• TFIDB EN
  • హీరో
    UATelugu2h 9m
    గుప్త నిధులు వెలికితీసే పురావస్తు శాస్త్రవేత్త... కృష్ణ. ఓ గ్రామంలో గుప్త నిధులు వెలికితీసేందుకు వెళ్తాడు. కానీ అదే గ్రామంలో అతని స్నేహితుడు విక్రమ్ హత్యకు గురవుతాడు.తన స్నేహితుడి మరణం వెనుక ఉన్నది ఎవరు? గుప్త నిధులను కృష్ణ కనిపెట్టాడా? లేదా? అనేది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    చిరంజీవి
    as Krishna
    రాధిక శరత్‌కుమార్
    రాధిక
    రావు గోపాల్ రావు
    రావు గోపాల్ రావు
    కైకాల సత్యనారాయణ
    అల్లు రామలింగయ్య
    నిర్మలమ్మ
    ప్రసాద్ బాబు
    జ్యోతి లక్ష్మి
    as an item number
    జయమాలిని
    ఒక ఐటెమ్ నంబర్
    సిల్క్ స్మిత
    ఒక ఐటెమ్ నంబర్
    సిబ్బంది
    విజయ బాపినీడు
    దర్శకుడు
    అల్లు అరవింద్
    నిర్మాత
    కృష్ణ - చక్రసంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Tollywood Next Generation : తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన టాప్ హీరోల వారసులు… ఆ కళలు నిజమయ్యేనా?
    Tollywood Next Generation : తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన టాప్ హీరోల వారసులు… ఆ కళలు నిజమయ్యేనా?
    హీరోల కుమారులు, కుమార్తెలు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టడం సర్వ సాధారణం. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అలా వచ్చిన వారే. వారసులుగా వచ్చినప్పటికీ వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తర్వాత జనరేషన్‌ కూడా సిద్ధంగా ఉంది. టాప్ హీరోల పిల్లలు చిన్నప్పుడే ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. భవిష్యత్‌ కోసం ఇప్పుడే బాటలు వేసుకుంటున్నారు వాళ్లేవరో ఓసారి లుక్కేద్దాం. గౌతమ్ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ అచ్చుగుద్దినట్లుగా కృష్ణలా ఉంటాడు. మహేశ్ తర్వాత సినిమాల్లోకి కచ్చితంగా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఓ సినిమాలో ఇప్పటికే నటించాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంలో మహేశ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేశాడు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.  మహాధన్‌ చిత్ర పరిశ్రమలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎదిగిన రవితేజ కుమారుడే మహాధన్. రాజా ది గ్రేట్ చిత్రంలో అంధుడి  పాత్రలో కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఇరగ్గొట్టాడు. మహాధన్‌కి నటన మీద ఆసక్తి ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూల్లో రవితేజ కన్ఫర్మ్ చేశాడు. “ సినీ పరిశ్రమలో ఉన్నాం కనుక కచ్చితంగా ఆసక్తి ఉంటుంది. లేదని చెప్పలేను. కానీ, ఎప్పుడూ వస్తాడనేది వాడి ఇష్టం” అన్నారు. దీనిబట్టి మహాధన్‌ హీరోగా వస్తాడనటంలో ఎలాంటి సదేహం లేదు. అకీరా నందన్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లకు జన్మించిన కుమారుడు అకీరా నందన్. అకీరా సినిమాల్లోకి రావాలని పవర్ స్టార్ ఫ్యాన్స్‌ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. నటనవైపు కాకుండా ఇండస్ట్రీలోనే మరోరంగంపై దృష్టిసారించాడు అకీరా. ఇటీవల రైటర్స్ బ్లాక్‌ అనే షార్ట్‌ ఫిల్మ్‌కు సంగీతం అందించాడు. ఈ విషయాన్ని అడివి శేష్‌ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.  సితార మహేశ్ కుమార్తె సితార కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సర్కారు వారి పాట చిత్రంలో ఓ సాంగ్‌లో తళుక్కున మెరిసింది సితార పాప. సినిమారంగంపై మక్కువని చెప్పకనే చెప్పింది. భవిష్యత్‌లో సితార నుంచి కూడా ఓ సినిమా ఉంటుందని ఆశించవచ్చు. అల్లు అర్హ అల్లు అర్జున్ కుమార్తె అర్హ బాలనటి అవాతరమెత్తింది. సామాజిక మాధ్యమాల్లో తండ్రితో కలిసి సందడి చేసే ఈ చిచ్చర పిడుగు.. గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమాలో ఓ క్యారెక్టర్‌లో మెరిసింది. ప్రిన్స్‌ భరత పాత్రలో నటించింది అర్హ. ఇందులో ముద్దుగా చెప్పిన డైలాగులకు మంచి మార్కులు పడ్డాయి. భవిష్యత్‌లో సినీరంగంలో రాణిస్తుందనడానికి ఈ ఒక్క సినిమా చాలు.  అరియానా, వివియానా మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా కూడా తమ ప్రతిభను చాటారు. విష్ణు నటించిన జిన్నా సినిమాలో పాటను ఆలపించారు ఇద్దరు. దీనిపై మంచు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.  అయాన్, అభిరామ్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్, జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభిరామ్ ఇప్పటివరకైతే ఆరంగేట్రం చేయలేదు. కానీ, రెండు కుటుంబాల నుంచి వారసులుగా ఉన్న కారణంగా భవిష్యత్‌లో కచ్చితంగా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉంది.
    ఏప్రిల్ 19 , 2023
    న్యూఇయర్‌ వేడుకల్లో టాలీవుడ్‌ హీరోలు.. ఎవరేవరూ ఏం చేశారంటే?
    న్యూఇయర్‌ వేడుకల్లో టాలీవుడ్‌ హీరోలు.. ఎవరేవరూ ఏం చేశారంటే?
    ]హీరో కార్తీ విదేశాల్లో న్యూఇయర్ సంబరాలు చేసుకున్నాడు. ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశాడు.కార్తీ
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>HBD Anushka Shetty: అనుష్క శెట్టి క్రష్ ఎవరో తెలిసిపోయింది! ఆ హీరో మాత్రం కాదు&nbsp;</strong>
    HBD Anushka Shetty: అనుష్క శెట్టి క్రష్ ఎవరో తెలిసిపోయింది! ఆ హీరో మాత్రం కాదు&nbsp;
    సౌత్‌లో హీరోల మాదిరి క్రేజ్‌ సంపాందించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క (Anushka Shetty). తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఇవాళ అనుష్క పుట్టిన రోజు. 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్‌లో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; ప్రసిద్ధ తులు కుటుంబం నుండి వచ్చిన అనుష్క నటి అవుతానని ఎప్పడూ అనుకోలేదట. కొన్ని పరిస్థితుల వల్ల నటి కావాల్సి వచ్చిందని ఈ బ్యూటీ చెప్పింది.&nbsp; బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుంచి అనుష్క డిగ్రీ పట్టా అందుకుంది. ఈ కాలేజీలోనే స్టార్ హీరోయిన్స్‌ దీపికా పదుకొనే, అనుష్క శర్మ, మమతా మోహన్ దాస్ వంటి సినీ తారలు చదువుకున్నారు. అనుష్క కళాశాలలో చదువుకునే రోజుల్లో ‘తపస్య‘ అనే ధ్యాన వర్క్ షాపుకు వెళ్తుండేది. ఆమెకు దానిపై ఆసక్తి లేకపోయినప్పటికీ తన తండ్రి విట్టల్ శెట్టి కోసమే ఆ సెషనుకు హాజరయ్యేది.&nbsp; View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) అనుష్క శెట్టి తన గురువు భరత్ ఠాకూర్ చేత యోగాలో మెళుకువలు నేర్చుకుంది. ఆ తర్వాత యోగాను తన వృత్తిగా ఎంచుకుంది. ముంబయిలో కొంతకాలం పాటు యోగా సెషన్లు సైతం నిర్వహించింది. యోగా టీచర్‌గా చాలా బిజీగా ఉన్నప్పుడేే పూరి జగన్నాథ్ డైరక్షన్‌లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో ‘సూపర్‘ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) నిజానికి అనుష్క శెట్టి అసలు పేరు స్విటీ. ‘సూపర్‘ సినిమా సెట్స్‌లో అందరూ ఆమెను స్విటీ అని పిలిచినప్పుడల్లా ఆమెకు ఇబ్బందిగా అనిపించేదట.&nbsp; దీంతో తన పేరును అనుష్క శెట్టిగా మార్చుకోవాలని నిర్ణయించుకుందట. అయితే కుటుంబ సభ్యుల అనుమతి కోసం ఏడాది కాలం పాటు ఈ అమ్మడు వెయిట్‌ చేయాల్సి వచ్చిందట. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) టాలీవుడ్ ఎత్తైన హీరోయిన్లలో అనుష్కశెట్టి ఒకరు. ఆమె ఎత్తు ఏకంగా 5 అడుగుల 9 అంగుళాలు. ఆమె ఏదైనా వేదికపై నిలబడి మాట్లాడేటప్పుడు మన హీరోలు కొందరు ఆమె కన్నా పొట్టిగా కనిపిస్తారు. అనుష్క ఏదైనా విషయంలో ఒత్తిడి కలిగితే దాన్ని అధిగమించడానికి ఒక ఆసక్తికరమైన పని చేస్తుంది. తనకు అత్యంత ఇష్టమైన సామెతలను చదువుతుంది. అలా చేయడం వల్ల వెంటనే రిలాక్స్ అయిపోతానని ఓ ఇంటర్వ్యూలో అనుష్క తెలిపింది. అనుష్క శెట్టి ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లాలన్నా సమయపాలన కచ్చితంగా పాటిస్తుందట. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకుంటుందట. ఇది తన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనుష్క చెప్పింది.&nbsp; రాత్రి వేళ భోజనం కూడా 8 గంటలలోపే పూర్తి చేస్తుందట. దీని వల్ల ఆమెకు మంచి నిద్ర వస్తుందట. అలాగే ఉదయం 7 గంటలలోపు లేచి యోగాతో రోజును ప్రారంభిస్తానని స్వీటి తన సీక్రెట్‌ను రివీల్‌ చేసింది.&nbsp; ఈ యోగా బ్యూటీ అనుష్కకు ఇంగ్లీషులో కవితలు రాయడం అంటే చాలా ఇష్టమట. అలాగే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వార్తా పత్రికలను సేకరించే అలవాటు కూడా ఉందట. ‘సైజ్‌ జీరో’ సినిమా ముందు వరకూ నాజుగ్గా ఉన్న అనుష్క ఆ మూవీ కోసం బిగ్‌ మిస్టేక్‌ చేసింది. పాత్ర కోసం విపరీతంగా బరువు పెరిగింది. ఆ తర్వాత సన్నబడేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రభావం ఇప్పటికీ అమెను వెంటాడుతోంది.&nbsp; సాధారణంగా హీరోయిన్లకు తమ ఫస్ట్‌ క్రష్‌ హీరోలు ఉంటారు. కానీ అనుష్క శెట్టి ఇందుకు భిన్నం. తన ఫస్ట్ క్రష్‌ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అని ఓ ఇంటర్వూలో రివీల్‌ చేసింది.&nbsp; సినిమాల్లోకి రాకముందు నుంచే రాహుల్‌ అంటే తనకు పిచ్చి అని స్వీటి చెప్పుకొచ్చింది. అయితే రాహుల్‌ ద్రావిడ్‌ను కలిసే అవకాశం పెద్దగా రాలేదని వాపోయింది. 'అరుంధతి' సినిమా అనుష్క ఫిల్మ్‌ కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ సినిమా సక్సెస్‌తోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌ హోదా ఈ అమ్మడు దక్కించుకుంది.&nbsp; ఆ తర్వాతే రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, భాగమంతి వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసి ఆమె తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.&nbsp; వాస్తవానికి అరుంధతి ఆఫర్‌ నేరుగా తన వద్దకు రాలేదని అనుష్క ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ హీరోయిన్‌ రిజెక్ట్‌ చేయడం వల్లే తనకు కలిసొచ్చిందని తెలిపింది. ఆ హీరోయిన్‌ ఎవరన్న విషయం మాత్రం రివీల్‌ చేయలేదు.&nbsp; అనుష్క ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌తో ఓ బుక్‌ రిలీజైన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ల్యూక్‌ కుతిన్హో రచనలో వచ్చిన 'ది మ్యాజిక్‌ వెయిల్‌ లాస్‌ పిల్‌' అనే బుక్‌లో తన ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ను అనుష్క రివీల్‌ చేసింది. 62 రకాల హెల్త్‌ టిప్స్‌, వెయిట్‌ లాస్‌ టెక్నిక్స్ ఇందులో ఉంటాయి.&nbsp; అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఘాటి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నేడు అనుష్క బర్త్‌డే సందర్భంగా ఉదయం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో స్వీటీ తల, చేతికి రక్తం ఉండగా ఆమె సిగర్‌ తాగుతూ కనిపించింది. సాయంత్ర 4:05 గంటలకు ‘ఘాటి’ స్పెషల్‌ గ్లింప్స్‌ను సైతం మూవీ టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో అనుష్క కొడవలి పట్టి ఒకరి పీక కోసి తీసుకెళ్తున్నట్లు దారుణంగా చూపించారు. అనుష్కకు అదిరిపోయే మాస్ ఎలివేషన్ ఇచ్చారు.&nbsp; https://www.youtube.com/watch?v=W5FkYULk3Ls
    నవంబర్ 07 , 2024
