ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్EtvApp
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
చిరంజీవి
నాగురాధ
రాజికైకాల సత్యనారాయణ
పర్వతాలుజగ్గయ్య
జగపతి రావుహరనాథ్
సూరిAnnapurnaas Naagus mother
మిక్కిలినేని
సిబ్బంది
TLV ప్రసాద్
దర్శకుడుM. S. గుహన్నిర్మాత
చక్రవర్తిసంగీతకారుడు
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Chiranjeevi- Radha Movies: చిరంజీవి- రాధ మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
విజయశాంతి(19) తర్వాత చిరంజీవితో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్ రాధ. ఈమె ఏకంగా 16 సినిమాల్లో నటించి చిరంజీవితో హిట్ పేయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వీటిలో 10 చిత్రాలు హిట్‌గా నిలిచాయి. వాటిపై ఓ లుక్ వేద్దాం.
గూండా(1984)
చిరంజీవి- రాధ (Chiranjeevi and Radha Movies List) కాంబోలో వచ్చిన తొలి చిత్రం 'గూండా'. ఈ చిత్రాన్ని ఏ.కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
నాగు(1984)
తాతినేని ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రెండోసారి చిరంజీవి- రాధ జత కట్టారు. ఈ సినిమాను ఏవీఎం ప్రొడక్షన్లో వచ్చింది. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
దొంగ(1985)
ఏ. కొదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది. తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా హిట్లు లేని సమయంలో ఈ చిత్రం విజయం సాధించి ఊపు తీసుకొచ్చింది. ఈ సినిమాతో చిరంజీవి- రాధ హిట్ పెయిర్‌గా నిలిచారు.
పులి(1985)
చిరంజీవి- రాధ జంటగా నటింటిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమాను రాజ్ భరత్ డైరెక్ట్ చేశారు.
రక్త సింధూరం(1985)
ఏ. కొదండరామిరెడ్డి డైరెక్షన్లో చిరంజీవి-రాధ జంటగా మెప్పించిన మరో చిత్రం పులి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దగా పెద్దగా ఆడలేదు.
అడవి దొంగ(1986)
చిరంజీవి- రాధ (Chiranjeevi and Radha Movies List) జంటగా నటించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను కే. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.
కొండవీటి రాజా(1986)
కే. రాఘవేంద్రరావు డైరెక్షన్లో చిరంజీవి-రాధ కాంబోలో బ్యాక్ టూ బ్యాక్ హిట్‌గా నిలిచిన చిత్రం 'కొండవీటి రాజా'. ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.
రుద్ర నేత్ర(1989)
కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయింది. ఈ సినిమాలో చిరుకు జోడీగా రాధ, విజయశాంతి నటించారు.
రాక్షసుడు(1986)
చిరంజీవి- రాధ కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. రాక్షసుడు చిత్రాన్ని ఏ.కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.
జేబు దొంగ(1987)
కొదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. చిరంజీవి- రాధ మరోసారి తమ కెమిస్ట్రీతో మెప్పించారు. ఈ చిత్రం హిందీలో ఆజ్కా గ్యాంగ్ లీడర్ పేరుతో డబ్ చేశారు.
యముడికి మొగుడు(1988)
చిరంజీవి, రాధ, విజయశాంతి జోడిగా రవిరాజ పినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన చిత్రం 'యముడికి మొగుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైయింది.
మరణ మృదంగం(1988)
ఏ కొదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ హిట్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధ మరోసారి నటించింది.
స్టేట్ రౌడీ(1989)
బి.గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి, రాధ(Chiranjeevi and Radha Movies List) పోటీపడిమరి నటించారు.
లంకేశ్వరుడు(1989)
చిరంజీవి, రాధ, రేవతి జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాను దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు తెరకెక్కించారు. ఇది ఆయనకు 100వ సినిమా.
కొండవీటి దొంగ(1990)
చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్లలో కొండవీటి దొంగ ఒకటి. ఈ చిత్రాన్ని కొదండ రామిరెడ్డి డైరెక్ట్ చేశారు. చిరంజీవి సరసన రాధ, విజయశాంతి జంటగా నటించారు.
కొదమ సింహం(1990)
చిరంజీవి- రాధ కలిసి నటించిన చివరి సినిమా ఇది. ఈ సినిమాను కే మురళిమోహన్‌రావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి కౌబాయ్ గెటప్‌తో అలరించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.
నవంబర్ 08 , 2023
Actress Sunaina: ‘ఇన్స్పెక్టర్ రిషి’ బ్యూటీ సునైన గురించి ఈ విషయాలు తెలుసా?
ప్రముఖ నటి సునైనా (Sunaina).. తాజాగా వచ్చిన ‘ఇన్స్పెక్టర్ రిషి’ (Inspector Rishi) సిరీస్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇందులో పోలీసు ఆఫీసర్ శోభన పాత్రలో అదరగొట్టింది. యాక్షన్స్ సీక్వెన్స్‌లోనూ మెప్పించింది. దీంతో ఈ భామకు సంబంధించిన సమాచారం కోసం తెలుగు ఆడియన్స్ తెగ వెతుకుతున్నారు. వాస్తవానికి ఈ బ్యూటీ తెలుగు చిత్రం ద్వారానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ భామకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సునైన ఎవరు?
సునైనా ప్రముఖ నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది.
సునైన ఎక్కడ పుట్టింది?
మహారాష్ట్ర నాగపూర్‌లో ఈ భామ పుట్టింది.
సునైన పుట్టిన రోజు?
ఏప్రిల్ 17, 1989
సునైన వయసు ఎంత?
34 సంవత్సరాలు (2024)
సునైన ఎత్తు ఎంత?
5 అడుగుల 6 అంగుళాలు (166 సెం.మీ)
సునైన ఏం చదువుకుంది?
నాగుపూర్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేసింది.
సునైన తల్లిదండ్రులు ఎవరు?
హరీష్ ఎల్లా, సంధ్యా ఎల్లా
సునైనకు తోబుట్టువులు ఉన్నారా?
సునైనా ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నాడు.
సినిమాల్లోకి రాకముందు సునైనా ఏం చేసింది?
మోడల్‌గా చేసింది. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో కనిపించి గుర్తింపు పొందింది.
సునైన తొలి తెరంగేట్ర చిత్రం?
2005లో తెలుగులో వచ్చిన కుమార్ vs కుమారి చిత్రం సునైనా తొలి సినిమా. ఈ చిత్రం ద్వారానే సినీ పరిశ్రమలో ఆమె కెరీర్ మెుదలైంది.
సునైన తొలి కన్నడ చిత్రం?
2008లో వచ్చిన 'గ్యాంగ్ బారే థుంగే బారే' (Gange Baare Thunge Baare)చిత్రం.. ఆమెకు కన్నడలో మెుదటి సినిమా.
సునైన తొలి తమిళ చిత్రం?
'కధలిల్ విఝున్తెన్' (2008)
సునైన డెబ్యూట్ వెబ్ సిరీస్?
'నిలా నిలా ఒడి వా' (2018)
సునైన ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు?
‘కుమార్ vs కుమారి’, ‘10th క్లాస్, మిస్సింగ్’, ‘పెళ్లికి ముందు ప్రేమకథ’, ‘రాజ రాజ చోర’, ‘రెజీనా’ (డబ్బింగ్)
సునైన ఇప్పటివరకూ చేసిన వెబ్‌సిరీస్‌లు?
'నిలా నిలా ఒడి వా' (2018), ‘హై ప్రీస్ట్స్’ (2019), ‘ఫింగర్‌టిప్’ (2019), చదరంగం (2020), మీట్ క్యూట్ (2022), ఇన్స్పెక్టర్ రిషి (2024).
సునైన ఫేవరేట్ ఫుడ్?
పోహా, పిజ్జా, ఇడ్లి, దోశ, చైనీస్ ఫుడ్, కాఫీ.
సునైన ఫేవరేట్ నటులు?
తమిళంలో రజనీకాంత్.. తెలుగులో అల్లుఅర్జున్, మహేష్ బాబు అంటే తనకు ఇష్టమని సునైనా తెలిపింది.
సునైనకు ఇష్టమైన కలర్స్?
గ్రే, పింక్, రెడ్.
సునైనకు ఇష్టమైన క్రీడ?
క్రికెట్
సునైన ఏ డ్రెస్ వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంది?
చీర అంటే ఈ బ్యూటీకి చాలా ఇష్టమట. ఏ మాత్రం సందర్భం దొరికిన చీర కట్టేస్తానని ఓ ఇంటర్యూలో తెలిపింది.
సునైనకు ఇష్టమైన ప్రదేశాలు?
కేరళ, గోవా, శిమ్లా, జమ్ముకశ్మీర్, దుబాయి
సునైన ఇన్స్టాగ్రామ్ ఖాతా?
https://www.instagram.com/thesunainaa/
https://www.youtube.com/watch?v=xIZ8KW7tvTE
ఏప్రిల్ 05 , 2024
CHIRANJEEVI: బలగం నటుడు మెుగిలయ్యకు చిరంజీవి సాయం… కంటి చూపుకోసం ఎంత ఖర్చైనా ఇస్తానని భరోసా
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరికీ సాయం కావాలాన్న ముందుండేది మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎంతోమందికి అండగా నిలబడ్డాడు చిరు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక చేయూతనందిస్తూ నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఆయన సహాయం ఇంకా ఎంతోమంది కళాకారులకు చేరుతూనే ఉంది. ఇటీవల ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్న బలగం మెుగిలయ్యకు సహాయం అందిస్తున్నాడు మెగాస్టార్.
