ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Zee5ఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Prime
Watch
స్ట్రీమింగ్ ఆన్Hotstar
Watch
స్ట్రీమింగ్ ఆన్Youtube
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
నాగార్జున
శివఅమల అక్కినేని
ఆశరఘువరన్
భవానీమురళీ మోహన్
శరత్కోట శ్రీనివాసరావు
మాచిరాజువిశ్వనాధం
సాయి చంద్
వెంకట్తనికెళ్ల భరణి
నానాజీశుభలేఖ సుధాకర్
మల్లి మల్లిక్జెడి చక్రవర్తి
జె. దుర్గారావు (జెడి)చిన్నా
రామజగన్
నరేష్విశ్వనాథ్ గణేష్
సుష్మకీర్తి
నిర్మలమ్మ
మల్లి అమ్మబ్రహ్మాజీ
భవానీ హెంచ్మాన్ఉత్తేజ్
యాదగిరికళాశాల ప్రిన్సిపాల్ భాను ప్రకాష్as the college principal
పూరి జగన్నాధ్
సిబ్బంది
రామ్ గోపాల్ వర్మ
దర్శకుడుఅక్కినేని వెంకట్నిర్మాత
యార్లగడ్డ సురేంద్రనిర్మాత
ఇళయరాజా
సంగీతకారుడుS. Gopala Reddyసినిమాటోగ్రాఫర్
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
శివాని నగరం గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త తెలుగు హీరోయిన్లలో శివాని నగరం(Shivani Nagaram) ఒకరు. యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్ర పోషించిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఈక్రమంలో శివాని నగరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. (Some Lesser Known Facts about Shivani Nagaram )
శివాని నగరం ఎప్పుడు పుట్టింది?
2001, ఆగస్టు 21న జన్మించింది
శివాని నగరం హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా?
అంబాజి పేట మ్యారేజ్ బ్యాండు
శివాని నగరం ఎత్తు ఎంత?
5 అడుగుల 6 అంగుళాలు
శివాని నగరం రాశి ఏది?
కుంభం
శివాని నగరం ఎక్కడ పుట్టింది?
హైదరాబాద్
శివాని నగరం అభిరుచులు?
పుస్తకాలు చదవడం, సింగింగ్
శివాని నగరంకు ఇష్టమైన ఆహారం?
నాన్ వెజ్, చికెన్
శివాని నగరంకు ఇష్టమైన కలర్?
బ్లాక్, పింర్
శివాని నగరంకు ఇష్టమైన హీరో?
మహేష్ బాబు
శివాని నగరం ఏం చదివింది?
డిగ్రీ
శివాని నగరం పారితోషికం ఎంత తీసుకుంటుంది?
ఒక్కో సినిమాకు రూ.10 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
శివాని నగరం సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
ఇన్‌స్టా రీల్స్ ద్వారా ఫేమస్ అయింది
శివాని నగరం ఎఫైర్స్ ఉన్నాయా?
అలాంటివి ఏమి లేవు
శివాని నగరం ఎక్కడ ఉంటుంది?
జూబ్లీ హిల్స్, హైదరాబాద్
శివాని నగరం ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/shivani_nagaram/?hl=en&img_index=1
https://www.youtube.com/watch?v=EAsvlMaZF3M
ఏప్రిల్ 05 , 2024
New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడీ' నుంచి శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభాస్ పేరును పోస్టర్ ద్వారా మూవీ టీమ్ తెలియజేసింది. ప్రభాస్ పాత్ర పేరును భైరవగా ప్రకటిస్తూ భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
కన్నప్ప (Kannappa)
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు ఈ పోస్టర్‌లో కనిపించాడు. కాగా, ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
NBK109
నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ కాంబోలో వస్తున్న 'NBK 109' చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్ విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించిన గ్లింప్స్‌లో బాలయ్యను బాబీ ‘నేచురల్ బోర్న్ కింగ్’ (NBK)గా చూపించారు. గ్లింప్స్‌లో చాలా స్టైలిష్ లుక్‌లో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
https://twitter.com/i/status/1766375268804120887
ఓదెల 2 (Odela 2)
తమన్నా (Tamannaah Bhatia) లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్ హెబ్బా పటేల్ లీడ్ రోల్‌లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో తమన్నా కనిపించింది.
షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai)
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి కూడా శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్ విడుదలైంది. ‘ఈ దేశంలోని 80% మంది సామాన్యుల కథనే మన సినిమా’ అంటూ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు.
‘దేవకీనందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)
తొలి సినిమాతోనే హీరోగా ఆకట్టుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) చేస్తున్న రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం చేస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఓ స్పెషల్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi)
హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం శివరాత్రితో పాటు ‘ఉమెన్స్ డే’ కూడా కావడంతో దానికి గుర్తుగా ఇందులోని అంజలి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీరంగ నీతులు (Sri Ranga Neethulu)
సుహాస్ హీరోగా ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాలో కార్తిక్ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ లుక్ పోస్టర్ విడుదలైంది. సుహాస్, కార్తిక్ రత్నంతో పాటు నటి రుహాని శర్మ పోస్టర్‌లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ కానుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari)
విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా మేకర్స్ అంజలికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్‌ను రిలీజ్ చేశారు.
సత్యభామ (Sathyabhama)
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సత్యభామ’. అఖిల్ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆరమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
మార్చి 09 , 2024
Shivarathri: శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు… సినిమా లింక్‌లు ఇవిగో..
శివరాత్రికి ఉండే ప్రత్యేకతే వేరు. ఈ రోజున భక్తి పరవశులై హిందువులు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతారు. నీలకంఠేశుడిపైనే మనసు, తనువు లగ్నం చేసి నిష్ఠతో గడుపుతారు. శివరాత్రి రోజున ఉపవాస నియమాన్ని పాటించేవారు జాగారం చేస్తుంటారు. ఈ పవిత్ర రాత్రి సమయంలో మెలుకువతో ఉండి జీవితంలోని చీకట్లను తొలగించుకోవాలని చెబుతుంటారు. శివరాత్రి రోజున జాగారం కీలక ఘట్టం. ఈ సమయాన్ని కొందరు భజనకు కేటాయిస్తే మరికొందరు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొందరు సినిమాలు చూస్తుంటారు. ప్రస్తుతం డిజిటల్ యుగంగా మారినందున చాలామంది ఫోన్‌లోనే సినిమాలు చూసేస్తున్నారు. అయితే, శివరాత్రి రోజున ఆధ్యాత్మికకు సంబంధించిన సినిమాలను చూడాలని భావించే వారు వీటిని ట్రై చేయొచ్చు.
