రివ్యూస్
How was the movie?
తారాగణం
నాగ చైతన్య
పూర్ణ చంద్ర రావుసమంత రూత్ ప్రభు
పూర్ణ చంద్రరావు భార్యదివ్యాంశ కౌశిక్
పూర్ణ చంద్రరావు ప్రేమికుడుసుబ్బరాజు
భూషణ్‌రావు రమేష్
పూర్ణ తండ్రిఅతుల్ కులకర్ణి
అన్షు తండ్రిఅనన్య అగర్వాల్
అన్షు మరియు కునాల్ కుమార్తె (తరువాత శ్రావణి మరియు పూర్ణల దత్తపుత్రిక)పోసాని కృష్ణ మురళి
శ్రావణి తండ్రిరవి ప్రకాష్
కోచ్ శ్రీనుసుహాస్
పూర్ణ స్నేహితురాలురజిత
అన్షు తల్లిసిబ్బంది
శివ నిర్వాణ
దర్శకుడుసాహు గారపాటినిర్మాత
హరీష్ పెద్దినిర్మాత
తమన్ ఎస్
సంగీతకారుడుప్రవీణ్ పూడి
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), అలీ (Ali), సునీల్ (Sunil), వేణుమాదవ్ (Venu Madhav) లాంటి సీనియర్ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్ కమెడియన్స్ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్ సైతం సాధిస్తున్నారు. అలా రీసెంట్గా ఆడియన్స్ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.
సుహాస్ (Suhas)
ప్రముఖ నటుడు సుహాస్.. వరుస హిట్లతో టాలీవుడ్లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్ అయిన సుహాస్.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్ నటిస్తున్నాడు.
వైవా హర్ష (Harsha Chemudu)
షార్ట్‌ఫిల్మ్స్ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్’, ‘పక్కా కమర్షియల్’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అభినవ్ గోమటం (Abhinav Gomatam)
యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్ఫిల్మ్స్లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్గా ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్ హీరోగా మారాడు.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
‘జబర్దస్త్’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్వేర్ సుధీర్’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు.
సత్యం రాజేష్ (Satyam Rajesh)
సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.
ప్రియదర్శి (Priyadarsi)
యంగ్ కమెడియన్ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’ (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore)
టాలీవుడ్‌లోని స్టార్ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్’తో కథానాయకుడిగా మారిన కిషోర్.. రీసెంట్గా ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.
ధన్‌రాజ్ (Dhanraj)
జబర్దస్త్ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్ ధన్‌రాజ్. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మార్చి 14 , 2024
This Week Releases: ఈ వారం(June 9) థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..!
గత రెండు వారాలుగా చిన్న సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాయి. దీంతో ఈ వారం విడుదలవుతున్న సినిమాలపైనా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ శుక్రవారం(June 9) ప్రధానంగా థియేటర్లలో నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇందులో ఒక్కో చిత్రం ఒక్కో జోనర్లో వస్తోంది. సినిమాలతో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. అవేంటో చూద్దాం.
టక్కర్
చాలా గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ నటించిన చిత్రం టక్కర్. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా చేసింది. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్లో సిద్ధార్థ్ వాయిస్ ఓవర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ‘ఆశే లోకాన్ని నడిపిస్తుంది. మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ ఆశను నెరవేర్చుకోవాలంటే ధనమే ఇంధనం. డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఆ దారి అందరిదీ ఒకటే అయినప్పుడు..’ అంటూ మొదలు పెట్టాడు. మిగతా కథేంటో జూన్ 9న థియేటర్లలో చూడాల్సిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల అవుతోంది.
విమానం
నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. ఇందులో దివ్యాంగుడైన తండ్రి పాత్రను పోషించాడు. మీరా జాస్మిన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విమానం ఎక్కాలన్న కొడుకు కలను దివ్యాంగుడైన తండ్రి ఎలా నెరవేర్చాడన్న ఇతివృత్తంతో సినిమా తెరకెక్కింది. యానాల శివప్రసాద్ డైరెక్ట్ చేశారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించారు. జూన్ 9న సినిమా విడుదల కానుంది.
అన్‌స్టాపబుల్
వీజే సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషించిన ఎంటర్టైనర్ ‘అన్‌స్టాపబుల్’. రెండు గంటల పాటు నాన్‌స్టాప్ వినోదం అందించేందుకు సినిమా రెడీగా ఉందని చిత్రబృందం వెల్లడించింది. డైమండ్ రత్నబాబు తెరకెక్కించాడు. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జూన్ 9న విడుదల కానుంది.
పోయే ఏనుగు పోయే
టాలీవుడ్లో ఏనుగు ప్రధాన పాత్ర పోషించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. అడవి రాముడు, అడవి రాజా వంటివి ఘన విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఇదే కథతో ‘పోయే ఏనుగు పోయే’ సినిమా తెరకెక్కింది. కేఎస్ నాయక్ డైరెక్ట్ చేశాడు. పవనమ్మాల్ కేశవన్ నిర్మాత. జూన్ 9న సినిమా విడుదల కానుంది.
ఓటీటీ విడుదలలు
TitleCategoryLanguagePlatformRelease DateThe IdleWeb SeriesEnglishZee5June 5Barracuda QueensWeb SeriesEnglishNetflixJune 52018MovieMalayalam/TeluguSonyLivJune 7Avatar: The Way Of WaterMovieEnglishDisney+ HotstarJune 7OrnaldSeriesEnglishNetflixJune 7St ExSeriesEnglishDisney+ HotstarJune 7Never have I EverSeriesEnglishNetflixJune 8Tour D FranceSeriesEnglishNetflixJune 8UP 65SeriesHindiJioCinemaJune 8My FaultSeriesEnglishAmazon PrimeJune 8MenTooMovieTeluguAhaJune 9BloodhoundsSeriesKoreanNetflixJune 9Blood DaddyMovieHindiJioCinemaJune 9Empire Of LightMovieEnglishDisney+ HotstarJune 9Flamin H0tMovieEnglishDisney+ HotstarJune 10
జూన్ 06 , 2023
HBD SAMANTHA: ఆ ఒక్కటి సమంతకే చెల్లింది.. బోల్డ్ అయినా, ఎమోషనల్ అయినా సామ్ దిగనంత వరకే!
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ సమంతది ప్రత్యేకమైన ప్రయాణం. ఏమాయ చేశావే చిత్రంతో జెస్సీగా పరిచయమై అందరి మనసుల్ని కొళ్లగొట్టింది సామ్. 2010లో కెరీర్ ప్రారంభించి దాదాపు 13 సంవత్సరాలుగా టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సమంత ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ వర్తమాన హీరోయిన్స్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెకున్నంత డైహార్ట్ ఫ్యాన్స్ హీరోయిన్స్‌లో మరెవరికి లేరని చెప్పవచ్చు. ఏప్రిల్ 28న ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటి వరకు సమంత చేసిన విభిన్న పాత్రలు ఓసారి గుర్తు చేసుకుందాం…
రంగస్థలం రామ లక్ష్మి
రామ్‌చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలంలో అచ్చమైన పల్లెటూరు అమ్మాయి పాత్రలో జీవించేసింది సమంత. ఆంధ్రా స్లాంగ్‌ను అచ్చుగుద్దినట్లు దింపేసింది. ఇందులో సామ్ చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
మజిలీ శ్రావణి
నాగచైతన్య, సమంత నటించిన చిత్రం మజిలీ. ఇందులో భర్త ఏం చేసినా భార్య వెనకేసుకు వస్తూ ప్రేమించే పాత్రలో సామ్ నటన నెక్స్ట్ లెవల్. క్లైమాక్స్‌లో సమంత పర్ఫార్మెన్స్ కన్నీళ్లు పెట్టిస్తుంది. అంతలా క్యారెక్టర్‌ను ముందుకు తీసుకెళ్లింది.
ఓ బేబీ
సమంత హీరోయిన్గా వచ్చిన లేడి ఓరియెంటెడ్ ఇది. ఓ ముసలి వ్యక్తి కొన్ని కారణాల వల్ల యవ్వనంలోకి వెళ్తుంది. కానీ, ఆ పాత్రను చేసిన వ్యక్తిలానే నటించడం చాలా కష్టమైన పని. సీనియర్ యాక్టర్లా హావాభావాలు పండిస్తూ… చూడటానికి 25 ఏళ్లున్నా వయసు మాత్రం 60 ఏళ్లు అన్నట్లుగా కనిపించే పాత్రలో చించేసింది ఈ బ్యూటీ.
యశోద
అద్దె గర్భం కాన్సెప్ట్‌లో వచ్చిన యాక్షన్ సినిమా. ఇందులో సమంత పోరాట సన్నివేశాల్లో అదరగొట్టింది. తన కోసం చిక్కుల్లో పడిన చెల్లెల్ని కాపాడేందుకు ఆమె వేసే ఎత్తుగడలు, విలన్లతో పోరాటం వంటివి ఆకట్టుకున్నాయంటే ఆమెనే కారణం. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలే వచ్చాయి.
శకుంతల
కాళిదాసు రచించి అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ సినిమాను పూర్తి చేసింది. ఇందులో తన పాత్ర కోసం చాలానే కష్టపడింది. శకుంతల పాత్రలో జీవించింది. గ్లామర్ పరంగా ఏమాత్రం తగ్గకుండా నటించింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చినప్పటికీ సామ్ చేసిన డిఫరెంట్ రోల్స్‌లో ఇదొకటని చెప్పవచ్చు.
పుష్ప ది రైజ్
పుష్ప చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ అంటూ ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఫ్యామిలీ మెన్ రాజీ
మనోజ్ బాజ్‌పేయ్ లీడ్ రోల్లో వచ్చిన ఫ్యామిలీ మెన్ సిరీస్ పార్ట్ 2లో సమంత విభిన్నమైన క్యారెక్టర్లో కనిపించింది. శ్రీలంక రెబల్ గ్రూప్ అంటే నక్సలైట్ పాత్రలో మెరిసింది సుందరి. డీ గ్లామరస్ రోల్లో కనిపించడమే కాకుండా బోల్డ్ సీన్లో నటించి షాకిచ్చింది.
సిటాడెల్
హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్ సిరీస్‌ను బాలీవుడ్లో వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా పోషించిన యాక్షన్ రోల్‌ను సామ్ చేయనుంది. ఇప్పటికే షూటింగ్ కోసం చిత్రబృందంతో జత కట్టింది చెన్నై సుందరి.
ఏప్రిల్ 27 , 2023
Satyam Sundaram 2024 Review: దేవరకు పోటీగా వచ్చిన ‘సత్యం సుందరం’ ఎలా ఉందంటే?
