ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్MXPlayer
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
చిరంజీవి
రాధిక శరత్‌కుమార్
మోహన్ బాబు
గీతా కాదంబీ
గీత - దేవినిర్మలమ్మ
రమాప్రభ - అరుంధతమ్మ
నూతన్ ప్రసాద్
రావు గోపాల్ రావు
రావు గోపాల్ రావుసిబ్బంది
TSBK మౌలీ
దర్శకుడుఅట్లూరి రాధాకృష్ణ మూర్తినిర్మాత
కొమ్మిన నారాయణరావునిర్మాత
సత్యం
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Chiranjeevi and Radhika Sarathkumar Movies List: చిరంజీవి- రాధికను హిట్ పేయిర్‌గా నిలిపిన సినిమాలు ఇవే!
తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి- రాధిక జంటకు సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరు కలిసి 16 చిత్రాల్లో నటించారు. వీటిలో చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిపై ఓలుక్ వేద్దాం.
కిరాయి రౌడీలు(1981)
ఏ. కోదండ రామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మోహన్ బాబు కూడా నటించారు. చిరంజీవి సరసన రాధిక (Chiranjeevi- Radhika Movies) నటించిన తొలి చిత్రమిది.
న్యాయం కావాలి(1981)
డి. రామేశ్వరి నవల కొత్త మలుపు ఆధారంగా ఏ. కోదండరామిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధిక నటించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది.
ఇది పెళ్లంటారా( 1982)
విజయ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. చిరంజీవి సరసన రాధిక హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరితో పాటు గొల్లపూడి మారుతీరావు నటించారు.
పట్నం వచ్చిన పతివ్రతలు(1982)
చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక(Chiranjeevi- Radhika Movies) నటించగా.. మోహన్ బాబు సరసన గీత నటించింది. ఈ సినిమాను మౌళి డైరెక్ట్ చేశారు.
బిల్లా రంగా(1982)
కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటించారు.
యమకింకరుడు(1982)
రాజ్ భరత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధిక నటించింది.
పులి బెబ్బులి(1983)
చిరంజీవి- కృష్ణం రాజు కాంబోలో వచ్చిన ఈ చిత్రం హిట్ అయింది. చిరంజీవి సరసన రాధిక(Chiranjeevi- Radhika Movies), కృష్ణం రాజుకు జోడీగా జయప్రద నటించారు. ఈ చిత్రాన్ని KSR దాస్ డైరెక్ట్ చేశారు.
ప్రేమ పిచ్చోలు (1983)
ఏ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చిరంజీవి జోడీగా రాధిక నటించింది.
పల్లెటూరి మొనగాడు(1983)
చిరంజీవి రాధిక కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్లాప్ అయింది. ఈ సినిమాను SA చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు.
అభిలాష(1983)
ఉరిశిక్షను రద్దు చేయాలన్న ఇతివృత్తంతో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ సినిమాను ఏ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. చిరంజీవి సరసన రాధిక నటించింది.
గూడచారి నెం.1 (1983)
చిరంజీవి- రాధిక నటించిన ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
హీరో (1984)
విజయ బాపినీడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక నటించింది.
జ్వాలా(1985)
చిరంజీవి, రాధిక జంటగా నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాను రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు.
దొంగ మొగుడు(1987)
చిరంజీవి, రాధిక, భానుప్రియ, మాధవి కాంబోలో వచ్చిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రాన్ని ఏ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.
ఆరాధన(1987)
భారతీ రాజా డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన సుహాసిని, రాధిక నటించారు. హీరో రాజశేఖర్ ముఖ్య పాత్రలో నటించారు.
రాజా విక్రమార్క(1990)
చిరంజీవి- రాధిక, అమల కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం చిరంజీవితో రాధిక నటించిన చివరి చిత్రం.
నవంబర్ 09 , 2023
Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.
[toc]
భోళా శంకర్
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు.
గాడ్ ఫాదర్
చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది.
ఖైదీ నంబర్ 150
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
అంజి
చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది.
శంకర్ దాదా జిందాబాద్
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
శంకర్ దాదా M.B.B.S
"మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.
ఠాగూర్
తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు.
మృగరాజు
హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
స్నేహం కోసం
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
హిట్లర్
మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది.
ముగ్గురు మొనగాళ్లు
కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు.
మెకానిక్ అల్లుడు
"శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆజ్ కా గూండా రాజ్
"గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఘరానా మొగుడు
"అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.
పసివాడి ప్రాణం
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
చక్రవర్తి
రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ఆరాధన
భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
దొంగ మొగుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
వేట
ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
రాజా విక్రమార్క
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ప్రతిబంధ్
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
త్రినేత్రుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ఖైదీ నంబర్ 786
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అడవి దొంగ
చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
నాగు
తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.
ఇంటిగుట్టు
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.
దేవాంతకుడు
దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.
హీరో
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు.
‘ఖైదీ’
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది.
అభిలాష
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ప్రేమ పిచ్చోళ్లు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
బంధాలు అనుబంధాలు
‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.
మంచు పల్లకీ
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
యమ కింకరుడు
యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.
పట్నం వచ్చిన పతివ్రతలు
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
చట్టానికి కళ్లులేవు
చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.
47 రోజులు
కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
మొగుడు కావాలి
చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు.
మోసగాడు
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
ప్రేమ తరంగాలు
'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
పున్నమి నాగు
'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
ఇది కథ కాదు
కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు.
మనవూరి పాండవులు
బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
సెప్టెంబర్ 25 , 2024
Telugu hot movies : గత 25 ఏళ్లలో తెలుగులో వచ్చిన అడల్ట్ సినిమాలు, అవి స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లిస్ట్ ఇదే!
రొమాంటిక్, అడల్ట్, బొల్డ్ కంటెంట్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలు యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తాయి. కథలో పెద్దగా లాజిక్‌లు ఏమి లేకుండా కేవలం.. హీరోయిన్ల అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఇస్తుంటాయి. పాత్ర డిమాండ్ చేసినా చేయకపోయినా.. కుదిరితే ముద్దు సీన్లు.. ఇంకాస్తా ముందుకెళ్తే బెడ్ రూం సీన్లు కూడా ప్రస్తుతం సినిమాల్లో సాధారణమై పోయాయి. మరి అలాంటి చిత్రాలు గడిచిన 25 ఏళ్లలో తెలుగులో ఎన్ని వచ్చాయో ఓసారి చూద్దాం.
[toc]
ఎవోల్
రీసెంట్‌గా ఓటీటీలో రిలీజైన ఎవోల్ చిత్రం ట్రెండింగ్‌లో ఉంది. తొలుత ఈ సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. ఈ చిత్రంలోని బొల్డ్ సీన్లకు సెన్సార్ బోర్డు అడ్డు చెప్పడంతో నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే. నిధి అనే యువతి ప్రభుని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే ప్రభు బిజినెస్ పార్ట్నర్ అయిన రిషితో నిధి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఇదే క్రమంలో ప్రభు తన అసిస్టెంట్ దివ్యతో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఓ రోజు దివ్య గురించి చెప్పి విడాకులు అడుగుతాడు. ఇదే సమయంలో నిధి కూడా తనకున్న అఫైర్‌ను బయటపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మరి వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నది మిగతా కథ.
యావరేజ్ స్టూడెంట్ నాని
ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమా హీరో, డైరెక్టర్ పవన్ కొత్తూరి ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఈ చిత్రంలో బొల్డ్ సీన్లు శృతి మించాయని ట్రోల్ చేశారు. సరే, ఇక కథలోకి వెళ్తే..
చదువులో యావరేజ్ స్టూడెంట్ అయిన నాని తన కాలేజ్ సీనియర్ సారాతో ప్రేమలో పడుతాడు. ఆమెతో ఎఫైర్ పెట్టుకుంటాడు. బ్రేకప్ అయిన తర్వాత అనుతో ప్రేమలో పడుతాడు. సారాతో ఎఫైర్ ఉన్నట్లు తెలిసిన అను అతన్ని ఎందుకు ప్రేమించింది? బ్రేకప్ అయిన తర్వాత కూడా నానితో సారా ఎందుకు రిలేషన్ షిప్ కొనసాగించాలనుకున్నది అనేది మిగతా కథ.
https://www.youtube.com/watch?v=xQxqX7fO4Ps
హాట్ స్పాట్
నాలుగు కథల సమాహారంగా హాట్‌స్పాట్ చిత్రం రూపొందింది. నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.
లవ్ మౌళి
2024లో వచ్చిన బొల్డ్ కంటెంట్ సినిమాల్లో లవ్ మౌళి చిత్రం ముందు వరుసలో నిలుస్తుంది. ఈ చిత్రం మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ ఇప్పటికీ విడుదలైది. ఈ సినిమాలోనూ బొల్డ్ సీన్లు పుష్కలంగా ఉన్నాయి. కథ పక్కకు పెడితే అడల్ట్ కంటెంట్ ఇష్టపడేవారిని ఈ చిత్రం ఏమాత్రం డిస్సాపాయింట్ చేయదని చెప్పాలి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.."తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి (నవదీప్) చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. కొన్ని అనుభవాల వల్ల అతడికి ప్రేమపై కూడా నమ్మకం పోతుంది. పెయిటింగ్ వేస్తూ వాటి ద్వారా వచ్చిన డబ్బులతో జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఓ అఘోరా (రానా దగ్గుబాటి) అతడికి మహిమ గల బ్రష్ ఇస్తాడు. ఆ పెయింటింగ్ బ్రష్‌తో తను కోరుకునే లక్షణాలున్న అమ్మాయిని సృష్టించే శక్తి మౌళికి వస్తుంది. ఈ క్రమంలో అతడు వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అతడి ముందు ప్రత్యక్షమవుతుంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వారి ప్రేమ బంధం.. గొడవలు రావడంతో బ్రేకప్ అవుతుంది. మౌళి.. మళ్లీ బ్రష్ పట్టి అమ్మాయి పెయింటింగ్ గీయగా తిరిగి చిత్రనే ముందుకు వస్తుంది. అలా ఎందుకు జరిగింది? మౌళి.. లవ్ బ్రేకప్‌కు కారణమేంటి? ప్రేమకు నిజమైన అర్థాన్ని హీరో ఎలా తెలుకున్నాడు? మౌళి, చిత్ర ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
Mr & Miss
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఏ మాత్రం డిస్సాపాయింట్ చేయదు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. "తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ కావడంతో శశి(జ్ఞ్యానేశ్వరి) ఓ పబ్‌లో అనుకోకుండా శివ(సన్నీ)ని కిస్ చేస్తుంది. అక్కడ మొదలైన వారి బంధం ముందుకు సాగుతుంది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుని శారీరకంగా దగ్గరవుతారు. అయితే కొన్ని కారణాల వల్ల విడిపోయే పరిస్థితి వస్తుంది. సరిగ్గా బ్రేకప్ చెప్పే సమయంలో శివ ఫొన్ మిస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి రిలేషన్ ఏమైంది అనేది మిగతా కథ.
ఏడు చేపలా కదా
ఈ సినిమా తెలుగులో పెద్ద ఎత్తున బజ్ సంపాదించింది. అడల్ట్ మూవీల్లో ఓ రకమైన ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రవి(అభిషేక్ పచ్చిపాల) పగలు ఏ అమ్మాయిని చూసి టెంప్ట్ అవుతాడో.. అదే అమ్మాయి రాత్రి అతనితో శారీరకంగా కలుస్తుంటుంది. ఈక్రమంలో అతను ప్రేమించిన (ఆయేషా సింగ్) కూడా రవికి దగ్గరవుతుంది. దీని వల్ల రవి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు రవిని చూసి వాళ్లెందుకు టెంప్ట్ అవుతున్నారన్నది మిగతా కథ.
RGV’s Climax
తెలుగులో వచ్చిన బొల్డ్ కంటెంట్ సినిమాల్లో ఇదొకటి. మియా మాల్కోవా మరియు ఆమె ప్రియుడు ఎడారి పర్యటనను అనుసరిస్తూ, వారు వేరే ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో వారి పయనం ఎడారిలో ఎటు వైపు సాగిందనేది కథ.
రాజ్
ఈ చిత్రం కూడా అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీ. ఇక ఈ సినిమాలో కూడా రొమాంటిక్ సీన్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇక కథలోకి వెళ్తే.. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన రాజ్ (సుమంత్) తన తండ్రి సన్నిహితుడి కూతురు మైథిలి (ప్రియమణి)తో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లి తేదీ దగ్గర పడుతున్న సమయంలో, అతను మరో అమ్మాయి ప్రియ (విమలా రామన్)తో ప్రేమలో పడుతాడు.పెళ్లిని రద్దు చేయాలని తండ్రిని కోరుతాడు. అయితే ఇంతలో ప్రియ కనిపించకుండా వెళ్లిపోతుంది. దీంతో ప్రియను రాజ్ పెళ్లి చేసుకుంటాడు? ఇంతకు ప్రియ ఎటు వెళ్లింది? మైథిలి, రాజ్ మధ్య కాపురం సజావుగా సాగిందా లేదా అనేది మిగతా కథ.
నేను
మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది.
BA పాస్
బాలీవుడ్‌లో వచ్చిన అత్యంత బోల్డ్ సినిమాల్లో ఒకటిగా BA PAss గుర్తింపు పొందింది. ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే…
ముఖేష్ (షాదబ్ కమల్) అనే ఓ యువకుడి చూట్టూ తిరుగుతుంది. బీఏ డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ముఖేష్ తల్లిదండ్రులు చనిపోతారు. దీంతో అతను ఢిల్లీలో ఉన్న తన మేనత్త ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఉంటాడు. అక్కడ అవమానాలను ఎదుర్కొంటూ చాలీ చాలని డబ్బుతో కాలం నెట్టుకొస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి సారికా(శిల్పా శుక్లా) అనే ఓ పెళ్ళైన మహిళ పరిచయమవుతుంది.ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. ముఖేష్ పరిస్థితి అర్థం చేసుకున్న సారికా అతనికి తనలాగా శారీరక సుఖం కోసం పరితపిస్తున్న పెళ్లైన మహిళలను పరిచయం చేస్తుంది. డబ్బు బాగా చేతికందుతున్న క్రమంలో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ముఖేష్ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏమిటి? ఈ వృత్తిని ముఖేష్ కొనసాగించాడా? మానేశాడా? అనేది మిగతా కథ.
