• TFIDB EN
  • గామి
    UATelugu
    అఘోరా శంకర్‌ (విష్వక్‌ సేన్‌) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. దానికి పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉంటుందని ఓ సాధువు చెప్తాడు. దీంతో శంకర్‌ తన అన్వేషణ మెుదలుపెడతాడు. మరోవైపు సమాంతరంగా దేవదాసి, హ్యూమన్‌ ట్రైల్స్‌ కథ నడుస్తుంటుంది. వాటితో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? హిమాలయాల యాత్రలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    2024 Apr 198 months ago
    గామి చిత్రం జీ5లో 100 మిలియన్‌కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. 250కి పైగా నగరాల్లో ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నట్లు జీ5 తెలిపింది.
    2024 Apr 128 months ago
    జీ5 ఓటీటీ వేదికగా గామి సినిమా స్ట్రీమింగ్ ఈరోజు నుంచి(ఏప్రిల్12) ప్రారంభమైంది.
    2024 Apr 28 months ago
    గామి చిత్రం జీ5 ఓటీటీ వేదికగా ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
    రివ్యూస్
    YouSay Review

    Gaami Movie Review: అఘోరా శంకర్‌గా విశ్వరూపం చూపించిన విష్వక్‌ సేన్‌.. ‘గామి’ ఎలా ఉందంటే?

    విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాందినీ చౌదరి కథానాయ...read more

    How was the movie?

    @isma5525604790

    Movie is visual wonder

    Go and watch it... You rarely get this kind of movies in tollywood

    9 months ago

    తారాగణం
    విశ్వక్ సేన్
    శంకర్
    చాందిని చౌదరి
    జాహ్నవి
    అభినయ
    దుర్గ
    హారిక పెద్దఉమా
    దయానంద్ రెడ్డి
    మహ్మద్ సమద్CT-333
    శాంతి రావుతార
    మయాంక్ పరాఖ్బక్షి
    జాన్ కొట్టోలీసుధామ
    శరత్ కుమార్ఆయుర్వేద గురువు
    రజనీష్సన్యాసి
    ఓంకార్ కాటమరాజురవి
    వెంకట్
    ఉన్నికృష్ణన్
    సిబ్బంది
    విద్యాధర్ కాగితదర్శకుడు
    కార్తీక్ శబరీష్నిర్మాత
    శ్వేత మొరవనేనినిర్మాత
    స్వీకర్ అగస్తీ
    సంగీతకారుడు
    నరేష్ కుమారన్సంగీతకారుడు
    విద్యాధర్ కాగితస్క్రీన్ ప్లే
    ప్రత్యూష్ వత్యంస్క్రీన్ ప్లే
    విశ్వనాథ్ రెడ్డి Chసినిమాటోగ్రాఫర్
    రాఘవేంద్ర తిరున్ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Bhimaa Day 1 Collections: ‘గామి’తో పోలిస్తే చతికిలపడ్డ ‘భీమా’.. తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
    Bhimaa Day 1 Collections: ‘గామి’తో పోలిస్తే చతికిలపడ్డ ‘భీమా’.. తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
    మాచో స్టార్ గోపిచంద్ (Gopichand) హీరోగా మాళవిక శర్మ (Malavika Sharma), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్లుగా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష (A. Harsha) రూపొందించిన చిత్రం ‘భీమా’ (Bhimaa). ప్రముఖ నిర్మాత కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్, ముఖేష్ తివారీ, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, వీకే నరేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో గోపిచంద్‌ విశ్వరూపం చూపించాడని కథనాలు వచ్చాయి. చాలా రోజుల తర్వాత గోపిచంద్‌కు సాలిడ్‌ హిట్‌ కూడా వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భీమా తొలిరోజు కలెక్షన్స్‌ ఎంత? బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌? ప్రీ బిజినెస్‌ లెక్కలు ఎలా ఉన్నాయి? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం.  భీమా తొలి రోజు కలెక్షన్స్‌.. భీమా చిత్రాన్ని మేకర్స్‌ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 900 స్క్రీన్లలో చిత్రాన్ని ప్రదర్శనకు తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో నైజాం, ఆంధ్రా కలిపి 600 స్కీన్లలో, ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. దీనికి తగ్గట్లే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ లభించినట్లు తెలుస్తోంది. ట్రెడ్‌ లెక్కల ప్రకారం ఈ సినిమా తొలి రోజు రూ.4.5 కోట్ల గ్రాస్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.35కోట్లు, ఓవర్‌సీస్‌ ఇతర ప్రాంతాలు కలిపి రూ.1.25 కోట్లు వసూలు చేసింది. అయితే కొన్ని ఏరియాల్లో మిక్స్‌డ్‌ టాక్‌ రావడం భీమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపించింది. లేదంటే ఈజీగానే రూ.5 కోట్ల మార్క్‌ను సాధించేదని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే గోపిచంద్‌ గత చిత్రం ‘రామబాణం’.. తొలిరోజున రూ. 2.5 కోట్ల గ్రాస్‌ సాధిస్తే.. ‘భీమా’ అంతకు రెట్టింపు వసూలు చేయడం విశేషం.  సాక్నిక్‌ లెక్కల ప్రకారం ప్రముఖ సినిమా వెబ్‌సైట్ సాక్నిక్‌ (Sacnilk) లెక్కల ప్రకారం.. భీమా చిత్రం తొలిరోజు రూ.3.50 కోట్ల నెట్‌ కలెక్షన్లను (Bhimaa Day1 Net Collections) వసూలు చేసింది. ఓవర్సీస్‌ లెక్కలను మాత్రం ఈ సైట్‌ ప్రస్తావించలేదు. ఇక తొలిరోజు ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్‌ షోస్‌ 27.58%, మధ్యాహ్నం 33.55%, సాయంత్రం 27.70%, సెకండ్‌ షో 49.49% నమోదైంది. నేడు, రేపు వీకెండ్‌ కావడంతో ఆక్యుపెన్సీ శాతం మరింత పెరిగే అవకాశముంది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో రూ.6 కోట్లకుపైగా కలెక్షన్లు సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌? గోపీచంద్ హీరోగా ఒక హిట్ అందుకునేలోపే.. మూడు ఫ్లాపులు పలకరిస్తున్నాయి. అయితే తనకు అచ్చొచ్చిన యాక్షన్‌ జానర్‌లో 'భీమా' చేయడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ (Bhimaa Movie Pre Release Business)ను మంచిగానే చేసింది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా థ్రియేటికల్‌ హక్కులు రూ.11.30 కోట్లకు అమ్ముడయ్యాయి. తెలంగాణ (నైజాం) రూ. 3.50 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ రూ. 4.50 కోట్లకు బిజినెస్‌ జరిగింది. మెుత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.50 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ కాగా.. కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి రూ.1.8 కోట్లు జరిగింది. 'భీమా' సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే రూ.12 కోట్ల షేర్ రాబట్టాలి. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో బ్రేక్‌ ఈవెన్‌ సాధించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  'భీమా'లో అదరగొట్టిన గోపిచంద్‌! భీమా చిత్రంలో గోపిచంద్‌.. రెండు కోణాల్లో క‌నిపించే పాత్ర‌ల్లో అదరగొట్టాడు. యాక్షన్ సీన్లలో విశ్వరూపం చూపించేశాడు. పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్ డైలాగ్స్‌, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల త‌ర్వాత గోపీచంద్ క‌టౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్‌ రోల్స్‌లో గోపిచంద్‌ కనిపిస్తాడు. పాత్రకు తగ్గ వేరియేషన్స్‌తో మిస్మరైజ్‌ చేశాడు. ఇక హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ప్రియా భవాని, గోపిచంద్‌ మధ్య కెమెస్ట్రీ తెరపై ఆకట్టుకుంటుంది. నరేష్‌, వెన్నెల కిషోర్‌, చమ్మక్‌ చంద్ర పాత్రలు నవ్వులు పూయిస్తాయి. నాజర్‌, ముఖేష్‌ తివారి, రోహిణి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.  https://telugu.yousay.tv/gopichand-bheema-review-gopichand-sivathandavam-in-action-sequences-bheema-movie-hit-free.html
    మార్చి 09 , 2024
    Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
    Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
    విష్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’ (Gaami). వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించారు. చాందిని చౌదరి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపింది. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న విజువల్స్‌ ట్రీట్‌ను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక్క ట్రైలర్‌తోనే ఈ సినిమా టాలీవుడ్‌ అటెంషన్‌ మెుత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది. ఇదిలా ఉంటే గామి ట్రైలర్‌లో చూపించిన ఓ సింబల్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సింబల్‌కు, కథకు ఏమైనా సంబంధం ఉందా? అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. ఇంతకి ఆ సింబల్‌ ఏంటి? దానిపై నెటిజన్లు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఈ కథనంలో చూద్దాం. అసలేంటి ఆ సింబల్‌? గామి ట్రైలర్‌ను గమనిస్తే మూడు ఆకులు ఒకదానికొకటి లింకప్‌ అయ్యి ఉన్న సింబల్‌ చాలా చోట్ల కనిపించింది. ట్రైలర్‌లో మానవ ప్రయోగాలు జరుగుతున్న ప్రాంతంలో ఈ సింబల్‌ను ప్రధానంగా చూడవచ్చు. అక్కడ బందీలుగా ఉన్న వ్యక్తుల శరీరాలపై కూడా ఇదే సింబల్‌ ముద్రించి ఉండటం గమనార్హం. తల వెనక భాగంలో మెడ కింద ఈ సింబల్‌ను మీరు చూడవచ్చు. మరోవైపు విశ్వక్‌ సేన్‌ కూడా హిమాలయ యాత్రకు బయలుదేరినప్పుడు మంచులో ఈ సింబల్‌ను రాసి దాని ముందు పెద్దగా అరవడం ట్రైలర్‌లో చూడవచ్చు. అంటే హ్యూమన్‌ ట్రైల్స్‌కు, అఘోర శంకర్‌ (విష్వక్‌ సేన్‌)కు ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఆ తరహా సింబల్‌ను వాడుక భాషలో ‘ట్రైక్యూట్రా’ అంటారు. అటువంటి ఈ సింబల్‌కు తీసుకొని డైరెక్టర్‌ విద్యాధర్‌.. కథలో ఎలాంటి నిర్వచనం చెప్తారో చూడాలి.  భూత- భవిష్యత్‌- వర్తమాన కాలంలో కథ సాగుతుందా? ‘గామి’ ట్రైలర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తే ఈ సినిమా.. భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్లో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుందని అనిపిస్తోంది. ట్రైలర్‌లో.. 'వాళ్ల గాయాలకు నువ్వు బాధలు మోస్తున్నావ్‌' అంటూ ఓ అఘోరా అనడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆ మానవ ప్రయోగాలకు హీరో శంకర్‌కు కచ్చితంగా ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. శంకర్‌ గతంలో ఆ హ్యూమన్‌ ట్రైల్స్‌లో బాధితుడి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ చెర నుంచి తప్పించుకొని ఆ ప్రయోగాల తాలుకూ స్పర్శ సమస్య ఎదుర్కొంటూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీని బట్టి కథ శంకర్‌ బాల్యంలో జరిగిన మానవ ప్రయోగాలు.. తన సమస్య పరిష్కారం కోసం భవిష్యత్‌లో చేస్తున్న హిమాలయ యాత్ర చూపిస్తూ పార్లర్‌గా కథ సాగవచ్చని అంచనా.  దేవదాసితో శంకర్‌కు ఉన్న సంబంధం? అఘోరా శంకర్‌కు.. దేవదాసికి మధ్య గల సంబంధంపై ట్రైలర్‌లో ఎలాంటి క్లూస్‌ డైరెక్టర్‌ ఇవ్వలేదు. రెండు పాత్రలను విభిన్న పరిస్థితుల్లో చూపించారు. దేవదాసి బిడ్డను కనడం.. ఆమెను ఊరివారు తరిమేయడం.. ఊరికి అరిష్టమని తెలిసి తిరిగి ఆమె కోసం వెతకడం వంటి దృశ్యాలు ట్రైలర్‌లో కనిపించాయి. ఒకవేళ దేవదాసి కూతురికి హీరోయిన్‌ చాందిని పాత్రకు సంబంధం ఉండే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాందిని పాత్ర అఘోర శంకర్‌కు సాయం చేయడం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మార్చి 8 వరకూ ఆగాల్సిందే.  గామి టీమ్‌పై రాజమౌళి ప్రశంసలు ఇక ‘గామి’ ట్రైలర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మూవీ టీమ్‌ కృషిని అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్‌ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
