• TFIDB EN
  • రంగస్థలం (2018)
    U/ATelugu2h 54m

    ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ.

    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రామ్ చరణ్చెల్లుబోయిన చిట్టి బాబు
    సమంత రూత్ ప్రభురామలక్ష్మి
    ఆది పినిశెట్టిచెల్లుబోయిన కుమార్ బాబు
    జగపతి బాబుఅధ్యక్షుడు ఫణీంద్ర భూపతి
    ప్రకాష్ రాజ్ఎమ్మెల్యే దక్షిణామూర్తి
    నరేష్కోటేశ్వరరావు
    అనసూయ భరద్వాజ్కొల్లి రంగమ్మ
    అన్నీచిట్టిబాబు
    బ్రహ్మాజీతహసీల్దార్
    బెనర్జీదక్షిణామూర్తి వైద్యుడు
    సత్య అక్కలఒక బూడిద రంగు షేడ్ గ్రామస్థుడు
    అజయ్ ఘోష్శేషు నాయుడు
    మహేష్ ఆచంటమహేష్
    శత్రుకుమార్ బాబు మరియు చిట్టిబాబుల శ్రేయోభిలాషి
    అమిత్ శర్మశ్రీమన్నారాయణ
    నాగ మహేష్రామలక్ష్మి తండ్రి
    చత్రపతి శేఖర్భూపతి గురించి చిట్టిబాబుని హెచ్చరించిన సాధువు
    నోయెల్ సీన్ఎర్ర శ్రీను
    రాజీవ్ కనకాలరంగమ్మ దివంగత భర్త
    సిబ్బంది
    సుకుమార్దర్శకుడు
    వై. నవీన్నిర్మాత
    వై. రవిశంకర్నిర్మాత
    C. V. మోహన్నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్సంగీతకారుడు
    ఆర్. రత్నవేలుసినిమాటోగ్రాఫర్
    నవీన్ నూలిఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>పూజా హెగ్డే గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    పూజా హెగ్డే గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. ఈక్రమంలో (Some Lesser Known Facts Pooja hegde)గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. పూజా హెగ్డే&nbsp; ముద్దు పేరు? పూజిత పూజా హెగ్డే వయస్సు ఎంత? 1990, అక్టోబర్ 13న జన్మించింది పూజా హెగ్డే తెలుగులో నటించిన తొలి సినిమా? ఒక లైలా కోసం(2014) పూజా హెగ్డే ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు&nbsp; పూజా హెగ్డే ఎక్కడ పుట్టింది? మంగళూరు, కర్ణాటక పూజా హెగ్డే ఉండేది ఎక్కడ? ముంబై పూజా హెగ్డే&nbsp; ఏం చదివింది? Mcom పూజా హెగ్డే&nbsp; అభిరుచులు? ట్రావెలింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, పుస్తకాలు చదవటం పూజా హెగ్డేకి ఇష్టమైన ఆహారం? బిర్యాని, ఫిజా పూజా హెగ్డేకి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ పూజా హెగ్డేకి ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ పూజా హెగ్డేకు ఇష్టమైన హీరోయిన్? మాధురి దీక్షిత్ పూజా హెగ్డే&nbsp; పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. పూజా హెగ్డే&nbsp; తల్లిదండ్రుల పేరు? లతా హెగ్డే, మంజునాథ్ హెగ్డే పూజా హెగ్డే&nbsp; రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది పూజా హెగ్డే&nbsp; ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/hegdepooja/ పూజా హెగ్డే నికర ఆస్తుల విలువ? రూ.50కోట్లు https://www.youtube.com/watch?v=B-Ep3Hhy2Sk
    ఏప్రిల్ 16 , 2024
    <strong>RC 17: మద్రాస్‌ చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రామ్‌ చరణ్‌-సుకుమార్‌ మూవీ.. రాజమౌళి క్రేజీ కామెంట్స్‌!</strong>
    RC 17: మద్రాస్‌ చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రామ్‌ చరణ్‌-సుకుమార్‌ మూవీ.. రాజమౌళి క్రేజీ కామెంట్స్‌!
    మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar)తో ‘RC17’ చిత్రాన్ని చరణ్‌ చేయనున్నాడు. ‘రంగస్థలం’ (Rangasthalam) లాంటి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రానుండటంతో ఇప్పటి నుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ‘RC17’పై దర్శకధీరుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై ఓ లుక్కేద్దాం.&nbsp; చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో..! 'RC 17' చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా మెుదలు కాకముందే ఈ సినిమా కథ ఇదేనంటూ నెట్టింట ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. దాని ప్రకారం ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందట. మద్రాసు పరిసర ప్రాంతాలలోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అప్పటి సామాజిక నిబంధనలను ధిక్కరించిన ఓ గుఢాచారి (స్పై) ఎమోషనల్‌ యాక్షన్‌ జర్నీనే ఈ సినిమా అని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.&nbsp; రాజమౌళి వ్యాఖ్యలు వైరల్‌ ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రమోషన్స్‌ సమయంలోనే దర్శకధీరుడు రాజమౌళి.. ‘RC17’ చిత్రం గురించి మాట్లాడారు. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న సినిమాలో ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుంది. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్‌ సీన్‌ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్‌ ఎడ్జ్‌కు వచ్చేస్తారని మాత్రం కచ్చితంగా నమ్ముతున్నాను’ అని అన్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారింది. ‘ఓపెనింగ్‌ సీన్‌ అద్భుతం’ మరోవైపు రాజమౌళి తనయుడు కార్తికేయ (Karthikeya) కూడా ‘RC 17’పై సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ చిత్రీకరణ సమయంలో సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు చరణ్‌ చెప్పాడు. ఆ సినిమాలో ఓపెనింగ్‌ సీన్ గురించి వివరించాడు. అది ఐదు నిమిషాలు ఉంటుందని.. అద్భుతమని తెలిపాడు. నాటి నుంచి ఈ సినిమా ప్రకటన కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. ఈ మూవీ వీరి కెరీర్‌లోనే మైలురాయి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ లీక్ చేయలేను’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేశారు.&nbsp; ఈ ఏడాది చివర్లో ప్రారంభం! ప్రస్తుతం రామ్‌చరణ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. దీనిని స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) రూపొందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu)తో చరణ్‌ ‘RC16’ సినిమాను పట్టాలెక్కిస్తాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తైన వెంటనే ‘RC17’ సెట్‌లోకి రామ్‌చరణ్‌ అడుగుపెడతాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా మెుదలవుతుందని సమాచారం. వచ్చే ఏడాది చివరిలో ‘RC17’ రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.&nbsp; రేపు అదిరిపోయే ట్రీట్‌! రేపు గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా నుంచి ‘జరగండి’ సాంగ్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఉదయం 9.00 గంటలకు ఈ సాంగ్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఓ పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్ రూపొందించిన ఈ పాట కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్‌, నవీన్‌ చంద్ర, ఎస్‌.జే సూర్య, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.&nbsp;
    మార్చి 26 , 2024
    RamCharan Global Craze: రామ్‌ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
    RamCharan Global Craze: రామ్‌ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
    మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ‘రామ్‌చరణ్‌’ (Ramcharan).. టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా మారారు. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. ‘మగధీర’తో స్టార్‌ హీరోగా మారిపోయాడు. ‘రంగస్థలం’ ద్వారా తనలో దాగున్న అద్భుతమైన నటుడ్ని ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రం ఆస్కార్‌ స్థాయికి ఎదగడంతో ఇందులో నటించిన తారక్‌ (Jr NTR), రామ్‌చరణ్‌ గురించి గ్లోబల్‌ స్థాయిలో చర్చ జరిగింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో రామ్‌చరణ్‌కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పే పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; ‘చరణ్‌ లాంటి నటుడు కావాలి’ హాలీవుడ్‌లో ఓ నటీనటుల ఎంపిక సంస్థ తమకి ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొన్ని పాయింట్స్ పెట్టి అందులో పలువురు హాలీవుడ్ స్టార్స్ ఫొటోలను చేర్చింది. ఆస్కార్‌ ఇసాక్‌ (Oscar Isaac), టెనెట్‌ (Tenet) నటుడు జాన్‌ డేవిడ్‌ వాషింగ్టన్‌ (John David Washington), టాప్‌ గన్‌ (Top Gun) ఫేమ్‌ మైల్స్‌ టెల్లర్‌ (Miles Teller) లాంటి నటులతో సహా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)లో రామ్‌చరణ్‌ పోలీసు గెటప్‌ను చేర్చింది. తమకు వీరి రేంజ్‌ ఫిజిక్‌, లుక్స్‌ ఉన్న నటులు కావాలని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. రామ్‌చరణ్‌ (RamCharan) లాంటి నటుడ్ని హాలీవుడ్‌ కోరుకుంటోందని మెగా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరో పక్కా హాలీవుడ్ మెటిరియల్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్‌ పోస్టరే ఉదాహరణ అంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/TweetRamCharan/status/1763423843023196469?s=20 ‘గేమ్‌ ఛేంజర్‌’లో ఎన్ని కోణాలో! ప్రస్తుతం రామ్‌ చరణ్‌.. 'గేమ్ ఛేంజర్‌' (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండూ పొంతనలేని పాత్రలని టాక్‌. అందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీకగా నిలిచేదైతే.. మరో పాత్ర 1970-80 కాలానికి చెందిందని అంటున్నారు. రెండు పాత్రల ఆహార్యాలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో రామ్‌చరణ్‌ పోషిస్తున్న ఒక పాత్ర పేరు ‘రామ్‌ నందన్‌’ అని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్‌ మూవీలో పీరియాడికల్‌ నేపథ్యంతో పాటు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, ప్రతీకారం, సామాజిక సమస్యలు.. అన్నీ మిళితమై ఉంటాయని వినికిడి. కైరా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, శ్రీకాంత్‌, ఎస్‌.ఎ.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp; అంబానీ కొడుకు వెడ్డింగ్‌కు రామ్‌చరణ్‌! ప్రపంచ కుబేరుల్లో ఒక‌రైన ముఖేష్ అంబానీ త‌న‌యుడు అనంత్ అంబానీ.. రాధికా మ‌ర్చంట్‌తో ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. అనంత్‌, రాధిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ఫిబ్ర‌వ‌రి 28 నుంచి గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో మొద‌ల‌య్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌కు రామ్‌చ‌ర‌ణ్ అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఈ పెళ్లి వేడుక‌ల్లో చెర్రీ పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ నుంచి రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే అనంత్ పెళ్లి వేడుక‌ల‌కు హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు షారుఖ్‌ ఖాన్ త‌న భార్య పిల్ల‌ల‌తో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబుతో స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం! గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్.. ఉప్పెన (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu)తో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ సైతం రెడీ అయిపోయింది. ఈ మూవీ రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కనున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ‘RC16’ మూవీలో క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్ కీల‌క పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించనుంది.&nbsp; ప్రొడ్యూసర్‌గానూ బిజీ బిజీ! హీరోగా బిజీగా ఉంటూనే చిత్ర నిర్మాణంపై రామ్‌చ‌ర‌ణ్ ఫోక‌స్ పెట్టాడు. తండ్రి చిరంజీవితో ఆచార్య, ఖైదీ నంబ‌ర్ 150 వంటి భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించిన చరణ్‌.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో కూడిన చిన్న సినిమాల‌ను నిర్మిచండానికి ‘వీ మెగా పిక్చ‌ర్స్’ పేరుతో మ‌రో కొత్త నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాడు. ఈ బ్యాన‌ర్ ద్వారా ‘ది ఇండియా హౌజ్’ పేరుతో ఓ దేశ‌భ‌క్తి మూవీని చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా న‌టిస్తున్నాడు.