భూ కైలాస్
అలనాటి సినిమా అయినప్పటికీ నేటికీ కొత్త అనుభూతిని కలిగించే సినిమా ఇది. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా. రావణాసురుడి పాత్రలో ఎన్టీఆర్ నటించారు. శివరాత్రికి మీకు తప్పకుండా మంచి అనుభూతిని అందిస్తుంది.
https://www.youtube.com/watch?v=I4C9hhuwxfQ
భక్త కన్నప్ప
1976లో వచ్చిన భక్తిరస చిత్రమే ‘భక్త కన్నప్ప’. శివుడి భక్తుడి పాత్రలో దివంగత కృష్ణం రాజు నటించారు. భక్త కన్నప్పగా ఆ పాత్రకు జీవం పోశారు. ఇది కూడా శివరాత్రి రోజున చూడదగిన సినిమానే.
https://www.youtube.com/watch?v=1_oYrqjgBEM
మహా శివరాత్రి
సాయికుమార్, రాజేంద్రప్రసాద్ కలిసి నటించిన సినిమా ఇది. మీనా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. రేణుక శర్మ దర్శకత్వం వహించారు.
https://www.youtube.com/watch?v=ArgkDQzeHXk
శ్రీ మంజునాథ
శివరాత్రి సినిమాలనగానే వెంటనే ఈ సినిమా పేరే గుర్తొస్తుంది. అంతలా ఫేమస్ అయ్యింది ఈ సినిమా. నాస్తికుడు శివుడి భక్తుడిగా ఎలా మారాడో ఈ సినిమాలో చూపిస్తారు. భక్తుడిగా అర్జున్, శంకరుడిగా చిరంజీవి నటించారు. అర్జున్ సరసన సౌందర్య కీలక పాత్ర పోషించింది.
https://www.youtube.com/watch?v=6B_kgUvWGsQ
జగద్గురు ఆదిశంకర
ఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో సాగుతుందీ సినిమా. నాగార్జున, సాయికుమార్, మోహన్ బాబు, కమలిని ముఖర్జీ తదితరులు కీలక పాత్ర పోషించారు. శంకరచార్యులుగా కౌశిక్ బాబు నటించాడు.
https://www.youtube.com/watch?v=y8bB-aaVZv4
ఈ సినిమాలను చూసి మీలోని ఆధ్యాత్మిక భావాన్ని మరింత రెట్టింపు చేసుకోండి. శివరాత్రి జాగారాన్ని ఫలప్రదం చేయండి.
మార్చి 08 , 2024
Shivarathri: శివరాత్రి రోజున శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు ఇవే..
]జగద్గురు ఆదిశంకరఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో సాగుతుందీ సినిమా. నాగార్జున, సాయికుమార్, మోహన్ బాబు, కమలిని ముఖర్జీ తదితరులు కీలక పాత్ర పోషించారు. శంకరచార్యులుగా కౌశిక్ బాబు నటించాడు.Watch Now
ఫిబ్రవరి 16 , 2023
Devara Story Prediction: కొరటాల శివ సూపర్ హిట్ ఫార్మూలాతో ‘దేవర’.. కంప్లీట్ స్టోరీ ఇదేనా?
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో తెలుగుతో పాటు నార్త్‌లోనూ ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా నేడు రిలీజ్ కానుండటంతో #JrNTR, #DevaraTrailer, #KoratalaSiva వంటి హ్యాష్‌ట్యాగ్స్ నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. ఇదిలా ఉంటే దర్శకుడు కొరటాల శివ తన ప్రతీ సినిమాలో ఓ ప్రత్యేక ఫార్మూలాను అనుసరిస్తుంటారు. ఆయన గత చిత్రాలను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అయితే దీనిని ఆధారంగా చేసుకొని కొందరు నెటిజన్లు దేవర ప్లాట్‌ను అంచనా వేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
కొరటాల ఫార్ములా ఇదే?
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘మిర్చి’ (Mirchi), ‘శ్రీమంతుడు’ (Srimanthudu), ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage), ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే ఈ సినిమా కథ, నేపథ్యం వేర్వేరు అయినప్పటికీ అందులో అంతర్లీనంగా ఉన్న ఫార్ములా మాత్రం ఒక్కటే. అది ఏంటంటే, ఔట్‌సైడర్ అయిన హీరో ఒక కొత్త ప్రదేశానికి వెళ్లి అక్కడ కష్టాలు అనుభవిస్తున్న ప్రజలకు అండగా ఉంటాడు. ఇబ్బందులకు గురిచేస్తున్న విలన్‌ను బుద్ది చెప్తాడు. కట్ చేస్తే హీరోకు ఆ ప్రాంత విలన్‌కు లింకప్ చేస్తూ ఓ గతం ఉంటుంది. పైన చెప్పిన ఈ సినిమాల ప్లాట్స్‌ను గుర్తుచేసుకొని దానికి ఇప్పుడు చెప్పిన ఫార్మూలాను అన్వయించుకుంటే మీకూ ఇది నిజమే అనిపిస్తుంది. కొరటాల శివ గత చిత్రం 'ఆచార్య' కూడా ఇదే ఫార్మూలతో వచ్చిందే. ఔట్‌సైడర్ అయిన చిరు, పాదగట్టం అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ అరచాకం సృష్టిస్తున్న విలన్లను అంతం చేస్తాడు. రామ్‌చరణ్ - పాదగట్టం - చిరును లింకప్ చేస్తూ ఓ ఫ్లాష్‌బ్యాక్‌ను రాసుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ.
దేవర స్టోరీ ఇదేనా?
కొరటాల శివ గత చిత్రాల ఫార్మూలాను ఆధారంగా కొందరు నెటిజన్లు దేవర ప్లాట్‌ను ప్రిడిక్షన్ చేస్తున్నారు. దాని ప్రకారం ఫస్ట్ టీజర్‌లో చూపించిన ఎర్ర సముద్రాన్ని ఒక ప్రాంతంగా అంచనా వేస్తున్నారు. ఎర్ర సముద్ర ప్రాంతంలో నివసించే జాలర్లకు ఎన్టీఆర్ నాయకుడు. అక్కడ అరాచకాలు సృష్టిస్తున్న విలన్లకు అతడు గట్టిగా బుద్ది చెబుతాడు. దీంతో కుట్ర చేసి విలన్ల గ్యాంగ్ అతడ్ని అంతం చేస్తుంది. విలన్ల దాడి నుంచి తప్పించుకున్న అతడి కుమారుడు (ఎన్టీఆర్) పెద్దయ్యాక తిరిగి ఆ ప్రాంతానికి వచ్చి విలన్లపై ఏవిధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేది ప్లాట్ అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొరటాల ఫార్మూలాను బట్టి చూస్తే ‘దేవర’ ప్లాట్ ఇదే అయ్యి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకూ వాస్తవమో తెలియదు కాని ప్లాట్ మాత్రం కన్విన్సింగ్ ఉందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
చరిత్ర సృష్టించిన ‘దేవర’
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’ (Devara) చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే పాటలతో పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఓవర్సీస్‌లో దీని ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా తాజాగా అది 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో టికెట్ల ప్రీసేల్ ద్వారా అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘దేవర’ నిలిచింది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
ముగ్గురు స్టార్ డైరెక్టర్లతో తారక్..
'దేవర' తర్వాత తారక్ లైనప్‌లో బాలీవుడ్ చిత్రం 'వార్ 2'తో పాటు 'NTR 31' కూడా ఉంది. హిందీ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, 'NTR 31' ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. అయితే తాజాగా కొరటాల శివతో పాటు ఈ ఇద్దరు డైరెక్టర్లతో తారక్ దిగిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తన ముగ్గురు డైరెక్టర్లతో తారక్ కలయిక సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ క్రేజీ కలయికకు ఓ కారణం ఉన్నట్లు సమాచారం. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ముగ్గురు దర్శకులతో తారక్ ఓ ఇంటర్యూలో కనిపించబోతున్నట్లు సమాచారం.
ట్రైలర్ లోడింగ్..
యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతోన్న దేవర చిత్రం నుంచి నేడు (సెప్టెంబర్ 10) ట్రైలర్ రిలీజ్ కానుంది. సాయంత్రం 5.04 గంటలకు దీన్ని రీలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ట్రైలర్ 2 నిమిషాల 50 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. ట్రైలర్‌ను చాలా వరకూ యాక్షన్ సీక్వెన్స్‌తో దర్శకుడు కొరటాల శివ నింపేసినట్లు తెలుస్తోంది. అటు మూవీ టీమ్ కూడా యాక్షన్ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండంటూ ట్రైలర్‌పై భారీ ఎత్తున హైప్ పెంచేసింది. కాగా ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
సెప్టెంబర్ 10 , 2024
Shivaleeka Oberoi Hot: పులి చారల బికినీలో టెంప్ట్ చేస్తున్న శివలీకా ఒబెరాయ్..!
