• TFIDB EN
  • లవ్ మీ
    UATelugu
    అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    ఇన్ ( Telugu )
    Watch
    2024 June 37 months ago
    లవ్‌ మీ చిత్రం జూన్ 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలిసింది
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఆశిష్ రెడ్డి
    అర్జున్
    వైష్ణవి చైతన్య
    ప్రియా
    రవి కృష్ణ
    ప్రతాప్
    సిమ్రాన్ చౌదరి
    రాజీవ్ కనకాల
    సంయుక్త మీనన్
    దివ్యవతి (అతి అతిధి పాత్ర)
    సిబ్బంది
    అరుణ్ భీమవరపుదర్శకుడు
    హర్షిత్ రెడ్డినిర్మాత
    హన్షిత రెడ్డినిర్మాత
    ఎంఎం కీరవాణి
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్‌  తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో కాస్త రొమాంటిక్ డోస్‌ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్‌ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న  థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్‌ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.  ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే..  పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్‌ సేన్‌).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు.  (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో చూసేందుకు మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు.  మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.  యక్షిణి మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి & హారర్‌ సిరీస్‌ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్‌.. నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్‌ సిరీస్‌పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్‌లో మంచి హరర్‌ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు. ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు,  మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన  కృష్ణ (రాహుల్ విజయ్)ని  ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ. పరువు నివేదా పేతురాజ్‌, నరేష్‌ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్‌ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పైన మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
    జూన్ 15 , 2024
    Movie Ticket Rs.99 at Multiplexes: మల్టీప్లెక్సుల్లో రూ.99కే సినిమా టికెట్.. ఈ ఆఫర్‌ ఆరోజు మాత్రమే!
    Movie Ticket Rs.99 at Multiplexes: మల్టీప్లెక్సుల్లో రూ.99కే సినిమా టికెట్.. ఈ ఆఫర్‌ ఆరోజు మాత్రమే!
    సాధారణంగా మల్టీప్లెక్సుల్లో సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక టికెట్‌కు రూ. 250కి పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే మే 31న మాత్రం.. సినీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. కేవలం రూ.99 టికెట్‌తో ఎంచక్కా మల్టీప్లెక్సుల్లో ఎంచక్కా సినిమాను చూసేయచ్చు. ఏ షో అయినా, ఏ సినిమా అయిన చూసే అవకాశాన్ని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ కల్పిస్తోంది. రిక్లైనర్స్, ప్రీమియం ఫార్మాట్స్ మినహాయించి మిగతా సీట్లకు మాత్రమే ఈ ఛాన్స్ అందుబాటులో ఉంటుంది.  ఈ ఆఫర్‌ ఎందుకంటే? మే 31న సినిమా లవర్స్‌ డే సందర్భంగా… మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా (Multiplex Association Of India) సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఆ రోజున రూ.99లకే తమ మల్టీప్లెక్స్‌లలో సినిమా చూసే వెసులుబాటు కల్పిస్తుసందర్భంగా న్నట్లు చెప్పింది. పీవీఆర్‌ - ఐనాక్స్‌ సినీ పోలిస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్త ఏ2, మూవీ టైం, మూవీ మ్యాక్స్, వేవ్, ఎం2కే, డిలైట్ సహా అనేక మల్టీప్లెక్సుల్లో ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ అవకాశం మే 31 ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని అసోసియేషన్‌ స్పష్టం చేసింది.  https://twitter.com/MAofIndia/status/1795374893879710125 ఇలా బుక్‌ చేసుకోండి! మే 31 సినిమా చూడాలని భావిస్తున్న వారు టికెట్‌ను ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. పేటీఎం, అమెజాన్‌ పే, బుక్‌మై షో వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా టిక్కెట్ కొనుగోలు చేస్తే రూ.99తో పాటు అదనంగా జీఎస్టీ, కన్వీనియన్స్‌ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నేరుగా థియేటర్‌ కౌంటర్ వద్ద టికెట్‌ తీసుకుంటే ఎలాంటి అదనపు రుసుము లేకుండా కేవలం రూ.99కే సినిమాను వీక్షించవచ్చు. మీ వెసులుబాటుకు తగ్గట్లు టికెట్ కొనుగోలు చేసుకోండి.  https://twitter.com/girishjohar/status/1795734272068006128 ఈ సినిమాలు చూడొచ్చు! ప్రస్తుతం థియేటర్లలో ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’, ‘రాజు యాదవ్’ సహా అనేక సినిమాలు ఉన్నాయి. అలానే ఈ శుక్రవారం పలు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. జాన్వీకపూర్, రాజ్ కుమార్ నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేశా మూవీ, కార్తికేయ గుమ్మకొండ నటించిన ‘భజే వాయు వేగం’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే యంగ్‌ హీరో విష్వక్‌ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ ఆ రోజే థియేటర్లలోకి వస్తోంది. కాబట్టి మే 31న కొత్త సినిమాలను రూ.99లకే చూసే అవకాశాన్ని అసలు మిస్‌ చేసుకోకండి. లవర్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకోండి. https://twitter.com/tanaymehrotra1/status/1795748420206100853 గతంలోనూ ఇలాగే.. రూ.99లకే మల్టీప్లెక్స్‌ టికెట్‌ ఆఫర్‌ చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది అక్టోబర్‌ 13న 'నేషనల్‌ సినిమా డే' సందర్భంగా కూడా ఈ ఆఫర్‌ను మల్టీప్లెక్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి సినీ లవర్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 6.5 మిలియన్స్‌కుపైగా ఆడియన్స్‌ మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూశారు. ఈసారి కూడా ఆ స్థాయిలోనే స్పందన ఉంటుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్‌ అంచనా వేస్తోంది. ఫ్యామిలీ అంతా తక్కువ ఖర్చుతో కొత్త సినిమా చూడాలనుకుంటే ఈ సదావకాశాన్ని మిస్‌ చేసుకోవద్దని అసోసియేషన్‌ ప్రతినిధులు సూచిస్తున్నారు.  https://twitter.com/AndhraBoxOffice/status/1711404182790680809
    మే 29 , 2024
    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
    లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. అందుకే ఈ జానర్‌లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే, చాలా సినిమా కథల్లో ప్రేమకు శుభం కార్డు పడుతుంది. కానీ, కొన్ని కథలు విషాదాంతం అవుతాయి. ప్రేమికుడు చనిపోవడమో, ప్రేయసి చనిపోవడమో లేదా ప్రేమను త్యాగం చేయడమో వంటివి జరుగుతుంటాయి. వాస్తవానికి కాస్త దగ్గరగా ఉండే సినిమా ప్రేమ కథలు తెలుగులో చాలా తక్కువగానే వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘బేబీ’ మూవీ సైతం విషాదాంతం అవుతుంది. మరి, గుండెల్ని పిండేసిన ప్రేమ కథా చిత్రాలేంటో తెలుసుకుందామా.  7/G బృందావన కాలనీ లవ్ స్టోరీ అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది ఈ సినిమానే. ఎన్ని ప్రేమ కథా చిత్రాలు వచ్చినా ఈ మూవీకి ఉండే ప్రాధాన్యత వేరు. ఒక అమ్మాయిని అబ్బాయి ఇంత గాఢంగా ప్రేమించగలడా? అనే ఆశ్చర్యం కలగక మానదు. 2004లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల మన్ననను పొందుతోంది.  ప్రేయసి రావే ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రేమ కోసం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చంటారు. మరి, ప్రేమనే త్యాగం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు. శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. నాడు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.  మహర్షి ఈ సినిమా గురించి నేటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. 1987లో వచ్చిందీ సినిమా. ఇది కూడా ఓ అమర ప్రేమికుడి కథే. ప్రేమించిన అమ్మాయికి వేరొక అబ్బాయితో పెళ్లయితే ఉండే బాధ వేరు. అనుక్షణం తననే తలుచుకుంటూ, తనను ఒక్కసారైనా చూడాలనే తపన కంటతడి పెట్టిస్తుంది. ప్రియురాలి మెప్పు పొందేందుకు చివరికి తన ప్రాణాలనే అర్పించే త్యాగధనుడు ప్రేమికుడు. నేటి యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. అభినందన లవ్ ఫెయిల్యూర్ సినిమాల్లో ముందు వరుసలో ఉంటుందీ ‘అభినందన’. ప్రతి భగ్న ప్రేమికుడు ఇందులోని పాటలు పాడుకుంటాడు. ప్రతి విరహ ప్రేమికుడు తనను తాను హీరో పాత్రలో ఊహించుకుంటాడు. ఇప్పటికీ ఈ సినిమాల్లోని పాటలను ఎంతోమంది వింటారు. 1987లో సినిమా విడుదలైంది. ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం’ అనే పాట ఈ సినిమాలోనిదే.   ఓయ్ మనసు ఇచ్చిన అమ్మాయి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఊహకు తెలియని ఒంటరితనం దరిచేరుతుంది. అలాంటి ఓ సినిమానే ఇది. మంచి ఫీల్‌ని ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి గురించి ఓ యువకుడు పడే తపన ఇందులో కనిపిస్తుంది. తనకే ఇలా ఎందుకు అవ్వాలన్న జాలి కలుగుతుంది. 2009లో ఈ మూవీ రిలీజ్ అయింది. సుస్వాగతం జీవితంపై దృష్టి పెట్టాల్సిన వయసులో ప్రేమ పేరుతో జగాన్ని మర్చిపోతే మిగిలేది శూన్యం. ఈ విషయాన్ని సుస్వాగతం మూవీ ప్రస్ఫుటిస్తుంది. ఇల్లు, కుటుంబం, భవిష్యత్‌ని లెక్క చేయకుండా ఓ అమ్మాయి వెంట తిరగడం సరికాదనే సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ప్రేమ ఒక భాగమే. కానీ, ప్రేమే జీవితం కాదనే విషయం సినిమా చూశాక బోధపడుతుంది. నేటి తరం యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. ప్రేమిస్తే ప్రేమించడం ఈజీ. కానీ, ఎదుటి వ్యక్తి ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సినిమా గుర్తుండిపోవడానికి కూడా ఇదే కారణం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను కన్నవారే నమ్మించి మోసం చేస్తే పిచ్చోడైపోయే అబ్బాయి కథ ఇది. ప్రేమికుడి దుస్థితికి తనే కారణమని విలపించే ప్రియురాలి స్వచ్ఛమైన ప్రేమకు చప్పట్లు కొట్టాల్సిందే. ఈ కథ కల్పించింది కాదు. నిజంగా జరిగింది. ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. 
