• TFIDB EN
  • రేసు గుర్రం
    UATelugu2h 43m
    హీరోకి తన అన్న అంటే అస్సలు పడదు. పోలీసు అధికారైన తన అన్నను ఓ పోలిటిషియన్‌ చంపాలని చూస్తున్నట్లు హీరో తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? అన్నను కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్లాన్లు వేశాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అల్లు అర్జున్
    ఒక నిర్లక్ష్యపు వ్యక్తి యునైటెడ్ స్టేట్స్‌లో స్థిరపడాలని కోరుకుంటాడు మరియు అతని సోదరుడు రామ్‌తో తరచుగా వాదిస్తాడు.
    శృతి హాసన్
    లక్కీని కలుసుకున్నప్పుడు మరియు ప్రేమలో పడినప్పుడు భావవ్యక్తీకరణ చెందే భావోద్వేగం లేని అమ్మాయి.
    షామ్
    లక్కీ అన్నయ్య మరియు నిజాయితీగల మరియు గౌరవప్రదమైన పోలీసు ఎల్లప్పుడూ పుస్తకం ద్వారా పనులు చేసేవాడు.
    రవి కిషన్ శుక్లా
    వంక మంత్రి కాకముందు రౌడీగా ఉండేవాడు.
    ప్రకాష్ రాజ్
    స్పందన మిలియనీర్ తండ్రి.
    బ్రహ్మానందం
    విసుగు చెందిన మరియు నైపుణ్యం కలిగిన ప్రత్యేక పోలీసు అధికారి.
    ఎంఎస్ నారాయణ
    అదృష్టవంతుడు తన మామగా భావించేవాడు.
    పోసాని కృష్ణ మురళి
    కారు ఢీకొన్న బాలుడిని గోవర్ధన్ రక్షించినట్లు అనిపించింది.
    జయ ప్రకాష్ రెడ్డి
    ప్రధాన పోలీసు.
    ముఖేష్ రిషి
    శివారెడ్డి తండ్రి.
    ప్రగతి మహావాది
    స్పందన తల్లి.
    తనికెళ్ల భరణి
    లక్కీ మరియు రామ్ తండ్రి
    పవిత్ర లోకేష్
    లక్కీ మరియు రామ్ తల్లి
    కోట శ్రీనివాసరావు
    పౌర సరఫరాల మంత్రి మరియు కూటమి పార్టీ నాయకుడు.
    సాయాజీ షిండే
    ముఖ్యమంత్రి
    తాగుబోతు రమేష్
    లక్కీ ఫ్రెండ్
    రాజీవ్ కనకాల
    అతని మొత్తం స్క్వాడ్ చంపబడకుండా ఉండటానికి అతని కమాండింగ్ అధికారిని బలవంతంగా చంపవలసి వచ్చింది.
    పరుచూరి బ్రదర్స్
    రామ్ సహోద్యోగి తండ్రి
    దువ్వాసి మోహన్
    రామ్ స్నేహితుడు మరియు పోలీసు అధికారి
    రఘు బాబు
    దొంగ
    నర్సింగ్ యాదవ్
    దండపాణి
    సుడిగాలి సుధీర్
    స్పందన కారు డ్రైవర్
    రఘు కారుమంచి
    పెద్ది రెడ్డి అనుచరుడు
    కైరా దత్
    ప్రత్యేక పాత్ర
    సిబ్బంది
    సురేందర్ రెడ్డి
    దర్శకుడు
    నల్లమలుపు బుజ్జి
    నిర్మాత
    వెంకటేశ్వరరావునిర్మాత
    తమన్ ఎస్
    సంగీతకారుడు
    వక్కంతం వంశీ
    కథ
    మనోజ్ పరమహంస
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
    Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
    దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినీ పరిశ్రమ నుంచి వచ్చి ప్రముఖ రాజకీయ నేతలుగా ఎదిగిన వారు దేశంలో చాలామందే ఉన్నారు. అందులో కొందరు పార్టీలు పెట్టగా, మరికొందరు వివిధ పార్టీల్లో చేరి విజయాలను అందుకున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలు సహా.. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మంగళవారం (జూన్‌ 4) ఓట్ల లెక్కింపు జరగ్గా.. పలువురు సెలబ్రిటీలు గణనీయమైన విక్టరీని సొంతం చేసుకున్నారు. మరికొందరు ఓటమీని చవిచూశారు. వారెవరో ఈ కథనంలో తెలుసుకుందాం.  పవన్‌ కల్యాణ్‌ (ఆంధ్రప్రదేశ్‌) జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) 2024 ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారారు. అధికార వైకాపా ప్రభుత్వాన్ని కూలతోసే లక్ష్యంతో పని చేసి సక్సెస్‌ అయ్యారు. ఆయన ప్రోత్సాహంతో ఏర్పడిన ఎన్‌డీఏ (టీడీపీ + జనసేన + భాజపా) కూటమి 175 సీట్లకు గాను ఏకంగా 164 కైవసం (టీడీపీ 135, జనసేన 21, భాజపా 8) చేసుకుంది. అటు 25కు గాను 21 ఎంపీ స్థానాలను (టీడీపీ 16, భాజపా 3, జనసేన 2) సొంతం చేసుకుంది. పొత్తులో భాగంగా పవన్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా 100స్ట్రైక్‌రేట్‌తో అన్ని స్థానాల్లో విజయ దుందుభి మోగించడం విశేషం. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజక వర్గం నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కొలువుదీరనున్న ఏపీ ప్రభుత్వంలో పవన్‌ కీలక పాత్ర పోషించనున్నారు.  https://twitter.com/i/status/1797987460137549943 నందమూరి బాలకృష్ణ (ఆంధ్రప్రదేశ్‌) హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై (TN Deepika) ఆయన 31,602 ఓట్లతో గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. ఎన్టీ రామారావు (Sr NTR) రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే కంచుకోటగా ఉన్న హిందూపురంలో.. బాలకృష్ణ 2014 నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. https://twitter.com/i/status/1797996139146617307 కంగనా రనౌత్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌) హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (భాజపా తరఫున) అరంగేట్రంలోనే విజయం సాధించారు.  కాంగ్రెస్‌ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌పై 74వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. హేమామాలిని (ఉత్తర్‌ ప్రదేశ్‌) ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ హేమమాలిని.. ఈ దఫా కూడా ఎన్నికల్లో నిలబడి సత్తా చాటారు. యూపీలోని మథుర నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ముకేశ్‌ ధంగర్‌పై 2.93 లక్షల మెజార్టీతో ఆమె గెలుపొందారు.  రవి కిషన్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) ‘రేసు గుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు రవికిషన్‌ కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయాన్ని అందుకున్నారు. గోరఖ్‌పుర్‌ (యూపీ)లో తన సమీప ప్రత్యర్థి భోజ్‌పురి నటి కాజల్‌ నిషాద్‌ (ఎస్పీ)పై లక్ష ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు.  శతృఘ్న సిన్హా (బెంగాల్‌) సీనియర్‌ సినీ నటుడు, అసన్‌సోల్‌ సిట్టింగ్‌ ఎంపీ శతృఘ్న సిన్హా (టీఎంసీ) వరుసగా రెండోసారి విజయం సాధించారు. భాజపా అభ్యర్థి ఎస్‌.ఎస్‌ అహ్లూవాలియాపై దాదాపు 60వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సురేశ్‌ గోపి (కేరళ) సినీయర్‌ మలయాళ నటుడు సురేశ్‌ గోపి కేరళలో భాజపాకు తొలి విజయాన్ని అందజేశాడు. త్రిసూర్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేశ్‌ గోపి 74వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో భాజపా తొలిసారి కేరళలో బోణి చేసినట్లైంది.  https://twitter.com/i/status/1797900510726676534 మనోజ్‌ తివారి (ఢిల్లీ) నార్త్‌ ఈస్ట్‌ దిల్లీ నుంచి భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారీ భాజపా అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేశారు. తాజా ఫలితాల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై 1,38,778 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  https://twitter.com/i/status/1798059260410318868 అరుణ్‌ గోవిల్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) బుల్లితెరపై రాముడిగా అలరించిన ప్రముఖ నటుడు అరుణ్‌ గోవిల్‌ (భాజపా).. ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌లో తన సమీప ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మపై 10,585 ఓట్ల ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయాన్ని కైవసం చేసుకున్నారు.  విజయ్‌ వసంత్‌ (తమిళనాడు) తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ, తమిళ నటుడు విజయ్‌ వసంత్‌ తన సమీప భాజపా అభ్యర్థి పొన్‌ రాధాకృష్ణన్‌పై 1,79,097 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  దీపక్‌ అధికారి (బెంగాల్‌) బెంగాల్‌లోని ఘటల్‌ నుంచి తృణమూల్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన సినీ నటుడు దీపక్‌ అధికారి అలియాస్‌ దేవ్‌ తన సమీప భాజపా అభ్యర్థి, సినీ నటుడు హిరణ్మయ్‌ ఛటోపాధ్యాయపై 1.82 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. ఓడిపోయిన సెలబ్రిటీలు నవనీత్‌ రాణా (మహారాష్ట్ర) తెలుగులో పలు సినిమాల్లో అలరించిన నటి నవనీత్‌ రాణా వరుసగా రెండోసారి అమరావతి (మహారాష్ట్ర) నుంచి తలపడ్డారు. అయితే.. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్వంత్‌ బసవంత్‌ వాంఖడే చేతిలో 19 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. లాకెట్‌ ఛటర్జీ (బెంగాల్‌) పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి సినీ నటి, సిట్టింగ్‌ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ (భాజపా) మరోసారి ఇదే స్థానం నుంచి బరిలో దిగారు. ఆమెకు పోటీగా టీఎంసీ మరో ప్రముఖ నటి రచనా బెనర్జీని నిలబెట్టింది. ఈ క్రమంలోనే రచన 76 వేల ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.
    జూన్ 05 , 2024
    20 Years Of Allu Arjun: వీడు హీరోనా అన్నారు..ఐకాన్‌ స్టార్‌ అయ్యాడు!
    20 Years Of Allu Arjun: వీడు హీరోనా అన్నారు..ఐకాన్‌ స్టార్‌ అయ్యాడు!
    ‘అల్లు అర్జున్‌’... ! పుష్ప సినిమాతో ఇండియాను షేక్‌ చేసి పాన్‌ ఇండియన్‌ స్టార్‌. ఐకాన్‌ స్టార్‌. అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న నటుల్లో ఒకరు. బ్రాండ్‌ వాల్యూలో ఇండియాలో టాప్‌-25లో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్‌ ఇండియన్‌ హీరో. హైయెస్ట్‌ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న వారిలో ఒకడు. కానీ ఇదంతా ఒక్క రోజులో రాలేదు. 20 ఏళ్ల కఠోర శ్రమ, నిబద్ధత పట్టుదల, కథల ఎంపికలో వైవిధ్యత సినిమా కోసం కష్టపడే తత్వం ఇవన్నీకలిపితేనే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. https://telugu.yousay.tv/allu-arjun-pushpa-will-decrease-in-brand-value-allu-arjun-rashmika-and-pv-sindhu-in-top-25.html తొలి అడుగు 28 మార్చి 2003లో గంగోత్రి సినిమా వచ్చినపుడు చాలా మంది విమర్శించారు. ఇతను హీరోనా అని మాట్లాడిన వారు కూడా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ వాటన్నింటికీ సమాధానం చెప్పాడు. 6 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 3 నంది అవార్డులతో తనలోని నటుడిని ప్రపంచానికి చాటాడు. మరి అల్లు అర్జున్‌ను స్టార్‌ చేసిన అంశాలేంటో చూద్దాం. కథల ఎంపిక గంగోత్రి విడుదలైన నాటి నుంచి ఇప్పటిదాకా అల్లు అర్జున్‌ను స్టార్‌గా నిలిచేలా చేసింది మాత్రం అతడి స్టోరీ సెలెక్షన్‌. అల్లు అర్జున్‌ ఏ రెండు వరుస సినిమాలు కూడా ఒకే పంథాలో సాగవు. లుక్‌, మేనరిజం ఇలా ప్రతీది మారిపోతుంది. గంగోత్రితో విమర్శలు ఎదుర్కొన్నా… ఆ తర్వాత 2004లో వచ్చిన సుకుమార్‌ ‘ఆర్య’ సినిమా అల్లు అర్జున్‌ పేరు మార్మోగేలా చేసింది. అప్పటిదాకా తెలుగు సినిమా చూడని వెరైటీ లవ్‌స్టోరీని అల్లు అర్జున్‌ ఎంపిక చేసుకోవడం సాహసమనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నింటిలోనూ అల్లు అర్జున్ డిఫరెంట్‌గానే కనిపిస్తాడు. బన్నీ, పరుగు, దేశముదురు, ఆర్య-2, వేదం, దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో ఇలా తనలోని నటుడిని సినీ ప్రపంచానికి పరిచయం చేస్తూనే వచ్చాడు. పుష్పలో అయితే ఊర మాస్‌ లుక్‌లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాడు. డ్యాన్స్‌ మరో మాట లేకుండా ఇండియాలోని  హీరోల్లో బెస్ట్‌ డ్యాన్సర్స్‌లో అల్లు అర్జున్‌ ఒకడు. అతడి డ్యాన్స్‌కు టాలివుడ్‌లోనే కాదు బాలివుడ్‌లోనూ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆర్య-2, అల వైకుంఠపురములో, రేసు గుర్రం ఇలా ఏ సినిమా తీసుకున్నా అల్లు అర్జున్‌ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే. సుకుమార్ అల్లు అర్జున్‌ కెరీర్‌లో సుకుమార్‌ది కీలక పాత్ర అనడం అతిశయోక్తి కాదు. అప్పుడు ఆర్యతో అతడి కెరీర్‌ను మలుపు తిప్పాడు. అలాగే ‘పుష్ప’తో పాన్‌ ఇండియా స్టార్‌ మార్చాడు. ఇప్పుడు పుష్ప: ది రూల్‌తో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.  https://telugu.yousay.tv/allu-arjun-passed-prabhas-in-remuneration.html అల్లు అర్జున్‌ చేసిన అద్భుతమైన పాత్రలు అల్లు అర్జున్‌ సినీ కెరీర్‌లో కథల ఎంపిక, డ్యాన్స్‌లతో పాటు కొన్ని పాత్రలు సినీ ప్రియులు మరిచిపోలేరు. అవి ఆర్య సుకుమార్‌ కల్ట్‌ క్లాసిక్‌ మూవీ ఆర్యలో ‘ఆర్య’గా అల్లు అర్జున్‌ను ఎవరూ మర్చిపోలేరు. సినిమా అంతా నవ్వించినా, నవ్వులపాలైనా చివరిలో కన్నీరు పెట్టించినా ‘ఆర్య’ పాత్ర సూపర్‌ అని చెప్పాలి. బాల గోవింద్‌ అల్లు అర్జున్‌కు మాస్‌ ఇమేజ్ తెచ్చిన సినిమా దేశముదురు. ఇందులో బాల గోవింద్‌గా అల్లు అర్జున్ పాత్ర ఊర మాస్‌ ఉంటుంది. ఇందులో బాలగోవింద్‌ డైలాగ్స్‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్‌గా ఉంటాయి. గోన గన్నారెడ్డి స్టైలిష్‌ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్‌ కంప్లీట్‌ డీ గ్లామర్‌ రోల్‌లో చూపించిన సినిమా రుద్రమదేవి. ఇందులో గోన గన్నారెడ్డిగా తెలంగాణ యాసలో అల్లు అర్జున్‌ చెప్పే డైలాగులు ఎవరూ మర్చిపోలేరు. కేబుల్‌ రాజు క్రిష్‌ తెరకెక్కించిన ‘వేదం’ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా. హీరోయిజంకు ఏమాత్రం అవకాశం లేకుండా కేవలం నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర కేబుల్‌ రాజు. ఎంతోమంది మిడిల్‌ క్లాస్‌ కుర్రాళ్లకు కనెక్ట్‌ అయిన పాత్ర. ఇది కూడా అల్లు అర్జున్ కెరీర్‌లో అద్భుతమైన పాత్రల్లో ఒకటి. పుష్ప ఫైనల్‌గా ‘పుష్ప’. పుష్పరాజ్‌ అంటూ అల్లు అర్జున్‌ చేసిన ఈ పాత్ర తన కెరీర్‌లో మైలురాయి. 20 ఏళ్ల కష్టానికి ఫలితాన్నిచ్చిన పాత్ర. ప్రస్తుతం పుష్ప-2 కోసం అల్లు అర్జున్‌ కష్టపడుతున్నారు. సుకుమార్‌ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. తన 20 ఏళ్ల ప్రయాణంపై అల్లు అర్జున్‌ ఎమోషనల్ పోస్ట్‌ చేశారు. ‘ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ప్రేక్షకులు, అభిమానులే. సదా మీకు కృతజ్ఞుడను’ అంటూ అల్లు అర్జున్‌ ట్వీట్ చేశాడు. https://twitter.com/alluarjun/status/1640581255732535296?s=20
    మార్చి 28 , 2023
    <strong>Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!</strong>
    Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!
    ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనను కొద్ది కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ‌ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.&nbsp; [toc] అసలేం జరిగిందంటే? జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘2017లో జానీ మాస్టర్‌ నాకు పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్‌ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్‌ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం (సెప్టెంబర్‌ 19) ఆయన్ని అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. తప్పు చేస్తే ఒప్పుకోండి: మంచు మనోజ్‌ మైనర్ అయినప్పటి నుంచి జానీ మాస్టర్‌ తనను వేధించాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత నుంచి జానీ మాస్టర్‌ కనిపించకుండా పోయారు. దీనిపై నటుడు మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ‘జానీ మాస్టర్.. మీరు కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు. https://twitter.com/HeroManoj1/status/1836692133216174368 జానీ మాస్టర్‌ టాప్‌-10 సాంగ్స్‌ జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని కాస్త పక్కన పెడితే ఆయన బెస్ట్‌ కొరియోగ్రాఫర్ అన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో పలు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌కు నృత్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఇటీవల నేషనల్‌ అవార్డు సైతం అందుకొని దేశంలోనే బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు. ఇప్పటివరకూ ఆయన కొరియోగ్రఫీలో వచ్చిన టాప్‌ -10 సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం&nbsp; మేఘం కరిగేనా (తిరు) తమిళంలో ధనుష్‌ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రంబళం’ సినిమా తెలుగులో 'తిరు' పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలోని 'మేఘం కరిగేనా' సాంగ్‌ను జానీ మాస్టర్‌ అద్భుతంగా కొరియోగ్రాఫ్‌ చేశారు. ధనుష్‌, నిత్య స్టెప్పులను నెక్స్ట్‌ లెవల్లో కంపోజ్‌ చేశారు. గతంలో ప్రభుదేవ చేసిన ‘వెన్నెలవే వెన్నలవే’ తరహాలో ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్‌ చేసింది. ఇందుకుగాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నేషనల్‌ బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై అందరి ప్రశంసలు అందుకున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=0IdqwA2GXgY అరబిక్‌ కుతు (బీస్ట్‌) విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలోని అరబిక్‌ కుతు సాంగ్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీకి తమిళ ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. విజయ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు స్టెప్స్‌ కంపోజ్‌ చేసిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. నటి పూజా హెగ్డే కూడా కెరీర్‌ బెస్ట్‌ స్టెప్స్‌తో ఓ ఊపు ఊపింది. https://www.youtube.com/watch?v=vOYJmUE_U24 రంజితమే (వారసుడు) విజయ్‌, రష్మిక జంటగా నటించిన ‘వారసుడు’ చిత్రంలోని రంజితమే సాంగ్‌ కూడా పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ పాటలో విజయ్‌, రష్మిక డ్యాన్స్‌ దెబ్బకు థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా సాంగ్‌ చివరిలో వచ్చే సింగిల్‌ టేక్‌ స్టెప్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ సాంగ్‌తో జానీ మాస్టర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=RoBavDxV-Y8 రారా రక్కమ్మ (విక్రాంత్‌ రోణ) విక్రాంత్‌ రోణ సినిమాలోని రారా రక్కమ్మ సాంగ్‌ దేశంలోని మ్యూజిక్‌ లవర్స్‌ను షేక్‌ చేసింది. ముఖ్యంగా జానీ మాస్టర్‌ అందించిన సిగ్నేచర్‌ స్టెప్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. చాలా ముంది యువత ఆ హుక్‌ స్టెప్‌పై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యారు. ఈ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్‌, కన్నడ నటుడు సుదీప్‌తో ఆడిపాడింది.&nbsp; https://www.youtube.com/watch?v=aC9KBju5BNY నువ్వు కావాలయ్యా (జైలర్‌) రజనీకాంత్‌ గత చిత్రం ‘జైలర్‌’లో నువ్వు కావాలయ్యా సాంగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. మిల్క్‌ బ్యూటీ తమన్న వేసిన హుక్‌ స్టెప్‌కు యూత్‌ ఫిదా అయ్యారు. ఈ సాంగ్‌ను కూడా జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేయడం విశేషం. ఈ పాటకు యూట్యూబ్‌లో మిలియన్స్‌ కొద్ది వ్యూస్‌ వచ్చాయి. రీల్స్‌ సైతం పెద్ద ఎత్తున చేశారు.&nbsp; https://www.youtube.com/watch?v=xMOuFKJmjNk రౌడీ బేబీ (మారి 2) సాయి పల్లవి, ధనుశ్ నటించిన ‘మారి 2’లోని రౌడీ బేబి సాంగ్‌ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట యూట్యూబ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి, ధనుష్‌ స్టెప్పులు అందరినీ కట్టిపడేశాయి. వాస్తవానికి మెుదట ఈ సాంగ్‌ ప్రభుదేవ వద్దకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో జానీ మాస్టర్‌ ఈ పాటను కంపోజ్ చేశారు. ప్రభుదేవా పర్యవేక్షణలో సాంగ్‌ చిత్రీకరణ జరిగింది.&nbsp; https://www.youtube.com/watch?v=O6FNcjUs0YI బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో) ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురంలో’ని బుట్టబొమ్మ సాంగ్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాయకుడు అర్మాన్‌ మాలిక్ ఆలపించిన పాటకు జాని మాస్టర్‌ తనదైన శైలిలో స్టెప్పులు డిజైన్‌ చేశారు. సాహిత్యానికి తగ్గట్లు యూనిక్‌ స్టెప్పులను బన్నీ చేత వేయించి సాంగ్‌ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించాడు. https://www.youtube.com/watch?v=2mDCVzruYzQ సినిమా చూపిస్తా మావా (రేసు గుర్రం) ‘రేసుగుర్రం’లోని మాస్‌ బీట్‌ ఉన్న సినిమా చూపిస్తా మావ పాటను కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫ్‌ చేశారు. ఇందులో బన్నీ, శ్రుతి హాసన్ వేసే స్టెప్పులు వీక్షకులను ఫిదా చేశాయి. ఆధ్యాంతం ఉత్సాహాం నింపేలా జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్‌ చేయడం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=H7EAJW8jYzA లైలా ఓ లైలా (నాయక్‌) రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించిన సినిమా ‘నాయక్’. ఈ సినిమాలో ‘లైలా ఓ లైలా’ పాటతో చెర్రీ ఓ బెస్ట్ డాన్సర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. పక్క ఇండస్ట్రీ వాళ్లు కూడా చెర్రీ టాప్ డాన్సర్ అని ప్రశంసించారు. ఈ పాటలో మాస్ స్టెప్పులకు తగ్గట్టుగానే చాలా క్లాసిక్ స్టెప్పులను కూడా జానీ మాస్టర్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ చేశాడు. https://www.youtube.com/watch?v=HGgHSi-kg78 ఏం మాయో చేశావే (ద్రోణ) 2009లో నితిన్ హీరోగా వచ్చిన ‘ద్రోణ’ సినిమాతో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఢీ’ షోలో జానీ మాస్టర్‌ టాలెంట్‌ చూసిన నితిన్‌ ఈ అవకాశాన్ని ఆయనకు అందించారు. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన ’ఏం మాయ చేశావో’ సాంగ్ అప్పట్లో సూపర్‌ హిట్‌ అయ్యింది. నితిన్‌ చేత ఆ స్థాయిలో స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ ఎవరూ అంటూ అంతా జానీ మాస్టర్‌ కోసం తెగ సెర్చ్ చేశారు. ఆ సాంగ్‌ తర్వాత నుంచి జానీ మాస్టర్‌ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=DPdL89Ho4P8
    సెప్టెంబర్ 19 , 2024
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.&nbsp; ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో&nbsp; ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు&nbsp; ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్&nbsp; ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి&nbsp; శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్&nbsp; నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక&nbsp; కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి&nbsp; మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&nbsp; ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్&nbsp; పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ&nbsp; సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:&nbsp; హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.&nbsp; సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి&nbsp; జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా&nbsp; బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం&nbsp; దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-&nbsp; యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.&nbsp; ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-&nbsp; జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు&nbsp; రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.&nbsp; ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.&nbsp; మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో&nbsp; ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి&nbsp; దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,&nbsp; కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి&nbsp; రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.&nbsp; ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ &nbsp;ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని&nbsp; ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా&nbsp; దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.&nbsp; మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.&nbsp; ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    శృతి హాసన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శృతి హాసన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శృతి హాసన్ తన మెస్మరైజింగ్ టాలెంట్‌తో తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో గబ్బర్ సింగ్, క్రాక్, శ్రీమంతుడు, వాల్తేరు వీరయ్య వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అనగనగా ఓ ధీరుడు, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు చిత్రాలకు గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకున్న శృతి హాసన్(Some Lesser Known Facts about Shruti Haasan)&nbsp; గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.&nbsp; శృతి హాసన్ ముద్దు పేరు? కన్నా శృతి హాసన్ వయస్సు ఎంత? 1986, జనవరి28న జన్మించింది శృతి హాసన్ తెలుగులో నటించిన తొలి సినిమా? అనగనగా ఓ ధీరుడు(2011) శృతి హాసన్ హిందీలో నటించిన తొలి సినిమా? లక్(2009) శృతి హాసన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు&nbsp; శృతి హాసన్ ఎక్కడ పుట్టింది? చెన్నై, తమిళనాడు శృతి హాసన్&nbsp; ఏం చదివింది? సైకాలజీలో డిగ్రీ శృతి హాసన్ అభిరుచులు? షాపింగ్, ట్రావెలింగ్ శృతి హాసన్‌కి ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ శృతి హాసన్‌కు అఫైర్స్ ఉన్నాయా? హీరో సిద్ధార్థతో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతం శాంతను హజరికతో ప్రేమలో ఉంది. శృతి హాసన్‌కు&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ శృతి హాసన్‌కు ఇష్టమైన హీరో? షారుక్‌ ఖాన్, రజనీకాంత్ శృతి హాసన్‌ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల&nbsp; వరకు ఛార్జ్ చేస్తోంది. శృతి హాసన్‌ తల్లిదండ్రుల పేరు? కమల్ హాసన్, సారిక ఠాకూర్ శృతి హాసన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? శృతి హాసన్‌ సినిమాల్లోకి రాకముందు సింగర్‌గా పలు స్టేజ్ పర్ఫామెన్సెస్ ఇచ్చింది శృతి హాసన్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/shrutzhaasan/?hl=en శృతి హాసన్ వ్యాపారాలు? శృతి హాసన్ పలు కాస్మోటిక్( Guess and aldo) బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది. https://www.youtube.com/watch?v=mos5_ozTwEE శృతి హాసన్ గురించి మరికొన్ని విషయాలు స్కూళ్లో చదివేటప్పుడు తన పేరు పూజ రామచంద్రన్.శృతి హాసన్‌కు క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉంది.శృతి హాసన్ తన బెస్ట్ ఫ్రెండ్ తమన్నా భాటియా ఒకరికొకరు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి.శృతితో విడిపోతున్నట్లు ఆమె మాజీ ప్రేమికుడు మైఖెల్ కార్‌సెల్ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు.
    ఏప్రిల్ 27 , 2024
    <strong>HBD Thaman: థమన్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!</strong>
    HBD Thaman: థమన్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!
    ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్ థమన్‌ (HBD Thaman) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీలోని టాప్‌ హీరోల చిత్రాలకు అదిరిపోయే సంగీతం అందిస్తూ టాప్‌ మోస్ట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. ఇవాళ థమన్‌ పుట్టిన రోజు. 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో థమన్‌కు సంబంధించిన సీక్రెట్స్ ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; థమన్‌ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. 1983 నవంబరు 16 ఏపీలోని నెల్లూరులో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. థమన్ తండ్రి పేరు ఘంటసాల శివకుమార్‌. ఆయన ప్రముఖ డ్రమ్మర్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు పొందాడు. ఒక్కప్పటి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కె. చక్రవర్తి దగ్గర ఏడు వందల సినిమాలకు వర్క్ చేశారు.&nbsp; థమన్‌ (HBD Thaman) తల్లి పేరు ఘంటసాల సావిత్రి. ఆమె కూడా ప్లే బ్యాక్‌ సింగర్‌. సంగీత కుటుంబం నుంచి రావడం వల్ల సహజంగానే మ్యూజిక్‌పై థమన్‌కు ఆసక్తి ఏర్పడింది. ఓ సారి థమన్‌ (HBD Thaman)కు తండ్రి శివ కుమార్‌ డ్రమ్‌ కొనిచ్చాడట. తొలిసారి దానిపైనే డ్రమ్‌ వాయించడం ప్రాక్టిస్‌ చేశాడట. అలా చిన్నప్పుడే తండ్రి ప్రోత్సాహంతో డ్రమ్స్‌పై పట్టు సాధించాడట. థమన్‌ తన 13 ఏళ్ల వయసులో బాలయ్య నటించిన 'భైరవ ద్వీపం' సినిమాకు డ్రమ్మర్‌గా పనిచేశారు. ఇందుకుగాను రూ.30 పారితోషికం కూడా అందుకున్నాడు.&nbsp; థమన్‌ (HBD Thaman) చదువుకుంటున్న క్రమంలోనే ఆయన తండ్రి అకస్మికంగా మరణించారు. దీంతో కుటుంబ బాధ్యత థమన్‌పై పడింది. చదువుకు స్వస్థి చెప్పి తను నేర్చుకున్న డ్రమ్స్‌నే వృత్తిగా మార్చుకున్నాడు.&nbsp; థమన్‌ తండ్రికి ఉన్న పేరు దృష్ట్యా పలువురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ థమన్‌కు సాయం చేశారు. షోలు చేసే అవకాశం కల్పించారు.&nbsp; అలా తన తండ్రి చనిపోయిన నాలుగేళ్ల వ్యవధిలోనే 4 వేల స్టేజ్‌ షోలు చేసి థమన్‌ తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.&nbsp; అలా షోలు చేస్తున్న క్రమంలోనే డైరెక్టర్ శంకర్‌ దృష్టిలో థమన్ పడ్డాడు. అలా బాయ్స్‌ సినిమాలో ఓ కీలకమైన కుర్రాడి రోల్‌ను సంపాదించాడు.&nbsp; ఓవైపు షోలు చేస్తూనే పలువురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ టీమ్‌లో డ్రమ్మర్‌గా థమన్‌ పనిచేశాడు. అలా 24 ఏళ్లు వచ్చేసరికి 64 మంది మ్యూజిక్‌ డైరెక్టర్స్‌తో 900 సినిమాలకు పనిచేయడం విశేషం. ఒకప్పటి స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ దగ్గర వర్క్‌ చేయడం తన కెరీర్‌కు ఎంతో బూస్టప్‌ ఇచ్చిందని థమన్‌ చెబుతుంటాడు.&nbsp; ముఖ్యంగా మణిశర్మ టీమ్‌ భాగమై చేసిన 'ఒక్కడు' సినిమా తన జీవితాన్ని మార్చేసిందని థమన్‌ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు.&nbsp; 24 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారిన థమన్‌.. తమిళ చిత్రం 'సింధనాయ్‌ సె' (2009) తొలిసారి వర్క్‌ చేశారు.&nbsp; రవితేజ హీరోగా చేసిన ‘కిక్‌’ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌గా థమన్‌కు ఫస్ట్ తెలుగు ఫిల్మ్‌. ఈ సినిమాలో సాంగ్స్‌ సూపర్‌ హిట్‌ కావడంతో థమన్‌ పేరు మారుమోగింది.&nbsp; ఆ తర్వాత ‘బృందావనం’, ‘దూకుడు’, ‘బిజినెస్‌మెన్’, ‘రేసుగుర్రం’.. ఇలా అతి తక్కువ సమయంలోనే సంగీత దర్శకుడు 100కు పైగా సినిమాలకు పని చేశాడు.&nbsp; తారక్‌- త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ థమన్‌కు 100వ చిత్రం. ఇప్పటివరకూ 145 చిత్రాలకు థమన్‌ సంగీతం అందించారు.&nbsp; ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘డాకు మహారాజ్‌’, ‘ఓజీ’, ‘అఖండా 2’, ‘ది రాజా సాబ్‌’ సహా 18 చిత్రాలు ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి.&nbsp; థమన్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన భార్య శ్రీవర్దిని కూడా మంచి సింగరే. థమన్‌ సంగీతం అందించిన బాడీ గార్డ్‌ చిత్రంలో 'హోసన్న' పాట పాడారు.&nbsp; థమన్‌ సోదరి యామిని ఘంటసాల కూడా ప్రముఖ నేపథ్య గాయని. అలాగే థమన్ అత్త పి. వసంత కూడా మంచి సింగర్‌గా రాణించారు. థమన్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌తో పాటు బెస్ట్ క్రికెటర్‌ కూడా ఉన్నాడు. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్స్‌లో ఆయన తెలుగు ఇండస్ట్రీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ధనా ధన్‌ సిక్స్‌లతో తెలుగు టీమ్‌కు విజయాలు అందించారు.&nbsp; ఏ.ఆర్‌. రెహమాన్‌ అంటే తనకు ఎంతో స్పూర్తి అని థమన్‌ పేర్కొన్నాడు. ఎప్పటికైనా ఆయన స్థాయికి ఎదగాలని తన కోరిక అని చెప్పాడు. తాజాగా&nbsp; తన 41వ పుట్టిన రోజు సందర్భంగా థమన్‌ తన జీవిత ఆశయం ఏంటో చెప్పారు. ఓ మ్యూజిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేసిన వెనుకబడిన వారికి ఫ్రీగా సంగీతం నేర్చించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.&nbsp; థమన్‌పై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. క్యాపీ క్యాట్‌, కాపీ గోట్‌ అంటూ మీమర్స్‌ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు.&nbsp; ట్రోల్స్‌పై స్పందిస్తూ తనకు కాపీ కొట్టడం రాదని, అందుకే వెంటనే దొరికిపోతానని (నవ్వుతూ) థమన్‌ చెప్పాడు.
    నవంబర్ 16 , 2024
    Memorable Villains in Telugu Cinema: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్‌ పాత్రలు ఇవే!
    Memorable Villains in Telugu Cinema: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్‌ పాత్రలు ఇవే!
    సాధారణంగా ప్రతీ సినిమాలో హీరోతో సమానంగా విలన్‌ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. విలన్‌ రోల్‌ ఎంత బలంగా ఉంటే కథాయనాయకుడి పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుంది. కాబట్టి టాలీవుడ్‌ దర్శకులు హీరోతో పాటు విలన్‌ క్యారెక్టర్‌ డిజైన్‌పైనా ప్రత్యేకంగా శ్రద్ధా వహిస్తుంటారు. విలన్ రోల్ క్లిక్‌ అయ్యిందంటే ఆటోమేటిక్‌గా హీరోకి ఎలివేషన్‌ లభించి సినిమా హిట్‌ అవుతుందని వారి నమ్మకం. అయితే ఇప్పటివరకూ టాలీవుడ్‌లో కొన్ని వందల చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని విలన్ పాత్రలే ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేశాయి. అటువంటి పాత్రలను You Say ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; భిక్షు యాదవ్‌ (Sye) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ చిత్రంలో హీరో నితిన్‌ పాత్ర కంటే.. విలన్‌ బిక్షు యాదవ్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతినాయకుడి పాత్రలో ప్రదీప్‌ రావత్‌ (Pradeep Rawat) తన లుక్‌తోనే భయపెట్టేలా ఉంటాడు. ముక్కుకు రింగ్‌ తగిలించుకొని నిజమైన విలన్‌గా కనిపిస్తాడు. ఈ పాత్ర ప్రదీప్‌ రావత్‌ కెరీర్‌ను మలుపుతిప్పింది.&nbsp; https://youtu.be/2JyoOhxNpGk?si=K9os2WSarS60Wz5b అలీభాయ్‌ (Pokiri) పోకిరిలో మహేష్‌ బాబు (Mahesh Babu) తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్‌ ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj) చేసిన అలీభాయ్‌ పాత్ర. మాఫియా డాన్‌గా పవర్‌ఫుల్‌గా కనిపిస్తూనే ప్రకాష్‌ రాజ్‌ తనదైన డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. ఈ పాత్ర తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రకాష్‌ రాజ్‌ ఓ సందర్భంలో చెప్పడం విశేషం.&nbsp; https://youtu.be/4xhZMkerEtE?si=rz8Z19xEeNxXIefV భల్లాలదేవ (Baahubali) రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రంలో రానా (Rana Daggubati) చేసిన ‘భల్లాల దేవ’ పాత్ర ప్రతీ ఒక్కరినీ అలరించింది. కుట్రలు, కుతంత్రాలు పన్నే రాజు పాత్రలో అతడు కనిపించాడు. కండలు తిరిగిన దేహంతో బాహుబలి (ప్రభాస్‌)ని ఎదిరించి నిలుస్తాడు. భల్లాల దేవ తరహా పాత్ర ఇప్పటివరకూ తెలుగులో రాలేదని చెప్పవచ్చు.&nbsp; https://youtu.be/2dFeczHMf58?si=8UKU0_h7Q0qrIGPv పశుపతి (Arundhati) తెలుగులో అతి భయంకరమైన విలన్‌ పాత్ర ఏది అంటే ముందుగా ‘అరుంధతి’ చిత్రంలోని పశుపతినే గుర్తుకు వస్తాడు. ఈ పాత్రలో సోనుసూద్‌ (Sonu Sood) పగ తీరని పిశాచిలా నటించాడు. అరుంధతి (అనుష్క)ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. పశుపతి పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది.&nbsp; https://youtu.be/aJV6JIswFYw?si=JZdCFz_l2XYuNRj3 కాట్‌రాజ్‌ (Chatrapathi) ఛత్రపతి సినిమాలో కాట్‌రాజ్‌ పాత్ర కూడా చూడటానికి చాలా క్రూయిల్‌గా ఉంటుంది. శ్రీలంక నుంచి వలస వచ్చిన వారిపై జులుం ప్రదర్శించే పాత్రలో సుప్రీత్‌ రెడ్డి (Supreeth Reddy) జీవించేశాడు. ఈ సినిమా తర్వాత అతడికి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.&nbsp; https://youtu.be/QLc8I_WIFnE?si=4TYG9WD6BUUG9ZS9 పండా (Gharshana) ఘర్షణ సినిమాలో డీసీపీ రామచంద్ర పాత్రలో హీరో వెంకటేష్‌ (Venkatesh) చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. అతడ్ని ఢీకొట్టే ప్రతినాయకుడి రోల్ పండా కూడా అదే విధంగా ఉంటుంది. గ్యాంగ్‌స్టర్‌ అయిన పండా పాత్రలో నటుడు సలీం బైజ్ (Salim Baig) అద్భుతంగా నటించాడు.&nbsp; https://youtu.be/C15GczxdDWk?si=bCbFuf4jMA-Ku9Ml మద్దాలి శివారెడ్డి (Race Gurram) రేసుగుర్రం చిత్రంలోని మద్దాలి శివారెడ్డి కూడా తెలుగులో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్‌. అల్లు అర్జున్‌ చేతిలో దెబ్బలు తిని.. మంత్రి అయిన తర్వాత హీరోపై రీవేంజ్‌ తీర్చుకునే తీరు బాగుంటుంది. నటుడు రవి కిషన్‌ (Ravi Kishan) ఈ పాత్రలో ఎంతో విలక్షణంగా నటించాడు.&nbsp; https://youtu.be/1eI5MaEPH24?si=akVQ_0ky0sQvA__H వైరం ధనుష్‌ (Sarrainodu) బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) తొలిసారి విలన్‌గా నటించాడు. సీఎం కొడుకు అయిన వైరం ధనుష్‌ పాత్రలో చాలా క్రూయల్‌గా చేశాడు.&nbsp; https://youtu.be/8-Dv9v3jlO4?si=O7-sqHVCz7MS0Usw భవాని (Siva) శివ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. భవాని అనే విలన్‌ పాత్ర కూడా అప్పటి ప్రతినాయకుడి రోల్స్‌కు చాలా భిన్నంగా ఉంటుంది. విలన్‌ అంటే కోరమీసాలు, గంభీరమైన గొంతు, పెద్ద పెద్ద డైలాగ్స్‌ అవసరం లేదని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) ఈ సినిమాతో నిరూపించాడు. భవాని పాత్రతో నటుడు రఘువరన్‌ (Raghuvaran) స్టార్‌ విలన్‌గా మారిపోయాడు.&nbsp; https://youtu.be/lOk1YI8xwk0?si=M7pHYNOlym7EGemT బుక్కా రెడ్డి (Rakta Charitra) రక్త చరిత్ర సినిమాలో బుక్కా రెడ్డి పాత్ర అతి భయానకంగా ఉంటుంది. కనిపించిన ఆడవారిపై అత్యాచారం చేస్తూ, అడ్డొచ్చిన వారిని చంపుకుంటూ పోయే ఈ పాత్రలో నటుడు అభిమన్యు సింగ్‌ (Abhimanyu Singh) జీవించేశాడు. సినిమాలో ఆ పాత్ర ఎంట్రీ అప్పుడల్లా ప్రేక్షకులు ఓ విధమైన టెన్షన్‌కు లోనవుతారు.&nbsp; https://youtu.be/xjVj28sLQGs?si=tFP6zVO5moZcczA0 అమ్రీష్‌ పూరి (Jagadeka Veerudu Athiloka Sundari) చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రంలో నటుడు అమ్రీష్‌ పూరి (Amrish Puri) ప్రతినాయకుడిగా కనిపించారు. మహాద్రాష్ట అనే మాంత్రికుడి రోల్‌లో ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించారు. దేవ కన్య అయిన హీరోయిన్‌ను వశం చేసుకునే పాత్రలో అమ్రీష్‌ నటన మెప్పిస్తుంది.&nbsp; https://youtu.be/l_XA9PuOwh0?si=3IUQQJNW3gFYuytc రణదేవ్ బిల్లా (Magadheera) రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ చిత్రంలో హీరోకు సమానంగా విలన్‌ రణదేవ్‌ బిల్లాకు స్క్రీన్‌ షేరింగ్ ఉంటుంది. దేవ్‌ గిల్ (Dev Gill) ఈ పాత్ర ద్వారా తొలిసారి టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. కండలు తిరిగిన దేహం, నటనతో వీక్షకులను కట్టిపడేశాడు.&nbsp; https://youtu.be/XoYCASOhKPw?si=F1JUwUIIo4FANYpN మంగళం శ్రీను (Pushpa) అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa)&nbsp; చిత్రంలో.. నటుడు సునీల్‌ (Sunil) మంగళం శ్రీను పాత్రలో నటించాడు. హాస్యనటుడిగా, హీరోగా గుర్తింపు పొందిన సునీల్‌ను విలన్‌గా చూసి తెలుగు ఆడియన్స్‌ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అతడి లుక్‌, నటన ఎంతగానో ఆకట్టుకుంది.&nbsp; https://youtu.be/qF_aQEXieGo?si=WBlNlBjRszc3KrzH
    మార్చి 20 , 2024
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), ‌అలీ (Ali), సునీల్‌ (Sunil), వేణుమాదవ్‌ (Venu Madhav) లాంటి సీనియర్‌ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్‌ కమెడియన్స్‌ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్‌ సైతం&nbsp; సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్‌ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.&nbsp; సుహాస్‌ (Suhas) ప్రముఖ నటుడు సుహాస్‌.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్‌ అయిన సుహాస్‌.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్‌ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్‌..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్‌ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్‌ నటిస్తున్నాడు. వైవా హర్ష (Harsha Chemudu)&nbsp; షార్ట్‌ఫిల్మ్స్‌ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్‌ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్‌’, ‘పక్కా కమర్షియల్‌’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది.&nbsp;&nbsp; అభినవ్‌ గోమటం (Abhinav Gomatam) యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్‌ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్‌.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా&nbsp; ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్‌ హీరోగా మారాడు.&nbsp; సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer) ‘జబర్దస్త్‌’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్‌.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్‌ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు. సత్యం రాజేష్‌ (Satyam Rajesh) సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్‌.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్‌ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; ప్రియదర్శి (Priyadarsi) యంగ్‌ కమెడియన్‌ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’&nbsp; (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు. వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) టాలీవుడ్‌లోని స్టార్‌ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్‌ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్‌.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్‌ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్‌’తో కథానాయకుడిగా మారిన కిషోర్‌.. రీసెంట్‌గా&nbsp; ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.&nbsp; ధన్‌రాజ్‌ (Dhanraj) జబర్దస్త్‌ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్‌ ధన్‌రాజ్‌. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్‌.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.&nbsp;
    మార్చి 14 , 2024
    ‘One Powerful Scene’ that Carried the Entire Movie: ఈ సినిమాలను బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలబెట్టిన సన్నివేశాలు ఇవే!