బాలీవుడ్ సొగసుల సుందరి శివలీకా ఒబెరాయ్ (Shivaleeka Oberoi).. సోషల్ మీడియాలో పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది.
తాజాగా బికినిలో ఫొటోషూట్ నిర్వహించిన ఈ అమ్మడు.. పులిచారల జాకెట్‌తో ఎద సొగసులను ఆరబోసింది.
సముద్రంలో బోటుపై నిలబడిన శివలీక.. తన మత్తెక్కించే అందాలతో నెటిజన్లకు గిలిగింతలు పెట్టింది.
శివలీక లేటెస్ట్ అందాలు.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ భామ అందాలకు కుర్రకారు ముగ్దులవుతున్నారు.
శివలీక ఒబెరాయ్.. 1995 జులై 24న ముంబయిలో జన్మించింది. ముంబయి యూనివర్శిటీలో సైకాలజీ చేసింది.
సినిమాలపై ఆసక్తితో అనుపమ్ ఖేర్స్ యాక్టింగ్ స్కూల్‌లో 3 నెలల డిప్లమో కోర్సు చేసింది. తద్వారా నటనలో నైపుణ్యం సంపాదించింది.
2014లో వచ్చిన కిక్ సినిమాతో శివలీకా.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నటిగా కాదు. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా శివలీకా పనిచేసింది.
ఇక 2016లో వచ్చిన హౌస్ ఫుల్ 3 (Housefull 3) మూవీకి సైతం శివలీక ఒబెరాయ్.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసి పని గుర్తింపు సంపాదించింది.
2017లో వచ్చిన యే సాలి ఆషిఖీ (Yeh Saali Aashiqui) ఫిల్మ్‌తో నటిగా శివలీక.. తెరంగేట్రం చేసింది.
ఇందులో మిథాలి డియోరా పాత్రలో చక్కటి నటన కనబరిచింది. తన అద్భుత నటనతో బెస్ట్ డెబ్యూట్ కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌కు సైతం నామినేట్ అయ్యింది.
ఆ తర్వాత ఖుదా హాఫీజ్ (2020), ఖుదా హాఫీజ్ చాప్టర్ 2 (Khuda Haafiz: Chapter 2) ఈ అమ్మడు కనిపించింది. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్‌లో ఈ భామకు అవకాశాలు దక్కలేదు.
శివలీక వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె 2018లో బాలీవుడ్ నటుడు కరమ్ రాజ్‌పాల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల వారి బంధం పెళ్లిపీటల వరకూ వెళ్లలేదు.
ఇక 2022లో బాలీవుడ్ నిర్మాత అభిషేక్ పతక్‌తో శివలీక ఒబెరాయ్ నిశ్చితార్థం చేసుకుంది. వీరి పెళ్లి 2023 ఫిబ్రవరిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో గోవాలో ఘనంగా జరిగింది.
ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్టులు చేతిలో లేకపోవడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాను నమ్ముకుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటో షూట్స్ నిర్వహిస్తూ దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోది.
శివలీక ఇచ్చే హాట్ ట్రీట్ కోసం పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఫాలో అవుతున్నారు. 2.3 మిలియన్ల మంది ఫాలోవర్లుగా ఉన్నారు.
జూలై 02 , 2024
Kalki 2898 AD: శివరాత్రి స్పెషల్.. సాలిడ్ అప్‌డేట్‌తో ముందుకొస్తున్న ‘కల్కీ’ టీమ్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేష్‌లో రూపొందుతున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). మైథాలజీ ఇన్‌స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో అంచనాలు మరింత హైప్‌లోకి వెళ్లాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉండనుందో అర్థమైపోతోంది. ఇదిలా ఉంటే నేడు శివరాత్రి సందర్భంగా మేకర్స్ సరికొత్త అప్‌డేట్‌కి రెడీ అయిపోయారు. ఇందుకు సంబంధించి పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.
పోస్టర్‌లో ఏముంది?
‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్‌లో ప్రభాస్ పాత్ర పేరును మూవీ టీమ్ ఎక్కడా రివీల్ చేయలేదు. అయితే ఇవాళ శివరాత్రి సందర్భంగా హీరో పేరును ప్రకటించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. సాయంత్రం 5:00 గంటలకు రివీల్ చేయనున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లోని శివలింగం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. మరోవైపు కల్కిలో ప్రభాస్ పేరు ఏమై ఉంటుందా? అని ఫ్యాన్స్ ఇప్పటికే ఆలోచనల్లో పడిపోయారు.
https://twitter.com/chitrambhalareI/status/1766015501350883362
ఇటలీలో ప్రభాస్, దిశా పటానీ..
తాజాగా కల్కి చిత్ర యూనిట్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీతో పాటు యూనిట్ అంతా కలసి దిగిన ఫోటోను మేకర్స్ గురువారం షేర్ చేశారు. ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్‌లో ఈ పాటని చాలా గ్రాండ్‌గా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్‌లో ప్రభాస్ (Prabhas), దిశా పటానీ (Disha Patani) మధ్య రొమాన్స్ ఉండనుందని సమాచారం. కాగా ఈ మూవీలో దిశా పటానీతో పాటు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే మరో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆ రోజు రావడం పక్కా!
ప్రభాస్ ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో జాప్యం జరుగుతున్నట్లు వార్తలు రావడంతో చిత్ర విడుదలపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తూ ఆ కన్ఫ్యూజన్‌ను దూరం చేసింది వైజయంతీ మూవీ మేకర్స్. కల్కి సినిమాను మే 9న విడుదల చేయడం పక్కా అన్నట్లుగా సోషల్ మీడియాలో వరుస అప్‌డేట్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
కల్కీ రిలీజయ్యే భాషలు ఇవే!
‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి టీమ్ రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍లో కూడా క్రేజ్ ఉంది.
మార్చి 08 , 2024
Shivathmika Rajashekar: ఎద అందాలతో హద్దులు చెరిపేసిన శివాత్మిక..!
రాజశేఖర్ - జీవిత నట వారసురాలు శివాత్మిక (Shivathmika Rajashekar) సోషల్ మీడియాలో మరోమారు రెచ్చిపోయింది.
తాజా ఫొటో షూట్‌లో హద్దులన్నీ చెరిపేసిన ఈ చిన్నది నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎద అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.
శివాత్మిక అందాలను చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని గ్లామర్ ఆమెదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
2019లో ‘దొరసాని’ చిత్రం ద్వారా శివాత్మిక తెలుగు తెరకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన శివాత్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.
దొరసానిలో శివాత్మిక నటనకు సైమా అవార్డ్ లభించింది. ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్‌గా పురస్కారం అందుకుంది.
దొరసాని తర్వాత ‘పంచతంత్రం’, ‘ఆకాశం’ చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇటీవల ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.
స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న శివాత్మిక.. తెలుగులో అవకాశాలు తగ్గడంతో సోషల్‌మీడియాపై ఫోకస్ పెట్టింది.
తనలో హోమ్లీ లుక్ మాత్రమే కాదు మోడ్రన్ లుక్ కూడా ఉందని దర్శక నిర్మాతలకు తెలిసేలా ఫోటో షూట్స్ చేస్తోంది.
హాట్ డోస్‌ను రెట్టింపు చేస్తూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటోంది. చురకత్తుల్లాంటి చూపులతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
శివాత్మిక తీరుతో ఆమెకు పాపులారిటీ దక్కడమే గాకుండా ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తోంది. నిత్యం నెటిజన్లు శివాత్మిక సోషల్ మీడియా వాల్‌పై కన్నేస్తున్నారు.
