• TFIDB EN
  • దొంగ మొగుడు
    UTelugu
    ఓ సంపన్నవ్యాపారవేత్త జీవితంలో నిత్యం వేధించే భార్య, తల్లి వల్ల సంతోషం లేకుండా పోతుంది. అచ్చం ఆ వ్యాపారవేత్తను పోలి ఉన్న వ్యక్తి వల్ల అతని భార్యలో మార్పు వస్తుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్ సూన్‌ ఆన్‌JioCinema
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    చిరంజీవి
    రవితేజ మరియు నాగరాజు
    రాధిక శరత్‌కుమార్
    గీత
    భానుప్రియ
    ప్రియంవద
    మాధవి
    రవితేజ భార్య
    జయంతి
    రావు గోపాల్ రావు
    రావు గోపాల్ రావు
    అల్లు రామ లింగయ్య
    చరణ్ రాజ్
    సుతి వేలు
    సుతివేలు
    రంగనాథ్
    సూర్య కిరణ్
    మాస్టర్ సురేష్
    సిబ్బంది
    ఎ. కోదండరామి రెడ్డి
    దర్శకుడు
    వెంకన్నబాబు ఎస్పీనిర్మాత
    కె. చక్రవర్తి
    సంగీతకారుడు
    లోక్ సింగ్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?</strong>
    Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
    మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. [toc] భోళా శంకర్ ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు. గాడ్ ఫాదర్ చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది. ఖైదీ నంబర్ 150 చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంజి చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది. శంకర్ దాదా జిందాబాద్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. శంకర్ దాదా M.B.B.S "మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. ఠాగూర్ తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు. మృగరాజు హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. స్నేహం కోసం కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది. హిట్లర్ మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది. ముగ్గురు మొనగాళ్లు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు. మెకానిక్ అల్లుడు "శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆజ్ కా గూండా రాజ్ "గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఘరానా మొగుడు "అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. పసివాడి ప్రాణం&nbsp; &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.&nbsp; చక్రవర్తి&nbsp; రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆరాధన&nbsp; భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; దొంగ మొగుడు&nbsp; ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్‌’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.&nbsp; వేట&nbsp; &nbsp;ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్&nbsp; &nbsp;యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; రాజా విక్రమార్క &nbsp;రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; ప్రతిబంధ్&nbsp; &nbsp;రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. త్రినేత్రుడు &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; ఖైదీ నంబర్ 786 &nbsp;విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అడవి దొంగ &nbsp;చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.&nbsp; చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; నాగు&nbsp; తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.&nbsp; ఇంటిగుట్టు &nbsp;చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.&nbsp; దేవాంతకుడు దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.&nbsp; హీరో విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్‌ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు. ‘ఖైదీ’ &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది. అభిలాష&nbsp; ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.&nbsp; ప్రేమ పిచ్చోళ్లు&nbsp; &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; బంధాలు అనుబంధాలు&nbsp; ‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.&nbsp; మంచు పల్లకీ&nbsp; &nbsp;వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.&nbsp; యమ కింకరుడు&nbsp; యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. పట్నం వచ్చిన పతివ్రతలు పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. చట్టానికి కళ్లులేవు చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. 47 రోజులు కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మొగుడు కావాలి చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు. మోసగాడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రేమ తరంగాలు 'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్‌. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. పున్నమి నాగు 'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఇది కథ కాదు కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు. మనవూరి పాండవులు బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
    సెప్టెంబర్ 25 , 2024
    Chiranjeevi and Radhika Sarathkumar Movies List: చిరంజీవి- రాధికను హిట్ పేయిర్‌గా నిలిపిన సినిమాలు ఇవే!
    Chiranjeevi and Radhika Sarathkumar Movies List: చిరంజీవి- రాధికను హిట్ పేయిర్‌గా నిలిపిన సినిమాలు ఇవే!
    తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి- రాధిక జంటకు సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరు కలిసి 16 చిత్రాల్లో నటించారు. వీటిలో చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిపై ఓలుక్ వేద్దాం. కిరాయి రౌడీలు(1981) ఏ. కోదండ రామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మోహన్ బాబు కూడా నటించారు. చిరంజీవి సరసన రాధిక (Chiranjeevi- Radhika Movies) నటించిన తొలి చిత్రమిది. న్యాయం కావాలి(1981) డి. రామేశ్వరి నవల కొత్త మలుపు ఆధారంగా ఏ. కోదండరామిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధిక నటించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఇది పెళ్లంటారా( 1982) విజయ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. చిరంజీవి సరసన రాధిక హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరితో పాటు గొల్లపూడి మారుతీరావు నటించారు. పట్నం వచ్చిన పతివ్రతలు(1982) చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక(Chiranjeevi- Radhika Movies) నటించగా.. మోహన్ బాబు సరసన గీత నటించింది. ఈ సినిమాను మౌళి డైరెక్ట్ చేశారు. బిల్లా రంగా(1982) కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక హీరోయిన్‌గా నటించింది.&nbsp; ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటించారు. యమకింకరుడు(1982) రాజ్‌ భరత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధిక నటించింది. పులి బెబ్బులి(1983) చిరంజీవి- కృష్ణం రాజు కాంబోలో వచ్చిన ఈ చిత్రం హిట్ అయింది. చిరంజీవి సరసన రాధిక(Chiranjeevi- Radhika Movies), కృష్ణం రాజుకు జోడీగా జయప్రద నటించారు. ఈ చిత్రాన్ని KSR దాస్ డైరెక్ట్ చేశారు. ప్రేమ పిచ్చోలు (1983) ఏ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చిరంజీవి జోడీగా రాధిక నటించింది. పల్లెటూరి మొనగాడు(1983) చిరంజీవి రాధిక కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్లాప్ అయింది. ఈ సినిమాను SA చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు. అభిలాష(1983) ఉరిశిక్షను రద్దు చేయాలన్న ఇతివృత్తంతో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ సినిమాను ఏ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. చిరంజీవి సరసన రాధిక నటించింది. గూడచారి నెం.1 (1983) చిరంజీవి- రాధిక నటించిన ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. హీరో (1984) విజయ బాపినీడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక నటించింది. జ్వాలా(1985) చిరంజీవి, రాధిక జంటగా నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాను రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. దొంగ మొగుడు(1987) చిరంజీవి, రాధిక, భానుప్రియ, మాధవి కాంబోలో వచ్చిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రాన్ని ఏ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఆరాధన(1987) భారతీ రాజా డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన సుహాసిని, రాధిక నటించారు. హీరో రాజశేఖర్ ముఖ్య పాత్రలో నటించారు. రాజా విక్రమార్క(1990) చిరంజీవి- రాధిక, అమల కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం చిరంజీవితో రాధిక నటించిన చివరి చిత్రం.
    నవంబర్ 09 , 2023
    Chiranjeevi- Radha Movies: చిరంజీవి- రాధ మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
    Chiranjeevi- Radha Movies: చిరంజీవి- రాధ మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
    విజయశాంతి(19) తర్వాత చిరంజీవితో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్ రాధ. ఈమె ఏకంగా 16 సినిమాల్లో నటించి చిరంజీవితో హిట్‌ పేయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వీటిలో 10 చిత్రాలు హిట్‌గా నిలిచాయి. వాటిపై ఓ లుక్‌ వేద్దాం. గూండా(1984) చిరంజీవి- రాధ (Chiranjeevi and Radha Movies List) కాంబోలో వచ్చిన తొలి చిత్రం 'గూండా'. ఈ చిత్రాన్ని&nbsp; ఏ.కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. నాగు(1984) తాతినేని ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రెండోసారి చిరంజీవి- రాధ జత కట్టారు. ఈ సినిమాను ఏవీఎం ప్రొడక్షన్‌లో వచ్చింది. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దొంగ(1985) ఏ. కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది. తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా హిట్లు లేని సమయంలో ఈ చిత్రం విజయం సాధించి ఊపు తీసుకొచ్చింది. ఈ సినిమాతో చిరంజీవి- రాధ హిట్ పెయిర్‌గా నిలిచారు. పులి(1985) చిరంజీవి- రాధ జంటగా నటింటిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమాను రాజ్ భరత్ డైరెక్ట్ చేశారు. రక్త సింధూరం(1985) ఏ. కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో చిరంజీవి-రాధ జంటగా మెప్పించిన మరో చిత్రం పులి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దగా పెద్దగా ఆడలేదు. అడవి దొంగ(1986) చిరంజీవి- రాధ (Chiranjeevi and Radha Movies List)&nbsp; జంటగా నటించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను కే. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.&nbsp; కొండవీటి రాజా(1986) కే. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో చిరంజీవి-రాధ కాంబోలో బ్యాక్‌ టూ బ్యాక్ హిట్‌గా నిలిచిన చిత్రం 'కొండవీటి రాజా'. ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. &nbsp;రుద్ర నేత్ర(1989) కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ ప్లాప్ అయింది. ఈ సినిమాలో చిరుకు జోడీగా రాధ, విజయశాంతి నటించారు.&nbsp; రాక్షసుడు(1986) చిరంజీవి- రాధ కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. రాక్షసుడు చిత్రాన్ని ఏ.కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. జేబు దొంగ(1987) కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. చిరంజీవి- రాధ మరోసారి తమ కెమిస్ట్రీతో మెప్పించారు. ఈ చిత్రం హిందీలో ఆజ్‌కా గ్యాంగ్‌ లీడర్ పేరుతో డబ్‌ చేశారు. యముడికి మొగుడు(1988) చిరంజీవి, రాధ, విజయశాంతి జోడిగా రవిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం 'యముడికి మొగుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైయింది.&nbsp; మరణ మృదంగం(1988) ఏ కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ హిట్‌ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధ మరోసారి నటించింది. స్టేట్ రౌడీ(1989) బి.గోపాల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి, రాధ(Chiranjeevi and Radha Movies List)&nbsp; పోటీపడిమరి నటించారు. లంకేశ్వరుడు(1989) చిరంజీవి, రాధ, రేవతి జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాను దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు తెరకెక్కించారు. ఇది ఆయనకు 100వ సినిమా. కొండవీటి దొంగ(1990) చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్‌లలో కొండవీటి దొంగ ఒకటి. ఈ చిత్రాన్ని కొదండ రామిరెడ్డి డైరెక్ట్ చేశారు. చిరంజీవి సరసన రాధ, విజయశాంతి జంటగా నటించారు. కొదమ సింహం(1990) చిరంజీవి- రాధ కలిసి నటించిన చివరి సినిమా ఇది. ఈ సినిమాను కే మురళిమోహన్‌రావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి కౌబాయ్ గెటప్‌తో అలరించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.
    నవంబర్ 08 , 2023
    Chiranjeevi Vijayashanthi: చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?
    Chiranjeevi Vijayashanthi: చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?
