• TFIDB EN
  • ఓకే ఒక జీవితం
    UTelugu2h 37m
    ఆది (శ‌ర్వానంద్‌), శ్రీను (వెన్నెల‌ కిషోర్‌), చైతూ (ప్రియ‌ద‌ర్శి) మంచి స్నేహితులు. వీరికి పాల్ (నాజ‌ర్‌) అనే ఓ శాస్త్రవేత్త ప‌రిచ‌యం అవుతాడు. పాల్‌ ఓ టైమ్‌ మిషన్‌ కనిపెడతాడు. గ‌తంలోకి వెళ్లి త‌మ త‌ప్పుల్ని స‌రిదిద్దుకునే అవ‌కాశాన్ని ఆది, శ్రీను, చైతూల‌కి ఇస్తాడు. వారు గతంలో ఏం చేశారన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SonyLivఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    YouSay Review

    ఒకే ఒక జీవితం మూవీ ఫుల్ రివ్యూ

    పెద్దగా ఆడంబరం లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా అమల, నాజర్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రధారులుగా తెరకె...read more

    How was the movie?

    తారాగణం
    అమల అక్కినేని
    రీతూ వర్మ
    వెన్నెల కిషోర్
    రమేష్ తిలక్
    ప్రియదర్శి పులికొండ
    చైతూ
    సతీష్
    నాసర్
    అలీ
    ఎంఎస్ భాస్కర్
    రవి రాఘవేంద్ర
    యోగ్ జపీ
    మధునందన్
    వైయాపురి
    సిబ్బంది
    శ్రీ కార్తీక్
    దర్శకుడు
    SR ప్రభు
    నిర్మాత
    జేక్స్ బిజోయ్
    సంగీతకారుడు
    సుజిత్ సారంగ్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Bhargavi Nilayam OTT Review: ఆత్మతో రైటర్‌ స్నేహం చేస్తే.. ‘భార్గవి నిలయం’ ఎలా ఉందంటే?</strong>
    Bhargavi Nilayam OTT Review: ఆత్మతో రైటర్‌ స్నేహం చేస్తే.. ‘భార్గవి నిలయం’ ఎలా ఉందంటే?
    నటీనటులు : టొవినో థామస్‌, చెంబన్‌ వినోద్‌, రోషన్‌ మ్యాథ్యూ, రీమా క‌ల్లింగ‌ల్‌, షైన్‌ టామ్‌ చాకో, అభిరామ్‌ రాధా కృష్ణ డైరెక్టర్‌: ఆషిక్‌ అబు సినిమాటోగ్రఫీ : గిరిష్‌ గంగాధరన్‌ ఎడిటింగ్‌ : వి. సాజన్‌ సంగీతం : బిజిబాల్‌, రెక్స్‌ విజయన్‌ నిర్మాతలు : అషిక్‌ అబు, రీమా కల్లింగల్‌ ఓటీటీ : ఆహా డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి ఈ వారం ఓ మ‌ల‌యాళ హ‌ర్ర‌ర్ చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేసింది. 1964లో మ‌ల‌యాళంలో వ‌చ్చిన ‘భార్గ‌వి నిల‌యం’ (Bhargavi Nilayam) సినిమాను తిరిగి 2023లో ‘నీల‌వెలిచం’ (Neelavelicham) పేరుతో కొన్ని మార్పులు చేసి రిమేక్ చేశారు. ఈ మూవీలో స్టార్ హీరో టోవినో థామ‌స్‌, రీమా క‌ల్లింగ‌ల్‌, రోష‌న్ మాథ్యూ, షైన్ టామ్ చాకో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. అశిక్ అబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గతేడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ అయిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. తాజాగా ఆ సినిమాను తెలుగులో ‘భార్గ‌వి నిల‌యం’ (Bhargavi Nilayam)గా అనువాదం చేసి ఓటీటీలో తీసుకొచ్చారు. ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి స‌ముద్ర‌తీరానికి స‌మీపంలో ఉన్న ప‌ల్లెటూళ్లో భార్గ‌వి నిల‌యం చాలా రోజులుగా మూత‌ప‌డి ఉంటుంది. ఆ బంగ‌ళా పేరు వింట‌నే ఊరివాళ్లు వ‌ణికిపోతుంటారు. భార్గ‌వి (రీమా క‌ల్లింగ‌ల్‌) అనే అమ్మాయి ఆత్మ‌గా మారి ఆ ఇంట్లో తిరుగుతుంద‌ని అందులో అడుగుపెట్టిన వారిని చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌నే ఊహాగానాలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో బ‌షీర్ (టోవినో థామ‌స్‌) అనే రైట‌ర్ ఆ ఊరికి కొత్త‌గా వ‌స్తాడు. భార్గ‌వి నిల‌యం చ‌రిత్ర గురించి తెలియ‌క అందులో అద్దెకు దిగుతాడు. ఇల్లు మారేందుకు డబ్బుల్లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఆత్మతో స్నేహం చేస్తాడు. ఆమెపై కథ రాయాలని ఫిక్సవుతాడు. అసలు భార్గవి ఎందుకు చనిపోయింది? ఆమెను ప్రాణంగా ప్రేమించిన శివకుమార్‌ (రోష‌న్ మాథ్యూ) ఎలా అదృశ్యం అయ్యాడు? ఈ ప్రేమ జంట జీవితంలోని మిస్ట‌రీని బ‌షీర్ ఎలా బ‌య‌ట‌పెట్టాడు? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే ర‌చ‌యిత పాత్ర‌లో టోవినో థామ‌స్ న‌ట‌న బాగుంది. అత‌డి లుక్‌, డైలాగ్ డెలివ‌రీ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా అనిపిస్తాయి. సినిమా మెుత్తాన్ని ఆయన భుజస్కందాలపై వేసుకొని మోశారు. కీలక సన్నివేశాల్లో నటుడిగా తన మార్క్‌ ఏంటో చూపించాడు. అటు ప్రేమ జంట‌గా రీమా క‌ల్లింగ‌ల్‌, రోష‌న్ మ‌థ్యూ ప‌ర్వాలేద‌నిపించారు. విల‌న్‌గా టామ్ చాకో యాక్టింగ్ బాగుంది. విలన్‌ పాత్రపై అతడు గట్టి ప్రభావాన్నే చూపారు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే ఆషిక్‌ అబు ఒక రొటిన్‌ స్టోరీనే ఈ సినిమాకు ఎంచుకున్నప్పటికీ కథనాన్ని మాత్రం ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఒక ప్రేమ జంట జీవితంలోని విషాదాన్ని ఓ ర‌చ‌యిత వెలికితీసే క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. భార్గవి ఆత్మ ఉన్న ఇంట్లో హీరో దిగడం, ఆ ఊరి వాళ్లు భయంకరమైన కథలతో అతడ్ని భయపెట్టడం ఇంటస్ట్రింగ్‌గా అనిపిస్తాయి. అసలేం జరుగుతుందా అన్న ఆసక్తిని కలిగిస్తాయి. ఈ క్రమంలో వచ్చే కొన్ని హార్రర్‌ ఎలిమెంట్స్ భయపెడతాయి. ఇంటర్వెల్‌కు ముందు హీరోకు ఆత్మతో దోస్తీ కుదరడంతో సెకండాఫ్‌పై ఆసక్తి ఏర్పడుతుంది. ద్వితియార్థంలో భార్గవి - శివకుమార్‌ లవ్‌స్టోరీ, వారి ప్రేమకథకు విలన్ ఎవరన్నది డైరెక్టర్‌ చూపించారు. భార్గవి మరణానికి కారణంతో పాటు ఆమె రివేంజ్‌ డ్రామాను ఆసక్టికరంగా చూపించి కథ ముగించారు. అయితే రొటిన్‌ స్టోరీ, బోరింగ్‌ లవ్ ట్రాక్‌, రెగ్యులర్ హార్రర్‌ సీన్స్‌ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి పనితీరు కనబరిచాడు. తన కెమెరా పనితనంతో 1964 కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టాడు. అటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్‌ అయ్యింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ టోవినో థామస్‌ నటనఆసక్తికర కథనంసాంకేతిక విభాగం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ హార్రర్‌ కాన్సెప్ట్‌థ్రిల్లింగ్‌ అంశాలు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 06 , 2024
    <strong>HBD Sunny Deol: పడిలేచిన బాలీవుడ్‌ కెరటం.. సన్నీ డియోల్‌ లైఫ్‌లో అంత జరిగిందా?</strong>
    HBD Sunny Deol: పడిలేచిన బాలీవుడ్‌ కెరటం.. సన్నీ డియోల్‌ లైఫ్‌లో అంత జరిగిందా?
    ప్రతీ మనిషి జీవితంలో గెలుపోటములు సహజం. అయితే ఓటములకు కుంగిపోకుండా గెలుపు మార్గాన్ని అన్వేషించిన వారే విజేతలుగా నిలుస్తారు. ఇందుకు సినీ నటులు ఏమాత్రం మినహాయింపు కాదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌ (Sunny Deol) సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచే వచ్చినప్పటికీ అతడి ఫిల్మ్‌ కెరీర్‌ పూల పాన్పులా సాగలేదు. అతడి కెరీర్‌ అయిపోయిందనుకున్న ప్రతీసారి బౌన్స్‌బ్యాక్‌ అవుతూ వచ్చాడు. 41 ఏళ్ల ఫిల్మ్‌ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రస్తుతం తిరుగులేని స్టార్‌గా బాలీవుడ్‌లో కొనసాగుతున్నారు. నేడు (అక్టోబర్‌ 19) సన్నీ డియోల్‌ 67వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ్‌ కెరీర్‌లో చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలేంటో తెలుసుకుందాం.&nbsp; ధర్మేంద్ర నటవారసుడిగా.. బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ 1957 అక్టోబర్‌ 19న జన్మించాడు. దిగ్గజ నటుడు ధర్మేంద్రకు ఆయన కుమారుడు. ఎవర్‌గ్రీన్‌ బాలీవుడ్‌ చిత్రం ‘షోలే’ (Sholey)లో అమితాబ్‌ బచ్చన్‌తో పోటీ పడి ధర్మేంద్ర నటించారు. అటువంటి ధర్మేంద్ర నట వారసుడిగా సన్నీ డియోల్‌ హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నిజానికి అతడి అసలు పేరు అజయ్‌ సింగ్‌ డియోల్‌. ఇండస్ట్రీలోకి వచ్చాక సన్నీ డియోల్‌గా మార్చుకున్నారు. 1983లో వచ్చిన రొమాంటిక్‌ చిత్రం 'బేతాబ్‌' (Betaab)తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అద్భుత నటన కనబరిచి తొలి సినిమాకే బెస్ట్‌ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అందుకున్నాడు. ’బేతాబ్‌’లో సన్నీ చేసిన గుర్రపు స్వారీ సీన్స్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. ఎంతో కఠినమైన గుర్రపు స్వారీ సీన్లను అలవోకగా చేయడంతో పాటు యాక్షన్‌ సీన్స్‌లోనూ దుమ్మురేపాడు. హీరోయిన్‌ అమృత సింగ్‌తో కలిసి అద్భుతంగా రొమాంటిక్‌ సన్నివేశాలను పండించాడు. తొలి మూవీతోనే స్టార్‌ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్‌ చేసుకున్నారు.  ఒకే ఏడాది 7 చిత్రాలు రిలీజ్‌ 'బేతాన్' సక్సెస్‌తో సన్నీ డియోల్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయనతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే రెండో చిత్రం 'రాజ్‌ ఖోస్లా' (1985) తీసి మరో హిట్‌ అందుకున్నారు సన్నీ. రొమాంటింక్‌ యాక్షన్‌ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం సన్నీలోని ప్రతిభను మరింత బహిర్గతం చేసింది. సన్నీ క్రేజ్‌ అమాంతం పెరగడం మెుదలైంది. ఆ తర్వాత అర్జున్‌ (1985), డెకాయిట్‌ (1987) చిత్రాలు చేశాడు. ఆ సినిమాలు కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆ తర్వాత నుంచి కథల ఎంపికలో సన్నీ ఉదాశీనంగా వ్యవహరించారు. వచ్చిన కథను వచ్చినట్లు ఓకే చేశారు. తద్వారా 1989వ సంవత్సరంలో ఏకంగా 7 సినిమాలను రిలీజ్‌ చేశారు. కానీ వాటిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. మిగిలిన ఐదు మూవీస్‌ బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. దీంతో సన్నీ క్రేజ్‌కు బీటలు వారడం మెుదలైంది. ఓటమి నుంచి పాటలు నేర్చుకున్న సన్నీ కథల విషయంలో జాగ్రత్త వహించాలని నిర్ణయించుకున్నాడు.&nbsp; ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్‌ 1990లో రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో 'ఘాయల్‌' అనే చిత్రం చేశాడు. ఈ మూవీని అతడి ధర్మేంద్ర నిర్మించడం విశేషం. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్‌ విజయాన్ని అందించింది. అంతకుముందు వచ్చిన వరుస ఫ్లాప్స్‌ను అందరూ మర్చిపోయేలా చేసింది. అంతేకాదు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రాజ్‌కుమార్‌ సంతోషి డైరెక్షన్‌లోనే వరుసగా దామిని (1993), ఘటక్‌ (1996) అనే రెండు బ్లాక్‌ బాస్టర్ చిత్రాలు చేశారు. ముఖ్యంగా ‘దామిని’ సినిమాలో వచ్చే కోర్టు సీన్‌లో కెరీర్‌ బెస్ట్ నటనతో సన్నీ డియోల్‌ మెస్మరైజ్‌ చేశారు. అంతేకాదు ఘటక్‌ సినిమాతో మరో నేషనల్‌ అవార్డ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)తో కలిసి చేసిన ‘డర్‌’ సినిమా సన్నీకి బిగ్‌ మైనస్‌గా మారింది. యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ ‘డర్‌’ సాఫ్ట్‌ రోల్‌ చేశాడు. దానికితోడు అందులో షారుక్‌ పాత్ర కనెక్టింగ్‌గా ఉండటంతో షారుక్‌ ముందు సన్నీ తేలిపోయాడన్న భావన ఆడియన్స్‌లో కలిగి ఉంది.&nbsp; ‘గదర్‌’తో చెక్‌! 1990వ దశకంలో పెద్ద ఎత్తున రొమాంటిక్‌ చిత్రాలు విడుదలయ్యాయి. ఇందుకు అనుగుణంగా షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ వంటి స్టార్స్.. ప్రేమ కథలను ఎంచుకుని మంచి విజయాలను సాధించారు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌ అన్న ముద్ర పడటంతో సన్నీకి ఆ తరహా లవ్‌స్టోరీలు రాలేదు. దీంతో ఒక వర్గం ప్రేక్షకులకు సన్నీ రీచ్‌ కాలేకపోయారు. అటు డ్యాన్స్‌లోనూ సన్నీకి పెద్దగా ప్రావీణ్యం లేకపోవడం కూడా అతడి క్రేజ్‌ను కొద్దిమేర డ్యామేజ్‌ చేసింది. ఇది అతడి కెరీర్‌లో వచ్చిన సెకండ్ స్ట్రగల్‌ ఫేజ్ అని చెప్పవచ్చు. అయితే 2001లో వచ్చిన ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ (Gadar: Ek Prem Katha) మూవీతో వాటన్నింటికి సన్నీ చెక్‌ పెట్టాడు. సరిహద్దులు దాటిన ప్రేమకథ చిత్రంలో అతడు అద్భుతంగా నటించారు. అంతేకాదు తనకు బాగా కలిసొచ్చిన యాక్షన్‌తో మరోమారు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ చిత్రం అతడి కెరీర్‌లోనే అతి పెద్ద మైలురాయిగా నిలిచింది. తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది.&nbsp; 23 ఏళ్ల నిరీక్షణ తర్వాత.. ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ (Gadar: Ek Prem Katha) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత సన్నీకి ఇక తిరుగుండదని అంతా భావించారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినప్పటికీ ఆ స్థాయి సక్సెస్‌ రాలేదు. ఓ దశలో హీరోగా అవకాశాలు కోల్పోయి క్యారెక్టర్ అర్టిస్టుగానూ సన్నీ డియోల్‌ చేశారు. 60 ఏళ్ల వయసులో ఎన్నో ఆర్థిక సమస్యలను సైతం ఆయన ఫేస్‌ చేశారని సన్నిహితులు తెలియజేశారు. దాదాపు 23 ఏళ్లుగా సాలిడ్‌ హిట్‌ కోసం సన్నీ అలుపెరగని పోరాటం చేస్తూనే వచ్చారు. ఇక అతడి కెరీర్‌ అయిపోయిందనుకుంటున్న సమయంలో మరోమారు ‘గదర్‌ 2’ మరోమారు బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు. రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 691.08 కోట్లు కొల్లగొట్టి మరోమారు సన్నీ డియోల్‌కు స్టార్ స్టేటస్‌ను అందించింది. ప్రస్తుతం 'లాహోర్‌ 1947', బోర్డర్‌ 2, రామాయణం వంటి బిగ్‌ ప్రాజెక్ట్స్‌లో సన్నీ డియోల్ నటిస్తున్నారు. తెలుగు డైరెక్టర్‌తోనూ టాలీవుడ్‌ డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలోనూ సన్నీ డియోల్‌ (Sunny Deol) ఓ బిగ్‌ ప్రాజెక్ట్ చేస్తున్నారు. 'జాట్‌' (Jaat) పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ను సైతం మేకర్స్‌ రిలీజ్ చేశారు. ఇందులో సన్నీ డియోల్‌ శరీరమంతా బ్లడ్‌ మార్క్స్‌తో భారీ ఫ్యాన్‌ని పట్టుకొని ఉండటాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. 