నటీనటులు: కార్తి, అరవింద స్వామి, శ్రీవిద్య, రాజ్‌కిరణ్ తదితరులు
రచన, దర్శకత్వం: సి.ప్రేమ్ కుమార్
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజు
ఎడిటింగ్: ఆర్.గోవింద రాజు
నిర్మాత: జ్యోతిక, సూర్య
విడుదల తేదీ: 28-09-2024
తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా ‘96’ వంటి ఫీల్ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెయ్యజగన్’. తెలుగులో ఈ మూవీని ‘సత్యం సుందరం’ పేరుతో తీసుకొచ్చారు. ఇందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జోతికలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇవాళ (సెప్టెంబరు 28) (meiyazhagan release date) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గుంటూరుకు చెందిన సత్యం (అరవిందస్వామి) ఆస్తి తగదాల కారణంగా పుట్టి పెరిగిన ఇల్లు, ఊరిని వదిలేసి వైజాగ్ వెళ్లిపోతాడు. ఈ క్రమంలో 30ఏళ్లు గడిచిపోతాయి. బాబాయి కూతురి పెళ్లి కోసం ఊరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఊరికి వచ్చిన సత్యంకి పెళ్లిలో బంధువు (కార్తీ) పరిచయమవుతాడు. బావా అంటూ సరదాగా కలిసిపోతూ బోలెడు కబుర్లు చెబుతుంటాడు. అతని మీతిమీరిన కలుపుగోలు తనం చూసి సత్యం జిడ్డులా భావిస్తాడు. అయితే కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతను చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. మరి వీళ్లిద్దరి ప్రయాణం ఏ మజిలీకి చేరింది? ఈ ప్రయాణంలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తితో అతనికున్న బంధం ఏంటి? ఆఖరికి అతని పేరు సత్యంకు గుర్తొచ్చిందా? లేదా? అన్నది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే
సత్యం పాత్రలో నటుడు అరవిందస్వామి పూర్తిగా ఒదిగిపోయాడు. తన అద్భుతమైన నటనతో ఆ పాత్రతో మనమూ ట్రావెల్ చేసేలా చేశాడు. సత్యం పడే బాధ, యాతన, ఇబ్బంది వంటి అన్ని ఫీలింగ్స్‌ను మనం కూడా అనుభవిస్తాం. ఇక కార్తీ తన అమాయకత్వంతో మరోసారి కట్టిపడేశాడు. ఓ వ్యక్తిపై అపరిమితమైన ప్రేమను చూపించే సగటు పల్లెటూరి యువకుడిగా అతడు నటించిన విధానం మెప్పిస్తుంది. కార్తీ కెరీర్లో ఈ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అరవిందస్వామి భార్యగా దేవదర్శిని మంచి ప్రదర్శన చేసింది. ఇప్పటివరకూ కమెడియన్, సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేసిన ఆమె ఎంతో డెప్త్ ఉన్న పాత్రనైనా అలవోకగా చేయగలనని ఈ సినిమాతో నిరూపించింది. శ్రీదివ్య, రాజ్ కిరణ్, జయప్రకాశ్‌ల పాత్రలు చిన్నవే అయినా కథపై ఎంతో ప్రభావం చూపాయి. మిగిలిన పాత్రలు దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
మనిషి సుఖంగా బ్రతకడానికి డబ్బు, పేరుతో పాటు మన మంచి కోరుకునే ఓ వ్యక్తి కూడా ఎంతో అవసరమని ఈ చిత్రం ద్వారా దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ చెప్పే ప్రయత్నం చేశారు. సత్యం ఊరిని వదిలి వెళ్లిపోవడానికి వెనకున్న కారణాన్ని చూపిస్తూ సినిమా ఆసక్తికరంగా మెుదలు పెట్టారు. ఓ పెళ్లికోసం సత్యం తిరిగి ఊరికి రావడం, అక్కడ కార్తి పాత్ర పరిచయం, అతడి అల్లరి, కార్తీ ఎవరో గుర్తురాక సత్యం పడే ఇబ్బందులు ఇలా అన్నీ సరదాగా అనిపిస్తాయి. ద్వితియార్థాన్ని కార్తీ ఇంటికి షిప్ఠ్ చేసిన దర్శకుడు అక్కడ సత్యానికి ఎదురయ్యే అనుభవాలను మనసుకు హత్తుకునేలా చూపించారు. ప్రేక్షకుల్ని వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లిపోయారు. ఇక కార్తి పాత్ర పేరు గుర్తురాక సత్యం పడే మానసిక సంఘర్షణ మదిని బరువెక్కిస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒక అందమైన నవలలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కమర్షియల్ హంగులు లేకపోవడం, కథ నెమ్మదిగా సాగడం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే నేపథ్య సంగీతం కథకు అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. సినిమా మొత్తం బ్యాగ్రౌండ్లో పాట వినిపిస్తూ ఉంటుంది. అది కథను మరింత భావోద్వేగభరితంగా మార్చడంలో సహాయపడింది. విజువల్స్ కట్టిపడేస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, భావోద్వేగాలుకార్తి, అరవింద స్వామి నటనసంగీతం
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథకమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3.5/5
సెప్టెంబర్ 28 , 2024
Summer Heroines 2024: వేసవి హీట్ మరింత పెంచేందుకు సిద్ధమవుతున్న అందాలు భామలు వీరే!
సమ్మర్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద పండగ లాంటిది. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవుల నేపథ్యంలో చిన్న, పెద్ద సినిమాలు సమ్మర్లో విడుదలయ్యేందుకు ఆసక్తి కనబరుస్తాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో వినోదాలు పంచడానికి పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా అందులోని కథానాయకులు వేసవి హీట్‌ను తమ అందచందాలతో మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏంటి? అవి ఎప్పుడు విడుదలవుతాయి? వంటి అంశాలు ఈ కథనంలో చూద్దాం.
మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)
‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మృణాల్ ఠాకూర్.. ఈ సమ్మర్లో సరికొత్త మూవీతో వస్తోంది. యంగ్ హీరో విజయ్ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రంతో ఈ భామ టాలీవుడ్లో మరోమారు సందడి చేయబోతోంది. ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.
దివ్యాంశ కౌషిక్ (Divyansha Kaushik)
‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ద్వారా అలరించనున్న మరో నటి దివ్యాంశ కౌషిక్. ఇందులో ఈ భామ సెకండ్ హీరోయిన్గా చేస్తోంది. 2019లో వచ్చిన మజిలీ సినిమా ద్వారా దివ్యాంశ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ, పోలీసు వారి హెచ్చరిక, మైఖేల్ తదితర చిత్రాల్లో నటించింది.
అంజలి (Anjali)
ప్రముఖ హీరోయిన్ అంజలి కూడా ఈ వేసవిని మరింత హీటెక్కించేందుకు రెడీ అవుతోంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించనుంది. ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ ముఖ్యపాత్రలు పోషించారు.
స్వర్ణిమా సింగ్ (Swarnima Singh)
హర్షివ్ కార్తీక్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బహుముఖం' (Bahumukham). 'గుడ్, బ్యాడ్ యాక్టర్' అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాలో స్వర్ణిమా సింగ్ కథానాయికగా చేసింది. తన అందం, అభినయంతో ఆకట్టుకునేందుకు ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మీనాక్షి గోస్వామి (Meenakshi Goswami)
మీనాక్షి గోస్వామి కథానాయికగా చేసిన లేటెస్ట్ చిత్రం 'భరతనాట్యం'. ఈ మూవీ ద్వారానే మీనాక్షి తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా సూర్యతేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమా ఓ యువకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందన్న కాన్సెప్ట్‌తో రూపొందింది.
ప్రనీకాన్వికా (Praneekaanvikaa)
ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న మరో చిన్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మీ'. కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రణీకాన్వికా నటించింది. ఇదే ఆమెకు మెుదటి సినిమా. ఈ మూవీ విజయం ద్వారా తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకోవాలని ఈ బ్యూటీ భావిస్తోంది. ఏప్రిల్ 19న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
కోమలి ప్రసాద్ (Komali Prasad)
యంగ్ హీరోయిన్ కోమలి ప్రసాద్ కూడా.. ఈ వేసవిలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘శశివదనే’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఏప్రిల్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ‘నేను సీతాదేవి’ (2016) చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన కోమలి.. ‘హిట్ 2’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. శశివదనే సినిమా విజయంపై ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
‘బేబీ’ సినిమా సెక్సెస్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఈ భామ నటించిన రెండో చిత్రం 'లవ్ మి ఇఫ్ యు డేర్' కూడా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ నెల 25 నుంచి తెలుగు ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయనుంది.
ఏప్రిల్ 03 , 2024
Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్ గుడ్ చిత్రాలు
'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్టైనర్ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్ లవ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.
భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy)
మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.
తొలి ప్రేమ (Tholi Prema)
వరుణ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.
ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade)
నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్ను ఇంప్రెస్ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.
అష్టా చమ్మా (Ashta Chamma)
నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.
అలా మెుదలైంది (Ala Modalaindi)
డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్ ఫెయిల్ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.
సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan)
హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.
మజిలి (Majili)
తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.
ఓకే బంగారం (Ok Bangaram)
ప్రస్తుత కాలంలో డేటింగ్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.
ఏ మాయ చేశావే (Ye Maya Chesave)
తెలుగులో వచ్చిన ఎవర్గ్రీన్ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్ మీనన్ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.
పెళ్లి చూపులు (Pelli Chupulu)
తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్ బిజినెస్‌లో భాగమై సక్సెస్ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.
సీతారామం (Sita ramam)
2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్గా వచ్చిన చిత్రాల్లో సూపర్ క్లాసిక్ మూవీగా దీన్ని చెప్పవచ్చు.
హాయ్ నాన్న (Hi nanna)
ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్ నాన్న తప్పకుండా ఉంటుంది.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju)
రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.
ఓయ్ (Oye)
బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు.
నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha)
కృష్ణ వంశీ డైరెక్షన్లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు.
రాజా రాణి (Raja Rani)
ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.
జాను (Jaanu)
శర్వానంద్, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్ లవ్ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్ టూ గెదర్ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.
గోదావరి (Godavari)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్ కొట్టదు. హీరో సుమంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది.
ఆనంద్ (Anand)
ఈ ఫీల్‌గుడ్ మూవీ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
మార్చి 22 , 2024
True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
టాలీవుడ్లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించాయి. యాక్షన్, శృంగార సన్నివేశాలు, ఐటెం సాంగ్స్ ఇలాంటివి లేకపోయినా.. స్వచ్చమైన ప్రేమ, ఆకట్టుకునే కథ-కథనం, చక్కటి ప్రజెంటేషన్ ఉంటే చాలని అవి నిరూపించాయి. ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిలించి కొత్త రకం ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ (Sitaramam), ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం ఈ చిత్రాలు కదిలించాయి. నార్త్ అభిమానుల ఫేవరేట్ చిత్రంగా మారిపోయాయి. మరి టాలీవుడ్లో ఇప్పటివరకూ వచ్చి కల్ట్ క్లాసిక్ మూవీలు ఏవి? అవి ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
సీతారామం
2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది.
హాయ్ నాన్న
ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది.
సూర్య S/O కృష్ణన్
హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.
మజిలి
తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.
నిన్ను కోరి
హీరో ఒక యువతిని ఎంతగానో ఇష్టపడతాడు. అనూహ్యంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తొలత ఆమెను దక్కించుకోవాలని భావించినప్పటికీ చివరికీ ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.
ఓయ్
బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు.
తొలి ప్రేమ
టాలీవుడ్లో వచ్చి కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. విదేశాల నుంచి వచ్చిన యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆమెకు తన భావాలను చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. తిరిగి వెళ్లేపోతున్న క్రమంలో తానూ హీరోను లవ్ చేస్తున్నట్లు యువతికి అర్థమవుతుంది.
నిన్నే పెళ్లాడతా
కృష్ణ వంశీ డైరెక్షన్లో వచ్చిన నిన్నే పెళ్లడతా చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు.
రాజా రాణి
ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.
జాను
శర్వానంద్, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్ లవ్ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్ టూ గెదర్ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.
ఫిబ్రవరి 13 , 2024
Kushi Movie Review: విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా?
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, లక్ష్మీ, మురళీ శర్మ, జయరామ్, రోహిణి, సచిన్ ఖేడేకర్, శరణ్య, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
దర్శకత్వం: శివ నిర్వాణ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ: మురళి. G
నిర్మాత : చిరంజీవి పెదమల్లు, Y. రవిశంకర్, నవీన్ యెర్నేని
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రమిది. విజయ్‌కి జోడిగా సమంత అని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సూపర్ హిట్ సాధించడంతో ‘ఖుషి’పై హైప్ మరింత పెరిగింది. భారీ అంచనాల మధ్య ఇవాళ (సెప్టెంబర్ 1) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విజయ్, సమంత జోడీకి ఎన్ని మార్కులు పడ్డాయి? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.
కథ:
ఈ సినిమా కథ కశ్మీర్లో ప్రారంభమవుతుంది. బుర్ఖాలో ఉన్న బేగం (సమంత)ను చూసి విప్లవ్ (విజయ్ దేవరకొండ) తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ పిల్ల తనదని ఫిక్స్ అవుతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో బేగం బ్రాహ్మిణ్ అని విప్లవ్కు తెలుస్తుంది. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా ‘ఖుషి’గా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల కాపురం కొత్త మలుపు తిరుగుతుంది. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే?
విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. విప్లవ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి అలరించాడు. అటు సమంత కూడా ఆరాధ్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఎంతగానో ఆకట్టుకుంది. తెరపై విప్లవ్, ఆరాధ్య పాత్రలు మాత్రమే కనిపించేంతలా విజయ్, సామ్ పోటీపడి నటించారు. వీరి మధ్య కెమెస్ట్రీ సైతం అద్భుతంగా కుదిరింది. అటు మురళీశర్మ, సచిన్ ఖేడేకర్, రోహిణి, లక్ష్మీ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. వెన్నెల కిషోర్, అలీ, రాహుల్ రామకృష్ణ కామెడీ నవ్వులు పూయించింది.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసే దర్శకుడు శివ నిర్వాణ. తన గత చిత్రాలైన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఖుషి కోసం రొటిన్ కథనే ఆయన ఎంచుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. పెళ్లి తర్వాత ఇది చేద్దాం.. అది చేద్దాం అని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంటలకు ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్లు బోరింగ్ అనిపిస్తాయి. మరికొన్ని సీన్లు ఎక్కడో చూసిన భావన కలిగిస్తాయి. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా శివ నిర్వాణ డైరెక్షన్ బాగుంది.
టెక్నికల్‌గా
ఖుషి సినిమాకు టెక్నికల్ అంశాలు చాలా బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. సందర్భానుసారంగా వచ్చే సాంగ్స్ ఎంతో వినసొంపుగా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అటు G. మురళి అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి మంచి ఎసెట్ అయ్యింది. ముఖ్యంగా కశ్మీర్ అందాలను ఆయన తన కెమెరా పనితనంతో ఎంతో అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. నాణ్యత విషయంలో ప్రొడ్యుసర్లు ఎక్కడా రాజీపడినట్లు అనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
విజయ్, సమంత నటనసంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
కథనంబోరింగ్ సీన్స్
రేటింగ్: 3/5
సెప్టెంబర్ 01 , 2023
SAMANTHA: సమంత కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడిందా? ఖుషీ సినిమానే చివరిదా?
సమంత…. నిన్న మెున్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. కానీ, ప్రస్తుతం సీన్ మారిపోయింది. ఒకప్పుడు చేతినిండా ఆఫర్లతో బిజీగా గడిపిన సామ్‌కు… ఇప్పుడు తెలుగులో విజయ్ దేవరకొండ సినిమా మినహా మరొకటి లేదు. బాక్సాఫీస్ వద్ద ఆమె చిత్రాలు పెద్దగా ఆడకపోవటంతో పాటు అటు మయోసైటిస్ సమస్యలు కూడా వేధిస్తుండటంతో సామ్ కెరీర్ దాదాపు ముగిసిందనీ సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.
ఇండస్ట్రీలో ఇక కష్టమే
సమంతకు గత కొన్నేళ్లుగా చెప్పుకోదగిన హిట్ పడటం లేదు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు ఎంచుకున్నప్పటికీ ప్రేక్షకులు ఆదరించట్లేదు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన యశోద అంతంతమాత్రంగానే నడిచింది. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిందనే చెప్పాలి. సినిమాకు పెద్దగా కలెక్షన్లు రావటం లేదు. ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువ వచ్చాయని చెబుతున్నారు. అంటే సామ్ ఫ్యాన్ బేస్ కూడా చాలా తగ్గిపోయింది. దీంతో ఆమె కెరీర్‌కు దాదాపు ఎండ్ కార్డ్ పడిందని అంతా భావిస్తున్నారు.
సామ్ ప్రాజెక్టులు
సామ్ చేతిలో ప్రస్తుతం కేవలం రెండు సినిమాలే ఉన్నాయి. విజయ దేవరకొండ సరసన ఖుషీ అనే చిత్రంలో చేస్తోంది. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో మజిలీ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్లో సిటాడెల్ రీమేక్ ప్రాజెక్టులోనూ నటిస్తోంది సామ్. ఇప్పటికే షూటింగ్లో పాల్గొంటుంది. ఈ రెండు మినహా ఆమె మరో చిత్రానికి కమిట్ అవ్వలేదు. దర్శకులెవ్వరూ చిత్రాలు చేయటానికి ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపిస్తోంది.
మయోసైటిస్ సమస్యలు
మయోసైటిస్ వ్యాధి సామ్‌ను తీవ్రంగా వేధిస్తోంది. యశోద సినిమా సమయంలో వ్యాధి సోకటంతో ఇబ్బంది పడుతుంది. సెలైన్ బాటిల్‌పైనే డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు కొద్దిగా కోలుకుని శాకుంతలం సినిమా చేసినప్పటికీ వివిధ సమస్యల కారణంగా ప్రచార కార్యక్రమాలు, షూటింగ్స్‌లో ఎక్కువగా పాల్గొనలేకపోయింది సమంత. కొన్ని సందర్భాల్లో ఈ సూచనలు స్పష్టంగా కనిపించాయి. మరి, ఇలాంటి సమయంలో నిర్మాతలు డబ్బులు పెట్టి షూటింగ్స్ ఆలస్యం చేసుకోవటం ఎందుకని భావిస్తున్నట్లు సమాచారం.
అందం తగ్గిపోయిందా?
సమంత లుక్ కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు ఉన్నంత అందంగా ఇప్పుడు ఆమె కనిపించట్లేదు. ఈ విషయం గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరిగింది. సామ్ అందం తగ్గిపోయిందని.. ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని అందరూ అంటున్నారు. ఫ్యాన్స్ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ… చాలామంది విమర్శలు చేస్తున్నారు.
సమంత పనైపోయింది
నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రేంజ్ పడిపోయిందని.. అందుకే వచ్చిన సినిమాలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆఫర్ల కోసం డ్రామాలు ఆడుతుందని ఓ అడుగు ముందుకేశారు. యశోద రిలీజ్ సమయంలో ఏడవటం.. శాకుంతలం అప్పుడు ఆరోగ్యం బాలేదని డ్రామాలు ఆడుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఏం మాయ చేశావే
నాగ చైతన్య సరసన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది సమంత. జెస్సీగా అందరి మనసులు దోచి అభిమానులను సంపాదించింది. మెుదటి సినిమానే హిట్ కావటంతో పాటు అందం, అభినయం ఉండటంతో వరుస ఆఫర్లతో దూసుకుపోయింది ఈ హీరోయిన్. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేసి చేతి నిండా సినిమాలతో వెలుగు వెలిగింది.
ఫ్యాన్ బేస్
సమంత ఫ్యాన్ బేస్ కూడా చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు కేవలం ఆమె కోసం మాత్రమే సినిమాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆమె నుంచి చిత్రం వస్తున్నా పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఒకప్పుడున్నంత ఫాలోయింగ్ సామ్‌కు ఇప్పుడు లేదనే చెప్పాలి. ఇన్ని ఒడుదొడుకుల నడుమ సమంత ఇండస్ట్రీలో ఎలా నెట్టుకు వస్తుందో చూడాలి.
ఏప్రిల్ 17 , 2023
LOVE SONGS: అబ్బాయిని ఇష్టపడుతూ అమ్మాయిలు పాడే పాటలు ఇవే… సెన్సేషనల్ హిట్స్
అమ్మాయి మీద ప్రేమతో కవిత్వాలు, పాటలు రాసి వారికి చెప్పడం చాలా సహజం. ఎన్నో సినిమాల్లో అలాంటి పాటలు మనకు కనిపించాయి. కానీ, అబ్బాయి మీద ప్రేమను తెలియజేస్తూ వచ్చే పాటలు తక్కువగా ఉంటాయి. తెలుగు సినిమాల్లో అలాంటి సాంగ్స్ కొన్ని మీకోసం.
మాష్టారు మాష్టారు…
ప్రస్తుతం క్కడ విన్నా ఒకే పాట వినబడుతుంది. ధనుష్ హీరోగా వచ్చిన సార్ చిత్రంలోని “మాష్టారు మాష్టారు నా మనసును గెలిచారు” అనే సాంగ్ . హలో ట్యూన్లో వైరల్‌గా మారిన ఈ పాట కూడా అబ్బాయిపై ప్రేమని చెప్పే పాటనే. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.
https://www.youtube.com/watch?v=7JBPq28O0sY
సామీ సామీ…
అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని సామీ సామీ అంటూ సాగే పాట ఈ కోవలోకి వస్తుంది. పుష్ప గురించి హీరోయిన్ పాడే ఈ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాటకు ఇన్‌స్టాలో చేయని రీల్ లేదు. చేయని వారుండరంటే అతిశయోక్తి కాదు. దేవీ శ్రీ ప్రసాద్ నుంచి వచ్చిన మరో అద్భుతమైన సాంగ్ ఇది.
https://www.youtube.com/watch?v=JJFVjxFmYlY
ప్రియతమా ప్రియతమా..
మజిలీ చిత్రంలోని ప్రియతమా ప్రియతమా అనే పాట ఇటీవల విడుదలైన బెస్ట్ లవ్ సాంగ్. నాగ చైతన్య తన ప్రేమని అర్థం చేసుకోవాలనే ఆశతో సమంత పాడుతుంది. ఈ పాట ఓ క్లాసిక్‌గా నిలిచిపోయిందనే చెప్పాలి. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
https://www.youtube.com/watch?v=BpINyS4k7Uw
ఉండిపోవ నువ్విలా..
సవారి చిత్రంలోని “ఉండిపోవ నువ్విలా రెండు కళ్ల లోపలా” అనే పాట ఇటీవల వచ్చిన పాటల్లో సూపర్ హిట్ అయ్యింది. అబ్బాయి మీద ప్రేమని వర్ణిస్తూ పాడిన పాట చాలామంది హృదయాల్ని తాకిందని చెప్పవచ్చు.
https://www.youtube.com/watch?v=UwALZDEsMdU
మనసున ఉన్నది…
తరుణ్, స్నేహ కాంబినేషన్లో వచ్చిన ప్రియమైన నీకు చిత్రంలోని “మనసున ఉన్నది చెప్పాలనున్నది” ఈ పాట అప్పట్లో ఓ సెన్సేషన్. ప్రేమించే అబ్బాయి గురించి మనసులో దాగున్న విషయాలను చెప్పలేకపోతున్నట్లుగా సాగే ఈ పాట సూపర్ హిట్. ఈ సినిమాకు శివశంకర్ సంగీతం అందించారు.
https://www.youtube.com/watch?v=COZGV3vEQ4A
ఇంతకీ నువ్వెవరు?...
నాని నటించిన స్నేహితుడు చిత్రంలోని “ఇంతకీ నువ్వెవరు వరుసకి నాకెవరు” అంటూ అబ్బాయి కోసం అమ్మాయి పాడే ఈ సాంగ్ చార్ట్‌బస్టర్. అనుకోని సమస్యల్లో చిక్కుకున్న తనకి సాయం చేస్తున్న అబ్బాయి గురించి హీరోయిన్ పాడుతుంది. శివరాం శంకర్ సంగీతం అందించారు.
https://www.youtube.com/watch?v=Yyn8XCwaalw
కోపమా నాపైనా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, త్రిష జంటగా తెరకెక్కిన లవ్, రొమాంటిక్ సినిమా వర్షం లోని “కోపమా నాపైనా ఆపవా ఇకనైనా” అంటూ సాగే పాట ట్రెండ్ సెట్టర్. అమ్మాయిపై అలిగిన హీరో కోసం పాడిన ఈ సాంగ్‌కి దేవి శ్రీ సంగీతం అందించగా శ్రేయ గోషాల్ పాడారు.
https://www.youtube.com/watch?v=K6gTLP1-gWU
మార్చి 17 , 2023
Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
టాలీవుడ్ అంటేనే ప్రపంచ సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రత్యేకించి, ఈ పరిశ్రమను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో హీరోయిన్ల పాత్ర అమోఘం. అద్భుతమైన అభినయంతో పాటు, అందంతో కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కను సైగలతోనే మాట్లాడగల నేర్పుతో అలరిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభతోనే కష్టపడి ఎదిగిన ఈ కథానాయికల అందం, నటన మనం మరిచిపోలేము. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో ఇంటర్నెట్లో నెటిజన్లు ఎక్కువగా వెతికిన టాప్ తెలుగు హీరోయిన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి
Sobhita Dhulipala
శోభితా ధూళిపాళ టాలీవుడ్ హీరోయిన్ . ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తోంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016) ద్వారా నటిగా పరిచయమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢచారి చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. రీసెంట్గా ఆమె హీరో నాగచైతన్యను వివాహం చేసుకుంది.