    మార్చి 01 , 2024
    <strong>సమంత గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
    సమంత గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సమంత దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో ఏమాయ చేసావే(2010) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ తమిళ్ అందం... దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు, యశోద, శాకుంతలం చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సమంత గురించి కొన్ని(Some Lesser Known Facts About Samantha) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం సమంత ఎవరు? సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సమంత దేనికి ఫేమస్? సమంత.. ఏమాయ చేసావే, పుష్ప, దూకుడు, రంగస్థలం వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. సమంత వయస్సు ఎంత? సమంత 1987 ఏప్రిల్ 28న జన్మించింది. ఆమె వయస్సు&nbsp; 36 సంవత్సరాలు&nbsp; సమంత ముద్దు పేరు? సామ్ సమంత ఎత్తు ఎంత? 5 అడుగుల 2 అంగుళాలు&nbsp; సమంత ఎక్కడ పుట్టింది? చెన్నై సమంతకు వివాహం అయిందా? 2017లో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2021లో విడిపోయింది. సమంత అభిరుచులు? పాటలు పాడటం, షాపింగ్, జిమ్‌ చేయడం సమంత ఇష్టమైన ఆహారం? స్వీట్ పొంగల్, డైరీ మిల్క్ చాక్‌లెట్, పాలకోవ సమంత అభిమాన నటుడు? ధనుష్, సూర్య, రజనీకాంత్ సమంత తొలి సినిమా? ఏమాయ చేసావే సమంత ఏం చదివింది? కామర్స్‌లో డిగ్రీ చేసింది సమంత పారితోషికం ఎంత? సమంత ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. సమంత తల్లిదండ్రుల పేర్లు? జోసెఫ్ ప్రభు, నైనిటీ సమంతకు అఫైర్స్ ఉన్నాయా? సమంత తొలుత సిద్ధార్థతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత వీరు విడిపోయినట్లు తెలిసింది సమంతకు ఎన్ని అవార్డులు వచ్చాయి? 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు వచ్చాయి. సమంత ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/samantharuthprabhuoffl/?hl=en సమంత సిగరేట్ తాగుతుందా? కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లలో సమంత స్మోకింగ్ చేస్తుందని ఉంది సమంత మద్యం తాగుతుందా? తెలియదు సమంత ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది? సమంత తొలుత నాగచైతన్యతో లిప్‌లాక్ సీన్‌లో నటించింది. ఆ తర్వాత నానితో లిప్‌లాక్ సీన్‌లో నటించింది. సమంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? చిన్మయి, రానా, అక్కినేని అఖిల్ సమంతకు టాటూలు అంటే ఇష్టమా? అవును, తన కుడి వైపు నడుము పై భాగంలో 'చై' అని టాటూ వేయించుకుంది. విడిపోయిన తర్వాత టాటూ తొలగించింది. సమంతకు వచ్చి వ్యాధి పేరు? ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్(మయోసైటిస్), ఈ వ్యాధితో పాటు 2013లో ఆమెకు డయాబెటిస్ ఉన్నట్లు తెలిసింది.&nbsp; సమంత గుడి ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్‌- బాపట్లలోని ఆలపాడు గ్రామంలో సమంత గుడిని ఆమె అభిమాని తెనాలి సందీప్ కట్టారు. https://www.youtube.com/watch?v=TRAuBpbd_nI
    ఏప్రిల్ 27 , 2024
    HBD Ram Charan: ‘రామ్‌చరణ్‌’కు బాల్యంలో చిరు ఎన్ని రిస్ట్రిక్షన్స్‌ పెట్టాడో తెలుసా?
    HBD Ram Charan: ‘రామ్‌చరణ్‌’కు బాల్యంలో చిరు ఎన్ని రిస్ట్రిక్షన్స్‌ పెట్టాడో తెలుసా?
    మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్‌ (Ram Charan).. టాలీవుడ్‌ (Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. చిరుత (Chirutha)తో తెరంగేట్రం చేసిన చరణ్‌.. రెండో సినిమా 'మగధీర' (Magadheera) ఇండస్ట్రీ హిట్‌ అందుకున్నాడు. రంగస్థలం (Rangasthalam)తో నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించిన అతడు.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగాడు. ఇవాళ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బాల్యానికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రామ్‌చరణ్‌కు చిన్నప్పుడు సిగ్గు చాలా ఎక్కువట. ఇంట్లో నిర్వహించే వేడుకల్లో అసలు పాల్గొనేవాడే కాదట. అల్లు అర్జున్‌ (Allu Arjun), శిరీష్‌ (Allu Sirish) డ్యాన్స్‌ వేస్తుంటే చూస్తూ కేరింతలు కొడుతూ ఉండేవట.&nbsp; ప్రస్తుతం రామ్‌చరణ్ ఈ స్థాయిలో డ్యాన్స్‌ వేయడానికి చిరు నుంచి వచ్చిన నైపుణ్యమే కారణమట. చరణ్‌ ఇప్పటివరకూ ఎలాంటి డ్యాన్స్‌ కోచింగ్‌ తీసుకోలేదట. చెర్రీ నటనలో మాత్రమే శిక్షణ తీసుకున్నారు. శిక్షణ అవసరం లేకుండానే అతడు డ్యాన్స్‌పై పట్టు సాధించడం విశేషం. రామ్‌చరణ్‌కు బాల్యంలో సినిమాలపై ఆసక్తి ఉండేది కాదట. అందుకు మెగాస్టార్‌ చిరంజీవి ఓ కారణంగా చెప్పవ్చచు. ఎందుకంటే చరణ్‌పై సినిమాల ప్రభావం పడకుండా చిరు జాగ్రత్తపడే వారట.&nbsp; చరణ్‌కు చదువుపై శ్రద్ధ పెరిగేందుకు సినిమా పోస్టర్లు కూడా ఇంట్లో ఉండనిచ్చేవారు కాదట . పదో తరగతి పూర్తయ్యాకే.. కొడుక్కి కొంచెం ‘సినీ ఫ్రీడమ్‌’ ఇచ్చారు చిరు. చరణ్‌ చదువు విషయానికొస్తే.. అతడు యావరేజ్‌ స్టూడెంట్‌. ఏ స్కూల్‌లో చేరినా రెండేళ్లకంటే ఎక్కువ ఉండేవారు కాదట.&nbsp; రామ్‌చరణ్‌ తన బాల్యం నుంచి టీనేజ్‌ వరకూ తరచూ స్కూల్స్‌ కాలేజీలు మారాల్సి వచ్చిందట. ఇప్పటివరకూ చెర్రీ.. 8 స్కూల్స్‌, 3 కాలేజీలు మారినట్లు సమాచారం. అయితే చదువు కంటే ఆటలంటేనే చెర్రీకి బాగా ఇష్టమట.&nbsp; నాలుగో తరగతి చదివే సమయంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. హార్స్‌ రైడింగ్‌లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో ‘మగధీర’లోని సన్నివేశాలే తెలియజేస్తాయి.&nbsp; సినిమాల విషయంలో చిరు ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారో బైక్‌ విషయంలోనూ అంతేనట. అందుకే చరణ్‌ బైక్‌ రైడింగ్‌ చేస్తానంటే చిరు ఎంకరేజ్‌ చేసేవారు కాదట.&nbsp; రామ్‌చరణ్‌కు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. బంధువుల, స్నేహితుల పుట్టిన రోజు, పెళ్లి రోజులకు వాటినే కానుకగా ఇస్తుంటారు. రామ్‌చరణ్‌ ప్రతీ ఏటా ఏదోక మాలధారణలో కనిపిస్తూనే ఉంటారు. దానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రశాంతత లభిస్తుందని, క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశంతోనే దీక్ష చేపడుతుంటానని ఓ సందర్భంలో తెలిపారు.&nbsp; అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన (Upasana)తో 2012లో చరణ్‌ వివాహమైంది. వీరి పాప పేరు క్లీంకార. సేవా కార్యక్రమాల్లోనూ ఈ నటుడు ముందుంటారు.&nbsp;&nbsp; తన సినిమాలు చూశాక మెగాస్టార్‌ చిరంజీవి చేసే కామెంట్స్‌ తనకు ఎంతో ముఖ్యమైనవని చరణ్‌ తెలిపాడు. డ్యాన్స్‌ బాగుందనో, ఫైట్లు బాగా చేశాననో చిరు చెప్పేవారట.&nbsp; ధ్రువ చూసిన తర్వాత కథకు పాత్రకు బాగా న్యాయం చేశావంటూ చిరు మెచ్చుకున్నారట. రంగస్థలం సినిమా చూస్తూ తన తల్లి భావోద్వేగానికి గురైనట్లు రామ్‌చరణ్‌ తెలిపారు. ఈ రెండూ తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు అని చరణ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్‌చరణ్ ఇప్పటివరకూ.. ‘చిరుత’, ‘మగధీర’, ‘ఆరెంజ్‌’, ‘రచ్చ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఇలా 14 విభిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.&nbsp; ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)తో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.&nbsp; ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ చిత్రం (#RC16) కూడా రామ్‌చరణ్‌ చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ నటిస్తోంది.&nbsp; రామ్‌చరణ్‌.. మరో కొత్త సినిమాను కూడా ఇటీవల అధికారికంగా ప్రకటించాడు. డైరెక్టర్‌ సుకుమార్‌తో ‘RC17’ చిత్రంలో చరణ్‌ నటించనున్నాడు. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత వీరు మళ్లీ సినిమా చేస్తుండటంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.&nbsp;
    మార్చి 27 , 2024
    <strong>RC 17: రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో కొత్త మూవీ.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?</strong>
    RC 17: రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో కొత్త మూవీ.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
    మెగా పవర్ రామ్‍చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అటు ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతోనూ రామ్‌చరణ్‌ చిత్రం ఖరారైంది. స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ‘RC16’ చిత్రానికి ఇటీవలే పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. అయితే తాజాగా రామ్‌చరణ్‌కు సంబంధించి మరో మూవీ కన్ఫార్మ్‌ అయ్యింది. ‘పుష్ప’ లాంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన సుకుమార్‌.. ‘RC17’ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు విడుదలైంది.&nbsp; హోలీ స్పెషల్ అనౌన్స్‌మెంట్‌.. రామ్‍చరణ్ - సుకుమార్ కాంబినేషన్‍లో భారీ సినిమా తెరకెక్కనుందని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నేడు అధికారికంగా వెల్లడించింది. హోలీ సందర్భంగా చెర్రీ, సుకుమార్ రంగులు పూసుకొని సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోను ట్వీట్ చేసింది. అలాగే జోడు గుర్రాల పోస్టర్‌తో ‘రోరింగ్ టూ కాంకర్’ అనే ట్యాగ్ లైన్‌ మరో పోస్టర్‌ను కూడా నిర్మాణ సంస్థ పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సుకుమార్‌ లాంటి దిగ్గజ దర్శకుడితో రామ్‌చరణ్‌ మళ్లీ పనిచేయనుండటంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; https://twitter.com/MythriOfficial/status/1772195858693698029 రంగస్థలం కాంబో రిపీట్‌! సుకుమార్‌ - రామ్‌చరణ్‌ కాంబోలో గతంలోనే ఈ సినిమా వచ్చింది. 2018లో వచ్చిన పీరియడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘రంగస్థలం’ భారీ విజయాన్ని అందుకుంది. నటుడిగా చెర్రీని మరోస్థాయికి తీసుకెళ్లింది. అప్పటి వరకు క్లాస్ సినిమాలతో మెప్పించిన సుకుమార్.. రంగస్థలంతో మాస్ అంటే ఏంటో చూపించారు. ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పుడు ‘ఆర్‌సీ17’ చిత్రానికి ఈ హిట్‌ కాంబినేషన్ మొత్తం రిపీట్ అవుతోంది. రిలీజ్‌ ఎప్పుడంటే? రామ్‍చరణ్ - సుకుమార్ కాంబోలో రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని... 2025 రెండో అర్ధభాగంలో రిలీజ్ చేసేలా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబుతో సినిమా పూర్తయ్యాక వెంటనే ఈ మూవీ షూటింగ్‍లో చెర్రీ పాల్గొనే ఛాన్స్ ఉంది.
    మార్చి 25 , 2024
    Telugu Beautiful Anchors: ఈ యాంకర్లు చాలా హాట్‌ గురూ!
    Telugu Beautiful Anchors: ఈ యాంకర్లు చాలా హాట్‌ గురూ!
    ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో మంది మహిళా యాంకర్లు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. సుమ, ఝాన్సీ, శ్యామల, ఉదయభాను వంటి సీనియర్‌ యాంకర్లు తమ మాటలతో మంచి గుర్తింపు సంపాదించగా.. ఇంకొందరు తమ బ్యూటీతో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. చిట్టిపొట్టి డ్రెస్సులతో గ్లామర్‌ షో చేస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ‌అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకొని పై స్థాయికి ఎదుగుతున్నారు. ప్రస్తుతం తెలుగులోని బ్యూటీఫుల్‌ యాంకర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. అనసూయ (Anasuya) యాంకర్‌ అనసూయ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్‌ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తన గ్లామర్‌తో షోకే అందాన్ని తీసుకొచ్చింది. ఆ షో సూపర్‌ హిట్‌ కావడంలో తన వంతు పాత్ర పోషించింది. జబర్దస్త్‌ క్రేజ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ గ్లామర్‌ బ్యూటీ.. ‘రంగస్థలం’లో రంగమ్మత్త, ‘పుష్ప’లో దాక్షాయణి పాత్రల్లో మెప్పించి మరింత గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.&nbsp; 2. రష్మి (Rashmi) జబర్దస్త్ షో ద్వారానే మంచి క్రేజ్‌ సంపాదించుకున్న మరో యాంకర్‌ రష్మి. జబర్దస్త్‌ స్కిట్లతో పాటు రష్మి అందాలకు కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉన్నారు. చిరంజీవి లేటెస్ట్‌ మూవీ భోళా శంకర్‌లోనూ రష్మి నటించింది.&nbsp; 3. శ్రీముఖి (Srimukhi) యాంకర్ అనసూయ, రష్మిల తరువాత ఆ స్థాయిలో అందాలు ఆరబోసే బుల్లితెర యాంకర్‌ ‘శ్రీముఖి’. వినోదాన్ని పంచే విషయంలో వారిద్దరి కంటే శ్రీముఖి ఓ మెట్టు పైనే ఉంటుంది. ఈ భామ కూడా తన గ్లామర్‌తో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది.&nbsp; 4. వింధ్య (Vindhya) తెలుగు యాంకర్లు అందరిదీ ఒక లెక్క అయితే.. వింధ్యది మరో లెక్క. తెలుగులో ఏకైక మహిళా స్పోర్ట్స్ యాంకర్‌ ఆమెనే. ఐపీఎల్‌ వచ్చినా, కబడ్డీ లీగ్స్ జరిగినా వింధ్య తన యాంకరింగ్‌తో కనువిందు చేస్తుంటుంది. తన హాట్‌నెస్‌తో క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది&nbsp; 5. మంజూష (Manjusha) హీరోయిన్ మెటీరియల్‌లా అనిపించే యాంకర్ మంజూష.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంది. తన గ్లామర్‌ షోతో కుర్రకారు మతులు పొగొట్టే ఈ భామ.. ఆడియో, సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన యాంకర్ల లాగా టీవీ, రియాలిటీ షోలలో కనిపిస్తుంటారు కానీ.. మంజూష మాత్రం సినిమా ఈవెంట్లలోనే తళుక్కున మెరుస్తూ ఉంటుంది.&nbsp; 6. వర్షిణి (Varshini) అందాల ఆరబోతలో అనసూయ, రష్మీలకు యాంకర్‌ వర్షిణీ గట్టి పోటీ ఇస్తోంది. టీవీ షోలలో ఎక్కువగా కనిపించే ఈ భామ.. ఇటీవల కాలంలో తన దూకుడు బాగా తగ్గించింది. పెద్దగా ఏ షోలలోనూ కనిపించడం లేదు.&nbsp; 7. విష్ణు ప్రియ (Vishnu Priya) తెలుగులో డ్యాన్స్‌ అద్భుతంగా చేసే అతికొద్ది మంది యాంకర్లలో విష్ణుప్రియ ఒకరు. ఈ భామ కూడా ఒంపుసొంపులను ఒలికించడంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన గ్లామర్‌ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.&nbsp;
    ఆగస్టు 04 , 2023
    Village Flavoured Movies: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. ఈ లైన్‌తో సినిమా తీస్తే పక్కా హిట్..!
    Village Flavoured Movies: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. ఈ లైన్‌తో సినిమా తీస్తే పక్కా హిట్..!
    టాలీవుడ్‌లో నయా ట్రెండ్ నడుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమాలు బంపర్ హిట్ సాధిస్తున్నాయి. పల్లెటూరి వాతావరణం, ఆహార్యం, యాస, ఆచార సంప్రదాయాలను ఎన్నో సినిమాలు ప్రతిబింబిస్తున్నాయి. ఇలా వచ్చిన సినిమాలు విజయాన్ని అందుకుంటున్నాయి. గత కొద్ది కాలంగా విలేజ్ ఫ్లేవర్‌తో వచ్చిన సినిమాలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.&nbsp; రంగస్థలం రంగస్థలం అనే గ్రామాన్ని సృష్టించి ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో నదీ పరివాహక ప్రాంతం, పొలాలు, గుడిసెలు.. అంతా పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తన నటనతో రామ్‌చరణ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు.&nbsp; దసరా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మొదటి చిత్రం ‘దసరా’. సింగరేణి బొగ్గు గనుల్లో ఉన్న ‘వీర్లపల్లి’ అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ముఖ్యంగా, ఇక్కడి మనుషుల అలవాట్లు, కట్టుబాట్లు, వేష భాషను సినిమాలో చక్కగా చూపించారు. తెలంగాణ మాండలికంలో డైలాగులు చెబుతూ నాని యాక్టింగ్ ఇరగదీశాడు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను ఈ సినిమా క్రాస్ చేసింది. బలగం అంచనాలు లేకుండా వచ్చి సంచలనం రేపిన సినిమా ‘బలగం’. ఇదొక ఊరి కథ. ప్రతి గ్రామంలోని ఓ కుటుంబంలో ఉండే కామన్ సమస్యను ఇందులో చూపించాడు డైరెక్టర్ వేణు యెల్దండి. గ్రామస్థుల మధ్య సంబంధ, బాంధవ్యాలు; వ్యవహార శైలిని కళ్లకు కట్టినట్లు తీశాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం పెను సంచలనం సృష్టించింది. ఊర్లలో ప్రత్యేకంగా ఈ సినిమాను స్క్రీనింగ్ చేశారు. బండ్లు, బస్సులు, ట్రాక్టర్లు కట్టుకుని థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లారు.&nbsp; విరూపాక్ష పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా ఇది. రుద్రవనం అనే గ్రామంలో జరిగే ఘటనల చుట్టూ సినిమా కథను రాసుకున్నాడు డైరెక్టర్ కార్తీక్ దండు. 1990వ దశకంలో గ్రామాల్లోని పరిస్థితి ఎలా ఉండేది? మూఢ నమ్మకాలను ఎంత బలంగా విశ్వసించేవారు? పల్లెటూరి వాతావరణం వంటి వాటిని ఇందులో చూపించారు.&nbsp; పుష్ప సుకుమార్ తెరకెక్కించిన మరో చిత్రం పుష్ప. శేషాచలం అడవుల్లోని గ్రామాల్లో నెలకొనే పరిస్థితులపై సినిమా తెరకెక్కింది. నటీనటుల వేష, భాష అచ్చం రాయలసీమను ప్రతిబింబిస్తాయి. బాక్సాఫీస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుందీ సినిమా. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ ఇరగదీశాడు.&nbsp; కేరాఫ్ కంచరపాలెం కంచరపాలెం, భీమిలి పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక్కడి ప్రజల జీవనశైలిని నిశితంగా పరిశీలించి చిత్రాన్ని తీయాలని డైరెక్టర్ వెంకటేశ్ మహా భావించాడు. అలా ఓ కథను ఎంచుకుని గ్రామీణ పరిస్థితులు ఉట్టిపడేలా సినిమాను తీశాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; శ్రీకారం వ్యవసాయానికి ఆదరణ కోల్పోతున్న నేపథ్యంలో దాని ప్రాధాన్యతను తెలియజేస్తూ వచ్చిన చిత్రం ఇది. గ్రామాల్లోని రైతుల మధ్య ఉండే అనుబంధాలను ఇందులో చక్కగా చూపించాడు డైరెక్టర్ కిశోర్. శర్వానంద్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది.&nbsp;&nbsp; కాంతార చిన్న చిత్రంగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం రేపింది కాంతార. ఓ మారుమూల అటవీ గ్రామంలోని ఆచారాన్ని ఆదర్శంగా తీసుకుని సినిమాను తెరకెక్కించారు. అడవి, గ్రామస్థులు, వారి అలవాట్లు, జీవన విధానం.. ఇలా ప్రతి కోణంలోనూ పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించారు.&nbsp;
    జూన్ 13 , 2023
    Telugu Unique Movies: లోపంతో వచ్చి హిట్ కొట్టారు.. తెలుగులో కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన హీరోలు
    Telugu Unique Movies: లోపంతో వచ్చి హిట్ కొట్టారు.. తెలుగులో కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన హీరోలు
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. మరెన్నో యాక్షన్‌ సినిమాలు ప్రేక్షకులను అలరించారు. హర్రర్‌, కామెడీ, రొమాంటిక్‌ వంటి జోనర్లలో వచ్చిన మూవీలు సైతం వెండితెరను పలకరించాయి. అయితే రొటీన్‌ కథలతో విసిగిపోయిన టాలీవుడ్‌కు కొన్ని సినిమాలు కొత్తదనాన్ని పరిచయం చేశాయి. హీరోకు లోపం ఉన్న కథతో వచ్చి సూపర్ హిట్స్‌గా నిలిచాయి. కొత్తగా ట్రై చేస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తాయని నిరూపించాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? లోపంతో నటించిన స్టార్‌ హీరోలు ఎవరు? ఇప్పుడు చూద్దాం.&nbsp; పుష్ప ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో అల్లుఅర్జున్‌ ఒక లోపంతో కనిపిస్తాడు. ‌అతడి కుడి భుజం సహజంగా కంటే మరీ పైకి ఉంటుంది. సినిమా అంతా బన్నీ అలాగే ఉంటాడు. భుజాన్ని అలాగే పైకి పెట్టి షూటింగ్‌లో పాల్గొనటం ఎంతో కష్టంగా అనిపించిందని ఓ సందర్భంలో బన్నీ చెప్పుకొచ్చాడు.&nbsp;&nbsp; రంగస్థలం రామ్‌చరణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం ఒకటి. సుకుమార్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌ చెవిటి వ్యక్తిగా కనిపిస్తాడు. ఎదుటి వ్యక్తి పెదాల కదలికలను బట్టి మాటలను ఆర్థం చేసుకుంటాడు. క్లైమాక్స్‌లో ఆ చెవిటి తనమే చెర్రీకి సమస్యగా మారుతుంది. తనను ఎవరూ చంపారో అన్న చెప్పినప్పటికీ అది బుచ్చిబాబు చెవికి ఎక్కదు. చివరకు విలన్‌ ప్రకాష్‌రాజ్‌ అని తెలుసుకొని చంపేయడంతో కథ సుఖాంతమవుతుంది. రాజా ది గ్రేట్‌ మాస్‌ మహారాజా రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్‌’ సినిమా టాలీవుడ్ భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో రవితేజకు కళ్లు కనిపించవు. బ్లైండ్‌గా ఉంటూ రవితేజ చేసిన కామెడీ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా టాలీవుడ్‌లో మంచి డైరెక్టర్‌గా అనిల్ రావిపూడిని నిలదొక్కుకునేలా చేసింది.&nbsp;&nbsp; సూర్య vs సూర్య యంగ్‌ హీరో నిఖిల్‌ కథానాయకుడిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రం ‘సూర్య vs సూర్య’. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిఖిల్‌ జన్యుపరమైన లోపంతో బాధపడుతుంటాడు. అతడి శరీరంలో హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉండటంతో పగటివేళ బయటకు వెళ్తే 15 నిమిషాల్లో చనిపోతాడని వైద్యులు చెబుతారు. దీంతో రాత్రివేళ మాత్రమే హీరో బయటకు వస్తుంటాడు. ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది.&nbsp; భలే భలే మగాడివోయ్ హీరో నాని, డైరెక్టర్‌ మారుతీ కాంబోలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో నాని మతిమరుపుతో బాధపడుతుంటాడు. ప్రతీ చిన్న విషయాన్ని మర్చిపోతూ నవ్వులు పూయించాడు. అయితే అతడికున్న ఆ సమస్య కొన్ని చిక్కులను సైతం తెచ్చిపెడుతుంది. హీరోయిన్‌తో తన ప్రేమకు ప్రధాన అడ్డంకిగా మారుతుంది.&nbsp; సవ్యసాచి నాగచైతన్య హీరోగా చేసిన ‘సవ్యసాచి’ చిత్రం ఇప్పటివరకూ వచ్చిన తెలుగు సినిమాలకు పూర్తి భిన్నం. ఇందులో హీరో ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌’ అనే లోపంతో బాధపడుతుంటాడు. అవిభక్త కవలలుగా పుట్టాల్సిన ఇద్దరు ఒకరిగా కలిసిపోవడమే ఈ సమస్యకు కారణం. ఇందులో నాగచైతన్య మెదడు, ఎడమ చేయి కవల సోదరుడి ఆధీనంలో ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కొత్త ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం కాసుల వర్షం కురిపించనప్పటికీ ఒక మంచి సినిమాగా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; నా పేరు సూర్య&nbsp; అల్లుఅర్జున్ హీరోగా వక్కంతం వంశీ రూపొందించిన చిత్రం ‘నా పేరు సూర్య‘. ఇందులో బన్నీ సైనికుడిగా కనిపిస్తాడు. ఈ సినిమాలో బన్నీకి విపరీతమైన కోపం ఉంటుంది. దాంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో సైన్యం నుంచి సస్పెండ్ కూడా అవుతాడు. ఇందులో అల్లుఅర్జున్‌ అగ్రెసివ్‌ యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.&nbsp;
    మే 31 , 2023
    HBD SAMANTHA: ఆ ఒక్కటి&nbsp; సమంతకే చెల్లింది..&nbsp; బోల్డ్ అయినా, ఎమోషనల్ అయినా సామ్ దిగనంత వరకే!
