• TFIDB EN
  • ఊహలు గుసగుసలాడే
    UTelugu2h 8m
    హీరో (నాగశౌర్య)కి న్యూస్ రీడర్ కావాలనేది లక్ష్యం. దీనిని ఆసరాగ చేసుకోని కంపెనీ ఎండీ (అవసరాల శ్రీనివాస్‌) హీరోయిన్‌ను పడేసేందుకు సాయం చేయమంటాడు. అలా హీరో ఇచ్చిన సలహాలతో హీరోయిన్‌కు దగ్గర అవ్వాలని చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎండీని కాదని హీరోయిన్‌ హీరోకు ఎలా దగ్గరయ్యింది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నాగ శౌర్య
    ఎన్. వెంకటేశ్వరరావు వెంకీ
    రాశి ఖన్నా
    శ్రీ సాయి శిరీష ప్రభావతి సిరి/ప్రభ
    శ్రీనివాస్ అవసరాల
    కె. ఉదయ్ భాస్కర్ ఉదయ్
    సూర్య
    ఉదయ్ తండ్రి
    రావు రమేష్
    వెంకీ మామయ్య
    హేమ
    వెంకీ అత్త
    ప్రగతి మహావాది
    వెంకీ అమ్మ
    సివిఎల్ నరసింహారావువెంకీ తండ్రి
    సత్య కృష్ణ
    ప్రభ కోడలు
    పోసాని కృష్ణ మురళి
    వామనరావు
    పృధ్వీ రాజ్
    వివాహ బ్రోకర్
    హరీష్ కోయలగుండ్లచింత గురు మూర్తి
    విద్యారావుకళ్యాణి
    కళ్యాణి మాలిక్
    బ్లాక్ టికెట్ అమ్మే వ్యక్తి (అతి అతిధి పాత్ర)
    కృష్ణ భగవాన్
    వాయిస్ ఓవర్
    సిబ్బంది
    శ్రీనివాస్ అవసరాల
    దర్శకుడు
    సాయి కొర్రపాటి
    నిర్మాత
    రజనీ కొర్రపాటినిర్మాత
    కళ్యాణి మాలిక్
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    రాశి ఖన్నా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    రాశి ఖన్నా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా ఆరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. జైలవకుశ, వరల్డ్ ఫేమస్ లవర్, హైపర్, థ్యాంక్యూ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. రాశి ఖన్నా తొలుత మోడలింగ్ చేసి నటనవైపు మొగ్గింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే ఈ ఆపిల్ బ్యూటీకి పెట్ డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇదే క్రమంలో మరికొన్ని ఆసక్తికరమైన సంగతులు(Some Lesser Known Facts about Raashii Khanna) రాశిఖన్నా గురించి తెలుసుకుందాం. రాశి ఖన్నా  ముద్దు పేరు? రాశి రాశి ఖన్నా ఎప్పుడు పుట్టింది? 1990, నవంబర్ 30న జన్మించింది రాశి ఖన్నా తొలి సినిమా? మద్రాస్ కేఫ్(2013) రాశి ఖన్నా  తెలుగులో నటించిన తొలి సినిమా? ఊహలు గుసగుసలాడే(2014) రాశి ఖన్నా  ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు  రాశి ఖన్నా  ఎక్కడ పుట్టింది? ఢిల్లీ రాశి ఖన్నా  ఏం చదివింది? బీఎస్సీ హానర్స్ ఇన్ ఇంగ్లీష్ రాశి ఖన్నా  అభిరుచులు? పాటలు పాడటం, కవితలు రాయడం రాశి ఖన్నాకి ఇష్టమైన ఆహారం? లెబనీస్, చైనీస్ వంటలు రాశి ఖన్నా కు అఫైర్స్ ఉన్నాయా? క్రికెటర్ జాస్ప్రిత్ బుమ్రా అఫైర్ ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. రాశి ఖన్నాకు  ఇష్టమైన కలర్ ? వైట్, ఎల్లో రాశి ఖన్నాకు ఇష్టమైన హీరో? మహేష్ బాబు, రణబీర్‌ కపూర్ రాశి ఖన్నా పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. రాశి ఖన్నా  తల్లిదండ్రుల పేరు? సరిత, రాజ్‌ కే ఖన్నా రాశి ఖన్నా  ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/raashiikhanna/?hl=en రాశి ఖన్నా ఫెవరెట్ సినిమాలు? బొమ్మరిల్లు రాశి ఖన్నాకు ఇష్టమైన ఐస్ క్రీం చాకోలెట్ ఐస్‌క్రీం అంటే రాశి ఖన్నాకు చాలా ఇష్టం రాశి ఖన్నా ఫెవరెట్ హీరోయిన్? మాధురి దీక్షిత్, ప్రియాంక చోప్రా https://www.youtube.com/watch?v=O0ClAuu8Ito రాశి ఖన్నాకు ఫెవరెట్ రెస్టారెంట్? ఎన్‌ గ్రీల్, హైదరాబాద్
    ఏప్రిల్ 06 , 2024
    నాగ శౌర్య(Naga Shaurya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నాగ శౌర్య(Naga Shaurya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    ఛలో సినిమా విజయంతో లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్న నాగ శౌర్య.. తక్కువ కాలంలోనే యూత్‌లో క్రేజ్ సంపాందించుకున్నాడు. ఊహలు గుసగుసలాడే, వరుడుకావలెను ఖుషి వంటి  హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న నాగ శౌర్య గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు మీకోసం నాగ శౌర్య అసలు పేరు? నాగశౌర్య ముల్పూరి నాగ శౌర్య ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు నాగ శౌర్య తొలి సినిమా? క్రికెట్ గర్స్ అండ్ బీర్(2011) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. నాగశౌర్యకు వివాహం అయిందా? 2022 నవంబర్ 20న తన ప్రియురాలు అనూష శెట్టితో వివాహం జరిగింది.  నాగ శౌర్య ఫస్ట్ క్రష్ ఎవరు? ఐశ్వర్య రాయ్ నాగ శౌర్యకు ఇష్టమైన సినిమా? టైటానిక్ చిత్రం తన ఫెవరెట్ చిత్రంగా నాగశౌర్య చెప్పాడు. నాగ శౌర్య ఇష్టమైన హీరో? తమిళ్ హీరో సూర్య నాగ శౌర్య తొలి బ్లాక్ బాస్టర్ హిట్? నాగ శౌర్య, రష్మిక మంధానతో కలిసి నటించిన చిత్రం ఛలో సూపర్ హిట్‌గా నిలిచింది. ఊహలు గుసగుసలాడే చిత్రం కూడా మంచి హిట్ అందుకుంది. నాగశౌర్యకు ఇష్టమైన కలర్? నీలం రంగు నాగ శౌర్య పుట్టిన తేదీ? 1989 జనవరి 14న ఏలూరులో జన్మించారు. నాగశౌర్య తల్లిదండ్రుల పేర్లు? శంకర్ ప్రసాద్, ఉషా ప్రసాద్ నాగశౌర్యకు ఇష్టమైన ప్రదేశం? హైదరాబాద్ నాగ శౌర్య ఏం చదివాడు? బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్(Bcom) https://www.youtube.com/watch?v=GU7EJFAPxCI నాగ శౌర్యకు ఎన్ని అవార్డులు వచ్చాయి? చెప్పుకోదగ్గ అవార్డులు ఏమి రాలేదు నాగ శౌర్య ఎన్ని సినిమాల్లో నటించాడు? నాగ శౌర్య 2024 వరకు 24 సినిమాల్లో నటించాడు.  నాగశౌర్యకు ఇష్టమైన ఆహారం? పెరుగు వడ నాగశౌర్య ముద్దుపేరు? నాని నాగ శౌర్యకు ఇష్టమైన హీరోయిన్? అనుష్క శెట్టి
    మార్చి 21 , 2024
    'Phalana Abbayi Phalana Ammayi' Review: సింపుల్‌గా సాగే రోమాంటిక్ డ్రామా కానీ…
    'Phalana Abbayi Phalana Ammayi' Review: సింపుల్‌గా సాగే రోమాంటిక్ డ్రామా కానీ…
    నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ సినిమా ఎలాంటి బజ్‌ లేకుండానే థియేటర్లలోకి వచ్చేసింది. వీరి కాంబోలో వచ్చిన ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద మంచి హిట్ కావటంతో ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులను వీరిద్దరూ మెప్పించారా? అవసరాల తన దర్శకత్వ ప్రతిభను చూపించాడో లేదో? చూద్దాం. దర్శకుడు: అవసరాల శ్రీనివాస్ నటీ నటులు: నాగశౌర్య, మాళవిక నాయర్ సంగీతం: కల్యాణ్ మాలిక్ సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామా కథేంటి? సంజయ్‌ ( నాగశౌర్య ), అనుపమ ( మాళవిక నాయర్ ) మధ్య జరిగే లవ్‌, రొమాంటిక్ డ్రామా. కొన్నేళ్ల పాటు స్నేహంతో కలిసి ఉన్న ఈ ఇద్దరూ ప్రేమించుకోవటం, తర్వాత వాళ్ల మధ్య ఎదురయ్యే సమస్యలు, విడిపోవటం చివరకు మళ్లీ కలుసుకోవటం అనే సింపుల్‌ కథ. ఎలా ఉందంటే?  కళాశాల నేపథ్యంలో జరిగే సన్నివేశాలతో సినిమా ప్రారంభించి ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చేందుకు అవసరాల ప్రయత్నించాడు. పాత్రల పరిచయం సింపుల్‌గా చేసి తన మార్క్ చూపించాడు.  హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సాదాసీదాగా ఉంటాయి. కథనం చాలా నెమ్మదిగా సాగుతుందని సగటు ప్రేక్షకులకు అనిపిస్తుంది. ప్రేక్షకులు పూర్తిగా ఇబ్బంది కలగకుండా కామెడీతో కవర్ చేయాలని చూశాడు దర్శకుడు. అవి కొంత మేరకు మాత్రమే మెప్పిస్తాయి. అన్ని చోట్ల నవ్వులు పూయించకపోవటంతో ప్రేక్షకులకు ఆ భావన పోదు.  దాదాపు 10 సంవత్సరాలు కలిసి ఉన్న జంట కొన్ని అనుకోని కారణాలతో విడిపోవటంతో ఇంటర్వెల్‌కు చేరుతుంది. ఫస్టాఫ్ ముగిసే సరికే ప్రేక్షకులు నిరాశకు గురవుతారు.  సెకాండాఫ్‌లోనూ కథనంలో వేగం లేదు. క్లైమాక్స్‌ను చిన్న సింపుల్ పాయింట్‌తో ముగించేశాడు అవసరాల శ్రీనివాస్‌. సాంకేతికంగా చిత్రం మెుత్తం నాగ శౌర్య, మాళవిక నాయర్ మధ్య జరుగుతుంది. వీళ్లిద్దరూ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. వీరిద్దరూ మరోసారి నటనలో తమ ప్రతిభ చూపించారు.  నాగశౌర్యతో క్లాసిక్ హిట్స్‌ తీసిన అవసరాల శ్రీనివాస్‌కు ఓవర్సీస్‌లో మంచి పేరు ఉంది. కానీ, అక్కడ కూడా ప్రేక్షకులను సినిమా నిరాశపర్చింది.  సినిమా చూసిన వాళ్లందరూ చాలా స్లోగా ఉందని చెబుతున్నారు. అవసరాల ఈ సారి స్క్రీన్‌ ప్లే మ్యాజిక్ చేయలేదని చెప్పవచ్చు. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రంలో ఏదైనా బాగుందంటే అది కళ్యాణ్ మాలిక్ సంగీతం మాత్రమే. ఇందులో ఉన్న రెండు పాటలు బ్లాక్‌ బస్టర్‌గా నిలిచాయి. బీజీఎం కూడా బాగుంది.  సునీల్ కుమార్ నామా సినిమాటోఫ్రీతో, కిరణ్ గంటి ఎడిటింగ్‌లో అద్భుతం అనిపించారు. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో వాళ్ల నైపుణ్యంతో రాబట్టగలిగారు.   బలాలు నాగశౌర్య, మాళవిక నాయర్ సంగీతం సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బలహీనతలు స్లో నరేషన్ రేటింగ్ : 2.5/5 ఊహలు గుసగుసలాడే వంటి చిత్రాన్ని చూద్దామనే అంచనాలతో వెళితే మాత్రం నిరాశ తప్పదు.
