• TFIDB EN
  • నిన్ను కోరి
    UTelugu2h 17m
    పల్లవి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఉమను తన భర్తతో కలిసి తన ఇంట్లో ఉండమని ఆహ్వానిస్తుంది. పల్లవిని తిరిగి పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఉమ వారి కాపురంలో కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నాని
    పి. ఉమా మహేశ్వరరావు ఉమా
    నివేతా థామస్
    పల్లవి
    ఆది పినిశెట్టి
    అరుణ్
    మురళీ శర్మ
    పల్లవి తండ్రి
    తనికెళ్ల భరణి
    ఉమ గురువు
    పృధ్వీ రాజ్
    పల్లవి బావ
    రాజశ్రీ నాయర్ పల్లవి తల్లి
    మౌనిక
    పల్లవి అక్క
    విద్యుల్లేఖ రామన్
    పల్లవి స్నేహితురాలు
    కేదార్ శంకర్అరుణ్ తండ్రి
    శివకుమార్ రామచంద్రవరపు
    వినీత్ చంద్ర
    వినీత్ చంద్ర
    సిబ్బంది
    శివ నిర్వాణ
    దర్శకుడు
    డివివి దానయ్య
    నిర్మాత
    గోపీ సుందర్
    సంగీతకారుడు
    కోన వెంకట్
    స్క్రీన్ ప్లే
    కార్తీక్ గట్టమ్నేని
    సినిమాటోగ్రాఫర్
    ప్రవీణ్ పూడి
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
    True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించాయి. యాక్షన్‌, శృంగార సన్నివేశాలు, ఐటెం సాంగ్స్‌ ఇలాంటివి లేకపోయినా.. స్వచ్చమైన ప్రేమ, ఆకట్టుకునే కథ-కథనం, చక్కటి ప్రజెంటేషన్‌ ఉంటే చాలని అవి నిరూపించాయి. ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిలించి కొత్త రకం ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ (Sitaramam), ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్‌ ఇండస్ట్రీని సైతం ఈ చిత్రాలు కదిలించాయి. నార్త్‌ అభిమానుల ఫేవరేట్‌ చిత్రంగా మారిపోయాయి. మరి టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ మూవీలు ఏవి? అవి ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.  సీతారామం 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది.  హాయ్‌ నాన్న ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది.  సూర్య S/O కృష్ణన్ హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.  మజిలి తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.  నిన్ను కోరి హీరో ఒక యువతిని ఎంతగానో ఇష్టపడతాడు. అనూహ్యంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తొలత ఆమెను దక్కించుకోవాలని భావించినప్పటికీ చివరికీ ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు.  మళ్లీ మళ్లీ ఇది రాని రోజు రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.  ఓయ్‌ బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. తొలి ప్రేమ  టాలీవుడ్‌లో వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథా చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. విదేశాల నుంచి వచ్చిన యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆమెకు తన భావాలను చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. తిరిగి వెళ్లేపోతున్న క్రమంలో తానూ హీరోను లవ్‌ చేస్తున్నట్లు యువతికి అర్థమవుతుంది.  నిన్నే పెళ్లాడతా కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లడతా చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.  జాను శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు. 
    ఫిబ్రవరి 13 , 2024
    Kushi Movie Review: విజయ్‌ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్‌.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా? 
    Kushi Movie Review: విజయ్‌ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్‌.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా? 
    నటీనటులు: విజయ్‌ దేవరకొండ, సమంత, లక్ష్మీ, మురళీ శర్మ, జయరామ్‌, రోహిణి, సచిన్‌ ఖేడేకర్‌, శరణ్య, అలీ, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు దర్శకత్వం: శివ నిర్వాణ  సంగీతం: హేషమ్ అబ్దుల్‌ వహాబ్‌ సినిమాటోగ్రఫీ: మురళి. G నిర్మాత : చిరంజీవి పెదమల్లు, Y. రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లైగర్‌ లాంటి డిజాస్టర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రమిది. విజయ్‌కి జోడిగా సమంత అని ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ సూపర్‌ హిట్‌ సాధించడంతో ‘ఖుషి’పై హైప్‌ మరింత పెరిగింది. భారీ అంచనాల మధ్య ఇవాళ (సెప్టెంబర్‌ 1) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విజయ్, సమంత జోడీకి ఎన్ని మార్కులు పడ్డాయి? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.  కథ: ఈ సినిమా కథ కశ్మీర్‌లో ప్రారంభమవుతుంది. బుర్ఖాలో ఉన్న బేగం (సమంత)ను చూసి విప్లవ్ (విజయ్ దేవరకొండ) తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ పిల్ల తనదని ఫిక్స్ అవుతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో బేగం బ్రాహ్మిణ్ అని విప్లవ్‌కు తెలుస్తుంది. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో  పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా ‘ఖుషి’గా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల కాపురం కొత్త మలుపు తిరుగుతుంది. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.  ఎవరెలా చేశారంటే? విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. విప్లవ్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి అలరించాడు. అటు సమంత కూడా ఆరాధ్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో ఎంతగానో ఆకట్టుకుంది. తెరపై విప్లవ్‌, ఆరాధ్య పాత్రలు మాత్రమే కనిపించేంతలా విజయ్‌, సామ్‌ పోటీపడి నటించారు. వీరి మధ్య కెమెస్ట్రీ సైతం అద్భుతంగా కుదిరింది. అటు మురళీశర్మ, సచిన్‌ ఖేడేకర్‌, రోహిణి, లక్ష్మీ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. వెన్నెల కిషోర్‌, అలీ, రాహుల్‌ రామకృష్ణ కామెడీ నవ్వులు పూయించింది.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే? ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసే దర్శకుడు శివ నిర్వాణ. తన గత చిత్రాలైన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఖుషి కోసం రొటిన్‌ కథనే ఆయన ఎంచుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. పెళ్లి తర్వాత ఇది చేద్దాం.. అది చేద్దాం అని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంటలకు ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్లు బోరింగ్‌ అనిపిస్తాయి. మరికొన్ని సీన్లు ఎక్కడో చూసిన భావన కలిగిస్తాయి. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా శివ నిర్వాణ డైరెక్షన్‌ బాగుంది.  టెక్నికల్‌గా  ఖుషి సినిమాకు టెక్నికల్‌ అంశాలు చాలా బాగా ప్లస్‌ అయ్యాయి. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. సందర్భానుసారంగా వచ్చే సాంగ్స్‌ ఎంతో వినసొంపుగా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్‌ వహాబ్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అటు G. మురళి అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి మంచి ఎసెట్‌ అయ్యింది. ముఖ్యంగా కశ్మీర్‌ అందాలను ఆయన తన కెమెరా  పనితనంతో ఎంతో అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. నాణ్యత విషయంలో ప్రొడ్యుసర్లు ఎక్కడా రాజీపడినట్లు అనిపించలేదు.   ప్లస్‌ పాయింట్స్‌ విజయ్‌, సమంత నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ కథనంబోరింగ్‌ సీన్స్‌ రేటింగ్‌: 3/5
    సెప్టెంబర్ 01 , 2023
    Dasara: రూ.100 కోట్ల క్లబ్‌లో దసరా..! నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్
    Dasara: రూ.100 కోట్ల క్లబ్‌లో దసరా..! నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్
    Updated On 6-4-2023 రూ.100 కోట్ల క్లబ్‌లో.. నాని కెరీర్లో ఇప్పటివరకు చాలా సినిమాలు బంపర్ హిట్‌ సాధించాయి. కానీ, అధికారిక గణాంకాల ప్రకారం ఏ సినిమా కూడా రూ.100 కోట్లు వసూలు చేయలేదు. అయితే 'దసరా’తో నాని రూ.100 కోట్ల క్లబ్‌లో చేరతాడని YouSay ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగానే కేవలం 6 రోజుల్లోనే ‘దసరా’ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్‌ను సాధించింది. దీంతో నాని రూ. 100 కోట్లు సాధించిన టాలీవుడ్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. https://twitter.com/NameisNani/status/1643656266248777728 ఈ సారి శ్రీరామ నవమికే ‘దసరా’ పండుగ వచ్చేసింది. సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ‘దసరా’ మూవీ థియేటర్లలో జోరు చూపించింది. నాని మార్క్ యాక్టింగ్, మాస్ యాటిట్యూడ్, బలమైన ఎమోషన్స్, టేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో మార్చి 30న విడుదలైన ఈ చిత్రం అంతటా హిట్ టాక్‌ని తెచ్చుకోవడం విశేషం. ఈ క్రమంలో ఆడియెన్స్ దృష్టి సినిమా కలెక్షన్లపై పడింది. కచ్చితంగా భారీ వసూళ్లను రాబడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. పండితుల అంచనాలను కూడా అందుకుంటూ దసరా మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవర్‌సీస్‌లో ‘దసరా’ జోరు.. ఓవర్‌సీస్‌లోనూ ‘దసరా’ మూవీ అదరగొడుతోంది. యుఎస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓవర్‌సీస్‌లో దసరా కలెక్షన్స్‌ రూ.20 కోట్లు దాటినట్లు మేకర్స్‌ తెలిపారు. ఆస్ట్రేలియాలో దసరా కలెక్షన్స్‌ 2.47 లక్షల డాలర్లు దాటాయి. ఓవర్‌సీస్‌లో ఈ వికెండ్‌ కూడా వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అంతటా హౌస్ ఫుల్.. నాని కెరీర్‌లోనే అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకొచ్చిన సినిమా దసరా. పైగా, దేశవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు. సినిమాపై అంచనాలు పెరిగిపోవడం, ప్రమోషన్లు కూడా కలిసి రావడంతో ప్రేక్షకుల దృష్టి ‘దసరా’ వైపు మళ్లింది. దీంతో థియేటర్లలో సీట్లను ఆడియన్స్‌ ముందుగానే బుక్ చేసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, కొచ్చి, బెంగుళూరులలో సినిమా చూడటానికి జనం ఆసక్తి చూపించారు. దసరా హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో సీటు దొరకని పరిస్థితి ఏర్పడింది. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాంలలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ హవా చూస్తుంటే వీకెండ్‌లో ‘దసరా’ వసూళ్ల మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. https://telugu.yousay.tv/review-dussehra-movie-review-nani-showed-universal-form-with-ooramas-performance.html ఏప్రిల్ 7 వరకు పోటీలేదు.. హిట్ టాక్ పొందడంతో ‘దసరా’ సినిమా కనీసం రెండు, మూడు వారాల పాటు నాన్‌స్టాప్‌గా ఆడే అవకాశం ఉంది. దీంతో పాటు ‘దసరా’కు దరిదాపులో ఏ పెద్ద సినిమా కూడా విడుదల కావట్లేదు. అయితే ఏప్రిల్ 7న రవితేజ ‘రావణాసుర’ మినహాయిస్తే టాలీవుడ్‌లో బడా సినిమాల రిలీజ్‌లు లేవు. ఈ లెక్కన చూసుకుంటే ‘దసరా’కు తిరుగులేదనే చెప్పాలి. రావణాసుర చిత్రం టాక్‌ దసరా వసూళ్లపై ప్రభావం చూపొచ్చు. రవితేజ చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంటే ఈ వికెండ్‌ కూడా దసరా వైపే ప్రేక్షకులు మెుగ్గు చూపే అవకాశముంది. అదే జరిగితే నాని సినిమా రూ.150 కోట్లు వసూలు చేయడం ఏమంత కష్టం కాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాని కెరీర్‌లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలేంటో చూద్దాం.  దసరా రూ. 100 కోట్లు ఎంసీఏ రూ.70 కోట్లు  గ్యాంగ్ లీడర్ రూ.70 కోట్లు శ్యాంసింగరాయ్ రూ.65 కోట్లు నేను లోకల్ రూ.60 కోట్లు మజ్ను రూ.58 కోట్లు నిన్ను కోరి రూ.55 కోట్లు భలే భలే మగాడివోయ్ రూ.51 కోట్లు దేవదాస్ రూ.48 కోట్లు జెర్సీ రూ.45 కోట్లు అంటే సుందరానికి రూ.40 కోట్లు జెంటిల్‌మెన్ రూ.32 కోట్లు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కానీ, నాని ఇందులో పూర్తిస్థాయి హీరోగా నటించలేదు. Please Note... దసరా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తుందని తొలిసారిగా అంచనా వేసిన వెబ్‌సైట్ ‘YouSay’నే..!
    ఏప్రిల్ 06 , 2023
    Highest Grossing Movies of Nani: నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలు ఇవే!
    Highest Grossing Movies of Nani: నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలు ఇవే!
    నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తద్వారా తొలి 8 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.73.6 కోట్లు (GROSS) కొల్లగొట్టి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగువేస్తోంది. థియేటర్‌ ఆక్యుపెన్సీ ఏమాత్రం తగ్గకపోవడంతో రెండు మూడు రోజుల్లోనే ఈ ఫీట్‌ సాధించే అవకాశం స్పష్టం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.  [toc] దసరా (Dasara) నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'దసరా' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.120.4 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. రూ.55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం నాని కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా నిలిచింది. అటు తొలి రోజున రూ.38.7 కోట్లు కొల్లగొట్టి అత్యధిక డే1 వసూళ్లు రాబట్టిన నాని ఫిల్మ్‌గానూ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని అందుకునేందుకు 'సరిపోదా శనివారం' దూసుకెళ్తోంది. Budget : 55cr First Day Collection Worldwide : 38.7cr Worldwide Collection : 120.4cr Overseas Collection : 21.8cr India Gross Collection : 98.6cr ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రం నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఉంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100.3 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఇందులో నాని ఫుల్‌లెంగ్త్‌ పాత్ర చేయలేదు. అతడిది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. అందుకే ట్రేడ్‌ వర్గాలు నాని రూ.100 కోట్ల సినిమాల జాబితాలో ఈగను చేర్చలేదు. Budget : 30cr First Day Collection Worldwide : 6.5cr Worldwide Collection : 100.3cr Overseas Collection : 13.8cr India Gross Collection : 86.5cr హాయ్‌ నాన్న (Hi Nanna) నాని రీసెంట్‌ చిత్రం ‘హాయ్‌ నాన్న’ రూ.77.2 కోట్ల (GROSS) కలెక్షన్స్‌తో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. శౌర్యువ్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం తండ్రి కూతురు సెంటిమెంట్‌తో వచ్చింది. ఇందులో నానికి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. తొలి రోజున ఈ చిత్రం రూ.10.5 కోట్లు కొల్లగొట్టింది. నటుడిగా నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. Budget : 45cr First Day Collection Worldwide : 10.5cr Worldwide Collection : 77.2cr Overseas Collection : 18.5cr India Gross Collection : 58.7cr సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) నాని లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ప్రస్తుతానికి ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం రూ.73.6 కోట్ల (GROSS) కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్‌ వద్ద రన్‌ అవుతోంది. ఏ క్షణంలోనైనా ఈ జాబితాలో పైకి ఎగబాకవచ్చు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రూ.55 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరక్కించారు. తొలిరోజే ఈ సినిమా రూ.21.8 కోట్లు కొల్లగొట్టింది. మూడు రోజుల్లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది.  Language : Telugu Budget : 55cr First Day Collection Worldwide : 21.8cr Worldwide Collection : 73.6cr (still running) Overseas Collection : 22.4cr (still running) India Gross Collection : 51.4cr (still running) MCA మిడిల్‌ క్లాస్ అబ్బాయి (MCA: Middle Class Abbayi) నాని హీరోగా వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.72.6 కోట్లు రాబట్టింది. ఇందులో నానికి జోడీగా సాయిపల్లవి చేసింది. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి.  Budget : 25cr First Day Collection Worldwide : 15.6cr Worldwide Collection : 72.6cr Overseas Collection : 10.2cr India Gross Collection : 62.4cr నేను లోకల్‌ (Nenu Local) నాని, కీర్తి సురేష్‌ జంటగా చేసిన 'నేను లోకల్‌' చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. కేవలం రూ.15 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.61.2 కోట్లు (GROSS) వసూలు చేసింది. తద్వారా ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ నటుడిగా నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.  Budget : 15cr First Day Collection Worldwide : 9.7cr Worldwide Collection : 61.2cr Overseas Collection : 9.8cr India Gross Collection : 51.4cr నిన్ను కోరి (Ninnu Kori) శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఫిల్మ్‌ కూడా నాని కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో నాని లవ్‌ ఫెయిల్యూర్‌ అయిన యువకుడిగా నటించాడు. రూ.20కో ట్ల ఖర్చుతో రూపొందిన ఈ ఫిల్మ్‌ వరల్డ్‌వైడ్‌గా రూ.59.2 కోట్లు రాబట్టింది.  Budget : 20cr First Day Collection Worldwide : 10.6cr Worldwide Collection : 59.2cr Overseas Collection : 10.3cr India Gross Collection : 48.9cr జెర్సీ (Jersey) నటుడిగా నాని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'జెర్సీ'. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 58.7 కోట్లు రాబట్టింది. ఒక్క ఇండియాలోనే రూ. 47.3 కోట్లు తన ఖాతాలో వేసుకుంది.  Budget : 30cr First Day Collection Worldwide : 11.2cr Worldwide Collection : 58.7cr Overseas Collection : 11.4cr India Gross Collection : 47.3cr శ్యామ్‌ సింగరాయ్‌ (Shyam Singha Roy) పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.51.8 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఇందులో సాయి పల్లవితో పాటు కృతి శెట్టి హీరోయిన్‌గా చేసింది.  Budget : 40cr First Day Collection Worldwide : 11.7cr Worldwide Collection : 51.8cr Overseas Collection : 6.5cr India Gross Collection : 45.3cr భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన పదో చిత్రంగా ‘భలే భలే మగాడివోయ్‌’ నిలిచింది. మారుతీ డైరెక్షన్‌లో రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.50.2 కోట్లను రాబట్టింది. ఇందులో మతిమరుపు ఉన్న వ్యక్తిగా నాని అద్భుత నటన కనబరిచాడు.  Budget : 10cr First Day Collection Worldwide : 5.2cr Worldwide Collection : 50.2cr Overseas Collection : 11.6cr India Gross Collection : 38.6cr
    సెప్టెంబర్ 06 , 2024
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌  బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా (Happy Birthday Nani) వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని.. ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రీసెంట్‌గా ‘హాయ్‌ నాన్న’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ రెండు సినిమాలతో ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నానీ నిరూపించుకున్నాడు. లేటెస్ట్‌గా ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు ఈ నేచురల్‌ స్టార్ సిద్ధమవుతున్నాడు.  ఈ తరం యంగ్‌ హీరోలకు స్ఫూర్తిగా నిలిచిన నానికి (Happy Birthday Nani) ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఇవాళ నాని పుట్టిన రోజు  సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం? నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.  అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.  రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.   పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.  ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.  నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.  MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని (HBD Nani) మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.  నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.  జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని (HBD Nani) పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.  గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.  వి (2020) వి(V) సినిమాలో నాని  నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.  టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.  శ్యామ్‌ సింగరాయ్‌ (2021)  పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.  అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.  హాయ్‌ నాన్న (2023) నాని-మృణాల్ ఠాకూర్‌ కాంబినేషన్‌లో యువ డైరెక్టర్‌ శౌర్యువ్‌ రూపొందించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. గుండెలకు హత్తుకునే భావోద్వేగాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోమారు నానీ తన అద్భుతమైన నటనతో ఇందులో ఆకట్టుకున్నాడు.       మెుత్తంగా అష్టా చమ్మా నుంచి ‘హాయ్‌ నాన్న’ వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    ఫిబ్రవరి 24 , 2024
    Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్
    Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌  బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని ఇవాళ ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.  ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నిరూపించుకున్నాడు. దసరా మూవీ ఒక్కరోజులోనే రూ. 38కోట్లు రాబట్టిందంటే నాని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయంతో నాని ఎంతో మంది యంగ్ హీరోలకు ఆదర్శంగా మారాడు. ‌అయితే నానికి ఈ సక్సెస్ ఒక్కరోజులో వరించలేదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఈ నేపథ్యంలో నాని సినీ ప్రస్థానం ఎలా సాగింది?. నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.  అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.  రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.   పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.  ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.  నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.  MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.  నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.  జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.  గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.  వి (2020) వి(V) సినిమాలో నాని  నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.  టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.  శ్యామ్‌ సింగరాయ్‌ (2021)  పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.  అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.       మెుత్తంగా అష్టా చమ్మా నుంచి దసరా వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    మార్చి 31 , 2023
    <strong>Nayanthara: భర్తతో రొమాంటిక్‌ ఫొటోలు షేర్‌ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్‌!&nbsp;</strong>
    Nayanthara: భర్తతో రొమాంటిక్‌ ఫొటోలు షేర్‌ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్‌!&nbsp;