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. [toc] సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్‌ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్‌ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు. జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్‌ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్‌ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5&nbsp; (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.&nbsp; https://twitter.com/sarathtarak9/status/1775161795440971956 వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన&nbsp; రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం. ప్రభాస్ కార్ కలెక్షన్లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం. ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్‌ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్​లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే? ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్​ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం. &nbsp;Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది. &nbsp;Rolls Royce Ghost ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు Jaguar XJL&nbsp; ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ఎదిగిన తర్వాత&nbsp; కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు. &nbsp;Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు&nbsp; BMW X5&nbsp; ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.&nbsp; Lamborghini Aventador Roadster&nbsp; &nbsp;లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది.&nbsp; ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది. Range Rover SV Autobiography&nbsp; ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది. అల్లు అర్జున్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్స్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్‌ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం. జాగ్వార్ XJL&nbsp; దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్‌ కలర్‌లో ఉంటుంది. హమ్మర్ H2&nbsp; అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్‌'గా పిలుచుకుంటారు.&nbsp; వోల్వో XC90 T8 ఇది&nbsp; వోల్వో&nbsp; ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు&nbsp;&nbsp; ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్‌ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.&nbsp; ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే. రామ్‌చరణ్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే.&nbsp; విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్‌ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం. Ferrari Portofino రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు. View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy) ఈ కార్ మాత్రమే కాకుండా రామ్‌ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు&nbsp; https://twitter.com/ManobalaV/status/1437059410321309702 ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు. https://twitter.com/HelloMawa123/status/1502241248836349956 విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు&nbsp; లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది.&nbsp; అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్‌ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు.&nbsp; Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది.&nbsp; తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు. https://www.youtube.com/watch?v=vkS_uio8ix8 నాగచైతన్య లగ్జరీ కార్‌ కలెక్షన్లు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ఫెరారీ 488GTB — (రూ. 3.88cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr) BMW 740 Li — (రూ. 1.30cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr) MV అగస్టా F4 — (రూ. 35L) BMW 9RT — (రూ. 18.50L) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280 View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) నాని లగ్జరీ కారు కలెక్షన్ నాని దగ్గర లగ్జరీ కార్‌ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్‌(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు,&nbsp; టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు. https://www.youtube.com/watch?v=KuOxAHUisOg రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్ రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్‌ అదే స్థాయిలో ఉన్నాడు.&nbsp; అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా &nbsp;రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్, &nbsp;రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR, రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ . రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-&nbsp;&nbsp; రూ. కోటి విలువైన BMW X3. https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్ విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్ శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో.&nbsp; విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్‌, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో&nbsp; స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం. రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు ఆడి Q7- రూ. 90 లక్షలు BMW 530D- రూ. 75 లక్షలు ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్ &nbsp;హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు Fiery Red Mercedes Sports Coupe-&nbsp; దీని ధర రూ.3.33కోట్లు https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128 https://twitter.com/actor_Nikhil/status/612984749645148160 రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్&nbsp;&nbsp; సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్‌ తర్వాత కొనుగోలు చేశాడు. https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
    అక్టోబర్ 22 , 2024
    Jai Hanuman: హనుమాన్‌గా కాంతారా హీరో రిషబ్ శెట్టి?
    Jai Hanuman: హనుమాన్‌గా కాంతారా హీరో రిషబ్ శెట్టి?
    యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్‌' యావత్‌ దేశాన్ని షేక్‌ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్‌’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పాన్‌ ఇండియా స్టార్‌ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; ‘హనుమాన్‌’గా కాంతార నటుడు! ‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్‌' ఎలా ఉండనుందో హింట్‌ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్‌ సీక్వెల్‌లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. ఇటీవల కేజీఎఫ్‌ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని చిత్ర యూనిట్‌ కొట్టిపారేసింది. కానీ, లేటెస్ట్ బజ్‌ ప్రకారం కాంతారా ఫేమ్‌ రిషబ్‌శెట్టితో ప్రశాంత్‌ వర్మ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హనుమంతుడి పాత్ర కోసం ఆయన్ను సంప్రదించినట్లు సమాచారం. రిషబ్‌ శెట్టి సైతం ఈ ప్రాజెక్ట్‌ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.&nbsp; దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఇండస్ట్రీ లీక్.. అఫిషియల్‌గా ఇంకా అనౌన్స్ మెంట్ చేయాల్సిన అవసరం ఉంది.&nbsp; స్టార్ల పేర్ల వెనక స్ట్రాటజీ ఉందా? ‘జై హనుమాన్‌’ను ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదోక వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తూనే ఉంది. ఇందులోని హనుమాన్‌ పాత్రకు పలానా స్టార్‌ హీరోను ఫైనల్‌ చేసినట్లు కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి రామ్‌చరణ్‌, రానా దగ్గుబాటి, కేజీఎఫ్‌ ఫేమ్‌ యష్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా రిషబ్‌ శెట్టి ఫైనల్ అయ్యాడంటూ కథనాలు మెుదలయ్యాయి. మరి అతడైనా ఖరారు అవుతాడో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే దీనివెనక పెద్ద ప్రమోషన్ స్టంట్ ఉన్నట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘జై హనుమాన్‌’పై ప్రేక్షకుల్లో హైప్‌ తగ్గిపోకుండా చిత్ర బృందంమే ఇలా లీక్స్‌ ఇస్తున్నట్లు అభిప్రాయపడుతున్నాయి. అప్పుడు ‘జై హనుమాన్‌’ అంశం ట్రెండింగ్‌లోకి వచ్చి ప్రజల్లో హైప్‌ తగ్గకుండా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.&nbsp; ‘కాంతార’తో పాన్‌ ఇండియా క్రేజ్‌ రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా’, ‘ది లయన్‌ కింగ్‌’, ‘బాట్‌మ్యాన్‌’ లాంటి విజయవంతమైన హాలీవుడ్‌ సినిమాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్‌ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. ‘మహా కాళీ’ ప్రాజెక్ట్‌ ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మ‌హా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌ రివీల్‌ చేస్తూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. భార‌తీయ సినీ ప్ర‌పంచంలో మొద‌టి మ‌హిళా సూప‌ర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వ‌హిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్‌ వర్మ పోస్టు పెట్టారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423 ‘జై హనుమాన్‌’ కంటే ముందే.. తన సినిమాటిక్‌ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్‌’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్‌ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.&nbsp;
    అక్టోబర్ 18 , 2024
    <strong>Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్‌.. ప్రభాస్‌ సైతం వెనక్కి తగ్గాల్సిందే!&nbsp;</strong>
    Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్‌.. ప్రభాస్‌ సైతం వెనక్కి తగ్గాల్సిందే!&nbsp;
    జూ.ఎన్టీఆర్‌ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ చేసింది. విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్ నటించారు. అయితే ‘దేవర’ మూవీ తారక్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెరపైకి తీసుకొచ్చింది. ప్రభాస్‌ వంటి గ్లోబల్‌ స్టార్‌కు సాధ్యం కానీ విజయాన్ని తారక్‌కు అందించింది. అటు ఫ్లాప్‌ దర్శకులకు తారక్‌ ఓ వరమని మరోమారు నిరూపించింది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఫ్లాప్‌ డైరెక్టర్లతో హిట్స్‌! టాలీవుడ్‌లోని ఫ్లాప్ డైరెక్టర్స్‌ పాలిట జూ.ఎన్టీఆర్‌ ఓ దేవుడిలా మారాడని చెప్పవచ్చు. భారీ డిజాస్టర్‌తో ఫేమ్‌ కోల్పోయిన డైరెక్టర్లు తారక్‌తో ఓ సినిమా చేస్తే మునుపటి క్రేజ్‌ను తిరిగి పొందడం ఖాయంగా కనిపిస్తోంది. రీసెంట్‌గా దేవర విషయంలోనూ ఇదే నిరూపితమైంది. దర్శకుడు కొరటాల శివ గతంలో తీసిన ‘ఆచార్య’ చిత్రం డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. అసలు కొరటాల శివ చిత్రమేనా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటువంటి డైరెక్టర్‌కు ఛాన్స్‌ ఇచ్చి దేవరతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు తారక్. అంతకుముందు ఫ్లాప్‌లతో ఉన్న పూరి జగన్నాథ్‌కు 'టెంపర్‌'తో సక్సెస్‌ ఇచ్చాడు. ‘1: నేనొక్కడినే’ పరాజయంతో ఢీలా పడిపోయిన సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’ మూవీ తీసి గాడిలో పెట్టాడు. రవితేజతో ఫ్లాప్ అందుకున్న బాబీకి ‘జై లవకుశ’తో మంచి హిట్ ఇచ్చాడు. ‘అజ్ఞాతవాసి’తో భారీ డిజాస్టర్‌ అందుకున్న త్రివిక్రమ్‌కు ‘అరవింద సామెత’తో&nbsp; సక్సెస్‌ అందించాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకు వరుసగా హిట్స్‌ ఇచ్చి సరికొత్త రికార్డును తారక్‌ క్రియేట్ చేస్తున్నాడు. ఒకే ఒక్క హీరోగా తారక్‌ హీరోల కెరీర్‌లో హిట్స్‌, ఫ్లాప్స్‌ అనేవి సర్వ సాధారణం. ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా తీసిన ప్రతీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం లేదు. గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సైతం బాహుబలి తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’ చిత్రాలతో ఫ్లాప్‌ అందుకున్న వాడే. అయితే తారక్‌ మాత్రం గత తొమ్మిదేళ్లుగా ఒక్క ఫ్లాప్‌ లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన గత 7 చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలిచాయి. ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’, ‘RRR’, ‘దేవర’ వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఈ జనరేషన్‌ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా తారక్‌ నిలవడం విశేషం. ఫ్యూచర్‌లో ‘దేవర 2’, ప్రశాంత్‌ నీల్‌తో ‘NTR 31’, సందీప్‌ రెడ్డి వంగాతో ఓ చిత్రం (గాసిప్‌) వంటి బిగ్‌ ప్రాజెక్ట్స్‌ ఉండటంతో తారక్ జైత్రయాత్ర ఇకపైనా కొనసాగే అవకాశముంది.&nbsp; 23 ఏళ్ల ఫ్లాప్‌ రికార్డు బద్దలు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో సినిమా చేస్తే బ్లాక్‌ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా వెంటనే హిట్‌ కొట్టిన దాఖలాలు లేవు. అయితే 'దేవర'తో తారక్‌ ఈ ఫ్లాప్‌ సెంటిమంట్‌ను బీట్‌ చేశాడు. రాజమౌళితో 'RRR' చేసిన తారక్‌ వెంటనే ‘దేవర’తో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘స్టూడెంట్‌ నెం.1’తో ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌కు శ్రీకారం చుట్టిన తారక్‌ స్వయంగా తానే దీనిని&nbsp; బ్రేక్‌ చేయడం విశేషం. అది కూడా 23 క్రితం స్టూడెంట్ నెం.1 రిలీజైన రోజున దేవరను తీసుకొచ్చి రాజమౌళి సెంటిమెంట్‌ను బద్దలు కొట్టాడు. రైతు పాత్రలో తారక్‌! తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌గా రష్మిక? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp;
    అక్టోబర్ 04 , 2024
    <strong>Tollywood Directors: హీరోయిన్‌ను ఎలా చూపించాలో వీళ్లకి మాత్రమే తెలుసా?</strong>
    Tollywood Directors: హీరోయిన్‌ను ఎలా చూపించాలో వీళ్లకి మాత్రమే తెలుసా?
