch?v=KHtwovGCU9g&amp;t=2s
    ఆగస్టు 10 , 2023
    Unique Promotions: ప్రమోషన్స్‌తోనే పడేశారు.. సోషల్ మీడియాలో ‘మేమ్‌ ఫేమస్‌’ రచ్చ రచ్చ..!
    Unique Promotions: ప్రమోషన్స్‌తోనే పడేశారు.. సోషల్ మీడియాలో ‘మేమ్‌ ఫేమస్‌’ రచ్చ రచ్చ..!
    సుమంత్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చేస్తున్న ప్రమోషన్స్‌ ఆకట్టుకుంటున్నాయి. రొటిన్‌ ప్రమోషన్స్‌లా కాకుండా చిత్ర యూనిట్‌ వినూత్నంగా తమ సినిమాను ప్రమోట్‌ చేసుకుంటోంది. డీజే బ్యాండ్‌తో స్వయంగా సెలబ్రిటీల దగ్గరకు వెళ్లి తమ ప్రమోషన్స్‌లో వారిని భాగస్వామ్యం చేస్తోంది. ‘మేమ్‌ ఫేమస్‌’ను ప్రమోట్‌ చేస్తూ సెలబ్రిటీలు చెబుతున్న డైలాగ్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. విశ్వక్‌సేన్‌ ‘దాస్‌ కా ధమ్కీ’ మూవీ హిట్‌తో విశ్వక్‌ సేన్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో విశ్వక్‌ను కలిసిన ‘మేమ్‌ ఫేమస్‌’ చిత్ర యూనిట్‌ ఆయన చేత వినూత్నంగా సినిమాను ప్రమోట్ చేయించింది.&nbsp; View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) తిరువీర్‌ హారర్‌ చిత్రం ‘మసూద’లో లీడ్‌ రోల్‌ చేసిన నటుడు తీరువీర్‌ కూడా ‘మేమ్‌ ఫేమస్‌’ ప్రమోషన్స్‌లో భాగమయ్యాడు. View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) రాహుల్‌ సిప్లిగంజ్ ఆస్కార్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ను కూడా చిత్ర యూనిట్‌ కలిసింది. ఊరమాస్‌ స్టెప్పులతో తమ మూవీని ప్రమోట్‌ చేయించుకుంది.&nbsp; View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) సింగర్ మంగ్లీ ప్రముఖ సింగర్‌ మంగ్లీ కూడా ధూమ్‌ ధామ్‌ డ్యాన్స్‌తో ‘మేమ్‌ ఫేమస్‌’ సినిమాపై హైప్‌ క్రియేట్ చేసింది.&nbsp; View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) అడివి శేష్ యంగ్‌ హీరో అడివి శేష్‌ను కూడా చిత్ర యూనిట్‌ వదల్లేదు. తమ డప్పులకు చిందేయించి మరి హీరోతో ప్రమోషన్ చేయించుకుంది. View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) విజయ్‌ ఆంటోనీ బిచ్చగాడు-2 సినిమా హీరో ‘విజయ్‌ ఆంటోనీ’ సైతం ఎంతో ఉత్సాహాంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు.&nbsp; View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) రానా దగ్గుబాటి ‘మేమ్‌ ఫేమస్‌’ యూనిట్‌తో కలిసి హీరో రానా కూడా రచ్చ రచ్చ చేశాడు. కిర్రాక్‌ స్టెప్పులతో అలరించాడు. View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) తరుణ్‌ భాస్కర్‌ యంగ్‌ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ ఎంతో హుషారుగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) సుహాస్‌ ‘కలర్‌ ఫొటో’ సినిమా హీరో సుహాస్ చేసిన ప్రమోషన్స్ అన్నింటి కంటే హైలెట్‌ అని చెప్పొచ్చు. సినిమా ఫంక్షన్స్‌లో ఎంతో బిడియంగా కనిపించే సుహాస్‌ తన డ్యాన్స్‌తో ఇరగదీశాడు.&nbsp; View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) అనిల్‌ రావిపూడి ప్రముఖ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కూడా మూవీ ప్రమోషన్స్‌లో తళుక్కుమన్నాడు.&nbsp; View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) నవదీప్‌ హీరో నవదీప్‌ ఇటీవల ‘న్యూసెన్స్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు. ‘మేమ్‌ ఫేమస్‌’ చిత్రంతో పాటు తెలివిగా తన వెబ్‌సిరీస్‌ను కూడా నవదీప్‌ ప్రమోట్‌ చేసుకున్నాడు.