    తన భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) పుట్టినరోజును పురస్కరించుకొని నటి నయనతార (Nayanthara) తాజాగా కొన్ని స్పెషల్‌ ఫొటోలు షేర్‌ చేశారు.&nbsp; ఇందులో ఆమె ఆయన్ని ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ‘హ్యాపీ బర్త్‌డే మై ఎవ్రీథింగ్‌. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు. నువ్వు కన్న కలలు నిజం అయ్యేలా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. క్యూట్‌ కపుల్‌ అని పలువురు అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘నేనూ రౌడీనే’ సినిమా కోసం నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ తొలిసారి కలిసి వర్క్‌ చేశారు. ఆ సినిమా చిత్రీకరణలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది.&nbsp; ఆ స్నేహం కొద్ది కాలంలోనే ప్రేమగా మారింది. అలా సుమారు ఏడేళ్ల పాటు ఈ జంట ప్రేమించుకుంది.&nbsp; 2022లో పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సరోగసి విధానంలో ఇద్దరు కవల పిల్లలకు నయన్‌ జంట తల్లిదండ్రులయ్యారు.&nbsp;ఇద్దరు మగ పిల్లలకు ఉయిర్‌ రుద్రోనిల్‌ ఎన్‌.శివన్‌, ఉలగ్‌ దైవాగ్‌ ఎన్‌. శివన్‌ అని పేర్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే విఘ్నేశ్‌ శివన్‌ ప్రస్తుతం ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘అన్నపూరణి’ సినిమాకు గాను నయనతార (Nayanthara) ఉత్తమ నటిగా ఇటీవల సైమా అవార్డును సొంతం చేసుకుంది.&nbsp; నయనతార ప్రస్తుతం టెస్ట్‌’, ‘డియర్ స్టూడెంట్స్‌’, ‘తన్ని ఒరువన్‌ 2’ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.&nbsp; నయనతార వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె పుట్టుకతో మలయాళీ. మల్లువుడ్‌లో జయరాం నిర్మించిన ‘మనస్సినక్కరే’(2003) చిత్రంతో ఆరంగ్రేటం చేసింది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నయన్ పేరు మార్మోగిపోయింది. ఇక అప్పటి నుంచి నయన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో వరుస పెట్టి సినిమాలు చేసి సక్సెస్‌ అయ్యింది. అన్ని భాషల్లో తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది.&nbsp; ఈ అసాధారణ నటి తన జీవితంలో అతి పెద్ద తప్పిదాలు కూడా చేసింది. నయనతార వ్యక్తిగత జీవితంలో కూడా కష్ట సమయాలు ఉన్నాయి. తొలుత తమిళ నటుడు శింబుతో ప్రేమాయణం సాగించింది. శింబు వీరిద్దరి వ్యక్తిగత ఫొటోలను బయటపెట్టడంతో మనస్తాపానికి గురై అతడిని వదిలించుకుంది. ఆ తర్వాత నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపింది. ‘విల్లు’ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరి వ్యవహారం ప్రభుదేవా భార్య దృష్టికి వెళ్లడం, ఆమె ప్రభుదేవా నుంచి&nbsp; విడాకులు కోరడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ప్రభుదేవా నయనతారను పక్కనబెట్టాడు. ఈ పరిణామంతో నయనతార హతాశయురాలైంది. ఇది నయన్ జీవితంలో ఒక కోలుకోలేని దెబ్బ. ప్రభుదేవాతో బ్రేకప్ అనంతరం నయన్‌ జీవితంలోకి తమిళ డైరెక్టర్ విఘ్నేశ్‌ వచ్చాడు. అప్పటి నుంచి ఈ ‌అమ్మడు సినిమాల పరంగా వ్యక్తిగతంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో నయనతార అత్యధిక పారితోషికం తీసుకుంటోంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
    సెప్టెంబర్ 18 , 2024
    RAM CHARAN BIRTHDAY: గ్లోబల్‌ స్టార్‌తో ఉన్న ఫోటోలు పంచుకున్న సెలబ్రిటీలు
    RAM CHARAN BIRTHDAY: గ్లోబల్‌ స్టార్‌తో ఉన్న ఫోటోలు పంచుకున్న సెలబ్రిటీలు
    RRRతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన రామ్‌ చరణ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే #RC15 టైటిల్‌ అప్డేట్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తారలంతా చరణ్‌పై పుట్టిన రోజు శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. మహేశ్‌ బాబు, జూ. ఎన్టీఆర్ సహా అందరూ రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో కొంత మంది రామ్‌ చరణ్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుని తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాంటి అరుదైన ఫోటోలు మీకోసం కుమారుడు గ్లోబల్‌ స్టార్‌గా ఎదగడం..ఆస్కార్‌ వేదికపైకి వెళ్లడంతో పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు&nbsp; మెగాస్టార్ చిరంజీవి. కొడుకుకు ముద్దు పెడుతూ ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్నా’ అంటూ&nbsp; పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. https://twitter.com/KChiruTweets/status/1640209525277102080?s=20 మంచు ఫ్యామిలీలో ట్రోల్స్‌కు గురి కాని ఒకే ఒక్కడు మంచు మనోజ్‌. అందరితో కలుపుగోలుగా ఉంటూ వివాదాలకు దాదాపుగా దూరంగా ఉంటాడు. మోహన్‌ బాబు, చిరంజీవి మధ్య విబేధాలు ఉన్నట్లు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. కానీ మనోజ్ మాత్రం…రియల్లీ ప్రౌడ్‌ ఆఫ్‌ యూ మిత్రమా రియల్లీ సూపర్‌ డూపర్‌ హ్యాపీ బర్త్‌డే అంటూ రామ్‌ చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. https://twitter.com/HeroManoj1/status/1640258933918171136?s=20 బాలివుడ్‌ అందగాడు వివేక్‌ ఒబెరాయ్‌ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించాడు. క్రిష్‌, రక్త చరిత్ర వంటి సినిమాలతో అందరికీ సుపరిచితుడు. రామ్‌ చరణ్‌తో కలిసి వినయ విధేయ రామలో నటించిన వివేక్‌ ఒబెరాయ్‌ అప్పుడు తనతో దిగిన ఫోటోను పంచుకున్నారు. https://twitter.com/vivekoberoi/status/1640253518471913472?s=20 విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, KTR, రామ్‌ చరణ్‌తో కలిసి ఉన్న ఓ అరుదైన ఫోటోతో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. https://twitter.com/Ganta_Srinivasa/status/1640229869257887744?s=20 మెగా ఫ్యామిలీలో హాలివుడ్‌ కటౌట్‌ ఉన్న హీరో వరుణ్‌ తేజ్‌. చిన్నప్పటి నుంచి చరణ్‌తో కలిసి పెరిగిన వారే. ఇక ‘ఆట మొదలైంది’ అంటూ వరుణ్‌ తేజ్‌, రామ్‌చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. https://twitter.com/IAmVarunTej/status/1640261128071835648?s=20 RRR సినిమా తెర వెనక పనిచేసిన వారిలో రాజమౌళి తనయుడు కార్తికేయ ఒకరు. కార్తికేయ గురించి సినిమా ప్రమోషన్లలోనూ ఎన్టీఆర్, రామ్‌ చరణ్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. వీరి మధ్య మంచి బంధం కూడా ఉంది.&nbsp; ‘బ్రదర్‌ ఫ్రం అనదర్‌ మదర్‌’ అంటూ కార్తికేయ RRR సెట్‌లోని ఫోటో షేర్ చేశారు. https://twitter.com/ssk1122/status/1640258402285924354?s=20 రామ్‌ చరణ్‌తో రచ్చ సినిమా చేసిన సంపత్‌ నంది బ్రహ్మానందంతో కలిసి ఉన్న ఓ అపురూప చిత్రాన్ని పంచుకున్నారు. https://twitter.com/IamSampathNandi/status/1640230847315087361?s=20 యంగ్‌ సెన్సేషనల్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ కూడా రామ్‌ చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకుని శుభాకాంక్షలు చెప్పాడు. ప్రస్తుతం ఈ దర్శకుడి నుంచి ‘హనుమాన్‌’ అనే ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1640193538393804801?s=20 కియారా అద్వానీ, శంకర్‌ సహా ‘గేమ్ చేంజర్‌’ టీం రామ్‌ చరణ్‌కు కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు చెప్పింది. ఈ ఫోటోలతో కియారా కూడా ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. https://twitter.com/NP_App/status/1640266153653317632?s=20
    మార్చి 28 , 2023
    <strong>SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీపై నెటిజన్లు ఫైర్‌.. మరీ ఇలా చేశారేంటీ!</strong>
    SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీపై నెటిజన్లు ఫైర్‌.. మరీ ఇలా చేశారేంటీ!
    దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli)పై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్‌ ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో రాజమౌళిపై హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలబ్రిటీలు ప్రసంశల వర్షం కురిపించారు. అయితే ఈ డాక్యుమెంటరీ తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇలా ఎందుకు చేశారంటూ తీవ్ర స్థాయిలో నెటిజన్లు మండిపతున్నారు. వారి కోపానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏకీపారేస్తున్న నెటిజన్లు! దర్శకధీరుడు రాజమౌళి సాధించిన ఘనతలపై ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix) ఆగస్టు 2 నుంచి దీనిని ప్రసారం చేయనుంది. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తొలుత ఇంగ్లీష్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఆపై కొన్ని గంటల వ్యవధిలో తెలుగు వెర్షన్‌నూ తీసుకొచ్చారు. ఇంగ్లీషు వెర్షన్‌పై ప్రశంసలు కురిపించిన నెటిజన్లు తెలుగు ట్రైలర్‌ చూసి మాత్రం షాక్‌కి గురవుతున్నారు. ఆంగ్ల ట్రైలర్‌లో ప్రభాస్‌, రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ తమ సొంత వాయిస్‌తో రాజమౌళితో తమకున్న వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్నారు. తెలుగుకు (SS Rajamouli Documentary) వచ్చేసరికి రాజమౌళి సహా ఆ ముగ్గురు స్టార్ హీరోలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల చేత డబ్బింగ్‌ చెప్పించారు. తెలుగు సెలబ్రిటీలైన రాజమౌళి, ప్రభాస్‌, చరణ్‌, తారక్‌లకు వేరే వాళ్లతో డబ్బింగ్‌ చెప్పించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దానికి తోడు డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా పూర్‌గా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది తమనెంతో నిరాశకు గురిచేస్తోందని పోస్టులు పెడుతున్నారు. డబ్బింగ్‌ వల్ల డాక్యుమెంటరీని ఓన్‌ చేసుకోలేకపోతున్నట్లు ఫైర్ అవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికైనా తెలుగు డబ్బింగ్‌ విషయంలో పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=OTHKWEZilL4 డబ్బింగ్‌ చెప్పే సమయం లేదా? రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌ ఇంగ్లీష్‌ వెర్షన్‌లో ప్రభాస్‌, తారక్‌, రామ్‌చరణ్‌ తమ ఓన్‌ వాయిస్‌తో అభిప్రాయాలు తెలిపి తెలుగులో మాత్రం చెప్పకపోవడంపై వారిపైనా నెటిజన్లు మండిపడుతున్నారు. తెలుగు డైరెక్టర్‌కు సంబంధించి తొలిసారి ఓ డాక్యుమెంటరీ రూపొందుతుంటే ఇలా చేయడం సమంజసం కాదని అంటున్నారు. డబ్బింగ్‌ చెప్పే సమయం లేదా అంటూ నిలదీస్తున్నారు. ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ తెలుగులో ఆ స్టార్స్‌ డబ్బింగ్‌ చెప్పి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. అది దర్శకధీరుడికి ఇచ్చే నిజమైన గౌరవమని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు స్టార్‌ హీరోలకు మద్దతు తెలియజేస్తున్నారు. డాక్యుమెంటరీ మేకర్స్ హీరోల అభిప్రాయాలను కేవలం ఇంగ్లీషులోనే కలెక్ట్‌ చేసి ఉండొచ్చని అంటున్నారు. తెలుగులోనూ కోరి ఉంటే అప్పుడే తెలియజేసి ఉండేవారని మద్దతుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్‌పై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.&nbsp; రాజమౌళి గురించి మన స్టార్స్ ఏమన్నారంటే? ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో రానున్న ఈ డాక్యుమెంటరీలో (Netflix Documentary)&nbsp; రాజమౌళి సినీ ప్రయాణాన్ని చూపనున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళితో పనిచేసిన ప్రముఖుల అభిప్రాయాలను డాక్యుమెంటరీ మేకర్స్‌ అడిగి తెలుసుకున్నారు. వీడియో ప్రారంభంలో ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌, రమా రాజమౌళి, కరణ్‌జోహార్‌, జేమ్స్‌ కామెరూన్‌, రమా రాజమౌళి వంటి ప్రముఖులు దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. వారు ఏమన్నారంటే..&nbsp; ఇప్పటివరకు ఎవరూ చూపని స్టోరీలను ప్రపంచానికి తెలియజేయడం కోసమే రాజమౌళి పుట్టారు - ఎన్టీఆర్‌ ఇలాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమాలంటే ఆయనకు పిచ్చి ప్రేమ - ప్రభాస్‌ రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎవరితోనైనా పని చేయగలరు. ఆయనంటే నాకెంతో గౌరవం - జేమ్స్‌ కామెరూన్‌ ఆయన సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోతాను - రామ్‌చరణ్‌ ఈ దర్శకుడు ఓ లెజెండ్‌ - కరణ్‌ జోహార్‌ https://twitter.com/NetflixIndia/status/1815243072801763362 సెట్స్‌లో ఎన్నో మైక్స్‌ పగలడం చూశా: చరణ్‌ రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సెలబ్రిటీలకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆయనతో పని చేయడం ఎంత తలనొప్పో చెప్పాలంటూ ప్రశ్నించారు. అప్పుడు సెలబ్రిటీలు రాజమౌళితో తాము ఫేస్‌ చేసిన ఇబ్బందులను తెలియజేశారు. సెట్స్‌లో ఎన్నో మైక్స్‌ పగిలిపోవడం తాను చూశానంటూ రామ్‌చరణ్‌ చెప్పుకొచ్చారు. తాను రాజమౌళి పక్కన ఉన్నప్పుడు తన వస్తువులు పగలకుండా ఉంటే చాలు అని కోరుకునేవాడినని తెలిపారు. అటు జూ.ఎన్టీఆర్‌ మాట్లాడుతూ 'ఎలాంటి దయ, జాలి ఉండవు. తాను కోరుకున్నది రాబట్టుకోవడం, వెళ్లిపోవడం ఇలాగే చేస్తూ ఉంటాడు. అతను ఒక మ్యాడ్‌ పర్సన్‌' అని చెప్పుకొచ్చారు. భార్య రమా రాజమౌళి కూడా ఈ ట్రైలర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజమౌళితో పని చేసిన వారందరూ ఆయన్ని “పని రాక్షసుడని” పిలుస్తుంటారు' అని ఆమె చెప్పుకొచ్చారు.&nbsp; ఆస్కార్‌ కమిటీకి రాజమౌళి! దర్శకధీరుడు రాజమౌళికి ఇటీవల అస్కార్‌ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్‌ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్‌ సిద్వానీ, రవి వర్మన్‌ తదితరులు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.
    జూలై 23 , 2024
    <strong>Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్‌ సక్సెస్‌ చేసిన డైలాగ్స్‌ ఇవే..!</strong>
    Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్‌ సక్సెస్‌ చేసిన డైలాగ్స్‌ ఇవే..!