    మార్చి 17 , 2023
    Rashi Khanna: టైట్‌ జాకెట్‌లో పెదవి కొరుకుతూ రెచ్చగొడుతున్న రాశి ఖన్నా..!
    Rashi Khanna: టైట్‌ జాకెట్‌లో పెదవి కొరుకుతూ రెచ్చగొడుతున్న రాశి ఖన్నా..!
    ప్రముఖ నటి రాశి ఖన్నా సోషల్‌ మీడియాలో మరింత రెచ్చిపోతోంది. తాజాగా కొన్ని ఫొటోలను షేర్‌ చేసిన రాశి తన ఎద అందాలతో నెటిజన్ల మత్తులో ముంచేసింది తాజా ఫొటోల్లో రాశి క్లివేజ్‌ లుక్‌లో కనిపించింది. ఒకేసారి ఎద, నడుము అందాలను ప్రదర్శించి ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది.   గతంలో కంటే ఇప్పుడు మరింత హాట్‌గా రాశి కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందానికి వరుస అవకాశాలు క్యూ కడతాయని పోస్టులు పెడుతున్నారు.  ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా తన అందం, అభినయంతో తెలుగు డైరెక్టర్ల దృష్టిలో పడింది.  జోరు, శివం, హైపర్‌, తొలి ప్రేమ, వరల్డ్‌ ఫేమస్ లవర్‌ వంటి చిత్రాల్లో నటించి రాశి మెప్పించింది. గతేడాది 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలతో రాశీ అలరించింది. తమిళంలోనూ తిరు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  రాశి ఖన్నా హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. మద్రాస్‌ కేఫ్‌ చిత్రం ద్వారా తొలిసారి ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తొలినాళ్లలో గ్లామర్ పాత్రలకు కాస్త దూరం పాటించిన రాశి గత కొంత కాలంగా ఆ హద్దులు చెరిపేసింది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌తో కలిసి రుద్ర వెబ్‌సిరీస్‌ రాశి ఖన్నా చేసింది. అంతకుముందు ఫర్జీ వెబ్‌సిరీస్‌లోను రాశి మెరిసింది.  ఇటీవల కాలంలో రాశి సినిమాల జోరు తగ్గింది. దీంతో తన అందాల ఆరబోత ద్వారా ఆఫర్లు దక్కించుకోవాలని రాశి చూస్తోంది. 
    ఏప్రిల్ 03 , 2023
    Rashi Khanna: జాకెట్‌ విప్పి హద్దులు దాటిన రాశీ ఖన్నా..  చూసి తట్టుకోవడం కష్టమే!
    Rashi Khanna: జాకెట్‌ విప్పి హద్దులు దాటిన రాశీ ఖన్నా..  చూసి తట్టుకోవడం కష్టమే!
    టాలీవుడ్‌ బ్యూటీ రాశీ ఖన్నా (Rashi Khanna) తన బోల్డ్‌ ఫొటోలను షేర్‌ చేసి సోషల్‌మీడియాను తన వైపు తిప్పుకుంది.  తాజా ఫొటోల్లో రాశీ తన హద్దులను చెరిపేసింది. జాకెట్‌ విప్పేసి మరి లోదుస్తుల్లో దర్శనం ఇచ్చింది. ఈ హాట్‌ ట్రీట్‌తో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  రాశీ ఖన్నా క్లీవేజ్‌ షోకు నెట్టింట భారీ స్పందన వస్తోంది. ఆమె లేటెస్ట్‌ పిక్స్‌కు పెద్ద ఎత్తున లైక్స్, షేర్లు వస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ పేరు  #RaashiiKhanna హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతోంది.  గతంలో కంటే రాశీ మరింత హాట్‌గా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందానికి వరుస అవకాశాలు క్యూ కడతాయని పోస్టులు పెడుతున్నారు.  సౌత్ నుంచి నార్త్ వరకూ వరుస సినిమాలతో సత్తా చాటిన రాశీ ఖన్నా.. ఇటీవల తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలు చేసింది.  కానీ, ఆ రెండూ డిజాస్టర్‌గా మిగలడంతో ఈ బ్యూటీ (#RaashiiKhanna)కి భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో ఇటీవల పెద్ద సినిమా ప్రాజెక్టులు ఏవి ఆమె వద్దకు వెళ్లలేదు. అటు తమిళంలో రీసెంట్‌గా 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్' చిత్రాల్లో ఈ బ్యూటీ నటించింది. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే సినిమాలో మెరిసింది.  ప్రస్తుతం టాలీవుడ్‌లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) సరసన ఓ సినిమాలో రాశీ నటిస్తోంది. ఈ చిత్రానికి నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. రాశీతో పాటు శ్రీనిధి శెట్టి కూడా ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే హిందీలో ఈ చిన్నది 'యోధ' అనే సినిమాలో నటిస్తోంది.  తమిళంలో 'అరన్మనై 4', 'మేథావి' అనే చిత్రాలతో రాశీ బిజీ బిజీగా ఉంది.  కెరీర్‌ ప్రారంభంలో ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా  (Rashi Khanna) తన అందం, అభినయంతో తెలుగు డైరెక్టర్ల దృష్టిలో పడింది.  జోరు, శివం, హైపర్‌, తొలి ప్రేమ, వరల్డ్‌ ఫేమస్ లవర్‌ వంటి చిత్రాల్లో నటించి రాశి (#RaashiiKhanna) మెప్పించింది. రాశి ఖన్నా హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. మద్రాస్‌ కేఫ్‌ చిత్రం ద్వారా తొలిసారి ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌తో కలిసి రుద్ర (Rudra Series) వెబ్‌సిరీస్‌ రాశి ఖన్నా చేసింది. అంతకుముందు ఫర్జీ సిరీస్‌లోను రాశి మెరిసింది.  ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీలు చేస్తోన్న రాశీ ఖన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది.  ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా ఫ్యాన్స్‌కు షేర్‌ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు ఎన్నో హాట్ ఫొటోలను కూడా నెటిజన్లతో పంచుకుంటోంది. దీంతో ఈ అమ్మడు నెట్టింట తరచూ హైలెట్‌ అవుతూనే వస్తోంది. 
    జనవరి 30 , 2024
    Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
    Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
    తెలుగు చిత్ర సీమలో అందాలకు కొదువ లేదు. హాట్ గ్లామర్‌ను పండిచడంలో మన హీరోయిన్లు ఏ చిత్ర పరిశ్రమకు తక్కువకాదు. హాట్ సీన్లైనా, బెడ్‌రూం సీన్లలోనైనా నటించేందుకు వెనకాడటం లేదు. ఇక సినిమాల్లో గ్లామర్‌ షోను కాసేపు పక్కన పెడితే... సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అదరహో అనిపిస్తున్నారు. బికినీ సూట్‌లలో దర్శనమిస్తూ హీటెక్కిస్తున్నారు. కుర్ర హీరోయిన్లే కాదు.. వారితో పోటీపడుతూ మరి సీనియర్ భామలు కూడా పరువాల ప్రదర్శనకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరి ఆ అందాలపై మీరు ఓ లుక్కేయండి. [toc] Samantha Ruth Prabhu సమంత సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్‌ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. తొలి తరంలో కాస్త గ్లామర్ షోకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం..ఐటెం సాంగ్స్, లిప్ లాక్, బెడ్‌ రూం సీన్లలోనూ నటించేందుకు సిద్ధమైంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఫ్యాన్స్‌ను కవ్విస్తుంటుంది. హాట్ ఫొటో షూట్‌తో అలరిస్తుంది. ఆమె బికినీ ఫొటోలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మరి సమంత బికినీ ఫోటోస్‌పై మీరు ఓ లుక్కేయండి. Samantha bikini images Kajal Aggarwal కాజల్ అగర్వాల్   తెలుగు, హిందీ, తమిళ్ భాషాల్లో ప్రధానంగా నటించింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారం అందుకుంది. ఇక కాజల్ అగర్వాల్ అందాలకు ఫ్యాన్‌ బేస్ ఓ రేంజ్‌లో ఉంటుంది. చీర కట్టులో ఉన్నా, మోడ్రన్ డ్రెస్‌లో ఉన్నా తరగని అందం ఆమె సొంతం. బహిరంగంగా బికినీలో తన అందాలు చూపించేందుకు కాజల్‌కు ఇష్టముండదట. బికినీ ధరించాల్సి వచ్చిన సమయంలో సినిమాలనే వదులుకుంది ఈ భామ. అయితే కాజల్ తన బర్త్‌డే సందర్భంగా బికినీలో స్విమ్ చేసిన వీడియో మాత్రం ఉంది.  Kajal Agarwal bikini video https://twitter.com/TCINEUpdate/status/1670989988929077250 Tamannaah Bhatia తమన్నా భాటియా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015), ఊపిరి (2016), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017), ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019), సైరా నరసింహా రెడ్డి (2019), ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2022) వంటివి తమన్నా నటించిన ప్రముఖ తెలుగు సినిమాలు. కల్లూరి (2007), అయాన్ (2009), పయ్యా (2010), సిరుతై (2011), వీరమ్ (2014), ధర్మ దురై (2016), దేవి (2016), స్కెచ్ (2018), జైలర్ (2023) వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాల్లో నటించింది. నవంబర్ స్టోరీ (2021), జీ కర్దా (2023), ఆఖ్రీ సచ్ (2023), లస్ట్ స్టోరీస్2 వంటి వెబ్‌సిరీస్‌ల్లో ప్రధాన నటిగా పనిచేసింది. లస్ట్‌ స్టోరీస్‌లో ఆమె గ్లామర్ షోపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితేనేం ఏమాత్రం పరువాల ఘాటు తగ్గించకుండా దూసుకెళ్తోంది. ఆమె బికినీలో చేసే హాట్ షోకు అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. Tamannaah Bhatia Bikini images View this post on Instagram A post shared by Think Music India (@thinkmusicofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) Anushka Shetty అనుష్క శెట్టి  పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ త్వారత విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అరుంధతి(2009), బిల్లా(2009), మిర్చి(2013), బాహుబలి(2015), రుద్రమదేవి(2015), బాహుబలి ది కన్‌క్లూజన్(2017) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన ఏకైక హీరోయిన్‌గా అనుష్క శెట్టిని చెప్పవచ్చు. Anushka shetty Bikini Images Disha Patani దిషా పటాని తెలుగు చిత్రం లోఫర్ (2015)తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె బయోపిక్ MS ధోనితో  హిందీ చలన చిత్రాల్లోకి అడుగుపెట్టింది. సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దిషా నటనతోనే కాదు తన అందంతోనూ ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామర్ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు బికినీ ఫొటోలు పెడుతూ కుర్రకారును ఊరిస్తు ఉంటుంది. Disha Patani Bikini images Pragya Jaiswal ప్రగ్యా జైస్వాల్ ప్రధానంగా తెలుగు చిత్రాలలో పని చేస్తుంది. జైస్వాల్ తెలుగు పీరియడ్ డ్రామా కంచె (2015)తో గుర్తింపు పొందింది. తొలి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా ఫిల్మ్‌ ఫేర్ అవార్డును పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మకు చెప్పుకోదగ్గ అవాకాశాలు ప్రస్తుతం లేకున్నా…తనదైన గ్లామర్‌ షోతో ఆకట్టుకుటుంది. ఆ అందాలను మీరు చూసేయండి. Pragya Jaiswal bikini Images ShwetaTiwari శ్వేతా తివారీ హిందీ సినిమా, టెలివిజన్ నటి. 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. తివారీ బిగ్ బాస్ 4 (2010–11), కామెడీ సర్కస్ కా నయా దౌర్ (2011) రియాల్టీ షోలలో విజేతగా నిలిచి గుర్తింపు పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు హద్దు అంటూ లేదు. ఓసారి మీరు చూసేయండి మరి. ShwetaTiwari Bikini Images Deepika Padukone దీపికా పదుకొనే ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు, ఆమె ప్రశంసలలో మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. ఆమె దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలలో ఉంది; టైమ్ ఆమెను 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది మరియు 2022లో ఆమెకు టైమ్100 ఇంపాక్ట్ అవార్డును ప్రదానం చేసింది. deepika padukone bikini Images Pooja Hegde పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు అందాల దేవతగా మారింది. ఈ అమ్మడి సోకులకు కుర్రకారు హుషారెక్కుతుంటారు. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా చూడండి. Pooja Hegde Bikini Images Pooja Hegde Hot Videos https://twitter.com/RakeshR86995549/status/978983052364808194 View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) Raashii Khanna రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశి ఖన్నా చదువులో టాపర్‌. ఐఏఎస్‌ కావాలని ఆకాంక్షించినప్పటికీ... క్రమంగా మోడలింగ్ వైపు మొగ్గు చూపింది. ఆ తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ప్రతిరోజు పండగే, జీల్, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ బాట పట్టింది. అక్కడ హాట్ గ్లామర్ షో చేస్తూ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ అమ్మడి అందాలకు మంచి క్రేజ్ ఉంది. ఫొటోలు పెట్టినా క్షణాల్లోనే లక్షల్లో లైక్‌లు వస్తుంటాయి. Raashii Khanna Bikini images Dimple Hayathi డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమె డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. కేవలం ఆమె అందం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. డింపుల్ బికినీ అందాలను ఇప్పటికీ ఏ హీరోయిన్‌ బీట్‌ చేయలేదంటే అతిశయోక్తి కాదు. మీరు ఓసారి ఆ సోగసులపై లుక్‌ వేయండి https://twitter.com/PicShareLive/status/1525365506471231488 Ketika Sharma Bikini Images కేతిక శర్మ తెలుగు సినిమా నటి. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్‌ లైఫ్‌ (2016)' వీడియోతో పాపులర్‌ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. ఈ పాప సోషల్ మీడియాలో కాస్త కూడా కుదురుగా ఉండదు. హాట్ హాట్ ఫొటో షూట్‌లతో వెర్రెక్కిస్తుంటుంది. మరి మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్‌ వేయండి Ketika Sharma Bikini Images Catherine Tresa కేథరీన్ థెరీసా ప్రధానంగా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో నటిస్తోంది. తెలుగులో చమ్మక్ చల్లో చిత్రం ద్వారా పరిచయమైంది. కన్నడలో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును పొందింది. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా నటించింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. సరైనోడు, నేనేరాజు నేనే మంత్రి, బింబిసారా, వదలడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు కేథరీన్ మోడలింగ్ చేసింది. "నల్లి సిల్క్స్", "చెన్నై సిల్క్స్", "ఫాస్ట్ ట్రాక్","దక్కన్ క్రానికల్" లకు మోడల్‌గా వ్యవహరించింది. ఈ ముద్దుగుమ్మ నటనలోనే కాదు అందాల ప్రదర్శనలోనూ ఓ మెట్టు ఎక్కింది. తన సొగసుల సంపదను అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల గుండెల్లో వీణలు మోగిస్తుంటుంది. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా ఆస్వాదించండి. Catherine Tresa Bikini images Mrunal Thakur మృణాల్ ఠాకూర్ లవ్‌ సోనియా(2018) హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. తెలుగులో వచ్చిన జెర్సీ రీమేక్‌లో షాహిద్ కపూర్ సరసన నటించడంతో ఆమె టాలీవుడ్ పెద్దల దృష్టి పడింది. దీంతో ఆమెకు తెలుగులో సీతారామం(2022) చిత్రం ద్వారా అవకాశం వచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఇక మృణాల్ అందాల గురించి ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. మరి ఆ రేంజ్‌లో ఉంటుంది ఈ అమ్మడి అందాల తెగింపు. ఒక్క పాటలో చెప్పాలంటే ఇంతందం దారి మళ్లిందా అనిపిస్తుంది తన సోగసుల సోయగాలు చూస్తుంటే.. మీరు ఓసారి చూసేయండి మరి. Mrunal Thakur Bikini images Mrunal Thakur hot video https://twitter.com/MassssVishnu/status/1786566946600988750 https://twitter.com/MrunalThakur143/status/1788433120221401193 https://twitter.com/SastaJasoos/status/1788498532162236427 Anasuya Bharadwaj బుల్లితెర వ్యాఖ్యతగా అలరించిన గ్లామరస్ యాంకర్ అనసూయ.. నటిగా తొలిసారి నాగ(2003) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో బుజ్జి క్యారెక్టర్‌లో నటించింది. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ నటనకుగాను అవకాశాలు క్యూ కట్టాయి. రామ్‌చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఆమె చేసిన రంగమత్త పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. యాంకర్ రోల్‌ను వదిలి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది. క్షణం, విన్నర్, పుష్ప, రంగమర్తాండ, విమానం వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు తనలోని నటనా కోణాన్ని పరిచయం చేసింది. రంగస్థలం, క్షణం చిత్రాలకుగాను ఉత్తమ సహాయనటిగా సైమా పురస్కారాలు అందుకుంది. నటన కంటే ముందు ఆమెను పాపులర్ చేసింది మాత్రం ఆమె గ్లామర్ షో అని చెప్పాలి. బిగువైన అందాల విందుతో కుర్రకారుకు కలల రాణిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఏ ఫొటో పెట్టినా ఇట్టే ట్రెండ్ అవుతాయి మరి. Anasuya Bharadwaj Bikini images View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) Nidhhi Agerwal నిధి అగర్వాల్  ప్రధానంగా తెలుగుతో పాటు హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో సవ్యసాచి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పూరి డైరెక్షన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తొలి బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో గ్లామరస్ క్వీన్‌గా గుర్తింపు పొందింది. సినిమాల్లోకి రాకముందు.. కపిల్ శర్మ టాక్ షో, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్‌-4లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇక నిధి శర్మ ఇచ్చే గ్లామర్ షో గురించి మాట్లాడితే.. చూసేవారికి కన్నుల పండుగేనని చెప్పాలి. ఈ పాప బికిని వేసిన ఫొటోలు తక్కువేకానీ..చూపించిన ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది. కావాలంటే మీరు ఓసారి చూసేయండి. Nidhhi Agerwal Bikini Images Mehreen Kaur Pirzada మెహ్రీన్ తెలుగు సినిమా నటి. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ పిల్ల అందాల ప్రదర్శన గురించి మాట్లాడితే.. పర్వాలేదనే చెప్పాలి. ఫోటో షూట్‌ల కంటే ఈ అమ్మడు వీడియో షూట్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది. Mehreen Kaur Pirzada Bikini Videos View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) Manushi Chillar మానుషి చిల్లర్.. ప్రముఖ మోడల్‌. మిస్‌ వరల్డ్‌ 2017 పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్‌ వరల్డ్‌ కిరీటం పొందిన ఆరో భారత మహిళగా రికార్డులకెక్కింది. 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా బడేమియా చోటేమియా సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మాజీ ప్రపంచ సుందరి బికినీ అందాల గురించి చెప్పేదిమి లేదు. మీరే చూసేయండి. Manushi Chillar Bikini Images Manushi Chillar Bikini videos View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) https://twitter.com/ManushiChhillar/status/1787462061280166182 Sobhita Dhulipala శోభితా ధూళిపాళ ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది మరియు మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ యొక్క థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016)లో ఆమె తొలిసారిగా నటించింది మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చీర కట్టినా.. మోడ్రన్ డ్రెస్ వెసినా తరగని అందంతో చెలరేగుతుంటుంది. మరి ఆ అందాల విందును మీరు చూసేయండి మరి. Sobhita Dhulipala bikini images Hot videos View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) Tripti Dimri తృప్తి డిమ్రి.. కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ (2017) ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి సారి లీడ్ రోల్‌లో నటించింది. ఆ తరువాత ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)లలో చిత్రాలలో నటించింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు యానిమల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. రెడిఫ్ డాట్ కామ్ 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమె 8వ స్థానంలో నిలిచింది. ఇక అమ్మడు ఎక్స్‌పోజింగ్‌లో బాలీవుడ్ హీరోయిన్లకంటే రెండు అకులు ఎక్కువే చదివింది. ఓసారి ఆ అందాల విందును మీరు తనివితీరా ఎంజాయ్ చేయండి. Tripti Dimri Bikini images View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) Shirley Setia షిర్లె సెటియా... కృష్ణ వ్రింద విహారి చిత్రం(2022) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా యావరేజ్‌గా ఆడిన మంచి గుర్తింపు సాధించింది. అయితే ఈ చిత్రానికి కంటే ముందు లాక్‌డౌన్(2018) వెబ్‌సిరీస్‌ ద్వారా గుర్తింపు దక్కించుకుంది. షిర్లె సెటియాలో బహుముఖ ప్రజ్ఞ దాగి ఉంది. నటిగా మాత్రమే కాకుండా.. సింగర్‌గాను రాణించింది. ఇక కుర్రదాని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. Shirley Setia Bikini Images
    మే 11 , 2024
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే  చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.  భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్‌ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.  తొలి ప్రేమ (Tholi Prema) వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.  ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade) నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్‌ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్‌ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్‌ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.  అష్టా చమ్మా (Ashta Chamma) నాని, అవసరాల శ్రీనివాస్‌, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్‌ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్‌ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.  అలా మెుదలైంది (Ala Modalaindi) డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్‌ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్‌ ఫెయిల్‌ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.  సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan) హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.  మజిలి (Majili) తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.  ఓకే బంగారం (Ok Bangaram) ప్రస్తుత కాలంలో డేటింగ్‌ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.  ఏ మాయ చేశావే (Ye Maya Chesave) తెలుగులో వచ్చిన ఎవర్‌గ్రీన్‌ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్‌ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.   పెళ్లి చూపులు (Pelli Chupulu) తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్‌ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్‌ బిజినెస్‌లో భాగమై సక్సెస్‌ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.  సీతారామం (Sita ramam) 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన చిత్రాల్లో సూపర్‌ క్లాసిక్‌ మూవీగా దీన్ని చెప్పవచ్చు.  హాయ్‌ నాన్న (Hi nanna) ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్‌ నాన్న తప్పకుండా ఉంటుంది.  మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju) రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.  ఓయ్‌ (Oye) బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha) కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి (Raja Rani) ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు. జాను (Jaanu) శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.  గోదావరి (Godavari) శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్‌ కొట్టదు. హీరో సుమంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఆనంద్‌ (Anand) ఈ ఫీల్‌గుడ్‌ మూవీ కూడా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్‌ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
    మార్చి 22 , 2024
    SalaarTheSaga: సలార్ ఒక పెను సంచలనం.. ఇండియా హిస్టరీలో అలాంటి మూవీ రాలేదు!