ఈ స్టార్ కిడ్ ఎప్పుడు ఎలాంటి ట్రీట్ ఇస్తుందా అని నెటిజన్లు ఆశగా ఎదురు ఈ స్టార్ కిడ్ ఎప్పుడు ఎలాంటి ట్రీట్ ఇస్తుందా అని నెటిజన్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శివాత్మిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 3 లక్షల 95 వేల మంది ఫాలో అవుతున్నారు.
ఫిబ్రవరి 16 , 2024
Shivathmika: స్టన్నింగ్ లుక్స్‌లో శివాత్మిక అందాలు అదరహో..!
యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ మరోమారు తన అందచందాలతో సోషల్‌మీడియాను ఆకర్షించింది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
తాజా ఫొటోల్లో మోడ్రన్ డ్రెస్‌లో కనిపించిన ఈ భామ లేలేత అందాలను ఆరబోసింది. ఎద, నడుము ఒంపులను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది.
స్టార్ హీరోయిన్ కావాలని భావిస్తున్న ఈ భామ తన ఒంపుసొంపులను ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనకాడటం లేదు.
తనలో హోమ్లీ లుక్ మాత్రమే కాదు మోడ్రన్ లుక్ కూడా ఉందని దర్శకనిర్మాతలకు తెలిసేలా ఫోటో షూట్స్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఫ్యాషన్ డ్రెస్ వేసిన శివాత్మిక కెమెరాకు పోజులిచ్చింది.
ప్రముఖ నటులు జీవిత-రాజశేఖర్ కుమార్తె అయిన శివాత్మిక 2019లో వచ్చిన దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
దొరసాని తర్వాత ‘పంచతంత్రం’, ‘ఆకాశం’ చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేదు.
తాజాగా ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.
గత కొన్ని రోజులుగా శివాత్మిక సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
శివాత్మిక పెట్టిన ఫొటోలను ఆమె ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఆమె అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
నవంబర్ 16 , 2023
Shivathmika Rajashekar: సమ్మర్‌లో మరింత హీట్ పెంచుతున్న శివాత్మిక అందాలు
రాజశేఖర్ నట వారసురాలు శివాత్మిక సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తాజాాగా కొన్ని ఫోటోలను షేర్ చేసిన ఈ బామ ఎద అందాలతో రెచ్చిపోయింది.
నడుము, ఎద అందాలను చూపిస్తూ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది. సినిమాల్లో ట్రెడిషనల్‌గా కనిపించే ఈ భామను హాట్ లుక్స్‌లో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.
2019లో దొరసాని చిత్రం ద్వారా శివాత్మిక తెలుగు తెరకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన శివాత్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.
దొరసానిలో శివాత్మిక నటనకు సైమా అవార్డ్ లభించింది. ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్‌గా పురస్కారం అందుకుంది.
దొరసాని తర్వాత పంచతంత్రం, ఆకాశం చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేదు.
తాజాగా ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.
గత కొన్ని రోజులుగా శివాత్మిక సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
శివాత్మిక పెట్టిన ఫొటోలను ఆమె ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఆమె అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఏప్రిల్ 04 , 2023
Thandel Movie: శివ పార్వతుల్లా నాగ చైతన్య - సాయిపల్లవి.. ‘తండేల్’ నుంచి అదిరిపోయే పోస్టర్స్!
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘లవ్ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ బయటకొచ్చింది. ఇది చేసిన సినీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
శివరాత్రి స్పెషల్ సాంగ్
నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో రూపొందుతున్న ‘తండేల్’ చిత్రానికి చందు మెుండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. శివరాత్రి థీమ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తోంది. ఇందుకోసం భారీ సెట్‌ను సైతం వేశారు. పాట విజువల్ ట్రీట్‌లా ఉండేందుకు మేకర్స్ రూ.4 కోట్లు ఖర్చు చేశారని టాక్. అంతేకాదు వందలాది మంది డ్యాన్సర్లు ఈ పాటలో భాగం కాబోతున్నారట. సాయిపల్లవి, నాగచైతన్య శివపార్వతులను తలపించే నృత్యరీతులతో అలరించబోతున్నారని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. శివరాత్రి థీమ్‌తో ఓ పాటను ఈ స్థాయిలో కంపోజ్ చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారని టాక్. షూటింగ్ స్పాట్ ఫొటోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇందులో చైతు-సాయిపల్లవి శివ పార్వతులను తలపిస్తున్నారు.
https://twitter.com/ThandelTheMovie/status/1840612058691183016
తండేల్ స్టోరీ ఇదే
నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. గుజరాత్ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ అంటే గుజరాతి భాషలో బోటు నడిపే ఆపరేటర్ అని అర్థం. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని డైరెక్టర్ చందూ మెుండేటి ఓ ఇంటర్యూలో వెల్లడించారు.
చైతూ ఆశలన్నీ తండేల్ పైనే!
ప్రస్తుతం నాగ చైతన్య తన ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత అతడికి సరైన హిట్ లభించలేదు. ‘బంగార్రాజు’, ‘థ్యాంక్ యూ’, ‘లాల్ సింగ్ చద్ధా’, గతేడాది వచ్చిన ‘కస్టడీ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందాయి. దీంతో ‘తండేల్’ ద్వారా ఎలాగైన గెలుపు బాట పట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. మత్స్యకారుడి పాత్ర కోసం ఆయన ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది.
సాయిపల్లవి ప్రాజెక్ట్స్
ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్‌తో కలిసి 'అమరన్' అనే చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 31 థియేటర్లలోకి రానుంది. అలాగే బాలీవుడ్‌లో ‘రామాయణం’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. ఇందులో సీతగా ఆమె కనిపించనుంది. ఈ పాత్ర కోసం రూ.15 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే హీరో నాని, శేఖర్ కమ్ములా కాంబోలో రానున్న చిత్రంలోనూ సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి.
సెప్టెంబర్ 30 , 2024
Gopichand Bhimaa Review: యాక్షన్ సీక్వెన్స్‌ల్లో గోపిచంద్ శివతాండవం.. ‘భీమా’ మూవీ హిట్టా? ఫట్టా?
నటీనటులు : గోపిచంద్, ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ, వెన్నెకల కిషోర్, రఘుబాబు, నాజర్, నరేష్, ముఖేష్ తివారి, పూర్మ, రోహిణి, సరయూ, చమ్మక్ చంద్ర తదితరులు
దర్శకుడు : ఎ. హర్ష
సంగీతం : రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ : స్వామి జె. గౌడ
నిర్మాణ సంస్థ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నిర్మాత : కె. కె. రాధామోహన్
మాచో హీరో గోపీచంద్ (Gopichand) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ (Bhimaa). కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. యువ హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా, మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్‌కు ‘భీమా’ ఊరట కలిగించిందా? పోలీసు పాత్రలో గోపిచంద్ మెప్పించాడా? లేదా?
కథ
భీమా కథ పరుశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది. బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ దేవాలయంలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిని పోలీసు అధికారి భీమా (గోపిచంద్) ఎలా ఛేదించాడు? అతడికి పరుశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి? హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ ఇద్దరి రోల్స్ ఎలా ఉన్నాయి? ప్రియా భవానీతో గోపిచంద్ లవ్ ట్రాక్ ఎలా మెుదలైంది? అన్నది కథ.
