• TFIDB EN
 • కల్కి 2898 ఎ.డి
  రేటింగ్ లేదు
  No Dateమీకు ఈ సినిమా చూడాలనే ఆసక్తి ఉందా?
  ఆసక్తి
  U/ATelugu
  ఫ్రాథమికంగా ట్రైలర్‌ను బట్టి... భైరవ(ప్రభాస్) కాశీలో కిరాయి డబ్బుల కోసం ఏదైన పనిచేసే రౌడీలా ఉంటాడు. అయితే ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్న ఓ దుష్ట శక్తికి అశ్వద్ధామా నుంచి ఓ అవాంతరం ఏర్పడుతుంది. అతన్ని ఎదుర్కొనేందుకు భైరవకు పెద్ద మొత్తంలో ఆక్సీజన్, వాటర్ యూనిట్లను దుష్ట శక్తి ఆఫర్ చేస్తుంది. మరి భైరవా అశ్వద్ధామను ఎలా ఎదుర్కొన్నాడు. అశ్వద్ధామా ఎవరిని కాపాడుతున్నాడు? దుష్ట శక్తికి సాయం చేస్తున్న భైరవ ప్రపంచ శాంతి కోసం మారాడా? అనేది కథ అని సమాచారం.
  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్ సూన్‌ ఆన్‌Netflix| తేదీని ప్రకటించాలి
  2024 June 155 days ago
  కల్కి 2898AD నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో (జూన్15) విడుదలైంది. జూన్ 16న ఫుల్ వీడియో విడుదల కానుంది.
  2024 Mar 292 months ago
  హిందీ సహా దక్షిణాది భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.325 కోట్లకు దక్కించుకున్నట్లు టాక్. ఇది బడ్జెట్‌లో సగం కంటే ఎక్కువ.
  తారాగణం
  ప్రభాస్
  కల్కి
  అమితాబ్ బచ్చన్
  అశ్వత్థామ
  కమల్ హాసన్
  కలి
  దీపికా పదుకొనే
  పద్మ
  దిశా పటాని
  పశుపతి
  సిబ్బంది
  నాగ్ అశ్విన్
  దర్శకుడు
  సి. అశ్వని దత్
  నిర్మాత
  నాగ్ అశ్విన్రచయిత
  సంతోష్ నారాయణన్
  సంగీతకారుడు
  జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్సినిమాటోగ్రాఫర్
  కోటగిరి వెంకటేశ్వరరావు
  ఎడిటర్ర్
  ఎడిటోరియల్ లిస్ట్
  కథనాలు
  Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్‌.. పురాణాల్లో ఆ పాత్ర గురించి ఏముందో తెలుసా?
  Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్‌.. పురాణాల్లో ఆ పాత్ర గురించి ఏముందో తెలుసా?
  రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఎ.డి (Kalki 2898 AD). బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రచార గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ మూవీలో అమితాబ్‌ అశ్వత్థామ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పురణాల్లో ఆ పాత్రకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకునేందు ఆడియన్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు.  అశ్వత్థామ ఎవరంటే? ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నట్లు తెలిసినప్పటీ నుంచి ఆయన పోషిస్తున్న పాత్రపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. పురణాల్లోని ఓ కీలక పాత్రలో ఆయన కనిపిస్తారని లీక్స్‌ కూడా వచ్చాయి. అందుకు తగ్గట్లే ఆయన ‘అశ్వత్థామ’ పాత్రలో నటించనునట్లు మూవీ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ పాత్రపై బజ్‌ ఏర్పడింది. పురణాల ప్రకారం.. మహాభారతంలో అశ్వత్థామ ద్రోణుని కుమారుడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేత అశ్వత్థామ శపించబడతాడు. ప్రపంచం అంతమయ్యే వరకు అశ్వత్థామ.. తనకి ఉన్న గాయాలతో రక్తం, చీము కారుతూ, నిత్యం రగులుతూ బ్రతికే ఉండాలని శపిస్తాడు. ఈ శాపంతో అశ్వత్థామ ఇప్పటికి బ్రతికే ఉన్నాడని, గాయాలు నుంచి శ్రవించే రక్తం కనిపించకుండా ఒంటి నిండా బట్ట చుట్టుకొని ఉంటాడని సనాతన ధర్మ గురువులు చెబుతుంటారు. తాజాగా విడుదలైన అమితాబ్‌ లుక్స్‌ అచ్చం అలాగే ఉండటం గమనార్హం. గ్లింప్స్‌లో ఏముంది? కల్కిలో అశ్వత్థామను పరిచయం చేస్తూ ఆదివారం ఓ ఆసక్తికర వీడియోను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో ‘నీకు మరణం లేదా? నువ్వు దేవుడివా? నువ్వు ఎవరు?’ అంటూ ఓ చిన్నారి అమితాబ్‌ను ప్రశ్నిస్తాడు. అప్పుడు అమితాబ్‌ తన పాత్రను పరిచయం చేస్తాడు. ‘అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. నేను గురు ద్రోణాచార్య కొడుకు అశ్వత్థామ’ అని బాలుడితో చెప్పి బిగ్ బి అదృశ్యం అవుతాడు. కాగా, ఈ గ్లింప్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఒక్క వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని పేర్కొంటున్నారు. కాగా, అమితాబ్‌ గ్లింప్స్‌కు సంతోష్ నారాయణన్ ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా బాగుంది. https://twitter.com/i/status/1782338404421927223 రాజమౌళిని ఫాలో అవుతున్న నాగ్‌! అశ్వత్థామ పాత్ర తరహాలోనే రానున్న రోజుల్లో ‘కల్కి 2898 ఏడీ’లోని ఇతర కీలక రోల్స్‌కు సంబంధించిన పరిచయ వీడియోలు కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమా సమయంలో దర్శకధీరుడు రాజమౌళి అనుసరించిన ఫార్మూలనే కల్కీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ అనుసరించబోతున్నట్లు సమాచారం. బాహుబలి సమయంలో ప్రభాస్‌, రానా (భల్లాలదేవ), అనుష్క (దేవసేన) పాత్రలను రాజమౌళి ఓ ప్రత్యేక గ్లింప్స్‌ రూపంలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఈ తరహాలోనే నాగ్‌ అశ్విన్‌ కూడా అమితాబ్‌ బచ్చన్‌ రోల్‌ను పరిచయం చేశారు. త్వరలోనే ప్రభాస్‌ ‘భైరవ’ టీజర్‌ కూడా వస్తుందట. అలాగే దీపికా పదుకొనే, కమల్‌హాసన్‌ తదితరుల పాత్రలను కూడా ఇంట్రడ్యూస్‌ చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.   దీపికా, కమల్‌ పాత్రలు అవేనా?  ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) చేస్తున్న రోల్స్ అవేనంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్‌ హాసన్‌.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరి పాత్రలకు సంబంధించి కూడా వీడియో రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటి ఇవ్వాల్సి ఉంది.  నిరాశలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌! ‘కల్కి 2898 ఏడీ’ విడుదల తేదీకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. వాస్తవానికి మే 9న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్‌ ప్రకటించారు. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ రోజున ఈ సినిమా విడుదల కావడం లేదు. ఈ క్రమంలోనే కొత్త తేదీని మేకర్స్‌ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమితాబ్‌ పాత్రను పరిచయం చేయనున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించడంతో ‘అశ్వత్థామ వీడియో గ్లింప్స్‌’లోనే విడుదల తేదీని రివీల్‌ చేస్తారని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ భావించారు. అయితే ఎలాంటి డేట్‌ను లాక్‌ చేయకపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశ చెందుతున్నారు. 
  ఏప్రిల్ 22 , 2024
  <strong>Kalki 2898 AD Story: మూడు ప్రపంచాల సంగ్రామమే ‘కల్కి’.. రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్‌ చేసిన డైరెక్టర్‌!</strong>
  Kalki 2898 AD Story: మూడు ప్రపంచాల సంగ్రామమే ‘కల్కి’.. రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్‌ చేసిన డైరెక్టర్‌!
  యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం విడుదలకు ఇంకా ఏడు రోజుల సమయమే మిగిలి ఉంది. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం పార్ట్‌ - 1 జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబయిలో గ్రాండ్‌గా కల్కి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సైతం నిర్వహించారు. సైన్స్‌ ఫిక్షన్‌ ఫ్యూచరిక్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుందా? అన్న ప్రశ్న గత కొంతకాలంగా ప్రతీ సినీ అభిమానిలోనూ ఉంది. దీంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. 'కల్కి' కథను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు స్పెషల్‌ వీడియోను ఎక్స్‌ వేదికగా రిలీజ్‌ చేశారు.&nbsp; త్రీ వరల్డ్స్‌ స్టోరీ ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీ కథ.. మూడు ప్రపంచాల మధ్య తిరుగుతుందని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ లేటెస్ట్‌ వీడియోలో స్పష్టం చేశారు. కాశీ, కాంప్లెక్స్‌ (కాశీ పైన ఉన్న పిరమిడ్‌ లాంటి సిటీ), శంబాలా నగరాల చుట్టూ ప్రధానంగా కల్కి స్టోరీ తిరగనుందని తెలియజేశారు. ‘పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న కాశీ లేదా వారణాసి ఈ ప్రపంచంలో మొదటి నగరమని అనేక పుస్తకాలు, శాసనాల్లో ఉంది. నాగరికత పుట్టుక కూడా ఇక్కడి నుంచే మొదలైందని చెబుతారు. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే చివరి నగరమైతే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది’ అని నాగ్‌ అశ్విన్‌ తెలిపారు.&nbsp; https://twitter.com/i/status/1803649632041419033 కాంప్లెక్స్‌కు వెళ్లడమే లక్ష్యం 3000 ఏళ్ల తర్వాత కాశీ నగరం ఎలా ఉంటుంది? గంగ పూర్తిగా ఎండిపోయి ప్రజలు ఎలాంటి దుర్భర పరిస్థితులు అనుభవిస్తారు? అని ఊహించి రీసెర్చ్‌ చేసి మరి కల్కిలో కాశీ నగరాన్ని సృష్టించినట్లు నాగ్‌ అశ్విన్‌ చెప్పారు. అదే సమయంలో తిరగేసిన పిరమిడ్‌ ఆకారంలో ఉండే 'కాంప్లెక్స్‌'.. ఆకాశంలో కిలో మీటర్‌ మేర ఉండి స్వర్గాన్ని తలపిస్తుంటుందని పేర్కొన్నారు. 'కాంప్లెక్స్‌లో లభించని వస్తువు, పదార్థమంటూ ఉండదు. ఒక ముక్కలో చెప్పాలంటే అదొక స్వర్గం. నీరు, ఆహారం, పచ్చదనం ఇలా ప్రతిదీ అక్కడ ఉంటుంది. కాశీ ప్రజలు ఎప్పటికైనా కాంప్లెక్స్‌కు వెళ్లి అన్నింటినీ ఆస్వాదించాలనుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్‌లో ఉండటంతో అవి కాశీ ప్రజలకు అందకుండా కొందరు నియంత్రిస్తుంటారు. కాంప్లెక్స్‌లోకి వెళ్లాలంటే మిలియన్ల కొద్దీ యూనిట్స్‌ (ధనం) కలిగి ఉండాలి. ఒకరకంగా అక్కడ అడుగు పెట్టడమంటే జీవితాన్ని పణంగా పెట్టడమే' అని నాగ్‌ అశ్విన్‌ పేర్కొన్నారు. శంబాలా.. ఒక శరణార్థి క్యాంపు కల్కిలోని మూడో ప్రపంచమైన 'శంబాలా' గురించి కూడా తాజా వీడియోలో నాగ్‌ అశ్విన్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘వివిధ సంస్కృతుల్లో శంబాలా పేరును వినియోగించారు. టిబెటిన్‌ కల్చర్‌లో దీన్ని షాంగ్రిలా అని పిలిచారు. శంబాలా నుంచే విష్ణు చివరి అవతారం వస్తుందని పురణాలు చెబుతున్నాయి. కాబట్టి శంబాలా ప్రజలు దేవుడి రాక ఇక్కడి నుండి ఉంటుందన్న నమ్మకంతో జీవిస్తుంటారు. అయితే శంబాలా అనేది అతి పెద్ద శరణార్థి క్యాంపులాంటిది. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, సంస్కృతులకు చెందిన వాళ్లు.. కాంప్లెక్స్‌ సభ్యులు వేటాడి హతమార్చగా మిగిలిన వాళ్లు తలదాచుకునే ప్రదేశం. వీరిలోనే రెబల్స్‌ కూడా ఉంటారు. కాంప్లెక్స్‌ సభ్యులతో నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. ఇలా ఈ మూడు ప్రపంచాల మధ్యే నడిచే కథ వాటి మధ్య ఏర్పడే సంఘర్షణలే కల్కి కథ’ అని నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చారు. ‘కల్కి’ రన్‌టైమ్‌ ఎంతంటే? గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ రన్ టైమ్​ గురించి చర్చ నడుస్తోంది. తాజాగా ఇప్పుడు అధికారికంగా రన్ టైమ్​ బయటకి వచ్చింది. ఈ సినిమాను చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు.. మూవీకి యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చారు. రన్​​ టైమ్​ 180.55 నిమిషాల నిడివితో రానున్నట్లు పేర్కొన్నారు. అంటే ఈ సినిమాను మేకర్స్ 3 గంటల 55 సెకన్లకు కట్ చేశారు. మరి ఈ భారీ ట్రీట్​ను థియేటర్స్​లో ప్రేక్షకుల ఎలా ఆదరిస్తారో చూడాలి. కాగా, సినిమాలో అమితాబ్​ బచ్చన్​, కమల్​ హాసన్​, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.