కుమారి 21F
తెలుగులో వచ్చిన బోల్డ్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రాల్లో కుమారి 21F ఒకటి. యూత్‌ను తెగ ఆకర్షించింది ఈ సినిమా. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
సిద్దు(రాజ్ తరుణ్) హోటల్ మెనేజ్‌మెంట్‌లో డిగ్రీ కంప్లీట్ చేసి చెఫ్‌గా వెళ్ళాలని తెగ ట్రై చేస్తుంటాడు. ఈక్రమంలో ముంబై నుంచి వచ్చిన మోడల్ కుమారి(హేభ పటేల్) సిద్ధు ప్రేమలో పడుతుంది. ఆమె బోల్డ్ యాటిట్యూడ్ వల్ల సిద్ధు తొలుత ఇబ్బంది పడ్డా తర్వాత ఆమెను ప్రేమిస్తాడు. ఈక్రమంలో కుమారి క్యారెక్టర్ మంచిదికాదని సిద్ధు ఫ్రెండ్స్ అతనికి చెబుతారు. దీంతో ఆమెను అనుమానించిన సిద్ధు… కుమారి ఓ రోజు వేరే ఎవరి బైక్ మీదో వెళ్తుంటే నిలదీస్తాడు. దాంతో కుమారి తనని అర్థం చేసుకునే మెచ్యూరిటీ తనకు లేదని తన ప్రేమకి నో చెప్పి వెళ్లిపోతుంది. అసలు కుమారి ఎందుకు అంతలా బోల్డ్ గా ఉండటానికి కారణం ఏమిటి? అసలు ముంబై నుంచి కుమారి హైదరాబాద్ ఎందుకు వచ్చింది? అన్నది మిగతా కథ.
మిక్స్ అప్
రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బొల్డ్ కంటెంట్‌కు కెరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా విజయం సాధించనప్పటికీ.. ఓటీటీలో మాత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా(Telugu hot movies) ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. రెండు జంటలకు సెక్స్, లవ్ పరంగా సమస్యలు తలెత్తుతాయి. సైకాలజిస్ట్ సూచన మేరకు వారు గోవా టూర్ ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఒకరి భార్యను మరొకరు మార్చుకుంటారు. చివరికి ఆ రెండు జంటల పరిస్థితి ఏమైంది? అన్నది స్టోరీ. ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్ నుంచే బొల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులకు కావాల్సి మసాల అందుతుంది. ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడలేమని గుర్తించుకోవాలి.
సిద్ధార్థ్ రాయ్
రీసెంట్‌గా వచ్చిన మంచి హాట్ సీన్లతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు తెగ వెతకసాగారు. ఎట్టకేలకు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. 12 ఏళ్లకే ప్రపంచంలోని ఫిలాసఫీ పుస్తకాలన్నీ చదివిన సిద్ధార్థ్.. ఏ ఏమోషన్స్ లేకుండా జీవిస్తుంటాడు. లాజిక్స్‌ను మాత్రమే ఫాలో అయ్యే సిద్ధార్థ్ అనుకోకుండా ఇందుతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమలో హీరో ఏం తెలుసుకున్నాడు? ఇందు ఎందుకు బ్రేకప్ చెప్పింది? సిద్ధార్థ్ ప్రేమకథ చివరికీ ఏమైంది? అన్నది కథ.
ఆట మొదలైంది
ఈ చిత్రంలో బొల్డ్ కంటెంట్ అవసరానికి మించి ఉంటుంది. కథ ఎలా ఉన్నా.. బోల్డ్ కంటెంట్ ప్రేమికులను ఈ సినిమా నిరాశపర్చదు. కథ విషాయానికొస్తే.. శ్రీను మేనకోడలికి గుండె జబ్బు వచ్చినప్పుడు, మంచి మనసున్న వ్యక్తిగా వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని దయకు ప్రతిఫలంగా మరియు అతని కలలను నెరవేర్చుకునే ప్రయత్నంలో, శ్రీను తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
భక్షక్
సామాజిక రుగ్మతలపై మంచి సందేశం ఇచ్చినప్పటికీ.. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు బొల్డ్‌గా తీశారు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
బబుల్గమ్
ఇటీవల వచ్చిన బబుల్గమ్ చిత్రంలో ఉన్న బోల్డ్ కంటెంట్ యూత్‌ను బాగా టెంప్ట్ చేస్తుంది. చాలా వరకు లిప్ లాక్ సీన్లు అలరిస్తాయి. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్‌లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు.(Telugu hot movies) ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ. ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
యానిమల్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా యానిమల్. ఈ చిత్రంలోని హింసాత్మక సంఘటనలు ఏ స్థాయిలో ఉన్నాయో.. శృంగార సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రష్మిక మంధాన, తృప్తి దిమ్రితో ఉండే లిప్ లాక్ సీన్లు ప్రేక్షకులను రంజింప జేస్తాయి.ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
పర్‌ఫ్యూమ్
అమ్మాయిల వాసనపై వ్యామోహం పెంచుకున్న ఒక వ్యక్తి.. వారిని కిడ్నాప్ చేస్తూ రాక్షసానందం పోందుతుంటాడు. అతడ్ని పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారు? అతడు ఇలా ఎందుకు మారాడు? అనేది కథ.
మంగళవారం
ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ చాలా హాట్‌గా కనిపిస్తుంది. మునుపెన్నడు లేని విధంగా బోల్డ్ సీన్లలో పాయల్ నటించింది. శృంగార సన్నివేశాలు కావాలనుకునేవారిని ఈ చిత్రం నిరాశపరుచదు. ఇక ఈ చిత్రం కథ విషయానికొస్తే.. మహాలక్ష్మీపురంలోని ఓ జంట మధ్య అక్రమ సంబంధం ఉందని ఊరి గోడలపై రాతలు కనిపిస్తాయి. ఆ జంట అనూహ్య పరిస్థితుల్లో చనిపోతుంది. మరో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చనిపోవడంతో ఊరి ప్రజల్లో భయం మొదలవుతుంది. ఆ హత్యలన్ని మంగళవారం రోజునే జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించేందుకు ఎస్‌ఐ నందితా శ్వేత ప్రయత్నిస్తుంది. ఇంతకు ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అనేది మిగతా కథ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ది కేరళ స్టోరీ
ఈ చిత్రంలో కాస్త సందేశం ఉన్నప్పటికీ.. బొల్డ్ కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సినిమా స్టోరీ విషయానికొస్తే..కేరళలోని ఓ నర్సింగ్ కాలేజీలో హిందువైన షాలిని ఉన్నికృష్ణన్ (అదాశర్మ) చేరుతుంది. అక్కడ గీతాంజలి (సిద్ధి ఇద్నానీ), నిమా (యోగితా భిహాని), ఆసిఫా (సోనియా బలానీ)లతో కలిసి హాస్టల్‌లో రూమ్ షేర్ చేసుకుంటుంది. అయితే అసీఫా ఐసీస్ (ISIS)లో (Telugu Bold movies) అండర్ కవర్‌గా పనిచేస్తుంటుంది. అమ్మాయిలను బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం మతంలోకి మారుస్తుంటుంది. ఆమె పన్నిన ఉచ్చులో షాలిని చిక్కుకొని ఎలాంటి కష్టాలు అనుభవించింది అన్నది కథ. ఈ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో వీక్షించవచ్చు.
ఒదెల రైల్వే స్టేషన్
ఈ చిత్రంలో బొల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ అందాలు మిమ్మల్ని దాసోహం చేస్తాయి. ఇక స్టోరీ విషయానికొస్తే...అనుదీప్ (సాయి రోనక్) ఐపీఎస్ అధికారి. ట్రైనింగ్ కోసం ఓదెల వెళతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో వరుస హత్యాచారాలు తీవ్ర కలకలం రేపుతాయి. మరి అనుదీప్ హంతకుడ్ని పట్టుకున్నాడా? కేసు విచారణలో రాధ (హెబ్బా పటేల్) అతడికి ఎలా సాయపడింది? అనేది కథ. ఈ సినిమాను ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వీక్షించవచ్చు.
హెడ్స్ అండ్ టేల్స్
హాట్ సీన్లు దండిగా కావాలనుకునేవారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఈ సినిమా స్టోరీ ఏమిటంటే?..ముగ్గురు యువతులు తమ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాటి నుండి ఎలా బయటపడ్డారు? ఆ ముగ్గురి కథ ఏంటి? అన్నది కథ. ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.
క్రష్
ముగ్గురు యువకులు పై చదువుల కోసం అమెరికా వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. అమెరికా నుంచి వచ్చిన తమ సీనియర్ ఇచ్చిన సలహాతో వారి జీవితాలు అనూహ్య మలుపు తిరుగుతాయి.
ఏక్ మినీ కథ
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్ ప్రేమికులను ఎక్కడా నిరుత్సాహ పరుచదు. ఇక సినిమా విషయానికొస్తే, సంతోష్ శోభన్ (సంతోష్) తన జననాంగం చిన్నదని భావిస్తూ నిత్యం సతమతమవుతుంటాడు. ప్రాణహాని ఉందని తెలిసినా సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలోనే అమృత (కావ్య)తో అతడికి పెళ్లి జరుగుతుంది. తన సమస్య బయటపడకుండా సంతోష్ ఏం చేశాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైంది? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
డర్టీ హరి
హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చూసి ఎంజాయ్ చేయండి.
RDX లవ్
అందాల తార పాయల్ రాజ్‌పుత్ పరువాల ప్రదర్శనను పీక్ లెవల్ తీసుకెళ్లిన చిత్రమిది. అలివేలు (పాయల్ రాజ్‌పుత్) రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్ పొందడం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తుంటుంది. దీని కోసం, ఆమె హీరో(తేజస్)ని ఉపయోగించుకుంటుంది. ఇంతకు అలివేలు ఎవరు? సీఎంను ఎందుకు కలవాలనుకుంటుంది అనేది అసలు కథ. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు.
చీకటి గదిలో చితక్కొట్టుడు
ఈ చిత్రంలో కావాల్సినంత బోల్ట్ కంటెంట్ ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీ విషయానికొస్తే.. ఓ స్నేహితుల బృందం బ్యాచిలర్ పార్టీ కోసం నగరానికి దూరంగా (Telugu hot movies) ఉన్న విల్లాకు వెళ్తారు. ఆ విల్లాలో వారికి వింత పరిస్థితి ఎదురవుతుంది. ఓ అదృశ్య శక్తి వారిని వెంబడిస్తుంటుంది.
నాతిచరామి
ఈ చిత్రంలో పూనమ్ కౌర్ హాట్ ఎక్స్‌ప్రెషన్స్ మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి. ఒంటరి మహిళలకు ఏం కావాలి అనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది. వారి శారీర కోరికలు, వారి భావోద్వేగాలు వంటి అంశాల ప్రాతిపాదికగా నడిచే బోల్డ్ చిత్రం ఇది. ఈ సినిమా MX ప్లేయర్‌లో అందుబాటులో ఉంది.
24 కిసెస్
ఆనంద్ (అదిత్ అరుణ్) సామాజిక స్పృహ ఉన్న సినీ దర్శకుడు. శ్రీలక్ష్మీ (హెబ్బా పటేల్)తో ప్రేమలో పడి డేటింగ్‌తోనే జీవితాన్ని గడపాలని అనుకుంటాడు. దీంతో వారి లవ్ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారు మళ్లీ కలిశారా? 24 ముద్దుల వెనక రహస్యం ఏంటి? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
RX 100
ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోత మాములుగా ఉండదు. సెలవులకు ఇంటికి వచ్చిన ఇందు (పాయల్) ఊర్లోని శివ (కార్తికేయ)ను ప్రేమిస్తుంది. పెళ్లికి ముందే అతనితో శారీరకంగా దగ్గరవుతుంది. అయితే ఓ రోజు ఇందు అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. మరి శివ ఏమయ్యాడు? ఇందు వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది? అన్నది మిగతా కథ.
దండుపాళ్యం 3
దండుపాళ్యంగా పేరొందిన సైకో కిల్లర్స్ ముఠా తమ సరదాల కోసం ఎంతకైనా తెగించి నగరంలో బీభత్సం సృష్టిస్తుంటుంది. వారి కామం, డబ్బు కోసం క్రూరంగా చంపుతుంటారు. వారిని పట్టుకునేందుకు పోలీసు అధికారి (రవి శంకర్) గాలిస్తుంటాడు. చట్టం వద్ద దోషులుగా నిరూపించడానికి అతను ఏం చేశాడు? మరి వారికి శిక్ష పడిందా? లేదా? అన్నది మిగతా కథ.
జూలీ 2
నటి కావాలనుకునే సాదాసీదా అమ్మాయి జూలీ. ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించి స్టార్‌గా ఎదుగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాలు జూలీని చీకటి మార్గంలో పయనించేలా చేస్తాయి. అసలు జూలీ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
అర్జున్ రెడ్డి
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, శాలిని పాండే మధ్య వచ్చే కిస్ సీన్లు రంజింపజేస్తాయి. అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు.(Telugu Bold movies) ఇంతకు తన( ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.ఈ చిత్రం ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
బాబు బాగా బిజీ
తెలుగులో వచ్చిన బోల్డ్ కంటెంట్ సినిమాల్లో ఇది టాప్ లెవల్లో ఉంటుంది. మాధవ్ అనేక మంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటాడు. అయితే, మాధవ్ తన డ్రీమ్ గర్ల్ రాధను కలిసినప్పుడు అతను తన మార్గాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తాడు.
గుంటూరు టాకీస్
గిరి (నరేష్), హరి (సిద్ధు) ఓ మెడికల్ షాపులో పనిచేస్తూనే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటారు. ఓ దశలో పెద్ద దొంగతనమే చేయాలని నిర్ణయించుకొని ఓ ఇంట్లో 5 లక్షల రూపాయలను దోచేస్తారు. ఆ తర్వాత వారి జీవితాలు అనుకోని మలుపు తిరిగాయి. చివరికీ వీరి కథ ఎటు పోయింది? అన్నది కథ.
అవును2
ఇది "అవును" సినిమాకి సీక్వెల్. మోహిని మరియు హర్ష కొత్త ఇంటికి మారుతారు. ఆ ఇంటిలో మళ్లీ వింత ఘటనలు జరుగుతాయి. పగపట్టిన ఆత్మ వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది.
ఐస్ క్రీమ్ 2
ఐదుగురు ఫ్రెండ్స్ షార్ట్‌ఫిల్మ్ తీసేందుకు అడవిలోని గెస్ట్ హౌస్‌కు వెళ్తారు. అక్కడ వారికి వింత అనుభూతులు ఎదురవుతాయి. ఈ క్రమంలో వారిని కొందరు కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా చనిపోవడానికి కారణం ఏంటి? అన్నది కథ. ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.