    ఆగస్టు 14 , 2023
    తమన్నా భాటియా గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తమన్నా భాటియా గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తమన్నా భాటియా ప్రస్తుతం అవకాశాలపరంగా మంచి స్వింగ్‌లో ఉన్న హీరోయిన్,  తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. ఇప్పటి వరకు 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఈ మిల్క్ బ్యూటీ... ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015) హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ రాణిస్తోంది. ఇటీవల లస్ట్ స్టోరీస్2లో నటించి గ్లామర్ షోతో అదరగొట్టింది. అయితే తమన్నా గురించి చాలా మందికి తెలియని కొన్ని(Some Lesser Known Facts About Tamannaah Bhatia) ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. తమన్నా భాటియా ఎవరు? తమన్నా భాటియా భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తమన్నా దేనికి ఫేమస్? తమన్నా భాటియా.. హ్యాపీడేస్, బాహుబలి, F2 వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. తమన్నా భాటియా వయస్సు ఎంత? డిసెంబర్ 21, 1989లో జన్మించింది. ఆమె వయస్సు  34 సంవత్సరాలు  తమన్నా భాటియా ముద్దు పేరు? తమ్మి, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు  తమన్నా భాటియా ఎక్కడ పుట్టింది? ముంబై తమన్నా భాటియాకు వివాహం అయిందా? ఇంకా కాలేదు తమన్నా భాటియా అభిరుచులు? డ్యాన్సింగ్, కవితలు రాయడం తమన్నా భాటియా ఇష్టమైన ఆహారం? హైదరాబాద్ బిర్యాని తమన్నా భాటియా అభిమాన నటుడు? మహేష్ బాబు, హృతిక్ రోషన్ తమన్నా భాటియా తొలి సినిమా? చాంద్ సా రోషన్ చెహరా తమన్నా భాటియా నటించిన తొలి తెలుగు సినిమా? శ్రీ తమన్నా భాటియా ఏం చదివింది? BA చదివింది తమన్నా భాటియా పారితోషికం ఎంత? తమన్నా భాటియా ఒక్కొ సినిమాకు రూ.4 కోట్లు- రూ.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. తమన్నా భాటియా తల్లిదండ్రుల పేర్లు? సంతోష్ భాటియా, రజని భాటియా తమన్నా భాటియాకు అఫైర్స్ ఉన్నాయా? తమన్నా భాటియా తొలుత క్రికెటర్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. తమన్నా భాటియా ఎన్ని అవార్డులు గెలిచింది? 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు వచ్చాయి. తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/tamannaahspeaks/?hl=en తమన్నా భాటియా ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? తమన్నా భాటియా లస్ట్‌ స్టోరీస్ 2 వెబ్‌ సిరీస్‌లో విజయ్ వర్మతో కలిసి లిప్‌లాక్ సీన్లలో నటించింది. తమన్నా భాటియా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? సమంత, విజయ్ వర్మ తమన్నా భాటియా రోల్ మోడల్ ఎవరు? తన రోల్ మోడల్ మాధురి దీక్షిత్ అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు తమన్నా భాటియా ఎన్ని అవార్డులు గెలుచుకుంది? తమన్నా తన నటనకు గాను ఎన్నో పురస్కారాలు అందుకుంది. తమిళ్‌లో అత్యున్నత పురస్కారం కళైమామని, దయావతి మోడీ పురస్కారం, తఢకా చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును సైమా నుంచి పొందింది. https://www.youtube.com/watch?v=4pZvW7izZDw
    ఏప్రిల్ 16 , 2024
    పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పాయల్ రాజ్‌పుత్  2017లో పంజాబీ చిత్రం "చన్నా మెరేయా"తో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో "RX 100" చిత్రం ద్వారా విస్తృత గుర్తింపు పొందింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి విజయాలను అందించాయి. పాయల్ రాజ్‌పుత్ చాలా తక్కువ వ్యవధిలో అనేక విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో భాగం అయ్యింది. "RX 100", "వెంకీ మామ," "RDX లవ్, "మంగళవారం", "తమిళ చిత్రం "ఏంజెల్" వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.  శృంగార తారగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిను పాయల్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. పాయల్ రాజ్‌పుత్ ముద్దు పేరు? టింకీ పాయల్ రాజ్‌పుత్ ఎప్పుడు పుట్టింది? 1990, డిసెంబర్ 6న జన్మించింది పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా? చన్నా మేరేయా (2017) పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగులో తొలి సినిమా? RX 100(2018) పాయల్ రాజ్‌పుత్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7అంగుళాలు  పాయల్ రాజ్‌పుత్ ఎక్కడ పుట్టింది? ఢిల్లీ పాయల్ రాజ్‌పుత్ ఏం చదివింది? యాక్టింగ్‌లో డిప్లోమా చేసింది పాయల్ రాజ్‌పుత్  అభిరుచులు?  మోడలింగ్, ట్రావెలింగ్ పాయల్ రాజ్‌పుత్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యాని పాయల్ రాజ్‌పుత్‌కి  ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ పాయర్ రాజ్‌పుత్ తల్లిదండ్రుల పేర్లు? విమల్ కుమార్ రాజ్‌పుత్( అకౌంట్ టీచర్), నిర్మల రాజ్‌పుత్ పాయల్ రాజ్‌పుత్‌కి ఇష్టమైన హీరో? సల్మాన్ ఖాన్ పాయల్ రాజ్‌పుత్‌కి ఇష్టమైన హీరోయిన్? దీపికా పదుకునే పాయల్ రాజ్‌పుత్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.60లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది పాయల్ రాజ్‌పుత్  ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rajputpaayal/ పాయల్ రాజ్‌పుత్  బాయ్ ఫ్రెండ్? పాయల్ రాజ్‌పుత్ ముంబైకి చెందిన మోడల్ సౌరబ్ డింగ్రాతో డేటింగ్‌లో ఉంది. పాయల్‌కు వచ్చిన అవార్డులు?  తెలుగులో "RX 100"చిత్రానికి గాను ఉత్తమ తొలిచిత్ర నటిగా సైమా అవార్డును పొందింది. పాయల్ రాజ్‌పుత్  సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? పాయల్ రాజ్‌పుత్  సినిమాల్లోకి రాకముందు టీవీ సీరియళ్లలో నటించింది. మహాకుంభ్, సప్నోంసే భరె నైనా అనే సీరియళ్లలో పాయల్ నటించింది. https://www.youtube.com/watch?v=jPSBXjYO9uU
    ఏప్రిల్ 08 , 2024
    రీతు వర్మ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రీతు వర్మ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రీతు వర్మ తెలుగులో పెళ్లి చూపులు (2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. టక్ జగదీష్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో రీతు వర్మ నటించింది. కణం, మార్క్ ఆంటోని వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే రీతు వర్మ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About ritu varma)  విషయాలు ఇప్పుడు చూద్దాం.  రీతు వర్మ దేనికి ఫేమస్? రీతు వర్మ.. పెళ్లిచూపులు, వరుడు కావలెను, కణం చిత్రాల్లో లీడ్ రోల్  చేసి గుర్తింపు పొందింది. రీతు వర్మ వయస్సు ఎంత? 1990, మార్చి 10న జన్మించింది. ఆమె వయస్సు  33 సంవత్సరాలు  రీతు వర్మ ముద్దు పేరు? రీతు రీతు వర్మ ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు రీతు వర్మ ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ రీతు వర్మకు వివాహం అయిందా? ఇంకా కాలేదు రీతు వర్మ అభిరుచులు? యోగ, ట్రావెలింగ్, సినిమాలు చూడటం రీతు వర్మకు ఇష్టమైన ఆహారం? ఇటాలియన్ వంటకాలు రీతు వర్మ ఫెవరెట్ హీరో? మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రణ్‌బీర్ కపూర్ రీతు వర్మకు ఇష్టమైన హీరోయిన్? మాధురి దీక్షిత్, శ్రీదేవి రీతు వర్మ ఫెవరెట్ సినిమాలు? క్వీన్, హేట్ లవ్ స్టోరీస్ రీతు వర్మ సిగరెట్ తాగుతుందా? తెలియదు రీతు వర్మ మద్యం తాగుతుందా? తెలియదు   రీతు వర్మ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? పెళ్లి చూపులు రీతు వర్మ ఏం చదివింది? మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చదివింది రీతు వర్మ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. రీతు వర్మ తల్లిదండ్రుల పేర్లు? దిలిప్ కుమార్ వర్మ, సంగీత వర్మ రీతు వర్మకు అఫైర్స్ ఉన్నాయా? తెలియదు రీతు వర్మ ఎన్ని అవార్డులు గెలిచింది? పెళ్లి చూపులు చిత్రానికిగాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది రీతు వర్మ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rituvarma/ రీతు వర్మ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? ఇంతవరకు అలాంటి సీన్లలో నటించలేదు https://www.youtube.com/watch?v=m3ldXnuR8Po
    ఏప్రిల్ 08 , 2024
    <strong>సంయుక్త విశ్వనాథన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    సంయుక్త విశ్వనాథన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    సంయుక్త విశ్వనాథన్.. చారి 111 చిత్రం(2024) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా యావరేజ్‌గా ఆడిన మంచి గుర్తింపు సాధించింది. సంయుక్త తెలుగులో కంటే తమిళంలో మంచి పేరు సంపాదించింది. అక్కడ మోడ్రన్ లవ్ చెన్నై వంటి హిట్ చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది. మరి ఈ చెన్నై ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. సంయుక్త విశ్వనాథన్ పుట్టిన తేదీ? 19 Nov 1998 సంయుక్త విశ్వనాథన్ ఎక్కడ పుట్టింది? చెన్నైలో జన్మించింది. సంయుక్త విశ్వనాథన్ నటించిన తొలి సినిమా? మోడ్రన్ లవ్ చెన్నై సంయుక్త విశ్వనాథన్ తెలుగులో నటించిన తొలి సినిమా? చారి 111 సంయుక్త విశ్వనాథన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 4అంగుళాలు&nbsp; సంయుక్త విశ్వనాథన్ అభిరుచులు? షాపింగ్, ట్రావెలింగ్ సంయుక్త విశ్వనాథన్‌కు ఇష్టమైన ఆహారం? ఇండియన్ వంటకాలు సంయుక్త విశ్వనాథన్‌కు ఇష్టమైన కలర్?&nbsp; బ్లాక్&nbsp; సంయుక్త విశ్వనాథన్‌కు ఇష్టమైన హీరో? దళపతి విజయ్ సంయుక్త విశ్వనాథన్ ఏం చదివింది? MBA సంయుక్త విశ్వనాథన్ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.25లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. సంయుక్త విశ్వనాథన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? సంయుక్త విశ్వనాథన్ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. సంయుక్త విశ్వనాథన్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/samyukthaviswanathan View this post on Instagram A post shared by The Dancers Club (@tdc.thedancersclub)
    అక్టోబర్ 22 , 2024
    <strong>Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!</strong>
    Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!
