• TFIDB EN
  • నువ్వు నాకు నచ్చావ్
    UTelugu3h
    వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    వెంకటేష్
    వెంకటేశ్వర్లు వెంకీ
    ఆర్తి అగర్వాల్
    నందిని నందు
    పృథివీరాజ్
    ఆశా కాబోయే భర్త
    ఫ్లోరా సైనీ
    నందు స్నేహితుడు
    సుహాసిని మణిరత్నం
    నందు అత్త
    ప్రకాష్ రాజ్
    నందు తండ్రి
    చంద్ర మోహన్
    శేఖరం
    తనికెళ్ల భరణి
    ప్రసాద్ తండ్రి
    బ్రహ్మానందం
    ఫోటోగ్రాఫర్
    బాబూ మోహన్
    ప్రసాద్ బంధువు
    మల్లికార్జునరావు
    ప్రసాద్ బంధువు
    ఎంఎస్ నారాయణ
    నందు మామ
    షిజు
    నందు కాబోయే భర్త
    శంకర్ మెల్కోటే
    MD
    సుధ
    నందు తల్లి
    హేమ
    నందు అత్త మరియు చంటి భార్య
    సుదీప పింకీ
    నందు కజిన్
    శ్రీ లక్ష్మి
    ఆశా ఆంటీ
    కల్పనా రాయ్
    కుక్
    పద్మ జయంతిప్రసాద్ తల్లి
    సునీల్
    నందు గృహిణి
    బండ్ల గణేష్
    మోహన్ స్నేహితుడు
    అనంత్ బాబు
    ఆశ మామయ్య
    చిట్టి బాబు
    పూజారి
    గిరిధర్ వెంకీ స్నేహితుడు
    KK శర్మ పూజారి
    సిబ్బంది
    కె. విజయ భాస్కర్
    దర్శకుడు
    స్రవంతి రవి కిషోర్
    నిర్మాత
    కోటి
    సంగీతకారుడు
    కె. విజయ భాస్కర్
    స్క్రీన్ ప్లే
    ఎ. శ్రీకర్ ప్రసాద్
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    “విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్‌ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్‌ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం. నువ్వు నాకు నచ్చావ్‌! ప్రకాశ్‌ రాజ్‌ ఇంటికి వెంకటేశ్‌ వచ్చినపుడు సునీల్‌ తనని ఔట్‌ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్‌ సెటైర్‌ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్‌ పేరు లంకా” అనేస్తాడు. https://www.youtube.com/watch?v=UVFCtTNU29s అత్తారింటికి దారేది అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్‌. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్‌ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్‌ “ ఒరేయ్‌ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్‌ ఎలా కట్టాలి అని ప్లాన్‌ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్‌ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు. https://www.youtube.com/watch?v=9-PckWpekQY జల్సా జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్‌ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.  https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI అ ఆ ‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్‌ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్‌ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు. https://www.youtube.com/watch?v=qrrldRJc5e8 మన్మథుడు మన్మథుడులో సునీల్‌ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్‌ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్‌ ఇస్తాడు.  https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow అల వైకుంఠపురములో అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్‌ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు. అజ్ఞాతవాసి “సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి) S/O సత్యమూర్తి “రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌) భీమ్లా నాయక్‌ “ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్‌) అతడు “హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్‌ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
    ఏప్రిల్ 14 , 2023
    HBD Thalapathy Vijay: విజయ్‌ను స్టార్‌గా నిలబెట్టిన తెలుగు రీమేక్‌ మూవీస్‌ తెలుసా?
    HBD Thalapathy Vijay: విజయ్‌ను స్టార్‌గా నిలబెట్టిన తెలుగు రీమేక్‌ మూవీస్‌ తెలుసా?
    దళపతి విజయ్‌కి తెలుగులోనూ ప్రత్యేక అభిమానులు ఉన్నారు. విజయ్ సినిమా వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో హడావుడి నెలకొంటుంది. దీనికి కారణం విజయ్ చేసిన సినిమాలు తెలుగులోకి రీమేక్ కావడం, తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను తమిళ్‌లో రీమేక్ చేయడమే. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 9 తెలుగు సినిమాలను విజయ్ తమిళ్‌లో చేశాడు. విజయ్ బర్త్ డే(జూన్ 22) సందర్భంగా ఈ హీరో రీమేక్ చేసిన తెలుగు సినిమాలేంటో తెలుసుకుందాం.  పోకిరి విజయ్ కెరీర్‌లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ఇదొకటి. మహేశ్ బాబు చేసిన పోకిరి(2006) తమిళ్‌లోనూ అదే టైటిల్‌తో 2007లో రిలీజైంది. డబ్ వెర్షన్‌లో విజయ్ సరసన అసిన్ నటించింది. రీమేక్‌కి ప్రభు దేవా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళ థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది.  అతనొక్కడే కళ్యాణ్‌రామ్ నటించిన ‘అతనొక్కడే’(2005) సినిమా తెలుగులో డీసెంట్ టాక్‌ని సంపాదించింది. ఈ స్టోరీ నచ్చడంతో విజయ్ రీమేక్ చేశాడు. 2006లో ‘ఆతి’గా పేరుతో రీమేక్‌ మూవీ రిలీజైంది. తమిళ వెర్షన్‌కి రమణ డైరెక్టర్‌గా వ్యవహరించాడు.  ఒక్కడు మహేశ్ బాబు కెరీర్‌లో ఒక్కడు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2003లో ఒక్కడు విడుదల కాగా 2004లో తమిళ్‌లో ‘గిల్లి’గా రీమేక్ అయింది. విజయ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ఈ చిత్రానికి ధరణి దర్శకత్వం వహించాడు. నీతో ప్రకాశ్ కోవెలమూడి, మెహక్ చాహల్ తొలిసారిగా నటించిన చిత్రం ‘నీతో’(2002). తమిళ్‌లో ఇది ‘సాచియాన్’(2005)గా విడుదలైంది. విజయ్ సరసన బిపాషా బసు, జెనీలియా నటించారు. జోహన్ మహేంద్రన్ దర్శకత్వం వహించగా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది.  నువ్వు నాకు నచ్చావ్ విక్టరీ వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాను విజయ్ రీమేక్ చేశాడు. 2001లో నువ్వు నాకు నచ్చావ్ విడుదల కాగా 2003లో తమిళ్‌లో ‘వసీగర’గా వచ్చింది. ఇందులో విజయ్ సరసన స్నేహ నటించింది. తమిళ్‌లో కె.సెల్వభారతి డైరెక్ట్ చేశారు. చిరునవ్వుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ రచించిన చిరునవ్వుతో(2000) సినిమాను జి.రామ్ ప్రసాద్ డైరెక్ట్ చేశాడు. తమిళ్‌లో యూత్(2002)గా వచ్చింది. విజయ్ సరసన సంధ్య నటించింది. విన్సెంట్ సెల్వ డైరెక్షన్ వహించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.  తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’(2000) సినిమాను విజయ్ ‘బద్రి’గా రీమేక్ చేశాడు. తెలుగులో తెరకెక్కించిన పి.ఎ.అరుణ్ ప్రసాద్ తమిళంలోనూ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. 2001లో బద్రి విడుదలై థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది.  పవిత్ర బంధం వెంకటేశ్, సౌంధర్య నటించిన ‘పవిత్రబంధం’(1996) సినిమా తమిళంలో ప్రియమానవాలె(2000) గా రీమేక్ అయింది. రీమేక్ వెర్షన్‌లో విజయ్ సరసన సిమ్రాన్ నటించింది. కె.సెల్వ భారతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది.  పెళ్లి సందడి రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్‌ హిట్ ‘పెళ్లిసందడి’(1996) తమిళంలో ‘నినైదెన్ వంధై’(1998)గా రిలీజైంది. విజయ్, రంభ, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సైతం కె.సెల్వభారతి డైరెక్టర్‌గా వ్యవహరించాడు.
    జూన్ 22 , 2023
    Telugu Comedy Scenes: తెలుగులో ఎవర్‌గ్రీన్‌ కామెడీ సీన్స్‌.. చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..!
    Telugu Comedy Scenes: తెలుగులో ఎవర్‌గ్రీన్‌ కామెడీ సీన్స్‌.. చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..!
    తెలుగు సినీ అభిమానులు ఎక్కువగా హాస్యాన్ని ఇష్టపడుతుంటారు. తెరపైన హీరోలు, హాస్య నటులు చేసే కామెడీని చూస్తూ తమ సమస్యలు, ఒత్తిడిల నుంచి కాస్త ఉపశమనం పొందుతుంటారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ డైరెక్టర్లు సైతం తమ సినిమాల్లో హాస్య సన్నివేశాలకు పెద్దపీట వేస్తుంటారు. గత 20 ఏళ్లలో ఎన్నో కామెడీ సినిమాలు విడుదలై ప్రేక్షకుల మన్ననలు చూరగొన్నాయి. వాటిలోని హైలెట్‌ కామెడీ సీన్లను ఇప్పటికీ యూట్యూబ్‌లలో సెర్చ్ చేసి చూస్తుంటారు. ఈ నేపథ్యంలో గత కొన్నెళ్లలో వచ్చిన తెలుగు సినిమాల్లోని టాప్‌-10 కామెడీ సీన్స్‌ మీకోసం..  1. ట్రైన్‌ సీన్‌ (వెంకీ) హీరో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్లు ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తావో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ (2003) సినిమాలో రవితేజ, బ్రహ్మనందం మధ్య వచ్చే ట్రైన్‌ సీన్‌ ఇప్పటికీ ఎంతో మందిని నవ్విస్తూనే ఉంది. మెుదట రవితేజను బ్రహ్మీ ఓ ఆట ఆడుకోవడం.. ఆ తర్వాత హీరో రివేంజ్‌ తీర్చుకునే సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.  https://www.youtube.com/watch?v=pcpuYeqwloY 2. బ్రహ్మీ vs నాజర్‌ (బాద్‌షా) బాద్‌షా సినిమాలో బ్రహ్మానందం కామెడీనే హైలెట్‌ అని చెప్పాలి. పిల్లి పద్మనాభ సింహాగా బ్రహ్మీ చేసే కామెడీ పొట్టచెక్కలయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా నాజర్‌, బ్రహ్మీ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మరింతగా కితకితలు పెడతాయి. కలలో ఉన్నట్లు భ్రమిస్తూ బ్రహ్మానందం చేసే హంగామా అంతా ఇంతా కాదు.  https://www.youtube.com/watch?v=dxRDHXsQ2YQ 3. MS నారాయణ డైలాగ్స్‌ (దూకుడు) దూకుడు సినిమాలో ఎం.ఎస్‌ నారాయణ, మహేష్‌ మధ్య వచ్చే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. సినిమా హీరో అవకాశం కోసం ఎదురుచూస్తున్న వెంకట్రావ్‌ పాత్రలో MS నారాయణ అద్భుతంగా నటించారు. పలు సినిమాల్లోని సూపర్‌ హిట్‌ డైలాగ్‌లను ఏకధాటిగా చెప్పే సీన్‌ సినిమాకే హైలెట్. MS నారాయణ ఒక్కో డైలాగ్‌ చెప్తున్న సమయంలో మహేష్‌ ఇచ్చే రియాక్షన్స్ హాస్యాన్ని మరింత పెంచింది.  https://www.youtube.com/watch?v=uR3mdOT8DWY 4. సునీల్‌ కాలేజ్‌ సీన్స్ (సొంతం)  శ్రీను వైట్ల తీసిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ‘సొంతం’ ఒకటి. అప్పట్లో  ఈ సినిమా ఓ కామెడీ సెన్సేషన్‌ అని చెప్పాలి. శేషగిరి పాత్రలో సునీల్‌ తనదైన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు. వెంకటలక్ష్మీ (ఝాన్సీ), భోగేశ్వరావు (M.S. నారాయణ) పాత్రలతో సునీల్‌ చేసిన కామెడీని ఇప్పటికీ యూట్యూబ్‌లో చూసుకుంటూ హాస్య ప్రియులు నవ్వుకుంటుంటారు.  https://www.youtube.com/watch?v=d5rZgi9JHXU 5. బ్రహ్మీ ఫన్‌ వరల్డ్‌ సీన్స్‌ ( నువ్వు నాకు నచ్చావ్‌) వెంకటేష్‌ చేసిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ‘నువ్వు నాకు నచ్చావ్‌’ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. ఇందులో తన కామెడీ టైమింగ్‌తో వెంకీ అలరించాడు. బ్రహ్మీ ఎంట్రీతో సినిమాలో కామెడీ మరింత పీక్స్‌కు వెళ్తుంది. ముఖ్యంగా రోలర్‌ కోస్టర్‌ ఎక్కినప్పుడు బ్రహ్మీ ఇచ్చే హావభావాలను చూసి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటారు.  https://www.youtube.com/watch?v=D87NXZXotWY 6. క్విజ్‌ సీన్‌ (ఆగడు) ఆగడు సినిమాలో వచ్చే క్విజ్‌ సీన్‌ కూడా తెలుగు టాప్‌ కామెడీ సీన్లలో ఒకటిగా ఉంది. ఈ సన్నివేశంలో మహేష్‌ యాంకర్‌గా, వెన్నెల కిషోర్‌ జడ్జీగా కనిపిస్తారు. పోసాని కృష్ణమురళి కంటిస్టెంట్‌గా నవ్వులు పూయించాడు.  https://www.youtube.com/watch?v=ufmXlnz9R4w 7. బ్రహ్మీ సీన్స్ (అతడు) మహేష్‌ హీరోగా చేసిన అతడు సినిమాలో బ్రహ్మీ డిఫరెంట్‌ కామెడీ టైమింగ్‌తో అలరించాడు. ఫ్రస్టేషన్‌తో ఉన్న ఇంటి అల్లుడు పాత్రలో నవ్వులు పూయించాడు. తన ఎటకారపు మాటలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు.  https://www.youtube.com/watch?v=UhmDHGt81l4 8. సప్తగిరి (ప్రేమ కథా చిత్రం) సప్తగిరిని కామెడియన్‌గా నిలబెట్టిన సినిమా ప్రేమ కథా చిత్రం. ఇందులో సప్తగిరి కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా దయ్యం కొడుతున్నప్పుడు అతను ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది.  https://www.youtube.com/watch?v=9sUIkrR2U9c 9. ఎస్కేప్‌ సీన్‌ (నమో వెంకటేశా) ‘నమో వెంకటేశా’ సినిమాలో బ్రహ్మీ వెంకటేష్‌ పాత్రల మధ్య వచ్చిన కామెడీ కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో గిలిగింతలు పెట్టింది. ముఖ్యంగా ఇంటి నుంచి తప్పించుకునే క్రమంలో బ్రహ్మీకి ఎదురయ్యే ఆటంకాలు వీక్షకుల కుడుపును చెక్కలయ్యేలా చేస్తుంది.  https://www.youtube.com/watch?v=Llwxco8Ek2o 10. బ్రహ్మీ రివేంజ్‌ (ఢీ) మంచు విష్ణు కెరీర్‌లోనే ‘ఢీ’ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ అని చెప్పాలి. ఇందులో బ్రహ్మీ-విష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. అయితే తనను ఎంతగానో హింసించిన సునీల్‌, జయ ప్రకాష్‌ రెడ్డిపై బ్రహ్మీ రివేంజ్‌ తీర్చుకునే సీన్‌ సినిమాకే హైలెట్‌. ఫుల్‌గా మద్యం సేవించిన బ్రహ్మీ వారిద్దరినీ ఓ ఆట ఆడుకుంటాడు. ఈ క్రమంలో బ్రహ్మీ జనరేట్ చేసిన కామెడీ అతడి కెరీర్‌లోనే బెస్ట్ ‌అని చెప్పాలి.  https://www.youtube.com/watch?v=m7B4qtmgHkk
    మే 03 , 2023
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.  ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో  ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు  ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్  ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి  శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్  నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక  కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి  మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ  ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్  పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ  సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:  హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.  సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి  జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా  బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం  దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-  యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.  ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-  జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు  రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.  ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.  మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో  ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి  దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,  కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి  రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.  ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్  ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్  ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా  దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.  మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.  ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    EXCLUSIVE: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సైడ్‌ రోల్స్‌.. ఓ లుక్కేయండి! 