నా బంగారు తల్లి
దుర్గ (అంజలి పాటిల్) అమలాపురంలో చాలా తెలివైన విద్యార్థి. ఉన్నత చదువులను హైదరాబాద్‌లో పూర్తి చేయాలనుకుంటుంది. కానీ ఆమె తండ్రి ఒప్పుకోడు. రహస్యంగా హైదరాబాద్‌కు వెళ్లిన ఆమెను దుండగులు కిడ్నాప్ చేసి వ్యభిచారంలోకి దింపుతారు. ఈ క్రమంలో తన తండ్రి గురించి ఒక షాకింగ్ నిజం తెలుసుకుంటుంది. ఆమె తెలుసుకున్న నిజం ఏమిటి? వ్యభిచార గృహం నుంచి ఎలా తప్పించుకున్నది అన్నది మిగతా కథ. ఈ సినిమా హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
గ్రీన్ సిగ్నల్
ఈ సినిమాలోనూ కావాల్సినంత హాట్ మసాల సీన్లు మిమ్మల్ని అలరిస్తాయి. సినిమా కథ విషయానికొస్తే..నాలుగు జంటల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అపర్థాల వలన వారి ప్రయాణంలో చోటుచేసుకున్న సంక్లిష్టతలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది కథ.
ప్రేమ ఒక మైకం
మల్లిక (ఛార్మీ కౌర్) ఓ అందమైన వేశ్య. మద్యం మత్తులో లైఫ్ లీడ్ చేస్తూ.. నచ్చిన విటులతోనే వ్యాపారం చేస్తుంటుంది. ఓరోజు అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్ గురైన లలిత్‌ను హస్పిటల్‌కు చేర్చి.. బ్రతికించి చేరదీసి తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది. అయితే యాక్సిడెంట్‌లో లలిత్ చూపు కోల్పోతాడు. ఒకానొక సందర్భంలో యాక్సిడెంట్‌కు గురైన లలిత్ డైరీని చదువుతుంది. దాంతో డైరీ తర్వాత ఆతని జీవితం గురించి తెలుసుకున్న మల్లిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఏం చేసింది అన్నది మిగతా కథ. ఈ సినిమాను నేరుగా యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.
పవిత్ర
శ్రియ అందాలను ఆరాధించాలంటే ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా చూడాల్సిందే..వ్యభిచారం చేసే ఒక మహిళ తన జీవితం మార్చుకోవడానికి ఉన్న అన్నీ అడ్డంకులు దాటుకొని, పట్టుదలగా ఎలా ప్రయాణించింది అనేది సినిమా కథ. ఈ చిత్రాన్ని నేరుగా MX ప్లేయర్ ఓటీటీల్లో వీక్షించవచ్చు.
దండుపాళ్యం
క్రూరమైన ఓ గ్యాంగ్ నగరంలో దొంగతనాలు హత్యలు చేస్తుంచారు. మహిళలను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తుంటారు. పోలీసు అధికారి చలపాతి ఆ గ్యాంగ్‌ను ఎలా కనిపెట్టాడు? చట్టం ముందు వారిని ఏవిధంగా నిలబెట్టాడు? అన్నది కథ. ఈ సినిమాను యూట్యూబ్ ద్వారా నేరుగా చూడవచ్చు.
ది డర్టీ పిక్చర్
ఈ చిత్రంలో సిల్క్‌స్మిత పాత్రలో నటించిన విద్యాబాలను తన అందాలను కొంచెం కూడా దాచుకోకుండా బోల్డ్ షో చేసింది. శృంగార సన్నివేశాలు ఈ చిత్రంలో కొకొల్లలు. కథ విషయానికొస్తే.. రేష్మ పెద్ద హీరోయిన్ కావాలని చెన్నైకి వస్తుంది. కొద్ది రోజుల్లోనే నటిగా అవకాశం వస్తుంది. ఎక్కువగా ఐటెం గర్ల్ పాత్రలు వస్తుంటాయి. తరువాత ఆమె సిల్క్ స్మితగా మారుతుంది. తన గ్లామర్‌తో మొత్తం ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకుంటుంది. సౌత్ సూపర్ స్టార్ సూర్య కాంత్, రమా కాంత్‌తో(Telugu hot movies) ఆమె వివాహేతర సంబంధ కొనసాగిస్తుంది. మద్యానికి బానిసై.. కొద్దిరోజుల్లోనే అన్నీ కోల్పోతుంది. చివరికి ఆమె జీవితం ఎలా ముగిసిందన్నది అసలు కథ.
శ్వేత 5/10 వెల్లింగ్టన్ రోడ్
కాలేజీ స్టూడెంట్ అయిన శ్వేత ఓ బంగ్లాలో తన కుటుంబంతో నివసిస్తుంటుంది. ఆమె తల్లి దండ్రులు ఊరు వెళ్తారు. ఈక్రమంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ క్రిష్ ఇంటికి రావాలని కాల్ చేస్తుంది. అయితే ఒక అపరిచితుడు ఆమె ఇంటికి వస్తాడు. తనతో సెక్స్ చేయాలని లేకపోతే ఆమె బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ప్రైవేట్ వీడియోలను నెట్‌లో పెడుతానని బెదిరిస్తాడు. తర్వాత ఏం జరిగింది? శ్వేత అతనికి లొంగుతుందా? చివరకు ఏం జరిగింది అనేది మిగతా కథ.
అరుంధతి
ఈ సినిమాలోనూ కొన్ని సీన్లలో అనుష్క హాట్‌గా కనిపిస్తుంది.చాలా ఎళ్ల తర్వాత తన సొంత ఊరికి వెళ్లిన సమయంలో అరుందతి... తాను తన తాతమ్మ జేజమ్మలాగా ఉన్నానని తెలుసుకుంటుంది. ఈక్రమంలో తనను తన కుటుంబాన్ని నాశనం చేయాలనుకునే ఓ ప్రేతాత్మతో పోరాడుతుంది. ఈ సినిమా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
ఆపరేషన్ దుర్యోధన
ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ రెచ్చిపోయి మరి అందాల విందు చేసింది. బొల్డ్ అందాలను వీక్షించాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్. ఇక కథ విషయానికొస్తే..మహేష్ (శ్రీకాంత్) నిజాయితీగల పోలీసు అధికారి. అతని నిజాయితీ వల్ల నష్టపోతున్న కొద్దిమంది రాజకీయ నాయకుల వల్ల అతని భార్యను, పిల్లలను కోల్పోతాడు. దాంతో మహేష్ రాజకీయాల్లో చేరడానికి తన వేషాన్ని, పేరును మార్చుకుంటాడు. వ్యవస్థలో ఉన్న లోపాల్ని ప్రజలను ఎలా తెలియజేశాడన్నది మిగతా కథ.
రా
శ్రీధర్ ఒక ప్లేబాయ్. అమ్మాయిలను ఆకర్షిస్తూ వారిని నిరాశకు గురిచేస్తుంటాడు. శ్రీధర్ స్త్రీ ద్వేషిగా మారడానికి ఒక బలమైన గతం ఉంది. అయితే శాంతి అనే అమ్మాయి కలవడంతో అతని జీవితం మారుతుంది. ఈ చిత్రం యూట్యూబ్‌లో చూడొచ్చు.
సముద్రం
సాక్షి శివానంద్ ఈ సినిమాలో అవసారనికి మించి అందాల ప్రదర్శన చేసింది. ఈ సినిమా బొల్డ్ కంటెంట్ ప్రేమికులకు మంచి మత్తు అందిస్తుంది. ఈ చిత్రం సన్‌నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో అందుబాటులో ఉంది.
10th Class
టినేజ్‌లో ఉండే ఆకర్షణలను ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ సినిమాలోనూ కొన్ని శృంగార సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కథ విషయానికొస్తే.. శీను, అంజలి పదోతరగతిలో ప్రేమించుకుంటారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుని వారికి దూరంగా జీవిస్తుంటారు. ఈక్రమంలో శీను జీవితంలో ఓ విషాదం జరుగుతుంది.
ఆరుగురు పతివ్రతలు
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్ ప్రేమికులకు మంచి మజా అందిస్తుంది. ఈ సినిమాలోని కొన్ని సీన్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా కథ ఏంటంటే.. ఆరుగురు చిన్ననాటి స్నేహితులు ఆరేళ్ల తర్వాత తిరిగి కలుస్తారు. అందరు ఒక దగ్గర చేరి వారి వైవాహిక జీవితంలో జరిగిన సాధక బాధకాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు.
4 లెటర్స్
ఈ సినిమా కథ ఎలా ఉన్నా.. బొల్డ్ కంటెంట్ మాత్రం దండిగా ఉంటుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే.. విజ్జు టాప్ బిజినెస్ మెన్ కొడుకు. కాలేజీలో అంజలిని ఇష్టపడతాడు. అయితే (Telugu Bold Movies) ఆమె బ్రేకప్ చెప్పి వెళ్లిపోవడంతో విజ్జు మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే అంజలి మళ్లీ విజ్జు లైఫ్‌లోకి వస్తుంది. చివరికి అతడు ఏ అమ్మాయిని ప్రేమించాడు? అన్నది కథ.
రొమాంటిక్ క్రిమినల్స్
ఇందులో కూడా మోతాదుకు మించి అడల్ట్ కంటెంట్ ఉంటుంది. కథ విషయానికొస్తే... కార్తీక్ మరియు ఏంజెల్ అనే యువ జంట డ్రగ్స్ పెడ్లర్ సహాయంతో అనేక నేరాలకు పాల్పడుతారు. తీరా వారు మారాలని నిర్ణయించుకున్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
ఈరోజుల్లో
ఇందులో కూడా మంచి రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కథ విషయానికొస్తే..హీరో (శ్రీ) ఓ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించి మోసపోతాడు. అప్పటి నుంచి శ్రీ అమ్మాయిలపై ద్వేషం పెంచుకుంటాడు. శ్రేయాకి కూడా అబ్బాయిలంటే అసలు నచ్చదు. అటువంటి వ్యక్తులు ఎలా ప్రేమలో పడ్డారు? చివరికి ఎలా ఒక్కటయ్యారు? అన్నది కథ. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్‌లో చూడవచ్చు.
అల్లరి
అల్లరి నరేష్ హీరోగా నటించిన తొలి చిత్రమిది. ఈ చిత్రంలో కొన్ని హాట్ సీన్లు ప్రేక్షకులను రంజింపజేస్తాయి. ఇందులో పెద్దగా కథేమి లాజిక్‌గా ఉండదు. రవి, అపర్ణ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. పక్క ఫ్లాట్‌లోకి వచ్చిన రుచిని రవి ప్రేమిస్తాడు. ఆమెను ముగ్గులో దింపేందుకు రవికి అపర్ణ సాయం చేస్తుంది. ఈ క్రమంలో రవితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఈ సినిమాను నేరుగా యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు.
ఆగస్టు 24 , 2024
Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి.
[toc]
Drushyam
దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్) ఊరిలో కేబుల్ నెట్‌వర్క్ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ.
Karthikeya 2
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే…
కార్తికేయ (నిఖిల్)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ.
Bichagadu 2
ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ
F2
2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్(వరుణ్ తేజ్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ.
Ante Sundaraniki
గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ.
Tholiprema
ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే..
అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ.
Pelli Choopulu
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్ (విజయ్ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్ పెట్టే ఫుడ్ ట్రక్ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ.
ఓటీటీ సన్ నెక్ట్స్
Spyder
స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే…
ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.
ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్
Raja The Great
రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా
Ori Devuda
వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది.
అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా
Bichagadu
ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో
Jalsa
సంజయ్ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు.
ఓటీటీ: ఆహా
Nenu
అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
Sye Raa Narasimha Reddy
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే..
భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ
Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది.
Bharat Ane Nenu
సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్ (మహేష్) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా
Ye Maaya Chesave
ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ.
ఓటీటీ: జీ5, ప్రైమ్
Baahubali: The Beginning
మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ.
ఓటీటీ: హాట్ స్టార్
Businessman
ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్
Good Luck Sakhi
బంజార యువతి సఖి (కీర్తి సురేష్) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
Oxygen
అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ
ఓటీటీ: సన్ నెక్ట్స్
Adipurush
ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ
ఓటీటీ: సన్ నెక్ట్స్
SR Kalyanamandapam
కల్యాణ్ (కిరణ్ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్.ఆర్. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్ చదివే కల్యాణ్ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ.
ఓటీటీ: ఆహా
Disco Raja
భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ
ఓటీటీ: సన్ నెక్స్ట్
Goutham Nanda
మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు.
ఓటీటీ: ప్రైమ్
Kirrak Party
కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్
Teja
తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
Pelli Sandadi
శ్రీకాంత్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ.
ఓటీటీ:యూట్యూబ్
Swathi Muthyam
బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ.
ఓటీటీ: జియో టీవీ
Dhruva
ఐపీఎస్ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్).. సిద్ధార్థ్ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
KGF 2
రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ.
Baadshah
ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
ఓటీటీ: యూట్యూబ్
Pushpa
పుష్ప (అల్లుఅర్జున్) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్ ఘోష్) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్
Nannaku Prematho
హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
Ala Modalaindi
లవ్ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్ మొదలవుతుంది.
ఓటీటీ: జీ5, ప్రైమ్
Sir
బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
Jersey
అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ.
ఓటీటీ: జీ5
Hit: The First Case
ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Aditya 369
అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
Aha Naa Pellanta
ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
Vikram Vedha
వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ.
ఓటీటీ: ప్రైమ్
Bro
మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్(పవన్ కళ్యాణ్)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Khaidi
ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
Uppena
మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్ తేజ్) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Geetha Govindam
గోవింద్ (విజయ్ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
Acharya
బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ
Rang De
అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5
ఓటీటీ: ప్రైమ్
Induvadana
వాసు (వరుమ్ సందేశ్) ఫారెస్ట్ పోలీసాఫీసర్. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
Maharshi
మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
Aakaasam Nee Haddhu Ra
సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్
Ala Vaikunthapurramuloo
బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Munna
కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
RRR
నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5
Bommarillu
సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
Dear Comrade
స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Jathi Ratnalu
మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Dirty Hari
హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ
ఓటీటీ: ఆహా
Arjun Reddy
అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా, ప్రైమ్
Rangasthalam
ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్) ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్
జూన్ 25 , 2024
Tollywood Political Movies: తెలుగు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన చిత్రాలు ఇవే!
సినిమాలు కేవలం వినోద మాద్యమం మాత్రమే కాదు. అవి వినోదాన్ని పంచడంతో పాటు సమాజంలోని స్థితిగతులను కూడా ప్రతిబింబిస్తాయి. తద్వారా ప్రజల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో గత కొంత కాలంగా పొలిటికల్ చిత్రాల హవా పెరిగింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రజల రాజకీయ అభిప్రాయాలను ప్రభావితం చేసే విధంగా ఆ చిత్రాలు విడుదలవుతున్నాయి. టాలీవుడ్‌లో 2019 నుంచి ఈ పొలిటికల్ చిత్రాల ఒరవడి మెుదలవ్వగా.. 2024లోనూ అది కొనసాగుతూ వచ్చింది. ఆయా చిత్రాల విడుదల సందర్భంగా మెుదలయ్యే రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే మరికొన్ని సినిమాలు ఆదర్శనీయమైన రాజకీయ కథాంశాలతో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
యాత్ర (Yatra)
దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'యాత్ర' (Yatra). మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిచారు. వైఎస్‌ఆర్ పాదయాత్ర చేయడానికి గల కారణాలు? చంద్రబాబు 9ఏళ్ల పాలనను కాదని ప్రజలు వైఎస్‌ఆర్‌కు ఎందుకు పట్టం కట్టారు? అన్నది చూపించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ అప్పటి తెలుగు దేశం పార్టీని గద్దె దిగడానికి ఒకింత సాయం చేసిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపించింది.
