UATelugu2h 45m
సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల మధ్య కొత్త సమస్యలు వస్తాయి. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Netflixఫ్రమ్
Watch
రివ్యూస్
YouSay Review
Kushi Movie Review: విజయ్ దేవరకొండ
ఈ సినిమా కథ కశ్మీర్‌లో ప్రారంభమవుతుంది. బుర్ఖాలో ఉన్న బేగం (సమంత)ను చూసి విప్లవ్ (విజయ్ దేవరకొండ) తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ పిల్ల తనదని ఫిక్స్ అ...read more
How was the movie?
@Akhil24
1
1 year ago
తారాగణం
విజయ్ దేవరకొండ
విప్లవ్ దేవరకొండసమంత రూత్ ప్రభు
ఆరాధ్య "ఆరా"/ఆరా బేగంసచిన్ ఖేడేకర్
విప్లవ్ తండ్రి, లెనిన్ సత్యంశరణ్య పొన్వన్నన్
రాజలక్ష్మి, విప్లవ్ తల్లిమురళీ శర్మ
చదరంగం శ్రీనివాసరావు, ఆరాధ్య తండ్రిలక్ష్మి
ఆరాధ్య నానమ్మరోహిణి
జోయాజయరామ్
థామస్, జోయా భర్తశత్రు
షణ్ముఖ్, ఆరాధ్య బావవెన్నెల కిషోర్
పిటోబాష్, విప్లవ్ సహోద్యోగిరాహుల్ రామకృష్ణ
Rk, విప్లవ్ స్నేహితుడుశ్రీకాంత్ అయ్యంగార్
ర్ శరణ్య ప్రదీప్దీపూ, ఆరాధ్య స్నేహితురాలు
బ్రహ్మానందం
ఒక స్వామీజీఅలీ
హిమాలయన్ బాబాసిబ్బంది
శివ నిర్వాణ
దర్శకుడునవీన్ యెర్నేనినిర్మాత
వై. రవిశంకర్నిర్మాత
శివ నిర్వాణ
రచయితమురళి జి
సినిమాటోగ్రాఫర్ప్రవీణ్ పూడి
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Kushi Movie Review: విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా?
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, లక్ష్మీ, మురళీ శర్మ, జయరామ్, రోహిణి, సచిన్ ఖేడేకర్, శరణ్య, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
దర్శకత్వం: శివ నిర్వాణ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ: మురళి. G
నిర్మాత : చిరంజీవి పెదమల్లు, Y. రవిశంకర్, నవీన్ యెర్నేని
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రమిది. విజయ్‌కి జోడిగా సమంత అని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సూపర్ హిట్ సాధించడంతో ‘ఖుషి’పై హైప్ మరింత పెరిగింది. భారీ అంచనాల మధ్య ఇవాళ (సెప్టెంబర్ 1) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విజయ్, సమంత జోడీకి ఎన్ని మార్కులు పడ్డాయి? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.
కథ:
ఈ సినిమా కథ కశ్మీర్‌లో ప్రారంభమవుతుంది. బుర్ఖాలో ఉన్న బేగం (సమంత)ను చూసి విప్లవ్ (విజయ్ దేవరకొండ) తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ పిల్ల తనదని ఫిక్స్ అవుతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో బేగం బ్రాహ్మిణ్ అని విప్లవ్‌కు తెలుస్తుంది. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా ‘ఖుషి’గా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల కాపురం కొత్త మలుపు తిరుగుతుంది. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే?
విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. విప్లవ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి అలరించాడు. అటు సమంత కూడా ఆరాధ్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఎంతగానో ఆకట్టుకుంది. తెరపై విప్లవ్, ఆరాధ్య పాత్రలు మాత్రమే కనిపించేంతలా విజయ్, సామ్ పోటీపడి నటించారు. వీరి మధ్య కెమెస్ట్రీ సైతం అద్భుతంగా కుదిరింది. అటు మురళీశర్మ, సచిన్ ఖేడేకర్, రోహిణి, లక్ష్మీ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. వెన్నెల కిషోర్, అలీ, రాహుల్ రామకృష్ణ కామెడీ నవ్వులు పూయించింది.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసే దర్శకుడు శివ నిర్వాణ. తన గత చిత్రాలైన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఖుషి కోసం రొటిన్ కథనే ఆయన ఎంచుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. పెళ్లి తర్వాత ఇది చేద్దాం.. అది చేద్దాం అని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంటలకు ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్లు బోరింగ్ అనిపిస్తాయి. మరికొన్ని సీన్లు ఎక్కడో చూసిన భావన కలిగిస్తాయి. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా శివ నిర్వాణ డైరెక్షన్ బాగుంది.
టెక్నికల్‌గా
ఖుషి సినిమాకు టెక్నికల్ అంశాలు చాలా బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. సందర్భానుసారంగా వచ్చే సాంగ్స్ ఎంతో వినసొంపుగా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అటు G. మురళి అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి మంచి ఎసెట్ అయ్యింది. ముఖ్యంగా కశ్మీర్ అందాలను ఆయన తన కెమెరా పనితనంతో ఎంతో అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. నాణ్యత విషయంలో ప్రొడ్యుసర్లు ఎక్కడా రాజీపడినట్లు అనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
విజయ్, సమంత నటనసంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
కథనంబోరింగ్ సీన్స్
రేటింగ్: 3/5
సెప్టెంబర్ 01 , 2023
ఫ్యాన్స్ ఆతురతగా ఎదురు చూస్తున్న తెలుగు సినిమాలు
]
యూత్‌ని ఆకర్శిస్తున్న చిత్రం విజయ్- సమంతల ‘ఖుషి’.
విడుదల తేదీ: Dec 23, 2023
ఖుషిఖుషి
ఫిబ్రవరి 11 , 2023
Pindam Movie Review: హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో భయపెట్టిన ‘పిండం’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, శ్రీనివాస్ అవసరాల, బేబీ చైత్ర, బేబీ లీషా, విజయలక్ష్మి, శ్రీలత, రవివర్మ, తదితరులు
దర్శకుడు : సాయికిరణ్ దైదా
సంగీతం : కృష్ణ సౌరభ్ సూరంపల్లి
సినిమాటోగ్రఫీ: సతీష్ మనోహరన్
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
నిర్మాత : యశ్వంత్ దగ్గుమాటి
విడుదల తేదీ : డిసెంబర్ 15, 2023
ఒకప్పుడు టాలీవుడ్‌లో హారర్ జానర్ చిత్రాలు ఎక్కువగా కనిపించేవి. ఇటీవల కాలంలో వాటి తాకిడి కాస్త తగ్గింది. అయితే ఆడపాదడపా ఈ జానర్‌ని స్పృశిస్తూ దర్శకనిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఈ కోవలో రూపొందిన చిత్రం ‘పిండం’ (Pindam). ‘ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్’ అనే ఉపశీర్షికతో సినిమా రూపుదిద్దుకుంది. ప్రచార చిత్రాలు సైతం ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అందరి అంచనాలను అందుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
తాంత్రిక విద్యలో ఆరితేరిన అన్నమ్మ(ఈశ్వరి రావు)ను తన రీసెర్చ్ కోసం లోక్ నాథ్ (శ్రీనివాస్ అవసరాల) ఇంటర్వ్యూ చేస్తాడు. ఆమె కెరీర్ లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తాడు. అందుకు బదులిస్తూ 1990 దశకంలో సుక్లాపేట్‌లోని ఓ కుటుంబానికి జరిగిన ఘటనను ఆమె చెప్పుకొస్తుంది. ఆంటోనీ (శ్రీరామ్).. గర్భవతి భార్య మేరీ(ఖుషి రవి), తల్లి, తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతాడు. ఆ తర్వాత నుంచి ఇంట్లో అంతా అనుమానాస్పద ఘటనలు జరుగుతుంటాయి. వాళ్ళని పీడిస్తుంది ఏంటి? అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా? దుష్టశక్తి నుంచి ఆ కుటుంబం ఎలా బయట పడింది? అన్నది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
శ్రీరామ్, ఖుషి రవి మధ్య తరగతి కుటుంబానికి చెందిన జంటగా ఇమిడిపోయారు. హారర్ సీన్లలో శ్రీరామ్ నటన ఆకట్టుకుంటుంది. ఖుషి రవి గర్భవతిగా, ఇద్దరు బిడ్డల తల్లిగా పాత్రకి తగ్గట్టుగా నటించింది. తాంత్రిక శక్తులున్న మహిళగా ఈశ్వరీరావు నటన మెప్పిస్తుంది. ఇద్దరు చిన్నారుల్లో తారగా నటించిన అమ్మాయి సైగలతో మాట్లాడుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అవసరాల శ్రీనివాస్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. రవివర్మ తదితరులు పాత్రల ప్రాధాన్యం మేరకు నటించారు
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు సాయికిరణ్ దైదా కథనంపైన, కథలోని భావోద్వేగాలపైన ఇంకొంచెం దృష్టిపెట్టాల్సింది. అయితే ఆంథోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించే సన్నివేశాల్ని భయం కలిగించేలా తీయడంలో ఆయన సఫలమయ్యాడు. కానీ, అవే సీన్లు పదే పదే పునరావృతం కావడంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత ఉండదు. విరామంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ సెకండ్ పార్ట్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. కడుపులో పిండానికీ, బయటి ఆత్మకీ ముడిపెట్టడంలో పెద్దగా లాజిక్ కనిపించదు. ఓవరాల్‌గా సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయి.
