పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. గురువారం (జూన్ 27) వరల్డ్ వైడ్‌గా విడుదలై అదరగొడుతోంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కల్కి సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి.. ఈ మూవీ తొలిరోజు కలెక్షన్స్‌పై పడింది. మైథాలజీ – ఫ్యూచరిక్ జానర్‌లో విజువల్ వండర్‌గా రూపొందిన కల్కి ఫిల్మ్.. మెుదటి రోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ వచ్చాయి. మరి కల్కి ఆ మార్క్‌ను అందుకుందా? బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ మేనియా ఏ స్థాయిలో పని చేసింది? అటు యూఎస్‌లో కల్కి సృష్టించిన ఆల్‌టైమ్ రికార్డ్ ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
‘కల్కి 2898 ఏడీ’ మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘లెట్స్ సెలబ్రేట్ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్ చేసుకుంది. కానీ, ఈ వారంతంలో కల్కి కచ్చితంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆల్‌టైమ్ రికార్డు
ప్రభాస్ ‘కల్కి’ సినిమా నార్త్ అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు అగ్రతారల నటనకు అక్కడి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే నార్త్ అమెరికాలో కల్కి ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. నార్త్ అమెరికా ప్రీమియర్స్ కలెక్షన్స్‌లో కల్కి ఏకంగా 3.8 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికాలో ఒక ఇండియన్ చిత్రం ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాతి స్థానాల్లో ‘ఆర్‌ఆర్ఆర్’ (3.46 మిలియన్లు), ‘సలార్’ (2.6 మిలియన్లు), ‘బాహుబలి2’ (2.45 మిలియన్లు) ఉన్నాయి.
ఓవర్సీస్‌లో ఎంతంటే?
ప్రీమియర్స్, ఫస్ట్‌డే కలెక్షన్స్ కలిపి అమెరికాలో తొలి రోజు 5 మిలియన్ డాలర్ల వసూళ్లను కల్కి రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. అమెరికాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల్లో ‘కల్కి’ ఒక్క రోజులోనే 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన సినిమాగానూ రికార్డు నెలకొల్పింది. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఓవర్సీస్‌లో కల్కి బెంచ్‌మార్క్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీకెండ్‌కు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డ్ సేఫ్!
ట్రేడ్ వర్గాలు లెక్కలను బట్టి.. ‘ఆర్‌ఆర్‌ఆర్‘ రికార్డును ‘కల్కి 2898 ఏడీ’ బీట్ చేయలేకపోయింది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం తొలిరోజు రూ.223 కోట్లు (GROSS) రాబట్టి అత్యధిక డే1 వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా టాప్‌లో ఉంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ‘కల్కి 2898 ఏడీ’ రూ.180 కోట్ల వద్దే ఆగిపోవడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డ్ అలాగే భద్రంగా ఉంది. ఆ తర్వాత ‘బాహుబలి 2’ రూ.217 కోట్లతో రెండో స్థానంలో నిలించింది. అయితే రెండింటి రికార్డులను కల్కి బ్రేక్ చేయలేకపోయింది. కానీ, కేజీఎఫ్ 2 (రూ.164.5 కోట్లు), సలార్ (రూ.158 కోట్లు), ఆదిపురుష్ (136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) రికార్డ్స్‌ను బ్రేక్ చేసి టాప్-3లో నిలిచింది.
కలెక్షన్లపై మ్యాచ్ ఎఫెక్ట్!
‘కల్కి 2898 ఏడీ’ సినిమాను ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాల మాదిరిగా ప్రమోట్ చేయడంలో చిత్రబృందం వెనుకబడింది. ఇంకా పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉండేది. అటు ఈ సినిమా కలెక్షన్లపై టీ-20 వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడింది. గురువారం సాయంత్రం జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు ఆడియన్స్ మొగ్గు చూపడం కొంత మైనస్ గా మారింది. దీనికి తోడు గురువారం వర్కింగ్ డే కావడం కూడా కల్కి కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. అయితే సర్వత్రా పాజిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్‌లో కల్కి వసూళ్లు గణనీయంగా పెరిగే అవకాశముంది.
Top 10 Highest Opening Day Collections in India
1. ఆర్‌ఆర్‌ఆర్ (2022)
ఎన్టీఆర్ (Jr.NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్ వసూళ్లను చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం.
2. బాహుబలి 2 (2017)
రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్ ఇండియన్ ఓపెనింగ్ గ్రాసర్ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.
3. సలార్ (2023)
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ చిత్రం.. తొలిరోజున రూ.178.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2023 ఏడాదిలో అత్యధిక డే1 వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో ప్రభాస్ విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ సినిమా ఇదని ఫ్యాన్స్ తెగ మెచ్చుకున్నారు.
4. కేజీఎఫ్ 2 (2022)
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.
5. ఆదిపురుష్ (2023)
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్ మెుదటి రోజు కలెక్షన్స్ రూ.136.8 కోట్లుగా రికార్డ్ అయ్యాయి.
6. జవాన్ (2023)
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం.. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై తొలిరోజున రూ.129.6 కోట్లు కొల్లగొట్టింది. హిందీ సినిమా హిస్టరీలో తొలి రోజున ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన మెుదటి చిత్రంగా నిలిచింది. ప్రముఖ సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా చేశారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో తొలిసారి షారుక్‌తో జత కట్టింది.
7. సాహో (2019)
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్ చేసింది.
8. రోబో 2.0 (2018)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్ టాక్ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించాడు.
9. పఠాన్ (2023)
ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్ ఖాన్ పఠాన్ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్ మూవీ మంచి బూస్టప్ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్ కూడా హిట్ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
10. జైలర్ (2023)
రజనీకాంత్ లేటెస్ట్ మూవీ ‘జైలర్’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!