    మార్చి 06 , 2024
    Gaami Movie: ‘గామి’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు షాక్.. ఇక ఇలాంటివి చేయను: విశ్వక్ సేన్
    Gaami Movie: ‘గామి’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు షాక్.. ఇక ఇలాంటివి చేయను: విశ్వక్ సేన్
    టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘గామి’ (Gaami). దర్శకుడు విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం (మార్చి 8) ప్రేక్షకుల ముందుకు రానుంది. వినూత్న కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. హాలీవుడ్‌ స్థాయిలో విజువల్‌ ట్రీట్ ఉండటంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రంపైకి మళ్లింది. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప అనుభూతిని పంచుతుందని మేకర్స్‌ చాలా ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్టు షాకిచ్చింది.  సెన్సార్‌ పూర్తి.. కానీ! ప్రామిసింగ్‌ కంటెంట్‌తో వస్తోన్న 'గామి' చిత్రం.. సెన్సార్‌ కంప్లీట్‌ చేసుకున్నట్లు మేకర్స్‌ ఓ పోస్టర్‌ ద్వారా వెల్లడించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్‌ లభించినట్లు వారు ప్రకటించారు. ‘గామి’ట్రైలర్‌లోని విజువల్స్‌ బట్టి చూస్తే డెఫినెట్‌గా ఈ మూవీకి యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందని అంతా భావించారు. కానీ సెన్సార్‌ బోర్డు.. అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఈ చిత్రంలో పెద్దలు మాత్రమే చూసే కంటెంట్‌ ఉండబోతున్నట్లు ‘ఏ’ సర్టిఫికేట్‌ ఇవ్వడాన్ని బట్టి తెలుస్తోంది. ఇంతకీ ఆ సన్నివేశాలు ఏంటా అని తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.  ‘నా కెరీర్‌లో గామి చివరిది’ ‘గామి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విశ్వక్ సేన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడ గామి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గామి సినిమా నాకే కాదు ఆడియన్స్ కి కూడా చాలా ప్రత్యేకం. దాదాపు ఆరు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నాం. కథ, కథనం, విజువల్స్, గ్రాఫిక్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్‌కి ఒక సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఇలాంటి సినిమా రావడం చాలా అరుదు. నా కెరీర్‌లో నేను చేస్తున్న చివరి ప్రయోగాత్మక చిత్రం కూడా ఇదే. ఇక నుండి నేను చేసే సినిమాలు వేరే లెవల్లో ఉంటాయి. ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తా’ అని అన్నాడు. ‘ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి’ 'కలర్‌ ఫొటో' ఫేమ్‌ చాందినీ చౌదరి (Chandini Chowdary) ‘గామి’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఆమె సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘వారణాసి, కుంభమేళా, కాశ్మీర్, హిమాలయాలు.. ఇలా రియల్‌ లొకేషన్స్‌లో ‘గామి’ని చిత్రీకరించాం. షూటింగ్‌లో చాలా సవాల్‌తో కూడిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ సినిమా ప్రయాణం ఒక సాహస యాత్రలా జరిగింది. ఐమ్యాక్స్‌ స్క్రీన్‌లో మా మూవీ ట్రైలర్‌ చూసినప్పుడు మా కష్టానికి ప్రతిఫలం లభించిందనే ఆనందంతో నాకు కన్నీళ్లు వచ్చాయి' అని చాందిని తెలిపింది.  విశ్వక్‌ పారితోషికం ఏంతంటే? హీరో విష్వక్‌ సేన్ గత ఆరేళ్లుగా 'గామి' సినిమా కోసం పని చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాకు అతడి రెమ్యూనరేషన్ ఎంత అయ్యి ఉండవచ్చని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమా కోసం విశ్వక్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆరేళ్ల క్రితమే సినిమా ప్రారంభం కాగా.. అప్పటికీ విష్వక్‌కు ఈ స్థాయిలో ఫేమ్‌ లేదు. దీంతో క్రౌడ్ ఫండింగ్‌ ద్వారా ఈ సినిమాను కంప్లీట్‌ చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాలకు తగ్గట్లు విష్వక్‌కు భారీ మెుత్తమే ముట్టే అవకాశముంది.
    మార్చి 05 , 2024
    Gaami Prabhas: ‘గామి’ విజువల్‌ ట్రీట్‌పై ప్రభాస్‌ క్రేజీ కామెంట్స్‌.. టైటిల్‌కు అర్థం ఏంటో తెలుసా?
    Gaami Prabhas: ‘గామి’ విజువల్‌ ట్రీట్‌పై ప్రభాస్‌ క్రేజీ కామెంట్స్‌.. టైటిల్‌కు అర్థం ఏంటో తెలుసా?
    యంగ్‌ హీరో విష్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా.. విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన 'గామి' (Gaami) చిత్రం.. ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. విష్వక్‌ తొలిసారి అఘోరా పాత్రలో ఇందులో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా  'గామి' ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేయగా.. దానికి విశేష స్పందన వస్తోంది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉందంటూ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. విష్వక్‌కు ఈ చిత్రం మైలురాయిగా మిగిలిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్‌ను మరోస్థాయికి ‘గామి’ తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ‘గామి’ ట్రైలర్‌ చూసిన పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ప్రభాస్‌ ఏమన్నాడంటే! విజువల్‌ వండర్‌గా విడుదలైన 'గామి' (Gaami) ట్రైలర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. హీరో ప్రభాస్‌ ‘గామి’ ట్రైలర్‌పై స్పందిస్తూ ఏకంగా ఓ వీడియో బైట్‌నే రిలీజ్‌ చేశాడు. ట్రైలర్‌ తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్నాడు. ఈ ట్రైలర్ చూసాక తానే స్వయంగా వీడియో బైట్ ఇచ్చి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాలని అనుకున్నానని తెలిపాడు. విశ్వక్ సేన్ ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటాడని ప్రశంసించాడు. ట్రైలర్ ఎగ్జైటింగ్‌గా ఉందని.. మార్చి 8 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ప్రతీ ఒక్కరి హార్డ్ వర్క్ ట్రైలర్ లో కనిపిస్తోందంటూ మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్ వ్యాఖ్యలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి.  https://twitter.com/i/status/1763423427510370770 ‘గామి’ అరుదైన చిత్రం’ ‘గామి’ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకకి సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్‌ లాంచ్‌ చేశాడు. అనంతరం సందీప్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గామి ట్రైలర్‌ చాలా బాగుంది. ఇది చాలా అరుదైన సినిమా అనిపిస్తోంది. ఆరేళ్ల పాటు ఒక సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాతలకు చాలా ప్యాషన్‌ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ మూవీ సౌండ్‌ డిజైన్, కలర్‌ గ్రేడింగ్‌ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాని థియేటర్స్‌లో చూసినప్పుడు మంచి అనుభూతి వస్తుంది’ అని డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా అన్నారు.  https://twitter.com/HanuNews/status/1763062517746831765 ‘గామి’ అంటే అర్థం ఇదే! ఈ సినిమా పేరును అనౌన్స్‌ చేసినప్పటి నుంచి 'గామి' టైటిల్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. దానికి అర్థం ఏంటో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అర్థంపర్థం లేని టైటిల్‌గా అనిపిస్తోందంటూ కొందరు విమర్శలు సైతం చేశారు. అయితే దీనిపై ట్రైలర్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ విద్యాధర్‌ కాగిత క్లారిటి ఇచ్చారు. ‘గామి అంటే గమ్యాన్ని గమించేవాడు’ అని మీనింగ్ వస్తుందని తెలిపాడు. చిన్నగా మెుదలైన ‘గామి’.. విష్వక్‌, నిర్మాత ప్రోత్సాహంతో పెద్ద చిత్రంగా మారిందని అన్నారు. విజువల్‌ వండర్‌గా సినిమాను తెరకెక్కించినట్లు చెప్పుకొచ్చారు. మార్చి 8న కొత్త రకం తెలుగు సినిమాని చూస్తారని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.  https://twitter.com/NtvTeluguEnt/status/1763212759653810231 ‘ఫీచర్ ఫిల్మ్ అంటే నమ్మలేదు’ డెఫ్‌ & డంబ్‌ నటి అభినయ (Actress Abhinaya) ‘గామి’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. దేవదాసి పాత్రలో ఆమె కనిపించనుంది. మాటలు రాకపోయినా ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా అభినయ సైగలతో చేసిన స్పీచ్‌ ఆసక్తి రేపుతోంది. ‘విశ్వక్ సేన్ సినిమాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను. మీ ఎక్స్‌ప్రెషన్స్ నాకు చాలా నచ్చుతాయి. ‘గామి’ ఫీచర్ ఫిల్మ్ అంటే తొలుత నమ్మలేదు. వైజాగ్‌ షూటింగ్‌లో ఒక చిన్న కెమెరా పట్టుకొని 15 రోజుల్లో నా షూట్‌ పూర్తి చేసేశారు డైరెక్టర్‌’ అంటూ ‘గామి’ షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంది అభినయ. https://twitter.com/i/status/1763209148253213116
    మార్చి 01 , 2024
    Gaami Weekend Collections: బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోన్న ‘గామి’.. 3 రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?