మెుగిలయ్యకు అండగా
బలగం సినిమాలో నీ తోడుగా నా తోడు ఉండి అనే పాటను పాడిన మెుగిలయ్య అనారోగ్యం బారిన పడ్డారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపుడుతున్న ఆయనకి కంటి చూపు మందగించింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి మెుగిలయ్యకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దర్శకుడు వేణు ఎల్దండికి ఫోన్ చేసి మెుగిలయ్య కంటి చూపు రావటానికి ఎంత ఖర్చైనా తానే భరిస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని వేణు వారికి చెప్పినట్లు మెుగిలయ్య దంపతులు వెల్లడించారు.
https://twitter.com/i/status/1647889777688190976
విలన్‌కు సాయం
చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించిన విలన్ పొన్నాంబలమ్. ఆయనకి కూడా కిడ్నీలు పాడైపోతే చిరుకి మెసేజ్ చేశాడు. ఏదైనా సాయం చేయాలని కోరాడు. ఐదు నిమిషాల్లో ఫోన్ చేసిన మెగాస్టార్… చెన్నైలోని అపోలోకి తరలించి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం దాదాపు రూ. 40 లక్షలు చెల్లించాడు. ఈ విషయాన్ని పొన్నాంబలమ్ స్వయంగా పంచుకున్నారు.
https://twitter.com/i/status/1636009396437393409
కెమెరామెన్‌కు చేయూత
అక్కినేని నాగేశ్వరరావు, ఎంజీఆర్, బాలకృష్ణ, నాగార్జున వంటి సూపర్ స్టార్లతో పనిచేసిన కెమెరామెన్ దేవరాజ్. చిరంజీవితో నాగు, పులిబెబ్బులి వంటి సినిమాలు తీశాడు. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు వచ్చిన వార్తలు తెలుసుకున్న చిరు… దేవరాజ్‌ను ఇంటికి పిలిచి రూ. 5 లక్షలు ఇచ్చారు. అంతేకాదు, ఎప్పుడు అవసరం ఉన్నా అండగా ఉంటానని భరోసా కల్పించారు.
దటీజ్ మెగాస్టార్
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది పేద కళాకారులను ఆదుకున్నాడు చిరంజీవి. వారికి ఆర్థిక సాయం చేయడంతో పాటు హెల్త్ కార్డులు మంజూరు చేయించారు. కొంతమంది నటులకు అపోలో ఆస్పత్రిలో ఉచిత చికిత్స అందించినట్లు చాలామంది చెప్పారు. ఏళ్ల తరబడి ఆయన మెగాస్టార్‌గా కొనసాగుతున్నాడంటే ఇదే కారణమని నటులు చిరంజీవిని కొనియాడుతున్నారు.
ఏప్రిల్ 18 , 2023
RRRపై తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు… ఏకిపారేసిన నాగబాబు.. నీయమ్మ *** ఖర్చు పెట్టాడారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు
RRR చిత్రంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమ్మారెడ్డిని సినీ ప్రముఖులు విమర్శిస్తున్నారు. తెలుగు చలన చిత్ర స్థాయి పెరగడాన్ని స్వాగతించాల్సింది పోయి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అసలేంటీ వివాదం?
బంగారుతల్లి సినిమా ప్రమోషన్లలో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజ RRR చిత్ర యూనిట్‌పై విమర్శలు చేశారు. “ ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.600 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం ఆస్కార్ అవార్డు కోసం రూ.80 కోట్లు వెచ్చిస్తున్నారు. విమాన టికెట్ల కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాటితో 8 సినిమాలు తీసి వారి ముఖాన కొట్టచ్చు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
https://twitter.com/i/status/1633519566235275266
రచ్చ రచ్చ
తమ్మారెడ్డి వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో రచ్చ మెుదలయ్యింది. తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి తెలుస్తుంటే సొంత ఇంటి వాళ్లే విమర్శలు చేయడం ఏంటనే ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. 8 సినిమాలు తీసి నష్టం మిగల్చడం తప్ప మీరు చేసేది ఏముండదంటూ కామెంట్లు పెడుతున్నారు.
అకౌంట్స్ ఉన్నాయా?
ఈ విమర్శలపై దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా , సాహిత్యం, దర్శకుడు, నటీనటులకు మెుదటిసారి ప్రపంచవేదికలపై వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి గర్వపడాలి అన్నారు. అంతే కానీ..రూ.80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి మీదగ్గర అకౌంట్స్ ఉన్నాయా ? అని ప్రశ్నించారు. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి పేరుపొందిన దర్శకులు డబ్బులు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా? అన్నారు.
https://twitter.com/Ragavendraraoba/status/1633871454445137921
స్ట్రాంగ్ కౌంటర్
ప్రముఖ నటుడు నాగబాబు మరింత ఘాటుగా సమాధాన మిచ్చారు. “ నీయమ్మ మెుగు ఖర్చు పెట్టాడారా రూ.80 కోట్లు RRRకి ఆస్కారం కోసం” (#RRR మీద కామెంట్‌కు వైసీపీ వారి భాషలో సమాధానం) అంటూ కౌంటర్ ఇచ్చాడు.
https://twitter.com/NagaBabuOffl/status/1633845057622253568
నాగబాబుపై విమర్శలు
విమర్శలపై కాస్త కఠినంగానే స్పందించే నాగుబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అతడిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. గౌరవప్రదమైన కుటుంబంలో ఉండి.. ఇలాంటి విమర్శలతో పేరు చెడగొడుతున్నారని మండిపడ్డారు. చిరంజీవి, పవన్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు మరికొందరు.
మార్చి 10 , 2023
Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.
[toc]
భోళా శంకర్
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు.
గాడ్ ఫాదర్
చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది.
ఖైదీ నంబర్ 150
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
అంజి
చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది.
శంకర్ దాదా జిందాబాద్
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
శంకర్ దాదా M.B.B.S
"మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.
ఠాగూర్
తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు.
మృగరాజు
హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
స్నేహం కోసం
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
హిట్లర్
మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది.
ముగ్గురు మొనగాళ్లు
కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు.
మెకానిక్ అల్లుడు
"శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆజ్ కా గూండా రాజ్
"గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఘరానా మొగుడు
"అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.
పసివాడి ప్రాణం
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
చక్రవర్తి
రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ఆరాధన
భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
దొంగ మొగుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
వేట
ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
రాజా విక్రమార్క
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ప్రతిబంధ్
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
త్రినేత్రుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ఖైదీ నంబర్ 786
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అడవి దొంగ
చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
నాగు
తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.
ఇంటిగుట్టు
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.
దేవాంతకుడు
దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.
హీరో
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు.
‘ఖైదీ’
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది.
అభిలాష
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ప్రేమ పిచ్చోళ్లు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
బంధాలు అనుబంధాలు
‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.
మంచు పల్లకీ
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
యమ కింకరుడు
యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.
పట్నం వచ్చిన పతివ్రతలు
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
చట్టానికి కళ్లులేవు
చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.
47 రోజులు
కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
మొగుడు కావాలి
చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు.
మోసగాడు
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
ప్రేమ తరంగాలు
'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
పున్నమి నాగు
'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
ఇది కథ కాదు
కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్గళ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్లో మెప్పించారు.
మనవూరి పాండవులు
బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
సెప్టెంబర్ 25 , 2024
Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
కళామ్మతల్లిని నమ్ముకొని తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు స్టార్లుగా ఎదిగారు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డ కొందరు నటీనటులు.. తొలి సినిమాతో తమను తాము నిరూపించుకున్నారు. అందులోని పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తమ తొలి చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్‌ను తర్వాత కూడా కొనసాగించేందుకు మెుదటి సినిమా టైటిల్‌ను కొందరు తమ పేరుకు జత చేసుకున్నారు. ఇంకొందరు తమ పాత్రల పేరును తమ ఇండస్ట్రీ నేమ్‌గా మార్చుకున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
బట్టల సత్తి (Battala Satti)
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో మల్లికార్జునరావు అలియాస్ బట్టల సత్తి ఒకరు. 1972లో 'తులసి' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన.. అందులో ఓ చిన్న వేషం వేశారు. ఆ తర్వాత 'మంచు పల్లకి', 'అన్వేషణ'లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఇక రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన 'లేడీస్ ట్రైలర్' సినిమా.. మల్లిఖార్జున రావు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో 'బట్టల సత్తి' పాత్రలో ఆయన అదరగొట్టాడు. అప్పటి నుంచి ఆయనకు ‘బట్టల సత్తి’ అనే పేరు ఇండస్ట్రీలో మారుపేరుగా మారిపోయింది.
శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar)
విలక్షణ నటుడు శుభలేఖ సుధారక్ అసలు పేరు.. సూరావఝుల సుధాకర్. ఆయన తొలి చిత్రం శుభలేఖ (1982) కావడంతో ఇండస్ట్రీలో ఆయనకు శుభలేక సుధాకర్ అన్న పేరు పడిపోయింది. సూరావఝుల అనే ఇంటి పేరు మరుగున పడి దాని స్థానంలో శుభలేక వచ్చి చేరింది. సుధాకర్.. దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజను పెళ్ళి చేసుకున్నారు.
రామిరెడ్డి (Spot Nana Rami Reddy)
కొందరు నటులు.. తమ తొలి చిత్రాలతో ఫేమస్ అయితే నటుడు రామిరెడ్డి మాత్రం ఓ డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్ హీరోగా చేసిన ’అంకుశం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. అందులో ‘స్పాట్ పెడతా’ అనే డైలాగ్ పదే పదే చెప్పి ఫేమస్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత నుంచి తోటి నటులు ‘స్పాట్ పెట్టావా’ అంటూ రామిరెడ్డిని ఆటపట్టించే వారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
సుత్తి వీరభద్రరావు (Sutti Veerabhadra Rao)
సుత్తి వీరభద్రరావు అసలు పేరు.. మామిడిపల్లి వీరభద్ర రావు. జంధ్యాల దర్శకత్వములో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డారు. ముఖ్యంగా ఆ సినిమాలో ‘సుత్తి’ అనే పాత్రధారితో అధిక సన్నివేశాల్లో నటించడం.. వీరి కాంబోలో పుట్టిన హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడంతో ఆయన పేరుకు ముందు ‘సుత్తి’ యాడ్ అయ్యింది.
https://twitter.com/i/status/1674734022793244672
సుత్తివేలు (Suthivelu)
అలనాటి హాస్య నటుల్లో సుత్తివేలు ఒకరు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. చిన్నతనంలో చాలా సన్నగా ఉండటంతో బంధువులు వేలు అని పిలిచేవారు. 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ‘సుత్తి’ అనే పాత్ర పోషించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి ఆయన పేరు 'సుత్తివేలు'గా మారిపోయింది.
