• TFIDB EN
  • జయం
    UATelugu2h 32m
    కాలేజీలో చదువుకునే ఓ యువ జంట ప్రేమలో పడుతుంది. అయితే యువతి తల్లిదండ్రులు వారి బంధువుల అబ్బాయికి ఇచ్చి చెయ్యాలని నిర్ణయించుకుంటారు. మరి వారి ప్రేమ గెలుస్తుందా?
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నితిన్
    వెంకటరమణ
    సాధ
    వెంకటరమణ ప్రేమ ఆసక్తి
    గోపీచంద్
    రఘు
    శివకృష్ణసుజాత తండ్రి
    ప్రసాద్ బాబు
    రఘు తండ్రి
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    లక్ష్మీపతి
    చిత్తజాలు లక్ష్మీపతి
    సుమన్ సెట్టి
    అలీ బాబా
    సుప్రీత్
    రాళ్లపల్లి
    పూజారి
    దువ్వాసి మోహన్
    సత్తి బాబు
    జెన్నీ
    షకీలా
    జ్ఞాన సరస్వతి
    ఢిల్లీ రాజేశ్వరిసుజాత తల్లి
    శ్రీ లక్ష్మి
    నర్సు
    ఆలపాటి లక్ష్మి
    నిర్మలా రెడ్డి
    సిబ్బంది
    తేజ
    దర్శకుడు
    తేజనిర్మాత
    ఆర్పీ పట్నాయక్
    సంగీతకారుడు
    సమీర్ రెడ్డి
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Jayam Ravi Divorce: జయం రవి విడాకుల అంశంలో బిగ్‌ ట్విస్ట్‌.. సంచలన ఆరోపణలు చేసిన భార్య ఆర్తి!</strong>
    Jayam Ravi Divorce: జయం రవి విడాకుల అంశంలో బిగ్‌ ట్విస్ట్‌.. సంచలన ఆరోపణలు చేసిన భార్య ఆర్తి!
    తమిళ స్టార్‌ హీరో జయం రవి (Jayam Ravi)కి కోలీవుడ్‌ (Kollywood)తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్‌ అయ్యాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘సైరెన్‌’ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. దీనిపై తాజాగా ఆయన భార్య ఆర్తి స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. జయం రవి తరహాలోనే సోషల్‌ మీడియాలో స్పెషల్‌ నోట్‌ రిలీజ్‌ చేశారు.&nbsp; ‘నా అనుమతి తీసుకోలేదు’ సినీ నటుడు జయం రవి విడాకులు అంశంపై అతడి భార్య షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తనకు తెలియకుండానే తన భర్త విడాకుల ప్రకటన చేశారని ఆరోపించారు. అతడి బహిరంగ ప్రకటన చూసి షాక్‌కు గురైనట్లు చెప్పారు. ఈ మేరకు ప్రత్యేక నోట్‌ను రిలీజ్‌ చేశారు. ‘నాకు తెలియకుండానే నా అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎంతో బాధపడ్డాను. 18 ఏళ్లుగా మేము కలిసి ఉంటున్నాం. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి తీసుకోకుండా ప్రకటించడం నన్ను బాధించింది. కొంతకాలంగా మా మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నా. దురదృష్టవశాత్తూ నాకు ఆ అవకాశం దక్కలేదు’ అని ఆర్తి రాసుకొచ్చారు.&nbsp; View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) 'అన్యాయంగా నాపై నిందలు' జయం రవి చేసిన విడాకుల ప్రకటనతో తనతోపాటు తన పిల్లలు సైతం షాక్‌కు గురైనట్లు అతడి భార్య ఆర్తి అన్నారు. ‘ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల మాకు ఏమాత్రం మంచి జరగదు. బాధ కలిగినప్పటికీ నేను గౌరవంగా ఉండాలని భావిస్తున్నా. అందుకే పబ్లిక్‌గా కామెంట్ చేయడం లేదు. అన్యాయంగా నాపై నిందలు వేసి నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం కష్టంగా ఉంది. ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ నా పిల్లల శ్రేయస్సే. ఈ వార్త వారిపై ప్రభావాన్ని చూపుతుందనే విషయం నాకు బాధ కలిగిస్తోంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నేను నమ్ముతున్నా. ఇన్ని రోజులుగా మాకు మద్దతు ఇచ్చిన ప్రెస్‌, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆర్తి (Aarti) పేర్కొన్నారు. ఇష్టపూర్వకంగానే విడాకులు: జయం రవి నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అతడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం.&nbsp; ఈ విషయంపై రూమర్స్‌, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని జయం రవి పేర్కొన్నారు. https://twitter.com/actor_jayamravi/status/1833030619481444611 తారా స్థాయికి గొడవలు! 2009 జూన్‌లో జయం రవి, ఆర్తి పెళ్లితో ఒక్కటయ్యారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్ కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట విడాకులకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలివుడ్‌ మీడియా సైతం అనేకసార్లు కథనాలు రాసింది. ఈ క్రమంలోనే వారు వేర్వేరుగా జీవిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరు త్వరలో విడిపోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి. వాటికి తాజా పోస్టుతో జయం రవి ముగింపు పలికారు. అయితే ఎందుకు విడిపోతున్న సంగతి ఎక్కడా రివీల్‌ చేయలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందా? అని సెలబ్రిటీలతో పాటు జయం రవి అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే కలిసి ఉంటూ బాధ పడటం కన్నా విడిపోయి ఎవరికి నచ్చినట్లు హ్యాపీగా ఉండటమే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.&nbsp; తెలుగు రీమేక్‌తో స్టార్‌గా గుర్తింపు 1993లో వచ్చిన 'బావ బామ్మర్ది','పల్నాటి పౌరుషం' (1994) వంటి చిత్రాలతో బాల నటుడిగా జయం రవి పరిచయమయ్యారు. 2002లో టాలీవుడ్‌లో విడుదలై సూపర్‌ హిట్‌ అయిన ‘జయం’ సినిమాను తమిళ్‌లో రీమేక్‌ చేశారు. ఇది హీరోగా జయం రవికి ఫస్ట్‌ ఫిల్మ్‌. అది మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే హిట్‌ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. 2015లో వచ్చిన జెండాపై కపిరాజు మూవీలో జయం రవి ఓ అతిథి పాత్రలో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1 &amp; 2’ చిత్రాల్లో టైటిల్‌ రోల్‌ పోషించి పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు.&nbsp; ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.
    సెప్టెంబర్ 11 , 2024
    <strong>Jayam Ravi Divorce: భార్యతో విడిపోయిన జయం రవి.. విడాకులకు ముందు ఇంత జరిగిందా?</strong>
    Jayam Ravi Divorce: భార్యతో విడిపోయిన జయం రవి.. విడాకులకు ముందు ఇంత జరిగిందా?
    తమిళ స్టార్‌ హీరో జయం రవికి కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్‌ అయ్యాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘సైరెన్‌’ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఎక్స్‌ వేదికగా అతడు పెట్టిన సుదీర్ఘ పోస్టు ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.&nbsp; ‘మా ఇద్దరి మంచి కోసమే..’ నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అతడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం.&nbsp; ఈ విషయంపై రూమర్స్‌, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని జయం రవి పేర్కొన్నారు. https://twitter.com/actor_jayamravi/status/1833030619481444611 15 ఏళ్ల బంధానికి బ్రేక్‌ 2009 జూన్‌లో జయం రవి, ఆర్తి పెళ్లితో ఒక్కటయ్యారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్ కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట విడాకులకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలివుడ్‌ మీడియా సైతం అనేకసార్లు కథనాలు రాసింది. ఈ క్రమంలోనే వారు వేర్వేరుగా జీవిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరు త్వరలో విడిపోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి. వాటికి తాజా పోస్టుతో జయం రవి ముగింపు పలికారు. అయితే ఎందుకు విడిపోతున్న సంగతి ఎక్కడా రివీల్‌ చేయలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందా? అని సెలబ్రిటీలతో పాటు జయం రవి అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే కలిసి ఉంటూ బాధ పడటం కన్నా విడిపోయి ఎవరికి నచ్చినట్లు హ్యాపీగా ఉండటమే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.&nbsp; తెలుగు సినిమాతోనే గుర్తింపు 1993లో వచ్చిన 'బావ బామ్మర్ది','పల్నాటి పౌరుషం' (1994) వంటి చిత్రాలతో బాల నటుడిగా జయం రవి పరిచయమయ్యారు. 2002లో టాలీవుడ్‌లో విడుదలై సూపర్‌ హిట్‌ అయిన ‘జయం’ సినిమాను తమిళ్‌లో రీమేక్‌ చేశారు. ఇది హీరోగా జయం రవికి ఫస్ట్‌ ఫిల్మ్‌. అది మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే హిట్‌ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. 2015లో వచ్చిన జెండాపై కపిరాజు మూవీలో జయం రవి ఓ అతిథి పాత్రలో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1 &amp; 2’ చిత్రాల్లో టైటిల్‌ రోల్‌ పోషించి పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు.&nbsp; ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.
    సెప్టెంబర్ 09 , 2024
    GOD MOVIE REVIEW TELUGU: సైకో థ్రిల్లర్‌గా వచ్చిన గాఢ్ మెప్పించిందా? రేటింగ్ ఇదే!
    GOD MOVIE REVIEW TELUGU: సైకో థ్రిల్లర్‌గా వచ్చిన గాఢ్ మెప్పించిందా? రేటింగ్ ఇదే!