  జూన్ 20 , 2024
  Prabhas: 9 పార్టులుగా ‘కల్కీ 2898AD?... ఇక హాలీవుడ్‌ పని అయినట్లే!
  Prabhas: 9 పార్టులుగా ‘కల్కీ 2898AD?... ఇక హాలీవుడ్‌ పని అయినట్లే!
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై అంచనాలు చాలా హైరేంజ్‍లో ఉన్నాయి. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సంచలన వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ బజ్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; 9 పార్ట్‌లుగా కల్కీ! ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. హీరో ప్రభాస్‌ తన ఫోకస్‌ మెుత్తం ఈ చిత్రంపైనే పెట్టాడు. అయితే ఈ సినిమాపై వచ్చిన లేటెస్ట్ బజ్‌ ప్రకారం ‘కల్కీ 2898 ఏడీ’ 9 భాగాలుగా రానున్నట్లు తెలిసింది. ఈ సినిమా కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని, బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు కనీసం 9 పార్ట్స్‌గా తీయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్‌ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.&nbsp; https://twitter.com/MilagroMovies/status/1759613635327107364 ‘నేను ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్‌’ డార్లింగ్ ప్రభాస్‌కు సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు ఈ విషయాన్ని పలు వేదికలపై వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ప్రభాస్‌పై తనకున్న అభిమాన్ని చాటుకున్నాడు. మెగా హీరోల తర్వాత తనకు నచ్చిన కథానాయకుడు ప్రభాస్ అని వరుణ్‌ తెలిపాడు. సూపర్ స్టార్ కావాలని ప్రభాస్ ఎప్పుడు అనుకోలేదని.. అతడి శ్రమ, కృషి డార్లింగ్‌ను ఈ స్థాయికి చేర్చాయని ప్రశంసించాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1759574622213947537 షమీ ఫేవరెట్‌ స్టార్లు వీరే టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami) కూడా తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో తాను ప్రభాస్‌ ఫ్యాన్‌ అంటూ ప్రకటించాడు. సౌత్‌ ఇండియాలో మీకు నచ్చిన స్టార్స్ ఎవరని షమీని జర్నలిస్టు ప్రశ్నిస్తుంది. ఇందుకు షమీ సమాధానం ఇస్తూ.. సౌత్‌ సినిమాలు చాలా బాగుంటాయని.. తనకు ప్రభాస్‌తో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) ఫేవరేట్ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను కూడా ప్రభాస్‌, తారక్‌ ఫ్యాన్స్ తెగ వైరల్‌ చేస్తున్నారు. https://twitter.com/i/status/1759506059331338533 ఛత్రపతి శివాజీగా ప్రభాస్‌! మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిన్న (ఫిబ్రవరి 19) దేశ వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ మెుదలైంది. ఛత్రపతి శివాజీ బయోపిక్‌ను సినిమాగా తీస్తే ప్రస్తుత ఇండియన్‌ స్టార్‌ హీరోల్లో ఆ పాత్రకు ఎవరు సరిపోతారన్న ప్రశ్న తలెత్తింది. దీంతో మెజారిటీ నెటిజన్లు ఛత్రపతి శివాజీ పాత్రకు ప్రభాస్ అయితేనే బాగుంటుందని బదులిచ్చారు. శివాజీ పాత్రకు ప్రభాస్ ఒక్కడే ఛాయిస్ అని పేర్కొన్నారు. https://twitter.com/i/status/1759409716114190363 ప్రభాస్‌కు హనుమాన్‌ ఎలివేషన్‌ ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించిన సమాచారం #Prabhas హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఎడిటింగ్‌ వీడియో ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. హనుమాన్‌ సినిమాలో ఆంజనేయుడి శక్తిని వివరిస్తూ నటుడు సముద్రఖని చెప్పే డైలాగ్‌ను ఆ వీడియోలో ప్రభాస్‌కు ‌అన్వయించారు. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలను సముద్రఖని డైలాగ్స్‌కు మ్యాచ్‌ చేస్తూ వీడియోను ఎడిట్‌ చేశారు.&nbsp; https://twitter.com/i/status/1759832540071027104 మే 9న ఫ్యాన్స్‌కు పండగే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9వ తేదీన గ్లోబల్ రేంజ్‌లో విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్‍ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍‍లో కూడా క్రేజ్ ఉంది. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలకపాత్రలు చేస్తున్నారు.
  ఫిబ్రవరి 20 , 2024
  Upcoming Telugu Sequels: టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌.. సెట్స్‌పై సీక్వెల్‌ సినిమాలు.. లిస్ట్‌ చాలా పెద్దదే!
  Upcoming Telugu Sequels: టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌.. సెట్స్‌పై సీక్వెల్‌ సినిమాలు.. లిస్ట్‌ చాలా పెద్దదే!
  ఓ సినిమా హిట్‌ అయితే దానికి సీక్వెల్‌ తెరకెక్కించడం ఇటీవల అన్ని ఇండస్ట్రీలలో కామన్‌ అయిపోయింది. ఈ ట్రెండ్‌ని టాలీవుడ్‌ కూడా బాగా అలవరుచుకుంది. గతంలో అరకొరగా సీక్వెల్స్‌ వచ్చే టాలీవుడ్‌లో ఇప్పుడు అదే ఓ సిద్ధాంతంగా మారింది. హీరోలు సైతం తమ సూపర్‌ హిట్‌ సినిమాలను రెండో పార్ట్‌గా మలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో డైరెక్టర్లు చకా చకా కథను సిద్దం చేసి సీక్వెల్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సీక్వెల్స్‌ అంకుర దశలో ఉండగా, మరికొన్ని శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఇంకొన్ని త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; పుష్ప 2 అల్లుఅర్జున్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బన్నీని పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌ ‘పుష్ప 2’ (Pushpa 2) కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో పుష్ప2ను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వేగంగా షూటింగ్ జరుపుతున్నారు.&nbsp; ఆర్‌ఆర్‌ఆర్‌ - 2&nbsp; దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘RRR’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌ హిట్ అయింది. ఇందులో రామ్‌చరణ్, తారక్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రానుందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రవర్మ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని రాజమౌళి కాకుండా వినూత్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది. కానీ అందులో వాస్తవం లేదని సినీ వర్గాలు స్ఫష్టం చేశాయి. మరి, ఈ భారీ ప్రాజెక్టుని ఎవరికి అప్పగిస్తారో చూడాలి. డబల్‌ ఇస్మార్ట్‌ రామ్‌పోతినేని హీరోగా పూరి జగన్నాద్‌ డైరెక్షన్‌‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఇందులో రామ్.. ఊరమాస్‌ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ‘డబల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. 2024 మార్చి 8న మూవీ రిలీజ్‌ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.&nbsp; గూఢచారి 2 యంగ్‌ హీరో అడివి శేష్ కెరీర్‌లో ‘గూఢచారి’ (Goodachari) చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. ఈ షూటింగ్‌ను ‘G2’ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘G2’ మూవీ పోస్టర్‌, ప్రీ లుక్‌ టీజర్‌ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెంచేశాయి. ఆల్ఫ్‌ పర్వతాల చుట్టూ ఈ సీక్వెల్‌ పార్ట్‌ తిరగనుందని సమాచారం.&nbsp; హిట్‌ 3 తెలుగులో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్‌ ఫ్రాంచైజీ చిత్రం హిట్‌ (HIT). తొలి భాగమైన ‘ది ఫస్ట్‌ కేస్‌’లో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించగా.. హిట్‌-2 (HIT 2)లో అడవిశేష్‌ కథానాయకుడిగా చేశాడు. ఇక హిట్‌-3 (HIT 3) కూడా రానున్నట్లు సెకండ్‌ పార్ట్‌ ఎండింగ్‌లో డైరెక్టర్‌ శైలేష్‌ కొలను హింట్‌ ఇచ్చేశారు. ఇందులో అర్జున్‌ అనే పోలీసు ఆఫీసర్‌ పాత్రను నాని పోషించనున్నాడు.&nbsp; ప్రతినిధి-2 యంగ్‌ హీరో నారా రోహిత్‌ ప్రస్తుతం ప్రతినిధి-2 (Prathinidhi-2) చిత్రంలో నటిస్తున్నాడు. 2014లో వచ్చిన ప్రతినిధి సినిమాకు ఇది సీక్వెల్‌. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఈ మూవీని డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.&nbsp; టిల్లు స్క్వేర్‌ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన డీజే టిల్లు చిత్రం గతేడాది మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, పాట రిలీజయ్యాయి. సెప్టెంబర్‌ 15న టిల్లు స్క్వేర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.&nbsp; బింబిసార 2 గతేడాది విడుదలైన ‘బింబిసార’ (Bimbisara) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరో కళ్యాణ్‌ రామ్‌.. మగధ సామ్రాజ్యనేత బింబిసారుడిగా నటించాడు. సినిమా విడుదల సమయంలోనే బింబిసార-2 కూడా ఉంటుందని చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.&nbsp; సలార్‌&nbsp; ప్రభాస్‌, ప్రశాంత్ నీల్‌ కాంబోలో సలార్‌ (Salaar) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే సలార్‌ రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు చిత్ర యూనిట్‌ టీజర్‌లో కన్ఫర్మ్ చేసేసింది. అందుకే పార్ట్ 1కి ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’ అనే ట్యాగ్ లైన్ జోడించింది. దీన్ని బట్టి రెండో పార్ట్‌ కచ్చితంగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రాజెక్ట్‌ K ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K (Project K) సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానునట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
  ఆగస్టు 02 , 2023
  Kalki 2898 AD Record: ప్రభాస్‌ వేట.. ‘కల్కి’ దెబ్బకు ‘ఆర్ఆర్‌ఆర్‌’ రికార్డు గల్లంతు!