షావుకారు జానకి (Shavukaru janaki)
షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు ఉన్నాయి. మొట్ట మొదటి చిత్రం ‘షావుకారు’ ఈమె ఇంటి పేరుగా మారిపోయింది. ‘షావుకారు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మంచి మనసులు’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు తెలుగులో ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
సాక్షి రంగారావు (Sakshi Ranga rao)
ఈ దిగ్గజ నటుడు అసలు పేరు రంగవఝుల రంగారావు. 1967లో బాపూ-రమణల దర్శకత్వంలో వచ్చిన 'సాక్షి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి మెుదటి చిత్రం పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సాక్షి రంగారావు.. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ దర్శకత్వంలో వచ్చి సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.
అల్లరి నరేష్ (Allari Naresh)
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్.. తొలి చిత్రం ‘అల్లరి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తీసుకొచ్చిన ఫేమ్‌తో నరేష్ కాస్త అల్లరి నరేష్‌గా మారాడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు నటనకు స్కోప్ ఉన్న విలక్షణ పాత్రల్లో నటిస్తూ ఈ తరం ‘రాజేంద్ర ప్రసాద్’గా నరేష్ గుర్తింపు పొందాడు.
వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas)
టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ‘వందేమాతరం శ్రీనివాస్’ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును మార్చుకున్నారు. ఇతని అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాలో 'వందేమాతర గీతం వరసమారుతున్నది' పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాట సూపర్ హిట్ కావడంతో ఆయన పేరుకు ముందు వందేమాతరం వచ్చి చేరింది.
సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (Sri Vennela Sirivennela Sitaramasastri)
టాలీవుడ్ సుప్రసిద్ధ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరుంది. ఆయన ‘సిరివెన్నెల’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలోని అన్ని పాటలను సీతారామశాస్త్రినే రాయడం విశేషం. అప్పట్లో ‘సిరివెన్నెల’ సినిమా పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీతారామశాస్త్రి లిరిక్స్‌కు చాలా మంది మైమరిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఇండస్ట్రీలో పిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ 2021 నవంబరు 30న ఆయన మరణించారు.
మహర్షి రాఘవ (Maharshi Raghava)
వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' అనే సినిమాలో నటుడు రాఘవ కథానాయకుడిగా చేశారు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నారు. రాఘవ ఇప్పటివరకూ 170కి పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.
దిల్ రాజు (Dil Raju)
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ నిర్మాతగా దిల్‌రాజు కొనసాగుతున్నారు. ఈయన అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. కెరీర్ తొలినాళ్లలో డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించిన ఆయన 2003లో వచ్చిన 'దిల్' సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్ రాజుగా కొనసాగుతూ వస్తున్నారు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore)
నటుడు వెన్నెల కిషోర్ ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ కమెడియన్‌గా చెలామణి అవుతున్నాడు. ఇండస్ట్రీలోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన కిషోర్.. ‘వెన్నెల’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మూవీ టైటిల్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల 1 1/2' చిత్రం డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం.
సత్యం రాజేష్ (Satyam Rajesh)
నటుడు సత్యం రాజేష్ అసలు పేరు.. రాజేష్ బాబు. సుమంత్ (Sumanth) నటించిన ‘సత్యం’ సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్.. ‘క్షణం’ సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘నాయకి’ సినిమాలో హీరోగా చేసి ఆశ్చర్యపరిచాడు. రీసెంట్గా పొలిమేర, పొలిమేర 2 చిత్రాల్లో లీడ్ పాత్రల్లో కనిపించి సాలిడ్ విజయాలను అందుకున్నాడు.
చిత్రం శ్రీను (Chithram Srinu)
చిత్రం శ్రీను అసలు పేరు మరోటి ఉంది. ఇండస్ట్రీలోకి రాకముందు వరకూ అతడ్ని బంధువులు శ్రీనివాసులు అని పిలిచేవారు. 'చిత్రం' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూవీ టైటిల్‌ను తన పేరు ముందు జత చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలోని వారంతా అతడ్ని చిత్రం శ్రీను అని పిలవడం మెుదలుపెట్టారు. ఇతను దాదాపు 260 సినిమాల్లో నటించాడు. ‘చిత్రం’, ‘ఆనందం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’, ‘బొమ్మరిల్లు’, ‘మంత్ర’, ‘100% లవ్’ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu bhaskar)
డైరెక్టర్ భాస్కర్.. తన తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’తో సూపర్ డూపర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సక్సెస్‌తో ‘బొమ్మరిల్లు’ తన పేరుకు ముందు జత చేసుకున్నాడు. ఆయన తర్వాతి చిత్రం ‘పరుగు’ తెలుగులో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ‘ఆరెంజ్’తో హ్యాట్రిక్ కొట్టాలని భావించగా అతడికి తీవ్ర నిరాశే ఎదురైంది. రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘ఆరెంజ్’ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించగా.. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు.
ఆహుతి ప్రసాద్ (Ahuti Prasad)
నటుడు ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఆయన తొలి చిత్రం ఆహుతి (1987) ఘన విజయం సాధించింది. ఇందులో ఆయన పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఆహుతి ప్రసాద్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటివరకూ 136 చిత్రాల్లో నటించారు. క్యాన్సర్ బారిన పడి జనవరి 4, 2015న ఆయన మృతి చెందారు.
జేడీ చక్రవర్తి (JD Chakravarthy)
హైదరాబాద్‌లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జేడీ చక్రవర్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' సినిమాతో చక్రవర్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అందులో జేడీ అనే ప్రతినాయక విద్యార్థి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఆ పాత్ర పేరుతో జేడీ చక్రవర్తిగా మారిపోయాడు.
బొమ్మాళి రవి శంకర్ (Bommali Ravi Shankar)
తెలుగులోని సుప్రసిద్ధ డబ్బింగ్ ఆర్టిస్టుల్లో బొమ్మాళి రవిశంకర్ ఒకరు. ప్రముఖ నటుడు సాయి కుమార్‌కు స్వయాన సోదరుడైన ఆయన.. ప్రేమకథ (1999) సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. 2008లో వచ్చిన 'అరుంధతి' చిత్రం రవిశంకర్‌కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో సోన్‌సూద్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన రవిశంకర్.. అమ్మ బొమ్మాళి అంటూ చెప్పే డైలాగ్ అప్పట్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి పి. రవిశంకర్ కాస్త.. బొమ్మాళి రవిశంకర్‌గా మారిపోయారు.
https://twitter.com/ramanuja2797/status/1393914318530351116
దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. తనదైన మ్యూజిక్‌తో యావరేజ్ సినిమాలను సైతం సూపర్‌హిట్స్‌గా మారుస్తుంటాడు. 1999లో వచ్చిన ‘దేవి’ సినిమాతో అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అందులోని అన్ని పాటలు సూపర్‌హిట్‌గా నిలవడంతో ఈ రాక్‌స్టార్‌కు గ్రాండ్ ఎంట్రీ లభించినట్లైంది. దీంతో తొలి సినిమా టైటిల్‌ను దేవి శ్రీ ప్రసాద్ తన పేరులో కలుపుకున్నాడు.
బాహుబలి ప్రభాకర్ (Bahubali Prabhakar)
‘రైట్ రైట్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ప్రభాకర్.. ‘మర్యాద రామన్న’ సినిమాతో చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి’లో కాలకేయుడి పాత్రలో కనిపించి ప్రభాకర్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అద్భత నటనతో వీక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమా తర్వాత నుంచి అతడు బాహుబలి ప్రభాకర్‌గా అందరి దృష్టిలో పడ్డాడు.
ప్రభాస్ శ్రీను (Prabhas Srinu)
పైనున్న నటులకు సినిమాలు, పాత్రలను బట్టి పేరులో మార్పు వస్తే.. ఈ నటుడికి మాత్రం స్నేహం వల్ల పేరులో మార్పు వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్‌కు శ్రీనుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో తన మిత్రుడి పేరును తన పేరుకు మందు తగిలించుకొని ప్రభాస్ శ్రీనుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. 2012లో ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి గాను ప్రభాస్ శ్రీను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు.
మార్చి 07 , 2024
నాగ శౌర్య(Naga Shaurya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
ఛలో సినిమా విజయంతో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న నాగ శౌర్య.. తక్కువ కాలంలోనే యూత్‌లో క్రేజ్ సంపాందించుకున్నాడు. ఊహలు గుసగుసలాడే, వరుడుకావలెను ఖుషి వంటి హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న నాగ శౌర్య గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు మీకోసం
నాగ శౌర్య అసలు పేరు?
నాగశౌర్య ముల్పూరి
నాగ శౌర్య ఎత్తు ఎంత?
5 అడుగుల 9 అంగుళాలు
నాగ శౌర్య తొలి సినిమా?
క్రికెట్ గర్స్ అండ్ బీర్(2011) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.
నాగశౌర్యకు వివాహం అయిందా?
2022 నవంబర్ 20న తన ప్రియురాలు అనూష శెట్టితో వివాహం జరిగింది.
నాగ శౌర్య ఫస్ట్ క్రష్ ఎవరు?
ఐశ్వర్య రాయ్
నాగ శౌర్యకు ఇష్టమైన సినిమా?
టైటానిక్ చిత్రం తన ఫెవరెట్ చిత్రంగా నాగశౌర్య చెప్పాడు.
నాగ శౌర్య ఇష్టమైన హీరో?