    నటీనటులు: జయం రవి, నయనతార, నరైన్, ఆశిశ్ విద్యార్థి, రాహుల్ బోస్, వినోద్ కిషన్, విజయలక్ష్మి నిర్మాతలు: సుధన్ సందరం, జయరాం, సతీష్‌కుమార్ డెరెక్టర్: ఐ.అహ్మద్ సంగీతం: యువన్ శంకర్ రాజా సినిమాటోగ్రఫీ: హరి కే.వేదాంతం జయం రవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాఢ్' నేడు తెలుగు&nbsp; ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా సైకోథ్రిల్లర్‌గా&nbsp; డైరెక్టర్ అహ్మద్ తెరకెక్కించారు. ఆద్యంతం ట్విస్ట్‌లు, ఎమోషనల్ డ్రామాతో వచ్చిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళ్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు&nbsp; ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ డబ్బింగ్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? సినిమా ఎలా ఉంది? చిత్రంలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం. కథ గాడ్ స్టోరీ విషయానికి వస్తే దూకుడు స్వభావం కలిగిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అర్జున్ (జయం రవి)కి అతడి స్నేహితుడు&nbsp; ACP ఆండ్రూ (నరైన్) అంటే చాలా ఇష్టం. సాఫిగా సాగుతున్న వారి జీవితానికి&nbsp; సైకో కిల్లర్ బ్రహ్మ (రాహుల్ బోస్) రూపంలో ప్రతిఘటన ఎదురవుతుంది. ఈ క్రమంలో కిల్లర్ బ్రహ్మ అమ్మాయిలను కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా హత్యలు చస్తూ తప్పించుకు తిరుగుతుంటాడు. అతన్ని పట్టుకునేందుకు అర్జున్, ఆండ్రూ టీం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఆండ్రూ మరణించడంతో మనస్తాపం చెందిన అర్జున్ డిపార్ట్‌మెంట్ నుంచి తప్పుకుంటాడు. అయితే అరెస్టయిన సైకో కిల్లర్ బ్రహ్మ&nbsp; జైలు నుంచి తప్పించుకుని అర్జున్ సన్నిహితులను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. ఆ సైకో కిల్లర్‌ను పట్టుకునేందుకు అర్జున్ ఏం చేశాడు.. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు.. ప్రియ (నయనతార)తో లవ్ ట్రాక్ ఎలా సాగింది? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? అర్జున్ పాత్ర పరిచయంతోనే కథ మొదలు పెట్టిన దర్శకుడు.. నగరంలో&nbsp; ఉండే 25 ఏళ్ల లోపు అమ్మాయిలు కిడ్నాప్ కావడం.. వారంతా సైకో కిల్లర్ చేతిలో హత్యకు గురికావడం.. వాటిని ఛేదించేందుకు అర్జున్ బృందం రంగంలోకి దిగడం.. ఇలా పది నిమిషాల పాటు కథ వేగంగా సాగుతుంది. ఆ తర్వాత కథ నెమ్మదిస్తుంది. హత్యలు జరిగే తీరు ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది. అయితే హత్య సీన్స్ నిడివి ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులను అసహనానికి గురిచేస్తుంది.&nbsp; అర్జున్ సైకో కిల్లర్‌ను పట్టుకోవడం, అతడు జైలు నుంచి తప్పించుకోవడం, కిల్లర్ వెనుక మరో సైకో కిల్లర్ ఉన్నాడని తెలియడంతో సెకండ్ హాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. చనిపోయిన సైకో కిల్లర్‌నే మళ్లి హత్యలు చేస్తున్నాడా.. లేదా మరొకరు ఉన్నాడా.. సైకో కిల్లర్&nbsp; జైలులో ఉన్నప్పుడు తనలాంటి వ్యక్తిని తయారు చేయడం వంటి సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. అయితే సైకో కిల్లర్ వ్యక్తి వెనకున్న మరో సైకోను పట్టుకునేందుకు హీరో పెద్దగా కష్టపడాల్సి ఉండకపోవడం, వ్యక్తిని చూడగానే అతడే హత్యలు చేస్తున్నాడని తెలుసుకోవడం వంటి సన్నివేశాలు చాలా సాధారణంగా ఉంటాయి. క్లైమాక్స్ సీన్స్ మంచి థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఎవరెలా చేశారంటే పోలీస్ కమిషనర్‌ పాత్రలో జయం సూపర్బ్‌గా నటించాడు. సైకో కిల్లర్స్‌గా నటించిన ఇద్దరు నటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నయనతార పాత్రకు సినిమాలో పెద్ద స్కోప్ లేదు.&nbsp; రెండు మూడు&nbsp; సన్నివేశాల్లో తప్ప ఎక్కడా కనిపించదు. నరైన్, ఆశిశ్ విద్యార్థి, వినోద్ కిషన్, విజయలక్ష్మి తమ పరిధి మేరకు నటించారు.&nbsp; డెరెక్షన్ సైకో కిల్లర్స్ హత్యలు చేసే తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. అయితే ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ అయిన్పటికీ కథను ఆసక్తికరంగా మలచుకోవడంతో డెరెక్టర్&nbsp; ఐ.అహ్మద్ కాస్త తడబాటుకు గురయ్యాడు. సైకో కిల్లర్స్ వరుస హత్యలకు పాల్పడటానికి గల కారణాలు ఏంటనేది చెబితే బాగుండేది. టెక్నికల్ పరంగా గాఢ్ మూవీ నిర్మాణ విలువల పరంగా ఉన్నతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో అది కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు.&nbsp; యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ సినిమాకు మంచి హైప్ తెచ్చింది. నేపథ్య సంగీతం క్లైమాక్స్ సీన్లు, పోరాట సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. బలాలు&nbsp; జయం రవి నటన ఇంటర్వెల్ సీన్స్ సెకండ్ హాఫ్‌లో ఆసక్తికర ట్విస్టులు బలహీనతలు ఫస్ట్ హాఫ్‌ సీన్లు పసలేని స్క్కీన్‌ ప్లే నయన తారకు స్కోప్‌ లేకపోవడం చివరగా ఫస్ట్ హాఫ్‌లో నార్మల్‌గా సాగే ఈ మూవీ సెకండ్ హాఫ్‌లో ప్రేక్షకులను మెప్పిస్తుంది. రేటింగ్:&nbsp; 2.5/5
    అక్టోబర్ 13 , 2023
    నితిన్ (Nithiin) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నితిన్ (Nithiin) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో నితిన్ ఒకడు. జయం, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయిందే వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజం, స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు నితిన్ దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో లవర్‌ బాయ్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకుంటున్న&nbsp; నితిన్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. నితిన్ అసలు పేరు? నితిన్ కుమార్ రెడ్డి నితిన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు నితిన్&nbsp; ఎక్కడ పుట్టారు? నిజామాబాద్ రామ్‌ పొత్తినేని తేదీ ఎప్పుడు? 1988 మే 15 నితిన్ వివాహం అయిందా? శాలిని కందుకూరితో 2020లో పెళ్లి జరిగింది. నితిన్‌కి ఇష్టమైన రంగు? వైట్, రెడ్ నితిన్ తల్లిదండ్రుల పేరు సుధాకర్ రెడ్డి, విద్యారెడ్డి నితిన్ అభిరుచులు? డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడటం నితిన్‌కి ఇష్టమైన ఆహారం? అలుగడ్డ కర్రీ నితిన్&nbsp; అభిమాన నటుడు? పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి నితిన్‌కు నచ్చిన సినిమా? ఖుషి నితిన్‌కు స్టార్ డం అందించిన సినిమాలు? సై, దిల్, జయం నితిన్&nbsp; ఏం చదివాడు? ఇంజనీరింగ్&nbsp; https://www.youtube.com/watch?v=5SzH8VHhUVw నితిన్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 32 సినిమాల్లో నటించాడు నితిన్ సినిమాకు ఎంత తీసుకుంటారు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.10కోట్లు- రూ.15కోట్లు తీసుకుంటున్నాడు. నితిన్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు? జయం, శ్రీఆంజనేయం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు.
    మార్చి 21 , 2024
    <strong>HBD Priyanka Mohan: ‘నన్ను తీసుకొని తొందరపడ్డారేమో’.. నేరుగా డైరెక్టర్‌నే అడిగేసిన ప్రియాంక మోహన్‌!</strong>
    HBD Priyanka Mohan: ‘నన్ను తీసుకొని తొందరపడ్డారేమో’.. నేరుగా డైరెక్టర్‌నే అడిగేసిన ప్రియాంక మోహన్‌!
    దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరోయిన్లలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ (Priyanka Arul Mohan) ఒకరు. కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడిన ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సూర్య, ధనుష్‌, నాని, శివ కార్తికేయన్‌, జయం రవి వంటి స్టార్‌ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పవన్‌ పక్కన 'ఓజీ' సినిమాలో నటిస్తూ అందరి కళ్లు తనవైపు తిప్పుకుంది. కాగా, ఇవాళ ప్రియాంక మోహన్‌ పుట్టిన రోజు (HBD Priyanka Mohan). 29వ సంవత్సరంలోకి ఈ అమ్మడు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె కెరీర్‌లోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; 1995 నవంబర్‌ 20న కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రియాంక మోహన్‌ (HBD Priyanka Mohan) జన్మించింది. ఆమె అక్కడే విధ్యాబ్యాసం చేసింది. బయలాజికల్ ఇంజనీర్‌గా పట్టా అందుకుంది. ప్రియాంక అమ్మ కన్నడిగ కాగా ఆమె తండ్రిది తమిళ నేపథ్యం. దీంతో కన్నడతో పాటు తమిళ భాషపైనా ప్రియాంకకు పట్టు వచ్చింది.&nbsp; ఇంజనీరింగ్‌ చదువుతున్న సమయంలోనే ప్రియాంక పలు నాటకాలు వేసింది. ఆ సమయంలోనే రెండు, మూడు ప్రకటనల్లోనూ నటించింది.&nbsp; ఆ సమయంలోనే ఫ్రెండ్స్‌ అంతా కలిసి డబ్బులు వేసుకొని మరి తనతో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారని ప్రియాంక ఓ ఇంటర్వూలో రివీల్‌ చేసింది.&nbsp; అలా చేసిన తన ఫస్ట్‌ కన్నడ సినిమా 'ఒందు కథే హెళ్లా' అని ప్రియాంక (HBD Priyanka Mohan) స్పష్టం చేసింది. అయితే ఈ సినిమా చేస్తున్న సంగతి ఇంట్లో అస్సలు చెప్పలేదట.&nbsp; రిలీజయ్యాక అందులో ప్రియాంకను చూసి కుటుంబ సభ్యులు చాలా&nbsp; షాకయ్యారట. కానీ ఒక్క మాట కూడా అనలేదని, పైగా ప్రోత్సహించారని ప్రియాంక చెప్పింది. నటనపై ఆసక్తి ఉనప్పటికీ సినిమాల్లోకి రావాలని ప్రియాంక ఎప్పుడు అనుకోలేదట. మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కన్నదట. ఇండస్ట్రీలోకి రాకపోయుంటే ఈపాటికి మంచి కార్పోరేట్ సంస్థలో పని చేస్తూ ఉండేదానిని ప్రియాంక (HBD Priyanka Mohan) చెప్పింది. నాని 'గ్యాంగ్‌ లీడర్స్' సినిమాతోనే ప్రియాంక తెలుగు తెరపై అడుగుపెట్టింది. తొలి రోజు షూటింగ్‌లో లక్ష్మీ, శరణ్య వంటి దిగ్గజ నటులను చూసి ప్రియాంక చాలా టెన్షన్‌కు గురైందట. పెద్ద నటులతో చేసేంత అర్హత తనకు ఉందా అని ఆలోచించిందట. వెంటనే దర్శకుడు విక్రమ్‌ వద్దకు వెళ్లి 'బాగా ఆలోచించే నన్ను తీసుకున్నారా.. తొందరపడ్డారేమో' అని అనేసినట్లు ప్రియాంక తెలిపింది.&nbsp; చిన్నప్పటి నుంచి ప్రియాంకకు సూర్య అంటే చాలా ఇష్టం. హీరో సూర్యతో కలిసి 'ఈటీ'లో నటించే ఛాన్స్ రావడంతో ఎంతో సంతోషించినట్లు ఈ అమ్మడు తెలిపింది. షూటింగ్ పూర్తయ్యాక సూర్య గిఫ్ట్ పంపిస్తే దానిని ఇన్‌స్టాలో పోస్టు చేసి మరి ఈ భామ మురిసిపోయింది. ప్రియాంక చాలా మృధుస్వభావి. ఎక్కడకు వెళ్లినా చాలా తక్కువగా మాట్లాడతారు. దీని వల్ల ఆమెకు స్నేహితులు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు.&nbsp; హీరోయిన్లు నిత్యా మీనన్‌, అనుష్క, నజ్రియా అంటే ప్రియాంకకు ఎంతో అభిమానం. వారి నటన తనకు ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో ప్రియాంక చెప్పింది.&nbsp; సాధారణంగా షూటింగ్‌ గ్యాప్‌ దొరికితే ఏ హీరోయిన్‌ అయినా వెంటనే విహారానికి వెళ్లిపోతారు. కానీ ప్రియాంక (HBD Priyanka Mohan) అలా కాదు.&nbsp; తీరిక సమయాల్లో ఇంట్లోనే హాయిగా విశ్రాంతి తీసుకుంటుందట. లేదంటే నచ్చిన పనులు చేస్తూ ఫ్రీ టైమ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తుందంట. అప్పుడప్పుడు విహారయాత్రకు వెళ్తుంది. పొద్దున్నే లేవాలంటే ప్రియాంకకు చాలా కష్టంగా ఉంటుందట. కెరీర్‌ తొలినాళ్లలో వ్యాయమం చేయడానికి కూడా చాలా బద్దకించేదానినని ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పింది.&nbsp; View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) చికెన్‌ వంటకాలను ప్రియాంక (HBD Priyanka Mohan) బాగా చేస్తుందట. ఏ టైప్‌ చికెన్‌ డిష్‌ కావాలన్న చాలా రుచికరంగా చేసేస్తానని ఓ సందర్భంలో ఈ అమ్మడు తెలిపింది. ఇక పొద్దున్నే కప్పు కాఫీ పడాల్సిందేనని ఈ అమ్మడు (HBD Priyanka Mohan) చెప్పింది. కాఫీ లేకుండా తన డే అస్సలు స్టార్ట్‌ కాదని చెపుకొచ్చింది.&nbsp; తెర వెనుక తాను ఎలా ఉంటుందో సినిమాల్లోనూ అలాగే ఉండేందుకు ఈ అమ్మడు ప్రయత్నిస్తోంది. స్కిన్‌షోలకు దూరంగా సంప్రదాయ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తోంది. తెలుగులో ఇప్పటివరకూ ‘గ్యాంగ్ లీడర్‌’తో పాటు ‘శ్రీకరం’, రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’ చిత్రాలు చేసింది. ప్రస్తుతం పవన్‌తో 'ఓజీ'లో నటిస్తోంది.&nbsp; అటు తమిళంలో శివకార్తికేయన్‌తో చేసిన 'డాక్టర్‌', 'డాన్‌'.. ధనుష్‌తో చేసిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రాలు తెలుగులోనూ డబ్‌ అయ్యాయి.
    నవంబర్ 20 , 2024
    <strong>ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్‌ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్‌!</strong>
    ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్‌ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్‌!