    మెగాస్టార్ చిరంజీవి మరే హీరోయిన్‌తో తీయనన్ని సినిమాలు లెడీబాస్ విజయశాంతితో తీశాడు. వీరిద్దరి కాంబోలో మొత్తం 19 చిత్రాలు వచ్చాయి. 90వ దశకంలో వీరికి హిట్ పెయిర్‌ అనే పేరు ఉండేది. వీరి కాంబోలో చిత్రం విడుదలైందంటే థియేటర్లకు అభిమానులు పరుగులు తీసేవారు. చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాల్లో గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, స్వయంకృషి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. 1. సంఘర్షణ మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి తొలిసారి సంఘర్షణ చిత్రంలో నటించారు. మురళి మోహన్ రావు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసింది. 2. స్వయం కృషి చిరంజీవి- విజయశాంతి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం స్వయంకృషి. ఈ సినిమాలో విజయశాంతి- చిరంజీవి పోటీపడి మరి నటించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ సినిమాను కళాతపస్వి కే.విశ్వనాథ్ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 3. దేవాంతకుడు వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఎస్‌ ఏ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను జీవీ నారాయణరావు నిర్మించారు. కే చక్రవర్తి మ్యూజిక్ అందించారు. 4. మహానగరంలో మాయగాడు చిరంజీవి- విజయశాంతి(Chiranjeevi and Vijayashanthi) కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఆశించినంతగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఈ సినిమాను విజయ బాపినేడు డైరెక్ట్ చేశారు. మాగంటి రవింద్రనాథ్ చౌదరి నిర్మించారు. 5. ఛాలెంజ్ చిరంజీవి, విజయశాంతి జంటగా కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో విజయశాంతితో పాటు సుహాసిని కూడా నటించింది. 6. చిరంజీవి చిరంజీవి తన సొంత పేరుతో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ చిత్రాన్ని&nbsp; సీవీ రాజేంద్రన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో విజయశాంతితో పాటు భానుప్రియ కూడా నటించింది. 7. కొండవీటి రాజా చిరు, విజయశాంతి, రాధ జంటగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది.&nbsp; 'కొండవీటి రాజా' సినిమాను దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.&nbsp; 8. ధైర్యవంతుడు చిరు, విజయశాంతి(Chiranjeevi and Vijayashanthi) కాంబోలో వచ్చిన 'ధైర్యవంతుడు' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రాన్ని లక్ష్మీ దీపక్ డైరెక్ట్ చేశాడు. 9. చాణక్య శపథం కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. చిరంజీవి, విజయశాంతి జంటకు పీడ కలను మిగిల్చింది. 10. పసివాడి ప్రాణం చిరంజీవిని టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా చేసిన చిత్రం ఇది. తన తరం ఉన్న హీరోలతో ఉన్న పోటీని తట్టుకుని చిరంజీవి నంబర్ 1 గా నిలిచాడు. విజయశాంతితో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 11. మంచి దొంగ రాఘవేంద్ర రావు డైరెక్షన్‌ వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో విజయశాంతితో పాటు సుహాసిని నటించింది. 12. యముడికి మొగుడు చిరంజీవి, విజయశాంతి (Chiranjeevi and Vijayashanthi) జోడిగా రవిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం 'యముడికి మొగుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైయింది.  13. యుద్ధ భూమి &nbsp;మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబోలో వచ్చిన 'యుద్ధభూమి' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ అయింది. ఈ సినిమాను కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేశారు. 14. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిరంజీవి, విజయశాంతి జంటగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రాన్ని ఏ కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. 15. కొండవీటి దొంగ చిరు, విజయశాంతి, రాధ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఏ కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. 16. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్‌లో సినిమా రూపొందింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతితో పాటు నిరోషా నటించింది. 17. గ్యాంగ్ లీడర్ చిరంజీవికి మెగాస్టార్ క్రేజ్‌ను సుస్థిరం చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ చిత్రాన్ని విజయ బాపినీడు తెరకెక్కించారు. చిరు సరసన విజయశాంతి((Chiranjeevi and Vijayashanthi) హీరోయిన్‌గా నటించింది. 18.&nbsp; మెకానిక్ అల్లుడు చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన చివరి చిత్రం ఇది. ఈ సినిమాలో నాగేశ్వరరావు చిరంజీవికి మామగా నటించారు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను బి. గోపాల్ తెరకెక్కించారు. 19. రుద్ర నేత్ర కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ ప్లాప్ అయింది. ఈ సినిమాలో చిరుకు జోడీగా విజయశాాంతి, రాధ నటించారు. 
    నవంబర్ 07 , 2023
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.&nbsp; ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో&nbsp; ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు&nbsp; ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్&nbsp; ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి&nbsp; శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్&nbsp; నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక&nbsp; కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి&nbsp; మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&nbsp; ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్&nbsp; పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ&nbsp; సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:&nbsp; హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.&nbsp; సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి&nbsp; జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా&nbsp; బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం&nbsp; దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-&nbsp; యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.&nbsp; ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-&nbsp; జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు&nbsp; రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.&nbsp; ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.&nbsp; మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో&nbsp; ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి&nbsp; దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,&nbsp; కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి&nbsp; రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.&nbsp; ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ &nbsp;ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని&nbsp; ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా&nbsp; దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.&nbsp; మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.&nbsp; ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    Chiranjeevi Dual Role Movies: మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా?
    Chiranjeevi Dual Role Movies: మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా?
    మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీకి మకుటంలేని మహారాజు. ఆయన 150కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల చేత మెగాస్టార్‌గా పిలుపించుకున్నారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయ్యారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను రంజింపజేశారు. ఈ సందర్భంగా అనేక సినిమాల్లో డ్యూయర్ రోల్స్ చేసి తనదైన ముద్ర వేశారు. మరి మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్‌లో నటించిన చిత్రాలు ఏవో ఓసారి చూసేద్దామా.. 1. నకిలీ మనిషి (1980) చిరంజీవి తొలిసారి 'నకిలీ మనిషి' చిత్రంలో డ్యూయల్ (Chiranjeevi Dual Role Movies) రోల్‌లో కనిపించారు. ఈ సినిమాను ఎస్‌.డీ.లాల్ తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి.. ప్రసాద్, శ్యామ్ పాత్రల్లో కనిపించారు. 2. బిల్లా రంగా&nbsp; (1982) ఈ చిత్రాన్ని కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రాల్లో నటించారు. చిరుతో పాటు మోహన్ బాబు, రాధిక, ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. 3. రోషగాడు (1983) &nbsp;చిరంజీవి ఈ సినిమాలో శ్రీకాంత్, సికిందర్ అనే రెండు పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కేఎస్‌ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన మాధవి, సిల్క్‌ స్మిత నటించారు. 4. సింహపురి సింహం (1983)&nbsp; కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి రాజశేఖరం, విజయ్ అనే తండ్రి, కొడుకు పాత్రల్లో అలరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. 5. జ్వాల(1985) రవిరాజా పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి అన్నదమ్ముడిగా(Chiranjeevi Dual Role Movies) నటించారు. ఆయన సరసన రాధిక, భానుప్రియ నటించారు. 6. రక్త సింధూరం (1985) రక్త సింధూరంలో కూడా చిరంజీవి అన్నదమ్ములుగా డబుల్‌ రోల్‌లో మెప్పించారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ గోపిగా, గండ్రగొడ్డలి క్యారెక్టర్‌లో నటించారు. ఈ సినిమాను ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. 7. దొంగమొగుడు (1987) ఎ.కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరంజీవి.. రవితేజ, నాగరాజుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక, భానుప్రియ నటించారు. 8. యముడికి మొగుడు (1988) రావిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాళీ, బాలు పాత్రల్లో చిరంజీవి డ్యూయల్‌ రోల్‌లో మెప్పించారు. 9.రౌడీ అల్లుడు (1991) కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరంజీవి ఆటో జానీగా, కళ్యాణ్‌బాబుగా (Chiranjeevi Doublel Role Movies)నటించారు.&nbsp; 10. ముగ్గురు మొనగాళ్లు (1994) ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి... పృథ్వీ, విక్రమ్, నటరాజ రామకృష్ణ దత్తాత్రేయగా మూడు పాత్రల్లో తొలిసారి త్రిపాత్రాభినయం చేశారు. ఈ సినిమాను కే. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 11. రిక్షావోడు (1995) కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రల్లో నటించారు. 12. స్నేహం కోసం (1999) కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలోనూ చిరంజీవి తండ్రి కొడుకులుగా(Chiranjeevi Dual Role Movies) నటించారు. చిరంజీవి సరసన మీనా నటించింది. 13. అందరివాడు (2005) చిరంజీవి ఈ సినిమాలో మరోసారి తండ్రి కోడుకుల పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. 14. ఖైదీ నంబర్ 150 (2017) ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని వి.వి.నాయక్ డైరెక్ట్ చేశారు. మరోసారి రెండు పాత్రల్లో మెగాస్టార్ మెప్పించారు. కత్తి శీను, శంకర్‌గా అలరించారు. మెగాస్టార్ చిరంజీవి మొత్తంగా 14 చిత్రాల్లో డ్యూయల్ రోల్స్‌లో నటించి మెప్పించారు. ఇంకా ఆయన సినీ ప్రస్థానం ముందుకు సాగాలని మనమంత కోరుకుందాం.
    నవంబర్ 10 , 2023
    My Dear Donga Review: కామెడీతో అదరగొట్టిన అభినవ్‌ గోమఠం.. ‘మై డియర్‌ దొంగ’ ఎలా ఉందంటే?
    My Dear Donga Review: కామెడీతో అదరగొట్టిన అభినవ్‌ గోమఠం.. ‘మై డియర్‌ దొంగ’ ఎలా ఉందంటే?
    నటీనటులు: అభినవ్ గోమఠం, శాలినీ కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, శశాంక్ మందూరి, వంశీధర్ గౌడ్ దర్శకుడు: బీఎస్ సర్వజ్ఞ కుమార్ రచన: శాలినీ కొండేపూడి సంగీతం: అజయ్ అరసాద ఎడిటర్: సాయి మురళి సినిమాటోగ్రఫీ: ఎస్ఎస్ మనోజ్ నిర్మాత: మహేశ్వర్ రెడ్డి గోజల స్ట్రీమింగ్‌ వేదిక : ఆహా హాస్యనటుడు 'అభినవ్‌ గోమఠం' ప్రధాన పాత్రలో చేసిన చిత్రం ‘మై డియర్‌ దొంగ’ (My Dear Donga Review). ఇందులో షాలిని కొండెపూడి (Shalini Kondepudi) మరో కీలక పాత్ర పోషించింది. కాగా, ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో ప్రసారం అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను అలరించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.&nbsp; కథేంటి? సుజాత (షాలిని), డాక్టర్‌ విశాల్‌ (నిఖిల్‌ గాజుల) ప్రేమికులు. తొలుత బాగానే ఉన్న కొంతకాలం తర్వాత విశాల్‌లో మార్పు వచ్చిందని సుజాత భావిస్తుంటుంది. ఎక్కడకు పిలిచినా బిజీ అని చెబుతున్నాడనీ ఫీలవుతుంది. ఈ క్రమంలోనే సురేశ్‌ (అభినవ్‌ గోమఠం) ఆమె ఫ్లాట్‌లో చోరీ చేసేందుకు వెళ్తాడు. అదే సమయానికి షాలిని బర్త్‌డే సెల్రబేషన్‌ చేసేందుకు విశాల్‌ ఆమె ఫ్రెండ్స్‌తో ఇంటికి వస్తాడు. అప్పటికే విశాల్‌తో మాట్లాడిన సుజాత.. ఫ్రెండ్స్‌కు అతడ్ని బాల్య స్నేహితుడిగా పరిచయం చేస్తుంది. దొంగ అని తెలిసినా సుజాత.. సురేశ్‌తో ఎందుకు పరిచయం పెంచుకుంది? వారి కుటుంబ నేపథ్యాలేంటి? విశాల్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి కారణమేంటి?&nbsp; ఎవరెలా చేశారంటే? నటి షాలిని కథను ముందుండి నడిపించింది. సుజాత పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా బాగా అనిపిస్తాయి. ఎప్పటిలానే అభినవ్‌ తన కామెడీతో గిలిగింతలు పెట్టాడు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. సుజాతను ప్రేమించిన డాక్టర్‌ విశాల్‌ పాత్రలో నిఖిల్‌ ఫర్వాలేదనిపించాడు. దివ్య శ్రీపాద, ఆమె లవర్‌గా నటించిన శశాంక్‌, వెయిటర్‌గా నటించిన వంశీధర్‌ గౌడ్‌ తమ నటనతో ఓకే అనిపించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే నేటి ప్రేమికుల మనస్తత్వం ఎలా ఉందో తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు బీఎస్ సర్వజ్ఞ కుమార్. సుజాత ఉద్యోగ ప్రస్తావన, స్నేహితులు, విశాల్‌తో లవ్‌ ఎపిసోడ్‌తో సినిమాను నెమ్మదిగా స్టార్ట్‌ చేసిన డైరెక్టర్‌.. సుజాత ఫ్లాట్‌లోకి సురేశ్‌ ప్రవేశించడం నుంచి కథలో వేగం పెంచారు. అభినవ్‌ గోమఠం చుట్టూ రాసుకున్న కామెడీ ట్రాక్‌ సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. ప్రతీ ఎపిసోడ్‌ను ప్రేక్షకుడిని నవ్వించాలన్న లక్ష్యంతో రూపొందించినట్లు కనిపిస్తుంది. అయితే సుజాత, సురేశ్‌ తమ కుటుంబాల గురించి ఒకరికొకరు వివరించే తీరు కన్‌ఫ్యూజ్‌ క్రియేట్ చేస్తుంది. ఆ ఎమోషనల్‌ సీన్స్‌ను ఇంకాస్త ప్రభావవంతంగా చూపించి ఉంటే బాగుండేది. కానీ, కామెడీ పేరుతో ఎలాంటి అసభ్యతకు చోటివ్వకుండా ఫ్యామిలీతో ఎంచక్కా చూసేలా దర్శకుడు ఈ మూవీని రూపొందించడం ప్రశంసనీయం. స్లో నేరేషన్‌ కాస్త ఇబ్బంది పెట్టవచ్చు.&nbsp; సాంకేతికంగా&nbsp; సాంకేతిక విభాగానికొస్తే.. మ్యూజిక్‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉంది.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ షాలిని, అభినవ్‌ గోమఠం నటనకామెడీ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ నెమ్మదిగా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5
    ఏప్రిల్ 20 , 2024
    <strong>Comedian Ali Roles: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో అలీ చేసిన రోల్ విశిష్టత తెలుసా?</strong>
    Comedian Ali Roles: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో అలీ చేసిన రోల్ విశిష్టత తెలుసా?