    అక్టోబర్ 19 , 2024
    <strong>Miss You Review: మిస్‌ ఫైర్‌ అయిన సిద్ధార్థ్‌ ఎమోషనల్‌ డ్రామా.. మరో ఫ్లాప్‌ ఖాతాలో పడినట్లే!</strong>
    Miss You Review: మిస్‌ ఫైర్‌ అయిన సిద్ధార్థ్‌ ఎమోషనల్‌ డ్రామా.. మరో ఫ్లాప్‌ ఖాతాలో పడినట్లే!
    నటీనటులు : సిద్ధార్థ్‌, ఆషికా రంగనాథ్‌, కరుణాకరన్‌, బాల శరవణన్‌ తదితరలు డైరెక్టర్‌ : ఎన్‌. రాజశేఖర్‌ సంగీతం: జిబ్రాన్‌ సినిమాటోగ్రఫీ: కె.జి. వెంకటేష్‌ ఎడిటర్‌: దినేష్‌ పోనరాజ్‌ నిర్మాత : శామ్యూల్‌ మాథ్యూ విడుదల తేదీ: &nbsp;డిసెంబర్‌ 13, 2024 ప్రముఖ నటుడు సిద్ధార్థ్ (siddharth), కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘మిస్‌ యు’ (Miss You Movie Review In Telugu). యు.ఎన్‌.రాజశేఖర్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని 7 మైల్స్‌ పర్‌ సెకండ్‌ సంస్థ నిర్మించింది. ఒక యునిక్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు తమ చిత్రం తప్పక నచ్చుతుందని ప్రమోషన్స్‌ సందర్భంగా ఊదరగొట్టింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 13న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందిపడుతున్న సిద్ధార్థ్‌కు సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.  కథేంటి వాసు (సిద్ధార్థ్‌) డైరెక్టర్‌ కావాలని కలలు కంటాడు. ఈ ప్రయత్నాల్లో ఉండగా అనుకోకుండా అతడికి యాక్సిడెంట్‌ జరుగుతుంది. దీంతో రెండు సంవత్సరాల గతాన్ని మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు బాబీ (కరుణాకరన్‌)తో అయి పరిచయం అతడి జీవితంలో అనుకోని పరిణామాలను తీసుకొస్తుంది. అతడితో కలిసి బెంగళూరుకు వెళ్లిన వాసుకి అక్కడ సుబ్బలక్ష్మీ (ఆషికా రంగనాథ్‌) పరిచయమవుతుంది. తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. వెంటనే ఈ విషయాన్ని ఆమెకు చెప్తాడు. అయితే సుబ్బలక్ష్మీ రిజెక్ట్‌ చేస్తుంది. అయితే సుబ్బలక్ష్మీ అలా ఎందుకు చేసింది? వాసుతో సుబ్బలక్ష్మీకి ముందే పరిచయం ఉందా? మంత్రితో ఆమెకున్న ఉన్న వైరం ఏంటి? వాసు మర్చిపోయిన రెండేళ్లలో ఏం జరిగింది? అన్నది స్టోరీ.  ఎవరెలా చేశారంటే వాసు పాత్రలో నటుడు సిద్ధార్థ్ (Miss You Review) మరోమారు సెటిల్డ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. బాగా కలిసొచ్చిన లవర్ బాయ్‌ పాత్రలో అలరించాడు. వాసు పాత్రకు అతడు పూర్తిగా న్యాయం చేశాడని చెపొచ్చు. ఇక హీరోయిన్‌ సుబ్బలక్ష్మీ పాత్రలో ఆషికా రంగనాథ్‌ (Miss You Movie Review In Telugu) అదరగొట్టింది. క్యారెక్టరైజేషన్‌ పరంగా చూస్తే సిద్ధార్థ్‌ కన్నా ఆమె రోల్‌ బాగా హైలెట్‌ అయ్యింది. కరుణాకర్ కామెడీ పంచ్‌లు బాగానే పేలాయి. మిగతా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఓ మోస్తరుగా అలరించారు. జయప్రకాశ్, శరత్ లోహితస్వ నటన బాగుంది. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు ఎన్.రాజశేఖర్ రాసుకున్న కథ బాగున్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో పూర్తిగా తడబడ్డాడు. వాసు పాత్రను డిజైన్ చేసిన తీరు సైతం ఏమాత్రం ఆకట్టుకోదు. సినిమాను ప్రారంభించిన విధానం బాగున్నప్పటికీ కథ సాగుతున్న కొద్ది క్యూరియాసిటీగా అనిపించదు. యాక్సిడెంట్‌ తర్వాత ఆడియన్స్‌లో ఆసక్తి పెంచినప్పటికీ ఆపై వచ్చే రెగ్యులర్‌ సీన్స్‌తో కథను సాదాసీదాగ మార్చేశారు. హీరో పరిచయం, యాక్సిడెంట్‌ తర్వాత వచ్చే సీన్స్, కరుణాకరణ్‌ కామెడీతో ఫస్టాఫ్‌ పర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు డైరెక్టర్‌. సినిమాకు ఎంతో కీలకమైన ఎమోషనల్ డ్రామాను సరిగ్గా పండించలేకపోయారు.&nbsp; క్లైమాక్స్ మినహా మిగతా ఎమోషనల్‌ సీన్స్‌ అన్ని సాగదీసిన ఫీలింగ్‌ను కలిగిస్తాయి.&nbsp; సాంకేతికంగా.. టెక్నికల్‌ అంశాలకు వస్తే (Miss You Movie Review In Telugu) జిబ్రాన్‌ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలు మాత్రం పెద్దగా కనెక్ట్‌ కావు. వెంకటేష్ సినిమాటోగ్రఫీ వర్క్ డిసెంట్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారాగణం నటనకామెడీ సీన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఆసక్తిలేని కథనంకనెక్ట్‌ కానీ ఎమోషన్‌ డ్రామారొటీన్‌ సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 2/5&nbsp;
    డిసెంబర్ 13 , 2024
    <strong>Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ?</strong>
    Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ?
    ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) దక్షిణాది సినీ పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి (Mammootty) నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్‌ అతి తక్కువ కాలంలోనే తనకంటూ సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నారు. తన అద్భుత నటనతో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. మలయాళంతో పాటు తెలుగులోనూ పార్లర్‌గా చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. అయితే దుల్కర్‌ తన ఫోకస్‌ మెుత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. తెలుగులో వరుసగా ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చేస్తూ రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, నితిన్‌ వంటి టైర్‌ 2 హీరోలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.&nbsp; తెలుగు రైజింగ్‌ హీరోగా దుల్కర్‌! యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తన రెండు, మూడు చిత్రాలతోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరో క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. తెలుగులో నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి మెప్పించాడు. తన అద్భుతమైన నటుడితో తెలుగు ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ సినిమాలో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా, శత్రుదేశంలో పట్టుబడ్డ బందీగా తన విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీలో ప్రభాస్ ను పెంచి పెద్ద చేసే గురువు పాత్రలో నటించి మెప్పించాడు. ఓ రకంగా అది పరశురాముడి పాత్ర అని చెబుతున్నారు. ‘కల్కి 2’ లోనూ దుల్కర్‌ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది.&nbsp; డబ్బింగ్‌ చిత్రాలతోనూ గుర్తింపు డైరెక్ట్‌ తెలుగు చిత్రాలే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో అతడు నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. దుల్కర్‌ నటించిన 9 వరకూ చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను పలకరించాయి. అందులో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఓకే బంగారం', సాయిపల్లవితో చేసిన 'హేయ్‌ పిల్లగాడ', ‘అందమైన జీవితం’ వంటి చిత్రాలు తెలుగు యూత్‌ను ఎంతగానో ఆకర్షించాయి. దుల్కర్‌ మనవాడే అన్న ఫీలింగ్‌ను వారిలో కలిగించాయి. అలాగే ‘కురుప్‌’, ‘సెల్యూట్‌’, ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ వంటి యాక్షన్‌ చిత్రాలు సైతం మాస్‌ ఆడియన్స్‌లో మంచి గుడ్‌విల్‌ తెచ్చిపెట్టాయి. దీంతో తెలుగులో క్లాసు-మాసు కలగలిసిన హీరోగా దుల్కర్‌ మారిపోయాడు.&nbsp; కొత్త ప్రాజెక్ట్స్‌తో దూకుడు తెలుగులోనూ స్టార్‌ హీరో క్రేజ్‌ సంపాదించుకున్న దుల్కర్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వరుసగా టాలీవుడ్‌లో ప్రాజెక్ట్స్‌కు ఓకే చెబుతూ దుల్కర్‌ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి ‘లక్కీ భాస్కర్‌’ చిత్రంలో దుల్కర్‌ నటిస్తున్నాడు. అక్టోబర్‌ 31న ఈ చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత పవన్‌ సాధినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఒక తార' అంటూ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు దుల్కర్‌ ఓకే చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ కూడా విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో రైతు పాత్రలో దుల్కర్‌ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తెలుగు స్టార్‌ హీరో రానా నిర్మాణంలో కొత్త ప్రాజెక్ట్‌ 'కాంత'ను పట్టాలెక్కించాడు. ఇందులో దుల్కర్‌కు జోడీగా టాలీవుడ్ రైజింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. 1950 నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రానా కీలక పాత్ర పోషించనున్నాడు. తమిళ డైరెక్టర్‌ సెల్వమణి సెల్వరాజ్‌ ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు.&nbsp; https://twitter.com/vamsikaka/status/1817427815249133673 https://twitter.com/imwpolitikos/status/1833028992456089818 https://twitter.com/Chrissuccess/status/1832279694118400071 ‘టైర్‌ 2’ హీరోలకు గట్టిపోటీ! టాలీవుడ్‌లో దుల్కర్‌ సల్మాన్‌ దూకుడు చూస్తుంటే టైర్‌ 2 హీరోలకు గట్టి పోటీ తప్పదని అనిపిస్తోంది. రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, నితిన్‌, అడవి శేష్‌ తదితర హీరోలకు దుల్కర్‌ పోటీగా మారతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో అతడు చేస్తున్న మూడు ప్రాజెక్టుల్లో కనీసం రెండు హిట్స్‌ అయినా అతడి గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. క్లాసిక్‌ లుక్స్‌తో పాటు యాక్షన్‌ సీక్వెన్స్‌లో దుమ్మురేప గల సత్తా అతడికి ఉండటంతో తెలుగు డైరెక్టర్ల ఫస్ట్‌ ఛాయిస్‌ అతడు అయ్యే పరిస్థితులు రావొచ్చని అంటున్నారు. వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న నాగచైతన్య, రామ్‌, విజయ్ దేవరకొండ వంటి హీరోలు దుల్కర్‌ విషయంలో జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 10 , 2024
    <strong>Honeymoon Express Review: బోల్డ్‌ కంటెంట్‌ ఫుల్లు.. అవి మాత్రం నిల్లు.. ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ రివ్యూ!</strong>
    Honeymoon Express Review: బోల్డ్‌ కంటెంట్‌ ఫుల్లు.. అవి మాత్రం నిల్లు.. ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ రివ్యూ!