ఎవరేలా చేశారంటే
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన భీమా సినిమాలో.. హీరో గోపిచంద్ అదరగొట్టాడు. పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ డైలాగ్స్, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల తర్వాత గోపీచంద్ కటౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్ రోల్స్‌లో గోపిచంద్ కనిపిస్తాడు. పాత్రకు తగ్గ వేరియేషన్స్‌తో మిస్మరైజ్ చేశాడు. ఇక హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ ఇద్దరి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ప్రియా భవాని, గోపిచంద్ మధ్య కెమెస్ట్రీ తెరపై ఆకట్టుకుంటుంది. నరేష్, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర పాత్రలు నవ్వులు పూయిస్తాయి. నాజర్, ముఖేష్ తివారి, రోహిణి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
భీమా చిత్రానికి దర్శకత్వం వహించిన ఏ. హర్ష.. డైరక్టరే కాకుండా కొరియోగ్రాఫర్ కూడా. ‘భీమా’ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు.. రెండు సాంగ్స్‌కి కొరియోగ్రఫీ కూడా అందించారు. కన్నడ అనేక హిట్ చిత్రాలను అందించిన హర్ష.. గోపీచంద్‌ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడంలో సెక్సెస్ అయ్యారు. పరశురామ క్షేత్రం చుట్టూ అల్లుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌తో పాటు మరో సర్‌ప్రైజింగ్ రోల్‌తో గోపీచంద్‌లోని నట విశ్వరూపాన్ని డైరెక్టర్ బయటపెట్టారు. ప్రతీ యాక్షన్ ఎపిసోడ్‌ను గూస్‌బంప్స్ వచ్చేలా తెరకెక్కించారు. అటు ఎఫ్ఎక్స్ విభాగం నుంచి కూడా మంచి ఔట్‌పుట్‌ను రాబట్టడంలో డైరెక్టర్ హర్ష విజయం సాధించారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే సెకండాఫ్ కాస్త రొటీన్‌గా సాగినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. రవి బస్రూర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్ చేసింది. స్వామి జె. గౌడ కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
గోపిచంద్ నటనయాక్షన్ సీక్వెన్స్‌నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్
సాగదీత సీన్లుఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 08 , 2024
Tollywood Cult Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే!
ఒకప్పుడు టాలీవుడ్ అంటే దేశంలోని సినీ ఇండస్ట్రీలలో ఒకటిగా ఉండేది. తెలుగు సినిమాలంటే నార్త్ ఇండియన్స్ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. మన డైరెక్టర్లు కూడా కేవలం సరిహద్దులు గీసుకొని కేవలం తెలుగు ఆడియన్స్ కోసమే సినిమా రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జాతీయ అవార్డు ఫంక్షన్లకు ఆహ్వానం లభించని స్టేజీ నుంచి ఆస్కార్ వేడుకల్లో పాల్గొనే స్థాయికి మన డైరెక్టర్లు ఎదిగారు. అంతర్జాతీయ బహుమతులను దేశానికి అందిస్తూ ప్రతీ ఒక్కరినీ గర్వపడేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే 1990 నుంచి ఇవాళ్టి దసరా వరకూ ఎన్నో కల్ట్ సినిమాలు టాలీవుడ్ గతిని మార్చాయి. తెలుగు ఇండస్ట్రీని రేంజ్‌ను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నాయి.
కల్ట్ మూవీ అంటే?
కల్ట్ మూవీకి పర్యాయ పదంగా ట్రెండ్ సెట్టర్ సినిమా అని కూడా సినీ విశ్లేషకులు పిలుస్తారు. విభిన్న కథాంశం. విడుదలయ్యాక ఆ మూవీ పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ సంపాదించడం, ఆ చిత్రం పంథాను కొన్నేళ్లపాటు మరికొన్ని సినిమాలు అనుసరించి రావడం, ఆ సినిమా డైలాగ్స్.. ఇప్పటికీ జనాల నాలుకలపై నానడం వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్ల వర్షం కురిపించే సినిమాలు ఈ కోవలోకే వస్తాయి.
90వ దశకం నుంచి యాక్షన్ కల్ట్ మూవీలు
శివ(1989)
ఎలాంటి అంచనాలు లేకుండా 1989లో రిలీజైన 'శివ' మూవీ ఇండస్ట్రీ కల్ట్ గా నిలిచింది. అప్పటి వరకు సామాజిక ఆర్థిక అంశాలే ప్రధానం రూపొందిన చిత్రాల పంథాను ఒక్కసారిగా మార్చింది. పక్క యాక్షన్ మూవీగా తెరకెక్కిన శివ నాగార్జునకు స్టార్ డామ్ తెచ్చిపెట్టింది. ఆయన కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసింది. నాగార్జున పట్ల యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సైకిల్ చైన్ లాగే మెనరిజాన్ని అప్పట్లో యూత్ పిచ్చిగా ఫాలో అయ్యేవారు. ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మతో మూవీలు చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కట్టారు. అంతే కాదు శివ యాక్షన్ సిక్వెన్స్‌ను అనుసరిస్తూ చాలా చిత్రాలు వచ్చాయి.
గాయం(1993)
1993లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లోనే వచ్చిన 'గాయం' సైతం మంచి యాక్షన్ కల్ట్ గా నిలిచింది. ఈ మూవీని యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పెరొందిన జగపతి బాబు ఈ సినిమాతో ఒక్కసారిగా మాస్ లుక్ లోకి మారిపోయారు. దుర్గ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. జగపతి బాబు సరసన రేవతి, కోటా శ్రీనివాస్ రావు, సిరివెన్నెల సితారామశాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అనే పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిందే.
భారతీయుడు(1996)
శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన భారతీయుడు ఆల్ టైమ్ యాక్షన్ కల్ట్ చిత్రంగా పేరొందింది. రొటీన్ మూవీలకు భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా సరికొత్త కథాంశంతో శంకర్ తెరకెక్కించాడు. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీ తర్వాత ఇదే తరహా కథాంశాలతో వచ్చిన రమణ, ఠాగూర్, మల్లన్న చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో మెప్పించాడు. మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించాడు.
సమరసింహా రెడ్డి(1999)
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'సమరసింహా రెడ్డి(1999), నరసింహా నాయుడు(2001) యాక్షన్ ఎంటర్ టైన్మెంట్‌కు కొత్త నిర్వచనం అందించాయి. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిత్రాల్ని డెరెక్టర్ బీ గోపాల్ అద్భుతంగా తెరకెక్కించాడు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. ఈ చిత్రాల్లో బాలయ్య డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసింది. ఈ రెండు సినిమాలను అనుకరిస్తూ వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. ఫాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఇంద్ర, ఆది, యజ్ఞం మూవీలు హిట్ కొట్టాయి.
పోకిరి(2006)
తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ కల్ట్ మూవీ పోకిరి(2006). అప్పటివరకు తెలుగు తెరకు పరిచయం లేని గ్యాంగ్ స్టర్ స్టోరీ లైన్ తో పూరి ముందుకొచ్చాడు. పోకిరి దెబ్బకు అన్ని రికార్డులు దాసోహం అయ్యాయి. హీరో మేనరిజం, డెలాగ్స్, చిత్రీకరణ విలువలు, మణిశర్మ మ్యూజిక్ ప్రతి ఒక్కటీ వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు పోకిరి యాక్షన్ సిక్వెన్స్ ను ఫాలో అయ్యాయి.
మగధీర(2009)
రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర క్లాసిక్ కల్ట్ గా చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను మగధీర బ్రేక్ చేసింది. పూర్వ జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ చాల ఏళ్ల తర్వాత మళ్లీ పౌరాణిక వాసనను తెలుగు తెరకు గుర్తు చేసింది. కత్తులు, యుద్ధం వంటి యాక్షన్ డ్రామాతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మంచి బ్రెక్ ఇచ్చింది. నటించిన రెండో సినిమాతోనే చరణ్ కు స్టార్ హోదా దక్కింది. ఈ చిత్రం పోలికలతో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఆశించినంత విజయం సాధించలేదు.