Meenakshi Chaudhary
మీనాక్షి చౌదరి.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్. హరియాణాలో పుట్టి పెరిగిన మీనాక్షి.. కెరీర్ ప్రారంభంలో మోడల్‌గా చేసింది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' (2021) ఫిల్మ్‌తో టాలీవుడ్లో అడుగుపెట్టింది. హిట్ 2, గుంటూరు కారం, లక్కీ బాస్కర్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో క్రేజ్ సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 9 సినిమాలు చేసింది.
Sreeleela
శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్. శ్రీలీల చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చింది. MBBS చదివిన శ్రీలీల నటనపై మక్కువతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది. పెళ్లి సందD చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది
Samantha
సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ప్రధానంగా నటిస్తోంది. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది.
Courtesy Instagram: samantha
Rashmika Mandanna
నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. కిరాక్ పార్టీ, గీతాగోవిందం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆమె సైమా పురస్కారం అందుకుంది .
Sai Pallavi
సాయిపల్లవి భారతీయ సినీ నటి. మలయాళం చిత్రం ప్రేమమ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలోని మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.
Kiara Advani
కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ . ఆమె హిందీ మరియు తెలుగు భాషా చిత్రాలలో పని చేస్తుంది. ఆమె హాస్య చిత్రం ఫగ్లీ (2014)లో తొలిసారిగా నటించింది. స్పోర్ట్స్ బయోపిక్ MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (2016)లో MS ధోని భార్యగా నటించింది. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిల్మ్ లస్ట్ స్టోరీస్ (2018)లో లైంగికంగా సంతృప్తి చెందని భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది మరియు పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను మేయిన్ హీరోయిన్గా నటించి మెప్పించింది.
Rukshar Dhillon
రుక్సర్ థిల్లాన్ టాలీవుడ్‌కు చెందిన నటి. 2016లో కన్నడ సినిమా 'రన్ ఆంటోని'తో సినీ రంగ ప్రవేశం చేసింది. ‘ఆకతాయి’ (2017) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'కృష్ణార్జున యుద్ధం' (2018), ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (2022), ‘నా సామిరంగా’ (2024) చిత్రాలతో తెలుగులో పాపులర్ అయ్యింది.
Samyuktha Menon
సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్‌తో నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. సంయుక్త మీనన్ తెలుగు కంటే ముందు మలయాళం చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పాప్‌కార్న్, థివాండి వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
Keerthy Suresh
కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్ దే(2021), సర్కారు వారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహానటిలో ఆమె నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.
Divyansha Kaushik
దివ్యాంశ కౌశిక్ తెలుగు చిత్రం మజిలీ (2019)తో తొలిసారిగా నటించింది, దీని కోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం SIIMA అవార్డును అందుకుంది.
Pooja Hegde
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది.
Mirnalini Ravi
మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్' ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చింద్రా’ చిత్రాల్లో నటించింది. మృణాళిని నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్ గురు'లోనూ మంచి నటన కనబరిచి అభిమానులను అలరించింది.
Kethika Sharma
కేతిక శర్మ తెలుగు సినిమా నటి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగ రంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్ లైఫ్ (2016)' వీడియోతో పాపులర్ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది.
Chandini Chowdary
చాందిని చౌదరి తెలుగులో మధురం సినిమాతో ఆరంగేట్రం చేసింది. 'కలర్ ఫొటో' సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్లో నటించి సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Eesha Rebba
ఈష రెబ్బ తెలుగు సినీ నటి. 'అంతకు ముందు... ఆ తరువాత'(2013) చిత్రం ద్వరా హీరోయిన్గా పరిచయమైనది. బందిపోటు, బ్రాండ్ బాబు సినిమాల్లో హిరోయిన్‌గా గుర్తింపు పొందింది. అయితే ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ సహాయ నటి పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది. అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఈష రెబ్బ సినిమాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించింది. 3 రోజస్, పిట్టకథలు, మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది.
Priyanka Jawalkar
"ప్రియాంక జవాల్కర్ తెలుగు సినిమా నటి. కలవరం ఆయే సినిమా(2017) సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన టాక్సీవాలా చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. మరాఠి కుటుంబానికి చెందిన ప్రియాంక విద్యాభ్యాసం అంతా ఏపీలోనే జరిగింది. ఆమె హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉన్న ప్రియాంక ఎన్.జె.బిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. టాలీవుడ్లో నటనతో పాటు గ్లామర్‌కు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Dimple Hayathi
డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవి తేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.
Courtesy Instagram: Dimple Hayathi
Pujita Ponnada
పూజిత పొన్నాడ టాలీవుడ్‌కు చెందిన నటి. విశాఖపట్నంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ నగరాల్లో పెరిగింది. ఊపిరి (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 'రన్' (2020) సినిమాతో హీరోయిన్గా మారింది. ఇప్పటివరకూ తెలుగులో 18 చిత్రాల్లో నటించింది.
Ananya Nagalla
అనన్య నాగళ్ల తెలుగు సినీ నటి. మల్లేశం(2019) సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్', వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్‌లోని రాజా మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేసింది. కొన్నిరోజులు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది.
Courtesy Instagram:Ananya Nagalla
డిసెంబర్ 04 , 2024
Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!
ప్రేమ అంటే రెండు అక్షరాల కలయిక కాదు. రెండు మనసుల కలయిక. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పరితపించేది, అన్వేషించేది ప్రేమ కోసమే. మనిషి నుంచి పశు పక్ష్యాదుల వరకు ప్రేమతోనే జీవితాలు ముందుకు సాగుతుంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలతో సంబంధం లేకుండా జీవన నావా ముందుకు సాగాలంటే ప్రేమ అనే చమురు చాలా అవసం. ఒకరిపై ఎంత ప్రేమో చెప్పాలంటే మాటలు సరిపోవు. కానీ కొన్ని మనసును తాకి మనలోని ప్రేమను ధ్వనింపజేస్తాయి. తెలుగు సినీలోకంలో ప్రేమ కావ్యాలు కోకొల్లలు. ప్రేక్షకులను ప్రేమ మాయలోకి దింపిన ఆ దృశ్య కావ్యాల నుంచి మనసుకు హత్తుకునేలా చేసిన డైలాగ్స్ మీకోసం..
[toc]
బేబీ
“ఫస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడే అనుకున్నా.. రెండోసారి, ఇంకోసారి ప్రేమ అనే మాట ఉండదని”
“మీ అంత బలం లేకుండొచ్చు. గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఇంకెవడూ ఎవడూ కొట్టలేడు”
“అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు కష్టం వస్తుందని దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడు”
వాన
“ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నన్ను మర్చిపోయినా.. ముసలిదానివైపోయినా.. చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు”
మన్మథుడు
“నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంతిష్టమో చెప్పగలను!”
కంచె
“గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం”
నిన్నుకోరి
“నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే… లైఫ్ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది”
ఆర్య
“నీ కోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను “
ఆరెంజ్
“ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే.. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే.. జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి”
ప్రేయసిరావే
“ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవ కణంలోనూ నీ జ్ఞాపకమే ఉంటుంది.”
ఏమాయ చేశావె
“ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే , ఒక్క నువ్వు తప్ప.”
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
“కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!”
మజిలి
“పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది”
ఊపిరి
“ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెబితే.. ఎక్కడ రిజెక్ట్ చేస్తారోనని భయం. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయం. మనకి కావాల్సిన వాళ్లు దూరమైతే.. ఎలా ఉన్నారని భయం. నిజానికి భయం ఉంటే.. ప్రేమ ఉన్నట్టే”
జాను
“పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే”
అందాల రాక్షసి
“నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను”
"రాళ్ళను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు."
ఓయ్
“నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే”
కలర్ ఫొటో
“ప్రేమించిన వారిని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ.”
“ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి..ఈ సముద్రం గట్టున నిల్చున్న మనిషి ఇద్దరూ ఒకటే
సముద్రం వచ్చి చల్లగా మన కాళ్లు కడుగుతోందని అనుకుంటాం.
కానీ మనకే తెలియకుండా కాళ్ల కింద ఇసుకని వెనక్కి లాగేసుకుని పోతుంది.
మొగుడి దగ్గర మనసు దాచుకోగలం.. కానీ ఒళ్లు దాచలేం.”
“ఈ ప్రపంచం మొత్తమ్మీద స్వచ్ఛమైన వాటిలో
రెండోది అమ్మాయి నవ్వు.మొదటిది ఓ మగాడి కన్నీళ్లు.”
“నీరు పట్టిన చద్దన్నం ఆకలి తీర్చకపోవచ్చు..కానీ కుడితి కలిపి పెడితే ఆవులు ఆవురావురుమంటూ తాగుతాయి.
అలాగే మురికి నీళ్లు మనకు దాహం తీర్చకపోవచ్చు..కానీ నిప్పును ఆర్పుతాయి.
ప్రపంచంలో ఏదీ ఊరికే పోదు అన్నీ ఉపయోగపతడాయి.”
మనం
“మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు”
పడిపడిలేచె మనసు
మిమ్మల్ని ప్రేమించిన వాళ్లకి.. అది కష్టమైనా, నష్టమైనా చివరి వరకూ మీతోనే ఉండాలనిపిస్తుంది.
హలో గురు ప్రేమకోసమే
“గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి... మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం.”
తీన్మార్
“మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది”
అల వైకుంఠపురములో..
“ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కరెక్టే.., కానీ నిజం చెపితేనే కదా, ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.”
“బరువు పైన ఉంటే కిందకి చూడలేం, ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.”
“ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే వెలుగు, అదే గుడిలో వెలిగితే ఊరంతటికి వెలుగు”
“ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మ నాన్నలు అనుకోవడమేనా, అమ్మ, నాన్ననాన్నలు బాగుండాలని పిల్లలు అనుకోరా.!
“ఒక యుద్ధం వచ్చిన దేశం లో ఉన్నవాళ్ళందరూ, కులం, మతం ప్రాంతం అనే తేడాలు లేకుండ కలిసిపోతారు సర్,
ఒక కష్టం వచ్చినప్పుడే, కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ల స్వార్థం, ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.”
ఆగస్టు 23 , 2024
Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
తెలుగు చిత్ర సీమలో అందాలకు కొదువ లేదు. హాట్ గ్లామర్‌ను పండిచడంలో మన హీరోయిన్లు ఏ చిత్ర పరిశ్రమకు తక్కువకాదు. హాట్ సీన్లైనా, బెడ్రూం సీన్లలోనైనా నటించేందుకు వెనకాడటం లేదు. ఇక సినిమాల్లో గ్లామర్ షోను కాసేపు పక్కన పెడితే... సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అదరహో అనిపిస్తున్నారు. బికినీ సూట్లలో దర్శనమిస్తూ హీటెక్కిస్తున్నారు. కుర్ర హీరోయిన్లే కాదు.. వారితో పోటీపడుతూ మరి సీనియర్ భామలు కూడా పరువాల ప్రదర్శనకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరి ఆ అందాలపై మీరు ఓ లుక్కేయండి.
[toc]
Samantha Ruth Prabhu
సమంత సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. తొలి తరంలో కాస్త గ్లామర్ షోకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం..ఐటెం సాంగ్స్, లిప్ లాక్, బెడ్ రూం సీన్లలోనూ నటించేందుకు సిద్ధమైంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఫ్యాన్స్‌ను కవ్విస్తుంటుంది. హాట్ ఫొటో షూట్‌తో అలరిస్తుంది. ఆమె బికినీ ఫొటోలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మరి సమంత బికినీ ఫోటోస్‌పై మీరు ఓ లుక్కేయండి.