    Gaami Weekend Collections: బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోన్న ‘గామి’.. 3 రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?
    విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో విడుదలైన తాజా చిత్రం ‘గామి’ (Gaami). శివరాత్రి కానుకగా శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'గామి' సినిమా బాక్సాఫీస్ విజృంభిస్తోంది. విశ్వక్ సేన్ గత చిత్రాలతో పోలిస్తే ఇది అద్భుతమైన వసూళ్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు ఆరేళ్ల పాటు చిత్ర యూనిట్‌ ఈ సినిమా కోసం శ్రమించగా వాటి తాలూకా ఫలితాలు ప్రస్తుతం లభిస్తున్నాయి. వీకెండ్‌ అయ్యేసరికి ఈ సినిమా కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఈ చిత్రం లాభాల్లోకి అడుగుపెట్టిందన్న వార్తల్లో నిజమెంత? ఈ కథనంలో పరిశీలిద్దాం.  వీకెండ్ కలెక్షన్స్ ఇవే! ప్రయోగాత్మక కథతో తీసిన 'గామి' చిత్రానికి మూడు రోజుల్లో రూ.20.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. మేకర్స్ లెక్కల ప్రకారం ఈ చిత్రం తొలి రోజు తొలిరోజు రూ.9 కోట్లు, రెండు రోజు రూ.6 కోట్లు, మూడు రోజు రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రయోగాత్మక కథతో తీసిన 'గామి' చిత్రానికి మూడు రోజుల్లో ఈ రేంజులో కలెక్షన్స్ రావడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇక రెండో రోజు నుంచే చాలా ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వచ్చేసిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇకపై వచ్చేదంతా లాభాలే అని అంటున్నారు. ఈ వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం థియేటర్లలోకి రావట్లేదు కాబట్టి ఈ మూవీ మరిన్ని కోట్లు రాబట్టుకోవడం గ్యారంటీగా కనిపిస్తోంది.   గామి లాభాల్లోకి వచ్చినట్లేనా? విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ.1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ.3.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. రెండు రాష్ట్రాలు కలుపుకొని మెుత్తంగా రూ. 8.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అటు కర్నాటక ప్లస్, రెస్టాఫ్ ఇండియా ప్లస్, ఓవర్సీస్ ఏరియాల హక్కులు రూ. 2 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్ల వ్యాపారం చేసింది. సాక్నిక్‌ లెక్కల ప్రకారం చూస్తే ఈ సినిమా ఇప్పటికే రూ.8.91 కోట్ల నెట్‌ వసూళ్లను రాబట్టింది. మిగతా రూ.1.31 కోట్ల నెట్ వసూళ్లను నాల్గో రోజు కలెక్ట్ చేసి అధికారికంగా ఈ మూవీ నేటి నుంచి లాభాల్లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.  https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-telugu-beauty-chandini-chowdary.html
    మార్చి 11 , 2024
    Gaami Day 1 Collections: విష్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌.. ‘గామి’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?
    Gaami Day 1 Collections: విష్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌.. ‘గామి’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?
    విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. చాందినీ చౌదరి కథానాయికగా చేసింది. మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజైన ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో విశ్వక్‌ సేన్‌ ఆకట్టుకున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. అదే స్థాయిలో పాజిటివ్‌ రెస్పాన్స్‌ సాధించడంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీకి తిరుగుండదని అంతా భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే మార్నింగ్ షో నుంచే ‘గామి’ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తాజాగా ఫస్ట్‌డే కలెక్షన్స్‌ను చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.  డే1 కలెక్షన్స్‌ ఎంతంటే? గామి సినిమా మొదటి రోజే (Gaami Day 1 Collections) రూ.9.07 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. అటు అమెరికాలోనూ ఈ సినిమా తొలి రోజు 2.50 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. 1 మిలియన్‌ డాలర్స్‌ దిశగా ‘గామి’ పరుగులు పెడుతున్నట్లు పేర్కొంది. విష్వక్‌ సేన్‌ ఇప్పటి వరకూ చేసిన చిత్రాల్లో ఇదే అత్యధిక డే వన్‌ కలెక్షన్స్‌ అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఇక నేడు, రేపు రెండు రోజులు కూడా వీకెండ్ కావడంతో ఈజీగా మూడు రోజుల్లో 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశముందని అంచనా వేస్తున్నాయి.  View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) సాక్నిక్‌ లెక్కల ప్రకారం గామి చిత్రం తొలిరోజు కలెక్షన్స్‌ను ప్రముఖ వెబ్‌సైట్‌ సాక్నిక్‌ (Sacnilk) కూడా ప్రకటించింది. ఈ సినిమా తొలి రోజు రూ. 4.50 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ (Gaami Day1 Net Collections)ను వసూలు చేసినట్లు తన సైట్‌లో పేర్కొంది. అయితే వరల్డ్‌ వైడ్‌గా ఎంత వసూళ్లను రాబట్టిందోనన్న విషయాన్ని మాత్రం సాక్నిక్‌ తన సైట్‌లో ప్రస్తావించలేదు. అటు ‘గామి’ ఫస్ట్‌డే రోజున చెప్పుకోతగ్గ స్థాయిలో థియేటర్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లు సాక్నిక్‌ తెలిపింది. మార్కింగ్‌ షోకు 45.58%, మధ్యాహ్నం 56.47%, సాయంత్రం 49.88%, సెకండ్ షో 71.69% ఆక్యుపెన్సీ రేట్‌ నమోదైనట్లు వెల్లడించింది. ఈ వీకెండ్‌లో ఆక్యుపెన్సీతో పాటు కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని విశ్లేషించింది.  ప్రీ రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ.1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ.3.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. రెండు రాష్ట్రాలు కలుపుకొని మెుత్తంగా రూ. 8.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అటు కర్నాటక ప్లస్, రెస్టాఫ్ ఇండియా ప్లస్, ఓవర్సీస్ ఏరియాల హక్కులు రూ. 2 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్ల వ్యాపారం చేసింది. అంటే గామి హిట్ అవ్వాలంటే రూ. 11 కోట్ల షేర్ వసూలు చేయాల్సిన అవసరం ఉంది. తొలిరోజు రూ.9 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఈ మూవీ ఈజీగానే లాభాల్లోకి అడుగుపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  విష్వక్‌ నటనపై ప్రశంసలు అఘోరా శంకర్‌ పాత్రలో విశ్వక్‌ కెరీర్ బెస్ట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కొత్త విష్వక్‌ సేన్‌ను చూస్తారు. శంకర్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి అతడు నటించాడు. విష్వక్‌ నటన, డైలాగ్‌ డెలివరీ గత చిత్రాల కంటే చాలా బెటర్‌గా అనిపిస్తాయి. భావోద్వేగాలను చక్కగా పలికిస్తూ ఎమోషన్స్‌ సీన్లలో విష్వక్ అదరగొట్టాడు. అటు ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటి చాందిని చౌదరి ఆకట్టుకుంది. సినిమాలో విష్వక్‌ తర్వాత స్క్రీన్‌పై ఆమె పాత్రకే ఎక్కువ ప్రజెన్స్‌ లభించింది. హిమాలయ యాత్రలో. యాక్ష విష్వక్‌కు సాయపడే పాత్రలో ఆమె మెప్పించింది. నటన పరంగా ఆమెకు ఎలాంటి మైనస్‌లు లేవు. ఇక దేవదాసి పాత్రలో అభినయ కూడా చక్కటి నటన కనబరిచింది. https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html
    మార్చి 09 , 2024
    Gaami Movie Review: అఘోరా శంకర్‌గా విశ్వరూపం చూపించిన విష్వక్‌ సేన్‌.. ‘గామి’  ఎలా ఉందంటే?
    Gaami Movie Review: అఘోరా శంకర్‌గా విశ్వరూపం చూపించిన విష్వక్‌ సేన్‌.. ‘గామి’  ఎలా ఉందంటే?