  Kalki 2898 AD Record: ప్రభాస్‌ వేట.. ‘కల్కి’ దెబ్బకు ‘ఆర్ఆర్‌ఆర్‌’ రికార్డు గల్లంతు!
  ప్రస్తుతం దేశంలో 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) ఫీవర్‌ నడుస్తోంది. గ్లోబల్‌ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. ట్రైలర్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌, గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ హాలీవుడ్‌ రేంజ్‌ను తలపించాయి. ఇక ఏమాత్రం వేచి ఉండలేమన్న స్థాయిలో ట్రైలర్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా అమెరికాలో ఈ చిత్రం ప్రీ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా అక్కడ కల్కి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డు బద్దలు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ'.. జూన్‌ 27న (Kalki Release Date) వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ తేదీ దగ్గర పడుతుండంతో అమెరికాలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్‌ను ఓపెన్‌ చేశారు. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. అమెరికా ప్రీ బుకింగ్స్‌ హిస్టరీలో సరికొత్త చరిత్రను కల్కి క్రియేట్‌ చేసింది. బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డును బద్దలు కొట్టింది. అమెరికా ప్రీ బుకింగ్స్‌లో అతి తక్కువ సమయంలో వన్‌ మిలియన్ కలెక్షన్స్‌ క్రాస్‌ చేసిన తొలి భారతీయ చిత్రంగా కల్కి సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. గతంలో ఈ రికార్డు 'ఆర్‌ఆర్‌ఆర్‌' పేరిట ఉండేది. ప్రస్తుతం ప్రీ బుకింగ్ అయిన టికెట్ల సంఖ్య గంట గంటకు గణనీయంగా పెరుగుతున్నట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.&nbsp; దిశా పటానీ.. క్యారెక్టర్‌ రివీల్‌ కల్కి సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Hassan), దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పటాని (Disha Patani).. ఇలా పలువురు స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించి ఇప్పటికే పలువురు స్టార్స్ క్యారెక్టర్ల పేర్లను పోస్టర్ల రూపంలో చిత్ర యూనిట్‌ రివీల్‌ చేసింది. తాజాగా దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.&nbsp; నేడు దిశా పటాని పుట్టిన రోజు కావడంతో మూవీలోని ఆమె పాత్ర పేరును కల్కి టీమ్‌ రివీల్‌ చేసింది. క్యారెక్టర్ పేరు ‘రాక్సీ’ అని పరిచయం చేస్తూ.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో దిశా గోడకు ఆనుకొని తన నడుము అందాలు చూపిస్తూ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; బుజ్జిని నడిపిన ఆనంద్‌ మహీంద్ర ‘కల్కి’లో ఎంతో కీలకమైన పాత్ర పోషించిన బుజ్జి(వాహనం)ని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా బుధవారం నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పంచుకుంది. డ్రైవ్‌ చేసిన అనంతరం ఆనంద్‌ మహీంద్ర బుజ్జితో ఫొటోలు దిగారు. కాగా, బుజ్జి వెహికల్‌ తయారీకి.. 'మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ' టీమ్‌ సహాయపడినట్లు ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ వాహనం రెండు మహీంద్ర ఇ-మోటర్లతో నడుస్తుందని చెప్పారు. నాగ్ అశ్విన్‌, అతడి టీమ్‌ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఆయన ప్రశంసించారు.&nbsp; https://www.youtube.com/watch?v=wS0gKXgO_AA&amp;t=25s
  జూన్ 13 , 2024
  Kalki 2898 AD: ‘కల్కి’ రన్‌టైమ్‌ లాక్‌.. సినిమా బడ్జెట్‌పై ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!
  Kalki 2898 AD: ‘కల్కి’ రన్‌టైమ్‌ లాక్‌.. సినిమా బడ్జెట్‌పై ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!
  ప్రభాస్‌ (Prabhas) హీరోగా చేస్తున్న లేటెస్ట్ సైన్‌ ఫిక్షన్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో దిగ్గజ నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, కల్కి సినిమా విడుదలకు ఇంకా నాలుగు వారాలే గడువు ఉండటంతో మేకర్స్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులపై ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే రన్‌ టైమ్‌ను లాక్‌ చేసినట్లు ఓ బజ్‌ బయటకొచ్చింది. మరోవైపు ఈ సినిమా బడ్జెట్‌పై హీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; కల్కి రన్‌టైమ్‌ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రాన్ని జూన్‌ 27న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మూవీలోని పాత్రలను ఒక్కొక్కరిగా రివీల్‌ చేస్తున్నారు. ఈ కోవలోనే ప్రభాస్‌ (భైరవ), అమితాబ్‌ బచ్చన్‌ (అశ్వత్థామ), బుజ్జి (రోబోటిక్‌ వెహికల్‌) పాత్రలు బయటకొచ్చాయి. అయితే తాజా అప్‌డేట్‌ ప్రకారం ఈ మూవీ రన్‌టైమ్‌ను కూడా మేకర్స్ ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినినా నిడివిని 3.10 గం.లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లి ఏమైన కత్తెరలు పడినా కూడా నిడివి 3 గం.లకు తగ్గే పరిస్థితి ఉండదని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే రన్‌టైమ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; దాని వల్లే కల్కి బడ్జెట్ పెరిగింది: ప్రభాస్‌ కల్కి సినిమా ప్రమోషన్స్‌ భాగంగా హీరో ప్రభాస్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ నేషనల్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్‌పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి చిత్రాన్ని దేశ ప్రజలతో పాటు వరల్డ్‌ వైడ్‌గా ఉన్న సినీ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు చెప్పారు. ఈ క్రమంలో బడ్జెట్‌ భారీగా పెరిగిందని అన్నారు. గ్లోబల్‌ రేంజ్‌ సినిమా కావడం వల్ల కల్కిలోని పాత్రల పేర్లు కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పారు. డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ మాట్లాడుతూ.. కల్కి సినిమా చూశాక ప్రేక్షకులు మరో కొత్త ప్రపంచంలోకి వెళ్లొచ్చామనే భావనలోకి వెళ్తారని అన్నారు. అవతార్‌ చూశాక పొందిన కొత్త అనుభూతినే కల్కి తర్వాత ప్రేక్షకులు పొందుతారని హామి ఇచ్చారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లీషుతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా కల్కి విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. చెన్నై వీధుల్లో బుజ్జి సందడి కల్కి చిత్రంలో కీలకమైన బుజ్జి వాహనాన్ని ఇటీవల చిత్ర యూనిట్‌ ఆవిష్కరించింది. ఆ మూవీని పలు నగరాల్లో తిప్పుతూ చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ చేస్తోంది. తాజాగా చెన్నై వీధుల్లో బుజ్జి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ తన ఎక్స్‌ ఖాతాలో పంచుకుంది. కాగా, ఇప్పటికే ఈ వాహనాన్ని టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ చైతన్య డ్రైవ్‌ చేశారు. మరోవైపు బుజ్జిని నడపాలంటూ టెస్లా, స్పెస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్‌ కోరారు.&nbsp; https://twitter.com/i/status/1795776188931305863 31న స్పెషల్‌ వీడియో! కల్కి సినిమాలో బుజ్జి - భైరవ (ప్రభాస్‌) ప్రయాణం ఎలా సాగిందో తెలియజేసేందుకు మే 31న ఓ స్పెషల్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేయబోతున్నారు. 'బుజ్జి అండ్‌ భైరవ' (Bujji And Bhairava) పేరుతో రూపొందిన ఈ ప్రత్యేక వీడియో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. చిన్నారులను ఎంటర్‌టైన్‌ చేసే ఉద్దేశ్యంతో ఓ కార్టూన్‌ రూపంలో వీడియోను రూపొందించినట్లు ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. ఇందులో ఏముందో తెలియాలంటే స్పెషల్‌ వీడియో వచ్చేవరకూ ఆగాల్సిందే.&nbsp; https://twitter.com/i/status/1795100292314186235 తెలుగులో అత్యధిక రన్‌టైమ్‌ చిత్రాలు కల్కి తరహాలోనే ఇప్పటివరకూ అత్యధిక రన్‌టైమ్‌ కలిగిన చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. వాటి గురించి తెలుసుకునేందుకు ఈ క్రింది లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://telugu.yousay.tv/tfidb/list/Animal_Runtime_3.21_Hours:_Do_You_Know_the_Longest-Running_Telugu_Movie$$7660d6ac-0846-43e3-b679-c28804e28ed4
  మే 30 , 2024
  Kalki 2898 AD: రామ్‌చరణ్‌ కూతురికి కల్కి టీమ్ స్పెషల్ గిఫ్ట్‌.. డైరెక్టర్‌ ప్లాన్‌ అదేనా?
  Kalki 2898 AD: రామ్‌చరణ్‌ కూతురికి కల్కి టీమ్ స్పెషల్ గిఫ్ట్‌.. డైరెక్టర్‌ ప్లాన్‌ అదేనా?
  పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) డైరెక్షన్‌లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రంపై దేశవ్యాప్తంగా బజ్‌ ఉంది. ఈ చిత్రం జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ జోరు ఒక్కసారిగా పెంచింది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన AI వెహికల్‌.. బుజ్జిని ప్రముఖ నగరాల్లో తిప్పుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ను బుజ్జి వెహికల్‌ను నడపాలని కోరి వరల్డ్‌ వైడ్‌గా సినిమాపై అటెన్షన్‌ తీసుకొచ్చింది. ఇక తాాజాగా మరో కాన్సెప్ట్‌తో సరికొత్త ప్రమోషన్స్‌ను మేకర్స్‌ షురూ చేశారు.&nbsp; క్లింకారకు స్పెషల్‌ గిఫ్ట్‌ సరికొత్త ప్రమోషన్స్‌కు కల్కి టీమ్‌ నాంది పలికింది. ఇందులో భాగంగా సినీ సెలబ్రిటీల పిల్లలకు&nbsp; గిఫ్ట్‌లు పంపుతోంది. తాజాగా రామ్‌ చరణ్‌ కుమార్తె క్లీంకారకు (Klinkaara) మూవీ యూనిట్‌ ఓ బహుమతి అందించింది. అందులో బుజ్జి - భైరవ స్టికర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్‌ ఉన్నాయి. క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. కల్కి టీమ్‌కు థ్యాంక్స్‌, ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా వీటిని పంపనున్నట్లు తెలుస్తోంది.&nbsp; చిన్నారులపై ఫోకస్‌ సాధారణంగా ఏ సినిమా మేకర్స్‌ అయినా రిలీజ్‌ సందర్భంగా యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తుంటారు. అయితే కల్కి టీమ్‌ ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. ఓ వైపు పెద్దలను ఆకర్షిస్తూనే చిన్నారులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం చిన్నారులపైనే ఫుల్‌గా ఫోకస్‌ పెట్టినట్లు కనిపిస్తోంది. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. ఇటీవల కిడ్స్‌ను టార్గెట్‌ చేస్తూ 'బుజ్జి అండ్‌ భైరవ' (Bujji And Bhairava) పేరుతో సరికొత్త యానిమేషన్‌ సిరీస్‌ను తీసుకొచ్చారు. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వేదికగా ఈ సిరీస్‌ రెండు ఎపిసోడ్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది చిన్నారులను ఎంటగానో ఆకర్షిస్తోంది. అటు పెద్దల నుంచి సైతం సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా స్పెషల్‌ గిఫ్ట్స్‌ ప్రోగ్రామ్‌ను కూడా పిల్లల కోసమే లాంచ్ చేశారు.&nbsp; కారణం ఇదేనా! ‘కల్కి 2898 ఏడీ’ సైంటిఫిక్‌ అండ్‌ ఫ్యూచరిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన బుజ్జి, భైరవ సిరీస్‌, గ్లింప్స్‌ను పరిశీలిస్తే కల్కి చిత్రం సూపర్‌ హీరోల కాన్సెప్ట్‌ను తలపిస్తోంది. సాధారణంగా ఈ తరహా చిత్రాలు.. పెద్దల కంటే పిల్లలనే ఎక్కువగా అట్రాక్ట్‌ చేస్తుంటాయి. ఇప్పటికే హాలీవుడ్‌లో వచ్చిన అవెంజర్స్, మార్వెల్‌ సిరీస్‌ చిత్రాలు ఈ విషయాన్నే రుజువు చేశాయి. కాబట్టి కల్కి టీమ్‌ కూడా ఆ పాయింట్‌నే పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ముందుగా పిల్లల్లో కల్కి సినిమాపై ఆసక్తి రగిలిస్తే ఆటోమేటిక్‌గా తల్లిదండ్రులను కూడా థియేటర్లకు రప్పించవచ్చని మూవీ టీమ్‌ భావిస్తున్నట్లు సమాచారం. అటు యూత్‌, టీనేజర్స్‌ను ఆకర్షించడానికి ప్రభాస్ ఉండనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ వ్యూహాత్మంగా ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది.&nbsp; కల్కి రన్‌టైమ్‌ లాక్‌? 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రన్‌ టైమ్‌ ఫిక్స్ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రీసెంట్‌ సోషల్‌ మీడియా బజ్‌ ప్రకారం.. ఈ సినిమా నిడివిని 3.10 గం.లుగా మేకర్స్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లి ఏమైన కత్తెరలు పడినా కూడా నిడివి 3 గం.లకు తగ్గే పరిస్థితి ఉండదని ప్రచారం జరుగుతోంది. అయితే రన్‌టైమ్‌పై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా చేశారు. దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp;
  జూన్ 03 , 2024
  Kalki 2898 AD Sequel: ప్రభాస్‌ ‘కల్కి’ రెండు కంటే ఎక్కువ భాగాలుగా రానుందా? నెట్టింట ఆసక్తికర చర్చ!