తమిళ్ హీరో సూర్య
నాగ శౌర్య తొలి బ్లాక్ బాస్టర్ హిట్?
నాగ శౌర్య, రష్మిక మంధానతో కలిసి నటించిన చిత్రం ఛలో సూపర్ హిట్‌గా నిలిచింది. ఊహలు గుసగుసలాడే చిత్రం కూడా మంచి హిట్ అందుకుంది.
నాగశౌర్యకు ఇష్టమైన కలర్?
నీలం రంగు
నాగ శౌర్య పుట్టిన తేదీ?
1989 జనవరి 14న ఏలూరులో జన్మించారు.
నాగశౌర్య తల్లిదండ్రుల పేర్లు?
శంకర్ ప్రసాద్, ఉషా ప్రసాద్
నాగశౌర్యకు ఇష్టమైన ప్రదేశం?
హైదరాబాద్
నాగ శౌర్య ఏం చదివాడు?
బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్(Bcom)
https://www.youtube.com/watch?v=GU7EJFAPxCI
నాగ శౌర్యకు ఎన్ని అవార్డులు వచ్చాయి?
చెప్పుకోదగ్గ అవార్డులు ఏమి రాలేదు
నాగ శౌర్య ఎన్ని సినిమాల్లో నటించాడు?
నాగ శౌర్య 2024 వరకు 24 సినిమాల్లో నటించాడు.
నాగశౌర్యకు ఇష్టమైన ఆహారం?
పెరుగు వడ
నాగశౌర్య ముద్దుపేరు?
నాని
నాగ శౌర్యకు ఇష్టమైన హీరోయిన్?
అనుష్క శెట్టి
మార్చి 21 , 2024
నాగచైతన్య (Naga Chaitanya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
స్టార్ కిడ్‌గా తెరంగేట్రం చేసినప్పటికీ నాగ చైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ప్రస్తుతం సక్సెస్ బాటలో పయనిస్తున్నాడు. టాలీవుడ్లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నా నాగ చైత్య గురించి కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
నాగచైతన్య ఎవరు?
టాలీవుడ్లో స్టార్ హీరో నాగార్జున తనయుడు. దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడు
నాగచైతన్య ముద్దు పేరు?
చై
నాగ చైతన్య ఎత్తు ఎంత?
5 అడుగుల 10 అంగుళాలు
నాగచైతన్య ఎక్కడ పుట్టారు?
హైదరాబాద్
నాగ చైతన్య పుట్టిన తేదీ ఎప్పుడు?
1986 నవంబర్ 23
నాగ చైతన్య భార్య పేరు?
సమంత, ప్రస్తుతం వారు విడిపోయారు
సమంత- నాగ చైతన్య ఎప్పుడు విడిపోయారు?
వ్యక్తిగత కారణాలతో 2021 అక్టోబర్ 2న విడిపోయారు.
నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకున్నాడా?
లేదు, కానీ ఓ హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
నాగ చైతన్య అభిరుచులు?
ట్రావెలింగ్
నాగ చైతన్య అభిమాన నటుడు?
నాగార్జున, ఆమిర్ ఖాన్
నాగ చైతన్య అభిమాన హీరోయిన్?
అనుష్క శెట్టి
నాగ చైతన్యకు స్టార్ డం అందించిన సినిమాలు?
ఏ మాయా చేసావే, 100%లవ్,
నాగ చైతన్యకు ఇష్టమైన కలర్?
బ్లాక్
నాగ చైతన్య ఏం చదివాడు?
St. మేరీస్ కాలేజీలో డిగ్రీ
నాగ చైతన్య ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 28 సినిమాల్లో నటించాడు
నాగ చైతన్యకు ఇష్టమైన ఆహారం?
చేపల పులుసు
https://www.youtube.com/watch?v=1dHAFadok8g
నాగ చైతన్య సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.10కోట్లు- రూ.12 తీసుకుంటున్నారు.
నాగ చైతన్య గెలుచుకున్న అవార్డులు?
మొదటి చిత్రం జోష్ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సౌత్ స్కోప్ సినిమా అవార్డ్స్, మనం చిత్రానికిగాను నంది అవార్డు అందుకున్నారు.
మార్చి 19 , 2024
నాగార్జున (Nagarjuna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
టాలీవుడ్లో మన్మథుడిగా గుర్తింపు పొందిన నాగార్జున ఇండస్ట్రీలో ప్రేక్షకుల హృదయాల్లో తనదైన గుర్తింపు పొందారు. తెలుగులో లెజెండరీ నటులైన అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన మాస్ ఇమేజ్ను పొందాడు. ఆయ కెరీర్లో ఎన్నో మరుపురాని చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. శివ, గీతాంజలి, అన్నమయ్య చిత్రాలతో చెరగని ముద్ర వేశారు. ప్రేక్షకుల హృదయాల్లో నమ మన్మథుడిగా స్థానం సంపాదించిన నాగార్జున గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు మీకోసం..
నాగార్జున అసలు పేరు?
అక్కినేని నాగార్జున రావు
నాగార్జున ఎత్తు ఎంత?
5 అడుగుల 10 అంగుళాలు
నాగార్జున నటించిన తొలి సినిమా?
నాగార్జునకు రెండేళ్ల వయసులో వెలుగు నీడలు(1961) అనే తన తండ్రి చిత్రం ద్వారా బాలనటుడిగా ఆరంగేట్రం చేశాడు.
నాగార్జున ఎక్కడ పుట్టారు?
చెన్నై
నాగార్జున పుట్టిన తేదీ ఎప్పుడు?
1959 ఆగస్టు 29
నాగార్జున భార్య పేరు?
మొదటి భార్య పేరు లక్ష్మి దగ్గుపాటి(1984-1990), రెండో భార్య పేరు అమల(1992- ప్రస్తుతం)
నాగార్జున అభిరుచులు?
పుస్తకాలు చదవడం, జిమ్‌లో వర్క్స్‌వుట్ చేయడం.
నాగార్జున హీరోగా నటించిన తొలిసినిమా?
విక్రమ్(1986)
నాగార్జున అభిమాన నటుడు?
అమితాబ్ బచ్చన్
నాగార్జున అభిమాన హీరోయిన్?
టబు
నాగార్జున ఫెవరెట్ రెస్టారెంట్?
N ASIAN
నాగార్జునకు స్టార్ డం అందించిన చిత్రం?
శివ
నాగార్జునకి ఇష్టమైన కలర్?
బ్లాక్ అండ్ వైట్
నాగార్జున తల్లిదండ్రుల పేర్లు?
అక్కినేని నాగేశ్వర్రావు, అన్నపూర్ణమ్మ
నాగార్జున ఏం చదివారు?
ఇంజనీరింగ్
నాగార్జున ఎన్ని సినిమాల్లో నటించారు?
100కి పైగా సినిమాల్లో నటించారు
నాగార్జునకి ఇష్టమైన ఆహారం?
గ్రిల్డ్ చికెన్‌ను నాగార్జున ఇష్టంగా తింటాడు. దీనితో పాటు చేపల పులుసు, దోశ అంటే ఇష్టం
https://www.youtube.com/watch?v=HRVE2bZg5Uk
నాగార్జున వ్యాపారాలు?
ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మాస్టర్స్ టీంకు సహ యజమానిగా ఉన్నారు.అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు హైదరాబాద్‌లో N కన్వెన్షన్స్ పేరుతో ఫంక్షన్ హాళ్లు ఇతర వ్యాపారాలను ఆయన నిర్వహిస్తున్నారు.
నాగార్జున నికర ఆస్తుల విలువ ఎంత?
రూ.3100కోట్లు
నాగార్జున సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.15కోట్లు- రూ.20కోట్లు తీసుకుంటారు.
మార్చి 19 , 2024
‘నాటు నాటు’ సాంగ్ మాత్రమే కాదు…. MM కీరవాణి స్వరపరిచిన టాప్ 10 సాంగ్స్ లిస్ట్ ఇదే
]10. పుణ్యభూమి నా దేశం- మేజర్ చంద్రకాంత్ఈ పాట మేజర్ చంద్రకాంత్ సినిమాలోని దేశభక్తి గీతం. ఇప్పటికీ జాతీయ పండగల వేళ.. తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతూ ఉంటుంది. ఈ పాటను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆలపించారు.Watch Now
ఫిబ్రవరి 13 , 2023
Thandel Movie: శివ పార్వతుల్లా నాగ చైతన్య - సాయిపల్లవి.. ‘తండేల్’ నుంచి అదిరిపోయే పోస్టర్స్!
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై టాలీవుడ్లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘లవ్ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్ నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. ఇది చేసిన సినీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
శివరాత్రి స్పెషల్ సాంగ్
నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో రూపొందుతున్న ‘తండేల్’ చిత్రానికి చందు మెుండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. శివరాత్రి థీమ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తోంది. ఇందుకోసం భారీ సెట్‌ను సైతం వేశారు. పాట విజువల్ ట్రీట్‌లా ఉండేందుకు మేకర్స్ రూ.4 కోట్లు ఖర్చు చేశారని టాక్. అంతేకాదు వందలాది మంది డ్యాన్సర్లు ఈ పాటలో భాగం కాబోతున్నారట. సాయిపల్లవి, నాగచైతన్య శివపార్వతులను తలపించే నృత్యరీతులతో అలరించబోతున్నారని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. శివరాత్రి థీమ్‌తో ఓ పాటను ఈ స్థాయిలో కంపోజ్ చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారని టాక్. షూటింగ్ స్పాట్ ఫొటోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇందులో చైతు-సాయిపల్లవి శివ పార్వతులను తలపిస్తున్నారు.
https://twitter.com/ThandelTheMovie/status/1840612058691183016
తండేల్ స్టోరీ ఇదే
నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. గుజరాత్ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ అంటే గుజరాతి భాషలో బోటు నడిపే ఆపరేటర్ అని అర్థం. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని డైరెక్టర్ చందూ మెుండేటి ఓ ఇంటర్యూలో వెల్లడించారు.