    SalaarTheSaga: సలార్ ఒక పెను సంచలనం.. ఇండియా హిస్టరీలో అలాంటి మూవీ రాలేదు!
    ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సినిమాని ప్రభాస్ ఎలా యాక్సెప్ట్ చేశారంటూ నెట్టింట విమర్శలొచ్చాయి. ప్రభాస్ కెరీర్ ఢమాల్ అంటూ చాలామంది ట్వీట్లు కూడా చేశారు. అయితే, ఆదిపురుష్ ఫలితాన్ని మర్చిపోయేలా ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సలార్ ఫీవర్‌ షురూ అయింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీంతో ఫోకస్ మొత్తం సలార్ వైపు మళ్లింది. సలార్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌లో సరికొత్త జోష్ మొదలైంది.  ‘సలార్’కి 100 రోజుల ముందే కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్లను ట్రాక్‌లో పెట్టింది. దీంతో ఇప్పటి నుంచే సలార్ మూవీ ప్రజల్లో ఉండేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ని రివీల్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న చిత్రం కావడమూ ఇందుకు మరో కారణం. పైగా, ఇందులో ‘KGF’కు మించిన యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయట. ఊహకు అందని రీతిలో మూవీ ఉంటుందని టాక్‌. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  టీం సభ్యుల ప్రచారం.. సినిమా ప్రచార వ్యూహాలు ఒకెత్తయితే, మూవీ విషయాలను క్యాస్ట్ అండ్ క్రూ సందర్భానుసారంగా వెల్లడిస్తుండటం మరొక ఎత్తు. ఇప్పటికే సలార్ మూవీ గురించి రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. సినిమా స్టోరీ ప్లాట్ సహా ఎక్కడ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటితోనే అభిమానులు పండగ చేసుకుంటుంటే వారికి మరింత కిక్ ఇచ్చేలా మూవీ టీం సభ్యులు అప్‌డేట్స్ ఇస్తున్నారు.  కెమెరా.. సలార్ మూవీ కోసం ప్రత్యేక కెమెరాను ఉపయోగిస్తున్నట్లు సినిమాటోగ్రఫర్ భువన గౌడ్ వెల్లడించాడు. సిగ్నేచర్ లెన్స్‌తో కూడిన నెక్ట్స్ వెర్షన్ అలెక్స్ ఎర్రీ కెమెరాను వాడుతున్నట్లు తెలిపాడు. పైగా, సినిమా పూర్తిగా ఐమ్యాక్స్ వెర్షన్‌కి సపోర్ట్ చేసేలా 4K లో తీస్తున్నట్లు వెల్లడించాడు. డార్క్ సెంట్రిక్‌ థీమ్‌లో తెరకెక్కుతున్నందున ఆరెంజ్‌కు బదులు బూడిద రంగును వాడినట్లు చెప్పాడు. పైగా, స్కేల్, జాగ్రఫీ పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయని చెప్పి హైప్ క్రియేట్ చేశాడు.  సరికొత్తగా ప్రభాస్.. సలార్ సినిమాలో చూసే ప్రభాస్ సరికొత్తగా ఉంటాడని నటి శ్రియా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని సలార్‌లో చూస్తారని చెప్పింది. కేజీఎఫ్ ఒక సంచలనం అయితే సలార్ పెను సంచలనం అంటూ చెప్పుకొచ్చింది. హాలీవుడ్‌ సెన్సేషనల్‌ సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను మరిపించేలా ఫైట్స్ ఉండబోతున్నాయట. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఒక ప్రపంచం ఉంటుందని.. అదే విధంగా ప్రశాంత్ నీల్ మరొక ప్రపంచాన్ని సృష్టించాడని తెలిపింది. ఇలాంటి ప్రపంచంలో ఓ మైటీ ప్రభాస్ ఉంటాడని చెప్పింది. ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని పేర్కొంది. మరో 8 పాత్రలు వేటికవే ప్రత్యేకమని స్పష్టం చేసింది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో మీరే ఊహించుకోండి అంటూ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించింది.  https://twitter.com/Attitudist/status/1671201399584227328 మ్యూజిక్ కేజీఎఫ్ 1, 2 సినిమాలకు మ్యూజిక్ అందించాడు రవి బాస్రూర్. ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు సలార్ మూవీకి కూడా రవినే సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీంతో మ్యూజిక్ పరంగా ఆల్బమ్ ముందే హిట్ లిస్టులోకి చేరుకుంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. రవి బాస్రూర్ పోస్ట్ చేసే మ్యూజిక్ ప్రాక్టీస్ వీడియోలు వీటికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇలా చిత్రంపై ఒకొక్క విషయం వెల్లడిస్తూ  https://twitter.com/NimmaNuthan/status/1671180132638420992
    జూన్ 21 , 2023
    <strong>The Goat Day 1 Collections: తొలి రోజున ‘ది గోట్‌’ వసూళ్ల సునామీ.. ‘లియో’తో పోలిస్తే ఎదురుదెబ్బే!</strong>
    The Goat Day 1 Collections: తొలి రోజున ‘ది గోట్‌’ వసూళ్ల సునామీ.. ‘లియో’తో పోలిస్తే ఎదురుదెబ్బే!
    తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. అయితే గురువారం (సెప్టెంబర్‌ 5)న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే తమిళనాడులో మాత్రం విజయ్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షించి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తొలి రోజు కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; డే 1 కలెక్షన్స్ ఎంతంటే విజయ్‌ హీరోగా నటించిన ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) అంచనాలకు తగ్గట్లే తొలిరోజు భారీ వసూళ్లను సాధించింది. ఒక్క ఇండియాలోనే ఈ చిత్రం రూ.55 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.43 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక్క తమిళనాడులోనే అత్యధికంగా రూ.38.3 కోట్లు (GROSS) వసూలైనట్లు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్లు, హిందీలో రూ.1.7 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసినట్లు ప్రకటించాయి. ఇక వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌ కలుపుకుంటే రూ.80 కోట్లు (GROSS)పైనే తొలి రోజు రాబట్టే అవకాశముందని అంచనా వేస్తున్నాయి. అయితే ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం ‘ది గోట్‌’ చిత్రం ‘లియో’ రికార్డ్‌ను దాటలేకపోయినట్లు తెలుస్తోంది. విజయ్‌ గత చిత్రం ‘లియో’ తొలి రోజున రూ. రూ.148.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ రికార్డును ‘ది గోట్‌’ అధిగమించలేకపోయింది.&nbsp; 'ది గోట్‌' ఎలా ఉందంటే? దర్శకుడు వెంకట్‌ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్‌ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్‌ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్‌ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్‌ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్‌. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్‌ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.&nbsp; కథేంటి గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్‌ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్‌ (విజయ్‌)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.&nbsp; https://telugu.yousay.tv/the-goat-review-if-dalapati-vijay-had-to-face-himself-is-the-goat-great-or.html
    సెప్టెంబర్ 06 , 2024
    The GOAT Review: దళపతి విజయ్‌ తనతో తానే తలపడాల్సి వస్తే.. ‘ది గోట్‌’ గ్రేట్‌గా ఉందా? లేదా?
    The GOAT Review: దళపతి విజయ్‌ తనతో తానే తలపడాల్సి వస్తే.. ‘ది గోట్‌’ గ్రేట్‌గా ఉందా? లేదా?
    నటీనటులు : విజయ్‌, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్‌ త్యాగరాజన్‌, కొకిలా మోహన్‌, జయరాం, స్నేహా, వీటీవీ గణేష్‌, అరవింద్‌ ఆకాష్‌, వైభవ్ రెడ్డి తదితరులు కథ, దర్శకత్వం : వెంకట్‌ ప్రభు సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ నూని ఎడిటింగ్‌ : వెంకట్‌ రాజన్‌ నిర్మాతలు : కల్పతి ఎస్‌. అఘోరం, కల్పతి ఎస్. గణేశ్‌, కల్పతి ఎస్‌. సురేష్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? విజయ్‌కు మరో మరుపురాని విజయాన్ని అందించిందా? లేదా? ఈ రివ్యూ&nbsp; (The Greatest of All Time Telugu Review)లో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్‌ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్‌ (విజయ్‌)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే దళపతి విజయ్‌ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. గాంధీ పాత్రలో ఎప్పటిలాగే అదరగొట్టాడు. అయితే జీవన్‌ పాత్రలో యంగ్‌ విజయ్‌ డిజిటలైజ్డ్‌ లుక్ కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంత కన్విన్సింగ్‌గా ఉండదు. ఇక యాక్షన్‌ సీక్వెన్స్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో విజయ్‌ మరోమారు తన మార్క్‌ చూపించాడు. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరికి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆమెది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. స్పెషల్‌ స్క్వాడ్‌ సభ్యులుగా ప్రశాంత్‌, అజ్మల్‌, ప్రభుదేవా పర్వాలేదనిపించారు. వారికి హెడ్‌గా జయరాం తన నటనతో ఆకట్టుకున్నారు. సీనియర్ విజయ్‌కు జోడీగా చేసిన స్నేహా తన నటనతో మెప్పించింది. తమిళ యువ హీరో శివ కార్తికేయన్‌ చిన్న పాత్రలో సందడి చేశారు. త్రిష ఓ స్పెషల్‌ సాంగ్‌లో అలరించింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు వెంకట్‌ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్‌ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్‌ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్‌ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్‌ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్‌. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్‌ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే యువన్‌ శంకర్‌ రాజా అందించిన పాటలు పూర్తిగా తేలిపోయాయి. ఏది మైండ్‌లో గుర్తుంచుకునేలా లేదు. అయితే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం బాగుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లను బీజీఎం మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. గ్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ ఇంకాస్త బెటర్‌గా పనిచేయాల్సింది. ముఖ్యంగా విజయ్ డీఏజింగ్‌ లుక్‌ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడినట్లు అనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విజయ్‌ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌క్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ ఊహకందే కథనంప్రథమార్ధం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    సెప్టెంబర్ 05 , 2024
    <strong>Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ ఆకట్టుకుందా!</strong>
    Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ ఆకట్టుకుందా!