  Kalki 2898 AD Sequel: ప్రభాస్‌ ‘కల్కి’ రెండు కంటే ఎక్కువ భాగాలుగా రానుందా? నెట్టింట ఆసక్తికర చర్చ!
  ప్రస్తుతం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా.. మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో భారీగా&nbsp; అంచనాలు ఉన్నాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సంచలన వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ బజ్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; రెండు కంటే ఎక్కువ భాగాలుగా! ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరకు వస్తుండటంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ సైతం మెుదలు పెట్టింది. ఇప్పటికే విడుదలైన భైరవ (ప్రభాస్‌) బుజ్జి వీడియో అభిమానులకు సర్‌ప్రైజ్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన ఓ అప్‌డేట్‌ సైతం ఫ్యాన్స్‌ను మరింత ఖుషి చేస్తోంది. దీని ప్రకారం కల్కి చిత్రం రెండు కంటే ఎక్కువ భాగాలుగా రానున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.&nbsp; కారణం ఇదేనట! ‘కల్కి 2898 ఏడీ’ కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు టాక్‌. బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు రెండు కంటే ఎక్కువ భాగాలు అవసరం అవుతాయని మేకర్స్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మెుదట కల్కీకి సంబంధించి ఓ సీక్వెల్‌ ప్లాన్‌ చేయాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది. సీక్వెల్‌లోనూ కథ చెప్పలేకపోతే మిగతా పార్ట్స్‌ గురించి ఆలోచించాలని మేకర్స్‌ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నెట్టింట వైరల్‌ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్‌ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. అయితే ఈ&nbsp; ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.&nbsp; నేడు బిగ్ ఈవెంట్‌ ‘కల్కి’ సినిమాకు సంబంధించి ఇవాళ (మే 22) రామోజీ ఫిల్మ్‌ సిటీలో పెద్ద ఈవెంట్‌ను చిత్ర యూనిట్‌ నిర్వహించనుంది. ఇప్పటికే స్టేజీ సిట్టింగ్‌ కూడా రెడీ అయ్యింది. సా. 5 గంటలకు ఈ వేడుక మెుదలకానుంది. కల్కి సినిమా మెుదలు పెట్టిన తర్వాత భారత్‌లో చేస్తున్న తొలి ఈవెంట్‌ కావడంతో దీనిపై అందరిలోనూ హైప్‌ ఏర్పడింది. ఈ ఈవెంట్‌కు ప్రభాస్‌తో పాటు మూవీ యూనిట్ అంతా వస్తారని సమాచారం. కల్కి సినిమాలో భైరవ (ప్రభాస్), బుజ్జి మధ్య రిలేషన్‌ ఏంటో ఈ ఈవెంట్‌లో చెప్పనున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్‌ ద్వారా తెలియజేశారు.&nbsp;
  మే 22 , 2024
  <strong>Kalki 2898 AD: ‘కల్కి’ సినిమా చూసి ఆశ్చర్యపోయిన సెన్సార్‌ బోర్డు.. మూవీలో ఇవే హైలెట్స్‌ అట!</strong>
  Kalki 2898 AD: ‘కల్కి’ సినిమా చూసి ఆశ్చర్యపోయిన సెన్సార్‌ బోర్డు.. మూవీలో ఇవే హైలెట్స్‌ అట!
  టాలీవుడ్‌ సహా యావత్‌ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. జూన్‌ 27న గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్‌ ఈ సినిమాను సెన్సార్‌ సభ్యుల ముందుకు తీసుకెళ్లింది. మూవీని చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు.. కల్కిలోని అద్భుతమైన విజువల్స్‌కు ఆశ్చర్యపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాను చూసి వారు బాగా ఇంప్రెస్‌ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రన్‌ టైమ్ ఎంతంటే? హైదరాబాద్‌లోని క్యూబ్ ఆఫీస్‌లో సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ముందుగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ (U/A Certificate) జారీ చేశారట. మూవీ రన్ టైమ్‌ను 2 గంటల 55 నిమిషాలకు వారు లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సమేతంగా ఈ సినిమాను వీక్షించేలా సెన్సార్‌ బోర్డు ఈ U/A సర్టిఫికేట్‌ను జారి చేసినట్లు సమాచారం. ఇక కల్కి రన్‌టైమ్‌ విషయంలో పెద్దగా కోతలు కూడా పడలేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రన్‌టైమ్‌ పరంగా చూస్తే కల్కి చిత్రం భారీ నిడివి కలిగిన సినిమాగా చెప్పవచ్చు. గతంలో ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’ (Bahubali), ‘బాహుబలి 2’ (Bahubali 2), ‘సలార్‌’ (Salaar) వంటి చిత్రాలు దాదాపు మూడు గంటల నిడివితో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.&nbsp; https://twitter.com/sureshvarmaz/status/1803083897162326411?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1803083897162326411%7Ctwgr%5Ea9c2e13cc71d84f550b3404869cf14b6794be696%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Ftelugu.hindustantimes.com%2Fentertainment%2Fprabhas-kalki-2898-ad-first-review-in-telugu-by-censor-board-members-kalki-2898-ad-movie-review-telugu-nag-ashwin-121718773237508.html సెన్సార్‌ బోర్డు ఇంప్రెస్‌..! కల్కి సినిమాను చూసి సెన్సార్‌ బోర్డు సభ్యులు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమాలో ఇలాంటి విజువల్స్ గతంలో ఎప్పుడూ చూడలేదని వారు అభిప్రాయ పడినట్లు సమాచారం. స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా, యూనిక్ కాన్సెప్ట్‌తో ఉందని.. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని వ్యాఖ్యానించినట్లు టాక్‌. ఎమోషన్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా అదిరిపోయిందని సమాచారం. భైరవగా ప్రభాస్‌ దుమ్ముదులిపాడని, కల్కిలో ట్విస్టులకు ప్రేక్షకులకు మైండ్ పోతుందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), అలాగే కమల్ హాసన్ (Kamal Hassan) పాత్రలు కూడా చాలా బాగున్నాయని అంటున్నారు. వాళ్లని ఎలాగైతే చూడాలని ప్రేక్షకులు భావించారో ఆ స్థాయిలోనే వారి పాత్రలను తీర్చిదిద్దారని సెన్సార్‌ సభ్యులు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. క్లైమాక్స్‌లో వచ్చే అద్భుతమైన ట్విస్ట్.. కచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని చెబుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1803314969414672532 18 ఏళ్ల తర్వాత రీఎంట్రీ! అలనాటి హీరోయిన్‌ శోభన (Sobhana).. కల్కి సినిమాలో కీలక పాత్ర పోషించారు. ‘మరియమ్‌’ అనే పాత్రలో ఆమె కనిపించనున్నట్లు చిత్రయూనిట్‌ తాజాగా ప్రకటించింది. ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్‌ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. ఈ పోస్టర్‌కు 'ఆమె లాగే తన పూర్వీకులు కూడా ఎదురు చూశారు' అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఆమె పాత్రపై సినీ అభిమానుల్లో ఆసక్తి మెుదలైంది. ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన శోభన.. తెలుగులో చివరిసారి 'గేమ్‌' (2006) సినిమాలో కనిపించారు. మళ్లీ 18 ఏళ్ల తర్వాత 'కల్కి 2898 ఏడీ'తో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వనుండటం విశేషం.&nbsp; https://twitter.com/VyjayanthiFilms/status/1803294901825839541
  జూన్ 19 , 2024
  Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
  Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగాలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ ‘కామిక్ కాన్’లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ‘ప్రాజెక్ట్ K’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ పాల్గొన్నారు. గ్లింప్స్‌ చెప్పే సీక్రెట్స్ ఇవే! కాగా, ప్రాజెక్ట్‌ K సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద ‘2898 AD’ అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో జరిగే కథ అని డైరెక్టర్‌ చెప్పకనే చెప్పాడు. గ్లింప్స్ చూస్తే సాధారణంగా ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది అని, ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు కల్కి ఉద్భవిస్తాడని, ప్రజల్ని కాపాడతాడని తెలుస్తుంది. అయితే గ్లింప్స్‌ను మరింత పరిశీలనగా చూస్తే చాలా విషయాలు మనకు అర్థమౌతాయి. కలియుగాంతం సమయంలో ఈ ప్రపంచం పూర్తిగా రోబోల మయంగా, ఆధునిక ఆయుధాలతో యుద్ధం జరిగే స్థాయికి వెళ్తుందని గ్లింప్స్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా 2898 ADలో ప్రస్తుత స్థాయిలో జనాభా కాకుండా చాలా కొద్దిమంది ప్రజలే ఉండొచ్చని భావించవచ్చు. వారంతా ఓ వ్యక్తి (రాజు) పాలనలో జీవిస్తుండవచ్చు. https://twitter.com/DEADLINE/status/1682221771154677760?s=20 అమితాబ్‌ పాత్ర నిడివి తక్కువేనా? ప్రాజెక్ట్‌లో Kలో రాజు (అమితాబ్‌ బచ్చన్‌) తన ప్రజలని పాలిస్తుంటే ఒక విలన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ రాజుని బంధించి అతని ప్రజలని విలన్ తనకు బానిసలుగా చేసుకున్నట్లు గ్లింప్స్‌లో కనిపిస్తోంది. అలాంటప్పుడు రాజు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో వారిని ఆదుకునేందుకు కల్కి అవతారంలో హీరో (ప్రభాస్‌) ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. మూవీలో అయితే మొదట అమితాబ్ వచ్చి ఆ తర్వాత ప్రభాస్ వస్తాడని అర్థం చేసుకోవచ్చు. శివాలయంలోకి ఓ రోబో రావడం గ్లింప్స్‌లో చూశాం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడి క్యారెక్టర్‌లో అమితాబ్ నటిస్తున్నట్లు టాక్.&nbsp; https://twitter.com/DEADLINE/status/1682129398600966146?s=20 ప్రభాస్ అందుకే కల్కి అవుతాడా? ఇక ప్రాజెక్ట్ K అంటే ‘ప్రాజెక్ట్ కల్కి’ అని, ప్రభాస్‌తో లోకాన్ని కాపాడించడానికి కొంతమంది చేసే యుద్ధమని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. నిమిషం వీడియోతో డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్‌గా కథ మెుత్తం రివీల్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక కొంచెం డీటేలింగ్‌లోకి వెళ్తే అమితాబ్‌ బచ్చన్‌తో పాటు హీరోయిన్‌ దీపికా పదుకొణేను కూడా విలన్లు బంధించినట్లు గ్లింప్స్‌లో చూపించారు. దీన్ని బట్టి ప్రభాస్‌ ఆమె కోసం వచ్చి కల్కి లాగా మారతాడా? అన్న సందేహం కూడా ఉత్పన్నమవుతుంది. లేదా హీరోయిన్‌ను కాపాడే క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా దీపికా, ప్రభాస్‌ మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా బాగా ఎలివేట్‌ చేయాలని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారు.&nbsp; చీకటికి రారాజు అతడే? ఇకపోతే ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తాడని మెున్నటి వరకూ ఊహాగానాలు వినిపించినా తాజాగా విడుదలైన గ్లింప్స్‌ వీడియోతో ‌అది కన్‌ఫార్మ్‌ అయింది. ఎందుకంటే ప్రాజెక్ట్‌Kలో కమల్‌ హాసన్‌ నటించనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించిన సమయంలో ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. 'భూమి మెుత్తాన్ని కమ్మేసే షాడో (చీకటి) కోసం వెతికామని.. ఆ పాత్ర చేయగల ఒకే ఒక్కడు దొరికేశాడు' అని కమల్‌ గురించి ప్రకటించారు. తాజా గ్లింప్స్‌ కూడా భూమిని చీకటి కమ్మేయడం గమనించవచ్చు. ఈ రెండు కలిపి చూస్తే ఇందులో విలన్లకు రారాజుగా కమల్‌ హాసన్‌ కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1672854637014138880 సూపర్ రెస్పాన్స్ గ్లింప్స్‌ని చూస్తుంటే గూస్‌బమ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. విజువల్ వండర్‌గా, హాలీవుడ్ రేంజ్ సినిమాని తలపిస్తోందని చెబుతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక, సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. మళ్లీ మళ్లీ వినాలనిపించే ట్రాక్‌ని అందించాడు. గ్లింప్స్ చూశాక మ్యూజిక్ హాంట్ చేస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.&nbsp; https://twitter.com/THR/status/1682126315229683715?s=20 విడుదల తేదీ? ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం ఈ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ కావాలి. అయితే, గ్లింప్స్‌లో కేవలం 2024లో వస్తుందనే ఇచ్చారు. అంటే, మూవీ డేట్ మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. మరి, జనవరి 12న కాకుండా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్‌కి అచ్చొచ్చిన ‘మే9’న కల్కిని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు ఇదే రోజున రిలీజ్ అయ్యాయి. https://www.youtube.com/watch?v=bC36d8e3bb0
  జూలై 21 , 2023
  Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ వెనక నాగ్‌ అశ్విన్‌ మాస్టర్‌ ప్లాన్‌..!&nbsp;
  Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ వెనక నాగ్‌ అశ్విన్‌ మాస్టర్‌ ప్లాన్‌..!&nbsp;
  ప్రభాస్‌ హీరోగా చేస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ ఫ్యూచరిస్టిక్ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD)పై వరల్డ్‌ వైడ్‌గా బజ్‌ ఏర్పడింది. ఈ సినిమాను మహానటి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. జూన్‌ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. సినిమాలో రోబిటిక్‌ వెహికల్‌గా కీలక పాత్ర పోషించిన బుజ్జి అనే వాహనాన్ని ఇటీవల అందరీ పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. సినిమా కోసం స్పెషల్‌గా తయారు చేయించిన వెహికల్‌ కావడంతో బుజ్జిపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం బుజ్జిని ఉపయోగించుకొని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సరికొత్త ప్రమోషన్స్‌కు తెరలేపారు.&nbsp; అపర కుబేరుడికి రిక్వెస్ట్‌ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలా మస్క్‌ (Elon Musk)కు.. 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ తాజాగా ఓ రిక్వెస్ట్‌ పెట్టారు. బుజ్జి వెహికల్‌ను నడపడానికి ఆహ్వానిస్తున్నట్లు ఓ ట్వీట్‌ను ఎలాన్‌ మస్క్‌కు ట్యాగ్‌ చేశాడు. ‘ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా&nbsp; బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువుతో సరికొత్తగా డిజైన్‌ చేశాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అద్భుతమైన ఇంజినీరింగ్ వర్క్‌తో నిర్మించబడింది. మీకు బుజ్జి తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుంది' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/nagashwin7/status/1795534761072693594 ట్వీట్‌ వెనక మాస్టర్‌ ప్లాన్‌ అపర కుభేరుడు ఎలాన్‌ మస్క్‌కు నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ పెట్టడం వెనక ఓ మాస్టర్‌ ప్లాన్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. కల్కి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎలాన్‌ మస్క్‌ దృష్టిని కల్కి మీదకు మళ్లిస్తే అది గ్లోబల్‌ స్థాయిలో మూవీకి ప్లస్ అవుతుందని నాగ్ అశ్విన్‌ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అసాధ్యమని తెలిసినా బుజ్జిని నడపాలని, ఇండియాకు రావాలని ఆయన మస్క్‌ను కోరినట్లు సమాచారం. ఇప్పటికే నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా మంది భారతీయులు ట్వీట్‌పై స్పందిస్తున్నారు. ఈ అడ్వాన్స్‌డ్‌ వెహికల్‌ను నడపాలని మస్క్‌కు సైతం సూచిస్తున్నారు. అటు మస్క్‌ కూడా అశ్విన్‌ ట్వీట్‌కు సమాధానం ఇస్తే అది ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రావాల్సినంత ప్రమోషన్ వరల్డ్‌ వైడ్‌గా వచ్చేస్తుంది.&nbsp; బుజ్జిని నడిపిన చైతూ బుజ్జి వెహికల్‌పై మనసు పారేసుకున్న టాలీవుడ్‌ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya).. ఇప్పటికే దానిపై ఓ రైడ్‌ కూడా వేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఇటీవల ఈ కారును డ్రైవ్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఎక్స్‌లో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. అనంతరం బుజ్జి వెహికల్‌కు హాట్యాఫ్‌ చెప్పిన చైతూ.. అదొక ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చెప్పుకొచ్చారు.&nbsp; https://twitter.com/chay_akkineni/status/1794262966986215753 బుజ్జి ఎందుకు స్పెషలో తెలుసా? బుజ్జి అనే ఫ్యూచరస్టిక్‌ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్‌ తయారీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.&nbsp; కల్కి బడ్జెట్‌ తెలిస్తే షాకే! ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
  మే 29 , 2024
  Kalki 2898 AD Update: కల్కిలో దిశా పటానీ పాత్రపై క్రేజీ బజ్‌.. పురాణాలకు ముడిపెడుతున్న నెటిజన్లు!
  Kalki 2898 AD Update: కల్కిలో దిశా పటానీ పాత్రపై క్రేజీ బజ్‌.. పురాణాలకు ముడిపెడుతున్న నెటిజన్లు!
  ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కాంబోలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’.. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను సైతం చిత్ర యూనిట్‌ ప్రారంభించింది. అమితాబ్‌ బచ్చన్‌ పాత్రకు సంబంధించిన గ్లింప్స్, ప్రభాస్‌ పోస్టర్‌ ఇప్పటికే విడుదలై ఫ్యాన్స్‌ అలరించాయి. తాజాగా బుజ్జి అనే రోబోటిక్‌ వెహికల్‌ పాత్రను కూడా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఆడియన్స్‌ పరిచయం చేశారు. అయితే ఈ సినిమా పురణాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నట్లు దర్శకుడు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటి దిశా పటాని నటిస్తుండగా.. తాజాగా ఆమె పాత్రకు సంబంధించి క్రేజీ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోహినిగా దిశా పటానీ! లేటెస్ట్ బజ్‌ ప్రకారం 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో దిశా పటానీ (Disha Patani) మోహినీ అనే యువతి పాత్రలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. విలన్‌ అయిన కమల్‌ హాసన్‌.. ఆమెను గూఢచారి (స్పై)గా భైరవ (ప్రభాస్‌) వద్దకు పంపిస్తాడని సమాచారం. మోహిని తన గ్లామర్‌తో ప్రభాస్‌ను ఆకట్టుకొని అతడు నుంచి రహాస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఈ మూవీలో ఆమె పాత్ర చాలా కీలకం కానుందన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. మరోవైపు కొందరు నెటిజన్లు.. దిశా పటానీ పాత్రను ఇతిహాసాలలోని మోహిని పాత్రతో లింకప్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాను ఊపేస్తోంది.&nbsp; ఆ లాజిక్‌ మాటేంటి? ఇతి హాసాలలోని మోహిని పాత్రతో దిశాపటాని పాత్రను పోల్చడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో అసలు లాజిక్‌ లేదని అంటున్నారు. పురాణాల ప్రకారం మోహిని పాత్ర అనేది మహా విష్ణువు అవతారం. ఇందులో ప్రభాస్‌ కూడా మహా విష్ణువు అవతారం (భైరవ)లో కనిపిస్తాడని టాక్‌ ఉంది. కాబట్టి మోహిని పాత్ర.. ప్రభాస్‌పై ఎలా స్పై చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ లేటెస్ట్‌ బజ్‌లో నిజం లేకపోవచ్చని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే దిశాపటానీ పాత్ర పేరు వరకే మోహిని ఉండి, పురణాలతో ఆమెకు సంబంధం లేకపోతే తాజా ప్రచారంపై నమ్మకం ఉంచొచ్చని ఇంకొందరు పోస్టులు చేస్తున్నారు. దీనిపై చిత్రయూనిట్‌ క్లారిటీ ఇస్తే తప్ప ఈ చర్చ ముగిసేలా లేదు. &nbsp; దిశాతో ప్రభాస్ స్పెషల్‌ సాంగ్‌ 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone) ప్రభాస్‌కు జోడీగా చేస్తోంది. ఇక సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలో దిశా పటానీ కనిపించనుంది. ప్రభాస్‌ - దిశా పటానీ మధ్య ‘కల్కి’లో ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉండనుంది. ఈ పాటకు సంబంధించిన షూట్‌ను నెల రోజుల క్రితం ఇటలీలో నిర్వహించారు. ఇటలీలోని బ్యూటీఫుల్‌ లోకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అప్పట్లో దిశా పటానీ తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. చిత్ర యూనిట్‌తో పాటు ప్రభాస్‌తో దిగిన సెల్ఫీ ఫొటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.&nbsp; View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) దీపికా, కమల్‌ పాత్రలు అవేనా?&nbsp; ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) చేస్తున్న రోల్స్‌పై కూడా సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కమల్‌ హాసన్‌.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. వీరి పాత్రలు కూడా కల్కిలో చాలా కీలకంగా ఉంటాయని.. ముఖ్యంగా ప్రభాస్‌ను ఢీకొట్టే పాత్రలో కమల్‌ హాసన్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరిద్దరి పాత్రలపైనా స్పష్టత రానుంది.&nbsp;
  మే 24 , 2024
  Kalki 2898 AD: శివరాత్రి స్పెషల్‌.. సాలిడ్‌ అప్‌డేట్‌తో ముందుకొస్తున్న ‘కల్కీ’ టీమ్‌!