    పూరి జగన్నాథ్‌ సినిమా అంటే పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌, హీరోయిజంతో పాటు హాస్య నటుడు అలీ క్యారెక్టర్లు కూడా గుర్తుకు వస్తాయి. పూరి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో అలీ కోసం ప్రత్యేకంగా కొన్ని పాత్రలను సృష్టించారు. ఆ పాత్ర తాలుకూ కామెడీ ట్రాకులు ఆయా సినిమాలకు భలే వర్కౌట్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే 'డబుల్‌ ఇస్మార్ట్‌' సినిమాలోనూ అలీకి ఓ ప్రత్యేకమైన రోల్‌ను ఇచ్చాడు పూరి. ‘బోకా’ అనే విచిత్రమైన పాత్రలో అలీ కనిపించనున్నారు. ట్రైలర్‌లో అలీ పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో పూరి సినిమాల్లో అలీ చేసిన ప్రత్యేకమైన పాత్రలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; బైక్‌ల దొంగ (ఇడియట్‌) రవితేజ, పూరి జగన్నాథ్‌ కాంబోలో వచ్చిన ఇడియట్‌ చిత్రం అప్పట్లో ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఇందులో బైక్‌లను దొంగిలించే పాత్రలో అలీ కనిపిస్తాడు. హైదరాబాద్‌ నుంచి బీదర్‌కు బైక్‌పై ఇసుక మూటను తీసుకెళ్తూ పోలీసు అధికారి జీవాను ఫుల్‌గా కన్ఫ్యూజ్‌ చేస్తాడు. ఆ ఇసుకను బీదర్‌లో చల్లడానికి తీసుకెళ్తున్నట్లు పదే పదే పోలీసులకు అలీ చెప్తాడు. అయితే అంత దూరం ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలియక పోలీసులతో పాటు ఆడియన్స్‌ కూడా కన్ఫ్యూజ్‌ అవుతారు. ఫైనల్‌గా అలీనే బైక్‌ దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాకవుతారు.&nbsp; స్కెచ్ ఆర్టిస్టు (సూపర్‌) నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ఆర్టిస్టు జాన్‌ అబ్రహం పాత్రలో అలీ కనిపిస్తాడు. ఇందులో అతడు మంచి నైపుణ్యం గల ఆర్టిస్టు. ఒకసారి చూస్తే ఇట్టే వారి స్కెచ్‌ వేయగలడు. అలా ఓ సందర్భంలో పోలీసులు వెతుకున్న హీరోను చూస్తాడు. దీంతో పోలీసులు అతడ్ని వెంటపెట్టుకొని వెళ్తారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం, అలీ మధ్య వచ్చే లై డిటెక్టర్‌ సీన్‌ ఎప్పటికీ మర్చిపోలేరు.&nbsp; బిక్షగాడు (పోకిరి) మహేష్‌, పూరి కాంబోలో వచ్చిన ‘పోకిరి’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో బిక్షవాడి పాత్రలో అలి కనిపించాడు. బ్రహ్మానందం అతడి ఈగో హర్ట్‌ చేయడంతో పదుల సంఖ్యలో బిక్షగాళ్లతో అతడి వెంట తిరుగుతూ నవ్వులు పూయించాడు. అలీ - బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ ఈ సినిమా సక్సెస్‌లో ముఖ్య భూమిక పోషించాయని చెప్పవచ్చు.&nbsp; హిమాలయ బాబా (దేశ ముదురు) అల్లు అర్జున్‌ హీరోగా చేసిన దేశముదురు చిత్రంలో అలీ హిమాలయాల్లో తపస్సు చేసే బాబా పాత్రలో కనిపించాడు. తాను బాబాగా ఎందుకు మారాడో కొద్ది కొద్దిగా రివీల్‌ చేస్తూ ఆడియన్స్‌లో ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్‌ చేస్తాడు. ప్రతీ సీన్‌ క్లైమాక్స్‌లా ఉంటుందంటూ నవ్వులు పూయించాడు. ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలకు ఇప్పటికీ ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది.&nbsp; గోలి (దేవుడు చేసిన మనుషులు) రవితేజ, పూరి కాంబోలో వచ్చిన ఈ ఫిల్మ్‌లో గోలీ అనే విచిత్రమైన పాత్రలో అలీ నటించాడు. లక్ష్మీదేవి కుమారుడిగా చెప్పుకుంటూ విపరీతంగా పూజలు చేస్తుంటాడు. లక్ష్మీదేవి (కోవై సరళ) అతడికి సాయం చేయాలని భావించి కొన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ తన తింగరితనంతో చేజేతులా వాటిని చెడగొట్టుకుంటూ నవ్వులు పూయించాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ అలీ చేసిన గోలి పాత్ర మాత్రం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది.&nbsp; నచ్చిమి (చిరుత) మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ 'చిరుత'లో అలీ పాత్ర విచిత్రంగా ఉంటుంది. నచ్చిమిగా అలీ పాత్ర, వేషధారణ, అన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అప్పటివరకూ ఆయన చేసిన క్యారెక్టర్లలో భిన్నమైన పాత్రగా నచ్చిమి గుర్తింపు తెచ్చింది. ఇప్పటికీ బుల్లితెరపై నచ్చిమిగా అలీ కనిపడితే నవ్వులే నవ్వులు అని చెప్పవచ్చు.&nbsp; బోకా (ఇస్మార్ట్‌ శంకర్‌) రామ్‌ పోతినేని, పూరి కాంబోలో వస్తోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమాలో బోకా అనే అడివి మనిషి తరహా పాత్రలో అలీ కనిపించనున్నాడు. ట్రైలర్‌లో అలీ పర్‌ఫార్మెన్స్‌ చూసి ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఈ పాత్ర కూడా పక్కాగా హైలెట్ అవుతుందని పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ పాత్ర ఎలా పుట్టిందో ఈ క్యారెక్టర్‌కు సంబంధించిన ఐడియా ఎలా వచ్చిందో అలీ తాజా ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. మలేషియాలో బిల్లా షూటింగ్‌ సందర్భంలో చింపాజిని మేనేజర్‌గా పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రభాస్‌కు చేసి చూపించినట్లు అలీ తెలిపారు. తన నటనకు ప్రభాస్‌తో పాటు అక్కడ ఉన్నవారంతా గంటన్నర సేపు నవ్వుతూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయం ఫోన్‌లో పూరికి చెప్పగానే ట్రాక్‌ బాగుంది ఏ సినిమాలోనైనా పెడదాం అన్నట్లు చెప్పారు. అలా అమెజాన్‌ ఫారెస్ట్‌ నుంచి బోకా అనే క్యారెక్టర్‌ను తీసుకున్నట్లు అలీ స్పష్టం చేశారు. తన రోల్‌కు సంబంధించిన షూటింగ్‌ను మూడు రోజుల్లోనే ఫినిష్‌ చేసినట్లు అలీ తెలిపారు.  
    ఆగస్టు 13 , 2024
    Abhinav Gomatam: కామెడీ స్టార్‌ అభినవ్‌ గోమఠం గురించి ఈ విషయాలు తెలుసా?