చైతూ ఆశలన్నీ తండేల్ పైనే!
ప్రస్తుతం నాగ చైతన్య తన ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత అతడికి సరైన హిట్ లభించలేదు. ‘బంగార్రాజు’, ‘థ్యాంక్ యూ’, ‘లాల్ సింగ్ చద్ధా’, గతేడాది వచ్చిన ‘కస్టడీ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందాయి. దీంతో ‘తండేల్’ ద్వారా ఎలాగైన గెలుపు బాట పట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. మత్స్యకారుడి పాత్ర కోసం ఆయన ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది.
సాయిపల్లవి ప్రాజెక్ట్స్
ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్‌తో కలిసి 'అమరన్' అనే చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 31 థియేటర్లలోకి రానుంది. అలాగే బాలీవుడ్లో ‘రామాయణం’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. ఇందులో సీతగా ఆమె కనిపించనుంది. ఈ పాత్ర కోసం రూ.15 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే హీరో నాని, శేఖర్ కమ్ములా కాంబోలో రానున్న చిత్రంలోనూ సాయిపల్లవి హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి.
సెప్టెంబర్ 30 , 2024
HBD Nagarjuna: నాగార్జున బర్త్‌డే స్పెషల్.. ఆయన వేసిన ఈ డేరింగ్ స్టెప్స్ ఏ హీరో వేయలేదు భయ్యా!
అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున (Akkineni Nagarjuna) ఏ హీరో చేయనన్నీ ప్రయోగాలు తనపై తాను చేసుకున్నారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా వైవిధ్యమైన చిత్రాలతో కెరీర్లో ముందుకు సాగారు. మాస్, క్లాస్, ఆధ్యాత్మికం, లవ్ ఇలా అన్ని జానర్స్‌లో చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసులుగా తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్‌ను సైతం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తండ్రిగానూ సక్సెస్ అయ్యారు. ఇండస్ట్రీలో నాగార్జున సక్సెస్ వెనుక కొన్ని డేరింగ్ స్టెప్స్ ఉన్నాయి. ఇవాళ (ఆగస్టు 29) నాగార్జున బర్త్‌డే సందర్భంగా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
'శివ'తో సెన్సేషన్
సాధారణంగా కెరీర్ తొలినాళ్లలో ఏ హీరో అయినా సేఫ్ స్టోరీలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు. అయితే నాగార్జున ‘శివ’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కనీసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయని రామ్‌గోపాల్ వర్మకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి గొప్ప సాహసమే చేశారు. నాగార్జున వేసిన ఆ డేరింగ్ స్టెప్ అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎవరూ ఊహించిన విధంగా ‘శివ’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాగ్ కెరీర్‌తో పాటు టాలీవుడ్ దిశను కూడా శివ పూర్తిగా మార్చేసింది. హీరో అంటే ఇలాగే ఉండాలన్న మూసధోరణికి ‘శివ’తో నాగ్ - రామ్‌గోపాల్ వర్మ చెక్ పెట్టారు.
వైవిధ్యతకు ప్రాధాన్యం
శివ సినిమాతో నాగార్జున ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారిపోయాడు. అప్పట్లో ఒక సినిమా హిట్ అయ్యిందంటే అదే ప్యాట్రన్‌లో చాలా కథలు వచ్చి పడేవి. అయితే నాగార్జున వాటికి తలొగ్గకుండా సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ‘గోవిందా గోవిందా’లాంటి సూపర్ నేచురల్ హెయిస్ట్ ఫిల్మ్, ‘నిన్నే పెళ్లాడతా’ వంటి ఫ్యామిలీ డ్రామా, ‘హలో బ్రదర్’లాంటి యాక్షన్ ఎంటర్టైనర్లతో ఫ్యాన్స్‌ను అలరించారు. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు.
‘అన్నమయ్య’
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలు కమర్షియల్ చిత్రాలతో దూసుకుపోతున్న తరుణంలో నాగార్జున ‘అన్నమయ్య’ ప్రాజెక్ట్‌ను ఓకే చేసి అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటికే మాస్ ఇమేజ్ తెచ్చుకున్న నాగార్జున డివోషనల్ చిత్రం చేయడమేంటని ఇండస్ట్రీలో విమర్శలు వచ్చాయి. నటుడు అంటే అన్ని రకాల పాత్రలు వేయాలన్న సిద్ధాంతాన్ని నమ్మిన నాగార్జున ఏమాత్రం సంకోచించకుండా అన్నమయ్య సినిమాలో నటించారు. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నాగార్జున తన నటనతో నిజమైన అన్నమయ్యను గుర్తుచేశారు. ఈ చిత్రానికి ఏకంగా రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ రావడం విశేషం.
మరిన్ని ఆధ్యాత్మిక చిత్రాలు..
‘అన్నమయ్య’ సక్సెస్‌తో నాగార్జున సరిపెట్టుకోలేదు. ఓవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మరిన్ని భక్తిరస సినిమాల్లో ఆయన నటించారు. రాఘవేంద్రరావు-నాగార్జున కాంబోలో వచ్చిన ‘రామదాసు’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అలాగే ‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’, ‘జగద్గురు ఆది శంకర’ వంటి ఆధ్యాత్మిక చిత్రాల్లో నాగార్జున మెరిశారు.
కొత్తవారికి ఛాన్స్..
కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో రిస్కే కాదు, విజయమూ ఉందని ఎన్నోసార్లు నిరూపించారు నాగార్జున. సుదీర్ఘ నట ప్రస్థానంలో సుమారు 40 మంది దర్శకులను ఆయన టాలీవుడ్‌కి పరిచయం చేశారు. రామ్‌గోపాల్ వర్మ (శివ), వైవీఎస్ చౌదరి (శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి), లారెన్స్ (మాస్), విజయ్ బిన్నీ (నా సామిరంగ) తదితరులు ఆ జాబితాలోకే వస్తారు. తాను స్టార్ కావడానికి కారణం ఓ రకంగా నూతన దర్శకులే అంటుంటారు నాగ్.
తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్
తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలను మార్చిన హీరోగా నాగార్జునను చెబుతుంటారు. ఈ విషయంపై డైరెక్టర్ కృష్ణవంశీ ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను గ్లోబల్ చేసిన హీరో నాగార్జున అని కొనియాడారు. ఇతర ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లను తీసుకొచ్చి తన సొంత డబ్బుతో వైవిధ్యమైన చిత్రాలు నిర్మించారని గుర్తుచేశారు. తద్వారా ఆడియన్స్ విజన్‌ను నాగార్జున మార్చేశారని పేర్కొన్నారు. మణిరత్నం, ప్రియదర్శన్, ఫాజిల్, రవిచందర్, మహేష్ భట్ ఇలా మలయాళం, కన్నడ, హిందీ, తమిళ ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లతో నాగార్జున వర్క్ చేశారని గుర్తుచేశారు. చిన్న క్యారెక్టర్ అయినా బాంబే వెళ్లి వచ్చేవారని పేర్కొన్నారు. పాన్ ఇండియా అనే మాటకు మెుదట ఫౌండేషన్ వేసిందే నాగార్జున అని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
https://twitter.com/thokkaloteja/status/1828863171152757038
బిగ్ బాస్ హోస్ట్‌గా..
సాధారణంగా స్టార్డమ్ వచ్చిన హీరోలు బుల్లితెర షోలలో కనిపించేందుకు పెద్దగా ఆసక్తి కనిపించరు. వారి దృష్టంతా సినిమాలపైనే ఉంటుంది. అయితే నాగార్జున అలా కాదు. బిగ్‌బాస్ తెలుగు షోకు గత కొన్నేళ్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎన్టీఆర్, తారక్ వంటి కుర్ర హీరోలు ఒక సీజన్‌కు మాత్రమే పరిమితం కాగా నాగ్ మాత్రం అలవోకగా సీజన్‌లపైన సీజన్లు చేసుకుంటూ వెళ్తున్నారు. వరుసగా ఐదు సీజన్ల (Bigg Boss 3,4,5,6,7)కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సెప్టెంబరు 1న ప్రారంభం కానున్న 8వ సీజన్‌కూ ఆయనే వ్యాఖ్యాత. అంతేకాదు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి కూడా నాగ్ హోస్ట్‌గా వ్యవహించడం గమనార్హం.
https://twitter.com/i/status/1829013612117230039
ఫిట్నెస్ మంత్ర
నాగార్జున ఫిట్నెస్ను చూసి కుర్ర హీరోలు సైతం షాకవుతుంటారు. శివ సమయంలో నాగ్ ఫిజిక్ ఎలా ఉందో ఇప్పటికే అదే బాడీని మెయిన్‌టెన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం, వర్కౌట్ చేయడమే తన అందం సీక్రెట్ అంటూ పలు వేదికల్లో నాగార్జున చెప్పుకుంటా వచ్చారు. 1986లో ‘విక్రమ్’(Vikram)తో హీరోగా పరిచయమైన నాగ్ వంద చిత్రాలకు చేరుకున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ (Kubera)లో నటిస్తున్నారు.
ఆగస్టు 29 , 2024
అనన్య నాగళ్ల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
అనన్య నాగళ్ల.. మల్లేశం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె చేసిన "పద్మ" పాత్ర విమర్శకుల ప్రశంసలు పొందింది. వకీల్‌సాబ్ చిత్రంలో దివ్యా నాయక్ క్యారెక్టర్ ద్వారా గుర్తింపు పొందింది. అనన్య సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే అనన్యకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. మరి అనన్య నాగళ్ల గురించి మరిన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts Ananya nagalla) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అనన్య నాగళ్ల దేనికి ఫేమస్?
అనన్య నాగళ్ల మల్లేశం చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంతో పాటు వకీల్ సాబ్ చిత్రంలోనూ నటించింది.
అనన్య నాగళ్ల వయస్సు ఎంత?
1987 ఆగస్టు 1న జన్మించింది. ఆమె వయస్సు 36 సంవత్సరాలు
అనన్య నాగళ్ల తొలి సినిమా?