&nbsp; View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) హరీశ్‌ శంకర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ కూడా మేమ్ ఫేమస్‌ చిత్ర ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొన్నాడు. View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) నాగచైతన్య ఎప్పుడూ సాఫ్ట్‌గా, కూల్‌గా ఉండే హీరో నాగచైతన్య కూడా దుమ్ములేపాడు.&nbsp; View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) విజయ్‌ దేవరకొండ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ కూడా తనదైన శైలిలో కొత్త మూవీని ప్రమోట్ చేశాడు. View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas) అల్లు అరవింద్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదుట కూడా ‘మేమ్‌ ఫేమస్‌’ టీమ్ హల్‌చల్‌ చేసింది. ఈ క్రమంలో సడెన్ ఎంట్రీ ఇచ్చిన అల్లుఅరవింద్‌.. మే 26న థియేటర్స్‌లో కలుద్దాం అంటూ మూవీ బృందంతో అన్నారు.&nbsp; View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
    మే 23 , 2023
    ధమాకా చిత్రం శ్రీ లీలను టాప్‌ హీరోయిన్‌గా చేస్తుందా?
    ధమాకా చిత్రం శ్రీ లీలను టాప్‌ హీరోయిన్‌గా చేస్తుందా?
    ధమాకా చిత్రం శ్రీ లీలను టాప్‌ హీరోయిన్‌గా చేస్తుందా?ధమాకా చిత్రం శ్రీ లీలను &nbsp;టాప్‌ హీరోయిన్‌గా చేస్తుందా?YouSay short News Appశ్రీలీల నేటితరం హీరోయిన్లలో అందరికన్నా ఎక్కువ పాపులరై చేతినిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది.పెళ్లి సందడి సినిమాతో ఆరంగేట్రం చేసిన&nbsp; ఈ ముద్దుగుమ్మ..తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించింది.కుర్ర హీరోల పక్కన ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. రానున్న చిత్రాలన్నీ రెండు, మూడోతరం హీరోలతోనే ఉన్నాయి.సందీప్‌ కిషన్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కార్తీకేయతో నటించే ప్రాజెక్టులకు &nbsp;సంతకం చేసేసింది.రవితేజ సరసన నటించిన ధమాకా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, పాటలతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.ధమాకా చిత్రం శ్రీలల కెరీర్‌కు కీలకం. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే హిట్ కావటం తప్పనిసరి.ఒకవేళ బాక్సాఫీస్ వద్ద ధమాకా బ్లాక్ బస్టర్‌ కొడితే శ్రీలీలకు ఇండస్ట్రీ ద్వారాలు పూర్తిగా తెరుచుకుంటాయి. టాప్‌ హీరోల సరసన నటించే అవకాశం దక్కుతుంది.జనాన్ని థియేటర్లకు రప్పించేందుకు శ్రీలలతో పాటు ధమాకా చిత్రబృందం ప్రమోషన్లతో గట్టిగానే ప్రయత్నిస్తున్నారుధమాకా చిత్ర ప్రమోషన్లలో భాగంగా శ్రీలల చాలా ఇంటర్వ్యూలకు వెళ్లారు. ఎన్నో టీవీ షో కార్యక్రమాలకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేశారు.మరోవైపు హీరో రవితేజకు కూడా చాలాకాలంగా మంచి హిట్ లేదు. ధమాకా సక్సెస్‌ అతడికి కూడా చాలా అవసరం.రవితేజ, శ్రీలీలతో పాటు చిత్రబృందం మెుత్తం ధమాకా హిట్‌ కొడుతుందనే విశ్వాసంతో ఉన్నారు. వారి ఆశ నిజం కావాలని కోరుకుందాం.డిసెంబర్ 23న వీరిద్దరూ నటించిన సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది.