    సినిమాకు హీరో, హీరోయిన్‌ రెండు కళ్లు లాంటి వారు. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లకు నటన పరంగా పెద్ద స్కోప్‌ దొరకడం లేదు. సినిమా మెుత్తం హీరో చుట్టూనే సాగేలా కొందరు దర్శకులు సినిమాలు తీస్తున్నారు. పాటల కోసం, అందచందాలను ఆరబోయటం కోసం మాత్రమే హీరోయిన్లు అన్నట్లు చూపిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘లైగర్‌’, ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రాలను గమనిస్తే హీరోయిన్ నటన కంటే వారి ఎక్స్‌పోజింగ్‌పైనే దర్శకులు ఎక్కువగా దృష్టిపెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్‌లోని కొందరు యువ డైరెక్టర్లు మాత్రం హీరోయిన్లను ఒకప్పటిలా డిగ్నిటీగా చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో శేఖర్ కమ్ములాను ఫాలో అవుతూ సినీ లవర్స్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేసిన చిత్రాలేంటి? అందులో హీరోయిన్స్‌ను ఎలా చూపించారు? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) టాలీవుడ్‌లో సెన్సిబుల్‌ దర్శకుడు అనగానే ముందుగా శేఖర్‌ కమ్ముల గుర్తుకు వస్తారు. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఆయా సినిమాల కోసం ఎంచుకునే హీరోయిన్స్‌, వారిని ఆయన చూపించే విధానం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆనంద్‌, గోదావరి చిత్రాల్లో నటి కమలిని ముఖర్జీని ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. పక్కింటి అమ్మాయి అనిపించేతలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. అలాగే ‘లీడర్‌’లో రీచా గంగోపాధ్యాయ, ‘లైఫ్‌ ఈజ్‌బ్యూటీఫుల్‌’లో షగున్‌ కౌర్‌ పాత్రలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఇక ‘ఫిదా’, ‘లవ్‌ స్టోరీ’ చిత్రాల్లో సాయి పల్లవి పాత్రను మనసుకు హత్తుకునేలా ఎలా తీర్చిదిద్దారో అందరికీ తెలిసిందే. పెద్దగా ఎక్స్‌పోజింగ్‌ చేయనప్పటికీ ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుందంటే అందులో శేఖర్‌ కమ్ములకు ఎంతో కొంత క్రెడిట్ ఇవ్వాల్సిందే. హీరోయిన్లను డిగ్నిటీగా ఎలా చూపించాలో, వారి నుంచి నటన ఏవిధంగా రాబట్టాలో తెలిసిన దర్శకుడు కావడంతో శేఖర్‌ కమ్ములతో కనీసం ఒక సినిమా అయిన చేయాలని కథానాయికలు ఆశ పడుతుంటారు.&nbsp; హను రాఘవపూడి (Hanu Raghavapudi) శేఖర్‌ కమ్ముల తరహాలోనే దర్శకుడు హను రాఘవపూడి కథానాయికల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తారు. ఆయన దర్శత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’, ‘క్రిష్ణ గాడి వీర ప్రేమ గాధ’, ‘పడి పడి లేచె మనసు’, ‘సీతారామం చిత్రాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన దర్శకత్వంలో పని చేసిన లావణ్య త్రిపాఠి, మెహరిన్‌, సాయిపల్లవి, మృణాల్‌ ఠాకూర్‌ ఎంత మంచి పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘సీతారామం’ వంటి అద్భుతమైన ప్రేమ కావ్యంలో మృణాల్‌ను చాలా బాగా చూపించారు. ఆ సినిమాతో ఆమె తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించుకుంది. ఆ సినిమాలోని సీత పాత్ర తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని మృణాల్‌ పలు సందర్భాల్లో చెప్పడం విశేషం. హను రాఘవపడి ప్రభాస్‌తో ఓ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశాడు. ఈ చిత్రం ద్వారా కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పటికే ఆమె లుక్స్‌ విపరీతంగా ఆకర్షించగా డైరెక్టర్‌ హను ఇంకెంత బాగా చూపిస్తారోనని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.&nbsp; వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya) యంగ్‌ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సైతం హీరోయిన్ల విషయంలో శేఖర్ కమ్ములానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్‌గా నానితో చేసిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రంలో తమిళ నటి ప్రియాంక అరుళ్‌ మోహన్‌ను ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. ఎక్కడా గ్లామర్‌షోకు చోటు ఇవ్వకుండా ఆమె ద్వారా అద్భుత నటనను రాబట్టి ప్రశంసలు అందుకున్నారు. అందుకు ముందు డైరెక్ట్‌ చేసిన ‘మెంటల్‌ మదిలో’ (Mental Madhilo), ‘బ్రోచెవారెవరురా’ (Brochevarevarura), ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) చిత్రాల్లోనూ హీరోయిన్ల స్కిన్‌ షో కంటే డిగ్నిటీ లుక్‌కే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఆయా చిత్రాల్లో నటించిన నివేదా పేతురాజ్‌, నివేదా థామస్‌, నజ్రియా నజిమ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. శౌర్యువ్ (Shouryuv) దర్శకుడు శౌర్యువ్‌ ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మనసుకు హత్తుకునేలా ఈ చిత్రాన్ని మలిచి ప్రశంసలు అందుకున్నారు. ఇందులో నాని హీరోగా నటించగా మృణాల్‌ ఠాకూర్‌ అతడికి జోడీగా చేసింది. బాలీవుడ్‌లో అప్పటికే హాట్‌ బాంబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్‌ను ఇందులో మళ్లీ అచ్చ తెలుగు అమ్మాయిగా చూపించారు. సాంగ్స్‌లో స్కిన్‌ షోకు అవకాశం ఉన్నప్పటికీ శౌర్యువ్‌ ఆ పని చేయలేదు. ఆమె పోషిస్తున్న డిగ్నిటీ పాత్రపై ప్రభావం చూపకుండా ఆద్యంతం మృణాల్‌ను అందంగా చూపించారు. హీరోయిన్‌ పాత్ర ఎలా ఉండాలి? ఎలా చూపించాలి? అని శౌర్యువ్‌కు ఉన్న స్పష్టతను చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. తన తర్వాతి సినిమాల్లోనూ ఇదే రీతిన కొనసాగాలని ఆశిస్తున్నారు.&nbsp; తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker) యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ యూత్‌ఫుల్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయారు. యువత మెచ్చే కంటెంట్‌తో వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే కుర్రకారును ఆకట్టుకువాలన్న తాపత్రయంలో అతడు ఎక్కడా గ్లామర్‌ షోకు ఆస్కారం ఇవ్వడం లేదు. తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’ నుంచి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో విజయ్‌ దేవరకొండకు జోడీగా రీతు వర్మ నటించింది. అసభ్యతకు, అనవసర స్కిన్‌షోకు చోటు లేకుండా ఆమెతో మంచి నటన రాబట్టాడు తరుణ్‌ భాస్కర్‌. ఈ సినిమాతో రీతు వర్మ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నటుడిగా మారి పలు సినిమాల్లో నటించిన తరుణ్‌ బాస్కర్‌ ‘కీడా కోలా’తో మళ్లీ డైరెక్టర్‌గా మారారు.
    సెప్టెంబర్ 14 , 2024
    <strong>Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ?</strong>
    Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ?
    ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) దక్షిణాది సినీ పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి (Mammootty) నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్‌ అతి తక్కువ కాలంలోనే తనకంటూ సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నారు. తన అద్భుత నటనతో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. మలయాళంతో పాటు తెలుగులోనూ పార్లర్‌గా చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. అయితే దుల్కర్‌ తన ఫోకస్‌ మెుత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. తెలుగులో వరుసగా ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చేస్తూ రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, నితిన్‌ వంటి టైర్‌ 2 హీరోలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.&nbsp; తెలుగు రైజింగ్‌ హీరోగా దుల్కర్‌! యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తన రెండు, మూడు చిత్రాలతోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరో క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. తెలుగులో నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి మెప్పించాడు. తన అద్భుతమైన నటుడితో తెలుగు ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ సినిమాలో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా, శత్రుదేశంలో పట్టుబడ్డ బందీగా తన విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీలో ప్రభాస్ ను పెంచి పెద్ద చేసే గురువు పాత్రలో నటించి మెప్పించాడు. ఓ రకంగా అది పరశురాముడి పాత్ర అని చెబుతున్నారు. ‘కల్కి 2’ లోనూ దుల్కర్‌ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది.&nbsp; డబ్బింగ్‌ చిత్రాలతోనూ గుర్తింపు డైరెక్ట్‌ తెలుగు చిత్రాలే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో అతడు నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. దుల్కర్‌ నటించిన 9 వరకూ చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను పలకరించాయి. అందులో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఓకే బంగారం', సాయిపల్లవితో చేసిన 'హేయ్‌ పిల్లగాడ', ‘అందమైన జీవితం’ వంటి చిత్రాలు తెలుగు యూత్‌ను ఎంతగానో ఆకర్షించాయి. దుల్కర్‌ మనవాడే అన్న ఫీలింగ్‌ను వారిలో కలిగించాయి. అలాగే ‘కురుప్‌’, ‘సెల్యూట్‌’, ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ వంటి యాక్షన్‌ చిత్రాలు సైతం మాస్‌ ఆడియన్స్‌లో మంచి గుడ్‌విల్‌ తెచ్చిపెట్టాయి. దీంతో తెలుగులో క్లాసు-మాసు కలగలిసిన హీరోగా దుల్కర్‌ మారిపోయాడు.&nbsp; కొత్త ప్రాజెక్ట్స్‌తో దూకుడు తెలుగులోనూ స్టార్‌ హీరో క్రేజ్‌ సంపాదించుకున్న దుల్కర్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వరుసగా టాలీవుడ్‌లో ప్రాజెక్ట్స్‌కు ఓకే చెబుతూ దుల్కర్‌ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి ‘లక్కీ భాస్కర్‌’ చిత్రంలో దుల్కర్‌ నటిస్తున్నాడు. అక్టోబర్‌ 31న ఈ చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత పవన్‌ సాధినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఒక తార' అంటూ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు దుల్కర్‌ ఓకే చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ కూడా విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో రైతు పాత్రలో దుల్కర్‌ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తెలుగు స్టార్‌ హీరో రానా నిర్మాణంలో కొత్త ప్రాజెక్ట్‌ 'కాంత'ను పట్టాలెక్కించాడు. ఇందులో దుల్కర్‌కు జోడీగా టాలీవుడ్ రైజింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. 1950 నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రానా కీలక పాత్ర పోషించనున్నాడు. తమిళ డైరెక్టర్‌ సెల్వమణి సెల్వరాజ్‌ ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు.&nbsp; https://twitter.com/vamsikaka/status/1817427815249133673 https://twitter.com/imwpolitikos/status/1833028992456089818 https://twitter.com/Chrissuccess/status/1832279694118400071 ‘టైర్‌ 2’ హీరోలకు గట్టిపోటీ! టాలీవుడ్‌లో దుల్కర్‌ సల్మాన్‌ దూకుడు చూస్తుంటే టైర్‌ 2 హీరోలకు గట్టి పోటీ తప్పదని అనిపిస్తోంది. రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, నితిన్‌, అడవి శేష్‌ తదితర హీరోలకు దుల్కర్‌ పోటీగా మారతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో అతడు చేస్తున్న మూడు ప్రాజెక్టుల్లో కనీసం రెండు హిట్స్‌ అయినా అతడి గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. క్లాసిక్‌ లుక్స్‌తో పాటు యాక్షన్‌ సీక్వెన్స్‌లో దుమ్మురేప గల సత్తా అతడికి ఉండటంతో తెలుగు డైరెక్టర్ల ఫస్ట్‌ ఛాయిస్‌ అతడు అయ్యే పరిస్థితులు రావొచ్చని అంటున్నారు. వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న నాగచైతన్య, రామ్‌, విజయ్ దేవరకొండ వంటి హీరోలు దుల్కర్‌ విషయంలో జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 10 , 2024
    <strong>Kalki 2: స్టార్‌ హీరోయిన్‌తో ప్రభాస్‌కు కొత్త చిక్కులు.. ‘కల్కి 2’ ఇప్పట్లో లేనట్లే!</strong>
    Kalki 2: స్టార్‌ హీరోయిన్‌తో ప్రభాస్‌కు కొత్త చిక్కులు.. ‘కల్కి 2’ ఇప్పట్లో లేనట్లే!
    ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. కమల్‌ హాసన్‌ (Kamal Hassan), అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), దీపికా పదుకొనే (Deepika Padukone) వంటి స్టార్‌ క్యాస్ట్‌ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అందరి అంచనాలను అందుకుంటూ రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై అందరి దృష్టి పడింది. ‘కల్కి 2’ ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఇప్పటి నుంచే ఆడియన్స్‌ ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ‘కల్కి 2’ షూట్‌ ఇప్పట్లో మెుదలయ్యేలా కనిపించడం లేదు. ఇందుకు స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకొనే కారణమని ప్రచారం జరుగుతోంది.&nbsp; షూటింగ్స్‌కు బ్రేక్‌! 'కల్కి 2' చిత్రం వచ్చే ఏడాది జూన్‌ - జులై కల్లా రిలీజ్‌ అవుతుందని నిర్మాత అశ్వని దత్‌ గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్‌ కూడా పూర్తైనట్లు పేర్కొన్నారు. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం 'కల్కి 2' రీమైనింగ్‌ షూటింగ్‌కు దీపిక పదుకొనే వల్ల బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్‌. సెప్టెంబర్‌లో ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. బిడ్డ పుట్టాక కనీసం ఏడాది పాటు సినిమాలకు గ్యాప్‌ ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా తనకు ఎంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ప్రాజెక్టును వదులుకున్నారట. అలాగే ఓ ప్రముఖ బాలీవుడ్‌ షోకు సైతం దీపిక నో చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి 'కల్కి 2' షూటింగ్‌కు కూడా ఆమె దూరంగా ఉండే ఛాన్స్ ఉంది.&nbsp; దీపికనే కీలకం! ‘కల్కి 2’ చిత్రానికి దీపికా పదుకొనే పాత్రే కీలకం. ఆమె చుట్టూనే సెకండ్‌ పార్ట్ తిరగనుంది. సంక్రాంతి తర్వాత నుంచి ‘కల్కి 2’ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శకుడు నాగ్ అశ్విన్‌ భావిస్తున్నారు. అటు హీరో ప్రభాస్‌ కూడా ‘కల్కి 2’ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దీపికా షూటింగ్‌ హాజరుకాకపోతే ఎలా అని కల్కి టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కల్కి కోసం ప్రభాస్‌ సిద్ధం చేసుకున్న డేట్స్‌ కూడా తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఊహించని పరిణామం ప్రభాస్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టినట్లు ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘కల్కి 2’ చిత్రం వచ్చే ఏడాది కాకుండా 2026లో రిలీజయ్యే అవకాశముందని విశ్లేషిస్తున్నాయి.&nbsp; అసలు కథ ‘పార్ట్‌ 2’లోనే! ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను గమనిస్తే తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికి సరిపోయినట్లు అనిపిస్తుంది. భైరవగా ప్రభాస్‌ (Prabhas), సుమతిగా దీపికా పదుకొనే (Deepika Padukone), అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌గా కమల్‌ హాసన్‌ (Kamal Hassan), అర్జునుడుగా విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) పాత్రల చుట్టే కల్కి తిరిగింది. ఒక్కో పాత్ర నేపథ్యం, కథలో వారి ప్రాధాన్యతలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తొలి భాగంలో చూపించాడు. కలియుగం అంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు, విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌ వారిని పెడుతున్న బాధలు కళ్లకు కట్టాడు. మహా విష్ణువు పదో అవతారమైన ‘కల్కి’ రాకకు ముందు ఉన్న పరిస్థితులను ‘పార్ట్‌ 1’లో చూపించారు. అయితే హీరో ప్రభాస్‌, విలన్‌ సుప్రీమ్ యాష్కిన్‌ ఒక్కసారి కూడా తొలి భాగంలో ఎదురెదురు పడలేదు. అయితే ‘పార్ట్‌ 2’లో వీరిద్దరు ఒకరితో ఒకరు నేరుగా తలపడవచ్చు. ఇది సెకండ్‌ పార్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది.&nbsp; కమల్‌ హాసన్‌ విశ్వరూపం కల్కి సినిమాలో కమల్‌ హాసన్‌ పాత్ర నిడివి 15 నిమిషాల కంటే తక్కువే. రెండు మూడు డైలాగ్స్ మినహా ఆయన నటనను వీక్షించే అవకాశం ఆడియన్స్‌కు లభించలేదు. సుమతి (దీపిక పదుకొనే) గర్భం నుంచి సేకరించిన సీరాన్ని ఇంజెక్ట్‌ చేసుకొని సుప్రీమ్‌ యాష్కిన్‌ దైవ శక్తి పొందుతాడు. అతడు మరింత శక్తివంతంగా మారడాన్ని ‘కల్కి’ క్లైమాక్స్‌లో చూపించారు. దీంతో ‘కల్కి 2’లో కమల్‌ హాసన్‌ పాత్ర పూర్తి స్థాయిలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ కమల్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘కల్కి 2’ తాను ఎక్కువ సేపు కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఫలితంగా భైరవ నుంచి కర్ణుడిగా మారిన ప్రభాస్‌, అశ్వత్థామ అమితాబ్‌తో సుప్రీమ్‌ యాష్కిన్‌ నేరుగా తలపడే అవకాశముంది. ఈ క్రమంలో నటన పరంగా కమల్‌ హాసన్‌ విశ్వరూపం చూసే ఛాన్స్‌ ఫ్యాన్స్‌కు లభించవచ్చు. కల్కి పాత్రలో ఎవరు? పురాణాల ప్రకారం కలిని మహా విష్ణువు అవతారమైన కల్కి అంతం చేస్తాడు. కల్కి షూటింగ్‌ మెుదలైనప్పటి నుంచి కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంతా భావించారు. అయితే అతడ్ని కర్ణుడుగా చూపించి డైరెక్టర్‌ ఝలక్‌ ఇచ్చాడు. దీంతో సినిమాకు మూలమైన కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తొలి భాగం పూర్తయ్యే వరకూ కల్కి సుమతి గర్భంలోనే ఉన్నాడు. కాబట్టి సెకండ్‌ పార్ట్‌లో ఒక్కసారిగా పెరిగి పెద్దవాడైనట్లు చూపించే అవకాశం లేదు. కాబట్టి కల్కిని ఓ బాలుడిగా చూపించే ఛాన్స్‌ ఉంది. కలి అయిన సుప్రీమ్‌ యష్కిన్‌ను ఆ బాలుడు చంపేందుకు ప్రభాస్‌ (కర్ణుడు/భైరవ), అశ్వత్థామ (అమితాబ్‌ బచ్చన్‌) సాయం చేయవచ్చు.&nbsp;
    ఆగస్టు 06 , 2024
    <strong>Laila Movie : అమ్మాయి గెటప్‌లో విశ్వక్‌ సేన్‌.. హీరోయిన్స్‌ను తలదన్నేలా మేకోవర్!&nbsp;</strong>
    Laila Movie : అమ్మాయి గెటప్‌లో విశ్వక్‌ సేన్‌.. హీరోయిన్స్‌ను తలదన్నేలా మేకోవర్!&nbsp;
    యంగ్ హీరో విశ్వక్ సేన్‌ (Vishwak Sen).. విభిన్న తరహా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్‌, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విశ్వక్‌.. ఇటీవలే ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) సినిమాతో సాలిడ్‌ సక్సెస్‌ అందుకున్నాడు. దీంతో అతడు నెక్స్ట్‌ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతున్నాడో అని ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. అయితే తాజాగా ఈ యంగ్‌ హీరో.. తన కొత్త సినిమాను మెుదలు పెట్టారు. ఈ మూవీలో విశ్వక్‌ పాత్రకు సంబంధించి ఫస్ట్‌ పోస్టర్‌ రిలీజ్‌ కాగా.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ చేయని గెటప్‌లో విశ్వక్‌ ఈ పోస్టర్‌లో కనిపించాడు.&nbsp; ‘లైలా’గా విశ్వక్‌ సేన్‌.. ప్రస్తుతం విష్వక్‌ సేన్‌.. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. షైన్‌ స్క్రీన్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి 'లైలా' (Laila Movie) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం జరగ్గా.. ఫస్ట్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో విశ్వక్‌ లేడీ గెటప్‌లో కనిపించి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే క్లోజ్‌గా ఫేస్‌లో కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్‌ను రిలీజ్ చేసారు. కెరీర్‌లో తొలిసారి ఓ లేడీ గెటప్‌లో విశ్వక్‌ కనిపిస్తుండటంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. అమ్మాయిగా విశ్వక్ సేన్ భలే క్యూట్‌గా ఉన్నాడంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. హీరోయిన్లను తలదన్నే అందంతో కనిపించి సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెంచేశాడని పోస్టులు పెడుతున్నారు. తమ హీరో డేరింగ్‌ డెసిషన్‌కు సెల్యూట్‌ అంటూ పోస్టర్‌ను వైరల్‌ చేస్తున్నారు. ఈ మూవీ కూడా తప్పక విజయం సాధిస్తుందని ఫ్యాన్స్‌ ఆకాంక్షిస్తున్నారు.&nbsp; https://twitter.com/pudiharicharan/status/1808373415163973920 రిలీజ్ ఎప్పుడంటే..! తాజాగా పూజా కార్యక్రమం జరుపుకున్న 'లైలా' చిత్రం.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విశ్వక్‌కు జోడీగా ఆకాంక్ష శర్మ (Akanksha Sharma)నటించనుంది. ఈ మూవీని వచ్చే ఏడాది వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న (Laila Movie Release Date Announced) రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలిన ప్రధాన తారాగణాన్ని కూడా ఫైనల్‌ చేసి.. షూటింగ్‌ మెుదలు పెట్టేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు మెుదలు పెట్టింది. ఈ మూవీ విశ్వక్‌ కెరీర్‌లోనే మరుపురాని చిత్రంగా మిగిలిపోతుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.&nbsp; https://twitter.com/AndhraBoxOffice/status/1808389179472060518 ‘రెమో’ తరహాలో మేకోవర్‌! విశ్వక్‌ సేన్‌ లేటెస్ట్‌ ‘లైలా’ పోస్టర్‌.. తమిళ నటుడు శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) నటించిన 'రెమో' (Remo) చిత్రాన్ని గుర్తు చేస్తోంది. బక్కియారాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా చేసింది. ఇందులో కూడా హీరో శివకార్తికేయన్‌.. అందమైన అమ్మాయి గెటప్‌లో కనిపిస్తాడు. హీరోయిన్‌ను ఇంప్రెస్‌ చేసే క్రమంలో సినిమా మెుత్తం ఆ పాత్రలోనే అలరిస్తాడు. అయితే విశ్వక్‌ సేన్‌ కూడా లైలాలో ఎక్కువ నిడివి లేడీ గెటప్‌లోనే కనిపించే అవకాశముందని అంటున్నారు. లైలా పోస్టర్‌లోని అతడి మేకోవర్‌ చూస్తే.. ఏదో ఒక సీన్‌ కోసం చేసినట్లు కనిపించడం లేదు. అచ్చమైన అమ్మాయిలాగా కనిపించేలా అతడి మేకోవర్‌ను డిజైన్‌ చేసినట్లు అనిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.&nbsp; ‘మెకానిక్‌ రాకీ’గా విశ్వక్‌.. ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌.. 'మెకానిక్‌ రాకీ' (Mechanic Rocky) అనే ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీలో విశ్వక్‌ పాత్ర.. చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. రవితేజ ముళ్లపూడి డైరెక్షన్‌లో రానున్న చిత్రంలో.. విశ్వక్‌కు జోడీగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) కనిపించనుంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమా విశ్వక్ సేన్ కేరీర్‌లో 10వ మూవీగా రానుంది. ఈ మూవీని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్‌ తల్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.
    జూలై 03 , 2024
    Hero's In Middle Class Roles: మన జీవితాలను కళ్లకు కట్టిన స్టార్‌ హీరోల పాత్రలు.. ఓ లుక్కేయండి!
    Hero's In Middle Class Roles: మన జీవితాలను కళ్లకు కట్టిన స్టార్‌ హీరోల పాత్రలు.. ఓ లుక్కేయండి!