    ప్రభాస్‌ (Prabhas).. ప్రస్తుతం ఈ పేరు యావత్‌ సినీ లోకాన్ని ఊర్రూతలూగిస్తోంది. థియేటర్లలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రభజనం కొనసాగుతున్న వేళ.. అందరూ ప్రభాస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో అతడి నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ సీక్వెన్స్‌లో ప్రభాస్‌ అదరగొట్టాడని, ఇండియన్‌ సినిమా స్టాండర్డ్స్‌ను కల్కి టీమ్‌ గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు. మరి ముఖ్యంగా కల్కిలో ప్రభాస్‌ డైలాగ్స్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ డైలాగ్స్‌ కల్కిలో పడ్డాయని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ సహా కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె ఇతర ప్రధాన తారాగణం చెప్పిన డైలాగ్స్‌ను కూడా ఫ్యాన్స్‌ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ప్రేక్షకులను మిస్మరైజ్‌ చేసిన కల్కి డైలాగ్స్ ఏవి? అవి ఏ సందర్భంలో వచ్చాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; కల్కి మూవీ డైలాగ్స్‌ కల్కి సినిమా ప్రారంభంలో కురుక్షేత్రం ఎపిసోడ్‌ చూపిస్తారు. గర్భస్త శిశువుపై అస్త్రాన్ని వదిలి.. అశ్వత్థామ పెద్ద తప్పు చేస్తాడు. దీంతో శ్రీకృష్ణుడు అతడ్ని శపించే క్రమంలో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.&nbsp; అశ్వత్థామ : చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ. నీ ఉపదేశాలు వినడానికి నేను అర్జునుడ్ని కాదు.&nbsp; కృష్ణుడు : ఈ 18 రోజులు కురు క్షేత్రంలో జరిగిన పాపాల కన్నా.. నీ అధర్మం నిష్కృతమైనది. ధ్రోణాచార్యుడి పుత్రుడివి అయ్యుండి ఇంతకు దిగజారావా? అశ్వత్థామ : నా తండ్రి పేరు పలికే అర్హత నీకు లేదు. నువ్వు అనుకుంటే అతడి మరణాన్ని ఆపగలిగేవాడివి. కృష్ణుడు : అశ్వత్థామ.. దేవుడైనా క్రురుడైనా కర్మను తప్పించుకోలేరు. గర్భస్త శిశువుపై అస్త్రం వదిలావు. నీ ఖర్మ నువ్వు అనుభవించక తప్పదు.&nbsp; అశ్వత్థామ : అయితే సంధించు చక్రం.. విధించు నీ శిక్షని. కృష్ణుడు : చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ.. అది విముక్తి. కాలాంతరం పాండవులు అందరూ చనిపోతారు. నా శరీరమూ మరణిస్తుంది. ఈ యుగం అంతరిస్తుంది. కానీ, నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక.. చావు రాక.. బ్రతకలేక.. ఎన్నో పాపాలు చూస్తూ జీవిస్తావు. ఇదే నా శాపం. అశ్వత్థామ : మరి నా శాపానికి ప్రాయిశ్చిత్తం లేదా? కృష్ణుడు : నువ్వు నన్ను చంపాలనుకున్నావ్‌.. కానీ ఒక రోజు నువ్వే నన్ను కాపాడాలి.&nbsp; అశ్వత్థామ : నేనా? కృష్ణుడు : కలియుగం వస్తుంది. కలి వస్తున్నాడు. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటి అయినప్పుడు నేను మళ్లీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి మహా శక్తిశాలి. ఎంత శక్తివంతుడు అంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భ గుడికి కాపలా కాయాలి. డైలాగ్‌ కాంప్లెక్స్‌ ఒక యువకుడిపై 5000 యూనిట్స్‌ నజరానా ప్రకటిస్తుంది. అతడ్ని పట్టుకునేందుకు ఓ గ్యాంగ్ వెళ్తుంది. ఈ సందర్భంలో పారిపోతున్న ఆ వ్యక్తికి బుజ్జి (AI వెహికల్‌).. సంకెళ్లు వేస్తుంది. అప్పుడు బుజ్జిపై విలన్‌ గ్యాంగ్‌ కాల్పులు జరుపుతారు. దీంతో బుజ్జి తన బాస్‌ భైరవ (ప్రభాస్‌)ను పరిచయం చేస్తూ బైరవకు ఎలివేషన్స్ ఇస్తుంది. బుజ్జి : హేయ్‌.. స్టాప్‌. నన్ను షూట్‌ చేస్తావా. ఇప్పుడు చూడు నా బాస్‌ వచ్చి మీ అందరిని స్మాష్‌ చేస్తాడు. విలన్‌ గ్యాంగ్‌: ఎవరు మీ బాస్‌? బుజ్జి : పాత యుద్ధాల్లో సోల్జర్‌. ఇంత వరకూ&nbsp; ఒక్క యుద్ధంలో ఓడిపోలేదు. ది వన్‌ అండ్‌ ఓన్లీ భైరవ (ఈ డైలాగ్‌ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు) భైరవ: ఎంట్రీ అనంతరం భైరవ నేలపై గురక పెట్టి నిద్ర పోతాడు.. బుజ్జి : భైరవ గెటప్‌.. చాలా బిల్డప్‌ ఇచ్చాను లే. భైరవ: బుజ్జి.. బుజ్జి.. ప్లీజ్‌ 5 మినిట్స్‌ పడుకుంటాను. (దీని తర్వాత ప్రభాస్‌ ఎంట్రీ ఫైట్‌ ఉంటుంది) డైలాగ్‌ సుప్రీమ్‌ యాస్కిన్‌ (కమల్‌ హాసన్‌).. కాంప్లెక్స్‌లో తన మనుషుల చేత గర్భిణి స్త్రీలపై ప్రయోగాలు చేయిస్తుంటాడు. దీంతో యాస్కిన్‌ బృందంలోని ఒక సైంటిస్టు అతడ్ని చంపడానికి యత్నిస్తాడు. యస్కిన్‌.. ఆ సెంటిస్టును చంపుతూ చెప్పే డైలాగ్స్‌ మెప్పిస్తాయి.&nbsp; సుప్రీమ్‌ యాస్కిన్‌: చావుకు నేను చాలా ప్రాణాలు ఇచ్చాను. అది నన్నేం చేయదు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకు నన్ను చంపాలనుకున్నావ్‌? సైంటిస్టు : మంచి కోసం..&nbsp; సుప్రీమ్‌ యాస్కిన్‌ : మంచి.. చరిత్రలో ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసా ఈ మంచి. రాజులు రాజ్యాలు మారుతున్న ప్రతీసారి మారుతుందీ మంచి. దాన్ని నమ్మోద్దు. ఇంతకీ నీకేం కావాలి? సైంటిస్టు : ఈ లోకాన్ని కాపాడాలి సుప్రీమ్ యాస్కిన్‌ : అదే కదా.. నేనూ చేసింది. దేవుడిని, డబ్బులని, వందల యుద్ధాలు చేసే అందరినీ ఒక్క యుద్ధంతో గెలిచాను తప్పా?. మీరు బూడిద చేస్తున్న ప్రకృతిని అందనంత దూరంలో పెట్టాను.. తప్పా? సైంటిస్టు : నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి నువ్వు ఎవరు? సుప్రీమ్‌ యాస్కిన్‌ : మరి నాశనం చేయడానికి మీరు ఎవరు? ఎన్ని యుగాలు అయినా.. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు.. మారలేడు. ఇది నీ తప్పు కాదులే. హ్యూమన్‌ బీయింగ్స్‌కు ఉన్న డిఫెక్టే అది.&nbsp; డైలాగ్‌ కల్కిని గర్భంలో మోస్తున్న సుమతి (దీపిక పదుకొణె)ని.. సుప్రీమ్‌ యస్కిన్‌ మనుషుల నుంచి కాపాడి అశ్వత్థామ శంబాలకు తీసుకు వస్తాడు. అప్పుడు శంబాలకు రక్షణాధికారిగా ఉన్న వ్యక్తి సుమతి ఎవరో తెలియక అడ్డుకుంటాడు. సందర్భంలో వచ్చే సీన్‌, డైలాగ్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. రక్షణాధికారి : ఆమెను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావు. 5 మిలియన్ పౌండ్లు పెట్టారు ఈమె మీద. కాంప్లెక్స్‌ మాత్రమే కాదు వరల్డ్‌లో ప్రతీ ఒక్కరు ఆమె కోసం వెతుకున్నారు. ఎలా కాపాడతావు? అశ్వత్థామ : నేను కాపాడతాను రక్షణాధికారి : అసలు నువ్వు ఎవరు? పొడుగ్గా ఉంటే సరిపోదు. ఎప్పుడైనా యుద్ధం చేశావా? అశ్వత్థామ గురించి తెలిసిన బాలుడు: ఎక్స్‌క్యూజ్‌మీ.. మహాభారతంలో శ్రీకృష్ణుడితోనే యుద్ధం చేశాడు.. ఓకే. (ఇక్కడ హైలెట్‌ బీజీఎం వస్తుంది) రక్షణాధికారి : అందరికీ పిచ్చి ఎక్కిందా? ఈమె (సుమతి) ఇక్కడి రావడం వల్ల అందరికీ ఎంతో డేంజరో అర్థమవుతుందా? తను జస్ట్‌.. ల్యాబ్‌ నుంచి ఎస్కేప్‌ అయిన మామూలు ప్రెగ్నెంట్‌ ఉమెన్‌. ఏమీ స్పెషల్‌ ఉమెన్‌ కాదు. అయినా పుట్టేది దేవుడు అనడానికి ఏంటీ సాక్ష్యం. *ఆ డైలాగ్‌ అనగానే వెంటనే వర్షం మెుదలవుతుంది. అక్కడ వాన పడి చాలా కాలమే అయి ఉంటుంది. ఆమె రాకతో వర్షం పడటంతో కల్కి జన్మించేది ఆమె కడుపునే అని శంబాలా ప్రజలు నమ్ముతారు. ఈ సీన్‌ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. డైలాగ్‌ మహావిష్ణువు.. కల్కిగా పుట్టేందుకు తననే ఎందుకు ఎంచుకున్నాడని సుమతి (దీపిక).. అశ్వత్థామను ప్రశ్నిస్తుంది. ఆ సందర్భంలో వచ్చే డైలాగ్స్‌ మిస్మరైజింగ్‌ చేస్తాయి.&nbsp; అశ్వత్థామ : నువ్వు ప్రాణం ఇవ్వడానికే పుట్టావ్‌ అమ్మా? సుమతి : అసలు ఏం మాట్లాడుతున్నారు. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకా ఎంత మంది చనిపోవాలి? అశ్వత్థామ : ప్రతీ చావుకి ఒక పరమార్థం ఉంటుంది. ప్రతీ చావు లోకానికి కొత్త ఊపిరి పోస్తుందమ్మా. సుమతి : కానీ, నేనే ఎందుకు? అశ్వత్థామ : మోయగలిగిన శక్తి ఉన్నవారికే బాధ్యతను ఇస్తాడు ఆ దేవుడు. భగవంతుడ్ని కడుపులో మోయాలంటే భూదేవి అంత ఓర్పు ఉండాలి. మీలో ఆ ఓర్పు ఉందనే మిమ్మల్ని తల్లిగా ఎంచుకున్నారు.&nbsp; అశ్వత్థామ: నువ్వు ఇప్పుడు కనబోయేది మాములు ప్రాణం కాదమ్మ.. సృష్టిని. జన్మనివ్వడం నీ ధర్మం కాపాడటం నా బాధ్యత. డైలాగ్‌ శంబలకు తీసుకెళ్లిన సుమతి తనకు కావాలని కాంప్లెక్స్‌ ప్రతినిధి చటర్జీ తన మనుషులతో అంటాడు. అన్ని డైరెక్షన్స్‌లో రైడర్స్‌ పంపాం.. త్వరలోనే పట్టుకుంటామని అతని కమాండర్ చెబుతాడు. అప్పటికే అశ్వత్థామతో యుద్ధం చేసిన ప్రభాస్‌.. ఏమి చేయలేరని అంటాడు. ఈ సందర్బంలో ఛటర్జీతో అతడి సంభాషణ ఆకట్టుకుంటుంది. భైరవ : ఆ ముసలోడు ఉన్నంతవరకూ ఏం చేయలేరు. ఛటర్జీ : ముసలోడా? భైరవ : మీ వాళ్లందరినీ కొట్టింది అతడే? ఒక్కడు కూడా వాడ్ని టచ్‌ చేయలేదు. నేను తప్పా. ఛటర్జీ : వీడెవడు అసలు? కమాండర్‌: భైరవ అని బౌంటీ ఎంటర్‌ సర్‌. మన వాళ్లని కొడితే బ్లాక్‌ లిస్ట్‌ చేశాను.&nbsp; భైరవ: ఎలాగైనా బ్లాక్‌ లిస్ట్‌ చేశావు కదా. మళ్లీ కొడతా. పాయింట్‌ ఏంటి అంటే నేను ఒక్కడినే ఆ అమ్మాయిని తీసుకురాగలను. మీకు వేరే ఆప్షన్‌ లేదు.&nbsp; ఛటర్జీ : అంత ష్యూర్‌ ఆ..&nbsp; భైరవ : రికార్డ్స్‌ చూసుకో.. ఇంతవరకూ ఒక్క ఫైట్‌ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను.&nbsp; డైలాగ్‌ కల్కి క్లైమాక్స్‌లో.. కమల్‌ హాసన్‌ మీద వచ్చే సీన్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. శక్తిని పుంజుకున్న తర్వాత ఆయన చెప్పే 'జగన్నాథ రథచక్రాల్‌ వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌.. రథచక్ర ప్రళయఘోళ భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను'.. అనే డైలాగ్‌ సెకండ్‌ పార్ట్‌లో తాను ఎంత విధ్వంసం సృష్టిస్తానో తెలియజేస్తుంది. అయితే ఈ డైలాగ్‌ శ్రీశ్రీ మహా ప్రస్థానం లోనిది. 44 ఏళ్ల క్రితం ఆకలి రాజ్యం సినిమాలో ఇదే డైలాగ్‌ను కమల్‌ హాసన్ చెప్తారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అతడి నోట శ్రీశ్రీ కవిత వినిపించడం ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది.&nbsp; View this post on Instagram A post shared by TELUGU SONGS OLD (@telugu_songs_old) డైలాగ్‌ కల్కిలో అప్పటివరకూ భైరవగా ఉన్న ప్రభాస్‌.. చివరి భాగంలో కర్ణుడిగా కనిపించి అందరికీ షాకిస్తాడు. చివరి పది నిమిషాల మహాభారతం ఎపిసోడ్‌లో కర్ణుడిగా కనిపించి స్క్రీన‌ను షేక్‌ చేస్తాడు.&nbsp; ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్‌ విల్లు పట్టుకుని రథంపై నిలబడగా.. థియేటర్‌ మొత్తం దద్దరిల్లిపోయింది. భైరవను కర్ణుడిగా పరిచయం చేసే సందర్భంలో వచ్చే కురుక్షేత్రంలోని డైలాగ్స్‌ విజిల్స్‌ వేయిస్తాయి.&nbsp; అర్జునుడు : అశ్వత్థామ.. తలరాతను రాసే బ్రహ్మ చేసిన గాంఢీవం ఇది. దీనిని ఎవరు అడ్డుకోలేరు. కర్ణుడు: ప్రభాస్‌ ఎంట్రీ ఇచ్చి అర్జునుడు వేసిన బాణాన్ని నిలువరిస్తాడు. ఆ సందర్భంలో ఆలస్యమైందా ఆచార్య దేవా? అని అశ్వత్థామతో అంటాడు. అశ్వత్థామ: లేదు.. సరైన సమయంలోనే వచ్చావు.&nbsp; అర్జునుడు: చూశావా.. కేశవ (కృష్ణుడు). తను నాకు సమానుడా? వాడ్ని (కర్ణుడు) అడ్డుకొని మన రథం కేవలం రెండు అడుగులు వెనక్కి వెళ్లింది. నా అస్త్రానికి అతడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్లింది.&nbsp; కృష్ణుడు : ఓ ధనుంజయ.. నీ రథం అగ్నిదేవుడి వరం. కాపాడుతున్నదని జెండాపై కపిరాజు (హనుమంతుడు).&nbsp; నడుపుతున్నది ముల్లోకాలు నడిపించే నేను. అయినా రెండడుగులు వెనక్కి తోశాడంటే ఆలోచించు అర్జునా.&nbsp; కృష్ణుడు: తను (కర్ణుడు) సామాన్య యోధుడు కాదు. తన కళ్లల్లోని తేజస్సు.. తన చేతిలోని ధనస్సు.. తన పేరు.. చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. సూర్య పుత్ర వైకర్ణ.. కర్ణ. (ఈ డైలాగ్‌తో కల్కి తొలిపార్ట్‌ ముగుస్తుంది).