  Kalki 2898 AD: శివరాత్రి స్పెషల్‌.. సాలిడ్‌ అప్‌డేట్‌తో ముందుకొస్తున్న ‘కల్కీ’ టీమ్‌!
  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేష్‌లో రూపొందుతున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). మైథాలజీ ఇన్‌స్పైర్డ్‌ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో అంచనాలు మరింత హైప్‌లోకి వెళ్లాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉండనుందో అర్థమైపోతోంది. ఇదిలా ఉంటే నేడు శివరాత్రి సందర్భంగా మేకర్స్ సరికొత్త అప్‌డేట్‌కి రెడీ అయిపోయారు. ఇందుకు సంబంధించి పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.&nbsp; పోస్టర్‌లో ఏముంది? ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌, టీజర్‌లో ప్రభాస్‌ పాత్ర పేరును మూవీ టీమ్‌ ఎక్కడా రివీల్‌ చేయలేదు. అయితే ఇవాళ శివరాత్రి సందర్భంగా హీరో పేరును ప్రకటించబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. సాయంత్రం 5:00 గంటలకు రివీల్ చేయనున్నట్లు సరికొత్త పోస్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ పోస్టర్‌లోని శివలింగం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. మరోవైపు కల్కిలో ప్రభాస్‌ పేరు ఏమై ఉంటుందా? అని ఫ్యాన్స్‌ ఇప్పటికే ఆలోచనల్లో పడిపోయారు.&nbsp; https://twitter.com/chitrambhalareI/status/1766015501350883362 ఇటలీలో ప్రభాస్, దిశా పటానీ.. తాజాగా కల్కి చిత్ర యూనిట్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీతో పాటు యూనిట్ అంతా కలసి దిగిన ఫోటోను మేకర్స్ గురువారం షేర్ చేశారు. ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్‌లో ఈ పాటని చాలా గ్రాండ్‌గా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్‌లో ప్రభాస్ (Prabhas), దిశా పటానీ (Disha Patani) మధ్య రొమాన్స్ ఉండనుందని సమాచారం. కాగా ఈ మూవీలో దిశా పటానీతో పాటు బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొనే మరో హీరోయిన్‌గా నటిస్తోంది.&nbsp; ఆ రోజు రావడం పక్కా! ప్రభాస్‌ ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో జాప్యం జరుగుతున్నట్లు వార్తలు రావడంతో చిత్ర విడుదలపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ నిర్వహిస్తూ ఆ కన్ఫ్యూజన్‌ను దూరం చేసింది వైజయంతీ మూవీ మేకర్స్. కల్కి సినిమాను మే 9న విడుదల చేయడం పక్కా అన్నట్లుగా సోషల్ మీడియాలో వరుస అప్‌డేట్స్‌ను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.&nbsp; కల్కీ రిలీజయ్యే భాషలు ఇవే! ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్‍ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి టీమ్‌ రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍‍లో కూడా క్రేజ్ ఉంది.&nbsp;
  మార్చి 08 , 2024
  Kalki 2898 AD Trailer: కల్కిలో ప్రభాస్‌ కంటే అమితాబ్‌ పాత్రనే హైలెట్‌ కానుందా? ట్రైలర్‌లో ఎన్నో ప్రశ్నలు!
  Kalki 2898 AD Trailer: కల్కిలో ప్రభాస్‌ కంటే అమితాబ్‌ పాత్రనే హైలెట్‌ కానుందా? ట్రైలర్‌లో ఎన్నో ప్రశ్నలు!
  పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం గ్లోబల్ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం జూన్ 27న (Kalki Release Date) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ సమీపిస్తుండటంతో మేకర్స్.. మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం (జూన్‌ 10) కల్కి ట్రైలర్‌ (Kalki Trailer In Telugu)ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసే ఎలివేషన్స్‌తో ఈ ట్రైలర్ అదరగొట్టింది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్న కల్కి ట్రైలర్‌ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ట్రైలర్‌ అద్భుతంగా ఉండటంతో పాటు కొత్త ప్రశ్నలు రేకెత్తేలా చేసింది. అవేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; ప్రభాస్‌.. కల్కినే కాదట! 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా కథ ఇదేనంటూ చాలా రకాల స్టోరీలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. కథను ఎక్స్‌క్లూజివ్‌గా తామే అందిస్తున్నామన్న రీతిలో కొన్ని పేజీలు.. మూవీ ప్లాట్స్‌ను తమకు నచ్చిన విధంగా రాసుకొచ్చాయి. అయితే ఎక్కువ మంది ప్రచారం చేసిన స్టోరీ.. కాస్త కన్విన్సింగ్‌గా ఉన్న కథ ప్రకారం.. ఈ సినిమా కలియుగం చివరిలో జరుగుతుందని, విష్ణు పదవ అవతారమైన కల్కి (ప్రభాస్‌) వచ్చి భూమి మీద ఉన్న మనుషులను కాపాడతారని అనుకుంటూ వచ్చారు. అయితే తాజా ట్రైలర్‌ చూసిన తర్వాత అసలు ప్రభాస్‌ కల్కినే కాదని తెలిసి అంతా షాకయ్యారు. మరి ప్రభాస్‌ పాత్ర ఇందులో ఉండనుంది? మరి టైటిల్‌లోని కల్కి ఎవరు? అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. నాగ్‌ అశ్విన్‌ ఏం ట్విస్ట్ ప్లాన్‌ చేశాడో అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=y1-w1kUGuz8 ప్రభాస్‌ ప్రాధాన్యత తగ్గిందా! కల్కి ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ప్రభాస్‌ కంటే బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) పాత్రనే హైలెట్‌గా కనిపించినట్లు కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రభాస్‌కు తగ్గ ఎలివేషన్స్‌ ట్రైలర్‌లో ఉన్నప్పటికీ అమితాబ్‌ క్యారెక్టర్‌కు ఇచ్చిన ప్రాధాన్యతతో పోలిస్తే అది కాస్త తక్కువేనని పోస్టులు పెడుతున్నారు. అయితే సినిమా కోసం ప్రభాస్‌ పాత్రను దాచి ఉంచారమోనన్న వాదన కూడా నెట్టింట బలంగా వినిపిస్తోంది. 'రికార్డ్స్‌ చెక్‌ చేసుకో.. ఇప్పటివరకూ నేను ఏ ఫైట్‌ ఓడిపోలేదు' అంటూ ప్రభాస్‌ చెప్పే డైలాగ్స్‌ ఇందుకు ఒక చిన్న ఉదాహరణ అని చెబుతున్నారు. జూన్‌ 27న ప్రభాస్‌ చేసే యాక్షన్‌తో థియేటర్లు మోతెక్కిపోతాయని నమ్మకంగా చెబుతున్నారు.&nbsp; దీపికా డబ్బింగ్‌పై ట్రోల్స్‌ కల్కి సినిమాను పరిశీలిస్తే ఇందులోని యాక్టర్లంతా దాదాపుగా తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. విభిన్నమైన గెటప్‌లో ఉన్న లోకనాయకుడు కమల్‌ హాసన్‌ను అయితే చాలా మంది డబ్బింగ్‌ వల్లే గుర్తుపట్టారు. అయితే ట్లైలర్‌లో దీపికా డబ్బింగ్‌ చూసి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీపిక గొంతు విన్నాక ఏదో తేడాగా ఉందే.. డబ్బింగ్ విషయంలో నాగ్‌ అశ్విన్‌ ఇలా ఎందుకు చేశారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో దీపికా ఇలానే డబ్బింగ్‌ చెప్పిందంటూ పాత వీడియోల్ని షేర్‌ చేస్తున్నారు. దీపిక అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్' మూవీలో తెలుగులో కొన్ని డైలాగ్స్ చెబుతోంది. ఆ వీడియోను ట్రోలింగ్​కు వాడేస్తున్నారు. https://twitter.com/i/status/1800179235677778142 వీటిపైనా నెట్టింట చర్చ..! ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్‌.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇందులోని రిచ్​ విజువల్స్, మూవీ కాన్సెప్ట్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా ప్రతీ దాని గురించి అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అమితాబ్ - ప్రభాస్ పాత్రలకు కనెక్షన్ ఏంటి? బుజ్జి - భైరవల కథ ఏంటి? దీపిక పదుకొణె, దిశా పటానీల పాత్రలు ఏంటి? కమల్ హాసన్ డిఫరెంట్​ లుక్, రోల్​ ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. మొత్తంగా ట్రైలర్​కు ఫుల్ మార్క్​లు పడ్డాయి.&nbsp;
  జూన్ 11 , 2024
  Kalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి మహేష్‌.. ఎందుకంటే?
  Kalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి మహేష్‌.. ఎందుకంటే?
  సలార్‌ (Salaar) తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా చేస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). మహానటి ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఉంది. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజ్‌ న్యూస్‌ బయటకొచ్చింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈ సినిమాలో భాగస్వామ్యం కాబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.&nbsp; మహేష్‌ బాబు డబ్బింగ్‌? (Mahesh Babu Dubbing) కల్కి చిత్రం (Prabhas New Movie)లో హీరో ప్రభాస్‌ విష్ణు మూర్తి అవతారంలో కనిపించనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో అతడి పాత్ర పేరు 'భైరవ' అని చిత్ర యూనిట్‌ ఇప్పటికే రివీల్‌ చేసింది. అయితే ప్రభాస్‌ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్‌ బాబు (Mahesh Babu) వాయిస్‌ను ఉపయోగించుకోవాలని మేకర్స్‌ భావిస్తున్నారట. ప్రభాస్ ఎంట్రీకి, ఎలివేషన్స్‌కు మహేష్‌ వాయిస్‌ ఇస్తే సినిమాపై హైప్‌ మరింత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ విషయమై మహేష్‌ను కూడా సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; గతంలో ఇలాగే.. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు ఇలా డబ్బింగ్‌ చెప్పడం కొత్తేమి కాదు. గతంలో ఆయనకు డబ్బింగ్‌ చెప్పిన అనుభవం ఉంది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) - త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ (Jalsa Movie) సినిమాకు మహేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. సంజయ్‌ సాహు పాత్రను పరిచయం చేస్తూ తన వాయిస్‌తో చక్కటి ఎలివేషన్స్‌ ఇచ్చాడు. అప్పట్లో ఇది ‘జల్సా’ సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మహేష్‌ చేత ఎలాగైన డబ్బింగ్‌ చెప్పించాలని దర్శకుడు నాగ్‌ అశ్విన్ పట్టుదలతో ఉన్నట్లు ఫిల్స్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం మహేష్‌ ‘SSMB29’ సినిమా షూట్‌ కోసం సిద్దమవుతున్నాడు. మరి ఈ ఆఫర్‌కు మహేష్ ఓకే చెప్తాడో లేదో చూడాలి. కల్కి వెనక లెజెండరీ డైరెక్టర్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Prabhas New Movie Director).. కల్కి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ద్వాపర యుగం నుంచి కలియుగం అంతంలో కల్కి అవతరించే వరకు ఈ చిత్ర కథ ఉండనుందని టాక్. మహాభారతం నాటి పాత్రలతో ముడిపడి ఉన్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై ఇతిహాసాల ప్రభావం కూడా గట్టిగానే ఉండనుంది. ఈ నేపథ్యంలో పౌరాణిక చిత్రాలపై పట్టున్న లెజెండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) ఈ సినిమా విషయంలో తన వంతు సాయం అందిస్తున్నట్లు సమాచారం. ‘మాయాబజార్‌’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడం, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ లాంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన అనుభవం కల్కికి ఉపయోగపడుతుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారు.&nbsp; ‘ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు’ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ (Prabhas New Movie) సినిమాపై రానా (Rana Daggubati) ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా కథకు ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కనెక్ట్‌ అవుతారని ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో వ్యాఖ్యానించాడు. ‘భారతీయ తెరపై తదుపరి పెద్ద మూవీ కల్కి. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కల్కికి కనెక్ట్ అవుతారు. ఈ ఇండియన్‌ ఎవెంజర్స్ క్షణం కోసం ఎదురు చూస్తున్నా’ అని అన్నాడు. కాగా, ఈ సినిమాకు అశ్వనీదత్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్‌ సరసన దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు.&nbsp;
  మే 08 , 2024
  Kalki 2898 AD: ప్రభాస్‌ వీడియో రిలీజ్.. ఫ్యాన్స్ భయాలను దూరం చేసిన కల్కీ టీమ్‌!