    EXCLUSIVE: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సైడ్‌ రోల్స్‌.. ఓ లుక్కేయండి! 
    సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్‌ పాత్రలే ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుంటాయి. విలన్‌ నటన బట్టి ఆ పాత్రనూ ఆదరించేవారు ఉంటారు. అయితే కొన్నిసార్లు క్రేజ్‌తో సంబంధం లేకుండా సైడ్‌ పాత్రలు కూడా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంటాయి. తెరపై ఆ పాత్ర సాగుతున్నంతసేపు తమ వెంటే ప్రేక్షకుల అటెన్షన్‌ను తీసుకువెళ్తుంటాయి. టాలీవుడ్‌లో మరో పదేళ్లు గడిచినా ఆ పాత్రలకున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ పాత్రలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి? సత్యరాజ్ (బాహుబలి) బాహుబలిలో ప్రభాస్‌, రాణా పాత్రల తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్‌ కట్టప్ప. దర్శకుడు రాజమౌళి ఈ పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. కట్టప్ప పాత్ర లేకుండా బాహుబలి చిత్రాన్ని అసలు ఊహించలేము. సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ (Sathyaraj) ఆ పాత్రలో పరాకయప్రవేశం చేసి మరి నటించాడు. ప్రకాష్‌ రాజ్‌ (అతడు) మహేష్‌ కెరీర్‌లో వచ్చిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. ఇందులో మహేష్‌ బాబు (Mahesh Babu) తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునే పాత్ర ప్రకాష్‌ రాజ్‌ది. సీబీఐ ఆఫీసర్‌గా అతడి అందరినీ అలరించాడు. కేసు దర్యాప్తు సందర్భంగా ప్రకాష్‌ రాజ్‌ చెప్పే డైలాగ్స్, ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  https://youtu.be/Kk93JgAM7wA?si=5saRnFWzIEeDf3fR సుకుమారి (మురారి) మహేష్‌ బాబు హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మురారి’ (Murari) చిత్రం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని శబరి పాత్రలో సీనియర్‌ నటి మెప్పించింది. మహేష్‌ జాతకంలో ఉన్న గండం వల్ల అతడికి ఏం జరుగుతుందో అని భయపడుతూ సినిమాలో మంచి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసింది. హీరో కోసం చివర్లో ప్రాణ త్యాగం చేసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.  https://youtu.be/3GrsswRGUaA?si=TgwJ6hZRa0rtRu18 శ్రీకాంత్‌ (శంకర్‌దాదా MBBS) మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా చేసిన ‘శంకర్‌ దాదా MBBS’ చిత్రం అప్పట్లో ఎంత సెన్సేషన్‌ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసింది. ఇందులో ‘ఏటీఎం’ అనే పాత్ర ఎంతో కీలకమైనది. సీనియర్‌ నటుడు శ్రీకాంత్ (Srikanth) ఈ పాత్రలో కనువిందు చేశాడు. చిరుకి రైట్‌గా ఉంటూ సందర్భానుసరంగా వచ్చే సీన్లలో నవ్వులు పూయించాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’లోనూ శ్రీకాంత్‌ ఈ తరహా పాత్రనే చేసి అదరగొట్టాడు. https://youtu.be/QHdvEYMIOao?si=K5wkBfT-Y1gUFlZ3 రాజేంద్ర ప్రసాద్ (ఆ నలుగురు) డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదని నిరూపించిన చిత్రం ‘ఆ నలుగురు’ (Aa Naluguru). ఇందులో రఘు రామయ్య పాత్రలో సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) నటించాడు. నైతిక విలువలు కలిగిన ఓ పత్రికా ఎడిటర్‌గా, ఎంత కష్టం వచ్చినా న్యాయంగా వ్యవహరించే ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు.  https://youtu.be/AYZjTMg2EbM?si=iOSHIruH84KVRJ-0 శ్రీహరి (నువ్వొస్తానంటే నేనొద్దంటానా) సిద్ధార్థ్‌ - త్రిష జంటగా డ్యాన్స్‌ మాస్టర్ ప్రభుదేవ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో నటుడు శ్రీహరి (Srihari)కి మంచి పాత్ర దక్కింది. హీరోయిన్‌కు అన్నగా ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు. అన్న అంటే ఎలా ఉండాలో ఈ పాత్ర ద్వారా తెలియజేశారు. క్లైమాక్స్‌లో హీరో చేసిన హత్యను తనపైన వేసుకొని జైలుకు వెళ్లే దృశ్యాలు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతాయి.  https://youtu.be/WNCwQvHa1w4?si=f2K-X2pSMJSzfQtd గొల్లపూడి మారుతిరావు (లీడర్‌) దిగ్గజ నటుడు గొల్లపూడి మారుతిరావు (Gollapudi Maruti Rao).. ‘లీడర్‌’ సినిమాలో ఓ అద్భుతమైన క్యామియో చేశారు. సీనియర్‌ పొలిటిషన్‌గా హీరో రాణాతో ఆయన చెప్పే డైలాగ్స్‌ ప్రస్తుత రాజకీయాలకు అద్దం పడతాయి. ఆ సీన్‌పై మీరు ఓ లుక్కేయండి.  https://youtu.be/AjLNxJCU1Cs?si=nNVLqa_4N5Md1O8y అభినవ్‌ గోమఠం (ఈ నగరానికి ఏమైంది) తక్కువ సమయంలోనే మంచి క్రేజ్‌ సంపాదించుకున్న హాస్య నటుల్లో అభినవ్‌ గోమఠం ఒకరు. ఈ నగారానికి ఏమైంది చిత్రం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కౌషిక్ పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.  https://youtu.be/qAluEZGqhh8?si=xRLufanS8xSuqf9h సుహాసిని (నువ్వు నాకు నచ్చావ్‌) వెంకటేష్‌ - ఆర్తి అగర్వాల్‌ జంటగా చేసిన ఈ చిత్రంలో సీనియర్‌ నటి సుహాసిని (Suhasini) హీరోయిన్‌కు అత్తగా మెప్పించింది. అత్తింటిలో కొందరి ఆడవారి కష్టాలు ఎలా ఉంటాయో తన డైలాగ్స్‌ ద్వారా కళ్లకు కట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరోయిన్‌ తండ్రిని పెళ్లికి ఒప్పించే సీన్ అదరహో అనిపిస్తుంది.  https://youtu.be/XlXM5l95rEg?si=pepiyzzgooAEmbwe
    మే 01 , 2024
    EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
    EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
    యంగ్‌ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటింటిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం తొలి పార్ట్‌ కంటే ఇంకా బెటర్‌ టాక్‌ తెచ్చుకొని దూసుకెళ్తోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.78 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ‘టిల్లు స్క్వేర్‌’ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఇందులోని డైలాగ్స్‌ అని చెప్పవచ్చు. హీరో సిద్దూ తన డిఫరెంట్‌ వాయిస్‌ మాడ్యులేషన్‌తో చెప్పిన ఆ డైలాగ్స్‌ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  డైలాగ్‌ ఓ సీన్‌లో హీరోయిన్‌ లిల్లీ జోసేఫ్‌ (అనుపమా) తన తండ్రిని టిల్లు (సిద్దూ జొన్నలగడ్డ) ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఈ సీన్ నవ్వులు పూయిస్తుంది లిల్లీ: నా పూర్తి పేరు లిల్లీ జోసెఫ్‌ టిల్లు: అంటే మీరు క్రిస్టియన్సా? లిల్లీ: తండ్రిని చూపిస్తూ ఇతనే ఫాదర్‌ టిల్లు : చర్చి ఫాదరా? https://twitter.com/i/status/1774726359111307728 డైలాగ్‌ లిల్లీ ఫాదర్‌: ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను ఒక మగ పిల్లాడ్ని ఇలాగేనా పెంచేది?  టిల్లు తండ్రి: ఒక మగ పిల్లాడి తండ్రిగా చెప్తున్నాను నేనేం పెంచలేదు వాడే పెరిగాడు డైలాగ్‌ టిల్లు తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే.. టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్‌ ఏస్టేట్ ఐకూన్‌ టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది https://twitter.com/i/status/1774992506087944622 డైలాగ్‌ ఓ సీన్‌లో లిల్లీ మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్‌ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.  టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్‌ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి టిప్పు సుల్తాన్‌ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ.. https://twitter.com/i/status/1773542640488784015 డైలాగ్‌ లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు? టిల్లు : నిలబడా నేను.. వేస్ట్‌. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్‌ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి  https://twitter.com/i/status/1773655054655856994 డైలాగ్‌ సినిమాలో వచ్చే కారు సీన్‌లో లిల్లీ చాలా క్లోజ్‌గా ఉన్న సమయంలో టిల్లు ఓ మాట అంటాడు.  లిల్లీతో టిల్లు : పోయినసారి కంటే ఈ సారి గట్టిగా తగిలేటట్టు ఉంది గట్టి దెబ్బ అలాగే ఓ సీన్‌లో అమ్మాయి ఫొటోను చూస్తూ టిల్లు చెప్పే డైలాగ్‌ ఆడియన్స్ బాగా ఎంజాయ్‌ చేశారు.  టిల్లు:  పిల్ల హైలెట్‌గా ఉంది.. అబ్బో ఎవడి జీవితమో నాశనం https://twitter.com/i/status/1772913769770803358 డైలాగ్‌ లిల్లీతో టిల్లు చెప్పే మరో డైలాగ్‌ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  టిల్లు:  నీకు ఒకటి చెప్పాల్నా.. టిల్లు అనేటోడు నార్మన్‌ హ్యూమన్‌ బీయింగ్‌ అయితే కాదు. నేనొక కారణజన్ముడ్ని https://twitter.com/i/status/1774319933129916896 డైలాగ్‌ లిల్లీతో కారులో ప్రయాణిస్తూ గతంలో రాధికతో జరిగిన ఎపిసోడ్‌ గురించి సినిమాటిక్‌గా టిల్లు చెప్పే డైలాగ్‌ సూపర్‌గా అనిపిస్తుంది.  టిల్లు: ఫ్రెండ్స్‌ అందరితో కలిసి ఓ సినిమా చూసినా.. ఇట్స్‌ ఏ నల్లమల్ల ఫారెస్ట్‌.. విత్‌ నల్ల చీర.. ఫిల్మ్‌ బై రాధిక. చానా పెద్ద డైరెక్టర్‌ ఆమె.. భలే చెప్తది కథలు. ఓటీటీటీ.. ప్యాన్‌ మాల్కాజ్‌ గిరి మూవీ అది. దాని స్టోరీ ఏంటంటే లవ్‌, హార్ట్‌ బ్రేక్‌, హార్రర్‌, మిస్టరీ, థ్రిల్లర్‌, చీటింగ్‌, క్రైమ్‌ జానర్‌లో వచ్చింది. డైలాగ్‌ లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్‌ చెప్పు రాధిక. లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ  టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది.  అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.  నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8 డైలాగ్‌: బర్త్‌ డే రోజు.. లిల్లీ ఉన్న బిల్డింగ్‌కు వెళ్లిన సమయంలో.. టిల్లు : ఇదో పెద్ద ఇలాకతా మఫిలియా కొంపరా ఇది ఇక్కడ ఎవరు ఎవరితో ఆడుకుంటుర్రో తెల్వదు గానీ.. ప్రతీసారి ఇంపాక్ట్‌ ప్లేయర్‌లాగా నన్ను మాత్రం దింపుతున్నారు రా. మా సైడ్‌ జోకర్ అంటారు'  https://www.youtube.com/watch?v=sARNpvr4IoE పబ్‌లో ఓ అమ్మాయితో మాట్లాడుతూ... టిల్లు: చున్నీ ఉండదా ఈ డ్రెస్‌కు.. అమ్మాయి: ఇది బాడీకాన్ డ్రేస్.. టిల్లు..! టిల్లు: అచ్చా షాప్‌ వాడే మరచిపోయిండా.. ఎందుకంటే పిల్లగాళ్లు ఎగ్జైట్ అవుతున్నరూ.. పెళ్లి సంబంధం గురించి పిన్నితో మాట్లాడేటప్పుడు.. పిన్ని: అరెయ్ టిల్లు గీ పిల్ల జూడు ఎట్లున్నదో.. టిల్లు: ఇంకా పెళ్లిళ్లకు పిల్లల్ని చూడడం ఆపలేదా పిన్ని. మానస 5.7ఫీట్ హైట్.. కంప్లెక్సెన్ ఫేయిర్.. యూ పీపూల్ ఆర్ రేసిస్ట్స్... పిల్ల హైలెట్ ఉన్నది... అబ్బో ఎవడి జీవితమో నాశనం పిన్ని: నీకోసమేరా పిచ్చోడా.. టిల్లు: హెయ్! నాకొద్దు బొంగు... అడిగానా నిన్ను. పిన్ని: మళ్ల ఎప్పుడు చేసుకుంటవురా..  టిల్లు: చేసుకోను నేను... నీయమ్మ నాపెళ్లితో మీ అబ్సేషన్ ఏందే.. నాకు అర్థం అవతలేదు. నీ కమీషన్ కోసం నా కడుపు కొట్టకు, బతకనీయ్ కొన్నిరోజులు. నీయమ్మ సాయంత్రం కాంగనే.. అంటీలు అందరూ చూట్టూ జేరి మాఫియా..  టిల్లు డాడీ: మీ అమ్మలాగా ఉన్న ఓ మంచి పిల్లను జూసి పెళ్లి చేసుకో.. టిల్లు:  డాడీ... నీకు మార్కెట్‌లో 'బెబ్స్‌' ఎట్లున్నరో మినిమం ఐడియా కూడా లేదు నువ్వు మాట్లాడకు.. అమ్మసోంటి అమ్మాయిలు లేరు బయటా.. అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు. వీకెండ్ పార్టీలో తొలి సారి లిల్లీని కలిసినప్పుడు... టిల్లు: ఉన్నడా భాయ్‌ ఫ్రెండ్.. లిల్లీ: నీకెందుకు..? టిల్లు: హా.. ఉంటే నా షూ నేను ఏసుకపోతా... లిల్లీ: లేదంటే.. టిల్లు: నిన్ను ఏసుకోని పోతా..  లిల్లీ: అబ్బా... ఎక్కడికీ..  టిల్లు: నువ్వు ఏడికంటే ఆడికి..  మందు గురించి మాట్లాడే టైంలో.. టిల్లు: మందు ఎప్పుడైనా మర్యాదగా తాగలి.. అట్ల రెవల్యూషన్‌లాగా రప్ప.. రప్ప తాగొద్దు. అర్థమైందా.. కారులో లిల్లీతో రొమాంటిక్ సీన్‌లో టిల్లు: ఒకటీ.. రెండూ, మూడూ, నాలుగు... మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు.. లిల్లీ: స్మైలింగ్.. టిల్లు: ప్రతి మనిషికి బాడీలో ఓ వీక్‌ పార్ట్ ఉంటదీ కదా.. అట్లా నీ వీక్ పార్ట్ ఏది?... లీప్సా.. లిల్లీ:  లేదు, నా కళ్లు. నీ వీక్ స్పాట్ ఎక్కడా? టిల్లు:  నాదా...? నా హార్ట్ చాలా వీకూ..  ** రొమాంటిక్ మ్యూజిక్…** టిల్లు: ఫర్ఫ్యూమ్ అచ్చా హై.. కౌనా సా.. లిల్లీ: నా ఫర్ఫ్యూమ్ స్మెల్ కాదు.. నా స్మెల్‌ ఏంటో తెలిసిననాడు మాట్లాడు. టిల్లు:  నువ్వోమో డీప్‌గా మాట్లాడుతున్నావ్... నేనేమో చీప్‌గా మాట్లాడుతున్నా.. లిల్లీ: Do You Know the best part Of Kiss టిల్లు: Kiss లిల్లీ: నా లిప్స్.. నీ లిప్స్‌ను టచ్‌ చేసే ముందు ఉండే ఫ్యూ సెకన్స్..  పబ్‌లో టిల్లుతో లిల్లీ లిల్లీ: దొరికింది కదా… అని ఏది పడితే అది తినొద్దు.. Good Sex is Like a Good food 'టిల్లు: what do you mean good sex? sex is good huh? లేనోన్ని అడుగు బాధేందో తెలుస్తది. లిల్లీతో ఉన్న ట్విస్ట్ రివీల్ అయినప్పుడు.. షానన్ డైలాగ్ షానన్:  ప్రతిసారి ఎక్కడ పడుతావ్‌రా… ఇలాంటి జంబల్ హార్ట్స్‌ లేడీస్‌నీ.. “ఎర్రిపప్ప అయ్యి.. అయ్యి ఆలసట రావడం లేదర నీకూ?... నీ యంకమ్మ..! క్లైమాక్స్‌లో లాస్ట్‌ డైలాగ్‌ లిల్లీ: పోయిన సారి ఆ రాధికకు బెయిల్ ఎందుకు ఇచ్చావ్.. ఈసారి లిల్లీని అరెస్ట్ ఎందుకు చేయించావ్? టిల్లు: ఎందుకంటే ఆ రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది... ఈ లిల్లీ నన్ను మోసం చేయడానికే ప్రేమించింది. https://twitter.com/i/status/1773940395300544591
    ఏప్రిల్ 02 , 2024
    August 15 Celebrity Birthdays: స్వాతంత్ర్య దినోత్సవం రోజున జన్మించిన సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!