    జూలై 02 , 2024
    Niharika Konidela Divorce: అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా? నిహారిక- చైతన్య, సమంత- నాగచైతన్యకు కలిసి రాని డెస్టినేషన్ వెడ్సింగ్స్!
    Niharika Konidela Divorce: అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా? నిహారిక- చైతన్య, సమంత- నాగచైతన్యకు కలిసి రాని డెస్టినేషన్ వెడ్సింగ్స్!
    మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, మాజీ ఐజీ ప్రభాకరరావు కుమారుడు చైతన్యలకు విడాకులు మంజూరు అయ్యాయి. ఏప్రిల్ 1న పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. జూన్ 5న వీరికి డైవర్స్ మంజూరు అయ్యాయి. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. 2020 డిసెంబర్‌లో నిహారిక, చైతన్యల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత 2 ఏళ్లపాటు ఈ జంట బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో కొద్దికాలం దూరంగా జీవనం సాగించారు. ఆ తర్వాత ఇక కలిసి ఉండలేమని భావించి పరస్పర అంగీకారంతో విడిపోయారు.  విడాకులకు అసలు కారణం ఇదేనా? నిహారిక- చైతన్య జొన్నలగడ్డ వివాహం తర్వాత నిహారిక చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. ఒకసారి ఓ పబ్‌ పార్టీలో నిహారిక పేరు వినిపించడం అప్పట్లో తెగ వైరల్ అయింది. ఓసారి అపార్ట్‌మెంట్‌ వాళ్లతో గొడవతో నిహారిక మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో చైతన్య- నిహారికల మధ్య మనస్పర్థలు పెరిగి విడాకులకు దారితీసినట్లు సమాచారం. పెళ్లికి ముందు గారాల పట్టిగా పెరిగిన నిహారిక వివాహా అనంతరం కాస్త ఫ్రీడమ్‌ను కోల్పోయినట్లు తెలిసింది. https://twitter.com/Ferrari_Monk/status/1676291467445440512?s=20 విడాకులపై నిహారిక స్పందన చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకోవడంపై మెగా డాటర్‌ నిహారిక తొలిసారి స్పందించింది. తాము పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ఈ సున్నిత సమయంలో తమని ఇబ్బంది పెట్టవద్దని కోరింది. అభిమానులు సంయమనం పాటించాలని కోరింది.&nbsp; కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితంలో తాము ప్రైవసీని కోరుకుంటున్నట్లు పోస్టులో తెలిపింది. దీనిని అందరూ గౌరవించి&nbsp; సహకరించాలని నిహారిక కోరింది. ఇంత కాలం తనకు అండగా ఉన్న కుటుంబసభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు అంటూ తన పోస్టును నిహారిక ముగించింది. https://twitter.com/SureshPRO_/status/1676474938033840128?s=20 చైతన్య ఎమన్నారంటే? నిహారికతో విడాకుల నేపథ్యంలో చైతన్య జొన్నలగడ్డ చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటా. 10 రోజులుగా నా జీవితంలో వచ్చిన 'విపాసన' ప్రక్రియ అద్భుతం. మనం ఒక ప్రాంతానికి ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి.. అద్భుత జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది కూడా అలాంటిదే అని పోస్ట్ పెట్టాడు. కాగా ప్రస్తుతం చైతన్య మానసిక ప్రశాంతత పొందేందుకు ముంబైలోని విపాసన మెడిటేషన్ సెంటర్‌లో ఉన్నట్లు తెలిసింది. అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా? టాలీవుడ్‌లో సమంత- నాగచైతన్య (Samantha- Nagachithanya) విడాకులు పొందిన తీరును కొంతమంది.. నిహారిక- చైతన్య డైవర్స్‌తో పోలుస్తున్నారు. ఈ రెండు జంటలు సొంత ప్రాంతంలో కాకుండా బయటి ప్రదేశంలో (డెస్టినేషన్ వెడ్డింగ్) వివాహం చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిహారిక- చైతన్య..  2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లో గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination wedding) చేసుకున్నారు. అలా చేసుకున్న రెండేళ్లకే ఈ జంట విడిపోయింది.  అంతకు ముందు 2017 అక్టోబర్ 6న గోవాలో నాగచైతన్య- సమంత ఇదే తరహాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ జంట కాపురం కూడా కొద్ది కాలం సజావుగానే సాగింది. ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో 2021లో విడిపోయారు. దీంతో ఫ్యాన్స్ టాలీవుడ్ సెలబ్రెటీలకు డెస్టినేషన్ మ్యారెజెస్ కలిసి రావడం లేదని వాదిస్తున్నారు. వరుణ్ తేజ్‌- లావణ్య త్రిపాఠి అయినా ఇక్కడే పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నారు.
    జూలై 05 , 2023
    RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్‌ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
    RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్‌ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
    టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ రాకేష్‌ మాస్టర్‌&nbsp; తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే రాకేష్ మాస్టర్ మృతి కారణాల పట్ల సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాకేష్ మాస్టర్ చనిపోవడానికి ఏపీలో అమ్ముతున్న చీప్ లిక్కర్, కల్తీ మద్యమే కారణమని వైసీపీ సర్కారును ట్రోల్ చేస్తున్నారు. అక్కడ విరివిగా లభించే 'బూమ్ బూమ్' బీర్లను రాకేశ్ మాస్టర్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయి ప్రాణాలు కోల్పోయారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు వీడియోలను షేర్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/mana_Prakasam/status/1670462301533765632?s=20 ఏపీలో మద్యపానం నిషేధం పేరిట తొలుత మద్యం ధరలు భారీగా పెంచారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత నకిలీ, కల్తీ మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చి విచ్చలవిడిగా అమ్ముతున్నారనీ ఆరోపించారు.&nbsp; వీటి తయారీ వెనుక ఉన్నది వైసీపీ నేతలే ఉన్నారని గతంలో&nbsp; ప్రతిపక్షాలు కూడా పెద్దఎత్తున విమర్శించిన సంగతి తెలిసిందే. బ్రాండెడ్ మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాదని.. అందుకే చీప్ మద్యానికి అనుమతించారని కామెంట్లు చేస్తున్నారు. కల్తీ మద్యానికి రాకేష్ మాస్టర్ బలి అయ్యారని పోస్టులు పెడుతున్నారు. https://twitter.com/apramayanam/status/1670464153348190209?s=20 మరణం ముందే తెలుసు.. ఎప్పుడూ యూట్యూబ్‌లో ఎంటర్‌టైన్ చేసే రాకేష్ మాస్టర్ మృతిని చూసి తట్టుకోలేని అభిమానులు ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. రాకేష్ మాస్టర్ తాను చనిపోతాననే విషయం తనకు ముందే తెలుసు. తన అనారోగ్యం గురించి తెలిసినా... అందర్ని నవ్విస్తూ కడుపులోనే తన బాధను దాచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రాకేశ్ మాస్టర్ మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. "నా శరీరంలో మార్పు కనిపిస్తోంది. అది నాకు తెలుస్తోంది. నువ్వు ఉదయించే సూర్యుడివి నువ్వు  అయితే… నేను అస్తమించే సూర్యుడిని. అమ్మా, నాన్నలను బాగా చూసుకో'' అంటూ వీడియోలో చెబుతున్నట్లు ఉంది. దీంతో తాను చనిపోతానన్న విషయం తనకు ముందే తెలుసని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. https://twitter.com/Devineni_Hari/status/1670424465300402177?s=20 రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్యూ ఇచ్చిన రాకేష్ మాస్టర్ తన చివరి కోరిక ఏమిటో చెప్పారు. ఆయన చనిపోయాక ఎక్కడ సమాధి చేయాలో పేర్కొన్నారు. 'ఇల్లు, దుస్తులు, శరీరం ఏదీ శాశ్వతం కాదు. నా మామగారి సమాధి పక్కన వేప మెుక్క నాటా. దాన్ని పెంచుతా. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండని యూట్యూబ్ ఛానెల్స్‌కు విజ్ఞప్తి చేశా' అని మాస్టర్‌ అన్నారు.&nbsp; డాక్టర్లు ఏమన్నారు? &nbsp;రాకేశ్ మాస్టర్ మృతిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు బులెటెన్ విడుదల చేశారు. ఉదయం రక్త విరేచనాలు కావడంతో మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో రాకేష్ మాస్టర్ అడ్మిట్ అయ్యారు. ఆయనకు డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ తీవ్రంగా ఉండటంతో శరీరంలోని చాలా అవయవాలు దెబ్బతిన్నాయి అని&nbsp; గాంధీ సూపరింటిండెంట్ రాజారావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మాస్టర్ తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు. ప్రభాస్‌కు డ్యాన్స్ శిక్షణ రాకేశ్ మాస్టర్‌కి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. కెరీర్ ఆరంభంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరో వేణు ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కంటెస్టెంట్‌కు మాస్టర్‌గా వ్యవహరించాడు. ఆయన మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది. https://twitter.com/CreatorYog/status/1670510684935962625?s=20
    జూన్ 19 , 2023
    Mrunal Thakur : నెటిజన్లతో మృణాల్‌ ముచ్చట్లు… సీతారామం 2 సినిమాపై క్లారిటీ..!
    Mrunal Thakur : నెటిజన్లతో మృణాల్‌ ముచ్చట్లు… సీతారామం 2 సినిమాపై క్లారిటీ..!