    సాధారణంగా హీరో పాత్రలు ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ఉంటాయి. యాక్షన్‌ చిత్రాల్లో ఒకలా.. సోషియోఫాంటసీ జానర్స్‌లో మరోలా ఉంటాయి. చాలా వరకూ సినిమాల్లో హీరో పాత్రను సాధారణ ప్రేక్షకులు ఓన్‌ చేసుకోలేరు. ఎందుకంటే ఆ చిత్రాల్లో వారు కలర్‌ఫుల్‌ డ్రెస్‌లు వెసుకుంటూ కార్లల్లో తిరుగుతుంటారు. హైఫై జీవితాలను గడుపుతుంటారు. అయితే కొన్ని సినిమాలు అలా కాదు. అవి మధ్యతరగతి కుటుంబాలకు చాలా దగ్గరగా ఉంటాయి. మిడిల్‌ క్లాస్‌ జీవితాలను కళ్లకు కడతాయి. ఆ సినిమాల్లో హీరో ఎలాంటి హంగులు లేకుండా కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉంటాడు. అందుకే సమాజంలోని మెజారిటీ యూత్‌ ఆ హీరో పాత్రలను ఓన్‌ చేసుకుంటారు. తమను తాము తెరపై చూసుకుంటున్నట్లు భావిస్తారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన టాప్‌ మిడిల్ క్లాస్ హీరో పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ (Aadavari Matalaku Arthale Verule)&nbsp; సినిమాలో హీరో వెంకటేష్‌ (Venkatesh) సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. ఉద్యోగం లేక తండ్రి కోటా శ్రీనివాస్‌ చేత చివాట్లు తింటూ ఉంటాడు. చివరికీ ఉద్యోగం రావడంతో తండ్రిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. ఓ కారణం చేత తండ్రిని కోల్పోయి అనాథగా మారతాడు. ఇలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మిడిల్‌ క్లాస్‌ జీవితాలను గుర్తు చేస్తూనే ఉంటుంది.&nbsp; రఘువరన్‌ బీటెక్‌ ఈ (Raghuvaran Btech) సినిమాలో రఘువరన్‌ (ధనుష్‌) కుటుంబం కోసం ఏదోటి కోల్పోతూనే ఉంటాడు. ఓ అవసరం కోసం దాచుకున్న డబ్బును తమ్ముడికి ఇచ్చేస్తాడు. తల్లి చనిపోవడంతో ఇష్టం లేని ఉద్యోగానికి ఇంటర్యూలకు తిరుగుతాడు.&nbsp; తమ్ముడు ఈ (Thammudu) సినిమాలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తొలుత ఆకతాయి తనంగా ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఉంటాడు. బాక్సింగ్‌ పోటీలకు సిద్దమైన అన్నపై అతడి ప్రత్యర్థులు దాడి చేయడంతో పవన్‌లో మార్పు వస్తుంది. అన్న కోసం జల్సా జీవితాన్ని వదులుకొని ఎంతో కష్టపడి బాక్సింగ్‌ నేర్చుకుంటాడు. అన్నను ఆస్పత్రిపాలు చేసిన విలన్‌కు బాక్సింగ్‌ కోర్టులో బుద్ది చెప్తాడు.&nbsp; అలా వైకుంఠపురంలో ఇందులో (Ala Vaikunthapurramuloo) అల్లు అర్జున్‌ కోటీశ్వరుడు. మురళిశర్మ చేసిన కుట్రతో అతడే తండ్రి అని నమ్మి చిన్నప్పటి నుంచి అతడి ఇంట్లోనే పెరుగుతాడు. అతడి భార్యను తల్లిగా, కూతుర్ని సొంత చెల్లెలని&nbsp; భావిస్తాడు. పెద్దయ్యాక తనెవరో నిజం తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న అసలైన తల్లిదండ్రులను కాపాడతాడు. కానీ వారికి నిజం చెప్పడు. మిడిల్‌ క్లాస్‌ జీవితాన్నే గడిపేందుకు ఇష్టపడతాడు. గ్యాంగ్‌ లీడర్‌ గ్యాంగ్‌లీడర్‌లో (Gang Leader) చిరంజీవి (Chiranjeevi) తొలుత ఖాళీగా తిరుగుతుంటాడు. పెద్దన్న మరణంతో రెండో అన్న చదువు బాధ్యత తనపై వేసుకుంటాడు. డబ్బు కోసం ఓ కేసులో జైలుకు సైతం వెళ్తాడు. అలా తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు.  అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఈ (Amma Nanna O Tamila Ammayi) సినిమాలో రవితేజ (Ravi Teja)కు తన తండ్రి ప్రకాష్‌ రాజ్ అంటే అసలు పడదు. తన తల్లిని వదిలేశాడని కోపంతో ఉంటాడు. అనుకోకుండా తల్లి చనిపోవడంతో ఆమె ఆఖరి కోరిక మేరకు బాక్సింగ్ కోచ్ అయిన తండ్రి దగ్గరకు వెళ్తాడు. విలన్‌ తన తండ్రిని, సవతి చెల్లిని మోసం చేశాడని తెలుసుకొని బాక్సింగ్ కోర్టులో తలపడి అతడికి బుద్ధి చెప్తాడు.  అ ఆ ఇందులో (A Aa) నితిన్‌ (Nithin) పక్కా మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిలా ఉంటాడు. రావురమేష్‌కి తన ఫ్యామిలీ అప్పు ఉండటంతో ఇష్టం లేకపోయినా అతడి కూతుర్ని చేసుకునేందుకు సిద్ధపడతాడు. కోటీశ్వరురాలైన అత్త కూతురు సమంత ప్రేమిస్తోందని తెలిసినప్పటికీ క్లైమాక్స్‌ వరకూ కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటాడు.&nbsp; జెర్సీ (Jersey) క్రికెటర్‌ అయినా నాని (Nani) అనారోగ్య కారణంతో ఆటకు దూరమవుతాడు. రైల్వే ఉద్యోగం కోల్పోయి భార్య సంపాదనపై ఆధారపడి జీవిస్తుంటాడు. క్రికెటర్‌గా చూడాలని కొడుకు చెప్పడంతో తిరిగి బ్యాట్‌ పట్టుకుంటాడు. ఒక మధ్యతరగతి తండ్రి కొడుకును ఎంతగా ప్రేమిస్తాడో ఈ సినిమాలో నాని చూపించాడు.&nbsp; నేనింతే&nbsp; ఈ (Neninthe) సినిమాలో రవితేజ (Ravi Teja).. సినిమా డైరెక్టర్‌ కావాలని కలలు కంటూ ఉంటాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించలేని స్థితిలో ఉంటాడు. ఓ వైపు లక్ష్యం.. మరోవైపు తల్లి ఆరోగ్యం మధ్య అతడు పడే సంఘర్షణ చాలా మంది జీవితాలను ప్రతిబింబిస్తుంది.&nbsp; యోగి ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన యోగి (Yogi) చిత్రం మిడిల్‌ క్లాస్‌ యువతకు చాలా బాగా కనెక్ట్‌ అవుతుంది. డబ్బుకోసం తల్లిని విడిచి నగరానికి వచ్చిన హీరో ఓ హోటల్‌లో పనిచేస్తుంటాడు. రూపాయి రూపాయి కూడగట్టి తల్లికి గాజులు చేయిస్తాడు. అయితే ఆ గాజులు వేసుకోకుండానే తల్లి చనిపోవడం చాలా మందికి తమ గతాన్ని గుర్తు చేస్తుంది. 
    మార్చి 01 , 2024
    Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
    Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
    సూపర్‌ హీరోలను ఇష్టపడని వారు ఉండరు. సినిమాల్లో వారు చూపించే తెగువ, ధైర్య సాహసాలు వీక్షకులను ముఖ్యంగా చిన్న పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. రొటీన్‌ సినిమాల్లో హీరోల్లా కాకుండా వారు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటారు. కొండను సైతం పిండి చేయగల సామర్థ్యం వారి సొంతం. అటువంటి సూపర్‌ హీరోలందర్నీ ఏటా ఒక చోటకు చేరుస్తూ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈవెంట్‌ ‘కామిక్‌ కాన్‌’ (Comic Con). అవెంజెర్స్‌, స్పైడర్‌మ్యాన్‌, అవతార్‌, సూపర్‌ మ్యాన్‌ వంటి పాత్రలు ఆ ఈవెంట్‌లో తళుక్కుమంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్‌ హీరోల అభిమానులు అక్కడ ప్రత్యక్షమై తమకు నచ్చిన హీరో వేషధారణను ధరిస్తాయి. అయితే తెలుగులోనూ కామిక్‌ కాన్‌ స్థాయి హీరో పాత్రలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; హనుమాన్‌ (Hanuman) ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్‌’ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. తొలి ఇండియన్‌ సూపర్‌ మ్యాన్‌ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ పాత్రను ఎలివేట్‌ చేశాడు. హనుమంతుడి పవర్స్‌ను పొందిన హీరో.. ఈ సినిమాలో చాలా శక్తివంతంగా మారతాడు. భారీ కొండరాయిని సైతం అలవోకగా చేతితో పైకెత్తుతాడు. తమ ఊరికి హాని తలపెట్టాలని చూసిన విలన్లకు తగి బుద్ది చెబుతాడు. అయితే హనుమాన్‌ గెటప్‌లోకి మీరూ సింపుల్‌గా మారవచ్చు. లాంగ్‌ హెయిర్‌ చేతిలో గదతో పాటు హీరో ధరించిన టీషర్ట్‌ వేసుకుంటే మీరు హనుమాన్‌లాగా మారిపోతారు. భీమ్ (ఆర్ఆర్‌ఆర్‌) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్రంలో తారక్‌ (Jr NTR) భీమ్‌ పాత్రలో కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో పెద్ద పులిని సైతం ఎదుర్కొని తన బలం ఎంటో నిరూపిస్తాడు. విరామానికి ముందు వచ్చే సీన్‌లో అడవి జంతువులతో కలిసి బ్రిటిష్‌ వారిపై పోరాడే సీన్‌ చూసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇక భీమ్‌లా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా?. తారక్‌లా కర్లీ హెయిర్‌స్టైల్‌, చేతిలో బల్లెం పట్టుకొని ఆ పాత్రకు తగ్గ డ్రెస్‌ వేస్తే మీరూ భీమ్‌ లాగా కనిపించవచ్చు. బాహుబలి (Bahubali) ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి (Bahubali) చిత్రంలో ప్రభాస్‌ ఎంతో శక్తివంతంగా కనిపిస్తాడు. మదగజం లాంటి ఏనుగును సైతం కంట్రోల్‌ చేయగల సామర్థ్యం అతడికి ఉంటుంది. కండలు తిరిగిన దేహంతో వందలాది మంది శత్రుసైనికులను బాహుబలి తన ఖడ్గంతో&nbsp; అంతం చేస్తాడు. అటువంటి&nbsp; బాహుబలిలాగా మీరు కనిపించాలంటే ఈ కింద ఫొటోలో ఉన్న గెటప్‌లోకి వెంటనే మారిపోండి.&nbsp; భల్లాల దేవ (Bhallala Deva) ‘బాహుబలి’ చిత్రంలో ప్రతినాయకుడైన భల్లాల దేవ పాత్రలో రానా కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో భారీ దున్నపోతుపై భల్లాల పై చేయి సాధించడాన్ని బట్టి అతడు ఎంత పవర్‌ఫుల్‌లో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో వచ్చిన శక్తివంతమైన విలన్ పాత్రలో భల్లాల దేవ కచ్చితంగా టాప్‌-3లో ఉంటాడు. భల్లాలలాగా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా? అయితే గదను పోలిన ఆయుధాన్ని పట్టుకొని.. యుద్ధానికి వెళ్లే సూట్‌ ధరిస్తే సరి. కాకపోతే ముఖంలో కాస్త క్రూరత్వం ఉండేలా ఎక్స్‌ప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది.&nbsp; కట్టప్ప (Kattappa) ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రను కూడా దర్శకుడు రాజమౌళి ఎంతో దృఢంగా తీర్చిదిద్దాడు. విశ్వాసానికి నిలువెత్తు రూపంగా ఆ పాత్రను చూపించాడు. ‘బాహుబలి 2’ క్లైమాక్స్‌లో ప్రభాస్‌ సాయం చేస్తూ విలన్లపై కట్టప్ప దండెత్తే తీరు అతడి ధైర్య సాహసాలకు అద్దం పడుతుంది. బాహుబలి తొలి భాగం రిలీజ్‌ తర్వాత కట్టప్ప పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం గమనార్హం. అయితే కట్టప్పలా కనిపించడం చాలా సింపుల్‌. తలపై గుండు.. నెరిసిన గడ్డంతో కట్టప్ప తరహా డ్రెస్‌ వేస్తే మీరు అలాాగే మారిపోతారు.&nbsp; కాలకేయ (Kalakeya) కొన్ని సినిమాల్లో హీరో పాత్రకు సమానంగా విలన్‌ రోల్‌ హైలెట్‌ అవుతుంటాయి. ఈ కోవకు చెందిందే ‘బాహుబలి’ సినిమాలోని ‘కాలకేయ పాత్ర’. చూస్తేనే భయం వేసేలా ఆ పాత్రను రాజమౌళి రూపొందించారు. నటుడు ప్రభాకర్‌ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ముఖ్యంగా కిలికి భాషలో ఆకట్టుకున్నాడు. ఈ వేషధారణను ధరించడం అంత తెలిక కాదు. నిపుణులు వద్దకు వెళ్తే వారు సులభంగా వేయగలరు. అపరిచితుడు (Aparichithudu) ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగల అతికొద్ది మంది హీరోల్లో తమిళ నటుడు విక్రమ్‌ ఒకరు. అతడు హీరోగా చేసిన ‘అపరిచితుడు’ చిత్రం ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఇందులో విక్రమ్‌ చేసిన మూడు పాత్రల్లో కెల్లా అపరిచితుడు ఎంతో అగ్రెసివ్‌. తప్పు చేసిన వారిని దండిస్తూ చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్‌ నిపుణులతో విక్రమ్‌ చేసే ఫైట్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అపరిచితుడిలా మీరు కనిపించాలంటే ముందుగా బ్లాక్‌ డ్రెస్‌ ధరించి లాంగ్‌ హెయిర్‌ను ముఖం మీదకు వదిలేయాలి. ఆ తర్వాత సగం ముఖం వరకూ పుర్రె స్టిక్కర్‌ను ధరిస్తే సరిపోతుంది.&nbsp; రోబో (Robo) భారతీయ సినిమా చరిత్రలో ‘రోబో’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హాలీవుడ్‌ చిత్రాన్ని తలపించేలా డైరెక్టర్ శంకర్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చిట్టి అనే రోబో పాత్రలో&nbsp; రజనీకాంత్‌ సూపర్‌ హీరోలా కనిపిస్తాడు. అసాధ్యం అనుకున్న పనులను ఎంతో తెలిగ్గా చేసేస్తూ ఆశ్చర్యపరుస్తాడు. అయితే రోబోలా కనిపించాలని మీరు కోరుకుంటే వెంటనే రోబో సూట్‌ను ఆర్డర్‌ పెట్టేయండి. చిట్టిలా రెడీ అయ్యి మీ ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్ చేయండి.