    టాలీవుడ్‌ మూలస్తంభాల్లో ఒకరైన దివంగత అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతగా, పద్మవిభూషణ్‌గా, నటసామ్రాట్‌గా ఆయన ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్‌ 20, 1924లో జన్మించారు. నేటితో 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆయన అభిమానులు దేశ, విదేశాల్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఒక్క దిగ్గజ నటుడిగానే అందరికీ తెలుసు. కానీ, ఆయనలో బెస్ట్ డ్యాన్సర్ కూడా ఉన్నారు. అసలు టాలీవుడ్‌కు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే ఆయన అని ఈ జనరేషన్‌ వారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; [toc] డ్యాన్స్‌కు మూలపురుషుడు అక్కినేని టాలీవుడ్‌లో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే డ్యాన్స్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. అగ్రకథానాయకులు డ్యాన్స్‌ వేసేందుకు ఆసక్తి కనబరిచేవారు కాదు. వారి ఫోకస్‌ మెుత్తం ఏ విధంగా నటించాలి, ఎలా హావాభావాలు ప్రదర్శిస్తే ప్రేక్షకులను నచ్చుతుంది అన్నదానిపైనే ఉండేది. ముఖ్యంగా 1960-70 మధ్య ఈ తరహా ధోరణి ఎక్కువగా కనిపించేది. హీరోయిన్‌ డ్యాన్స్‌ చేస్తుంటే హీరో ఒక పక్కన నిలబడి కాళ్లు చేతులు కదుపుతున్నారన్న విమర్శలు కూడా అప్పట్లో వచ్చేవి. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఈ పరిస్థితులను పూర్తిగా మార్చివేశారు. చాలా మందికి టాలీవుడ్‌లో డ్యాన్స్ అంటే మెగాస్టార్‌ చిరంజీవి గుర్తుకువస్తారు. కానీ ఆయనకంటే ముందే నాగేశ్వరరావు తన సినిమాల్లో డ్యాన్స్‌కు పెద్ద పీట వేశారు. హీరోకు నటనతో పాటు డ్యాన్స్‌ కూడా ముఖ్యమని తెలియజేశారు. కథానాయికతో పోటీ పడి మరి స్టెప్పులు వేశారు. ఓ దశలో నాగేశ్వరరావును చూసి నందమూరి తారకరామారావు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి వారు కూడా పోటా పోటీగా తమ సినిమాల్లో స్టెప్పులు ఉండేలా జాగ్రత్తపడ్డారు.&nbsp; అక్కినేని స్టెప్స్‌కు ఆడియన్స్‌ ఫిదా! 1971లో వచ్చిన దసరాబుల్లోడు (Dasara Bullodu Movie) సినిమాలో ‘ఎట్టాగే ఉన్నాది ఓలమ్మీ’ అంటూ ఏఎన్ఆర్ అదిరిపోయే డ్యాన్స్ చేసి వావ్ అనిపించాడు. అలాగే బంగారుబాబులో ‘చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది’ అంటూ అప్పట్లో తన స్టెప్పులతో ఉర్రూతలూగించారు. అప్పటివరకూ కేవలం సాంగ్స్‌ వింటూ ఆనందించిన తెలుగు ప్రేక్షకులు అక్కినేని దెబ్బతో డ్యాన్స్‌ను కూడా ఆస్వాదించడం మెుదలుపెట్టారు. ముఖ్యంగా ప్రేమ్‌ నగర్‌ సినిమాలో ‘నేను పుట్టాను లోకం నవ్వింది’ పాటలో మద్యం సేవించిన వ్యక్తిలా నాగేశ్వరరావు వేసిన డ్యాన్స్ ట్రెండ్‌ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమాభిషేకం సినిమాలో ‘నీ కళ్లు చెబుతున్నాయి’ అంటూ శ్రీదేవితో పోటీపడి మరి వేసిన డ్యాన్స్‌ అందర్నీ మెప్పించింది. అదే సినిమాలో జయసుధతో కలిసి 'కోటప్పకొండకు వస్తానని మెుక్కుకున్నా' పాటలో వేసిన స్టెప్స్‌ కూడా అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. అంతేకాదు మెకానిక్ అల్లుడు సినిమాలో మెగాస్టార్‌ చిరుతోనూ పోటీగా నాగేశ్వరరావు స్టెప్పులు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. అందులో మచ్చుకకు కొన్ని లింక్స్‌ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిపై ఓ లుక్కేయండి.  https://www.youtube.com/watch?v=OG_H1fNnWJA https://www.youtube.com/watch?v=uWhPlHc0yoU https://www.youtube.com/watch?v=nTt-kp2Lndc https://www.youtube.com/watch?v=zA_uVs7H7G0 https://www.youtube.com/watch?v=y_p90nJNsB8 నాగేశ్వరరావు స్ఫూర్తితో.. టాలీవుడ్‌లో డ్యాన్స్‌కు మారుపేరుగా చెప్పుకుంటున్న మెగాస్టార్‌ చిరంజీవికి సైతం ఒకనొక దశలో నాగేశ్వరరావు స్ఫూర్తిగా నిలిచారు. సినిమాల్లో డ్యాన్స్ ప్రాధాన్యతను నాగేశ్వరరావు చిత్రాలను చూసే చిరు తెలుసుకున్నారని ఆయన సన్నిహితులు అంటుంటారు. ఈ క్రమంలోనే డ్యాన్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన చిరు ఎవరికీ సాధ్యం కాని స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. ఒకనొక సందర్భంలో చిరు డ్యాన్స్‌ గురించి అక్కినేని నాగేశ్వరరావు సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఈవెంట్‌లో చిరు పాల్గొన్న సందర్భంలో ఆయన మాట్లాడారు. సినిమాకు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే తానని నాగేశ్వరరావు గుర్తుచేశారు. అసలు డ్యాన్స్ ఎందుకు మెుదలుపెట్టానా అని అప్పుడప్పుడు అనిపిస్తుందని అన్నారు. చిరు స్టెప్పులు చూస్తుంటే అతని శరీరంలో అసలు ఎముకలు ఉన్నాయా? లేవా? అని అనుమానం కలుగుతుంటుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కొన్ని దశాబ్దాల పాటు నటన, డ్యాన్స్‌లో తిరుగులేని హీరోగా చిరు నిలిచారు. నాగేశ్వరరావు మెుదలపెట్టిన డ్యాన్స్‌ను చిరు అందిపుచ్చుకోకా ప్రస్తుతం హీరోలు అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, తారక్‌, రామ్‌ పోతినేని వంటి వారు ఆ పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=pFTIlMls-98 బాలకృష్ణ ఆసక్తికర పోస్టు ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) శత జయంతి సందర్భంగా నటుడు బాలకృష్ణ (Balakrishna) ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ఆయన్ని స్మరించుకోవడం గర్వకారణం అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతీ నటుడికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం. నాటకరంగం నుంచి చిత్రరంగం వరకూ ఆయన చేసిన ప్రయాణం ప్రతిఒక్కరికీ ప్రేరణ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు.&nbsp; ఏఎన్నాఆర్‌ టాప్‌-10 చిత్రాల రీరిలీజ్‌ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా&nbsp; ‘ఏఎన్నార్ 100: కింగ్ ఆఫ్ ది సిల్వ‌ర్ స్క్రీన్’పేరుతో అక్కినేని పది క్లాసిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు దేశంలోనే అనేక ప్రాంతాలలో స్పెషల్ షోస్‌ను ప్రదర్శిస్తున్నారు. హైద‌రాబాద్‌, ముంబై, ఢిల్లీ, బెంగ‌ళూరు, వ‌రంగ‌ల్, కాకినాడ‌, తుమ‌కూరు, వ‌డోద‌ర‌, జ‌లంధ‌ర్‌, రూల్కెలాతో స‌హా మొత్తం 25 ప్రాంతాలలో ఈ స్పెషల్‌ షోస్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? ఎక్కడ చూడాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; దేవదాస్‌ (1951) అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో ప్రేమలో విఫలమైన వ్యక్తిగా అద్భుత నటన కనబరిచాడు. ప్లాట్‌ ఏంటంటే ‘దేవదాసు, పార్వతి ప్రేమను సమాజం అంగీకరించకపోవడంతో మద్యానికి దేవదాసు బానిసవుతాడు. ఇంతలో చంద్రముఖి అనే వేశ్య అతనితో ప్రేమలో పడటం మొదలు పెడుతుంది. చివరికీ ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets మిస్సమ్మ (1955) అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కాంబోలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్లాట్‌ ఏంటంటే ‘ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు. మరి వారు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది స్టోరీ Book Tickets మాయాబజార్‌ (1957) స్టోరీ ఏంటంటే ‘బలరాముడు తన కుమార్తెను సుభద్ర కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే కౌరవుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; Book Tickets భార్య భర్తలు (1961) ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘ఉప్యాధ్యాయురాలైన శారదను ఆనంద్‌ ఇష్టపడతాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. క్రమేణా ఆనంద్‌ వ్యక్తిత్వం నచ్చి ఆమె అతడ్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ&nbsp; ప్రేయసి ఆనంద్‌కు తారసపడి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ. Book Tickets గుండమ్మ కథ (1962) అక్కినేని నాగేశ్వరరావు, రామారావు కాంబోలో వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ విజయాన్ని అందుకుంది. ప్లాట్‌ ఏంటంటే 'గుండమ్మకు ఒక కొడుకు, కూతురు. సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తుంటుంది. లక్ష్మికి అనాథను ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరినీ ఇంట్లో శాశ్వత పనోళ్లుగా చేసుకోవాలని గుండమ్మ చూస్తుంది. తన సొంత కూతుర్ని మాత్రం డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటుంది. జమీందారు రామభద్రయ్య కొడుకులు ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; Book Tickets డాక్టర్‌ చక్రవర్తి (1964) ఏఎన్నార్‌కు మంచి పేరు తీసుకొచ్చి చిత్రాల్లో డాక్టర్‌ చక్రవర్తి ఒకటి. ప్లాట్ ఏంటంటే ‘డాక్టర్ చక్రవర్తి తన సోదరి మరణం తర్వాత మాధవిని సొంత చెల్లెలిగా భావిస్తాడు. ఎందుకంటే ఆమె తన ప్రవర్తనతో చక్రవర్తి సోదరిని గుర్తు చేస్తుంటుంది. అయితే వారి జీవిత భాగస్వాములు వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets సుడిగుండాలు (1968) ఈ మూవీ స్టోరీ ఏంటంటే ‘జస్టిస్ చంద్ర శేఖరం గొప్ప దయగల వ్యక్తి. దోషిగా నిర్ధారించబడిన వారి కుటుంబాలకు ఆశ్రయం ఇస్తుంటాడు. సొంత కొడుకు హత్యకు గురైనప్పుడు దానికి బాధ్యులైన దోషులను సమర్థిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets ప్రేమ్‌ నగర్‌ (1971) ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘జల్సాగా తిరిగే సంపన్న యువకుడు మధ్యతరగతి అమ్మాయిని ప్రేమిస్తాడు. యువతి తల్లి వారి పెళ్లికి అంగీకరించదు. దీంతో ఆ యువకుడు మద్యానికి బానిస అవుతాడు. చివరికి వారు ఒక్కటయ్యాారా? లేదా?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets ప్రేమాభిషేకం (1982) నటుడిగా నాగేశ్వరరావు మరో మెట్టు ఎక్కించిన చిత్రం ‘ప్రేమాభిషేకం’. స్టోరీ విషయానికి వస్తే 'రాజేష్‌ దేవిని గాఢంగా ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి కొద్ది రోజుల ముందు రాజేష్‌కు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెకు తనపై ద్వేషం కలిగేలా ప్రవర్తిస్తాడు. దీంతో దేవి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. చివరికి రాజేష్‌ పరిస్థితి ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets మనం (2014) అక్కినేని కుటుంబానికి, అభిమానలకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మనం’. ఆ ఫ్యామిలీకి చెందిన నలుగురు హీరోలు (నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌) ఈ సినిమాలో నటించారు. ‘పునర్జన్మలు - ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ. Book Tickets
    సెప్టెంబర్ 20 , 2024
    NBK vs Jr.NTR: బాలయ్య గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు తారక్‌ రావట్లేదా? కావాలనే దూరం పెట్టారా?
    NBK vs Jr.NTR: బాలయ్య గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు తారక్‌ రావట్లేదా? కావాలనే దూరం పెట్టారా?