    సీతారామం చిత్రంలో సీతగా నటించిన మృణాల్‌ ఠాకూర్‌ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ భామ అందం, అభినయం, నటన.. సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. సీతారామంలో ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలంగా తన హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. బోల్డ్‌ లుక్‌లో ఉన్న మృణాల్‌ను చూసి ఆమె ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాాగా మృణాల్‌ ట్విటర్‌ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. #askmrunal పేరుతో నెటిజన్ల ప్రశ్నలను ఆహ్వానించింది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన ప్రతీ ప్రశ్నకు మృణాల్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నలు, సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ప్రశ్న: మీకు కెనడియన్‌ యాక్టర్‌ కీను రీవ్స్‌తో నటించే అవకాశం వస్తే ఎలా ఫీలవుతారు? మృణాల్‌: సంతోషం, ఆనందం, ఆశ్చర్యాన్ని తెలియజేసే ఎమోజీస్‌&nbsp; https://twitter.com/mrunal0801/status/1645117683267170306 భారత్‌లో బ్రిటన్ రాయబారి: మనం రెండేళ్ల క్రితం కలిసి విమాన ప్రయాణం చేశాం. మీరు సాధించిన విజయాలకు నా అభినందనలు. మృణాల్‌: మీ నుంచి ఈ మాటలు వినడం చాలా సంతోషం. ఆ రోజు సినిమాలపై మన మధ్య జరిగిన సంభాషణ ఇప్పటికీ నాకు గుర్తింది. https://twitter.com/mrunal0801/status/1645084379264237570 ప్రశ్న: హైదరాబాద్‌లో నాని 30 సినిమా షూటింగ్‌లో మిమ్మల్ని కలిశాను. మీరు చాలా బాగా మాట్లాడారు. ఇంతపెద్ద స్టార్‌గా ఎదగడానికి మీ వినయమే కారణం అనుకుంటా. మృణాల్‌: థ్యాంక్యూ https://twitter.com/mrunal0801/status/1645078658900525056 ప్రశ్న: సీతారామంలో సీతా మహాలక్ష్మీగా మీ నటన చూసి ఫ్యాన్‌ అయిపోయా. ఆ సినిమా గురించి ఏమైన చెప్పండి. మృణాల్‌: సీతారామం నిజంగా ఓ అద్భుతం. https://twitter.com/mrunal0801/status/1645067329078804482 ప్రశ్న: బాలీవుడ్ or సౌత్‌&nbsp; మృణాల్‌: ఇండియన్ సినిమా. https://twitter.com/mrunal0801/status/1645062867035496451 ప్రశ్న: తెలుగులో ఒక మాట మాట్లాడండి? మృణాల్‌: మళ్లీ మెుదలు https://twitter.com/mrunal0801/status/1645062753697103875 ప్రశ్న: సీతారామం 2 కు అవకాశం ఉందా? మృణాల్: నాకూ తెలీదు. కానీ ఉండాలని కోరుకుంటున్నా https://twitter.com/mrunal0801/status/1645028690697519104 ప్రశ్న: మీరు నటించిన గుమ్రా మూవీ చూశా. యాక్షన్‌ మూవీలో నిన్ను చూడటం చాలా ఎక్జైటింగ్‌గా అనిపించింది. కేవలం నీ కోసమే మా పేరెంట్స్‌ను సినిమాకు తెసుకెళ్లాలని అనుకుంటున్నా. మృణాల్‌: మీ తల్లిదండ్రులకు నా ప్రేమను తెలియజేయండి. వారు సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. https://twitter.com/mrunal0801/status/1645060359915556864 బాలీవుడ్‌లో మృణాల్‌ నటించిన గుమ్రా మూవీ ఏప్రిల్‌ 7న విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో పోలీసు ఆఫీసర్‌గా మృణాల్‌ నటన ఆకట్టుకుంది. హీరో ఆదిత్య రాయ్‌ కపూర్‌కు పోటీగా నటించి మృణాల్‌ మెప్పించింది. తొలి మూడు రోజుల్లో గుమ్రా మూవీ రూ.15కోట్ల గ్రాస్‌ సాధించినట్లు మేకర్స్‌ ప్రకటించారు.&nbsp;
    ఏప్రిల్ 10 , 2023
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.&nbsp; ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో&nbsp; ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు&nbsp; ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్&nbsp; ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి&nbsp; శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్&nbsp; నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక&nbsp; కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి&nbsp; మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&nbsp; ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్&nbsp; పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ&nbsp; సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:&nbsp; హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.&nbsp; సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి&nbsp; జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా&nbsp; బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం&nbsp; దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-&nbsp; యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.&nbsp; ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-&nbsp; జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు&nbsp; రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.&nbsp; ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.&nbsp; మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో&nbsp; ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి&nbsp; దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,&nbsp; కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి&nbsp; రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.&nbsp; ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ &nbsp;ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని&nbsp; ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా&nbsp; దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.&nbsp; మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.&nbsp; ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే&nbsp; చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.&nbsp; భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్‌ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.&nbsp; తొలి ప్రేమ (Tholi Prema) వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.&nbsp; ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade) నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్‌ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్‌ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్‌ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.&nbsp; అష్టా చమ్మా (Ashta Chamma) నాని, అవసరాల శ్రీనివాస్‌, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్‌ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్‌ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.&nbsp; అలా మెుదలైంది (Ala Modalaindi) డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్‌ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్‌ ఫెయిల్‌ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.&nbsp; సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan) హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.&nbsp; మజిలి (Majili) తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.&nbsp; ఓకే బంగారం (Ok Bangaram) ప్రస్తుత కాలంలో డేటింగ్‌ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.&nbsp; ఏ మాయ చేశావే (Ye Maya Chesave) తెలుగులో వచ్చిన ఎవర్‌గ్రీన్‌ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్‌ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.&nbsp;&nbsp; పెళ్లి చూపులు (Pelli Chupulu) తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్‌ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్‌ బిజినెస్‌లో భాగమై సక్సెస్‌ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.&nbsp; సీతారామం (Sita ramam) 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన చిత్రాల్లో సూపర్‌ క్లాసిక్‌ మూవీగా దీన్ని చెప్పవచ్చు.&nbsp; హాయ్‌ నాన్న (Hi nanna) ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్‌ నాన్న తప్పకుండా ఉంటుంది.&nbsp; మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju) రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.&nbsp; ఓయ్‌ (Oye) బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha) కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి (Raja Rani) ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు. జాను (Jaanu) శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.&nbsp; గోదావరి (Godavari) శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్‌ కొట్టదు. హీరో సుమంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఆనంద్‌ (Anand) ఈ ఫీల్‌గుడ్‌ మూవీ కూడా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్‌ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
    మార్చి 22 , 2024
    <strong>Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!</strong>
    Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!
    ప్రేమ అంటే రెండు అక్షరాల కలయిక కాదు. రెండు మనసుల కలయిక. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పరితపించేది, అన్వేషించేది ప్రేమ కోసమే. మనిషి నుంచి పశు పక్ష్యాదుల వరకు ప్రేమతోనే జీవితాలు ముందుకు సాగుతుంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలతో సంబంధం లేకుండా జీవన నావా ముందుకు సాగాలంటే ప్రేమ అనే చమురు చాలా అవసం. ఒకరిపై ఎంత ప్రేమో చెప్పాలంటే మాటలు సరిపోవు. కానీ కొన్ని మనసును తాకి మనలోని ప్రేమను ధ్వనింపజేస్తాయి. తెలుగు సినీలోకంలో ప్రేమ కావ్యాలు కోకొల్లలు. ప్రేక్షకులను ప్రేమ మాయలోకి దింపిన ఆ దృశ్య కావ్యాల నుంచి మనసుకు హత్తుకునేలా చేసిన డైలాగ్స్ మీకోసం.. [toc] బేబీ “ఫస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడే అనుకున్నా.. రెండోసారి, ఇంకోసారి ప్రేమ అనే మాట ఉండదని” “మీ అంత బలం లేకుండొచ్చు. గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఇంకెవడూ ఎవడూ కొట్టలేడు” “అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు కష్టం వస్తుందని దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడు” వాన “ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నన్ను మర్చిపోయినా.. ముసలిదానివైపోయినా.. చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు” మన్మథుడు “నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంతిష్టమో చెప్పగలను!” కంచె&nbsp; “గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం” నిన్నుకోరి “నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే… లైఫ్‌ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది” ఆర్య “నీ కోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను “ ఆరెంజ్‌ “ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే.. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే.. జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి” ప్రేయసిరావే “ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవ కణంలోనూ నీ జ్ఞాపకమే ఉంటుంది.” ఏమాయ చేశావె “ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే , ఒక్క నువ్వు తప్ప.” మళ్లీ మళ్లీ ఇది రాని రోజు “కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!”&nbsp; మజిలి “పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది” ఊపిరి “ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెబితే.. ఎక్కడ రిజెక్ట్‌ చేస్తారోనని భయం. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయం. మనకి కావాల్సిన వాళ్లు దూరమైతే.. ఎలా ఉన్నారని భయం. నిజానికి భయం ఉంటే.. ప్రేమ ఉన్నట్టే” జాను “పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే” అందాల రాక్షసి “నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను” "రాళ్ళను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు." ఓయ్ “నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే” కలర్ ఫొటో “ప్రేమించిన వారిని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ.” “ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి..ఈ సముద్రం గట్టున నిల్చున్న మనిషి ఇద్దరూ ఒకటే సముద్రం వచ్చి చల్లగా మన కాళ్లు కడుగుతోందని అనుకుంటాం. కానీ మనకే తెలియకుండా కాళ్ల కింద ఇసుకని వెనక్కి లాగేసుకుని పోతుంది. &nbsp;మొగుడి దగ్గర మనసు దాచుకోగలం.. కానీ ఒళ్లు దాచలేం.” “ఈ ప్రపంచం మొత్తమ్మీద స్వచ్ఛమైన వాటిలో రెండోది అమ్మాయి నవ్వు.మొదటిది ఓ మగాడి కన్నీళ్లు.” “నీరు పట్టిన చద్దన్నం ఆకలి తీర్చకపోవచ్చు..కానీ కుడితి కలిపి పెడితే ఆవులు ఆవురావురుమంటూ తాగుతాయి. అలాగే మురికి నీళ్లు మనకు దాహం తీర్చకపోవచ్చు..కానీ నిప్పును ఆర్పుతాయి. ప్రపంచంలో ఏదీ ఊరికే పోదు అన్నీ ఉపయోగపతడాయి.” మనం “మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు” పడిపడిలేచె మనసు మిమ్మల్ని ప్రేమించిన వాళ్లకి.. అది కష్టమైనా, నష్టమైనా చివరి వరకూ మీతోనే ఉండాలనిపిస్తుంది. హలో గురు ప్రేమకోసమే “గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి... మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం.” తీన్‌మార్ “మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్‌ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది” అల వైకుంఠపురములో.. “ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కరెక్టే.., కానీ నిజం చెపితేనే కదా, ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.” “బరువు పైన ఉంటే కిందకి చూడలేం, ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.” “ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే వెలుగు, అదే గుడిలో వెలిగితే ఊరంతటికి వెలుగు” “ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మ నాన్నలు అనుకోవడమేనా, అమ్మ, నాన్ననాన్నలు బాగుండాలని పిల్లలు అనుకోరా.! “ఒక యుద్ధం వచ్చిన దేశం లో ఉన్నవాళ్ళందరూ, కులం, మతం ప్రాంతం అనే తేడాలు లేకుండ కలిసిపోతారు సర్, &nbsp;ఒక కష్టం వచ్చినప్పుడే, కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ల స్వార్థం, ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.”