    ప్రేమ అంటే రెండు అక్షరాల కలయిక కాదు. రెండు మనసుల కలయిక. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పరితపించేది, అన్వేషించేది ప్రేమ కోసమే. మనిషి నుంచి పశు పక్ష్యాదుల వరకు ప్రేమతోనే జీవితాలు ముందుకు సాగుతుంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలతో సంబంధం లేకుండా జీవన నావా ముందుకు సాగాలంటే ప్రేమ అనే చమురు చాలా అవసం. ఒకరిపై ఎంత ప్రేమో చెప్పాలంటే మాటలు సరిపోవు. కానీ కొన్ని మనసును తాకి మనలోని ప్రేమను ధ్వనింపజేస్తాయి. తెలుగు సినీలోకంలో ప్రేమ కావ్యాలు కోకొల్లలు. ప్రేక్షకులను ప్రేమ మాయలోకి దింపిన ఆ దృశ్య కావ్యాల నుంచి మనసుకు హత్తుకునేలా చేసిన డైలాగ్స్ మీకోసం.. [toc] బేబీ “ఫస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడే అనుకున్నా.. రెండోసారి, ఇంకోసారి ప్రేమ అనే మాట ఉండదని” “మీ అంత బలం లేకుండొచ్చు. గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఇంకెవడూ ఎవడూ కొట్టలేడు” “అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు కష్టం వస్తుందని దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడు” వాన “ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నన్ను మర్చిపోయినా.. ముసలిదానివైపోయినా.. చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు” మన్మథుడు “నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంతిష్టమో చెప్పగలను!” కంచె&nbsp; “గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం” నిన్నుకోరి “నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే… లైఫ్‌ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది” ఆర్య “నీ కోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను “ ఆరెంజ్‌ “ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే.. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే.. జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి” ప్రేయసిరావే “ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవ కణంలోనూ నీ జ్ఞాపకమే ఉంటుంది.” ఏమాయ చేశావె “ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే , ఒక్క నువ్వు తప్ప.” మళ్లీ మళ్లీ ఇది రాని రోజు “కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!”&nbsp; మజిలి “పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది” ఊపిరి “ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెబితే.. ఎక్కడ రిజెక్ట్‌ చేస్తారోనని భయం. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయం. మనకి కావాల్సిన వాళ్లు దూరమైతే.. ఎలా ఉన్నారని భయం. నిజానికి భయం ఉంటే.. ప్రేమ ఉన్నట్టే” జాను “పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే” అందాల రాక్షసి “నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను” "రాళ్ళను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు." ఓయ్ “నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే” కలర్ ఫొటో “ప్రేమించిన వారిని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ.” “ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి..ఈ సముద్రం గట్టున నిల్చున్న మనిషి ఇద్దరూ ఒకటే సముద్రం వచ్చి చల్లగా మన కాళ్లు కడుగుతోందని అనుకుంటాం. కానీ మనకే తెలియకుండా కాళ్ల కింద ఇసుకని వెనక్కి లాగేసుకుని పోతుంది. &nbsp;మొగుడి దగ్గర మనసు దాచుకోగలం.. కానీ ఒళ్లు దాచలేం.” “ఈ ప్రపంచం మొత్తమ్మీద స్వచ్ఛమైన వాటిలో రెండోది అమ్మాయి నవ్వు.మొదటిది ఓ మగాడి కన్నీళ్లు.” “నీరు పట్టిన చద్దన్నం ఆకలి తీర్చకపోవచ్చు..కానీ కుడితి కలిపి పెడితే ఆవులు ఆవురావురుమంటూ తాగుతాయి. అలాగే మురికి నీళ్లు మనకు దాహం తీర్చకపోవచ్చు..కానీ నిప్పును ఆర్పుతాయి. ప్రపంచంలో ఏదీ ఊరికే పోదు అన్నీ ఉపయోగపతడాయి.” మనం “మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు” పడిపడిలేచె మనసు మిమ్మల్ని ప్రేమించిన వాళ్లకి.. అది కష్టమైనా, నష్టమైనా చివరి వరకూ మీతోనే ఉండాలనిపిస్తుంది. హలో గురు ప్రేమకోసమే “గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి... మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం.” తీన్‌మార్ “మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్‌ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది” అల వైకుంఠపురములో.. “ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కరెక్టే.., కానీ నిజం చెపితేనే కదా, ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.” “బరువు పైన ఉంటే కిందకి చూడలేం, ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.” “ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే వెలుగు, అదే గుడిలో వెలిగితే ఊరంతటికి వెలుగు” “ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మ నాన్నలు అనుకోవడమేనా, అమ్మ, నాన్ననాన్నలు బాగుండాలని పిల్లలు అనుకోరా.! “ఒక యుద్ధం వచ్చిన దేశం లో ఉన్నవాళ్ళందరూ, కులం, మతం ప్రాంతం అనే తేడాలు లేకుండ కలిసిపోతారు సర్, &nbsp;ఒక కష్టం వచ్చినప్పుడే, కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ల స్వార్థం, ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.”
    ఆగస్టు 23 , 2024
    Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
    Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
    ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; సరిపోదా శనివారం నాని హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్‌ రిలీజైంది. ప్రముఖ నటుడు సాయికుమార్‌ నానితో పాటు ఈ పోస్టర్‌లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్‌ కానున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.&nbsp; RT 75 ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. తన తర్వాతి ప్రాజెక్టును ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్‌ మౌళి ప్రముఖ నటుడు నవదీప్ (Navdeep) హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ ట్రైలర్‌ వీక్షకులను ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/i/status/1777920829575078381 అరణ్మనై 4&nbsp; రాశీ ఖన్నా (Rashi Khanna), తమన్నా (Tamannaah), సుందర్. సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరణ్మనై 4’ (Aranmanai 4) చిత్రం నుంచి కూడా ఉగాది కానుకగా ఓ పోస్టర్‌ విడుదలైంది. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్‌ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. కమిటీ కుర్రోళ్లు నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్‌ నెం.1 చిత్రానికి ఉగాది సందర్భంగా టైటిల్‌ ఎనౌన్స్ చేశారు. 'కమిటీ కుర్రోళ్లు' అనే పేరును ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను సుప్రీమ్‌ హీరో సాయి దుర్గా తేజ్‌ అనౌన్స్‌ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు యదు వంశీ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. https://twitter.com/i/status/1777941376782786758 ధూం ధాం చైతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ (Hebha Patel) జంటగా నటిస్తున్న 'ధూం ధాం' (Dhoom Dhaam) చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కనిపించింది. ఈ మూవీని దర్శకుడు సాయి కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు.&nbsp; ఏ మాస్టర్‌ పీస్‌&nbsp; సుకు పూర్వజ్‌ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్‌ పీస్‌' (A Master Peace). అరవింద్‌ కృష్ణ, జ్యోతి పుర్వాజ్‌, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పండగ సందర్భంగా పోస్టర్‌ రిలీజైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేవకి నందన వాసుదేవ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్‌ గల్లా (Ashok Galla) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vaasudeva). మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇందులో అశోక్‌ గల్లా లుక్ ఆకట్టుకుంటోంది. భలే ఉన్నాడే! యువ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tharun) హీరోగా రూపొందుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి ఓ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో రాజ్‌ తరుణ్‌ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించాడు.&nbsp; ప్రతినిధి 2 నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Pratinidhi 2). ఈ మూవీ పోస్టర్‌ కూడా ఉగాది సందర్భంగా విడుదలై సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.&nbsp; కృష్ణమ్మ&nbsp; సత్యదేవ్‌ (Satya Dev) లేటెస్ట్‌ మూవీ ‘కృష్ణమ్మ’ (Krishnamma) నుంచి ఉగాది సందర్భంగా ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీలోని దుర్గమ్మ పాటను ఏప్రిల్‌ 11న ఉ.11.11 గం.లకు రిలీజ్‌ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో సత్యదేవ్‌ త్రిశూలం పట్టుకొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు.&nbsp;
    ఏప్రిల్ 10 , 2024
    Cute Love Proposal: తెలుగు సినిమాల్లో క్యూట్ లవ్ ప్రపోజల్ సీన్స్‌
    Cute Love Proposal: తెలుగు సినిమాల్లో క్యూట్ లవ్ ప్రపోజల్ సీన్స్‌