    HBD SAMANTHA: ఆ ఒక్కటి&nbsp; సమంతకే చెల్లింది..&nbsp; బోల్డ్ అయినా, ఎమోషనల్ అయినా సామ్ దిగనంత వరకే!
    చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌ సమంతది ప్రత్యేకమైన ప్రయాణం. ఏమాయ చేశావే చిత్రంతో జెస్సీగా పరిచయమై అందరి మనసుల్ని కొళ్లగొట్టింది సామ్. 2010లో కెరీర్ ప్రారంభించి దాదాపు 13 సంవత్సరాలుగా టాప్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సమంత ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ వర్తమాన హీరోయిన్స్‌ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెకున్నంత డైహార్ట్ ఫ్యాన్స్‌ హీరోయిన్స్‌లో మరెవరికి లేరని చెప్పవచ్చు. ఏప్రిల్ 28న ఆమె పుట్టిన రోజు సందర్భంగా&nbsp; ఇప్పటి వరకు సమంత చేసిన విభిన్న పాత్రలు ఓసారి గుర్తు చేసుకుందాం… రంగస్థలం రామ లక్ష్మి రామ్‌చరణ్‌, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలంలో అచ్చమైన పల్లెటూరు అమ్మాయి పాత్రలో జీవించేసింది సమంత. ఆంధ్రా స్లాంగ్‌ను అచ్చుగుద్దినట్లు దింపేసింది. ఇందులో సామ్‌ చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి.&nbsp; మజిలీ శ్రావణి నాగచైతన్య, సమంత నటించిన చిత్రం మజిలీ. ఇందులో భర్త ఏం చేసినా భార్య వెనకేసుకు వస్తూ ప్రేమించే పాత్రలో సామ్‌ నటన నెక్స్ట్‌ లెవల్‌. క్లైమాక్స్‌లో సమంత పర్‌ఫార్మెన్స్‌ కన్నీళ్లు పెట్టిస్తుంది. అంతలా క్యారెక్టర్‌ను ముందుకు తీసుకెళ్లింది.  ఓ బేబీ సమంత హీరోయిన్‌గా వచ్చిన లేడి ఓరియెంటెడ్‌ ఇది. ఓ ముసలి వ్యక్తి కొన్ని కారణాల వల్ల యవ్వనంలోకి వెళ్తుంది. కానీ, ఆ పాత్రను చేసిన వ్యక్తిలానే నటించడం చాలా కష్టమైన పని. సీనియర్ యాక్టర్‌లా హావాభావాలు పండిస్తూ… చూడటానికి 25 ఏళ్లున్నా వయసు మాత్రం 60 ఏళ్లు అన్నట్లుగా కనిపించే పాత్రలో చించేసింది ఈ బ్యూటీ. యశోద అద్దె గర్భం కాన్సెప్ట్‌లో వచ్చిన యాక్షన్ సినిమా. ఇందులో సమంత పోరాట సన్నివేశాల్లో అదరగొట్టింది. తన కోసం చిక్కుల్లో పడిన చెల్లెల్ని కాపాడేందుకు ఆమె వేసే ఎత్తుగడలు, విలన్లతో పోరాటం వంటివి ఆకట్టుకున్నాయంటే ఆమెనే కారణం. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలే వచ్చాయి. శకుంతల కాళిదాసు రచించి అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ సినిమాను పూర్తి చేసింది. ఇందులో తన పాత్ర కోసం చాలానే కష్టపడింది. శకుంతల పాత్రలో జీవించింది. గ్లామర్‌ పరంగా ఏమాత్రం తగ్గకుండా నటించింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చినప్పటికీ సామ్ చేసిన డిఫరెంట్ రోల్స్‌లో ఇదొకటని చెప్పవచ్చు.&nbsp; పుష్ప ది రైజ్‌ పుష్ప చిత్రంలో ఐటెమ్‌ సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ అంటూ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఫ్యామిలీ మెన్ రాజీ మనోజ్ బాజ్‌పేయ్‌ లీడ్‌ రోల్‌లో వచ్చిన ఫ్యామిలీ మెన్ సిరీస్‌ పార్ట్‌ 2లో సమంత విభిన్నమైన క్యారెక్టర్‌లో కనిపించింది. శ్రీలంక రెబల్ గ్రూప్‌ అంటే నక్సలైట్‌ పాత్రలో మెరిసింది సుందరి. డీ గ్లామరస్‌ రోల్‌లో కనిపించడమే కాకుండా బోల్డ్‌ సీన్‌లో నటించి షాకిచ్చింది. సిటాడెల్ హాలీవుడ్‌ యాక్షన్ థ్రిల్లర్‌ సిటాడెల్‌ సిరీస్‌ను బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌, సమంత లీడ్‌ రోల్స్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా పోషించిన యాక్షన్‌ రోల్‌ను సామ్ చేయనుంది. ఇప్పటికే షూటింగ్‌ కోసం చిత్రబృందంతో జత కట్టింది చెన్నై సుందరి.&nbsp;
    ఏప్రిల్ 27 , 2023
    Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
    Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
    టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్‌ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్‌ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్‌ సుకుమార్ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. సుకుమార్‌ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్‌ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సుకుమార్‌ ఆసిస్టెంట్&nbsp; డైరెక్టర్లు: శ్రీకాంత్‌ ఓదెల(srikanth odela) టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల పేరు మార్మోగుతోంది. డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమాతోనే శ్రీకాంత్‌ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. నానితో చేసిన ‘దసరా’( DASARA ) సినిమాను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే శ్రీకాంత్‌ ఈ సినిమాకు ముందు వరకు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల సక్సెస్‌కు తనవంతు సాయం చేశాడు.&nbsp; శ్రీకాంత్‌ ఓదెల లేకుండా రంగస్థలం ఇంత బాగా వచ్చేది కాదని ఓ సందర్భంలో సుకుమార్‌ చెప్పారంటే ఈ డైరెక్టర్‌ టాలెంట్‌ అర్థమవుతోంది. https://telugu.yousay.tv/srikanth-odela-went-around-sukumars-house-for-4-years-for-opportunities-dussehra-director-emotional.html https://twitter.com/vamsikaka/status/1642932721612894208?s=20 బుచ్చిబాబు(Buchi Babu Sana) సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి బుచ్చిబాబు. తొలి సినిమా ఉప్పెనతో బుచ్చిబాబు ఓ ప్రభంజనమే సృష్టించాడు. సుకుమార్‌ నేర్పిన పాఠాలను చక్కగా అవపోసన పట్టిన ఆయన మెుదటి సినిమాతోనే తన మార్క్‌ ఏంటో చూపించాడు. అరంగేట్ర హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతి శెట్టిని స్క్రీన్‌పై చక్కగా ప్రెజెంట్‌ చేశాడు. ఉప్పెన ఘనవిజయం ద్వారా రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను బుచ్చిబాబు కొట్టేశారు. తన 16వ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్‌ చేస్తారని స్వయంగా చరణ్‌ చెప్పే స్థాయికి ఎదిగాడు.&nbsp; పల్నాటి సూర్యప్రతాప్‌(Palnati surya pratap) సుకుమార్‌ డైరెక్షన్‌ స్కూల్‌ నుంచి వచ్చిన పల్నాటి సూర్యప్రతాప్‌ కూడా తన తొలి సినిమాతో మంచి హిట్‌ అందుకున్నాడు. కుమారి 21F చిత్రం ద్వారా తన టాలెంట్‌ ఎంటో నిరూపించుకున్నాడు. ఇటీవల హీరో నిఖిల్, హీరోయిన్‌ అనుపమ జంటగా ‘18 పేజెస్‌’ సినిమాను సూర్య తీశాడు. క్లాసిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. కాగా, సుకుమార్‌ తీసిన 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్పకు సూర్య స్క్రీన్‌ రైటర్‌గా పనిచేశాడు.&nbsp; రాజమౌళి ఆసిస్టెంట్&nbsp; డైరెక్టర్లు: (Rajamouli assistant directors) G.R కృష్ణ( GR KRISHNA ) టాలీవుడ్ డైరెక్టర్‌ G.R కృష్ణ తొలుత రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సింహాద్రి సినిమా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కృష్ణ.. ఆశించిన రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. దీంతో 2019 నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న కృష్ణ ఇప్పటివరకూ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. కరుణ కుమార్‌ ( KARUNA KUMAR) మరో టాలీవుడ్‌ డైరెక్టర్‌ కరుణ కుమార్‌ కూడా రాజమౌళి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసి మెప్పించలేకపోయాడు. అయితే ఆయన తొలి సినిమా ‘పలాస’ హిట్‌ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్‌, కళాపురం వంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేక పోయాయి.&nbsp; అశ్విన్‌ గంగరాజు (ASHWIN GANGA RAJU) డైరెక్టర్‌ అశ్విన్‌ గంగరాజు సైతం రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌ డైెరెక్టర్‌గా పనిచేశాడు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2021లో ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా అశ్విన్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. రాజమౌళి హీరోలకూ ఫ్లాపుల బెడద..! రాజమౌళి శిష్యులే కాదు ఆయనతో సినిమా తీసిన హీరోలు సైతం తమ తర్వాతి సినిమాల్లో ఫెయిల్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.&nbsp; జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా ‘స్టూడెంట్‌ నెం.1’ను ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ‘సుబ్బు’ సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన ‘ఆంధ్రావాల’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.&nbsp; ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది.&nbsp; రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp;
    ఏప్రిల్ 06 , 2023
    Allu Ayaan: చరణ్ మామ అంటేనే ఇష్టం.. ట్విట్టర్‌ను షేక్‌ చేస్తున్న అల్లు అయాన్ వీడియోలు, ఫొటోలు
    Allu Ayaan: చరణ్ మామ అంటేనే ఇష్టం.. ట్విట్టర్‌ను షేక్‌ చేస్తున్న అల్లు అయాన్ వీడియోలు, ఫొటోలు
    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీ సినిమా రిలీజ్‌ అంటే థియేటర్స్‌ దగ్గర పూనకాలే. బన్నీకి బయటనే గాక సోషల్‌ మీడియాలోనూ భారీగా క్రేజ్‌ ఉంది. ఇవాళ బన్నీ గారాల పట్టి అల్లు అయాన్‌ పుట్టిన రోజు కావడంతో నెటిజన్లు సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నారు. ‘అల్లు అయాన్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ తమదైన శైలిలో బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు. దీంతో ట్విటర్‌లో #AlluAyan పేరు ట్రెండింగ్‌గా మారింది.&nbsp; అయాన్‌ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్‌ ట్విటర్‌ వేదికగా బర్త్‌డే విషెస్‌ చెప్పాడు. హ్యాపీ బర్త్‌డే మై స్వీటెస్ట్‌ ‘చిన్నిబాబు’ అంటూ అయాన్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టును బన్నీ ప్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/alluarjun/status/1642732690700111877 https://twitter.com/ShivaBoya1231/status/1642805820370063360 అటు రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ కూడా అయాన్‌కు బెస్ట్ విషెస్‌ చెబుతున్నారు. ‘చెర్రీ మామ’ అంటూ అయన్‌ ముద్దుగా పిలిచిన వీడియోను షేర్ చేస్తున్నారు. అంతేగాక రంగస్థలంలో చరణ్‌ ఫోజును అనుసరిస్తూ అయాన్‌ దిగిన ఫొటోను పంచుకుంటున్నారు. నటుడిగా తనకు రామ్‌చరణ్‌ ఇష్టమని ఓ సందర్భంలో అయాన్ చెప్పడం గమనార్హం.&nbsp; https://twitter.com/IMPravallikaM17/status/1642825725471346688 https://twitter.com/BBhanuTweets/status/1642733395859099650 సైరా ఆడియో ఫంక్షన్‌ సందర్భంగా అయాన్‌పై అల్లుఅర్జున్‌ ప్రేమ చూపించిన వీడియోను బన్నీ ఫ్యాన్స్‌ తెగ వైరల్ చేస్తున్నారు. అమితంగా ప్రేమించే బన్నీ లాంటి నాన్న దొరికినందుకు అయాన్ అదృష్టవంతుడని కామెంట్లు చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1642785636104171520 బన్నీ చిన్నప్పుడు అయాన్‌ను ఎత్తుకున్న ఫొటోలను ఫ్యాన్స్‌ ట్విటర్‌లో పోస్టు చేస్తున్నారు. అలాగే అల్లు అర్హాతో అయాన్‌ దిగిన పిక్‌ను వైరల్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/iam_naveen66/status/1642706542188453888 డీజే టిల్లు ఆడియో ఫంక్షన్‌ వేదికపై అయాన్‌ నమస్కరిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తున్న అయాన్‌ను చూసి బన్నీ మురిసిపోవడం వీడియోలో కనిపిస్తోంది.&nbsp; https://twitter.com/i/status/1642749681167138817 అల్లు అర్జున్‌తో కలిసి అయాన్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో దూకే వీడియో కూడా ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1642713358968451072 మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన ఘనీ సినిమాను ప్రమోట్‌ చేస్తూ అప్పట్లో&nbsp; అల్లు అయాన్ చేసిన వీడియో ఇప్పడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో బాక్సింగ్ ప్రాక్టిస్ చేస్తూ అయాన్ కనిపిస్తాడు.&nbsp; https://twitter.com/i/status/1642727327212929024 అల్లు అరవింద్‌ శతజయంతి వేడుకల్లో అయాన్‌ తన మాటలతో ఆకట్టుకున్నాడు. ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు https://youtu.be/YKOZYqSLRbM &nbsp; మెుత్తంగా అల్లుఅర్జున్‌కు సరైన వారసుడు అయాన్‌ అవుతాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. జూనియర్‌ అల్లుఅర్జున్‌ అంటూ ఇప్పటినుంచే ఆకాశానికి ఎత్తుతున్నారు.&nbsp;