    నందమూరి కుటుంబం నుంచి ప్రస్తుత స్టార్‌ హీరోలు అనగానే ముందుగా బాలకృష్ణ (Balakrishna), జూ.ఎన్టీఆర్‌ (Jr.NTR)లే గుర్తుకువస్తారు. నందమూరి నట వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బాబాయ్‌, అబ్బాయ్‌ తమకంటూ సెపరేట్‌ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఏపీ ఎన్నికల సమయంలో చంద్రబాబును జైల్లో పెట్టినా తారక్‌ స్పందించకపోవడం, ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలకు దూరంగా ఉండటం, ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తారక్‌ ప్లెక్సీలను తీసేయాలని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే తాజాగా మరోమారు నందమూరి కుటుంబానికి - తారక్‌ మధ్య ఉన్న విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; తారక్‌కు అందని ఆహ్వానం! నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆగస్టు 30తో 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు సినీ పరిశ్రమ తరఫున ప్రముఖులంతా బాలయ్యకు గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుతున్నారు. సెప్టెంబరు ఒకటోతేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు హాజరవ్వాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డితో పాటు చిరంజీవి (Chiranjeevi), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌కు కూడా ఇన్విటేషన్స్‌ వెళ్లాయి. అయితే నందమూరి ఫ్యామిలీకి చెందిన జూ.ఎన్టీఆర్‌ను మాత్రం ఈవెంట్‌ నిర్వాహకులు ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన సోదరుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram)కు సైతం ఇన్విటేషన్‌ ఇవ్వలేదని టాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో బాలకృష్ణ, తారక్‌ మధ్య ఉన్న మనస్పర్థలు మరోమారు తెరపైకి వచ్చాయని అంటున్నారు. బాలయ్య సూచన మేరకే నిర్వాహకులు వారిద్దరిని ఆహ్వానించలేదని టాక్‌ వినిపిస్తోంది. దీంతో బాలయ్య-తారక్‌ మధ్య రాజుకున్న వివాదం ఇంకా చల్లారలేదని తెలుస్తోంది.&nbsp; విభేదాలకు కారణాలు ఇవేనా..! వై.ఎస్‌. జగన్‌ నేతృత్వంలోని గత ఏపీ ప్రభుత్వం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. బాలకృష్ణ వియ్యంకుడైన చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి ఏకంగా 50 రోజుల పాటు జైలులో పెట్టింది. దీనిపై నందమూరి కుటుంబం పెద్ద ఎత్తున చంద్రబాబు ఫ్యామిలీకి అండగా నిలిచింది. జగన్‌ ప్రతీకార రాజకీయం చేస్తున్నాడంటూ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇంత జరుగుతున్నా తారక్‌ మాత్రం అప్పట్లో దీనిపై పల్లెత్తు మాట కూడా అనలేదు. కనీసం ట్విటర్‌ వేదికగా ఈ అరెస్టును ఖండిస్తున్నట్లు పోస్టు సైతం పెట్టలేదు. తారక్‌ మౌనంగా ఉండటం సరికాదంటూ టీడీపీ క్యాడర్‌, తెలుగు దేశం సోషల్‌ మీడియా విభాగం సూచిస్తున్న ఆయన పట్టించుకోలేదు. దీంతో బాలయ్య తీవ్ర అసహనానికి లోనైనట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.&nbsp; కంట్రోల్‌ చేయని తారక్‌! వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తారక్‌కు అత్యంత సన్నిహితులు. నాని, వంశీ పలు సందర్భాల్లో ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో వారు ఇరువురు చంద్రబాబు, అతడి కుమారుడు నారా లోకేష్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. బాలకృష్ణపై కూడా అవాకులు, చవాకులు పేల్చారు. ఒక దశలో చంద్రబాబు భార్య, బాలకృష్ణ సోదరి అయిన నారా భువనేశ్వరి క్యారెక్టర్‌ను తప్పుబడుతూ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై చంద్రబాబు సైతం మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నారు. అటువంటి సమయంలో తనకు అత్యంత సన్నిహితులైన వంశీ, నానిని తారక్‌ నియంత్రించలేదని విమర్శలు వచ్చాయి. ప్రారంభంలోనే వారిని తారక్ మందలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బాలకృష్ణతో పాటు టీడీపీ నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.&nbsp; తారక్‌ మౌనానికి కారణం అదేనా? 2009 ఎలక్షన్స్‌ ముందు వరకూ తారక్‌ టీడీపీ తరపున చాలా చురుగ్గా వ్యవహరించాడు. ఎన్నికల్లో పార్టీ తరపున సుడిగాలి పర్యటన చేసి తన ప్రచారంతో శ్రేణులను హోరెత్తించారు. అయితే ఆ ఎలక్షన్స్‌లో ఓడిపోవడంతో తారక్‌ను చంద్రబాబు పక్కనే పెట్టేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా 2014 నుంచి పార్టీ వ్యవహారాలకు తారక్‌ను దూరంగా ఉంచారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటివరకూ పార్టీ అవసరాలకు వినియోగించుకొని ఒక్కసారిగా పక్కనపెట్టేయడం తారక్‌ను తీవ్రంగా బాధించిందని అతడి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
    ఆగస్టు 31 , 2024
    This Week OTT Releases: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
    This Week OTT Releases: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
    టాలీవుడ్‌లో వచ్చే వారం పెద్ద సినిమాలు రిలీజ్ కానుండటంతో చిన్న చితకా సినిమాలు ఈ వారం రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలాగే ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 20కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం థియేటర్లలలో విడుదలకు సిద్ధమైన సినిమాలు గాఢ్ తమిళ్‌లో హిట్ సాధించిన ఇరైవన్ మూవీ తెలుగులో గాఢ్ పేరుతో అక్టోబర్ 13న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సినిమాలో నయనతార, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆద్యంతం ట్విస్ట్‌లతో కూడిన ఈ చిత్రం తమిళ్‌లో మంచి కలెక్షన్లు రాబట్టింది. కాగా ఈ సినిమాను సుధన్ సుందరం, జి. జయరామ్ సంయుక్తంగా నిర్మించారు. ఐ.అహ్మద్ డైరెక్ట్ చేశారు. మధనపూడి గ్రామం అనే నేను ఓ ఊరి కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. శివ కంఠమనేని హీరోగా క్యాథలిన్ గౌడ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 13న థియేటర్లలో రిలీజ్ కానుంది.&nbsp; రతినిర్వేదం మలయాళంలో సూపర్ హిట్‌ అయి తెలుగులోనూ ఒకప్పుడు హిట్ కొట్టిన చిత్రం రతి నిర్వేదం. ఈ చిత్రం అక్టోబర్ 13న రీరిలీజ్ కానుంది. శ్వేతమీనన్, శ్రీజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. సగిలేటి కథ రాయలసీమ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం సగిలేటి కథ. ఈ చిత్రాన్ని రాజశేఖర్ సుద్మూన్ డైరెక్ట్ చేశారు. రవితేజ మహాదాస్యం, విషిక కోట ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ గ్రామంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. రాయలసీమ సంస్కృతులు పండుగలు సినిమాలో ప్రధానాంశంగా ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. రాక్షస కావ్యం మైథాలజీని ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అన్వయిస్తూ రూపొందించిన చిత్రం రాక్షస కర్తవ్యం. ఈ చిత్రంలో అభయ్ నవీన్, కుశాలిని లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వీరితో పాటు రోహిణి, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేష్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు (October 9- 13) TitleCategoryLanguagePlatformRelease DateMargauxMovieEnglishNetflixOctober&nbsp; 09Big WopWebseriesGermanNetflixOctober 11KasargoldMovieMalayalamNetflixOctober 13Awareness&nbsp;MovieSpanish&nbsp;Amazon PrimeOctober 11&nbsp; In My Mother's &nbsp; &nbsp; SkinMovieTagalog&nbsp;Amazon PrimeOctober 12Everybody Loves Diamonds&nbsp;SeriesItalian&nbsp;Amazon PrimeOctober 13The BurialmovieEnglish&nbsp;Amazon PrimeOctober 13Mathagam Part 2SeriesTelugu DubbedHot StarOctober 12GoosebumpsSeriesEnglishHot StarOctober 13Sultan of DelhiSeriesHindiHot StarOctober 13MattikathaMovieTelugu&nbsp;ahaOctober 13&nbsp; Prema VimanaMovie&nbsp;Telugu&nbsp;Zee 5October 13Star vs Food Survival&nbsp;SeriesHindiDiscovery PlusOctober 09Mr. NagabhushanamSeriesTeluguEtv-WinOctober 13Mission Impossible - Dead Reckoning Part 1MovieEnglishBook My ShowOctober 11Talk To MeMovieEnglishBook My ShowOctober 15The Queen MaryMovieEnglishBook My ShowOctober 15
    అక్టోబర్ 09 , 2023
    Priya Bhavani Shankar: ఎవరు పాప నువ్వు.. ఇన్నాళ్లు ఇంత అందం ఎక్కడ దాచావు?
    Priya Bhavani Shankar: ఎవరు పాప నువ్వు.. ఇన్నాళ్లు ఇంత అందం ఎక్కడ దాచావు?
    తమిళ్ హీరోయిన్&nbsp; ప్రియా భవాని శంకర్ టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రెస్‌లో అదరగొట్టింది.&nbsp; సొగసైన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది&nbsp; వరుస ఆఫర్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ భామ వలపుల వయ్యారాలతో కుర్రకారును చిత్తుచేస్తుంది. తమిళ చిత్రాల్లోనే నటిస్తున్న ఈ నెరజాన… తెలుగులోనూ ఓ చిత్రంలోనూ నటించింది యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన కళ్యాణం కమనీయం మూవీలో హీరోయిన్‌గా మెప్పించింది 1989 డిసెంబర్ 31న జన్మించిన ఈ సొగసుల లేడీ.. తొలుత టీవీల్లో యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించింది. తమిళ్‌లో మేయదాన్ మాన్ ( మేయని జింక) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది ప్రియా భవాని శంకర్ జయంరవికి జంటగా నటించిన అఖిలన్‌, శింబుతో జతకట్టిన పత్తుతల, తాజాగా రాఘవలారెన్స్‌ సరసన నటించిన రుద్రన్‌ చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. తాజాగా ఎస్‌ జే సూర్య సరసన బొమ్మయ్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ప్రస్తుతం తమిళ్‌లో వరుసగా ఐదు చిత్రాల్లో నటిస్తోంది హరి డైరెక్షన్‌లో విశాల్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.
    జూన్ 19 , 2023
    Chatrapathi Review: యాక్షన్‌ సీన్స్‌లో దుమ్మురేపిన బెల్లంకొండ.. ఛత్రపతితో హిట్‌ కొట్టినట్టేనా?
    Chatrapathi Review: యాక్షన్‌ సీన్స్‌లో దుమ్మురేపిన బెల్లంకొండ.. ఛత్రపతితో హిట్‌ కొట్టినట్టేనా?
    నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, నుష్రత్‌ భరుచ్చా, కరణ్‌సింగ్‌ ఛబ్రా, సాహిల్ వేద్, అమీత్‌ శివదాస్‌, రాజేంద్ర గుప్త డైరెక్టర్‌: V.V. వినాయక్‌ సంగీతం: తనిష్క్‌ బాగ్చీ నిర్మాత : అక్షయ్‌, ధవల్‌, జయంతీ లాల్ టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి.. తెలుగులో సూపర్ హిట్టుగా నిలిచి ప్రభాస్‌కి మాస్ హీరో ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇదే సినిమాతో బాలీవుడ్‌లో మాస్ హీరోగా ఎదగడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ ని ఎంచుకున్నాడు. కాగా శ్రీనివాస్‌కు హిందీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు ఆయన చేసిన సినిమాలు హిందీలో డబ్‌ అయ్యి మంచి క్రేజ్‌ తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో దాన్ని మరింత పెంచుకునే క్రమంలో ఇవాళ ఛత్రపతి హిందీ సినిమా బాలీవుడ్‌లో రిలీజైంది. మరి సినిమా ఎలా ఉంది? శ్రీనివాస్‌ నటన ఆకట్టుకుందా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథ:&nbsp; ఛత్రపతి సినిమా కథ తెలుగు ప్రేక్షకలకు సుపరిచితమే. మారుమూల గ్రామంలో నివసించే మహిళ భాగ్యశ్రీకు ఇద్దరు పిల్లలు. అశోక్‌ (కరణ్‌ సింగ్‌ ఛబ్రా) సొంత బిడ్డ కాగా శివ (బెల్లంకొండ శ్రీనివాస్) పెంపుడు బిడ్డ. గ్రామంలోని వారంతా అనుకోకుండా ఊరిని ఖాళీ చేయాల్సి వస్తోంది. ఆ గందరళగోళంలో శివ తల్లి నుంచి వేరుపడతాడు. అప్పటినుంచి తన తల్లిని వేతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో శివకు హీరోయిన్‌ సాయం చేస్తుంది. అయితే రోజువారీ కూలీగా ఉన్న శివ ఛత్రపతిగా ఎలా మారాడు? తన తల్లిని చేరుకున్నాడా? లేడా? అన్నది మిగతా కథ. ఎవరెలా చేశారంటే? ఛత్రపతి హిందీ వెర్షన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ అదరగొట్టాడు. యాక్షన్‌ సీన్స్‌లో తన మార్క్‌ను చూపిస్తూ దుమ్మురేపాడు. శ్రీనివాస్‌ కండలు తిరిగిన దేహం.. యాక్షన్‌ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది. ఫైట్ సీన్ల కోసం ఆయన పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. కొన్ని సీన్లలో ఎంతో స్టైలిష్‌గాను హీరో కనిపించాడు. నటన, డ్యాన్స్‌తోనూ అదరగొట్టాడు. నటన పరంగా హీరోయిన్‌ నుష్రత్‌ భరుచ్చాకు పెద్ద స్కోపు లేదు. కేవలం పాటలకు మాత్రమే ఆమెను పరిమితం చేశారు. నెగిటివ్‌ క్యారెక్టర్‌లో కరణ్‌సింగ్‌ ఛబ్రా ఆకట్టుకున్నాడు. సీనియర్‌ నటి భాగ్య శ్రీ, శరద్‌ ఖేల్కర్‌, ఫ్రెడ్డీ ధరువాలా, రాజేష్‌ శర్మ తమ పాత్రల మేరకు నటించారు.&nbsp; విశ్లేషణ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ ఛత్రపతి గ్లింప్స్‌ను తిరిగి తీసుకురావడంలో విఫలమయ్యాడు. దశాబ్దం క్రితం వచ్చిన స్టోరీని ఇప్పటికీ అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుంటే బాగుండేది. ఇప్పటికే ఛ‌త్రపతి చూసిన వాళ్లకు సినిమా బోర్ కొట్టిస్తుంది. పాత కథనే మక్కీకి మక్కిగా తెర‌కెక్కించ‌డం మైనస్ అయ్యింది. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా సాగిపోతుంది. సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. సినిమాలో ఏదైనా హైలెట్‌ సీన్స్‌ ఉన్నాయంటే అది యాక్షన్‌ సీన్స్‌ మాత్రమేనని ఆడియన్స్ చెబుతున్నారు. 1980-90లో వచ్చిన బాలీవుడ్‌ సినిమాను చూసినట్లు అనిపించిందని పేర్కొంటున్నారు. ఇక ఒక్క మాట‌లో చెప్పాలంటే బాలీవుడ్ ఛ‌త్ర‌ప‌తి ఒక‌ అవుట్ డేటెడ్ సినిమా అనే చెప్పాలి. ఫైట్స్‌ తప్ప సినిమాలో ఏమాత్రం పస లేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ హీరో నటనయాక్షన్‌ సీన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ పాటలురొటిన్‌ సీన్స్‌బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ రేటింగ్‌: 2/5
    మే 12 , 2023
    Ponniyin Selvan-2 Review: పొన్నియన్‌ సెల్వన్‌ నటుల విశ్వరూపం… మణిరత్నం నుంచి మరో కళాఖండం!