    Abhinav Gomatam: కామెడీ స్టార్‌ అభినవ్‌ గోమఠం గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌లోని టాలెంటెడ్ యంగ్‌ నటుల్లో ‘అభినవ్‌ గోమఠం’ ముందు వరుసలో ఉంటాడు. కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించిన అభినవ్‌.. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ఓ వైపు హాస్య పాత్రలు పోషిస్తూనే మరోవైపు కథానాయకుడిగా, ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌రా’, ‘మై డియర్‌ దొంగ’ చిత్రాలు ఇటీవల రిలీజై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. అతడు లీడ్‌ రోల్‌ చేసిన ‘సేవ్‌ ద టైగర్స్‌ 1 &amp; 2’ సిరీస్‌లు ఓటీటీలో సూపర్‌ హిట్ అయ్యాయి. దీంతో అభినవ్‌ గురించి తెలుసుకునేందుకు టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి ఈ ఆర్టికల్‌లో అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; అభినవ్‌ గోమఠం ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్‌ అభినవ్‌ గోమఠం ఎప్పుడు పుట్టాడు? జనవరి 1, 1986 అభినవ్‌ గోమఠం ఎత్తు ఎంత? 5 ఫీట్‌ 10 ఇంచెస్‌ (178 సెం.మీ) అభినవ్‌ గోమఠం రాశి ఏది? సింహా రాశి అభినవ్‌ గోమఠం స్కూలింగ్‌ ఎక్కడ జరిగింది? హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అభినవ్‌.. తన ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అభినవ్‌ గోమఠం విద్యార్హత ఏంటి? హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో బీటెక్‌ చేశాడు.&nbsp; అభినవ్‌ గోమఠానికి పెళ్లి జరిగిందా? కాలేదు&nbsp;&nbsp; అభినవ్‌ గోమఠం తండ్రి ఏం చేసేవారు? అభినవ్‌ తండ్రి ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగి.&nbsp; అభినవ్‌ గోమఠం కెరీర్‌ ప్రారంభంలో ఏం చేశాడు? నటనపై ఆసక్తితో ఉడాన్‌ థియేటర్‌, అహరం థియేటర్‌ వంటి సంస్థల ఆధ్వర్యంలో పలు నాటకాలు ప్రదర్శించాడు. ఆ తర్వాత లఘు చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.&nbsp; అభినవ్‌ గోమఠం చేసిన తొలి షార్ట్‌ ఫిల్మ్‌ ఏది? ఆర్టిఫిషియల్‌ (2012) అభినవ్‌ గోమఠం చేసిన&nbsp; మొదటి చిత్రం ఏది? మైనే ప్యార్ కియా (Maine Pyaar Kiya) అభినవ్‌ గోమఠంను పాపులర్‌ చేసిన చిత్రం? ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi) అభినవ్‌ గోమఠం ఇప్పటివరకూ చేసిన చిత్రాలు ఏవి? ‘మైనే ప్యార్ కియా’, ‘బిల్లా రంగ’, ‘జగన్నాటకం’, ‘మళ్ళీరావా’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘జెస్సీ’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘సీత’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘రంగ్ దే’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘సెహరి’, ‘విరూపాక్ష’, ‘గూఢచారి’, ‘గాందీవధారి అర్జున’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘కిస్మత్’, ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘మై డియర్ దొంగ’.. అభినవ్‌ గోమఠం ఇప్పటివరకూ చేసిన వెబ్‌సిరీస్‌లు? ‘అర్థమైందా అరుణ్ కుమార్’, ‘తులసివనం’, ‘సేవ్ ద టైగర్స్’, ‘సేవ్ ది టైగర్స్ 2’ అభినవ్‌ గోమఠంపై వచ్చిన వివాదస్పద ఆరోపణలు ఏంటి? టాలీవుడ్‌ నటి కల్పిక.. అభినవ్‌ గోమఠంపై సంచలన ఆరోపణలు చేసింది. అభినవ్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తనను వేధించాడని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అభినవ్‌ కొట్టిపారేశారు.&nbsp; అభినవ్‌ గోమఠం నెట్‌ వర్త్‌ ఎంత? ఏడాదికి రూ.1.5 కోట్లు (అంచనా) అభినవ్‌ గోమఠం ఫేవరేట్‌ హీరో ఎవరు? షారుక్‌ ఖాన్ అభినవ్‌ గోమఠం ఫేవరేట్‌ డైరెక్టర్‌ ఎవరు? మణిరత్నం అభినవ్‌ గోమఠం బెస్ట్‌ డైలాగ్ ఏది? ఈ నగరానికి ఏమైంది సినిమాలో వచ్చే బార్‌ సీన్‌.. అభినవ్‌ను చాలా పాపులర్‌ చేసింది. నలుగురు ఫ్రెండ్స్‌ (విష్వక్‌, కౌషిక్ (అభినవ్‌), ఉప్పు, కార్తిక్‌) బార్‌లో సిట్టింగ్‌ వేస్తారు. ఆ సందర్భంలో అభినవ్‌ వేసే డైలాగ్స్‌ యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సీన్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; అభినవ్‌ : ఈ నగరానికి ఏమైంది. ఓ పక్కన బారు.. ఇంకో పక్కన ఫ్రెండ్స్‌. అయినా ఎవరూ తాగట్లేదేంటి? రేయ్‌.. ఆ వాంట్‌ టూ సే సమ్‌థింగ్‌ రా. విష్వక్‌: వీడొకడు.. అభినవ్‌ : ఎన్నేళ్లు అయ్యిందిరా మనం ఇట్ల కూర్చొని తాగి. ఆల్‌ మోస్ట్ 4 ఇయర్స్‌. ఐ యామ్‌ వెరీ హ్యాపీ. తాగుదాం.&nbsp; ఉప్పు : రేయ్‌.. త్రీ డేస్‌ బ్యాక్‌ పెంట్ హౌస్‌లో కూర్చొని తాగాం మనం. అభినవ్‌ : అది వేరురా.. కార్తిక్‌: లాస్ట్‌ వీకే కదరా.. క్లబ్‌లో ఎంట్రీ కోసం వచ్చి తాగినాం అభినవ్‌ : నేను ఎక్కువ తాగలేదు ఆ రోజు. విష్వక్‌ : టూ డేస్‌ అయ్యింది వీడు మందు తాగాం అని కాల్‌ చేసి.. అభినవ్‌ : అయితే ఏంది ఇప్పుడు.. నేను అనొద్దా ఇట్లా. ఎగ్జామినేషన్‌ హాల్‌లో కూర్చున్నట్లు అందరం సైలెంట్‌గా కూర్చోవాలా. నువ్వేందిరా గ్లాసెస్ వేసుకున్నావ్‌ (విష్వక్‌తో). ఆరింటి తర్వాత కళ్లద్దాలు పెట్టుకుంటే గుడ్లు పెట్టి కొట్టేవాళ్లం నీకు గుర్తు లేదా? ఎందుకు పెట్టుకున్నావ్‌. విష్వక్‌ : పళ్లు రాలతాయ్‌.. అర్థమవుతుందా ఉప్పు : కళ్లల్లో మండే అగ్ని గోళాలను ఆపుకోడానికి ఈ రైబాన్‌ వేసుకున్నాడు చూశావా? అభినవ్‌ : లవ్‌ అయ్యిందా రా? (కార్తిక్‌ తో) కార్తిక్ : లవ్‌ ఏముంది రా.. ఫస్ట్ డెవలప్‌ అవ్వాలి.. పెళ్లి అయ్యాక ఇవన్నీ అయిపోతాయి. నలుగురు ఫ్రెండ్స్‌: డెవలప్‌.. డెవలప్‌.. డెవలప్‌.. డెవలప్‌.. https://youtu.be/qAluEZGqhh8?si=IymIAooV_cchv61s అభినవ్‌ గోమఠంను ఫేమస్‌ చేసిన సింగిల్‌ లైన్‌ డైలాగ్స్‌? ‘ఛీ దీనెమ్మ ఏం టార్చర్‌’ ‘ఏం రా వేడి చేసిందా’ అభినవ్‌ గోమఠం బెస్ట్‌ యాక్టింగ్‌ సీన్‌? ఈ నగరానికి ఏమైంది సినిమాలో అభినవ్‌ పాత్రను పరిచయం చేసే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. ఇందులో అభినవ్‌ తన నటనతో అదరగొట్టాడు. ముఖ్యంగా జంతువులకు డబ్బింగ్‌ చెప్పేటప్పుడు అతడు ఎక్స్‌ప్రెషన్స్‌ నవ్వులు తెప్పిస్తాయి. అభినవ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఓ సారి మీరు చూసేయండి.&nbsp; https://youtu.be/9uiW6XzEEWc?si=SxGSZETzIZbJcyzF అభినవ్‌ గోమఠం చిత్రాలు/సిరీస్‌లకు సంబంధించిన పోస్టర్లు? అభినవ్‌ గోమఠం వైరల్‌ వీడియో ఏది? దావత్‌ అనే షోలో అభినవ్‌ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఇందులో సన్నీ లియోన్‌ ప్రస్తావన రాగా.. ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు ఆమె ప్రీవియస్‌ వర్క్స్‌ చూసేవాడినని చెప్తాడు. ఈ మాటతో యాంకర్‌ రీతు సహా అక్కడ ఉన్న వారంతా ఇరగపడి నవ్వుతారు. ఇందుకు సంబంధించిన వీడియోపై ఓ లుక్కేయండి. https://www.instagram.com/reel/C5ksjvkpqib/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA== అభినవ్‌ గోమఠం రీసెంట్‌ ఫొటోలు?
    ఏప్రిల్ 26 , 2024
    OTT Release This Week: ఈ వారం ఓటీటీ/ థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే!
    OTT Release This Week: ఈ వారం ఓటీటీ/ థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే!
    ఈ దసరా పండగకు థియేటర్లు దద్దరిల్లనున్నాయి. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు మూవీలు సినిమా హాళ్లో మోత మోగించనున్నాయి. బాలయ్య, రవితేజ ఇద్దరు పెద్ద స్టార్లు కావడంతో ఈసారి దసరా.. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచనుంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల హీరోలు ప్రమోషన్లలో తెగ బీజీగా ఉన్నారు. రెండు మాస్ యాక్షన్ చిత్రాలు కావడంతో ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ చిత్రం విజయ్ నటించిన లియో కూడా దసరా బరిలో నిలుస్తోంది. మరి ఏ చిత్రం ప్రేక్షకులను రంజింప జేయనుందో తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే. అటు ఓటీటీ ఫ్లాట్‌ ఫారమ్స్‌లోనూ 20కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దామా... టైగర్ నాగేశ్వర రావు స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే సినిమాలో రవితేజ మాస్ యాక్షన్‌తో ఇరగదీసినట్లు అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే దాదాపు 23 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ తిరిగి ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేస్తుండటంతో సినిమాపై మాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రమోషన్లలో చిత్ర యూనిట్ బిజీగా గడుపుతోంది. రవితేజ అన్ని తానై మూవీ ప్రమోషన్లలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. భగవంత్ కేసరి బాలకృష్ణ మాస్ డైలాగ్స్‌తో ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఇదివరకు ఎప్పుడూ చూడని పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని డైరెక్టర్ అనిల్ రావుపూడి చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 'భగవంత్ కేసరి ఈ పేరు సానా ఏళ్లు గుర్తుంటుంది' అని బాలయ్య డైలగ్ ప్రేక్షకుల్లో బాగా నానుతోంది. మహిళా సాధికారత కథాంశంగా ఈ సినిమా తెరకెక్కిందని బాలయ్య ఇప్పటికే తెలిపారు. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. థమన్ సంగీతం అందించారు. శ్రీలీల బాలయ్య కూతురుగా నటించింది. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. లియో స్టార్ కాస్టింగ్‌తో వస్తున్న చిత్రం లియో. తమిళ్ సూపర్ స్టార్ విజయ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్ సినిమాలు భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు మ్యాన్షన్ 24 బుల్లితెర యాంకర్, డైరెక్టర్ ఓంకార్ తెరకెక్కించిన వెబ్‌ సిరీస్ మ్యాన్షన్ 24. ఈ వెబ్ సిరీస్ హాట్‌ స్టార్‌లో అక్టోబర్ 17నుంచి స్ట్రీమింగ్ కానుంది. హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్, అవికాగోర్, బిందు మాధవి, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ వెబ్‌ సిరీస్ రానుంది.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateRick and Marty: Season 7WebseriesEnglishNetflixOctober 16I Walked Up A VampireWebseriesEnglishNetflixOctober 17The Devil on TrialWebseriesEnglishNetflixOctober 17Kaala PaaniWebseriesEnglishNetflixOctober 18Singapenne&nbsp;MovieTamil&nbsp;NetflixOctober 18Bodies&nbsp;Web SeriesEnglishNetflixOctober 19Captain Lazer Hawk: A Blood Dragon RemixWeb SeriesEnglish&nbsp;NetflixOctober 19Crypto BoyMovieDutch&nbsp;NetflixOctober 19NeonWeb SeriesEnglishNetflixOctober 19CreatureWeb SeriesTurkishNetflixOctober 20DoonaWeb SeriesKorean&nbsp;NetflixOctober 20Elite Season 7Web Series&nbsp;SpanishNetflixOctober 20Kandasams: The BabyMovie&nbsp;EnglishNetflixOctober 20Old DadsMovieEnglishNetflixOctober 20Once Upon A StudioMovieEnglishDisney Plus HotstarOctober 16Mansion 24Web SeriesTeluguDisney Plus HotstarOctober 17The Wandering Earth IIMovieMandarinAmazon PrimeOctober 18Permanent Roommates: Season 3Web SeriesHindiAmazon PrimeOctober 18Mama MashchindraMovieTeluguAmazon PrimeOctober 20Sayen: Desert RoadMovieEnglishAmazon PrimeOctober 20The Other JoyMovieEnglishAmazon PrimeOctober 20Transformers: The Rise of the BeastsMovieEnglishAmazon PrimeOctober 20Upload Season 3Web SeriesEnglishAmazon PrimeOctober 20Unstoppable Limited Edition&nbsp;Talk ShowTeluguahaOctober 17Red SandalwoodMovieTamilahaOctober 20Krishna RamaMovieTeluguE-WinOctober 22
    అక్టోబర్ 16 , 2023
    <strong>Devara Movie Review: ఎర్ర సముద్రానికి ముచ్చెమటలు పట్టించిన ‘దేవర’.. తారక్‌ ఖాతాలో హిట్‌ పడినట్లేనా?</strong>
    Devara Movie Review: ఎర్ర సముద్రానికి ముచ్చెమటలు పట్టించిన ‘దేవర’.. తారక్‌ ఖాతాలో హిట్‌ పడినట్లేనా?