    ఏప్రిల్ 03 , 2023
    #AskNani: ఫ్యాన్‌కు నాని  స్ట్రాంగ్ కౌంటర్… మళ్లీ చెబుతున్నా  KGF, దసరా ఒకటి కాదు.. ఒరిజినల్ పీస్
    #AskNani: ఫ్యాన్‌కు నాని  స్ట్రాంగ్ కౌంటర్… మళ్లీ చెబుతున్నా  KGF, దసరా ఒకటి కాదు.. ఒరిజినల్ పీస్
    దసరా చిత్రంతో అభిమానులకు మాస్‌ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు నాని. మార్చి 30న మెుదలవుతున్న మాస్‌ జాతర కోసం సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో సినిమాపై సూపర్‌ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రచారంలో బిజీగా ఉన్న నేచురల్ స్టార్… ట్విటర్‌లో&nbsp; అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఓసారి వాటిపై లుక్కేయండి. దసరా రన్‌టైమ్‌ #Asknaniలో భాగంగా దసరా చిత్రం రన్‌ టైమ్ రివీల్‌ చేశాడు నాని. ఈ చిత్రంలో బాగా హై ఇచ్చే సీన్ ఏదంటూ అభిమాని అడిగిన ప్రశ్నకు 2 గంటల 36 నిమిషాలు అలానే ఉంటుందనే సమాధానం ఇచ్చాడు.&nbsp; https://twitter.com/NameisNani/status/1636016970473828353 ఫుల్‌ బిందాస్ సినిమా ఔట్‌పుట్‌పై మీరు సంతోషంగా ఉన్నారా ? అడిగిన ప్రశ్నకు నాని పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ట్రైలర్‌లోని ఓ చిన్న వీడియోను జోడిస్తూ సమాధానం చెప్పాడు యంగ్ హీరో. దీంతో చిత్రం అదిరిపోతుందని చెప్పకనే చెప్పాడు.&nbsp; https://twitter.com/NameisNani/status/1636015575284748288 స్ట్రాంగ్ రిప్లై రంగస్థలం, పుష్ప చిత్రాలతో పోలీస్తే దసరా సినిమాలో తేడా ఏంటీ ? నార్త్‌ ఇండియాలో కొంతమంది చిత్రాన్ని కేజీఎఫ్‌తో పోల్చి పట్టించుకోవడం లేదని తెలిపాడు ఓ అభిమాని. దీనికి నాని స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చాడు. షారుఖ్‌ ఖాన్, ఆర్నాల్డ్‌ ఒకే రకం జాకెట్ వేసుకున్నంత మాత్రాన హాలీవుడ్‌ టర్మినేటర్, బాలీవుడ్ దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాలు ఒక్కటి కావంటూ రిప్లే ఇచ్చాడు.&nbsp; https://twitter.com/NameisNani/status/1636005865101877255 ఫన్నీ సమాధానం నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చిన నాని. భలే భలే మెుగాడివోయ్‌ చిత్రం ఎప్పుడనే క్వశ్చన్‌కు నాని ఎపిక్ రిప్లై ఇచ్చాడు. సినిమా కథను గుర్తు చేస్తూ “ వాడికి గుర్తొచ్చినప్పుడు” అన్నాడు.&nbsp; https://twitter.com/NameisNani/status/1636006778805837824 ఎవరైనా ఒక్కటే నేచురల్ స్టార్‌ కొత్త దర్శకులకు అవకాశాలు ఎక్కువగా ఇస్తుంటాడు. అలా కాకుండా టాప్‌ డైరెక్టర్లతో పనిచేయాలని ఓ వ్యక్తి చెప్పగా… “ టాలెంట్ కొత్తది అయితే ఏంటి? పాతది అయితే ఏంటి? తేడా తెలియట్లేదు నాకు” అంటూ చెప్పిన సమాధానాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. https://twitter.com/NameisNani/status/1636004611210502150 ఒరిజినల్ పీస్‌ సినిమా ట్రైలర్ చూస్తే నిజంగానే కొత్త దర్శకుడు తీసినట్లుగా అనిపించదు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి చిత్రాన్ని తెరకెక్కించిన ఫీలింగ్ వస్తుంది. దీనిపై నానికి ప్రశ్నలు ఎదురయ్యాయి. “ఊహల్లో ఇప్పటికే చాలా తీసేశాడు. దొరికాడు మనకు ఒకడు, ఒరిజినల్ పీస్‌” అంటూ శ్రీకాంత్ ఓదెలను కొనియాడాడు.&nbsp;
    మార్చి 16 , 2023
    <strong>EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!</strong>
    EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!
    సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మరికొన్ని సినిమాలు స్థానికతను బేస్‌ చేసుకొని వచ్చి మంచి ఆదరణ పొందాయి. స్థానిక ప్రజల భాష, మనుషుల వ్యక్తిత్వాలు, చుట్టుపక్కల పరిస్థితులను ఆడియన్స్‌కు తెలియజేశాయి. టాలీవుడ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జిల్లాలను ప్రతిబింబించేలా ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; పుష్ప (Pushpa) అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల చుట్టు తిరుగుతుంది. అంతేకాదు చిత్తూరు దాని పరిసర ప్రాంతాల ప్రభావం కూడా సినిమాలో కనిపిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు శ్లాంగ్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను రిప్రజెంట్‌ చేశాడు.&nbsp; గుంటూరు కారం (Guntur Karam) మహేష్‌ బాబు (Mahesh Babu) రీసెంట్‌ చిత్రం.. ‘గుంటూరు కారం’ పేరుకు తగ్గట్లే ఏపీలోని ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్‌ చేసింది. ఈ సినిమాలో గుంటూరు దాని పరిసర ప్రాంతాలను చూపించారు. ఇందులో మహేష్‌ది గుంటూరు కావడంతో పదే పదే ఆ ఊరి పేరు సినిమాలో వినిపించడం గమనార్హం.&nbsp; బలగం (Balagam) ప్రియదర్శి (Priyadarsi) హీరోగా జబర్దస్త్ ఫేమ్‌ వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ‘బలగం’ చిత్రం గతేడాది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ గ్రామాలకు అద్దం పట్టింది. ఊర్లో ప్రజల మధ్య ఉండే అనుబంధాలను తెలియజేసింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో అనుసరించే విధానాలను కళ్లకు కట్టింది రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం 1980ల నాటి గోదావరి పరివాహక గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇందులో రామ్‌చరణ్‌ చిట్టిబాబు పాత్రలో గోదావరి జిల్లాల అబ్బాయిగా కనిపించాడు. తన యాస, భాషతో ఆకట్టుకున్నాడు.&nbsp; దసరా (Dasara) హీరో నాని నటించిన దసరా సినిమాను గమనిస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి/రామగుండం ఏరియాల ప్రభావం కథపై కనిపిస్తుంది. నాని కూడా స్థానిక భాషలో డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సింగరేణి బొగ్గుగనుల సమీపంలో జీవించే వారి జీవితాలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరరూపం ఇచ్చారు. ఈ సినిమాను చూసి ఆ ప్రాంత వాసులు అప్పట్లో సంతోషం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు.&nbsp; కలర్‌ఫొటో (Colour Photo) కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమా కథ మెుత్తం కోనసీమ చుట్టూ తిరుగుతుంది. అక్కడి అందాలను డైెరెక్టర్‌ తెలుగు ఆడియన్స్‌కు చూపించారు. ఈ సినిమా ద్వారానే హాస్య నటుడు సుహాస్ హీరోగా మారాడు.&nbsp; ఉప్పెన (Uppena) యంగ్ హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej), డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాకినాడ తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల జీవన స్థితులను డైరెక్టర్ కళ్లకు కట్టాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు వారు ఎంత కష్టపడతారో చూపించారు.&nbsp; కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam) వరుణ్‌ సందేశ్ (Varun Sandesh) హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాను 50 శాతానికి పైగా రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో దర్శకుడు చూపించారు. అక్కడ వారి మనసులు ఎంత స్వచ్చంగా ఉంటాయో తెలియజేశారు. విరాట పర్వం (Virata parvam) హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’.. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 1990-92 ప్రాంతంలో మలుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎలా జీవించారో తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, మావోయిస్టులు, పోలీసులు ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించారు.&nbsp; ఇస్మార్ట్ శంకర్‌ (Ismart Shankar) రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ను పరిశీలిస్తే.. ఇందులో హీరో ఓల్డ్‌ సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తన మాటలు, హావ భావాలు కూడా ఆ ప్రాంత వాసులను గుర్తుచేస్తాయి. ఇందులో హీరోయిన్‌గా చేసిన నభా నటేష్‌.. వరంగల్‌ పోరీ అంటూ పదే పదే చెప్పుకోవడం గమనార్హం. కేర్ ఆఫ్‌ కంచరపాలెం (C/o కంచరపాలెం) మహా వెంకటేష్‌ (Maha Venkatesh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. పాత్రల మాటతీరు కూడా విజయనగరం జిల్లా యాసను పోలి ఉంటాయి. కార్తిక్‌ రత్నం, రాజు, రాధా బెస్సీ, ప్రణీ పట్నాయక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.&nbsp; రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru) కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా చేసిన 'రాజావారు రాణిగారు'.. ఒక అహ్లాదకరమైన సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లాలను ప్రతిబింబిస్తుంది. అక్కడి గ్రామాల్లో ఉండే కల్మషంలేని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. గోదావిరి నేటివిటీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.&nbsp; గోదావరి ఆధారంగా వచ్చిన చిత్రాలు టాలీవుడ్‌ చాలా సినిమాలు ఉభయ గోదావరి జిల్లాలను ఆధారంగా చేసుకొని వచ్చాయి. గల గలపారే గోదావరి నది ఆయా చిత్రాల్లో చాలవరకూ సన్నివేశాల్లో ప్రతింబింబిస్తుంది. ‘సితారా’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బెండు అప్పారావు’, ‘శతమానం భవతి’ తదితర చిత్రాలన్నీ గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చినవే.&nbsp; .&nbsp;
    మే 03 , 2024
    <strong>Anasuya Bharadwaj: ‘సెక్సీగా ఉంటాను.. ఏమైనా నేర్పిస్తాను’.. ఫీజులు ఎగిరే క్యాప్షన్‌!</strong>
    Anasuya Bharadwaj: ‘సెక్సీగా ఉంటాను.. ఏమైనా నేర్పిస్తాను’.. ఫీజులు ఎగిరే క్యాప్షన్‌!