    నటీనటులు: చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ తదితరులు డైరెక్టర్‌ : బాల రాజశేఖరుని సంగీతం : కల్యాణి మాలిక్‌ నేపథ్య సంగీతం : ఆర్‌.పి పట్నాయక్‌ నిర్మాత : కేకేఆర్‌, బాలరాజు విడుదల తేదీ: 21 జూన్‌, 2024 చైతన్యరావు (Chaitanya Rao), హెబ్బా పటేల్‌ (Hebah Patel) ఫస్ట్‌ టైమ్‌ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్‌, బాలరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకుందా? చైతన్యరావు, హెబ్బాపటేల్‌కు మంచి విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. కథేంటి ఇషాన్‌ (చైతన్య రావు), సోనాలి(హెబ్బా పటేల్) ఒక చిన్న యాక్సిడెంట్‌ ద్వారా పరిచయం అవుతారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే వీళ్లిద్దరి ఆలోచన విధానం వేర్వేరుగా ఉంటాయి. సోనాలి చాలా ఫాస్ట్‌ అయితే.. ఇషాన్ నిదానం. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఏదోక&nbsp; సమస్యలు వస్తుంటాయి. ఓ రోజు వీరికి సీనియర్‌ కపుల్స్‌ పరిచయమై హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ అనే గేమ్‌ గురించి చెబుతారు. అలా వారిని ఓ రిసార్ట్‌కు పంపిస్తారు. ఇంతకీ హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ అంటే ఏంటి? దాని వల్ల ఇషాన్‌ - సోనాలి మధ్య గొడవలు సద్దుమణిగాయా? వీరి శృంగార జీవితం బాగుపడిందా? లేదా? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే కొన్ని రోజులుగా వరుస చిత్రాలతో అలరిస్తున్న చైతన్య రావు.. ఈ సినిమాలోనూ చక్కటి నటన కనబరిచాడు. రెండు వేరియేషన్స్‌లో నటించి ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ మరోమారు తన అందచందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వీరి మధ్య కెమెస్ట్రీ యూత్‌ను మెప్పిస్తుంది. సీనియర్‌ జంటగా తనికెళ్ల భరణి, సుహాసిని ఎప్పటిలాగే తమ సెటిల్డ్‌ నటనతో అలరించారు. థియేటర్లలో నవ్వులు పూయించారు. కథ మెుత్తంగా ప్రధానంగా ఈ నలుగురు మధ్యే సాగడం గమనార్హం. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే పెళ్లైన కొత్త జంట కొద్ది రోజులకే విడిపోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. యువ జంటలు చిన్న చిన్న పొరపొచ్చాలకే విడాకుల వరకూ వెళ్తున్నారు. ఈ అంశాన్నే కథాంశంగా తీసుకొని దర్శకుడు బాల శేఖరుని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత ఒకరి ఇష్టాలను మరొకరు అర్థం చేసుకోవాలన్న సందేశాన్ని ఈ మూవీ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కథ చెప్పే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. సైన్స్‌ ఫిక్షన్‌, టైమ్‌ ట్రావెల్‌ అంటూ కథను ఎటెటో తీసుకెళ్లి కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ చేశారు. యూత్‌ను అట్రాక్ట్‌ చేస్తూ తీసిన కొన్ని సీన్లు మరీ బోల్డ్‌గా అనిపిస్తాయి. వల్గారిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ మూవీకి కనెక్ట్‌ కాకపోవచ్చు. తమ జీవితాన్ని బాగు చేయడానికి వాళ్లే ఫ్యూచర్‌ నుంచి రావడం అనేది కాస్త కొత్తగా అనిపిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్‌ అందించిన పాటలు బాగున్నాయి. ఆర్‌.పి పట్నాయక్ అందించిన నేపథ్యం సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన పనిని ఇంకాస్త బెటర్‌గా నిర్వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ చైతన్య రావు, హెబ్బా పటేల్‌ నటనసమకాలిన అంశాలు ఉండటంసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథనం, స్క్రీన్‌ప్లేసాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp; https://telugu.yousay.tv/en/do-you-know-these-top-secrets-about-hebah-patel.html
    జూన్ 21 , 2024
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ సురభి పద్మావతి, అభిషేక్‌ బొడ్డెపల్లి తదితరులు దర్శకుడు : అజయ్‌ నాగ్‌ సంగీతం: సింజిత్‌ యర్రమిల్లి సినిమాటోగ్రఫి: దేవ్‌దీప్‌ గాంధీ నిర్మాతలు: అభిషేక్‌ వి. తిరుమలేశ్‌, వియన్‌ రెడ్డి మామిడి విడుదల తేదీ: 10-05-2024 మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambam). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ కాలాఘటి జైలులో మిగిల్ (మోహన్ భగత్) శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఉరి తీయడానికి సరిగ్గా ఒక రోజు ముందు అనూహ్యంగా జైలు నుంచి మిస్‌ ‌అవుతాడు. జైలు గదికి ఉన్న తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం పోలీసులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని గురించి కనిపెట్టేందుకు డిటెక్టివ్ (రవీంద్ర విజయ్‌) రంగంలోకి దిగుతాడు. అతడు చేస్తున్న దర్యాప్తులో మిగిల్‌కు సంబంధించిన ఓ డైరీ దొరుకుతుంది. అందులో ఏముంది? మిగిల్‌ కథేంటి? అతడికి డెజావు ఎక్స్‌పరిమెంట్‌కు ఏంటి సంబంధం? అసలు మిగిల్‌ ఎందుకు జైలుకు వెళ్లాడు? అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది మిగిలిన కథ.&nbsp; ఎవరెలా చేశారంటే కేరాఫ్ కంచర పాలెంలో (Aarambham Review In Telugu) గడ్డం క్యారెక్టర్‌లో కనిపించిన మోహన్‌ భగత్‌.. ఈ సినిమాలో మిగిల్‌ పాత్రలో అదరగొట్టాడు. మెయిన్ లీడ్‌లో కనిపించి తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడు. సుప్రీతా సత్యనారాయణ ఫిమేల్ లీడ్‌లో ఓకే అనిపించింది. తల్లి పాత్రలో సురభి ప్రభావతి అదరగొట్టేసింది. సైంటిస్ట్‌గా భూషణ్ చాలా బాగా నటించారు. లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అజయ్‌ నాగ్‌.. సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. జీవితంలో ఓ తోడు ఉండాలని అనే కాన్సెప్ట్‌కు డెజావు అనే సైన్స్‌ ఎక్స్‌పెరమెంట్‌ను జోడించి సస్పెన్స్‌ను క్రియేట్‌ చేశాడు. కథతో పాటు కథనాన్ని కూడా ఆసక్తికరంగా నడిపించాడు. స్టోరీలో అక్కడక్కడా బోరింగ్‌ సీన్లు ఉన్నప్పటికి సస్పెన్స్‌ను చివరి వరకూ కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా రుచించకపోవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Aarambham Review In Telugu) ఈ మూవీకి అన్ని విభాగాలు చక్కటి పనితీరును అందించాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొండ ప్రాంతాల్లోని ఓ చిన్న గ్రామాన్ని తన కెమెరాలతో ఎంతో చక్కగా చూపించాడు. సింజిత్‌ యర్రమిల్లి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ పనితీరు కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, స్క్రీన్‌ప్లేసస్పెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ బోరింగ్‌ సన్నివేశాలుకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    మే 10 , 2024
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే&nbsp; చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.&nbsp; భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్‌ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.&nbsp; తొలి ప్రేమ (Tholi Prema) వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.&nbsp; ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade) నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్‌ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్‌ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్‌ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.&nbsp; అష్టా చమ్మా (Ashta Chamma) నాని, అవసరాల శ్రీనివాస్‌, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్‌ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్‌ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.&nbsp; అలా మెుదలైంది (Ala Modalaindi) డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్‌ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్‌ ఫెయిల్‌ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.&nbsp; సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan) హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.&nbsp; మజిలి (Majili) తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.&nbsp; ఓకే బంగారం (Ok Bangaram) ప్రస్తుత కాలంలో డేటింగ్‌ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.&nbsp; ఏ మాయ చేశావే (Ye Maya Chesave) తెలుగులో వచ్చిన ఎవర్‌గ్రీన్‌ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్‌ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.&nbsp;&nbsp; పెళ్లి చూపులు (Pelli Chupulu) తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్‌ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్‌ బిజినెస్‌లో భాగమై సక్సెస్‌ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.&nbsp; సీతారామం (Sita ramam) 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన చిత్రాల్లో సూపర్‌ క్లాసిక్‌ మూవీగా దీన్ని చెప్పవచ్చు.&nbsp; హాయ్‌ నాన్న (Hi nanna) ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్‌ నాన్న తప్పకుండా ఉంటుంది.&nbsp; మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju) రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.&nbsp; ఓయ్‌ (Oye) బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha) కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి (Raja Rani) ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు. జాను (Jaanu) శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.&nbsp; గోదావరి (Godavari) శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్‌ కొట్టదు. హీరో సుమంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఆనంద్‌ (Anand) ఈ ఫీల్‌గుడ్‌ మూవీ కూడా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్‌ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
    మార్చి 22 , 2024
    BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
    BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
    నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిశోర్, తదితరులు దర్శకత్వం: సముద్రఖని స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యూజిక్: తమన్ ఎస్.ఎస్ సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్‌ మూవీ ‘బ్రో’. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ హిట్ల అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన మరో రీమేక్ ఇదే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు, పవన్ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాను మలిచారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాతృక దర్శకుడు సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. మరి, ఫిలాసఫికల్ టచ్‌తో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మెప్పించిందా? టైం కాన్సెప్ట్ ప్రేక్షకుడిని కన్వీన్స్ చేసిందా? ‘బ్రో’ మూవీతో పవన్ హ్యాట్రిక్ రీమేక్ హిట్ అందుకున్నాడా? అనే విశేషాలు రివ్యూలో చూద్దాం. కథేంటంటే? మార్కండేయుడు(సాయితేజ్) ఓ బిజినెస్‌మేన్ పెద్దకొడుకు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మార్క్‌పై పడతాయి. గజిబిజి హడావుడిలో పడిపోయి అటు కుటుంబానికి, లవర్‌కి పెద్దగా టైం కేటాయించని పరిస్థితి మార్క్‌ది. ఈ క్రమంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతాడు. మార్క్‌ని తీసుకెళ్లడానికి టైటాన్(పవన్ కళ్యాణ్) వస్తాడు. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయని, వాటిని పూర్తి చేశాక వస్తానని కాలదేవుడిని ఒప్పిస్తాడు. ఈ క్రమంలో మార్క్ చేసే ప్రతి పనిలోనూ ఎదురు దెబ్బ తగులుతుంది. మరి, చివరికి మార్క్ వాటినెలా పూర్తి చేశాడు? టైటాన్ ఏమైనా సాయం చేశారా? అనేది తెరపై చూడాల్సిందే. https://twitter.com/captain_India_R/status/1684756208845045760?s=20 ఎలా ఉంది? ‘వినోదయ సిత్తం’ మూవీ కంప్లీట్‌గా ఫిలాసఫికల్‌ మూడ్‌లో సాగుతుంది. కానీ, బ్రో ఇందుకు కాస్త భిన్నం. తత్వాన్ని బోధిస్తూనే కమర్షియల్ హంగులను అద్దుకుందీ సినిమా. దేవుడికి కూడా టైం రావాలని, దేవుడి కన్నా గొప్పది ‘టైం’ అనే విషయాన్ని చెబుతుంది. దీనినే పూర్తిగా ఫ్యాన్ మేడ్‌లా రూపొందించి కన్వే చేశారు. పవన్ కళ్యాణ్ పాత్రను దృష్టిలో పెట్టుకునే పూర్తి సినిమాను మలిచారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచే ఈ ఫ్లేవర్ కనిపిస్తుంది. అసలే ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కి పవన్ పాపులర్ సాంగ్స్‌ని మిక్స్ చేసి బిర్యానీ తినిపించారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ని కుర్చీలో కూర్చోనివ్వవు. ఇంట్రవెల్ పార్ట్, క్లైమాక్స్ పార్ట్ సినిమాకు అసెట్‌గా నిలుస్తాయి. సన్నివేశాలకు అనుగుణమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కథనం వేగంగా సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో ఎమోషన్ పీక్స్. అప్పటిదాకా ఎంజాయ్ చేసిన సినిమాను చివరి 20 నిమిషాల్లో మర్చిపోతాం. థియేటర్ల నుంచి బయటకొచ్చేటప్పుడు ఈ క్లైమాక్స్ మాత్రమే గుర్తుంటుంది. అయితే, కొన్ని చోట్ల సీన్లు ఓవర్‌గా అనిపించడం, కుటుంబం ఎమోషన్లు ఊహించినంతగా పండకపోవడం కాస్త మైనస్. సినిమాలో ఏపీ పాలిటిక్స్‌ని ఇరికించడం రుచించకపోవచ్చు. https://twitter.com/CharanRuthless/status/1684406412892606464?s=20 ఎవరెలా చేశారు? కాలదేవుడిగా పవన్ కళ్యాణ్ ఇరగ దీశాడు. ఎంట్రీ సీన్ నుంచి సినిమాకు ఫుల్ ఎనర్జీని తీసుకొచ్చాడు. సినిమా ఆసాంతం నాటి పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేసేలా నటించాడు. తన పాపులర్ సాంగ్స్‌లలో స్టెప్పులతో అలరించాడు. క్లైమాక్స్‌లోనూ ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ఇక మార్క్‌‌పై సానుభూతి కలిగేంతలా నటించాడు సాయితేజ్. తన రియల్ లైఫ్‌కి ఇది చాలా దగ్గరగా ఉండటంతో అట్టే ఒదిగిపోయాడు. మావయ్యతో కలిసి చేసే సీన్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. చివర్లో సాయితేజ్ ఏడిపించేస్తాడు. ఇక, కేతిక శర్మ తన పాత్రకు పరిమితమైంది. తల్లిగా రోహిణి, చెల్లిగా ప్రియా ఓకే అనిపించారు. టెక్నికల్‌గా సినిమాకు కథ ఎంతో బలాన్నిచ్చింది. రీమేక్ అయినప్పటికీ మాతృ కథలోని ఆత్మ పోకుండా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సముద్రఖని సఫలమయ్యాడు. ఎంత వరకు అవసరమో, ఫ్యాన్స్‌కి ఏం కావాలో అంతే చూపించాడు. ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా డైలాగ్స్‌లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. ఇక, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఆకట్టుకుంటుంది. శ్లోకం బీజీఎం ఒక వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్‌ని యంగ్‌గా చూపించడంలో సుజీత్ వాసుదేవ్ తన పనితనం చూపించారు. నిర్మాణ విలువలు సరిపోయాయి. https://youtu.be/jnzuXnj6HE0 ప్లస్ పాయింట్స్ పవన్, సాయితేజ్ మధ్య సీన్స్ పవన్ సాంగ్స్ మిక్స్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ఓవర్ సీన్స్ పొలిటికల్ డైలాగ్స్ చివరగా.. సినిమా చూసొచ్చాక జీవితంలో ఏదైనా చేయాలనిపిస్తుంది ‘బ్రో’ రేటింగ్: 3/ 5 https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
    జూలై 28 , 2023
    BRO Pre Review: బ్రో మూల కథ ఎలా పుట్టింది? 12 భాషల్లో ఈ సినిమాను ఎందుకు తీస్తున్నారు?
    BRO Pre Review: బ్రో మూల కథ ఎలా పుట్టింది? 12 భాషల్లో ఈ సినిమాను ఎందుకు తీస్తున్నారు?
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్‌గా రూపొందిన చిత్రం ‘బ్రో’. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్‌ ఇది. మాతృకలో తీసిన డైరెక్టర్ సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా విజయంపై మూవీ యూనిట్ ఎంతో ధీమాతో ఉంది. దీనికి కారణం సినిమా మూల కథే. మరి, ‘వినోదయ సిత్తం’ కథ ఎలా పుట్టింది? ఈ సినిమాలో అంతగా ఏముంది? మూవీతో ఏం సందేశం ఇచ్చారు? వంటి అంశాలను తెలుసుకుందాం.&nbsp; అలా తెరమీదకి.. ఓటీటీ కంటెంట్ కోసం జీ స్టూడియోస్ సముద్రఖనిని పిలిపించుకుని ఓ 5 కథలను చెప్పమంది. ఇందుకు 25 నిమిషాలు టైం ఇచ్చింది. దర్శకుడు 20 నిమిషాల్లోనే 5 కథలను పూర్తి చేశారు. ఇందులో నుంచి ఓ కథను సెలెక్ట్ చేసి ఓకే చేసేశారు. మరో 3 నిమిషాలు మిగిలి ఉండటంతో ఒక కథ చెప్పే అవకాశం ఇవ్వండని కోరి ఈ ‘బ్రో’ మూవీ స్టోరీ లైన్ చెప్పారు సముద్రఖని. దీంతో ముందుగా ఓకే చేసిన స్టోరీని పక్కన పెట్టి ‘వినోదయ సిత్తం’కు నిర్మాతలు ఓటేశారు. అలా ఈ సినిమాకు బీజం పడింది. అయితే, వినోదయ సిత్తం కథను తన గురువు బాలచందర్ గారు అందించినట్లు సముద్రఖని చెబుతుంటారు.&nbsp;&nbsp; https://twitter.com/KarnatakaPSPKFC/status/1683893592304111617?s=20 స్టోరీ ఇదే.. పరశురామ్(తంబిరామయ్య) క్రమశిక్షణ గల ఉద్యోగి. 25 ఏళ్లుగా ఓ ఎంఎన్‌సీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తుంటాడు. కంపెనీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. సమయాన్ని పకడ్బందీగా వాడుకోవాలని భార్య, పిల్లలకు చెబుతుంటాడు. అమెరికాలో ఉన్న కొడుక్కి సైతం పక్కా ప్లానింగ్ ఇస్తుంటాడు. అలా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తీరిక లేకుండా గడిపేస్తుంటాడు. కంపెనీ పనిమీద వేరే సిటీకి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్‌లో పరశురామ్‌ మరణిస్తాడు. పరశురామ్‌ని స్వర్గానికి తీసుకెళ్లడానికి కాలదేవుడు(సముద్రఖని) వస్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలే ఉన్నాయని, భవిష్యత్తులో ఆనందంగా ఉండటానికి ఎంతో కష్టపడ్డానని, తనను బతికించాలని వేడుకుంటాడు. వాదోపవాదాల అనంతరం 3 నెలల సమయాన్ని పొందుతాడు. అయితే, దీని గురించి ఇతరులకు చెప్పకుండా ఉండేందుకు కాలదేవుడు కూడా పరశురామ్‌ని వెంబడిస్తాడు. ముందుగా కూతురి పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. కానీ, ఆమె ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోతుంది. ఈ బాధలో ఉండగానే కొడుకు ఉద్యోగం కోల్పోయి అమెరికా నుంచి గర్ల్‌ఫ్రెండ్‌ని తీసుకొచ్చేస్తాడు. ఇదిలా ఉండగానే ఆఫీసులో తనకి కాకుండా వేరొకరికి ప్రమోషన్ వస్తుంది. ఇలా ఒకదాని వెంబడి మరొకటి జరిగి పరశురామ్‌కి జీవిత పరమార్థం అంటే ఏంటో అర్థమవుతుంది.&nbsp;&nbsp; https://youtu.be/stcCZWCBegk త్రివిక్రమ్‌కి అందుకే నచ్చిందా? మనిషికి భవిష్యత్తు అనేది ఉండదని వర్తమానం ఒక్కటే ఆచరణలో ఉంటుందని చెప్పే స్టోరీ ఇది.&nbsp; వాస్త‌వాల‌కు, భ్ర‌మ‌ల‌కు మ‌ధ్య ఉన్న తేడాని తెలుసుకుంటే జీవిత పరమార్థం బోధపడుతుందని చెబుతుంది. అందుకే, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి స్టోరీ చెబుతుండగానే నచ్చేసింది. చివర్లో వచ్చే డైలాగుని మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని ఇంప్రెస్ అయ్యారట త్రివిక్రమ్. దీంతో తెలుగులో తీయడానికి వెంటనే ఓకే చేసి తానే దగ్గరుండి క్యాస్టింగ్ ఫైనలైజ్ చేశారట. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని కథను కొత్తగా మలిచి ‘బ్రో’గా తీసుకొచ్చారు.&nbsp; https://www.youtube.com/watch?v=yNnJ9de339k 12 భాషల్లో చిత్రీకరణ డైరెక్టర్ సముద్రఖని తమిళనాడులోని మారుమూల గ్రామం. అక్కడినుంచి చెన్నై వచ్చి, అటుపై హైదరాబాద్‌కి రావడం వెనకాల ఏదో ఒక శక్తి ఉందని బలంగా నమ్మారు. దానినే ‘టైం’గా అభివర్ణించారు. అలా మనకు ఎన్నో ఇచ్చిన సమాజానికి మనం తిరిగి ఏమివ్వగలం అనే కోణం నుంచి కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. బ్రో మూల కథను అన్ని భాషల ప్రేక్షకులకు చేరవేయాలని సంకల్పించుకున్నారు. అలా, తమిళంలో ‘వినోదయ సిత్తం’తో ముందడుగు వేశారు. ఇప్పుడు తెలుగులో ‘బ్రో’ చేశారు. తర్వాత ‘తుళు’లో చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా బెంగాళీ, మరాఠీ, గుజరాతీ.. తదితర 12 భాషల్లో ఇదే సినిమాను తీస్తానని చెబుతున్నారు సముద్రఖని.&nbsp; https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
    జూలై 26 , 2023
    Krishnamma Movie Review: రివేంజ్‌ డ్రామాలో అదరగొట్టిన సత్యదేవ్‌… సినిమా ఎలా ఉందంటే?