ఎన్.టి.ఆర్. మహానాయకుడు (NTR Mahanayakudu)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్.టి.రామారావు.. రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటి విద్యా బాలన్.. ఎన్టీఆర్ భార్య బసవ తారకం పాత్రలో కనిపించింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నాదెండ్ల భాస్కరరావు.. కేంద్రంలోని కాంగ్రెస్ సాయంతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఇందులో చూపించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ బలంగా ప్రజల్లోకి, దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాల దృష్టికి తీసుకెళ్లి తిరిగి అధికారంలోకి రావడాన్ని దర్శకుడు క్రిష్ తెరపై ఆవిష్కరించారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ (Lakshmi's NTR)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎలా వచ్చింది? ఆమె రాక తర్వాత ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యులు ఎందుకు దూరమయ్యారు? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎలా జరిగింది? వంటి అంశాలను దర్శకుడు ఇందులో చూపించారు. ఈ మూవీపై అప్పటి తెలుగు దేశం పార్టీ కక్ష కట్టి విడుదల కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. చివరకు థియేటర్స్‌లో విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మూవీ అప్పటి ప్రతిపక్ష వైఎస్‌ఆర్సీపీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు వర్మ తెలిపారు.
అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు (Amma Rajyamlo Kadapa Biddalu)
2019 డిసెంబర్‌లో వచ్చిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాను కూడా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఏపీ రాజకీయాలను ఆధారంగా తీసుకొని రూపొందించాడు. సీఎం జగన్ అధికారం చేపట్టాక మాజీ సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ మనోవేదనకు గురై ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎలాంటి పన్నాగాలు చేశారు అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీశారు. ఈ సినిమా విడుదలకు ముందు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది.
జై బోలో తెలంగాణ (Jai Bholo Telangana)
తెలంగాణ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా (Jai Bolo Telangana) తెరకెక్కింది. ప్రత్యేక తెలంగాణ కోసం తరతరాలుగా ప్రాణాలర్పిస్తూ వస్తున్న ఓ కుటుంబం చుట్టూ కథ సాగుతుంది. ముఖ్యంగా ఉద్యమం సమయంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను ఈ సినిమాలో చూపించడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎన్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్, మీరానందన్ ప్రధాన పాత్రలు పోషించారు.
యాత్ర 2 (Yatra 2)
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెమీ బయోపిక్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కింది. వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయి.. తన తండ్రి బాటలో నడవాలని జగన్ ఎందుకు నిర్ణయించుకున్నాడు.. ఆ లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నది ఈ సినిమాలో చూపించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో ‘యాత్ర’ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
వ్యూహాం (Vyuham)
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఈ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. వైఎస్‌ఆర్ మరణం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్.. జగన్‌ను ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? వాటిని జగన్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఇందులో చూపించాడు.
శపథం (Sapadam)
'వ్యూహం' సినిమాకు కొనసాగింపుగా 'శపథం' మూవీని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జరిగిన పరిస్థితులను ఈ సినిమాలో తెరకెక్కించారు. జగన్ చేపట్టిన ప్రజా సంక్షేమాలను ఆపడానికి విపక్ష నేత చంద్రబాబు చేసిన కుట్రలు ఏంటి? ఓటమి తర్వాత పవన్ పరిస్థితి ఎలా ఉంది? అన్నది దర్శకుడు ఇందులో చూపించాడు.
రజాకార్ (Razakar)
సెప్టెంబర్ 17, 1948కి ముందు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం అణచివేత పాలనకు, రజాకార్ల అరాచకాల మధ్య ప్రజలు ఎలాంటి కష్టాలు అనుభవించారు. వారి అన్యాయాలకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమించారు అన్న దానిని కథాంశంగా చేసుకొని దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమాను రూపొందించారు.
రాజధాని ఫైల్స్ (Rajadhani Files)
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. భాను శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంల అఖిలన్ పుష్పరాజ్, విశాల్ పతి, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏపీ సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకొని నిర్మించడం గమనార్హం.
లీడర్ (Leader)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లీడర్’ చిత్రం.. బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే హీరో రానా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తండ్రి మరణించడంతో స్వార్థపరుడైన వ్యక్తికి అధికారం కట్టబెట్టడం ఇష్టం లేని అర్జున్ (రానా) సీఎం అవుతాడు. అతడు సమాజంలోని అవినీతి, కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశాడన్నది సినిమా. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది.
భరత్ అనే నేను (Bharath Ane Nenu)
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కూడా మంచి విజయాన్ని సాధించింది. సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్ (మహేష్) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్ పెట్టాడు? అన్న కోణంలో ఈ సినిమా తెరకెక్కింది.
నోటా (Nota)
యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన తొలి పొలిటికల్ చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఓ రాష్ట్ర సీఎం కొడుకు అయిన వరుణ్ (విజయ్).. తండ్రి కేసులో ఇరుక్కోవడంతో పదవిలోకి వస్తాడు. ఆ తర్వాత సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాడు? తప్పుచేసిన తండ్రిని సైతం ఎలా శిక్షించాడు? అన్న కోణంలో సినిమా రూపొందింది. ఇందులో విజయ్‌కు జోడీగా మెహ్రీన్ చేసింది.
మార్చి 13 , 2024
Pushpa 2 Item Song: పుష్ప 2 ఐటెం సాంగ్‌లో శ్రీలీల, శ్రద్ధా కపూర్?.. రొమాన్స్‌తో రెచ్చిపోనున్న బన్నీ!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం 'పుష్ప: ది రైజ్' కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. పుష్ప ది రైజ్‌లో ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. సమంత చేసిన ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాటకి థియేటర్లు మార్మోగాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా (Pushpa 2 Item Song)ఈ సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఇప్పుడు పార్ట్ 2లో ఐటెం సాంగ్ కూడా అంతకంటే ఎక్కువగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే పుష్ప 2లో రానున్న ఐటెం సాంగ్‌లో ఎవరు నటిస్తారన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.
తొలుత యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి ‘పుష్ప 2’ ఐటెం సాంగ్ చేస్తుందని అంతా భావిస్తుండగా చిత్ర యూనిట్ ఆమెకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. తృప్తి దిమ్రి చేత రిహార్సల్స్ చేయించగా వచ్చిన అవుట్‌పుట్ పట్ల మేకర్స్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీంతో ఆమెను పక్కకు పెట్టారని టాక్ నడుస్తోంది. ఆమె స్థానంలో టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు యువ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
‘పుష్ప’ మూవీపై దేశవ్యాప్తంగా విపరీతమైన బజ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.1000 కోట్లు దాటింది. దీంతో మేకర్స్ ప్రతి అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్ట్ 1 కన్న ఘనంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్ట్ 1 ఫీల్ ఏమాత్రం తగ్గినా పుష్ప 2 విజయం సాధించదు అనే భావనలో జాగ్రత్త వహిస్తున్నారు. ముఖ్యంగా పుష్పలో పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్ చేసింది. బన్నీ-సామ్ కలిసి వేసిన స్టెప్స్ ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.
ఐటెం సాంగ్‌లో శ్రీలీల
పుష్ప 2లో ఐటెం సాంగ్‌లో బన్నీ సరసన నర్తించేందుకు చిత్ర బృందం శ్రీలీలను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌పై యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. గుంటూరుకారం సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన ఐటెం సాంగ్ ఎంత ప్రజాదారణ పొందిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో "ఆ కుర్చి మడతపెట్టి" సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్ ఇరగదీసింది. అందాల ప్రదర్శనతో పాటు (Pushpa 2 Item Song)డ్యాన్స్‌తోనూ అదరగొట్టింది. మహేష్‌తో పోటీపడి మరి స్టెప్పులేసింది. లుక్స్, గ్లామర్ షో పరంగా ఆకట్టుకుంది. దీంతో శ్రీలీలను ఐటెం సాంగ్‌లో తీసుకోవాలనే ప్రయత్నాలను మూవీ మేకర్స్ ముమ్మరం చేశారు. ఇందుకు సుకుమార్, బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఈ ఇద్దరి కలయిక ఎలా ఉంటోందో అని ప్రేక్షకులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన బన్నీ, ఈ కుర్ర హీరోయిన్‌తో స్టెప్పులు ఇరగదీయనున్నాడు.
బన్నీతో శ్రద్ధా కపూర్ రొమాన్స్
పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం వినిపిస్తున్న మరో పేరు బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్. రీసెంట్‌గా ఆమె నటించిన స్త్రీ-2 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె గ్లామర్ షోక్ యూత్ ఫిదా అయిపోయింది. దీంతో శ్రద్ధా కపూర్ పేరును కూడా (Pushpa 2 Item Song)ఐటెం సాంగ్ కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమెతో మూవీ యూనిట్ మాట్లాడినట్లు సమాచారం. ఒక వేళ శ్రద్ధా కపూర్ ఒకే చెబితే.. పాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప బజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే పుష్ప2 ఐటెం సాంగ్‌లో ఎవరు నటిస్తారనేదానిపై గత వారం ఆ చిత్ర నిర్మాత ఓ ప్రకటన చేశారు. నవంబర్‌లో ఐటెం సాంగ్ షూట్ ఉంటుందని అప్పుడే అల్లు అర్జున్ సరసన నర్తించే హీరోయిన్ పేరు వెల్లడిస్తామని తెలిపారు. సో, త్వరలోనే ఆ వ్యక్తి పేరు అధికారికంగా బయటకు రానుంది.
బన్నీ సరసన ఇద్దరు హీరోయిన్లు
'పుష్ప 2'లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులోని ఐటెం సాంగ్‌లో రష్మిక మంధాన కూడా స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. ఐటెం గార్ల్‌తో పాటు రష్మిక కూడా ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపనుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్ట్ 1లో రష్మిక ఉన్నప్పటికీ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించలేదు. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ బన్నీ- సమంత ఇద్దరే స్టెప్పులు ఇరగదీశారు. ఈసారి రష్మికతో కలిసి ఇద్దరు భామలు ఐటెం సాంగ్‌లో కనిపించనుండటంతో మూవీ లవర్స్‌లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఇద్దరి భామాలతో కలిసి బన్నీ ఏ స్థాయిలో అలరిస్తాడో మరి చూడాలి.
నవంబర్‌లో పుష్ప మేనియా
నవంబర్ నెలను పుష్ప నెల అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రకటించారు. మూవీ విడుదలకు మరో నెల మాత్రమే మిగిలి ఉండటంతో ప్రమోషన్లు షూరు చేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. నవంబర్‌లో దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్లు హింట్ ఇచ్చారు. అన్ని భాషల్లో ప్రచారాన్ని త్వరలో మొదలపెట్టనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 15 నుంచి ఈ ప్రక్రియ మొదలు కానున్నట్లు టాక్. ఈ ప్రమోషన్లలో అల్లు అర్జున్‌తో పాటు మూవీ యూనిట్ పాల్గొననుంది.
చివరి దశకు 'పుష్ప 2' షూటింగ్
'పుష్ప 2' చిత్రానికి సంబంధించి షూటింగ్ దాదాపు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఒక్క ఐటెం సాంగ్ మినహా మొత్తం వర్క్ ఫినిష్ చేశారని సమాచారు. గత నెలలో రామోజీ ఫిల్మ్ సిటీలో హీరో అల్లు అర్జున్, విలన్ ఫహాద్ పాజిల్‌పై క్లైమాక్స్ సన్నివేశాలను సుకుమార్ తెరకెక్కించారు. ఫహాద్ ఫాజిల్, అల్లు అర్జున్‌ల నటన, సంభాషణలతో పాటు యాక్షన్ సన్నివేశాలు ఈ క్లైమాక్స్‌లో కీలకంగా ఉండబోతున్నాయని టాక్. తొలి పార్ట్‌లో తరహాలోనే ‘పుష్ప 2’లోనూ క్లైమాక్స్ కీలకంగా మారుతుందని పేర్కొంటున్నారు. పైగా మూడో పార్ట్‌కు సంబంధించిన లింక్‌ను కూడా ఈ క్లైమాక్స్‌లో షూట్ చేసారని సమాచారం.
నవంబర్ 02 , 2024
Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్-10 మూవీస్ ఇవే!
టాలీవుడ్‌లో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు ఇటీవలే విడుదలై మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రేమలు సినిమా మలయాళం నుంచి డబ్బింగై తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా మరో మలయాళ బ్లాక్ బాస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ కూడా తెలుగులో విడుదలై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా మలయాళంలో వచ్చిన టాప్-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
మంజుమ్మల్ బాయ్స్
గత నెల ఫిబ్రవరి 22న రిలీజైన ఈ (Manjummel Boys) చిత్రం మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటివరకూ రూ.214 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన తొలి చిత్రంగా ‘మంజుమ్మల్ బాయ్స్’ నిలిచింది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుణ్ణి మంజుమ్మల్ యువకులు ఎలా కాపాడారు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్ 6 తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది.
2018
2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రూ.26 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2023లో విడుదలై ఏకంగా రూ.175.5 కోట్ల వసూళ్లను సాధించింది. అటు తెలుగులోనూ డబ్ అయ్యి ఇక్కడా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. జూడ్ ఆంథనీ జోసేఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్, కున్‌చకో బొబన్, అపర్ణా బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ ముందు వరకూ మలయాళంలో అత్యధిక కలెక్షన్ల రికార్డు ఈ మూవీ పేరునే ఉండేది.
పులిమురుగన్
మలయాళంలోని స్టార్ హీరోల్లో మోహన్‌లాల్ (Mohan Lal) ఒకరు. ఆయన నటించిన ‘పులిమురుగన్’ (Pulimurugan) చిత్రం.. 2016లో విడుదలై ఏకంగా రూ.152 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఆరు రెట్లు కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2016-2023 మధ్య ఏడేళ్ల పాటు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పులిమురుగన్ కొనసాగింది. అటు తెలుగులోను ‘మన్యంపులి’ (Manyam Puli) పేరుతో ఈ చిత్రం విడుదలై హిట్ టాక్ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రానికి వైశాక్ దర్శకత్వం వహించారు.