సాంకేతికంగా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా, సంగీతం విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. శబ్దాలతోనే భయపెట్టడంలో సంగీత దర్శకుడు కృష్ణ సౌరభ్ సక్సెస్ అయ్యాడు. విష్ణు నాయర్ కళా ప్రతిభ తెరపై కనిపిస్తుంది. దర్శకుడు భయపెట్టే సన్నివేశాల్ని ఆయన బాగా డిజైన్ చేసుకున్నారు. నిర్మాణంపరంగా లోపాలేమీ లేవు.
ప్లస్ పాయింట్స్
హారర్ సన్నివేశాలునటీనటులుసంగీతం
మైనస్ పాయింట్స్
రొటిన్ కథ, కథనంకొరవడిన భావోద్వేగాలు
రేటింగ్: 2.5/5
డిసెంబర్ 15 , 2023
Samantha: నాగ చైతన్య ఫ్యాన్స్‌కి చిన్మయి వార్నింగ్..? సమంతను ఏమైనా అన్నారంటే..!
సమంత, విజయ్ దేవరకొండ జంటగా తెరకెక్కిన ‘ఖుషి’ సినిమా ‘మ్యూజికల్ కాన్సర్ట్’ (Musical Concert) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 3 పాటలు హిట్టయ్యాయి. దీంతో మ్యూజికల్ కాన్సర్ట్‌ని వీక్షించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహెబ్, సింగర్స్ సిద్ శ్రీరామ్, చిన్మయి, తదితరులు స్టేజిపై సందడి చేశారు. విజయ్ దేవరకొండ సినిమాల్లోని పాటలు పాడుతూ హోరెత్తించారు. అయితే, మ్యూజిక్ సెషన్ అనంతరం చిన్మయి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. పరోక్షంగా నాగచైతన్య ఫ్యాన్స్‌కి కౌంటర్ ఇచ్చిందని చర్చ సాగుతోంది.
https://twitter.com/SureshPRO_/status/1691450193684934656
సమంత అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది సినిమాల్లోని ఆమె గాత్రమే. సామ్‌కి డబ్బింగ్ చెప్పేది చిన్మయినే. సమంత తొలి సినిమా నుంచి వీరిద్దరి కాంబో కంటిన్యూ అవుతూ వస్తోంది. తాజాగా ఖుషి సినిమాకు సైతం సమంతకు చిన్మయినే డబ్బింగ్ చెప్పింది. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో చిన్మయి, రాహుల్ దంపతులు అండగా నిలిచారు. కుంగిపోవద్దని ధైర్యం నూరి పోశారు.
https://twitter.com/SamanthaPrabuFC/status/1691498121405374464
అంతకుముందు నాగచైతన్యతో విడాకుల ఘటనపై సామ్ మీద చై ఫ్యాన్స్ దుమ్మెత్తి పోశారు. సమంత ప్రవర్తనే కారణమంటూ నిందించారు. దీంతో సామ్ కుంగుబాటుకి గురైంది. సన్నిహితుల సాయంతో క్రమంగా కోలుకుంటూ సామ్ తిరిగి మేకప్ వేసుకుంది. అయితే, ఈ తతంగం అందరూ మర్చిపోయిన సమయంలో చిన్మయి చేసిన కామెంట్స్ నాటి రోజుల్ని గుర్తు చేశాయి.
https://twitter.com/TeamSamantha__/status/1691659796737622037
చిన్మయి ఏమందంటే?
స్టేజిపై పాట పాడిన అనంతరం యాంకర్ సుమ చిన్మయికి మైక్ ఇచ్చింది. ‘ఈ స్టేజిపై నుంచి నేనొక విషయం చెప్పాలని అనుకుంటున్నా సామ్.. తెలుగులో నా డబ్బింగ్ కెరీర్ ప్రారంభమైంది నీ వల్లే. ఈ రోజు నువ్వు ఎంతో మందిలో స్ఫూర్తి నింపావు. అమ్మాయిలకు, అబ్బాయిలకు నువ్వొక హీరోవి. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన ఉత్తమమైన వ్యక్తి సమంత. చాలా మంచి అమ్మాయి, ధైర్యవంతురాలు. ఎవరేం చెప్పినా, ఎన్ని ప్రచారాలు చేసినా ఏమీ మారదు’ అంటూ మాట్లాడింది. అనంతరం, సమంతకు డెడికేట్ చేస్తూ ఓ పాట పాడింది. నాగచైతన్యతో విడాకులపై సమంతను బలిపశువును చేయడంపై చిన్మయి ఇలా స్ట్రాంగ్ రిప్లే ఇచ్చినట్లు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
https://twitter.com/SamanthaPrabuFC/status/1691489745350897664
ఫ్యాన్స్ హ్యాపీ
చిన్మయి స్పీచ్‌పై సమంత ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు సరైన విషయం చెప్పారంటూ చిన్మయిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సమంత గురించి ఫ్యాన్స్ మనసులోని మాటను చిన్మయి బయటపెట్టారని చెబుతున్నారు. సామ్, చిన్మయిల ఫ్రెండ్‌షిప్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మరికొందరు ఫ్యాన్స్ సైతం ఇదే విధమైన ట్వీట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తరఫున మాట్లాడినందుకు చిన్మయికి ధన్యవాదాలు చెబుతున్నారు.
https://twitter.com/__GirDhar/status/1691518743820791809
విజయ్, సామ్ పర్ఫార్మెన్స్
మ్యూజికల్ కాన్సర్ట్‌లో విజయ్, సమంతల లైవ్ పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఖుషి టైటిల్ సాంగ్‌కి వీరిద్దరూ కలిసి కాలు కదిపారు. సామ్‌ని విజయ్ ఒంటిచేత్తో ఎత్తుకుని గింగిరాలు తిప్పాడు. అలాగే పైకి ఎత్తుకుని ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపాడు. కిందికి దిగగానే సామ్ ‘హల్లో హైదరాబాద్’ అని విష్ చేయగా ‘తెలుగు ప్రజల్లారా..’ అంటూ రౌడీబాయ్ స్టార్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/AndhraBoxOffice/status/1691475831133274112
ఆగస్టు 16 , 2023
నాగ శౌర్య(Naga Shaurya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
ఛలో సినిమా విజయంతో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న నాగ శౌర్య.. తక్కువ కాలంలోనే యూత్‌లో క్రేజ్ సంపాందించుకున్నాడు. ఊహలు గుసగుసలాడే, వరుడుకావలెను ఖుషి వంటి హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న నాగ శౌర్య గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు మీకోసం
నాగ శౌర్య అసలు పేరు?