    August 15 Celebrity Birthdays: స్వాతంత్ర్య దినోత్సవం రోజున జన్మించిన సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!
    ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. ఆ రోజును యావత్ భారతావని గౌరంవగా భావిస్తారు. ఆగస్టు 15న ఏ కార్యక్రమం జరిగినా గొప్పగా పేర్కొంటూ కలకాలం గుర్తించుకుంటారు. ఈనేపథ్యంలో ఆగస్టు 15న జన్మించిన సినీ ప్రముఖులు ఎవరెవరు ఉన్నారో ఓసారి చూద్దాం.. సుహాసిని మణిరత్నం సుహాసిని తమిళనాడులోని పరమకుమిడిలో 1961 ఆగస్టు 15న జన్మించింది. తమిళం , తెలుగు , మలయాళం, కన్నడ చిత్రాలలో నటించింది . కే బాలచందర్ డైరెక్షన్‌లో వచ్చిన సింధు భైరవి (1985) లో తన నటనకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది . తెలుగులో ఎగిరేపావురమా,  సంసారం చదరంగం, చంటబ్బాయి, నువ్వునాకునచ్చావ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  అర్జున్ సర్జా  అర్జున్ తెలుగు, తమిళ సినిమా పరిశ్రమ నటుడు, దర్శకుడు. ఇతడు సుమారు 130 సినిమాలలో నటించాడు. కొన్నింటికి తానే స్వయంగా డైరెక్ట్ చేశాడు. 1962 ఆగస్టు 15న కర్ణాటకలోని తుమకూర్‌లో జన్మించారు. అర్జున్‌కు ఇద్దరు ఆడ పిల్లలు, ఐష్వర్య సర్జా, అంజనా సర్జా. ఇతను హనుమంతుని వీర భక్తుడు.  అందువల్లే శ్రీఆంజనేయం చిత్రంలో ఆంజనేయునిగా నటించాడు.  అద్నాన్ సమి  అద్నాన్ సమి ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు. 1971 ఆగస్టు 15న లండన్‌లో సమి జన్మించారు. హిందీ, తెలుగు చిత్రాల్లో వందలాది సాంగ్స్ పాడారు.  పలు సినిమాల్లోనూ నటుడిగా యాక్ట్ చేశారు. భజరంగ్ భాయ్ జాన్ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించారు. 2016లో భారత పౌరసత్వం పొందారు. సంగీతంలో ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2020లో పద్మశ్రీ అవార్డుతో ఆయన్ను సత్కరించింది.   ఉత్తేజ్ ఉత్తేజ్ 1975, ఆగస్ట్ 15న నల్గొండ జిల్లాలోని సీతారాంపురంలో జన్మించారు. తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా, సంభాషణల రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు 197 సినిమాల్లో నటించారు.  మనీ, మనీ మనీ, అంతం, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, డేంజర్ వంటి హిట్ చిత్రాలకు మాటలు రాశాడు. చందమామ సినిమాకు ఉత్తమ హాస్య నటునిగా నంది బహుమతి పొందాడు. అయాన్ ముఖర్జి అయాన్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు.  1983 ఆగస్టు 15న  పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించారు. బ్రహ్మాస్త్ర, వేకప్‌సిడ్, 'హే జవానిహై దివాని' వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశారు.  ప్రస్తుతం బ్రహ్మాస్త్ర పార్ట్ 2 తెరకెక్కించి పనిలో ఉన్నారు. ఈ చిత్రం మూడు పార్ట్‌లలో రానుంది.  రాళ్లపల్లి రాళ్ళపల్లి ప్రముఖ తెలుగు క్యారెక్టర్ అర్టిస్ట్. ఆయన తూర్పు గోదావరి జిల్లా, రాచపల్లిలో 1945, ఆగస్టు 15 న జన్మించారు.  రాళ్లపల్లి అసలు పేరు రాళ్లపల్లి నరసింగరావు. తెలుగులో ఆయన దాదాపు 800కు పై చిత్రాల్లో నటించారు. తనికెళ్ల భరణి వంటి రచయితలకు ఆయన మార్గదర్శి. నాటకరంగంలో 8వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.
    ఆగస్టు 14 , 2023
    <strong>Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!</strong>
    Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!
    ప్రేమ అంటే రెండు అక్షరాల కలయిక కాదు. రెండు మనసుల కలయిక. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పరితపించేది, అన్వేషించేది ప్రేమ కోసమే. మనిషి నుంచి పశు పక్ష్యాదుల వరకు ప్రేమతోనే జీవితాలు ముందుకు సాగుతుంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలతో సంబంధం లేకుండా జీవన నావా ముందుకు సాగాలంటే ప్రేమ అనే చమురు చాలా అవసం. ఒకరిపై ఎంత ప్రేమో చెప్పాలంటే మాటలు సరిపోవు. కానీ కొన్ని మనసును తాకి మనలోని ప్రేమను ధ్వనింపజేస్తాయి. తెలుగు సినీలోకంలో ప్రేమ కావ్యాలు కోకొల్లలు. ప్రేక్షకులను ప్రేమ మాయలోకి దింపిన ఆ దృశ్య కావ్యాల నుంచి మనసుకు హత్తుకునేలా చేసిన డైలాగ్స్ మీకోసం.. [toc] బేబీ “ఫస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడే అనుకున్నా.. రెండోసారి, ఇంకోసారి ప్రేమ అనే మాట ఉండదని” “మీ అంత బలం లేకుండొచ్చు. గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఇంకెవడూ ఎవడూ కొట్టలేడు” “అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు కష్టం వస్తుందని దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడు” వాన “ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నన్ను మర్చిపోయినా.. ముసలిదానివైపోయినా.. చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు” మన్మథుడు “నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంతిష్టమో చెప్పగలను!” కంచె&nbsp; “గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం” నిన్నుకోరి “నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే… లైఫ్‌ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది” ఆర్య “నీ కోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను “ ఆరెంజ్‌ “ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే.. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే.. జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి” ప్రేయసిరావే “ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవ కణంలోనూ నీ జ్ఞాపకమే ఉంటుంది.” ఏమాయ చేశావె “ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే , ఒక్క నువ్వు తప్ప.” మళ్లీ మళ్లీ ఇది రాని రోజు “కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!”&nbsp; మజిలి “పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది” ఊపిరి “ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెబితే.. ఎక్కడ రిజెక్ట్‌ చేస్తారోనని భయం. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయం. మనకి కావాల్సిన వాళ్లు దూరమైతే.. ఎలా ఉన్నారని భయం. నిజానికి భయం ఉంటే.. ప్రేమ ఉన్నట్టే” జాను “పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే” అందాల రాక్షసి “నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను” "రాళ్ళను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు." ఓయ్ “నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే” కలర్ ఫొటో “ప్రేమించిన వారిని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ.” “ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి..ఈ సముద్రం గట్టున నిల్చున్న మనిషి ఇద్దరూ ఒకటే సముద్రం వచ్చి చల్లగా మన కాళ్లు కడుగుతోందని అనుకుంటాం. కానీ మనకే తెలియకుండా కాళ్ల కింద ఇసుకని వెనక్కి లాగేసుకుని పోతుంది. &nbsp;మొగుడి దగ్గర మనసు దాచుకోగలం.. కానీ ఒళ్లు దాచలేం.” “ఈ ప్రపంచం మొత్తమ్మీద స్వచ్ఛమైన వాటిలో రెండోది అమ్మాయి నవ్వు.మొదటిది ఓ మగాడి కన్నీళ్లు.” “నీరు పట్టిన చద్దన్నం ఆకలి తీర్చకపోవచ్చు..కానీ కుడితి కలిపి పెడితే ఆవులు ఆవురావురుమంటూ తాగుతాయి. అలాగే మురికి నీళ్లు మనకు దాహం తీర్చకపోవచ్చు..కానీ నిప్పును ఆర్పుతాయి. ప్రపంచంలో ఏదీ ఊరికే పోదు అన్నీ ఉపయోగపతడాయి.” మనం “మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు” పడిపడిలేచె మనసు మిమ్మల్ని ప్రేమించిన వాళ్లకి.. అది కష్టమైనా, నష్టమైనా చివరి వరకూ మీతోనే ఉండాలనిపిస్తుంది. హలో గురు ప్రేమకోసమే “గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి... మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం.” తీన్‌మార్ “మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్‌ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది” అల వైకుంఠపురములో.. “ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కరెక్టే.., కానీ నిజం చెపితేనే కదా, ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.” “బరువు పైన ఉంటే కిందకి చూడలేం, ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.” “ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే వెలుగు, అదే గుడిలో వెలిగితే ఊరంతటికి వెలుగు” “ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మ నాన్నలు అనుకోవడమేనా, అమ్మ, నాన్ననాన్నలు బాగుండాలని పిల్లలు అనుకోరా.! “ఒక యుద్ధం వచ్చిన దేశం లో ఉన్నవాళ్ళందరూ, కులం, మతం ప్రాంతం అనే తేడాలు లేకుండ కలిసిపోతారు సర్, &nbsp;ఒక కష్టం వచ్చినప్పుడే, కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ల స్వార్థం, ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.”
    ఆగస్టు 23 , 2024
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    వెండితెరపై మంచి జోడీగా పేరున్న జంటల్లో విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్‌’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. అతి తక్కువ సమయంలోనే బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. అయితే వీరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. విజయ్‌ - రష్మిక డీప్‌ లవ్‌లో ఉన్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. తాము కేవలం స్నేహితులమేనని పలు సందర్భాల్లో వీరు స్పష్టం చేసిన్పపటికీ ఈ రూమర్లకు బ్రేక్‌ పడలేదు. అయితే తాజాగా రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు విజయ్‌, ఆమెకు మధ్య ఏదో ఉందన్న సంకేతాలు ఇచ్చాయి.&nbsp; ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన 'గం గం గణేశా'.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ వేడుకలో రష్మికను ఆనంద్‌ పలు ప్రశ్నలు అడిగాడు. ఇటీవల రష్మిక పోస్టు చేసిన పెట్‌ డాగ్‌ ఫొటోల్లో విజయ్ పెట్‌ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్‌ అని అడగ్గా రష్మిక.. ఆరా (రష్మిక పెట్‌ డాగ్‌) నా ఫస్ట్‌ బేబీ, స్మార్ట్‌ (విజయ్‌ పెట్‌ డాగ్‌) నా సెకండ్‌ బేబీ అని చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్‌ కో-స్టోర్‌ ఎవరు అని ఆనంద్‌ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్‌ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్‌ తీసుకొని “ఆనంద్‌ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా” అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్‌ వెంటనే రౌడీ, రౌడీ స్టార్‌ అని అరడవంతో రౌడీ బయ్‌ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది. ప్రస్తుతం రష్మిక - ఆనంద్‌ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://youtu.be/LGt6bCE2ZMo?si=uV2RIkLzfv8Kjj_p క్లారిటీ ఇచ్చేసినట్లేనా? రష్మిక లేటెస్ట్ కామెంట్స్‌తో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరోతో ఉన్న రిలేషన్‌పై ఇన్నాళ్లకు రష్మిక నోటి నుంచి ఓ క్లారిటీ వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఆనంద్‌ దేవరకొండతో ‘మనం ఓ ఫ్యామిలీ’ అంటూ చెప్పడం ద్వారా విజయ్‌తో తన ప్రేమయాణాన్ని రష్మిక రివీల్‌ చేసిందని కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో విజయ్‌, రష్మిక విడివిడిగా పోస్టు ఫొటోలు ఒకే లోకేషన్‌వి కావడంతో వారు డేట్‌లో ఉన్నట్లు వార్తలు పుకార్లు మెుదలయ్యాయి. ఇందులో వాస్తవమేదో తెలియక అటు విజయ్‌ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ తలలు బాదేసుకునేవారు. ఇన్నాళ్లకు తమకు కావాల్సిన సమాధానం వచ్చిందని ఇరువురు ఫ్యాన్స్‌ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. విజయ్‌ - రష్మిక రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ చూడముచ్చటగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; మెంటల్‌ క్యారెక్టర్‌ చేయాలి: రష్మిక ఆనంద్‌ దేవరకొండకు 'బేబీ' (Baby) ద్వారా బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ సాయి రాజేష్‌ (Sai Rajesh) కూడా ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురించి రష్మిక మాట్లాడుతూ 'నేను బేబీ సినిమా చూశాను. ఆ సినిమా చూశాక మీతో సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. మీ హార్డ్‌ వర్క్‌, డెడికేషన్‌ నాకు తెలుసు. మెుదటిసారి బేబీ చూసినప్పుడు ఏడ్చేశా. ఒక నటిగా ఆ సినిమా చూశాక.. ఒక మెంటల్‌ క్యారెక్టర్‌ అయినా మీ డైరెక్షన్‌లో చేయాలనిపించింది' అని రష్మిక వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1795146872748728505 ‘గం గం గణేశా’ రిలీజ్‌ ఎప్పుడంటే? ఇక గం గం గణేశా చిత్రానికి వస్తే.. ఈ మూవీకి ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంద్‌ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాత్సవ, నయన్‌ సారిక నటించారు. ఈ సినిమాలో జబర్దస్త్‌ ఫేమ్ ఇమ్మాన్యుయేల్‌, బిగ్‌ బాగ్‌ ఫేమ్‌ ప్రిన్స్‌ యావర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ‘గం గం గణేశా’ సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 31న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.&nbsp;
    మే 28 , 2024
    Actress Samantha : ఫ్యాన్స్‌ కొంటె ప్రశ్నలకు.. క్రేజీ ఆన్సర్స్‌ ఇచ్చిన సమంత
    Actress Samantha : ఫ్యాన్స్‌ కొంటె ప్రశ్నలకు.. క్రేజీ ఆన్సర్స్‌ ఇచ్చిన సమంత
    టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత తన లేటెస్ట్‌ మూవీ శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ మూవీపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ క్రమంలో సమంత ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించింది. శాకుంతలం సినిమాతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అలాగే నటి మృణాల్‌ ఠాకూర్‌ అడిగిన దానికి కూడా సమంత ఆన్సర్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టులను సామ్‌ ట్విటర్‌లో పంచుకుంది. అసలు నెటిజన్లు సామ్‌ను ఏం అడిగారు?. అందుకు సమంత ఇచ్చి క్రేజీ ఆన్సర్స్‌ ఏంటీ? ఇప్పుడు చూద్దాం.&nbsp; మృణాల్‌ ఠాకూర్‌: శాకుంతలం సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా. నువ్వు చాలా ఇన్‌స్పైరింగ్‌. నా ప్రశ్న ఏంటంటే మనం కలిసి ఎప్పుడు సినిమా చేయబోతున్నాం? సామ్‌: కాంగ్రాట్యూలేషన్స్‌.... ‘గుమ్రా’ బ్యూటిఫుల్‌ మృణాల్‌ ఠాకూర్‌. నీ ఆలోచన చాలా నచ్చింది. మనం చేద్దాం. https://twitter.com/Samanthaprabhu2/status/1645087094765932545 నెటిజన్‌: మీ నిజమైన అభిమాని కోసం ఒక్క మాటలో ఏం చెబుతారు?&nbsp; సామ్‌: నిన్నటి వరకు స్ట్రేంజర్.. ఇవాళ కుటుంబ సభ్యుడు https://twitter.com/Samanthaprabhu2/status/1645082714532642816 నెటిజన్: మీకు ధైర్యం ఎక్కడ నుంచి వస్తోంది? ఎన్నో సమస్యలు ఉన్నా మీరు ఎలా మూవ్‌ ఆన్‌ అవుతున్నారు.&nbsp; సామ్: ఎందుకంటే నా కథ ఎలా ముగియాలో నేను నిర్ణయిస్తాను కాబట్టి. https://twitter.com/Samanthaprabhu2/status/1645082177414246401 నెటిజన్‌: మీరు శాకుంతలం రిలీజ్‌ రోజు ఫ్యాన్స్‌ షో చూసేందుకు దేవి 70MM థియేటర్‌కు వస్తారా? సామ్: రావొచ్చేమో? రావాలా..! https://twitter.com/Samanthaprabhu2/status/1645080239582871552 నెటిజన్‌: శాకుంతలం, ఖుషి, బాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌తో&nbsp; శామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాముల్గా ఉండదు సామ్‌: ఈ ఏడాది కూడా చాలా క్రేజీగా గడవబోతోంది. https://twitter.com/Samanthaprabhu2/status/1645080067968749568 నెటిజన్‌ : నువ్వు టీనేజ్ అమ్మాయిగా ఎంతో క్యూట్‌గా ఉన్నావు. ఈ లుక్‌ను ఇలాగే కొంత కాలం కొనసాగించాలని భావిస్తున్నారా? సామ్‌: గ్లాసెస్‌.. నా కొత్త బెస్ట్‌ ఫ్రెండ్‌ https://twitter.com/Samanthaprabhu2/status/1645079008026189828 నెటిజన్‌: మీ ఉద్దేశంలో ఆత్మగౌరవం, సెల్ఫ్‌ లవ్‌ అంటే ఏంటి? సామ్‌ : మీ గురించి తెలుసుకోవడానికి ఇతరులపై ఆధారపడనప్పుడు..మీరు మీతోనే సంతోషంగా ఉండగలిగినప్పుడు.. https://twitter.com/Samanthaprabhu2/status/1645078774957088774 నెజిజన్‌: మీరు వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో జయపజయాలను ఎలా తీసుకుంటారు. మీ హార్ట్‌ అండ్ మైండ్‌లో ఎమోషన్స్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? సామ్‌: విజయాల కంటే అపజయాలే మీకు ఎక్కువ గుణపాఠాలు నేర్పుతాయి. ఓటములే మిమ్మల్ని మంచి వ్యక్తిగా మారుస్తాయి. https://twitter.com/Samanthaprabhu2/status/1645075968133050369 నెటిజన్‌ : మీరు ఓ బేబి సినిమా అప్పుడు నాకు రిప్లై ఇచ్చారు. అది హిట్ అయింది. ఇప్పుడు కూడా ఒక రిప్లై ఇవ్వండి.. శాకుంతలం బ్లాక్‌ బస్టర్ అవుద్ది. సామ్‌: వామ్మో... అలాంటప్పుడు నీతో గొడవ పెట్టుకోకూడదు(నవ్వుతూ) https://twitter.com/Samanthaprabhu2/status/1645074391871668230
    ఏప్రిల్ 10 , 2023
    <strong>Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!</strong>
    Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!
    ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనను కొద్ది కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ‌ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.&nbsp; [toc] అసలేం జరిగిందంటే? జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘2017లో జానీ మాస్టర్‌ నాకు పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్‌ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్‌ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం (సెప్టెంబర్‌ 19) ఆయన్ని అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. తప్పు చేస్తే ఒప్పుకోండి: మంచు మనోజ్‌ మైనర్ అయినప్పటి నుంచి జానీ మాస్టర్‌ తనను వేధించాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత నుంచి జానీ మాస్టర్‌ కనిపించకుండా పోయారు. దీనిపై నటుడు మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ‘జానీ మాస్టర్.. మీరు కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు. https://twitter.com/HeroManoj1/status/1836692133216174368 జానీ మాస్టర్‌ టాప్‌-10 సాంగ్స్‌ జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని కాస్త పక్కన పెడితే ఆయన బెస్ట్‌ కొరియోగ్రాఫర్ అన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో పలు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌కు నృత్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఇటీవల నేషనల్‌ అవార్డు సైతం అందుకొని దేశంలోనే బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు. ఇప్పటివరకూ ఆయన కొరియోగ్రఫీలో వచ్చిన టాప్‌ -10 సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం&nbsp; మేఘం కరిగేనా (తిరు) తమిళంలో ధనుష్‌ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రంబళం’ సినిమా తెలుగులో 'తిరు' పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలోని 'మేఘం కరిగేనా' సాంగ్‌ను జానీ మాస్టర్‌ అద్భుతంగా కొరియోగ్రాఫ్‌ చేశారు. ధనుష్‌, నిత్య స్టెప్పులను నెక్స్ట్‌ లెవల్లో కంపోజ్‌ చేశారు. గతంలో ప్రభుదేవ చేసిన ‘వెన్నెలవే వెన్నలవే’ తరహాలో ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్‌ చేసింది. ఇందుకుగాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నేషనల్‌ బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై అందరి ప్రశంసలు అందుకున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=0IdqwA2GXgY అరబిక్‌ కుతు (బీస్ట్‌) విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలోని అరబిక్‌ కుతు సాంగ్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీకి తమిళ ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. విజయ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు స్టెప్స్‌ కంపోజ్‌ చేసిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. నటి పూజా హెగ్డే కూడా కెరీర్‌ బెస్ట్‌ స్టెప్స్‌తో ఓ ఊపు ఊపింది. https://www.youtube.com/watch?v=vOYJmUE_U24 రంజితమే (వారసుడు) విజయ్‌, రష్మిక జంటగా నటించిన ‘వారసుడు’ చిత్రంలోని రంజితమే సాంగ్‌ కూడా పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ పాటలో విజయ్‌, రష్మిక డ్యాన్స్‌ దెబ్బకు థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా సాంగ్‌ చివరిలో వచ్చే సింగిల్‌ టేక్‌ స్టెప్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ సాంగ్‌తో జానీ మాస్టర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=RoBavDxV-Y8 రారా రక్కమ్మ (విక్రాంత్‌ రోణ) విక్రాంత్‌ రోణ సినిమాలోని రారా రక్కమ్మ సాంగ్‌ దేశంలోని మ్యూజిక్‌ లవర్స్‌ను షేక్‌ చేసింది. ముఖ్యంగా జానీ మాస్టర్‌ అందించిన సిగ్నేచర్‌ స్టెప్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. చాలా ముంది యువత ఆ హుక్‌ స్టెప్‌పై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యారు. ఈ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్‌, కన్నడ నటుడు సుదీప్‌తో ఆడిపాడింది.&nbsp; https://www.youtube.com/watch?v=aC9KBju5BNY నువ్వు కావాలయ్యా (జైలర్‌) రజనీకాంత్‌ గత చిత్రం ‘జైలర్‌’లో నువ్వు కావాలయ్యా సాంగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. మిల్క్‌ బ్యూటీ తమన్న వేసిన హుక్‌ స్టెప్‌కు యూత్‌ ఫిదా అయ్యారు. ఈ సాంగ్‌ను కూడా జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేయడం విశేషం. ఈ పాటకు యూట్యూబ్‌లో మిలియన్స్‌ కొద్ది వ్యూస్‌ వచ్చాయి. రీల్స్‌ సైతం పెద్ద ఎత్తున చేశారు.&nbsp; https://www.youtube.com/watch?v=xMOuFKJmjNk రౌడీ బేబీ (మారి 2) సాయి పల్లవి, ధనుశ్ నటించిన ‘మారి 2’లోని రౌడీ బేబి సాంగ్‌ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట యూట్యూబ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి, ధనుష్‌ స్టెప్పులు అందరినీ కట్టిపడేశాయి. వాస్తవానికి మెుదట ఈ సాంగ్‌ ప్రభుదేవ వద్దకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో జానీ మాస్టర్‌ ఈ పాటను కంపోజ్ చేశారు. ప్రభుదేవా పర్యవేక్షణలో సాంగ్‌ చిత్రీకరణ జరిగింది.&nbsp; https://www.youtube.com/watch?v=O6FNcjUs0YI బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో) ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురంలో’ని బుట్టబొమ్మ సాంగ్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాయకుడు అర్మాన్‌ మాలిక్ ఆలపించిన పాటకు జాని మాస్టర్‌ తనదైన శైలిలో స్టెప్పులు డిజైన్‌ చేశారు. సాహిత్యానికి తగ్గట్లు యూనిక్‌ స్టెప్పులను బన్నీ చేత వేయించి సాంగ్‌ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించాడు. https://www.youtube.com/watch?v=2mDCVzruYzQ సినిమా చూపిస్తా మావా (రేసు గుర్రం) ‘రేసుగుర్రం’లోని మాస్‌ బీట్‌ ఉన్న సినిమా చూపిస్తా మావ పాటను కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫ్‌ చేశారు. ఇందులో బన్నీ, శ్రుతి హాసన్ వేసే స్టెప్పులు వీక్షకులను ఫిదా చేశాయి. ఆధ్యాంతం ఉత్సాహాం నింపేలా జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్‌ చేయడం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=H7EAJW8jYzA లైలా ఓ లైలా (నాయక్‌) రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించిన సినిమా ‘నాయక్’. ఈ సినిమాలో ‘లైలా ఓ లైలా’ పాటతో చెర్రీ ఓ బెస్ట్ డాన్సర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. పక్క ఇండస్ట్రీ వాళ్లు కూడా చెర్రీ టాప్ డాన్సర్ అని ప్రశంసించారు. ఈ పాటలో మాస్ స్టెప్పులకు తగ్గట్టుగానే చాలా క్లాసిక్ స్టెప్పులను కూడా జానీ మాస్టర్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ చేశాడు. https://www.youtube.com/watch?v=HGgHSi-kg78 ఏం మాయో చేశావే (ద్రోణ) 2009లో నితిన్ హీరోగా వచ్చిన ‘ద్రోణ’ సినిమాతో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఢీ’ షోలో జానీ మాస్టర్‌ టాలెంట్‌ చూసిన నితిన్‌ ఈ అవకాశాన్ని ఆయనకు అందించారు. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన ’ఏం మాయ చేశావో’ సాంగ్ అప్పట్లో సూపర్‌ హిట్‌ అయ్యింది. నితిన్‌ చేత ఆ స్థాయిలో స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ ఎవరూ అంటూ అంతా జానీ మాస్టర్‌ కోసం తెగ సెర్చ్ చేశారు. ఆ సాంగ్‌ తర్వాత నుంచి జానీ మాస్టర్‌ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=DPdL89Ho4P8
    సెప్టెంబర్ 19 , 2024
    5 Years Of Jersey : సినిమా సక్సెస్ కావడానికి అంతలా ఏముంది?
    5 Years Of Jersey : సినిమా సక్సెస్ కావడానికి అంతలా ఏముంది?
    నేచురల్ స్టార్‌ నాని (Nani) నటించిన జెర్సీ (Jersey) చిత్రం అతడి కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. 2019లో ఏప్రిల్‌ 19న విడుదలైన ఈ చిత్రం.. టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాని నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇందులో నాని నటనకు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. రిపీటెడ్‌ మోడ్‌లో ఈ సినిమాను చాలా ఏమోషనల్ అయ్యారు. నేటితో (ఏప్రిల్‌ 19) ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ‘జెర్సీ’ సక్సెస్‌కు కారణమైన అంశాలేంటో ఓసారి గుర్తు చేసుకుందాం.&nbsp; స్టోరీ అండ్ స్క్రీన్‌ ప్లే జెర్సీ సినిమా ఘన విజయం సాధించడానికి మూలకారణం ‘కథ’. చాలా యునిక్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్స్‌ డ్రామాకు తండ్రి కొడుకుల ఎమోషనల్‌ టచ్ జోడించడం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి స్క్రీన్‌ప్లే ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. అర్జున్‌ జర్నీని హృదయానికి హత్తుకునేలా ఆయన చూపించారు. కథలో ఫ్యామిలీ, త్యాగం, ఏమోషనల్‌, స్పోర్ట్స్‌ను మిళితం చేసి చక్కటి విజయాన్ని అందుకున్నారు.&nbsp; ప్రధాన తారాగణం నటన కథ ఎంత బాగున్నా దానికి తగ్గ తారాగణం లేకపోతే ఆశించిన ఫలితం రాదు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. పాత్రలకు తగ్గట్లు నటీనటులను ఎంచుకొని ఆయన మంచి ఫలితాన్ని రాబట్టాడు. ముఖ్యంగా అర్జున్ పాత్రకు నాని ఎంచుకోవడం ద్వారానే ఆయన సంగం విజయం సాధించాడని చెప్పవచ్చు. తెరపై చూస్తున్నంత సేపు అర్జున్‌ పాత్ర తప్ప నాని ఎక్కడా కనిపించలేదు. హీరో భార్య సారా పాత్రలో శ్రద్దా శ్రీనాథ్‌ కూడా అద్భుత నటన కనబరిచింది. నాని, శ్రద్ధా కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. అర్జున్‌ కోచ్‌గా నటించిన సత్యరాజ్‌ కూడా సినిమాపై మంచి ప్రభావం చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తన అసాధారణమైన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాడు. సంగీతం - సినిమాటోగ్రఫీ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన సంగీతం సినిమాను హైలెట్‌గా నిలిపింది. చాలా కాలం తర్వాత మంచి పాటలు విన్నామన్న ఫీలింగ్‌ అప్పట్లో ప్రేక్షకులకు కలిగించింది. ఇక&nbsp; నేపథ్య సంగీతం కూడా సినిమాకు చాలా బాగా కుదిరింది. ఆడియన్స్‌ ఎమోషనల్‌గా సినిమాకు కనెక్ట్‌ అయ్యేందుకు BGM ఉపయోగపడింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలకు అనిరుధ్‌ ఇచ్చిన BGM.. ఆ సీన్స్‌ తాలుకూ డెప్త్‌ను తెలియజేసింది. మరోవైపు సినిమాటోగ్రఫీ కూడా జెర్సీ చిత్రానికి ప్లస్‌గా మారింది. సినిమాటోగ్రాఫర్‌ సాను వర్గీస్‌.. చూపించిన విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. నటీనటుల ముఖాల్లోని భావోద్వేగాలను ఆయన చాలా బాగా క్యాప్చర్‌ చేశారు. అలాగే క్రికెట్‌ మ్యాచ్‌లను అతడు చాలా రియలస్టిక్‌గా చూపించాడు.&nbsp; తండ్రి-కొడుకుల అనుబంధం టాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ‘జెర్సీ’. ఈ సినిమాలోని అర్జున్‌ పాత్ర చాలా మంది తండ్రులకు కనెక్ట్‌ అవుతుంది. కుమారుడి సంతోషం కోసం ఏదైనా సాధించాలని తపన పడే ఆ పాత్ర మిడిల్‌క్లాస్‌ జీవితాలకు అద్దం పడుతుంది. కొడుకు పుట్టిన రోజున అడిగిన జెర్సీని కూడా బహుమతిగా కొనివ్వలేని తండ్రి.. తన బిడ్డకు హీరోలా కనిపించాలన్న సంకల్పంతో ఆపేసిన క్రికెట్‌ను మళ్లీ మెుదలు పెట్టడం ఆడియన్స్‌ను చాలా ఏమోషనల్‌ చేస్తుంది.&nbsp; జెర్సీ&nbsp; డైలాగ్స్‌ జెర్సీ సినిమా గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం డైలాగ్స్‌. ఒక్కో డైలాగ్‌ ప్రతీ ఒక్కరికీ జీవిత పాఠాన్ని నేర్పేలా స్పూర్తివంతంగా ఉంటాయి. ఆణిముత్యాల్లాగా కనెక్ట్ అవుతాయి. సినిమాల్లోని హైలెట్‌ డైలాగ్స్‌ ఇప్పుడు చూద్దాం. 'ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు'_ అర్జున్‌ 'నీ అంత టాలెంట్‌ ఉన్న వాళ్లని చాలా మందిని చూశాను. కానీ.. డిస్సిప్లైన్‌ లేకుండా ఎదిగిన వాళ్లని ఒక్కరిని కూడా చూడలేదు'_ సత్యరాజ్‌ పాత్ర&nbsp; కొడుకు: నాన్న నువ్వు మళ్లీ క్రికెట్‌ ఆడవా? అర్జున్‌ : నువ్వు చెప్పు ఆడనా వద్దా? కొడుకు: ఆడు నాన్న నువ్వు ఆడితే చాలా బాగుంటుంది.. హీరోలా అనిపిస్తావు? ‘ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్‌ చేయంది.., నా కొడుకు ఒక్కడే. వాడికి వాళ్ల నాన్న ఉద్యోగం చేస్తున్నాడా? డబ్బులు సంపాదిస్తున్నాడా? సక్సెస్ఫుల్లా? ఫెయిల్యూరా? ఇవేమి సంబంధం లేదు.., వాడికి నేను నాన్న అంతే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గిన తట్టుకోలేను సారా..' లాస్‌ మూడు రోజులలో నాకు నేను దొరికాను సర్‌. నా 36 ఏళ్ల జీవితం కనిపించింది' 'అర్జున్‌ కథ, వందలో సక్సెస్‌ అయిన ఒకడిది కాదు, సక్సెస్‌ అవ్వకపోయిన ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది' ‘మా నాన్న సంకల్పం ఎంత గొప్పది కాకపోతే.. ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ జెర్సీ నాకు వస్తుంది’
    ఏప్రిల్ 19 , 2024
    Samantha: నాగ చైతన్య ఫ్యాన్స్‌కి చిన్మయి వార్నింగ్..? సమంతను ఏమైనా అన్నారంటే..!