    నటీనటులు: విష్వక్‌ సేన్‌, చాందిని చౌదరి, అభినయ, రమ్య పసుపులేటి, మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, మయాంక్‌ పరాక్‌, రాజీవ్‌ కుమార్‌,  దర్శకుడు: విద్యాధర్‌ కాగిత సంగీతం: స్వీకర్‌ అగస్తీ, నరేష్‌ కుమారన్‌ సినిమాటోగ్రాఫర్‌:  విశ్వనాథ్‌ రెడ్డి, రాంపీ నందీగాం నిర్మాత: కార్తిక్‌ శబరీష్‌, శ్వేత మోరవనేని విడుదల తేదీ: 8 మార్చి, 2024 విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాందినీ చౌదరి కథానాయిక. ఇందులో విష్వక్ తొలిసారి అఘోరా గెటప్‌లో కనిపించనున్నాడు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న విజువల్‌ ట్రీట్‌ చూసి సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. కాగా, భారీ అంచనాల నడుమ గామి చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? అఘోరా గెటప్‌లో విష్వక్‌ మెప్పించాడా? అందరి అంచనాలను ఈ సినిమా నిలబెట్టిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ అఘోరా శంకర్‌ (విష్వక్‌ సేన్‌) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. మానవ స్పర్శ తగిలితే అతడికి ప్రాణం పోయేంత బాధ కలుగుతుంది. ఎవరూ ముట్టుకోవడానికి వచ్చినా చర్మ పగిలిపోతుంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉందని ఓ సాధువు చెబుతాడు. 36 ఏళ్లకు ఒకసారి వికసించే పుష్పాన్ని తాకితే సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తాడు. దీంతో ఆ పుష్పాలను అన్వేషిస్తూ శంకర్‌ హిమాలయాలకు బయలుదేరుతాడు. మరోవైపు సమాంతర ప్రపంచంలో ఓ దేవదాసి (అభినయ) బిడ్డకు జన్మనివ్వడంతో ఊరి ప్రజలు ఆమెను తరిమేస్తారు. అలాగే ఓ రహస్య ప్రదేశంలో మానవులపై ప్రయోగాలు జరుగుతుంటాయి. ఈ సబ్‌ప్లాట్స్‌తో అఘోరా శంకర్‌కు సంబంధం ఏంటి? హిమాలయాలకు వెళ్లిన శంకర్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతడికి చాందిని చౌదరి చేసిన సాయం ఏంటి? దేవదాసిని తరిమేసిన గ్రామస్తులే తిరిగి ఆమెకోసం ఎందుకు వెతకాల్సి వచ్చింది? హ్యుమన్‌ ట్రైల్స్‌ ఎందుకు చేస్తున్నారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరేలా చేశారంటే  ఈ సినిమాలో కొత్త విష్వక్‌ సేన్‌ను చూస్తారు. అఘోరా శంకర్‌ పాత్రలో అతడు విశ్వరూపం చూపించాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. విష్వక్‌ నటన, డైలాగ్‌ డెలివరీ గత చిత్రాల కంటే చాలా బెటర్‌గా అనిపిస్తాయి. యాక్షన్‌, ఎమోషన్స్‌ సీన్లలో విష్వక్ అదరగొట్టాడు. అటు ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటి చాందిని చౌదరి ఆకట్టుకుంది. సినిమాలో విష్వక్‌ తర్వాత స్క్రీన్‌పై ఆమె పాత్రకే ఎక్కువ ప్రజెన్స్‌ లభించింది. హిమాలయ యాత్రలో విష్వక్‌కు సాయపడే పాత్రలో ఆమె మెప్పించింది. నటన పరంగా ఆమెకు ఎలాంటి మైనస్‌లు లేవు. ఇక దేవదాసి పాత్రలో అభినయ కూడా చక్కటి నటన కనబరిచింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు విద్యాధర్ కాగిత.. ‘గామి’ చిత్రాన్ని సరికొత్త కథతో తెరకెక్కించారు. ఇప్పటివరకూ రాని యూనిక్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి.. అరంగేట్రంలోని మంచి ఇంప్రెషన్‌ సంపాదించాడు. సినిమా ప్రారంభం నుంచే ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచిన దర్శకుడు.. శంకర్‌ పాత్రలో ప్రేక్షకులు త్వరగా లీనమయ్యేలా చేశారు. ఓ వైపు శంకర్‌ పాత్రను నడిపిస్తూనే సమాంతరంగా మరో రెండు విభిన్న స్టోరీలను తీసుకురావడం మరింత ఆసక్తిని పెంచింది. చివర్లో ఆ మూడు కథలను లింకప్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఇక ఇంటర్వెల్‌కు ముందు వచ్చే లయన్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ విజువల్‌ ట్రీట్‌గా అనిపిస్తుంది. అయితే సబ్‌ప్లాట్ స్టోరీలైన దేవదాసి, హ్యూమన్‌ ట్రైల్స్‌ ఎపిసోడ్‌ను సమర్థవంతంగా చూపించడంలో మాత్రం డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అటు సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరీ సాగదీసిన భావన కలుగుతుంది. అయితే క్లైమాక్స్‌లో డైరెక్టర్‌ విద్యాధర్ ఇచ్చిన ట్విస్టులు మాత్రం మెప్పిస్తాయి. టెక్నికల్‌గా  ఈ సినిమాకు సాంకేతిక విభాగం చాలా బాగా ప్లస్ అయ్యింది. ప్రతీ విభాగం తమ పనికి 100 శాతం న్యాయం చేసింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. విశ్వనాథ్‌ రెడ్డి, రాంపీల కెమెరా పనితనం మెప్పిస్తుంది. స్వీకర్‌ అగస్తీ, నరేష్‌ కుమారన్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్ కథ, కథనంవిష్వన్‌ నటనటెక్నికల్‌ టీమ్‌ మైనస్‌ పాయింట్స్‌ సబ్‌ప్లాట్ స్టోరీలుసాగదీత సీన్లు Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 08 , 2024
    EXCLUSIVE : ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ పదే పదే వాయిదా పడటానికి కారణాలు ఇవే!
    EXCLUSIVE : ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ పదే పదే వాయిదా పడటానికి కారణాలు ఇవే!
    యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen).. ఇటీవల ‘గామి’ (Gaami) సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. డిఫరెంట్‌ స్టోరీ లైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో అఘోరా శంకర్‌ పాత్రలో అదరగొట్టాడు. మరోవైపు విశ్వక్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మెున్నటి వరకూ ఎలాంటి అప్‌డేట్‌ లేని ఈ చిత్రం నుంచి టీజర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌ అవ్వడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. వాస్తవానికి గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి గతే ఏడాదే రిలీజ్‌ కావాల్సింది. రిలీజ్‌ తేదీని ప్రకటించి కూడా పలుమార్లు సినిమాను వాయిదా వేశారు. అందుకు కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.  పోస్ట్‌పోన్‌పై విష్వక్‌ అసహనం! గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి చిత్రానికి ఛల్‌ మోహన్‌ రంగ ఫేమ్‌ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా చేసింది. మే 17న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండటంతో ఏప్రిల్‌ 27 సా. 4.01 గం.లకు టీజర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రం 2023 డిసెంబర్లోనే రిలీజ్‌ అవ్వాల్సింది. అయితే ‘హాయ్ నాన్న’ (Hi Nanna), ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) వంటి సినిమాలతో పోటీ కారణంగా ఆ సినిమాను నిర్మాతలు వాయిదా వేశారు. ఒకవేళ గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి అనుకున్న సమయానికి రాకపోతే తాను ఆ సినిమాను ప్రమోట్‌ చేయనని అప్పట్లో విశ్వక్‌ ప్రకటించడం వివాదస్పదంగా మారింది.  నిర్మాత రియాక్షన్‌ ఇదే! ‘ఆదికేశవ’ ప్రమోషన్‌ ఈవెంట్‌ సందర్భంగా అప్పట్లో నిర్మాత నాగ వంశీ.. విష్వక్‌ వ్యాఖ్యలపై స్పందించారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్‌ 8న విడుదల చేయాలన్నది విష్వక్‌ మాటల వెనక ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. తమ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సందర్భంలో వరుణ్‌ తేజ్ నటించిన 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' పోటీకి సిద్ధంగా ఉందని అన్నారు. అనుకోకుండా హాయ్‌ నాన్న, ఎక్ట్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌, సలార్‌ తెరపైకి వచ్చాయని పేర్కొన్నారు. అంత కాంపింటీషన్‌కు వెళ్లి సినిమాను రిలీజ్‌ చేయడం ఎందుకని అంటానని భావించి  విష్వక్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని నాగ వంశీ అభిప్రాయపడ్డారు. సినిమా షూటింగ్‌ దశలోనే ఉన్నందున దీనిపై ఇద్దరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఏదోక కారణంతో వాయిదా పడుతూనే వచ్చింది.  https://www.youtube.com/watch?v=hpFNP5gptFU ఐటెం సాంగ్‌తో గ్యాప్ ఈ ఏడాది ప్రారంభంలోనే గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిని రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావించినప్పటికీ అది జరగలేదు. ఐటెం సాంగ్‌ షూట్‌లో జరిగిన మార్పు వల్ల సినిమా షూటింగ్‌ ఆలస్యమైంది. తొలుత ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ కోసం ఈషా రెబ్బను మూవీ టీమ్ ఎంపిక చేసింది. ఒక రోజు షూటింగ్‌ కూడా నిర్వహించింది. మళ్లీ ఈషాను కాదని ఆమె స్థానంలో అయేషా ఖాన్‌ను రంగంలోకి దింపారు. అటు ఇళయరాజా ఇంట విషాధం కూడా ఈ మూవీ వాయిదాకు కారణమైంది. ఈ చిత్రానికి ఇళయరాజా తనయుడు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. జనవరి 25న అతడి సోదరి చనిపోవడంతో అతను సినిమా పనుల్లో పాల్గొనలేకపోయారు. దీంతో టెక్నికల్‌ వర్క్‌ పనులు ఆలస్యం అయ్యాయి.  ఈ సారి విశ్వక్ వల్లే వాయిదా? దీంతో మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సినిమాను రిలీజ్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఈ శివరాత్రికి ‘గామి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు విశ్వక్‌ అనౌన్స్‌ చేశారు. దీంతో వెనక్కి తగ్గిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి యూనిట్‌ ఎప్పటిలాగే సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మే 17న ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్‌ చేయాలని సంకల్పంతో ఉన్నారు. సినిమా ప్రమోషన్స్‌పైనా టీమ్‌ ఫోకస్‌ పెట్టింది. నెల రోజుల క్రితం అయేషా ఖాన్‌ నటించిన ‘మోతా’ అనే ఐటెం సాంగ్‌ లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. లేటెస్ట్‌గా టీజర్‌ అప్‌డేట్‌ను ఇచ్చింది. త్వరలోనే ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేయాలని మూవీ టీమ్‌ భావిస్తోంది. 
    ఏప్రిల్ 24 , 2024
    Mechanic Rocky Review: విష్వక్ సూపర్‌.. ఆ తప్పు చేయకుంటే బొమ్మ బ్లాక్‌ బాస్టరయ్యేది!
    Mechanic Rocky Review: విష్వక్ సూపర్‌.. ఆ తప్పు చేయకుంటే బొమ్మ బ్లాక్‌ బాస్టరయ్యేది!