అర్జున్ రెడ్డి(2017)
కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి డెరెక్ట్ చేసిన 'అర్జున్ రెడ్డి(2017)' టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం పెద్దఎ త్తున ఫ్యాన్ బేస్ సంపాదించింది. విజయ్ దేవరకొండ కేరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఊహించని సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాను హిందీ, తమిళ్ ఇండస్ట్రీల్లో రీమేక్ చేశారు. యూత్ లో ఫుల్ జోష్ ను నింపింది. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ ని రౌడీ బాయ్ అంటూ అభిమానులు పిలవడం మొదలు పెట్టారు.
బాహుబలి-2(2017)
రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కావ్యం 'బాహుబలి-2(2017)' భారత చలనచిత్ర గతినే మార్చింది. అన్ని భాషలను ఏకం చేసి పాన్ ఇండియా ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లోనే సాధ్యమనుకునే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్ రికార్డును బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులే కాదు సౌత్ సినిమాలను పెద్దగా ఆదరించని నార్త్ ఆడియన్స్ మనసులను సైతం కొల్లగొట్టింది.
సౌత్, నార్త్ కాదు మన సినిమా ఇండియన్ సినిమా అనే స్థాయికి ఇండస్ట్రీ వర్గాలను తీసుకొచ్చింది. ఈ మూవీ తర్వాత పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా మూవీలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
రంగస్థలం (2018)
ఒకేరకమైన కథలతో వెళ్తున్న టాలీవుడ్‌కు రంగస్థలం సినిమా కొత్త మార్గాన్ని చూపించింది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా పక్కా పల్లెటూరు కథతోనూ హిట్ కొట్టొచ్చని డైరెక్టర్ సుకుమార్ ఈ తరం దర్శకులకు చూపించారు. ఇందులో రామ్ చరణ్, సమంత నటన మూవీకే హైలెట్ అని చెప్పాలి. రామ్‌చరణ్‌లోని కొత్త నటుడ్ని ఈ సినిమా ఆవిష్కరించింది. ఈ సినిమా స్ఫూర్తితో ప్రస్తుతం చాలా మంది దర్శకులు పల్లెటూరి కథలో దృష్టిసారిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో షేక్ చేస్తున్న దసరా, బలగం సినిమాలకు ఈ సినిమానే స్ఫూర్తి అని చెప్పొచ్చు.
పుష్ప(2022)
పాన్ ఇండియా మూవీగా వచ్చిన 'పుష్ప' భారీ విజయాన్ని సాధించింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా డైలాగులను రాజకీయ నాయకులు మొదలు క్రికెటర్లు, WWE స్టార్ల వరకు వల్లవేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అయితే.. రాజకీయ నాయకులు 'తగ్గేదేలే'.. 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చే వరకు వెళ్లింది.
ఆర్‌ఆర్‌ఆర్ (2022)
దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేశాడు. టాలీవుడ్ శక్తి సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించింది. తద్వారా భారతీయుల హృదయాలను ఉప్పొంగేలా చేసింది. ఒకప్పుడు జాతీయ అవార్డులు రావడమే గగనంగా ఉన్న పరిస్థితి నుంచి తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. కథానాయకులు రామ్‌చరణ్, ఎన్‌టీఆర్‌లు కూడా RRRలో ఎంతో అద్భుతంగా నటించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.
బలగం (2023)
సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయిన ఘనవిజయం సాధిస్తుందని బలగం సినిమా నిరూపించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రభంజనే సృష్టించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రేమానురాగాలను డైరెక్టర్ వేణు చక్కగా చూపించాడు. పక్కా పల్లెటూరు నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.
దసరా (2023)
టాలీవుడ్ రేంజ్‌ను దసరా చిత్రం మరింత పెంచింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఈ సినిమా కూడా పల్లెటూరు కథాంశంతో తెరకెక్కి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ముఖ్యంగా హీరో నాని ఈ సినిమా తన నటా విశ్వరూపమే చూపించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఊరమాస్‌గా ఇరగదీశాడు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. మహానటి తర్వాత కీర్తి అత్యుత్తమ నటనను ఈ సినిమాలో చూడొచ్చు.
ఏప్రిల్ 12 , 2023
Bhoothaddam Bhaskar Narayana Review: థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకున్న ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’.. మూవీ ఎలా ఉందంటే?
నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ, వెంకటేష్ కాకుమాను తదితరులు.
దర్శకుడు: పురుషోత్తం రాజ్
సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రాఫర్: గౌతమ్ జి
నిర్మాతలు : స్నేహల్ జంగాల, శశిధర్ కాసి, కార్తీక్ ముడింబి
విడుదల తేదీ : మార్చి 01, 2024
టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో డిటెక్టివ్ చిత్రాలు వచ్చాయి. చిరంజీవి ‘చంటబ్బాయ్’ నుంచి రీసెంట్‌గా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వరకూ ఆ తరహా చిత్రాలు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచాయి. తాజాగా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ డిటెక్టివ్ జానర్‌లోనే తెరకెక్కింది. అయితే దర్శకుడు పురుషోత్తం రాజ్.. పురాణాలతో డిటెక్టివ్ కథని ముడిపెడుతూ ఈ సినిమాను రూపొందించడం ఆసక్తికరం. శివ కందుకూరి ఇందులో కథానాయకుడిగా చేశాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఈ డిటెక్టివ్ ఏ మేరకు మెప్పించాడు? అన్నది ఇప్పుడు చూద్దాం.
కథ
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో (Bhoothaddam Bhaskar Narayana Review) ఓ సీరియల్ కిల్లర్ మహిళల్ని టార్గెట్ చేస్తూ వరుసగా హత్యలు చేస్తుంటాడు. ఆడవారి తలలు నరికేసి వాటి స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ వరుస హత్యలు పోలీసులకు చిక్కుముడిలా మారిపోతాయి. దీంతో కేసును పరిష్కరించడం కోసం లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కేసును డిటెక్టివ్ ఛేదించాడా? లేదా? ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు ఆడవారినే హత్య చేస్తున్నాడు? వారి తలలు తీసుకెళ్లి ఏం చేస్తున్నాడు? రిపోర్టర్ లక్ష్మీతో హీరో లవ్‌స్టోరీ ఏంటి? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
శివ కందుకూరి డిటెక్టివ్ పాత్రలో సహజంగా ఒదిగిపోయాడు. నటన పరంగానూ వైవిధ్యం ప్రదర్శించాడు. ప్రథమార్ధంలో సరదా సన్నివేశాల్లో హుషారుగా కనిపించిన అతడు.. సెకండాఫ్‌లో సీరియస్ సన్నివేశాలపైనా బలమైన ప్రభావం చూపించాడు. అటు హీరోయిన్ రాశిసింగ్ చాలా అందంగా కనిపించింది. రిపోర్టర్ లక్ష్మిగా ఆమెకీ కీలకమైన పాత్రే దక్కింది. షఫి, దేవి ప్రసాద్, శివన్నారాయణ, శివకుమార్ తదితరులు అలవాటైన పాత్రల్లో తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ పురుషోత్తమ్ రాజ్.. ఆసక్తికర కథను ఎంచుకున్నారు. డిటెక్టివ్ కథను పురుణాలతో ముడిపెట్టిన విధానం బాగుంది. హీరోను పక్కా లోకల్ డిటెక్టివ్‌గా చూపించడం అందరినీ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. హత్యల పూర్వాపరాలు, పోలీసుల పరిశోధన, ఆ కేసులోకి హీరో ప్రవేశం, అతనికీ సవాల్ విసిరే పరిశోధన తదితర అంశాలన్నీ ఆసక్తిని రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధంలో మలుపులు మరింత ఉత్కంఠని పెంచుతాయి. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో కొన్ని సీన్లు కథకు స్పీడ్ బ్రేకుల్లా తయారయ్యాయి. ఓవరాల్‌గా పురషోత్తం రాజ్ దర్శకత్వం ఆకట్టుకుంటుంది.