    Samantha: నాగ చైతన్య ఫ్యాన్స్‌కి చిన్మయి వార్నింగ్..? సమంతను ఏమైనా అన్నారంటే..!
    సమంత, విజయ్ దేవరకొండ జంటగా తెరకెక్కిన ‘ఖుషి’ సినిమా ‘మ్యూజికల్ కాన్సర్ట్’ (Musical Concert) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 3 పాటలు హిట్టయ్యాయి. దీంతో మ్యూజికల్ కాన్సర్ట్‌ని వీక్షించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహెబ్, సింగర్స్ సిద్ శ్రీరామ్, చిన్మయి, తదితరులు స్టేజిపై సందడి చేశారు. విజయ్ దేవరకొండ సినిమాల్లోని పాటలు పాడుతూ హోరెత్తించారు. అయితే, మ్యూజిక్ సెషన్ అనంతరం చిన్మయి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. పరోక్షంగా నాగచైతన్య ఫ్యాన్స్‌కి కౌంటర్ ఇచ్చిందని చర్చ సాగుతోంది.&nbsp; https://twitter.com/SureshPRO_/status/1691450193684934656 సమంత అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది సినిమాల్లోని ఆమె గాత్రమే. సామ్‌కి డబ్బింగ్ చెప్పేది చిన్మయినే. సమంత తొలి సినిమా నుంచి వీరిద్దరి కాంబో కంటిన్యూ అవుతూ వస్తోంది. తాజాగా ఖుషి సినిమాకు సైతం సమంతకు చిన్మయినే డబ్బింగ్ చెప్పింది. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో చిన్మయి, రాహుల్ దంపతులు అండగా నిలిచారు. కుంగిపోవద్దని ధైర్యం నూరి పోశారు.&nbsp; https://twitter.com/SamanthaPrabuFC/status/1691498121405374464 అంతకుముందు నాగచైతన్యతో విడాకుల ఘటనపై సామ్ మీద చై ఫ్యాన్స్ దుమ్మెత్తి పోశారు. సమంత ప్రవర్తనే కారణమంటూ నిందించారు. దీంతో సామ్ కుంగుబాటుకి గురైంది. సన్నిహితుల సాయంతో క్రమంగా కోలుకుంటూ సామ్ తిరిగి మేకప్ వేసుకుంది. అయితే, ఈ తతంగం అందరూ మర్చిపోయిన సమయంలో చిన్మయి చేసిన కామెంట్స్ నాటి రోజుల్ని గుర్తు చేశాయి.&nbsp; https://twitter.com/TeamSamantha__/status/1691659796737622037 చిన్మయి ఏమందంటే? స్టేజిపై పాట పాడిన అనంతరం యాంకర్ సుమ చిన్మయికి మైక్ ఇచ్చింది. ‘ఈ స్టేజిపై నుంచి నేనొక విషయం చెప్పాలని అనుకుంటున్నా సామ్.. తెలుగులో నా డబ్బింగ్ కెరీర్ ప్రారంభమైంది నీ వల్లే. ఈ రోజు నువ్వు ఎంతో మందిలో స్ఫూర్తి నింపావు. అమ్మాయిలకు, అబ్బాయిలకు నువ్వొక హీరోవి. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన ఉత్తమమైన వ్యక్తి సమంత. చాలా మంచి అమ్మాయి, ధైర్యవంతురాలు. ఎవరేం చెప్పినా, ఎన్ని ప్రచారాలు చేసినా ఏమీ మారదు’ అంటూ మాట్లాడింది. అనంతరం, సమంతకు డెడికేట్ చేస్తూ ఓ పాట పాడింది. నాగచైతన్యతో విడాకులపై సమంతను బలిపశువును చేయడంపై చిన్మయి ఇలా స్ట్రాంగ్ రిప్లే ఇచ్చినట్లు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.&nbsp; https://twitter.com/SamanthaPrabuFC/status/1691489745350897664 ఫ్యాన్స్ హ్యాపీ చిన్మయి స్పీచ్‌పై సమంత ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు సరైన విషయం చెప్పారంటూ చిన్మయిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సమంత గురించి ఫ్యాన్స్ మనసులోని మాటను చిన్మయి బయటపెట్టారని చెబుతున్నారు. సామ్, చిన్మయిల ఫ్రెండ్‌షిప్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మరికొందరు ఫ్యాన్స్ సైతం ఇదే విధమైన ట్వీట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తరఫున మాట్లాడినందుకు చిన్మయికి ధన్యవాదాలు చెబుతున్నారు. https://twitter.com/__GirDhar/status/1691518743820791809 విజయ్, సామ్ పర్ఫార్మెన్స్ మ్యూజికల్ కాన్సర్ట్‌లో విజయ్, సమంతల లైవ్ పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఖుషి టైటిల్ సాంగ్‌కి వీరిద్దరూ కలిసి కాలు కదిపారు. సామ్‌ని విజయ్ ఒంటిచేత్తో ఎత్తుకుని గింగిరాలు తిప్పాడు. అలాగే పైకి ఎత్తుకుని ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపాడు. కిందికి దిగగానే సామ్ ‘హల్లో హైదరాబాద్’ అని విష్ చేయగా ‘తెలుగు ప్రజల్లారా..’ అంటూ రౌడీబాయ్ స్టార్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/AndhraBoxOffice/status/1691475831133274112
    ఆగస్టు 16 , 2023
    RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్‌ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
    RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్‌ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
    టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ రాకేష్‌ మాస్టర్‌&nbsp; తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే రాకేష్ మాస్టర్ మృతి కారణాల పట్ల సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాకేష్ మాస్టర్ చనిపోవడానికి ఏపీలో అమ్ముతున్న చీప్ లిక్కర్, కల్తీ మద్యమే కారణమని వైసీపీ సర్కారును ట్రోల్ చేస్తున్నారు. అక్కడ విరివిగా లభించే 'బూమ్ బూమ్' బీర్లను రాకేశ్ మాస్టర్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయి ప్రాణాలు కోల్పోయారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు వీడియోలను షేర్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/mana_Prakasam/status/1670462301533765632?s=20 ఏపీలో మద్యపానం నిషేధం పేరిట తొలుత మద్యం ధరలు భారీగా పెంచారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత నకిలీ, కల్తీ మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చి విచ్చలవిడిగా అమ్ముతున్నారనీ ఆరోపించారు.&nbsp; వీటి తయారీ వెనుక ఉన్నది వైసీపీ నేతలే ఉన్నారని గతంలో&nbsp; ప్రతిపక్షాలు కూడా పెద్దఎత్తున విమర్శించిన సంగతి తెలిసిందే. బ్రాండెడ్ మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాదని.. అందుకే చీప్ మద్యానికి అనుమతించారని కామెంట్లు చేస్తున్నారు. కల్తీ మద్యానికి రాకేష్ మాస్టర్ బలి అయ్యారని పోస్టులు పెడుతున్నారు. https://twitter.com/apramayanam/status/1670464153348190209?s=20 మరణం ముందే తెలుసు.. ఎప్పుడూ యూట్యూబ్‌లో ఎంటర్‌టైన్ చేసే రాకేష్ మాస్టర్ మృతిని చూసి తట్టుకోలేని అభిమానులు ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. రాకేష్ మాస్టర్ తాను చనిపోతాననే విషయం తనకు ముందే తెలుసు. తన అనారోగ్యం గురించి తెలిసినా... అందర్ని నవ్విస్తూ కడుపులోనే తన బాధను దాచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రాకేశ్ మాస్టర్ మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. "నా శరీరంలో మార్పు కనిపిస్తోంది. అది నాకు తెలుస్తోంది. నువ్వు ఉదయించే సూర్యుడివి నువ్వు  అయితే… నేను అస్తమించే సూర్యుడిని. అమ్మా, నాన్నలను బాగా చూసుకో'' అంటూ వీడియోలో చెబుతున్నట్లు ఉంది. దీంతో తాను చనిపోతానన్న విషయం తనకు ముందే తెలుసని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. https://twitter.com/Devineni_Hari/status/1670424465300402177?s=20 రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్యూ ఇచ్చిన రాకేష్ మాస్టర్ తన చివరి కోరిక ఏమిటో చెప్పారు. ఆయన చనిపోయాక ఎక్కడ సమాధి చేయాలో పేర్కొన్నారు. 'ఇల్లు, దుస్తులు, శరీరం ఏదీ శాశ్వతం కాదు. నా మామగారి సమాధి పక్కన వేప మెుక్క నాటా. దాన్ని పెంచుతా. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండని యూట్యూబ్ ఛానెల్స్‌కు విజ్ఞప్తి చేశా' అని మాస్టర్‌ అన్నారు.&nbsp; డాక్టర్లు ఏమన్నారు? &nbsp;రాకేశ్ మాస్టర్ మృతిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు బులెటెన్ విడుదల చేశారు. ఉదయం రక్త విరేచనాలు కావడంతో మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో రాకేష్ మాస్టర్ అడ్మిట్ అయ్యారు. ఆయనకు డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ తీవ్రంగా ఉండటంతో శరీరంలోని చాలా అవయవాలు దెబ్బతిన్నాయి అని&nbsp; గాంధీ సూపరింటిండెంట్ రాజారావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మాస్టర్ తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు. ప్రభాస్‌కు డ్యాన్స్ శిక్షణ రాకేశ్ మాస్టర్‌కి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. కెరీర్ ఆరంభంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరో వేణు ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కంటెస్టెంట్‌కు మాస్టర్‌గా వ్యవహరించాడు. ఆయన మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది. https://twitter.com/CreatorYog/status/1670510684935962625?s=20
    జూన్ 19 , 2023
    <strong>Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్‌ సక్సెస్‌ చేసిన డైలాగ్స్‌ ఇవే..!</strong>
    Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్‌ సక్సెస్‌ చేసిన డైలాగ్స్‌ ఇవే..!