    Ponniyin Selvan-2 Review: పొన్నియన్‌ సెల్వన్‌ నటుల విశ్వరూపం… మణిరత్నం నుంచి మరో కళాఖండం!
    తమిళ్‌ సూపర్ స్టార్లతో దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్‌కు బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు బాగుందంటే? కొందరు అర్థంకాలేదన్నారు. అయితే.. ఆ చిత్రంలో ఎన్నో ప్రశ్నలు విడిచిపెట్టారు దర్శకుడు. వాటన్నింటికి సమాధానం చెప్పేందుకు పొన్నియన్ సెల్వన్‌ 2ని తీర్చిదిద్దారు. గత నెల రోజుల నుంచి భారీగా ప్రమోషన్లు చేసిన ఈ చిత్రం విడుదలయ్యింది. మరీ, సినిమా విజయం సాధించిందా? మణిరత్నం మ్యాజిక్ పనిచేసిందా? అనేది సమీక్షిద్దాం. దర్శకుడు: మణిరత్నం నటీ నటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తీ, త్రిష, శోభితా, ఐశ్వర్య లక్ష్మి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్‌ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ కథేంటి? చోళ రాజ్య రాకుమారుడు అరుణ్మొళి ( జయం రవి ) ని అంతమెుందించడానికి జరిగిన కుట్రతో మెుదటి భాగం పూర్తవుతుంది. అతడు నిజంగానే చనిపోయాడా? లేదా సామంతరాజుల కుట్రలు తెలుసుకోవాలని వెళ్లిన వల్లవరాయుడు ( కార్తీ ) కాపాడాడా? తమ్ముడి మరణించినట్లు వస్తున్న వార్తలతో ఆదిత్య కరికాలుడు( విక్రమ్ ) ఏం చేశాడు ? చోళుల అంతం చూడాలని నందినీ( ఐశ్వర్య రాయ్‌ ) ఎందుకు అనుకుంటుంది? ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానమే పొన్నియన్ సెల్వన్‌ 2 కథ.&nbsp; ఎలా ఉంది మెగాస్టార్‌ వాయిస్‌ ఓవర్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అరుణ్మోళిని వల్లవరాయుడు, నందినీ, బుద్దిస్టులు కాపాడటంతో కథ మెుదలవుతుంది. కుట్ర విషయాన్ని తెలుసుకున్న ఆదిత్య కరికాలుడి ఎత్తుగడలతో చకచకా ముందుకు కదులుతుంది.&nbsp; ఆదిత్య కరికాలుడు- నందినీ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఇద్దరూ ఎదురుపడిన సంఘటన మరో లెవల్‌లో ఉంటుంది. చోళులను అంతం చేయాలని నందినీ ఎందుకు అనుకుంటుందనే సన్నివేశాలతో పాటు రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనుకునే పళవెట్టురాయర్‌ ఎత్తుగడలతో ఎక్కడా బోర్ కొట్టదు.&nbsp; త్రిష, ఐశ్వర్య రాయ్‌ ఇద్దరూ కలిసి కనిపించిన ఫ్రేమ్ చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నంత అందంగా మెరిశారు. సినిమా ప్రారంభమైన తర్వాత డీసెంట్ స్క్రీన్‌ప్లే వెళ్లినప్పటికీ కాస్త స్లో నరేషన్ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. ఇది మణిరత్నం స్టైల్‌ అయినప్పటికీ మరికొంత మెరుగ్గా ఉంటే బాగుండేదనే ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్‌ను త్వరగా ముగించాలని చేసినట్లు అనిపిస్తుంది. మరింత ఫోకస్ పెట్టి ఉంటే ప్రేక్షకులకు సినిమా ఎక్కువగా కనెక్ట్ అయ్యేది. ఎవరెలా చేశారు ? పొన్నియన్ సెల్వన్ 2లో విక్రమ్‌ తన విశ్వరూపం చూపించాడు. మెుదటిపార్ట్‌లో తక్కువ స్క్రీన్‌ స్పేస్‌ ఉన్నప్పటికీ ఇందులోనూ ఆయనదే హవా. మరో గుర్తుండిపోయే క్యారెక్టర్‌ అంటే ఐశ్వర్య రాయ్‌ అనే చెప్పాలి. నెగటివ్ షేడ్‌ ఉన్న పాత్రలోనూ నటించి మెప్పించింది. జయం రవి, కార్తీ తమ క్యారెక్టర్లకు ప్రాణం పోశారు. ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ మెుదటి భాగంలో చాలామంది కనెక్ట్ అయ్యేది వల్లవరాయన్ కార్తీ పాత్రతోనే. ప్రేక్షకులు ఈ సినిమాలోనూ ఆ క్యారెక్టర్‌తో ప్రయాణం చేస్తారు. త్రిష, శోభితా దూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి పాత్రల పరిధి మేరకు నటించారు.&nbsp; దర్శకుడు మణిరత్నం మెుదటి భాగంతో పోలిస్తే రెండో పార్ట్‌ను కాస్త మెరుగ్గా తీశారని చెప్పవచ్చు. సినిమాను నీట్‌గా హ్యాండిల్ చేశారు. స్లో నెరేషన్ చేసినప్పటికీ ప్రేక్షకులు విజయాన్ని కట్టబెట్టడం ఖాయమే.&nbsp; సాంకేతిక పనితీరు సినిమాకు హైలెట్‌గా నిలిచింది సినిమాటోగ్రఫీ. రవి వర్మన్ తన పనితీరుతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. దర్శకుడి ఊహా చిత్రాన్ని అచ్చుగుద్దినట్లుగా ప్రేక్షకులకు చూపించిన గొప్పతనం ఆయనకే దక్కుతుంది. ఎడిటింగ్‌ కూడా బాగుంది. నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.&nbsp; సినిమాకు సంగీతం ప్లస్ పాయింట్‌. ఈ చిత్రంలో ఏ. ఆర్‌.రెహమాన్‌ తన ప్రతిభ చూపించినప్పటికీ కొన్ని చోట్ల మరింత బాగుండాలి అనిపిస్తుంది. మెుత్తంగా ఫర్వాలేదనే చెప్పాలి. కానీ, రెహమాన్ నుంచి ఆశించినంత స్థాయిలో లేదు.&nbsp; బలాలు కథ, కథనం నటీనటులు సినిమాటోగ్రఫీ బలహీనతలు స్లో నరేషన్ రేటింగ్ : 3.25/5
    ఏప్రిల్ 28 , 2023
    MARCH 17 | ఈ వారం థియేటర్లు/ఓటీటీలో విడుదలయ్యే తెలుగు చిత్రాలు
    MARCH 17 | ఈ వారం థియేటర్లు/ఓటీటీలో విడుదలయ్యే తెలుగు చిత్రాలు
    గతవారం పూర్తిగా చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. ఈ సారి ప్రేక్షకులను అలరించేందుకు భారీ సినిమాలు వస్తున్నాయి. కేజీఎఫ్‌ రేంజ్ ట్రైలర్‌తో ఆకట్టుకున్న కబ్జ(Kabzaa) థియేటర్లలో సందడి చేయనుంది. అవసరాల శ్రీనివాస్‌, నాగ శౌర్య కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రాబోతుంది. భారీ చిత్రాలు ఓటీటీ వేదికగా సందడి చేయనున్నాయి.&nbsp; మల్టీస్టారర్ కబ్జ ఇండియన్‌ రియల్ స్టార్‌ ఉపేంద్ర, కిచ్చా సుదీప్, పునిత్ శివరాజ్‌ కుమార్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం కబ్జ. టీజర్ విడుదలైనప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ రేంజ్‌లో ట్రైలర్ ఉండటంతో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని అంటున్నారు. ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ జయంతి పురస్కరించుకొని మార్చి 17న విడుదల చేస్తున్నారు. https://www.youtube.com/watch?v=CHc1bsUKv4U హ్యాట్రిక్ మూవీ దర్శకుడు అవసరాల శ్రీనివాస్, హీరో నాగశౌర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఫలనా అబ్బాయి- ఫలనా అమ్మాయి. టి.జి విశ్వ ప్రసాద్, దాసరి పద్మ నిర్మాతలు. ఈ చిత్రం కూడా మార్చి 17న రిలీజ్ అవుతుంది. సినిమా అందరినీ అలరిస్తోందని చిత్రబృందం నమ్మకంతో ఉంది. https://www.youtube.com/watch?v=kX5vAM8TXzE ‘సార్‌’ సందడి ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఓటీటీలో విడుదలకు సిద్ధమయ్యింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉండనుంది.&nbsp; రైటర్ పద్మభూషణ్ రెడీ ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం ట్రైలర్‌తో హైప్ క్రియేట్ చేసి బాక్సాఫీస్ హిట్ కొట్టాడు సుహాస్. రైటర్ పద్మభూషణ్‌తో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనున్నాడు. మార్చి 17వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు&nbsp; Title CategoryLanguagePlatformRelease DateSathigani rendu ekaraluMovie&nbsp;Telugu&nbsp;Aha&nbsp;March 17Locked&nbsp;Series&nbsp;Telugu&nbsp;Aha&nbsp;March 17Money shotMovieEnglishNetflixMarch 15Kuthey&nbsp;Movie&nbsp;Hindi&nbsp;NetflixMarch 16Shadow and bone&nbsp;SeriesEnglish&nbsp;Netflix&nbsp;March 16Maestro&nbsp;Series&nbsp;English&nbsp;Netflix&nbsp;March 17In his shadow marchMovieEnglish&nbsp;Netflix&nbsp;March 17The magician elephant&nbsp;Animated MovieEnglishNetflix&nbsp;March 17Black adamMovieEnglish&nbsp;Prime videoMarch 15Dome&nbsp;Series&nbsp;English&nbsp;Prime video&nbsp;March 17Lock&nbsp;Movie&nbsp;Tamil&nbsp;Zee5&nbsp;March 17Pop kaun&nbsp;Series&nbsp;Hindi&nbsp;Disney+hoststarMarch 17Rocket boysSeries&nbsp;Hindi&nbsp;Sony livMarch 16
    మార్చి 14 , 2023
    <strong>Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన కన్నతల్లి.. విష్ణుకు సపోర్ట్‌గా స్టేట్‌మెంట్‌</strong>
    Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన కన్నతల్లి.. విష్ణుకు సపోర్ట్‌గా స్టేట్‌మెంట్‌
    మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రాచకొండ సీపీ వార్నింగ్‌తో కాస్త సద్దుమణిగిన ఈ వివాదం శనివారం (డిసెంబర్‌ 14) మరోమారు రాజుకుంది. పోలీసులు హెచ్చరించినా విష్ణు తనను తన కుటుంబాన్ని వేదిస్తున్నాడని మనోజ్‌ ఆరోపించాడు. ఇంట్లో వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో ఇన్‌వర్టర్‌లో షుగర్‌ వేసి పవర్ కట్స్‌కు కారణమయ్యాడని ప్రెస్‌నోట్‌ విడుదల చేశాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీనిపై మోహన్‌బాబు రెండో భార్య, మనోజ్‌ కన్నతల్లి నిర్మల తాజాగా స్పందించారు. మంచు మనోజ్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘విష్ణు గొడవ చేయలేదు’ మోహన్‌బాబు (Mohan Babu) ఫ్యామిలీ గొడవపై ఆయన భార్య నిర్మల (Manchu Nirmala) మెుదటిసారి రియాక్ట్‌ అయ్యారు. శనివారం నాడు మంచు మనోజ్‌ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వచ్చిన వార్తలపై స్పష్టతనిచ్చారు. ఈ మేరకు పహాడీ షరీఫ్‌ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు. ‘డిసెంబర్‌ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్‌పల్లిలోని మా ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్‌ చేశాడు. అయితే ఈ విషయంపై విష్ణు మీద మంచు మనోజ్‌ అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడు. ఈ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో పెద్ద కుమారుడు విష్ణుకీ అంతే హక్కు ఉంది. విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదు. మనోజ్‌ ఫిర్యాదులో నిజం లేదు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు కూడా మేమిక్కడ పనిచేయలేమని వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం లేదు’ అని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు.  https://twitter.com/FilmyBowl/status/1868917278437482648 మనోజ్‌ ప్రెస్‌నోట్‌లో ఏముందంటే? తన తల్లి నిర్మల పుట్టినరోజు సందర్భంగా శనివారం విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్లు మంచు మనోజ్‌ ఆదివారం (డిసెంబర్‌ 15) ఓ ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేశాడు. ‘నేను సినిమా షూటింగ్‌లో ఉన్నాను. కుమారుడి స్కూల్‌లో ఈవెంట్‌కు నా సతీమణి హాజరైంది. మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో నా సోదరుడు విష్ణు తన అనుచరులు, బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడు. జనరేటర్లలో షుగర్‌ పోయించాడు. దాంతో రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇంట్లో అమ్మ, తొమ్మిది నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. జనరేటర్లకు సమీపంలో వాహనాలు, గ్యాస్‌ కనెక్షన్‌ ఉంది. విష్ణు టీమ్‌ ఇంటి నుంచి వెళ్లిపోతూ నా వద్ద పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేసింది. నేను, నా కుటుంబం భయంతో బతుకుతున్నాం. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా’ అని మనోజ్‌ తన ప్రకటనలో తెలియజేశాడు. అలాగే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశాడు.  https://twitter.com/pakkatelugunewz/status/1868322391496999391 పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇదిలా ఉంటే సినీ నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీలో ఆయన చేరబోతున్నారంటూ ప్రధాన మీడియాల్లో కథనాలు ప్రసారమయ్యాయి. తన అత్త శోభా నాగిరెడ్డి జయంతి నేపథ్యంలో మనోజ్‌ సోమవారం భార్య, పిల్లలతో ఆళ్లగడ్డకు వచ్చారు. ఈ ఉదయం ఆళ్లగడ్డ సమీపంలోని అహోబిలం లక్ష్మీ నరసింహా స్వామిని మనోజ్‌ దంపతులు సందర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. దైవ దర్శనం అనంతరం మనోజ్‌ మీడియాతో మాట్లాడారు. తనను ఆదరిస్తున్న ఆళ్లగడ్డ ప్రజలు, ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ క్రమంలో జనసేనలో చేరికపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘నో కామెంట్స్‌’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. అయితే రాజకీయ ఎంట్రీని ఖండించకపోవడంతో త్వరలోనే ఆయన జనసేనలో చేరే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  https://twitter.com/abntelugutv/status/1868898831271968798 https://twitter.com/abntelugutv/status/1868886038598602791