    ప్రేమ. ఈ రెండక్షరాల పదం ఒక మనిషిని మార్చగలదు. విచ్ఛిన్నం చేయగలదు. &nbsp; తెలుగు సినిమాలో కొన్ని రొమాంటిక్ లవ్ ప్రపోజల్స్‌ గురించి తెలుసుకుందాం. ఆ మరపురాని సన్నివేశాలను మరోసారి గుర్తు చేసుకుందాం.&nbsp;&nbsp; అందాల రాక్షసి - ఈ జనరేషన్‌లో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథల్లో అందాల రాక్షసి ఒకటి. హీరో తన ప్రేమను కవితాత్మకంగా వర్ణిస్తూ ప్రపోజ్‌ చేయటం మనసులకు హత్తుకుంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=tTKfsFq_6lM సఖి -&nbsp; మాధవన్, శాలిని మధ్య లవ్‌ ప్రపోజల్‌ సన్నివేశం తరాలపాటు గుర్తుండిపోతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టించే శక్తి మణిరత్నం సంభాషణలకు ఉంది అనిపించే స్థాయిలో మాటలు ఉంటాయి.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=NflqnPbBmOQ ఆర్య - సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య సినిమాలో క్లైమాక్స్‌ గుండెల్ని పిండేస్తుంది. ఆర్యపై తనకున్న ప్రేమను తెలుసుకున్న గీత అతడి దగ్గరికి పరిగెత్తుకెళ్లటం చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి.&nbsp; https://www.youtube.com/watch?v=UyywQrR6NvY 3 (Three)&nbsp; - ఈ చిత్రంలో రామ్‌ తన ప్రేమ గురించి జననికి చెప్పినప్పుడు ప్రేమలో స్వచ్ఛత, యుక్త వయసులో కలిగే ఫీలింగ్స్‌ను తెలుపుతాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఈ సన్నివేశం ఎప్పుడూ ప్రత్యేకమే. https://www.youtube.com/watch?v=p0paKJ9vaXM ఏ మాయ చేసావే - మీ భాగస్వామి పట్ల ఉన్న ప్రేమ కారణంగా గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ డ్రామాకు సలాం కొట్టాల్సిందే. కార్తిక్‌ ప్రేమను జెస్సీ అంగీకరిస్తూ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ, ఇందులో చైతూ, సామ్‌ నటన ఆ ప్రేమ సన్నివేశాన్ని మరింత అందంగా మార్చాయి.&nbsp; https://www.youtube.com/watch?v=C3rLlWq5kLk మిర్చి - ఈ సినిమాలో ప్రేక్షకుల మనసును గెలిచే ఈ సన్నివేశం కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ, సీన్‌ ప్రభావం మాత్రం బాగా ఉంటుంది. ఒక్క ఛాన్స్‌ ఇస్తావా అంటూ ప్రభాస్‌ అనుష్కకి ప్రపోజ్‌ చేసే సన్నివేశానికి విజిల్స్‌ పడ్డాయి.&nbsp; https://www.youtube.com/watch?v=Yqu04K59uuw కలర్‌ ఫొటో- తెలుగు చిత్ర పరిశ్రమలో ఊహించని ప్రయత్నం ఈ సినిమా. అమాయకత్వం, నిజాయితీ అనే భావాలను కలర్‌ ఫొటోలో చూపించారు. నిజాయితీగా తన ప్రేమను హీరోయిన్‌కు చెప్పి ఆమెను ఒప్పించే సీన్‌ ఓ అద్భుతం.&nbsp; https://www.youtube.com/watch?v=ADBaHmoWxmQ సూర్య S/O కృష్ణన్‌ - దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఈ సినిమా ద్వారా తనలో మరో కళను బయటపెట్టాడు. చిత్రంలో తండ్రి, కుమారుడు మధ్య సమాంతరంగా జరిగే ప్రేమ సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. కానీ, ‘నాలోనే పొంగెను నర్మద’ అనే పాట పాడుతూ హీరోయిన్‌కు తన ప్రేమను తెలిపే సన్నివేశం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=hQycQ7r_OsI మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు - ప్రేమించిన వ్యక్తి పట్ల ఉండే ఫీలింగ్స్‌ గురించి సినిమా సాగుతుంది. ప్రత్యేకంగా శర్వానంద్‌, నిత్యమీనన్‌ కొన్ని సంవత్సరాల తర్వాత కలిసినప్పటికీ వారిద్దరి మధ్య అదే గౌరవం, ప్రేమ ఉండటం, ఇద్దరూ కవిత్వం ద్వారా ప్రేమను వ్యక్తపరచడం సినిమాలో అదిరిపోయే సీక్వెన్స్‌. https://www.youtube.com/watch?v=U7itGT4xajs మజ్ను నాని హీరోగా నటించిన మజ్ను.. మీ జీవితంలో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్స్‌ను గుర్తు చేసే సినిమా. ఇందులోని లవ్‌ లెటర్‌ సీన్‌ ఒక మనిషి నిజంగా ప్రేమలో పడితే ఎన్ని ఎమోషన్స్‌ ఉంటాయో తెలియజేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=mat52aolY9g
    ఫిబ్రవరి 13 , 2024
    <strong>OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!</strong>
    OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!
    సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు స్మాల్‌ హీరోల సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు&nbsp; భలే ఉన్నాడే (Bhale Unnade) రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఇందులో మనీషా కంద్కూర్‌ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్‌ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్‌ సమర్పణలో రవికిరణ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మత్తు వదలరా 2 (Mathu Vadalara 2) శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది.&nbsp; ధూం ధాం (Dhoom Dhaam) చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్‌ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీమోహన్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. రామ్‌కుమార్‌ నిర్మాత. సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, గోపీమోహన్‌ కథ ఆకట్టుకుంటుందని నిర్మాత ఎం.ఎస్‌.రామ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్‌ సంగీతం సమకూర్చారు.&nbsp; ఉత్సవం (Utsavam) దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్‌ తెలిపారు.&nbsp; ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu) మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ 'కమిటీ కుర్రోళ్లు'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టింది. ఇందులో సందీప్ సరోజ్, పి సాయి కుమార్, గోపరాజు రమణ, శరణ్య సురేష్, యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) రవితేజ, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబోలో రూపొందిన లేటెస్ట్‌ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 2018లో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్ దేవగన్ నటించిన 'రైడ్'కి రీమేక్‌గా ఇది రూపొందింది. పంద్రాగస్టు రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో సెప్టెంబర్‌ 12న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఓటీటీలోకి రాబోతోంది. ఇందులో రవితేజతో పాటు భాగ్యశ్రీ బోర్సే. జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఆయ్‌ (Aay) నార్నే నితిన్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘ఆయ్‌’ (Aay). తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఆగస్టు 15 విడుదలైన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకొని సినీ తారల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా సెప్టెంబర్ 12 నుంచి ప్రసారం కానుంది.&nbsp; తలవన్‌ (Thalavan) జిస్‌ జాయ్‌ దర్శకత్వంలో బిజు మేనన్‌, ఆసిఫ్‌ అలీ నటించిన మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘తలవన్‌’. మేలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సెప్టెంబర్ 12 నుంచి ‘సోనీలివ్‌’(SonyLIV)లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ ఇలా మొత్తం ఏడు భాషల్లో సినిమాను వీక్షించవచ్చు. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateSector 36MovieHindiNetflixSept 13Breaking Down The WallDocumentaryEnglishNetflixSept 12Emily In Paris S4SeriesEnglishNetflixSept 12Midnight At The Pera Palace S2SeriesEnglishNetflixSept 12Uglies&nbsp;MovieEnglishNetflixSept 13ThangalaanMovieTelugu/TamilNetflixSept 20The Money GameDocumentaryEnglishAmazonSept 10Stree 2MovieHindiAmazonSept 27BerlinMovieHindiZee 5Sept 13NunakijiMovieMalayalamZee 5Sept 13Bench LifeSeriesTeluguSonyLIVSept 12Goli Soda RaisingMovieTamilHotstarSept 13How To Die AloneMovieEnglishHotstarSept 13In Vogue: The 90sDocumentaryEnglishHotstarSept 13Kalbali RecordsMovieHindiHotstarSept 12Late Night With DevilMovieEnglishLions GateSept 13VisfotMovieTeluguJio CinemaSept 7
    సెప్టెంబర్ 09 , 2024
    Vijay Deverakonda: ఆ రోజు చాలా బాధపడ్డా… కానీ ఇప్పుడు 400 మిలియన్ల లవ్ సాధించా
    Vijay Deverakonda: ఆ రోజు చాలా బాధపడ్డా… కానీ ఇప్పుడు 400 మిలియన్ల లవ్ సాధించా
    నేషనల్ క్రష్ రష్మిక మంధాన(Rashmika Mandanna), రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫేయిర్‌ అంటే తెలుగులో ఓ ట్రెండ్ సెట్ చేసింది. వీరు చేసింది రెండు సినిమాలే అయినా సిల్వర్ స్క్రీన్‌ పేయిర్‌గా గుర్తింపు పొందారు. అంతలా వీరి మధ్య కెమిస్ట్రీ కుదురిందని చెప్పవచ్చు. వీరిద్దరు కలిసి నటించినా తొలి చిత్రం 'గీతా గోవిందం'బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఏకంగా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను పరుశురామ్ తెరకెక్కించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాణం అయింది. ఈ చిత్రంలో విజయ్- రష్మిక జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.&nbsp; మరో సినిమా వీరి కాంబినేషన్‌లో రావాలని ఆశపడ్డారు.దీంతో ఈ జోడి మళ్లి కలిసి పనిచేసింది. యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ డియర్ కామ్రెడ్(Dear Comrade) చిత్రాన్ని రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని&nbsp; మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై&nbsp; నిర్మించారు.మించారు.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించాయి. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో సూపర్బ్‌గా నటించాడు. అవుట్‌ అండ్ అవుట్ యాక్షన్‌ సీక్వెన్స్‌తో అలరించాడు. ఈ చిత్రంలో లిల్లి క్యారెక్టర్‌లో రష్మిక మంధాన క్రికెటర్‌గా అద్భుతంగా నటించింది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లకు ప్రేక్షకులు విజిల్స్ వేశారు. ఇద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను కదిలించాయి. ఈ సినిమా తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. సోషల్ మీడియాలో విజయ్ యాంటి ఫ్యాన్స్ ఈ సినిమాపైన కూడా ట్రోల్స్ మొదలు పెట్టారు. అయితే అవేమీ విజయ్ సక్సెస్‌ను ఆపలేకపోయాయి. ఈ థియేటర్లలో రాణించకపోయినప్పటికీ.. ఓటీటీలో దుమ్ము రేపింది. డబ్ అయిన అన్ని భాషల్లో మంచి టాక్ సంపాదించి విజయం సాధించింది. డియర్ కామ్రెడ్ రికార్డు.. తాజాగా.. డియర్ కామ్రెడ్ హిందీ డబ్‌డ్‌ వెర్షన్ రికార్డు క్రియేట్ చేసింది.