    ప్రభాస్‌ (Prabhas).. ప్రస్తుతం ఈ పేరు యావత్‌ సినీ లోకాన్ని ఊర్రూతలూగిస్తోంది. థియేటర్లలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రభజనం కొనసాగుతున్న వేళ.. అందరూ ప్రభాస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో అతడి నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ సీక్వెన్స్‌లో ప్రభాస్‌ అదరగొట్టాడని, ఇండియన్‌ సినిమా స్టాండర్డ్స్‌ను కల్కి టీమ్‌ గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు. మరి ముఖ్యంగా కల్కిలో ప్రభాస్‌ డైలాగ్స్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ డైలాగ్స్‌ కల్కిలో పడ్డాయని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ సహా కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె ఇతర ప్రధాన తారాగణం చెప్పిన డైలాగ్స్‌ను కూడా ఫ్యాన్స్‌ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ప్రేక్షకులను మిస్మరైజ్‌ చేసిన కల్కి డైలాగ్స్ ఏవి? అవి ఏ సందర్భంలో వచ్చాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; కల్కి మూవీ డైలాగ్స్‌ కల్కి సినిమా ప్రారంభంలో కురుక్షేత్రం ఎపిసోడ్‌ చూపిస్తారు. గర్భస్త శిశువుపై అస్త్రాన్ని వదిలి.. అశ్వత్థామ పెద్ద తప్పు చేస్తాడు. దీంతో శ్రీకృష్ణుడు అతడ్ని శపించే క్రమంలో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.&nbsp; అశ్వత్థామ : చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ. నీ ఉపదేశాలు వినడానికి నేను అర్జునుడ్ని కాదు.&nbsp; కృష్ణుడు : ఈ 18 రోజులు కురు క్షేత్రంలో జరిగిన పాపాల కన్నా.. నీ అధర్మం నిష్కృతమైనది. ధ్రోణాచార్యుడి పుత్రుడివి అయ్యుండి ఇంతకు దిగజారావా? అశ్వత్థామ : నా తండ్రి పేరు పలికే అర్హత నీకు లేదు. నువ్వు అనుకుంటే అతడి మరణాన్ని ఆపగలిగేవాడివి. కృష్ణుడు : అశ్వత్థామ.. దేవుడైనా క్రురుడైనా కర్మను తప్పించుకోలేరు. గర్భస్త శిశువుపై అస్త్రం వదిలావు. నీ ఖర్మ నువ్వు అనుభవించక తప్పదు.&nbsp; అశ్వత్థామ : అయితే సంధించు చక్రం.. విధించు నీ శిక్షని. కృష్ణుడు : చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ.. అది విముక్తి. కాలాంతరం పాండవులు అందరూ చనిపోతారు. నా శరీరమూ మరణిస్తుంది. ఈ యుగం అంతరిస్తుంది. కానీ, నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక.. చావు రాక.. బ్రతకలేక.. ఎన్నో పాపాలు చూస్తూ జీవిస్తావు. ఇదే నా శాపం. అశ్వత్థామ : మరి నా శాపానికి ప్రాయిశ్చిత్తం లేదా? కృష్ణుడు : నువ్వు నన్ను చంపాలనుకున్నావ్‌.. కానీ ఒక రోజు నువ్వే నన్ను కాపాడాలి.&nbsp; అశ్వత్థామ : నేనా? కృష్ణుడు : కలియుగం వస్తుంది. కలి వస్తున్నాడు. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటి అయినప్పుడు నేను మళ్లీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి మహా శక్తిశాలి. ఎంత శక్తివంతుడు అంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భ గుడికి కాపలా కాయాలి. డైలాగ్‌ కాంప్లెక్స్‌ ఒక యువకుడిపై 5000 యూనిట్స్‌ నజరానా ప్రకటిస్తుంది. అతడ్ని పట్టుకునేందుకు ఓ గ్యాంగ్ వెళ్తుంది. ఈ సందర్భంలో పారిపోతున్న ఆ వ్యక్తికి బుజ్జి (AI వెహికల్‌).. సంకెళ్లు వేస్తుంది. అప్పుడు బుజ్జిపై విలన్‌ గ్యాంగ్‌ కాల్పులు జరుపుతారు. దీంతో బుజ్జి తన బాస్‌ భైరవ (ప్రభాస్‌)ను పరిచయం చేస్తూ బైరవకు ఎలివేషన్స్ ఇస్తుంది. బుజ్జి : హేయ్‌.. స్టాప్‌. నన్ను షూట్‌ చేస్తావా. ఇప్పుడు చూడు నా బాస్‌ వచ్చి మీ అందరిని స్మాష్‌ చేస్తాడు. విలన్‌ గ్యాంగ్‌: ఎవరు మీ బాస్‌? బుజ్జి : పాత యుద్ధాల్లో సోల్జర్‌. ఇంత వరకూ&nbsp; ఒక్క యుద్ధంలో ఓడిపోలేదు. ది వన్‌ అండ్‌ ఓన్లీ భైరవ (ఈ డైలాగ్‌ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు) భైరవ: ఎంట్రీ అనంతరం భైరవ నేలపై గురక పెట్టి నిద్ర పోతాడు.. బుజ్జి : భైరవ గెటప్‌.. చాలా బిల్డప్‌ ఇచ్చాను లే. భైరవ: బుజ్జి.. బుజ్జి.. ప్లీజ్‌ 5 మినిట్స్‌ పడుకుంటాను. (దీని తర్వాత ప్రభాస్‌ ఎంట్రీ ఫైట్‌ ఉంటుంది) డైలాగ్‌ సుప్రీమ్‌ యాస్కిన్‌ (కమల్‌ హాసన్‌).. కాంప్లెక్స్‌లో తన మనుషుల చేత గర్భిణి స్త్రీలపై ప్రయోగాలు చేయిస్తుంటాడు. దీంతో యాస్కిన్‌ బృందంలోని ఒక సైంటిస్టు అతడ్ని చంపడానికి యత్నిస్తాడు. యస్కిన్‌.. ఆ సెంటిస్టును చంపుతూ చెప్పే డైలాగ్స్‌ మెప్పిస్తాయి.&nbsp; సుప్రీమ్‌ యాస్కిన్‌: చావుకు నేను చాలా ప్రాణాలు ఇచ్చాను. అది నన్నేం చేయదు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకు నన్ను చంపాలనుకున్నావ్‌? సైంటిస్టు : మంచి కోసం..&nbsp; సుప్రీమ్‌ యాస్కిన్‌ : మంచి.. చరిత్రలో ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసా ఈ మంచి. రాజులు రాజ్యాలు మారుతున్న ప్రతీసారి మారుతుందీ మంచి. దాన్ని నమ్మోద్దు. ఇంతకీ నీకేం కావాలి? సైంటిస్టు : ఈ లోకాన్ని కాపాడాలి సుప్రీమ్ యాస్కిన్‌ : అదే కదా.. నేనూ చేసింది. దేవుడిని, డబ్బులని, వందల యుద్ధాలు చేసే అందరినీ ఒక్క యుద్ధంతో గెలిచాను తప్పా?. మీరు బూడిద చేస్తున్న ప్రకృతిని అందనంత దూరంలో పెట్టాను.. తప్పా? సైంటిస్టు : నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి నువ్వు ఎవరు? సుప్రీమ్‌ యాస్కిన్‌ : మరి నాశనం చేయడానికి మీరు ఎవరు? ఎన్ని యుగాలు అయినా.. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు.. మారలేడు. ఇది నీ తప్పు కాదులే. హ్యూమన్‌ బీయింగ్స్‌కు ఉన్న డిఫెక్టే అది.&nbsp; డైలాగ్‌ కల్కిని గర్భంలో మోస్తున్న సుమతి (దీపిక పదుకొణె)ని.. సుప్రీమ్‌ యస్కిన్‌ మనుషుల నుంచి కాపాడి అశ్వత్థామ శంబాలకు తీసుకు వస్తాడు. అప్పుడు శంబాలకు రక్షణాధికారిగా ఉన్న వ్యక్తి సుమతి ఎవరో తెలియక అడ్డుకుంటాడు. సందర్భంలో వచ్చే సీన్‌, డైలాగ్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. రక్షణాధికారి : ఆమెను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావు. 5 మిలియన్ పౌండ్లు పెట్టారు ఈమె మీద. కాంప్లెక్స్‌ మాత్రమే కాదు వరల్డ్‌లో ప్రతీ ఒక్కరు ఆమె కోసం వెతుకున్నారు. ఎలా కాపాడతావు? అశ్వత్థామ : నేను కాపాడతాను రక్షణాధికారి : అసలు నువ్వు ఎవరు? పొడుగ్గా ఉంటే సరిపోదు. ఎప్పుడైనా యుద్ధం చేశావా? అశ్వత్థామ గురించి తెలిసిన బాలుడు: ఎక్స్‌క్యూజ్‌మీ.. మహాభారతంలో శ్రీకృష్ణుడితోనే యుద్ధం చేశాడు.. ఓకే. (ఇక్కడ హైలెట్‌ బీజీఎం వస్తుంది) రక్షణాధికారి : అందరికీ పిచ్చి ఎక్కిందా? ఈమె (సుమతి) ఇక్కడి రావడం వల్ల అందరికీ ఎంతో డేంజరో అర్థమవుతుందా? తను జస్ట్‌.. ల్యాబ్‌ నుంచి ఎస్కేప్‌ అయిన మామూలు ప్రెగ్నెంట్‌ ఉమెన్‌. ఏమీ స్పెషల్‌ ఉమెన్‌ కాదు. అయినా పుట్టేది దేవుడు అనడానికి ఏంటీ సాక్ష్యం. *ఆ డైలాగ్‌ అనగానే వెంటనే వర్షం మెుదలవుతుంది. అక్కడ వాన పడి చాలా కాలమే అయి ఉంటుంది. ఆమె రాకతో వర్షం పడటంతో కల్కి జన్మించేది ఆమె కడుపునే అని శంబాలా ప్రజలు నమ్ముతారు. ఈ సీన్‌ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. డైలాగ్‌ మహావిష్ణువు.. కల్కిగా పుట్టేందుకు తననే ఎందుకు ఎంచుకున్నాడని సుమతి (దీపిక).. అశ్వత్థామను ప్రశ్నిస్తుంది. ఆ సందర్భంలో వచ్చే డైలాగ్స్‌ మిస్మరైజింగ్‌ చేస్తాయి.&nbsp; అశ్వత్థామ : నువ్వు ప్రాణం ఇవ్వడానికే పుట్టావ్‌ అమ్మా? సుమతి : అసలు ఏం మాట్లాడుతున్నారు. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకా ఎంత మంది చనిపోవాలి? అశ్వత్థామ : ప్రతీ చావుకి ఒక పరమార్థం ఉంటుంది. ప్రతీ చావు లోకానికి కొత్త ఊపిరి పోస్తుందమ్మా. సుమతి : కానీ, నేనే ఎందుకు? అశ్వత్థామ : మోయగలిగిన శక్తి ఉన్నవారికే బాధ్యతను ఇస్తాడు ఆ దేవుడు. భగవంతుడ్ని కడుపులో మోయాలంటే భూదేవి అంత ఓర్పు ఉండాలి. మీలో ఆ ఓర్పు ఉందనే మిమ్మల్ని తల్లిగా ఎంచుకున్నారు.&nbsp; అశ్వత్థామ: నువ్వు ఇప్పుడు కనబోయేది మాములు ప్రాణం కాదమ్మ.. సృష్టిని. జన్మనివ్వడం నీ ధర్మం కాపాడటం నా బాధ్యత. డైలాగ్‌ శంబలకు తీసుకెళ్లిన సుమతి తనకు కావాలని కాంప్లెక్స్‌ ప్రతినిధి చటర్జీ తన మనుషులతో అంటాడు. అన్ని డైరెక్షన్స్‌లో రైడర్స్‌ పంపాం.. త్వరలోనే పట్టుకుంటామని అతని కమాండర్ చెబుతాడు. అప్పటికే అశ్వత్థామతో యుద్ధం చేసిన ప్రభాస్‌.. ఏమి చేయలేరని అంటాడు. ఈ సందర్బంలో ఛటర్జీతో అతడి సంభాషణ ఆకట్టుకుంటుంది. భైరవ : ఆ ముసలోడు ఉన్నంతవరకూ ఏం చేయలేరు. ఛటర్జీ : ముసలోడా? భైరవ : మీ వాళ్లందరినీ కొట్టింది అతడే? ఒక్కడు కూడా వాడ్ని టచ్‌ చేయలేదు. నేను తప్పా. ఛటర్జీ : వీడెవడు అసలు? కమాండర్‌: భైరవ అని బౌంటీ ఎంటర్‌ సర్‌. మన వాళ్లని కొడితే బ్లాక్‌ లిస్ట్‌ చేశాను.&nbsp; భైరవ: ఎలాగైనా బ్లాక్‌ లిస్ట్‌ చేశావు కదా. మళ్లీ కొడతా. పాయింట్‌ ఏంటి అంటే నేను ఒక్కడినే ఆ అమ్మాయిని తీసుకురాగలను. మీకు వేరే ఆప్షన్‌ లేదు.&nbsp; ఛటర్జీ : అంత ష్యూర్‌ ఆ..&nbsp; భైరవ : రికార్డ్స్‌ చూసుకో.. ఇంతవరకూ ఒక్క ఫైట్‌ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను.&nbsp; డైలాగ్‌ కల్కి క్లైమాక్స్‌లో.. కమల్‌ హాసన్‌ మీద వచ్చే సీన్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. శక్తిని పుంజుకున్న తర్వాత ఆయన చెప్పే 'జగన్నాథ రథచక్రాల్‌ వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌.. రథచక్ర ప్రళయఘోళ భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను'.. అనే డైలాగ్‌ సెకండ్‌ పార్ట్‌లో తాను ఎంత విధ్వంసం సృష్టిస్తానో తెలియజేస్తుంది. అయితే ఈ డైలాగ్‌ శ్రీశ్రీ మహా ప్రస్థానం లోనిది. 44 ఏళ్ల క్రితం ఆకలి రాజ్యం సినిమాలో ఇదే డైలాగ్‌ను కమల్‌ హాసన్ చెప్తారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అతడి నోట శ్రీశ్రీ కవిత వినిపించడం ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది.&nbsp; View this post on Instagram A post shared by TELUGU SONGS OLD (@telugu_songs_old) డైలాగ్‌ కల్కిలో అప్పటివరకూ భైరవగా ఉన్న ప్రభాస్‌.. చివరి భాగంలో కర్ణుడిగా కనిపించి అందరికీ షాకిస్తాడు. చివరి పది నిమిషాల మహాభారతం ఎపిసోడ్‌లో కర్ణుడిగా కనిపించి స్క్రీన‌ను షేక్‌ చేస్తాడు.&nbsp; ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్‌ విల్లు పట్టుకుని రథంపై నిలబడగా.. థియేటర్‌ మొత్తం దద్దరిల్లిపోయింది. భైరవను కర్ణుడిగా పరిచయం చేసే సందర్భంలో వచ్చే కురుక్షేత్రంలోని డైలాగ్స్‌ విజిల్స్‌ వేయిస్తాయి.&nbsp; అర్జునుడు : అశ్వత్థామ.. తలరాతను రాసే బ్రహ్మ చేసిన గాంఢీవం ఇది. దీనిని ఎవరు అడ్డుకోలేరు. కర్ణుడు: ప్రభాస్‌ ఎంట్రీ ఇచ్చి అర్జునుడు వేసిన బాణాన్ని నిలువరిస్తాడు. ఆ సందర్భంలో ఆలస్యమైందా ఆచార్య దేవా? అని అశ్వత్థామతో అంటాడు. అశ్వత్థామ: లేదు.. సరైన సమయంలోనే వచ్చావు.&nbsp; అర్జునుడు: చూశావా.. కేశవ (కృష్ణుడు). తను నాకు సమానుడా? వాడ్ని (కర్ణుడు) అడ్డుకొని మన రథం కేవలం రెండు అడుగులు వెనక్కి వెళ్లింది. నా అస్త్రానికి అతడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్లింది.&nbsp; కృష్ణుడు : ఓ ధనుంజయ.. నీ రథం అగ్నిదేవుడి వరం. కాపాడుతున్నదని జెండాపై కపిరాజు (హనుమంతుడు).&nbsp; నడుపుతున్నది ముల్లోకాలు నడిపించే నేను. అయినా రెండడుగులు వెనక్కి తోశాడంటే ఆలోచించు అర్జునా.&nbsp; కృష్ణుడు: తను (కర్ణుడు) సామాన్య యోధుడు కాదు. తన కళ్లల్లోని తేజస్సు.. తన చేతిలోని ధనస్సు.. తన పేరు.. చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. సూర్య పుత్ర వైకర్ణ.. కర్ణ. (ఈ డైలాగ్‌తో కల్కి తొలిపార్ట్‌ ముగుస్తుంది).