నాగశౌర్య ముల్పూరి
నాగ శౌర్య ఎత్తు ఎంత?
5 అడుగుల 9 అంగుళాలు
నాగ శౌర్య తొలి సినిమా?
క్రికెట్ గర్స్ అండ్ బీర్(2011) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.
నాగశౌర్యకు వివాహం అయిందా?
2022 నవంబర్ 20న తన ప్రియురాలు అనూష శెట్టితో వివాహం జరిగింది.
నాగ శౌర్య ఫస్ట్ క్రష్ ఎవరు?
ఐశ్వర్య రాయ్
నాగ శౌర్యకు ఇష్టమైన సినిమా?
టైటానిక్ చిత్రం తన ఫెవరెట్ చిత్రంగా నాగశౌర్య చెప్పాడు.
నాగ శౌర్య ఇష్టమైన హీరో?
తమిళ్ హీరో సూర్య
నాగ శౌర్య తొలి బ్లాక్ బాస్టర్ హిట్?
నాగ శౌర్య, రష్మిక మంధానతో కలిసి నటించిన చిత్రం ఛలో సూపర్ హిట్‌గా నిలిచింది. ఊహలు గుసగుసలాడే చిత్రం కూడా మంచి హిట్ అందుకుంది.
నాగశౌర్యకు ఇష్టమైన కలర్?
నీలం రంగు
నాగ శౌర్య పుట్టిన తేదీ?
1989 జనవరి 14న ఏలూరులో జన్మించారు.
నాగశౌర్య తల్లిదండ్రుల పేర్లు?
శంకర్ ప్రసాద్, ఉషా ప్రసాద్
నాగశౌర్యకు ఇష్టమైన ప్రదేశం?
హైదరాబాద్
నాగ శౌర్య ఏం చదివాడు?
బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్(Bcom)
https://www.youtube.com/watch?v=GU7EJFAPxCI
నాగ శౌర్యకు ఎన్ని అవార్డులు వచ్చాయి?
చెప్పుకోదగ్గ అవార్డులు ఏమి రాలేదు
నాగ శౌర్య ఎన్ని సినిమాల్లో నటించాడు?
నాగ శౌర్య 2024 వరకు 24 సినిమాల్లో నటించాడు.
నాగశౌర్యకు ఇష్టమైన ఆహారం?
పెరుగు వడ
నాగశౌర్య ముద్దుపేరు?
నాని
నాగ శౌర్యకు ఇష్టమైన హీరోయిన్?
అనుష్క శెట్టి
మార్చి 21 , 2024
విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
అర్జున్ రెడ్డి సినిమా విజయంతో రౌడీ బాయ్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. గీతాగోవిందం, ఖుషి వంటి హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన సంగతులు మీకోసం..
విజయ్ దేవరకొండ అసలు పేరు?
దేవరకొండ విజయ్ సాయి. అభిమానులు ముద్దుకు రౌడీ బాయ్, VDK అని పిలుచుకుంటారు.
విజయ్ దేవరకొండ ఎత్తు ఎంత?
5 అడుగుల 10 అంగుళాలు
విజయ్ దేవరకొండ తొలి సినిమా?
నువ్విలా చిత్రం ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాడు. 2016లో వచ్చిన పెళ్లి చూపులు చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు
విజయ్ దేవరకొండ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్?
అర్జున్ రెడ్డి చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గీతాగోవిందం, ట్యాక్సీవాలా, ఖుషి సినిమాలు హిట్స్‌గా నిలిచాయి.
విజయ్ దేవరకొండ క్రష్ ఎవరు?
ఖుషి సినిమాలో తనతోపాటు నటించిన సమంత తన క్రష్‌గా విజయ్ ఓ సందర్భంలో చెప్పాడు
VDKకు ఇష్టమైన కలర్?
తెలుపు, బ్లాక్, బ్రౌన్
విజయ్ దేవరకొండ పుట్టిన తేదీ?
మే 9, 1989
విజయ్ దేవరకొండకు నచ్చిన పుస్తకం?
విజయ్ దేవరకొండ పుస్తక ప్రియుడు. అతనికి 'ది పౌంటెన్ హెడ్' అనే పుస్తకం అంటే ఇష్టమని చెప్పాడు. ఈ పుస్తకంతో పాటు 'అట్లాస్ ష్రగ్ డ్', 'హూ మూవ్డ్ మై చీజ్' అనే పుస్తకాలు చదవదగినవని పేర్కొన్నాడు.
విజయ్ దేవరకొండకు లవర్ ఉందా?
విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన ప్రేమలో ఉన్నారని చాలా వార్తల్లో వచ్చాయి. వీరిద్దరు కలిసి పలు సందర్భాల్లో కనిపించడం ఆ వార్తలకు బలానిచ్చాయి. గీతాగోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్ చిత్రాల్లో ఈ జోడి నటించింది.
విజయ్ దేవరకొండ వ్యాపారాలు?
రౌడీ బ్రాండ్ పేరుతో క్లాత్ బిజినెస్ ఉంది. ఈ బ్రాండ్ బట్టలు మింత్రా ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. 'కింగ్ ఆఫ్ ది హిల్' అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. వోల్ట్స్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు.
విజయ్ దేవరకొండకు ఎన్ని అవార్డులు వచ్చాయి?
అర్జున్ రెడ్డి చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు. 2018 ఫోర్బ్స్ ఇండింయా సెలబ్రెటీ 100 జాబితాలో 72వ స్థానం, టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో 4 వ స్థానంలో నిలిచాడు.
విజయ్ దేవరకొండ సామాజిక సేవ చేస్తాడా?
కొవిడ్ టైంలో మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా వంట సామాగ్రిని అందించాడు. ఇందుకోసం రూ.1.7కోట్లు ఖర్చు పెట్టాడు. ఖుషి సినిమా విడుదల సమయంలో తన రెమ్యునరేషన్ నుంచి రూ.కోటి ఖర్చు పెట్టి 100 మంది రైతులకు సాయం చేశాడు
విజయ్ దేవరకొండ ఎన్ని సినిమాల్లో నటించాడు?
విజయ్ దేవరకొండ 2024 వరకు 14 సినిమాల్లో నటించాడు.
విజయ్ దేవరకొండకు ఇష్టమే ఆహారం?
చికెన్ బిర్యాని, ఇటాలియన్ పస్తా అండ్ పీజా, కాఫీ.
https://www.youtube.com/watch?v=6Z_mp4t0QLU
మార్చి 19 , 2024
Samantha: సినిమాల నుంచి సడెన్‌గా తప్పుకున్న సమంత… ఆందోళనలో అభిమానులు, హీరోలు.. కారణం ఇదే!
Samantha Ruth Prabhu: ఈ వార్త నిజంగా సమంత ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో సామ్ నటిస్తున్న ఖుషి( Kushi ) సినిమా చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుంది. ఈ షూటింగ్ మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సమంత తాజాగా వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్(Citadel) వెబ్‌సిరీస్ షూటింగ్ చివరి షెడ్యూల్ సైతం సెర్బియాలో పూర్తైంది. ఈ క్రమంలో భవిష్యత్‌లో ఏ సినిమాకు కమిట్ కావొద్దని నిర్ణయించుకుంది. సమంత చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ... ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలకు తీసుకున్న ఆడ్వాన్స్ పేమెంట్‌ను సైతం నిర్మాతలకు సమంత తిరిగిచ్చేస్తోందని తెలిసింది. దాదాపు ఒక ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని సామ్ భావిస్తోందట.
Courtesy Instagram: samantha
ఆదే కారణమా?
గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ వ్యాధితో సామ్ ఆరు నెలలు పోరాడింది. ఆ సమయంలో సమంత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. చికిత్స తీసుకుంటూ స్నేహితులతో కలిసి దేశ విదేశీ టూర్లు చేసి ఆ బాధ నుంచి ఉపశమనం పొందింది. అయితే ఇప్పుడు అదే మయోసైటిస్(Myositis) వ్యాధి తిరగబడినట్లు సమాచారం. శరీరం, ముఖంపై వస్తున్న మార్పులు గమనించిన సామ్.. పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావించింది. అందుకే కొద్దికాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కోలుకున్నాకే మూవీస్‌పై ఫొకస్ పెట్టాలని నిశ్చయించుకుంది.