    నటీనటులు: ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో తదితరులు రచన, దర్శకత్వం: కొరటాల శివ సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌ సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌ నిర్మాత: సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్‌ విడుదల తేదీ: 27-09-2024 ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. ఎన్టీఆర్‌ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 27న (devara release date) వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప (శ్రీకాంత్), కుంజర (షైన్‌ టామ్‌ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ (మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్‌ అవుతాడు. ఇందుకు భైరవ ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవర వారికి తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. ఇక దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు దొంగ సరకు తీసుకురాకుండా దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం (జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్‌ యతితో దేవర కథకు సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే తారక్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇందులోనూ దేవర, వర అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్‌లో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించుకున్నాడు. అటు డ్యాన్స్‌లోనూ ఇరగదీశాడు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌ పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయింది. తంగం పాత్రలో అచ్చమైన తెలుగమ్మాయిగా కనిపించింది. అయితే ఆమె పాత్ర కొద్దిసేపే ఉండటం గమనార్హం. విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ ఆకట్టుకున్నారు. తారక్‌ను ఢీ కొట్టే పాత్రలో అతడు గొప్ప ప్రభావం చూపించారు. శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్‌, అజయ్, మురళీశర్మ, శ్రుతి తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. మిగిలిన నటులు సైతం తమ పరిధిమేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు కొరటాల శివ ఎర్రసముద్రం పేరుతో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి తనదైన శైలిలో డ్రామా, భావోద్వేగాలు పండించే ప్రయత్నం చేశారు. ప్రథమార్ధంలో ఎర్ర సముద్రం కథ, దేవర-భైర పాత్రలు, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, పోరాట ఘట్టాలు, పాటలు, దేవర చూపించే భయం దేనికవే సాటి అనేలా కొరటాల చూపించారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా అదిరిపోయేలా ప్లాన్‌ చేశారు. ఫస్టాఫ్‌ అంతా దేవర చుట్టు తిప్పిన కొరటాల, సెకండాఫ్‌లో వర పాత్రను తెరపైకి తీసుకొచ్చారు. రెండో ఎన్టీఆర్‌ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్‌ ఎపిసోడ్స్‌ను బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్ని బోరింగ్‌గానే సాగుతాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌లో సముద్రం లోపల ఎన్టీఆర్‌తో వచ్చే యాక్షన్‌ సీన్లు అదిరిపోతాయి. క్లైమాక్స్‌ కొంతవరకు ఆసక్తికరంగా సాగినా ట్విస్ట్‌ పాయింట్‌ బాహుబలి సినిమాను గుర్తు చేస్తుంది. పార్ట్‌ 2కి లీడ్‌ ఇస్తూ దేవర కథను కొరటాల ముంగించారు. అయితే ప్రథమార్థం స్థాయిలో సెకండ్‌ పార్ట్‌ లేకపోవడం, పేలవమైన లవ్‌ట్రాక్‌, సాగదీత సీన్స్‌, ఊహకందేలా కథనం, ఒక్కప్పటి సినిమాల్లోని కొరటాల మార్క్‌ మిస్‌ కావడం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; సాంకేతికంగా&nbsp; టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. అనిరుధ్‌ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. చుట్టంమల్లే పాటకు థియేటర్స్‌లో ఈలలు పడతాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ ఎన్టీఆర్‌ నటనప్రథమార్థంసినిమాటోగ్రఫీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సెకండ్‌ పార్ట్‌పేలవమైన లవ్‌ట్రాక్‌ Telugu.yousay.tv Rating : 3.5/5  ‘దేవర’ గురించి నెటిజన్లు ఏమంటున్నారంటే? (Devara Public Talk) దేవర చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ట్విటర్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తారక్‌ నటన, యాక్షన్‌ సీక్వెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా అనిరుధ్‌ అందించిన పాటలు, నేపథ్యం సంగీతం అదిరిపోయిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని నెగిటివ్‌ పోస్టులు సైతం దేవరపై దర్శనమిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. దేవరలో ఎన్టీఆర్‌ నటన ఔట్‌ స్టాండింగ్‌గా ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు దేవర నచ్చుతాడని పోస్టు పెట్టాడు. https://twitter.com/vamsikaka/status/1839539465427263788 దేవర చిత్రానికి అనిరుధ్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం నెక్స్ట్‌ లెవల్లో ఉన్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. 'అదేం కొట్టుడు రా బాబు' అంటూ అనిరుధ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. https://twitter.com/NaveenKRaju22/status/1839415238132924882? దేవర దెబ్బకు థియేటర్లు తగలబడిపోతున్నాయంటూ మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఫస్టాఫ్‌ ఫెంటాస్టిక్‌.. సెకండాఫ్ సూపర్బ్‌.. బీజీఎం హై-వోల్టేజ్‌లో ఉందని కామెంట్‌ చేశాడు. https://twitter.com/Keerthan0712/status/1839544841291825305 దేవర ఫస్ట్‌ పార్ట్‌ చాలా బాగుందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. అయితే సెకండ్‌ పార్ట్ మాత్రం చాలా ప్రిడక్టబుల్‌గా ఉందని పేర్కొన్నారు. ఓవరాల్‌గా దేవర సంతృప్తి ఇస్తుందని రాసుకొచ్చాడు. https://twitter.com/venkyreviews/status/1839437743883178036? దేవర చిత్రం తనను తీవ్రంగా నిరాశ పరిచినట్లు ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. అంచనాలను అందుకోవడంలో విఫలమైందని పేర్కొన్నాడు. అసలు జాన్వీని హీరోయిన్‌గా ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదని పోస్టు పెట్టాడు. https://twitter.com/Fukkard/status/1839446863818162549
    సెప్టెంబర్ 27 , 2024
    <strong>ARM Movie Review: మూడు తరాల కథతో వచ్చిన మలయాళం యాక్షన్‌ డ్రామా.. ‘ఎ.ఆర్‌.ఎం’ ఆకట్టుకుందా?</strong>
    ARM Movie Review: మూడు తరాల కథతో వచ్చిన మలయాళం యాక్షన్‌ డ్రామా.. ‘ఎ.ఆర్‌.ఎం’ ఆకట్టుకుందా?
    నటీనటులు: టొవినో థామస్‌, కృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్‌, సురభి లక్ష్మి, బసిల్‌ జోసెఫ్‌, జగదీష్‌, కబీర్‌ దుహాన్‌సింగ్‌ తదితరులు దర్శకత్వం: జితిన్‌ లాల్‌ రచన: సుజిత్‌ నంబియార్‌ సంగీతం : థిబు నినన్‌ థామస్‌ సినిమాటోగ్రఫీ: జోమోన్‌టి ఎడిటింగ్‌: షమీర్‌ మహ్మద్‌ మలయాళ నటుడు టొవినో థామస్‌ (Tovino Thomas) తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు లీడ్‌ రోల్‌లో నటించిన ‘మిన్నల్‌ మురళి’, ‘2018’ చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించాయి. అతడు హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం 'ఎ.ఆర్‌.ఎమ్‌' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో టొవినో థామస్‌కు జోడీగా కృతి శెట్టి నటించింది. మల‌యాళంలో ‘అజ‌యంతే రండ‌మ్ మోష‌న‌మ్’ (ఎ.ఆర్‌.ఎమ్‌) పేరుతో ఈ చిత్రం రూపొందింది. తెలుగులో ‘అజ‌య‌న్ చేసిన రెండో దొంగ‌త‌నం’ అని అర్థం. కాగా, పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన 'ఏఆర్ఎం' మూవీ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరించిందా? టొవినో థామస్‌ ఖాతాలో మరో విజయం నమోదైనట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి అజ‌య్ (టొవినో థామ‌స్‌) ఊళ్లో చిన్న చిన్న ప‌నులు చేసుకుంటూ త‌ల్లి (రోహిణి)తో క‌లిసి జీవిస్తుంటాడు. తాత మ‌ణియ‌న్ (టొవినో థామ‌స్‌) ఒక‌ప్పుడు పేరు మోసిన దొంగ కావడంతో ఊళ్లో ఎక్క‌డ దొంగ‌త‌నం జ‌రిగినా అజ‌య్‌ని అనుమానిస్తుంటారు. మరోవైపు ఆ ఊరి గుడిలో కొలువైన శ్రీభూతి దీపం (విగ్రహం) బంగారం కంటే ఎంతో విలువైంది. దాన్ని కాజేయాల‌నే ల‌క్ష్యంతో సుదేవ్‌వ‌ర్మ (హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) ఆ ఊళ్లో అడుగుపెడతాడు. దీపాన్ని కొట్టేసి ఆ నింద అజ‌య్‌పై ప‌డేలా ప్లాన్‌ చేస్తాడు. అయితే ఎన్నో త‌ర‌త‌రాలుగా ఆ దీపాన్ని అజ‌య్ కుటుంబం రక్షిస్తూ వస్తుంది. మ‌రి ఈసారి అజ‌య్ దాన్ని ఎలా కాపాడాడు? ఆ విగ్ర‌హం వెనకున్న చ‌రిత్ర ఏంటి? ఆ చ‌రిత్ర‌లో మహావీరుడు కుంజికేలు (టొవినో థామ‌స్‌) పాత్ర? ల‌క్ష్మి (కృతిశెట్టి)తో అజ‌య్ లవ్‌ ట్రాక్‌? గురించి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే టొవినో థామ‌స్ మూడు పాత్ర‌లపై గ‌ట్టి ప్ర‌భావం చూపించారు. వీరుడైన కుంజికేలుగా అతడు ప్ర‌ద‌ర్శించిన యుద్ధ విద్య‌లు, చేసిన పోరాట ఘ‌ట్టాలు ఆక‌ట్టుకుంటాయి. తాత మ‌ణియ‌న్ పాత్రలో కూడా అతడి నటన మెప్పిస్తుంది. ఆ రెండు పాత్ర‌ల్లో టొవినో ఎంత వీరోచితంగా నటించాడో అజ‌య్ పాత్ర‌లో అంతే సాత్వికంగా చేసి ఆశ్చర్యపరిచాడు. ప్రతీ పాత్రలో వైవిధ్యం చూపించి నటనలో తనకు తిరుగులేదని చాటి చెప్పాడు. అటు ల‌క్ష్మి పాత్ర‌లో కృతిశెట్టి చక్కటి నటన కనబరించింది. 90ల నాటి అమ్మాయిగా అభినయం ప్రదర్శించింది. సుర‌భి ల‌క్ష్మి పాత్ర ఆక‌ట్టుకుంటుంది. ఆమె రెండు కోణాల్లో సాగే పాత్ర‌లో క‌నిపిస్తారు. రోహిణి, హ‌రీష్ ఉత్త‌మ‌న్ పాత్ర‌లూ క‌థ‌లో కీల‌కం.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు జితిన్‌లాల్‌కు ఇదే తొలి చిత్ర‌మైనా మూడు త‌రాల‌తో ముడిప‌డిన ఈ క‌థ‌ని స్ప‌ష్టంగా తెర‌కెక్కించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. మ‌హావీరుడు కేలు క‌థ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం నుంచి ఆయన సినిమాను ప‌రుగులు పెట్టించారు. అతడి ప‌రాక్ర‌మం, రాజ్యాన్ని కాపాడినందుకు మ‌హారాజుని అడిగిన వరం, ఆ త‌ర్వాత అత‌నికి తెలిసిన నిజం త‌దిత‌ర స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. కేలు పాత్ర‌కు దీటుగా త‌ర్వాత త‌రానికి చెందిన మ‌ణియ‌న్ పాత్రని ఆవిష్క‌రించారు దర్శకుడు. ఈ సినిమాకి మ‌ణియ‌న్ పాత్రే హైలైట్‌. దీపం ఎక్క‌డుందో మ‌ణియ‌న్ క‌నుక్కుని, దాన్ని కాజేసే స‌న్నివేశాలు బాగుంటాయి. మ‌ణియ‌న్‌, అజ‌య‌న్‌ పాత్ర‌ల్ని ఒకే చోటకి తీసుకొచ్చిన‌ప్పుడు రేకెత్తే సంఘ‌ర్ష‌ణ హృదయాల్ని హ‌త్తుకుంటుంది. అయితే ఇతర పాత్రలు ప్రభావవంతంగా లేకపోవడం, పేలవమైన లవ్‌ట్రాక్‌, ఊహకందే కథనం, బలహీనమైన క్లైమాక్స్‌ ఈ చిత్రానికి మైనస్‌లుగా మారాయి.&nbsp; టెక్నికల్‌గా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. థిబు నేప‌థ్య సంగీతం, పాట‌లు చిత్రానికి కొత్త హంగుని చేకూర్చాయి. జోమోన్ టి.జాన్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ టొవినో థామస్‌ నటనకథా నేపథ్యంసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఊహకందే కథనంబలహీనమైన క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 12 , 2024
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని&nbsp; అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని&nbsp; అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు టెనెంట్‌ హాస్య నటుడు సత్యం రాజేష్‌ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్‌' (Tenant). ఏప్రిల్‌ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ. శశివదనే రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ&nbsp; ప్రేమ కథ సాగనుంది. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.&nbsp; లవ్‌ మౌళి అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్‌ హీరోగా చేసిన సినిమా 'లవ్‌ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్‌ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. మార్కెట్‌ మహాలక్ష్మీ కేరింత ఫేమ్‌ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.&nbsp; శరపంజరం నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మార‌ణాయుధం సీనియర్‌ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించిన తాజా చిత్రం ‘మార‌ణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్‌ యూ శంకర్‌&nbsp; దర్శకుడు రాజీవ్‌ ఎస్‌.రియా.. ‘మై ఫ్రెండ్‌ గణేశా’ యానిమేషన్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్‌ యూ శంకర్‌’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్‌ తల్పాడే, తనీషా జంటగా నటించారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సైరెన్‌ జ‌యం ర‌వి (Jayam Ravi) క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మై డియర్ దొంగ&nbsp; ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.&nbsp; ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన యువ‌కుడు.. అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డే బందీగా చిక్కుకుపోతే ఏం జ‌రిగింది? దొంగ‌కు, యువ‌తికి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలాంటి మ‌లుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది. కాటేరా కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
    ఏప్రిల్ 15 , 2024
    Japan Movie Review: దొంగగా ‘కార్తీ’ నటన అదుర్స్‌.. మరి ‘జపాన్‌’ హిట్టా? ఫట్టా?