Samantha bikini images
Kajal Aggarwal
కాజల్ అగర్వాల్ తెలుగు, హిందీ, తమిళ్ భాషాల్లో ప్రధానంగా నటించింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారం అందుకుంది. ఇక కాజల్ అగర్వాల్ అందాలకు ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉంటుంది. చీర కట్టులో ఉన్నా, మోడ్రన్ డ్రెస్‌లో ఉన్నా తరగని అందం ఆమె సొంతం. బహిరంగంగా బికినీలో తన అందాలు చూపించేందుకు కాజల్‌కు ఇష్టముండదట. బికినీ ధరించాల్సి వచ్చిన సమయంలో సినిమాలనే వదులుకుంది ఈ భామ. అయితే కాజల్ తన బర్త్‌డే సందర్భంగా బికినీలో స్విమ్ చేసిన వీడియో మాత్రం ఉంది.
Kajal Agarwal bikini video
https://twitter.com/TCINEUpdate/status/1670989988929077250
Tamannaah Bhatia
తమన్నా భాటియా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015), ఊపిరి (2016), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017), ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019), సైరా నరసింహా రెడ్డి (2019), ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2022) వంటివి తమన్నా నటించిన ప్రముఖ తెలుగు సినిమాలు. కల్లూరి (2007), అయాన్ (2009), పయ్యా (2010), సిరుతై (2011), వీరమ్ (2014), ధర్మ దురై (2016), దేవి (2016), స్కెచ్ (2018), జైలర్ (2023) వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాల్లో నటించింది. నవంబర్ స్టోరీ (2021), జీ కర్దా (2023), ఆఖ్రీ సచ్ (2023), లస్ట్ స్టోరీస్2 వంటి వెబ్‌సిరీస్‌ల్లో ప్రధాన నటిగా పనిచేసింది. లస్ట్ స్టోరీస్‌లో ఆమె గ్లామర్ షోపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితేనేం ఏమాత్రం పరువాల ఘాటు తగ్గించకుండా దూసుకెళ్తోంది. ఆమె బికినీలో చేసే హాట్ షోకు అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు.
Tamannaah Bhatia Bikini images
View this post on Instagram A post shared by Think Music India (@thinkmusicofficial)
View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)
Anushka Shetty
అనుష్క శెట్టి పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ త్వారత విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అరుంధతి(2009), బిల్లా(2009), మిర్చి(2013), బాహుబలి(2015), రుద్రమదేవి(2015), బాహుబలి ది కన్‌క్లూజన్(2017) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన ఏకైక హీరోయిన్గా అనుష్క శెట్టిని చెప్పవచ్చు.
Anushka shetty Bikini Images
Disha Patani
దిషా పటాని తెలుగు చిత్రం లోఫర్ (2015)తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె బయోపిక్ MS ధోనితో హిందీ చలన చిత్రాల్లోకి అడుగుపెట్టింది. సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దిషా నటనతోనే కాదు తన అందంతోనూ ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామర్ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు బికినీ ఫొటోలు పెడుతూ కుర్రకారును ఊరిస్తు ఉంటుంది.
Disha Patani Bikini images
Pragya Jaiswal
ప్రగ్యా జైస్వాల్ ప్రధానంగా తెలుగు చిత్రాలలో పని చేస్తుంది. జైస్వాల్ తెలుగు పీరియడ్ డ్రామా కంచె (2015)తో గుర్తింపు పొందింది. తొలి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డును పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మకు చెప్పుకోదగ్గ అవాకాశాలు ప్రస్తుతం లేకున్నా…తనదైన గ్లామర్ షోతో ఆకట్టుకుటుంది. ఆ అందాలను మీరు చూసేయండి.
Pragya Jaiswal bikini Images
ShwetaTiwari
శ్వేతా తివారీ హిందీ సినిమా, టెలివిజన్ నటి. 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. తివారీ బిగ్ బాస్ 4 (2010–11), కామెడీ సర్కస్ కా నయా దౌర్ (2011) రియాల్టీ షోలలో విజేతగా నిలిచి గుర్తింపు పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు హద్దు అంటూ లేదు. ఓసారి మీరు చూసేయండి మరి.
ShwetaTiwari Bikini Images
Deepika Padukone
దీపికా పదుకొనే ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు, ఆమె ప్రశంసలలో మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. ఆమె దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలలో ఉంది; టైమ్ ఆమెను 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది మరియు 2022లో ఆమెకు టైమ్100 ఇంపాక్ట్ అవార్డును ప్రదానం చేసింది.
deepika padukone bikini Images
Pooja Hegde
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు అందాల దేవతగా మారింది. ఈ అమ్మడి సోకులకు కుర్రకారు హుషారెక్కుతుంటారు. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా చూడండి.
Pooja Hegde Bikini Images
Pooja Hegde Hot Videos
https://twitter.com/RakeshR86995549/status/978983052364808194
View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)
View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)
Raashii Khanna
రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశి ఖన్నా చదువులో టాపర్. ఐఏఎస్ కావాలని ఆకాంక్షించినప్పటికీ... క్రమంగా మోడలింగ్ వైపు మొగ్గు చూపింది. ఆ తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ప్రతిరోజు పండగే, జీల్, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ బాట పట్టింది. అక్కడ హాట్ గ్లామర్ షో చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ అమ్మడి అందాలకు మంచి క్రేజ్ ఉంది. ఫొటోలు పెట్టినా క్షణాల్లోనే లక్షల్లో లైక్‌లు వస్తుంటాయి.
Raashii Khanna Bikini images
Dimple Hayathi
డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమె డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. కేవలం ఆమె అందం కూడా అదే రేంజ్లో ఉంటుంది. డింపుల్ బికినీ అందాలను ఇప్పటికీ ఏ హీరోయిన్ బీట్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. మీరు ఓసారి ఆ సోగసులపై లుక్ వేయండి
https://twitter.com/PicShareLive/status/1525365506471231488
Ketika Sharma Bikini Images
కేతిక శర్మ తెలుగు సినిమా నటి. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్ లైఫ్ (2016)' వీడియోతో పాపులర్ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. ఈ పాప సోషల్ మీడియాలో కాస్త కూడా కుదురుగా ఉండదు. హాట్ హాట్ ఫొటో షూట్లతో వెర్రెక్కిస్తుంటుంది. మరి మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్ వేయండి
Ketika Sharma Bikini Images
Catherine Tresa
కేథరీన్ థెరీసా ప్రధానంగా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో నటిస్తోంది. తెలుగులో చమ్మక్ చల్లో చిత్రం ద్వారా పరిచయమైంది. కన్నడలో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును పొందింది. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా నటించింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. సరైనోడు, నేనేరాజు నేనే మంత్రి, బింబిసారా, వదలడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు కేథరీన్ మోడలింగ్ చేసింది. "నల్లి సిల్క్స్", "చెన్నై సిల్క్స్", "ఫాస్ట్ ట్రాక్","దక్కన్ క్రానికల్" లకు మోడల్‌గా వ్యవహరించింది. ఈ ముద్దుగుమ్మ నటనలోనే కాదు అందాల ప్రదర్శనలోనూ ఓ మెట్టు ఎక్కింది. తన సొగసుల సంపదను అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల గుండెల్లో వీణలు మోగిస్తుంటుంది. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా ఆస్వాదించండి.
Catherine Tresa Bikini images
Mrunal Thakur
మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా(2018) హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. తెలుగులో వచ్చిన జెర్సీ రీమేక్‌లో షాహిద్ కపూర్ సరసన నటించడంతో ఆమె టాలీవుడ్ పెద్దల దృష్టి పడింది. దీంతో ఆమెకు తెలుగులో సీతారామం(2022) చిత్రం ద్వారా అవకాశం వచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఇక మృణాల్ అందాల గురించి ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. మరి ఆ రేంజ్లో ఉంటుంది ఈ అమ్మడి అందాల తెగింపు. ఒక్క పాటలో చెప్పాలంటే ఇంతందం దారి మళ్లిందా అనిపిస్తుంది తన సోగసుల సోయగాలు చూస్తుంటే.. మీరు ఓసారి చూసేయండి మరి.
Mrunal Thakur Bikini images
Mrunal Thakur hot video
https://twitter.com/MassssVishnu/status/1786566946600988750
https://twitter.com/MrunalThakur143/status/1788433120221401193
https://twitter.com/SastaJasoos/status/1788498532162236427
Anasuya Bharadwaj
బుల్లితెర వ్యాఖ్యతగా అలరించిన గ్లామరస్ యాంకర్ అనసూయ.. నటిగా తొలిసారి నాగ(2003) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో బుజ్జి క్యారెక్టర్లో నటించింది. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ నటనకుగాను అవకాశాలు క్యూ కట్టాయి. రామ్‌చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఆమె చేసిన రంగమత్త పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. యాంకర్ రోల్‌ను వదిలి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది. క్షణం, విన్నర్, పుష్ప, రంగమర్తాండ, విమానం వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు తనలోని నటనా కోణాన్ని పరిచయం చేసింది. రంగస్థలం, క్షణం చిత్రాలకుగాను ఉత్తమ సహాయనటిగా సైమా పురస్కారాలు అందుకుంది. నటన కంటే ముందు ఆమెను పాపులర్ చేసింది మాత్రం ఆమె గ్లామర్ షో అని చెప్పాలి. బిగువైన అందాల విందుతో కుర్రకారుకు కలల రాణిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఏ ఫొటో పెట్టినా ఇట్టే ట్రెండ్ అవుతాయి మరి.
Anasuya Bharadwaj Bikini images
View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)
Nidhhi Agerwal
నిధి అగర్వాల్ ప్రధానంగా తెలుగుతో పాటు హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో సవ్యసాచి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పూరి డైరెక్షన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తొలి బ్లాక్బాస్టర్ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో గ్లామరస్ క్వీన్‌గా గుర్తింపు పొందింది. సినిమాల్లోకి రాకముందు.. కపిల్ శర్మ టాక్ షో, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్-4లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇక నిధి శర్మ ఇచ్చే గ్లామర్ షో గురించి మాట్లాడితే.. చూసేవారికి కన్నుల పండుగేనని చెప్పాలి. ఈ పాప బికిని వేసిన ఫొటోలు తక్కువేకానీ..చూపించిన ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది. కావాలంటే మీరు ఓసారి చూసేయండి.
Nidhhi Agerwal Bikini Images
Mehreen Kaur Pirzada
మెహ్రీన్ తెలుగు సినిమా నటి. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ పిల్ల అందాల ప్రదర్శన గురించి మాట్లాడితే.. పర్వాలేదనే చెప్పాలి. ఫోటో షూట్ల కంటే ఈ అమ్మడు వీడియో షూట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది.
Mehreen Kaur Pirzada Bikini Videos
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
Manushi Chillar
మానుషి చిల్లర్.. ప్రముఖ మోడల్. మిస్ వరల్డ్ 2017 పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ వరల్డ్ కిరీటం పొందిన ఆరో భారత మహిళగా రికార్డులకెక్కింది. 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రంతో ఈ భామ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్గా బడేమియా చోటేమియా సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక ఈ మాజీ ప్రపంచ సుందరి బికినీ అందాల గురించి చెప్పేదిమి లేదు. మీరే చూసేయండి.
Manushi Chillar Bikini Images
Manushi Chillar Bikini videos
View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar)
https://twitter.com/ManushiChhillar/status/1787462061280166182
Sobhita Dhulipala
శోభితా ధూళిపాళ ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది మరియు మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ యొక్క థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016)లో ఆమె తొలిసారిగా నటించింది మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చీర కట్టినా.. మోడ్రన్ డ్రెస్ వెసినా తరగని అందంతో చెలరేగుతుంటుంది. మరి ఆ అందాల విందును మీరు చూసేయండి మరి.
Sobhita Dhulipala bikini images
Hot videos
View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)
Tripti Dimri
తృప్తి డిమ్రి.. కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ (2017) ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి సారి లీడ్ రోల్లో నటించింది. ఆ తరువాత ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)లలో చిత్రాలలో నటించింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు యానిమల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. రెడిఫ్ డాట్ కామ్ 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమె 8వ స్థానంలో నిలిచింది. ఇక అమ్మడు ఎక్స్‌పోజింగ్‌లో బాలీవుడ్ హీరోయిన్లకంటే రెండు అకులు ఎక్కువే చదివింది. ఓసారి ఆ అందాల విందును మీరు తనివితీరా ఎంజాయ్ చేయండి.