&nbsp; హిందీలో డబ్ అయిన ఈ చిత్రం యూట్యూబ్‌లో ఏకంగా&nbsp; 40 కోట్ల ప్లస్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇదే విషయాన్ని డియర్ కామ్రెడ్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్‌ ద్వారా తన సంతోషాన్ని ట్వీట్ చేసింది. తెలుగులో ఈ సినిమా కథాంశం ప్రేక్షకులకు ఎక్కకున్నా హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. విజయ్- రష్మిక బాండింగ్ సూపర్బ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు విజయ్ నుంచి రావాలని మెసెజేస్ పెడుతున్నారు. &nbsp; ఈ విషయాన్నీ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది. ఆ రోజు బాధపడ్డాం.. మరోవైపు విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపాడు. 400 మిలియన్ లవ్&nbsp; సాధించాము. 2019లో డియర్ కామ్రెడ్ విడుదలైన రోజున కొంత బాధపడ్డాం. కానీ ఇప్పుడు 400 మిలియన్‌ లవ్ మమ్మల్ని తడిసి ముద్ధచేసింది.&nbsp; ఎన్ని సినిమాలు వచ్చినా తన లైఫ్‌లో డియర్ కామ్రెడ్ చిత్రం ప్రత్యేకమంటూ రాసుకొచ్చాడు. ఇదే పోస్ట్‌ను రష్మిక మంధానకు సైతం ట్యాగ్ చేశాడు. రష్మిక మంధాన సైతం దీనిపై స్పందించింది. విజయ్ దేవరకొండ పోస్ట్ స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టా రీల్‌లో పోస్ట్ చేసింది. విజయ్ బిజీ బిజీ ఇక ఇదిలా ఉంటే విజయ దేవరకొండ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫెమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న VD12 చిత్రాన్ని విజయ్ చేస్తున్నాడు. ఈ సినిమా పిరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకీర్తయన్ డెరెక్షన్‌లో VD14 చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ది లెజెండ్ ఆఫ్ కర్స్‌డ్ ల్యాండ్ అంటూ ఈ సినిమా ట్యాగ్ లైన్‌ ఉంది. ఈ రెండు సినిమాలు విజయ్ కెరీర్‌కు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో ఈ సినిమాలను చాలా జాగ్రత్తగా విజయ్ టెకప్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరోవైపు రష్మిక మంధాన పుష్ప2 ప్రమోషన్‌లో బిజీగా ఉంది. యానిమల్ సినిమా సక్సెస్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లో అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లైన చావా(హిందీ), కుబెరా(తమిళ్) సినిమాల్లో నటిస్తోంది.
    జూన్ 15 , 2024
    నాగచైతన్య (Naga Chaitanya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నాగచైతన్య (Naga Chaitanya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    స్టార్ కిడ్‌గా తెరంగేట్రం చేసినప్పటికీ నాగ చైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ప్రస్తుతం&nbsp; సక్సెస్ బాటలో పయనిస్తున్నాడు. టాలీవుడ్‌లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నా నాగ చైత్య గురించి కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. నాగచైతన్య ఎవరు? టాలీవుడ్‌లో స్టార్ హీరో నాగార్జున తనయుడు. దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడు నాగచైతన్య ముద్దు పేరు? చై నాగ చైతన్య ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు నాగచైతన్య ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ నాగ చైతన్య పుట్టిన తేదీ ఎప్పుడు? 1986 నవంబర్ 23 నాగ చైతన్య భార్య పేరు? సమంత, ప్రస్తుతం వారు విడిపోయారు సమంత- నాగ చైతన్య ఎప్పుడు విడిపోయారు? &nbsp;వ్యక్తిగత కారణాలతో 2021 అక్టోబర్ 2న విడిపోయారు. నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకున్నాడా? లేదు, కానీ ఓ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నాగ చైతన్య అభిరుచులు? ట్రావెలింగ్ నాగ చైతన్య అభిమాన నటుడు? నాగార్జున, ఆమిర్ ఖాన్ నాగ చైతన్య అభిమాన హీరోయిన్? అనుష్క శెట్టి నాగ చైతన్యకు స్టార్ డం అందించిన సినిమాలు? ఏ మాయా చేసావే, 100%లవ్,&nbsp; నాగ చైతన్యకు ఇష్టమైన కలర్? బ్లాక్ నాగ చైతన్య ఏం చదివాడు? St. మేరీస్ కాలేజీలో డిగ్రీ నాగ చైతన్య ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 28 సినిమాల్లో నటించాడు నాగ చైతన్యకు ఇష్టమైన ఆహారం? చేపల పులుసు https://www.youtube.com/watch?v=1dHAFadok8g నాగ చైతన్య సినిమాకు ఎంత తీసుకుంటారు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.10కోట్లు- రూ.12 తీసుకుంటున్నారు. నాగ చైతన్య గెలుచుకున్న అవార్డులు? మొదటి చిత్రం జోష్ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సౌత్ స్కోప్ సినిమా అవార్డ్స్, మనం చిత్రానికిగాను నంది అవార్డు అందుకున్నారు.
    మార్చి 19 , 2024
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు&nbsp; కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు&nbsp; కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్‌ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్‌ ఇమేజ్‌ ప్రేక్షకులను థియేటర్‌కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్‌ వస్తే తప్ప థియేటర్‌కు ఎవరూ వెళ్లరు. అలా&nbsp; తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్‌తో మూడో రోజు కల్లా దూసుకు పోయిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం.&nbsp; ఉప్పెన మెగాస్టార్‌ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్‌ తేజ్‌ మెుదటి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓపెనింగ్స్‌ ఫర్వాలేదనిపించినా.. హిట్‌ టాక్ రావటంతో మూడో రోజు ఏకంగా రూ. 8.26 కోట్లు కొళ్లగొట్టింది. చిత్రాన్ని రూ.15 కోట్లు పెట్టి తీస్తే రూ.83 కోట్లు వచ్చాయి.&nbsp; ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను విజయ్ సేతుపతి మెుదట ఒప్పుకోలేదు. దర్శకుడు పట్టుబట్టడంతో సైన్ చేశారు. చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను మార్చి కృతి శెట్టిని తీసుకున్నారు. ఆమె కారణంగా మరింత బజ్‌ వచ్చింది. దసరా&nbsp; నేచురల్‌ స్టార్‌ నాని నటించిన పవర్‌ ప్యాక్డ్‌ మాస్ చిత్రం దసరా. లుక్‌, యాసతో నటీనటులందరూ అదరగొట్టారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. రూ. 65 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 110 కోట్లు రాబట్టింది. ఇక మూడోరోజు రూ. 6.73 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. శ్రీకాంత్‌ ఓదెల మెుదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా అలా కనిపించదు. మరో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇచ్చి హిట్‌ కొట్టాడు నాని.&nbsp; విరూపాక్ష సాయిధరమ్ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన విరూపాక్ష హిట్‌ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. మూడోరోజు రూ. 5.77 కోట్లు రాబట్టింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు టాక్ తెలుసుకుందామని సినిమాకు వెళితే అతడి ఫోన్ కొట్టేశారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html లవ్‌ స్టోరీ శేఖర్ కమ్ముల మరో మ్యాజికల్‌ చిత్రం లవ్‌ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడో రోజు రూ. 5.19 కోట్లు వసూలు చేసింది. కులం అనే సున్నితమైన అంశాన్ని ప్రేమకథకు జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు శేఖర్. ఇందులో చైతూ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.&nbsp; బింబిసార కల్యాణ్‌రామ్‌కు మంచి హిట్‌ ఇచ్చిన సినిమా బింబిసార. చరిత్రలోని ఓ కథను తీసుకొని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు రూ. 5.02 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. రూ. 40 కోట్లు పెట్టి తీస్తే రూ. 65 కోట్లు సాధించింది. బింబిసార ఫ్రాంఛైజీలో భాగంగా మరో పార్ట్‌ కూడా వస్తుంది. చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై కల్యాణ్‌రామ్ స్వయంగా నిర్మించాడు.&nbsp; ఇస్మార్ట్ శంకర్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌, పూరి జగన్నాథ్‌లకు మంచి కిక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్‌. మెుదట్నుంచే కలెక్షన్లలో దూసుకెళ్లిన ఈ చిత్రం మూడో రోజు రూ. 4.32 కోట్లు రాబట్టింది. సినిమాకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టగా ఏకంగా రూ. 75 కోట్లు వచ్చాయి. సినిమాలో నటించిన నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వరుస కట్టాయి. మణిశర్మ బాణీలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి.&nbsp; భీష్మ వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబోలో వచ్చిన కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌ భీష్మ. బాక్సీఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం మూడో రోజు వసూళ్లు రూ. 4.31 కోట్లు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతుంది. భీష్మ, ఛలోని మించి ఉంటుందని దర్శకుడు చెప్పాడు. జాతి రత్నాలు కరోనా తర్వాత థియేటర్లలో జనం బాగా ఎంజాయ్ చేసిన సినిమా జాతి రత్నాలు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మస్త్‌ వసూళ్లు వచ్చాయి. బ్లాక్‌బస్టర్ టాక్ రావటంతో మూడో రోజు రూ. 4.28 కోట్లు రాబట్టింది. కేవలం రూ. 4 కోట్లు ఖర్చు చేయగా.. రూ. 65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కార్తీకేయ 2 ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాలీవుడ్‌ను షేక్ చేసింది కార్తీకేయ 2. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లోనూ కోట్లు రాబట్టిన కార్తీకేయ 2 మూడో రోజు కలెక్షన్లు రూ. 4.23 కోట్లు. సినిమాకు అయ్యింది రూ. 15 కోట్లు.. కానీ రూ. 117 కోట్లు కొళ్లగొట్టింది. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని నిఖిల్ చెప్పడంతో ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అఖిల్, పూజా హెగ్డే కాంబోలో లవ్‌ స్టోరీ స్పెషలిస్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తీశాడు. యావరేజ్ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లలో దూసుకెళ్లింది. ఈ సినిమాకు మూడో రోజు రూ. 4.03 కోట్లు సాధించింది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్‌ సినిమాకు హైలెట్. కలెక్షన్ల పరంగా రూ. 51 కోట్లు రాబట్టింది అఖిల్ సినిమా.