    గ్లామరస్‌ నటి అనసూయ భరద్వాజ్.. మరోమారు తన అందచందాలతో సోషల్‌ మీడియాను షేక్ చేసింది. మత్తెక్కించే అందాలను నెటిజన్లను కవ్విచించింది.&nbsp; ఎప్పుడు గ్లామర్‌ ఫొటోలు పెట్టేసి ఊరుకునే అను.. ఈసారి అదిరిపోయే క్యాప్షన్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్యాప్షన్‌ను తన హేటర్స్‌ కోసమే అనసూయ పెట్టినట్లు తెలుస్తోంది.&nbsp; ఆ క్యాప్షన్ ఏంటంటే.. నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.. నేను మిమ్మల్ని ప్రేమించగలను అంటూ పెట్టింది.&nbsp; ప్రస్తుతం అనసూయ గ్రామరస్‌ ఫొటోలతో పాటు.. ఈ క్యాప్షన్‌ గురించి కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అను వ్యాఖ్యలను ఫ్యాన్స్‌ సమర్థిస్తుంటే.. హేటర్స్‌ మాత్రం నిట్టూరుస్తున్నారు.&nbsp; ఇక తాజా ఫొటోల విషయానికి వస్తే.. ఇందులో అనసూయ చాలా హాట్‌గా కనిపించింది. చిట్టి పొట్టి డ్రెస్‌లో ఎద, థైస్‌ అందాలు చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది.&nbsp; లూజ్‌ హెయిర్‌తో మ్యాజింగ్‌ చమ్కీలు ధరించి అదరహో అనిపించింది. అంతేకాదు కురసైన డ్రెస్‌లో వివిధ రకాలుగా ఫొటోలకు ఫోజులిచ్చింది.&nbsp; జబర్దస్త్‌ షో ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.&nbsp; 2012 - 2022 మధ్య&nbsp; బుల్లితెర యాంకర్‌గా ‌కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్‌ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.&nbsp; యాంకర్‌ కాకముందు ప్రముఖ వార్త ఛానల్‌లో అనసూయ న్యూస్‌ రీడర్‌గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్‌ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.&nbsp; రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా (Meku Matrame Chepta), కథనం (Kathanam), F2, చావు కబురు చల్లగా (Chavu Kaburu Challaga), థ్యాంక్‌ యూ బ్రదర్‌, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.&nbsp; సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. రీసెంట్‌గా ‘రజాకార్‌’ చిత్రంలో పోచమ్మ పాత్రలో కనిపించి అనసూయ అందర్నీ అలరించింది. తన అత్యుత్తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు తమిళంలో ఫ్లాష్‌ బ్యాక్‌ మూవీలో అనసూయ నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ అయితే తమిళంలోనూ ఈ బ్యూటీ బిజీగా మరిపోనుంది.&nbsp;
    ఏప్రిల్ 03 , 2024
    Top TV Hosts In South India: సౌత్‌ ఇండియాను షేక్‌ చేస్తున్న బుల్లితెర భామలు వీరే!&nbsp;
    Top TV Hosts In South India: సౌత్‌ ఇండియాను షేక్‌ చేస్తున్న బుల్లితెర భామలు వీరే!&nbsp;
    దక్షిణాదిలో వెండితెరకు సమానంగా బుల్లితెర ఎదుగుతోంది. ఎంతో మంది మహిళా యాంకర్లు, సీరియల్ నటీమణులు టెలివిజన్ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. అదే సమయంలో సినిమా ఈవెంట్స్‌, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్లు, సక్సెస్‌ మీట్‌లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. కొందరు సీనియర్‌ యాంకర్లు తమ మాటలతో మంచి గుర్తింపు సంపాదించగా.. ఇంకొందరు తమ బ్యూటీతో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. చిట్టిపొట్టి డ్రెస్సులతో గ్లామర్‌ షో చేస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ‌అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకొని పై స్థాయికి ఎదుగుతున్నారు. ఇలా దక్షిణాదిలో అందరి దృష్టిని ఆకర్షించిన టాప్‌ యాంకర్లు, నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; మంజూష (Manjusha) హీరోయిన్ మెటీరియల్‌లా అనిపించే యాంకర్ మంజూష.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంది. తన గ్లామర్‌ షోతో కుర్రకారు మతులు పొగొట్టే ఈ భామ.. ఆడియో, సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన యాంకర్లు టీవీ, రియాలిటీ షోలలో కనిపిస్తుంటారు కానీ.. మంజూష మాత్రం సినిమా ఈవెంట్లకు మాత్రమే పరిమితమవుతూ వస్తోంది.&nbsp; వర్షిణి (Varshini) అందాల ఆరబోతలో అనసూయ, రష్మీలకు ఈ మధ్య కాలంలో&nbsp; యాంకర్‌ వర్షిణీ గట్టి పోటీ ఇస్తోంది. పటాస్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన వర్షిణి.. పలు సినిమాల్లోనూ నటించింది. ‘చందమామ కథలు’, ‘లవర్స్‌’, ‘మళ్లీ మెుదలైంది’, రీసెంట్‌గా ‘భాగ్‌ సాలే’ చిత్రాల్లో వర్షిణి మెరిసింది.&nbsp; విష్ణు ప్రియ (Vishnu Priya) తెలుగులో డ్యాన్స్‌ అద్భుతంగా చేసే అతికొద్ది మంది యాంకర్లలో ‘విష్ణుప్రియ’ ఒకరు. ఈ భామ కూడా ఒంపుసొంపులను ఒలికించడంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన గ్లామర్‌ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొంతకాలంగా యూట్యూబ్‌లో డ్యాన్సింగ్‌ ఆల్బమ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది.&nbsp; అషూ రెడ్డి (Ashu reddy) ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్‌స్మాష్‌ వీడియోలు పోస్టు చేస్తూ కెరీర్‌ను ప్రారంభించిన అషూ రెడ్డి.. తన వీడియోలతో చాలా ఫేమస్ అయ్యింది. 'ఛల్ మోహన్‌ రంగా' వెండి తెరపై ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు బిగ్‌బాస్ సీజన్‌ 3లో కనిపించి అలరించింది. ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే షోలలో కనిపిస్తూ అందాలు ఆరబోస్తోంది.&nbsp; సౌమ్యరావు (Sowmya rao) జబర్దస్త్‌ షో ద్వారా తెలుగులో ఫేమస్ అయిన కన్నడ భామ సౌమ్య రావు.. తన కెరీర్‌ను తమిళ టెలివిజన్‌ ఇండస్ట్రీలో ప్రారంభించింది. 'రోజా' అనే సీరియల్‌లో తొలిసారి నటించి మెప్పించింది. తెలుగులో శ్రీమంతుడు సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం బుల్లితెరపై గ్లామర్‌గా మెరిసిపోతూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.&nbsp; శ్యామల (Shyamala) అసూయపడే అందం, అలరించే యాంకరింగ్‌తో శ్యామల.. సుదీర్ఘ కాలంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటి సీరియళ్లలో అదిరిపోయే నటన కనబరిచినా శ్యామలా.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలు చేసింది. సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ శ్యామల దూసుకెళ్తోంది. దీప్తి నల్లమోతు (Deepthi Nallamothu) కెరీర్‌ ప్రారంభంలో ఓ న్యూస్‌ ఛానెల్‌లో పనిచేసిన దీప్తి నల్లమోతు.. ఔనా.. నిజమా? అన్న డైలాగ్‌తో చాలా ఫేమస్ అయ్యింది. అంతకుముందు రవితేజ 'భద్ర' సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2లో హౌస్‌మేట్‌గా అడుగుపెట్టి తనకంటూ మంచి పేరు సంపాదించింది.&nbsp; అనసూయ (Anasuya) యాంకర్‌ అనసూయ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్‌ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తన గ్లామర్‌తో షోకే అందాన్ని తీసుకొచ్చింది. ఆ షో సూపర్‌ హిట్‌ కావడంలో తన వంతు పాత్ర పోషించింది. జబర్దస్త్‌ క్రేజ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ గ్లామర్‌ బ్యూటీ.. ‘రంగస్థలం’లో రంగమ్మత్త, ‘పుష్ప’లో దాక్షాయణి పాత్రల్లో మెప్పించి మరింత గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.&nbsp; రష్మి (Rashmi) జబర్దస్త్ షో (Jabardasth) ద్వారానే మంచి క్రేజ్‌ సంపాదించుకున్న మరో యాంకర్‌ రష్మి. జబర్దస్త్‌ స్కిట్లతో పాటు రష్మి అందాలకు కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉన్నారు. చిరంజీవి రీసెంట్ మూవీ భోళా శంకర్‌లోనూ రష్మి నటించింది. అడపా దడపా సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ చిన్నది అలరిస్తోంది.&nbsp;&nbsp; శ్రీముఖి (Srimukhi) యాంకర్ అనసూయ, రష్మిల తరువాత ఆ స్థాయిలో అందాలు ఆరబోసే బుల్లితెర యాంకర్‌ ‘శ్రీముఖి’. వినోదాన్ని పంచే విషయంలో వారిద్దరి కంటే శ్రీముఖి ఓ మెట్టు పైనే ఉంటుంది. ఈ భామ కూడా తన గ్లామర్‌తో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. జీ తెలుగు, స్టార్‌ మా వంటి ఛానెళ్లలో వచ్చే పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ శ్రీముఖి దూసుకెళ్తోంది. మధ్య మధ్యలో సినిమా ఈవెంట్లలోనూ తళుక్కుమంటోంది.&nbsp; వింధ్య (Vindhya) తెలుగు యాంకర్లు అందరిదీ ఒక లెక్క అయితే.. వింధ్యది మరో లెక్క. తెలుగులో ఏకైక మహిళా స్పోర్ట్స్ యాంకర్‌ ఈమెనే. ఐపీఎల్‌ వచ్చినా, ప్రో కబడ్డీ లీగ్స్ జరిగినా వింధ్య తన యాంకరింగ్‌తో కనువిందు చేస్తుంటుంది. తన హాట్‌నెస్‌తో క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి అందరి చూపును తనవైపు తిప్పుకుంటుంది.&nbsp; రచిత (Rachitha) ప్రముఖ సీరియల్‌ నటి రచిత మహాలక్ష్మీ.. తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన రచిత.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు, సీరియళ్లలో నటించింది. తెలుగులో ‘స్వాతి చినుకులు’ సీరియల్‌ ద్వారా ఎనలేని ఖ్యాతిని సంపాదించింది. ఆ సీరియల్‌ ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా నడిచిందంటే అందుకు కారణం రచిత అని చెప్పవచ్చు.&nbsp; పల్లవి రామిశెట్టి (Pallavi Ramisetty) బుల్లి తెరపై కనిపించే అందమైన సీరియల్‌ నటీమణుల్లో పల్లవి రామిశెట్టి ఒకరు. ‘ఆడదే ఆధారం’, ‘అత్తారింటికి దారేది’, ‘మాటే మంత్రం’, ‘పాపే మా జీవన జ్యోతి’ వంటి ప్రముఖ సీరియళ్లలో పల్లవి నటించింది. ‘అలీ 369’, ‘స్టార్‌ మహిళా’, ‘క్యాష్‌’ వంటి టెలివిజన్‌ షోలలోనూ ఈమె పాల్గొంది. ప్రేమి విశ్వనాథ్‌ (Premi Viswanath) ‘కార్తిక దీపం’ సీరియల్‌తో ప్రేమి విశ్వనాథ్‌ చాలా పాపులర్ అయ్యారు. కేరళకు చెందిన ప్రేమి.. ‘కరుతముత్తు’ అనే మలయాళ సీరియల్‌ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. తెలుగులో గోరింటాకు, చెల్లెలి కాపురం వంటి సీరియళ్లలో అతిథి పాత్రలు పోషించింది. ‘మా ఉగాది వేడుక’, ‘మా వరలక్ష్మీ వ్రతం’ వంటి స్పెషల్‌ షోలలోను కనిపించి సందడి చేసింది.&nbsp; ప్రీతి అస్రాని (Preeti Asrani) గుజరాత్‌కు చెందిన ప్రీతి అస్రాని.. ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ అనే సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’, ‘మళ్లీ రావా’ వంటి చిత్రాల్లో చేసింది. 2016లో ‘పక్కింటి అమ్మాయి’ సీరియల్‌ ద్వారా బుల్లితెరలోకి అడుపెట్టింది. ఇటీవల ‘9 అవర్స్‌’, ‘వ్యూహాం’ వంటి సిరీస్‌లలోనూ ప్రీతి మెరిసింది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalakshmi Sarathkumar) ప్రముఖ స్టార్‌ జంట రాధిక - శరత్‌కుమార్‌ల తనయ వరలక్ష్మీ.. పలు సందర్భాల్లో బుల్లితెరపై మెరిసింది. జయ టీవీలో వచ్చిన 'ఉన్నాయ్‌ అరింధాల్‌' షోకు హోస్ట్‌గా వ్యవహించింది. అలాగే కలర్స్‌ తమిళ్‌ ఛానెల్‌లో వచ్చిన 'ఎంగ వీటు మపిల్లాయ్‌' షోలోనూ మెరిసింది. రీసెంట్‌గా తెలుగు వచ్చిన ‘హనుమాన్‌’ (Hanuman Movie)లో కీలక పాత్ర పోషించి వరలక్ష్మీ అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; వైష్ణవి గౌడ (Vaishnavi Gowda) కన్నడలో బాగా పాపులర్‌ అయిన అందమైన బుల్లితెర నటీమణుల్లో వైష్ణవి గౌడ ఒకరు. ‘అగ్నిసాక్షి’ సీరియల్‌లో సన్నిధి పాత్రను పోషించి మెప్పించింది. బిగ్‌బాస్‌ కన్నడ సీజన్‌ 8లో హౌస్‌మేట్‌గా వెళ్లి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.&nbsp; దీపికా దాస్‌ (Deepika Das) కర్ణాటకకు చెందిన దీపికా దాస్‌.. అక్కడ సీరియళ్లలో నటించి చాలా ఫేమస్ అయ్యింది. 2016లో వచ్చిన 'నాగిని' సీరియల్‌తో దీపిక బుల్లితెరపై అరంగేట్రం చేసింది. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలో 2017లో 'డ్రీమ్‌ గర్ల్‌' అనే కన్నడ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చింది.&nbsp;