ప్రేమలు (Premalu)
నస్లేన్ కె. గఫూర్, మ్యాథ్యూ థామస్, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్ ఎ. డి తెరకెక్కించిన మలయాళ చిత్రం 'ప్రేమలు' (Premalu). ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ సాధించి.. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గో చిత్రంగా నిలిచింది. అటు టాలీవుడ్‌లో ఈ సినిమాకు విశేష ఆదరణ దక్కింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్‌లో జరగడంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు.
లూసిఫర్
2019లో మోహన్‌లాల్ (Mohan lal) హీరోగా వచ్చిన లూసిఫర్ (Lucifer) కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళంలో ఈ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందగా.. రూ.127 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ సినిమానే తెలుగులో ‘గాడ్ ఫాదర్’ (Godfather) పేరుతో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రీమేక్ చేయడం గమనార్హం.
నెరు
గతేడాది వచ్చిన నెరు (Neru) సినిమా మలయాళంలో బ్లాక్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ లాయర్‌గా నటించాడు. రూ.12 బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.86 కోట్ల గ్రాస్ సాధించింది. అత్యాచారానికి గురైన ఓ అంధ యువతికి ఓ లాయర్ అండగా నిలబడి ఎలా న్యాయం చేశాడు? అన్న కథాంశంతో దర్శకుడు జీతు జోసెఫ్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
భీష్మ పర్వం
మమ్ముట్టి (Mammootty) హీరోగా 2022లో వచ్చిన ‘భీష్మ పర్వం’ (Bheeshma Parvam) కూడా మలయాళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా రూ.85 కోట్లు (గ్రాస్) రాబట్టి ఈ జాబితాలో ఏడో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు అమల్ నీరద్ దర్శకత్వం వహించగా మమ్ముట్టితో పాటు నదియా, అనసూయ, నెడుముడి వేణు ముఖ్య పాత్రలు పోషించారు.
ఆర్‌డీఎక్స్
రాబర్ట్ (R), డానీ (D), జేవియర్ (X) అనే ముగ్గురు స్నేహితుల్లో జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. రూ.8 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.84.55 వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం నిహాస్ హిదయనాథ్ అందించారు.
కన్నూర్ స్క్వాడ్
మమ్ముట్టి హీరోగా చేసిన్న ‘కన్నూర్ స్క్వాడ్’ (Kannur Squad) చిత్రం కూడా కలెక్షన్ల పరంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్ రూ.10 కోట్లు. విడుదల అనంతరం ఈ సినిమా రూ.82 కోట్ల గ్రాస్ రాబట్టింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రోబీ వర్గీస్ రాజ్ ఈ మూవీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
కురుప్
దుల్కార్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా చేసిన ‘కురుప్’ (Kurup) చిత్రం.. కలెక్షన్స్ పరంగా మలయాళంలో టాప్-10లో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్ రూ.35 కోట్లు. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.81 కోట్ల గ్రాస్ వచ్చింది. కేరళలో ఫేమస్ క్రిమినల్ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) నటించింది.
మార్చి 29 , 2024
Poonam Pandey: పూనం పాండేపై నెటిజన్లు కన్నెర్ర.. ఏకిపారేస్తూ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే (Poonam Pandey) మృతి చెందినట్లు శుక్రవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer)తో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె మేనేజర్ మీడియాకు వెల్లడించారు. అయితే, నటి మరణ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా పూనం పాండేనే ప్రకటించారు. తాను బతికే ఉన్నట్లు ఓ వీడియో సందేశాన్ని సైతం విడుదల చేశారు.
అందుకే ఇలా చేశా: పూనం పాండే
తను చనిపోయినట్లు స్వయంగా ప్రకటించుకున్న పూనం పాండే.. అందుకు గల కారణాలను తాజా వీడియోలో వివరించారు. తాను బాధపడుతున్న సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి ఏటా వేలాది మంది మహిళలు చనిపోతున్నట్లు పూనం తెలిపారు. ఆ వ్యాధి బారిన పడితే ఏమి చేయాలన్న అవగాహన చాలా మంది మహిళలకు ఉండటం లేదన్నారు. ఇతర క్యాన్సర్ల లాగే సర్వైకల్ క్యాన్సర్‌ను కూడా జయించవచ్చని తెలిపారు. కొన్ని రకాల టెస్టుల ద్వారా ప్రారంభంలోనే ఈ వ్యాధిని గుర్తించి హెచ్‌పీవీ వ్యాక్సిన్ (HPV Vaccine) తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నుంచి బయటపడ్డవచ్చని ఆమె సందేశం ఇచ్చారు.
https://twitter.com/i/status/1753677207913070756
ఏకిపారేస్తున్న నెటిజన్లు
మరోవైపు పూనం పాండే చేసిన పనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సర్వైకర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలన్న ఆమె ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ అందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఏమాత్రం ఆమోదయోగ్యమైంది కాదని అంటున్నారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కూడా ఆ వ్యాధిపై అవగాహన కల్పించే మార్గముందని చెబుతున్నారు. మరణం అనేది ఎప్పటికీ జోక్ కాదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
పూనం పాండే తీసుకున్న నిర్ణయం అగౌరవంగా ఉందని.. ఇలాంటివి యాక్టింగ్ స్కూల్‌లో చేసుకుంటే బాగుంటుందని మరో నెటిజన్ అన్నారు. హెల్త్‌కేర్‌కు సంబంధించిన అంశాలను ప్రజలకు చేరువ చేయడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని చెప్పారు.
అటు పూనం పాండే ఫేక్ మరణవార్త గురించి కొన్ని ఫన్నీ వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక డెడ్‌బాడీని లిఫ్ట్‌లోకి తీసుకురాగా అది పూనం పాండే లాగా నేను బతికే ఉన్నానని తిరిగి లేచినట్లు ఆ వీడియోలో ఉంది.
https://twitter.com/araza52505/status/1753689758847611052
మరికొందరు నెటిజన్లు ఇంకా విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుత డీప్‌ఫేక్ వీడియోలు విస్తృతంగా పెరిగిపోవడంతో ఆమె రిలీజ్ చేసిన వీడియో కూడా అలాంటిదేనని ఓ నెటిజన్లు కామెంట్ పెట్టాడు. ఆమె నిజంగానే చనిపోయి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
ఇది ఆమె పబ్లిసిటీ స్టంట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఇది పూర్తిగా హేయమైన చర్య అంటూ మరో వ్యక్తి అభిప్రాయ పడ్డాడు.
ఆమె క్యాన్యర్‌పై అవగాహన కల్పించడం కోసం ఇలా చేయదని తన గురించి ప్రచారం కోసమే హేయమైన చర్యకు పూనుకున్నారని ఓ నెటిజన్ అన్నారు. ఆమె మరణవార్త విని తాను చాలా ఫీల్ అయ్యాయని.. ఎందుకంటే తన తండ్రి కూడా అలాగే చనిపోయాడని అతడు చెప్పుకొచ్చాడు.
‘అందరూ నన్ను క్షమించండి’
పూనం ఫేక్ మరణవార్తపై విమర్శలు వస్తోన్న వేళ ఆమె మరో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. తను చేసిన పని వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే వారు క్షమించాలని అందులో కోరారు. ప్రతీ ఒక్కరిని షాక్‌కు గురి చేయాలన్నది తన ఉద్దేశం కాదని.. సర్వైకల్ క్యాన్సర్‌పై విస్తృత ప్రచారం కోసమే తాను ఇలా చేశానని పునరుద్ఘటించారు. ఈ ఫేక్ మరణవార్తను కాసేపు పక్కన పెడితే.. ప్రతీ ఒక్కరూ సర్వైకర్ క్యాన్సర్ గురించే చర్చించుకున్నారని గుర్తు చేసారు. ఆ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలగడం అత్యవసరమని చెప్పారు. తన మరణవార్త ద్వారా ఏం జరగాలని ఆశించానో అది నేరవేరిందని అన్నారు. ఇలా చెప్తునందుకు తాను గర్వపడుతున్నట్లు వీడియోను ముగించారు.
https://twitter.com/i/status/1753677387232096338
ఫిబ్రవరి 03 , 2024
Disha Patani: బోల్డ్ వీడియోలో రెచ్చిపోయిన దిశా పటానీ.. హాట్ ట్రీట్ అదరహో!
హాట్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) మరోమారు తన గ్లామర్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తాజాగా బాలీవుడ్ పాపులర్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీలో ఈ బామ బోల్డ్ శారీ లుక్‌లో తళుక్కుమంది.
ఎద, నడుము అందాలను చూపిస్తూ పలుచటి శారీలో రెచ్చిపోయింది. పార్టీకి వచ్చిన వారందర్నీ తన ఒంపుసొంపులతో ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే దిశా లేటెస్ట్ బాలీవుడ్ మూవీ 'యోధ' (Yodha) మరోమారు వాయిదా పడింది. డిసెంబర్ 15, 2023న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా తాజాగా దాన్ని పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటికే మూడుసార్లు ‘యోధ’ విడుదల తేదీ వాయిదా పడింది. నాల్గోసారి కూడా రిలీజ్ డేట్‌ను రీషెడ్యూల్ చేయడంపై బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో హీరోయిన్‌గా చేసిన #DishaPatani హ్యాష్‌టాగ్ నెట్టింట వైరల్ అవుతోంది.
‘యోధ’ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా చేశాడు. వాస్తవానికి ఈ సినిమా జులై 7న రిలీజ్ కావాల్సి ఉంది. అనివార్య కారణాలతో పలు దఫాలుగా ఈ మూవీ విడుదలను మేకర్స్ వాయిదా వేస్తూ వస్తున్నారు.
మరోవైపు దిశా పటాని పెట్టే బోల్డ్ ఫొటోలు ట్రెండింగ్‌లో నిలవడం గత కొంతకాలంగా కామన్ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతుంటారు.
https://twitter.com/fitbabesbytes/status/1721358334786416642?s=20
లోఫర్ సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
లోఫర్ సినిమా తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.
దిశా నటించిన ఎం.ఎస్ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2), బాగీ 3 (Baaghi 3), రాధే వంటి చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
భాగీ సినిమా షూటింగ్ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే టైగర్, దిశా రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. ఏదో కారణాల వల్ల వారు బ్రేక్ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో దిశా కూడా నటిస్తోంది. అలాగే తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’లో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తోంది.
నవంబర్ 07 , 2023
Malavika Satheesan: ‘పారిజాత పర్వం’ బ్యూటీ మాళవిక సతీశన్ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
యువ నటి మాళవిక సతీశన్ (Malavika satheesan).. 'పారిజాత పర్వం' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో చైతన్యరావుకు జోడీగా నటించి మెప్పించింది. ముఖ్యంగా కమెడియన్ వైవా హర్షతో ఈ అమ్మడు చేసిన కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు నవ్వులు పూయించింది. దీంతో మాళవిక గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ తెగ ఆసక్తికనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మాళవిక సతీశన్ ఎవరు?
టాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరోయిన్
మాళవిక సతీశన్ ఎక్కడ పుట్టింది?
కేరళలోని త్రివేండ్రంలో జన్మించింది.
మాళవిక సతీశన్ పుట్టిన తేదీ ఏదీ?
28 మార్చి, 2001
మాళవిక సతీశన్ తల్లిదండ్రులు ఎవరు?
సతీష్ రవీంద్రన్ - రేఖ సతీశన్ దంపతులకు మాళవిక జన్మించింది. రవీంద్రన్ ఆర్మీ ఆఫీసర్ కాగా, రేఖ స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది.
మాళవిక సతీశన్ ఎత్తు ఎంత?
5 అడుగుల 4 అంగుళాలు
మాళవిక సతీశన్ బరువు ఎంత?
52 కేజీలు
మాళవిక సతీశన్ వయసు ఎంత?
23 సంవత్సరాలు
మాళవిక సతీశన్ ప్రస్తుతం ఎక్కడ నివసిస్తోంది?
సికింద్రాబాద్
మాళవిక సతీశన్ స్కూలింగ్ ఎక్కడ జరిగింది?
అలహాబాద్‌లోని ఆర్మీ స్కూల్‌లో మాళవిక చదువుకుంది.
మాళవిక సతీశన్ ఏం చదువుకుంది?
బీఏ గ్రాడ్యుయేషన్ చేసింది
మాళవిక తొలి చిత్రం ఏది?
2020లో వచ్చిన 'చూసి చూడంగానే' చిత్రం ద్వారా మాళవిక తెరంగేట్రం చేసింది.
మాళవిక సతీశన్ ఇప్పటివరకూ చేసిన చిత్రాలు?
‘చూసి చూడంగానే’, ‘బొమ్మల కొలువు’, ‘బీఎఫ్‌హెచ్’ (బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్), ‘దోచేవారెవరురా’
మాళవిక సతీశన్ తాజా చిత్రం ఏది?
పారిజాత పర్వం (2024)
మాళవిక సతీశన్‌కు ఇష్టమైన హాబీలు ఏవి?
రీడింగ్ బుక్స్, డ్యాన్సింగ్, మోడలింగ్
మాళవిక సతీశన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లింక్ ఏది?
https://www.instagram.com/malavikasatheesanofficial/?hl=en
ఏప్రిల్ 20 , 2024
Market Mahalakshmi Review: మంచి సందేశంతో వచ్చిన ‘మార్కెట్ మహాలక్ష్మీ’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులు
దర్శకత్వం : వియస్ ముఖేష్
సంగీతం: జో ఎన్మవ్
నేపథ్య సంగీతం: సృజన శశాంక
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
ఎడిటర్: విశ్వనాధ్ కూచనపల్లి
నిర్మాత: అఖిలేష్ కలారు
విడుదల తేది: ఏప్రిల్ 19, 2024
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం నటింటిన లేటెస్ట్ చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మీ’ (Market Mahalakshmi). వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అఖిలేష్ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్, మహబూబ్ భాషా, ముక్కు అవినాష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 19) విడులైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
ప్రభుత్వ ఆఫీసులో గుమస్తాగా పని చేసే కేదార్ శంకర్ కొడుకును (పార్వతీశం) కష్టపడి సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్ చేస్తాడు. లక్షల్లో జీతం వస్తున్న కుమారుడికి రూ.కోటి కట్నం ఇచ్చే యువతితో పెళ్లి చేసేందుకు యత్నిస్తాడు. అయితే పార్వతీశం మాత్రం మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మీని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. దీంతో మహాలక్ష్మీ ప్రేమను పొందేందుకు పార్వతీశం మార్కెట్‌లోనే తిష్టవేస్తాడు. మరి మహాలక్ష్మీ పెళ్లికి ఒప్పుకుందా? ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి? సాఫ్ట్‌వేర్ అయిన పార్వతీశం.. మహాలక్ష్మీనే ఎందుకు ప్రేమించాడు? కొడుకు ప్రేమ వ్యవహారం తెలిసి కేదార్ శంకర్ ఏం చేశాడు? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో పార్వతీశం చక్కగా నటించాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అటు మార్కెట్ మహాలక్ష్మీ పాత్రలో ప్రణికాన్విక ఒదిగిపోయింది. తొలి చిత్రమే అయినప్పటికీ ఎక్కడా తడబడలేదు. అటు పార్వతీశం ఫ్రెండ్ పాత్రలో ముక్కు అవినాష్ నవ్వించే ప్రయత్నం చేశాడు. మద్యానికి బానిసైన వ్యక్తిలా మహబూబ్ బాషా నవ్వులు పూయించాడు. హీరోయిన్ సోదరుడిగా అతడు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. జయ, పద్మ, కేదార్ శంకర్, హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటింటి ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వీఎస్ ముఖేష్ కొత్త తరహా ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య లవ్ మెుదలైతే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో కథను నడిపించాడు. మహిళా సాధికారత ఎంత అవసరమో ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. అయితే మహాలక్ష్మీ ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు రొటీన్‌గా అనిపిస్తాయి. అక్కడ మరింత కామెడీ పండించే అవకాశమున్నా దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సెకండాఫ్‌ను బలమైన సన్నివేశాలతో నడిపించడం సినిమాకు ప్లస్ అయ్యింది. కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది.