    నటీనటులు: విష్వక్‌సేన్‌, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌, సునీల్‌, నరేశ్‌, హైపర్‌ ఆది, హర్ష వర్థన్‌ తదితరులు రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి సంగీతం: జేక్స్‌ బిజోయ్‌ సినిమాటోగ్రఫీ: మనోజ్‌రెడ్డి కాటసాని ఎడిటింగ్‌: అన్వర్‌ అలీ నిర్మాత: రామ్‌ తాళ్లూరి విడుదల తేదీ: 22-11-2024 యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) నుంచి ఈ ఏడాది వచ్చిన ‘గామి’ (Gaami), ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో చిత్రం ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky Review)తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు విష్వక్‌ (Vishwaksen) వచ్చేశాడు. అతడు నటించిన మెకానిక్‌ రాకీ చిత్రం నవంబర్‌ 22న గ్రాండ్‌గా రిలీజైంది. ఇందులో విష్వక్‌కు జోడీగా మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), శ్రద్ధా శ్రీనాథ్‌ (Shraddha Srinath) చేశారు. రవితేజ ముళ్లపూడి (Raviteja Mullapudi) దర్శత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది. విష్వక్‌ హ్యాట్రిక్‌ కొట్టాడా? ఇప్పుడు తెలుసుకుందాం.  కథేంటి రాకీ (విష్వక్‌ సేన్‌) బీటెక్‌ మధ్యలోనే ఆపేసి తండ్రి రామకృష్ణ (నరేష్‌) నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా చేరిపోతాడు. రిపేర్లతో పాటు డ్రైవింగ్‌ కూడా నేర్పిస్తుంటాడు. ఈ క్రమంలో అతడి దగ్గర డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు మాయ (శ్రద్ధ శ్రీనాథ్‌), ప్రియా (మీనాక్షి చౌదరి) జాయిన్‌ అవుతారు. తను చదువుకునే రోజుల్లోనే ప్రియను రాకీ ఇష్టపడతాడు. కాలేజీ మానేయడంతో వారు విడిపోతారు. చాలా సంవత్సరాల గ్యాప్‌ తర్వాత కలిసిన ప్రియకు రాకీ దగ్గరయ్యాడా? ఆమె గురించి రాకీకి తెలిసిన షాకింగ్‌ విషయాలు ఏంటి? వాళ్ల లైఫ్‌ను మాయ ఏ విధంగా ప్రభావితం చేసింది? కథలో రాంకీ రెడ్డి (సునీల్‌) ఎవరు? అతడి ఎంట్రీతో రాకీకి వచ్చిన సమస్యలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే విష్వక్‌ సేన్‌ (Mechanic Rocky Review) ఎప్పటిలాగే సెటిల్‌ నటనతో అదరగొట్టాడు. హుషారైన పాత్రలో ఎంతో యాక్టివ్‌గా కనిపించి ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. తనదైనా పంచ్‌లతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాడు. హీరోయిన్లు మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), శ్రద్ధా శ్రీనాథ్‌ (Shraddha Srinath) ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మెప్పించారు. అందంగా కనిపిస్తూ హావభావాలను చక్కగా పలికించారు. కొన్ని సన్నివేశాల్లో పోటీపడి మరి నటించారు. తెరపై మీనాక్షి, విష్వక్‌ సేన్‌ కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. వారి లవ్‌ట్రాక్‌ కూడా బాగుంది. సునీల్‌, నరేష్‌, హర్షవర్ధన్‌కు కూడా బలమైన పాత్రలే దక్కాయి. హర్ష చెముడు తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడ నవ్వించాడు. డైరెక్షన్ ఎలా ఉందంటే ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీకి ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌ను జోడించి నేటి తరానికి కనెక్ట్‌ అయ్యేలా దర్శకుడు రవితేజ ముళ్లపుడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంతో బలమైన అంశాలను తెరపై చూపినప్పటికీ, అవసరానికి మించిన కమర్షియల్‌ హంగులు, కామెడీ సన్నివేశాలు కారణంగా అవి తెలిపోయాయి. ఫస్టాఫ్‌ మెుత్తం పాత్రల పరిచయానికి, హీరో హీరోయిన్ల లవ్‌ట్రాక్‌, కమర్షియల్‌ హంగులు, పాటలు మధ్య రొటిన్‌గా సాగిపోతుంది. సాగదీసిన ఫీలింగ్‌ కూడా కలుగుతుంది. సెకండాఫ్‌ నుంచి అసలైన కథలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్‌. ద్వితీయార్థమే సినిమాకు బలం. అనూహ్యమైన ట్విస్టులు, ప్రతీ పాత్ర కథను మరో మలుపుకు తీసుకెళ్లడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మిడిల్‌ క్లాస్‌ వారి కోరికలను ఆసరగా చేసుకొని కొందరు ఎలా మోసం చేస్తారో దర్శకుడు చక్కగా చూపించాడు. ఫస్టాఫ్‌ విషయంలో దర్శకుడు జాగ్రత్తపడి ఉంటే బొమ్మ బ్లాక్‌ బాస్టర్‌ అయ్యేదని చెప్పవచ్చు.  సాంకేతికంగా టెక్నికల్‌ అంశాలకు వస్తే (Mechanic Rocky Review) సినిమా ఉన్నతంగా ఉంది. జేక్స్ బిజోయ్ (Mechanic Rocky music director) నేపథ్య సంగీతం చిత్రానికి బాగా ప్లస్‌ అయ్యింది. సినిమాటోగ్రాఫర్‌ తనకు ఇచ్చిన బాధ్యతను వందశాతం నెరవేర్చాడు. ఫస్టాఫ్‌ విషయంలో ఎడిటర్‌ మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ విష్వక్‌ నటనసెకండాఫ్‌ట్విస్టులు మైనస్ పాయింట్స్‌ ప్రథమార్థంకమర్షియల్‌ హంగులు Telugu.yousay.tv Rating : 2.5/5 
    నవంబర్ 22 , 2024
    Chandini Chowdary: నోరు జారిన చాందిని చౌదరి.. ఏకిపారేస్తున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌!
    Chandini Chowdary: నోరు జారిన చాందిని చౌదరి.. ఏకిపారేస్తున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌!
    ప్రముఖ నటి చాందిని చౌదరి (Chandini Chowdary) అంటే ఈ జనరేషన్‌ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. యూట్యూబ్‌ స్టార్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. ‘కలర్‌ ఫొటో’ (Colour Photo) చిత్రంతో ఒక్కసారిగా లైమ్‌ లైట్‌లోకి వచ్చిన చాందిని.. రీసెంట్‌గా ‘గామి’ (Gaami) చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. అయితే తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) ఫ్యాన్స్‌ చాందినిపై తీవ్రంగా మండిపడుతున్నారు.  ఏం జరిగిదంటే? చాందిని చౌదరి లేటెస్ట్‌ చిత్రం 'మ్యూజిక్‌ షాప్‌ మూర్తి' (Music Shop Murthy) విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో తాజాగా చిత్ర యూనిట్ టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ క్రమంలో ఓ రిపోర్టర్‌.. ప్రస్తుతం ఐపీఎల్ నడుస్తోంది కదా.. మీ ఫేవరేట్‌ టీమ్ ఏది? అని ప్రశ్నించారు. దీనికి చాందిని సమాధానం ఇస్తూ.. ‘నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూడలేదు. సీసీఎల్‌ మ్యాచ్‌లు మాత్రమే చూశా. ఐపీఎల్‌ చూసిన తర్వాత ఏది ఫేవరెట్ అని సెలెక్ట్ చేసుకుంటాను’ అని పేర్కొంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌’ (SRH) టీమ్‌ ఉంది కదా అని రిపోర్టర్‌ ప్రశ్నించగా.. ‘మాది ఆంధ్రా. మాకు ఆంధ్రా టీమ్‌ లేదు’ అని సరదాగా సమాధానం ఇచ్చింది.  https://twitter.com/i/status/1784952345450987801 సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌ ఫైర్‌! చాందిని చౌదరి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఆమెపై ఒక్కసారిగా ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఫ్యాన్స్ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె తెలంగాణ క్యాపిటల్‌ హైదరాబాద్‌ను ఓన్‌ చేసుకోలేకపోతోందంటూ మండిపడుతున్నారు. నీ చిత్రాలు కేవలం ఆంధ్రవాళ్లు మాత్రమే చూస్తున్నారా? తెలంగాణ వాళ్లు చూడటం లేదా? అని నిలదీస్తున్నారు. ఇలా సంకుచిత మనస్తత్వం కలిగి ఉంటే పెద్ద హీరోయిన్‌వి ఎలా అవుతావంటూ ప్రశ్నిస్తున్నారు.  వివరణ ఇచ్చిన చాందిని  నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటుండటంతో నటి చాందిని తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు సైతం పెట్టింది. ‘నా ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏది అని అడిగితే.. నేను మ్యాచ్‌లు చూశాకే చెబుతా అన్నాను. నాది ఆంధ్రా కాబట్టి ఆంధ్రాకి కూడా టీం ఉంటే బాగుండు అన్నాను. ట్రేండింగ్ కంటెంట్‌కి తగ్గట్టు వీడియో ఎడిట్ చేయడం మాములే కదా. అయినా.. నేను నా రెండు రాష్ట్రాలను చూసి గర్విస్తా. ఎందుకంటే నేను ఈ రెండు రాష్ట్రాలకు చెందిన దాన్ని. హైదరాబాద్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’ అంటూ చాందిని రాసుకొచ్చింది.  https://twitter.com/iChandiniC/status/1784913213701730485 రిలీజ్ ఎప్పుడంటే? చాంది చౌదరి లేటెస్ట్‌ చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ (Music Shop Murthy Release Date).. మే 31న విడుదల కానుంది. ఇందులో అజయ్‌ ఘోష్‌ లీడ్‌ రోల్‌లో నటించాడు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫ్లై హై బ్యానర్‌పై హర్ష గారపాటి నిర్మిస్తున్నారు. పవన్ సంగీతం, శ్రీనివాస్ బెజుగమ్ కెమెరా, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 
    మే 01 , 2024
    తెలుగింటి అందం చాందిని చౌదరి (Chandini Chowdary) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగింటి అందం చాందిని చౌదరి (Chandini Chowdary) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    పదహారనాళ్ల తెలుగు అందం చాందిని చౌదరి. నటనపై మక్కువతో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అంచెలంచెలుగా హీరోయిన్ స్థాయికి ఎదిగింది. మధురం సినిమాతో ఆరంగేట్రం చేసిన ఈ కుందనపు బొమ్మ.. 'కలర్ ఫొటో' సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్‌ లుక్‌లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించి సత్తా చాటింది. మరి ఈ తెలుగు అందం గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. చాందిని చౌదరి పదహా చాందిని చౌదరి ఎవరు? చాందిని చౌదరి తెలుగు హీరోయిన్. కలర్ ఫొటో చిత్రంతో ఫేమస్ అయింది.  చాందిని చౌదరి ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు  చాందిని చౌదరి ఎక్కడ పుట్టింది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ చాందిని చౌదరి పుట్టిన తేదీ ఎప్పుడు? 1993, అక్టోబర్ 23, వయస్సు(33) చాందిని చౌదరికి వివాహం అయిందా? లేదు ఇంకా జరగలేదు చాందిని చౌదరికి ఇష్టమైన రంగు? లైట్ పింక్ చాందిని చౌదరికి అభిరుచులు? స్విమ్మింగ్, ట్రావెలింగ్ చాందిని చౌదరికి ఇష్టమైన ఆహారం? తనకు పులిహోర అంటే ఇష్టమని తెలిపింది చాందిని చౌదరి అభిమాన నటుడు? పవన్ కళ్యాణ్ చాందిని చౌదరి తొలి సినిమా? మధురం(2014) చాందిని చౌదరికి గుర్తింపు తెచ్చిన సినిమాలు? కలర్ ఫొటో, సమ్మతమే, సూపర్ ఓవర్, గామి చాందిని చౌదరి ఏం చదివింది? మెకానికల్ ఇంజనీరింగ్  చాందిని చౌదరి ఎన్ని సినిమాల్లో నటించింది? 2024 వరకు 15 సినిమాల్లో నటించింది చాందిని చౌదరి పారితోషికం ఎంత? ఒక్కో సినిమాకి దాదాపు రూ.30 లక్షల వరకు తీసుకుంటోంది. చాందిని చౌదరి ఎన్ని అవార్డులు గెలుచుకుంది? అవార్డులు ఏమి రాలేదు కానీ, తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకుంది చాందిని చౌదరికి మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా? చాందిని చౌదరి అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది. ఎక్కువగా ట్రెడిషన్ వేర్ ధరించేందుకు ఇష్టపడుతుంది. చాందిని చౌదరి పెంపుడు కుక్క పేరు? చాందిని చౌదరికి పెంపుడు జంతువులంటే ఇష్టం, ఆమె పెట్ డాగ్ పేరు లడ్డూ చాందిని చౌదరి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/chandini.chowdary/?hl=en చాందిని చౌదరి సిగరేట్ తాగుతుందా? తెలియదు చాందిని చౌదరి మద్యం తాగుతుందా? తెలియదు