    Japan Movie Review: దొంగగా ‘కార్తీ’ నటన అదుర్స్‌.. మరి ‘జపాన్‌’ హిట్టా? ఫట్టా?
    నటీనటులు: కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, కెఎస్ రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు&nbsp; దర్శకత్వం: రాజు మురుగన్ ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్ సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాతలు: S.R ప్రభు, S.R ప్రకాష్ బాబు విడుదల తేదీ: నవంబర్ 10, 2023&nbsp;&nbsp; టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న తమిళ నటుల్లో హీరో కార్తీ (Karthi) ఒకరు. స్టార్‌ హీరో సూర్య సోదరుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ నేపథ్యంలోనే కార్తీ నుంచి ఏ సినిమా వచ్చిన తెలుగులో భారీ అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కార్తీ కొత్త సినిమా ‘జపాన్‌’ (Japan) ఇవాళ (నవంబర్ 10) తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, ప్రమోషనల్‌ చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. మరి దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? కార్తీ చేసిన కొత్త ప్రయత్నం ఫలించిందా? ఇంతకీ సినిమా హిట్టా? ఫట్టా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు, ఆభరణాలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అందరూ అనుమానిస్తారు. శ్రీధర్ (సునీల్), భవాని (విజయ్ మిల్టన్) ఇద్దరి నేతృత్వంలోని రెండు బృందాలు జపాన్ కోసం వేట మొదలు పెడతాయి. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. దోచుకున్న డబ్బులతో సినిమాలు తీసిన జపాన్.. స్టార్ హీరోయిన్ సంజు (అనూ ఇమ్మాన్యుయేల్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో ఆమెను కలుసుకునేందుకు వెళ్లిన జపాన్‌ను పోలీసులు పట్టుకుంటారు. అయితే తాను దొంగతనం చేయలేదని చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడతారు. జపాన్ కాకపోతే ఆ దొంగతనం చేసింది ఎవరు? ఈ కేసును పోలీసులు ఎలా పరిష్కరించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే క్యారెక్టర్ కోసం కార్తీ పడిన కష్టం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా జపాన్ యాస పలకడం కోసం ఆయన శ్రమించారు. హెయిర్ స్టైల్, డ్రసింగ్ స్టైల్ ఛేంజ్ చేశారు. కార్తీ యాక్టింగ్ &amp; ఎఫర్ట్స్ వరకు ఎటువంటి లోపం లేదు. తన పాత్ర వరకు ఆయన న్యాయం చేశారు. హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్‌ యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్ లేదు. గ్లామర్‌ సన్నివేశాలకు మాత్రమే ఆమె పరిమితమైంది. ఇక సునీల్‌ తన నటనతో సూపర్ అనిపించాడు. తన లుక్‌, గెటప్‌తోనే సగం మార్కులు కొట్టేశాడు. ఆయన కోసమే అన్నట్లు మధ్యలో కామెడీ సీన్లు కూడా ఉన్నాయి. భవాని పాత్రలో విజయ్ మిల్టన్ యాక్టింగ్ ఓకే. కెఎస్ రవికుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? దర్శకుడు రాజు మురుగన్ ఓ దొంగ చుట్టూ అల్లుకొన్న సింగిల్ పాయింట్ స్టోరీని ఎమోషనల్‌గా మార్చడంలో విఫలమయ్యారు. జపాన్ క్యారెక్టర్‌పై పెట్టిన శ్రద్ద కథపై, స్క్రీన్ ప్లే, ఇతర క్యారెక్టర్లపై పెట్టలేదనే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలను, క్లారిటీ లేని క్యారెక్టర్లను సాగదీస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే కార్తీ కోసం రాసుకొన్న డైలాగ్స్, కొన్ని సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి.&nbsp; సాంకేతికంగా టెక్నికల్ అంశాల పరంగా చూసినా 'జపాన్' ఆకట్టుకోవడం కష్టం. సినిమాటోగ్రఫీలో డార్క్ థీమ్, లో లైట్ ప్యాట్రన్స్ ఫాలో అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో మళ్ళీ వినాలనిపించే పాటలు లేవు. నేపథ్య సంగీతం అంతంతమాత్రంగానే ఉంది. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ అనుకున్నవి ఏవీ వర్కవుట్ కాలేదు. తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ కార్తీ నటనకామెడీ సీన్స్‌ మైనస్ పాయింట్స్‌ సాగదీత సీన్లుసంగీతంసినిమాటోగ్రఫీ రేటింగ్‌: 2.5/5
    నవంబర్ 10 , 2023
    This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
    దసరా సందర్భంగా థియేటర్లలో నెలకొన్న చిత్రాల హంగామా దీపావళికి కూడా కొనసాగనుంది. ఈసారి దీపావళి సందర్భంగా పలు డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు టైగర్‌ 3 బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్ (Salman Khan) హీరోగా మనీష్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘టైగర్‌3 ’ (Tiger 3) దీపావళి కానుకగా రాబోతోంది. నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ (Katrina Kaif)&nbsp;నటించింది. ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, సల్మాన్‌పై చిత్రీకరించిన ఫైట్‌ సీక్వెన్స్‌లు అదరహో అనేలా ఉన్నాయి.&nbsp; జపాన్‌ కథనాయకుడు కార్తి (Karthi) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జపాన్’ (Japan). రాజు మరుగున్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా చేసింది. ఇందులో కార్తి ‘జపాన్‌’ అనే దొంగ పాత్రలో కనిపించనున్నారు. రూ.200 కోట్ల విలువైన ఆభరణాలు జపాన్‌ ఎలా దొంగిలించాడు? అతడిని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ఎత్తుగడలు ఏంటి? వంటి ఆసక్తికర అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. దీపావళి కానుకగా నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌ రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌’ (Jigarthanda DoubleX). ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్‌స్టర్‌ ఆధారంగా సినిమా తీయాలనుకున్న ఓ దర్శకుడు ఆ గ్యాంగ్‌స్టర్‌నే హీరోగా పెట్టి సినిమా తీయాల్సివస్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జిగర్‌ తండ’. ఇప్పుడు ఆ కథకే మరింత యాక్షన్‌ను జోడించి తెరపైకి ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. అలా నిన్ను చేరి దినేశ్‌ తేజ్‌ హీరోగా హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్‌ శివన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొమ్మాలపాటి సాయిసుధాకర్‌ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమ, కుటుంబ వినోదంతో కూడిన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ మెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇందులోని భావోద్వేగాలు మనసుల్ని హత్తుకుంటాయని పేర్కొంది.&nbsp; ది మార్వెల్స్‌ అమెరికన్‌ సూపర్‌ హీరో సినిమా ‘ది మార్వెల్స్‌’ (The Marvels) కూడా ఈ వారమే థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటి బ్రీ లార్సన్‌ కెప్టెన్‌ మార్వెల్‌ పాత్రలో కనిపించనుంది. నియా డకోస్టా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదల కానుంది.&nbsp; ఇమాన్‌ వెల్లని, టోయోనా ప్యారిస్‌, సియో-జున్‌ పార్క్‌, శామ్యూల్‌ ఎల్‌. జాకన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీపావళి అందమైన పల్లెటూరి కథతో ‘దీపావళి’ సినిమా రూపొందింది. రాము, వెంకట్‌, దీపన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్‌ దర్శకత్వం వహిచారు. పండగకు కొత్త డ్రెస్‌ కావాలని అడిగిన మనవడి కోసం తాత తన మేకను బేరం పెడతాడు. ఆ మేక చుట్టూ అల్లుకున్న ఓ అహ్లాదకరమైన కథే ఈ సినిమా. దీపావళి సందర్భంగా నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateRainbow rishtaSeriesEnglishAmazon PrimeNov 07BTS: Yet To ComeMovieEnglishAmazon PrimeNov 09PippaMovieHindiAmazon PrimeNov 10IrugapatruMovieTamilNetflixNov 06Escaping twin flamesSeriesEnglishNetflixNov 08The killerMovieEnglishNetflixNov 10The RoadMovieTamilAhaNov 10The Santa Clause 2SeriesEnglishDisney+HotstarNov 08LabelSeriesTeluguDisney+HotstarNov 10Ghoomer&nbsp;MovieHindiZee 5Nov 10 ………………………………………………………………………………………………………………. APP: దీపావళి సందర్భంగా సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవంబర్‌ 6 నుంచి 12వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏవో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
    నవంబర్ 06 , 2023
    Tiger Nageswara Rao Movie Review: రవితేజ యాక్షన్ ఫీస్ట్.. దసరా బరిలో విజేతగా నిలిచిన టైగర్ నాగేశ్వరరావు
    Tiger Nageswara Rao Movie Review: రవితేజ యాక్షన్ ఫీస్ట్.. దసరా బరిలో విజేతగా నిలిచిన టైగర్ నాగేశ్వరరావు
    మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విక్రమార్కుడు, రావణాసుర, శంభో శివ శంభో వంటి సీరియస్ క్యారెక్టర్ల తర్వాత మరోసారి సీరియస్ యాక్టింగ్‌కు స్కోప్‌ ఉన్న చిత్రంలో రవితేజ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్‌లో కూడా రవితేజ లుక్స్, యాక్షన్ సీన్లు అంచనాలను మరింత పెంచాయి. మరోవైపు ఇంతవరకు ఎవరు టచ్ చేయని స్టువర్ట్‌పురం సబ్జెక్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో సినిమాపై హైప్ నెలకొంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మించారు. మరి ఇంత హైప్ సృష్టించిన టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? దసరా బరిలో నిలిచిన ఈ సినిమా విజయం సాధించిందా? అనే విషయాలను YouSay రివ్యూలో చూద్దాం.&nbsp;&nbsp; తారాగణం: రవితేజ, గాయత్రీ భరద్వాజ్, నుపూర్‌ సనన్‌, రేణూ దేశాయ్, నాజర్, అనుపమ్ ఖేర్, జిషు సేన్ గుప్తా డైరెక్టర్: వంశీ కృష్ణా నిర్మాత: అభిషేక్ అగర్వాల్ సినిమాటోగ్రఫీ: మది ఐ.ఎస్.సి ఫైట్స్: రామ్-లక్ష్మణ్ సంగీతం: జీవీ ప్రకాశ్ విడుదల తేదీ: అక్టోబర్‌ 20, 2023&nbsp; కథ: టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ ధనికుల దగ్గర అందినంత బంగారం, డబ్బు దోచుకుంటూ పేదలకు పంచుతుంటాడు. అతనికి పోలీసులు సైతం భయపడుతుంటారు. అయితే స్టువర్టుపురంలో మాములు వ్యక్తిగా ఉన్న నాగేశ్వరరావు గజదొంగగా ఎలా మారాడు. అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? తాను దోచుకున్న డబ్బు ఏంచేశాడు? స్టువర్టుపురంలో ఎలాంటి మార్పుని అతను తీసుకు వస్తాడు..? టైగర్ నాగేశ్వరరావును పట్టుకోవాలని ప్రధానమంత్రి ఎందుకు ఆర్డర్ వేశారు?&nbsp; చివరకు టైగర్ నాగేశ్వరరావును పోలీసులు పట్టుకున్నారా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఇక సినిమా విషయానికి వస్తే... 1970లో స్టువర్టుపురంలో పేరు మోసిన గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు. ఆయన జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ కథలో భారీగానే మార్పులు చేశారు వంశీ. సినిమా స్టార్టింగ్‌ నుంచే ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్టాప్‌లో కొన్ని కామెడీ సీన్లు, యాక్షన్ సీన్లు పర్వాలేదనిపిస్తాయి. ఊరిలో జరిగే సంఘటనలను చక్కగా చూపించారు.