టెక్నికల్‌గా
ఇక టెక్నికల్ అంశాల విషయానికి.. జో ఎన్మవ్ అందించిన పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. సన్నివేశాలను చక్కగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది. మార్కెట్‌లోని సన్నివేశాలు మాంటేజ్ షాట్లు సినిమాకు అదనపు అందాన్ని తీసుకొచ్చాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
హీరో, హీరోయిన్ నటనసందేశండైలాగ్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ లవ్ ట్రాక్‌సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 2.5/5
ఏప్రిల్ 19 , 2024
Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!
అడల్ట్ వుడ్ అంటే.. తెలుగులో వయోజన స్థితి. ఒక వ్యక్తి పూర్తి శారీరక, మానసిక పరిపక్వత పొందుతున్న జీవన దశను అడల్ట్‌వుడ్ అంటారు. ఈ దశలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, జీవితంలో నిలదొక్కుకునే సమయంలో ఎదురయ్యే(Adulthood Telugu Movies) సవాళ్లు, కుటుంబ సమస్యలు, ప్రేమ, ఆర్థిక స్వావలంబన వంటి సామాజిక అంశాలు ప్రభావం చూపుతాయి. తెలుగులో ఈ జనర్‌లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ప్రేక్షాకాదరణ పొందిన కొన్ని చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి.
[toc]
Jersey
అర్జున్ రంజీ క్రికెటర్, ఎప్పటికైనా ఇండియన్ టీమ్‌లో ఆడాలని కలలు కంటాడు. అయితే 26 సంవత్సరాల వయసులో ఓ కారణం వల్ల క్రికెట్‌కు దూరమవుతాడు. ఆ తరువాత ఆర్ధిక సమ్యసల వల్ల అలాగే తన కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడడం మొదలు పెడుతాడు. ఈక్రమంలో అతను ఎలాంటి పరిస్థులను ఎదుర్కున్నాడు? ఇంతకి అర్జున్ నేషనల్ టీంలో సెలక్ట్ అయ్యాడా ? అనేది మిగిలిన కథ.
Ee Nagaraniki Emaindi
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
Chi La Sow
అర్జున్ (సుశాంత్) తల్లితండ్రులు అంజలి(రుహాని శర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. అంజలిని చూసిన అర్జున్ పెళ్లికి ఒప్పుకున్నాడా? వీరి పెళ్లి చూపులు ఎలా జరిగింది? అన్నది కథ. (Adulthood Telugu Movies)
C/o Kancharapalem
కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ.
Brochevarevarura
పరీక్షల్లో ఫెయిలై ఖాళీగా సమయం వృథా చేస్తున్న ముగ్గురు విద్యార్థులు తమ కాలేజీలో మిత్ర అనే అమ్మాయితో స్నేహం చేస్తారు. ఆమెకు తండ్రితో ఓ సమస్య వస్తుంది. మిత్రను ఆ సమస్య నుంచి బయట పడేలా చేస్తారు. కానీ వారు చిక్కుల్లో పడతారు. (Adulthood Telugu Movies)
Ninnila Ninnila
పలు సమస్యలతో బాధపడుతున్న దేవ్, తార ఓ రెస్టారెంటులో చెఫ్‌గా పనిచేస్తుంటారు. అనుకోకుండా వీరిద్దరి ఆ రెస్టారెంట్‌లో రాత్రంతా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
Raja Raja Chora
భాస్కర్ (శ్రీ విష్ణు) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సంజన (మేఘా ఆకాష్)కు పరిచయమవుతాడు. అబ్బద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే భాస్కర్‌కు ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య (సునైనా) ఎవరు? అన్నది కథ.
Nootokka Jillala Andagadu
హీరో వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతుంటాడు. విగ్గు, టోపీతో మేనేజ్ చేస్తుంటాడు. (Adulthood Telugu Movies) ఈ విషయం దాచి సహోద్యోగి అంజలి (రుహానిశర్మ)ని ప్రేమిస్తాడు. ఈ రహస్యం ఓ రోజు అంజలికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
Balagam
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు.
Pareshan
ఇస్సాక్ , పాషా, సత్తి, RGV అనే నలుగురు యువకులు సింగరేణి ప్రాంతంలో నివసిస్తుంటారు.. వీరంతా మద్యానికి బానిసలు కావడంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా మద్యం తాగుతూనే ఉంటారు. సత్తి, పాషాలకు డబ్బు అవసరం కావడంతో, ఇస్సాక్ తన తండ్రి డబ్బును వారికి ఇస్తాడు. ఇదే క్రమంలో ఇస్సాక్‌కు ఓ సమస్య వచ్చి డబ్బు అవసరమవుతుంది. కానీ సత్తి, పాషా డబ్బు తిరిగి ఇవ్వరు. మరి ఇస్సాక్ వారి నుంచి డబ్బు వసూలు చేశాడా? ఇంతకు అతనికి వచ్చిన సమస్య ఏమిటి? అన్నది మిగతా కథ.
Nuvvu Naaku Nachchaav
వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.
Vedam
రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
Bommarillu
సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
Keedaa Cola
ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Seethamma Vakitlo Sirimalle Chettu
ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది.
Miss Shetty Mr Polishetty
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
Pilla Zamindar
అల్లరి చిల్లరగా తిరిగే ప్రవీణ్ పెద్ద భూస్వామి మనవడు. తన తాతగారి ఆస్తిని వారసత్వంగా పొందడం కోసం తన చదువును పూర్తి చేసేందుకు ఓ బోర్డింగ్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతను జీవితం గురించి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడన్నది మిగతా కథ.
Josh
దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు.
Rowdy Boys
అక్షయ్ (ఆశిష్) బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చేరడానికి కాలేజీకి వెళ్తూ మెడికల్ స్టూడెంట్ కావ్యను (అనుపమ పరమేశ్వరన్) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
Middle Class Melodies
రాఘవ అనే యువకుడు తన తండ్రిలాగా కాకుండా.. సమీపంలోని పట్టణంలో హోటల్ బిజినెస్ చేయాలనుకుంటాడు. పట్టణంలో హోటల్ తెరిచినప్పటికీ.. వ్యాపారం సక్సెస్ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వాటి నుంచి బయటపడేందుకు రాఘవ ఏం చేశాడు అనేది కథ.
ఆగస్టు 24 , 2024
Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సైన్స్ సైన్స్ ఫిక్షన్, టైం ట్రావలింగ్ చిత్రాల హవా సాగుతోంది. ఈ జోనర్‌లో తెరకెక్కించిన సినిమాలో మంచి విజయం సాధిస్తున్నాయి. దీంతో దర్శకులు ఈ కెటగిరీపై సినిమాలు తీస్తున్నారు. ఆదిత్య 369 నుంచి రాబోయే కల్కీ 2898 AD వరకు తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
7:11PM
టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో ఈ సినిమా వచ్చింది. అనుకోకుండా ఓ ఊరిలోకి వచ్చిన గ్రహాంతర వాసుల బస్సును హీరో సాహస్ పగడాల ఎక్కడంతో అతను 1999 నుంచి 2024కు ట్రావెల్ చేస్తాడు. ఈ చిత్రాన్ని చైతు మదాల తెరకెక్కించాడు. తెలుగులో మంచి విజయం సాధించింది.
ఒకే ఒక జీవితం
తెలుగులో టైం ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. చనిపోయిన తన తల్లిని బతికించుకునేందుకు టైం ట్రావెలింగ్‌కు వెళ్లిన శర్వానంద్ ఏం చేశాడు అనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శ్రీ కార్తిక్ తెరకెక్కించారు. ఈ సినిమాలో(Science fiction movies in telugu) గుడ్ స్క్రీన్ ప్లే, మంచి భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
Disco Raja
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించాడు. విలన్ల చేతిలో దెబ్బలు తిన్న రవితేజ మంచులో కూరుకుపోయి... చాలా ఏళ్లు గడిచిన వయసు పెరగకుండా యవ్వనంగా ఉంటాడు. ఈ సినిమా స్టోరీలో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది.
Mark Antony
టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన మార్క్ ఆంటోని మంచి విజయం సాధించింది. (Science fiction movies in telugu) గతంలోని వ్యక్తులతో మాట్లాడే ఓ టెలీఫోన్‌ను కనిపెట్టినప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే స్టోరీతో ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మార్క్- ఆంటోనిగా విశాల్ డ్యూయల్ రోల్‌లో కనిపించి అదరగొట్టాడు.
Krrish 3
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. భయంకరమైన వైరస్‌ను భారత్ మీద ప్రయోగించినప్పుడు క్రిష్ దానిని ఎలా అంతమొందించాడు అనే స్టోరీతో అద్భుతంగా సినిమాను రాకేష్ రోషన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించింది.
Robo 2.o
సైన్స్ ఫిక్షన్ స్టోరీ లైన్‌తో ఈ సినిమా వచ్చింది. సెల్‌ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతుంటాయి. దీనిపై కోపంతో పక్షిరాజు అక్షయ్ కుమార్.. ఈ లోకంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఎలక్ట్రానిక్ డివైస్‌లు పనిచేయకుండా చేస్తాడు. దీంతో పక్షిరాజు నుంచి వచ్చిన విపత్తును కాపాడేందుకు రజనీకాంత్ Robo 2.O లెటెస్ట్ వెర్షన్‌గా వచ్చి కాపాడుతాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు. కాకపోతే ఈ సినిమా రోబో సినిమా అంత విజయం సాధించలేదు.
Robo
రజనీకాంత్ అందాల తార ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఒక రోబోకు ఫీలింగ్స్ అందిస్తే ఎలాంటి వినాశనం జరుగుతుందనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకెక్కిచారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది.
24
టైం ట్రావెల్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో సూర్య నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 24 అనే వాచ్‌లో టైమ్‌ను మారిస్తే గతంలోకి- భవిష్యత్‌లోకి ప్రయాణం చేయవచ్చు.
Skylab
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం విఫలమై దాని శిథిలాలు తెలంగాణలోని ఈ చిన్న గ్రామంపై పడేందుకు సిద్ధంగా ఉందనే వార్తల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి శివమణి, తనికెళ్ల భరణి నటించారు.
Srivalli
బ్రేయిన్ మ్యాపింగ్ అనే సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాను దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించారు. వేర్వేరు ప్రాంతాల్లో.. ఉన్న ఇద్దరు వ్యక్తులు కొన్నిసార్లు ఒకరి గురించి మరొకరు ఒకేవిధంగా ఆలోచిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ల మెదళ్ల మధ్య శబ్ద తరంగాలు ఎలా ప్రవహిస్తాయి? సైన్స్ దీనికేమైనా వివరణ ఇస్తుందా.. అనే పాయింట్ ఆధారంగా 'శ్రీవల్లి' సినిమా రూపొందింది.
Taxiwaala
ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే సైంటిఫిక్ థియరీతో ఈ సినిమా రూపొందింది. మనం చనిపోయిన తరువాత ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వెళ్తుంది. అయితే మనం బతికి ఉండగానే శరీరం నుంచి ఆత్మను వేరు చేసుకోవచ్చు అదే 'ఆస్ట్రల్ ప్రొజెక్షన్'. దీని ప్రకారం చనిపోయిన శరీరాల్లో ఈ ఆత్మలను ప్రవేశపెట్టి వారితో మాట్లాడవచ్చు. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జువాల్కర్ నటించింది.
Tik Tik Tik
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అంతరిక్షంలో తిరిగే ఓ భారీ ఉల్క వల్ల భారత్‌కు ప్రమాదం ఉందని తెలిసి దానిని దారి మళ్లించడానికి కొందరు వ్యోమగాములను పంపిస్తారు. ఈ టీమ్‌ను జయం రవి లీడ్ చేస్తాడు. ఆ ఉల్కను ఎలా దారి మళ్లించేందుకు వ్యోమగాములు ఏం చేశారన్నది కథాంశం. ఈ చిత్రంలో జయం రవితో పాటు, నివేత పేతురాజ్, రమేష్ తిలక్, ఆరోజ్ అజిజ్ తదితరులు నటించారు.
Chandamama Lo Amrutham
చందమామపై హోటల్ నెలకొల్పాలన్న వెరైటీ కథాంశంతో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ జోనర్‌లో తెరకెక్కింది. ఈ చిత్రంలో శివన్నారాయణ, ఇంటూరి వాసు, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించారు.
Yuganiki Okkadu
తమిళనాడును పాలించిన ప్రాచీన చోళులు- పాండ్యులతో వైరం వల్ల రాజ్యాన్ని వదిలి ఎవరు గుర్తించని ప్రాంతానికి వెళ్తారు. వారు వెళ్లే మార్గం ఎవరికీ తెలియకుండా అనేక అవాంతరాలు పెడుతారు. చివరకు వారిని ఎలా కనిపెట్టారు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో కార్తి అద్భుతంగా నటించాడు. అతని సరసన రీమా సేన్, ఆండ్రియా జెర్మియా నటించారు. ఈ సినిమాను సెల్వా రాఘవన్ తెరకెక్కించాడు.
ఆదిత్య 369
తెలుగులో వచ్చిన ఫస్ట్ టైం ట్రావెల్ సినిమా ఇది. ఇందులో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన బాలకృష్ణ... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి ప్రయాణిస్తాడు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది.