సమంత రాబోయే సినిమాలు
శివ నిర్వాణ డైరెక్షన్‌లో సమంత-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న మూవీ ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో సమంత చేస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.
అభిమానుల అండ
ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత... కొద్దికాలంలోనే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. మహేష్ బాబు, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు కోలివుడ్‌లోనూ అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ చైతు- సామ్ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఇరువురి మధ్య అభిప్రాయ భేదంతో విడాకులు తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఏ పని చేసినా హైలెట్ అవుతూ వస్తుంది. ఎంత మంది ట్రోల్ చేసిన.. ధైర్యం కోల్పోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఆమెను అభిమానించే ఫ్యాన్ ఎల్లప్పుడూ సామ్‌కు అండగా ఉంటూ మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సమంత త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించి అందర్ని అకట్టుకోవాలని సామ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
జూలై 05 , 2023
Devara Trailer: ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్? ఆ రోజున టాప్ లేచిపోవాల్సిందే!
జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల కాంబోలో వస్తోన్న పాన్ ఇండియా చిత్రం 'దేవర' (Devara). 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) లాంటి బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం కావడంతో దేవరపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. సినిమా రిలీజ్‌కు 30 రోజులు కూడా లేకపోవడంతో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా? అని ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవర ట్రైలర్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసిన తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ 15న దేవర ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగుతోంది. ఆ దిశగా మేకర్స్ సన్నాహాలు సైతం మెుదలుపెట్టినట్లు సమాచారం. ట్రైలర్ ఎడిటింగ్ వర్క్‌ను కూడా రెండ్రోజుల్లో షురూ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. సెప్టెంబర్ 15న టాప్ లేచిపోతుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ రోజు కోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్‌పై దేవర టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
మూడో పాటకు రంగం సిద్ధం!
దేవర సినిమా నుంచి రిలీజైన ‘ఫియర్’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌కు మ్యూజిక్ లవర్స్ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చుట్టమల్లే’ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌ను సొంతం చేసుకొని ఆకట్టుకుంది. దీంతో మూడో పాటపై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే ఈ పాట గురించి లిరికిస్ట్ రామజోగయ్య శాస్త్రి హింట్స్ ఇచ్చారు. ఈ పాట అద్భుతంగా ఉంటుందంటూ హైప్ పెంచేశారు. ఇక దేవర థర్డ్ సాంగ్ మాస్ బీట్‌తో ఉండే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడు అనిరుధ్ తనదైన మ్యూజిక్‌తో ఈ పాటను సిద్ధం చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 7న వినాయక చవితి కానుకగా ఈ సాంగ్ రిలీజ్ కానునట్లు తెలుస్తోంది.
తారక్ డబుల్ షేడ్ చూశారా..
దేవర రిలీజ్‌కు నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మంగళవారం (ఆగస్టు 27) ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ గెటప్‌లలో కనిపించాడు. అంతేకాదు 'నెల రోజుల్లోనే అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతోంది' అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ జాతర పక్కా అంటూ అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/DevaraMovie/status/1828291026936832064
ప్రమోషన్స్‌పై ఫోకస్!
దేవర సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నానని ఎన్టీఆర్ ఇటీవలే వెల్లడించారు. అయితే, మిగిలిన కాస్త షూటింగ్‍ను కూడా డైరెక్టర్ కొరటాల శివ పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రమోషన్స్ కూడా మెుదలు కానున్నట్లు తెలుస్తోంది. దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు రూ.250కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు.
ఆగస్టు 28 , 2024
Naga Chaitanya - Sobhita: సమంత చేస్తే తప్పు.. శోభిత చేస్తే ఒప్పా! చైతూ నిశ్చితార్థంపై నెటిజన్ల ప్రశ్నలు!
అక్కినేని ఇంటి మరోమారు పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత (Samantha)తో విడాకులు అనంతరం ఆయన మరోమారు పెళ్లికి సిద్దమవుతున్నారు. ప్రముఖ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)ను నాగచైతన్య రెండో వివాహం చేసుకోనున్నాడు. తాజాగా వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసి అక్కినేని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం వీరి కలయికను తప్పుబడుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
నాగార్జున స్పెషల్ పోస్టు
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన తనయుడు నాగ చైతన్య నిశ్చితార్థం గురించి స్వయంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘నా తనయుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈ రోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది’ అని నాగార్జున పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531
రెండేళ్లుగా ప్రేమాయణం!
నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే ఇవాళ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.
సమంతతో విడాకులు
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)ను గతంలో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఏం మాయ చేశావే' (Ye Maaya Chesave) సినిమాతో చైతు-సమంతకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2017లో వివాహ బంధం ద్వారా వారిద్దరు ఒక్కటయ్యారు. బెస్ట్ కపుల్ అంటూ ప్రసంశలు కూడా అందుకున్నారు. అటువంటిది నాలుగేళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అభిమానులకు షాకిస్తూ 2021లో నాగ చైతన్య, సమంత విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారి వారిది అన్నట్లుగా జీవిస్తున్నారు. మూడేళ్ల తర్వాత చైతు మరో పెళ్లికి రెడీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్' అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
సమంత కంటే చాలా బోల్డ్!
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో సమంత బోల్డ్‌గా నటించడమే విడాకులకు కారణమని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. అలాగే పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయడం వంటి అనేక కారణాలూ వినిపించాయి. అయితే, ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాళ స్క్రీన్ ప్రజెన్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమంత కంటే ఎక్కువగా బోల్డ్ సీన్స్‌లో శోభిత నటించిందని కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే బోల్డ్ వెబ్ సిరీస్‌లో హాట్ షోతో శోభితా ధూళిపాళ్ల రెచ్చిపోయిందని చెబుతున్నారు. అందులో ఇంటిమేట్ సీన్లలో శోభిత నటించిందని పేర్కొంటున్నారు. అలాగే ‘ది నైట్ మేనెజర్’ వెబ్ సిరీస్‌లో కూడా బికినీతోపాటు ఘాటు శృంగార సీన్లలో శోభిత యాక్ట్ చేసింది. ఇటీవల రిలీజైన ‘ది మంకీ మ్యాన్’ సినిమాలో సైతం శోభితా హాట్ షో చేసింది. ఎక్స్‌పోజింగ్, బోల్డ్ సీన్స్ కారణంగా సమంతకు డివోర్స్ ఇచ్చిన నాగ చైతన్య ఆెమె కంటే బోల్డ్ హీరోయిన్ అయిన శోభితాను ఎలా పెళ్లి చేసుకోబోతున్నారు? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఆగస్టు 08 , 2024
RC 17: పాన్ వరల్డ్ స్థాయిలో చరణ్-సుకుమార్ చిత్రం.. రికార్డులు దాసోహం కావాల్సిందే!
టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' (Ram Charan) ఒకరు. 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) తర్వాత అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే నటుడిగా రామ్ చరణ్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన చిత్రం మాత్రం 'రంగస్థలం' (Rangasthalam). డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన ఈ మూవీలో చరణ్ నట విశ్వరూపం చూపించాడు. ఈ మెగా వారసుడి నటనకు ఇండస్ట్రీ మెుత్తం ఫిదా అయ్యింది. చరణ్‌లోని అసలైన నటుడ్ని సుకుమార్ బయటకు తీసుకొచ్చారని సర్వత్రా ప్రశంసలు కురిశాయి. అటువంటి చరణ్-సుక్కు కాంబోలో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ‘RC 17’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ గురించి చాలా రోజుల తర్వాత క్రేజీ అప్‌డేట్ వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
పాన్ వరల్డ్ స్థాయిలో..