    Krishnamma Movie Review: రివేంజ్‌ డ్రామాలో అదరగొట్టిన సత్యదేవ్‌… సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : సత్య దేవ్‌, అథిరా రాజ్‌, ఆర్చన అయ్యర్‌, రఘు కుంచె డైరెక్టర్‌ : వి. వి. గోపాల కృష్ణ సంగీతం: కాల భైరవ సినిమాటోగ్రాఫర్‌ : సన్నీ కుర్రపాటి ఎడిటర్‌ : తిమ్మరాజు నిర్మాత : కృష్ణ కొమ్మలపాటి టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వి.వి గోపాల కృష్ణ దర్శకుడు. అథిరా రాజ్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? సత్య దేవ్‌కు మరో హిట్‌ను అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.&nbsp; కథేంటి విజయవాడ వించిపేటలో జీవించే భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్‌), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ముగ్గురు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా జీవిస్తుంటారు. గతంలో నేరాలకు పాల్పడిన ఈ ముగ్గురు కొన్ని కారణాలతో మంచిగా మారతారు. భద్ర ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు. అయితే అనుకోకుండా వీరికి రూ. 3 లక్షలు అవసరం పడతాయి. చివరిసారిగా ఒక నేరం చేసి అవసరం తీర్చుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. జైలుకు కూడా వెళ్తారు. ఈ క్రమంలో వీరిలో ఒకరు అనూహ్యంగా చనిపోతారు? స్నేహితుల్లో ఒకరు చనిపోవడానికి కారణం ఎవరు? వారు జైలుకెళ్లేలా కుట్ర చేసిందెవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే విలక్షణ నటుడు సత్యదేవ్‌ ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తనదైన నటనతో అదరగొట్టాడు. పగతో రగిలిపోయే భద్ర పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఎమోషనల్ సన్నివేశాల్లో సత్యదేవ్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. హీరోయిన్‌గా అతిర పాత్ర పరిమితమే. నటన పరంగా ఆమె పాత్రకు పెద్ద స్కోప్‌ లేదు. స్నేహితులుగా చేసిన మీసాల లక్ష్మణ్‌, కృష్ణ తేజా రెడ్డి తమ నటనతో ఆకట్టుకున్నారు. పోలీసు ఆఫీసర్‌గా చేసిన నందగోపాల్‌ పర్వాలేదనిపించాడు. రఘు కుంచే పాత్ర కూడా సినిమాలో బాగుంది. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు వి.వి గోపాలకృష్ణ.. రివేంజ్‌ డ్రామాగా ఈ సినిమాకు తెరకెక్కించాడు. అయితే కథ పరంగా చూస్తే కొత్త దనం ఏమి లేదని చెప్పాలి. ఈ తరహా రివేంజ్‌ డ్రామాలు చాలానే వచ్చాయి. అయితే స్క్రీన్‌ప్లే మాత్రం ఆకట్టుకుంటుంది. ఆడియన్స్‌ను కథలోకి తీసుకెళ్లిన విధానం ప్రశంసనీయం. ఫస్టాఫ్‌ మెుత్తం ఓ దారుణ హత్య.. స్నేహితుల పాత్రలు, వారి మధ్య ఉన్న ఎమోషనల్‌ బాండ్‌ను పరిచయం చేయడంతోనే సరిపోయింది. దీంతో ఆడియన్స్‌కు కథ ల్యాగ్ అయిన ఫీలింగ్‌ కలిగింది. సెకండాఫ్‌కు వచ్చాక దర్శకుడు కథలో వేగం పెంచాడు. తమ ఫ్రెండ్‌ను చంపిన వారిని హీరో టార్గెట్‌ చేసే సీన్లను దర్శకుడు ఆసక్తికరంగా చూపించాడు. అయితే క్లైమాక్స్ ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. చిన్న చిన్న లోపాలున్నా దర్శకుడిగా వి.వి. గోపాల కృష్ణ సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సన్నీ కుర్రపాటి తన కెమెరా పనితనంతో తెరపై ప్లెజెంట్‌ వాతావరణాన్ని తీసుకొచ్చారు. అటు కాల భైరవ అందించిన పాటలు సో సోగా ఉన్నాయి. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ సత్యదేవ్‌ నటనస్క్రీన్‌ప్లేసెకండాఫ్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్ రీవెంజ్‌ డ్రామాబోరింగ్‌ సీన్స్&nbsp; Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp; https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-satyadev.html
    మే 10 , 2024
    <strong>Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి</strong>
    Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి
    బాలీవుడ్‌ నటి అర్చిత అగర్వాల్‌ (Arrchita Agarwaal) షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఆమె లీడ్‌ యాక్ట్రెస్‌గా చేసిన ‘దెస్‌పాచ్‌’ (Despatch) చిత్రం ఇటీవల జీ 5 (Zee 5) ఓటీటీలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో మనోజ్‌ బాజ్‌పాయి (Manoj Bajpayee) హీరోగా చేశారు. ఈ మూవీ సక్సెస్‌ నేపథ్యంలో బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడిన అర్చిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే తన లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలు పంచుకుంది.&nbsp; అర్చిత ఇండస్ట్రీలోకి వచ్చి 9 ఏళ్లు అయినప్పటికీ రీసెంట్‌గా వచ్చిన 'దెస్‌పాచ్‌' (Despatch) చిత్రంతోనే ఆమె నటిగా తెరంగేట్రం చేసింది. తొలి ఫిల్మ్‌తోనే నటిగా మంచి మార్కులు సంపాదించింది.&nbsp; నటి కాకముందు కాస్ట్యూమ్‌ అసిస్టెంట్‌గా తాను వర్క్‌ చేసినట్లు తాజా ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. ‘బంగిస్తాన్‌’ (2015), ‘పికు’ (2015), ‘రాయిస్‌’ (2016) తదితర చిత్రాలకు పని చేసినట్లు స్పష్టం చేసింది.&nbsp; కాస్ట్యూమ్‌ వర్క్‌లో సంతృప్తి లేకపోవడంతో నటన వైపునకు అర్చిత వచ్చింది. ఇందుకోసం అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో జాయిన్‌ అయ్యింది. అక్కడ నటనకు సంబంధించిన ఎన్నో వర్క్ షాప్స్‌లో పాల్గొంది.&nbsp; 'దెస్‌పాచ్‌'కు ముందు 2020లోనే అర్చిత (Arrchita Agarwaal)కు సినిమా ఆఫర్‌ వచ్చింది. అయితే ఎలాంటి కారణం లేకుండా తనను రిజెక్ట్‌ చేసినట్లు అర్చిత తెలిపింది. అది జరిగిన నాలుగేళ్లకు సినమా ఆఫర్‌ దక్కించుకున్నట్లు నటి తెలిపింది.&nbsp; ‘డెస్‌పాచ్‌’లో శృంగార సన్నివేశాల్లో నటించడంపైనా అర్చిత మాట్లాడింది. తనకు అసౌకర్యమైన రొమాంటిక్‌, ఇంటిమేట్‌ సీన్స్‌లో తాను చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే ఆడియన్స్‌ వాటిని తప్పుగా తీసుకోలేదని చెప్పుకొచ్చింది.&nbsp; వాస్తవానికి స్కూల్‌ డేస్‌ నుంచే నటి కావాలన్న కోరిక అర్చితకు ఉండేది. అయితే తాను పెద్దగా అందంగా లేనని ఆమె అనుకునేది. కానీ ఇండస్ట్రీలోనే సెటిల్‌ అవ్వాలన్న కోరిక ఉండటంతో తొలుత కాస్ట్యూమ్ అసిస్టెంట్‌గా సినిమాలకు వర్క్‌ చేసింది.&nbsp; అర్చిత అగర్వాల్‌ తండ్రి ఒక బిజినెస్‌ మ్యాన్‌. ఆమె ఎదుగుతున్న క్రమంలో ఆయన ఎన్నో ఆర్థిక నష్టాలను చూశాడు. అయినప్పటికీ ప్రయత్నం ఆపలేదని అర్చిత తెలిపింది. అతనే తనకు ప్రేరణ అని తెలిపింది.&nbsp; నటి అవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు మీ చుట్టు పక్కల వారు ఎలా రియాక్ట్‌ అయ్యారు? అన్న ప్రశ్నకు అర్చిత ఆసక్తికర సమాధానం చెప్పింది.&nbsp; తాను నటి అవ్వాలని అనుకుంటున్నట్లు చిన్నప్పుడే చెప్పి ఉంటే ‘నువ్వు అనుష్క శర్మ లేదా ప్రియాంక చోప్రాలాగా లేవు’ అనే పోలికలు తన చెవిన పడేవని పేర్కొంది.&nbsp; తాను ఆ విషయం కాలేజీ డేస్‌ వరకూ దాచానని చెప్పింది. ఆ తర్వాత ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకోగా ‘నీకేమైనా పిచ్చా’ అన్నట్లు చూశారని చెప్పింది. నటి కావాలని కోరుకుంటున్నట్లు బంధువులకు తెలియగానే 'బట్టలు అలా వేసుకోవాలి.. ఇలా వేసుకోవాలి.. ముంబయి ఆ విధంగా జీవించాలి' అంటూ తీర్పులు చెప్పడం మెుదలుపెట్టారని అర్చిత తెలిపింది.&nbsp; అయితే ఒకటి మాత్రం నిజమని ఇండస్ట్రీలోకి రావాలంటే ‘థిక్‌ స్కిన్‌’ అవసరమని.. అది తనకు ఉందని’ అర్చిత తెలిపింది.&nbsp; ‘దెస్‌పాచ్‌’ తర్వాత ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదని అర్చిత స్పష్టం చేసింది. అయితే చాలా మంది దర్శకులతో మాట్లాడానని, తిరిగి సంప్రదిస్తామని చెప్పారని పేర్కొంది.&nbsp;
    డిసెంబర్ 18 , 2024
    <strong>Roti Kapda Romance Review: యూత్‌ను ఆకర్షించే ఎంగేజింగ్‌ లవ్‌ స్టోరీలు.. ‘రోటి కపడా రొమాన్స్‌’ ఎలా ఉందంటే!</strong>
    Roti Kapda Romance Review: యూత్‌ను ఆకర్షించే ఎంగేజింగ్‌ లవ్‌ స్టోరీలు.. ‘రోటి కపడా రొమాన్స్‌’ ఎలా ఉందంటే!
    నటీనటులు: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు దర్శకత్వం: విక్రమ్‌ రెడ్డి సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి ఎడిటర్: విజయ్ వర్థన్ సినిమాటోగ్రఫీ : సంతోష్ రెడ్డి నిర్మాతలు:&nbsp; బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్ బొజ్జం నిర్మాణ సంస్థ : లక్కీ మీడియా విడుదల తేదీ: 28-11-2024 హర్ష నర్రా, సందీప్‌ సరోజ్, తరుణ్, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రోటి కపడా రొమాన్స్‌’. విక్రమ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్‌, సృజన్‌ కుమార్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. నవంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? యూత్‌ను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. (Roti Kapda Romance Review) కథేంటి ఈవెంట్‌ ఆర్గనైజర్‌ హర్ష (హర్ష నర్రా), సాఫ్ట్‌వేర్‌ రాహుల్‌ (సందీప్‌ సరోజ్‌), ఆర్జే సూర్య (తరుణ్‌), విక్కీ(సుప్రజ్‌ రంగ) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి ఓకే గదిలో జీవిస్తుంటారు. వీరిలో విక్కీ మాత్రం ఏ పని చేయకుండా స్నేహితుల డబ్బుతో ఎంజాయ్‌ చేస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. ఆర్జే సూర్యతో దివ్య(నువేక్ష), హర్షతో సోనియా (కుష్బూ చౌదరి), విక్కీతో శ్వేత (మేఘలేఖ), రాహుల్‌తో ప్రియ (ఠాకూర్‌) ప్రేమలో పడతారు. అమ్మాయిల రాకతో ఆ నలుగురు ఫ్రెండ్స్‌ లైఫ్‌ ఎలా మారింది? ప్రేమ వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్‌ చేశారు? ప్రేయసితో ఎందుకు విడిపోయారు? బ్రేకప్‌ తర్వాత నలుగురు కుర్రాళ్లలో వచ్చిన రియలైజేషన్‌ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ఈ సినిమాలో చేసినవారంతా దాదాపు కొత్తవాళ్లే (Roti Kapda Romance Review). అయినా తమ తమ పాత్రల్లో వారు చక్కగా నటించారు. హీరోలుగా నటించిన హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌రంగా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విక్కీ పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. ఇక నలుగురు హీరోయిన్లు కూడా ఎంతగానో అలరించారు. సినిమా మెుత్తం ఈ నాలుగు జంటల చుట్టే తిరిగింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే నలుగురు అబ్బాయిల జీవితంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఏం జరిగిందన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు విక్రమ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఫ్రెండ్‌షిప్‌, లవ్‌, బ్రేకప్ కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలే వచ్చినప్పటికీ కొత్తగా ప్రెజెంట్‌ చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. నాలుగు విభిన్నమైన ప్రేమకథలను ఒకే ఫ్రేమ్‌పై చూపించడం బాగా కలిసొచ్చింది. పరిణితి నిర్ణయాల వల్ల నేటి యూత్‌కు జరుగుతున్న నష్టాలు, ప్రేమలో ఎదురవుతున్న సమస్యలు, పెళ్లి విషయంలో యూత్‌ ఆలోచనలను మేళవిస్తూ కథను నడిపిన తీరు మెప్పిస్తుంది. అందరూ కొత్తవారైనప్పటికీ వారి నుంచి ఉత్తమ నటన రాబట్టడంలో డైరెక్టర్ సక్సెస్‌ అయ్యాడు. అయితే కొన్ని సీన్లు ఎక్కడో చూసిన ఫీలింగ్‌ రావడం, పెద్దగా స్టార్‌ క్యాస్ట్‌ లేకపోవడం, కమర్షియల్‌ హంగులు మిస్‌ కావడం మైనస్‌ చెప్పవచ్చు.&nbsp; సాంకేతికంగా.. టెక్నికల్‌ విషయాలకు వస్తే (Roti Kapda Romance Review) అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. సందర్భానుసారంగా వచ్చిన పాటలు సైతం వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్‌ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారాగణం నటనయూత్‌ను ఆకర్షించే ఎలిమెంట్స్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్టార్ క్యాస్ట్‌ లేకపోవడంకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    నవంబర్ 28 , 2024