Kalki 2898 AD
సైన్స్ ఫిక్షన్ ఆధారంగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. కలియుగాంతంలో జరిగే విపత్తుల నుంచి ప్రజలను రక్షించే సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించనున్నాడు. టైం ట్రావెల్ మిషిన్ ద్వారా 2898 జన్మించబోయే కల్కిని 2024లోకి తీసుకుని రానున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకుణే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
నవంబర్ 07 , 2023
Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
కమెడియన్ వేణు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు దర్శకుడిగా మారి తీసిన సినిమా ‘బలగం’. తొలి సినిమానే ప్రతిష్టాత్మక నిర్మాత దిల్‌రాజు కాంపౌండ్‌లో తెరకెక్కడం విశేషం. తెలంగాణలో బలగం అంటే బంధుగణం. బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల ప్రేమలు, పల్లెటూరి మనస్తత్వాలు ఇలా అన్ని రంగరించి ఓ ఎమోషనల్ డ్రామాగా వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి తన ప్రయత్నం ఎంతమేరకు విజయవంతమైందో చూద్దాం.
చిత్రబృందం
నటీనటులు: ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు తదితరులు
దర్శకత్వం: వేణు ఎల్దండి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత
https://www.youtube.com/watch?v=8R3Vcy5CaPc
కథ:
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. దీనికి తోడు చావు ఇంట్లో జరిగిన గొడవతో పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇదే సమయంలో 20 ఏళ్ల క్రితమే ఊరి నుంచి వెళ్లిపోయిన కొమురయ్య చిన్న కొడుకు, కూతురు (సాయిలు మేనత్త) తండ్రి మరణవార్త విని ఊరికి వస్తారు. సాయిలు మేనత్త తన కూతురు సంధ్యను తీసుకుని వస్తుంది. సంధ్యను చూసి ఇష్టపడిన సాయిలు, తనకు బాగా ఆస్తి కూడా ఉందని తెలుసుని ఎలాగైనా తనని ప్రేమలో పడేయాలనుకుంటాడు. కానీ కర్మ రోజున కొమురయ్య పిండాన్ని ఏ కాకీ ముట్టుకోదు. అక్కడ సాయిలు మామ,బాబాయ్‌ల మధ్య గొడవ జరుగుతుంది. కాకి ముట్టకపోవడం ఊరికి అరిష్టమని భావించిన గ్రామ పెద్దలు.. కొమురయ్య కోరిక తీరకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అనుకుంటారు. 11వ రోజు కాకి ముట్టకపోతే వారిని ఊరి నుంచి వెలివేస్తామని హెచ్చరిస్తారు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాలు, తాత చావును సాయిలు ఎలా వాడుకున్నాడు. చివరికి ఏం జరిగింది అనేదే కథ.
ఎలా ఉంది:
చక్కటి తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. పల్లెటూరి యాస, సంస్కృతి, అమాయకత్వం, మొండితనం, మూర్ఖత్వం ఇలా అన్ని కోణాలను దర్శకుడు వేణు చక్కగా తెరకెక్కించాడు. తొలి సినిమానే అయినా అలా ఎక్కడా అనిపించదు. ప్రతి పాత్రా చాలా సహజంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ ఊరిలో ఉండి సాయిలును చూస్తున్నట్లు ఉంటుంది. భావోద్వేగాలు, కామెడీ చాలా సహజంగా ఉంటాయి. తెలంగాణ పల్లెటూరిలో ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఉండే పరిస్థితిని చాలా సహజంగా తెరకెక్కించాడు. తాత చావు, ఓ కాకి చుట్టూ కథ నడిపిస్తూ.. కామెడీ పండిస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడు. ఫస్టాఫ్ పాత్రల పరిచయం, కామెడీ ఉంటుంది. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో చివరి 15 నిమిషాల సినిమా కంటతడి పెట్టిస్తుంది. మన ఇంట్లో ఉండే తాత, నాయినమ్మ, అమ్మమ్మలను గుర్తుచేసేలా ఉంటుంది. భావోద్వేగాలు ఎంత చక్కగా పండాయో, కామెడీ కూడా అంతే చక్కగా పండింది.
నటీ నటులు:
సాయిలు పాత్రలో ప్రియదర్శి జీవించాడనే చెప్పాలి. నిజంగా మన ఇంటి పక్క సాయిలును చూసినట్టే ఉంటుంది. హీరోయిన్‌గా కావ్య బాగా నటించింది. సుధాకర్ రెడ్డి పాత్ర కాసేపే ఉన్నా చాలా బాగా చేశారు. రచ్చ రవి తన కామెడీతో మెప్పించాడు. ఇతర నటీ నటులు కూడా తమ పరిధిమేరకు నటించారు.
సాంకేతిక పనితీరు:
దర్శకుడు వేణు తొలి సినిమా అయినా చాలా చక్కగా తెరకెక్కించాడు. స్టార్ క్యాస్ట్ లేకపోయినా సినిమాలో ఉన్న నటులంతా సహజంగా నటించారు. కథనం విషయంలో కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియే సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ మెచ్చుకోవాలి. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సినిమా చాలా సహజంగా కనిపించడానికి వేణు సినిమాటోగ్రఫీ చాలా సాయపడింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి. చివరి 15 నిమిషాలు చక్కటి ఎమోషన్స్ పండాయంటే అందుకు కారణంగా చివర్లో వచ్చే బుర్ర కథ. దీనికి కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రొడక్షన్ పరంగా సినిమాకు ఏ లోటు లేదు.
బలాలు
కథ
కథా నేపథ్యం
భావోద్వేగాలు
కామెడీ
పాటల్లో సాహిత్యం
బలహీనతలు
కొన్ని చోట్ల సాగదీత సీన్లు
స్టార్ క్యాస్ట్ లేకపోవడం
ఒక్కమాటలో
చక్కటి భావోద్వేగాలతో ఉండే పల్లెటూరి కుటుంబ కథా చిత్రం బలగం. ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలనుకుంటే ‘బలగం’ మిస్ కాకూడని సినిమా.
రేటింగ్
3/5
మార్చి 03 , 2023
Prashanth Neel : సలార్, కేజీఎఫ్ 2 కలయికతో KGF 3..!
థియేటర్లలో పూనకాలే అంటున్న నెటిజన్లు
కన్నడ నటుడు యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. భారత చలనచిత్ర పరిశ్రమను నెలబెట్టిన సినిమాల్లో కచ్చితంగా కేజీఎఫ్ ఉంటుంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలు రికార్డు వసూళ్లను రాబట్టాయి. ముఖ్యంగా కేజీఎఫ్-2 చిత్రం రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్స్‌ను అధిగమించాయి. అయితే పార్ట్-2 హీరో సముద్రంలో మునిగిపోయినట్లు చూపించిన ప్రశాంత్ నీల్ మరణించినట్లు ధ్రువీకరించలేదు. దీంతో కచ్చితంగా పార్ట్-3 ఉంటుందని బలమైన సంకేతాలు వెళ్లాయి. ఇందుకు అనుగుణంగానే తాజాగా KGF మేకర్స్ పార్ట్-3పై ఆశలు కలిగించారు.
KGF-2 సినిమా రిలీజై నేటితో (ఏప్రిల్ 14) ఏడాది పూర్తైన సందర్బంగా మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. సినిమాలోని ప్రతీ పాత్రను తిరిగి గుర్తు చేస్తూ ఆ వీడియో సాగింది. ‘మరపురాని క్యారెక్టర్లు, యాక్షన్ ప్రయాణం అద్భుతంగా సాగింది. ప్రపంచ రికార్డులతో పాటు అనేక హృదయాలను గెలుచుకున్నాం’ అంటూ మేకర్స్ క్యాప్షన్ పెట్టారు. అమ్మకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది.. మరి నెరవేరిందా? అని మూడో పార్ట్‌పై హింట్ ఇచ్చారు. దీనిని మేకర్స్ చేసిన అధికారిక ప్రకటనగా భావించిన నెటిజన్లు #KGF3, #PrashanthNeel హ్యాష్‌ట్యాగ్‌లను తెగ ట్రెండ్ చేస్తున్నారు. కేజీఎఫ్2, సలార్ చిత్రాలను కలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
కేజీఎఫ్2, సలార్ చిత్రాల అనుసంధానంగా కేజీఎఫ్-3 రానుందని ఇప్పటినుంచే నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. ఈ మేరకు తమ అంచనాలను ట్విటర్‌లో పెడుతూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.
https://twitter.com/hombalefilms/status/1646732589540028416
https://twitter.com/adheeraeditz/status/1646759564300173313
https://twitter.com/VickyOfficia1/status/1646758480051576832
https://twitter.com/SagarPrabhas141/status/1646738776880992256
‘బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది డే’ అంటూ మరికొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. KGF-3 కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/MoviesPlexus/status/1646782407029444608
https://twitter.com/iamaniketL/status/1646781955395182593
https://twitter.com/Movies_Bar/status/1646781802378592257
1978-81 మధ్య రాకీ భాయ్ ఎక్కడ ఉన్నాడని సదరు వీడియోలో మేకర్స్ ఓ ప్రశ్నను వదిలారు. అయితే దానికి సమాధానం పార్ట్-3 వస్తుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. కేజీఎఫ్-3 కూడా ప్రభంజనం సృష్టిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/saloon_kada/status/1646776349733060608
https://twitter.com/imARajput66/status/1646781794988228608
థియేటర్‌లో అద్భుత అనుభూతిని పంచిన సినిమాల్లో కేజీఎఫ్ ఒకటని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. హీరో ఇంట్రో, క్లైమాక్స్ కోసమే మూడు సార్లు సినిమా చూశానని చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్-3 కోసం పిచ్చిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.
https://twitter.com/Thalapathy_Bk/status/1646758004715581441
కేజీఎఫ్ 3 అంచనాలకు అందని రీతిలో ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మన ఊహాకు మించి సినిమా ఉండబోతుందని అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/YUVA__YASHCULT/status/1646787256202698752
షారుక్ ఖాన్ రీసెంట్ మూవీ పఠాన్ రికార్డులను KGF3 బద్దలు కొడుతుందని నెటిజన్లు అంటున్నారు. ఒకసారి సినిమా రిలైజ్ అయితే పటాన్ రికార్డ్స్ ఎక్స్‌పైరేనని ట్వీట్లు చేస్తున్నారు.
ఏప్రిల్ 14 , 2023
Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి
లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ
రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లవ్ మీ’ (Love Me). ఇఫ్ యూ డేర్ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్ తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో కాస్త రొమాంటిక్ డోస్ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్ లవర్ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.
ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే.. పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్ సేన్).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.
పారిజాత పర్వం
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అని ఉపశీర్షిక పెట్టారు. (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో చూసేందుకు మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైతన్య (చైతన్యరావు) డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. స్నేహితుడ్ని (హర్ష) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాతల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో చివరికి తానే నిర్మాతగా మారి సినిమా తీయాలని ఫిక్సవుతాడు. డబ్బు కోసం శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) సెకండ్ సెటప్‌ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తాడు. మరోవైపు బారు శ్రీను (సునీల్), పారు (శ్రద్దా దాస్) కూడా ఆమెను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు బారు శ్రీను ఎవరు? అతడి కథేంటి? చైతన్య డైరెక్టర్ అయ్యాడా? లేదా? అన్నది కథ.
యక్షిణి
మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి & హారర్ సిరీస్ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్.. నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్‌లో మంచి హరర్ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు.
ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు, మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన కృష్ణ (రాహుల్ విజయ్)ని ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ.
పరువు
నివేదా పేతురాజ్, నరేష్ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పైన మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
జూన్ 15 , 2024
Tillu Square sequel: టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఉందా?... మూవీ మేకర్స్ క్లారిటీ!
టాలీవుడ్‌లో ఈ ఏడాదిలో మరో బ్లాక్ బాస్టర్ చిత్రం టిల్లు స్కేర్ అని చెప్పాలి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), క్యూట్ గల్ అనుపమ పరమేశ్వరణ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా. నాగ్ అశ్వీన్ నిర్మాణంలో దర్శకుడు మల్లిక్ రామ్ డెరెక్ట్ చేసిన టిల్లు స్కేర్ చిత్రానికి మేకర్స్ అనుకున్నదానికంటే ఎక్కువ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. రెండు మూడు రోజుల్లోనే ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడి తిరిగి రానున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు టిల్లు స్క్వేర్ ఓటిటి డీల్‌కి సంబంధించి క్రేజీ బజ్ తెలిసింది.
టిల్లు స్కేర్ ఓటీటీ ప్రసార హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా రూ.13 నుంచి రూ.15 కోట్ల వరకు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకన్నట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే టిల్లు స్కేర్ మంచి నెంబర్‌నే సాధించిందని చెప్పవచ్చు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం... ఓటీటీ ద్వారా గట్టి నెంబర్ సాధించడం పట్ల మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఉందా?
డీజే టిల్లు నుంచి 'టిల్లు స్కేర్' సీక్వేల్‌గా వచ్చింది. మరి టిల్లు స్కేర్ నుంచి మరో సీక్వేల్ వస్తే బాగుంటుందని ఈ సినిమా హిట్ తర్వాత అభిమానులు అనుకుంటున్నారు. రిలీజ్‌కు ముందు నుంచే ఈ బజ్ ఉండగా.. సినిమా విడుదల తర్వాత ఇది కాస్త ఎక్కువైంది. అయితే ఇదే విషయంపై మేకర్స్ టిల్లు స్క్వేర్ విడుదల తర్వాత స్పష్టత ఇచ్చారు. డీజే టిల్లు చిత్రం క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చినట్టుగా ఇందులో ఎలాంటి హింట్ ఇవ్వ లేదు. దీంతో మరో సినిమా లేనట్టే అని అంతా అనుకున్నారు. అయితే ప్రేక్షకుల మదిలో ఎక్కడో ఓ మూలన టిల్లు స్కేర్‌కు సీక్వేల్‌గా టిల్లు క్యూబ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.
టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఇస్తే ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను నిలబెట్టుకోలేక పోతే ఇబ్బందుల్లో పడుతామని తొలుత మేకర్స్ ఆలోచించారు. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాత నాగ్ వంశీ కూడా తెలిపారు. అయితే శుక్రవారం సాయంత్రం జరిగిన సక్సెస్ మీట్‌లో టిల్లు క్యూబ్ ఉంటుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. "నిజానికి మీడియా నుంచి నా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సీక్వేల్‌పై ఓ ఐడియా ఇచ్చారు. ఇదే విషయంపై హీరో సిద్ధూ నేను మాట్లాడుకున్నాం. అతి త్వరలోనే చేద్దామని నిర్ణయించుకున్నాం. క్లైమాక్స్‌లో హీరోయిన్ స్లో మోషన్ మీద టిల్లు 3 అనౌన్స్ చేస్తాం. సోమవారం నుంచి ప్రేక్షకులకు అది కనిపిస్తుంది" అని స్పష్టం చేశారు. టిల్లు క్యూబ్ అనౌన్స్ చేయడంలో డీజే టిల్లు అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు.
https://twitter.com/GulteOfficial/status/1773664243654471818?s=20
మార్చి 30 , 2024
Prabhas New Movie: ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ మరో కొత్త సినిమా.. టైటిల్ కూడా ఫిక్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా కేజీఎఫ్ (KGF) ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సలార్’ (Salaar). గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది. సలార్ పార్ట్ 2; శౌర్యంగ పర్వం (Salaar Part 2 ; Shouryaanga Parvam) పేరుతో ఇది రూపొందనుంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో మరో చిత్రం ఉండనున్నట్లు క్రేజీ బజ్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సినిమా టైటిల్ అదే!