రామ్ చరణ్- సుకుమార్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ మూవీ ఎప్పుడు మెుదలవుతుందా? అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ‘రంగస్థలం’ చిత్రాన్ని మించి 'RC 17' ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో చరణ్-సుక్కు మూవీ రూపుదిద్దుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తూ వచ్చారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం 'RC 17' గ్లోబల్ స్థాయిలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఓ సమస్యను కీ పాయింట్‌గా చేసుకొని సుక్కు ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మెుదలైనట్లు టాక్ వినిపిస్తోంది. సుకుమార్ టేకింగ్‌కు పాన్ వరల్డ్ స్థాయి మూవీ పడితే ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. 'RC 17'కు సంబంధించి త్వరలోనే కీలక అప్‌డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.
ఆ మూవీ తర్వాతే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' (Game Changer) మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. రామ్‌చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తైనట్లు తెలుస్తోంది. దీంతో గతంలో ప్రకటించిన విధంగానే ‘ఉప్పెన’ (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu) డైరెక్షన్‌లో చరణ్ నటించనున్నారు. 'RC 16' వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించనుంది. బుచ్చిబాబు ప్రాజెక్ట్ తర్వాత చరణ్-సుకుమార్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
సెట్స్‌పైకి ఎప్పుడంటే?
డైరెక్టర్ సుకుమార్ కూడా ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 6న సినిమా రిలీజ్ చేసేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన పతాక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే ‘RC 17’ ప్రాజెక్ట్‌పై సుకుమార్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశముంది. అయితే ఇప్పటికే రామ్‌చరణ్ సినిమాకు సంబంధించిన చిన్న చిన్న ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ను సుకుమార్ మెుదలుపెట్టినట్లు కూడా టాక్ ఉంది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్దం చేసి వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సుకుమార్ భావిస్తున్నారు.
చరణ్‌కు విలన్‌గా సూర్య!
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (Ram Charan), తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ రాబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అతడి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందట. రామ్‌చరణ్ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే చరణ్-సూర్య మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ క్రేజీగా ఉంటుందని అంటున్నారు.
ఆగస్టు 08 , 2024
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్? ప్రభాస్ బాటలో రామ్‌చరణ్!
‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్ ఛేంజర్’ విడుదల తేదీపై హింట్ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. రిలీజ్ డేట్ లాక్ అయ్యిందంటూ పోస్టులు పెడుతున్నారు.
రిలీజ్ ఆ రోజేనా?
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Producer Dil Raju) నిర్మిస్తున్నారు. తాజాగా ‘రాయన్’ (Raayan) ప్రీ రిలీజ్ ఈవెండ్ పాల్గొన్న ఆయన ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై స్పందించారు. క్రిస్మస్ కు కలుద్దామంటూ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి 'గేమ్ ఛేంజర్'ను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న 50వ చిత్రం. దీంతో దిల్‌రాజు ఎంతో ప్రతిష్టాత్మకగా ‘గేమ్ ఛేంజర్’ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.
https://twitter.com/i/status/1815052022200013098
ప్రభాస్ బాటలో రామ్‌చరణ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘సలార్’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్ కానుకగానే విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. 2023 డిసెంబర్ 22న వచ్చిన సలార్ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.700 కోట్లు కొల్లగొట్టింది. అయితే సలార్ క్రిస్మస్‌కే రిలీజ్ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నా సామి రంగ), వెంకటేష్ (సైంధవ్), తేజ సజ్జా (హనుమాన్) వంటి స్టార్ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్ యూనిట్ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్ & కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. కాబట్టి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే ప్రభాస్ తరహాలోనే బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చరణ్ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
గేమ్ ఛేంజర్‌పై భారీ ఆశలు!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ఐ, స్నేహితుడు వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్ ఛేంజర్’ పూడుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
కథ ఇదేనా?
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ’గేమ్ ఛేంజర్’ స్టోరీలైన్‌ను గతంలోనే రివీల్ చేసింది. తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ ‘గేమ్ ఛేంజర్’ ప్లాట్‌ను బహిర్గతం చేసింది. దీని ప్రకారం ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడాడు’ అన్నది ఈ మూవీ కథగా అమెజాన్ పేర్కొంది. కాగా ఇందులో చరణ్ తండ్రి కొడులుగా డ్యూయల్ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అటు ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్, సముద్రఖని, అంజలి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు.
View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)
జూలై 22 , 2024
SSMB29: ఇంకో వారంలో కథ లాక్ అయ్యే ఛాన్స్.. కీరవాణి కీలక వ్యాఖ్యలు!
‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా హిట్‌తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli).. సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఈ క్రేజీ కాంబో చిత్రం ఎప్పుడు మెుదలవుతుందా? అని యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన అప్‌డేట్స్ సైతం ఫ్యాన్స్‌ను తెగ ఖుషి చేశాయి. మహేష్ లుక్ ఇదేనంటూ బయటకొచ్చిన ఫొటోలు సైతం అందర్ని ఆకట్టుకున్నాయి. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుందని భావిస్తున్న క్రమంలో సంగీత దర్శకుడు కీరవాణి షాకింగ్ కామెంట్స్ చేశారు.
కథ రెడీ కాలేదా?
రాజమౌళి దర్శకత్వంలో రానున్న 'SSMB29' మూవీ షూట్.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సెట్స్‌పైకి వెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆగస్టు 9న ఈ మూవీ ఎట్టిపరిస్థితుల్లో మెుదలవుతుందని నమ్ముతున్నారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి వారి ఆశలపై తాజాగా నీళ్లు చల్లారు. తానింకా ఈ ప్రాజెక్ట్‌పై పని కూడా మెుదలు పెట్టలేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కథ కూడా ఇంకా ఫైనల్ కాలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొన్ని టెస్ట్ షూట్స్ జరుగుతున్నాయని.. ఒక వారంలో కథ లాక్ అయ్యే ఛాన్స్ ఉందని కీరవాణి స్పష్టం చేశారు. తన మ్యూజిక్ వర్క్స్ జులై లేదా ఆగస్టులో మెుదలుపెడతానని స్పష్టం చేశారు. టెస్ట్ షూట్స్ జరుగుతున్నాయంటే ఈ మూవీ షూటింగ్.. ఈ ఏడాది ఆఖరులో గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
కథ.. ఆ నవలల ఆధారమేనా?
రాజమౌళి తండ్రి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. ‘SSMB29’ సినిమాకు కథను అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాజమౌళి & టీమ్.. రెండు ఆఫ్రికా నవలల హక్కులను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విల్బర్ స్మిత్ రాసిన రెండు నవలలను వారు కొనుగోలు చేసినట్లు జోరుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో 'SSMB29' ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశానికి సంబంధించిన నవలల హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు రావడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. వీటి ఆధారంగానే రాజమౌళి SSMB29 తెరకెక్కించనున్నారా? అన్న సందేహాం అభిమానుల్లో మెుదలైంది. ఇందులో నిజానిజాలు ఎంతో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
మహేష్ ద్విపాత్రిభినయం!
రాజమౌళి తెరకెక్కించనున్న 'SSMB29' మూవీలో మహేష్ ద్విపాత్రిభినయం చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. అయితే దీనిపై రాజమౌళి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. ఇది సూపర్ స్టార్ అభిమానులకు నిజంగా శుభవార్త కానుంది. ఇక ఈ మూవీలో మహేష్ చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటి వరకూ చూడని మహేష్‌ను ఈ సినిమాలో చూడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నాని స్పెషల్ రోల్..!
'SSMB 29' గురించి మరో రూమర్ గతంలో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ సినిమాలో యంగ్ హీరో నాని (Nani) ఓ స్పెషల్ రోల్‌లో నటించనున్నట్లు టాక్ వినిపించింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా తెరకెక్కనుండటంతో పలు పాత్రల కోసం రాజమౌళి.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ నటీనటులను రంగంలోకి దించనున్నారట. ఈ క్రమంలోనే ఒక పాత్ర కోసం నాని పేరును ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రాజమౌళి, నాని మధ్య మంచి అనుబంధం ఉండటంతో యంగ్ హీరో నటించడం ఖాయమని అంటున్నారు. దీనిపై రాజమౌళి టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా, గతంలో రాజమౌళి రూపొందించిన 'ఈగ' సినిమాలో నాని నటించాడు. స్క్రీన్‌పైన కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఆ భామకు ఛాన్స్ దక్కిందా?