మల్లేశం
అనన్య నాగళ్ల ఎత్తు ఎంత?
5 అడుగుల 6 అంగుళాలు
అనన్య నాగళ్ల ఎక్కడ పుట్టింది?
సత్తుపల్లి, ఖమ్మం
అనన్య నాగళ్ల ఉండేది ఎక్కడ?
హైదరాబాద్
అనన్య నాగళ్ల ఏం చదివింది?
ఇంజనీరింగ్
అనన్య నాగళ్ల తల్లిదండ్రుల పేర్లు
విష్ణుప్రియ, వెంకటేశ్వరరావు
అనన్య నాగళ్ల ఫెవరెట్ హీరో?
పవన్ కళ్యాణ్
అనన్య నాగళ్ల ఫెవరెట్ హీరోయిన్
సావిత్రి
అనన్య నాగళ్ల ఫెవరెట్ క్రికెటర్
సచిన్ టెండూల్కర్
అనన్య నాగళ్ల అభిరుచులు?
బాక్సింగ్, యోగా
అనన్య నాగళ్లకు ఇష్టమైన ఆహారం?
బిర్యాని
అనన్య నాగళ్లకి ఇష్టమైన కలర్ ?
వైట్ అండ్ బ్లాక్
అనన్య నాగళ్ల పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.25లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
అనన్య నాగళ్ల సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
సినిమాల్లోకి రాకముందు ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. ఆ తర్వాత "షాది" అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి గుర్తింపు పొందింది.
అనన్య నాగళ్ల ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/ananya.nagalla/?hl=en
https://www.youtube.com/watch?v=Tqjtq5lvnas
ఏప్రిల్ 13 , 2024
Samantha: నాగ చైతన్య ఫ్యాన్స్‌కి చిన్మయి వార్నింగ్..? సమంతను ఏమైనా అన్నారంటే..!
సమంత, విజయ్ దేవరకొండ జంటగా తెరకెక్కిన ‘ఖుషి’ సినిమా ‘మ్యూజికల్ కాన్సర్ట్’ (Musical Concert) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 3 పాటలు హిట్టయ్యాయి. దీంతో మ్యూజికల్ కాన్సర్ట్‌ని వీక్షించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహెబ్, సింగర్స్ సిద్ శ్రీరామ్, చిన్మయి, తదితరులు స్టేజిపై సందడి చేశారు. విజయ్ దేవరకొండ సినిమాల్లోని పాటలు పాడుతూ హోరెత్తించారు. అయితే, మ్యూజిక్ సెషన్ అనంతరం చిన్మయి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. పరోక్షంగా నాగచైతన్య ఫ్యాన్స్‌కి కౌంటర్ ఇచ్చిందని చర్చ సాగుతోంది.
https://twitter.com/SureshPRO_/status/1691450193684934656
సమంత అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది సినిమాల్లోని ఆమె గాత్రమే. సామ్‌కి డబ్బింగ్ చెప్పేది చిన్మయినే. సమంత తొలి సినిమా నుంచి వీరిద్దరి కాంబో కంటిన్యూ అవుతూ వస్తోంది. తాజాగా ఖుషి సినిమాకు సైతం సమంతకు చిన్మయినే డబ్బింగ్ చెప్పింది. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో చిన్మయి, రాహుల్ దంపతులు అండగా నిలిచారు. కుంగిపోవద్దని ధైర్యం నూరి పోశారు.
https://twitter.com/SamanthaPrabuFC/status/1691498121405374464
అంతకుముందు నాగచైతన్యతో విడాకుల ఘటనపై సామ్ మీద చై ఫ్యాన్స్ దుమ్మెత్తి పోశారు. సమంత ప్రవర్తనే కారణమంటూ నిందించారు. దీంతో సామ్ కుంగుబాటుకి గురైంది. సన్నిహితుల సాయంతో క్రమంగా కోలుకుంటూ సామ్ తిరిగి మేకప్ వేసుకుంది. అయితే, ఈ తతంగం అందరూ మర్చిపోయిన సమయంలో చిన్మయి చేసిన కామెంట్స్ నాటి రోజుల్ని గుర్తు చేశాయి.
https://twitter.com/TeamSamantha__/status/1691659796737622037
చిన్మయి ఏమందంటే?
స్టేజిపై పాట పాడిన అనంతరం యాంకర్ సుమ చిన్మయికి మైక్ ఇచ్చింది. ‘ఈ స్టేజిపై నుంచి నేనొక విషయం చెప్పాలని అనుకుంటున్నా సామ్.. తెలుగులో నా డబ్బింగ్ కెరీర్ ప్రారంభమైంది నీ వల్లే. ఈ రోజు నువ్వు ఎంతో మందిలో స్ఫూర్తి నింపావు. అమ్మాయిలకు, అబ్బాయిలకు నువ్వొక హీరోవి. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన ఉత్తమమైన వ్యక్తి సమంత. చాలా మంచి అమ్మాయి, ధైర్యవంతురాలు. ఎవరేం చెప్పినా, ఎన్ని ప్రచారాలు చేసినా ఏమీ మారదు’ అంటూ మాట్లాడింది. అనంతరం, సమంతకు డెడికేట్ చేస్తూ ఓ పాట పాడింది. నాగచైతన్యతో విడాకులపై సమంతను బలిపశువును చేయడంపై చిన్మయి ఇలా స్ట్రాంగ్ రిప్లే ఇచ్చినట్లు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
https://twitter.com/SamanthaPrabuFC/status/1691489745350897664
ఫ్యాన్స్ హ్యాపీ
చిన్మయి స్పీచ్‌పై సమంత ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు సరైన విషయం చెప్పారంటూ చిన్మయిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సమంత గురించి ఫ్యాన్స్ మనసులోని మాటను చిన్మయి బయటపెట్టారని చెబుతున్నారు. సామ్, చిన్మయిల ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మరికొందరు ఫ్యాన్స్ సైతం ఇదే విధమైన ట్వీట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తరఫున మాట్లాడినందుకు చిన్మయికి ధన్యవాదాలు చెబుతున్నారు.
https://twitter.com/__GirDhar/status/1691518743820791809
విజయ్, సామ్ పర్ఫార్మెన్స్
మ్యూజికల్ కాన్సర్ట్‌లో విజయ్, సమంతల లైవ్ పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఖుషి టైటిల్ సాంగ్‌కి వీరిద్దరూ కలిసి కాలు కదిపారు. సామ్‌ని విజయ్ ఒంటిచేత్తో ఎత్తుకుని గింగిరాలు తిప్పాడు. అలాగే పైకి ఎత్తుకుని ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపాడు. కిందికి దిగగానే సామ్ ‘హల్లో హైదరాబాద్’ అని విష్ చేయగా ‘తెలుగు ప్రజల్లారా..’ అంటూ రౌడీబాయ్ స్టార్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/AndhraBoxOffice/status/1691475831133274112
ఆగస్టు 16 , 2023
Rangabali Movie Review: రంగబలితో నాగశౌర్య సక్సెస్ అందుకున్నట్లేనా.. మూవీ ఎలా ఉంది?
నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..
దర్శకుడు: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీతం: పవన్ సీహెచ్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి
‘ఛలో’ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం నాగశౌర్య ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. క్లాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచి లవర్ బాయ్‌గా గుర్తింపు పొందిన నాగశౌర్య ఇందులో మాస్ క్యారెక్టర్ పోషించాడు. ఈ సారి ‘రంగబలి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చాడు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? మాస్ ఆడియెన్స్‌ని నాగశౌర్య బుట్టలో వేసుకున్నాడా? వంటి అంశాలను రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే?
శౌర్య(నాగశౌర్య) పనీపాట లేకుండా తిరిగే అబ్బాయి. రాజవరంలో తండ్రి విశ్వం(రమణ) మెడికల్ షాపుని నిర్వహిస్తుంటాడు. కొడుకుకి మెడికల్ షాపును అప్పజెప్పి భవిష్యత్తును తీర్చిదిద్దాలని భావిస్తాడు విశ్వం. ఇందుకోసం ఫార్మసీ ట్రైనింగ్‌కి వైజాగ్ పంపిస్తాడు. అక్కడ శౌర్య సహజ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. కానీ, వీరి ప్రేమను అంగీకరించడానికి సహజ తండ్రి అడ్డు చెబుతాడు. రాజవరంలోని రంగబలి సెంటర్ ఇందుకు ప్రధాన కారణం. మరి వీరి ప్రేమకి, రంగబలికి సంబంధం ఏంటి? ప్రేమ కోసం హీరో ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
రంగబలి చూసిన ఆడియన్స్‌కు రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూసిన భావనే కలుగుతుంది. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంటుంది. సత్య చేసే కామెడీ ఫస్టాఫ్‌లో బోర్ కొట్టకుండా చేస్తుంది. ఇక ఒక ట్విస్టుతో ఇంటర్వెల్ అవుతుంది. సెకండాఫ్ పూర్తిగా యాక్షన్ సీన్లతో నడుస్తుంది. ఫస్టాఫ్‌లో కనిపించిన జోరు సెకండాఫ్‌లో ఉండదు. ఇక, క్లైమాక్స్ తీసికట్టుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కథ అందరికీ తెలిసేలా ఉన్నా ప్రభావవంతమైన కథనంతో ప్రేక్షకుడిని రంగబలి మెప్పించలేకపోయింది.
ఎవరెలా చేశారు?