    ఏప్రిల్ 24 , 2023
    LOVE SONGS: అబ్బాయిని ఇష్టపడుతూ అమ్మాయిలు పాడే పాటలు ఇవే… సెన్సేషనల్ హిట్స్‌
    LOVE SONGS: అబ్బాయిని ఇష్టపడుతూ అమ్మాయిలు పాడే పాటలు ఇవే… సెన్సేషనల్ హిట్స్‌
    అమ్మాయి మీద ప్రేమతో కవిత్వాలు, పాటలు రాసి వారికి చెప్పడం చాలా సహజం. ఎన్నో సినిమాల్లో అలాంటి పాటలు మనకు కనిపించాయి. కానీ, అబ్బాయి మీద ప్రేమను తెలియజేస్తూ వచ్చే పాటలు తక్కువగా ఉంటాయి. తెలుగు సినిమాల్లో అలాంటి సాంగ్స్‌ కొన్ని మీకోసం.&nbsp; మాష్టారు మాష్టారు… ప్రస్తుతం క్కడ విన్నా ఒకే పాట వినబడుతుంది. ధనుష్ హీరోగా వచ్చిన సార్‌ చిత్రంలోని&nbsp; “మాష్టారు మాష్టారు నా మనసును గెలిచారు” అనే సాంగ్ . హలో ట్యూన్‌లో వైరల్‌గా మారిన ఈ పాట కూడా అబ్బాయిపై ప్రేమని చెప్పే పాటనే. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. https://www.youtube.com/watch?v=7JBPq28O0sY సామీ సామీ… అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని సామీ సామీ అంటూ సాగే పాట ఈ కోవలోకి వస్తుంది. పుష్ప గురించి హీరోయిన్ పాడే ఈ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాటకు ఇన్‌స్టాలో చేయని రీల్ లేదు. చేయని వారుండరంటే అతిశయోక్తి కాదు. దేవీ శ్రీ ప్రసాద్‌ నుంచి వచ్చిన మరో అద్భుతమైన&nbsp;సాంగ్ ఇది. https://www.youtube.com/watch?v=JJFVjxFmYlY ప్రియతమా ప్రియతమా.. మజిలీ చిత్రంలోని ప్రియతమా ప్రియతమా అనే పాట ఇటీవల విడుదలైన బెస్ట్ లవ్‌ సాంగ్. నాగ చైతన్య తన ప్రేమని అర్థం చేసుకోవాలనే ఆశతో సమంత పాడుతుంది. ఈ పాట ఓ క్లాసిక్‌గా నిలిచిపోయిందనే చెప్పాలి. ఎస్.ఎస్‌. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. https://www.youtube.com/watch?v=BpINyS4k7Uw ఉండిపోవ నువ్విలా.. సవారి చిత్రంలోని “ఉండిపోవ నువ్విలా రెండు కళ్ల లోపలా” అనే పాట ఇటీవల వచ్చిన పాటల్లో సూపర్ హిట్ అయ్యింది. అబ్బాయి మీద ప్రేమని వర్ణిస్తూ పాడిన పాట చాలామంది హృదయాల్ని తాకిందని చెప్పవచ్చు. https://www.youtube.com/watch?v=UwALZDEsMdU మనసున ఉన్నది…&nbsp; తరుణ్, స్నేహ కాంబినేషన్‌లో వచ్చిన ప్రియమైన నీకు చిత్రంలోని “మనసున ఉన్నది చెప్పాలనున్నది” ఈ పాట అప్పట్లో ఓ సెన్సేషన్‌. ప్రేమించే అబ్బాయి గురించి మనసులో దాగున్న విషయాలను చెప్పలేకపోతున్నట్లుగా సాగే ఈ పాట సూపర్ హిట్. ఈ సినిమాకు శివశంకర్ సంగీతం అందించారు. https://www.youtube.com/watch?v=COZGV3vEQ4A ఇంతకీ నువ్వెవరు?... నాని నటించిన స్నేహితుడు చిత్రంలోని “ఇంతకీ నువ్వెవరు వరుసకి నాకెవరు” అంటూ అబ్బాయి కోసం అమ్మాయి పాడే ఈ సాంగ్‌ చార్ట్‌బస్టర్. అనుకోని సమస్యల్లో చిక్కుకున్న తనకి సాయం చేస్తున్న అబ్బాయి గురించి హీరోయిన్ పాడుతుంది. శివరాం శంకర్‌ సంగీతం అందించారు.&nbsp; https://www.youtube.com/watch?v=Yyn8XCwaalw కోపమా నాపైనా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, త్రిష జంటగా తెరకెక్కిన లవ్, రొమాంటిక్ సినిమా వర్షం లోని “కోపమా నాపైనా ఆపవా ఇకనైనా” అంటూ సాగే పాట ట్రెండ్ సెట్టర్. అమ్మాయిపై అలిగిన హీరో కోసం పాడిన ఈ సాంగ్‌కి దేవి శ్రీ సంగీతం అందించగా శ్రేయ గోషాల్‌ పాడారు. https://www.youtube.com/watch?v=K6gTLP1-gWU
    మార్చి 17 , 2023
    BABY: తెలుగింటి అందం వైష్ణవీ చైతన్య లేలేత సొగసులకు ఫిదా కావాల్సిందే.. ఇంతకు ఈమె ఎవరంటే?
    BABY: తెలుగింటి అందం వైష్ణవీ చైతన్య లేలేత సొగసులకు ఫిదా కావాల్సిందే.. ఇంతకు ఈమె ఎవరంటే?
    కుర్ర హీరోయిన్ వైష్ణవీ చైతన్య ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె నటించిన 'బేబీ' చిత్రం జులై 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందంతో కలిసి ఈ చిన్నది ప్రమోషన్స్‌​లో బిజీ బీజీగా గడుపుతోంది.&nbsp; దీంతో వైష్ణవి పాప ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఈ ముద్దుగుమ్మ బ్యాక్‌గ్రౌండ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. వైష్ణవీ చైతన్య తెలుగు అమ్మాయే.&nbsp; 1996లో జనవరి 4న 1996&nbsp; విజయవాడలో జన్మించింది. యాక్టింగ్‌లోకి రాకముందు.. ఈ చక్కని గుమ్మ యూట్యూబ్‌లో పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించి ఫేమస్ అయింది యుట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ నటించిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ షార్ట్ ఫిల్మ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సీరిస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. &nbsp;అలవైకుంఠాపురంలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటించి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇంకా పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తూ కెరీర్‌లో జెట్‌ వేగంతో దూసుకెళ్తోంది నటిగా, మోడల్‌గా , డ్యాన్సర్‌గా బహుముఖ పాటవాన్ని చూపుతూ తాజాగా హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది ఈ విజయవాడ పిల్ల సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఫాలోవర్లు ఈ మధ్య భారీగానే పెంచుకుంటోంది. లెలేత అందాల ప్రదర్శనతో కుర్రకారుకు వల విసురుతోంది. చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసిన ఈ అమ్మడి అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే మరో మూడు రోజుల్లో బేబీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.&nbsp; ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ జోడీగా నటిస్తోంది ఇప్పటికే&nbsp; బేబీ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. సాంగ్స్ కూడా మంచి ఆదరణ పొందాయి. ఇద్దరు యువకుల ప్రేమ మధ్యలో నలిగిపోయే యువతి పాత్రలో వైష్ణవీ కనిపించనుంది.&nbsp; ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం అయితే తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం బృందం వినూత్నంగా ప్రచారాన్ని మొదలు పెట్టింది.&nbsp; సోమవారం హైదరాబాద్- బోరబండలో ఆటో డ్రైవర్లతో కలిసి సినిమా విశేషాలను పంచుకుంది.
    జూలై 11 , 2023
    Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా?
    Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా?