    ‘One Powerful Scene’ that Carried the Entire Movie: ఈ సినిమాలను బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలబెట్టిన సన్నివేశాలు ఇవే!
    కథను మలుపు తిప్పే సీన్లు ప్రతీ సినిమాలోనూ కచ్చితంగా ఉంటాయి. అయితే కొన్ని మాత్రమే ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. సాధారణంగా సాగిపోతున్న కథకు అవి బూస్టర్స్‌లాగా పనిచేస్తాయి. కథ గమనాన్ని మార్చి.. ప్రేక్షకుల అటెన్షన్‌ను తిరిగి సినిమాపై మళ్లేలా చేస్తాయి. అయితే ఇలాంటి సీన్లు ఒకే విధంగా ఉండాలన్న నిబంధన ఏమి లేదు. కథ అవసరాన్ని బట్టి డైరెక్టర్లు ఆ సీన్లను కామెడీ, యాక్షన్‌, సెంటీమెంట్‌ జానర్లలో ఎంచుకుంటూ ఉంటారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ సీన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; సలార్‌ (Salaar) ప్రభాస్ హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ చిత్రంలో అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ మాత్రం పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ప్యాకేజీలా అనిపిస్తుంది. ప్రభాస్‌ గురించి నటి శ్రియా రెడ్డి ఇచ్చే ఎలివేషన్స్‌ మెప్పిస్తాయి.&nbsp; https://twitter.com/i/status/1760698195787870606 ఆర్‌ఆర్‌ఆర్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం గ్లోబల్‌ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. బ్రిటీష్‌ బంగ్లాలోకి తారక్‌ జంతువులతో ప్రవేశించే సీన్‌ హైలేట్‌ అని చెప్పవచ్చు. అటు తారక్‌ - రామ్‌చరణ్‌ ఫైటింగ్‌ కూడా మెప్పిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1758341886304284738 బాహుబలి 2 (Bahubali 2) బాహుబలి 2లో ప్రతీ సీనూ.. ఓ అద్భుతమే అని చెప్పవచ్చు. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే రానా పట్టాభిషేకం సన్నివేశం మాత్రం ప్రేక్షకలకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. రానా చక్రవర్తిగా పట్టభిషేకం చేసుకున్న తర్వాత ప్రభాస్ సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతాడు. ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్‌ అదరహో అనిపిస్తాయి.&nbsp; https://www.youtube.com/watch?v=TloNJQKZiFg జెర్సీ (Jersey) నేచురల్‌ స్టార్‌ నాని తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న చిత్రాల్లో జెర్సీ ముందు వరుసలో ఉంటుంది. కొడుకు కోరిక మేరకు తిరిగి బ్యాట్‌ పట్టిన నాని.. జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. తన కల నెరవేరిన సమయంలో ట్రైన్‌ వెళ్తుండగా నాని అరిచే సీన్‌.. వీక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=UXPR1I8sYnw రేసుగుర్రం (Race Gurram) అల్లుఅర్జున్ (Allu Arjun) హీరోగా సురేందర్‌ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం (రేసుగుర్రం). అయితే ఈ చిత్ర విజయంలో బ్రహ్మీ (Brahmanandam) పాత్ర కూాడా కాస్త ఎక్కువగానే ఉంది. క్లైమాక్స్‌లో కిల్‌బిల్‌ పాండే పాత్రతో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బ్రహ్మీ.. ఫ్రస్టేషన్‌తో ఉన్న పోలీసాఫీసర్‌గా నవ్వులు పూయించాడు. ఈ సినిమాలో కిల్ బిల్ సీక్వెన్స్‌ చిత్రానికే హైలెట్ https://www.youtube.com/watch?v=jxBLgrppzpc వేదం (Vedam) క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ (Allu Arjun), మంచు మనోజ్ (Manju Manoj), అనుష్క (Anushka) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’ (Vedam). ఇందులో బన్నీ.. కేబుల్‌ రాజు పాత్రలో అదరగొట్టాడు. అయితే ద్వితియార్థంలో ఓ వృద్దుడి నుంచి అల్లు అర్జున్‌ డబ్బులు కొట్టేసే సీన్‌ సినిమాలో హైలెట్‌ అని చెప్పవచ్చు. పెద్దాయన కూతురు కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బును.. ఆస్పత్రిలో బన్నీ ఎత్తుకెళ్లేందుకు యత్నిస్తాడు. ఈ క్రమంలో ఆ వృద్ధుడు కాళ్లు పట్టుకొని బతిమాలగా.. వదిలించుకొని మరి వెళ్తాడు. అయితే తన తప్పును తెలుసుకొని బన్నీ డబ్బు తిరిగి ఇచ్చే సీన్‌ హృదయాలకు హత్తుకుంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=XVGHRAdH2dk పోకిరి (Pokiri) మహేశ్‌ బాబు (Mahesh Babu), డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ ఎన్ని రికార్డులు తిరగరాసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని క్లైమాక్స్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అప్పటివరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన మహేశ్‌.. పోలీసు ఆఫీసర్ అని తెలియడంతో అంతా షాక్‌కు గురవుతారు.&nbsp; https://www.youtube.com/watch?v=PvkITH66FEc ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) అద్భుత సృష్టి ‘ఈగ’ (Eega) సినిమా. ఇందులో నాని (Nani), సమంత (Samantha), కన్నడ స్టార్‌ సుదీప్‌ (Sudeep) ప్రధాన పాత్రలు పోషించారు. పవర్‌ఫుల్‌ విలన్ అయిన సుదీప్‌ను క్లైమాక్స్‌లో ఒక చిన్న ఈగ చంపే సీన్‌ ఆకట్టుకుంటుంది.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=1SCFGWtXtDE ఛత్రపతి (Chatrapathi) ప్రభాస్‌ (Prabhas), రాజమౌళి కాంబినేషన్‌లో ఛత్రపతి సినిమా.. అప్పట్లో టాలీవుడ్‌ను షేక్‌ చేసింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ ఫ్యాన్స్ చేత విజిల్స్‌ వెేయిస్తుంది. ప్రభాస్‌ తొలిసారి విలన్లపై పిడికిలి బిగించే సీన్ అదరహో అనిపిస్తుంది. https://www.youtube.com/watch?v=eF5OVQcHfsc జనతా గ్యారేజ్‌ (Janatha Garage) కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’లో తారక్‌ పవర్‌ ప్యాక్డ్‌ హీరోగా నటించాడు. మోహన్‌లాల్ నుంచి జనతా గ్యారేజ్ బాధ్యతలు తీసుకున్నాక వచ్చే తొలి ఫైట్‌ సీన్‌ మెప్పిస్తుంది. రాజీవ్‌ కనకాల సమస్యను తీర్చేందుకు తారక్‌ తన గ్యాంగ్‌తో వెళ్లి విలన్లకు బుద్ది చెప్తాడు. https://www.youtube.com/watch?v=FmAak259Its టెంపర్‌ (Temper) తారక్‌-పూరి కాంబోలో వచ్చిన టెంపర్‌ చిత్రంలో.. కోర్టు సీన్‌ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. ఓ రేప్‌లో విలన్ సోదరులు తప్పించుకోకుడదన్న ఉద్దేశ్యంతో తారక్‌ తాను ఆ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకుంటాడు. ఈ ఊహించని పరిణామం ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1668264361469591558 https://twitter.com/i/status/1668264361469591558 విక్రమార్కుడు (Vikramarkudu) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ (Ravi Teja) ద్విపాత్రాభినయం చేశాడు. విక్రమ్‌ రాథోడ్‌ అనే పోలీసు ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్‌ (Prakash Raj), రవితేజ (Ravi Teja) మధ్య వచ్చే సీన్ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. https://www.youtube.com/watch?v=aorA5S083W4 మగధీర (Magadheera) రామ్‌చరణ్‌ (Ramcharan), రాజమౌళి (S S Rajamouli కాంబోలో వచ్చిన చిత్రం ‘మగధీర’. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ షేర్‌ఖాన్‌ పంపిన వందమంది సైనికులను చంపే సీన్‌ హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సీన్‌ సినిమాను మలుపు తిప్పుతుంది.&nbsp; https://www.youtube.com/watch?v=9NJya1B8mvI మిర్చి (Mirchi) ప్రభాస్‌ హీరోగా కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్‌లో వచ్చిన ‘మిర్చి’.. టాలీవుడ్‌లో పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో తండ్రిని బెదిరించిన విలన్‌ తరపు మనుషులకు ప్రభాస్‌ వార్నింగ్ ఇచ్చే ఆకట్టుకుంటుంది. https://www.youtube.com/watch?v=5aSph4tD8yQ ఆడవారి మాటలకు అర్థాలే&nbsp; ఈ (Aadavari Matalaku Arthale Verule) సినిమాలో వెంకటేష్‌, కోటా శ్రీనివాసరావు తండ్రి కొడుకులుగా నటించారు. కొడుకు ప్రేమ విషయం చెప్పేందుకు వెళ్లిన కోటా శ్రీనివాసరావును హీరోయిన్‌ త్రిష అనుకోకుండా చెంపదెబ్బ కొడుతుంది. దీంతో మనస్తాపానికి గురైన అతడు నిద్రలోనే ప్రాణం విడిస్తాడు. తండ్రి శవం ముందు వెంకటేష్‌ పడిన బాధ.. ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టిస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=L26KInZYQcI ఇంద్ర (Indra) మెగాస్టార్‌ చిరంజీవి మరుపురాని చిత్రాల్లో ఇంద్ర కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలోని ప్రతీ సీను అద్బుతమే. ముఖ్యంగా చిరంజీవి పవర్‌ఫుల్‌ గతాన్ని రివీల్‌ చేసే ఇంటర్వెల్‌ సీన్‌ను ఇప్పటికీ ఫ్యాన్స్‌ గుర్తు చేసుకుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=I4JvUuSQh2I సింహాద్రి (Simhadri) రాజమౌళి దర్శకత్వంలో తారక్ హీరోగా చేసిన రెండో చిత్రం ‘సింహాద్రి’. ఇందులో తన అక్కను చంపిన విలన్లపై తారక్‌ ప్రతీకారం తీర్చుకునే సీన్‌ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. తమను పట్టిపీడిస్తున్న రౌడీలను తారక్‌ చంపుతున్న క్రమంలో కేరళ ప్రజలు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్‌గా అనిపిస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=u0PlQ1J6EHo తులసి (Thulasi) బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన తులసి చిత్రంలో హీరో వెంకటేష్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. కోర్టు పరిసరాల్లో తండ్రికి వార్నింగ్‌ ఇచ్చిన విలన్లపై అతడు ప్రతీకారం తీర్చుకునే సీన్‌ నెవర్‌బీఫోర్ అనిపిస్తుంది.&nbsp; https://youtu.be/1Spz6cJ1ebk?si=_aVPwuSM3khOaPBS
    ఫిబ్రవరి 24 , 2024
    <strong>Pottel Movie Review: రిలీజ్‌కు ముందు ‘రంగస్థలం’తో పోలికలు.. మరి ‘పొట్టేల్‌’ ఆ స్థాయిలో ఉందా?</strong>
    Pottel Movie Review: రిలీజ్‌కు ముందు ‘రంగస్థలం’తో పోలికలు.. మరి ‘పొట్టేల్‌’ ఆ స్థాయిలో ఉందా?