సొంతూరిలో రాజులా బతకాలనే భావనతో ఏమైనా చేసే యువకుడి పాత్రలో నాగశౌర్య మెప్పించాడు. లుక్స్‌తో క్లాస్, బాడీతో మాస్ ఆడియెన్స్‌ని మెప్పించాడు. హీరోయిన్ యుక్తి తరేజ ఫర్వాలేదనిపించింది. హీరోతో రొమాన్స్ పండించింది. ఇక కమెడియన్ సత్య కడుపుబ్బా నవ్వించాడు. ఇతరులు సంతోషపడితే చూడలేని అగాధం పాత్రలో ఇరగదీశాడు. ఫస్టాఫ్ మొత్తం తన కామెడీనే గుర్తుండిపోయేలా చేశాడు. ఇక, విలన్‌గా షైన్ టామ్ చాకోకు సరైన క్యారెక్టర్ పడలేదనిపించింది. డిజైన్ చేసిన మేరకు తన పాత్రలో మెప్పించాడీ మలయాళ నటుడు. గోపరాజు రమణ, మురళీ శర్మ, శరత్ కుమార్, తదితరులు ఓకే అనిపించారు.
సాంకేతికంగా?
ఒక చిన్న విషయాన్ని అనుకుని దానిని సినిమాగా డెవలప్ చేశాడు దర్శకుడు పవన్ బాసంశెట్టి. తొలి సినిమా అయినప్పటికీ కొన్ని సీన్లలో తన ప్రతిభను కనబర్చాడు. అయితే, ఓవరాల్‌గా ప్రేక్షకుడిని సాటిస్ఫై చేయలేకపోయాడు. క్లైమాక్స్‌ని మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి ఉండాల్సింది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ పాటలు పెద్దగా బయటికి రాలేవు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి.
https://www.youtube.com/watch?v=e9d9qhvI3dk
ప్లస్ పాయింట్స్
కామెడీ
నటీనటులు
మైనస్ పాయింట్స్
పేలవ కథ, కథనం
క్లైమాక్స్
పాటలు
రేటింగ్: 2.25/5
https://www.youtube.com/watch?v=B8ybLVdO2YQ
జూలై 07 , 2023
Custody Review: ప్రేక్షకులను నాగచైతన్య తన ‘కస్టడీ’లో బంధించాడా? అక్కినేని ఫ్యామిలీకి హిట్ వచ్చిందా?
అక్కినేని నాగ చైతన్య-కృతి శెట్టి హీరో హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియమణి, అరవింద స్వామి కీలక పాత్రల్లో నటించారు. చైతూ కానిస్టేబుల్‌గా కనిపిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అక్కినేని ఫ్యామిలీకి సరైన హిట్ లేని సమయంలో కస్టడీతో చై ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి, భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం హిట్ తెచ్చిపెట్టిందా? కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య ఆకట్టుకున్నాడా? కస్టడీ కథ ఏంటి, ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
నటీనటులు: నాగ చైతన్య, కృతిశెట్టి, ప్రియమణి, అరవింద స్వామి, శరత్‌కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్
దర్శకుడు: వెంకట్ ప్రభు
సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: S.R కతిర్, సుమేర్ వర్మ
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
కథ:
శివ (నాగ చైతన్య) నిజాయితీ గల కానిస్టేబుల్. ఎంతగానో ప్రేమించిన రేవతి(కృతి శెట్టి)ని వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్లో రాజన్న(అరవింద్ స్వామి) ని అరెస్ట్ చేసి ఉంచుతారు. డ్యూటీలో ఉన్న శివకి రాజన్నని ఎవరో చంపేస్తున్నారు అనే సమాచారం అందుతుంది. మరోవైపు రేవతికి వేరే పెళ్లి నిశ్చయించారని తెలుస్తుంది. ఎలాగైనా న్యాయం గెలవాలని చెప్పి రాజన్నని కోర్టులో అప్పగించేందుకు అదే రాత్రి రేవతితో పాటు రాజన్నని కూడా తీసుకెళ్తాడు. అసలు రాజన్నను ఎందుకు అరెస్టు చేశారు? చంపాలనుకున్నది ఎవరు? శివ తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అనేది అసలు కథ.
ఎలా ఉందంటే
సినిమా ఓ యాక్సిడెంట్‌తో మెుదలై కథలోకి వెళ్తోంది. దాదాపు 15 నిమిషాల పాత్రల పరిచయానికే సమయం పడుతుంది. ప్రియమణి, నాగ చైతన్య, కృతి శెట్టి ఇంట్రో, ఫ్యామిలీ సన్నివేశాలతో స్లోగా సాగుతుంది. క్రూరమైన విలన్‌గా అరవింద్ స్వామి ఇంట్రోతో అసలు కథ ప్రారంభమవుతుంది. ప్రీ ఇంటర్వెల్ ముందు కథనంలో వేగం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్‌తో సెకాండాఫ్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు.
సెకాండాఫ్ స్లోగా స్టార్ట్ అవ్వటంతో పాటు కొన్ని సాగదీత సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్ను కొట్టిస్తాయి. కొన్ని సీన్లు ఇప్పటికే చూసేశాం అన్నట్లుగా అనిపిస్తాయి. కృతి శెట్టితో లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. యాక్షన్ ఎపిసోడ్లు, ట్విస్ట్‌లు మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయి. వెంకట్ ప్రభు తరహా స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం యువన్ ఇరగదీశాడు.
ఎవరెలా చేశారంటే?
కస్డడీ సినిమాలో నాగచైతన్య అదరగొట్టాడు. శివ పాత్రలో పరకాయప్రవేశం చేసి అలరించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివ పాత్రనే కనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్ చైతూ లుక్ సెట్ అవ్వలేదేమో అనిపించినా.. కథలో లీనమయ్యేకొద్ది శివపాత్రతో కనెక్ట్ అవ్వకుండా ఉండలేం. యాక్షన్ సీన్లలో చైతూ తనదైన మార్క్ చూపించాడు. హీరోయిన్ కృతి శెట్టి కూడా నాగ చైతన్య కి సమానంగా స్క్రీన్ షేర్ చేసుకుంది. కొన్ని సీన్లలో శృతి తన గ్లామర్‌తో ప్రేక్షకులను ముగ్దులను చేస్తుంది. అరవింద్ స్వామి నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటిలాగే ఆయన తన పాత్రని అద్భుతంగా పండించాడు. శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిషోర్ మిగిలిన తారాగణం కూడా వారి పాత్రల మేరకు బాగానే చేశారు.
సాంకేతికంగా
తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తన మార్క్ కథనంతో తెరకెక్కిస్తారు. మానాడు చిత్రం ఇందుకు ఉదాహరణ.చై విషయంలో మంచి కథనే ఎంచుకున్నప్పటికీ కొన్ని చోట్ల తడబడ్డాడు.కథనం మరింత గ్రిప్పింగ్ రాసుంటే బాగుండేది. ఇళయ రాజా, యువన్ శంకర్ ఇద్దరు కలిసి పనిచేయడంతో మ్యూజిక్‌పై అంచనాలు పెరిగాయి. కానీ, పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద అసెట్ అని చెప్పాలి. కొన్ని సీన్లను BGM బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది.
బలాలు
నాగ చైతన్య నటనబ్యాక్ గ్రౌండ్ స్కోర్యాక్షన్ సీన్స్
బలహీనతలు
పాటలురొటీన్ కథసాగదీత సీన్లు
రేటింగ్: 2.5/5
మే 12 , 2023
ఆస్కార్‌లో నాటు నాటుకు పోటీపడుతున్న పాటలు ఇవే…
]28th ఎడిషన్ క్రిటిక్ ఛాయిస్ అవార్డు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకు దక్కింది సాటిలైట్ అవార్డు వేడుకల్లో ఉత్తమ గీతం అవార్డును పొందింది.
ఫిబ్రవరి 11 , 2023
Ananya Nagalla: అనన్య నాగళ్లకు సపోర్ట్‌గా సందీప్ రెడ్డి వంగా.. ఏమైందంటే?
తెలుగు ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘పొట్టేల్’ (Pottel). అక్టోబర్ 25న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ అనన్య బిజీ బిజీగా ఉంటోంది. రీసెంట్గా ట్రైలర్ లాంచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో అనన్యకు చేదు అనుభవం ఎదురైంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఎవరికైనా ఇచ్చారా? అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్న టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై అనన్య మరోమారు మాట్లాడారు. అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తమ టీమ్‌కు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.
సందీప్‌పై అనన్య ప్రశంసలు
యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రధాన పాత్రల్లో సాహిత్ మోత్కూరి రూపొందించిన సినిమా ‘పొట్టేల్’ (Pottel). మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ వేడకకు 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నటి అనన్య మాట్లాడారు. తమ ‘పొట్టేల్’ ప్రమోషన్స్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒకసారి కాదు రెండుసార్లు తమ మూవీ వేడుకల్లో పాల్గొన్నారంటూ ప్రశంసలు కురిపించారు. ఒక చిన్న సినిమాను పెద్ద సినిమా స్థాయికి తీసుకెళ్లడం కోసం మీరు చేస్తున్న సపోర్ట్ మాటల్లో చెప్పలేనని వ్యాఖ్యానించారు.
https://twitter.com/i/status/1848603026728358266
'రంగస్థలం’ తర్వాత పొట్టేలే: సందీప్ రెడ్డి
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న కథను తెరకెక్కిస్తున్నానంటూ దర్శకుడు సాహిత్ ఓ రోజు తనకు చెప్పాడని సందీప్ అన్నారు. కథ వినగానే 'ఇది చిన్న కథ కాదు పెద్దది' అని అనిపించిందన్నారు. తాను ఇప్పటికే సినిమా చూశానని బాగా నచ్చిందని పేర్కొన్నారు. సినిమా ఆ విధంగా ఉంటుందని అసలు ఊహించలేదన్నారు. మీకూ తప్పకుండా నచ్చుతుందని ఆడియన్స్‌ను ఉద్దేశించి చెప్పారు. 'రంగస్థలం' తర్వాత పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో చూసిన సినిమా ఇదేనంటూ ఆకాశానికెత్తారు. చిన్న సినిమాలను ప్రతీ ఒక్కరు ప్రోత్సహించాలంటూ ఆడియన్స్‌కు విజ్ఞప్తి చేశారు.
https://twitter.com/i/status/1848595831508652364
సంస్కారం ఉంటే ఆ ప్రశ్నలు వేయరు: అనన్య
‘పొట్టేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటి అనన్య నాగళ్ల మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమిట్మెంట్పై జర్నలిస్టు అడిగిన ప్రశ్నను మరోమారు లేవనెత్తుతూ చురకలు అంటించారు. ‘ఇంత డైరెక్ట్‌గా సున్నితమైన అంశంపై ఎలా ప్రశ్నించారని ఇంటికి వెళ్లాక కూడా ఆలోచించాను. అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు కదా అనుకున్నా. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల. 5 సంవత్సరాల నుంచి దీని కోసం నేను ఇంట్లో ఫైట్ చేస్తున్నా. పొట్టేల్ చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్లందరూ గర్వంగా ఫీలవుతారని భావించా. కమిట్మెంట్ ప్రశ్న వేసి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను సక్సెస్ అయినా కమిట్మెంట్కు అంగీకరించాను కాబట్టే సక్సెస్ అయ్యానని అందరూ అనుకుంటారు. హీరోయిన్లు మేకప్ వేసుకుని ఎప్పుడూ నవ్వుతూనే ఉంటున్నంత మాత్రాన వారికి హృదయం ఉండదు, ఫ్యామిలీ ఉండదని కాదు. మమ్మల్నీ గౌరవించండి’ అని అనన్య కోరారు.