    డిసెంబర్ 17 , 2024
    <strong>Sreeleela: టాలీవుడ్‌లో శ్రీలీల బౌన్స్‌బ్యాక్‌.. బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో!&nbsp;</strong>
    Sreeleela: టాలీవుడ్‌లో శ్రీలీల బౌన్స్‌బ్యాక్‌.. బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో!&nbsp;
    అతి కొద్ది కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించిన నటీమణుల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయమైంది. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ఆకట్టుకొని తెలుగులో వరుస ప్రాజెక్ట్స్‌ చేసింది. రవితేజ, రామ్‌, బాలకృష్ణ, నితీన్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌, మహేష్‌ బాబు చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. ‘భగవంత్‌ కేసరి’ మినహా ఆమె నటించిన చిత్రాలన్నీ నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో ఈ అమ్మడికి ఐరెన్‌ లెగ్‌ అన్న ముద్ర వేశారు. మహేష్‌ ‘గుంటూరు కారం’ తర్వాత పెద్దగా ఆఫర్లు కూడా రాకపోవడంతో శ్రీలీల కెరీర్‌ ఇక ముగిసినట్లేనని అంతా భావించారు. అయితే ‘పుష్ప 2’ కిస్సిక్‌ సాంగ్‌తో ఈ అమ్మడు మరోమారు బౌన్స్ బ్యాక్‌ అయ్యింది. వరుస ప్రాజెక్ట్స్‌ పట్టాలెక్కిస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. నాగచైతన్యకు జోడీగా.. నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా ‘విరూపాక్ష’ డైరెక్టర్‌ కార్తీక్‌ దండు (Karthik Dandu) ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. 'NC24' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్, SVC క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. మైథ‌లాజిక‌ల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా ఎంపికైనట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. తొలుత ఈ పాత్రకు మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary)ని అనుకున్నప్పటికీ శ్రీలీలను ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. లుక్స్‌ టెస్ట్‌ కూడా ఆదివారం (డిసెంబర్‌ 15) జరిగిందని, మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. దీంతో తెరపై చైతూ-శ్రీలీల జోడీ తెరపై ఎలాంటి మాయ చేస్తుందోనని ఇప్పటి నుంచే అక్కినేని ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు. https://twitter.com/klapboardpost/status/1868499773554409475 కోలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ.. ‘అమరన్‌’తో సాలిడ్‌ హిట్‌ అందుకున్న శివకార్తికేయన్‌ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. 'SK25' వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో నటుడు జయం రవి, అధర్వ కీలక పాత్రల పోషించనున్నారు. రూ.150 కోట్ల బడ్టెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలోనూ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను సైతం నిర్వహించారు. తమిళంలో శ్రీలీలకు ఇదే మెుట్ట మెుదటి ఫిల్మ్‌. డాన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆకాష్‌ భాస్కరన్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రానికి 'పురనానూరు' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పీరియాడికల్ యాక్షన్‌ డ్రామాగా ఇది రానున్నట్లు సమాచారం.  https://twitter.com/MovieTamil4/status/1868647066563686816 చేతి నిండా ప్రాజెక్ట్స్‌.. నితీన్‌ లేటెస్ట్‌ చిత్రం ‘రాబిన్‌హుడ్‌’ (Robin Hood)లోనూ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల కాబోతోంది. అలాగే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ - హరీశ్‌ శంకర్‌ కాంబోలో రూపొందుతున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustad Bhagat Singh) సినిమాలోనూ ఈ అమ్మడే హీరోయిన్‌. రవితేజ (Raviteja) హీరోగా నటిస్తోన్న 'మాస్‌ జాతర' (Mass Jathara) చిత్రంలోనూ శ్రీలీలనే హీరోయిన్‌గా చేస్తోంది. 'ధమాకా' (Dhamaka) తర్వాత వీరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం ఇది. ఇవి కాకుండా ప్రస్తుతం చర్చల దశలో మరో మూడు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అఖిల్ అక్కినేని (Akkineni Akhil) అప్‌కమింగ్‌ ఫిల్మ్‌లోనూ కథానాయికగా శ్రీలీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే నవీన్‌ పోలిశెట్టి (Naveen Polishetty) తీయబోయే నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌లోనూ శ్రీలీల నటించే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా రానున్న 'కోహినూర్‌' (Kohinur) చిత్రంలోనూ శ్రీలీల (Sreeleela) ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కువ ప్రాజెక్ట్స్‌ చేతిలో పెట్టుకొని శ్రీలీల దూకుడు ప్రదర్శిస్తోంది.  https://twitter.com/GulteOfficial/status/1868525815597850925
    డిసెంబర్ 16 , 2024
    <strong>Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్‌ సర్కార్‌ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?&nbsp;</strong>
    Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్‌ సర్కార్‌ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?&nbsp;
    తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్‌ (Tollywood)ను రేవంత్‌ సర్కార్‌ టార్గెట్‌ చేసిందా అన్న అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం నాగార్జున విషయంలో మెుదలైన ఈ ప్రచారం తాజాగా అల్లు అర్జున్‌ నేపథ్యంలో మరోమారు ఊపందుకుంది. రేపో మాపో మోహన్ బాబు అరెస్టు కూడా తథ్యం అన్న వార్తలు నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి కావాలనే ఇదంతా చేస్తున్నారన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలకు తన పవర్‌ ఏంటో రుచి చూపించాలని రేవంత్‌ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్‌ అరెస్టు సందర్భంగా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రేవంత్‌ ప్రభుత్వంలో ఇండస్ట్రీకి వ్యతిరేకంగా జరిగిన ఘటనలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  బన్నీ అరెస్టు నేపథ్యంలో.. అల్లు అర్జున్‌ (Allu Arrest) అరెస్టు నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సర్కార్‌ ఇండస్ట్రీని టార్గెట్ చేసిందా? అన్న అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతకుముందు రేవంత్‌ నుంచి ఎదురైన ప్రతీకూల సంఘటనలకు బన్నీ అరెస్టును ముడిపెట్టి చూసినప్పుడు ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. బన్నీ అరెస్టుపై నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం ఫిల్మ్‌ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ‘చట్టం ముందు అందరూ సమానులే’.. ‘సినిమావాళ్లు సరిహద్దుల్లో యుద్ధం ఏమీ చేయడంలేదు కదా’.. ‘నాకు నేనే సూపర్‌ స్టార్‌’ అంటూ చేసిన కామెంట్స్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గత ముఖ్యమంత్రులు ఇండస్ట్రీతో ఎంతో సామరస్యంగా ఉన్నారని, రేవంత్‌ ప్రభుత్వం మాత్రం తమపై కన్నెర్ర చేస్తోదంటూ పలువురు దర్శక నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.  https://twitter.com/profAIPC/status/1867584148153552902 https://twitter.com/narne_kumar06/status/1867753868052115915 మంచు ఫ్యామిలీ గొడవలోనూ.. ఇటీవల మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మంచు మనోజ్‌ (Manchu Manoj)తో పాటు మంచు విష్ణు (Manchu Vishnu), మోహన్‌బాబు (Mohan Babu) ఒకరిపై ఒకరు మీడియా ముఖంగా విమర్శలు చేసుకున్నారు. ప్రధాన మీడియా ఛానళ్లు ఈ ఫ్యామిలీ గొడవ గురించే చూపించింది. దీంతో తీవ్ర అసహనానికి లోనైనా మోహన్‌బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి సైతం చేశారు. దీనికి సంబంధించి ఆయనపై హత్య కేసు కూడా నమోదైంది. త్వరలో అరెస్టు కూడా చేస్తారని అంటున్నారు. అయితే మనోజ్‌తో వివాదం నేపథ్యంలో పోలీసులకు ముందే ఫిర్యాదు చేసిన వారు ప్రేక్షక పాత్ర వహించారని ఆడియో సందేశంలో మోహన్‌ బాబు అసహనం వ్యక్తం చేశారు. మనోజ్‌ కూడా పోలీసుల వ్యవహార తీరును తప్పుబట్టాడు. ఆపై రాచకొండ సీపీ మంచు విష్ణుతో పాటు, మంచు మనోజ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కూడా మీడియాలో హైలెట్ అయ్యింది.  డ్రగ్స్‌ కేసుల విషయంలో..&nbsp; కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో రేవంత్‌ సెలబ్రిటీ (Tollywood)లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటులు తప్పకుండా డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన వీడియోలు చేయాలని పిలుపునిచ్చారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ దుష్ఫలితాలపై అవగాహన కల్పించే విధంగా తారాగణంతో ఒకటిన్నర లేదా రెండు నిమిషాల నిడివితో వీడియో సినిమాకు ముందు ప్రదర్శించాలని కోరారు. అలా చేస్తేనే టికెట్ ధరల పెంపునకు, షూటింగ్‌లకు తమ ప్రభుత్వం అనుమతిస్తుందని హుకుం జారీ చేశారు. అయితే రేవంత్‌ ఇచ్చిన పిలుపు మంచిదే అయిన్పపటికీ ఆయన ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడటం చాలా మంది దర్శక నిర్మాతలకు నచ్చలేదని అప్పట్లో టాక్ వినిపించింది.&nbsp; https://twitter.com/Telugu360/status/1808059015038959963 గద్దర్ అవార్డ్స్‌ సందర్భంలో.. సి. నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలోనూ మరోమారు టాలీవుడ్‌ (Tollywood)పై సీఎం రేవంత్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గద్దర్‌ అవార్డులపై రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై మండిపడ్డారు. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయించింది. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని సీఎం రేవంత్‌ కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడాన్ని జులైలో జరిగిన సి. నారాయణ రెడ్డి జయంతి వేడుకల్లో రేవంత్‌ రెడ్డి తప్పుబట్టారు. గద్దర్‌పై గౌరవంతో తీసుకున్న ఈ నిర్ణయంపై టాలీవుడ్‌ పెద్దల నుంచి స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు. ఓ బహిరంగ సమావేశంలో రేవంత్‌ మరోమారు టాలీవుడ్‌పై విమర్శలు చేయడం అప్పట్లో వార్తల్లో హైలెట్ అయ్యింది. https://twitter.com/M9News_/status/1818214759227118067 ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత చెరువులు, కుంటలను ఆక్రమించి భవనాలను నిర్మించిన అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలినాళ్లలో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ భవనాన్ని ప్రభుత్వ అధికారులు ఆగమేఘాల మీద కూల్చివేయడం అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రూ.వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారన్న ఆరోపణలతో ఆయనపై క్రిమినల్ కేసును సైతం పోలీసులు నమోదు చేశారు. దీనిని కక్ష్యసాధింపు చర్యగా విపక్షాలు ఆరోపించాయి. దురుద్దేశ్యంతోనే నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశారని మండిపడ్డాయి.  https://twitter.com/sudhakarudumula/status/1827197076960375266 సమంతపై కాంగ్రెస్‌ మంత్రి వ్యాఖ్యలు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR)ను టార్గెట్‌ చేస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య - సమంత విడాకుల అంశాన్ని కేటీఆర్‌తో ముడిపెడుతూ దారుణంగా మాట్లాడారు. దీనిని అక్కినేని కుటుంబంతో పాటు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్‌ టార్గెట్‌ చేసుకోవడం సిగ్గు చేటని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహేష్‌ బాబు ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దీనికి సంబంధించి సదరు మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా వేయగా ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.  https://twitter.com/KDRtweets/status/1841433938297807337
    డిసెంబర్ 14 , 2024
    <strong>Shraddha Arya: పండంటి కవలలకు జన్మనిచ్చిన తెలుగు హీరోయిన్‌.. ఆమెను గుర్తుపట్టారా?</strong>
    Shraddha Arya: పండంటి కవలలకు జన్మనిచ్చిన తెలుగు హీరోయిన్‌.. ఆమెను గుర్తుపట్టారా?
    తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన శ్రద్ధా ఆర్య (Shraddha Arya) పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేసి మరి తెలియజేసింది.&nbsp; https://twitter.com/indiaforums/status/1863856572520362279 నవంబర్‌ 29న ఒక అమ్మాయి, అబ్బాయికి జన్మనిచ్చినట్లు శ్రద్ధా స్పష్టత ఇచ్చింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.&nbsp; 2021లో నేవీ అధికారి రాహుల్‌ నగల్‌ను శ్రద్ధా పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో తాను కడుపుతో ఉన్నట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది.&nbsp; శ్రద్ధా ఆర్య (Shraddha Arya) విషయాలకు వస్తే ఆమె 1987 ఆగస్టు 17న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించింది. ముంబయి యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ చేసింది. సినిమాల్లోకి రాకముందు బుల్లితెరపై శ్రద్ధా ఆర్య మెరిసింది. జీ టీవీ (హిందీ)లో వచ్చిన 'ఇండియాస్‌ బెస్ట్‌ సినీ స్టార్స్‌ కి కోజ్‌' షోలో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.&nbsp; ప్రముఖ నటుడు ఎస్‌.జే.సూర్య హీరోగా చేసిన తమిళ చిత్రం 'కల్వనిన్‌ కాదలి' (2006) సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.&nbsp; ఆ తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'నిశబ్ద్‌' (2007) సినిమాలో నటించింది. అందులో రీతు ఆనంద్‌ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. అదే ఏడాది 'గొడవ' (Godava) అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు శ్రద్ధా పరిచయమైంది. ఇందులో వైభవ్‌కు జోడీగా అంజలి పాత్రలో మెరిసింది.&nbsp; ఆ తర్వాత తెలుగులో ‘కోతి మూక’ (Kothi Muka), ‘రోమియో’ (Romeo) వంటి చిత్రాల్లో శ్రద్ధా నటించింది. అయితే అవేమి పెద్దగా సక్సెస్‌ కాకపోవడంతో టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు.&nbsp; దీంతో మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లి పోయిన శ్రద్ధా.. అక్కడ షాహిద్‌ కపూర్‌తో కలిసి 'పాఠశాల' (2010) సినిమా చేసింది. అందులో నటాషా సింగ్‌ పాత్రలో తళుక్కుమంది.&nbsp; ఆ తర్వాత కన్నడలో అడుగుపెట్టిన ఆమె అక్కడ 'డబుల్‌ డెక్కర్‌', 'మదువే మానే' చిత్రాలు చేసింది. పంజాబిలో 'బంజారా' (2018) ఫిల్మ్‌లోనూ నటించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే సీరియల్స్‌లోనూ శ్రద్ధా ఆర్య నటించింది. 'ష్‌ష్‌ష్‌.. పిర్‌ కోయి హై' (2008) అనే హిందీ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.&nbsp; 'మెయిన్ లక్ష్మీ తేరే ఆంగన్ కీ', ‘డ్రీమ్‌ గర్ల్‌’, ‘కసమ్‌ తేరే ప్యార్‌ కి’, ‘కుండలి భాగ్య’ వంటి సీరియల్స్‌లో నటించి మరింత పాపులర్ అయ్యింది.&nbsp; సినిమాలు, సీరియల్స్‌తో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్ సైతం శ్రద్ధా ఆర్య చేసింది. జీనా, సోనియో హిరియే, మెరీ జాన్‌, పీకే, కార్ గబ్రూ ది తదితర 10 మ్యూజిక్‌ వీడియోలు చేసింది.&nbsp; శ్రద్ధా ఆర్య వ్యక్తిగత విషయాలకు వస్తే పెళ్లికి ముందు ఆమె ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. 2015లో తొలుత ఎన్నారై జయంత్‌ రట్టితో నిశ్చితార్థం చేసుకుంది. అనివార్య కారణాలతో దాన్ని రద్దు చేసుకుంది.&nbsp; ఆ తర్వాత 2019లో అలం సింగ్‌ మక్కర్‌తో రిలేషన్‌ షిప్‌లో అడుగుపెట్టింది. వారిద్దరు ‘నాచ్‌ బలియే’ (Nach Baliye) అనే డ్యాన్స్‌ షోలో కపుల్స్‌గా పోటీ చేశారు. షో పూర్తయ్యే సరికి వారి బంధం కూడా ముగిసింది.&nbsp; ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌, టెలివిజన్ షోలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్‌ను శ్రద్ధా ఎంజాయ్‌ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరుచూ ఫొటోలు పెడుతూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.&nbsp;
    డిసెంబర్ 03 , 2024
    <strong>Bandla Ganesh: ‘టికెట్ల రేటు పెంపునకే సీఎం కావాలి’.. ప్రభాస్‌, తారక్‌కు బండ్ల గణేష్‌ చురకలు!&nbsp;</strong>
    Bandla Ganesh: ‘టికెట్ల రేటు పెంపునకే సీఎం కావాలి’.. ప్రభాస్‌, తారక్‌కు బండ్ల గణేష్‌ చురకలు!&nbsp;
    ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ (Bandla Ganesh) ఏదోక కామెంట్స్‌ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. న్యూస్‌ చానళ్లు, సోషల్‌ మీడియా వేదికగా పలు రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు బాహాటంగా మద్దతు తెలుపుతూ హాట్‌ టాపిక్‌గా మారుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్‌ మీడియాలో బండ్ల గణేష్‌ సంచలన పోస్టు పెట్టారు. శుక్రవారం (నవంబర్‌ 9) తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పుట్టిన రోజు నేపథ్యంలో టాలీవుడ్‌ సెలబ్రిటీలను టార్గెట్‌ చేశారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి మాత్రమే సీఎం కావాలని సినీ ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.&nbsp; టాలీవుడ్‌పై బండ్ల గణేష్‌ ఫైర్‌! తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి నవంబర్‌ 8న ఘనంగా పుట్టిన రోజు జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒకరిద్దరు మినహా తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్దగా రెస్పాన్స్‌ రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ రేవంత్‌ రెడ్డికి ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన బండ్ల గణేష్‌ సినీ పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.&nbsp; ‘గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది.&nbsp; https://twitter.com/ganeshbandla/status/1855087509103165519 తారక్‌, ప్రభాస్‌కు చురకలు? తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్య గ్యాప్‌ వచ్చినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే మెయిన్‌గా టికెట్ల రేటు పెంపు విషయాన్ని బండ్ల గణేష్‌ ప్రస్తావించడం చర్చకు తావిస్తోంది. స్టార్ హీరోలు ప్రభాస్‌, జూ.ఎన్టీఆర్‌లను టార్గెట్‌ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’, తారక్‌ చేసిన ‘దేవర’ చిత్రాలు టికెట్ పెంపునకు తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్‌ చేసుకున్నాయి. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. అయితే శుక్రవారం రేవంత్‌ రెడ్డి బర్త్‌డే సందర్బంగా తారక్‌, ప్రభాస్‌ నుంచి ఎలాంటి విషింగ్ పోస్టు రాలేదు. దీంతో బండ్ల గణేష్‌ వారిద్దరిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.&nbsp; విష్‌ చేసిన స్టార్స్‌ వీరే! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. 'రానున్న సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి. ప్రజాసేవలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అటు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సైతం రేవంత్‌ రెడ్డిని విష్‌ చేశారు. దేవుడు మీకు ఆరోగ్యాన్నివ్వాలని, రాష్ట్రాన్ని మరింత సుభిక్షం వైపు నడిపించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ (Ramcharan) సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. సూపర్ స్టార్ మహేష్‌ బాబు (Mahesh Babu) కూడా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. రేవంత్‌ రెడ్డి లీడర్‌షిప్‌ను ప్రశంసించాడు. https://twitter.com/KChiruTweets/status/1854736624749625361 https://twitter.com/PawanKalyan/status/1854776671339262428 https://twitter.com/AlwaysRamCharan/status/1854859851509141522 https://twitter.com/urstrulyMahesh/status/1854818024030929039 నంది అవార్డుల విషయంలో రగడ! ఈ ఏడాది జనవరిలో గద్దర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్‌ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. రేవంత్‌ ఈ ప్రకటన చేసి ఆరేడు నెలలు గడిచినా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ క్రమంలో ఓ వేదికపై మాట్లాడిన సీఎం రేవంత్‌ రెడ్డి, సినీ పెద్దల మౌనంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు సినీ నటుడు నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత, అతడి ఫ్యామిలీపై కాంగ్రెస్‌ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు టాలీవుడ్‌ను కుదిపేశాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంతో సినీ పెద్దలు ‌అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.&nbsp; https://twitter.com/RamMohanINC/status/1752717581834916020
    నవంబర్ 09 , 2024
    <strong>Prabhas Documentary: మెుగల్తూరు టూ పాన్ ఇండియా స్టార్‌.. ప్రభాస్‌పై అదిరిపోయే డాక్యూమెంటరీ!</strong>
    Prabhas Documentary: మెుగల్తూరు టూ పాన్ ఇండియా స్టార్‌.. ప్రభాస్‌పై అదిరిపోయే డాక్యూమెంటరీ!
    దేశంలోని అగ్ర కథనాయికల్లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కచ్చితంగా టాప్‌ ప్లేస్‌లో ఉంటాడు. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు ప్రభాస్‌. నిలకడగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నాడు. ఏ కథనాయకుడికి అందనంత ఎత్తులో డార్లింగ్‌ నిలిచాడు. అటువంటి ప్రభాస్‌కు ఏ తెలుగు హీరోకు దక్కని అరుదైన గౌరవం లభించనున్నట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేసేలా ఓ డాక్యుమెంటరీ రూపొందనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. సమగ్ర సమాచారంతో డాక్యుమెంటరీ! ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee 5) ప్రభాస్‌ డాక్యుమెంటరీని ప్లాన్‌ చేస్తున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వర్క్‌ను కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. అందుకోసం ప్రభాస్ సొంత ఊరైన మొగల్తూరుకు వెళ్ళి అక్కడ గ్రామస్థులతో డాక్యుమెంటరీ బృందం మాట్లాడనుందట. అలాగే ప్రభాస్‌తో చేసిన నటులు, డైరెక్టర్లు, ఫ్రెండ్స్ అభియాలను కూడా వీడియోల రూపంలో సేకరించనుందట. అందుకు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాదాపు వచ్చే ఏడాది ఆఖరిలో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ డాక్యుమెంటరీపై ఇప్పటినుంచే అందరిలో ఆసక్తి ఏర్పడింది.&nbsp; రాజమౌళిపై సైతం దర్శకధీరుడు రాజమౌళి సాధించిన ఘనతలపై ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ సైతం ఓ డాక్యుమెంటరీ చేసింది. ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో ఆగస్టు 2 నుంచి దీనిని స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ప్రభాస్‌, రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌లు రాజమౌళితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పని విషయంలో ఆయన ఎంత కఠినంగా ఉంటారో కూడా ఫన్నీగా తెలియజేశారు. అటు రాజమౌళి భార్య రమా రాజమౌళి, సంగీతం దర్శకుడు కీరవాణి సైతం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీకి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. రాజమౌళి సినిమాలలాగే ఆయన వ్యక్తిత్వం కూడా ఇంత గొప్పగా ఉంటుందా అని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.&nbsp; ప్రభాస్‌కు విలన్‌గా గోపిచంద్‌! ప్రభాస్‌, గోపిచంద్‌ మధ్య మంచి ప్రెండ్‌షిప్‌ ఉంది. వీరిద్దరూ ప్రత్యర్థులుగా చేసిన వర్షం సినిమా అప్పట్లో బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇటీవల విశ్వం మూవీ ప్రమోషన్స్‌ సందర్భంగా గోపిచంద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌కు విలన్‌గా చేసే ఛాన్స్‌ వస్తే నటిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడి రంగంలోకి దిగినట్లు ఇండస్ట్రీలో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్‌ పాత్ర కోసం గోపిచంద్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే గోపిచంద్‌ మాత్రం తన నిర్ణయాన్ని తెలియజేయలేదని టాక్‌. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం.&nbsp; ప్రభాస్‌ బర్త్‌డే కానుక ప్రభాస్‌ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘ఈశ్వర్‌’. 22ఏండ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం మాస్‌ హీరోగా ప్రభాస్‌కి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చింది. జయంత్‌ సి.పరాంజీ ప్రభాస్‌లోని మాస్‌ యాంగిల్‌ని తొలి సినిమాతోనే అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ నెల 23న ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘ఈశ్వర్‌’ చిత్రం గ్రాండ్‌గా రీరిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ని కొత్తగా కట్‌ చేసి రిలీజ్‌ చేశారు. ‘రీ ఇంట్రడ్యూసింగ్‌ ప్రభాస్‌’ అంటూ వదిలిన ‘ఈశ్వర్‌’ ట్రైలర్‌ ఇప్పడు అందర్నీ ఆకట్టుకుంటోంది.&nbsp; https://www.youtube.com/watch?v=gTA9ghC4ehs
    అక్టోబర్ 15 , 2024
    <strong>Celebrities Weddings &amp; Divorce: ఓవైపు పెళ్లిళ్లు మరోవైపు విడాకులు.. చిత్ర పరిశ్రమలో ఏంటీ విచిత్రం?</strong>
    Celebrities Weddings &amp; Divorce: ఓవైపు పెళ్లిళ్లు మరోవైపు విడాకులు.. చిత్ర పరిశ్రమలో ఏంటీ విచిత్రం?