    న‌టీన‌టులు: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ త‌దిత‌రులు రచన, దర్శకత్వం: సాహిత్ మోత్కూరి సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్ నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మాణ సంస్థ‌: నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ విడుద‌ల‌ తేదీ: 25-10-2024 అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర (Yuva Chandra) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం పొట్టేల్‌ (Pottel Movie Review). సవారి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్‌ మోత్కురి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఏ చిన్న సినిమాకు రాని పబ్లిసిటీ ‘పొట్టేల్‌’కు వచ్చింది. పాన్‌ ఇండియా డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌ 'రంగస్థలం'తో పోలుస్తూ ప్రశంసలు కురిపించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సైతం సినిమా బాగుందంటూ ఆడియన్స్‌లో అంచనాలు పెంచేశారు. శుక్రవారం (అక్టోబర్‌ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకుందా? అనన్యకు మంచి విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని గుర్రంగట్టు గ్రామంలో కథ సాగుతుంది. గ్రామ దేవత బాలమ్మకు ఊరి ప్రజలు పుష్కరానికి ఒకసారి జాతర చేసి పొట్టేలును బలిస్తుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద పటేల్ (అజయ్‌) ఒంటిమీదకి అమ్మవారు పూనుతుందని గ్రామస్తుల నమ్మకం. అయితే పటేల్‌ ఊరి ప్రజలను ఎదగనివ్వడు. గ్రామస్తులు చదువుకోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. మరోవైపు పెద్ద గంగాధరీ (యువ చంద్ర) అమ్మవారికి బలిచ్చే పొట్టేల్‌కు కాపరిగా ఉంటాడు. ఎవరికీ తెలియకుండా కూతుర్ని చదవిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పటేల్‌, గంగాధరీ దగ్గర ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు. జాతర సమయానికి పొట్టేల్‌ తీసుకురాకపోతే కూతుర్ని బలిస్తానని హెచ్చరిస్తాడు. కూతురి ప్రాణాల్ని ద‌క్కించుకునేందుకు గంగాధరీ ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడా లేదా? ఇందులో బుజ్జ‌మ్మ (అనన్య నాగళ్ల) క‌థేంటి? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే పటేల్‌గా అజయ్‌ అద్భుతంగా జీవించాడు. ‘విక్రమార్కుడు’లో టిట్ల పాత్రతో ఎంత ఇంపాక్ట్‌ ఇచ్చాడో ఈ సినిమాలో అంతకు మించిన ప్రభావం చూపించాడు. అటు గంగాధరీ పాత్రలో కొత్త నటుడు యువ చంద్ర అదరగొట్టాడు. బిడ్డను చదివించాలి, ఊరికి మంచి జరగాలి అని తాపత్రయ పడే వ్యక్తి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అతనికిది తొలి చిత్రమే అయినా పాత్రకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లిపోయాడు. తెలుగమ్మాయి అనన్య నాగళ్లకు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. బుజ్జమ్మగా అలరించింది. డీగ్లామర్‌ పాత్రే అయినా చక్కగా నటించింది. సింగర్‌ నోయల్‌కు కూడా ఇందులో మంచి పాత్రే దక్కింది. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఛత్రపతి శేఖర్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సాహిత్ మోత్కూరి 1980ల నాటి గ్రామీణ నేప‌థ్యాన్ని ఆవిష్క‌రిస్తూ ఆరంభంలోనే ప్రేక్ష‌కుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లాడు. తొలి 20 నిమిషాల్లోనే గ్రామంలో లీనమయ్యేలా చేశాడు. పటేళ్ల కాలంలో బడుగు, బలహీన వర్గాలను ఎలా అణగదొక్కారు. ఎలాంటి దారుణానికి ఒడిగట్టేవారు అనే విషయాలను చక్కగా చూపించారు. కులం, మతం, చిన్న పెద్దా అనే అహంకారం అనే అంశాన్ని ప్రొజెక్ట్‌ చేసిన విధానం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్ర‌ల ప‌రిచ‌యం, హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌క‌థ త‌దిత‌ర స‌న్నివేశాలతో ప్రథమార్థాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సెకండ్‌ పార్ట్‌ విషయంలోనే దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ప్ర‌ధాన పాత్ర‌ల్ని విల‌న్ ఎంత హింసిస్తే అంతగా భావోద్వేగాలు పండుతాయ‌నే భావ‌న‌తో స‌న్నివేశాల్ని మ‌లిచిన‌ట్టు కనిపిస్తుంది. స‌న్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతుంటాయి. అయితే కథ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.&nbsp; సాంకేతికంగా.. సాంకేతిక విష‌యాల‌కొస్తే సంగీతం, కెమెరా విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. పాట‌లు, నేప‌థ్య సంగీతం చిత్రంపై మంచి ప్ర‌భావం చూపించాయి. ఎడిటింగ్ ప‌రంగా లోపాలు ఉన్నాయి. ద్వితీయార్ధంలో చాలా స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ చక్కటి పనితీరు కనబరిచింది. తమ పనితనంతో 80ల నాటి వాతావరణాన్ని సృష్టించారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథప్రధాన తారాగణం న‌ట‌నసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఆస‌క్తి రేకెత్తించ‌ని క‌థ‌నంసాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    అక్టోబర్ 25 , 2024
    NBK 110 : బాలయ్య-బోయపాటి కొత్త సినిమా ప్రకటన.. సరికొత్త రోల్‌లో బాలయ్య చిన్న కూతురు!
    NBK 110 : బాలయ్య-బోయపాటి కొత్త సినిమా ప్రకటన.. సరికొత్త రోల్‌లో బాలయ్య చిన్న కూతురు!
    టాలీవుడ్‌లో హీరోలకే కాకుండా కొన్ని రకాల కాంబినేషన్స్‌కు కూడా సెపరేట్‌ ఫ్యాన్స్ బేస్‌ ఉంటుంది. అలాంటి వాటిలో బాలకృష్ణ - బోయపాటి కాంబో ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌లో ఈ కాంబోకు యమా క్రేజ్‌ ఉంది. గతంలో బాలయ్య - బోయపాటి చేసిన హ్యాట్రిక్‌ చిత్రాలు ఇండస్ట్రీని షేక్‌ చేశాయి. ఇవాళ (జూన్‌ 10) బాలకృష్ణ పుట్టని రోజు సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీంతో నందమూరి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు.&nbsp; బాలయ్య కుమార్తె సమర్పణలో.. ఇవాళ (జూన్‌ 10).. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకొని బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమా ఖరారైంది. ఇది 'NBK 110' చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య - బోయపాటి అప్‌కమింగ్‌ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్ సంస్థ ఆధ్వర్యంలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. 'లెజెండ్‌' చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న ఈ ఇద్దరు నిర్మాతలు.. 'NBK110' చిత్రాన్ని కూడా రాజీ పడకుండా భారీ ఎత్తున తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ మూవీకి నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనుండటం విశేషం. షూటింగ్‌ ఎప్పుడంటే? బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం గురించి ఇప్పటి నుంచే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ సెట్స్‌ పైకి ఎప్పుడు వెళ్తుందా అని ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో టాక్‌ ప్రకారం.. 'NBK110' చిత్రం ఆగస్టులో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్‌ బాబీతో కలిసి 'NBK109' చిత్రంలో చేస్తున్నాడు. చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమాకు ఏపీ ఎన్నికల నేపథ్యంలో కాస్త బ్రేక్ పడింది. మిగిలిన కాస్త షూటింగ్‌ను పూర్తి చేసిన బోయపాటి సినిమాను పట్టాలెక్కించాలన్న ప్లాన్‌లో బాలయ్య ఉన్నారు.&nbsp; బోయపాటికే సాటి.. ఇండస్ట్రీకి హ్యాట్రిక్‌ విజయాలను అందించిన బాలకృష్ణ - బోయపాటి జర్నీ.. 'సింహా' సినిమాతో మెుదలైంది. నందమూరి అభిమానులు బాలయ్య నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ విధమైన కథ, డైలాగ్స్‌తో సినిమా తీసి విజయం సాధించారు బోయపాటి. ఆ తర్వాత వచ్చిన 'లెజెండ్‌', 'అఖండ' చిత్రాలు సైతం ఈ కోవలోనే వచ్చి భారీ విజయాలు సాధించాయి. బాలయ్యకు ఎలాంటి కథలు సెట్‌ అవుతాయి.. పాత్రకు తగ్గట్లు ఆయన్ను ఎలా మౌల్డ్‌ చేయాలన్నది బోయపాటి తెలిసినంతగా మరే డైరెక్టర్‌కు తెలియదని నందమూరి ఫ్యాన్స్‌ అంటుంటారు. అటువంటి ఈ ఇద్దరి కలయికలో నాల్గో చిత్రం అనౌన్స్‌ కావడంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. వీరి కాంబో ఈసారి కూడా ఇండస్ట్రీని షేక్‌ చేస్తుందని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.&nbsp; 'NBK109' నుంచి క్రేజీ గ్లింప్స్‌ నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో NBK 109 పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ ప్రాజెక్ట్‌ నుంచి బాలయ్య బర్త్‌డే గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. "దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు" అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్‌గా ఉంది. మొత్తానికి బాలయ్య బర్త్‌డేకి మంచి ట్రీట్ ఇచ్చింది NBK109 టీమ్. మీరూ గ్లింప్స్‌ చూసేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=Ib7bmm-PiaU
    జూన్ 10 , 2024
    NBK 109 vs Devara: బాక్సాఫీస్‌ బరిలో బాలయ్య,&nbsp; తారక్‌, రవితేజ .. ఎవరిది పైచేయి?
    NBK 109 vs Devara: బాక్సాఫీస్‌ బరిలో బాలయ్య,&nbsp; తారక్‌, రవితేజ .. ఎవరిది పైచేయి?
    టాలీవుడ్‌లో సినిమా - సినిమాకు మధ్య పోటీ సాధారణమే. ఒకే రోజున రెండు, మూడు చిత్రాలకు పైగా రిలీజవుతూ ఒకదానికొకటి సవాలు విసురుకుంటాయి. అయితే ఆ పోటీ ముగ్గురు స్టార్‌ హీరోల మధ్య ఉంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో అటువంటి పోటీనే టాలీవుడ్‌లో చూడబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), మాస్‌ మహారాజ్ రవితేజ (Ravi Teja) బాక్సాఫీస్‌ వద్ద తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకే రోజున వారి సినిమాలు రిలీజ్‌ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి ఇప్పటి నుంచే అభిమానుల్లో మెుదలైంది.&nbsp; బాలయ్య vs రవితేజ నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'NBK 109' చిత్రం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్‌కు బాలయ్య దూరంగా ఉన్నప్పటికీ అతడి పాత్ర మినహా రిమైనింగ్‌ షూటింగ్‌ను బాబీ శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్‌ ముగియడంతో త్వరలోనే బాలయ్య సెట్స్‌లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాలయ్య పైన ఉన్న సీన్స్‌ త్వరగా షూట్‌ చేసి సెప్టెంబర్‌ 27న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు మాస్‌ మహారాజ్‌ రవితేజ - దర్శకుడు హరీష్‌ శంకర్‌ (Harish Shankar) కాంబోలో 'మిస్టర్‌ బచ్చన్‌' మూవీ తెరకెక్కుతోంది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) 'ఓజీ' (OG) సినిమా వాయిదా పడటంతో ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ ఫుల్‌ ఫోకస్‌ మెుత్తం రవితేజ చిత్రంపైనే పెట్టారు. చాలా ఫాస్ట్‌గా షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ మూవీని కూడా సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయాలని హరీష్‌ శంకర్‌ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే బాలయ్య - రవితేజ బాక్సాఫీస్‌ ఎదుట తలపడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఈ ఆసక్తికర పోరులో విజయం ఎవరినీ వరిస్తుందో చూడాలి.&nbsp; గతంలో బాలయ్యదే పైచేయి బాలకృష్ణ - రవితేజ బాక్సాఫీస్‌ వద్ద తలపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో వారు చేసిన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. గతేడాది బాలయ్య చేసిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari), రవితేజ నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ఒకే రోజున బాక్సాఫీస్‌ బరిలో నిలిచాయి. అయితే ఈ పోరులో బాలకృష్ణ పైచేయి సాధించారు. ఆయన చేసిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రశంసలు అందుకుంది. అయితే ‘టైగర్‌ నాగేశ్వరరావు’ మాత్రం రూ. 48 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి కూడా బాలయ్యదే గెలుపు అని నందమూరి ఫ్యాన్స్‌ అంటుంటే.. కాదు కాదు రవితేజనే బాక్సాఫీస్‌ కింగ్‌గా నిలుస్తాడని అతడి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; దేవర నుంచి గట్టిపోటీ తప్పదా? తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' (Devara) చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ గతంలోనే ప్రకటించారు. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం.. 'దేవర'ను సైతం సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయాలని కొరటాల టీమ్‌ భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఆ రోజున రావాల్సిన పవన్‌ కల్యాణ్‌ 'ఓజీ' చిత్రం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేవరను రెండు వారాల ముందుగానే రిలీజ్‌ చేస్తే బాగుంటుందని మేకర్స్‌ భావిస్తున్నారట. ఇదే జరిగితే ఆ రోజున బాక్సాఫీస్‌ వద్ద త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.&nbsp; 'NBK109' నుంచి క్రేజీ గ్లింప్స్‌ నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తోన్న ‘NBK 109’ చిత్రం నుంచి ఇటీవలే క్రేజీ గ్లింప్స్‌ విడుదలైంది. బాలయ్య బర్త్‌డే రోజున ఈ స్పెషల్‌&nbsp; గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. "దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు" అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్‌గా ఉంది. మీరూ గ్లింప్స్‌ చూసేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=Ib7bmm-PiaU
    జూన్ 13 , 2024
    Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
    Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