&nbsp; సారా(నుపురు సనన్) టైగర్ నాగేశ్వరరావు మధ్య జరిగే లవ్ ట్రాక్.. ఇడియట్ సినిమా సీన్లను గుర్తు చేస్తుంది. అయితే మాములు జీవితం సాగిస్తున్న నాగేశ్వరరావు దొంగగా ఎలా మారాడు అనే సంఘటనలను డైరెక్టర్ వంశీ బాగా డీల్ చేశాడు అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో రాబిన్ హుడ్ స్టైల్‌కి మూవీ ట్రాక్ వెళ్తుంది. ధనికుల నుంచి టైగర్ నాగేశ్వరరావు అందినంత దోచేస్తుంటాడు. అలా దోచుకున్న సొమ్మును టైగర్ నాగేశ్వరరావు ఏం చేస్తాడు అనేది కూడా బాగా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపూ 1970 దశకంలోని వాతావరణానికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.&nbsp; అయితే టైగర్ నాగేశ్వరరావు అంటే కేవలం దొంగనే కాదు.. ఆయనలోని పాజిటివ్ కోణాన్ని చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఎవరెలా చేశారంటే రవితేజ మరోసారి తన యాక్షన్‌ పవర్‌ను బయట పెట్టాడు. లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్‌తో అదరగొట్టాడు. రవితేజ చెప్పిన డైలాగ్స్ థియేటర్స్‌లో ప్రేక్షకులను అలరిస్తాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో రవితేజ జీవించేశాడు. యాక్షన్ సిక్వెన్స్‌ అదిరిపోయాయి. ఇక హీరోయిన్ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు తమకు ఇచ్చిన రోల్స్‌లో మెప్పించారు. టైగర్ నాగేశ్వరరావు గజ దొంగ గ్యాంగ్‌లో యాక్ట్ చేసినవారు కూడా ఇంప్రెస్ చేస్తారు. ఈ సినిమాలో స్పేషల్ రోల్ చేసిన రేణు దేశాయ్ సామాజిక కార్యకర్తగా ఆకట్టుకుంది. ఆమె పాత్ర సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. నాజర్, జిషు సేన్ గుప్తా తమ పాత్రల్లో రాణించారు. అనుపమ్ ఖేర్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? &nbsp;'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వంశీకృష్ణ .. కెరీర్‌ ఆరంభంలోనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీయడంలో దాదాపుగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ప్రతి సీన్‌ను జాగ్రత్తగా రాసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్‌ ఫ్రేష్‌గా తీశాడు. రవితేజను టైగర్ నాగేశ్వరరావుగా చూపించడంలో విజయం సాధించాడు. ఫస్టాఫ్‌ను సెకండాఫ్‌తో కనెక్ట్ చేసిన విధానం బాగుంది. అయితే సెకండాఫ్‌లో లాగ్ అనిపిస్తుంది. కొన్ని సీన్లు తీసివేస్తే బాగుండు అనిపిస్తుంది. అలాగే నుపుర్- రవితేజ మధ్య వచ్చే లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. సింక్ లేకుండా వచ్చే పాటలు కూడా చికాకు తెప్పిస్తాయి. సెకండాఫ్‌పై ఇంకొంచెం శ్రద్ద పెడితే బాగుండు అనిపిస్తుంది. మొత్తానికి తాను అనుకున్న కథను ప్రేక్షకులకు చెప్పడంలో మాత్రం డైరెక్టర్ వంశీ సక్రెస్ అయ్యాడు. టెక్నికల్ పరంగా.. నిర్మాణ విలువల పరంగా టైగర్ నాగేశ్వరరావు సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. సినిమా కోసం పెట్టిన భారీ ఖర్చు సీన్లలో ప్రతిబింబిస్తుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలకు గూస్ బంప్స్ వస్తాయి. ఇక టాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు అంత ఆకట్టుకోకపోయినా… బీజీఎం మెప్పిస్తుంది. యాక్షన్ సిక్వెన్స్, రవితేజ డైలాగ్స్‌కు కొట్టిన BGM బాగుంది. మది ఐ.ఎస్.సి అందించిన సినిమాటోగ్రఫి, రామ్-లక్ష్మణ్ ఫైట్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.&nbsp; బలాలు రవితేజ యాక్టింగ్ యాక్షన్ సిక్వెన్స్ డైరెక్షన్ బలహీనతలు సింక్‌ లేకుండా మధ్య మధ్యలో వచ్చే పాటలు సెకండాఫ్‌లో కొన్ని లాగ్ సీన్లు చివరగా: టైగర్ నాగేశ్వరరావు అంటే కేవలం గజ దొంగ కథ మాత్రమే కాదు... ఓ పాజిటివ్ వైబ్రెషన్. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే సినిమా మంచి వినోదాన్ని పంచుతుంది. రేటింగ్: 3/5
    అక్టోబర్ 20 , 2023
    <strong>Devara Weekend Collections: బాక్సాఫీస్‌పై ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ‘దేవర’.. మూడు రోజుల్లో రూ.300 కోట్లు!</strong>
    Devara Weekend Collections: బాక్సాఫీస్‌పై ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ‘దేవర’.. మూడు రోజుల్లో రూ.300 కోట్లు!
    ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ చిత్రం శుక్రవారం (సెప్టెంబర్‌ 27) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. అక్కడక్కడ మిక్స్‌డ్‌ టాక్‌ మినహా ఓవరాల్‌గా పాటిజివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. రిలీజైన అన్ని థియేటర్లలో హౌస్‌ ఫుల్‌ బోర్డ్స్‌తో దేవర ప్రదర్శితమవుతోంది. ఎన్టీఆర్‌ నటన, అనిరుధ్‌ మ్యూజిక్‌, కొరటాల శివ డైలాగ్స్ అదిరిపోయాయంటూ ప్రేక్షకులు కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో తొలిరోజు దేవర రూ.172 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది. వీకెండ్‌ (శుక్ర, శని, ఆది) పూర్తయ్యే సరికి ఈ సినిమా కలెక్షన్స్‌ ఎన్ని కోట్లకు చేరాయో ఇప్పుడు చూద్దాం. వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే? ఎన్టీఆర్‌-జాన్వీకపూర్‌ జంటగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలై నేటితో మూడు రోజులు పూర్తైనా కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. ఈ చిత్రం వీకెండ్‌లో ఏకంగా రూ.304 కోట్లు (GROSS) వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఈ విషయాన్ని మేకర్స్‌ ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో తారక్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. బాక్సాఫీస్‌ వద్ద దేవర ఊచకోత కొనసాగుతోందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే మూడు వందల కోట్ల క్లబ్‌లో చేరిన ‘దేవర’ ఈ వారంలోనే ఈజీగా రూ.500 కోట్లు రాబడుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1840623014981075232 ప్రాంతాల వారీగా..&nbsp; దేవర మేకర్స్‌ వరల్డ్ వైడ్‌ కలెక్షన్స్ మాత్రమే ప్రకటించారు. అయితే ట్రేడ్‌ వర్గాలు మాత్రం ప్రాంతాల వారీగా దేవర వసూళ్లను అంచనావేసే ప్రయత్నం చేశాయి. వాటి ప్రకారం దేవర చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల వ్యవధిలో రూ.126.5 కోట్లు కొల్లగొట్టింది. ఒక్క నైజాంలోనే రూ.38.77 కోట్లు రాబట్టింది. సీడెడ్‌ ఏరియాల్లో రూ.17.90 కోట్లు దేవరకు వచ్చి చేరాయి.&nbsp; కర్ణాటకలో రూ. 20.9 కోట్లు, తమిళనాడులో రూ.5.9 కోట్లు, కేరళలో రూ.1.4 కోట్లు, రెస్‌ ఆఫ్ ఇండియాలో రూ.35.3 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. అటు ఓవర్సీస్‌లో రూ.65 కోట్లకు పైగా దేవర వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. మెుత్తంగా కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ సాధిస్తూ తారక్‌ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్నాడు.&nbsp; డే 1 కలెక్షన్స్‌తో కొత్త రికార్డులు! ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే (సోలో హీరోగా) అత్యధిక డే 1 కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా దేవర నిలిచింది.&nbsp;దేవర చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేశారు.&nbsp; ‘RRR’ తర్వాత తారక్‌ కెరీర్‌లో ఇదే అత్యధికం. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.83.71 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఒక్క నైజాంలోనే 19.32 కోట్ల వసూళ్లు అందుకొని 'RRR' తర్వాత ఆల్‌టైమ్‌ టాప్‌- 2లో నిలిచిందని పేర్కొన్నాయి. దేవర సక్సెస్‌కు కారణాలు ఇవే! దేవరలో ఎర్ర సముద్రం అనే సరికొత్త ప్రపంచాన్ని దర్శకుడు కొరటాల శివ సృష్టించారు. ఈ సినిమాలో తారక్‌ వన్‌ మ్యాన్‌ షో చేశారు. దేవర, వర అనే తండ్రి కొడుకుల పాత్రలో అద్వితీయమైన నటన కనబరిచాడు. మరోవైపు విలన్‌గా చేసిన సైఫ్ అలీఖాన్‌ కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అనిరుధ్‌ ఇచ్చిన బీజీఎం సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని చెప్పవచ్చు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో అనిరుధ్‌ బీజీఎం గూస్‌బంప్స్‌ తెప్పించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ తనదైన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో మెప్పించారు. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ రూపొందించిన తీరు అభినందనీయం. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, క్లైమాక్స్‌ ఆడియన్స్‌కు మంచి మజాను అందించాయి. అయితే సాగదీత సన్నివేశాలు, పేలవమైన లవ్‌ట్రాక్‌ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు. దేవర స్టోరీ ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప (శ్రీకాంత్), కుంజర (షైన్‌ టామ్‌ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ (మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్‌ అవుతాడు. ఇందుకు భైరవ ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవర వారికి తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. ఇక దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు దొంగ సరకు తీసుకురాకుండా దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం (జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్‌ యతితో దేవర కథకు సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp;
    సెప్టెంబర్ 30 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌&nbsp; ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; 2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది.&nbsp;ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best&nbsp; Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) &amp; గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:&nbsp; నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ&nbsp; నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ&nbsp; అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా&nbsp; మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన&nbsp; సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని&nbsp; ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.&nbsp; ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    Maharaja Movie Review: కర్మ సిద్దాంతంతో వచ్చిన రీవేంజ్‌ డ్రామా.. ‘మహారాజా’ మెప్పించాడా?
    Maharaja Movie Review: కర్మ సిద్దాంతంతో వచ్చిన రీవేంజ్‌ డ్రామా.. ‘మహారాజా’ మెప్పించాడా?