    ఆగస్టు 23 , 2024
    These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
    These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
    సాధారణంగా ప్రతీ సినిమాలోనూ విలన్లను దుర్మార్గులుగా చూపిస్తుంటారు. ప్రజలను పట్టిపీడిస్తున్నట్లు, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వారి పాత్రలను డిజైన్‌ చేస్తుంటారు. అప్పుడు హీరో అతడి అన్యాయాలను ఎదిరించి విలన్‌ను అంతం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే కొన్ని సినిమాల్లో విలన్లు అలా కాదు. వారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే వాటిని సరైన మార్గంలో పెట్టకపోవడంతో వారు ప్రతినాయకులుగా మారాల్సి వస్తుంది. తెలుగులో వచ్చిన అలాంటి విలన్‌ పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; రోబో 2.0 - పక్షి రాజు రజనీకాంత్‌ హీరోగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో (Robo 2.0) పక్షిరాజా అనే విలన్‌ పాత్రలో అక్షయ్‌ కుమార్ నటించాడు. విలన్‌కు పక్షులంటే అమితమైన ఇష్టం. సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల పక్షులు చనిపోతున్నాయని వాటి వాడకాన్ని మానుకోవాలని ప్రచారం చేస్తుంటాడు. ఎవరు పట్టించుకోకపోడవంతో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోతుంటాయి. ఆ బాధతో సెల్ టవర్‌కు ఊరేసుకొని భయంకర శక్తిగా మారతాడు విలన్‌. ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. రోబోలా వచ్చిన రజనీకాంత్‌ అతడ్ని అడ్డుకొని అంతం చేస్తాడు. ప్రజలను కాపాడతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=5OkypaWGYAo నేను లోకల్‌ - నవీన్‌ చంద్ర హీరో నాని - కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘నేను లోకల్‌’ (Nenu Local) చిత్రంలో నవీన్‌ చంద్ర (Naveen Chandra) విలన్‌ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. కథలోకి వెళ్తే నవీన్‌ హీరో కంటే ముందే హీరోయిన్‌ను చూసి ప్రేమిస్తాడు. ఆమె తండ్రి విధించిన షరతుతో పోలీసు ఆఫీసర్‌గా మారి తిరిగి వస్తాడు. ఈ గ్యాప్‌లో హీరో-హీరోయిన్‌ ప్రేమలో పడతారు. హీరోపై కోపంతో హీరోయిన్‌ తండ్రి నవీన్‌ చంద్రతో ఆమె పెళ్లిని నిర్ణయిస్తాడు. నానిని అడ్డుకునేందుకు నవీన్ విఫలయత్నం చేయగా చివరికీ హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=rYcZLAgPLps ‘వి’ - నాని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ (V) చిత్రంలో హీరో నాని ప్రతి నాయకుడి పాత్ర పోషించాడు. వరుసగా హత్యలు చేస్తూ డీసీపీ ఆదిత్య (సుధీర్‌ బాబు)కు సవాళ్లు విసురుతుంటాడు. అయితే నాని చేసే హత్యల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతిని విలన్లు హత్య చేస్తారు. దీంతో నాని వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.&nbsp; https://youtu.be/2vvywZbPvIc?si=NHylb0Fm4xXRv_nf నిన్నుకోరి - నాని ఈ సినిమాలో నాని కథానాయకుడే అయినప్పటికీ.. ద్వితియార్థంలో కాస్త స్వార్థంతో కనిపిస్తాడు. ప్రేయసికి పెళ్లైందని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. భార్య భర్తల మధ్య గొడవలు సృష్టించి వాళ్లు విడిపోయేలా చేయాలని అనుకుంటాడు. అయితే హీరోయిన్‌కు తన భర్తపై ఉన్న ప్రేమను చూసి నాని తన మనసు మార్చుకుంటాడు. తన ప్రేమను చంపుకొని ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ie8feBbd4VA సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు - రావు రమేష్‌ వెంకటేష్‌-మహేశ్‌ బాబు అన్నదమ్ములుగా చేసిన ఈ చిత్రంలో నటుడు రావు రమేష్‌.. ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇందులో ధనవంతుడైన రావు రమేష్‌.. హీరో ఫ్యామిలీకి డబ్బు లేదని విమర్శిస్తూ ఉంటాడు. ఖాళీగా తిరుగుతున్న వెంకటేష్‌, మహేష్‌లను ఏదైనా పని చేసుకొని బాగుపడాలని సూచిస్తుంటాడు. అతడు చెబుతున్న మాటలు మంచివే అయినప్పటికీ వాటి వెనక ఉన్న అహంకార ధోరణి రావు రమేష్‌ను విలన్‌గా మార్చింది. https://www.youtube.com/watch?v=G50OUBEZm-4 మగధీర - శ్రీహరి మగధీరలో రామ్‌చరణ్‌ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు శ్రీహరి. ఇందులో షేర్‌ఖాన్‌ పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. అతడు కాలభైరవుడు (రామ్‌చరణ్‌) సేనానిగా ఉన్న రాజ్యంపైకి దండెత్తుతాడు. దీంతో హీరో.. షేర్‌ఖాన్‌ సైన్యంలోని వంద మందిని చంపి తన వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు. హీరో ధైర్యసాహసాలకు మెచ్చిన శ్రీహరి.. ఇచ్చిన మాట ప్రకారం మరో జన్మలో రామ్‌చరణ్‌కు సాయం చేస్తాడు.&nbsp; https://youtu.be/6L-sfTeMSZM?si=cx22Tp3DbXpIL5ec పుష్ప - శత్రు పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పట్టుకునే డీఎస్పీ గోవిందప్ప పాత్రలో నటుడు శత్రు నటించాడు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు గోవిందప్ప తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అయితే హీరో ఎర్ర చందనం స్మగ్లర్‌ కావడంతో అతడ్ని పట్టుకునేందుకు యత్నించిన శత్రు.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టిలో విలన్‌గా మారిపోయాడు.&nbsp; https://www.youtube.com/watch?v=krENzIi3Tto పరుగు - ప్రకాష్‌ రాజ్‌ బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, షీలా కౌర్‌ జంటగా చేశారు. ప్రకాష్‌ రాజ్ చిన్న కూతురైన హీరోయిన్‌ను చూసి బన్నీ ప్రేమిస్తాడు. లేచిపోయిన పెద్ద కూతురు కోసం తండ్రి పడుతున్న ఆవేదన చూసి హీరో మారతాడు. ఆమెను లేపుకెళ్లడానికి వెనకాడతడు. క్లైమాక్స్ ముందు వరకూ విలన్‌గా కనిపించిన ప్రకాష్‌ రాజ్‌.. చివర్లో చిన్న కూతురు ప్రేమను అర్థం చేసుకొని ఆమెను బన్నీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?v=R7Vw3cJnjyU విక్రమ్‌ - కమల్‌ హాసన్‌ ఇందులో హీరో కమల్‌ హాసన్ మాస్క్‌ మ్యాన్‌ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. పోలీసు ఆఫీసర్ అయిన తన కొడుకును డ్రగ్స్‌ మాఫియా లీడర్‌ సంతానం (విజయ్‌ సేతుపతి) హత్య చేస్తాడు. ఇందుకు కారణమైన వారిని హత్య చేస్తూ కమల్‌ హీరోగా మారతాడు. తొలి భాగంలో తాగుబోతు, డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిలా విలన్‌లా కనిపించే కమల్‌.. సెకండాఫ్‌లో తన యాక్షన్‌తో అదరగొడతాడు. https://youtu.be/x7WPik_LnmY?si=zJ9KW1ZxulMB1ZH2 రిపబ్లిక్‌ - రమ్యకృష్ణ సాయిధరమ్ తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ విలన్‌ పాత్ర పోషించింది. తొలుత ఆమెప్రాంతీయ పార్టీ అధినేత్రిగా మంచి పొలిటిషియన్‌గా కనిపించారు. ప్రజల మేలు కోరే ఆదర్శ రాజకీయ నాయకురాలిగా మెప్పిస్తారు. కానీ ఆమె నిజ స్వరూపం తెలిశాక ఆడియన్స్ షాకవుతారు.&nbsp; https://www.youtube.com/watch?v=FWg79VONoTY
    ఫిబ్రవరి 27 , 2024
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    ప్రేమ కథా చిత్రాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కల్ట్‌ లవ్‌ స్టోరీలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఆయా సినిమాలతో పాటు అందులోని పాటలూ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి కొన్ని మెలోడి సాంగ్స్‌ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించాయి. ఆ పాటలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో అవి తప్పక ఉంటాయి. అటు యూట్యాబ్‌లోనూ అత్యధిక వ్యూస్‌తో ఆ సాంగ్స్‌ దూసుకెళ్తున్నాయి. ఇంతకీ ఆ యూత్‌ఫుల్‌ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. మాష్టారు మాష్టారు ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్‌ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులోని ‘మాష్టారు మాష్టారు’ పాట విశేష ఆదరణ పొందింది. ఈ తరం యువత ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. అటు యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్ ‌అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 70 మిలియన్ల మంది ఈ సాంగ్‌ను వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 2. నీ కన్ను నీలి సముద్రం ఉప్పెన సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్‌ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ పాట చాలమందికి ఫేవరేట్. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా జావేద్ అలీ ఆ సాంగ్‌ పాడారు. యూట్యూబ్‌లో 39 మిలియన్ల మంది ఈ పాటను చూశారు.&nbsp; https://www.youtube.com/watch?v=zZl7vDDN8Ek 3. చిట్టి నీ నవ్వంటే&nbsp; జాతి రత్నాలు సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే’ పాట యూత్‌ను ఎంతగానో ఆకర్షించింది.&nbsp;రాధన్ సంగీతం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటను యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా రాశారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను ఏకంగా 145 మిలియన్ల మంది వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=uvCbZxYdLuU 4. ఇంకేం ఇంకేం కావాలి విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ సాంగ్‌ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అటు యూట్యూబ్‌లో ఈ పాటకు 155 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. https://www.youtube.com/watch?v=cC8AmhPUJPA 5. అడిగా అడిగా నాని, నివేదా థామస్‌ జంటగా చేసిన సినిమా ‘నిన్నుకోరి’. ఇందులోని ‘అడిగా అడిగా’ పాట హృదయాలను హత్తుకుంటుంది. గోపి సుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు మ్యూజిక్‌ లవర్స్‌ను మెప్పించాయి.&nbsp; https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU 6. చూసి చూడంగానే 2018లో రిలీజైన ‘ఛలో’ సినిమా నాగశౌర్య కెరీర్‌లోని బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘చూసి చూడంగానే’ పాట అప్పట్లో యమా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆటోల్లోనూ, బస్‌స్టాండ్లలోనూ ఎక్కడ చూసిన ఈ సాంగ్‌ మారుమోగేది. అనురాగ్‌ కులకర్ణి, స్వరసాగర్‌ మహతి ఈ పాటను పాడారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను 205 మిలియన్ల మంది వీక్షించారు. https://www.youtube.com/watch?v=_JVghQCWnRI 7. పూలనే కునుకేయమంటా శంకర్‌ డైరెక్షన్‌లో విక్రమ్‌, అమీ జాక్సన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐ’. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ‘పూలనే కునుకేయమంటా’ అనే పాట కోట్లాది మంది హృదయాలను దోచుకుంది. హరిచరణ్, శ్రేయా ఘోషల్‌ ఎంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. అంతేగాక ఈ సాంగ్‌ను చిత్రీకరించిన లోకేషన్స్‌ కూడా ఆకట్టుకుంటాయి.&nbsp; https://www.youtube.com/watch?v=cjoz0FZ-wWs 8. మాటే వినదుగా విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన ‘టాక్సీవాలా’ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ‘మాటే వినదుగా’ పాట కూడా మ్యూజిక్ లవర్స్‌ను&nbsp; ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ సాంగ్‌ను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని వింటుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc 9. మధురమే విజయ్‌ దేవరకొండ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ‘అర్జున్‌ రెడ్డి’. ఇందులో ‘మధురమే’ పాట మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌గా గుర్తింపు పొందింది. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో విజయ్‌, హీరోయిన్‌ షాలిని పాండే రొమాన్స్‌ను తారా స్థాయిలో చూపించారు. రాధన్ సంగీతం అందించిన ఈ పాటకు సమీరా భరద్వాజ్ స్వరాన్ని అందించింది. https://www.youtube.com/watch?v=YaZuEkCgctA&amp;feature=youtu.be 10. ఎంత సక్కగున్నావే రంగస్థలం సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ పాట అందరినీ కట్టిపడేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ పాటకు సంగీతంతో పాటు స్వరాన్ని కూడా అందించారు. సమంత అందాన్ని పొగిడే క్రమంలో రామ్‌చరణ్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. యూట్యూబ్‌లో 61 మిలియన్ల మంది ఈ పాటను వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=eABViudPBFE
    మే 31 , 2023
    Sid Sriram: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే టాప్‌-10 సిద్‌ శ్రీరామ్‌ సాంగ్స్‌..
    Sid Sriram: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే టాప్‌-10 సిద్‌ శ్రీరామ్‌ సాంగ్స్‌..