  Kalki 2898 AD: ప్రభాస్‌ వీడియో రిలీజ్.. ఫ్యాన్స్ భయాలను దూరం చేసిన కల్కీ టీమ్‌!
  బాహుబలి ముందు వరకూ టాలీవుడ్‌ (Tollywood)కే పరిమితమైన ప్రభాస్‌.. ఆ సినిమా తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి వరుసపెట్టి జాతీయ స్థాయి చిత్రాలు చేస్తున్న ప్రభాస్‌.. రీసెంట్‌గా సలార్‌ (Salaar)తో సాలిడ్‌ హిట్‌ను అందుకున్నాడు. ప్రభాస్‌ (Prabhas) కటౌట్‌కు తగ్గ సినిమా వచ్చిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందరి దృష్టి ప్రభాస్‌ అప్‌కమింగ్‌ చిత్రం ‘కల్కీ 2898 ఏడీ’ (Kalki 2898 AD)పై పడింది. ఎవడే ‘సుబ్రమణ్యం’, ‘మహానటి’ సినిమాల డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై మూవీ టీమ్‌ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.  ఆ భయం లేనట్లే! ప్రభాస్‌ ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో జాప్యం జరుగుతున్నట్లు వార్తలు రావడంతో చిత్ర విడుదలపై అనుమానాలు రేకెత్తాయి. ఇలాంటి సందర్భంలో తాజాగా కల్కి సినిమాలోని ప్రభాస్ గ్లింప్స్‌ వీడియో విడుదల చేసి అందరి కన్ఫ్యూజన్ దూరం చేసింది వైజయంతీ మూవీ మేకర్స్. కల్కి సినిమాను మే 9న విడుదల చేయడం పక్కా అన్నట్లుగా సోషల్ మీడియాలో వీడియో వదిలింది. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ పాదం మాత్రమే చూపించారు. ఓ బీట్‌కు ప్రభాస్ కాలు మూమెంట్ వేస్తూ ఉంటుంది. దీనికి టా టక్కర టక్కరే అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇక ఇందులో ప్రభాస్ పాదం చూసి వెంకటేశ్వర పాదం అంటారు దాన్ని అని కామెంట్స్ చేస్తున్నారు. https://twitter.com/i/status/1761054691193225602 బడ్జెట్‌ ఎంతంటే? సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్డెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ మూవీని నిర్మిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అటు ప్రభాస్‌ కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.&nbsp; ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె నటిస్తోంది. అలాగే హాట్ బాంబ్ దిశా పటానీ కూడా కల్కిలో కీలక పాత్ర పోషిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో ప్రధాన పాత్ర చేస్తుంటే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నారు.&nbsp; కల్కీలో నాని, తారక్‌! ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) పరశురాముడిగా, నాని (Nani) కృపాచార్య పాత్రలో కాసేపు కనిపిస్తారని ఈ మధ్య వార్తలు జోరు అందుకున్నాయి. వీళ్లే కాకుండా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా నటిస్తారని ఓ టాక్ ఉంది. ఇదే నిజమైతే ప్రభాస్‌ కల్కీ చిత్రంతో అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే స్టార్‌ హీరోల పాత్రలపై చిత్ర యూనిట్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.&nbsp; 9 పార్ట్‌లుగా కల్కీ! ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. హీరో ప్రభాస్‌ తన ఫోకస్‌ మెుత్తం ఈ చిత్రంపైనే పెట్టాడు. అయితే ఈ సినిమాపై వచ్చిన లేటెస్ట్ బజ్‌ ప్రకారం ‘కల్కీ 2898 ఏడీ’ 9 భాగాలుగా రానున్నట్లు తెలిసింది. ఈ సినిమా కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని, బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు కనీసం 9 పార్ట్స్‌గా తీయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్‌ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.&nbsp; కల్కీ రిలీజయ్యే భాషలు ఇవే! ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9వ తేదీన గ్లోబల్ రేంజ్‌లో విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్‍ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍‍లో కూడా క్రేజ్ ఉంది.&nbsp;
  ఫిబ్రవరి 28 , 2024
  Bujji And Bhairava Review: ‘బుజ్జి - భైరవ’ పాత్రలపై క్లారిటీ వచ్చేసిందోచ్‌.. క్లిక్‌ అయితే సూపర్‌ హిట్టే!
  Bujji And Bhairava Review: ‘బుజ్జి - భైరవ’ పాత్రలపై క్లారిటీ వచ్చేసిందోచ్‌.. క్లిక్‌ అయితే సూపర్‌ హిట్టే!
  ప్రస్తుతం యావత్‌ దేశం ఆసక్తికగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గ్లోబల్‌ ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్‌ నటిస్తుండగా, AI సాయంతో ఆలోచించే మెషీన్‌.. ‘బుజ్జి’గా కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి కథానాయిక కీర్తి సురేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు. అసలు భైరవ, బుజ్జి ఎవరు? ఎలా కలిశారు? అన్న పాయింట్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు కల్కి టీమ్ వినూత్న ఆలోచన చేసింది. ‘బుజ్జి అండ్‌ భైరవ’ (Bujji And Bhairava Review) పేరుతో అమెజాన్‌ ప్రైమ్‌లో యానిమేటెడ్‌ సిరీస్‌ను విడుదల చేసింది. తొలిగా రెండు ఎపిసోడ్లు విడుదల అయ్యాయి. మరో రెండు ఎపిసోడ్లు సినిమా రిలీజ్ అయ్యాక విడుదల చేయనున్నారు. మరి ఇప్పుడు రిలీజ్ అయిన రెండు ఎపిసోడ్స్‌లో ఏం ఉంది? బుజ్జి, బైరవ పాత్రలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. బుజ్జి ఎవరో తెలుసా? బుజ్జికి సంబంధించిన సమాచారాన్ని ఈ యానిమేటెడ్‌ సిరీస్‌లో క్లుప్తంగా చూపించారు. BU - JZ - 1 అనే కోడ్ నేమ్ ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైజ్‌యే బుజ్జి. ఈ డివైస్‌ను ఒక శక్తివంతమైన షిప్‌కు కనెక్ట్‌ చేయడం సిరీస్‌లో చూపించారు. ఆ షిప్‌ 99 మిషన్లను విజయవంతంగా&nbsp; పూర్తి చేసి 100వ మిషన్‌లో ఉండగా దానిపై దాడి జరుగుతుంది. వెహికిల్ నాశనం అయిపోయి గ్లింప్స్‌లో చూపించిన ప్రధాన డివైస్ మాత్రం మిగులుతుంది. ఈ దాడితో కాంప్లెక్స్‌ (గ్లింప్స్‌లో చూపించిన పెద్ద ట్రయాంగిల్‌)కి షిఫ్ట్&nbsp; అయిపోవాలన్న బుజ్జి కల చెల్లాచెదురైపోతుంది. అయితే ఈ చిన్న డివైస్‌ను ప్రభాస్ మొట్టమొదటిసారి చూసినప్పుడు దానిపై BU - JZ - 1 కోడ్ నేమ్ మొత్తాన్ని కలిపి ‘బుజ్జి’ అని చదువుతాడు. అలా దానికి బుజ్జి అనే పేరు ఫిక్స్ అవుతుంది. క్రేజీగా భైరవ పాత్ర? బుజ్జిలాగానే భైరవ (ప్రభాస్‌) కూడా కాంప్లెక్స్‌కి షిఫ్ట్ అయిపోవాలని కలలు కంటుంటాడు. కానీ, దానికి ఒక మిలియన్ యూనిట్స్ (క్రిప్టో కరెన్సీలాంటిది) అవసరం అవుతాయి. యూనిట్స్ అనేది 2898 నాటి ఇండియన్ కరెన్సీ. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు భైరవ డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఈ సిరీస్‌లో భైరవ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది చూపించలేదు. భైరవ ఉండే ఇంటి ఓనర్‌గా బ్రహ్మానందం కనిపించడం విశేషం. రెండు ఎపిసోడ్‌ల సిరీస్‌లో బ్రహ్మానందం, ప్రభాస్‌ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. మరి బ్రహ్మానందం సినిమాలో ఉంటారో లేదో చూడాలి. శంభల నగరం మహా విష్ణువు పదో అవతారమైన కల్కి... శంభల నగరంలో పుడతాడని మన పురాణాల్లో ఉంది. దీనికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఈ సిరీస్‌లో చూపించారు. కాంప్లెక్స్‌కు వెళ్తున్న వెహికిల్స్‌పై శంభల సిటీకి చెందిన రెబల్స్ దాడి చేసి అందులో ఆహారాన్ని కొల్లగొడతారు. శంభల సిటీలో పిల్లలకు కనీసం ఆహారం కూడా లేదని వీరి మాటల్లో వివరిస్తారు. ఈ రెబల్స్‌లో ఒకరు సినిమా గ్లింప్స్‌లో చూపించిన పశుపతిలా కనిపిస్తారు. దీన్ని బట్టి పశుపతి పాత్ర శంభల నగరానికి సంబంధించిన రెబల్ అనుకోవచ్చు. కల్కి- భైరవ వేర్వేరు పాత్రలా! మన పురాణాల ప్రకారం కల్కి శంభల నగరంలో పుడతారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ పోషించిన భైరవ పాత్ర కాశీ నగరంలో ఉంటుంది. భైరవ పాత్ర బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చిన్నప్పుడు శంభల నగరంలో పుట్టి తర్వాత భైరవ కాశీ నగరానికి వస్తాడా? లేకపోతే కల్కి పాత్ర అవతారానికి భైరవ సాయం చేస్తాడా? ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలపై కల్కి సినిమాలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.&nbsp; సిరీస్‌ స్టోరీ ఏంటి? కల్కి సినిమా మెుదలయ్యే రెండేళ్ల కాలానికి ముందు కథ జరుగుతుంది. చాలా సంవత్సరాలుగా కార్గో వెహికల్‌లో పనిచేసే ఏఐ మెషీన్‌ బుజ్జికి ప్రమోషన్‌ వస్తుంది. కాంప్లెక్స్‌ మెంబర్‌ అయిన వ్యక్తికి ప్రైవేటు వెహికల్‌ కావడానికి సిద్ధమవుతుంటుంది. ఈ క్రమంలో చివరి కార్గో డెలివరీ చేయడానికి వెళ్తుండగా రెబల్స్‌ అటాక్‌ చేసి, ఆ షిప్‌ను కూల్చేస్తారు. దీంతో బుజ్జికి కాంప్లెక్స్‌ సిటీతో కనెక్షన్‌ కట్‌ అయిపోయి స్క్రాప్‌లోకి వెళ్లిపోతుంది. మరోవైపు కాశీ పట్టణంలోని చిల్లర దొంగతనాలు చేసే భైరవ (ప్రభాస్‌) కూడా కాంప్లెక్స్‌లో మెంబర్‌ కావాలని అనుకుంటాడు. దొంగలను పట్టుకునే క్రమంలో ఓ బైక్‌ ముక్కలైపోవడంతో దాన్ని స్క్రాప్‌నకు వేసేందుకు తీసుకెళ్తాడు. అక్కడే భైరవకు బుజ్జి పరిచయం అవుతుంది. బుజ్జి ఆలోచనతో భైరవ ఓ స్పెషల్‌ కారును ఎలా తయారు చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సిరీస్‌ స్టోరీ. Telugu.yousay.tv Rating : 3/5  
  జూన్ 01 , 2024
  New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
  New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
  ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి చిన్న హీరోల చిత్రాలే విడుదల కావడానికి ఓ కారణం ఉంది. జూన్‌ 27న ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల కానుంది. దీంతో పెద్ద సినిమాలు ఏవి ఈ వారం విడుదలయ్యేందుకు సాహించలేదు. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు నింద వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 21న ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకు రానుంది. కాండ్రకోట మిస్టరీ వెనక కథేమిటి? నింద ఎవరిపై పడింది? అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు చిత్ర బృందం తెలిపింది.&nbsp; హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ చైతన్యరావు, హెబ్బా పటేల్‌ ఫస్ట్‌ టైమ్‌ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్‌, బాలరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; జూన్‌ 21న&nbsp; ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ ఆకట్టుకుంటున్నాయి. OMG హస్యనటుడు వెన్నెల కిషోర్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ఓఎమ్‌జీ (OMG). ఇటీవల ‘చారి 111’ చిత్రంలో ఫ్లాప్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఈ వారం హారర్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాడు. నందిత శ్వేత హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రానికి శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్‌ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు రక్షణ పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ర‌క్ష‌ణ’ (Rakshana) ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 21 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. జూన్ 7న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఇందులో పాయల్‌ తొలిసారి పోలీసు అధికారిణి పాత్ర పోషించింది.&nbsp; బాక్‌ సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak Movie). ఖుష్బూ సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ‘బాక్‌’ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 21 నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. కోటా ఫ్యాక్టరీ సీజన్‌-3 నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌లలో ‘కోట ఫ్యాక్టరీ’ (Kota Factory 3) ఒకటి. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు విజయవంతం కాగా, మూడో సీజన్‌ జూన్‌ 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులు, వాళ్లు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సవాళ్లు, వాళ్లకు అండగా నిలిచే జీతూ భయ్యా చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. TitleCategoryLanguagePlatformRelease DateAgent Of MysteriesSeriesEnglish/KoreanNetflixJune 18OutstandingMovieEnglishNetflixJune 18Maha RajSeriesHindiNetflixJune 19America’s SweetheartsSeriesEnglishNetflixJune 13NadigarMovieMalayalamNetflixJune 21Trigger WarningMovieEnglishNetflixJune 21Bad CopMovieHindiDisney + HotstarJune 21The HoldoversMovieEnglishJio CinemaJune 16House Of The Dragon 2SeriesEnglishJio CinemaJune 17IndustrySeriesEnglishJio CinemaJune 19Bigboss OTT 3Reality ShowHindiJio CinemaJune 21
  జూన్ 17 , 2024
  Kamal Hassan: ‘కల్కి’పై కమల్‌ హాసన్‌ క్రేజీ కామెంట్స్‌.. 27 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ!