    ప్రేక్షకులతో పాటు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల వేడుక 'ఫిల్మ్‌ఫేర్‌' (Filmfare Awards 2024). 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.&nbsp; జనవరి 27, 28 తేదీల్లో గుజరాత్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడుతున్న చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేశారు. అయితే ఇది కొత్త వివాదానికి దారి తీసింది. రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani), యానిమల్‌ (Animal) చిత్రాలతో పాటు 12th ఫెయిల్‌, డంకీ, జవాన్‌, శ్యామ్‌ బహదూర్‌ చిత్రాలు అవార్డు రేసులో నిలిచాయి. కానీ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్‌', 'సలార్‌' వంటి చిత్రాలకు ఏ ఒక్క విభాగంలోనూ చోటు దక్కకపోవడం చర్చలకు తావిస్తోంది.&nbsp; ప్రభాస్‌కు అన్యాయం! బాహుబలి తర్వాత ప్రభాస్‌ (Prabhas) క్రేజ్‌ ప్రపంచస్థాయికి చేరింది. ఆయనతో చిత్రాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ప్రభాస్‌ చేసిన ఆదిపురుష్‌ (Aadipurush), సలార్‌ (Saalar) చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. ‘ఆదిపురుష్‌’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్‌ మానియాతో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అందులో డార్లింగ్‌ నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి. ఇక రీసెంట్‌ మూవీ ‘సలార్‌’ బాక్సాఫీస్‌ వద్ద దుమ్ముదులిపింది. ఇప్పటివరకూ ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.611.8 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ తన కలెక్షన్స్‌ను పెంచుకుంటుంది. పైగా ఇందులో ప్రభాస్‌ తన యాక్షన్‌తో గూస్‌బంప్స్ తెప్పించాడు. అటువంటి ప్రభాస్‌కు ఉత్తమ నటుడు కేటగిరి నామినేషన్స్‌లో కనీసం చోటు దక్కకపోవడం ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది.  సలార్‌ వద్దు.. డంకీ ముద్దు!(Saalar Vs Dunki) షారుక్‌ ఖాన్‌ రీసెంట్‌ చిత్రం డంకీ (Dunki), ప్రభాస్‌ ‘సలార్‌’ చిత్రాలు రెండూ ఒకే రోజూ రిలీజయ్యాయి. డంకీ ఇప్పటివరకూ రూ.460.70 కోట్లు వసూలు చేయగా సలార్‌ అంతకంటే ఎక్కువే కలెక్షన్స్ సాధించింది. అయినప్పటికీ సలార్‌ను కాదని, డంకీ ఉత్తమ చిత్రం కేటగిరిలో చోటు కల్పించడంపై ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది చిత్రాలు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న ఈ రోజుల్లోనూ మన హీరోలపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఘటనలు భారతీయ చిత్ర పరిశ్రమకు మంచిది కాదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పూర్తిగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించినవని తెలుసు.. సలార్, ఆదిపురుష్ వంటి చిత్రాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన విషయం గుర్తించుకోవాలి. ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సినిమాలు హిందీ డైరెక్టర్లతోనే తీశాడు. విచిత్రమేమిటంటే.. జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ సౌత్ నుంచి వచ్చాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ అయింది. ఈ సినిమాకు అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో స్థానం దక్కింది.  అలాగే సలార్ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది.. ప్రశాంత్ నీల్. అతను సౌత్‌కు చెందినవాడే కావచ్చు. కానీ సలార్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఎలాంటి హిట్ సాధించిందో… హిందీలోనూ అలాంటి హిట్‌నే సాధించింది. కావాలనే ప్రభాస్‌ను అవార్డుల రేసు నుంచి పక్కకు పెట్టారని నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి బాలీవుడ్‌లో కొంతమంది అగ్ర హీరోలు ఉన్నారని చర్చించుకుంటున్నారు.  సలార్ విడుదల సమయంలో థియేటర్లు కెటాయించకుండా… డంకీ చిత్రానికి థియేటర్లు కేటాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas fans) నిరసన వ్యక్తం చేశారు. దానికి ప్రతీకారంగానే ప్రభాస్‌ను, ఆయన సినిమాలను బాలీవుడ్‌లో ఓ వర్గం పక్కకు పెట్టారని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.   పాపం రష్మిక..! అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక మంచి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ఉత్తమ నటి కేటగిరి నామినేషన్స్‌లో రష్మిక( Rashmika Mandanna) పేరు లేకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. అదే సినిమాలో కొద్దిసేపు కనిపించి అలరించిన నటి త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో నిలవడం చర్చకు తావిస్తోంది. దీనిని రష్మిక ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. రష్మిక దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటి కావడం వల్లే ఆమె ఏ విభాగంలోనూ నామినేట్ కాలేదని చెబుతున్నారు.  అప్పట్లోనే అవమానం అంబాని గణపతి పూజ సమయంలోనూ… బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్ కావాలనే రష్మికను పట్టించుకోని వీడియో అప్పట్లో సోషల్ మీడియోలో వైరల్ అయింది. సౌత్ నటి అయినందు వల్లే రష్మికను అవైడ్ చేశారని పెద్ద చర్చ సాగింది. https://twitter.com/leena_gaut57982/status/1704495711058812951?s=20 ‘యానిమల్’ సత్తా చాటేనా! తెలుగు డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ (Animal) చిత్రం ఏకంగా 19 విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడి కేటగిరిలో సందీప్ రెడ్డి వంగా, ఉత్తమ నటుడు విభాగంలో రణ్‌బీర్‌ కపూర్‌, ఉత్తమ సహాయ నటులుగా అనిల్‌ కపూర్‌, బాబీ దేబోల్‌, సహాయ నటిగా త్రిప్తి దిమ్రి యానిమల్‌ మూవీ నుంచి రేసులో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకల్లో (Filmfare Awards 2024) యానిమల్‌ సత్తా చాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోమారు జాతీయ స్థాయిలో టాలీవుడ్‌ సత్తా ఏంటో తెలియనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.  విభాగాల వారిగా నామినేషన్స్ జాబితా ఉత్తమ చిత్రం (పాపులర్‌) 12th ఫెయిల్‌జవాన్‌ఓఎంజీ2పఠాన్‌రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) 12th ఫెయిల్‌బీడ్‌ఫరాజ్‌జొరామ్‌శ్యామ్‌ బహదూర్‌త్రీ ఆఫ్‌ అజ్‌జ్విగాటో ఉత్తమ దర్శకుడు అమిత్‌ రాయ్‌ (ఓఎంజీ2)అట్లీ (జవాన్‌)కరణ్‌ జోహార్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)సందీప్‌ వంగా (యానిమల్‌)సిద్ధార్థ్‌ ఆనంద్‌ (పఠాన్‌)విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)రణ్‌వీర్‌ సింగ్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)షారుక్‌ఖాన్‌ (డంకీ)షారుక్‌ ఖాన్‌(జవాన్‌)సన్నీ దేఓల్‌ (గదర్‌2)విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌) ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) అభిషేక్‌ బచ్చన్‌ (ఘూమర్‌)జయ్‌దీప్‌ అహల్వత్‌ (త్రీ ఆఫ్‌ అజ్‌)మనోజ్‌ బాజ్‌పాయ్‌ (జొరామ్‌)పంకజ్‌ త్రిపాఠి (ఓఎంజీ2)రాజ్‌కుమార్‌ రావ్‌ (బీడ్‌)విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌)విక్రాంత్‌ మెస్సే (12th ఫెయిల్‌) ఉత్తమ నటి అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)భూమి పెడ్నేకర్‌ (థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌)దీపిక పదుకొణె (పఠాన్‌)కియారా అడ్వాణీ (సత్య ప్రేమ్‌కి కథ)రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)తాప్సీ (డంకీ) ఉత్తమ నటి (క్రిటిక్స్‌) దీప్తి నవల్‌ (గోల్డ్‌ ఫిష్‌)ఫాతిమా సనా షేక్‌ (ధక్‌ ధక్‌)రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)సయామీఖేర్‌ (ఘూమర్‌)షహానా గోస్వామి (జ్విగాటో)షఫిల్‌ షా (త్రీ ఆఫ్ అజ్‌) ఉత్తమ సహాయ నటుడు ఆదిత్య&nbsp; రావల్‌ (ఫరాజ్‌)అనిల్‌ కపూర్‌ (యానిమల్‌)బాబీ దేఓల్‌ (యానిమల్‌)ఇమ్రాన్‌ హష్మి (టైగర్‌3)టోటా రాయ్‌ చౌదరి (రాఖీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ)విక్కీ కౌశల్‌ (డంకీ) ఉత్తమ సహాయ నటి జయా బచ్చన్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)రత్న పాఠక్‌ షా (ధక్‌ ధక్‌)షబానా అజ్మీ (ఘూమర్‌)షబానా అజ్మీ&nbsp; (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)త్రిప్తి దిమ్రి (యానిమల్‌)యామి గౌతమ్‌ (ఓఎంజీ2)
    జనవరి 17 , 2024
    Akira Nandan: పవన్‌ కళ్యాణ్ కోసం అకిరా నందన్‌ ఎమోషనల్ వీడియో.. నెట్టింట వైరల్‌!
    Akira Nandan: పవన్‌ కళ్యాణ్ కోసం అకిరా నందన్‌ ఎమోషనల్ వీడియో.. నెట్టింట వైరల్‌!
    టాలీవుడ్‌ స్టార్‌ హీరో, జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం దేశంలో మార్మోగుతోంది. ఏపీలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100 స్టైక్‌ రేట్‌తో గెలిచి ఆయన రాజకీయాల్లో నయా రికార్డును సృష్టించారు. పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో గెలవడంతో పాటు.. కూటమి విజయం (164/175)లో కీలక పాత్ర పోషించిన పవన్‌కు శుభాంకాక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, అభిమానులు ఆయన్ను పెద్ద ఎత్తున విష్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో పవన్‌ తనయుడు అకిరా నందన్‌ (Akira Nandan) తన తండ్రి కోసం ఓ స్పెషల్‌ వీడియోను క్రియేట్‌ చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; నాన్నకు ప్రేమతో.. పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకిరా నందన్‌ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాడు. విజయోత్సహంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ సంతోషంలో పాలుపుంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా అకిరా తన తండ్రి కోసం ఎడిట్‌ చేసిన వీడియోను పవన్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘కొన్ని వారాల క్రితం వాళ్ల నాన్న కోసం అకీరా నందన్‌ (Akira Nandan) చేసిన ప్రత్యేక వీడియో ఇది. పవన్‌పై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనం. తన తండ్రి విజయంపై అకీరా ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నాడు’ అని రేణు దేశాయ్‌ (Renu Desai) దీనికి క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో పవన్‌ అభిమానులను జనసేన కార్యకర్తలను విపరీతంగా ఆకర్షిస్తోంది.&nbsp; View this post on Instagram A post shared by renu desai (@renuudesai) పవన్‌ పంచ్‌ డైలాగ్స్‌.. అకిరా ఎడిట్‌ చేసిన వీడియోలో పవన్‌ సినిమాలకు సంబంధించిన క్లిప్స్‌ ఉన్నాయి. ‘ఖుషి’ (Kushi) నుంచి ‘భీమ్లానాయక్‌’ (Bheemla Nayak) వరకు పవన్‌ చేసిన చిత్రాల్లోని పవర్‌ఫుల్‌ డైలాగులతో అకీరా ఈ వీడియోను రూపొందించాడు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను చూస్తుంటే గూస్‌బంప్స్‌ వస్తున్నాయని పవన్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఎమ్మెల్యే గారి అబ్బాయి చేసిన వీడియో బాగుదంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ తాము చూసిన పవన్‌ ట్రెండింగ్‌ వీడియోల్లో ఇదే బెస్ట్ అంటూ అకీరాను ఆకాశానికి ఎత్తుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1798036906124657133 తండ్రితోనే అకిరా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించారు. పిఠాపురంలో 70 వేలకు పైగా మెజార్టీ సాధించారు. ఫలితాలు వెలువడిన రోజు పవన్‌ భార్య అన్నా లెజ్నెవా ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలో పవన్‌ రెండో భార్య కుమారుడు అకిరా నందన్‌ కూడా కనిపించాడు. పవన్ కల్యాణ్‌కు ఆయన భార్య వీర తిలకం పెడుతుండగా.. అకీరా కూడా అక్కడే నిలబడ్డాడు. అనంతరం తండ్రితో పాటే అమరావతిలోని నివాసానికి అకిరా వెళ్లాడు. కూటమి విజయం అనంతరం పవన్‌ను కలవడానికి వచ్చిన చంద్రబాబు కాళ్లకు నమస్కారం సైతం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.&nbsp; https://twitter.com/i/status/1797940145787908224 https://twitter.com/i/status/1798002911848673587 అకిరా ఎంతో టాలెంటెడ్‌! అకిరా నందన్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్‌. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్‌ బాల్‌ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అతడు మ్యూజిక్‌ కోర్సులు చేస్తున్నాడు. అతడి మ్యూజిక్‌ టాలెంట్‌ తెలిసే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అతడి చేత ప్రత్యేక పర్‌ఫార్మెన్స్‌ చేయించింది. ఆ సందర్భంలోనే యానిమల్‌ సినిమాలోని ‘నాన్న నువ్వు నా ప్రాణం’ అంటూ పాటకు పియానో వాయించి అకిరా అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.&nbsp; https://twitter.com/i/status/1747251367033577947
    జూన్ 06 , 2024
    Eagle Movie: ‘ఈగల్‌’ గురించి పూనకాలు తెప్పించే మాట చెప్పిన నిర్మాత.. అదే నిజమైతే!
    Eagle Movie: ‘ఈగల్‌’ గురించి పూనకాలు తెప్పించే మాట చెప్పిన నిర్మాత.. అదే నిజమైతే!
    మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle Movie). అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran), కావ్యా థాపర్‌ (Kavya Thapar) హీరోయిన్లుగా నటించారు. నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. రవితేజతో 'ధమాకా' సినిమాని నిర్మించిన టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, ప్రమోషన్‌ పోస్టర్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈగల్‌పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో సినిమాపై హైప్‌ మరింత పెరిగింది.&nbsp; ‘ఈగల్’ క్లైమాక్స్‌.. నెవర్‌ బిఫోర్‌! తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన 'ఈగల్' నిర్మాత విశ్వ ప్రసాద్.. మూవీ క్లైమాక్స్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈగల్.. చివరి 40 నిమిషాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. ఇంత వరకు తెలుగులో అలాంటి అవుట్ పుట్ వచ్చి ఉండదు. ఎక్కువ చేసి చెప్పడం లేదు, బాహుబలితో కంపేర్ చేయడం లేదు గానీ.. లోకేష్ కనకరాజు స్టైల్లో క్లైమాక్స్ ఉంటుంది. సాధారణ తెలుగు సినిమాల క్లైమాక్స్‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది. తెలుగులో ఇప్పటిదాకా ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండరు’ అంటూ సినిమాపై మరింత హైప్ పెంచేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈగల్‌ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో పెరిగిపోయింది.&nbsp; టికెట్‌ రేట్లు సాధారణమే.. గత కొంతకాలంగా స్టార్‌ హీరో సినిమా వస్తుందంటే టికెట్‌ రేట్లు పెంచడం అనివార్యమవుతోంది. అయితే రవితేజ ‘ఈగల్‌’ (Eagle) చిత్రం మాత్రం టికెట్‌ పెంపునకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఈగల్‌ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణ టికెట్ రేట్లు ఉంచడం విశేషం. దీని ప్రకారం హైదరాబాద్ పీవీఆర్ - ఐనాక్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'ఈగల్' టికెట్ రేటు రూ.200గా ఉండనుంది. ఏషియన్ మల్టీప్లెక్స్‌లలో కొన్ని చోట్ల రూ.175కే టికెట్ పొందవచ్చు. ఇక సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు విషయానికి వస్తే... బాల్కనీ రేటు రూ.150 మాత్రమే. మెజారిటీ సింగిల్ స్క్రీన్లలో రూ.110, కొన్ని థియేటర్లలో రూ.145లకు టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ‘ఈగ‌ల్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌! ఇక ఈగల్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్ అంటూ కొన్ని అంకెలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీని ప్రకారం.. ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.21 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. ఏపీ, తెలంగాణ‌లో క‌లిపి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.17 కోట్ల‌కు జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. ఓవ‌ర్‌సీస్‌లో రూ.2 కోట్లు.. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుతో పాటు ఇత‌ర రాష్ట్రాలు కలిపి మ‌రో రూ.2 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. దీని ప్రకారం 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈగల్‌ రిలీజ్ అవుతోంది. తగ్గిన రవితేజ మార్కెట్‌! రవితేజ రీసెంట్‌ మూవీ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’తో పోలిస్తే ‘ఈగల్‌’ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ కోత పడింది. టైగర్‌ నాగేశ్వరరావు థియేట్రిక‌ల్ హ‌క్కులు గతంలో రూ.37 కోట్ల‌కు అమ్ముడుపోయాయి. ర‌వితేజ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా అది నిలిచింది. దానితో పోలిస్తే ‘ఈగ‌ల్’ మాత్రం రూ.16 కోట్లు త‌క్కువకే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగా చూస్తే మాత్రం ర‌వితేజ టాప్-5 చిత్రాల్లో ఒక‌టిగా ఈగ‌ల్ నిలిచింది. రావ‌ణాసుర‌, ఖిలాడి సినిమాల థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ.22 కోట్ల వ‌ర‌కు అమ్ముడుపోగా.. వాటి త‌ర్వాత నాలుగో స్థానంలో ఈగ‌ల్ నిలిచింది. ఈగల్‌లో రవితేజ పాత్ర అదే! ఈగ‌ల్ సినిమాలో ర‌వితేజ రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాడే షూట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ట్రైలర్‌, టీజర్‌ చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. వాస్తవానికి ఈగల్‌ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ సంక్రాంతి బ‌రిలో గుంటూరు కారం, సైంధ‌వ్‌, నా సామిరంగ‌, హ‌నుమాన్ రిలీజ్ కావ‌డంతో ఈగ‌ల్ వాయిదాప‌డింది. అటు రవితేజ తన త‌ర్వాతి చిత్రాన్ని డైరెక్టర్‌ హ‌రీష్ శంక‌ర్‌తో చేస్తున్నాడు. దీనికి ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది.&nbsp;
    ఫిబ్రవరి 08 , 2024
    <strong>Akira Nandan: అకీరా నందన్‌ గురించి ఈ టాప్‌ - 10 సీక్రెట్స్‌ తెలుసా?</strong>
    Akira Nandan: అకీరా నందన్‌ గురించి ఈ టాప్‌ - 10 సీక్రెట్స్‌ తెలుసా?
    పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ ఏదోక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా అకీరా పేరు మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ సినిమాలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అకీరా ఫిల్మ్ ఎంట్రీ పవన్‌ మూవీతోనే జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక అకీరా అంటే పవన్‌ కల్యాణ్‌ కుమారుడిగానే చాలా మందికి తెలుసు. అతడి గురించి తెలియని టాప్ -10 సీక్రెట్స్‌ ఇప్పుడు చూద్దాం.&nbsp; అకీరానందన్‌ 2004 ఏప్రిల్‌ 8న పవన్‌ - రేణు దేశాయ్‌ దంపతులకు జన్మించాడు. అప్పటికీ పవన్‌ రేణుదేశాయ్‌ను వివాహం చేసుకోలేదు. 2009లో పవన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2012లో వారిద్దరు విడిపోయారు.&nbsp; అకీరా కటౌట్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. హైట్‌లో ప్రభాస్‌, రానా, వరుణ్‌ తేజ్‌లను గుర్తుచేస్తుంటాడు. అతడి హైట్‌ ప్రస్తుతం 6 అడుగుల 4 అంగుళాలు ఉంది.&nbsp; అకీరా నందన్ విద్యాబ్యాసం హైదరాబాద్‌లోనే జరిగింది. ఆక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో అకీరా చదువుకున్నాడు. క్రికెట్ ఆడటమంటే అకీరాకు చాలా ఇష్టం.&nbsp; అకీరా నందన్‌ ఫేవరేట్‌ హీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కాదట. యంగ్‌ హీరో అడివి శేష్‌ అంటే అకీరాకు చాలా ఇష్టమట. ఈ విషయం అకీరా తల్లి రేణు దేశాయ్‌ గతంలో వెల్లడించింది.&nbsp; ఇండస్ట్రీలోని కుర్ర హీరోల్లో అకీరాకు ఓ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉన్నాడు. అతడు ఎవరో కాదు అడివి శేషూనే. ఈ విషయాన్ని మేజర్‌ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా అడివి శేష్‌ చెప్పాడు. అకీరా తనకు మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఉన్నా తామిద్దరం మంచి స్నేహితులమని, తరుచూ కలుస్తుంటామని చెప్పుకొచ్చాడు. అకీరాకు చాలా మృదుస్వభావి. స్టార్‌ హీరో, డిప్యూటీ సీఎం కుమారుడిని అన్న ఫీలింగ్ అతడిలో కాస్తంత కూడా కనిపించదని అకీరా సన్నిహితులు చెబుతుంటారు.&nbsp; ప్రస్తుతం అకీరా మెగా ఫ్యామిలీతో గానీ, తల్లి రేణుదేశాయ్‌తో గానీ కలిసి ఉండటం లేదట. హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడట. అతడి బాగోగులు పవన్‌ కల్యాణే చూసుకుంటున్నారు.&nbsp; తన తల్లికి పవన్‌ విడాకులు ఇచ్చారన్న ఫీలింగ్‌ అకీరాలో రాకుండా రేణు దేశాయ్‌ చాలా జాగ్రత్త పడిందట. రాజకీయ కారణాల వల్లే తాము విడిపోవాల్సి వచ్చిందని పదే పదే చెప్తూ తండ్రిపై అకీరాకు కోపం రాకుండా చూసుకుందట. అకీరానందన్‌ చైల్డ్ ఆర్టిస్టుగా ఓ సినిమాలో నటించాడు. 2014లో తన తల్లి దర్శకత్వం వహించిన ‘ఇష్క్‌ వాలా లవ్‌’లో అతడు తొలిసారి స్క్రీన్‌పై కనిపించాడు.&nbsp; ప్రస్తుతానికి అకీరాకు యాక్టింగ్‌ చేయాలన్న ఆసక్తి లేదు. కానీ సంగీతం అంటే చాలా ఇష్టమట. ఇందుకోసం పియానో కూడా నేర్చుకున్నాడు. అలాగే యోగ, మార్షల్ ఆర్ట్స్‌, కిక్‌ బాక్సింగ్‌లోనూ అకీరాకు ప్రావీణ్యం ఉంది.&nbsp;
    అక్టోబర్ 21 , 2024
    PAWAN KALYAN HBD: పవన్ కళ్యాణ్ గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ప్రశ్నలు ఇవే... దిమ్మదిరిగే ఆన్సర్స్ ఇచ్చిన గూగుల్
    PAWAN KALYAN HBD: పవన్ కళ్యాణ్ గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ప్రశ్నలు ఇవే... దిమ్మదిరిగే ఆన్సర్స్ ఇచ్చిన గూగుల్
    పవర్ స్టార్ కళ్యాణ్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్.&nbsp; మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లో ఆయన క్రేజ్‌ను మ్యాచ్ చేయడం అంటే అంత తేలిక కాదు. &nbsp; అటు సినీరంగంలోనూ, రాజకీయాల్లోనూ కొనసాగుతూ తనదైన ముద్రవేస్తున్నారు. సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు అని అందరికి తెలిసిందే. ఈక్రమంలో ఆయన గురించి నెటిజన్లు గూగుల్‌లో శోధన మొదలు పెట్టారు. సెర్చ్ ఇంజిన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ గూగుల్‌ను ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఏంటీ? దానికి గూగుల్ ఇచ్చిన క్రేజీ సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ప్ర: పవన్ కళ్యాణ్ ఇళ్లు ఎక్కడ? గూ: హైదరాబాద్‌- జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2021లో ఓ ఇళ్లును కొనుగోలు చేశాడు. అక్కడే తన&nbsp; భార్య&nbsp; అన్నా లెజ్నెవా వారి కొడుకుతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల రాజకీయంగా యాక్టివ్‌గా ఉండటంతో తన నివాసాన్ని అమరావతికి మార్చాడు. ప్ర: పవన్ కళ్యాణ్ పట్టిన రోజు ఎప్పుడు? గూ: పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2 1971లో జన్మించారు ప్ర: పవన్ కళ్యాణ్ ఎత్తు ఎంత? గూ: 1.78 మీటర్లు ప్ర: పవన్ కళ్యాణ్ సొంతంగా నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ పేరు? గూ: కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్ర: పవన్ కళ్యాణ్ పూర్తిగా నేర్చుకున్న మార్షల్ ఆర్ట్ ఏది? గూ: కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు ప్ర: పవన్ కళ్యాణ్ ఏ ప్రొడక్షన్ నెట్‌వర్క్‌ క్రింద సినిమాలను నిర్మిస్తున్నారు? గూ: అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్ర: పవన్ కళ్యాణ్‌ తొలి హీరోయిన్ పేరు ఏమిటి? గూ: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించిన సుప్రియ పవన్ ఫస్ట్ హీరోయిన్ ప్ర: పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు పొందిన మొదటి భార్య గురించి? గూ: నందిని. పవన్ కళ్యాణ్‌కు నందిని సత్యానంద్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిచయం కావడం జరిగింది. 1997లో వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత వీరు విడిపోయారు. విడాకుల అనంతరం నందిని తన పేరును జాన్వీగా మార్చుకుని డా. కృష్ణా రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్ర: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు? గూ: ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఇలా చెప్పారు.." నాకు ఒక వ్యక్తితో బంధం కుదరలేదు. నేను మరొకరిని వివాహం చేసుకోవలసి వచ్చింది. అలాగే ఇది కోరికతోనో, వ్యామోహంతోనో జరగలేదు. అవి అలా జరిగాయి. కానీ బాధను మాత్రం మిగిల్చాయి. ప్ర: పవన్ కళ్యాణ్ ఫొన్ నంబర్? గూ: 99047081XX లాస్ట్ రెండు డిజిట్స్ మాత్రం తెలియదు. ప్ర: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఎవరు? గూ: అన్నా లెజ్నెవా రష్యన్ మోడల్, నటి.&nbsp; తీన్‌మార్ చిత్రం సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది.&nbsp; వీరి వివాహం 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్- ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్స్ కార్యాలయంలో జరిగింది. ప్ర: పవన్ కళ్యాణ్‌కు ఎంత మంది పిల్లలు? గూ: పవన్‌ కళ్యాణ్‌కు నలుగురు సంతానం. పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ సంతానంగా అకీరా, ఆద్య. మూడో భార్య అన్నా లెజ్నెవాకు మార్క్ శంకర్ పవనోవిచ్, పోలేనా అంజనా పవనోవా జన్మించారు.
    మార్చి 19 , 2024
    Top 20 Ullu Actress: శృంగార వీడియోలకు ఈ భామలే కేరాఫ్‌.. ఈ ఉల్లు బ్యూటీల గురించి ఇవి తెలుసా?
    Top 20 Ullu Actress: శృంగార వీడియోలకు ఈ భామలే కేరాఫ్‌.. ఈ ఉల్లు బ్యూటీల గురించి ఇవి తెలుసా?
    రసిక రాజులకు పసందైన వినోదాన్ని పంచే ఓటీటీ వేదిక ‘ఉల్లు’ (ULLU). ఇది ప్రత్యేకించి ఆడల్ట్‌ కంటెంట్‌ను స్ట్రీమింగ్‌ చేస్తూ ఉంటుంది. ఉల్లు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌.. ఉల్లు యాప్‌/వెబ్‌సైట్‌ ద్వారా వివిధ రకాల వినోద కంటెంట్‌ను అందిస్తుంది. ఇందులో శృంగారభరితమైన వెబ్‌సిరీస్‌లు, షార్ట్‌ఫిల్మ్‌లను చూడవచ్చు. వీటిలో నటించే భామలకు బయట మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. స్టార్‌ హీరోయిన్ల స్టేటస్‌ను వారు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో టాప్‌-20 (Top 20 Ullu Actress) ఉల్లు నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; Payal Patil ఈ భామ ఉల్లు వెబ్‌ సిరీస్‌లలో 'రేణు' అనే పేరుతో చాలా ఫేమస్ అయ్యింది. 'సెక్రటరీ' అనే సిరీస్‌ ద్వారా కుర్రకారు హృదయాలను దోచుకుంది. కిట్టి పార్టీ, జిలేబీ బాయ్‌ వంటి సినిమాల్లోనూ ఆడల్ట్‌ పాత్రలు పోషించింది.&nbsp; Ritu Pandey ఈ బ్యూటీ కూడా శృంగార సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ చిత్రం 'సావ్‌ధాన్ ఏక్‌ అద్భుత్‌ కహానీ' (Savdhan Ek Adbhut Kahaani) చిత్రంతో చాలా ఫేమస్ అయ్యింది. Shyna Khatri షైనా ఖాత్రి... ఒకప్పుడు మోడల్‌గా చేసి ఈ ఉల్లు ఓటీటీలోకి అడుగుపెట్టింది. కర్జాదార్‌, కామ్‌ పురుష్‌, పగ్లెట్‌ 2, పెహ్రెడార్ వంటి ఆడల్ట్‌ సిరీస్‌లలో నటించింది. తన ఎక్స్‌ప్రెషన్స్‌, సోయగాలతో వీక్షకులను మైమరిపించింది.&nbsp; Alpita Banika అల్పిత బనికా.. చుల్‌ (Chull) అనే ఉల్లు వెబ్‌సిరీస్‌తో దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. సోషల్‌మీడియాలోనూ హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ చాలా ఫేమస్‌ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెను ఫాల్లో అయ్యే వారి సంఖ్య చాలా పెద్దదే.&nbsp; Tanisha Kanojia ఆడల్ట్‌ సినిమా అనగానే గుర్తుకు వచ్చేవారిలో తనీష కచ్చితంగా ఉంటుంది. ఆమె ఉల్లుతో పాటు బూమ్‌ మూవీస్‌ (Boom Movies), కూకు (Kooku) వంటి వివిధ ఆడల్ట్ ఓటీటీ వేదికల్లో సినిమాలు సిరీస్‌లు చేసింది. సుర్‌సురి-లీ (Sursuri-Li), చర్మ్‌సుఖ్‌ (Charamsukh) సిరీస్‌లు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.&nbsp; Paromita Dey ఈ బ్యూటీ (Top 20 Ullu Actress) కెరీర్‌ ప్రారంభంలో రేడియో జాకీగా చేసింది. 2015లో వచ్చిన హిందీ వెబ్‌సిరీస్‌ 'తుమ్‌సే నా హో పాయేగా' వెబ్‌ సిరీస్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తన అంద చందాలతో కుర్రకారును ఆకట్టుకుంది. Amika Shail అమికా షైల్‌.. హిందీలో ఫేమస్‌ ఆడల్ట్‌ నటి. చర్మ్‌సుఖ్‌ (ట్యూషన్‌ టీచర్‌), గండీ బాత్‌ 5, రుఖ్‌సాతి సిరీస్‌లతో పాటు దివ్య ద్రిష్టి, బాల్‌ వీర్‌ వంటి టెలివిజన్‌ షోలలో నటించింది. ఆడల్ట్‌ కంటెంట్‌ ప్రియులు ఈమెను స్టార్‌ హీరోయిన్‌ కంటే ఎక్కువగా ఆరాధిస్తారు.&nbsp; Bharti Jha భోజ్‌పూరి ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన భర్తీ జా.. అడల్ట్‌ వెబ్‌సిరీస్‌ల వైపు వెళ్లి మంచి పేరు సంపాదించింది. పలు ఆడల్ట్ ఓటీటీ వేదికల్లో కనిపించి కుర్రకారును ఆకర్షిస్తోంది.&nbsp; Nehal Vadoliya ఈ బ్యూటీ ఉల్లు (ULLU) లోకి రాకముందు మోడల్‌గా పనిచేసింది. గుజరాతి, మరాఠి, హిందీ చిత్రాలతో పాటు టెలివిజన్‌ ఇండస్ట్రీలోనూ నేహాల్‌ నటించింది. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు వలపు వల వేస్తుంటుంది నేహాల్.&nbsp; Jinnie Jazz ఈ బ్యూటీ (Top 20 Ullu Actress) ఉల్లు వెబ్‌సిరీస్‌లలో బోల్డ్‌ &amp; గ్లామరస్‌ పాత్రలకు పెట్టింది పేరు. 'చరమ్‌సుఖ్‌ ఆతే కి చక్కి', రిష్వాలా, లవ్‌ గురు వంటి సిరీస్‌లతో జెన్నీ బాగా పాపులర్ అయ్యింది.