    నటీనటులు: విజయ్‌ సేతుపతి, అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, నటరాజ్‌, భారతీరాజా, అభిరామి తదితరులు రచన, దర్శకత్వం: నిథిలన్‌ స్వామినాథన్‌ సంగీతం: అజనీశ్‌ లోకనాథ్‌ ఎడిటింగ్‌: ఫిల్లోమిన్‌ రాజ్‌ సినిమాటోగ్రఫీ: దినేశ్ పురుషోత్త‌మ‌న్‌ నిర్మాత: సుదర్శన్‌ సుందరమ్‌, జగదీశ్‌ పళనిస్వామి విడుదల : 14-06-2024 తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) నటించిన లేటెస్ట్‌ చిత్రం 'మహా రాజా' (Maharaja). అతడి కెరీర్‌లో 50వ చిత్రంగా ఇది రూపొందింది. దీంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. నిథిలాన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్‌ దాస్‌, అనురాగ్‌ కశ్యప్‌, మునీశ్‌ కాంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం సమకూర్చారు. జూన్‌ 14న ప్రపంచవ్యాప్తంగా తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజైంది. మరి ‘మహా రాజా’ ఎలా ఉంది? ఎప్పటిలాగే విజయ్‌ సేతుపతి తన నటనతో అదరగొట్టాడా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. కథేంటి బార్బర్‌గా పనిచేసే మ‌హారాజా (విజ‌య్ సేతుప‌తి) ఒక‌ ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకుంటాడు. కూతురు జ్యోతియే ప్రాణంగా సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. కట్‌ చేస్తే ఒక రోజు మ‌హారాజా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్తాడు.&nbsp; ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై దాడి చేశార‌ని ఫిర్యాదు చేస్తాడు. ఈ క్ర‌మంలోనే త‌న బిడ్డ ప్రాణాల్ని కాపాడిన ల‌క్ష్మీని ఎత్తుకెళ్లిపోయార‌ని చెబుతాడు. ఎలాగైన ఆ ల‌క్ష్మిని వెతికి పెట్ట‌మ‌ని పోలీసుల‌ను వేడుకుంటాడు. ఇంతకీ ఆ ల‌క్ష్మి ఎవ‌రు? మహారాజాపై దాడి ఎందుకు జరిగింది? వారితో మహారాజాకు ఉన్న వైరం ఏంటి? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? చివరికీ లక్ష్మీ దొరికిందా? లేదా? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే మహారాజా పాత్రలో విజయ్‌ సేతుపతి ఎప్పటిలాగే అద్భుత నటన కనబరిచాడు. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై మోశారు. తన కూతురికి అన్యాయం చేసిన వారిని వెంటాడి హతమార్చే క్రమంలో వచ్చే మాస్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ఇక కూతురు జ్యోతి పాత్రలో సచిన నటన మెప్పిస్తుంది. క్లైమాక్స్‌లో ఆమె నటన శభాష్‌ అనేలా ఉంటుంది. అటు ప్రతినాయకుడిగా సెల్వం పాత్రలో అనురాగ్‌ కశ్యప్‌ ఆకట్టుకున్నారు. మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌, భార‌తీరాజా, మ‌ణికంద‌న్‌, అరుళ్‌దాస్‌ త‌దిత‌రులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు నిథిల స్వామినాథన్‌.. ఒక రొటీన్‌ రివేంజ్‌ డ్రామాను తెరకెక్కించినట్లు అనిపించినా కథకు కర్మ సిద్దాంతాన్ని జోడించడం వల్ల సినిమా కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లేను ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపిన తీరు.. విజ‌య్ సేతుప‌తి విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి. ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్టుల‌తో భావోద్వేగ‌భ‌రితంగా దర్శకుడు సినిమాను ముగించారు. ముఖ్యంగా ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో వ‌చ్చే మ‌లుపులు ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌ను పంచుతాయి. ప్ర‌థమార్ధంలో ఎక్కువ భాగం పాత్ర‌ల ప‌రిచ‌యాల‌కే కేటాయించినప్పటికీ డైరెక్టర్‌ ఎక్కడా బోర్‌ కొట్టించలేదు. ఓ వైపు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా.. మరోవైపు లక్ష్మీ, జ్యోతి ఎపిసోడ్స్‌ను సమాంతరంగా చూపిస్తూనే వాటన్నింటిని లింకప్‌ చేసిన విధానం మెప్పిస్తుంది. ఈ కథకు ముగింపు పలికిన తీరు ప్రేక్షకులకు సంతృప్తికరంగా అనిపిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతం సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. ఫిలోమిన్ ఎడిటింగ్ ప్ర‌తిభ‌.. దినేశ్ సినిమాటోగ్రఫీ ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్‌ విజయ్‌ సేతుపతి నటనట్విస్టులుసంగీతం మైనస్‌ పాయింట్‌ స్లో నారేషన్‌సాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    జూన్ 14 , 2024
    Tollywood Top Experimental Movies: తెలుగులో తప్పక చూడాల్సిన ప్రయోగాత్మక చిత్రాలు.. చూస్తే థ్రిల్‌ అవుతారు!&nbsp;&nbsp;
    Tollywood Top Experimental Movies: తెలుగులో తప్పక చూడాల్సిన ప్రయోగాత్మక చిత్రాలు.. చూస్తే థ్రిల్‌ అవుతారు!&nbsp;&nbsp;
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్‌హిట్స్‌గా నిలిస్తే మరికొన్ని పరాజయాలను చవిచూశాయి. అయితే కొన్ని చిత్రాలు (Telugu Experimental Movies With Unique Concept) మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని పంచాయి. రొటిన్‌ చిత్రాలకు అలవాటు పడిన ఆడియన్స్‌కు కొత్తదనాన్ని పరిచయం చేశాయి. సరైన కంటెంట్‌తో వస్తే ఎలాంటి ప్రయోగాత్మక చిత్రాలనైనా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; జంబ లకిడి పంబ (Jamba lakidi Pamba) తెలుగులో ‘జంబ లకిడి పంబ’ చిత్రం ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పవచ్చు. మగవారు ఆడవారిగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ సినిమా క్లిప్స్‌ పెట్టుకొని చూస్తుంటారు ఆడియన్స్‌.&nbsp; ఆదిత్య 369 (Aditya 369) నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇది తెలుగులో వచ్చిన తొలి టైమ్‌ ట్రావెలింగ్ సినిమా. అప్పటివరకూ హాలీవుడ్‌లోనే ఈ తరహా చిత్రాలు వచ్చాయి. అయితే మన పరిస్థితులకు అనుగుణంగా డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు కథను రాసుకున్నారు. టైమ్‌ ట్రావెలింగ్‌ కాన్సెప్ట్‌తో శ్రీకృష్ణ దేవరాయల కాలానికి కథను ముడిపెట్టి మంచి ఫలితాలను రాబట్టాడు.&nbsp; నాని (Nani) మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్‌.జె. సూర్య (S.J. Surya) దర్శకత్వంలో వచ్చిన నాని (2004) చిత్రం.. విభిన్నమైన కథాంశంతో రూపొందింది. ఓ బాలుడు సైంటిస్ట్‌ ద్వారా 28 ఏళ్ల కుర్రాడిగా మారడం.. ఓ కంపెనీలో పనిచేస్తూ ఓనర్‌ కూతుర్నే ప్రేమించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. చివరికి తన తల్లికి దూరమవుతున్నానని భావించి మళ్లీ చిన్నపిల్లాడిగా మారిపోవడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది.&nbsp; దశావతరం (Dasavatharam) ఒక హీరో ద్విపాత్రాభినయం (Telugu Experimental Movies With Unique Concept) చేయడం సాధారణం. కొన్ని సినిమాల్లో ముగ్గురిగానూ నటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే పది విభిన్నమైన పాత్రలను హీరో ఒక్కడే చేయడం ఒక్క ‘దశవాతరం’ (Kamal Haasan) సినిమాలోనే చూడవచ్చు. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ హీరోగా చేశారు. ఈ సినిమాను చూసిన వారంతా కమల్ నటనకు ఫిదా అయ్యారు.&nbsp; దొంగల ముఠా (Dongala Mutha) రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'దొంగల ముఠా' చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. రవితేజ, చార్మి కౌర్, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు, సుప్రీత్ రెడ్డి వంటి నటీనటులతో ఐదే రోజుల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ చిత్రం థియేటర్‌లోకి వచ్చే వరకూ తారాగణం ఒక్క రూపాయి తీసుకోకపోవడం విశేషం. కెనాన్ 5D కెమెరాలతో ఈ చిత్రం రూపొందించడం మరో ప్రత్యేకత.   ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రం.. టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఒక సినిమాకు (Telugu Experimental Movies With Unique Concept) స్టార్‌ హీరోనే అవసరం లేదు.. ఒక చిన్న ఈగతో కూడా ఘన విజయం సాధించొచ్చని ఈ సినిమా ద్వారా రాజమౌళి నిరూపించారు. హాలీవుడ్‌ స్థాయి టెక్నిషియన్లను వినియోగించుకొని అద్భుతమైన విజువల్‌ ట్రీట్‌ను అందించారు.&nbsp; మిథునం (Mithunam) పాతిక సంవత్సరాల క్రితం రచించిన 25 పేజీల ‘మిథునం’ కథకు నటుడు తనికెళ్ళ భరణి అందించిన చిత్రరూపమే ఈ సినిమా. ఈ మూవీ మెుత్తం కేవలం రెండు పాత్రలే కనిపిస్తాయి. పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడటంతో ఆ తల్లిదండ్రులు తమ శేష జీవితాన్ని ఎలా గడిపారు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ‘ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా’ ఇచ్చిన సూచనల మేరకు ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు సైతం నామినేట్ కావడం విశేషం.&nbsp; అనుకోకుండా ఒక రోజు (Anukokunda Oka Roju) 2005లో వచ్చిన ఈ చిత్రం కూడా విభిన్న కథాంశంతో రూపొందింది. సహస్ర (ఛార్మీ) అనే ఓ అమ్మాయి అనుకోకుండా ఓ నైట్ పార్టీకి వెళ్లడం.. అక్కడ పొరపాటున మత్తు పదార్థాలు తీసుకోవడం.. ఆ టైంలో ఆమెకు తెలీకుండా ఏదేదో చూసేయడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత ఆమె జీవితంలో ఓ రోజు తెలీకుండా మిస్ అవుతుంది. ఆ రోజు ఏం జరిగిందో తెలుకోవడానికి ప్రయత్నిస్తుంటే సహస్రపై హత్యాప్రయత్నాలు జరుగుతాయి. మూఢనమ్మకాలకు సహస్రపై జరుగుతున్న దాడులకు సంబంధం ఏంటన్నది కథ. ఈ సినిమా ఆధ్యాంతం చాలా ఆసక్తికరంగా సాగుతుంది.&nbsp; అ! (Awe!) టాలీవుడ్‌లో ఈ తరహా సినిమా ఇప్పటివరకూ రాలేదు. హనుమాన్‌ (Hanu Man) ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.&nbsp; మనం (Manam) అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మనం’. పునర్జన్మలు - ప్రేమలకు ముడిపెడుతూ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం కథ కొత్తగా ఉండటంతో పాటు ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. భావోద్వేగాలలో మునిగి తేలేలా చేస్తుంది.&nbsp; ఒక్కడున్నాడు (Okkadunnadu) గోపిచంద్‌ హీరోగా&nbsp; చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడున్నాడు’ చిత్రం కూడా వీక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఓ మాఫియా డాన్‌కు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం కావడం.. హీరో గుండె అతడికి సరిగ్గా సరిపోలడం జరుగుతుంది. దీంతో విలన్లు హీరో వెంట పడుతుంటారు. చివరికీ ఏమైంది అన్నది స్టోరీ. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం మంచి థ్రిల్‌ను అందించింది.&nbsp; గగనం (Gaganam) నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని (Telugu Experimental Movies With Unique Concept) దర్శకుడు రాధా మోహన్‌ తెరకెక్కించారు. విమానం హైజాకింగ్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. హాలీవుడ్‌ చిత్రాలకే పరిమితమైన ఇలాంటి కథను.. తొలిసారి తెలుగులోకి తీసుకొచ్చారు. ఆద్యాంతం ఈ సినిమా ఉత్కంఠగా సాగుతుంది.&nbsp;
    మార్చి 20 , 2024

    @2021 KTree