Tripti Dimri Bikini images
View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri)
Shirley Setia
షిర్లె సెటియా... కృష్ణ వ్రింద విహారి చిత్రం(2022) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా యావరేజ్‌గా ఆడిన మంచి గుర్తింపు సాధించింది. అయితే ఈ చిత్రానికి కంటే ముందు లాక్డౌన్(2018) వెబ్‌సిరీస్ ద్వారా గుర్తింపు దక్కించుకుంది. షిర్లె సెటియాలో బహుముఖ ప్రజ్ఞ దాగి ఉంది. నటిగా మాత్రమే కాకుండా.. సింగర్‌గాను రాణించింది. ఇక కుర్రదాని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.
Shirley Setia Bikini Images
మే 11 , 2024
‘అల వైకుంఠపురంలో’ రీమేక్ ఎందుకు వర్కౌట్ కాలేదు..? డిజాస్టర్‌గా కార్తీక్ ఆర్యన్ ‘షెహ్జాదా’
సౌత్ సినిమాలను హిందీలోకి రీమేక్ చేసే సంప్రదాయం ఇటీవల బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే 2020లో విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ సినిమాను ‘షెహ్జాదా’గా రీమేక్ చేశారు. కార్తీక్ ఆర్యన్‌కి జంటగా కృతి సనన్ నటించింది. రోహిత్ ధవన్ డైరెక్షన్ వహించారు. అయితే, ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బీ టౌన్ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ‘షెహ్జాదా’పై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రబృందానికి ప్రేక్షకులు గట్టి షాక్ ఇచ్చారు. అసలు ఈ సినిమా ఎందుకు ఆడలేదు? ‘అల వైకుంఠపురం’ సినిమాకి, ‘షెహ్జాదా’కి మధ్య ప్రధాన తేడా ఏంటో చూద్దాం.
స్టోరీ లైన్, అల్లు అర్జున్ నటన, తమన్ సంగీతం, స్టైలిష్ ఫైట్స్,డ్యాన్స్ కొరియోగ్రఫీ త్రివిక్రమ్ మార్క్ టేకింగ్.. ‘అల వైకుంఠపురం’ సినిమా భారీ విజయం సాధించడానికి ప్రధాన కారణాలు. ‘నాన్ బాహుబలి’ కేటగిరీలో అత్యధిక వసూళ్లను సాధించి ‘అల వైకుంఠపురంలో’ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. అంతటి విజయవంతమైన సినిమాను రీమేక్ చేయగా కనీస స్పందన రాకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అయితే, ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో పోలిస్తే ‘షెహ్జాదా’లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. వీటి వల్ల మాతృక సినిమా కలిగించిన అనుభూతిని షెహ్జాదా కల్పించలేక పోయింది.
స్టోరీ లైన్లో మార్పు..
ఒరిజినల్ సినిమాలో బంటు(అల్లు అర్జున్) వాల్మీకి(మురళీ కృష్ణ) కుమారుడిగా పెరుగుతాడు. వాల్మీకి భార్య(రోహిణి) పాత్ర ఇందులో కీలకం. తల్లిగా తన మాతృత్వాన్ని ప్రదర్శించింది. అయితే, ‘షెహ్జాదా’లో వాల్మీకి భార్య పాత్రని చంపేశారు. తద్వారా హీరోకి వాల్మీకి కుటుంబాన్ని వదిలించుకోవడానికి మార్గం సులువు చేశారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో పెంచిన తల్లికి ప్రాధాన్యమివ్వాలా? జన్మనిచ్చిన అమ్మ వైపు మొగ్గు చూపాలా? అనే విషయాన్ని బంటు విచక్షణకే వదిలేశారు. కానీ, షెహ్‌జాదాలో పెంచిన కుటుంబం నుంచి దూరం కావడానికి హీరోకు బలమైన కారణాన్ని సృష్టించారు. ఇలా పెంపుడు తల్లి పాత్రను తీసేయడం ప్రేక్షకులకు రుచించలేదు.
‘అల వైకుంఠపురంలో’ రాజ్ మనోహర్(సుశాంత్)కి ప్రేయసిగా నందిని(నివేతా పెత్తురాజ్) పాత్రకి తగిన ప్రాధాన్యత ఉంటుంది. అమూల్య(పూజా హెగ్డే)ని పెళ్లి చేసుకోవడంలో రాజ్ పడే ఇబ్బందికి ఇదే ప్రధాన కారణం. ‘షెహ్జాదా’లో నందిని పాత్రని తీసేశారు. ‘అమూల్య’ని పెళ్లి చేసుకోవడంలో రాజ్ పాత్రకి అభ్యంతరం లేకుండా చేశారు. ఇది కూడా సినిమాకు మైనస్‌గా నిలిచింది. అంతేగాకకుండా ‘రాజ్ మనోహర్’ పాత్రలో చేసిన మార్పులు ప్రేక్షకులను మెప్పించలేదు.
హీరో క్యారెక్టరైజేషన్..
అల వైకుంఠపురం సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ బాగా ఎలివేట్ అయింది. అమూల్య(పూజా హెగ్డే)ని చిక్కుల్లో నుంచి విడిపించే సమయంలో తన క్యారెక్టర్‌కు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. విలన్లకు కొట్టి బుద్ధి చెబుతాడు. కానీ, ‘షెహ్జాదా’లో ఇదే లోపించింది. ఈ సీన్లో తన క్యారెక్టర్‌కి విరుద్ధంగా కార్తీక్ ఆర్యన్ ప్రవర్తిస్తాడు. తనదైన శైలిలో కాకుండా సావధానంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇదే కాస్త అసహజంగా అనిపించింది.
ఫైట్స్ కొరియోగ్రఫీ
ఫైట్ సీన్లను రీక్రియేట్ చేయొచ్చు. కానీ, ఒక హీరో శైలిని రీక్రియేట్ చేయలేం. చెల్లెలి దుపట్టాను ఆకతాయిలు తీసుకెళ్లిన సమయంలో హీరో చేసే ఫైట్, తాతను రక్షించడంలో వచ్చే సీన్, క్లైమాక్స్ ఫైట్లు అల్లు అర్జున్‌ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినవి. స్టైలిష్‌గా ఈ సీన్లు సాగుతుంటాయి. ‘షెహ్జాదా’లో కార్తీక్ ఆర్యన్ ఈ సీన్లలో విఫలమయ్యాడు. సీన్లను ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టినా, తన పర్ఫార్మెన్స్తో కార్తీక్ ఆర్యన్ కొత్తదనాన్ని తీసుకురాలేక పోయాడు.
పాత్రలు
‘అల వైకుంఠపురంలో’ కనిపించే ప్రతి పాత్రకు నిర్దిష్టమైన ప్రాధాన్యత ఉంటుంది. ‘షెహ్జాదా’లో ఇది లోపించింది. పైగా, బంటు సహోద్యోగుల పాత్రలు శేఖర్(నవదీప్), రవీందర్(రాహుల్ రామకృష్ణ), సునీల్ క్యారెక్టర్లు రీమేక్‌లో లేవు. బోర్డ్ రూమ్‌లో జరిగే సన్నివేశం లేదు. ఇలా మార్పులు చేయడంతో ఆ మజాని ప్రేక్షకులు ఆస్వాదించలేకపోయారు. విలన్ పాత్రల్లో కూడా సహజత్వం లోపించినట్లు అనిపించింది.
సంగీతం
‘అల వైకుంఠపురం’ సినిమాకు సంగీతం పెద్ద అసెట్‌గా నిలిచింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. బుట్టబొమ్మ, రాములో రాములా, సామజ వరగమన, టైటిల్ సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే సిత్తరాల సిరపడు, డాడీ సాంగ్.. ఇలా ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. షెహ్‌జాదాలో చెప్పుకోదగ్గ సంగీతం లేదు. ఒకటి రెండు మినహా మిగతావి చప్పగా సాగాయి. ఫలితంగా సంగీత ప్రియులకు నిరాశే మిగిల్చింది. ఓవరాల్‌గా ‘అల వైకుంఠపురం’ సినిమాతో పోలిస్తే ‘షెహ్జాదా’ ఎక్కడా పోటీ పడలేక పోయింది. ఫలితంగా ‘డిజాస్టర్’ టాక్ని మూటగట్టుకుంది.
అల్లు అర్జున్ మేనియా
షెహ్జాదా సక్సెస్ సాధించకపోవడానికి అల్లు అర్జున్ మేనియా కూడా ఒక కారణమే. గతంతో పోలిస్తే దక్షిణాది సినిమాల పరిధి పెరిగింది. ‘అల వైకుంఠపురం’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. దీంతో బీ టౌన్ ప్రేక్షకులు బన్నీ మునపటి సినిమాలను వీక్షించారు. ఇది కూడా ‘షెహ్జాదా’కు మైనస్‌గా మారింది.
రీమేక్‌లు వర్కౌట్ అవుతాయా?
గతేడాది ఐదు దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్‌ల ‘విక్రమ్ వేధ’, అక్షయ్ కుమార్ ‘కట్పుట్లి’ సినిమాలు ఆశించిన మేర కలెక్షన్లు సాధించలేదు. ఇక జాన్వీ కపూర్ ‘మిలీ’, రాజ్‌కుమార్ ‘హిట్- ద ఫస్ట్ కేస్’, రాధిక ఆప్టే ‘ఫోరెన్సిక్’ సినిమాలు బోల్తా కొట్టాయి. తాజాగా ఈ లిస్టులోకి ‘షెహ్జాదా’ చేరింది. దీంతో రీమేక్ సినిమాలు వర్కౌట్ అవుతాయా అన్న సందేహం మొదలైంది. అయితే, అజయ్ దేవ్గన్ ‘దృశ్యం2’ మాత్రం ఘన విజయం సాధించింది. మళయాలంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడం, హిందీలోకి డబ్ కాకపోవడంతో అజయ్ దేవ్గన్ మూవీ హిట్ అయ్యింది.
దక్షిణాది భాషల సినిమా పరిధి పెరిగింది. ఇక్కడి కథలు బాలీవుడ్ మాస్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రాంతీయ భాషల్లో విడుదలైన సినిమాలకు సబ్‌టైటిల్స్ ఇస్తుండటంతో హిందీలోనూ వాటిని చూస్తున్నారు. దీంతో రీమేక్ సినిమాలపై ఆసక్తి కొరవడింది. అయితే, ప్రస్తుతం మరికొన్ని రీమేక్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’(వీరం రీమేక్), అజయ్ దేవ్గన్ భోళా(లోకేష్ కనగరాజ్ ఖైదీ రీమేక్) ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.
ఫిబ్రవరి 23 , 2023
Tamannaah Bhatia: ఎద పొంగుల అందంతో రచ్చ రేపుతున్న మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా మరోమారు తన అందచందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బిగుతైన అవుట్‌ఫిట్‌లో యద అందాలను ఆరబోసింది.
ముంబయిలో జరిగిన యానిమల్ సక్సెస్ పార్టీలో పాల్గొన్న తమన్నా.. తాజా లుక్‌తో అక్కడి వారిని కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తమన్నా ఇండస్ట్రీకి పరిచయమై 18 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తూ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోంది.
View this post on Instagram A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)
మెుదట బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఆ తర్వాత దక్షిణాదిలో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
https://twitter.com/Zoom_News_India/status/1743860862207803778?s=20
గతేడాది చిరంజీవితో చేసిన ‘భోళాశంకర్’ చిత్రం నిరాశ పరిచినా.. రజనీకాంత్ ‘జైలర్’తో ఈ భామ ఘన విజయాన్ని అందుకుంది.
అయితే జైలర్ విజయం తర్వాత తమన్నాకు ఆ స్థాయిలో సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.
View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)
ప్రస్తుతం తమిళంలో ‘అరణ్మణై-4’ చిత్రంతో పాటు ‘హిందీ’లో వేద సినిమాలో తమన్నా నటిస్తోంది. అలాగే మలయాళంలోనూ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లపైనా ఈ భామ ఫోకస్ పెట్టింది. ఇటీవల ‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్‌సిరీస్‌లో తమన్నా బోల్డ్‌గా కనిపించింది. తన ప్రియుడు విజయ్ వర్మతో ముద్దు సీన్లలో రెచ్చిపోయింది.