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న ఈ హ్యాట్రిక్ మూవీకి టైటిల్ ఇదే అంటూ ఓ పేరు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘రావణం’ (Ravanam) అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రంగా ఇది రూపొందనున్నట్లు సమాచారం. భారత సినిమా చరిత్రలో ఇంతవరకూ రాని కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బాహుబలి తరహాలోనే..!
బాహుబలి తరహాలోనే ఈ సినిమాకు కూడా మైథలాజికల్ డ్రామా (Mythological Drama)గా రానుందని అంటున్నారు. ప్రభాస్ బాహుబలి తర్వాత ఆ జోనర్ సినిమాను ఇప్పటి వరకూ చేయలేదు. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ నటించినప్పటికీ అది రామాయణం ఆధారంగా తెరకెక్కింది. దీంతో కమర్షియల్‌గా రానున్న ‘రావణం’ ప్రభాస్ ఫేమ్, కెరీర్‌ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కథకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ మైథలాజికల్‌గా వస్తుందన్న ఊహాగానాలతో ‘రావణం’ ఆసక్తిరేపుతోంది.
నిర్మాత అతడే!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాను రూపొందిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తారని అంటున్నారు. ప్రస్తుతం దిల్ రాజు.. రామ్‌చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. దిల్‌రాజు ఫోకస్ మెుత్తం ప్రస్తుతం ఆ సినిమా పైనే ఉంది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ఆయన ‘రావణం’ మేకింగ్ వర్క్స్‌పై దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
షూటింగ్ ఎప్పుడు?
‘రావణం’ సినిమా షూటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ‘సలార్ 2’ తర్వాత వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని కొందరు అంటున్నారు. గతంలో తారక్ (Jr NTR)తో ప్రశాంత్ నీల్ ఓ సినిమాను ప్రకటించారు. ‘NTR 31’గా అది రావాల్సి ఉంది. అయితే తాజా బజ్ ప్రకారం ఆ మూవీ కంటే ముందే ‘రావణం’ తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే మరికొందరి విశ్లేషణ మరోలా ఉంది. 2026 తర్వాత ప్రశాంత్ నీల్ ‘రావణం’ ప్రాజెక్ట్‌ను టేకప్ చేయవచ్చని అంటున్నారు. అప్పటి వరకూ దీనిపై అధికారిక ప్రకటన కూడా ఉండకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లోనే ‘రావణం’పై క్లారిటీ రానుంది.
ఫిబ్రవరి 12 , 2024
Pushpa 2 Item Song: సమంతతో పోలిస్తే శ్రీలీలకు అన్యాయం? మరీ అంత తేడానా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతపెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇందులో సమంత చేసిన ‘ఊ అంటావా ఊఊ అంటావా’ ఐటెం సాంగ్ యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ ఈ తరహా ఐటెంగ్ సాంగ్ (Pushpa 2 Item Song)ను సుకుమార్ ఏర్పాటు చేశాడు. ఈసారి సమంత ప్లేసులో శ్రీలీల ఈ స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఇటీవల సాంగ్ షూటింగ్ సెట్ నుంచి శ్రీలీల ఫొటోలు సైతం బయటకొచ్చాయి. ఇదిలాఉంటే శ్రీలీల పారితోషికంకు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. దీంతో ఆమెకు అన్యాయం జరిగిందన్న వాదనలు ఊపందుకున్నాయి.
శ్రీలీల పారితోషికం ఎంతంటే?
అల్లుఅర్జున్ - సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా సుకుమార్‌గా తమవంతు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఐటెం సాంగ్ (Pushpa 2 Item Song)లో చేసిన హీరోయిన్ శ్రీలీలకు భారీ మెుత్తంలో పారితోషికం ముట్టచెప్పినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ‘కిస్సిక్కి’ అంటూ సాగే ఈ పాట కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెట్, హీరోయిన్ పారితోషికం ఇతర మొత్తం కలిపి రూ.5 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నాయి.
సమంతతో పోలిస్తే అన్యాయం!
2021లో వచ్చిన ‘పుష్ప’ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసింది. ఇందుకు గాను సామ్ అప్పట్లోనే రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శ్రీలీలకు రూ.2 కోట్ల పారితోషికం ఇవ్వడంపై ఆమె అభిమానులు పెదవి విరుస్తున్నారు. శ్రీలీలకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సమంతకు ఇచ్చిన దానిలో సగం కూడా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీలకు ఏం తక్కువ అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిని ఫిల్మ్ వర్గాలు ఖండిస్తున్నాయి. శ్రీలీలకు ఎలాంటి అన్యాయం జరగలేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల మూడు గంటల సినిమా చేస్తే రూ.4-5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ‘పుష్ప 2’లో 3 నిమిషాల పాటకే ఆమెకు రూ. 2 కోట్లు ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఆమెకు తన మార్కెట్ విలువ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్‌ను అందిందని పేర్కొంటున్నారు.
శ్రీలీల.. బన్నీ ఛాయిస్!
పుష్ప 2 ఐటెం సాంగ్ (Pushpa 2 Item Song)కు శ్రీలీలను ఎంచుకోవాలన్నది డైరెక్టర్ సుకుమార్ ఆలోచన కాదని సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జునే శ్రీలీలను సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ ఇంతకుముందే శ్రీలీలతో కలిసి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ కోసం ఒక యాడ్ చేశాడు. వీరిద్దరి కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లోనే సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. మరోవైపు ఈ జనరేషన్ హీరోయిన్లలో శ్రీలీల బెస్ట్ డ్యాన్సర్ కీర్తింప బడుతోంది. ఈ నేపథ్యంలో బన్నీ-శ్రీలీల ఒకే వేదికపై ఆడి పాడితే ఆడియన్స్‌లో పూనకాలు రావడం పక్కా. ఇవన్నీ ఆలోచించే శ్రీలీలపై బన్నీ మెుగ్గు చూపినట్లు సమాచారం. అంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శ్రద్ధా కపూర్, దిశా పటానీ, త్రిప్తి దిమ్రి పేర్లు ఈ ఐటెం సాంగ్ పరిశీలనలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
పాట్నాలో ట్రైలర్ రిలీజ్
దేశ విదేశాల్లో ఉన్న సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule). మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో ట్రైలర్ రిలీజ్‌పై మూవీ టీమ్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు పాట్నాలో ట్రైలర్ (Pushpa 2 Trailer)ను విడుదల చేయనున్నట్లు రీసెంట్‌గా ప్రకటించింది. ఈ మేరకు బన్నీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది. ఇందులో గన్ భుజాన పెట్టుకొని పుష్పగాడు ఎంతో అగ్రెసివ్‌గా కనిపించాడు. ఇది చూసిన సినీ లవర్స్ తెగ ఖుషీ అవుతున్నారు. పుష్ప 2 ట్రైలర్ దెబ్బకు సోషల్ మీడియా మోతమోగడం ఖాయమని అంటున్నారు.
https://twitter.com/PushpaMovie/status/1855922382181134676
నవంబర్ 13 , 2024
HBD Anushka Shetty: అనుష్క శెట్టి క్రష్ ఎవరో తెలిసిపోయింది! ఆ హీరో మాత్రం కాదు
సౌత్‌లో హీరోల మాదిరి క్రేజ్ సంపాందించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క (Anushka Shetty). తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఇవాళ అనుష్క పుట్టిన రోజు. 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్‌లో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రసిద్ధ తులు కుటుంబం నుండి వచ్చిన అనుష్క నటి అవుతానని ఎప్పడూ అనుకోలేదట. కొన్ని పరిస్థితుల వల్ల నటి కావాల్సి వచ్చిందని ఈ బ్యూటీ చెప్పింది.
బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుంచి అనుష్క డిగ్రీ పట్టా అందుకుంది. ఈ కాలేజీలోనే స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, అనుష్క శర్మ, మమతా మోహన్ దాస్ వంటి సినీ తారలు చదువుకున్నారు.
అనుష్క కళాశాలలో చదువుకునే రోజుల్లో ‘తపస్య‘ అనే ధ్యాన వర్క్ షాపుకు వెళ్తుండేది. ఆమెకు దానిపై ఆసక్తి లేకపోయినప్పటికీ తన తండ్రి విట్టల్ శెట్టి కోసమే ఆ సెషనుకు హాజరయ్యేది.
View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial)
అనుష్క శెట్టి తన గురువు భరత్ ఠాకూర్ చేత యోగాలో మెళుకువలు నేర్చుకుంది. ఆ తర్వాత యోగాను తన వృత్తిగా ఎంచుకుంది. ముంబయిలో కొంతకాలం పాటు యోగా సెషన్లు సైతం నిర్వహించింది.
యోగా టీచర్‌గా చాలా బిజీగా ఉన్నప్పుడేే పూరి జగన్నాథ్ డైరక్షన్‌లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో ‘సూపర్‘ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.
View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial)
నిజానికి అనుష్క శెట్టి అసలు పేరు స్విటీ. ‘సూపర్‘ సినిమా సెట్స్‌లో అందరూ ఆమెను స్విటీ అని పిలిచినప్పుడల్లా ఆమెకు ఇబ్బందిగా అనిపించేదట.
దీంతో తన పేరును అనుష్క శెట్టిగా మార్చుకోవాలని నిర్ణయించుకుందట. అయితే కుటుంబ సభ్యుల అనుమతి కోసం ఏడాది కాలం పాటు ఈ అమ్మడు వెయిట్ చేయాల్సి వచ్చిందట.
View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial)
టాలీవుడ్ ఎత్తైన హీరోయిన్లలో అనుష్కశెట్టి ఒకరు. ఆమె ఎత్తు ఏకంగా 5 అడుగుల 9 అంగుళాలు. ఆమె ఏదైనా వేదికపై నిలబడి మాట్లాడేటప్పుడు మన హీరోలు కొందరు ఆమె కన్నా పొట్టిగా కనిపిస్తారు.
అనుష్క ఏదైనా విషయంలో ఒత్తిడి కలిగితే దాన్ని అధిగమించడానికి ఒక ఆసక్తికరమైన పని చేస్తుంది. తనకు అత్యంత ఇష్టమైన సామెతలను చదువుతుంది. అలా చేయడం వల్ల వెంటనే రిలాక్స్ అయిపోతానని ఓ ఇంటర్వ్యూలో అనుష్క తెలిపింది.
అనుష్క శెట్టి ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లాలన్నా సమయపాలన కచ్చితంగా పాటిస్తుందట. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకుంటుందట. ఇది తన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనుష్క చెప్పింది.
రాత్రి వేళ భోజనం కూడా 8 గంటలలోపే పూర్తి చేస్తుందట. దీని వల్ల ఆమెకు మంచి నిద్ర వస్తుందట. అలాగే ఉదయం 7 గంటలలోపు లేచి యోగాతో రోజును ప్రారంభిస్తానని స్వీటి తన సీక్రెట్‌ను రివీల్ చేసింది.
ఈ యోగా బ్యూటీ అనుష్కకు ఇంగ్లీషులో కవితలు రాయడం అంటే చాలా ఇష్టమట. అలాగే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వార్తా పత్రికలను సేకరించే అలవాటు కూడా ఉందట.
‘సైజ్ జీరో’ సినిమా ముందు వరకూ నాజుగ్గా ఉన్న అనుష్క ఆ మూవీ కోసం బిగ్ మిస్టేక్ చేసింది. పాత్ర కోసం విపరీతంగా బరువు పెరిగింది. ఆ తర్వాత సన్నబడేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రభావం ఇప్పటికీ అమెను వెంటాడుతోంది.
సాధారణంగా హీరోయిన్లకు తమ ఫస్ట్ క్రష్ హీరోలు ఉంటారు. కానీ అనుష్క శెట్టి ఇందుకు భిన్నం. తన ఫస్ట్ క్రష్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అని ఓ ఇంటర్వూలో రివీల్ చేసింది.
సినిమాల్లోకి రాకముందు నుంచే రాహుల్ అంటే తనకు పిచ్చి అని స్వీటి చెప్పుకొచ్చింది. అయితే రాహుల్ ద్రావిడ్‌ను కలిసే అవకాశం పెద్దగా రాలేదని వాపోయింది.
'అరుంధతి' సినిమా అనుష్క ఫిల్మ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ సినిమా సక్సెస్‌తోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ హోదా ఈ అమ్మడు దక్కించుకుంది.
ఆ తర్వాతే రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, భాగమంతి వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసి ఆమె తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.
వాస్తవానికి అరుంధతి ఆఫర్ నేరుగా తన వద్దకు రాలేదని అనుష్క ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ హీరోయిన్ రిజెక్ట్ చేయడం వల్లే తనకు కలిసొచ్చిందని తెలిపింది. ఆ హీరోయిన్ ఎవరన్న విషయం మాత్రం రివీల్ చేయలేదు.
అనుష్క ఫిట్‌నెస్ సీక్రెట్స్‌తో ఓ బుక్ రిలీజైన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ల్యూక్ కుతిన్హో రచనలో వచ్చిన 'ది మ్యాజిక్ వెయిల్ లాస్ పిల్' అనే బుక్‌లో తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ను అనుష్క రివీల్ చేసింది. 62 రకాల హెల్త్ టిప్స్, వెయిట్ లాస్ టెక్నిక్స్ ఇందులో ఉంటాయి.
అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఘాటి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నేడు అనుష్క బర్త్‌డే సందర్భంగా ఉదయం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో స్వీటీ తల, చేతికి రక్తం ఉండగా ఆమె సిగర్ తాగుతూ కనిపించింది.
సాయంత్ర 4:05 గంటలకు ‘ఘాటి’ స్పెషల్ గ్లింప్స్‌ను సైతం మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఇందులో అనుష్క కొడవలి పట్టి ఒకరి పీక కోసి తీసుకెళ్తున్నట్లు దారుణంగా చూపించారు. అనుష్కకు అదిరిపోయే మాస్ ఎలివేషన్ ఇచ్చారు.
https://www.youtube.com/watch?v=W5FkYULk3Ls
నవంబర్ 07 , 2024