    ఫిబ్రవరి 22 , 2024
    Top 15 Telugu BGM Movies: తెలుగులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా?
    Top 15 Telugu BGM Movies: తెలుగులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా?
    ఒక సినిమా సక్సెస్‌లో కథ, హీరో స్టార్‌డమ్‌, పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా గణనీయమైన పాత్రను పోషిస్తుంది. ఒక సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా తీసినప్పటికీ దానిని సరిగ్గా ఎలివేట్‌ చేసే BGM లేకపోతే ఫలితం ఉండదు. అందుకే దర్శకులు పాటలతో పాటు(Top Telugu BGM Movies) నేపథ్య సంగీతానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ను ఫైనలైజ్‌ చేస్తుంటారు. ఇప్పటివరకూ తెలుగులో వందలాది చిత్రాలు వచ్చినప్పటికీ BGM అనగానే ఠక్కున కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అటువంటి టాప్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; సలార్‌ (Salaar) ప్రభాస్‌ (Prabhas) హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘సలార్‌’. ఈ సినిమా విజయంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. రవి బస్రూర్‌ (Ravi Basrur) అందించిన BGM.. యాక్షన్‌ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది.&nbsp; https://twitter.com/i/status/1756920670112317839 పుష్ప (Pushpa) సుకుమర్‌ - అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa BGM) లోనూ నేపథ్య సంగీతం హైలేట్‌గా అనిపిస్తుంది. రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్ సన్నివేశానికి తగ్గట్లు అద్భుతమైన బీజీఎంలను అందించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే BGM సినిమాకే హైలెట్ అనిచెప్పవచ్చు.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=B4aXmcfwkL4 ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా చేసిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా గ్లోబల్‌ స్థాయిలో విజయాన్ని అందుకుంది. కీరవాణి అందించిన పాటలు, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. ముఖ్యంగా తారక్‌, రామ్‌చరణ్‌ పాత్రలను హైలెట్‌ చేస్తూ ఇచ్చిన BGM గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. https://www.youtube.com/watch?v=Cve98-ZDIjY రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో రంగస్థలం ఒకటి. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ సినిమాకు పాటలతో పాటు బీజీఎం((Rangasthalam) ప్రధాన బలంగా నిలిచింది.&nbsp; https://twitter.com/i/status/1508823419013369857 అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అర్జున్‌ రెడ్డి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపించాడు. అతడి యాక్షన్‌కు తగ్గ బీజీఎం తోడవడంతో సినిమాలోని సీన్లు అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి.&nbsp; https://www.youtube.com/watch?v=RrtLwUR1kVQ బాహుబలి (Baahubali) తెలుగులో అద్భుతమైన నేపథ్య సంగీతంతో వచ్చి చిత్రాల్లో ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ ఒకటి. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతీ సన్నివేశానికి జీవం పోసిందని చెప్పవచ్చు. https://www.youtube.com/watch?v=poqKN52SKx0 ఇంద్ర (Indra) మెగాస్టార్ చిరంజీవి చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఈ సినిమా అప్పట్లో రికార్డుల మోత మోగించింది. మణిశర్మ ఇచ్చిన బీజీఎం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ‘మెుక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’.. అంటూ చిరు చెప్పే డైలాగ్‌కు మణిశర్మ ఇచ్చిన BGM విజిల్‌ వేసేలా ఉంటుంది. అటు చిరు - ప్రకాష్‌ ఎదురుపడ్డ సందర్భంలోనూ వచ్చే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.&nbsp; https://twitter.com/i/status/1281802257319641090 https://twitter.com/i/status/1286298937746264065 మిర్చి (Mirchi) ప్రభాస్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘మిర్చి’ సినిమా కూడా తన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో వీక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రెయిన్‌లో ఫైట్‌ సందర్భంగా వచ్చే BGM అదరహో అనిపిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1653647992283619340 విక్రమార్కుడు (Vikramarkudu) రాజమౌళి - రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన 'విక్రమార్కుడు' కూడా అద్భుతమైన బీజీఎం గలిగిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా ఉంది. ఇందులో ప్రకాష్‌ రాజ్‌ రవితేజ ప్రొఫైల్‌ను చూస్తున్న క్రమంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. నీకు భయం లేదా అన్న ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతుండగా వచ్చే BGM ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1407610528948645889 https://twitter.com/i/status/1672174183395266561 ఛత్రపతి (Chatrapathi) రాజమౌళి - ప్రభాస్‌ కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఛత్రపతి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రభాస్ శత్రువులకు వార్నింగ్ వచ్చే సమయంలో నేపథ్య సంగీతం ఆకట్టుకుటుంది.&nbsp; https://twitter.com/i/status/1591641776083070978 స్టాలిన్‌ (Stalin) చిరు హీరోగా తమిళ దర్శకుడు మురగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా BGM అప్పట్లో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. విలన్ ప్రదీప్‌ రావత్‌కు చిరు వార్నింగ్ ఇచ్చే సమయంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1307524939029688320 తులసి (Tulasi) వెంకటేష్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘తులసి’. సినిమా టైటిల్‌తో వచ్చే BGM ఆడియన్స్‌ను కూర్చిలో కూర్చోనివ్వకుండా చేస్తుంది. అలాగే హీరోయిన్‌ నయనతారతో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లోని BGM కూడా హృదయాలకు హత్తుకుంటుంది.&nbsp; https://twitter.com/i/status/1377645148671148036 https://twitter.com/i/status/1386233991800360961 సింహాద్రి (Simhadri) తారక్‌ నటించిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాల్లో ‘సింహాద్రి’ ఒకటి. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి రూపొందించారు. తన అక్కను చంపిన విలన్లను తారక్ వేటాడే క్రమంలో వచ్చే BGM మెస్మరైజ్‌ చేస్తుంది.&nbsp;&nbsp; https://twitter.com/i/status/1557928081096028160 రక్షకుడు (Rakshakudu) నాగార్జున హీరోగా ప్రవీణ్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమా సాంగ్స్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అటు నేపథ్య సంగీతం కూడా అప్పటి చిత్రాలకు భిన్నంగా రెహమాన్‌ అందించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=hX06emC9sb8 ఓజీ (OG) పవన్‌ కల్యాణ్‌ హీరోగా డైరెక్టర్ సుజీత్‌ రూపొందిస్తున్న చిత్రం ‘ఓజీ’. ‘హంగ్రీ చీతా’ పేరుతో విడుదలైన ఈ చిత్ర సాంగ్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లోని బీజీఎంను ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తమ మెుబైల్స్‌కు రింగ్‌టోన్‌, కాలర్‌ ట్యూన్స్‌గా పెట్టుకుంటున్నారు.&nbsp; https://twitter.com/i/status/1759904474091704446 యానిమల్‌ (Animal) ఈ మధ్య కాలంలో నేపథ్య సంగీతంతో బాగా పాపులర్ అయిన చిత్రం యానిమల్‌. రణ్‌బీర్‌ మాస్‌ యాక్షన్‌ను హర్షవర్ధన్‌ రామేశ్వర్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా ఎలివేట్‌ చేసింది. తన తండ్రిని చంపాలని అక్క భర్త స్కెచ్‌ వేస్తున్నట్లు రణ్‌బీర్‌ తెలుసుకున్న సమయంలో వచ్చే BGM సినిమాకే హైలేట్‌.&nbsp; https://twitter.com/Billa2Harry/status/1751450675991773283
    ఫిబ్రవరి 21 , 2024
    HBD SSMB: ఫ్లాప్స్‌ని నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన హీరో.. మహేశ్ లాగే ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా?&nbsp;
    HBD SSMB: ఫ్లాప్స్‌ని నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన హీరో.. మహేశ్ లాగే ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా?&nbsp;