ఇప్పటికే 11th అవర్, నవంబర్ స్టోరీ వంటి రెండు వెబ్ సిరీస్‌లతో తమన్నా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలలో ‘జీ కర్డా’, ‘ఆఖ్రీ సచ్’ వంటి సిరీస్‌లలో కనిపించి మెప్పించింది.
ఓ వైపు సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే వ్యాపార రంగంపైనా ఈ భామ దృష్టి సారిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ భారీ మెుత్తంలో అర్జిస్తోంది.
మరోవైపు భాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో షికార్లు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో తన గ్రామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు హాట్ ట్రీట్ ఇస్తోంది.
జనవరి 08 , 2024
Tamannaah Bhatia: బ్లాక్ శారీలో కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా మరోమారు తన అంద చందాలతో సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
బ్లాక్ శారీలో తెల్లటి అందాలు ఆరబోసిన ఈ భామ.. యంగ్ హీరోయిన్లకు తానేమాత్రం తీసిపోనని చెప్పకనే చెబుతోంది.
తమన్నా ఇండస్ట్రీకి పరిచయమై 18 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తూ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోంది.
https://twitter.com/i/status/1734496218007707743
మెుదట బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఆ తర్వాత దక్షిణాదిలో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
ఈ ఏడాది చిరంజీవితో చేసిన ‘భోళాశంకర్’ చిత్రం నిరాశ పరిచినా.. రజనీకాంత్ ‘జైలర్’తో ఈ భామ ఘన విజయాన్ని అందుకుంది.
అయితే జైలర్ విజయం తర్వాత తమన్నాకు ఆ స్థాయిలో సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు.
ప్రస్తుతం తమిళంలో ‘అరణ్మణై-4’ చిత్రంతో పాటు ‘హిందీ’లో వేద సినిమాలో తమన్నా నటిస్తోంది. అలాగే మలయాళంలోనూ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లపైనా ఈ భామ ఫోకస్ పెట్టింది. ఇటీవల ‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్‌సిరీస్‌లో తమన్నా బోల్డ్‌గా కనిపించింది. తన ప్రియుడు విజయ్ వర్మతో ముద్దు సీన్లలో రెచ్చిపోయింది.
ఇప్పటికే 11th అవర్, నవంబర్ స్టోరీ వంటి రెండు వెబ్ సిరీస్‌లతో తమన్నా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాదిలో ‘జీ కర్డా’, ‘ఆఖ్రీ సచ్’ వంటి సిరీస్‌లలో కనిపించి మెప్పించింది.
ఓ వైపు సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే వ్యాపార రంగంపైనా ఈ భామ దృష్టి సారిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ భారీ మెుత్తంలో సంపాదిస్తోంది.
మరోవైపు భాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో షికార్లు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో తన గ్రామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది.
డిసెంబర్ 12 , 2023
Pushpa 2 : మళ్లీ పవన్ ఫ్యాన్స్‌ను గెలికిన బన్నీ.. ఏకిపారేసిన గరికపాటి!
అల్లు అర్జున్ (Allu Arjun), మెగా ఫ్యామిలీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత వివాదాలు ఉన్నాయని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రీసెంట్గా ‘మట్కా’ ప్రమోషన్స్ సందర్భంగా వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఇందుకు మరింత ఊతం ఇచ్చాయి. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తికి అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి మద్దతు తెలపడం ఈ మెగా - అల్లు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, అల్లు అర్మీ రెండుగా చీలిపోయి సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అల్లు అర్జున్ చేసింది కరెక్ట్ కాదని పలువురు సినీ పెద్దలు, రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే అదే వైసీపీ నేతకు తాజాగా అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టడానికే బన్నీ ఇలా చేశాడన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన 'పుష్ప 2' (Pushpa 2) మరో రెండు వారాల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. సుకుమార్ - బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం దేశంలోని యావత్ సినీలోకం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్ (Pushpa 2 Trailer)) రిలీజ్ కాగా దానికి ఆడియన్స్ నుంచి విశేష స్పందన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో 'పుష్ప 2' గురించి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి (Silpa Ravi Chandra Kishore Reddy) స్పందించారు. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. థియేటర్లలో వైల్డ్ ఫైర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎక్స్‌లో పోస్టు చేశారు. అలాగే మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ సైతం చెప్పారు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ 'థాంక్యూ బ్రదర్.. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు' అంటు రిప్లే ఇచ్చాడు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
https://twitter.com/alluarjun/status/1859428674535030932
మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడా?
‘డీజే: దువ్వాడ జగన్నాథం’ సినిమాకు ముందు వరకు తన ప్రతీ సినిమా ఈవెంట్లో పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి గురించి బన్నీ (Allu Arjun) మాట్లాడుతూ వారిని ఆకాశానికెత్తారు. తొలిసారి డీజే ప్రమోషనల్ ఈవెంట్లో పవన్ గురించి ‘చెప్పను బ్రదర్’ అనడంతో మెగా ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. ఆ తర్వాత ‘డీజే’ సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి వదిలేశారు. అయితే ఏపీ ఎలక్షన్స్ టైమ్‌లో పవన్ ప్రత్యర్థి పార్టీ వైకాపా అభ్యర్థిగా ఉన్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి బన్నీ మద్దతు తెలిపడం, స్వయంగా నంద్యాల వెళ్లి ఓటు వేయాలని అక్కడి ప్రజలను అభ్యర్థించడం మెగా ఫ్యాన్స్, జనసైనికులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి బన్నీని హేట్ చేయడం ప్రారంభించారు. బన్నీని విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు కూాడా. అటు అల్లు అర్మీ సైతం వారికి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఇప్పుడు మరోమారు శిల్పా రవి రెడ్డికి థ్యాంక్స్ చెప్పి మరోమారు మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మెుదట శిల్పా రవి రెడ్డి పోస్టు చేశారని, దానికి బన్నీ రిప్లే మాత్రమే ఇచ్చారని అల్లు ఫ్యాన్స్ సమర్థించుకుంటున్నారు.
వైసీపీ నేతతో స్నేహం ఎలా కుదిరింది?
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మెట్స్. అలా శిల్పా రవితో బన్నీకి పరిచయం ఏర్పడి స్నేహాంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో శిల్పా రవికి బన్నీ ట్విటర్ ద్వారా ‘ఆల్ ది బెస్ట్’ తెలిపి ఊరుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు. ఈసారి కూడా వైకాపా తరపున శిల్పా రవి బరిలో ఉండటంతో బన్నీ నేరుగా రంగంలోకి దిగాడు. మామయ్య పవన్ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ అప్పట్లో ఒక ట్వీట్ పెట్టి మాత్రమే ఊరుకున్న బన్నీ, ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి కోసం స్వయంగా వెళ్లడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, నంద్యాలలో కూటమి అభర్థిగా టీడీపీ నేత ఫరూఖ్ బరిలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఐటెం సాంగ్‌పై క్రేజీ అప్డేట్!
డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) ‘పుష్ప 2’ చిత్రంలో 'కిస్సిక్' అనే ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్పెషల్ సాంగ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. నవంబర్ 23న 'కిస్సిక్' లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన సైతం రాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ పాటలో అల్లు అర్జున్ (Allu Arjun), శ్రీలీల తమ స్టెప్పులతో దుమ్మురేపారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ పాట కోసం శ్రీలీల రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ (Sreeleela Remuneration) తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. 'పుష్ప'లోని ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ సాంగ్ కంటే 'కిస్సిక్' ఇంకా పెద్ద హిట్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
బన్నీపై గరికపాటి ఫైర్
'పుష్ప 2' సినిమా రిలీజ్‌కి దగ్గరపడుతున్న వేళా సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైంది. గతంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు (Garikipati Narasimha Rao) 'పుష్ప' సినిమాపై చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. 'పుష్ప' లాంటి సినిమాలు సమాజానికి హానికరమని 2021లో గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియోను తెరపైకి తీసుకొచ్చి కొందరు ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ ‘ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకూ సమంజసం. సినిమా మొత్తం స్మగ్లింగ్ చూపించి చివరలో మంచిగా చూపిస్తాం తదుపరి భాగం వరకూ వేచి చూడండి అంటారు. ఇది ఎంతవరకూ న్యాయం. ఈలోపు సమాజం చెడిపొవాలా? స్మగ్లింగ్ చేసే వ్యక్తి తగ్గేదే లే అంటాడా?. ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. తగ్గేదే లే అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటి వారు వాడాలి. అంతేకానీ స్మగ్లర్లు కాదు’ అంటూ మండిపడ్డారు.
https://twitter.com/i/status/1859501799511843292
నవంబర్ 21 , 2024
Mrunal Thakur: తెలుగులో మళ్లీ జతకట్టనున్న మృణాల్ ఠాకూర్- దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ ఎవరంటే?
సీతారామం సినిమా తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో జతకట్టిన దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకూర్ హిట్ పేయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దుల్కర్ సల్మాన్ రామ్ పాత్రలో, మృణాల్ సీత పాత్రలో అలరించారు. స్వచ్ఛమైన ప్రేమకథను తమ కళ్లతోటే పలికించి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని అద్భుతంగా పండించారు. మృణాల్ ఠాకూర్ సాంప్రదాయ వస్త్రధారణతో ఆమె చేసిన అభినయం తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ జోడీ మరోసారి జత కట్టనుట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ పరుశురామ్ శిష్యుడు రవి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని మంచి ప్రేమకథా చిత్రం రాసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్లో నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హిట్ పేయిర్ రిపీట్
సీతారామం మూవీ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్‌తో పాటు మృణాల్ ఠాకూర్‌కు సరైన హిట్ పడలేదనే చెప్పాలి. దుల్కర్ కింగ్ కొత్త వంటి వెబ్ సిరీస్‌లో నటించినా అది ఆశించినంత విజయం సాధించలేదనే చెప్పాలి. మరోవైపు సీతారామం సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్నా, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు చేసింది. ఇందులో హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా... ఫ్యామిలీ స్టార్ చిత్రం మాత్రం చతికిలపడిపోయింది. ఫ్యామిలీ స్టార్‌కు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆశించినంతగా వసూళ్లు రాలేదు. ఈ సినిమా కోసం మృణాల్ బాగానే కష్టపడిందని చెప్పాలి. విజయ్ దేవరకొండతో కలిసి మూవీ ప్రమోషన్లలో తీరిక లేకుండా పాల్గొంది. స్వయంగా రీల్స్ చేసి వైరల్ చేసినా.. సినిమా ఫలితం మాత్రం వేరేలాగా వచ్చింది. దీంతో ఆమె కెరీర్ తెలుగులో ప్రశ్నార్థకంగా మారింది. కొత్త హీరోయిన్లతో గట్టి పోటీ ఎదుర్కొంటోంది.
మృణాల్ హవా కొనసాగేనా?
దశాబ్దకాలంగా మృణాల్ బాలీవుడ్లో నటిస్తోంది."సూపర్ 30"లో హృతిక్ రోషన్‌తో జతకట్టింది, కానీ ఇప్పటివరకు ఈ కలువ కనుల సుందరికి బీటౌన్‌లో సరైన గుర్తింపు దక్కలేదు. అయితే టాలీవుడ్లో మృణాల్ కేవలం ఒక్క సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకుంది. తెలుగు ప్రజల ప్రేమకు మైమరిచిపోయిన ఈ భామ అప్పట్లో కన్నీళ్లు కూడా పెట్టుకుంది.సీతారామం విజయం మృణాల్‌కు టాలీవుడ్లో రాచబాట పరిచింది. సీతారామం సినిమాకోసం రూ.80 లక్షలు పారితోషికం తీసుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత తన రెమ్యూనరేషన్‌ను రూ.కోటీన్నరకు పెంచింది. ఫ్యామిలీ స్టార్ పరాజయంతో ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్లో అవకాశాలు సన్నగిల్లాయి. రవి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్‌తో జత కట్టే సినిమాపై ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ను నిర్ణయించే అవకాశం ఉంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్లో స్టోరీ
టాలీవుడ్లో దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకుర్ జోడీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో.. ఈ జంటలో మరో మారు సినిమా తీయాలని టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ పరుశురాం అసిస్టెంట్ డైరెక్టర్ రవి ఈ జంటతో సినిమా తీసేందుకు ముందుకొచ్చాడని సమాచారం. దుల్కర్- సల్మాన్ కోసం ఓ వినూత్నమైన ప్రేమ కథను రాసుకున్నాడంట. ఇది పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా రవి పూర్తి చేశాడంట. ఈ సినిమా కోసం దిల్ రాజు దగ్గరికి వెళ్లగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్‌లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాశ్‌ను ఎంపిక చేశారంట. ఆయన కూడా ఈ సినిమాకు పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ.. తెలుగులో సార్, ఆదికేశవ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. సార్ సినిమా పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అదే తరహాలో మ్యూజిక్ అందించేందుకు జీవీ ప్రకాశ్ సిద్ధమయ్యారు.
షూటింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం దిల్ రాజు గేమ్ ఛేంజర్, విజయ్ దేవరకొండతో మరో సినిమాతో ఆయన బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తికాగానే దుల్కర్- మృణాల్ ఠాకూర్ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అటు మృణాల్ ఠాకూర్ సైతం పూజా మేరి జాన్ అనే బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంది. ఇటు దుల్కర్ సైతం మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తికాగానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ జంటపై ఊహగానాలు వినిపిస్తున్నాయి.
మే 14 , 2024
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..
బుల్లితెర యాంకర్, నటి అనసూయ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో స్టార్ నటిగా మారిపోయింది. అయితే కొద్దిరోజుల క్రితం వరకూ అనసూయ ఏమాట్లాడిన నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చారు. వాటికి అదే స్థాయిలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అనసూయ కౌంటర్లు ఇస్తూ వచ్చింది. ఏమైందో ఏమో గాని కొని ఇటీవల అనసూయ సోషల్ మీడియాలో అంతా యాక్టివ్‌గా ఉండటం లేదు. దేని గురించి పెద్దగా రియాక్ట్ కావడం లేదు. దీంతో అనసూయ పేరు పెద్దగా చర్చకు రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదాస్పద పోస్టుతో మరోమారు అనసూయ చర్చనీయాంశంగా మారింది. యంగ్ హీరో విజయ్ దేవరకొండను మళ్లీ టార్గెట్ చేసిందా అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
అనసూయ పోస్టు ఏంటంటే?
'పుష్ప 2' చిత్రంలో నటి అనసూయ (Anasuya Bharadwaj) కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తొలి భాగంలో ఆమె చేసిన దాక్షయణి రోల్ సెకండ్ పార్ట్‌లోనూ కొనసాగింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ అనసూయ పాల్గొంది. గ్లామర్ లుక్స్‌లో కనిపించి సందడి చేసింది. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమోగాని ఎక్స్‌లో ఓ సెన్సేషన్ పోస్టు అనసూయ పెట్టింది. 'దూరపు కొండలు నునుపు' అంటూ అందులో రాసుకొచ్చింది. అయితే దీనికి ఎవరి పేరును ట్యాగ్ చేయలేదు. దీంతో ఆమె ఏ ఉద్దేశ్యంతో చేసింది? ఎవరి కోసం చేసింది? అన్న విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
https://twitter.com/anusuyakhasba/status/1863783255813849226
రౌడీ బాయ్ గురించేనా?
యంగ్ హీరో విజయ్ దేవరకొండతో నటి అనసూయ (Anasuya Bharadwaj)కు ఉన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా నుంచి ఇది కొనసాగుతూ వస్తోంది. విజయ్ను విమర్శిస్తూ ఆమె బహిరంగంగానే పలుమార్లు మాట్లాడింది. అయితే తాజాగా పెట్టిన పోస్టు కూడా విజయ్ను ఉద్దేశించి పెట్టిందేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 'దూరపు కొండలు నునుపు' అన్న మాటల్లో కొండ అని ఉండటాన్ని హైలెట్ చేస్తున్నారు. హైదరాబాద్ ఈవెంట్లో హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడింది. ఆమె స్పీచ్ ఇచ్చిన విధానం, మాట తీరు అచ్చం విజయ్ దేవరకొండ స్టైల్లో ఉన్నాయన్న కామెంట్స్ వినిపించాయి. పైగా వారిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న రూమర్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అనసూయ ఇలా పోస్టు పెట్టి ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
రష్మిక కంటే శ్రీలీలకే ప్రాధాన్యత!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ఉన్న నెగిటివిటీని హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)పై కూడా అనసూయ (Anasuya) చూపించిందన్న వాదనలు నెట్టింట వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ‘పుష్ప 2’తో ఇది మరోమారు నిరూపితమైందని నెటిజన్లు అంటున్నారు. ‘పుష్ప 2’ (Pushpa 2)లో హీరోయిన్గా చేసిన రష్మికతో కంటే స్పెషల్ సాంగ్‌లో కనిపించిన శ్రీలీలతోనే ఆమె ఎక్కువ చనువుగా ఉందని గుర్తు చేస్తున్నారు. శ్రీలీలను ఆటపటిస్తున్న వీడియోలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆ వీడియోలో శ్రీలీల, అనసూయ నవ్వుతూ జోక్స్ వేసుకోవడం గమనించవచ్చు.
https://twitter.com/ActressSouth/status/1863784223536271766
అనసూయ ప్రస్థానం
జబర్దస్త్ షో ద్వారా అనసూయ తొలిసారి బుల్లితెరకు పరిచయమైంది. యాంకర్‌గానే గాక గ్లామర్ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది. తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. రీసెంట్గా ‘రజాకార్’ చిత్రంలో పోచమ్మ పాత్రలో కనిపించి అనసూయ అందర్నీ అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో పాటు తమిళంలో ‘ఫ్లాష్ బ్యాక్’, ‘ఉల్ఫ్’ చిత్రాల్లో అనసూయ నటిస్తోంది.
డిసెంబర్ 03 , 2024
Pushpa 2 : మళ్లీ గెలుక్కునేందుకు సిద్ధమైన బన్నీ ఫ్యాన్స్.. అవసరమా?
అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్మీ (Allu Army), మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ‘పుష్ప 2’ చిత్రాన్ని బాయ్‌కాట్ చేస్తామంటూ కూడా మెగా ఫ్యాన్స్ వార్నింగ్‌లు సైతం ఇస్తున్నారు. అయితే అల్లు వర్సెస్ మెగా వివాాదాని (Allu Vs Mega Families)కి కేంద్రంగా మారిన ప్రాంతం ఏపీలోని నంద్యాల. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా బన్నీ ఆ ఏరియాలో ప్రచారం చేయడాన్ని మెగా ఫ్యాన్స్, జన సైనికులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి బన్నీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇదిలాఉంటే తాజాగా నంద్యాలలోని బన్నీ ఫ్యాన్స్ అత్యవసర మీటింగ్‌కు పిలుపునిచ్చారు. దీంతో నంద్యాల కేంద్రంగా మరో రచ్చ మెుదలవుతుందా అన్న అనుమానాలు మెుదలయ్యాయి.
మీటింగ్ అందుకేనా!
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ (Allu Vs Mega Families) ఒక చోట సమావేశం కాబోతున్నారు. ఆత్మకూరు రోడ్డులోని చెరువుకట్ట ప్రాంతంలో గురువారం ఉదయం 10:30కు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను నంద్యాల ట్విటర్ హ్యాండిల్స్ ద్వారా ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే మెగా - అల్లు ఫ్యామిలీ రచ్చకు కారణమైన నంద్యాలలో ఫ్యాన్స్ ఈ మీటింగ్ పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశం ద్వారా మరో వివాదానికి వారు తెరలేపుతారా? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'పుష్ప 2' సినిమా నేపథ్యంలోనే ఈ భేటి జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ కోసం తమ అభిమాన హీరోకు ఏ విధంగా సాయపడాలి? ఎలా అండగా నిలవాలి? మెగా ఫ్యాన్స్ చేస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని ఎలా అడ్డుకోవాలి? అన్న దానిపై ఈ మీటింగ్‌లో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
https://twitter.com/NandyalTimes/status/1861659960972632065
నంద్యాల ఘటన గుర్తుందా?
ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలపడానికి ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నంద్యాలకు వెళ్లారు. దీంతో అప్పట్లోనే బన్నీ వ్యవహార శైలి ఏపీ రాజకీయాలతో పాటు, తెలుగు చిత్ర పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మెట్స్. అలా శిల్పా రవితో బన్నీకి పరిచయం ఏర్పడి స్నేహాంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో శిల్పా రవికి బన్నీ ట్విటర్ ద్వారా ‘ఆల్ ది బెస్ట్’ తెలిపి ఊరుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు. ఈసారి కూడా వైకాపా తరపున శిల్పా రవి బరిలో ఉండటంతో బన్నీ నేరుగా రంగంలోకి దిగాడు. మామయ్య పవన్ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ ట్విటర్లో ఒక పోస్టు మాత్రమే పెట్టిన బన్నీ పవన్ ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి కోసం స్వయంగా రావడం పొలిటికల్ వర్గాల్లో (Allu Vs Mega Families) హాట్ టాపిక్‌గా మారింది. కాగా, నంద్యాలలో బన్నీ మద్దతిచ్చిన వ్యక్తి ఓడిపోగా కూటమి అభర్థి, టీడీపీ నేత ఫరూఖ్ ఘన విజయం సాధించారు.
https://twitter.com/aaa_cinemas/status/1789215453405208730
‘కిస్సిక్’ నేపథ్యంలోనూ బన్నీపై ట్రోల్స్!
నంద్యాల ఘటన నుంచి బన్నీని టార్గెట్ చేసిన మెగా ఫ్యాన్స్ (Allu Vs Mega Families) అతనిపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. బన్నీ తాజా చిత్రం ‘పుష్ప 2’ రిలీజ్‌కు రెడీ అయిన నేపథ్యంలో ఈ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఐటెం సాంగ్ ‘కిస్సిక్’ను ఆధారంగా చేసుకొని ఓ ఎడిటింగ్ వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ సందర్భంగా స్టార్ హీరోయిన్స్ రష్మిక మందన్న, శ్రీలీలను బన్నీ ఆలింగనం చేసుకోగా కిస్సిక్ లిరిక్స్‌ను వాటికి మ్యాచ్ అయ్యేలా ఎడిట్ చేశారు. ‘దెబ్బలు పడతాయిరో మామా’ గత చిత్రాల్లో బన్నీపై చేయిచేసుకున్న వీడియోలను దానికి జత చేశారు. ప్రస్తుతం ఈ ఎడిటింగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
https://twitter.com/Jalsa44/status/1860990666245091594
బన్నీ ఇన్‌స్టా పోస్టుపై వివాదం
సోషల్ మీడియాలో బన్నీ, పవన్ ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన 'పుష్ప 2' ప్రమోషనల్ ఈవెంట్‌లోని పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు కనిపించాయి. ఏం పీకలేరు బ్రదర్ అంటూ 'పీకే' (పవన్ కల్యాణ్) హైలెట్ చేస్తూ ఇంగ్లీష్ టెక్ట్స్‌లో ఉన్న ఓ ఫ్లకార్డ్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీలీలతో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అందులో పోస్టర్ కనిపించింది. అయితే ఇది యాదృచ్చికంగా జరిగిందా? కావాలనే బన్నీ పెట్టాడా? అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. అయితే ఈ పోస్టును చూసి పవన్ ఫ్యాన్స్ మరోమారు బన్నీపై రెచ్చిపోయారు. అటు అల్లు ఆర్మీ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం మెుదలుపెట్టింది. ఇది గమనించిన బన్నీ ఆ ఫ్లకార్డ్‌ను తీసేసి క్రాప్ ఇమేజ్ను మరోమారు ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే జరగాల్సిన ఫ్యాన్ డ్యామేజ్ అంతా అప్పటికే జరిగిపోయిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
https://twitter.com/7theDestroyeRRR/status/1860759885773942867
నవంబర్ 28 , 2024