&nbsp; Rekha Mona Sarkar ఈ భామ 'జస్సీ కింగ్‌ ద ఫకర్‌ గోల్డెన్‌ హోల్‌' అనే కూకు వెబ్‌ సిరీస్‌తో పాపులర్ అయ్యింది. కెరీర్ ప్రారంభానికి ముందు మోడల్‌గా చేసిన రేఖ.. ప్రస్తుతం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ గుర్తింపు పొందింది. Aliya Naaz ఉల్లు వేదికపై నటించే ఆడల్ట్ తారల్లో ‘అలియా నాజ్‌’ ఒకరు. బహుజన్, జఘన్య ఉపాయ్, చుడివాలా, టక్‌ వంటి శృంగార సిరీస్‌లలో అందాలు ఆరబోసి అందర్ని ఫిదా చేసింది. మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో దూసుకుపోతోంది.&nbsp; Sneha Paul స్నేహా పాల్‌ కూడా తన గ్లామర్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది. చరమ్‌సుఖ్‌ చావల్‌ హౌస్‌ 1, 2, 3.., లాల్‌ లిహఫ్‌ తదితర ఆడల్ట్‌ ఉల్లు సిరీస్‌లలో ఆమె నటించింది. మత్తెక్కించే అందాలతో వీక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది.&nbsp; Rajsi Verma రాజ్సీ వర్మా (Top 20 Ullu Actress).. ఉల్లు వెబ్‌సిరీస్‌లలో నటించడం ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. చరమ్‌సుఖ్‌, శుభరాత్రి, పలంగ్‌టోడ్‌ సిరీస్‌లలో తన అందచందాలను ఆరబోసింది. Muskaan Agarwal ఈ భామ.. పలంగ్‌టోడ్‌ (బెకాబో దిల్‌), ఆతే కి చక్కి, రూపాాయ 500, చరమ్‌సుఖ్‌ (లైవ్‌ స్ట్రీమింగ్‌), జాల్‌, చమ్‌సుఖ్‌ (తౌబా తౌబా), సుల్తాన్‌ వంటి ఆడల్ట్‌ సిరీస్‌లలో నటించి ఉర్రూతలూగించింది. ఈ అందచందాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.&nbsp; Ayushi Jaiswal ఈ బ్యూటీ సిరీస్‌ను చూసిన వారు తిరిగి మళ్లీ మళ్లీ చూస్తుంటారని అంటారు. ఆయూషి జైస్వాల్‌.. ఉల్లుతో పాటు ర్యాబిట్‌ మూవీస్‌, మ్యాక్స్‌ ప్లేయర్‌ వంటి ఆడల్ట్‌ ఓటీటీ వేదికల్లో నటిస్తోంది. చరమ్‌సుఖ్‌ కమర్ కి నాప్‌, హాట్‌స్పాట్‌ (ఫాంటసీ కాల్‌), పలంగ్‌ టోడ్‌ దమడ్‌ జీ వంటి శృంగార సిరీస్‌ల ద్వారా ఆయుషీ ఫేమస్‌ అయ్యింది.&nbsp; Ruks Khandagale ఈ బ్యూటీ ప్రధానంగా ఉల్లు వేదికగా వచ్చే ఆడల్ట్‌ సిరీస్‌లలోనే కనిపిస్తుంది. ఉల్లుతో పాటు అడపాదడపా హాట్‌షాట్స్‌, బెలూన్స్‌, హాట్‌మస్తీ వేదికల్లోనూ నటిస్తుంది. పలంగ్‌టోడ్‌ డబుల్‌ ధమాకా, సామ్నే వాలి ఖిడ్కీ, టక్‌, డొరహా పార్ట్ 1,2 సిరీస్‌లో ఆమె అందాలను చూడవచ్చు.&nbsp; Noor Malabika ఈ బ్యూటీ (Top 20 Ullu Actress) కూడా ఉల్లు సిరీస్‌ల ద్వారానే అందరి దృష్టిలో పడింది. ఉల్లు పాపులర్‌ వెబ్‌సిరీస్‌లు.. పలాంగ్‌టోడ్‌ సిస్కియాన్‌, చరమ్‌సుఖ్‌ తపన్‌, వాక్‌మ్యాన్‌, టిఖీ ఛట్నీలలో ఆమె నటించింది.&nbsp; Hiral Radadiya ఈ బ్యూటీ అందాలను చూడాలంటే ఉల్లు (Top 20 Ullu Actress) వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సిందే. ఉల్లుతో పాటు కూకు, ఫ్లిజ్‌, హాట్‌మస్తీ వంటి ఆడల్ట్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ బ్యూటీ వీడియోలు ఉన్నాయి.&nbsp; Priya Gamre కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించిన ఈ సుందరి.. 2009లో '1 నవ్రా 3 బాయ్‌కా' ఆడల్ట్‌ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. కౌన్సిలర్ పార్ట్‌ 1, 2.. గాచీ పార్ట్‌ 1, 2.. మట్కీ వంటి సిరీస్‌లతో తన సొగసులను చూపించింది.
    ఫిబ్రవరి 19 , 2024
    <strong>Game Changer: డల్లాస్‌ టూ తిరుపతి.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రమోషన్‌ ఈవెంట్స్‌ లాక్‌!</strong>
    Game Changer: డల్లాస్‌ టూ తిరుపతి.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రమోషన్‌ ఈవెంట్స్‌ లాక్‌!
    మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ కానుంది. జనవరి 10న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గేమ్‌ ఛేంజర్ ప్రమోషన్స్‌, అప్‌డేట్స్‌ విషయంలో గత కొంతకాలంగా మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలోనైనా ప్రమోషన్స్‌పై మూవీ టీమ్‌ ఫోకస్‌ పెట్టాలని కోరుతున్నారు. ఈ క్రమంలో నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్‌ ఈవెంట్స్‌ ఏ తేదీల్లో, ఎక్కడ జరగనున్నాయో ముందే చెప్పేశారు. దీంతో మెగా ప్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; ప్రమోషన్ ప్లాన్స్ రివీల్‌ గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) ప్రమోషన్‌ ఈవెంట్స్‌పై నిర్మాత దిల్‌ రాజు క్లారిటీ ఇచ్చారు. చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రమోషన్స్‌పై తమ ప్లాన్‌ ఎంటో తెలియజేశారు. ఈ నెల 9న లక్నోలో టీజర్ లాంచ్ చేయనున్నట్లు దిల్‌రాజు చెప్పారు. ఆ తర్వాత అమెరికాలోని డల్లాస్‌లో ఓ భారీ ఈవెంట్ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం చెన్నైలో మరో ఈవెంట్ ఉండనున్నట్లు తెలిపారు. జ‌న‌వ‌రి తొలి వారంలో ఏపీ, తెలంగాణ‌ల్లో స్పెషల్‌ ఈవెంట్స్ నిర్వహిస్తామని చెప్పారు.. జ‌న‌వ‌రి 10న సంక్రాంతి స్పెష‌ల్‌గా గేమ్ చేంజ‌ర్ సినిమాను రిలీజ్ పేర్కొన్నారు. సాంగ్స్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా గేమ్‌ ఛేంజర్‌లో ఉంటుందని దిల్‌రాజు చెప్పారు.&nbsp; https://twitter.com/TeamRCGuntur_/status/1854106243595690248 https://twitter.com/TheAakashavaani/status/1853657034605953343 తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌! ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను తిరుపతిలో గ్రాండ్‌ నిర్వహించాలని మూవీ టీమ్‌ భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ఓపెన్‌ ప్లేసులో ఈవెంట్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, రామ్‌ చరణ్‌ బాబాయ్ అయిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఈవెంట్‌కు పిలిచే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రామ్‌చరణ్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో మూవీ టీమ్‌ ఆహ్వానాన్ని పవన్‌ కాదనే ఛాన్స్ ఉండకపోవచ్చని చెబుతున్నారు. అటు హైదరాబాద్‌లోనూ ఓ ప్రమోషన్ ఈవెంట్‌ నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది.&nbsp; దిల్‌ రాజు 50వ చిత్రంగా.. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఫిల్మ్‌ కెరీర్‌లో ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer) 50వ చిత్రంగా రానుంది. గేమ్‌ ఛేంజర్‌ స్టోరీని మూడేళ్ల క్రితమే శంకర్‌ చెప్పినట్లు దిల్‌రాజు తెలిపారు. ఆ కాన్సెప్ట్‌ వినగానే ఎంతో ఆసక్తి కలిగిందని చెప్పారు. సహ నిర్మాత ఆదిత్య రామ్‌ తనకు మంచి స్నేహితుడని, నాలుగు తెలుగు సినిమాలు సైతం ప్రొడ్యూస్‌ చేశారని చెప్పారు. అయితే వ్యాపార నిమిత్తం చెన్నైలో అతడు బిజీ అయ్యారని పేర్కొన్నారు. గేమ్‌ ఛేంజర్‌ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరగానే ఆదిత్య రామ్‌ వెంటనే సరే అన్నారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, ఆదిత్య రామ్‌ మూవీస్‌ సంస్థలు 'గేమ్‌ ఛేంజర్‌'కే కాకుండా భవిష్యత్‌లో మరికొన్ని ప్రాజెక్ట్స్‌కు కూడా కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. శంకర్‌ ఫామ్‌తో కలవరం! RRR వంటి బ్లాక్‌ బాస్టర్ తర్వాత శంకర్‌తో రామ్‌చరణ్ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ ఎగిరిగంతేశారు. అయితే ఇటీవల శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘భారతీయుడు 2’ డిజాస్టర్‌తో వారి ఉత్సాహం పూర్తిగా దెబ్బతింది. ‘భారతీయుడు 2’ అసలు శంకర్‌ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ డైరెక్షన్‌పై మెగా అభిమానుల్లో అనుమానాలు ఏర్పడ్డాయి. ’గేమ్‌ ఛేంజర్‌’ అటు ఇటు అయితే తీవ్ర నిరాశ తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శంకర్‌కు సైతం సక్సెస్‌ బాటలో పడేందుకు ‘గేమ్‌ ఛేంజర్‌’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజు కూడా ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీతో తీవ్రంగా నష్టపోయి గేమ్‌ ఛేంజర్‌పై భారీగా ఆశలు పెట్టుకున్నారు.&nbsp; ట్రెండింగ్‌లో అన్‌ప్రిడిక్టబుల్ గేమ్‌ ఛేంజర్‌ చిత్రానికి సంబంధించి అన్‌ప్రిడిక్టబుల్ (#Unpredictable) పదం రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. దీనికి కారణం ఏంటో తెలియక చాలా మంది నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ‘అన్‌ప్రిడిక్టబుల్‌’ అనేది గేమ్ ఛేంజర్ టీజర్‌లో ఉండే శక్తివంతమైన లైన్ అని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. చరణ్‌ నోట ఈ పదం వస్తుందని అంటున్నారు. దీంతో సినిమాలోని ఏ సందర్భంలో చరణ్‌ ఈ పదం వాడతారోనని అభిమానులు ఇప్పటినుంచే తెగ థింక్‌ చేస్తున్నారు. కాగా, నవంబర్‌ 9న రాబోయో టీజర్‌ 1 నిమిషం 40 సెకన్ల నిడివి ఉంటుందని అంటున్నారు.&nbsp;
    నవంబర్ 06 , 2024
    Suhani Bhatnagar: ‘దంగల్‌’ నటి ప్రాణం తీసిన చిన్న గాయం.. ఏం జరిగిందంటే?
    Suhani Bhatnagar: ‘దంగల్‌’ నటి ప్రాణం తీసిన చిన్న గాయం.. ఏం జరిగిందంటే?
    బాలీవుడ్‌ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'దంగల్‌'లో బాల నటిగా చేసిన ‘సుహాని భట్నాగర్’ (Suhani Bhatnagar) కన్నుమూసింది. 19 ఏళ్ళ వయసులోనే సుహాని మరణించి అందర్నీ షాక్‌కి గురి చేసింది. https://twitter.com/kadak_chai_/status/1758784936247746905?s=20 కొన్నేళ్ల క్రిందట సుహానికి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె కాలుకి గాయమైంది. చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మందులు సుహానిపై దుష్ప్రభావం చూపాయి.&nbsp; సుహాని శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటీన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సుహానీ ఈ ఉదయం ప్రాణాలు విడిచింది.&nbsp; సుహానికి సంబంధించిన అంత్యక్రియలను ఫరిదాబాద్‌ సెక్టార్‌ 15లోని అజ్రోండా శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు ఉదయం ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. సుహానీ 2016లో వచ్చిన ‘దంగల్‌’ (Dangal) సినిమా ద్వారానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో అమీర్‌ఖాన్‌తో పాటు కూతుళ్లుగా నటించిన ఫాతిమా, సన్యా, సుహాని భట్నాగర్‌కు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు వచ్చింది.&nbsp; ఈ సినిమా తరువాత ఈ ఫాతిమా, సన్యాస, సుహానిలకు ఇండస్ట్రీలో చాలా ఆఫర్లు వచ్చాయి. ఆ ఆఫర్స్‌ని ఫాతిమా, సన్యా అందిపుచ్చుకున్నారు.&nbsp; కానీ సుహాని (Suhani Bhatnagar) మాత్రం.. యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకోని స్టడీస్‌పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే సినిమాలకు దూరమై చదువులో బిజీ అయ్యింది. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను సుహాని పలకరిస్తూనే ఉండేది. ఎప్పటికప్పుడు తన సమాచారాన్ని వారితో పంచుకునేది.&nbsp; ఈ క్రమంలో సుహాని పోస్టు చేసిన ఫొటోలను చూసి నెటిజన్లు ఫిదా అయ్యేవారు. సుహాని ట్రాన్స్‌ఫార్మేషన్‌, అందం చూసి ఆశ్చర్యపోయేవారు.&nbsp; సుహాని అందాన్ని కచ్చితంగా వెండితెరపై చూడాల్సిందేనని బాలీవుడ్ ఆడియన్స్‌ భావించారు. ఆమె ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న క్రమంలోనే ఈ షాకింగ్ న్యూస్ ఎదురైంది.&nbsp; సుహాని అకస్మిక మరణంతో బాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.&nbsp;
    ఫిబ్రవరి 17 , 2024

    @2021 KTree