'SSMB 29' సినిమాలో హీరోయిన్‌గా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. మహేష్‌కు జోడీగా అలియా భట్ (Alia Bhatt) అయితే ఎలా ఉంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలో దర్శకుడు రాజమౌళి.. అలియా భట్‌తో పని చేశారు. ఇందులో అలియా భట్ నటన నచ్చడంతో మళ్లీ ఆమెను రిపీట్ చేసే అవకాశముందని కామెంట్లు వినిపిస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాగా, హాలీవుడ్ నటి చెల్సియా ఇస్లాన్ కూడా 'SSMB 29' చిత్రానికి ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తను కూడా మేకర్స్ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు.
జూన్ 25 , 2024
Ram Charan New Movie: మూడు నేషనల్ అవార్డ్స్ సాధించిన డైరెక్టర్‌తో రామ్‌చరణ్ కొత్త సినిమా!
చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్.. తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో నటనకు పెద్ద స్కోప్ లేని పాత్రలు చేసిన చరణ్.. ‘రంగస్థలం’ సినిమాతో తనలోని అసలైన నటుడ్ని పరిచయం చేశాడు. 'ఆర్‌ఆర్ఆర్' ద్వారా నటనలో మరో స్టెప్ పైకెక్కి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ జాతీయ స్థాయిలో బజ్ ఉంది. అటు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, సుకుమార్‌తోనూ సినిమాను అనౌన్స్ చేశాడు. లేటెస్ట్‌గా తమిళ స్టార్ డైరెక్టర్‌తో మరో ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
డైరెక్టన్ ఎవరంటే?
తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran)తో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్‌తో వెట్రిమారన్ సినిమా ఉంటుందని విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ, అది వర్కౌట్ కాలేదు. రీసెంట్‌గా చరణ్‌కు తమిళ డైరెక్టర్ కథ వినిపించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అది చరణ్‌కు బాగా నచ్చిందని సమాచారం. కథలో స్వల్ప మార్పులు చేయాలని చరణ్ సూచించినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఆ ఛేంజస్ తర్వాత త్వరలోనే వీరి కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఎవరీ వెట్రిమారన్?
తమిళంలో వెట్రిమారన్ చిత్రాలకు (Vetrimaaran Movies) చాలా గుర్తింపు ఉంది. ఆయన హీరోల కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన సినిమాల్లో కథే ప్రధాన హీరో. వెట్రిమారన్ తీసిన ‘డుకాలం’, ‘విసారణై’, ‘వడాచైన్నై’, ‘అసురన్’, ‘విడుతలై’ వంటి సినిమాలు గమనిస్తే అందులో కథే కీలక పాత్ర పోషించింది. అందులో నటీనటుల కంటే పాత్రలే ఆడియన్స్ కనిపించాయి. వెట్రిమారన్ ఇప్పటివరకూ 8 చిత్రాలకు దర్శకత్వం వహించగా అందులో మూడు నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్నాయి. అటువంటి డైరెక్టర్‌తో రామ్‌చరణ్ ప్రాజెక్ట్ ఓకే అయితే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. నటుడిగా రామ్‌చరణ్ మరో మెట్టు ఎక్కుతాడనడంలో ఎలాంటి సందేహాం ఉండదని ఫ్యాన్స్ అంటున్నారు.
రెండేళ్లు ఆగాల్సిందే!
ప్రస్తుతం రామ్ చరణ్.. తమిళ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ‘బుచ్చి బాబు’ దర్శతక్వంలో చరణ్ చేయనున్నాడు. మరోవైపు సుకుమార్‌తోనూ ఓ సినిమా చేసేందుకు చరణ్ కమిట్‌మెంట్ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసుకున్న తర్వాతనే ఆయన వెట్రిమారన్‌తో సినిమా చేసే అవకాశముంది. ఇందుకు దాదాపు రెండేళ్ల సమయం పట్టొచ్చు. అటు వెట్రిమారన్ కూడా ప్రస్తుతం 'విడుదతలై పార్ 2'కు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే గరుడాన్ అనే ఫిల్మ్‌కు కూడా వెట్రిమారన్ కథ అందిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసుకున్న తర్వాతనే రామ్‌చరణ్ మూవీపై ఆయన పూర్తిగా ఫోకస్ పెట్టనున్నారు.
బిగ్ అప్‌డేట్స్ ఎక్కడా!
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, సినిమా మొదలయి మూడేళ్లు అవుతున్నా ఒక్క సాంగ్ తప్ప ఎలాంటి బిగ్ అప్‌డేట్స్ రాలేదు. సినిమా షూట్ నుంచి అప్పుడప్పుడు వస్తున్నా లీక్స్ తప్ప సినిమాలో ఎవరి ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాలేదు. అయితే ఈ సంవత్సరం ఎలాగైన సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత దిల్‌రాజు పట్టుదలగా ఉన్నారు. కాగా, ఇందులో చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తోంది. ప్రముఖ నటి అంజలి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
మే 28 , 2024
Pushpa 2 Latest Song: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌పై ఊహించని ట్విస్ట్.. తెరపైకి ‘యానిమల్’ బ్యూటీ!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం 'పుష్ప: ది రైజ్' కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచగా.. ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ వాటిని రెట్టింపు చేసింది. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరోవైపు ‘పుష్ప 2’కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది విన్న ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
తృప్తి దిమ్రితో ఐటెం సాంగ్!
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్’.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులో నటించిన బాలీవుడ్ నటి తృప్తి దిమ్రీ.. తన గ్లామర్‌తో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. లేటెస్ట్ బజ్ ప్రకారం.. ‘పుష్ప 2’లో ఈ భామ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాంగ్ కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా తృప్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తుందని అంటున్నారు. పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత చేసిన మ్యాజిక్‌ను తృప్తి రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బన్నీ, తృప్తి కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రోమోలో ఏముందంటే?
సెకండ్ సాంగ్ ప్రోమోలో పూర్తిగా హీరోయిన్ రష్మిక మందన్ననే కనిపించింది. సాంగ్ సెట్‌లో రష్మిక మేకప్ వేసుకుంటూ కనిపించింది. ఈ క్రమంలో కేశవ వచ్చి.. శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేస్తున్నారంటగా కదా ఆ పాటేందో చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు రష్మిక ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ పాట పాడుతుంది. మీరు కూడా ఈ ప్రోమోను ఓసారి చూసేయండి.
https://www.youtube.com/watch?v=sbp9M95-2rQ&t=19sv
పూర్తి సాంగ్ ఎప్పుడంటే?
పుష్ప 2లోని రెండో పాటను మే 29న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజా ప్రోమోలో స్పష్టం చేశారు. ఆ రోజు ఉ.11.07 గం.లకు పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇది బన్నీ, రష్మిక మధ్య సాగే మెలోడీ సాంగ్ అంటూ వివరించారు. గతంలో పుష్ప సినిమాలో వచ్చిన ‘సామి.. సామి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ పాట కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఆ పాట కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఆ రోజున ఫ్యాన్స్‌కు పండగే
భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రత్యర్థిగా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahad Faasil) నటిస్తున్నారు. అనసూయ, ధనుంజయ్, సునీల్, రావు రమేశ్, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.
మే 23 , 2024
War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ నుంచి మైండ్ బ్లోయింగ్ న్యూస్.. ఊగిపోతున్న ఫ్యాన్స్!
భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై బజ్ ఏర్పడింది. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీగా హైప్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ముంబయిలో శరవేగంగా సాగుతోంది. తారక్ గత కొన్నిరోజులుగా ముంబయిలోనే ఉంటూ షూట్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ‘వార్ 2’కు సంబంధించిన క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
సిక్స్ ప్యాక్‌లో తారక్!