    మార్చి 05 , 2024
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు విభిన్నమైన చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం శివరాత్రి పండగను పురస్కరించుకొని థియేటర్లలో సందడి చేయనున్నాయి. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో ఈ ప్రత్యేక కథనంలో ద్వారా పరిశీలిద్దాం.  థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు గామి విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా రూపొందిన అడ్వెంచర్‌ డ్రామా ఫిల్మ్‌ ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్‌. ‘మానవ స్పర్శ సమస్యను ఎదుర్కొంటున్న ఓ అఘోర హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం’ అని దర్శకుడు తెలిపారు. విశ్వక్‌ అఘోరాకు నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి.  భీమా గోపీచంద్‌ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష రూపొందించిన ఫాంటసీ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘భీమా’ (Bhimaa). మాళవికా శర్మ (Malvika Sharma), ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) కథానాయికలుగా చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. షైతాన్‌ బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ నటించిన హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘షైతాన్‌’ (హిందీ) (Shaitaan). వికాస్‌ బహ్ల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవగణ్‌తో పాటు ఆర్‌. మాధవన్‌, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రేమలు మలయాళంలో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘ప్రేమలు’.. ఈ వారం తెలుగులో రిలీజవుతోంది. గిరీశ్‌ ఎ.డి. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్‌ కె. గఫూర్‌ (Naslen K Gafoor), మ్యాథ్యూ థామస్‌ (Mathew Thomas), మమితా బైజూ (Mamitha Baiju) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 8న రిలీజ్‌ కానుంది. రికార్డ్ బ్రేక్ నిహార్‌, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్‌, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్నకుమార్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘రికార్డ్‌ బ్రేక్‌’ (Record Break). ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌ అజయ్‌, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్‌ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’ (We Love Bad Boys). రాజు రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి రవితేజ నున్న, నేహా జురెల్‌ జంటగా సత్య రాజ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి’ (Raju Gari Ammayi Naidu Gari Abbayi). హాస్యంతోపాటు ఊహించని మలుపులతో ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ రేపుతుందని రవితేజ పేర్కొన్నారు. ఈ సినిమా మార్చి 9న రిలీజ్ కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు హనుమాన్‌ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘హనుమాన్’. సంక్రాంతికి రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత అంటే ఈ శుక్రవారం (మార్చి 8) మహా శివరాత్రినాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (Zee 5) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. లాల్ సలామ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అతిథిపాత్రలో కనిపించిన ఈ ‘లాల్ సలామ్’ (Lal Salaam) మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ నెలలోపే నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెడుతోంది. మార్చి 8న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. యాత్ర 2 యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వస్తోంది. మాజీ సీఎం వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీని ఎక్కిన తీరును ఈ మూవీలో చూపించారు. 2019లో వచ్చిన యాత్రకు ఇది సీక్వెల్. ఈ చిత్రం కూడా మార్చి 8న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. వళరి ‘గురు’ ఫేమ్ రితికా సింగ్ (Ritika Singh) కీలక పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’ (Valari). శ్రీరామ్‌ కీలక పాత్ర పోషించాడు. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnweshippin KandethumMovieMalayalam / TeluguNetflixMarch 08The Gentleman MovieEnglishNetflixMarch 07DamselMovieEnglishNetflixMarch 08The Backup PlanMovieEnglishNetflixMarch 08SaaguMovieTeluguAmazon / MX PlayerMarch 08Captain MillerMovieHindiAmazon March 08Show TimeMovieHindiDisney + HotstarMarch 08Maha Rani Season 2Web SeriesTelugu/HindiSony LIVMarch 07
    మార్చి 04 , 2024
    <strong>Tollywood Box office: 75% పడిపోయిన విష్వక్‌ సేన్‌ మార్కెట్‌.. సత్యదేవ్‌, ఆశోక్‌ గల్లా పరిస్థితి మరీ దారుణం!</strong>
    Tollywood Box office: 75% పడిపోయిన విష్వక్‌ సేన్‌ మార్కెట్‌.. సత్యదేవ్‌, ఆశోక్‌ గల్లా పరిస్థితి మరీ దారుణం!
    ఈ వారం టాలీవడ్ నుంచి మూడు కీలక చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద రిలీజ్‌ అయ్యాయి. మాస్‌ కా దాస్‌ విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) నటించిన ‘మెకానిక్‌ రాకీ’ (Mechanik Rocky) శుక్రవారం (నవంబర్‌ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో పాటు విలక్షణ నటుడు సత్యదేవ్‌(Sathyadev) హీరోగా చేసిన ‘జిబ్రా’ (Zebra) కూడా ఆడియన్స్‌ను పలకరించింది. అలాగే ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) కథ ఇచ్చిన కథతో ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)బాక్సాఫీస్‌ బరిలో నిలిచింది. అయితే విష్వక్‌, సత్యదేవ్‌ చిత్రాలు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకోగా అశోక్‌ గల్ల (Ashok Galla) నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) డిజాస్టర్‌ టాక్ సొంతం చేసుకుంది. మరీ తొలి రోజు ఈ చిత్రాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్నాయా? లేదా మంచి వసూళ్లనే సాధించాయా? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; ‘మెకానిక్‌ రాకీ’ కలెక్షన్స్‌ ఎంతంటే విష్వక్‌ సేన్‌ (Vishwaksen) హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికలుగా చేసిన చిత్రం ‘మెకానిక్‌ రాకీ’ (Mechanik Rocky Day 1 Collections). రవితేజ ముళ్లపూడి (Raviteja Mullapudi) దర్శత్వం వహించారు. శుక్రవారం (నవంబర్‌ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ చిత్రాలతో విష్వక్‌ ప్రేక్షకులను పలకరించాడు. మంచి హిట్‌ టాక్‌ కూడా సొంతం చేసుకున్నాడు. ‘మెకానిక్‌ రాకీ’తో ఎలాగైన హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాలని భావించిన విష్వక్‌కు ఈ మూవీ ఝలక్‌ ఇచ్చారు. యావరేజ్‌ టాక్‌ మాత్రమే తెచ్చుకుంది. ఈ ప్రభావం తొలి రోజు కలెక్షన్స్‌పై స్పష్టంగా కనిపించింది. మెకానిక్‌ రాకీ తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 2.3 కోట్ల గ్రాస్‌ మాత్రమే రాబట్టగలిగింది. ఇది విష్వక్‌ స్థాయికి చాలా తక్కువనే చెప్పాలి. ఆయన గత చిత్రాలు ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’, ‘గామి’ తొలి రోజున వరుసగా రూ.8 కోట్లు, రూ.8.6 కోట్ల గ్రాస్‌ సాధించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్‌ కా ధమ్కీ’ కూడా రూ.8.88 కోట్లు వసూలు చేసింది. ఆ చిత్రాలతో పోలిస్తే మెకానిక్‌ రాకీ డే 1 కలెక్షన్స్‌ 75% మేర పడిపోయాయని చెప్పవచ్చు.&nbsp; ‘జిబ్రా’ కలెక్షన్స్‌ ఎంతంటే సత్యదేవ్ (Satya Dev), డాలి ధనంజయ్ (daali dhananjaya) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra Movie Review). ‘పెంగ్విన్‌’ సినిమాను డైరెక్ట్‌ చేసిన ఈశ్వర్‌ కార్తీక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్‌, అమృత అయ్యంగార్‌ కథానాయికలుగా చేశారు. వైట్ కాలర్‌ క్రైమ్‌ డ్రామాలో దీనిని రూపొందించారు. మెగాస్టార్‌ చిరు (Chiranjeevi) ఈ మూవీ ప్రమోషన్స్‌లో స్వయంగా పాల్గొనడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడింది. యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.65.8 లక్షలు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.55.5 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. శని, ఆది వారాల్లో సినిమా కలెక్షన్స్‌ పెరిగే ఛాన్స్ లేకపోలేదని తెలిపాయి. దేవకీ నందన వాసుదేవ కలెక్షన్స్‌ ఎంతంటే ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్‌ కుమారుడు, మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ (Ashok Galla) హీరోగా రూపొందిన తాజా చిత్రం 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva Review). హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథ అందించగా అర్జున్‌ జంద్యాల దర్శకత్వం వహించారు. ఇందులో ఆధ్యాత్మిక, వాణిజ్య అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయని చిత్ర యూనిట్‌ మెుదటి నుంచి చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్‌ 22) రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్‌ టాక్ తెచ్చుకొని అందరినీ షాక్‌కు గురించేసింది. మూవీ టాక్‌కు తగ్గట్లే కలెక్షన్స్‌ కూడా దారుణంగా నమోదయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.15.5 లక్షలు మాత్రమే దక్కించుకుందని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి వచ్చిన నెగిటివ్‌ టాక్‌ వల్ల రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరీ ఏం జరుగుతుందో చూడాలి.&nbsp;
    నవంబర్ 23 , 2024
    <strong>Vishwak Sen: పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌తో విష్వక్‌ సేన్‌ రొమాన్స్‌.. క్రేజీ కాంబో లోడింగ్‌!</strong>
    Vishwak Sen: పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌తో విష్వక్‌ సేన్‌ రొమాన్స్‌.. క్రేజీ కాంబో లోడింగ్‌!
    ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న యంగ్‌ హీరోల్లో విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) ఒకరు. వరుసగా చిత్రాలను రిలీజ్‌ చేస్తూ అతడు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాట్రిక్‌ హిట్స్‌తో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న ఈ మాస్‌ కా దాస్‌ వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే జాతి రత్నాలు డైరెక్టర్‌ అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోయిన్‌తో విష్వక్‌ రొమాన్స్‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; ‘VS14’లో హీరోయిన్‌ ఫిక్స్‌! విష్వక్‌ సేన్‌ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘VS14’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఆగస్టులో అధికారిక ప్రకటన వచ్చింది. అయితే లేటేస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమాలో విష్వక్‌కు జోడీగా తమిళ నటి  ప్రియాంక అరుళ్‌ మోహనన్‌ చేయనుంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నాని సరసన నటించిన ప్రియాంక మంచి మార్కులు కొట్టేసింది. మరోవైపు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో 'ఓజీ' సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తోంది. ఇక విష్వక్‌ సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తే ‘VS14’పై అంచనాలు భారీగా పెరగనున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టి.జి. విశ్వ ప్రసాద్‌ నిర్మించనున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం సమకూర్చనున్నారు. యాక్షన్‌ డ్రామా.. యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌ ఇటీవల మరో ప్రాజెక్టును ప్రకటించాడు. 'VS13' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. శ్రీధర్‌ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. తాజా పోస్టర్‌ను గమనిస్తే ఇందులో విష్వక్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.&nbsp; రెండోసారి ఖాకీ పాత్రలో.. విష్వక్‌ సేన్‌ పోలీసు పాత్రను పోషించడం ఇదే తొలిసారి కాదు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్‌ : ది ఫస్ట్‌ కేసు' (HIT: The First Case) చిత్రంలోనూ విష్వక్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌తో విష్వక్‌ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ‘VS13’ ప్రాజెక్ట్‌లోనూ విష్వక్‌ మరోమారు పోలీసు పాత్ర పోషిస్తుండటంతో ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. తనకు బాగా కలిసొచ్చిన కాప్‌ రోల్‌లో విష్వక్‌ మరోమారు సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; విష్వక్‌ బిజీ బిజీ.. ప్రస్తుతం విష్వక్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్‌ సాంగ్‌ కూడా రిలీజై ఆకట్టుకుంది. దీంతో పాటు ఇటీవల ‘లైలా’ (Laila) అనే కొత్త సినిమాను సైతం విష్వక్‌ ఇటీవల ప్రకటించారు. ఇందులో విష్వక్‌ అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘లైలా’ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హ్యాట్రిక్‌ హిట్స్‌ ప్రస్తుతం విష్వక్‌ హ్యాట్రిక్‌ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఆయన రీసెంట్‌ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్‌ టాక్‌ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్‌ పాత్రలో విష్వక్‌ మాస్‌ జాతర చేశాడు. అలాగే విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్‌ పాత్రలో విష్వక్‌ నటన మెప్పించింది. హీరోయిన్‌ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్‌ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా చేసింది.&nbsp;
    సెప్టెంబర్ 24 , 2024
    Vishwak Sen: ‘ఓ పిల్లో’ అంటూ వెంటపడ్డ విష్వక్‌ సేన్‌.. ‘మెకానిక్‌ రాకీ’ నుంచి సెకండ్‌ సాంగ్‌ రిలీజ్‌! 
    Vishwak Sen: ‘ఓ పిల్లో’ అంటూ వెంటపడ్డ విష్వక్‌ సేన్‌.. ‘మెకానిక్‌ రాకీ’ నుంచి సెకండ్‌ సాంగ్‌ రిలీజ్‌! 
    యంగ్ హీరో విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) వివిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్‌, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విష్వక్‌‌.. ఇటీవలే ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) సినిమాతో సాలిడ్‌ సక్సెస్‌ అందుకున్నాడు. దీంతో అతడు నెక్స్ట్‌ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతున్నాడో అని ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విష్వక్‌‌ ‘మెకానిక్‌ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్ రిలీజై ఆకట్టుకుంటోంది.&nbsp; ‘ఓ పిల్ల’ సాంగ్‌ రిలీజ్‌ విష్వక్‌ సేన్‌ (Vishwak sen) కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky). రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న ఇది విడుదల కానుంది. ఇటీవలే సరిపోదా శనివారం కోసం బ్లాక్‌ బాస్టర్ ఆల్బమ్‌ అందించిన జేక్స్‌ బెజోయ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓపిల్లో..’ అనే పాటను విడుదల చేశారు. కృష్ణచైతన్య ఈ పాటను రాయగా నకాశ్‌ అజీజ్‌ పాడారు. ఆ యూత్‌ఫుల్ పాటను మీరూ చూసేయండి. https://www.youtube.com/watch?v=3HkSttt1iJg&amp;t=3s సాంగ్ ఎలా ఉందంటే? రాఖీ (విష్వక్‌ సేన్‌), ప్రియ (మీనాక్షి చౌదరి) ప్రేమను పరిచయం చేసేలా 'ఓ పిల్లా' సాంగ్ సాగింది. 'బీటెక్‌లోనే మిస్సయ్యనే నిన్నే కొంచంలో' అంటూ కథానాయకుడు విష్వక్‌‌ తన ప్రేమపై ఉన్న భావాలను ఇందులో వ్యక్తం చేశాడు. నకాష్‌ అజీజ్‌ ఈ పాటను యూత్‌ఫుల్‌గా, ఎంతో మనోహరంగా పాడారు. ఈ సాంగ్‌లో విష్వక్‌, మీనాక్షి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. విజువల్స్‌ కూడా చాలా ఎంగేజింగ్‌గా ఆకట్టుకున్నాయి. మనోజ్‌ కాటసాని సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తోంది. విష్వక్‌ ఎప్పటిలాగే తన క్లాసిక్‌ స్టెప్పులతో ఈ పాటలో ఆకట్టుకున్నాడు. కాగా, ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తోంది.&nbsp;&nbsp; ‘లైలా’గా విష్వక్‌ విష్వక్‌ మెకానిక్‌ రాకీతో పాటు లైలా అనే మరో ప్రాజెక్ట్‌లోనూ వర్క్‌ చేస్తున్నాడు. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విష్వక్‌ మెుదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నాడు. దీంతో సినిమా అనౌన్స్‌ చేసినప్పటినుంచే ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకూ మాస్‌ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన విష్వక్‌‌ మెుదటిసారి అమ్మాయిగా నటిస్తుండటంతో ఈ సినిమా చూసేందుకు విష్వక్‌ ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్‌ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.&nbsp; https://twitter.com/HanuNews/status/1808353426721407104 పోలీసు ఆఫీసర్‌గా.. యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌ ఇటీవల మరో ప్రాజెక్ట్‌ను సైతం అనౌన్స్‌ చేశాడు. 'VS13' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. శ్రీధర్‌ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్‌ పోస్టర్‌ చూస్తుంటే ఇందులో విష్వక్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.&nbsp; https://twitter.com/SLVCinemasOffl/status/1820696576098197948 హ్యాట్రిక్‌ హిట్స్‌ ప్రస్తుతం విష్వక్‌ హ్యాట్రిక్‌ విజయాలతో మంచి ఊపు మీదనున్నారు. ఆయన రీసెంట్‌ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్‌ టాక్‌ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్‌ పాత్రలో విష్వక్‌ మాస్‌ జాతర చేశాడు. అలాగే విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్‌ పాత్రలో విష్వక్‌ నటన మెప్పించింది. హీరోయిన్‌ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్‌ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా చేసింది.&nbsp;
    సెప్టెంబర్ 18 , 2024
    <strong>Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;</strong>
    Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;
    టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్‌ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్‌, రవితేజ, రామ్‌ పోతినేని, నితిన్‌, గోపిచంద్‌ వంటి సీనియర్‌ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్‌ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; సుహాస్‌ (Suhas) ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్‌‌ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్‌ పద్మభూషణ్‌’, ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్‌ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్‌ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తేజ సజ్జ (Teja Sajja) బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్‌’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్‌' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్‌ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్‌' అనే మరో పాన్‌ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించింది.&nbsp;&nbsp; నిఖిల్ సిద్దార్ధ్‌ (Nikhil Siddhartha) యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హ్యాపీ డేస్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.&nbsp; ఆ సినిమాలో వరుణ్ సందేశ్‌ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్‌ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్‌ జానర్ ఫిల్మ్స్‌ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్‌ చిత్రంలో నిఖిల్‌ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.&nbsp; విశ్వక్‌ సేన్‌ (Visvak Sen) యువ నటుడు విశ్వక్‌ సేన్‌ యూత్‌లో మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్‌ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్‌ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్‌ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్‌’ పేరుతో మాస్‌ యాక్షన్‌ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్‌’, ‘పాగల్‌’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్‌ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్‌ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్‌ జానర్‌ ఫిల్మ్‌లో విశ్వక్‌ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.&nbsp; అడివి శేష్ (Adivi Sesh) ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్‌ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్‌‌ గ్రోత్‌ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌‌గా, ఎడిటర్‌‌గా కూడా వర్క్‌ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్‌ బాస్టర్‌ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్‌ కూడా తెరకెక్కించి మరో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్‌’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్‌’ కూడా పట్టాలెక్కనుంది.&nbsp; నార్నే నితిన్‌ (Narne Nithin) జూనియర్ ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాడ్‌’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్‌ కూడా బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇక నితిన్‌ తన తర్వాతి చిత్రం ‘ఆయ్‌’ను పక్కా విలేజ్‌ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్‌ ‘ఆయ్‌’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్‌, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్‌ పర్‌ఫార్మెన్స్‌ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.&nbsp;
    సెప్టెంబర్ 17 , 2024
    <strong>VS13: పోలీసు ఆఫీసర్‌గా విష్వక్‌ సేన్.. అదిరిపోయే అనౌన్స్‌మెంట్‌ వచ్చేసిందిగా!</strong>
    VS13: పోలీసు ఆఫీసర్‌గా విష్వక్‌ సేన్.. అదిరిపోయే అనౌన్స్‌మెంట్‌ వచ్చేసిందిగా!
    ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న యంగ్‌ హీరోల్లో విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) ఒకరు. వరుసగా చిత్రాలను రిలీజ్‌ చేస్తూ అతడు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాట్రిక్‌ హిట్స్‌తో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న ఈ మాస్‌ కా దాస్‌ వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. రెండు చిత్రాలు ఇప్పటికే సెట్స్‌పై ఉండగా తాజాగా మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఆ మూవీ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; యాక్షన్‌ డ్రామా.. యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌ తాజాగా మరో ప్రాజెక్టును ప్రకటించాడు. 'VS13' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. శ్రీధర్‌ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. తాజా పోస్టర్‌ను గమనిస్తే ఇందులో విష్వక్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.&nbsp; https://twitter.com/SLVCinemasOffl/status/1820696576098197948 రెండోసారి ఖాకీ పాత్రలో.. విష్వక్‌ సేన్‌ పోలీసు పాత్రను పోషించడం ఇదే తొలిసారి కాదు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్‌ : ది ఫస్ట్‌ కేసు' (HIT: The First Case) చిత్రంలోనూ విష్వక్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌తో విష్వక్‌ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ‘VS13’ ప్రాజెక్ట్‌లోనూ విష్వక్‌ మరోమారు పోలీసు పాత్ర పోషిస్తుండటంతో ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. తనకు బాగా కలిసొచ్చిన కాప్‌ రోల్‌లో విష్వక్‌ మరోమారు సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; విష్వక్‌ బిజీ బిజీ.. ప్రస్తుతం విష్వక్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. దీంతో పాటు ఇటీవల ‘లైలా’ (Laila) అనే కొత్త సినిమాను సైతం విష్వక్‌ ఇటీవల ప్రకటించారు. ఇందులో విష్వక్‌ అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘లైలా’ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హ్యాట్రిక్‌ హిట్స్‌ ప్రస్తుతం విష్వక్‌ హ్యాట్రిక్‌ విజయాలతో మంచి ఊపు మీదనున్నారు. ఆయన రీసెంట్‌ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్‌ టాక్‌ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్‌ పాత్రలో విష్వక్‌ మాస్‌ జాతర చేశాడు. అలాగే విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్‌ పాత్రలో విష్వక్‌ నటన మెప్పించింది. హీరోయిన్‌ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్‌ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా చేసింది.&nbsp;
    ఆగస్టు 06 , 2024
    This Week OTT Movies: ఉగాది, రంజాన్‌ సందర్భంగా ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఓ లుక్కేయండి!
    This Week OTT Movies: ఉగాది, రంజాన్‌ సందర్భంగా ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఓ లుక్కేయండి!
    ఈ వేసవిలో తెలుగు ఆడియన్స్‌కు వినోదాన్ని పంచేందుకు ఈ వారం పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అగ్ర హీరోల సినిమాలు లేకపోవడంతో చిన్న చిత్రాలు తమ సత్తా ఏంటో చూపించేందుకు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు/ సిరీస్‌లు ఆడియన్స్‌ను ఎంటర్టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలి లీడ్‌ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) రూపొందింది. అంజలితో పాటు శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.&nbsp; లవ్‌ గురు ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ చిత్రం.. ‘లవ్‌ గురు’ (Love Guru). మృణాళిని రవి కథానాయిక. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. రంజాన్‌ కానుకగా ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి లవ్‌ గురు ఎలా పరిష్కారం చూపించాడు అన్నది ఈ చిత్ర కథాంశం. డియర్‌ జీవీ ప్రకాష్‌కుమార్‌, ఐశ్వర్య జంటగా నటించిన లేటెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘డియర్‌’ (Dear). తమిళంలో ఏప్రిల్‌ 11న విడుదలవుతున్న ఈ చిత్రం.. తెలుగులో ఒక రోజు ఆలస్యంగా ఏప్రిల్‌ 12న రాబోతోంది. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. అన్నపూర్ణా స్టూడియోస్‌, ఏషియన్‌ సినిమాస్‌ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నాయి. భార్య గురక వల్ల ఆ భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అన్నది స్టోరీ.&nbsp; బడేమియా ఛోటేమియా బాలీవుడ్‌ కథానాయకులు అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన తాజా చిత్రం ‘బడేమియా ఛోటేమియా’ (Bade miyan Chote miyan) ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌, మానుషి చిల్లర్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 10న ఈ మూవీ థియేటర్‌లలో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.&nbsp; మైదాన్‌ భారత ఫుట్‌బాల్‌ దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘మైదాన్‌’ (Maidaan). బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ ఇందులో లీడ్‌ రోల్‌లో చేశాడు. అమిత్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా చేసింది. బోనీ కపూర్‌ నిర్మాత. ఏప్రిల్‌ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు.&nbsp; ఓటీటీలో విడులయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఓం భీమ్ బుష్‌ ఈ వారం ఓటీటీలోకి క్రేజీ సినిమా రాబోతోంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం బీమ్‌ బుష్‌’ (Om Bheem Bush). ఏప్రిల్‌ 12న ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్‌ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.&nbsp; గామి యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ లేటెస్ట్ చిత్రం 'గామి' (Gaami).. మార్చి 8న థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. జీ 5 వేదికగా ఏప్రిల్‌ 12 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ ఇది ప్రసారం కానుంది.&nbsp; ప్రేమలు&nbsp; మలయాళంలో విడుదలై భారీ హిట్ అందుకున్న ‘ప్రేమలు’ (Premalu).. తెలుగులోనూ మంచి విజయం సాధించింది. మార్చి 8న విడుదలైన ఈ మూవీ.. తెలుగు వెర్షన్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. కాగా, ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 12 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. మరోవైపు అదే రోజున హాట్ స్టార్‌లో మలయాళ వెర్షన్‌లో రిలీజ్‌ కాబోతోంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateUnlockedSeriesKoreanNetflixApril 10What Jenniffer DidMovieEnglishNetflixApril 10Baby ReindeerMovieEnglishNetflixApril 11Heartbreak High S2SeriesEnglishNetflixApril 12Amar Singh ChamkeelaMovieHindiAmazon primeApril 12GaamiMovieTeluguAmazon primeApril 12Blood FreeSeriesKoreanDisney + HotstarApril 10The Greatest HitsMovieEnglishDisney + HotstarApril 12KarthikaMovieTelugu&nbsp;AhaApril 09PremaluMovieTelugu&nbsp;AhaApril 12AdrusyamSeriesHindiSonyLIVApril 11Laal SalaamMovieTelugu/TamilSunNXTApril 12
    ఏప్రిల్ 08 , 2024
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.&nbsp; టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి&nbsp; ఓసారి చూద్దాం. అడవి శేషు(Adivi Sesh) ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు.&nbsp; 'కర్మ' అనే సినిమాతో&nbsp; డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.&nbsp; విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు.&nbsp; మరో నాలుగేళ్ల తర్వాత&nbsp; దాస్‌ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్‌ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) 'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు.&nbsp;అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్‌ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆర్‌ నారాయణ మూర్తి(R. Narayana Murthy) విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ &amp;సూపర్ స్టార్ కృష్ణ లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే&nbsp; అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే&nbsp; డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
    ఏప్రిల్ 01 , 2024
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్‌ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్‌, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్‌ ఠాకూర్‌ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే&nbsp; గత కొద్ది కాలంగా&nbsp; ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్‌ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; గౌరి ప్రియ (Gouri Priya) టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్‌’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన ‘లవర్‌’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=8dwrE0OCq40 ఆనందిని (Anandhi) వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్‌ హీరోగా చేసింది.&nbsp; చాందిని చౌదరి (Chandini Chowdary) ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్‌ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్‌ సేన్‌ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్‌', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.&nbsp; వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్‌ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్‌ ఆనంద్‌ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI దివ్య శ్రీపాద (Divya Sripada) టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్‌ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.&nbsp; రితు వర్మ (Ritu Varma) హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్‌ షా' (Badshah) సినిమాలో కాజల్‌ ఫ్రెండ్‌ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్‌ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్‌’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్‌ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్‌ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=4hNEsshEeN8 స్వాతి రెడ్డి (Swathi Reddy) వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్‌' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా,&nbsp; గోల్కొండ స్కూల్‌, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్‌ ఆఫ్‌ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE డింపుల్‌ హయాతి (Dimple Hayathi) ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్‌ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్‌ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606 శివాని నగరం (Shivani Nagaram) ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి. మానస చౌదరి (Maanasa Choudhary) ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్‌’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్‌.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్‌ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్‌ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1762802318934950146 అంజలి (Anjali) తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్‌, సరైనోడు, వకీల్‌సాబ్‌, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గేమ్‌ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
    మార్చి 06 , 2024

    @2021 KTree