    సినీ ప్రస్థానంలో ఎంత పెద్ద హీరోకైనా హిట్, ఫ్లాప్‌లు సహజం. పరాజయాలను తట్టుకుని నిలబడితేనే ఇక్కడ రాణించగలం. అయితే, సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరోది, ఫ్లాప్ అయితే డైరెక్టర్లదనే వాదన ఉండేది. కానీ, ఫెయిల్యూర్‌ని నిజాయితీగా ఒప్పుకున్న హీరోలు కొంత మందే ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉండేది మహేశ్ బాబునే. తన చిత్రాల పరాభవానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి అభిమానుల ఆదరణను నిలబెట్టుకున్నాడు. మరి మహేశ్ సారీ చెప్పిన సందర్భాలేంటి? ఈ లిస్టులో ఉన్న ఇతర హీరోలు ఎవరో చూద్దాం.&nbsp; మహేశ్ బాబు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న మహేశ్.. తన కెరీర్‌లో కొన్ని పరాజయాలను చవిచూశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలు బోల్తా కొట్టడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేదు. దీంతో మహేశ్ బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. ఆగడు మూవీ పరాజయంపై శ్రీమంతుడు ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాడు. ఆగడు సినిమా మిమ్మల్ని నిరాశపరచడంపై సారీ చెప్తున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదే కాకుండా, ‘భరత్ అనే నేను’ సినిమా ఈవెంట్‌లో బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్‌ని యాక్సెప్ట్ చేశాడు. స్పైడర్ సినిమాపై కూడా సూపర్ స్టార్ సారీ చెప్పాడు.&nbsp; https://www.youtube.com/watch?v=R99OpY-9uis&amp;t=41s జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్ మూవీలతో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’గా మారాడు ఎన్టీఆర్. కెరీర్‌లో రెండు, మూడు సినిమాల పరాజయాల్ని ఎన్టీఆర్ మరచిపోలేడు. రభస, రామయ్య వస్తావయ్యా సినిమాల విషయంలో అభిమానులకు సారీ చెప్పాడు. టెంపర్ మూవీ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌తో మనసులో మాట పంచుకున్నాడు. ‘ప్రతి సినిమాతో వస్తున్నాం. పోతున్నాం. కానీ, ఈ సారి మాత్రం కాలర్ ఎగిరేసే సినిమాను అందించబోతున్నాం’ అంటూ మైకులో చెప్పేశాడు. దీంతో పాటు ఎన్టీఆర్, మెహర్ రమేశ్ కాంబోలో వచ్చిన డిజాస్టర్ ‘శక్తి’ మూవీపై పలుమార్లు ప్రస్తావించాడు తారక్.&nbsp; https://www.youtube.com/watch?v=-ZitbUbHFKQ&amp;t=7s పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పుకునే విజయాన్ని సాధించలేదు. గబ్బర్‌సింగ్‌తో ఈ కోరిక తీరిపోయింది. గబ్బర్‌ సింగ్ సినిమాల కన్నా ముందు పరాజయం సాధించిన సినిమాలను ప్రస్తావించాడు. గబ్బర్ సింగ్ మూవీ ఆడియో ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రతి సినిమాకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు. https://www.youtube.com/watch?v=0VAIYgsc5Bc&amp;t=92s నాగార్జున భాయ్ సినిమా విషయంలోనూ నాగార్జున పెదవి విప్పారు. మనం మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా ఫెయిల్యూర్‌పై మాట్లాడారు.&nbsp; https://www.youtube.com/watch?v=cXM5F5FAKKA&amp;t=55s రామ్‌చరణ్ తేజ్ రంగస్థలం సినిమా అనంతరం అంచనాల మధ్య వచ్చిన మూవీ.. ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా చెర్రీకి ఊహించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో సినిమా ఫలితంపై రామ్‌చరణ్ ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలో ఒక నోట్ రిలీజ్ చేశాడు.&nbsp; అఖిల్, వరుణ్ తేజ్ రీసెంట్‌గా వచ్చిన స్పై మూవీపై నిఖిల్ సిద్ధార్థ, ఏజెంట్ మూవీపై అఖిల్, గని సినిమాపై వరుణ్ తేజ్‌లు కూడా పబ్లిక్‌గానే సారీ చెప్పారు. ఇంకా, ఇలా ఫెయిల్యూర్స్‌ని యాక్సెప్ట్ చేసిన హీరోలు ఉంటే కామెంట్ చేయండి.&nbsp; https://twitter.com/AkhilAkkineni8/status/1658079819790422016
    ఆగస్టు 08 , 2023
    Memes on Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్‌పై మీమ్స్.. ఇంత టాలెంట్‌గా ఉన్నారెంట్రా బాబు!
    Memes on Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్‌పై మీమ్స్.. ఇంత టాలెంట్‌గా ఉన్నారెంట్రా బాబు!
    మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. జూన్ 20న జన్మించిన మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి సినీ, రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అగ్ర హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ రామ్‌చరణ్ దంపతులను విష్ చేశారు. దీంతో సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ హడావుడి చేసేస్తున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి ట్విటర్‌లో మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.&nbsp; మెగా లిటిల్ ప్రిన్సెస్ ఆగమనాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇస్తూ ఓ నెటిజన్ వినూత్నంగా పార్టీ అడిగారు. వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘బాస్ పార్టీ’ సాంగ్‌ని ట్యాగ్ చేసి ‘బాసూ పార్టీ ఎక్కడా’ అంటూ అడుగుతున్నారు.&nbsp; https://twitter.com/Nithish13771106/status/1671007811839623170 దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ ఫలించిందంటూ మెగాస్టార్ ఎమోషనలయ్యారు. మెగా ఇంట అన్నీ శుభకార్యాలే జరుగుతున్నాయని, చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. https://twitter.com/Hemanth_RcCult/status/1671006003612225536 లిటిల్ ప్రిన్సెస్ పుట్టిందని తెలియగానే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎలా ఆనందపడ్డారో తెలుపుతూ మరో మీమ్ చేశారు.&nbsp; https://twitter.com/WeLoveMegastar/status/1671021787042447365 లయన్ కింగ్ సినిమాలో కూన సింహాన్ని రాజుగా ప్రకటించే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలా రామ్‌చరణ్, ఉపాసన తమ కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారంటూ ఓ మీమ్ చేశారు. https://twitter.com/s_siechojithu/status/1670955824305569795 రామ్‌చరణ్, ఉపాసనల గారాల పట్టికి తన బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలిస్తే ఎలా ఆశ్చర్యపోతుందోనని చెబుతూ ఓ మీమ్ చేశారు. https://twitter.com/HereFoRamCharan/status/1671203912190406656 తన నాన్న అల్లూరి సీతారామరాజు, తాతా ఇంద్రసేనరెడ్డి, చిన్నతాత గబ్బర్ సింగ్, మామయ్య పుష్పరాజ్ అని తెలుసుకుని మురిసిపోతుంది. https://twitter.com/sunny5boy/status/1671039650897510400 మెగా ప్రిన్సెస్‌ని అరుంధతితో పోలుస్తూ చేసిన మీమ్ తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/always_dasari9/status/1670959463367598082 మనవరాలి రాకతో తాతయ్య చిరంజీవి ఎంతో సంబరపడుతున్నారు. ఇక చిట్టితల్లి పెంపకాన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత చిరుపై ఉంటుందని వివిధ మీమ్స్ షేర్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/BharathRCKajal/status/1671029533041111040 డ్యాన్స్ నేర్పించడం, ఫొటోలు, వీడియోలు క్యాప్చర్ చేస్తుండటం, ఉదయాన్నే నిద్ర లేపి వ్యాయామం చేపిస్తుండటం వంటి పనులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. https://twitter.com/Hemanth_RcCult/status/1670954488969187328 ఇక లిటిల్ ప్రిన్సెస్‌ని స్కూళ్లో చేర్పించే సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి ఓ మీమ్ చేశారు. జై చిరంజీవ సినిమాలో సీన్‌ని స్పూఫ్ చేశారు. ఇది వైరల్ అవుతోంది. https://twitter.com/PriyaRC_4/status/1671024958275997705 ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఎంతో ఫేమస్. కానీ, ఇందులో ఓ విలన్ ‘జయ ఆంటీ తెలుసా నీకు, లల్లూ అంకుల్ తెలుసా నీకు.. వారంతా నా వెనకే ఉన్నారు’ అని అర్థం వచ్చేలా హిందీలో చెబుతాడు. దీనిని మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి అన్వయించారు. మెగాస్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్.. ఇలా వీళ్లంతా నా వెనక ఉన్నారంటూ చెబుతున్న మీమ్ ఇది.&nbsp;&nbsp; https://twitter.com/vj_vijayawada/status/1671070004484386818 అల్లు అర్జున్ కుమారుడు అయాన్. ఇప్పుడు పుట్టిన లిటిల్ ప్రిన్సెస్‌కు వరుసకు బావ అవుతాడు. రామ్‌చరణ్, ఉపాసనకు కుమార్తె పుట్టడంతో అత్యంత ఆనందం పొందిన వ్యక్తి అయానే అంటూ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.&nbsp; https://twitter.com/gnani0414/status/1670985319297212416 పుష్ప సినిమాలో ‘భలే య్యాపీగా ఉండాది కదరా నీకు’ అంటూ చెప్పే డైలాగ్ వైరల్ అవుతోంది. https://twitter.com/gnani0414/status/1671012059625168897 రామ్‌చరణ్‌కి ప్రత్యేక అభిమాని అయాన్. రంగస్థలం చిట్టిబాబు గెటప్ వేసి మామ మీద అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా మరదలు పుట్టాక మామయ్యతో అయాన్ చిట్ చాట్ ఇలా ఉంటుందని మీమ్ చేశారు. https://twitter.com/lokeshBangaram/status/1671441932294422529 మెగా ఫ్యామిలీ చిన్నదేం కాదు. ఎంతో మంది ఉంటారు. వారి మధ్యలో లిటిల్ ప్రిన్సెస్ చేరింది. దీంతో తనపై ప్రేమను ఎలా కురిపిస్తారో ఈ మీమ్ చూస్తే తెలిసిపోతుంది. https://twitter.com/s_siechojithu/status/1671026894760992770 నాయక్ సినిమాలో పోసాని కృష్ణమురళి కామెడీ హైలైట్. అందులో అధికారులు ఓ ల్యాప్‌టాప్‌లో ప్రాపర్టీస్ చూపించి మీవేనా? అని అడిగితే అన్నీ నావేనని ఒప్పుకుంటాడు. ఈ వీడియోను స్పూఫ్ చేశారు. https://twitter.com/KingLeo_007/status/1671348946755805191 చెర్రీకి పిల్లలంటే ఎంతో ఇష్టం. చిన్నపిల్లలు కనిపిస్తే చాలు చరణ్ పిల్లాడిలా మారిపోతాడు. వారితో ఎంతో ముచ్చటగా ఆడుకుంటాడు. ఇప్పుడు తనకే బిడ్డ పుట్టింది. మరి, ఏ రేంజ్‌లో ఫన్ ఉంటుందో ఊహించుకుంటేనే తెలిసిపోతుంది. https://twitter.com/Noori_NN/status/1671045618079506433
    జూన్ 21 , 2023
    Anasuya Bharadwaj: కైపెక్కించే ఫోజుల్లో రచ్చ రచ్చ చేస్తున్న రంగమ్మత్త!
    Anasuya Bharadwaj: కైపెక్కించే ఫోజుల్లో రచ్చ రచ్చ చేస్తున్న రంగమ్మత్త!
    బుల్లితెర యాంకర్‌ &amp; నటి అనసూయ భరద్వాజ్‌ మరోమారు గ్లామర్‌ ఫొటోలతో తళుక్కుమంది. హాఫ్‌ జాకెట్‌లో సింధూర పువ్వులా మెరిసిపోయింది. ట్రెండీ లెహంగా, మ్యాచింగ్ టాప్ ధరించిన అనసూయ.. మతులు పోగెట్టో ఫోజులతో అలరించింది. సోఫాలో పడుకొని అందాల విందు చేసింది. హాట్‌ హాట్‌ స్టిల్స్‌తో ఆకట్టుకుంది.&nbsp; జబర్దస్త్‌ షో ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.&nbsp; 2012 - 2022 మధ్య&nbsp; బుల్లితెర యాంకర్‌గా ‌కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్‌ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.&nbsp; యాంకర్‌ కాకముందు ప్రముఖ వార్త ఛానల్‌లో అనసూయ న్యూస్‌ రీడర్‌గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, విన్నర్‌, గాయత్రి సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రంగస్థలం సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.&nbsp; రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్‌ యూ బ్రదర్‌, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.&nbsp; సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమాలోనూ అనసూయ గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. ప్రస్తుతం పుష్ప2 చిత్రంలోనూ ఈ భామ నటిస్తోంది.&nbsp; తాజాగా విమానం సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషించింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌లో అనసూయ బిజీబిజీగా గడుపుతోంది.&nbsp;
    జూన్ 01 , 2023

    @2021 KTree