‘వార్ 2’ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య భారీ ఫైట్ సీన్ వుండనుందని టాక్ వినిపిస్తోంది. ఈ ఫైట్ సీన్‌లో ఎన్టీఆర్ మరోసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఫైట్ సీన్ మునుపెన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు గ్రాండ్ ఎంట్రీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ‘వార్ 2’ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ YRF (Yash Raj Films) స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
‘వార్ 2’లో మరో బాలీవుడ్ బ్యూటీ!
‘వార్ 2’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హీరోయిన్‌ను కత్రీనా కైఫ్ ఈ మూవీలో భాగం కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయమే మేకర్స్ సంప్రదించగా ఇందుకు కత్రీనా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇదే నిజమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే హృతిక్, తారక్ లాంటి టాప్ డ్యాన్సర్లు ఉన్న సినిమాలో ఐటెం సాంగ్‌ను కత్రినా చేస్తుందంటే ఫ్యాన్స్‌కు ఇక పండగే అని చెప్పవచ్చు.
దేవర నుంచి ఫస్ట్ సింగిల్
ప్రస్తుతం తారక్ 'వార్ 2'తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే మే 20న తారక్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఒక రోజు ముందే ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. మే 19న సా. 7.02 ని.లకు ఈ పాట విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు పోస్టర్‌ను సైతం రిలీజ్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/UrsVamsiShekar/status/1791707613316763915
మే 18 , 2024
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఆ విషయంలో ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ!
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ (Ram Charan) నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇవాళ రామ్‌చరణ్ పట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. ప్రస్తుతం ఈ విజువల్ ట్రీట్‌ను చూసి మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
ఫస్ట్ సాంగ్ వచ్చేసింది?
‘గేమ్ ఛేంజర్’ మెుదటి సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈపాటికే సాంగ్ రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సాంగ్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ‘జరగండి’ (Jaragandi) లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘జరగండి జరగండి జరగండి.. జాబిలమ్మ జాకెటేసుకొచ్చేనండి’ అనే లిరిక్స్‌తో ఈ పాట మొదలైంది. మాస్ ట్యూన్స్, క్యాచీ లిరిక్స్‌తో జరగండి పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు ఆనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా.. దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ ఆలపించారు. ప్రభుదేవ కొరియాగ్రఫీ చేశారు.
https://www.youtube.com/watch?v=45vS1-xtnp8
పాట ఎలా ఉందంటే?
‘జరగండి’ సాంగ్ లిరికల్ వీడియోను గమనిస్తే ఇది పక్కా డైరెక్టర్ శంకర్ మార్క్‌తో రూపొందింది. ఆయన గత చిత్రాల్లోని పాటలు ఎలా అయితే ప్రత్యేకంగా అనిపించాయో ఈ సాంగ్ కూడా అలాగే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సాంగ్ అంతా కలర్‌ఫుల్‌గా.. పదుల సంఖ్యలో డ్యాన్సర్లతో నిండిపోయింది. ఇందులో రామ్‌చరణ్, కియారా అద్వానీ పెయిర్ చాలా క్యూట్‌గా ఉంది. ఇద్దరూ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించారు. చరణ్ తన డ్యాన్స్‌తో ఇరగదీసినట్లే కనిపిస్తోంది. ప్రభుదేవ మాస్టర్ ఈ సాంగ్‌ను కొరియోగ్రాఫ్ చేస్తున్న దృశ్యాలను సైతం ఈ లిరికల్ వీడియోలో గమనించవచ్చు. ఓవరాల్‌గా ఈ సాంగ్ గేమ్ ఛేంజర్ మూవీలో ప్రధాన ఆకర్షణగా నిలిచే ఛాన్స్ ఉంది.
ఆ విషయంలో ఫ్యాన్స్ నిరాశ!
‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నారు. రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ సాంగ్‌తో పాటు విడుదల తేదీని కూడా అనౌన్స్ చేస్తారని అంతా భావించారు. అయితే అలా ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కనీసం కమింగ్ సూన్ (Coming Soon) అని కూడా ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా కోసం ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మార్చి 27 , 2024
RC 17: రామ్‌చరణ్-సుకుమార్ కాంబోలో కొత్త మూవీ.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
మెగా పవర్ రామ్‍చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అటు ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతోనూ రామ్‌చరణ్ చిత్రం ఖరారైంది. స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ‘RC16’ చిత్రానికి ఇటీవలే పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. అయితే తాజాగా రామ్‌చరణ్‌కు సంబంధించి మరో మూవీ కన్ఫార్మ్ అయ్యింది. ‘పుష్ప’ లాంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన సుకుమార్.. ‘RC17’ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు విడుదలైంది.
హోలీ స్పెషల్ అనౌన్స్‌మెంట్..
రామ్‍చరణ్ - సుకుమార్ కాంబినేషన్‍లో భారీ సినిమా తెరకెక్కనుందని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నేడు అధికారికంగా వెల్లడించింది. హోలీ సందర్భంగా చెర్రీ, సుకుమార్ రంగులు పూసుకొని సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోను ట్వీట్ చేసింది. అలాగే జోడు గుర్రాల పోస్టర్‌తో ‘రోరింగ్ టూ కాంకర్’ అనే ట్యాగ్ లైన్ మరో పోస్టర్‌ను కూడా నిర్మాణ సంస్థ పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సుకుమార్ లాంటి దిగ్గజ దర్శకుడితో రామ్‌చరణ్ మళ్లీ పనిచేయనుండటంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
https://twitter.com/MythriOfficial/status/1772195858693698029
రంగస్థలం కాంబో రిపీట్!
సుకుమార్ - రామ్‌చరణ్ కాంబోలో గతంలోనే ఈ సినిమా వచ్చింది. 2018లో వచ్చిన పీరియడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘రంగస్థలం’ భారీ విజయాన్ని అందుకుంది. నటుడిగా చెర్రీని మరోస్థాయికి తీసుకెళ్లింది. అప్పటి వరకు క్లాస్ సినిమాలతో మెప్పించిన సుకుమార్.. రంగస్థలంతో మాస్ అంటే ఏంటో చూపించారు. ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పుడు ‘ఆర్‌సీ17’ చిత్రానికి ఈ హిట్ కాంబినేషన్ మొత్తం రిపీట్ అవుతోంది.
రిలీజ్ ఎప్పుడంటే?
రామ్చరణ్ - సుకుమార్ కాంబోలో రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని... 2025 రెండో అర్ధభాగంలో రిలీజ్ చేసేలా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబుతో సినిమా పూర్తయ్యాక వెంటనే ఈ మూవీ షూటింగ్‍లో చెర్రీ పాల్గొనే ఛాన్స్ ఉంది.
మార్చి 25 , 2024
RamCharan Global Craze: రామ్ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ‘రామ్‌చరణ్’ (Ramcharan).. టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరిగా మారారు. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. ‘మగధీర’తో స్టార్ హీరోగా మారిపోయాడు. ‘రంగస్థలం’ ద్వారా తనలో దాగున్న అద్భుతమైన నటుడ్ని ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’తో రామ్‌చరణ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రం ఆస్కార్ స్థాయికి ఎదగడంతో ఇందులో నటించిన తారక్ (Jr NTR), రామ్‌చరణ్ గురించి గ్లోబల్ స్థాయిలో చర్చ జరిగింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో రామ్‌చరణ్‌కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పే పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
‘చరణ్ లాంటి నటుడు కావాలి’
హాలీవుడ్‌లో ఓ నటీనటుల ఎంపిక సంస్థ తమకి ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొన్ని పాయింట్స్ పెట్టి అందులో పలువురు హాలీవుడ్ స్టార్స్ ఫొటోలను చేర్చింది. ఆస్కార్ ఇసాక్ (Oscar Isaac), టెనెట్ (Tenet) నటుడు జాన్ డేవిడ్ వాషింగ్టన్ (John David Washington), టాప్ గన్ (Top Gun) ఫేమ్ మైల్స్ టెల్లర్ (Miles Teller) లాంటి నటులతో సహా ఆర్‌ఆర్‌ఆర్ (RRR)లో రామ్‌చరణ్ పోలీసు గెటప్‌ను చేర్చింది. తమకు వీరి రేంజ్ ఫిజిక్, లుక్స్ ఉన్న నటులు కావాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రామ్‌చరణ్ (RamCharan) లాంటి నటుడ్ని హాలీవుడ్ కోరుకుంటోందని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తమ హీరో పక్కా హాలీవుడ్ మెటిరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్ పోస్టరే ఉదాహరణ అంటూ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/TweetRamCharan/status/1763423843023196469?s=20
‘గేమ్ ఛేంజర్’లో ఎన్ని కోణాలో!