&nbsp; పక్షిరాజా (Pakshi Raja) ‘రోబో 2’ చిత్రంలో ప్రతినాయకుడు పక్షిరాజా పాత్ర హాలీవుడ్‌ సినిమాల్లో విలన్లను తలపిస్తుంది. ప్రకృతిని కంట్రోల్‌ చేయగల పవర్‌ను పొంది అతడు చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. కథానాయకుడు రజనీకాంత్‌కు సవాళ్లు విసురుతూ ఇబ్బందులకు గురిచేస్తాడు. పక్షి రాజాలా మారాలనుకుంటే కాస్త శ్రమ పడాల్సిందే. కాబట్టి నిపుణుల వద్దకు వెళ్తే వారు మిమ్మల్ని అచ్చం అలాగే తయారు చేస్తారు.&nbsp; అరుంధతి (Arundhati) తెలుగులో పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ పాత్ర అనగానే ముందుగా అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమానే అందరికీ గుర్తుకువస్తుంది. దుర్మార్గుడైన పశుపతిని ఎదిరించే వీర వనితగా ఇందులో అరుంధతి కనిపిస్తుంది. అరుంధతి లాగా మీరు పవర్‌ఫుల్‌గా కనిపించాలని అనుకుంటే ముందుగా ముఖాన గుడ్రపు బొట్టు ధరించాలి. శిగను మూడేసి అనుష్క కట్టిన స్టైల్‌లో ఆభరణాలు, శారీ కడితే మీరు అరుంధతి అయిపోతారు.&nbsp; పశుపతి (Pasupathi) తెలుగు సినీ చరిత్రలో ‘పశుపతి’ లాంటి విలన్‌ను చూసి ఉండరు. అరుంధతి చేతిలో చనిపోయినా అతడు పగ తీరని పిశాచిలా మళ్లీ తిరిగి వస్తాడు. అరుంధతి రూపంలో ఉన్న ఆమె వారసురాలని ఇబ్బందులకు గురి చేస్తాడు. పశుపతి లాగా కనిపంచాలంటే మీరు అఘోరాలాగా మారాల్సి ఉంటుంది.&nbsp; ఆదిత్య 369 (Aditya 369) బాలయ్య హీరోగా చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇందులో బాలయ్య ఓ టైమ్‌ మిషన్‌ ద్వారా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్తాడు. అలాగే ఫ్యూచర్‌లోకి వెళ్లి అప్పటి పరిస్థితులు ఎలా ఉండనున్నాయో కళ్లకు కడతాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణలాగా మీరు మారిపోవాలని అనుకుంటే అతడు ధరించిన రోబోటిక్‌ జాకెట్‌ను వేయండి.&nbsp; సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy) చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం.. నిజమైన యోధుడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. బ్రిటిష్‌ వారి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి.. ఆంగ్లేయులకు సింహస్వప్నంలా సైరా మారతారు ప్రజల కోసం చివరికీ ప్రాణ త్యాగం చేసి అసలైన సూపర్‌ హీరోగా నిలుస్తారు. సైరా నరసింహా రెడ్డి మీరూ కనిపించాలంటే సేమ్‌ చిరంజీవిలాగా లాంగ్‌ హెయిర్‌, కోరమీసంతో వీపున కత్తి ధరించండి.&nbsp; బింబిసార (Bimbisara) 5వ శతాబ్దానికి చెందిన మగద రాజ్యాధిపతి బింబిసారుడు కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించాడు. శత్రువులను నిర్ధాక్షణ్యంగా ఏరిపారేసే శూరుడిలా బింబిసారుడు కనిపిస్తాడు. అతడి మీరూ కనిపించాలంటే లాంగ్‌ హెయిర్‌ గడ్డంతో పాటు చేతిలో ఖడ్గాన్ని ధరించాలి. కళ్యాణ్‌ రామ్‌ తరహాలో వజ్రాహారాలు, రాజ దుస్తులను ధరిస్తే బింబిసార గెటప్‌లోకి మారిపోతారు.&nbsp; అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) బ్రిటిష్‌ వారికి ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్ర సమరయోధుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ ఒకరు. సూపర్‌ కృష్ణ ఆయన జీవిత కథను సినిమాగా తీశారు. ఆగస్టు 15 సందర్భంగా ఇప్పటికీ చిన్నారులు అల్లూరి సీతారామరాజు వేషధారణను ధరించి ఆయన్ను గుర్తు చేస్తుంటారు. ఇలా అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించడం చాలా సింపుల్‌. చొక్క లేకుండా శరీరానికి కాషాయ రంగు వస్తాన్ని చుట్టుకొని.. వీపున బాణాలు.. చేతిలో విల్లు పట్టుకుంటే ఆ మహాత్ముడిలా కనిపించవచ్చు.&nbsp;
    ఫిబ్రవరి 29 , 2024
    Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
    Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
    సినిమాల్లో హీరో ఎంట్రీ సీన్లతోనే… ప్రేక్షకులు ఆ చిత్రంపై ఓ అంచనాకు వస్తారు. ముఖ్యంగా స్టార్ హీరోలకైతే కచ్చితంగా ఎలివేషన్‌తో కూడిన ఇంట్రో సీన్ పడాల్సిందే. లేకపోతే ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తుంటారు. తెలుగులో హీరో ఎంట్రీ సీన్‌ ప్రత్యేకంగా లేని సినిమాను ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. ఫ్యాన్స్ ఛాయిస్, హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా డైరెక్టర్లు ముందుగానే ఈ ఇంట్రో సీన్ల కోసం చాలా కసరత్తు చేస్తుంటారు. సినిమా డిస్సాపాయింట్ చేసినా ఫ్యాన్స్‌ కాస్త ఒప్పుకుంటారు కానీ... ఇంట్రో సీన్‌ మాత్రం బాక్స్‌ బద్దలవాల్సిందే అని కోరుకుంటారు. మరి తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ ఇంట్రో సీన్లను ఓసారి చూద్దామా. అతడు- మహేష్ బాబు "ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే... అతడే.. అంటూ ఈ సాంగ్ లిరిక్స్ సాగుతూ మహేష్ బాబు ఇచ్చే పవర్‌ఫుల్ ఎంట్రీ ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్ అని చెప్పాలి. అతడు సినిమాలో మహేష్‌ బాబు ఎంట్రీ సీన్‌కు పడిన BGM సూపర్బ్‌గా ఉంటుంది. మణిశర్మ అందించిన స్కోర్‌ బెస్ట్ ఇంట్రో BGMలలో ఒకటిగా చెప్పవచ్చు. https://youtu.be/HpqfxXRhlgU?si=gVE6a5dcBzFqR1lQ పవన్ కళ్యాణ్- అత్తారింటికి దారేది "బుల్లెట్ ఆరు అంగుళాలే ఉంటుంది కానీ మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ ఆరు అడుగులు ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడు నా మనవడు గౌతం నందా" అని పవన్ కళ్యాణ్ గురించి ఆయన తాతా ఇచ్చే ఎలివేషన్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఆ తర్వాత వచ్చే BGMకు ఫ్యాన్స్‌ అరుపులు కేకలతో థియేటర్లు దద్దరిళ్లిపోయాయి.&nbsp; https://youtu.be/uoBS4Pl6-e8?si=CGm7Tdo6myR7330K ప్రభాస్- బాహుబలి 2 బాహుబలి2 ఇంట్రడక్షన్ సీన్ నెవర్ బిఫోర్‌ అని చెప్పవచ్చు. రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు రాజ మాత శివగామి దేవి అఖండ జ్యోతిని తలపై పెట్టుకుని వెళ్తున్న క్రమంలో మదగజం నుంచి ఆమెను ప్రభాస్ కాపాడే సీన్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్లలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ సీన్‌లో బాహుబలి బలం, ధైర్యాన్ని దర్శకుడు ఈ సీన్‌లో చెప్పకనే చెప్పాడు. https://youtu.be/jkgaUY3VJHY?si=IKuFfqQIiA6VeL92 దసరాలో నాని దసరా సినిమాలో నాని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చిన ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్‌లో బొగ్గు దొంగతనం చేసే సీన్‌ ఫ్యాన్స్‌ చేత కేకలు పుట్టించిందని చెప్పవచ్చు. https://youtu.be/WcOf-pvKGn0?si=xZn3a4j-BvVMyrNF బాలకృష్ణ- లెజెండ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చినన్ని ఇంట్రడక్షన్ సీన్లు మరేతర హీరోకు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా లెజెండ్ సినిమాలో విలన్లను చేజ్ చేసి ఫైట్ సిక్వెన్స్, తన మార్క్ డైలాగ్స్, ఇంట్రోకు తగ్గట్టుగా ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ నిజంగా ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ. https://youtu.be/Ech6LOW6UQA?si=-ueNWM61P2nAq4j- రామ్‌ చరణ్- చిరుత తన తొలి సినిమా చిరుతలో పవర్‌ఫుల్ ఇంట్రో పొందాడు హీరో రామ్‌ చరణ్. జైళ్లో తొటి ఖైదీలు అవమానించినప్పుడు వారిపై చరణ్ తన మొహం కనిపించకుండా రివేంజ్ తీర్చుకునే సీన్.. మెగా ఫ్యాన్స్‌ చేత పూనకాలు పెట్టించింది. https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby జూ.ఎన్టీఆర్- RRR కొమురం భీం క్యారెక్టర్ గురించి బ్రిటిష్ వారికి రాజీవ్ కనకాలా చెప్పే సీన్ నిజంగా జూ. ఎన్టీఆర్ సినిమాల్లో బెస్ట్ ఇంట్రోగా చెప్పవచ్చు. ఆ సీన్‌లో తారక్ పులితో పొరాడే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది.&nbsp; https://youtu.be/BN1MwXUR3PM?si=Cl7Fpcj0qc2nigQu పవన్ కళ్యాణ్- పంజా&nbsp; పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్‌ సైతం ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. బందీగా ఉన్న తనికెళ్ల భరణిని కాపాడేందుకు వెళ్లిన పవన్‌ను చంపేందుకు విలన్లు అతని కారుపై కాల్పులు జరుపుతారు. ఈక్రమంలో పవన్ చనిపోయాడని దగ్గరకు వెళ్తారు. కట్ చేస్తే... పెద్ద బాంబు పేలిన శబ్దం.. పవర్‌ఫుల్ బీజీఎంతో పవన్ ఎంట్రీ సీన్ సూపర్‌గా ఉంటుంది. https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby మహేష్ బాబు- పోకిరి పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్‌ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. "మేము కాదు పండుగాడు.. రేపు పొద్దున ఇందిరా నగర్‌లో పరుగెత్తించి, పరుగెత్తించి కొడుతాడు" అని హీరో ఫ్రెండ్స్ ఇచ్చే ఎలివేషన్.. కట్ చేస్తే.. మహేష్ స్టన్నింగ్ రన్నింగ్ స్టైల్‌తో వచ్చే ఇంట్రో సూపర్బ్‌గా ఉంటుంది. https://youtu.be/e8-GhC0gFtQ?si=PGXqB0DN34tfHaJg అల్లు అర్జున్- ఆర్య మ్యాన్‌ హోల్ పడిన కుక్క పిల్లను బన్నీ రక్షించే సీన్... హార్ట్‌ ఫెల్ట్‌గా ఉంటుంది. ఈలాంటి సీన్‌తో ఇప్పటి వరకు ఏ హీరోకు ఇంట్రో పడలేదని చెప్పాలి. అప్పవరకు ఉన్న మూస ధొరణి ఇంట్రోలకు సుకుమార్ తన స్టైల్‌ ఆఫ్ టేకింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టాడు. https://youtu.be/kvYePkoR6s0?si=jNeyhKqY4ARC-zRZ సింహాద్రి- జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి అప్పన్నకు మొక్కు చెల్లించేందుకు వెళ్తున్నప్పుడు విగ్రహాన్ని కోతి దొంగిలించి విలన్లకు ఇస్తుంది. కట్‌ చేస్తే జూ. ఎన్టీఆర్ ఇంట్రో అదిరిపోతుంది. https://youtu.be/P9q4u7KR9Is?si=Ftql6FN6xG8-uABE స్టాలిన్- చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో వచ్చిన ఇంట్రోల్లో స్టాలిన్ ఇంట్రో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్ అని చెప్పవచ్చు.&nbsp; అమ్మాయిని కిడ్నాప్‌ చేసిన విలన్లకు చిరు బుద్ది చెప్పే సీన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. https://youtu.be/Dlc5V4Gi0So?si=Af3xz6wiuoQw5NfT రామ్‌ చరణ్- మగధీర ఈ చిత్రంలో రామ్‌ చరణ్ చేసే హై ఎండ్ ఎక్స్‌ట్రీమ్ బైక్ ఫీట్.. టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ హీరో ఎంట్రీ సీన్లలో ఒకటిగా చెప్పవచ్చు. https://youtu.be/uGh4lbLnmio?si=vsy6ox3mmaiNDg_i ప్రభాస్- బిల్లా హాలీవుడ్ రేంజ్‌ ఎలివేషన్ ఈ సినిమాలో ప్రభాస్‌కు దక్కింది. ఆయన కటౌట్‌కు తగ్గ BGM స్కోర్ సూపర్బ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్‌ ఆ సీన్‌కు తగ్గ మణిశర్మ బీజీఎం, ప్రభాస్ యాటిట్యూడ్‌ను ఎలివేట్ చేసింది.&nbsp; https://youtu.be/jq1Kr3nlOCE?si=OxJV6jjNiTTEDHta ఘర్షణ- వెంకటేష్ ఈ చిత్రంలో వెంకటేష్ ఇంట్రో వెరైటీగా చూపించాడు దర్శకుడు గౌతమ్ మీనన్. "నా పేరు రామచంద్ర, ఐపీఎస్, నా డ్రెస్ మీద ఉన్న మూడు సింహాలే నా జీవితం, నా తపస్సు" అంటూ ఎలివేషన్‌తో వెంకీని చూపించాడు. https://youtu.be/APNGeCwPlGQ?si=KxY7kBiopg4-6I5a
    ఫిబ్రవరి 26 , 2024
    Rashi Singh: జీన్స్ బటన్ విప్పి.. చెమటలు పట్టిస్తున్న కుర్ర హీరోయిన్
    Rashi Singh: జీన్స్ బటన్ విప్పి.. చెమటలు పట్టిస్తున్న కుర్ర హీరోయిన్