    ఫిబ్రవరి 13 , 2023
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    పిల్లా నువ్వులేని జీవితం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్.. చిత్రలహరి, విరూపాక్ష వంటి హిట్ చిత్రాల ద్వారా స్టార్ డం సంపాదించాడు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ గురించి మీకు తెలియని కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం. సాయి ధరమ్ తేజ్ ముద్దు పేరు? ధరమ్ సాయి ధరమ్ తేజ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా? పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ సాయి ధరమ్ తేజ్ పుట్టిన తేదీ ఎప్పుడు? October 15, 1986 సాయి ధరమ్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ క్రష్ ఎవరు? లారిసా బొనేసి(Larissa Bonesi). ఈమె తిక్క చిత్రంలో సాయి ధరమ్ సరసన హీరోయిన్‌గా నటించింది. సాయి ధరమ్‌కు ఇష్టమైన సినిమా? గ్యాంగ్ లీడర్ సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, చిరంజీవి సాయి ధరమ్ తేజ్ తొలి హిట్ సినిమా? సుబ్రహ్మాణ్యం ఫర్ సేల్ చిత్రం సాయిధరమ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. చిత్రలహరి, బ్రో, విరూపక్ష వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. సాయి ధరమ్‌కు ఇష్టమైన కలర్? నీలం రంగు సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రుల పేర్లు? విజయ దుర్గ, జీవీఎస్ ప్రసాద్ సాయి దరమ్‌కు ఇష్టమైన ప్రదేశం? దుబాయ్, లండన్ సాయి ధరమ్ చదువు? MBA సాయి ధరమ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? పిల్లా నువ్వులేని జీవితం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ గెలుచుకున్నాడు. https://www.youtube.com/watch?v=G7ptLW3O0Qo సాయి ధరమ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? సాయి ధరమ్ 2024 వరకు 16 సినిమాల్లో నటించాడు.&nbsp; సాయి ధరమ్‌కు ఇష్టమైన ఆహారం? రొయ్యల పలావు, పప్పు అన్నం సాయి ధరమ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సాయి ధరమ్ ఒక్కో సినిమాకి దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్ అభిరుచులు? ట్రావలింగ్, క్రికెట్ ఆడటం సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరోయిన్? సమంత
    మార్చి 21 , 2024
    VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్‌ కథాంశంతో&nbsp; విరూపాక్ష… సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్ కమ్‌ బ్యాక్!
    VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్‌ కథాంశంతో&nbsp; విరూపాక్ష… సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్ కమ్‌ బ్యాక్!
    సాయి ధరమ్‌ తేజ్‌ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న అనంతరం చేసిన మెుదటి సినిమా విరూపాక్ష. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. యాక్సిడెంట్ తర్వాత మాట కూడా పడిపోయిందని చెప్పిన సాయి… సినిమాలో ఎలా నటించాడు? సుకుమార్ కాంపౌండ్‌ నుంచి వస్తున్న మరో దర్శకుడు సక్సెస్ అయ్యాడా ? లేదా ? సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం దర్శకుడు: కార్తీక్ దండు నటీ నటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్‌, సోనియా సింగ్, రవికృష్ణ సంగీతం:&nbsp; అజనీశ్ లోక్‌నాథ్‌ సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌ కథ రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్‌ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ. ఎలా ఉందంటే? రుద్రవరం అనే ఊరికి ఓ జంట శాపం పెట్టడంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. సూర్య పాత్రలో సాయిధరమ్, నందినీగా సంయుక్త మీనన్‌ నటించారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. ఈ సీన్లు ప్రేక్షకులకు కాస్త బోరింగ్‌గానే అనిపిస్తాయి. అయితే, ఇంటర్వెల్‌కు ముందు అసలు కథను ప్రారంభించి అదిరిపోయే సన్నివేశాలు పెట్టడంతో సెకాండాఫ్‌పై ఆసక్తి కలుగుతుంది. ఊరిలో ఒక్కొక్కరు చనిపోతుంటే దాని వెనుకున్న రహస్యాన్ని చేధించే అంశాలతో సెకాండాఫ్‌ను నింపేశారు. కథనం చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్ని కచ్చితంగా సీటు అంచుల్లో కూర్చొబెడుతుంది. ప్రీ క్లైమాక్స్‌ వరకు చిత్రం బాగానే ఉంటుంది. చివర్లో కాస్త తడబడ్డారనే చెప్పాలి.&nbsp; ఎవరెలా చేశారు? సాయిధరమ్ తేజ్‌కి ఇది కమ్ బ్యాక్ సినిమా. నటనలో మరో మెట్టు ఎక్కేశాడు కుర్ర హీరో. సూర్య పాత్రలో లీనమైపోయాడు. సెటిల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు సాయి. సంయుక్త మీనన్‌ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. వరుసగా హిట్లు కొడుతున్న ఈ హీరోయిన్‌ మరోసారి మెప్పించిందనే చెప్పాలి. తన ఖాతాలో మరో హిట్ వేసుకుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సోనియా సింగ్, అజయ్ లాంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; సాంకేతిక పనితీరు సుకుమార్ కాంపౌండ్‌ నుంచి వచ్చిన దర్శకుడు కార్తీక్ దండు మెుదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఉప్పెనతో బుచ్చిబాబు, దసరాతో శ్రీకాంత్‌ ఓదెల ఎలా ఆకట్టుకున్నారో కార్తీక్‌ కూడా అదేస్థాయిలో మెప్పించాడు. విరూపాక్ష చిత్రాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు కార్తీక్. ఈ చిత్రానికి మరో ప్లస్‌ పాయింట్‌ స్క్రీన్‌ ప్లే. సుకుమార్ స్వయంగా అందించిన స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. చిత్రాన్ని ఎక్కడో నెలబెట్టింది.&nbsp; విరూపాక్ష చిత్రానికి సంగీతంతో ప్రాణం పోశాడు అజనీశ్‌ లోక్‌నాథ్. కాంతార చిత్రానికి మ్యూజిక్ అందించి మెప్పించిన అతడు.. విరూపాక్షలో అందించిన నేపథ్య సంగీతం పెద్ద అసెట్. చిత్రానికి పూర్తి న్యాయం చేశాడు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. బలాలు కథ, కథనం సాయిధరమ్, సంయుక్త మీనన్ నేపథ్య సంగీతం బలహీనతలు క్లైమాక్స్‌, లవ్‌ ట్రాక్‌ రేటింగ్ 3.25/5
    ఏప్రిల్ 21 , 2023
    REVIEW: ‘ధమాకా’ రవితేజ హిట్ కొట్టాడా?
    REVIEW: ‘ధమాకా’ రవితేజ హిట్ కొట్టాడా?
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    ఫిబ్రవరి 13 , 2023
    ఒంటిపై ధరించినది నలుపైనా తెలుపైనా వీరి అందం అదరహో!
    ఒంటిపై ధరించినది నలుపైనా తెలుపైనా వీరి అందం అదరహో!
    ]మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండిWatch Now
    ఫిబ్రవరి 10 , 2023
    Review: విశ్వక్‌సేన్ ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందా?
    Review: విశ్వక్‌సేన్ ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందా?