    ప్రముఖ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ ఎన్నో హిట్‌ పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. మిస్మరైజింగ్‌ వాయిస్‌తో కోట్లాది మంది సంగీత ప్రియులను ఉర్రూతలూగించాడు. ఇండో అమెరికన్‌ అయినప్పటికీ తెలుగు పాటలను ఎంతో అద్భుతంగా పాడుతూ శ్రీరామ్‌ తనదైన మార్క్‌ చూపిస్తున్నాడు. సిద్‌ శ్రీరామ్ స్వరం నుంచి వచ్చిన టాప్‌-10 తెలుగు హిట్‌ సాంగ్స్‌ను ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. శ్రీవల్లి: పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను సిద్‌ శ్రీరామ్‌ చాలా అద్భుతంగా పాడాడు. అప్పటివరకు పాడిన పాటలకు పూర్తి భిన్నంగా ఈ పాటను ఆలపించాడు. శ్రీరామ్‌ యూనిక్‌ వాయిస్‌ వల్లే ఈ పాటకు అంత హైప్‌ వచ్చింది.&nbsp; https://www.youtube.com/watch?v=txHO7PLGE3o 2. కళావతి సర్కారు వారి పాటలో కళావతి సాంగ్‌ను శ్రీరామ్‌ చాలా బాగా ఆలపించాడు. కమాన్‌ కమాన్‌ కళావతి అంటూ మహేష్‌ చేత స్టెప్పులు వేయించాడు. ఈ పాట రిలీజ్‌ తర్వాత సిద్‌ శ్రీరామ్‌ ఫేమ్‌ మరింత పెరిగింది. https://www.youtube.com/watch?v=SfDA33y38GE 3. మగువ మగువ వకీల్‌సాబ్‌ చిత్రంలోని మగువ మగువ సాంగ్‌ మహిళల గొప్పతనాన్ని తెలియజేసింది. ఈ పాటకు తన స్వరం ద్వారా సిద్‌ శ్రీరామ్‌ జీవం పోశాడు.&nbsp; https://www.youtube.com/watch?v=fqM8DJIZIDw 4. ఇంకేం ఇంకేం కావాలి గీతా గోవిందం సినిమాలోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ పాటను శ్రీరామ్‌ ప్రాణం పెట్టి పాడాడు. ఒక్క ఇంగ్లీష్‌ పదం లేని ఈ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించి ప్రశంసలు అందుకున్నాడు. లిరిక్స్‌లోని డీప్‌ ఎమోషన్స్‌ను శ్రీరామ్‌ తన గొంతులో చక్కగా పలికించాడు. అప్పట్లో యూత్‌ను ఈ పాట విపరీతంగా ఆకర్షించింది.&nbsp; https://www.youtube.com/watch?v=VkmXX_jKmZw 5. ఉండిపోరాదే 2018లో విడుదలైన హుషారు సినిమాలోని ‘ఉండిపోరాదే పాట’ అప్పట్లో చాలా పెద్ద హిట్‌ అయింది. ప్రేమలో విఫలమైన యువకుడి బాధను తన గొంతులో శ్రీరామ్‌ పలికించాడు. దీంతో యువకులు ఈ పాటకు చాలా బాగా కనెక్ట్‌ అయ్యారు.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=wCnUAKzAmVo 6. సామజవరగమన అలా వైకుంఠపురంలో చిత్రంలోని ‘సామజవరగమన’ పాట ఎంత సూపర్‌ హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాట ఘన విజయానికి అల్లు అర్జున్‌ క్లాసీ స్టెప్పులు ఎంతగానో దోహదం చేశాయి. అలాగే శ్రీరామ్‌ కూడా తన స్వరం ద్వారా సాంగ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=OCg6BWlAXSw 7. మాటే వినదుగా టాక్సీవాలా చిత్రంలోని ‘మాటే వినదుగా’ పాట సిద్‌ శ్రీరామ్‌ హిట్‌ ఆల్బమ్స్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ పాట ద్వారా కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాల్లో శ్రీరామ్‌ స్థానం సంపాదించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc 8. అడిగా అడిగా&nbsp; నిన్నుకోరి సినిమాలోని ‘అడిగా అడిగా’ పాట భగ్న ప్రేమికులను ఎంతగానో ఆకర్షించింది. ప్రేయసి ప్రేమను బలంగా కోరుకునే యువకుడి ఫీలింగ్స్‌ను సిద్‌ చాలా బాగా వ్యక్తపరిచాడు. ఈ పాటకు గాను ఈ యువ గాయకుడికి మంచి ప్రశంసలే దక్కాయి.&nbsp; https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU 9. వచ్చిందమ్మ గీతా గోవిందం మూవీలోని ‘వచ్చిందమ్మా’ పాట కూడా మంచి హిట్ అయింది. ఈ పాటలో శ్రీరామ్‌ వాయిస్‌ ప్రేక్షకులను మిస్మరైజింగ్‌ చేసిందనే చెప్పాలి.&nbsp; https://www.youtube.com/watch?v=xVcoYF--0mM 10. ఏమున్నావే పిల్ల నల్లమల్ల సినిమాలోనే ఏమున్నావే పిల్ల పాట ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. సినిమా పెద్దగా ఆడకపోయిన ఈ పాట మాత్రం ఇప్పటికా చాలా మందికి ఫేవరేట్ సాంగ్‌ ఉంది. https://www.youtube.com/watch?v=0K7HpHP2Jk8 &nbsp;&nbsp;
    ఏప్రిల్ 05 , 2023
    #90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్‌ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి? 
    #90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్‌ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి? 
    నిన్నటి గతాన్ని భద్రపరిచి నేటి తరానికి అందిస్తూ.. ఆనాటి మంచి, చెడు, ఆనందాలు, సమస్యలు అన్నింటిని హానెస్ట్‌గా చూపించింది #90s MiddleClass Biopic. మిడ్ 2000ను ఒక కాలచక్రంలో బంధించి అందమైన పాత్రల భావోద్వేగాలను చూపిస్తుంది. వెబ్‌సిరీస్‌లో పెద్దగా చెప్పుకోవడానికి కథేమి ఉండదు. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో డే టూ డే లైఫ్‌ను అద్భుతంగా తెరకెక్కించింది. సిల్లీ సండే మూమెంట్స్, పండుగలు, హాలిడే ఎంజాయ్‌మెంట్‌ను కళ్లకు అద్ధినట్లు చూపిస్తుంది. నిజానికి ఇదే కదా లైఫ్‌ అంటే. మనం బ్రతికేది ఆ మూమెంట్స్‌లోనే కదా! చాలా విషయాలు మనం ఏదొక అజెండాతో చేస్తాం. ఎలాంటి ఎజెండా లేకుండా మనం చేసే పనులే మన లైఫ్. సరిగ్గా అలాంటి విషయాలను దగ్గరకు తెచ్చినదే #90s MiddleClass Biopic. ఈ సిరీస్ చూస్తున్నంతసేపూ అన్ని సీన్లు మన నిజ జీవితంలో ఎక్కడొక్కడ మనకు తారసపడినవే. వాటినే అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్. లెడీస్ తాలుకు సెన్సిటివ్ విషయాలను చాలా సూపర్బ్‌గా షోలో క్యారీ చేయించాడు. ఇక 90s A MiddleClass Biopic టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈటీవి విన్‌ ఫ్లాట్‌ఫాం నుంచి వచ్చిన ఈ  వెబ్‌సిరీస్‌కు IMDB ఏకంగా 9.6 రేటింగ్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఓ వెబ్‌సిరిస్‌కు ఈ స్థాయిలో రేటింగ్ రాలేదనే చెప్పాలి. ఈ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో 90వ దశకం మధ్యతరగతి వాతావరణాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి పాత్ర ఆ కాలం నాటి సాధక బాధకాలను కళ్లకు కట్టింది. ముఖ్యంగా 90sలో పుట్టినవారికి బాగా కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా వరకు పోస్టులు ఈ వెబ్‌సిరీస్‌లోని ఏదొక సీన్‌తో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ పాత్రలను అభిమానులు బాగా ఓన్ చేసుకున్నారు. మరి అంతలా అభిమానించే విధంగా ఆ వెబ్‌సిరీస్‌లో క్లారెక్టర్ల తాలుకు ఔచిత్యాన్ని  ఓసారి విశ్లేషిద్దాం. చంద్రశేఖర్(శివాజీ):&nbsp; ఓ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టార్‌. మధ్యతరగతి మనస్తత్వం కలవాడు. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.&nbsp; ప్రభుత్వ టీచర్‌ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిపిస్తూ వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్‌ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. ఖర్చు విషయంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెడుతుంటాడు. పిల్లల భవిష్యత్ గురించి కలలుగంటగా పనిచేస్తుంటాడు. సినిమా చూస్తున్నంత సేపు శేఖర్ క్యారెక్టర్ 90వ దశకంలో సగటు తండ్రి ఆలోచనలకు ప్రతినిధిగా కనిపిస్తాడు. పిల్లల పట్ల అతను వ్యవహరించే తీరు నవ్వు తెప్పిస్తుంది. కొన్ని చోట్ల వారి భవిష్యత్ గురించి సగటు తండ్రిగా శేఖర్ పడే బాధ కంటతడి పెట్టిస్తుంది. ఆడ పిల్ల తండ్రి కావడంతో ఆమెకు ఏదో ఒకటి కూడ బెట్టాలన్న మధ్యతరగతి సమస్యలు కనిపిస్తుంటాయి. పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉంటూనే వారికి అందించాల్సి సౌకర్యాల కోసం ఆలోచిస్తుంటాడు.&nbsp; https://twitter.com/sunny5boy/status/1745383429808517544?s=20 రాణి(వాసుకీ): ఈ వెబ్‌సిరీస్‌లో సగటు మధ్యతరగతి గృహిణిగా రాణి పాత్రలో వాసుకీ ఆనంద్ అద్భుతమైన నటన కనబర్చింది. నిరంతరం కుటుంబం కోసం ఆలోచించే గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. భర్త తెచ్చిచ్చే కాస్త డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తుంటుంది. భర్తకు తన బాధ్యతలు గుర్తు చేస్తూ అనవసర ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఆడపిల్ల ఉన్న ఇంట్లో మధ్యతరగతి గృహిణి భయాలు ఆమెలో స్పష్టంగా కనిపించాయి. పిల్లల కోరికలను తీర్చుతునే... అనవసరమైన ఆశలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆనాటి జీవనగతిని కళ్లకు కట్టింది. https://twitter.com/Ga_ne_sh_5/status/1745774847375069388?s=20 ఆదిత్య: ముఖ్యంగా ఈ సినిమాకు నిజమైన హీరో మౌలి అనే చెప్పాలి. చిన్నవయసులోనే అద్భుతమైన నటన కనబరిచాడు. అతన్ని చూస్తుంటే ప్రతింట్లో ఉండే చిన్న కొడుకు మాదిరి కనిపిస్తాడు.&nbsp; సాధారణంగా ఇళ్లల్లో చిన్న కొడుకు గారాభంగా పెరుగుతుంటారు. వాళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇంట్లో వంట నచ్చకపోతే మారం చేయడం, తోటి పిల్లలను ఆట పట్టించడం వంటి చేష్టలు హాస్యంగా కనిపిస్తాయి. మార్కులు తక్కువ వచ్చినప్పుడు అమ్మ-నాన్న దగ్గర ఆదిత్య చెప్పే అబద్దాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంటికి ఎవరైన చుట్టాలు వచ్చినప్పుడు వారివద్ద చిన్నపిల్లలు చేసే సరదా చేష్టలు ఆదిత్య క్యారెక్టర్ 90s కాలాన్ని గుర్తు చేస్తాయి.&nbsp; ముఖ్యంగా ఆ వయసులో చిన్నపిల్లలు పడే మానసిక వ్యథ.. ఆదిత్య పాత్రలో ప్రతిబింబిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ఆదిత్య- చంద్రశేఖర్ క్యారెక్టర్‌కు సంబంధించిన సీన్లు ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. https://twitter.com/Iharish999/status/1744674325352132686?s=20 ప్రశాంత్ &amp;దివ్య: పదోతరగతి చదువుతున్న ప్రశాంత్ టీనేజ్ కుర్రాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. బయట ఆడుకోవాలని ఉన్నా, తన తండ్రి మాట కోసం ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. 10thలో జిల్లా ఫస్ట్ రావాలనే తన తండ్రి కోరిక కోసం పరిశ్రమిస్తుంటాడు. అతని తమ్ముడు ఆదిత్యతో చేసే సరదా సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇక దివ్య మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయి పుడితే ఎలా పెరుగుతుందో అలాగే కనిపించింది. తల్లిద్రండ్రుల భయాల మధ్య వారి మాటకు అనుగుణంగా పెరుగుతూ కనిపిస్తుంది. https://twitter.com/_Shivatweets/status/1745269317112119543?s=20 https://telugu.yousay.tv/90s-web-series-review-how-is-the-90s-series-a-reflection-of-middle-class-families.html
    జనవరి 16 , 2024

    @2021 KTree