సాంకేతికంగా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సంగీతం, కెమెరా, ఎడిటింగ్, కళ తదితర విభాగాలన్నీ మంచి పనితీరుని కనబరిచాయి. నేపథ్య సంగీతం ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. నిర్మాణంలోనూ నాణ్యత కనిపిస్తుంది. బడ్జెట్‌కు వెనకాడినట్లు ఎక్కడా అనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
హీరో నటనకథలో పురాణ నేపథ్యంద్వితీయార్థం
మైనల్ పాయింట్స్
ప్రథమార్థంలో కొన్ని సీన్లు
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 02 , 2024
#90’s Web Series Review: మధ్యతరగతి ఫ్యామిలీలకు ప్రతీరూపం #90’s.. సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు: శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు
రచనం, దర్శకుడు: ఆదిత్య హాసన్
సంగీతం: సురేష్ బొబ్బలి
సినిమాటోగ్రఫీ: అజాజ్ మహ్మద్
ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి
నిర్మాత: రాజశేఖర్ మేడారం
శివాజీ, వాసుకి జంటగా నటించిన లెేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘#90's. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ట్యాగ్‌లైన్. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన ఈ వినోదాత్మక సిరీస్‌ను రాజశేఖర్ మేడారం నిర్మించారు. మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలతో నవ్వులు పూయిస్తూ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిరీస్‌ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. కాగా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సిరీస్ ప్రసారంలోకి వచ్చింది. మరి దీని కథేంటి? లెక్కల మాస్టార్‌గా శివాజీ ఎలా నటించారు? ఇప్పుడు చూద్దాం.
కథ
చంద్రశేఖర్ (శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. ప్రభుత్వ టీచర్ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో జాయిన్ చేస్తాడు. వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. మరి వచ్చిందా? క్లాస్‌మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? చంద్రశేఖర్ ఇంట్లో ఉప్మా కథేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ఎవరెలా చేశారంటే
చంద్రశేఖర్ పాత్రలో శివాజీ ఒదిగిపోయారు. మిడిల్ క్లాస్ తండ్రులందరికీ ప్రతినిధిగా ఆయన కనిపించారు. మధ్య తరగతి గృహిణి రాణిగా వాసుకీని చూస్తే 90లలో పిల్లలకు తమ తల్లి గుర్తుకు వస్తుంది. భర్తతో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంట్లో పరిస్థితి గురించి చెప్పే సన్నివేశంలో ఆమె అద్భుత నటన కనబరిచారు. రఘు పాత్రలో మౌళి నటన సహజంగా ఉంది. అతడు చక్కగా చేశాడు. వాసంతి, స్నేహాల్ కామత్ అందంగా నటించారు. చిన్నోడు రోహన్ అయితే పక్కా నవ్విస్తాడు. చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల అతిథి పాత్రలో మెప్పిస్తారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
90లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణాన్ని దర్శకుడు ఆదిత్య హాసన్ చక్కగా తెరపై ఆవిష్కరించారు. కథ రొటిన్‌గా అనిపించినప్పటికీ క్యూట్ & లిటిల్ మూమెంట్స్‌తో దర్శకుడు ఆకట్టుకున్నాడు. ఆరు ఎపిసోడ్స్ కలిగిన ఈ సిరీస్‌తో ప్రేక్షకులను 90ల నాటి రోజుల్లోకి తీసుకెళ్లి ఆ స్మృతులను ఆదిత్య గుర్తుచేశారు. కుటుంబ విలువలను సిరీస్‌లో చక్కగా చూపించారు. చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతుక్కునే '90స్' మధ్యతరగతి కుటుంబాన్ని కళ్లకు కట్టారు. ముఖ్యంగా మనం 90ల నాటి పిల్లలమైతే ఈ సిరీస్‌కు కనెక్ట్ అవుతాం. దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి ఒక్కరికీ అందమైన జ్ఞాపకాలను అందించారు.
టెక్నికల్‌గా
సాంకేతికంగా #90’s సిరీస్ బాగుంది. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా కుదిరాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. అప్పటి పరిస్థితులను ఆవిష్కరించడానికి యూనిట్ పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటీనటులుకథ, దర్శకత్వంసాంకేతిక విభాగం
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం
రేటింగ్: 3/5
జనవరి 05 , 2024
Amaran Collections: తెలుగులో 500% లాభాలతో దుమ్మురేపిన ‘అమరన్’.. ఎంత వచ్చాయంటే?
కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా తెరకెక్కిన చిత్రం అమరన్ (Amaran). అమరుడైన మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలై 19 రోజులు అయినా ఇప్పటికీ అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అటు తెలుగులోనూ రికార్డు వసూళ్ల (Amaran Collections)ను రాబడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. థియేటర్లలో పూర్తి స్థాయి ఆక్యుపెన్సీతో అదరగొడుతోంది. ఫలితంగా నటుడు శివకార్తికేయన్ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు.
రూ.300 కోట్ల క్లబ్‌లోకి..
శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. దీపావళిని పురస్కరించుకుని అక్టోబర్ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరి అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన చేస్తోంది. తొలి 19 రోజుల్లో ఈ చిత్రం రూ.300 కోట్ల గ్రాస్ (Amaran Collections)ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మేరకు ‘మెగా బ్లాక్ బాస్టర్’ అంటూ మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శివకార్తికేయన్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రూ.300 కోట్ల మార్క్ అందుకోలేదు. అమరన్‌తోనే అతడు ఈ ఘనత సాధించడం విశేషం.
https://twitter.com/Dasarathan_1720/status/1858698464630063231
తెలుగులో లాభాలే లాభాలు..
‘అమరన్’ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ తెలుగు హక్కులు రూ.4 కోట్లకు అమ్ముడు పోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.8 కోట్లుగా నిలిచింది. అయితే తెలుగులో ఎవరు ఊహించని స్థాయిలో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పటివరకూ రూ.41 కోట్ల గ్రాస్ (Amaran Collections) వసూళ్లను అమరన్ సాధించింది. 500% లాభాలతో తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అటు తమిళనాడులోనే రూ.143 కోట్లను ‘అమరన్’ తన ఖాతాలో వేసుకుంది. అలాగే కేరళలో రూ.11.50 కోట్లు, కర్ణాటకలో రూ.22 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.4.5 కోట్లు, ఓవర్సీస్‌లో ఏకంగా రూ.79 కోట్లను కొల్లగొట్టింది. ఈ స్థాయి రెస్పాన్స్ చూసి అమరన్ టీమ్ తెగ ఖుషీ అవుతోంది.
కలిసొచ్చిన కంగువా ఫ్లాప్..