ప్రస్తుతం రామ్ చరణ్.. 'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండూ పొంతనలేని పాత్రలని టాక్. అందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీకగా నిలిచేదైతే.. మరో పాత్ర 1970-80 కాలానికి చెందిందని అంటున్నారు. రెండు పాత్రల ఆహార్యాలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో రామ్‌చరణ్ పోషిస్తున్న ఒక పాత్ర పేరు ‘రామ్ నందన్’ అని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ మూవీలో పీరియాడికల్ నేపథ్యంతో పాటు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, ప్రతీకారం, సామాజిక సమస్యలు.. అన్నీ మిళితమై ఉంటాయని వినికిడి. కైరా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, శ్రీకాంత్, ఎస్.ఎ.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అంబానీ కొడుకు వెడ్డింగ్‌కు రామ్‌చరణ్!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్‌తో ఏడడుగులు వేయబోతున్నాడు. అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫిబ్రవరి 28 నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మొదలయ్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు రామ్‌చరణ్ అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ పెళ్లి వేడుకల్లో చెర్రీ పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ మాత్రమే అనంత్ పెళ్లి వేడుకలకు హాజరుకాబోతున్నట్లు సమాచారం. రామ్‌చరణ్‌తో పాటు షారుఖ్ ఖాన్ తన భార్య పిల్లలతో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బుచ్చిబాబుతో స్పోర్ట్స్ డ్రామా చిత్రం!
గేమ్ ఛేంజర్ తర్వాత రామ్‌చరణ్.. ఉప్పెన (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu)తో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సైతం రెడీ అయిపోయింది. ఈ మూవీ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ‘RC16’ మూవీలో కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించనుంది.
ప్రొడ్యూసర్‌గానూ బిజీ బిజీ!
హీరోగా బిజీగా ఉంటూనే చిత్ర నిర్మాణంపై రామ్‌చరణ్ ఫోకస్ పెట్టాడు. తండ్రి చిరంజీవితో ఆచార్య, ఖైదీ నంబర్ 150 వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన చరణ్.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో కూడిన చిన్న సినిమాలను నిర్మిచండానికి ‘వీ మెగా పిక్చర్స్’ పేరుతో మరో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ బ్యానర్ ద్వారా ‘ది ఇండియా హౌజ్’ పేరుతో ఓ దేశభక్తి మూవీని చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు.
మార్చి 01 , 2024
Samantha in Bikini: బికినీలో తడిసిన అందాలతో రెచ్చగొడుతున్న సమంత.. దానికోసమేనా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన గ్లామర్ ఫొటోతో మరోమారు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బికినీ సూట్ డ్రెస్‌లో ఉన్న ఈ భామ బోల్డ్ ఫొటో షూట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఆఫ్రికన్ అడవుల్లోని సెలయేరులో సమంత జలకాళాడుతున్న ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి. పోక రంగు బికినీలో అందాలు ప్రదర్శన చేస్తూ చెమటలు పట్టిస్తోంది.
ఈ ఫోటోలు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. లుకింగ్ హాట్, అంటూ తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.
ఈ మధ్య వరుస పరాజయాలతో డీలా పడిన సమంత.. ఖుషి సినిమా విజయంతో కాస్త ఊరట పొందింది. అయితే టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం ఆశించినంతగా లభించడం లేదు.
View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
కుర్ర హీరోయిన్లు శ్రీలీల, నుపుర్ సనన్, ఆషికా రంగనాథ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది.
దీంతో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారేందుకు ఇలా హాట్ ఫొటో షూట్ ద్వారా ఫొటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తనలో ఏమాత్రం వేడి తగ్గలేదని నిరూపిస్తోంది.
ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత... కొద్దికాలంలోనే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది.
మహేష్ బాబు, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగుతో పాటు కోలివుడ్‌లోనూ అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ చైతు- సామ్ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు.
ఇరువురి మధ్య అభిప్రాయ భేదంతో విడాకులు తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంది.
తాను ఏ పని చేసినా హైలెట్ అవుతూ వస్తుంది. ఎంత మంది ట్రోల్ చేసిన.. ధైర్యం కోల్పోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తుంది.
ఆమెను అభిమానించే ఫ్యాన్ ఎల్లప్పుడూ సామ్‌కు అండగా ఉంటూ మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. మయోసైటిస్ వ్యాధి భారిన పడిన సామ్ కోలుకుని వరుసగా సినిమాలు చేస్తోంది.
ప్రుస్తుతం బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సిటాడెల్ సిరీస్‌లో సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సీరిస్ రిలీజ్ కావాల్సి ఉంది.
మరోవైపు సమంత కొన్ని రోజుల క్రితమే నిర్మాతగానూ మారింది. 'ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు సామ్ తెలిపింది.
ప్రస్తుతం సామ్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. కుర్ర హీరోయిన్ల కంటే పదునైన అందాల దాడి తాను చేయగలనని హింట్ ఇస్తోంది.
ఫిబ్రవరి 24 , 2024
Actress Samantha: సోషల్ మీడియాలో అకస్మాత్తుగా సమంత ట్రెండింగ్.. ఎందుకంటే?
స్టార్ హీరోయిన్ సమంత మరోమారు తన క్యూట్ ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలుచటి శారీలో స్లివ్‌లెస్ జాకెట్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది.
ఫెయిర్ లుక్‌లో తళతళ మెరిసిపోతున్న సామ్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దగ్గర్లో సమంత చిత్రాలు లేకపోవడంతో ఇలా ఫొటోల్లో ఆమెను చూసుకుంటూ సంబరపడుతున్నారు.
తాజాగా సంక్రాంతికి తాను ఏం చేశానో చెప్తూ సామ్ పలు ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. తాను వేసిన ముగ్గు, గాలిపటంతో ఆటలు, పెంపుడు జంతువులు, లైటింగ్ డెకరేట్ చేసిన ఇల్లు.. ఇలా పలు ఫొటోలను షేర్ చేసింది.
గతేడాది ఖుషితో అలరించిన సమంత త్వరలో సిటాడెల్ (ఇండియన్ వెర్షన్) వెబ్‌సిరీస్‌తో సందడి చేయనున్నారు.
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సిటాడెల్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు. రాజ్, డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
మరోవైపు సమంత కొన్ని రోజుల క్రితమే నిర్మాతగానూ మారింది. ‘ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు సామ్ తెలిపింది.
ఇదిలా ఉంటే తాజాగా సామ్ గురించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప2' చిత్రంలోనూ ఆమె ఐటెమ్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ రూమర్స్‌పై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 'పుష్ప' పార్ట్-1లో సామ్ చేసిన ఐటెమ్ సాంగ్ అప్పట్లో ఉర్రూతలూగించింది.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో సమంత సత్తా చాటింది. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్లలో సమంత రెండో స్థానంలో నిలిచింది.
బాలీవుడ్ భామ ఆలియా భట్ మెుదటి ప్లేస్ స్థానంలో నిలవగా.. దీపికా పదుకునే , కత్రినా కైఫ్, నయనతార వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఆరో స్థానంలో రష్మిక నిలవడం గమనార్హం.
ప్రస్తుతం సామ్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఈ భామ ఇన్‌స్టా ఖాతాను 31.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
జనవరి 17 , 2024