    కుర్ర హీరోయిన్ రాశి సింగ్ హాట్ ఫోటో షూట్‌తో పరువాల విందు చేస్తోంది. అందాల ప్రదర్శనతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది.  బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ వేసుకున్న ఈ ముద్గుగుమ్మ జీన్స్ బటన్ తొలగించి హాట్ ఫొటో షూట్ చేసింది. rashi singh ఎద, నాభి అందాలు ఎకరువు పెడుతూ కుర్రాళ్లకు కనుల విందు చేసింది.  దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే పంథాలో సాగుతున్నట్లు రాశి సింగ్ కనిపిస్తోంది. ఇన్‌స్టాలో హాట్ ఫోటో షూట్ తాలుకు ఫోటోలు పెడుతూ కవ్విస్తుంటుంది. ముఖ్యంగా తనకు ఇష్టమైన బ్లాక్, లైట్ పింక్ కలర్ డ్రెస్సులో నిండైన అందాలను ఎర వేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే రాశి సింగ్(Rashi singh Hot) చలాకీగా ఉంటుంది. ఎప్పటికప్పుడూ రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఇన్‌స్టాలో ఈ సుందరాంగికి 1మిలియన్‌కు దగ్గర్లో ఫాలోవర్లు ఉన్నారు. తెలుగులో జమ్ (2019) చిత్రం ద్వారా రాశి సింగ్ వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పోస్టర్, రీసౌండ్ వంటి చిన్నా చితక సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు . అయితే ఆది సాయికుమార్ నటించిన శశి చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్‌లో మెప్పిస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తోంది.  రాశి సింగ్ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. ఈమె ఛత్తీస్ గఢ్‌లోని బిలాయిలో 1994 జనవరి 5న జన్మించింది.  బిలాయిలోని కృష్ణ పబ్లిక్ స్కూల్‌లో సెకండరీ విద్యను, ముంబైలో పీజీ చదివింది. రాశి సింగ్‌కు డ్యాన్స్ చేయడం, సాంగ్స్ వినడమంటే ఇష్టం ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన "భూతద్దం భాస్కర్ నారాయణ'' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం విలేజ్ క్లైమ్ నేపథ్యంలో రానుంది. ఈ సినిమా విజయంపై రాశి సింగ్(Rashi singh Movies) గంపెడు ఆశలు పెట్టుకుంది. సినిమా సక్సెస్ అయితే అవకాశాలు దారి చూపుతాయని కలలు కంటోంది. 
    ఫిబ్రవరి 26 , 2024
    Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?
    Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?
    స్టార్‌ హీరోల పక్కన యంగ్ హీరోయిన్లు నటించడం మాములే. కానీ స్టార్‌ హీరోయిన్‌ల పక్కన ఓ యంగ్ హీరో నటించడం అరుదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే జరుగుతోంది. స్టార్‌ హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, అనుష్క శెట్టి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు యంగ్‌ హీరోలతో జతకడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. వరుస ఫ్లాపులు, చేతిలో సినిమాలు లేకపోవడంతో వీరంతా చిన్న హీరోలతోనూ రొమాన్స్‌ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.&nbsp; సమంత అగ్రకథానాయిక అయిన సమంత.. డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా చేయబోతోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చేస్తున్న ‘ఖుషీ’ సినిమా పూర్తికాగనే ఆ చిత్రం పట్టాలెక్కుతుందని టాక్.&nbsp; సమంత - సిద్ధూ జంటగా చేయబోయే సినిమాకు మహిళా డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ కథను సిద్ధూ సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.&nbsp; ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమాలోనూ సమంతకు జంటగా యంగ్‌ హీరో దేవ్‌ మోహన్‌ నటిేంచాడు. సినిమా ఫ్లాప్‌ అయినా వీరి మధ్య కెమెస్ట్రీ బాగానే కుదిరినట్లు వార్తలు వచ్చాయి.&nbsp; అనుష్క శెట్టి అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి సినిమాల ద్వారా హీరోయిన్‌ అనుష్క శెట్టి ఎంతో క్రేజ్ సంపాదించింది. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈ భామ కుడా యంగ్‌ హీరోతో జతకట్టేందుకు సిద్ధమైంది.&nbsp; ‘మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో యువ హీరో నవీన్‌ పొలిశెట్టికి జోడీగా నటించింది. పి. మహేష్‌ బాబు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాట్రైలర్‌ ఆకట్టుకుంది.&nbsp; వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న అనుష్క కెరీర్‌ను 2015లో వచ్చిన జీరో సైజ్‌ సినిమా దెబ్బతీసింది. సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన అనుష్క తిరిగి తగ్గలేకపోయింది. దీంతో ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.&nbsp; రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మహేష్‌, రవితేజ, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌, తారక్‌, రామ్‌పోతినేని వంటి స్టార్ హీరోలతో జత కట్టిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరిగా ఓ వెలుగు వెలుగింది.&nbsp; గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో రకుల్‌ సింగ్‌ తర్జనభర్జన అవుతోంది. దీంతో యంగ్‌ హీరోలతోనూ సినిమా చేసేందుకు వెనకాడటం లేదు. 2021లో వచ్చిన కొండ పొలం సినిమాలో యంగ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌ సరసన రకూల్ నటించింది.&nbsp; కొండ పొలం సినిమాలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించి రకూల్‌ మెప్పించింది. తెలివిగల గిరిజన యువతి పాత్రలో ఒదిగిపోయింది. వైష్ణవ్‌ - రకూల్‌ జంటకు కూడా మంచి మార్కులే పడ్డాయి.&nbsp; తమన్నా మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో కుర్ర హీరోలతో సైతం నటించేందుకు ఈ బ్యూటీ సై అంటోంది.&nbsp; 2021లో వచ్చిన ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా తమన్నా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడినప్పటికీ వారి జంటకు మాత్రం మంచి పేరే వచ్చింది. కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది.&nbsp; కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రానికి రీమేక్‌గా ‘గుర్తుందా శీతాకాలం ’ సినిమా తీశారు. డైరెక్టర్‌ నాగశేఖర్‌ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.&nbsp;
    మే 24 , 2023
    5 YEARS FOR BHARAT ANU NENU: వెండితెరపై CMలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ హీరోలు
    5 YEARS FOR BHARAT ANU NENU: వెండితెరపై CMలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ హీరోలు
    సినీ హీరోలు రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నారంటే జనాలకు ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను ప్రతిబింబించేలా చెప్పే డైలాగులు, సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మహేశ్‌ బాబు లాంటి స్టార్ హీరో ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన చిత్రం భరత్‌ అనే నేను. ఈ సినిమా వచ్చి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలో వెండితెరపై ఏ హీరోలు ముఖ్యమంత్రి రోల్స్‌ చేశారో ఓ సారీ చూద్దాం. ఒకే ఒక్కడు దర్శకుడు శంకర్‌, అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఒకే ఒక్కడు. ఇందులో హీరో అనుకోకుండా ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. ఉన్న సమయంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజలను మెప్పిస్తాడు. ఈ కోణంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో సంచలన సృష్టించింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు 100 రోజులు ఆడింది సినిమా. ఈ కథను మెుదట రజినీకాంత్, కమల్‌ హాసన్‌కు వినిపించినా వాళ్లు బిజీగా ఉండటంతో అర్జున్‌తో తెరకెక్కించినట్లు చెప్పాడు శంకర్.&nbsp; భరత్‌ అనే నేను పక్కా కమర్షియల్ మాస్ రోల్స్ చేసే మహేశ్‌ బాబు.. భరత్‌ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా నటించి మెప్పించాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. నేటికి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ పవర్‌ఫుల్‌ రోల్‌లో సూపర్‌ స్టార్‌ చెప్పిన డైలాగ్స్‌ బాగా పేలాయి. చాలామందికి స్ఫూర్తి కలిగించాయి. సినిమాను నిర్మించేందుకు రూ. 65 కోట్లు ఖర్చు చేయగా…రూ. 225 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఇందులో I Don't know అనే పాటను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్‌ పాడాడు. అంతేకాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు.&nbsp; లీడర్‌ దగ్గుపాటి రానా ఏకంగా మెుదటి సినిమాతోనే ప్రయోగం చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రంలో సీఎం రోల్‌లో మెరిశాడు రానా. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తండ్రి మరణానంతరం సీఎం అయిన కుమారుడు.. అవినీతి నిర్మూలన దిశగా ఎలా అడుగులు వేశాడనే కథతో సినిమా తెరకెక్కించారు. సినిమా కథ దాదాపు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, జగన్‌కు సంబంధించిలా కనిపిస్తుంది. కానీ, కొద్దిపాటి మార్పులు చేశారని అప్పట్లో టాక్ నడిచింది. రూ. 9 కోట్లతో తెరకెక్కించగా… రూ. 16 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి.&nbsp; నేనే రాజు నేనే మంత్రి విలక్షణ చిత్రాల దర్శకుడు తేజ తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా మరోసారి రాజకీయ నాయకుడిగా కనిపించాడు. వడ్డీ వ్యాపారిగా జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా ఎదిగి సీఎంలా ఎలా అయ్యాడనే పవర్‌ఫుల్ కథతో సినిమా తీశారు. రూ. 12 కోట్లతో నిర్మించగా.. రూ. 45 కోట్లు వసూళ్లు చేసింది. సినిమా కథను చెప్పేందుకు వెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర విషయాన్ని తేజ పంచుకున్నాడు. కథలో మార్పులు చేయమంటే ఇటే వెళ్లిపోతానని డోర్ దగ్గర నిల్చుని చెప్పినట్లు వెల్లడించాడు. నోటా&nbsp; పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ…కెరీర్ తొలి నాళ్లలోనే ముఖ్యమంత్రి పాత్రలో నటించాడు. నోటా సినిమా ద్వారా సీఎంగా తన నటనను చూపించాడు. అయితే, సినిమా పెద్దగా ఆడలేదు. కానీ, రూ. 12 కోట్లతో నిర్మించామని.. రూ. 25 కోట్లు వసూళ్లు సాధించామని నిర్మాత చెప్పారు. వెట్టాట్టమ్ అనే నవల ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు.&nbsp; కథానాయకుడు ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథానాయకుడు. ఇందులో బాలకృష్ణ సీఎంగా కనిపించారు. నిజ జీవితంలో నందమూరి తారకరామ రావు ముఖ్యమంత్రి జీవితంలో జరిగిన సంఘటనల్లో అచ్చుగుద్దినట్లుగా నటించారు. కానీ, సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. రూ.50 కోట్లు పెట్టి తీశారు. రూ. 70. కోట్లు వచ్చాయి. బాలకృష్ణ సహానిర్మాతగా వ్యవహరించారు.&nbsp; యాత్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం యాత్ర. మళయాలం నటుడు మమ్ముట్టి ఇందులో లీడ్‌ రోల్‌ పోషించాడు. వైఎస్ పాదయాత్ర, పథకాల ఆలోచనకు మూలం ఏంటి? సీఎంగా ఎలాంటి పనులు చేశారు? ఇలా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ తీర్చిదిద్దారు. వైఎస్ క్యారెక్టర్‌లో మమ్ముట్టి జీవించారు. ఆయన నటకు మంచి మార్కులు పడ్డాయి. రూ. 12 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా రూ. 40 కోట్ల వసూళ్లు సాధించింది.&nbsp;
    ఏప్రిల్ 20 , 2023
    తెలుగు హీరోల్లో అత్యధిక  రెమ్యూరేషన్‌ ఎవరికంటే? తెలిస్తే షాకవుతారు!