    సినిమా- స్పై తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, జిషుసేన్ గుప్తా,  ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ డైరెక్టర్: గ్యారీ బీహెచ్ మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్ &amp; శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ఎడిటర్: గ్యారీ బీహెచ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'స్పై' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కార్తికేయ సిరీస్‌తో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్‌ భిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ సాధిస్తున్నాడు. దైవ భక్తి నేపథ్యంతో వచ్చిన కార్తికేయ సిరీస్ 1,2 మంచి హిట్ సాధించాయి. ఈసారి దేశ భక్తి కాన్సెప్ట్‌తో వచ్చిన 'స్పై'  విడుదలకు ముందే ప్రేక్షకుల మధ్య మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ప్రేక్షకుల అంచనాలను స్పై అందుకుందా? నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడిందా? సినిమా ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం. కథ:  జై(నిఖిల్) రా ఏజెంట్. విదేశాల్లో సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మిషిన్‌లో పనిచేస్తూ 'రా' ఎజెంట్ అయిన సుభాష్ వర్ధన్( ఆర్యన్ రాజేష్) చనిపోతాడు. అతని చావుకు కారణం తెలుసుకోవాలని 'రా' చీఫ్ శాస్త్రి( మకరంద్ పాండే) ఆ కేసు ఫైల్స్  జైకి అప్పగిస్తారు. ఈ మిషన్‌లో భాగంగా అనుహ్యంగా  దేశభక్తుడైన సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్ గురించి జైకి తెలుస్తుంది. అసలు  ఓ ఉగ్రవాది దగ్గర నేతాజీ ఫైల్స్ ఎందుకున్నాయి? నేతాజీ డెత్ మిస్టరీ చివరకు జై ఛేదించాడా? అన్న అంశాలు తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ఎలా ఉందంటే? స్పై మూవీ గతంలో తెలుగులో వచ్చిన గూఢచారి సినిమాలనే పోలి ఉంది. ఓ రా చీఫ్.. హీరో అయిన రా ఏజెంట్‌కు సిక్రెట్ మిషిన్ అప్పగిస్తాడు. అతడు చివరికి మిషిన్ పూర్తి చేసి విలన్ చంపే కామన్ పాయింట్‌ను స్పై చిత్రం కూడా ఫాలో అయింది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ నటించి గూఢాచారి 116 నుంచి అడవి శేషు నటించిన గూఢచారి వరకు ఇదే ఫార్మూలలో వచ్చి హిట్ సాధించాయి. స్పై మూవీ సైతం ఇదే తరహాలో ఉండటంతో సినిమా చూస్తున్నంతసేపు కొత్తదనం అనిపించదు. ఫస్టాప్‌లో నిఖిల్, హీరోయిన్ వైష్ణవి లవ్ స్టోరీ, జోర్డాన్‌లో ఆయుధాల స్మగ్లింగ్ వంటి సీన్లు ఉంటాయి. నేతాజీ రిలేటెడ్ సీన్స్ బాగున్నాయి. కోర్ పాయింట్స్ ఉన్నా సీన్లకు హైప్ తీసుకురాలేదు.  అయితే ఫస్టాఫ్‌లో ఓ మంచి సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్‌ విషయానికొస్తే... ఏజెంట్ జై టీమ్‌కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్‌ గురించి తెలుస్తుంది. దాని ఆధారంగా చేసుకుని సెకండాఫ్ సాగుతుంది. సినిమాలో దేశభక్తి కోటింగ్ తప్ప.. ఆ కోర్ పాయింట్‌కు తగ్గ సీన్లు మాత్రం పడలేదు. రెగ్యులర్ స్పై మూవీలాగే కనిపిస్తుంది. కొన్ని ఓవర్ ఎలివేటెడ్‌గా అనిపిస్తాయి. యాక్షన్ సీన్లు అంతగా పండలేదు. ఎవరెలా చేశారంటే? రా ఏజెంట్‌గా నిఖిల్ సిద్ధార్జ్ బాగా సూట్ అయ్యాడు.  గతంలో చేసిన క్యారెక్టర్స్ మాదిరి ఉండటంతో చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హీరోయిన్‌గా ఐశ్వర్య మేనన్.. ఏజెంట్ వైష్ణవి పాత్రలో పర్వాలేదనిపించింది. అభినవ్ గోమఠం.. కామెడీని పండించాడు. అతనితో యాక్షన్ సీన్ల కంటే కామెడీ సీన్లే ఎక్కువ ఉంటాయి. రానా దగ్గుపాటి కొద్దిసేపు కనిపించి అలరిస్తాడు. మిగతా క్యారెక్టర్లు పోసాని కృష్ణమురళి, ఆర్యన్ రాజేశ్, సచిన్ ఖేడ్కర్, సురేశ్, ఆర్యన్ రాజేష్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. టెక్నికల్‌గా.. స్పై సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నికల్ పరంగా చాలా రిచ్‌గా ఉంది. విజువల్స్ మెపిస్తాయి. యాక్షన్ సీన్లు ఇంకొంచెం బాగా తీస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ.. సాంగ్స్ మెప్పించవు. విశాల్ చంద్ర శేఖర్ ట్యూన్స్ విషయంలో ఇంకాస్తా శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ ఓకే.&nbsp; గ్రాఫిక్స్ సీన్స్ మెప్పించవు. కొన్ని చోట్లు తేలిపోయాయి.యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. స్వతహాగా ఎడిటర్ అయిన డైరెక్టర్ గ్యారీ బీహెచ్ తన కత్తెరకు పనిచెప్పడంలో పనిచెప్పలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి.&nbsp; చివరగా: ఓవరాల్‌గా గూఢచారి టెంప్లెట్‌లో సినిమా కావాలనుకునే వారికి 'స్పై' వినోదాన్ని అయితే పంచుతుంది. రేటింగ్: 2.25/5
    జూన్ 29 , 2023
    Guntur Kaaram Review: డ్యాన్స్‌, మాస్‌ యాక్షన్‌తో ఇరగదీసిన మహేష్‌.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!
    Guntur Kaaram Review: డ్యాన్స్‌, మాస్‌ యాక్షన్‌తో ఇరగదీసిన మహేష్‌.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!
    నటీనటులు: మహేశ్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌, జయరాం, రావు రమేశ్‌, ఈశ్వరిరావు, మురళీశర్మ, సునీల్‌ తదితరులు రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌ సంగీతం: థమన్‌ సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ ప్రొడక్షన్‌ కంపెనీ: హారిక &amp; హాసిని క్రియేషన్స్‌ విడుదల తేదీ: 12-01-2024 మహేష్‌ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా చిత్రం 'గుంటూరు కారం' (Guntur Karam). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలై టీజర్‌, ట్రైలర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్రివిక్రమ్‌-మహేష్‌ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ కావడంతో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. మరి గుంటూరు కారం ఎలా ఉంది? మహేశ్‌ మాస్‌ అవతార్‌ మెప్పించిందా? శ్రీలీల అందాలతో అలరించిందా? ఇప్పుడు చూద్దాం.  కథ జనదళం పార్టీ అధినేత వైరా సూర్య నారాయణ (ప్రకాశ్‌ రాజ్‌) కూతురు వసుంధర (రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తుంది. వసుంధరను మంత్రిని చేయాలని సూర్యనారాయణ భావిస్తాడు. ఎమ్మెల్యే కాటా మధు (రవిశంకర్‌) ఇందుకు అడ్డుతగులుతాడు. ఆ పదవి తనకు ఇవ్వకపోతే వసుంధరకు రెండో పెళ్లి అయిన విషయంతో పాటు మెుదటి భర్త సంతానం రమణ (మహేష్‌ బాబు) గురించి బయటపెడతానని బెదిరిస్తాడు. దీంతో సూర్యనారాయణ ముందు చూపుగా రమణను పిలిపించి వసుంధరతో ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్స్‌పై సంతకం చేయమంటాడు. కానీ రమణ నిరాకరిస్తాడు.(Guntur kaaram Review) తండ్రి రాయల్ సత్యం (జయరామ్‌) చెప్పినా వినకుండా గుంటూరులోనే ఉంటూ మిర్చియార్డ్‌ నడుపుతుంటాడు. అసలు వసుంధర తన మెుదటి భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చింది? రమణను చూడటానికి కూడా ఎందుకు ఇష్టపడలేదు? అమ్ము (శ్రీలీల) రమణల లవ్ ట్రాక్‌ ఏంటి? మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే మ‌హేశ్‌బాబు (Mahesh babu) పాత్ర ఆయ‌న నట‌నే ఈ సినిమాకి హైలైట్‌ అని చెప్పవచ్చు. ముఖ్యంగా డ్యాన్స్‌తో మహేష్‌(Mahesh babu) ఇరగదీశాడు. భావోద్వేగాల్నీ తనదైన శైలీలో అద్భుతంగా పండించాడు. శ్రీలీల మ‌రోసారి స్టెప్పులకే ప‌రిమితమైంది. కుర్చీ మ‌డ‌త‌పెట్టి పాటలో ఆమె, మ‌హేష్ క‌లిసి చేసిన హంగామా క‌ల్ట్ మాస్ అనాల్సిందే. మీనాక్షి చౌద‌రి పాత్ర కూడా సినిమాలో ప‌రిమిత‌మే. ర‌మ్య‌కృష్ణ పాత్ర‌, ఆమె న‌ట‌న హుందాగా అనిపిస్తుంది. ప్ర‌కాశ్‌రాజ్, వెన్నెల కిశోర్  పాత్ర‌ల్లో కొత్త‌ద‌న‌ం లేదు. జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేశ్‌, ముర‌ళీశ‌ర్మ‌, సునీల్‌ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఏ పాత్ర‌లోనూ బ‌లం క‌నిపించ‌దు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే బలమైన భావోద్వేగాలు, పదునైన మాటలతో త్రివిక్రమ్‌ (Trivikram) తన చిత్రాల్లో మ్యాజిక్‌ చేస్తుంటారు. కానీ గుంటూరు కారం (Guntur Kaaram Review) విషయంలో ఆ మేజిక్‌ మిస్‌ అయ్యింది. పాతికేళ్లు తల్లికి దూరంగా పెరిగినా కొడుకు.. సంతకం చేస్తే తెగిపోయే బంధంతో కథ ముడి పడి ఉంటుంది. ఈ విషయం తొలి సన్నివేశాల్లోనే చెప్పేసిన త్రివిక్రమ్‌.. ఆ తర్వాత సినిమాను కాలక్షేప సీన్లతో నడిపించేసినట్టే అనిపిస్తుంది. కథతో సంబంధం లేకుండా పాత్రలను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి త్రివిక్ర‌మ్ స్థాయికి త‌గ్గ పాత్ర‌లు, స‌న్నివేశాలు ఏమాత్రం కావు. ఓవరాల్‌గా మాస్ పాత్ర‌లో మ‌హేశ్‌బాబు చేసే హంగామా, ఆయ‌న ఎన‌ర్జీ, పాట‌లు, విరామ స‌న్నివేశాలు, ప‌తాక స‌న్నివేశాల్లో కాసిన్ని భావోద్వేగాలు ఇవే ఈ సినిమాకు బలం. టెక్నికల్‌గా ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్‌ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. మనోజ్‌ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ వర్క్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ మహేష్ నటనశ్రీలీల డ్యాన్సులుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంకొరవడిన భావోద్వేగాలుకనబపడని త్రివిక్రమ్‌ మార్క్‌ రేటింగ్‌ : 3/5
    జనవరి 12 , 2024
    <strong>Vidudala Part 2 Review: వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపిన ‘విడుదల 2’.. కానీ!</strong>
    Vidudala Part 2 Review: వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపిన ‘విడుదల 2’.. కానీ!