అసలేం జరిగిందంటే?
పొట్టేల్ మూవీకి సంబంధించి ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటి సంయుక్త మీనన్ ట్రైలర్ విడుదల చేసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఓ మహిళా రిపోర్టర్ క్యాస్టింగ్ కౌచ్‌పై అనన్య నాగళ్లను ప్రశ్నించారు. 'ఒక హీరోయిన్‌కు కానీ, ఆర్టిస్ట్‌కు కానీ సినిమా ఛాన్స్ ఇచ్చేముందు కమిట్మెంట్ అడుగుతుంటారు. దీనికి మీరు ఏం చెబుతారు? మీరెప్పుడైనా ఫేస్ చేశారా?’ అని అడిగారు. అందుకు అనన్య బదులిస్తూ ‘కమిట్మెంట్ అడుగుతారని మీరు కచ్చితంగా ఎలా చెబుతున్నారు. అలాంటిదేమి లేదు’ అని చెప్పింది. ఆ తర్వాత రిపోర్టర్ మాట్లాడుతూ ‘మీరు చేసే సైన్ అగ్రిమెంట్లోనే కమిట్మెంట్ ఉంటుందంట కదా. ఇండస్ట్రీ ఫ్రెండ్సే చెప్పారు' అని ప్రశ్నించింది. 'ఇది వందశాతం రాంగ్ అండి. సీరియస్‌గా నేనెప్పుడు ఫేస్ చేయలేదు. అసలు అలాంటిది ఉండదు' అని అనన్య పేర్కొంది.
https://twitter.com/tfpcin/status/1847262295266865248
రిపోర్టర్‌పై మల్లేశం నిర్మాత ఫైర్
అనన్య నాగళ్లను మహిళ రిపోర్టర్ ప్రశ్నించిన తీరుపై నెటిజన్లు మండిపతున్నారు. వీడియో వైరల్ అవుతుండటంతో మల్లేశం నిర్మాత వెంకట్ సిద్దారెడ్డి కూడా స్పందించారు. రిపోర్టర్ ప్రశ్న సరైంది కాదంటూ ఎక్స్ వేదికగా సుదీర్గ పోస్టు పెట్టాడు. మల్లేశం షూటింగ్ సందర్భంగా అనన్య భద్రత కోసం తీసుకున్న జాగ్రత్తలను సైతం పోస్టులో మెన్షన్ చేశారు. మహిళా రిపోర్టర్ అంత దారుణంగా అడగడం అస్సలు బాలేదని పేర్కొన్నారు. అది కూడా ఒక సినిమా ప్రమోషన్లో కంప్లీట్‌గా అనవసరమైన ప్రశ్న వేశారని మండిపడ్డారు. ఆమెకు అనన్య చక్కగా సమాధానం చెప్పిందని ప్రశంసించారు. ఈ పోస్టుకు అనన్య సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచినందుకు వెంకట్ సిద్ధా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
https://twitter.com/AnanyaNagalla/status/1847503625607680498
అక్టోబర్ 22 , 2024
Akkineni Nagarjuna: హీరో నాగార్జునపై క్రిమినల్ కేసు.. ప్రతికారం తీర్చుకుంటున్నారా?
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఒకరు. టాలీవుడ్ మన్మథుడిగా కూడా ఆయన్ను పిలుస్తుంటారు. అటువంటి కింగ్ నాగార్జునకు గత కొన్ని రోజులుగా అసలు కలిసి రావడం లేదు. ఏదోక రూపంలో అక్కినేని ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. నాగచైతన్య-శోభిత నిశ్చితార్థంపై విమర్శలు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండ సురేఖ ఘాటు వ్యాఖ్యలు నాగార్జునను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నాగార్జునపై కేసు నమోదు
సినీ హీరో నాగార్జునపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పోలీసులకు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపారు. అనంతరం తాజాగా నాగార్జునపై కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే.
రూ.100 కోట్ల స్థలం కబ్జా!
నాగార్జునపై చేసిన ఫిర్యాదులో మరిన్ని అంశాలను కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేవనెత్తారు. శిల్పారామం ఎదురుగా గల అయ్యప్ప సొసైటీ ప్రాంతంలోని తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి 17, 2021న నివేదిక ఇచ్చారని ఫిర్యాదు పేర్కొన్నారు. రూ.వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి చెరువును కబ్జా చేసి అక్రమంగా వ్యాపారం చేసి రూ.కోట్లు గడించిన అక్కినేని నాగార్జునపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు.
https://twitter.com/jsuryareddy/status/1842478697938403807
కక్ష్య సాధింపు చర్యలేనా!
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య - సమంత విడాకుల అంశాన్ని కేటీఆర్‌తో ముడిపెడుతూ దారుణంగా మాట్లాడారు. దీనిని అక్కినేని కుటుంబంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. అటు నాగార్జున ఓ అడుగు ముందుకువేసి రూ.100 కోట్ల మేర పరువునష్టం దావా మంత్రిపై వేశారు. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగార్జునపై క్రిమినల్ కేసు పెట్టడం ద్వారా అతడ్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ కేసులో నాగార్జున ఎలా వ్యూహాత్మంగా ముందుకు వెళ్తారో చూడాలి.
తీవ్రంగా ఖండించిన టాలీవుడ్
అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రంగా ఖండించింది. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గు చేటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహేష్ బాబు ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అటు తారక్ సైతం వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోందంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ స్పందిస్తూ మంత్రి ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సీనియర్ నటుడు వెంకటేష్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
అక్టోబర్ 05 , 2024
Anjali : ఆయనపై ఎప్పటికీ నాకు అదే ఉంటుంది.. బాలకృష్ణ ఇష్యూపై అంజలి కామెంట్స్!
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహార శైలిపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. ప్రముఖ నటి అంజలి (Actress Anjali)ని బాలకృష్ణ నెట్టివేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంజలి పట్ల బాలయ్య అనుచితంగా ప్రవర్తించారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను రెండ్రోజులుగా వైరల్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా హీరోయిన్ అంజలి కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ట్రోలర్స్‌కు ఇండైరెక్ట్‌గా గట్టి కౌంటర్ ఇచ్చింది.
‘మేము గొప్ప స్నేహితులం’
స్టార్ హీరోయిన్ అంజలి (Anjali).. బాలకృష్ణపై వస్తోన్న విమర్శలపై పరోక్షంగా స్పందించింది. ఎక్స్ వేదికగా ఓ ప్రత్యేక పోస్టు పెట్టింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా బాలయ్యతో పాటు ఉన్న ఓ మెమోరబుల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. దీంతో అంజలి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అంజలి పోస్టును షేర్ చేస్తూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/yoursanjali/status/1796260781551682021
నెటిజన్లు భిన్నాభిప్రాయాలు
అంజలి పోస్టుపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇంత ఆలస్యంగా స్పందించడం ఏంటని ఆమెపై మండిపతున్నారు. బాలకృష్ణ తోసేసిన వ్యవహారం రెండ్రోజులుగా సోషల్ మీడియాను ఊదరకొడుతున్న క్రమంలో కాస్త త్వరగా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నటి స్పందించే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని బాలయ్య ఫ్యాన్స్ వాపోతున్నారు. మరోవైపు బాలయ్య యాంటి ఫ్యాన్స్ నటి అంజలిపై సానుభూతి చూపిస్తున్నారు. కొందరి ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఈ పోస్టు చేయాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.
https://twitter.com/GoneWorse/status/1796158320778117123
నిర్మాత ఏమన్నారంటే..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నిర్మాత నాగవంశీ కూడా బాలయ్య వైరల్ వీడియోపై ఇటీవలే స్పందించారు. ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువుకొద్దీ అలా చేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని చెప్పారు. ఆ చర్యకు ముందూ.. వెనక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హైఫై అంటూ చేతులతో చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించలేదని చెప్పారు. పూర్తి వీడియోను ఓ సారి చూసేయండి.
https://twitter.com/DeepikaBhardwaj/status/1796143784851325044
నేషనల్ వైడ్‌గా వైరల్
నటుడు బాలకృష్ణ.. నటి అంజలిని ఏ ఉద్దేశ్యంతో తోసిన అది.. నేషనల్ వైడ్‌గా మాత్రం ట్రెండ్ అయింది. ప్రముఖ జాతీయ మీడియాలు సైతం ఆ వీడియోను ప్రసారం చేశాయి. ఎంత చనువు ఉన్నా ఒక నటితో అలా ప్రవర్తిస్తారా అంటూ జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం పక్కకు వెళ్లింది. అంతా బాలయ్య-అంజిలి గురించే చర్చించుకున్నారు.
మే 31 , 2024