    తెలుగు హీరోల్లో అత్యధిక రెమ్యూరేషన్‌ ఎవరికంటే? తెలిస్తే షాకవుతారు!
    ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్‌ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే స్థితి నుంచి మన అగ్ర హీరోలు రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పైగా తీసుకునే రేంజ్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఏ హీరో రెమ్యూనరేషన్‌ ఎంత ఉందో చూద్దాం. ప్రభాస్‌: హీరో ప్రభాస్‌ కెరీర్‌ బాహుబలి చిత్రం తర్వాత పూర్తిగా మారిపోయింది. బాహుబలి ముందు వరకు టాలీవుడ్‌కే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్‌ఆ సినిమాతో విశ్వవ్యాప్తమైంది. దీంతో రెండేళ్ల నుంచి ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్... సిద్ధార్థ్ సినిమాతో పాటు భవిష్యత్తులో సైన్ చేయబోయే సినిమాల కోసం రెమ్యునరేషన్‌ను మరింత పెంచాడని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ తన 25వ చిత్రం స్పిరిట్‌ కోసం ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.&nbsp; మహేశ్‌: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ‘SSMB28’ నటిస్తున్న మహేశ్.. దాని తర్వాత దర్శకధీరుడు S.S. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ సినిమాలో చేయనున్నారు. రాజమౌళితో సినిమా అంటే ఓ రేంజ్‌లో ఉంటాయని ఆయన గత చిత్రాలు ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి ఇప్పటికే నిరూపించాయి. పాన్‌ వరల్డ్‌గా రూపొందనున్న ఈ మూవీకి మహేశ్‌ ఏకంగా రూ. 100కోట్లు తీసుకుంటున్నారని టాక్. గత చిత్రం ‘సర్కారు వారి పాట’కు రూ.55 కోట్లు తీసుకున్న మహేశ్‌ నెక్స్ట్‌ మూవీకి ఏకంగా వంద కోట్లు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.&nbsp; పవన్‌ కళ్యాణ్‌: టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతూనే సినిమాలను సైతం అంతే స్పీడుగా పట్టాలెక్కిస్తున్నారు. పవన్‌ ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే హరిహర వీరమల్లు కోసం పవన్‌ రూ. 60 కోట్లు ఛార్జ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన ఒక్కో రోజు షూటింగ్ కోసం రూ. 2 కోట్లు తీసుకున్నట్టు పవన్‌ స్వయంగా వెల్లడించారు.&nbsp; రామ్‌ చరణ్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో రామ్‌చరణ్‌ బ్రాండ్‌ పూర్తిగా మారిపోయింది. మగధీర, రంగస్థలంతో చరణ్‌కు వచ్చిన క్రేజ్‌ను RRR రెండింతలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌ గేమ్ ఛేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చెర్రీ దాదాపు రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సినిమాకు రూ. 45 కోట్లు తీసుకున్న చెర్రీ శంకర్‌ మూవీ కోసం ఏకంగా రూ. 15 కోట్లు పెంచడం గమనార్హం. చెర్రీ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో నటించనున్నారు.&nbsp; జూ. ఎన్టీఆర్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం రామ్‌చరణ్‌తో పాటు జూ.ఎన్టీఆర్‌కు వరల్డ్‌వైడ్‌గా ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.&nbsp; RRR కు ఎన్టీఆర్‌ రూ. 45 కోట్లు తీసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ డైరెక్షన్‌లో NTR30 మూవీలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో&nbsp; రూపొందుతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్‌ రూ.60 కోట్లు తీసుకుంటున్నారని టాక్.&nbsp; https://telugu.yousay.tv/these-are-the-top-10-telugu-heroes-with-the-most-followers-on-instagram.html అల్లు అర్జున్‌: పుష్ప చిత్రంతో అల్లు అర్జున్‌ మేనియా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మూవీ హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో బన్నీ క్రేజ్‌ బాలీవుడ్‌కు విస్తరించింది. దీంతో అల్లుఅర్జున్ మార్కెట్‌ విలువ భారీగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ కోసం బన్నీ కూడా రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp; చిరంజీవి అగ్రకథానాయకుడిగా టాలీవుడ్‌ను దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్‌ చిరు.. సినిమాల్లో తన రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. చిరు మార్కెట్‌ వాల్యూ యంగ్‌ హీరోలకూ ఏ మాత్రం తక్కువగా లేదనే చెప్పాలి. దీంతో చిరు కూడా తన ప్రతీ సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య కోసం చిరు రూ.40 కోట్లు తీసుకున్నారని టాక్. బాలకృష్ణ: నట సింహం బాలకృష్ణ సైతం వరుస హిట్లతో తన మార్కెట్‌ను పెంచుకున్నారు. ‘అఖండ’కు రూ.11 కోట్లు తీసున్న బాలయ్య.. ఆ సినిమా రూ. 90 కోట్ల షేర్‌ వసూలు చేయడంతో రెమ్యూనరేషన్‌ను పెంచారు. ‘వీర సింహారెడ్డి’ కోసం బాలయ్య రూ.15 కోట్లు తీసుకున్నారని తెలిసింది.&nbsp; విజయ్‌ దేవరకొండ: అర్జున్‌రెడ్డి సినిమాతో యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ టాలీవుడ్ సంచలనంగా మారారు. అయితే ఇటీవల రిలీజైన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌, లైగర్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా ఫెయిల్‌ అయ్యాయి. అయితే వరుస ఫ్లాపులు వస్తున్నప్పటికీ విజయ్ ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ‘లైగర్‌’కు కూడా విజయ్‌ రూ. 15 కోట్లు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.&nbsp;
    ఏప్రిల్ 01 , 2023
    Tattoos: హీరోయిన్ల సొగసులపై టాటూలు.. వాటి అర్థం తెలుసా?
    Tattoos: హీరోయిన్ల సొగసులపై టాటూలు.. వాటి అర్థం తెలుసా?
    ]పవన్ కళ్యాణ్‌‌ని విస్తృతంగా ఆరాధించే నటి అశు రెడ్డి. అందుకే తన పక్కటెముకలపై పవన్ కళ్యాణ్ పేరును టాటూ వేయించుకుంది. రెండు చేతులపైనా ఈ బ్యూటీకి టాటూలున్నాయి.అశు రెడ్డి
    ఫిబ్రవరి 13 , 2023
    సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను మీరెప్పుడు ఇలా చూసి ఉండరు!
    సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను మీరెప్పుడు ఇలా చూసి ఉండరు!
    ]ప్రస్తుతం ఎంతోమంది బాలీవుడ్ నటులు, డైరెక్టర్లు మృణాల్‌తో సినిమాలు చేయాలని ఆశపడుతున్నారు.
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Diwali Photos Of Tollywood Celebrities: దీవాళి వేళ తళక్కున మెరిసిన తెలుగు హీరోయిన్లు</strong>
    Diwali Photos Of Tollywood Celebrities: దీవాళి వేళ తళక్కున మెరిసిన తెలుగు హీరోయిన్లు
    దీపావళి సందర్భంగా పలువురు తెలుగు హీరోయిన్లు సాంప్రదాయ వస్త్రాలంకరణలో తళక్కున మెరిసారు. కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకున్న ఆనంద క్షణాలను ఇన్‌స్టా పోస్ట్‌ల ద్వారా పంచుకున్నారు. మరి ఎవరెవరూ పండుగను ఎలా జరుపుకున్నారో మీరు ఓ లుక్‌ వేయండి. టాలీవుడ్ కుర్ర హీరోయిన్ పూజిత పొన్నాడ బ్లూ కలర్ శారీలో అందంగా కనిపించింది. చేతిలో దీపాలతో ఫొటోలకు పొజులిచ్చింది. ఇంటిళ్లిపాది దీపాలను అలంకరించింది. నేషనల్ క్రష్ రష్మిక మంధాన దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంది. రాత్రిపూట తన ఇంటి టెరాస్‌పై దీపాలు పెడుతూ అందంగా కనిపించింది. దేవర బ్యూటి జాన్వీ కపూర్ దీపావళి సందర్భందా టిష్యూ సిల్క్‌ చీరలో తళక్కున మెరిసింది. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంది. రాశీ ఖన్నా దీపావళి వేళ.. ఇంటి ముగ్గువేసి పువ్వులతో అలంకరించింది. వాటిపై దీపాలు పెడుతూ పండుగను సెలబ్రేట్ చేసుకుంది. బాలయ్య ముద్దుగుమ్మ ప్రాగ్య జైస్వాల్ దీపావళి వేళ తన ఇంటిని బంతిపూల మాలలతో అలంకరించింది. వీటికి సంబంధించిన ఫిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తమిళ్ సూపర్ స్టార్ సూర్య తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకున్నాడు. ఈ ఆనంద క్షణాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అందాల తార అనసూయ దీపావళి వేళ.. సాంప్రదాయ వస్త్రాలంకరణలో మెరిసింది. చేతిలో దీపం చూపిస్తూ తన సంతోషాన్ని పంచుకుంది. ఇస్మార్ట్ భామ నభా నటేష్ హాట్‌ లుక్‌లో దియా పట్టుకుని ఫొటోకు పొజులిచ్చింది. బ్యాక్‌ గ్రౌండ్ వెలుతురులో అందంగా కనిపించింది. మేజర్ బ్యూటీ సాయి మంజ్రేకర్ దీపావళి ట్రెడిషనల్ అవుట్‌ లుక్‌లో వావ్ అనిపించింది. దీపాలు వెలిగిస్తున్న ఫొటోలు షేర్ చేసింది. హీరోయిన్ నేహా శర్మ పండుగ వేళ హాట్ లుక్‌లో దియాను పట్టుకుని ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ గ్లామరస్ పిక్స్ వైరల్‌గా మారాయి. కొత్త జంట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. టాలీవుడ్ గ్లామరస్ బ్యూటి పూజా హెగ్డే తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకుంది. రెడ్ శారీలో అందంగా కనిపించింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి పాటాసులు కాల్చే ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. కుటుంబంతో దీపావళిని ఆనందంగా జరుపుకున్నట్లు పోస్ట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ సైతం తన కుటంబ సభ్యులతో కలిసి దీపావళిని ఆనందంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.
    నవంబర్ 02 , 2024

    @2021 KTree