    జూలై 02 , 2024
    సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. డీజే టిల్లు సినిమా సక్సెస్‌తో యూత్‌లో మంచి గుర్తింపు పొందాడు. తనదైన స్లాంగ్, మెనరిజంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న సిద్ధు జొన్నలగడ్డ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. సిద్ధు జొన్నల గడ్డ అసలు పేరు? సిద్ధార్థ జొన్నలగడ్డ సిద్ధు జొన్నల గడ్డ ఎత్తు ఎంత? 5’.7” (175 cms) సిద్ధు జొన్నలగడ్డ తొలి సినిమా? జోష్ చిత్రం ద్వారా సిద్ధు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. &nbsp;హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'పెళ్లికి ముందు జీవితం'&nbsp; సిద్ధు జొన్నలగడ్డ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన తేదీ ఎప్పుడు? 1992 సిద్ధు జొన్నలగడ్డకు వివాహం అయిందా? &nbsp;ఇంకా కాలేదు సిద్ధు జొన్నల గడ్డ ఫెవరెట్ హీరోయిన్? అనుష్క శెట్టి సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన సినిమా? అర్జున్ రెడ్డి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అల వైకుంఠపురములో సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన హీరో? వెంకటేష్ సిద్ధు జొన్నలగడ్డ తొలి హిట్ సినిమా? గుంటూరు టాకీస్ చిత్రం సిద్ధు జొన్నలగడ్డకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే డిజే టిల్లు చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన కలర్? బ్లాక్ సిద్ధు జొన్నలగడ్డ తల్లిదండ్రుల పేర్లు? శారద, సాయి కుమార్ జొన్నలగడ్డ సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ప్రదేశం? హైదరాబాద్ సిద్ధు జొన్నలగడ్డ ఏం చదివాడు? ఇంజనీరింగ్, MBA సిద్ధు జొన్నలగడ్డ అభిరుచులు బైక్ రైడింగ్, మోడలింగ్ సిద్ధు జొన్నలగడ్డ ఎన్ని సినిమాల్లో నటించాడు? సిద్ధు 2024 వరకు 13 సినిమాల్లో నటించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ఆహారం? బిర్యాని సిద్ధు జొన్నలగడ్డ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 7కోట్లు సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సిద్ధు ఒక్కో సినిమాకి దాదాపు 2 నుంచి 3 కోట్లు తీసుకుంటాడు . సిద్ధు జొన్నలగడ్డకు స్మోకింగ్ అలవాటు ఉందా? చాలా సందర్భాల్లో స్మోకింగ్ అలవాటు ఉందని చెప్పాడు సిద్ధు జొన్నలగడ్డ మద్యం తాగుతాడా?&nbsp; అవును, వీక్లీ వన్స్ తాగుతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సిద్దు జొన్నలగడ్డ నిక్‌ నేమ్‌ ఏంటి? స్టార్‌ బాయ్‌ సిద్ధూ సిద్ధు జొన్నలగడ్డకు తోబుట్టువులు ఉన్నారా? ఒక అన్నయ్య ఉన్నారు. ‌అతని పేరు చైతన్య జొన్నల గడ్డ సిద్ధు జొన్నలగడ్డ రైటర్‌గా పనిచేసిన చిత్రాలు? సిద్ధు మంచి నటుడే కాకుండా రైటర్‌, సింగర్, లిరికిస్ట్‌, ఎడిటర్‌ కూడా. 'క్రిష్ణ అండ్‌ హీస్‌ లీలా', 'మా వింత గాధ వినుమా', ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ స్వయంగా పాడిన పాటలు ఏవి? గుంటూరు టాకీస్‌ ‘టైటిల్‌ ట్రాక్‌’, నరుడా ఢోనరుడా సినిమాలో 'కాసు పైసా', 'పెళ్లి బీటు' పాటలను సిద్ధు పాడాడు. అలాగే మా వింత గాధ వినుమాలో ‘షయార్‌-ఈ-ఇష్క్‌’, డీజే టిల్లులో 'నువ్వలా' సాంగ్స్ పాడి అలరించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ రాసిన పాటలు ఏవి? జాణ (మా వింత గాధ వినుమ), ఓ మై లిల్లీ (టిల్లు స్క్వేర్‌) సిద్దు జొన్నలగడ్డ ఇప్పటివరకూ చేసిన ఏకైక వెబ్‌సిరీస్‌? 2018లో వచ్చిన 'గ్యాంగ్‌స్టర్స్‌' సిరీస్‌లో సిద్ధు నటించాడు. అది అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ తర్వాత సిద్ధు ఏ వెబ్‌సిరీస్‌లో చేయకపోవడం గమనార్హం. సిద్ధు జొన్నలగడ్డకు గర్ల్‌ ఫ్రెండ్ ఉందా? గతంలో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు సిద్ధు ఓ ఇంటర్యూలో తెలిపాడు. అయితే అది మధ్యలోనే బ్రేకప్‌ అయినట్లు తెలిపాడు. ప్రస్తుతం సిద్దూ ఎవరితోనూ రిలేషన్‌లో లేడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ ఫేవరేట్‌ బాలీవుడ్‌ హీరో ఎవరు? రణ్‌బీర్‌ కపూర్‌ సిద్ధు జొన్నలగడ్డ హెయిల్ కలర్‌ ఏంటి? నలుపు సిద్ధు జొన్నలగడ్డ ఫేమస్‌ హెయిర్‌ స్టైల్‌ ఏది? డీజే టిల్లు కోసం అతడు యూనిక్‌ హెయిర్‌ స్టైల్‌ చేయించుకున్నాడు. దీన్ని తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్‌ అని అంటున్నారు. టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్‌ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ఏవి? 'జాక్‌', 'తెలుసు కదా', 'టిల్లు క్యూబ్‌'.. సిద్ధు జొన్నలగడ్డ చేసిన టిల్లు పాత్ర ఎలా పుట్టింది? టిల్లు పాత్ర కల్పితం. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి, చిలకలగూడ, వారాసిగూడ, సికింద్రాబాద్‌ ఏరియాల్లో ఉన్నప్పుడు తన అనుభవాలు, ఎదురైన వ్యక్తుల నుంచి ఈ డీజే టిల్లు పాత్ర పుట్టిందని సిద్ధు ఓ ఇంటర్యూలో తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ చేసిన మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్‌ ఏవి? సిద్ధు కెరీర్‌లో మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్స్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి గుంటూరు టాకీస్‌లోని ‘నీ సొంతం’ సాంగ్‌. ఇందులో యాంకర్‌ రష్మీతో కలిసి సిద్ధు చేసే రొమాన్స్‌ అప్పట్లో కుర్రకారును ఫిదా చేశాయి. అలాగే టిల్లు స్క్వేర్‌లోనూ సిద్ధూ జొన్నలగొడ్డ రెచ్చిపోయాడు. ‘ఓ మై లిల్లీ’ సాంగ్‌లో హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌తో కలిసి లిప్‌ కిస్‌ సీన్లలో నటించాడు. ఆ రెండు సాంగ్స్‌పై ఓ లుక్కేయండి. https://www.youtube.com/watch?app=desktop&amp;v=mw9Jn_BsPZE&amp;vl=hi https://www.youtube.com/watch?v=QiKd8Iegu5g సిద్దు జొన్నలగడ్డ బెస్ట్‌ డైలాగ్స్‌ డీజే టిల్లులో రాధిక హత్య చేసిన వ్యక్తిని.. టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) పాతిపెట్టే క్రమంలో వచ్చే డైలాగ్స్‌ ది బెస్ట్ అని చెప్పవచ్చు.&nbsp; రాధిక: హేయ్‌.. అక్కడ రాయి ఉంది చూస్కో టిల్లు: ఐ హావ్‌ వన్‌ సజిషన్‌ ఫర్‌ యూ.. పోయి కారులో ఏసీ ఆన్‌ చేసుకొని రిలాక్స్‌గా స్విగ్గీ ఓపెన్ చేసి ఓ ఫ్రెష్‌ వాటర్‌ మిలాన్‌ జ్యూస్‌ ఆర్డర్‌ చేసుకొని రిలాక్స్‌గా నువ్వు.  “మనం చేసేదే లంగా పని పైగా కాంట్రిబ్యూషన్‌ లేదు నీది. పైగా ఉప్పర్‌ సే బొంగులో కరెక్షన్స్ అన్ని చెబుతున్నావ్‌” “ ప్లీజ్‌ నువ్వేళ్లి రిలాక్స్‌ గా. నాకు అలవాటే ఈ శవాలు పాతిపెట్టుడు. నేను రోజూ చేసే పనే ఇది. ఫినిష్‌ చేసుకొని వస్తా.&nbsp; కొద్దిసేపటి తర్వాత.. టిల్లు : ఏం చేస్తాడు ఇతను (చనిపోయిన వ్యక్తి).. సాఫ్ట్‌వేరా? రాధిక: ఫొటోగ్రఫీ.. టూ మూవీస్‌కు కెమెరామెన్‌గా పనిచేశాడు టిల్లు: చాలా అన్‌ఫార్చ్యూనెట్లీ ఇట్లా అయిపోయింది. ఏజ్ కూడా బాగా తక్కువే. హీ నెవర్‌ సీ సక్సెస్‌ బీకాజ్‌ ఆఫ్‌ యూ https://youtu.be/11iKluNP0rs?si=YoSXNG65ACZWI-zt టిల్లు స్క్వేర్‌లో సిద్దు జొన్నలగడ్డ చెప్పిన టాప్‌ డైలాగ్స్‌ ఏవి? ఈ సినిమాలో టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే.. డైలాగ్‌ టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్‌ ఏస్టేట్ ఐకూన్‌ టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది https://twitter.com/i/status/1774992506087944622 డైలాగ్‌ ఓ సీన్‌లో...... లిల్లీ (అనుపమా పరమేశ్వరన్‌) మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్‌ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.&nbsp; టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్‌ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి టిప్పు సుల్తాన్‌ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ.. https://twitter.com/i/status/1773542640488784015 డైలాగ్‌ లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు? టిల్లు : నిలబడా నేను.. వేస్ట్‌. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్‌ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి&nbsp; https://twitter.com/i/status/1773655054655856994 డైలాగ్‌ లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్‌ చెప్పు రాధిక. లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ&nbsp; టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది. అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.&nbsp; నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8 టాలీవుడ్‌ సెలబ్రిటీలతో సిద్దు జొన్నలగడ్డ దిగిన ఫొటోలు సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్‌ స్టైలిష్‌ ఫొటోలు సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ  కారు కలెక్షన్స్‌సిద్ధు ప్రస్తుతం రేంజ్‌ రోవర్‌ కారు వినియోగిస్తున్నాడు. ఈ కారులోనే తన సినిమా ఫంక్షన్లకు హాజరవుతున్నాడు.  https://www.youtube.com/watch?v=8CM-HSifLsY https://www.youtube.com/watch?v=i817fCTiZ3g
    ఏప్రిల్ 27 , 2024
    నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నేహా శెట్టి మెహబూబా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, గల్లీ రౌడి వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నేహా శెట్టి.. డిజే టిల్లు చిత్రంలో హీరోయిన్‌గా అలరించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన రాధిక పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నేహా శెట్టి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. జోమాటో యాడ్ షూటింగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి నటించింది. ఈక్రమంలో నేహా శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Neha Shetty ) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా శెట్టి దేనికి ఫేమస్? నేహా శెట్టి డీజే టిల్లు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన రాధిక పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. &nbsp;నేహా శెట్టి వయస్సు ఎంత? 1999, డిసెంబర్ 6న జన్మించింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు&nbsp; &nbsp;నేహా శెట్టి ముద్దు పేరు? &nbsp;నేహా &nbsp;నేహా శెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు&nbsp; &nbsp;నేహా శెట్టి ఎక్కడ పుట్టింది? మంగళూరు, కర్నాటక &nbsp;నేహా శెట్టి&nbsp; అభిరుచులు? డ్యాన్సింగ్, షాపింగ్ నేహా శెట్టికి&nbsp; ఇష్టమైన ఆహారం? దోశ, బిర్యాని నేహా శెట్టి&nbsp; తల్లిదండ్రుల పేర్లు? హరిరాజ్ శెట్టి, నిమ్మి శెట్టి నేహా శెట్టి&nbsp; ఫెవరెట్ హీరో? అల్లు అర్జున్ నేహా శెట్టి&nbsp; ఇష్టమైన కలర్ ? పింక్, వైట్ నేహా శెట్టి&nbsp; ఇష్టమైన హీరోయిన్స్ దీపిక పదుకునే &nbsp;నేహా శెట్టి తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? డీజే టిల్లు నేహా శెట్టి&nbsp; ఏం చదివింది? డిగ్రీ &nbsp;నేహా శెట్టి పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్ నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. నేహా శెట్టి&nbsp; సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్, మిస్ మంగళూరు(2014)లో అందాల పోటీలో విజేతగా నిలిచింది. More Information About Neha Shetty నేహా శెట్టి హాట్‌ ఫొటోలు (Neha Shetty Hot Images) నేహా శెట్టి పోషించిన బెస్ట్‌ రోల్ ఏంటి? డీజే టిల్లు సినిమా చేసిన రాధిక పాత్ర.. ఇప్పటివరకూ ఆమె చేసిన చిత్రాల్లో బెస్ట్‌ అని చెప్పవచ్చు.&nbsp; నేహా శెట్టి మూవీస్ లిస్ట్ ముంగారు మలె 2 (Mungaru Male 2), మెహబూబా (Mehbooba), గల్లీ రౌడి (Gully Rowdy), మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ (Most Eligible Bachelor), డీజే టిల్లు (DJ Tillu), బెదురులంక 2012 (Bedurulanka 2012), రూల్స్‌ రంజన్‌ (Rules Ranjann), టిల్లు స్క్వేర్‌ (Tillu Square) నేహా శెట్టి అప్‌కమింగ్‌ మూవీ? గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs of Godavari) నేహా శెట్టి చీరలో దిగిన టాప్‌ ఫొటోలు( Neha shetty in Saree) నేహా శెట్టి బ్లౌజ్ కలెక్షన్స్(Neha Shetty Blouse Collections) నేహా శెట్టి బ్లౌజింగ్‌కు స్టైల్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ట్రెండ్‌ తగ్గట్లు బ్లౌజులు ధరిస్తూ ఆమె చాలా మంది యువతులకు ప్రేరణగా నిలుస్తోంది. ఆ ట్రెండీ బ్లౌజులు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; కోల్డ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ&nbsp; కోల్డ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ అమె అందాన్ని రెట్టింపు చేసింది. నలుగురిలో ప్రత్యేకంగా కలిపించాలని భావించే వారికి ఈ బ్లౌజ్‌ తప్పక నచ్చుతుంది.&nbsp; వి-నెక్‌ కట్‌ స్లీవ్‌ బ్లౌజ్‌ ట్రెడిషన్‌తో పాటు ట్రెండీగా కనిపించాలని భావించిన సమయంలో నేహా వి - నెక్‌ కట్‌ స్లీవ్‌ బ్లౌజ్‌లను దరిస్తూ ఉంటుంది. బ్లౌజ్‌కు తగ్గ శారీ, జ్యూయలరీ ధరించి కుర్రకారును ఫిదా చేస్తుంటుంది.&nbsp; డీప్‌ ప్లంగింగ్‌ హల్టర్‌ నెక్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ బ్లౌజ్‌ ట్రెండీ లుక్‌ను తీసుకొస్తుంది. యువతులు మరింత అందంగా.. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ బ్లౌజ్ ఉపయోగపడుతుంది.&nbsp; ఆఫ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ బ్లౌజ్‌ చాలా మోడరన్‌ లుక్‌ను అందిస్తుంది. యువతుల అందాలను చాలా బాగా ఎలివేట్‌ చేస్తుంది.&nbsp; రౌండ్‌ నెక్‌ హాఫ్‌ స్లీవ్స్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ రౌండ్‌ నెక్‌ హాఫ్‌ స్లీవ్‌ బ్లౌజ్‌.. మంచి ట్రెడిషనల్‌ లుక్‌ తీసుకొస్తుంది. గోల్డెన్‌ ఎంబ్రాయిడరీతో ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ బ్లౌజ్‌ను శుభకార్యాలకు ధరించవచ్చు. క్లాసిక్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ నేహా.. ట్రెడిషన్‌, మోడరన్‌, ట్రెండ్‌ తగ్గట్లు ఇట్టే మారిపోగలదు. అయితే కాస్త సాఫ్ట్‌ లుక్‌లో కనిపించాలని భావించినప్పుడు ఈ అమ్మడు క్లాసిక్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ను ధరిస్తుంది. ఈ లుక్‌లో నేహాకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు.&nbsp; నేహా శెట్టిని వైరల్‌ చేసిన పోస్టు/ రీల్‌? ‘రూల్స్‌ రంజన్‌’ సినిమాలో తాను చేసిన ‘సమ్మోహనుడా’ సాంగ్‌కు నేహా శెట్టి రీల్‌ చేసింది. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా అది సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అయ్యింది. చాలా మంది యువతులు ఈ పాటపై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యారు.&nbsp; View this post on Instagram A post shared by Swetha Naidu (@swethaa_naidu) సోషల్‌ మీడియాలో ఉన్న నేహా శెట్టి హాట్‌ వీడియోస్? https://twitter.com/i/status/1730782118777950693 నేహా శెట్టి చేసిన బెస్ట్‌ స్టేజీ పర్‌ఫార్మెన్స్‌ ఏది? గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిలోని ‘సుట్టంలా సూసి’ సాంగ్‌ రిలీజ్‌ సందర్భంగా హీరో విశ్వక్‌తో నేహాశెట్టి స్టేజీపై డ్యాన్స్‌ వేస్తుంది. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.&nbsp; View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) నేహా శెట్టి ఏ ఏ భాషలు మాట్లాడగలదు? ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు నేహా శెట్టిది ఏ రాశి? మిథున రాశి నేహా శెట్టికి సోదరుడు/ సోదరి ఎవరైనా ఉన్నారా? నేహాకు ఓ సోదరి ఉంది. ఆమె పేరు నవామి శెట్టి నేహా శెట్టి పైన వచ్చిన రూమర్లు ఏంటి? ఈ బ్యూటీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌, ఆకాష్‌ పూరితో అప్పట్లో ప్రేమయాణం కొనసాగించినట్లు రూమర్లు ఉన్నాయి.&nbsp; నేహా శెట్టికి ఇష్టమైన గాయకులు ఎవరు? ఏ.