    నటీనటులు: రాజ్‌ తరుణ్‌, హాసిని, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు రచన, దర్శకత్వం: రామ్‌ భీమన సంగీతం: గోపీ సుందర్‌ సినిమాటోగ్రఫీ: పీజీ విందా ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ నిర్మాత: డాక్టర్‌ రమేశ్‌ తేజవత్‌, ప్రకాశ్‌ తేజవత్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ (Raj Tarun) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అటు సినీ, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదొడుకులను ఫేస్‌ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు నటించిన లేటేస్ట్ చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu Movie review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్‌ భీమన (Ram Bhimana) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హాసిని (Actress Hasini) హీరోయిన్‌గా చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రాజ్‌ తరుణ్‌కు హిట్‌ను అందించి ఊరట కల్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి రచిత్‌ రామ్‌ (రాజ్‌తరుణ్‌) పుట్టుకతోనే కోటీశ్వరుడు. పీఆర్‌ గ్రూప్స్‌ అధినేత ఆదిత్య రామ్‌ (మురళీ శర్మ) ఏకైక తనయుడు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని తిరిగొచ్చిన కుమారుడికి సీఈవో బాధ్యతలు అప్పగించాలని ఆదిత్య నిర్ణయించుకుంటాడు. అయితే రచిత్‌ పెద్దమ్మ వసుంధర దానికి (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ రూల్స్‌ ప్రకారం సీఈవోగా ఎంపికవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది. దీనికి రచిత్‌ అంగీకరించి బయటకువచ్చేస్తాడు. ఏపీలోని మారుమూల గ్రామమైన రాయపులంకకు వెళ్తాడు. అక్కడికి వెళ్లాక రచిత్‌ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు అతడు ఎలాంటి సాహసాలు చేశాడు? అమ్ముతో అతడి లవ్‌ స్టోరీ ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే రచిత్‌ రామ్‌ పాత్రలో రాజ్‌తరుణ్‌ చక్కటి నటన కనబరిచాడు. కోటీశ్వరుడిగా, ఎటువంటి ఐడెంటిలేని సాధారణ వ్యక్తిలా రెండు డైమన్షన్స్‌లో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఇక పల్లెటూరి అమ్మాయి అమ్ము పాత్రలో హాసిని సుధీర్‌ స్క్రీన్‌పై ఎంతో అందంగా మెరిసింది. రాజ్‌తరణ్‌ - అమ్ము మధ్య వచ్చే లవ్‌ సీన్స్ మెప్పిస్తాయి. హీరో ఫ్రెండ్‌ పాత్రలో ప్రవీణ్‌ నవ్వులు పూయిస్తాడు. సత్య, బ్రహ్మానందం వంటి కమెడియన్లు సినిమాలో తళుక్కుమని మెరిశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని కారణాల వల్ల ఓ సామాన్యుడిలా గడపటం గతంలో చాలా చిత్రాల్లోనే చూశాం. 'పురుషోత్తముడు' చిత్రాన్ని కూడా దర్శకుడు రామ్‌ భీమన ఈ కోవలోనే రూపొందించారు. ధనవంతుడైన హీరో రాయపులంక గ్రామం చేరాక అసలు కథ మెుదలవుతుంది. హీరోయిన్‌తో పరిచయం, లవ్‌ సీన్స్‌ ఆకట్టుకునేలా ఉంటాయి. ఫస్టాఫ్‌ మెుత్తం విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కామెడీతో ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. ఊర్లో జరిగే అన్యాయాలపై హీరో తిరగబడటం, ఇంటర్వెల్‌ బ్యాంగ్ మెప్పిస్తాయి. అయితే ద్వితీయార్థం నుంచి కథ గాడి తప్పినట్లు కనిపిస్తుంది. ఎలాంటి మలుపు లేకుండా ఊహకు తగ్గట్లు సాఫీగా, బోరింగ్‌గా సాగిపోతుంది. క్లైమాక్స్‌ సైతం అంచనాలకు తగ్గట్లు ఉన్నా ప్రకాశ్‌ రాజ్‌ ఎంట్రీ, అతడు చెప్పే డైలాగ్స్‌ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కథ, కథనంలో వైవిధ్యం చూపడంలో దర్శకుడు రామ్‌ భీమన పూర్తిగా విఫలమయ్యాడు. సాంకేతికంగా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే గోపి సుందర్‌ అందించిన సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పీజీ విందా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని తన కెమెరా పనితనంతో చక్కగా చూపించారు. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ రాజ్‌తరుణ్‌ నటనఫస్టాఫ్‌లోని కొన్ని సీన్స్‌హీరో-హీరోయిన్‌ కెమెస్ట్రీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఊహకందేలా సాగే కథనంట్విస్టులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    జూలై 27 , 2024
    <strong>RGV Comments On SSMB29: మహేష్‌ - రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్‌.. ఫుల్‌ జోష్‌లో ఫ్యాన్స్‌!&nbsp;</strong>
    RGV Comments On SSMB29: మహేష్‌ - రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్‌.. ఫుల్‌ జోష్‌లో ఫ్యాన్స్‌!&nbsp;
    దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli), మహేష్‌ బాబు (Mahesh Babu) కాంబోలో రానున్న చిత్రం కోసం యావత్‌ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మహేష్‌ ఫ్యాన్స్‌, సగటు సినీ అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ ప్రాజెక్ట్ కోసం నిరీక్షిస్తున్నారు. అయితే తరుచూ వివాదాలతో సావాసం చేసే డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ ‘SSMB29’పై క్రేజీ కామెంట్స్‌ చేశారు. ఎప్పుడు లేనిది రిలీజ్‌ ముందే ఈ సినిమాను ఆకాశానికి ఎత్తారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఇంతకీ వర్మ ఏమన్నారో ఈ కథనంలో చూద్దాం.&nbsp; 'బాప్‌ ఆఫ్‌ ఆల్‌' దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గత కొన్నేళ్లుగా సంచలనాలకు మారు పేరుగా మారిపోయారు. అతడు ఏం మాట్లాడిన, సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టినా ప్రతీది సెన్సేషన్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఆర్జీవీ, మహేష్‌ - రాజమౌళి చిత్రంపై ప్రశంసలు కురిపించారు. 'SSMB29' కచ్చితంగా 'బాప్‌ ఆఫ్‌ ఆల్‌' అవుతుందని వ్యాఖ్యానించారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) తర్వాత మహేష్‌ చిత్రం కోసం రాజమౌళి చాలా వర్క్‌ చేశారని గుర్తుచేశారు. డెఫినెట్‌గా ఊహలకు అందని రేంజ్‌లో ఈ చిత్రం ఉంటుందని సాలిడ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మహేష్‌ ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. దీంతో వర్మ కామెంట్స్‌ నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి.&nbsp; https://twitter.com/i/status/1815971837337297111 రాజమౌళి కంటే నాదే లగ్జరీ లైఫ్: ఆర్జీవీ దర్శకధీరుడు రాజమౌళి పైనా రామ్‌ గోపాల్‌ వర్మ ప్రశంసలు కురిపించారు. బాహుబలి కలెక్షన్స్‌ని బాలీవుడ్‌ సినిమాలు కూడా కలెక్ట్‌ చేయలేవని వ్యాఖ్యానించారు. ‘రాజమౌళి సక్సెస్ తెలుగు సినిమాది కాదు. ఇది కేవలం రాజమౌళిదే. రాజమౌళి ఎక్కడ పుట్టినా ఇలాగే సినిమాలు తీసేవాడేమో. RRRలో యాక్షన్ సీక్వెన్స్ లు చాలా యూనిక్ గా ఉంటాయి. RRR వల్లే ఇండియన్ సినిమా గురించి చాలా దేశాలకి తెలిసింది. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా రాజమౌళి గొప్పగా చెప్పుకోడు. రాజమౌళి కంటే నాదే లగ్జరీ లైఫ్' అటు ఆర్జీవీ కామెంట్స్ చేశారు. హార్దిక్‌ పాండ్యా డివోర్స్‌పై.. ఇటీవల హార్ధిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇటీవల తనదైన శైలిలో స్పందించారు. 'పెళ్ళీలు నరకంలో నిర్ణయించబడితే, విడాకులు స్వర్గంలో నిర్ణయించబడతాయి. వివాహం చేసుకోవడం కంటే జీతం తీసుకునే ఓ నర్స్‌ను నియమించుకోవడం బెటర్. ప్రస్తుతం రోజు రోజుకు విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవి చూసి పేద ప్రజలు డబ్బు ఖర్చు చేయడం మూర్ఖత్వమే. ప్రేమ గుడ్డివారిని చేస్తే పెళ్లి కళ్లు తెరిపిస్తుంది' అంటూ ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు. ఇవి కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.&nbsp; https://twitter.com/RGVzoomin/status/1814612480649535830 https://twitter.com/RGVzoomin/status/1814614163593044241 https://twitter.com/RGVzoomin/status/1814615965612863618 సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి! 'SSMB29'కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపుగా పూర్తి కావొస్తున్నట్లు సమాచారం. మిగిలిన కాస్త వర్క్‌ను కూడా ఫినిష్‌ చేసుకొని సెప్టెంబర్‌లో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇందులో మహేష్‌ ద్విపాత్రిభినయం చేస్తున్నట్లు ఇటీవల నెట్టింట ప్రచారం జరిగింది. ఇందులో ఒకటి నెగిటివ్‌ షేడ్స్ ఉంటుందని గాసిప్స్‌ వినిపించాయి. మహేష్‌ ఇప్పటివరకూ 28 చిత్రాల్లో నటించగా ఎందులోనూ డబల్‌ రోల్‌, నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర చేయలేదు. దీంతో ఈ అప్‌డేట్‌ మహేష్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకర్షించింది. మరి ఇందులో వాస్తవం ఎంతో రాజమౌళి టీమ్‌ తెలియజేయాల్సి ఉంది.&nbsp;
    జూలై 24 , 2024
    <strong>Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్‌’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!&nbsp;</strong>
    Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్‌’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!&nbsp;
    ఒకే తరహా చిత్రాలను చూడాలంటే ఎంతటి సినిమా లవర్స్‌కైనా బోర్‌ కొట్టక మానదు. దీనిని గమనించిన కొందరు దర్శక నిర్మాతలు.. క్రేజీ కాన్సెప్ట్‌తో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించారు. వైవిధ్యమైన కథ, కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ చిత్రాలు ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్నాయి. విభిన్న తరహా చిత్రాలు చూడాలని కోరుకునేవారు వీటిని ఎంచక్కా వీక్షించవచ్చు. ఇవి మీకు తప్పనిసరిగా కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌ ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అహం రీబూట్‌ (Aham Reboot) సుమంత్‌ హీరోగా రూపొందిన లేటెస్ట్‌ చిత్రం అహం రీబూట్‌'. జూన్‌ 30 నుంచి ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీకి ప్రశాంత్ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో సుమత్‌ పాత్ర ఒక్కటే స్క్రీన్‌పై కనిపిస్తాయి. మిగత పాత్రలు కేవలం వినిపిస్తాయి అంతే. ఈ మూవీ స్ట్రీమింగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తున్నట్లు ఆహా వర్గాలు తెలిపాయి. ప్లాట్‌ ఏంటంటే.. ఆర్జే నిలయ్‌ (సుమంత్‌) స్టూడియోలో ఉండగా ఒక అమ్మాయి నుంచి కాల్‌ వస్తుంది. ఎవరో కిడ్నాప్‌ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్‌ అని భావించిన నిలయ్‌.. ఆమె మాటలకు కన్విన్స్‌ అవుతాడు. ఎలాగైన కాపాడాని అనుకుంటాడు. మరోవైపు ఆమెను రక్షించేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగుతారు. ఇంతకీ కిడ్నాపైన యువతి ఎవరు? ఆమెకు నిలయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ వేదిక : ఆహా 105 మినిట్స్‌ (105 Minuttess) ‘అహం రీబూట్‌’ తరహాలోనే రీసెంట్‌గా ఓ లేడీ ఒరియెంటేడ్‌ చిత్రం వచ్చింది. సింగిల్‌ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ‘105 మినిట్స్‌’ (105 Minuttess) సినిమాలో హీరోయిన్‌ హన్సిక (Hansika) నటించారు. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తికావడం విశేషం. ఈ సినిమా ప్లాట్‌ ఏంటంటే.. జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులకు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ఆరంభం (Aarambham) కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌ మోహన్‌ భగత్‌ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరంభం' చిత్రం కూడా ప్రయోగాత్మక కథతో రూపొందింది. ‘డెజావు’ అనే డిఫరెంట్‌ కాన్సెప్టుతో దర్శకుడు అజయ్‌ నాగ్‌ ఈ సినిమా తెరకెక్కించారు. జైల్లో శిక్ష అనుభవించే ఖైదీ ఉన్నట్టుండి మాయమవుతాడు. సెల్‌కు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచకుండా, గోడలు పగలగొట్టకుండా సునాయాసంగా అతడెలా తప్పించుకున్నాడు? అనేది ఆసక్తికరం. ఈ మూవీలో సుప్రితా సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, లక్ష్మణ్‌ మీసాల, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్లాట్‌ విషయానికి వస్తే.. ‘మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్‌ ‌అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్‌ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : ఈటీవీ విన్‌ లవ్‌ మీ (Love Me) ఆశిష్‌ (Ashish Reddy), వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో అరుణ్‌ భీమవరపు తెరకెక్కించిన చిత్రం 'లవ్‌ మీ'. ఈ మూవీ కూడా వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ఒక యువకుడు దెయ్యంతో ప్రేమలో పడితే&nbsp; ఎలా ఉంటుంది? ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా జయాపజయాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మూవీకి కచ్చితంగా ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌లో అందిస్తుంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ప్రాజెక్ట్‌ జెడ్‌ (Project Z) సందీప్ కిష‌న్‌ (Sundeep Kishan), లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హీరో హీరోయిన్లుగా న‌టించిన 'ప్రాజెక్ట్ జెడ్' మూవీ.. ఇప్పటివరకూ చూడని స్టోరీ లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషికి చావు అనేది లేకుంటే ఎలా ఉంటుంది? ఆనే కాన్సెప్ట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. ఇదంతా సీరియల్‌ కిల్లర్‌ పని పోలీసు డిపార్ట్‌మెంట్‌కు తెలుస్తోంది. దీంతో పోలీసు ఆఫీసర్‌ కుమార్‌ (సందీప్‌ కిషన్‌) రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. ఓ సైంటిస్టు ఇవన్ని చేస్తున్నట్లు గ్రహిస్తారు? ఇంతకీ ఆ సైంటిస్టు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతడు చేసిన ప్రయోగం ఏంటి? కుమార్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : ఆహా ప్రసన్న వదనం (Prasanna Vadanam) సుహాస్‌ (Suhas) రీసెంట్‌ చిత్రం 'ప్రసన్న వదనం'.. ఓ ప్రయోగాత్మక మూవీగా చెప్పవచ్చు. ఇందులో హీరో ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే స‌మ‌స్య బారిన పడతాడు. ఎవరి ముఖాన్ని, వాయిస్‌నూ గుర్తుపట్టలేకపోతాడు. దీని వల్ల అతడు ఫేస్‌ చేసిన సమస్యలు ఏంటి? అన్నది కాన్సెప్ట్‌. ఇందులో పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. మూవీ కథ ఏంటంటే.. రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ. భ్రమయుగం (Bramayugam) మలయాళ చిత్ర పరిశ్రమ ప్రయోగాలకు పెట్టింది పేరు. అక్కడి స్టార్‌ హీరో మమ్ముట్టి (Mammootty) నటించిన ‘భ్రమయుగం’ (Bramayugam) కూడా ఇప్పటివరకూ చూడని కాన్సెప్ట్‌తో రూపొందింది.&nbsp;డిజిటల్‌ యుగంలోనూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్నితెరకెక్కించారు. ఈ సినిమా మెుత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కథ ఏంటంటే.. ‘తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్ముట్టి (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : సోనీ లివ్‌
    జూలై 03 , 2024
    Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్‌ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
    Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్‌ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
    నటీనటులు: రామ్ పొత్తినేని, శ్రీలీల, శ్రీకాంత్, ప్రిన్స్, ఇంద్రజ, సాయిమంజ్రేకర్, శరత్ లోహితాశ్వ నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి డైరెక్టర్: బోయపాటి శ్రీను సంగీతం: ఎస్‌ఎస్ తమన్ ఎడిటింగ్: తమ్మిరాజు సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది.&nbsp; ఇస్మార్ట్ శంకర్ తర్వాత&nbsp; వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న రామ్‌..ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? అఖండాతో భారీ విజయాన్ని నమోదు చేసిన బోయపాటి మరోసారి తన మాస్ మార్క్‌ను చూపించాడా? ఇంతకు సినిమా ఎలా ఉంది? సినిమాలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం. కథ స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది. క్లైమాక్స్ ఏంటీ? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని ఇప్పటివరకు అభిమానులు చూడని మాస్‌ అవతార్‌లో కనిపించడం బాగుంది. సినిమాలో ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్, హీరోయిన్‌తో కామెడీ ట్రాక్ రొమాన్స్ ఉంటుంది. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోయింది.&nbsp; అప్పటి వరకు సాదాసీదగా నడిచిన సినిమా ఆ తర్వాత నుంచి సినిమా హైప్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి. కొన్ని సీన్లు కంటతడిపెట్టిస్తాయి. రామ్ చెప్పే మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. 'ఇయ్యాలే పొయ్యాలే... గట్టిగా అరిస్తే తొయ్యాలే... అడ్డం వస్తే లేపాలే, దెబ్బతాకితే సౌండ్ గొల్కొండ దాటలే' వంటి డైలాగ్స్ ఊపు తెప్పిస్తాయి. ఇక సాంగ్స్‌లో రామ్- శ్రీలీల ఇద్దరు పోటీ పడి మరి స్టెప్పులతో ఇరగదీశారు. నీ చుట్టు సాంగ్, కల్ట్ మామ పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది.&nbsp; ఎవరెలా చేశారంటే? ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కంప్లీట్ మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సినిమా మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రామ్‌ను బోయపాటి బాగా చూపించారు. రెండు విభిన్న పాత్రల్లో రామ్ మెప్పించాడు.&nbsp; మాస్ డైలాగ్స్ థియేటర్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రామ్ పక్కన శ్రీలీల జోడీ బాగుంది. తన అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌తో అదరగొట్టింది. మరో హీరోయిన్ సాయీ మంజ్రేకర్ సైతం ఆకట్టుకుంది. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ బాలకృష్ణతో అఖండ విజయం తర్వాత బోయపాటి మరోసారి తన యాక్షన్ మార్క్‌ను చూపించాడు. లవ్లీ బాయ్ రామ్‌ను పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇంటెన్సివ్ యాక్షన్ సీన్లు ప్రేక్షకుల ఊహకు మించి ఉంటాయి. పస్టాఫ్‌ను కామెడీ లవ్‌ ట్రాక్‌తో నడిపిన బోయపాటి... సెకండాఫ్‌ నుంచి కథలో సీరియస్ నెస్‌ తీసుకొచ్చి స్టోరీకి ప్రేక్షకున్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఓ నార్మల్ ఫ్యామిలీ స్టోరీకి మాస్ ఎలిమెంట్స్ జోడించి కమర్షియల్ సినిమాగా బోయపాటి మార్చేశాడు.&nbsp; టెక్నికల్‌ పరంగా సాంకేతికంగా , నిర్మాణ విలువల పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. థమన్ అందించిన BGM బాగుంది. సాంగ్స్ పర్వాలేదు. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోతుంది.&nbsp; సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ప్రేక్షకులకు మాస్ మీల్స్‌ను అందించడంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదని తెలుస్తోంది.&nbsp; బలం బోయపాటి మార్క్ డైరెక్షన్ రామ్ మాస్ యాక్టింగ్ శ్రీలీల అందం&nbsp; థమన్ BGM బలహీతనలు అవసరానికి మించిన కొన్ని యాక్షన్ సీన్లు చివరగా: &nbsp;మాస్ మీల్స్ కోరుకునే ప్రేక్షకులకు ఊహకు మించిన ట్రీట్ అందిస్తుంది స్కంద. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. రేటింగ్ 4/5
    సెప్టెంబర్ 28 , 2023
    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
    లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. అందుకే ఈ జానర్‌లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే, చాలా సినిమా కథల్లో ప్రేమకు శుభం కార్డు పడుతుంది. కానీ, కొన్ని కథలు విషాదాంతం అవుతాయి. ప్రేమికుడు చనిపోవడమో, ప్రేయసి చనిపోవడమో లేదా ప్రేమను త్యాగం చేయడమో వంటివి జరుగుతుంటాయి. వాస్తవానికి కాస్త దగ్గరగా ఉండే సినిమా ప్రేమ కథలు తెలుగులో చాలా తక్కువగానే వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘బేబీ’ మూవీ సైతం విషాదాంతం అవుతుంది. మరి, గుండెల్ని పిండేసిన ప్రేమ కథా చిత్రాలేంటో తెలుసుకుందామా.&nbsp; 7/G బృందావన కాలనీ లవ్ స్టోరీ అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది ఈ సినిమానే. ఎన్ని ప్రేమ కథా చిత్రాలు వచ్చినా ఈ మూవీకి ఉండే ప్రాధాన్యత వేరు. ఒక అమ్మాయిని అబ్బాయి ఇంత గాఢంగా ప్రేమించగలడా? అనే ఆశ్చర్యం కలగక మానదు. 2004లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల మన్ననను పొందుతోంది.&nbsp; ప్రేయసి రావే ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రేమ కోసం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చంటారు. మరి, ప్రేమనే త్యాగం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు. శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. నాడు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.&nbsp; మహర్షి ఈ సినిమా గురించి నేటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. 1987లో వచ్చిందీ సినిమా. ఇది కూడా ఓ అమర ప్రేమికుడి కథే. ప్రేమించిన అమ్మాయికి వేరొక అబ్బాయితో పెళ్లయితే ఉండే బాధ వేరు. అనుక్షణం తననే తలుచుకుంటూ, తనను ఒక్కసారైనా చూడాలనే తపన కంటతడి పెట్టిస్తుంది. ప్రియురాలి మెప్పు పొందేందుకు చివరికి తన ప్రాణాలనే అర్పించే త్యాగధనుడు ప్రేమికుడు. నేటి యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. అభినందన లవ్ ఫెయిల్యూర్ సినిమాల్లో ముందు వరుసలో ఉంటుందీ ‘అభినందన’. ప్రతి భగ్న ప్రేమికుడు ఇందులోని పాటలు పాడుకుంటాడు. ప్రతి విరహ ప్రేమికుడు తనను తాను హీరో పాత్రలో ఊహించుకుంటాడు. ఇప్పటికీ ఈ సినిమాల్లోని పాటలను ఎంతోమంది వింటారు. 1987లో సినిమా విడుదలైంది. ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం’ అనే పాట ఈ సినిమాలోనిదే.&nbsp;&nbsp; ఓయ్ మనసు ఇచ్చిన అమ్మాయి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఊహకు తెలియని ఒంటరితనం దరిచేరుతుంది. అలాంటి ఓ సినిమానే ఇది. మంచి ఫీల్‌ని ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి గురించి ఓ యువకుడు పడే తపన ఇందులో కనిపిస్తుంది. తనకే ఇలా ఎందుకు అవ్వాలన్న జాలి కలుగుతుంది. 2009లో ఈ మూవీ రిలీజ్ అయింది. సుస్వాగతం జీవితంపై దృష్టి పెట్టాల్సిన వయసులో ప్రేమ పేరుతో జగాన్ని మర్చిపోతే మిగిలేది శూన్యం. ఈ విషయాన్ని సుస్వాగతం మూవీ ప్రస్ఫుటిస్తుంది. ఇల్లు, కుటుంబం, భవిష్యత్‌ని లెక్క చేయకుండా ఓ అమ్మాయి వెంట తిరగడం సరికాదనే సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ప్రేమ ఒక భాగమే. కానీ, ప్రేమే జీవితం కాదనే విషయం సినిమా చూశాక బోధపడుతుంది. నేటి తరం యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. ప్రేమిస్తే ప్రేమించడం ఈజీ. కానీ, ఎదుటి వ్యక్తి ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సినిమా గుర్తుండిపోవడానికి కూడా ఇదే కారణం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను కన్నవారే నమ్మించి మోసం చేస్తే పిచ్చోడైపోయే అబ్బాయి కథ ఇది. ప్రేమికుడి దుస్థితికి తనే కారణమని విలపించే ప్రియురాలి స్వచ్ఛమైన ప్రేమకు చప్పట్లు కొట్టాల్సిందే. ఈ కథ కల్పించింది కాదు. నిజంగా జరిగింది. ఎన్నో భాషల్లో రీమేక్ అయింది.&nbsp;