  Kamal Hassan: ‘కల్కి’పై కమల్‌ హాసన్‌ క్రేజీ కామెంట్స్‌.. 27 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ!
  పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా గ్లోబల్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ రూపొందిన చిత్రం 'కల్కి 2898 ఏడి' (Kalki 2898 AD). నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం.. యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సైంటిఫిక్‌ ‌అండ్ ఫ్యూచరిక్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Hassan) నటించారు. దీంతో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే కల్కి గురించి ఇప్పటివరకూ పెద్దగా కామెంట్స్‌ చేయని కమల్‌.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కల్కిపై అంచనాలను మరింత పెంచుతున్నాయి కమల్‌ ఏమన్నారంటే దేశం గర్వించతగ్గ నటుల్లో కమల్‌ హాసన్‌ ఒకరు. ఆయన యూనివర్సల్ స్టార్‌గానూ గుర్తింపు పొందారు. అటువంటి కమల్‌.. కల్కిలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపించనున్నారని తెలియగానే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా కల్కి సినిమాపై స్పందించిన కమల్‌.. ఈ చిత్రాన్ని హవర్‌ గ్లాస్‌తో పోల్చారు. మనం ఎలా టర్న్‌ చేస్తే అలా సినిమా తిరుగుతుందని వ్యాఖానించారు. ఇలాంటి సినిమాలో నటించడం చాలా ఆసక్తికరమని చెప్పారు. ఇప్పటివరకు చేసిన 230 చిత్రాల్లో ఈ తరహా సినిమాను చేయలేదని చెప్పుకొచ్చారు. కమల్‌ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.&nbsp; కల్కిలో భారీ కాస్టింగ్‌ ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న కల్కి చిత్రంలో.. హీరో ప్రభాస్‌, కమల్‌ హాసన్‌లతో పాటు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం మరింత మంది స్టార్ నటులు కల్కిలో కనిపించబోతున్నారు. గతంలో ప్రచారం జరిగిన విధంగా ఎస్‌.ఎస్‌ రాజమౌళి (SS Rajamouli), ఆర్జీవీ (RGV), విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), హీరో నాని (Nani) ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. వీరితో పాటు దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రానాలు కూడా గెస్ట్‌ రోల్స్‌లో అలరించబోతున్నట్లు తాజాగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాగా, ఇప్పటికే సినిమాలోని బుజ్జి అనే రోబొటిక్‌ వాహనానికి హీరోయిన్‌ కీర్తి సురేష్‌ తన వాయిస్‌ అందించింది. ఇలా ఇంతమంది స్టార్‌ నటీనటులు కల్కిలో భాగస్వామ్యం కావడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి.&nbsp; అలనాటి నటి గ్రాండ్‌ ఎంట్రీ! కల్కి సినిమాలో కనిపించబోయే స్టార్‌ క్యాస్టింగ్‌లలో ప్రధానంగా ఓ నటి పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ అయిన శోభన (Actress Shobana) కూడా కల్కిలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. నటి శోభన తెలుగులో సినిమాలు చేసిన రెండు దశాబ్దాలు దాటి పోయింది. 1997 తర్వాత ఆమె తెలుగులో ఏ సినిమా చేయలేదు. ఈ క్రమంలో ఇప్పుడు కల్కిలో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. సుమారు 27 ఏళ్ల తర్వాత ఆమె తెలుగు తెరపై మెరవబోతున్నారు. కాగా, ఈ సినిమాలో హాస్య నటుడు బ్రహ్మానందం కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. జూన్‌ రెండో వారంలో ట్రైలర్‌! విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో కల్కి టీమ్‌ ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇప్పటికే 'బుజ్జి అండ్‌ భైరవ' అనే యానిమేటెడ్‌ సిరీస్‌ను ఓటీటీలో లాంచ్‌ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. దీనికి కొనసాగింపుగా త్వరలో ట్రైలర్‌ కూడా తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వర్స్క్‌ కూడా మెుదలైనట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. జూన్‌ రెండో వారంలో ట్రైలర్‌ లాంచ్ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. విజువల్‌ వండర్‌లా ట్రైలర్‌ ఉంటుందని, అసలు కంటెంట్‌ను ఇందులో చూపిస్తారని సమాచారం. మరి ఈ ట్రైలర్ ఏ మేరకు ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుందో చూడాలి.&nbsp;
  జూన్ 04 , 2024
  Naga Chaitanya: ప్రభాస్‌ ‘బుజ్జి’ని ఆడేసుకున్న&nbsp; నాగ చైతన్య.. ఏం చేశాడో చూడండి!&nbsp;
  Naga Chaitanya: ప్రభాస్‌ ‘బుజ్జి’ని ఆడేసుకున్న&nbsp; నాగ చైతన్య.. ఏం చేశాడో చూడండి!&nbsp;
  ప్రభాస్‌ (Prabhas) - నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కాంబోలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మూవీ కోసం యావత్‌ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఇటీవల కల్కీ మూవీ యూనిట్‌.. ‘బుజ్జి’ అనే కొత్త క్యారెక్టర్‌ను ఓ స్పెషల్‌ ఈవెంట్ ద్వారా పరిచయం చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమాలో తనకు ఫ్రెండ్‌గా చేసిన ఓ రోబోటిక్‌ వెహికల్‌ను హీరో ప్రభాస్‌ స్వయంగా నడిపి ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వెహికల్‌ గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో కార్లను అమితంగా ఇష్టపడే స్టార్‌ హీరో నాగ చైతన్య కన్ను.. బుజ్జిపై పడింది. అప్పుడు అతడు ఏం చేశాడో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; బుజ్జిని డ్రైవ్‌ చేసిన చైతూ హీరో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)కు కార్లు అంటే యమా క్రేజ్‌. మార్కెట్‌లోకి ఏ కొత్త స్పోర్ట్స్‌ కారు వచ్చిన కొనేందుకు అతడు ఆసక్తి కనబరుస్తాడు. అయితే తాజాగా బుజ్జి అనే స్పెషల్‌ మేకింగ్‌ వెహికల్‌పై విపరీతంగా చర్చ జరుగుతుండటంతో చైతూ దృష్టి దీనిపై పడింది. ఇంకేముందు తాను ఓసారి బుజ్జిని నడపాలని నిర్ణయించుకొని చైతూ చిత్ర యూనిట్‌ సంప్రదించారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంతో చైతూ ఆ కారును నడిపి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఈ కారును చైతు డ్రైవ్ చేసాడు. దర్శకుడు నాగ్‍అశ్విన్.. చైతూకు వెల్‍కమ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఎక్స్‌లో షేర్‌ చేయగా నాగచైతన్య దానిని రీట్వీట్ చేశాడు.&nbsp; This was nothing like I’ve ever imagined .. hats off to the entire team for translating this vision into reality .. truly an engineering marvel . Had a great time chilling with Bujji . https://t.co/fmwCJPsLCl— chaitanya akkineni (@chay_akkineni) May 25, 2024 ‘ఇంజనీరింగ్ అద్భుతం..’ కల్కి మేకర్స్‌ షేర్‌ చేసిన వీడియోను రీట్విట్‌ చేస్తూ.. బుజ్జిని నడిపిన అనుభవాన్ని నాగ చైతన్య తెలియచేశాడు. తమ విజన్‌ను విజయవంతంగా రియాలిటీలోకి అనువదించినందుకు మెుత్తం టీమ్‌కి నాగ చైతన్య హ్యాట్సఫ్‌ చెప్పాడు. నిజంగా ఇదోక ఇంజినీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జి కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇంజనీరింగ్‌ రూల్స్‌ను బ్రేక్ చేసినట్లు అనిపిస్తోందన్నారు. తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. మెుత్తంగా బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చైతూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు తెగ ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp; Witness the epic entry of Bhairava (#Prabhas) with Bujji at the #Bujji event! Feel the energy and excitement! ❤️‍🔥 @deepikapadukone @SrBachchan @nagashwin7 @VyjayanthiFilms#BhairavaEntry #Tollywood #EventHighlights #Kalki2898AD #AmitabhBachchan #DeepikaPadukone #NagAshwin… pic.twitter.com/XaQJvWvoqa— SIIMA (@siima) May 22, 2024 బుజ్జి ప్రత్యేకతలు ఇవే బుజ్జి అనే ఫ్యూచరస్టిక్‌ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్‌ తయారీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.&nbsp; #Bujji has arrived! 🔥#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #ActorPrabhas @deepikapadukone @DishaPatani @VyjayanthiFilms @DjokerNole pic.twitter.com/IDYUiFMHNz— INOX Movies (@INOXMovies) May 23, 2024 రూ. 600 కోట్ల బడ్జెట్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
  మే 25 , 2024

  @2021 KTree