    నటీనటులు: విజయ్​ సేతుపతి, సూరి, మంజు వారియర్, కిషోర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, భవాని శ్రీ, గౌతమ్ మీనన్ తదితరులు దర్శకత్వం : వెట్రిమారన్‌ సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ : ఆర్. వెల్‌రాజ్ నిర్మాతలు: ఎల్రెడ్ కుమార్, వెట్రిమారన్&nbsp; విడుదల తేదీ: డిసెంబర్‌ 20, 2024 గతేడాది తెలుగు, తమిళ భాషల్లో రిలీజై మెప్పించిన ‘విడుదల’ చిత్రానికి సీక్వెల్‌ రూపొందింది. ‘విడుదల 2’ (Vidudala Part 2 Review) పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో సూరి (Soori), విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), మంజు వారియర్‌, గౌతమ్‌ మీనన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌ దర్శకత్వం వహించారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, డిసెంబర్‌ 20న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.  కథేంటి పెరుమాళ్ (విజయ్ సేతుపతి) అరెస్టుతో తొలిభాగం ముగియగా అతడి విచారణతో పార్ట్ 2 మొదలవుతుంది. పెరుమాళ్‌ను క్యాంప్ నుండి వేరే బేస్‌కి మార్చాలని పోలీసులు డిసైడ్‌ అవుతారు. అతడి అరెస్టులో కీలకంగా వ్యవహరించిన కుమరేశన్ (సూరి)తో కలిసి బయలుదేరతారు. ఈ క్రమంలో పోలీసులతో పెరుమాళ్‌ తన కథను పంచుకుంటాడు. అతడి స్టోరీ విన్నాక పోలీసులకు అతడిపై జాలి కలుగుతుంది. దీంతో పెరుమాళ్‌ అరెస్ట్‌ను సీక్రెట్‌గా ఉంచాలని అనుకుంటారు. అయితే అరెస్టు విషయం మీడియాకు లీక్‌ కావడంతో అధికారికంగా అనౌన్స్‌ చేసేందుకు పోలీసులు రెడీ అవుతారు. ఈ క్రమంలోనే పెరుమాళ్‌ పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. అప్పుడు పోలీసులు ఏం చేశారు? అతడ్ని పట్టుకునేందుకు ఎలాంటి ప్లాన్స్ వేశారు? ఇంతకీ పోలీసులకు పెరుమాళ్‌ చెప్పిన గతం ఏంటి? అతడు ఉధ్యమనాయకుడిగా ఎలా మారాడు? పెరుమాళ్‌ మంచితనం గురించి తెలిసిన కుమారేశన్ ఎవరివైపు నిలబడ్డాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే పెరుమాళ్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి (Vidudala Part 2 Review) అదరగొట్టాడు. కుర్రతనం నుంచి ఉద్యమ నాయకుడిగా ఎలా ఎదిగాడన్న పాత్రలో జీవించేశాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో ఎప్పటిలాగే తన నటనతో కట్టిపడేశాడు. తొలి భాగాన్ని తన భుజంపై వేసుకొని నడిపించిన నటుడు సూరి సెకండ్‌ పార్ట్‌కు వచ్చేసరికి కొన్ని సీన్లకే పరిమితమయ్యాడు. అతడికి ఎక్కువ స్క్రీన్‌ స్పేస్‌ దొరకలేదు. ఉన్నంతలో బాగానే చేశాడు. ఇండిపెండెంట్‌ ఉమెన్‌ పాత్రలో మంజు వారియర్‌ ఆకట్టుకుంది. పోలీసు ఉన్నతాధికారిగా గౌతమ్‌ మీనన్‌ నటన సెటిల్డ్‌గా ఉంది. విలన్‌ షేడ్స్‌ ఉన్న పోలీసు ఆఫీసర్‌ చేతన్‌ మంచి నటన కనబరిచాడు. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్‌ చూపించిన రోల్‌ చేతన్‌దే. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు వెట్రిమారన్‌.. గౌతమ్ మీనన్ - విజయ్ సేతుపతిల మధ్య వచ్చే ఇంటరాగేషన్ సీన్‌తో కథను ప్రారంభించారు. ఆపై వెంటనే ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లి ఆడియన్స్‌ను కథలో లీనమయ్యేలా చేశారు. ఈ క్రమంలో విజయ్ సేతుపతి, మంజు వారియర్‌ల మధ్య సాగే లవ్ ట్రాక్ ఆకట్టుకునేలా చూపించారు. అలాగే పోలీస్ వ్యవస్థ, రాచరికపు దురహంకారం, ప్రభుత్వం ప్రజల్ని ఎలా మోసం చేస్తుంది వంటి విషయాలను ఏమాత్రం బెరుకు లేకుండా దర్శకుడు చూపించాడు. శాంతియుతంగా సాగే ఉద్యమం హింసా మార్గం ఎలా పట్టిందనే పాయింట్‌ను చాలా బలంగా చూపించారు. తొలి భాగం వరకూ కథ బాగానే సాగినప్పటికీ సెకండాఫ్‌కు వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పిన ఫీలింగ్‌ కలుగుతుంది. ముందు సీన్లో చనిపోయిన క్యారెక్టర్లు తర్వాతి సీన్‌లో కనిపించడం గందరగోళానికి గురిచేస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ చిరాకు తెప్పిస్తాయి. సీన్స్‌ మధ్య కనెక్టివిటీ ఉండదు. క్లైమ్యాక్స్ కూడా చాలా లెంగ్తీగా ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది.  సాంకేతికంగా.. టెక్నికల్ అంశాలకు వస్తే (Vidudala Part 2 Review) ఇళయరాజా సంగీతం సినిమాగా బాగా ప్లస్‌ అయ్యింది. పావురమా పాట వినడానికి చాలా బాగుంది. వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం నేచురల్ లొకేషన్లలోనే తీశారు. అది స్క్రీన్‌పై మంచి ఎఫెక్ట్ చూపించింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. సెకండాఫ్‌ను ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విజయ్ సేతుపతి నటనసందేశాత్మక సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సెకండాఫ్‌అతుకుల బొంతలా ఉండే&nbsp; సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5 
    డిసెంబర్ 20 , 2024
    Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    న‌టీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ తోట సంగీతం: సన్నీ MR ఎడిటర్‌ : విజయ్ వర్ధన్ నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు స‌మ‌ర్ప‌ణ‌: యు.వి.క్రియేష‌న్స్‌ విడుద‌ల‌ తేదీ: 22-03-2024 శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో చేసిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్‌’ (Om Bheem Bush Review). శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? వీరు ముగ్గురూ కలిసి చేసిన హంగామా ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) మంచి స్నేహితులు. జీవితంపై శ్రద్ద లేకుండా సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. మరి ఈ ముగ్గురు సైంటిస్టులుగా ఎలా మారారు? అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? ఆ ఊరిలోని సంపంగి దెయ్యం ఉన్న కోటలో ముగ్గురు ఎందుకు అడుగుపెట్టారు? ఆ దెయ్యానికి క్రిష్‌కి ఉన్న సంబంధం ఏంటి? కోటలోకి అడుగు పెట్టిన ఈ బిగ్‌బ్యాంగ్‌ బ్రదర్స్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ మధ్యలో జలజాక్షి (ప్రీతి ముకుంద్)తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే? శ్రీవిష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి క‌లిసి పండించిన కామెడీ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. వీళ్ల మ‌ధ్య కామెడీ టైమింగ్ చాలా స‌న్నివేశాల‌కి బ‌లం తీసుకొచ్చింది. క‌థానాయిక‌లు ప్రీతిముకుంద‌న్‌, ఆయేషాఖాన్‌లకు క‌థ‌లో ప్రాధాన్యం త‌క్కువే. అయితే ప్రియదర్శికి జోడిగా నటించిన అయేషా ఖాన్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ప్రియా వడ్లమాని కూడా అందాలు ఆరబోసింది. ర‌చ్చ ర‌వి, ఆదిత్య మేన‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్&nbsp; పాత్ర‌ల ప‌రిధి మేరకు న‌టించారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ‘జాతిర‌త్నాలు’ (Om Bheem Bush Review) త‌ర‌హాలో ముగ్గురు స్నేహితుల క్రేజీ ప్ర‌యాణానికి హార‌ర్ కామెడీతో కూడిన ఓ&nbsp; కాన్సెప్ట్‌ని జోడించాడు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు కితకితలు పెట్టేలా రూపొందించారు. ప్రథమార్థం మెుత్తాన్ని ఊరిలో వీరు చేపట్టిన ఏ టూ జెడ్‌ సర్వీసులు, దాని చుట్టూ అల్లుకున్న కామెడీతో డైరెక్టర్‌ నడిపించాడు. ఇక ద్వితియార్థాన్ని సంపంగి మహల్‌ చుట్టూ తిప్పాడు డైరెక్టర్‌. సంపంగి దెయ్యం క‌థ‌తోపాటు, ప‌తాక స‌న్నివేశాలను తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. అయితే ఆరంభ సన్నివేశాలు, ద్వితీయార్ధంలో దెయ్యంతో డేటింగ్ వంటి స‌న్నివేశాలు అంత‌గా ప్ర‌భావం చూపించ‌వు. మెుత్తానికి బంగ్లా, దెయ్యం, తీర‌ని కోరిక తదిత‌ర అంశాల‌న్నీ పాత‌వే అయినా క‌థ‌కి కొత్త‌గా హాస్యాన్ని మేళ‌వించడంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు సాంకేతికంగా &nbsp; టెక్నికల్‌ అంశాలకు వస్తే (Om Bheem Bush).. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా స‌న్నీ ఎం.ఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఎడిటర్ విష్ణు వర్షన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ శ్రీవిష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ&nbsp; న‌ట‌నకామెడీప‌తాక స‌న్నివేశాలు మైనస్ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీప్రథమార్ధంలోని ప్రారంభ సీన్లు Telugu.yousay.tv Rating : 3.5/5
    మార్చి 22 , 2024

    @2021 KTree