    భారతీయ సమాజ వ్యవస్థలో వివాహం అనేది ఎంతో కీలకమైంది. పాశ్చాత్య దేశాలను భారత్‌ను ప్రధానంగా వేరు చేసే అంశాల్లో వివాహం కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. కలకాలం ఎంతో హాయిగా జీవించాలనే లక్ష్యంతో కొత్త జంట వైవాహిక బంధంలోకి అడుగుపెతుంటారు. చిత్ర పరిశ్రమలోనూ చాలా మంది సెలబ్రిటీలు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు ఏది చేసినా అది సెన్సేషన్ అయిపోతుంటుంది. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌ చేసినా, పెళ్లి చేసుకున్నా లేదా విడాకులు తీసుకున్నా అవి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. కొన్ని దశాబ్దాల చిత్ర పరిశ్రమ చరిత్ర తీసుకుంటే పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీల కంటే విడిపోయే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. తాజాగా స్టార్‌ హీరో సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి వివాహం చేసుకున్న నేపథ్యంలో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది.&nbsp; [toc] వైభవంగా సిద్ధార్థ్‌ వివాహం నటుడు సిద్ధార్థ్‌ (Siddharth), నటి అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ అదు సిద్ధు’ అని అదితి క్యాప్షన్‌ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. మహా సముద్రం షూటింగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది క్రమేణా ప్రేమగా మారింది. ఎక్కడ చూసిన ఈ ఇద్దరు తారలు జంటగా కనిపించేవారు. దీంతో వీరి పెళ్లిపై చాలా కాలం నుంచే రూమర్లు వచ్చాయి. తాజాగా పెళ్లి చేసుకొని ఆ రూమర్లకు సిద్ధార్థ్‌ - అదితి జంట చెక్‌ పెట్టింది.  https://twitter.com/UnrealAkanksha/status/1835569675968602477 ఓవైపు పెళ్లిళ్లు.. యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రముఖ నటి శోభితా దూళిపాళను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలేే ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. చైతూ తండ్రి అక్కినేని నాగార్జున తొలిసారి వీరి నిశ్చితార్థ ఫొటోలను నెట్టింట షేర్‌ చేయడంతో విషయం బయటకు వచ్చింది. యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం కూడా ఇటీవల వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే చైతన్య గతంలో స్టార్‌ హీరోయిన్‌ సమంతను వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు.  ‘రాజావారు రాణిగారు’ చిత్రంలో తనకు జోడీగా చేసిన రహస్య గోరఖ్‌ను ఇటీవల పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. గతేడాది మెగా హీరో వరుణ్‌ తేజ్‌,  హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి అంగరంగ వైభంగా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకొని ఈ జంట ఆకట్టుకుంది.  https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531 https://twitter.com/AadhanTelugu/status/1826816125809647850 మరోవైపు విడాకులు ఓవైపు సెలబ్రిటీలు ఎంత ఫాస్ట్‌గా వివాహం చేసుకుంటున్నారో అదే విధంగా తమ భాగస్వామికి విడాకులు ప్రకటిస్తూ షాక్ ఇస్తున్నారు. రీసెంట్‌గా తమిళ స్టార్‌ నటుడు జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచాడు. తనకు తెలియకుండానే విడాకులపై అనౌన్స్‌మెంట్‌ చేశారని ఆయన భార్య ఆర్తి అతడిపై మండిపడటంతో ఈ వ్యవహారంలో ట్విస్ట్ ఏర్పడింది. ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్‌ తన భార్య, రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రముఖ నటుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ జి.వి. ప్రకాష్‌ కూడా పదేళ్ల వైవాహిక బంధానికి చెక్‌ పెట్టి తన భార్య, సింగర్‌ సైంధవికి విడాకులు ఇచ్చారు. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల కూడా గతేడాది తన భర్త చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే పెళ్లిచేసుకోవడం, విడిపోవడం ‌అనేది వారి వ్యక్తిగత విషయాలే అయినప్పటికీ గతంతో పోలిస్తే ఇవి ఎక్కువ కావడం చర్చకు తావిస్తోంది.  గతంలో విడాకులు తీసుకున్న పాపులర్‌ సెలబ్రిటీలు నాగార్జున - లక్ష్మీ దగ్గుబాటి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మెుదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె సినీ హీరో వెంకటేష్ (Venkatesh), నిర్మాత సురేష్ బాబుల సోదరి. వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి వీరు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం. పవన్‌ కల్యాణ్‌ - రేణూ దేశాయ్‌ పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. తొలి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి రేణూ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు. రష్యాకు చెందిన అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఆమెతో జీవిస్తున్నారు.&nbsp; సుమంత్‌ - కీర్తి రెడ్డి నాగార్జున మేనల్లుడు సురేంద్ర యార్లగడ్డ -సత్యవతిల కుమారుడైన నటుడు సుమంత్ (Sumanth) కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగా ‘తొలి ప్రేమ’ ఫేమ్‌ హీరోయిన్‌ కీర్తి రెడ్డిని ప్రేమించి 2004 ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్‌గానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు. అమీర్ ఖాన్ - కిరణ్ రావు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్ ఖాన్ తన మొదటి భార్యతో విడాకుల తర్వాత డిసెంబరు 28, 2015న కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావు ఖాన్ అనే అబ్బాయి ఉన్నాడు. 16 సంవత్సరాల వివాహ బంధం తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.&nbsp; మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ అర్బాజ్ ఖాన్, నటి మలైకా అరోరా 1998లో వివాహం చేసుకున్నారు. వారికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు 2002లో జన్మించాడు. ఈ జంట 28 మార్చి 2016న విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 మే 2017న అధికారికంగా విడాకులు తీసుకున్నారు. హృతిక్ రోషన్ - సుసానే ఖాన్ బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్ రోషన్‌, సుస్సేన్ 20 డిసెంబర్ 2000న వివాహం చేసుకున్నారు. 14 సంవత్సరాల వివాహం తర్వాత ఈ జంట 2014లో పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు. కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్ కరిష్మా, సంజయ్ 2003లో వివాహం చేసుకున్నారు. అనేక విభేదాలు, ఆరోపణల కారణంగా ఈ జంట 2014లో అధికారికంగా విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైఫ్​ అలీఖాన్​ - అమృతా సైఫ్ అలీఖాన్ 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్​ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. భరణంగా అమృతాకు ఆస్తిలో సగం వాటా ఇచ్చారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‏ను రెండో వివాహం చేసుకున్నారు. సంజయ్‌ దత్‌ - రిచా శర్మ 1987లో నటి రిచా శర్మతో సంజయ్​ దత్​ వివాహం జరిగింది. 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్‏తో మృతి చెందింది. వీరికి త్రిషాలా కూతురు. 1998లో మోడల్ రియా పిళ్లైతో రెండో పెళ్లి జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. 2008లో మాన్యతా దత్​ను గోవాలో మూడో పెళ్లి చేసుకున్నారు సంజయ్.&nbsp;
    సెప్టెంబర్ 16 , 2024
    <strong>Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!</strong>
    Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్లలోనూ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. హాలీవుడ్‌ రేంజ్‌ విజువల్స్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నటీనటుల గెటప్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ స్థాయి సక్సెస్‌ కల్కి టీమ్‌కు అంత ఈజీగా రాలేదు. దీని వెనక అంతులేని శ్రమ దాగుంది. కల్కి చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ (Secrets of Kalki 2898 AD) తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; 40 ఏళ్ల తర్వాత.. కల్కి సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ (KALKI 2898 AD Hidden Truth) ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాష్కిన్‌ అనే ప్రతినాయకుడి పాత్రలో కమల్‌హాసన్‌ కనిపించారు. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఈ సినిమాలో నటించారట. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’ అనే సినిమాలో చివరిగా అమితాబ్, కమల్‌ నటించారు. ఆ తర్వాత మళ్లీ కల్కిలోనే వీరిద్దరు కలిసి పనిచేశారు.&nbsp; కమల్‌ లుక్‌ కష్టాలు.. ‘కల్కి 2898 ఏడీ’ కమల్‌ హాసన్‌ చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. ఈ లుక్‌ ఫైనల్‌ చేసే క్రమంలో ఎన్నో గెటప్‌లను పరిశీలించారట. దేనితోనూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సంతృప్తి చెందలేదట. చివరకు లాస్‌ ఏంజెల్స్ వెళ్లి అక్కడ హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసే మేకప్‌ నిపుణులను కల్కి టీమ్‌ సంప్రదించట. అలా కమల్‌ హాసన్‌ ప్రస్తుత లుక్‌ బయటకొచ్చిందని సినీ వర్గాలు తెలిపాయి.&nbsp; మేకప్‌కు కోసం 5 గంటలు కల్కి సినిమాలో అశ్వత్థామ గెటప్‌ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. 81 ఏళ్ల వయసున్న అమితాబ్‌ బచ్చన్‌&nbsp; (Amitabh Bachchan) ఈ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. అయితే అశ్వత్థామ మేకప్ వేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేదని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇక తీయడానికి మరో 2 గంటలు పట్టేదట. దీంతో అమితాబ్‌ మేకప్‌ కోసమే అచ్చంగా 5 గంటల సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బుజ్జి కోసం రూ.4 కోట్లు ‘కల్కి’లో ప్రభాస్‌ రైడ్‌ చేసిన ‘బుజ్జి’ (KALKI 2898 AD Hidden Truth) అనే ఫ్యూచరిక్‌ వెహికల్‌ను ఎంతో కష్టపడి చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. బుజ్జి తయారీకి మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ టీమ్‌ సహకారం అందించింది. ఈ ఒక్క కారు కోసమే రూ.4కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.&nbsp; 700VFX షాట్స్‌ కల్కి సినిమాలో కాశీ, శంబల, కాంప్లెక్స్‌ అనే మూడు ఫ్యూచరిక్‌ ప్రపంచాలను డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ క్రియేట్‌ చేశారు. కాశీని నిర్జీవంగా.. శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. పుష్కలమైన వనరులను కలిగినట్లు కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. ఇలా చూపించేందుకు మెుత్తం వీఎఫ్‌ఎక్స్‌నే ఉపయోగించారు. ఇందుకోసం 700 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉపయోగించినట్లు సమాచారం.&nbsp; హాలీవుడ్‌ యంత్రాంగం ‘కల్కి 2898 ఏడీ’ విజువల్‌ వండర్‌గా ఉందంటూ పెద్ద ఎత్తున టాక్‌ వస్తోంది. హాలీవుడ్‌ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలు ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణం. ప్రముఖ హాలీవుడ్‌ చిత్రాలైన హ్యారీ పోటర్‌, ఇంటర్‌స్టెల్లర్‌, డ్యూన్‌, బ్లేడ్‌ రన్నర్‌ వంటి భారీ హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన VFX టీమ్‌ ‘కల్కి’ కోసం పనిచేసింది. రికార్డు స్థాయి బడ్జెట్‌ భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌ (KALKI 2898 AD Hidden Truth)తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ.600 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు వేతనాలు, సెట్స్‌కు అయిన ఖర్చు కంటే.. నాణ్యమైన విజువల్స్‌, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ కోసమే ఎక్కువ మెుత్తం ఖర్చు చేశారట. https://telugu.yousay.tv/kalki-2898-ad-review-kalki-which-raised-the-level-of-indian-cinema-immensely-how-is-the-movie.html#google_vignette
    జూన్ 27 , 2024

    @2021 KTree