    విశ్వక్‌సేన్ డ్యుయల్ రోల్‌లో నటించిన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం మార్చి 22 థియేటర్లలో విడుదలైంది. ప్రచార చిత్రాలు, పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, విశ్వక్‌సేన్ హిట్ కొట్టాడా? డైరెక్టర్‌గా, యాక్టర్‌గా విశ్వక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ సినిమా ప్రేక్షకుడిని మెప్పించిందా? అనే విషయాలను రివ్యూలో తెలుసుకుందాం.  దర్శకుడు: విశ్వక్‌సేన్&nbsp; నటీ నటులు: విశ్వక్‌సేన్, నివేథా పెతురాజ్, రావు రమేశ్, రోహిణి, తదితరులు సంగీతం: లియోన్ జేమ్స్ సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు, జార్జ్ విలియమ్స్ కథేంటి? కృష్ణ దాస్(విశ్వక్‌సేన్) ఒక అనాథ. ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో వెయిటర్‌గా పనిచేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి రిచ్‌గా బతకాలని కలలు కంటుంటాడు. వెయిటర్‌గా చేస్తున్న సమయంలోనే కీర్తి(నివేథా పెతురాజ్)తో ప్రేమలో పడతాడు. మరోవైపు, సంజయ్ రుద్ర(విశ్వక్‌సేన్) ఓ ఫార్మా కంపెనీని నడిపే సీఈవో. అనుకోని కారణాల వల్ల సంజయ్ జీవితంలోకి కృష్ణదాస్ ప్రవేశించాల్సి వస్తోంది. అయితే, సంజయ్‌గా దాస్ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? సంజయ్, దాస్‌లకు మధ్య ఏమైనా సంబంధం ఉందా? చివరికి వీరిద్దరూ కలుసుకున్నారా? అనేది తెరపై చూడాల్సిందే.&nbsp; ఎలా ఉంది?&nbsp; అందరికీ తెలిసిన ఫార్ములానే కావడంతో కథలో కొత్తదనం కనిపించలేదు. ఫస్టాఫ్‌లో కామెడీ సన్నివేశాలు కాస్త నవ్వించాయి. నివేదాతో లవ్ ట్రాక్ మరీ అంతగా ఆకట్టుకోలేదు. మొత్తానికి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ద్వితీయార్ధంలో తొలి పది నిమిషాలు అది కొనసాగుతుంది. ఆ తర్వాత సినిమాలో ట్విస్టులు రావడం మొదలవుతాయి. అయితే, కథలో అవసరమైన వాటికన్నా ఎక్కువ ట్విస్టులు ఉండటం ప్రేక్షకులకు రుచించలేదు. కొన్ని ట్విస్టులను ప్రేక్షకులు ఊహిస్తారు. ఎమోషనల్ సీన్స్‌ మరింత మెరుగ్గా ఉండాల్సింది. క్లైమాక్స్‌లో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.&nbsp; ఎవరెలా చేశారు?&nbsp; విశ్వక్‌సేన్ డ్యుయల్ రోల్‌లో అలరించాడు. తనలోని భిన్న కోణాలను చూపించడానికి ఈ రెండు పాత్రలు బాగా ఉపయోగపడ్డాయి. నటన పరంగా విశ్వక్‌ ఆకట్టుకున్నాడు. బోల్డ్ డైలాగ్‌లతో మాస్ ఆడియెన్స్‌ని మురిపించాడు. నివేదా పేతురాజ్ అందంగా కనిపించింది. రావు రమేశ్, రోహిణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మహేశ్, హైపర్ ఆది కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. మరో ముఖ్య పాత్రలో అజయ్ మెప్పించాడు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. సెకండాఫ్‌లో స్టోరీని నడిపించడానికి విశ్వక్‌ బాగానే శ్రమించాడు. తనలోని డైరెక్టర్‌కు పనిచెప్పాడు. ఇక లియోన్ జేమ్స్ అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చింది. ముఖ్యంగా ‘మావా బ్రో’, ‘ఆల్మోస్ట్ పడిపోయానే పిల్లా’ పాటలు తెరపై సందడి చేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు పనిచెప్పి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ విశ్వక్‌సేన్ నటన సంగీతం నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ ఎక్కువ ట్విస్టులు స్క్రీన్ ప్లే ఫైనల్‌గా.. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న దాస్‌.. క్లాస్ ప్రేక్షకులకు ధమ్కీ ఇచ్చాడు. రేటింగ్: 2.5/5
    మార్చి 22 , 2023

    @2021 KTree