    ఆగస్టు 14 , 2023
    Vimanam Movie Review: తండ్రి, కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా.. ప్రేక్షకుడిని కదిలించే ‘విమానం’&nbsp;
    Vimanam Movie Review: తండ్రి, కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా.. ప్రేక్షకుడిని కదిలించే ‘విమానం’&nbsp;
    నటీనటులు : సముద్రఖని, ధృవన్ వర్మ, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ,ధన్ రాజ్ తదితరులు.. దర్శకత్వం: శివప్రసాద్ యానాల సినిమాటోగ్రఫీ: వివేక్ కలేపు సంగీతం: చరణ్ అర్జున్ నిర్మాత : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నటుడిగా, దర్శకుడిగా చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సముద్రఖని. తెలుగు సినిమాల్లో విలన్‌గా మెప్పిస్తూనే మెగా ఫోన్ పట్టుకుని ఏకంగా పవన్ కళ్యాణ్‌తో సినిమా తీస్తున్నాడు. ఈ క్రమంలో పాజిటివ్ రోల్‌లో సముద్రఖని ప్రధానపాత్ర దారుగా వచ్చిన చిత్రం ‘విమానం’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి, ఈ ‘విమానం’ థియేటర్‌లో ప్రేక్షకుడిని ఆకాశానికి తీసుకెళ్లిందా? టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు సన్నివేశాలు మెప్పించాయా? అనే విషయాలను రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి? ప్రచార చిత్రాలతోనే సినిమా కథేంటో తెలిసిపోయింది. ఓ పేదింటి కుర్రాడు రాజు(మాస్టర్ ధ్రువ్)కి విమానం అంటే ఎంతో ఇష్టం. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాలని ఆశపడుతుంటాడు. తండ్రి వీరయ్య(సముద్రఖని) వికలాంగుడు. తల్లి లేకున్నా రాజుకి ఏ లోటు రాకుండా పెంచాలని పరితపిస్తుంటాడు. వంశ పారం పర్యంగా వచ్చిన సులభ్ కాంప్లెన్స్‌ని నడుపుకొంటూ జీవనాన్ని సాగిస్తాడు వీరయ్య. ఎప్పుడు విమానం గురించి అడిగినా చదువుకుంటే విమానం ఎక్కొచ్చని చెబుతూ కొడుకుని వీరయ్య ఎంకరేజ్ చేస్తాడు. ఈ క్రమంలో కొడుక్కి ఓ ప్రాణాంతక వ్యాధి ఉందనే చేదు నిజాన్ని వీరయ్య తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే పుత్రుడి కోరిక తీర్చాలని వీరయ్య ఒక్కో పైసా పోగు చేస్తాడు. కానీ, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక్కో ఘటనతో తన ప్రయత్నానికి వీరయ్య మరింత దూరం అవుతుంటాడు. మరి చివరికి ఎలా విమానం ఎక్కించాడని తెరపై చూడాల్సిందే.&nbsp; ఎలా ఉంది? ఇలాంటి సినిమాలకు కథనం, సంభాషణలు, నటీనటుల ప్రదర్శన చాలా ముఖ్యం. ఈ సినిమా వీటిని భర్తీ చేస్తుంది. బస్తీలో ఉండే వాతావరణం, నిరుపేద కుటుంబ పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపించారు. చూసేటప్పుడు ఇది మన కథే, పక్కింటి వారి కథే అన్న భావన కలుగుతుంది. మొత్తానికి తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని తెరపై చూపిస్తుంది. ఇంటర్వెల్, సెకండాఫ్‌, క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి.&nbsp; ఎవరెలా చేశారు? వికలాంగ తండ్రిగా సముద్రఖని జీవించేశాడు. కొడుకు కలను నెరవేర్చాలన్న తపన ఓ వైపు, కలకాలం తనతో ఉండబోడన్న వేదన మరోవైపు.. ఇలా గుండెను భారంగా చేసుకుని బతుకీడుస్తున్న వ్యక్తిగా సముద్రఖని ప్రేక్షకులను మెప్పించాడు. తనలోని నటుడిని వెలికి తీశాడు. ఇక రాజు పాత్రలో మాస్టర్ ధ్రువన్ ఆకట్టుకున్నాడు. చిన్న పిల్లలకు ఉండే అమాయకత్వం, నిజాయితీ, ఆశలు, కోరికలను చక్కగా చూపించగలిగాడు. వేశ్య అయిన సుమతి పాత్రలో అనసూయ ఫర్వాలేదనిపించింది. తన ప్రేమ కోసం పరితపించే కోటిగా రాహుల్ రామకృష్ణ మెప్పించాడు. వీరిద్దరి ప్రేమాయణం చివరికి కంటతడి పెట్టిస్తుంది. ఎయిర్ హోస్టెస్ పాత్రలో అలనాటి హీరోయిన్ మీరా జాస్మిన్ తళుక్కుమంది. ఆటో డ్రైవర్‌గా ధన్‌రాజ్ పరిధి మేరకు నటించాడు.&nbsp; టెక్నికల్‌గా తెలిసిన కథను హృదయాలకు హత్తుకునేలా తీయడంలో డైరెక్టర్ శివప్రసాద్ యానాల సక్సెస్ అయ్యాడు. నిరుపేద కుటుంబంలో ఉండే పరిస్థితులను చక్కగా చూపించాడు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని భావోద్వేగంగా చిత్రీకరించి ప్రేక్షకులను మెప్పించాడు. కోటీ, సుమతి మధ్య సన్నివేశాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. అయితే, కథలో పాత్రలను పరిచయం చేయడానికి కాస్త సమయం తీసుకున్నాడు. సెకండాఫ్‌లో హీరోకి ఎదురయ్యే కష్టాలను కాస్త సినిమాటిక్‌గా చూపించాడు. ముఖ్యంగా, తెలుగులో డైలాగ్స్ అందించిన హను రావూరి తన కలానికి పనిచెప్పాడు. సందర్భానుసారంగా వచ్చే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇక, చరణ్ అర్జున్ సంగీతం ఆకట్టుకుంటుంది. వివేక్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ప్లస్ పాయింట్స్ నటీనటులు&nbsp; భావోద్వేగ సన్నివేశాలు క్లైమాక్స్ సీన్స్ మైనస్ పాయింట్స్ ఊహకు అందే కథ, కథనం చివరగా.. ప్రేక్షకుడిని భావోద్వేగాలనే ఎయిర్‌పోర్టుకి తీసుకెళ్లేదే ‘విమానం’. రేటింగ్: 3.25/5
    జూన్ 09 , 2023
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.&nbsp; ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో&nbsp; ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు&nbsp; ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్&nbsp; ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి&nbsp; శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్&nbsp; నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక&nbsp; కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి&nbsp; మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&nbsp; ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్&nbsp; పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ&nbsp; సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:&nbsp; హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.&nbsp; సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి&nbsp; జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా&nbsp; బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం&nbsp; దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-&nbsp; యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.&nbsp; ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-&nbsp; జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు&nbsp; రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.&nbsp; ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.&nbsp; మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో&nbsp; ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి&nbsp; దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,&nbsp; కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి&nbsp; రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.&nbsp; ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ &nbsp;ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని&nbsp; ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా&nbsp; దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.&nbsp; మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.&nbsp; ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
    Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్‌ బేబీ, విరాజ్‌ అశ్విన్‌, శ్రుతిహాసన్‌ తదితరులు రచన, దర్శకత్వం: శౌర్యువ్ సంగీతం: హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌ నిర్మాత: మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్‌. నిర్మాణ సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ విడుదల: 07-12-2023 ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేకుండా స్వయం కృషితో పైకొచ్చిన ఈ జనరేషన్‌ హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటారు. ఇమేజ్‌, ట్రెండ్ అంటూ లెక్క‌లేసుకోకుండా సినిమాలు చేస్తుండటం నాని ప్రత్యేకతగా చెప్పవచ్చు. దసరా సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని.. ప్రస్తుతం ‘హాయ్‌ నాన్న’ చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శౌర్యువ్ అనే ద‌ర్శ‌కుడిని ఈ సినిమాతో&nbsp; ప‌రిచ‌యం చేశారు. విడుద‌ల‌కి ముందే&nbsp; నాని - మృణాల్ జోడీ, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాలను పంచాయా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ విరాజ్ (నాని) ముంబైలో ఓ ఫ్యాష‌న్ ఫొటోగ్రాఫ‌ర్‌. తన కూతురు మహి(కియారా) అంటే అతడికి ప్రాణం. కూతురికి సరదాగా కథలు చెప్తుంటాడు విరాజ్‌. ఆ కథల్లో హీరోగా నాన్ననే ఊహించుకుంటూ ఉంటుంది మహి. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటే విరాజ్‌ చెప్పడు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి మహిని యష్న (మృణాల్‌ ఠాకూర్‌) కాపాడుతుంది. వారిద్దరు కాఫీ షాపులో ఉండగా పాపను వెత్తుకుంటూ విరాజ్‌ ‌అక్కడకు వస్తాడు. అక్కడే మహికి అమ్మ కథ చెప్తాడు విరాజ్‌. ఇంతకి ఆ కథలో ఏముంది? వర్ష పాత్ర ఎవరిది? యష్నకీ, మ‌హి త‌ల్లికీ సంబంధం ఏమిటి? యష్న.. విరాజ్‌ని ఎలా ప్రేమించింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే నాని (Hero Nani) మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ప్రేక్షకుల హృద‌యాల్ని బ‌రువెక్కించాడు. చిన్నారితో క‌లిసి ఆయ‌న పండించిన భావోద్వేగాలు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ముఖ్యంగా కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనే తపన, బాధ, దు:ఖాన్ని నాని కళ్లలోనే చూపించాడు. నాని, మృణాల్ ఠాకూర్ జోడీ బాగుంది. ఇద్ద‌రూ చాలా బాగా న‌టించి పాత్రలకు ప్రాణం పోశారు. ప్రేమ స‌న్నివేశాలు, ప్రీ క్లైమాక్స్‌లోనూ మృణాల్ నానితో పోటీపడి మరి నటించింది. త‌న అభిన‌యంతో క‌ట్టిప‌డేసింది. బేబి కియారా ముద్దు ముద్దుగా క‌నిపిస్తూ కంటత‌డి పెట్టించింది. ప్రియ‌ద‌ర్శి, అంగ‌ద్ బేది, జ‌య‌రామ్, విరాజ్ అశ్విన్ త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడిగా శౌర్యువ్‌కి ఇది తొలి చిత్రమే అయిన ఎంతో అనుభవం ఉన్నట్లు సినిమాను తెరకెక్కించారు. కథ చెప్పడంలో ఎక్కడా కన్ఫ్యూజ్ కాలేదు. అసభ్యతకి తావు ఇవ్వకుండా అక్కర్లేని రొమాన్స్, హింసల్ని జనానికి ఎక్కించకుండా కథని నీట్‌గా ప్రజెంట్ చేశారు. అయితే కొన్ని స్పూన్ ఫీడింగ్ సీన్ల వల్ల కథ సాగిదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్లో నెరేషన్‌ కూడా కాస్త మైనస్‌ అని చెప్పవచ్చు. అయితే సినిమాకు అవసరమైన భావోద్వేగాలను పండించడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. అనూహ్య మలుపులతో ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విజయం సాధించారు. కుటుంబ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ‘హాయ్‌ నాన్న’లో పుష్కలంగా ఉన్నాయి. సాంకేతికంగా.. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. క‌థ‌కి త‌గ్గ స‌న్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది.&nbsp; సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ మూవీకి ప్లస్ అయ్యింది. నానిని కొత్తగా చూపించారు. హీరోయిన్‌ని రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో డిఫరెంట్‌గా చూపించారు. ముంబై, గోవా లొకేషన్స్‌ని అందంగా మలిచారు. అటు హేష‌మ్ ఇచ్చిన సంగీతం ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటుంది. సమయమా సాంగ్‌ సినిమా మొత్తం ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, కూర్పు సరిగ్గా కుదిరాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ నాని, మృణాల్‌, కియారా నటనభావోద్వేగాలు, మలుపులుసంగీతం&nbsp; మైనస్‌ పాయింట్స్‌ ఊహకు అందే కథసాగదీత సీన్లు రేటింగ్‌: 3/5
    డిసెంబర్ 07 , 2023
    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
    తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ ఇలియానా. నడుము వయ్యారాలతో యువతను ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హీరోయిన్‌ హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఇలియానా తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే… ఇల్లి బేబి భర్తతో విడిపోయి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. కానీ, ఇప్పుడు తల్లిని కాబోతున్నానంటూ అందరికీ షాకిచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) తల్లి కాబోతుంది గోవా బ్యూటీ ఇలియానా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చిన్నారి టీషర్ట్‌ని, తన మెడలోని ‘మామా’ అంటూ ఉన్న ఫోటోలను షేర్‌ చేసినా హీరోయిన్… “లిటిల్ డార్లింగ్ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో త్వరలోనే ఈ సుందరి గుడ్‌ న్యూస్‌ చెబుతుందని అందరూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) ఇలియానా జీవితం కెరీర్‌ పీక్ దశలో ఉండగానే ఇలియానా సినిమాలకు దూరం అయ్యింది. కొద్ది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలే విడిపోవడానికి కారణం. &nbsp; ఆమె సోదరుడితో డేటింగ్ ఆండ్రూతో విడిపోయిన తర్వాత ఇలియానా మరో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ప్రేమలో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని ఇల్లీ బేబి అధికారికంగా ధ్రువీకరించలేదు. స్పందించడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఈ క్రమంలో వార్తలు నిజేమనని అనుమానాలు చాలామందిలో కలిగాయి.&nbsp; తండ్రి ఎవరు?&nbsp; ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టి ఒక్కసారిగా షాకిచ్చింది ఇలియానా. భర్తతో విడిపోయి మూడేళ్ల తర్వాత ఇలా&nbsp; ప్రకటించడంతో.. తండ్రి ఎవరంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. బిడ్డకు తండ్రి ఎవరో ఇలియానాకు తెలుసని.. ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.&nbsp; పరిచయం చేస్తుందా? బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రేమికుడిని ఇలియానా పరిచయం చేసే ఛాన్స్ ఉందనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. అటు సరోగసి లేదా దత్తత తీసుకోవటం ద్వారా ఆమె తల్లి అవుతుందేమో అని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇలియానా జీవిత భాగస్వామి ఎవరనేది సస్పెన్స్‌. దీనికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి. టాప్ హీరోయిన్ దేవదాసు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కొద్ది రోజుల్లోనే గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా హిట్‌తో ఏకంగా మహేశ్ సరసన పోకిరి చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి అగ్రహీరోలతో నటించి హిట్లు అందుకుంది. అల్లు అర్జున్‌తో జులాయి తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ఈ భామ…. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కనిపించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం… ఇలియానా బొద్దుగా మారటంతో ఆఫర్లు తగ్గిపోయాయి.&nbsp;
    ఏప్రిల్ 18 , 2023
    <strong>Mega Multi Starrer Movie: చిరు, పవన్‌, చరణ్‌ కాంబోలో మల్టీస్టారర్‌.. డైరెక్టర్‌ హారీష్‌ శంకర్‌ బిగ్‌ ప్లాన్‌!</strong>
    Mega Multi Starrer Movie: చిరు, పవన్‌, చరణ్‌ కాంబోలో మల్టీస్టారర్‌.. డైరెక్టర్‌ హారీష్‌ శంకర్‌ బిగ్‌ ప్లాన్‌!
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న కుటుంబాల్లో 'మెగా ఫ్యామిలీ' (Mega Family) ఒకటి. మెగాస్టార్‌ చిరంజీవి ఈ ఫ్యామిలీకి మూల పురుషుడు కాగా ఆయన తర్వాత ఎంతో మంది హీరోలు టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అలా వచ్చిన పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), రామ్‌ చరణ్‌ (Ram Charan), అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా అది టాలీవుడ్‌లో సెన్సేషనే అని చెప్పవచ్చు. అటువంటిది చిరు, పవన్‌, చరణ్‌ కలిసి ఒక మల్టీస్టారర్‌ తీస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే ఎంతో బాగుంది కదూ..! అయితే ఇది త్వరలోనే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ దిశగా డైరెక్టర్ హరీష్ శంకర్‌ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; ‘అదే అతి పెద్ద పాన్‌ ఇండియా’.. మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్‌ (Harish Shankar) ఒకరు. ఆయన పవన్‌ కల్యాణ్‌ భక్తుడిగా తనను తాను ప్రకటించుకున్నారు. అటువంటి హరీశ్‌ శంకర్‌ తన 'మిస్టర్‌ బచ్చన్‌' సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్‌ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'పాన్ ఇండియా కోసం అని కథ రాయలేం. ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమా అని తీయలేదు. 'కాంతార' పాన్ ఇండియా కోసం చేయలేదు. వాళ్ళ మట్టి కథను చెప్పారు. పాన్ ఇండియా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. సహజసిద్ధంగా అలా జరగాలి. కల్యాణ్‌ గారు, రామ్ చరణ్, చిరంజీవి ఈ ముగ్గురి కోసం ఒక లైన్ ఎప్పటి నుంచో వర్కవుట్ చేస్తున్నాను. చేస్తే అన్ని పాన్ ఇండియాల కంటే అదే పాన్ ఇండియా అవుతుంది' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారిపోయింది. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు మెగా ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1817891248398795055 గతంలోనే స్పెషల్‌ క్యామియోలు! మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ గతంలోనే ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. ఇందులో చరణ్‌ ఓ స్పెషల్‌ క్యామియోతో అలరించాడు. అంతకుముందు ‘బ్రూస్‌లీ’ ‘మగధీర’ చిత్రాల్లో కుమారుడి కోసం మెగాస్టార్‌ ఒక చిన్న క్యామియో ఇచ్చారు. మరోవైపు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ సైతం రెండు సినిమాల్లో కలిసి నటించారు. ‘శంకర్‌దాదా MBBS’ మూవీలోని ఓ స్పెషల్ సాంగ్‌లో పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ మెరిశారు. ‌అలాగే ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ సినిమా క్లైమాక్స్‌లోనూ అన్న చిరుతో కలిసి పవన్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. అయితే చిరు, పవన్‌, చరణ్‌ ముగ్గురు కలిసి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా నటించలేదు. క్యామియోలు తప్ప కలిసి ఫుల్‌ లెంగ్త్‌ రోల్స్‌లో నటించలేదు. దీంతో మెగా మల్టీస్టారర్‌ చిత్రం కోసం ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.&nbsp; మెగా ఫ్యామిలీతో అనుబంధం దర్శకుడు హరీష్‌ శంకర్‌కు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. పవన్‌ కల్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీకి వీర విధేయుడన్న పేరు ఈ మాస్‌ డైరెక్టర్‌కు ఉంది. మెగా ఆడియన్స్‌ పల్స్ గురించి హరీష్‌ శంకర్‌కు బాగా తెలుసు. ఆయన ఇప్పటికే నలుగురు మెగా హీరోలతో పని చేశారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో 'గబ్బర్‌ సింగ్‌' (Gabbar Singh), అల్లు అర్జున్‌తో 'దువ్వాడ జగన్నాథం' (Duvvada Jagannadham), వరుణ్‌తేజ్‌తో 'గద్దలకొండ గణేష్‌' (Gaddalakonda Ganesh), సాయి ధరమ్‌ తేజ్‌తో 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' (Subrahmanya For Sale) చిత్రాలు తెరెకెక్కించారు. అందులో మెగా హీరోలను చూపించిన తీరు ఫ్యాన్స్‌ను ఎంతగానో మెప్పించింది. దీంతో అతడి డైరెక్షన్‌లో మల్టీస్టారర్‌ వస్తే ఇక బాక్సాఫీస్‌ బద్దలు కావడం ఖాయమని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయ్యి త్వరలోనే పట్టాలెక్కాలని కోరుకుంటున్నారు.&nbsp; ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ గుర్తుండిపోతుంది’&nbsp; పవన్‌ కల్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబోలో 'ఉస్తాద్ భగత్‌ సింగ్‌' (Ustad Bhagat Singh) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ ఏపీ రాజకీయాల్లో బిజీ అయిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. దీంతో ఆ చిత్రాన్ని పక్కన పెట్టి రవితేజతో 'మిస్టర్‌ బచ్చన్‌' (Mr.Bachchan) సినిమాను సైతం హరీష్‌ శంకర్‌ రూపొందించారు. తాజాగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఉస్తాద్ భగత్‌ సింగ్‌ గురించి హరీష్‌ శంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఆయన వీలును బట్టి సినిమా పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఈ చిత్రం చాలా ఏళ్ల పాటు అభిమానులకు గుర్తుండిపోతుందని భరోసా ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా అంటే ఏది ఆశించి థియేటర్లకు వస్తోరో ఆ అంశాలన్నీ సంపూర్ణంగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో ఉంటాయని చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్‌ మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.&nbsp;
    జూలై 30 , 2024

    @2021 KTree