    <strong>Venom 3 Review In Telugu: యాక్షన్ సీక్వెన్స్‌లో టాప్‌ నాచ్‌.. ‘వెనమ్‌ 3’ ఎలా ఉందంటే?&nbsp;</strong>
    Venom 3 Review In Telugu: యాక్షన్ సీక్వెన్స్‌లో టాప్‌ నాచ్‌.. ‘వెనమ్‌ 3’ ఎలా ఉందంటే?&nbsp;
    నటీనటులు : టామ్‌ హార్డీ, ఆండీ సెర్కిస్, చివెటెల్ ఎజియోఫోర్, జునో టెంపుల్, పెగ్గీ, రీస్‌ ఇఫాన్స్‌, క్రిస్టో ఫెర్నాండెజ్, స్టీఫెన్ గ్రాహమ్ తదితరులు&nbsp; దర్శకత్వం : కెల్లి మార్సెల్‌ సినిమాటోగ్రఫీ : ఫబియన్ వాగ్నర్‌ ఎడిటింగ్‌ : మార్క్‌ సంగర్‌ సంగీతం : డ్యాన్‌ డీకాన్‌ నిర్మాతలు : అవి అరద్‌, మ్యాట్‌ టాల్‌మచ్‌, కెల్లీ మార్సెల్‌, టాప్‌ హార్డీ విడుదల తేదీ : అక్టోబర్ 25, 2024 హాలీవుడ్‌ చిత్రాల్లో 'వెనమ్‌' సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సూపర్‌ హీరో చిత్రాలను బాగా ఇష్టపడే వారిని 'వెనమ్‌' సిరీస్‌ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలు రాగా బ్లాక్‌ బాస్టర్‌ విజయాలను అందుకున్నాయి. తాజాగా వాటికి కొనసాగింపుగా 'వెనమ్‌ 3' థియేటర్లలోకి వచ్చింది. ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ (Venom: The Last Dance) పేరుతో అక్టోబర్‌ 25న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఎప్పటిలాగే ఈ చిత్రంలోనూ టామ్ హార్డీ కథానాయకుడిగా చేశాడు. కెల్లీ మార్సెల్ దర్శకుడు. మరి పార్ట్‌ 3 కూడా ప్రేక్షకులను మెప్పించిందా? అదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌తో విజువల్‌ వండర్‌గా నిలిచిందా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథేంటి ‘వెనమ్: లెట్ దేర్ బి కార్నేజ్’ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే మూడో పార్ట్‌ మెుదలవుతుంది. వెనమ్‌తో విడిపోయిన తర్వాత ఎడ్డీ బ్రాక్ (టామ్ హార్డీ) మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవుతాడు. మరోవైపు వెనమ్‌ని కూడా తన గ్రహానికి చెందిన వాసులు వెంటాడుతూ ఉంటాయి. ఇంతలో వీరిద్దరికీ ఒక కొత్త ప్రమాదం ఎదురవుతుంది. వేరే లోకంలో బంధించి ఉన్న నల్ (ఆండీ సెర్కిస్) అనే సూపర్ విలన్ విడుదలకు అవసరమైన ఒక ఎలిమెంట్ వీరి దగ్గర మాత్రమే ఉంటుంది. దీంతో నల్ సైన్యం కూడా వీరి వెంట పడుతుంది. నల్ సైన్యం నుంచి తప్పించుకోవాలంటే ఎడ్డీ, వెనమ్‌ల్లో ఒకరు మరణించాలి. లేదంటే జీవితాంతం పరిగెడుతూనే ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎడ్డీ, వెనమ్ ఏం చేశారు? నల్‌ను వారు ఎలా ఎదుర్కొన్నారు? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే వెనమ్‌ 3 మూవీలో టామ్ హార్డీ వన్ మ్యాన్ షో చేశాడు. ఎడ్డీ బ్రాక్ పాత్రలో మరోమారు చక్కగా ఒదిగిపోయాడు. లేని వెనమ్‌ని ఊహించుకుని దాంతో కెమిస్ట్రీని పండించడం మామూలు విషయం కాదు. గత చిత్రాలలో లాగానే ఇందులోనూ తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ దుమ్మురేపాడు. ఎంతో సాహసోపేతంగా ఫైట్స్‌ చేసి ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. నల్‌ పాత్రలో ఆండీ సెర్కిస్ కూడా ఆకట్టుకున్నాడు. చివెటెల్ ఎజియోఫోర్, జునో టెంపుల్, పెగ్గీ, రీస్‌ ఇఫాన్స్‌, క్రిస్టో ఫెర్నాండెజ్, స్టీఫెన్ గ్రాహమ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; https://twitter.com/VenomMovie/status/1834215396595101934 డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు కెల్లి మార్సెల్‌ తొలి రెండు భాగాలు తరహాలోనే ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ చిత్రాన్ని కూడా అదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌తో రూపొందించారు. ప్రారంభంలో ఫ్లైట్ యాక్షన్ సీన్‌తో సినిమాను మెుదలపెట్టిన దర్శకుడు ఆ జోరు చివరకూ కొనసాగించాడు. మూడు సాలిడ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. 20 నిమిషాల పాటు సాగే ఈ సీక్వెన్స్‌ను ప్రేక్షకులు కళ్లార్పకుండా చూస్తారు. ఒక పెద్ద శత్రువు కోసం వెనమ్, ఇతర సింబియోట్లు, మిలటరీ అందరూ కలిసి చేసే పోరాటం అలరిస్తుంది. అయితే వెనమ్‌ సిరీస్‌లో ఈ మూవీనే లాస్ట్‌ అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఎడ్డీ, వెనమ్‌ బాండింగ్‌ను హైలెట్‌ చేస్తూ ఎమోషనల్‌ ఫినిషింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ప్రీ క్లైమ్యాక్స్‌కు ముందు వచ్చే ఒక్క సీన్ మాత్రం ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. ఓవరాల్‌గా యాక్షన్‌ ప్రియులను ఈ సినిమా తప్పక అలరిస్తుంది. https://twitter.com/VenomMovie/status/1846663977784562073 టెక్నికల్‌గా సాంకేతిక విషయాలకు వస్తే వీఎఫ్‌ఎక్స్‌ టీమ్ అద్భుత పనితీరు కనబరిచిది. విజువల్‌ వండర్‌లా సినిమాను తీర్చిదిద్దింది. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ టామ్ హార్డీ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ మైనస్ పాయింట్స్ కొరవడిన ఎడ్డీ, వెనమ్‌ బాండింగ్‌కథలో డ్రామా లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    అక్టోబర్ 25 , 2024
    <strong>Dhoomam OTT Review: సిగరేట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ధూమం’ ఎలా ఉందంటే?</strong>
    Dhoomam OTT Review: సిగరేట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ధూమం’ ఎలా ఉందంటే?
    నటీనటులు : ఫహద్ ఫాజిల్‌, అపర్ణ బాలమురళి, రోషన్‌ మ్యాథ్యూ, వినీత్‌, అను మోహన్‌, అచ్యుత్‌ కుమార్‌, విజయ్‌ మీనన్‌ తదితరులు రచన, దర్శకత్వం : పవన్‌ కుమార్‌ సంగీతం : పూర్ణచంద్ర తేజస్వి సినిమాటోగ్రఫీ : ప్రీతా జయరామన్‌ ఎడిటింగ్‌ : సురేష్‌ అరుముగన్‌ నిర్మాతలు : విజయ్‌ కిరగందూర్‌, విజయ్‌ సుబ్రహ్మణియన్‌ విలక్షణ నటుడిగా దక్షిణ చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు నటుడు 'ఫహద్‌ ఫాజిల్‌'. హీరో, విలన్‌ అనే భేదాలు లేకుండా తన అద్భుత నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మలయాళంలో అతడు నటించిన 'ధూమం' (Dhoomam) చిత్రం గతేడాది థియేటర్లలో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో తాజాగా ఈ సినిమాను తెలుగు వెర్షన్‌లో ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఆహా వేదికగా జులై 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? ఫహద్‌ ఫాజిల్‌ మరోమారు తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడా? అసలు 'ధూమం' కాన్సెప్ట్ ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి అవినాష్‌ (ఫహాద్‌ ఫాజిల్‌) ఓ సిగరేట్‌ కంపెనీలో పనిచేస్తుంటాడు. సేల్స్‌ హెడ్‌గా తన తెలివితేటలతో అమ్మకాలను అమాంతం పెంచేస్తాడు. కంపెనీ ఎండీ సిధ్‌ (రోషన్‌ మ్యాథ్యు)తో ఓ రోజు అవినాష్‌కు గొడవ జరుగుతుంది. దీంతో జాబ్‌కి రిజైన్‌ చేస్తాడు. ఒక రోజు భార్య దియా (అపర్ణ బాలమురళి)తో కలిసి కారులో వెళ్తుండగా అతడిపై ఓ ముసుగు వ్యక్తి అటాక్‌ చేస్తాడు. భార్యను ఎత్తుకెళ్లి తను చెప్పింది చేస్తే విడిచిపెడతానని వార్నింగ్‌ ఇస్తాడు. ఇంతకీ ఆ ముసుగు వ్యక్తి ఎవరు? అవినాష్‌ ఓ మర్డర్‌ కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు? ముసుగు వ్యక్తికి కంపెనీ ఎండీకి ఏమైనా సంబంధం ఉందా? ఆ ట్రాప్‌ నుండి అవినాష్‌ ఎలా బయటపడ్డాడు? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే 'ధూమం' సినిమాలో ఫహద్‌ ఫాజిల్‌ వన్‌మ్యాన్‌ షో చేశాడు. అవినాష్‌ పాత్రలో పూర్తిగా జీవించేశాడు. భార్యను కాపాడుకునే భర్తగా, తప్పును సరిద్దుకునే వ్యక్తిగా అద్భుత నటన కనబరిచాడు. ఇక దియా పాత్రలో అపర్ణ బాలమురళి ఆకట్టుకుంది. సహజమైన నటనతో మెప్పించింది. అటు నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో రోషన్‌ మ్యాథ్యూ కనిపించాడు. అతడితో పాటు ప్రవీణ్‌గా చేసిన వినీత్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు చక్కటి నటన కనబరిచాడు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే సిగరేటు, పొగాకు ఉత్పుత్తుల వల్ల సమాజానికి జరుగుతున్న నష్టం ఏంటో డైరెక్టర్‌ పవన్‌ కుమార్‌ ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. లాభాల కోసం సిగరేట్‌ కంపెనీలు వేసే ఎత్తులను కళ్లకు కట్టాడు. ఓ ట్రాప్‌లో ఇరుక్కున్న యువకుడు తన భార్యను కాపాడునేందుకు చేసిన పోరాటాన్ని థ్లిల్లింగ్‌గా చూపించాడు. హీరో హీరోయిన్ల ప్రజెంట్‌, పాస్ట్‌ను సమాంతరంగా నడిపిస్తూ అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విరామ సమయానికి ఇచ్చిన ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా విభిన్నమైన క్లైమాక్స్‌తో ముగించిన తీరు మెప్పిస్తుంది. అయితే కమర్షియల్ హంగులు లేకపోవడం, తక్కువ పాత్రలే ఉండటం, సెకండాఫ్‌ మరి నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్‌గా మారింది. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే పూర్ణచంద్ర తేజస్వి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. ఎడిటర్‌ పనితీరు ఓకే. సెకండాఫ్‌ను ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ఫహద్‌ ఫాజిల్‌ నటనసందేశంవిభిన్నమైన క్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ నెమ్మదిగా సాగే కథనంసెకండాఫ్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    జూలై 11 , 2024
    Gam Gam Ganesha Review: అన్న ఫెయిల్‌ అయినా తమ్ముడు సక్సెస్‌ అయ్యాడు!
    Gam Gam Ganesha Review: అన్న ఫెయిల్‌ అయినా తమ్ముడు సక్సెస్‌ అయ్యాడు!
    నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ, నయన్‌ సారిక, ప్రగతి శ్రీవాస్తవ్‌, రాజ్‌ అర్జున్‌, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేష్‌, ప్రిన్స్‌ యావర్‌, జబర్దస్త్‌ ఇమ్మాన్యుయేల్‌, క్రిష్ణ చైతన్య డైరెక్టర్‌ : ఉదయ్‌ బొమ్మిశెట్టి సంగీతం : చైతన్ భరద్వాజ్‌ సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వడి ఎడిటర్‌ : కార్తిక శ్రీనివాస్‌ నిర్మాతలు : వంశీ కృష్ణ, కేదర్‌ సెలగంశెట్టి విడుదల తేదీ : 31-05-2024 విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) నటించిన లేటెస్ట్‌ చిత్రం.. ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్‌ బొమ్మిశెట్టి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక కథానాయికలు. జబర్దస్త్‌ ఇమ్మాన్యుయెల్‌, వెన్నెల కిశోర్‌, రాజ్‌ అర్జున్‌, సత్యం రాజేష్‌, ప్రిన్స్‌ యావర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘బేబీ’ లాంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ చేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది విజయ్‌ దేరరకొండ చేసిన ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. మరి సోదరుడు ఆనంద్‌ దేవరకొండ సినిమా అయినా సక్సెస్‌ కావాలని విజయ్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మే 31న విడుదలైన ‘గం గం గణేశా’ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిచిందా? లేదా? కథేంటి గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ.. గణేష్ పాత్రలో ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌తో మెప్పించాడు. బేబీ చిత్రం తర్వాత నటుడిగా మరింత పరిణితి సాధించాడు. ఇమ్మాన్యుయెల్‌తో కలిసి అతడు చేసిన కామెడీ సినిమాకు ప్లస్‌ అయ్యింది. అటు హీరోయిన్‌ ప్రగతి శ్రీవాస్తవ అదరగొట్టింది. నీలవేణి పాత్రలో మెప్పించింది. హీరో హీరోయిన్ల మధ్య కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. మరో కథానాయిక నయన్‌ సారిక కూడా శ్రుతి పాత్రలో ప్రేక్షకులను అలరించింది. హాస్యనటులు వెన్నెల కిషోర్‌, ఇమ్మాన్యుయెల్‌ తమదైన కామెడీ ఆకట్టుకున్నారు. విలన్‌గా రాజ్‌ అర్జున్‌ నటన మెప్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు ఉదయ్‌ బొమిశెట్టి రొటీన్‌ కథనే తీసుకున్నప్పటికీ సినిమాను క్రైమ్‌ &amp; ఎంటర్‌టైనింగ్‌ ఫార్మెట్‌లో అద్భుతంగా రూపొందించారు. కథనం, కామెడీ, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను దర్శకుడు బాగా వర్కౌట్‌ చేశాడు. ముఖ్యంగా హీరో - ఇమ్మాన్యుయెల్‌ - వెన్నెల కిషోర్‌ చుట్టూ రాసుకున్న కామెడీ ట్రాక్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్టులు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఆడియన్స్‌కు థ్రిల్‌ను పంచేలా దర్శకుడు ఆ సీన్లను తీర్చిదిద్దాడు. అయితే కొన్ని చోట్ల అసంబద్ద నారేషన్‌ సినిమాకు మైనస్‌గా మారింది. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, సెకండాఫ్‌ ట్విస్టులు, థ్లిల్లింగ్‌ క్లైమాక్స్‌తో ఒక మంచి చిత్రాన్ని అందించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు.  టెక్నికల్‌గా ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్‌ టీమ్‌ మంచి పనితీరును కనబరిచింది. మరి ముఖ్యంగా నేపథ్య సంగీతం మూవీకి హైలెట్‌గా నిలిచింది. చైతన్ భరద్వాజ్‌ తన క్యాచీ బీజీఎంతో సన్నివేశాలకు అదనపు ఆకర్షణను అందించాడు. సినిమాటోగ్రాఫర్‌ ఆదిత్య జవ్వడి పనితనం బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ ఆనంద్‌ దేవరకొండ నటనకామెడీట్విస్టులు మైనస్‌ పాయింట్స్ కథలో కొత్తదనం లేకపోవడంస్టోరీ నారేషన్‌లో తడబాటు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp; పబ్లిక్‌ టాక్‌ ఎలా ఉంది? గం గం గణేశా చిత్రాన్ని చూసిన ఓ నెటిజన్‌.. ఇది పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌ అని చెబుతున్నారు. ఈ వీకెండ్‌ ఫుల్లుగా నవ్వుకోవచ్చని ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఆనంద్ ఖాతాలో మరో హిట్‌ చేరిందని కామెంట్‌ పెట్టాడు.&nbsp; https://twitter.com/OfficialSreeNu/status/1796180578644926755 ‘గం గం గణేశా’ డీసెంట్‌ సినిమా అని.. ట్విస్టులు, వినోదం సినిమాకు హైలెట్‌గా నిలిచాయని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/review_rowdies/status/1796384723033596372 స్టోరీలో కంటెంట్‌ మిస్‌ అయ్యిందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఆనంద్‌ దేవరకొండ తన శక్తిమేర నటించాడని పేర్కొన్నాడు. కానీ అప్‌ టూ ద మార్క్ చేరుకోలేకపోయడని పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/Mjcartels/status/1796394003979800864 ‘గం గం గణేశా’.. రిలాక్స్‌గా సీట్‌లో కూర్చొని ఎంజాయ్‌ చేసే మూవీ అని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించాడు. సందర్భానుసారంగా వచ్చే కామెడీ సూపర్బ్‌గా వర్కౌట్ అయ్యిందని చెప్పాడు. https://twitter.com/tcsblogs/status/1796341604845867293
    మే 31 , 2024
    Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్‌.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?
    Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్‌.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?
    నటీనటులు: సుహాస్‌, పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు రచన, దర్శకత్వం: అర్జున్‌ వైకే సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌ సినిమాటోగ్రఫీ: ఎస్‌.చంద్రశేఖరన్‌ ఎడిటింగ్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌ ఆర్‌ నిర్మాత: మణికంఠ జేఎస్‌, ప్రసాద్‌రెడ్డి టీఆర్‌ విడుదల తేదీ: 03-05-2024 సుహాస్‌ (Suhas) హీరోగా నటించిన లేటెస్ట్‌ థ్రిల్లింగ్‌ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). అర్జున్‌ వై.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాధాకృష్ణ, రాశీ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. జె.ఎస్‌ మణికంఠ, టి.ఆర్‌.ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌తో బాధపడే యువకుడిగా సుహాస్ ఇందులో నటించాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం (మే 3) రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? సుహాస్‌కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూ తెలుసుకుందాం.  కథేంటి రేడియో జాకీగా పనిచేస్తున్న సూర్య (సుహాస్‌) జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయి ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ అనే సమస్య బారిన సూర్య పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంటాడు. ఒక రోజు సూర్య కళ్లెదుట ఓ యువతి హత్య జరుగుతుంది. అది ఎవరు చేశారో స్పష్టంగా చూడలేకపోయినా పోలీసులకు తెలియజేయాలని అనుకుంటాడు. ఏసీపీ వైదేహీ (రాశి సింగ్‌) వద్దకు వెళ్లి జరిగిందంతా చెబుతాడు. ఈ క్రమంలో సూర్యపై దాడి జరుగుతుంది. అనూహ్యంగా సూర్యనే ఈ హత్య కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇంత‌కీ ఆ హ‌త్య ఎవ‌రు చేశారు? ఆ కేసులో సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? పాయల్‌తో హీరో లవ్ స్టోరీ ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే హీరో సుహాస్ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్న వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా సుహాస్‌ ఇంకాస్త మెరుగయ్యాడని చెప్పవచ్చు. పాత్రకు అవ‌స‌ర‌మైన చోట హాస్యాన్నీ, భావోద్వేగాల్ని పలికించి మెప్పించాడు. ఇక సుహాస్‌కు జోడీగా పాయల్‌ ఓకే అనిపించింది. వారి మ‌ధ్య వచ్చే  స‌న్నివేశాలు స‌ర‌దా స‌ర‌దాగా సాగుతాయి. పోలీసు ఆఫీసర్‌గా రాశి సింగ్‌కు మంచి పాత్రే దక్కింది. ఆ రోల్‌కు ఆమె పూర్తిగా న్యాయం చేసింది. వైవాహర్ష స్నేహితుడిగా అల‌వాటైన పాత్ర‌లో సంద‌డి చేశాడు. నందు, సాయి శ్వేత పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే డిజార్డర్‌ ఉన్న హీరో పాత్రలను గతంలో చాలా సినిమాల్లో చూసినప్పటికీ దర్శకుడు అర్జున్‌ వైకే ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ను కథాంశంగా తీసుకోవడం కొత్తగా అనిపించింది. మంచి మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుల‌కు థ్రిల్‌ని పంచ‌డంలోనూ ద‌ర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. క‌థానాయ‌కుడి పాత్ర‌, దానికున్న స‌మ‌స్యపై ప్రారంభంలోనే ప్రేక్షకులకు ఓ అవగాహన తీసుకొచ్చి తదుపరి సన్నివేశాలపై ఆసక్తి రగిలించాడు. హీరోకు స్నేహితుడి మధ్య వచ్చే సన్నివేశాలతో ఫస్టాఫ్‌ సరదాగా సాగిపోతుంది. విరామానికి ముందు వచ్చే అనూహ్య మలుపుతో కథ రసవత్తరంగా మారుతుంది. సెకండాఫ్‌ కీల‌క స‌మ‌యాల్లో చోటు చేసుకునే మ‌లుపులు, ప‌తాక సన్నివేశాలతో సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాడు దర్శకుడు. అయితే అక్కడక్కడ కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌లో డెప్త్‌ లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. అలాగే దర్శకుడు క‌థ‌ని న‌డిపించిన విధాన‌ం ఓ టెంప్లేట్‌లా అనిపిస్తుంది.  సాంకేతికంగా.. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా చంద్రశేఖరన్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజయ్‌ బుల్గానిన్ అందించిన పాటలు కన్నా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాలను BGM బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు. ప్లస్‌ పాయింట్స్ సుహాస్‌ నటనమలుపులుసెకండాఫ్‌ మైనస్‌ పాయింట్స్ ప్రారంభ సీన్స్నెమ్మదిగా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5 
    మే 03 , 2024
    రీతు వర్మ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రీతు వర్మ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రీతు వర్మ తెలుగులో పెళ్లి చూపులు (2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. టక్ జగదీష్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో రీతు వర్మ నటించింది. కణం, మార్క్ ఆంటోని వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే రీతు వర్మ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About ritu varma)&nbsp; విషయాలు ఇప్పుడు చూద్దాం.&nbsp; రీతు వర్మ దేనికి ఫేమస్? రీతు వర్మ.. పెళ్లిచూపులు, వరుడు కావలెను, కణం చిత్రాల్లో లీడ్ రోల్&nbsp; చేసి గుర్తింపు పొందింది. రీతు వర్మ వయస్సు ఎంత? 1990, మార్చి 10న జన్మించింది. ఆమె వయస్సు&nbsp; 33 సంవత్సరాలు&nbsp; రీతు వర్మ ముద్దు పేరు? రీతు రీతు వర్మ ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు రీతు వర్మ ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ రీతు వర్మకు వివాహం అయిందా? ఇంకా కాలేదు రీతు వర్మ అభిరుచులు? యోగ, ట్రావెలింగ్, సినిమాలు చూడటం రీతు వర్మకు ఇష్టమైన ఆహారం? ఇటాలియన్ వంటకాలు రీతు వర్మ ఫెవరెట్ హీరో? మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రణ్‌బీర్ కపూర్ రీతు వర్మకు ఇష్టమైన హీరోయిన్? మాధురి దీక్షిత్, శ్రీదేవి రీతు వర్మ ఫెవరెట్ సినిమాలు? క్వీన్, హేట్ లవ్ స్టోరీస్ రీతు వర్మ సిగరెట్ తాగుతుందా? తెలియదు రీతు వర్మ మద్యం తాగుతుందా? తెలియదు &nbsp;&nbsp;రీతు వర్మ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? పెళ్లి చూపులు రీతు వర్మ ఏం చదివింది? మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చదివింది రీతు వర్మ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. రీతు వర్మ తల్లిదండ్రుల పేర్లు? దిలిప్ కుమార్ వర్మ, సంగీత వర్మ రీతు వర్మకు అఫైర్స్ ఉన్నాయా? తెలియదు రీతు వర్మ ఎన్ని అవార్డులు గెలిచింది? పెళ్లి చూపులు చిత్రానికిగాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది రీతు వర్మ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rituvarma/ రీతు వర్మ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? ఇంతవరకు అలాంటి సీన్లలో నటించలేదు https://www.youtube.com/watch?v=m3ldXnuR8Po
    ఏప్రిల్ 08 , 2024
    Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!
    Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!
    ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సైన్స్ సైన్స్ ఫిక్షన్, టైం ట్రావలింగ్&nbsp; చిత్రాల హవా సాగుతోంది. ఈ జోనర్‌లో తెరకెక్కించిన సినిమాలో మంచి విజయం సాధిస్తున్నాయి. దీంతో దర్శకులు ఈ కెటగిరీపై సినిమాలు తీస్తున్నారు. ఆదిత్య 369 నుంచి రాబోయే కల్కీ 2898 AD వరకు తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. 7:11PM టైమ్‌ ట్రావెలింగ్ కథాంశంతో ఈ సినిమా వచ్చింది. అనుకోకుండా ఓ ఊరిలోకి వచ్చిన గ్రహాంతర వాసుల బస్సును హీరో సాహస్ పగడాల ఎక్కడంతో అతను 1999 నుంచి 2024కు ట్రావెల్ చేస్తాడు. ఈ చిత్రాన్ని చైతు మదాల తెరకెక్కించాడు.&nbsp; తెలుగులో మంచి విజయం సాధించింది. ఒకే ఒక జీవితం తెలుగులో టైం ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. చనిపోయిన తన తల్లిని బతికించుకునేందుకు టైం ట్రావెలింగ్‌కు వెళ్లిన శర్వానంద్ ఏం చేశాడు అనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శ్రీ కార్తిక్ తెరకెక్కించారు. ఈ సినిమాలో(Science fiction movies in telugu) గుడ్ స్క్రీన్ ప్లే, మంచి భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. Disco Raja సైన్స్ ఫిక్షన్‌ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించాడు. విలన్ల చేతిలో దెబ్బలు తిన్న రవితేజ మంచులో కూరుకుపోయి... చాలా ఏళ్లు గడిచిన వయసు పెరగకుండా యవ్వనంగా ఉంటాడు. ఈ సినిమా స్టోరీలో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది. Mark Antony టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన మార్క్ ఆంటోని మంచి విజయం సాధించింది. (Science fiction movies in telugu) గతంలోని వ్యక్తులతో మాట్లాడే ఓ టెలీఫోన్‌ను కనిపెట్టినప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే స్టోరీతో ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మార్క్‌- ఆంటోనిగా విశాల్ డ్యూయల్ రోల్‌లో కనిపించి అదరగొట్టాడు. Krrish 3 సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. భయంకరమైన వైరస్‌ను భారత్‌ మీద ప్రయోగించినప్పుడు క్రిష్ దానిని ఎలా అంతమొందించాడు అనే స్టోరీతో అద్భుతంగా సినిమాను రాకేష్ రోషన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించింది. Robo 2.o సైన్స్ ఫిక్షన్ స్టోరీ లైన్‌తో ఈ సినిమా వచ్చింది. సెల్‌ఫోన్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతుంటాయి. దీనిపై కోపంతో పక్షిరాజు అక్షయ్ కుమార్.. ఈ లోకంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఎలక్ట్రానిక్ డివైస్‌లు పనిచేయకుండా చేస్తాడు. దీంతో పక్షిరాజు నుంచి వచ్చిన విపత్తును కాపాడేందుకు రజనీకాంత్ Robo 2.O లెటెస్ట్ వెర్షన్‌గా వచ్చి కాపాడుతాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు. కాకపోతే ఈ సినిమా రోబో సినిమా అంత విజయం సాధించలేదు. Robo&nbsp; రజనీకాంత్ అందాల తార ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఒక రోబోకు ఫీలింగ్స్ అందిస్తే&nbsp; ఎలాంటి వినాశనం జరుగుతుందనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకెక్కిచారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది. 24 టైం ట్రావెల్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో సూర్య నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 24 అనే వాచ్‌లో టైమ్‌ను మారిస్తే గతంలోకి- భవిష్యత్‌లోకి ప్రయాణం చేయవచ్చు. Skylab సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం విఫలమై దాని శిథిలాలు తెలంగాణలోని ఈ చిన్న గ్రామంపై పడేందుకు సిద్ధంగా ఉందనే వార్తల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి శివమణి, తనికెళ్ల భరణి నటించారు. Srivalli బ్రేయిన్ మ్యాపింగ్‌ అనే సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమాను దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించారు. వేర్వేరు ప్రాంతాల్లో.. ఉన్న ఇద్దరు వ్యక్తులు కొన్నిసార్లు ఒకరి గురించి మరొకరు ఒకేవిధంగా ఆలోచిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ల మెదళ్ల మధ్య శబ్ద తరంగాలు ఎలా ప్రవహిస్తాయి? సైన్స్ దీనికేమైనా వివరణ ఇస్తుందా.. అనే పాయింట్ ఆధారంగా 'శ్రీవల్లి' సినిమా రూపొందింది.&nbsp; Taxiwaala ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే సైంటిఫిక్ థియరీతో ఈ సినిమా రూపొందింది.&nbsp; మనం చనిపోయిన తరువాత ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వెళ్తుంది. అయితే మనం బతికి ఉండగానే శరీరం నుంచి ఆత్మను వేరు చేసుకోవచ్చు అదే 'ఆస్ట్రల్ ప్రొజెక్షన్'. దీని ప్రకారం చనిపోయిన శరీరాల్లో ఈ ఆత్మలను ప్రవేశపెట్టి వారితో మాట్లాడవచ్చు. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జువాల్కర్ నటించింది. Tik Tik Tik సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అంతరిక్షంలో తిరిగే ఓ భారీ ఉల్క వల్ల భారత్‌కు ప్రమాదం ఉందని తెలిసి దానిని దారి మళ్లించడానికి కొందరు వ్యోమగాములను పంపిస్తారు. ఈ టీమ్‌ను జయం రవి లీడ్ చేస్తాడు. ఆ ఉల్కను ఎలా దారి మళ్లించేందుకు వ్యోమగాములు ఏం చేశారన్నది కథాంశం. ఈ చిత్రంలో&nbsp; జయం రవితో పాటు, నివేత పేతురాజ్, రమేష్ తిలక్, ఆరోజ్ అజిజ్ తదితరులు నటించారు. Chandamama Lo Amrutham చందమామపై హోటల్ నెలకొల్పాలన్న వెరైటీ కథాంశంతో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ జోనర్‌లో తెరకెక్కింది. ఈ చిత్రంలో శివన్నారాయణ, ఇంటూరి వాసు, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించారు. Yuganiki Okkadu తమిళనాడును పాలించిన ప్రాచీన చోళులు- పాండ్యులతో వైరం వల్ల రాజ్యాన్ని వదిలి ఎవరు గుర్తించని ప్రాంతానికి వెళ్తారు. వారు వెళ్లే మార్గం ఎవరికీ తెలియకుండా అనేక అవాంతరాలు పెడుతారు. చివరకు వారిని ఎలా కనిపెట్టారు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో కార్తి అద్భుతంగా నటించాడు. అతని సరసన రీమా సేన్, ఆండ్రియా జెర్మియా నటించారు. ఈ సినిమాను సెల్వా రాఘవన్ తెరకెక్కించాడు. ఆదిత్య 369 తెలుగులో వచ్చిన ఫస్ట్ టైం ట్రావెల్ సినిమా ఇది. ఇందులో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన బాలకృష్ణ... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి ప్రయాణిస్తాడు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది. Kalki 2898 AD సైన్స్‌ ఫిక్షన్ ఆధారంగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.&nbsp; కలియుగాంతంలో జరిగే విపత్తుల నుంచి ప్రజలను రక్షించే సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించనున్నాడు. టైం ట్రావెల్ మిషిన్ ద్వారా 2898 జన్మించబోయే కల్కిని 2024లోకి తీసుకుని రానున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకుణే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2024&nbsp; సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
    నవంబర్ 07 , 2023
    OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు
    OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు
    సినిమా చూసేందుకు వెళ్లాలి అనుకున్నప్పుడు&nbsp; అందరికన్నా ముందు గుర్తొచ్చేది స్నేహితులే. వాళ్లతో కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేస్తూ సరదాగా గడిపేస్తాం. ఇక బ్యాచ్‌లర్‌గా ఉంటే వేరే లెవల్. రూమ్‌లో ఉంటూ ఫ్రెండ్స్‌తో కలిసి మజా చేయాలనుకుంటే… ఓటీటీలో చూసేందుకు కొన్ని ఎవర్‌ గ్రీన్ సినిమాలు ఉన్నాయి. అవేంటో చదివి మీ దోస్తులతో చూసి ఎంజాయ్ చేయండి.&nbsp; ఈ నగరానికి ఏమైంది సరాదాగా దోస్తులతో కలిసి మందు కొట్టినప్పుడు “గోవా పోవాలి” అని ఎన్ని బ్యాచ్‌లు అనుకొని ఉంటాయి. ఎంతమంది వెళ్లి ఉంటారు. మన జీవితాల్లోనే జరిగే ఇలాంటి ఎన్నో సరాదా సంఘటనలను గుర్తు చేస్తుంది ఈ సినిమా. విశ్వక్‌సేన్, అభినవ్‌ గోమఠం, వెంకటేశ్‌ కాకుమాను, సాయి సుశాంత్ రెడ్డి లీడ్‌ రోల్స్ చేశారు. రూ. 2కోట్లతో తీస్తే రూ. 12 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.&nbsp; జాతిరత్నాలు ఈ సినిమా గుర్తొస్తే మెుదట తలుచుకునేది క్రేజీ డైరెక్టర్ అనుదీప్ KV. జాతిరత్నాలు చిత్రాన్ని అంతలా ప్రేక్షకుల మదిలో ఉండిపోయేలా తీర్చిదిద్దాడు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి ముగ్గురు స్నేహితులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సినిమాలోని వన్‌లైన్‌ పంచులు బాగా పేలాయి. ఎండాకాలం ఉక్కపోస్తున్న, వాన కాలం వర్షం పడుతున్నా… అలా రూమ్‌లో కూర్చొని నవ్వుకుంటూ ఎంజాయ్‌ చేయవచ్చు. రూ. 4 కోట్ల బడ్జెట్‌ ఖర్చు పెడితే.. ఏకంగా రూ.75 కోట్లు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్‌లో చిత్రాన్ని చూడవచ్చు. డీజే టిల్లు డీజే టిల్లు సినిమా వచ్చి రెండేళ్లైనా సిద్ధూ జొన్నలగడ్డ స్వాగ్‌ ఇంకా మర్చిపోలేరు. టిల్లుతో రాధిక చేయించే విన్యాసాలు.. తెలంగాణ యాసలో పేలిన పంచులను స్నేహితులతో కలిసి చూస్తే కాలక్షేపమే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఆహా, సోని లివ్‌ వేదికగా సినిమాను వీక్షించవచ్చు.&nbsp; హుషారు మద్యం తాగే మిత్రులు కొనడం ఎందుకు దాన్నే తయారు చేద్దామనే క్రేజీ ఆలోచన వస్తే హుషారు సినిమా. సరదాగా గడిపే నలుగురు వ్యక్తులు, కెరీర్‌ను సెట్‌ చేసుకోవాలని తిప్పలు పడుతుండటంతో పాటు కష్టం వచ్చిన స్నేహితుడికి అండగా నిలిచే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సరదాగా నవ్వుకోవాలి అనిపించినప్పుడు కబూమ్‌ హుషారు సినిమా చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.&nbsp; బ్రోచెవారెవరురా&nbsp; స్నేహితులు ఎంతవరకైనా తోడు ఉంటారనేది చూడాలంటే బ్రోచెవారెవరూ చూడాల్సిందే. ఫీజు కట్టాలని చెప్పి నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలు, షికార్లు చుట్టేయడం. ఆఖరికి కిడ్నాప్‌లో కూడా స్నేహితులు తోడు వస్తారనే కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో బ్రోచెవారెవరూ రూపొందింది. శ్రీ విష్ణు, దర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్‌ రోల్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో ఈ సినిమా చూడొచ్చు. ఒకే ఒక జీవితం టైమ్ ట్రావెల్‌ కథాంశంతో ముగ్గురు మిత్రులు వాళ్ల చిన్నతనంలోకి వెళితే ఎలా ఉంటుందనే విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఒకే ఒక జీవితం తెరకెక్కింది. ఇందులో ప్రియదర్శి, వెన్నెల కిషోర్, శర్వానంద్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. సరాదాగా సాగే థ్రిల్లింగ్ సినిమాను దోస్తులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. సోని లివ్‌లో అందుబాటులో ఉంది. మిషన్ ఇంపాజిబుల్‌ చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి మనం ఎలా ఉండేవాళ్లమో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఈ సినిమా. రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు చిచ్చరపిడుగులు చేసిన విన్యాసాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.&nbsp; హృదయం కాలేజ్‌ లైఫ్, లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన హృదయం సూపర్ హిట్ అయ్యింది. మోహన్‌ లాల్ కుమారుడు ప్రణవ్, కల్యాణి ప్రియదర్శి లీడ్‌ రోల్స్‌లో వచ్చింది. స్నేహితులతో కలిసి చూస్తూ దర్శనా అంటూ పాటలు పాడుకునేంత బాగుంటుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.&nbsp; చిచ్చోరే ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఈ సినిమాను ఇష్టపడతారు. కళాశాల జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సుశాంత్ సింగ్ , శ్రద్ధాకపూర్, నవీన్ పొలిశెట్టి నటించిన ఈ సినిమా కాలేజ్ డేస్‌ను గుర్తు చేస్తాయి. డిస్నీ + హాట్‌స్టార్‌ ఓటీటీలో చిచ్చొరే సినిమా ఉంది. రొమాంచనమ్ హారర్‌ కామెడీ జానర్‌లో ఇదొక డిఫరెంట్‌ మూవీ. ఏడుగురు బ్యాచిలర్స్‌ ఉండే ఓ ఇంట్లో ఆత్మను పిలిచే గేమ్‌ ఆడతారు. ఆత్మ వస్తుందా? వస్తే ఏం చేసింది? ఇది కథ. బ్యాచిలర్‌ రూమ్‌లను కళ్లకు కట్టినట్టు చూపిండటమే గాక అదిరిపోయే కామెడీ ఉంటుంది. స్నేహితులతో కలిసి చూస్తే కడుపుబ్బా నవ్వుతూ చిల్‌ అవ్వొచ్చు. హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడొచ్చు. మీకు ఏవైనా మూవీస్ పక్కాగా చూడాల్సినవి తెలిస్తే కామెంట్‌ చేయండి.
    ఏప్రిల్ 21 , 2023
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్‌ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్‌, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్‌ ఠాకూర్‌ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే&nbsp; గత కొద్ది కాలంగా&nbsp; ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్‌ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; గౌరి ప్రియ (Gouri Priya) టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్‌’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన ‘లవర్‌’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=8dwrE0OCq40 ఆనందిని (Anandhi) వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్‌ హీరోగా చేసింది.&nbsp; చాందిని చౌదరి (Chandini Chowdary) ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్‌ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్‌ సేన్‌ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్‌', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.&nbsp; వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్‌ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్‌ ఆనంద్‌ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI దివ్య శ్రీపాద (Divya Sripada) టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్‌ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.&nbsp; రితు వర్మ (Ritu Varma) హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్‌ షా' (Badshah) సినిమాలో కాజల్‌ ఫ్రెండ్‌ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్‌ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్‌’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్‌ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్‌ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=4hNEsshEeN8 స్వాతి రెడ్డి (Swathi Reddy) వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్‌' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా,&nbsp; గోల్కొండ స్కూల్‌, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్‌ ఆఫ్‌ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE డింపుల్‌ హయాతి (Dimple Hayathi) ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్‌ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్‌ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606 శివాని నగరం (Shivani Nagaram) ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి. మానస చౌదరి (Maanasa Choudhary) ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్‌’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్‌.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్‌ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్‌ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1762802318934950146 అంజలి (Anjali) తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్‌, సరైనోడు, వకీల్‌సాబ్‌, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గేమ్‌ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
    మార్చి 06 , 2024

    @2021 KTree