ఆర్‌ రెహమాన్‌, శంకర్‌ మహదేవన్‌, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నేహా శెట్టి ఫేవరేట్‌ స్పోర్ట్స్‌ ఏది? క్రికెట్‌ నేహాశెట్టి ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు? ధోని, విరాట్‌ కోహ్లీ నేహా శెట్టికి ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు? మైసూర్‌, గోవా, కర్ణాటక నేహా శెట్టి చేసిన చిత్రాల్లోని బెస్ట్‌ సీన్‌? https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_ నేహా శెట్టి జ్యూయలరీ ఫొటోలు? నేహా శెట్టి చిన్నప్పటి ఫొటోలు? నేహా శెట్టి సినిమాలోని బెస్ట్ డైలాగ్స్‌ ఏవి? డీజే టిల్లులో నేహా శెట్టి చేసిన సన్నివేశాలన్నీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా టిల్లు.. రాధిక (నేహా శెట్టి) ప్లాటులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చే సీన్‌ హైలెట్‌గా అని చెప్పవచ్చు. ఎందుకంటే కథలో రాధిక పుల్‌ లెంగ్త్‌ పాత్ర పరిచయమయ్యేది ఈ సీన్‌ నుంచే. రాధిక ఓ హత్య చేసి అమాయకంగా చెప్పే డైైలాగ్స్ ఆమె కెరీర్‌లోనే బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఆ సంభాషణ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; డీజే టిల్లులో రాధిక పాత్రకు సంబంధించి మరో కీలకమైన సన్నివేశం కూడా ఉంది. నేహా శెట్టి బాగా పాపులర్ అవ్వడానికి అందులో ఆమె చెప్పే డైలాగ్స్‌ కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.&nbsp; టిల్లు : ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావ్‌ రాధిక నాతోని..! రాధిక : ఎందుకు టిల్లు.. నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లమ్‌ నీకు? టిల్లు: నిజంగా ఈ క్వశ్చన్‌ నన్ను అడుగుతున్నావా రాధిక? రాధిక : అవును టిల్లు.. చెప్పు? టిల్లు:&nbsp; నేను ఇది నీకు ఎక్స్‌ప్లనేషన్‌ ఇస్తున్న చూడు ఇది సెకండ్‌ హైలెట్ ఆఫ్‌ ది నైట్‌ అది. కానీ చెప్తా.. నేను హౌలా గాడ్ని కాబట్టి.&nbsp; https://youtu.be/r6L5KO89Azs?si=wuYC205pIGEZWNMB టిల్లు : ఐ హ్యావ్‌ ఏ స్మాల్‌ డౌట్‌.. ఇదంతా సెల్ఫ్‌ డిఫెన్స్‌లోనే జరిగింది కదా? కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌ అయితే కాదు కదా? రాధిక : కాదు, టిల్లు.. ఐ ప్రామిస్‌ టిల్లు : అయితే పోదాం కదా.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి నిజం చెప్పేద్దాం. రాధిక : పోలీసు.. పోలీసు.. అనొద్దు టిల్లు ప్లీజ్‌.. టిల్లు : ఎందుకట్ల పోలీసు.. పోలీసు.. అంటే భయపడుతున్నావ్‌? హా.. పాత కేసులేమైనా ఉన్నాయా నీ మీద? హే ఉంటే చెప్పు నేనేమి అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్‌లో ఒక సర్‌ప్రైజే హ్యాండిల్‌ చేయగల్గుతా. ఇట్ల మల్టిపుల్‌ అంటే నోతోని గాదు. ఇప్పుడు పోలీసు స్టేషన్‌కు పోయినాక ఆడ సడెన్‌గా యూ ఆర్ ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌ నెంబర్‌ వన్‌ క్రిమినల్‌ అని తెలిసినాక గుండె ఆగి చస్తా. అసలే డెలికేట్‌ మైండ్‌ నాది.&nbsp; రాధిక: అవును టిల్లు 40 మర్డర్స్‌ చేశాను.. ఐదేళ్లుగా నాకోసం వెతుకున్నారు. టిల్లు: అట్ల అనకు ప్లీజ్‌.. నాకు నిజంగా భయమైతాంది. రాధిక: ఇంకేం టిల్లు.. అప్పటి నుంచి చెప్తున్నా పోలీసు పోలీసు అంటే వద్దని. మళ్లీ పెద్ద ఇష్యూ అవుతుంది. ఇద్దరం ఇరుక్కుంటాం. నీకు అర్థం కాదు. అప్పటి నుంచి పోలీసు పోలీసు అని ఒకటే నస. టిల్లు: వన్‌ మినిట్‌.. వన్‌ మినిట్‌.. ఒక వన్‌ స్టెప్‌ బ్యాక్‌ వద్దాం. ఇప్పుడు ఇందాక నువ్వు మన ఇద్దరం ఇరుక్కుంటాం అని అన్నావ్ కదా. అంటే నేనెందుకు ఇరుక్కుంటాను. నాకేం సంబంధం. నాకు వాడు రూమ్‌లో ఉన్నట్లు కూడా తెల్వదు.&nbsp; రాధిక: టిల్లు.. మన ఇద్దరి ఫొటోస్‌ ఇంక ఎక్కడ సేవ్‌ చేసుకున్నాడో తెలీదు మనకి. అండ్ ఈ బిల్డింగ్‌లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_ &nbsp;నేహా శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/iamnehashetty/?hl=en https://www.youtube.com/watch?v=sv7EkhD7c1U
    ఏప్రిల్ 25 , 2024
    <strong>HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;</strong>
    HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;
    నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అధికారికంగా సినీ రంగ ప్రవేశం చేశాడు. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఈ అరంగేట్ర చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ (సెప్టెంబర్‌ 6) మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ఎగిరిగంతేసే న్యూస్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోక్షజ్ఞ పోస్టర్ ఎలా ఉందంటే నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ తాజాగా విడుదలైంది. ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్‌ లుక్‌లో స్మైలింగ్‌ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌ మోక్షజ్ఞకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407 తారక్‌ స్పెషల్‌ విషెస్‌ నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డేతో పాటు ఆయన డెబ్యూ ఫిల్మ్‌ పోస్టర్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) స్పందించారు. మోక్షజ్ఞను విష్‌ చేస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్‌డే మోక్షూ’ అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్‌ చేశారు. మరోవైపు నందమూరి హీరో కల్యాణ్‌ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘టిన్సెల్ టౌన్‌కు నీకు స్వాగతం మోక్షూ. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్స్‌ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు. రెండ్రోజులుగా వరుస హింట్స్‌ రెండు రోజులుగా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి హింట్స్‌ ఇస్తూనే వచ్చారు. ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని తొలుత అతడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ పెట్టిన మరో పోస్టు కూడా నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ. https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368 https://twitter.com/PrasanthVarma/status/1831604468355391886 ‘జై హనుమాన్‌’తో లింకప్‌! ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ ఫస్ట్‌ ఫిల్మ్‌ రూపొందనుంది. ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్‌ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన (Prasanth Varma) స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి&nbsp; తొలుత హనుమాన్‌ను ప్రశాంత్ వర్మ రిలీజ్‌ చేశారు. సెకండ్‌ ఫిల్మ్‌గా మోక్షజ్ఞ ఫిల్మ్‌ రాబోతోంది. ఈ విషయాన్ని ‘సింబా ఈజ్‌ బ్యాక్‌’ అనే పోస్టర్‌లో 'PVCU 2' ప్రాజెక్ట్‌ అంటూ ప్రశాంత్‌ వర్మనే స్పష్టం చేశారు. తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్‌ ఉంటుందని గతంలో ప్రశాంత్‌ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్‌ తర్వాత ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్‌'తో కనెక్షన్‌ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్‌ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌ మామా ఏం ప్లాన్‌ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/theBuzZBasket/status/1831944240831852919 శ్రీకృష్ణుడిగా బాలయ్య! మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్‌, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్‌ తరహాలోనే ఈ సినిమాలో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని, చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్‌ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; హీరోయిన్‌ ఫిక్స్ అయ్యిందా? మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్‌. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్‌ జోడీ మరో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.
    సెప్టెంబర్ 06 , 2024
    Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్‌.. పురాణాల్లో ఆ పాత్ర గురించి ఏముందో తెలుసా?
    Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్‌.. పురాణాల్లో ఆ పాత్ర గురించి ఏముందో తెలుసా?
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఎ.డి (Kalki 2898 AD). బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రచార గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ మూవీలో అమితాబ్‌ అశ్వత్థామ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పురణాల్లో ఆ పాత్రకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకునేందు ఆడియన్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; అశ్వత్థామ ఎవరంటే? ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నట్లు తెలిసినప్పటీ నుంచి ఆయన పోషిస్తున్న పాత్రపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. పురణాల్లోని ఓ కీలక పాత్రలో ఆయన కనిపిస్తారని లీక్స్‌ కూడా వచ్చాయి. అందుకు తగ్గట్లే ఆయన ‘అశ్వత్థామ’ పాత్రలో నటించనునట్లు మూవీ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ పాత్రపై బజ్‌ ఏర్పడింది. పురణాల ప్రకారం.. మహాభారతంలో అశ్వత్థామ ద్రోణుని కుమారుడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేత అశ్వత్థామ శపించబడతాడు. ప్రపంచం అంతమయ్యే వరకు అశ్వత్థామ.. తనకి ఉన్న గాయాలతో రక్తం, చీము కారుతూ, నిత్యం రగులుతూ బ్రతికే ఉండాలని శపిస్తాడు. ఈ శాపంతో అశ్వత్థామ ఇప్పటికి బ్రతికే ఉన్నాడని, గాయాలు నుంచి శ్రవించే రక్తం కనిపించకుండా ఒంటి నిండా బట్ట చుట్టుకొని ఉంటాడని సనాతన ధర్మ గురువులు చెబుతుంటారు. తాజాగా విడుదలైన అమితాబ్‌ లుక్స్‌ అచ్చం అలాగే ఉండటం గమనార్హం. గ్లింప్స్‌లో ఏముంది? కల్కిలో అశ్వత్థామను పరిచయం చేస్తూ ఆదివారం ఓ ఆసక్తికర వీడియోను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో ‘నీకు మరణం లేదా? నువ్వు దేవుడివా? నువ్వు ఎవరు?’ అంటూ ఓ చిన్నారి అమితాబ్‌ను ప్రశ్నిస్తాడు. అప్పుడు అమితాబ్‌ తన పాత్రను పరిచయం చేస్తాడు. ‘అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. నేను గురు ద్రోణాచార్య కొడుకు అశ్వత్థామ’ అని బాలుడితో చెప్పి బిగ్ బి అదృశ్యం అవుతాడు. కాగా, ఈ గ్లింప్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఒక్క వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని పేర్కొంటున్నారు. కాగా, అమితాబ్‌ గ్లింప్స్‌కు సంతోష్ నారాయణన్ ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా బాగుంది. https://twitter.com/i/status/1782338404421927223 రాజమౌళిని ఫాలో అవుతున్న నాగ్‌! అశ్వత్థామ పాత్ర తరహాలోనే రానున్న రోజుల్లో ‘కల్కి 2898 ఏడీ’లోని ఇతర కీలక రోల్స్‌కు సంబంధించిన పరిచయ వీడియోలు కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమా సమయంలో దర్శకధీరుడు రాజమౌళి అనుసరించిన ఫార్మూలనే కల్కీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ అనుసరించబోతున్నట్లు సమాచారం. బాహుబలి సమయంలో ప్రభాస్‌, రానా (భల్లాలదేవ), అనుష్క (దేవసేన) పాత్రలను రాజమౌళి ఓ ప్రత్యేక గ్లింప్స్‌ రూపంలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఈ తరహాలోనే నాగ్‌ అశ్విన్‌ కూడా అమితాబ్‌ బచ్చన్‌ రోల్‌ను పరిచయం చేశారు. త్వరలోనే ప్రభాస్‌ ‘భైరవ’ టీజర్‌ కూడా వస్తుందట. అలాగే దీపికా పదుకొనే, కమల్‌హాసన్‌ తదితరుల పాత్రలను కూడా ఇంట్రడ్యూస్‌ చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.&nbsp;&nbsp; దీపికా, కమల్‌ పాత్రలు అవేనా?&nbsp; ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) చేస్తున్న రోల్స్ అవేనంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్‌ హాసన్‌.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరి పాత్రలకు సంబంధించి కూడా వీడియో రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటి ఇవ్వాల్సి ఉంది.&nbsp; నిరాశలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌! ‘కల్కి 2898 ఏడీ’ విడుదల తేదీకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. వాస్తవానికి మే 9న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్‌ ప్రకటించారు. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ రోజున ఈ సినిమా విడుదల కావడం లేదు. ఈ క్రమంలోనే కొత్త తేదీని మేకర్స్‌ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమితాబ్‌ పాత్రను పరిచయం చేయనున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించడంతో ‘అశ్వత్థామ వీడియో గ్లింప్స్‌’లోనే విడుదల తేదీని రివీల్‌ చేస్తారని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ భావించారు. అయితే ఎలాంటి డేట్‌ను లాక్‌ చేయకపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశ చెందుతున్నారు.&nbsp;
    ఏప్రిల్ 22 , 2024
    Akira Nandan: మెగా లెగసీకి అకిరానే భవిష్యత్ ఆశాకిరణం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ!
    Akira Nandan: మెగా లెగసీకి అకిరానే భవిష్యత్ ఆశాకిరణం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ!
    పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), రేణూ దేశాయ్‌ (Renu Desai) కొడుకు అకిరా నందన్‌ (Akira Nandan) గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సంక్రాంతి సందర్భంగా యానిమల్‌ (Animal) సినిమాలోని ఓ పాటకు పియానో వాయించిన వీడియో మరోమారు నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1747251367033577947 పవన్ కొడుకు పియానో వాయించిన ఈ వీడియోను ఉపాసన (Upasana) షేర్‌ చేస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా ఫోన్ కొన్నింటిని క్యాప్చర్ చేయడం లేదు.. కానీ, అకీరా జస్ట్ సూపర్’ అని పేర్కొన్నారు. ఉపాసన షేర్ చేసిన ఈ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎవరూ ఊహించని విధంగా యానిమల్‌(Animal)లోని 'నాన్న నువ్వు నా ప్రాణం అనినా...' అనే పాటకు అకిరా పియానా వాయించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. తండ్రి ప్రేమకోసం తపన పడే కొడుకుకి సంబంధించిన పాటను అకిరా ఎంచుకోవడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. తన తండ్రిని అకిరా ఎంతగా మిస్‌ అవుతున్నాడో అకిరా ఈ ప్రదర్శన ద్వారా చెప్పకనే చెప్పాడని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు అకిరా నందన్‌ (Akira Nandan)కు సంబంధించిన లేటెస్ట్‌ పిక్స్‌ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అతడి లుక్‌ వింటేజ్‌ పవన్‌ను (Pawan Kalyan) గుర్తు చేసేలా ఉండటంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.&nbsp; ఇదిలా ఉంటే అకీరా నందన్‌కు సంబంధించి నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. అకిరా లేటెస్ట్‌ ఫొటోలను చూసిన ఫ్యాన్స్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) తర్వాత మెగా లెగసీకి అసలైన వారసుడు అకీరానే అవుతాడని అంటున్నారు.&nbsp; రామ్ చరణ్ ఎరా (Era) అయ్యాక మెగా లెగసీ బాధ్యత అంతా అకిరా నందన్ మీదే ఉంటుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకసారి అకిరా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే అతడి కటౌట్‌కు రికార్డులన్నీ పరారవుతాయని ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.&nbsp; అకిరా నందన్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్‌. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్‌ బాల్‌ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అతడు మ్యూజిక్‌ కోర్సులు చేస్తున్నాడు. అతడి మ్యూజిక్‌ టాలెంట్‌ తెలిసే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అకిరాతో ఓ స్పెషల్‌ పర్ఫామెన్స్‌ను ఏర్పాటు చేసింది.
    జనవరి 23 , 2024

    @2021 KTree