నిజానికి అమరన్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించినా ఈ స్థాయి వసూళ్లు వస్తాయని వారు కూడా ఊహించలేదు. ఎందుకంటే సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’ వల్ల తమ లాంగ్ రన్ కలెక్షన్స్ దెబ్బతింటాయని భావించారు. అయితే నవంబర్ 14న వచ్చిన ‘కంగువా’ చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినీ లవర్స్ అమరన్ మెయిన్ ఛాయిస్‌గా మారిపోయింది. థియేటర్‌లో మంచి సినిమాను అస్వాదించాలని అనుకునేవారంతా కుటుంబంతో సహా అమరన్‌కు వెళ్తున్నారు. దీని కారణంగానే మూవీ వచ్చి మూడు వారాలు అవుతున్న బాక్సాఫీస్ (Amaran Collections) వద్ద జోరు తగ్గలేదు. ఈ వారం కూడా పెద్ద స్టార్ హీరోల చిత్రాలు లేకపోవడంతో కలెక్షన్స్ ఇదే రీతిలో పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నెలాఖరులో ఓటీటీలోకి..
థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ‘అమరన్’ (Amaran OTT Release) ఈ నెలాఖరులో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 29 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ వసూళ్ల (Amaran Collections) దృష్ట్యా రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే డిసెంబర్ 5వ తేదీనైనా పక్కాగా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. దీంతో ఇప్పటివరకూ థియేటర్లలో చూడని వారంతా ‘అమరన్’ ఓటీటీ రాకకోసం తెగ ఎదురుచూస్తున్నారు.
నవంబర్ 19 , 2024
Amaran Movie Review: హృదయాన్ని హత్తుకునే ఓ వీర సైనికుడి గాథ
చిత్రం: అమరన్నటీనటులు: శివ కార్తికేయన్, సాయి పల్లవి, భువన్ అరోడ, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్సినిమాటోగ్రఫీ: సీహెచ్ సాయిఎడిటింగ్: ఆర్. కలైవానన్నిర్మాతలు: కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్, వివేక్ కృష్ణానిదర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామివిడుదల తేదీ: 31-10-2024
భారత సైనికుల త్యాగాలు, ధైర్యసాహసాలు కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రాల్లో అమరన్ ఒకటి. ఈ చిత్రం జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పోరాడుతూ వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా(Amaran Movie Review) తీసుకుని చిత్రీకరించారు. ముకుంద్‌గా శివ కార్తికేయన్, ఆయన భార్య ఇందుగా సాయి పల్లవి నటించారు. తమిళంలో సోనీ పిక్చర్స్‌తో కలసి కమల్‌హాసన్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి పండుగ వేళ పలు భాషల్లో విడుదలైంది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? ఓసారి చూద్దాం.
కథ
ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ.
సినిమా ఎలా ఉందంటే?
అమరన్ చిత్రం ఒక దేశభక్తి, ప్రేమ, త్యాగం కలబోతైన సినిమా. సైనికుడు కష్టాల్లో ఉండగా ఆయన కుటుంబం ఎలా మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటుందో, కుటుంబం ఎంతటి త్యాగాలను చేస్తుందో ఈ చిత్రం హృదయానికి హత్తుకునేలా చూపించింది.(Amaran Movie Review) మాదెప్పటికీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్పే... ఇప్పుడూ అంతే" అనే ఇందు మాటలు ప్రేక్షకున్ని ప్రతి సన్నివేశంలో మమేకం చేస్తాయి.
ముఖ్యంగా ముకుంద్, ఇందుల ప్రేమకథ ఒక అందమైన దృశ్యకావ్యంగా నిలుస్తుంది. వారి ప్రేమాయణం, సైనిక బాధ్యతలు వేర్వేరు ప్రపంచాలుగా ఉన్నా, ఆ పాత్రలను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించారు. ముకుంద్ వ్యక్తిగత జీవితంలో భార్య, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగాలతో కట్టిపడేస్తాయి.
అలాగే కశ్మీర్‌లో ప్రజలు- సైనికుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి, ఉగ్రవాదులను పట్టుకునేందుకు సైనికులు ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు, వారి ప్రణాళికలు ఎలా ఉంటాయి, ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి సైనికులు ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కొంటారు అనే అంశాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఇక క్లైమాక్స్‌లో అల్తాప్ వానీని హతం చేయడానికి ఖాజీపత్రి ఆపరేషన్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
ఇప్పటి వరకు చేయని ఓ కొత్త పాత్రలో శివ కార్తికేయన్ అద్భుతంగా నటించాడు. ఆయన కెరీర్‌లో సరదా పాత్రల్లో ఎక్కువగా కనిపించే శివ కార్తికేయన్ ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా, సీరియస్‌గా, సైనికుడి గంభీరతను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి, తన పాత్రలో సహజత్వాన్ని తెరపై ప్రదర్శిస్తూ, తల్లి, భార్యగా త్యాగపూరిత పాత్రలో తన ప్రతిభను చాటారు. ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రతి సన్నివేశాన్ని మరింత అద్భుతంగా మార్చుతుంది.
సాంకేతికత
ఈ సినిమా టెక్నికల్‌గా చాలా ఉన్నతంగా ఉంది. సీహెచ్ సాయి తీసిన విజువల్స్ కశ్మీర్‌లోని సైనిక భౌగోళిక పరిస్థితులను ప్రతిబింబింపజేస్తాయి.(Amaran Movie Review) జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం భావోద్వేగాలను హైలెట్ చేస్తుంది. ఎడిటింగ్, యాక్షన్ సన్నివేశాలు అన్నీ సినిమాకు అనువుగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను మరింత బలంగా కనెక్ట్ చేస్తాయి.
బలాలు
బలమైన కథ
సెకాండాఫ్
బలమైన ఎమోషన్స్
శివకార్తికేయన్- సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ
బలహీనతలు
పస్టాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు
చిరవగా
మేజర్ ముకుంద్ వరదరాజన్‌కి నివాళిగా, ఆయన ధైర్యసాహసాలను, కుటుంబం త్యాగాన్ని చూపించిన ఈ చిత్రం హృదయాలను హత్తుకుంటుంది.
రేటింగ్: 4/5
నవంబర్ 01 , 2024
Devara: కొరియన్ మూవీని చూసి దేవర కాపీ? వీడియో వైరల్!
జూ.ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. కలెక్షన్స్ సునామి సృష్టించి తారక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీలో వచ్చే సముద్రపు ఫైట్ సీక్వెన్స్ ఆడియన్స్‌ను ఎంతగానో అలరించాయి. కొరటాల శివ క్రియేటివిటీ అద్భుతమంటూ కామెంట్స్ సైతం వినిపించాయి. అయితే అవన్నీ కొరటాల శివ సొంత ఆలోచనల నుంచి పుట్టినవి కావని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఓ కొరియన్ సినిమా సీన్లను మక్కీకి మక్కీ దించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇదిగో ఆధారాలంటూ ఓ వీడియోను సైతం ట్రెండ్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
‘దేవర’ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ సీన్స్‌ను గమనిస్తే ఎవరికైనా గూస్‌బంప్స్ రావాల్సిందే. ఒక తెలుగు డైరెక్టర్ సముద్రంలో ఆ స్థాయి యాక్షన్ సీక్వెన్స్ తీస్తారని ఎవరు ఊహించలేదు. సముద్రపు ఓడలోని ఆయుధాలను దోచుకునేందుకు హీరో తన గ్యాంగ్‌తో కలిసి వెళ్లడం, గన్స్‌తో ఉన్న పెట్టెలను సముద్రంలో పడేయటం మూవీలో చూడవచ్చు. అప్పటికే నాటు పడవలతో సిద్ధంగా ఉన్న హీరో గ్యాంగ్‌లోని మరికొందరు ఆ బాక్స్‌లను తమ నాటు పడవల్లోకి ఎక్కించుకొని నావీ అధికారుల కళ్లుకప్పి స్మగ్లింగ్ చేస్తారు. అయితే అచ్చం ఇలాంటి సీనే కొరియన్ మూవీలో ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ సీన్‌నే దర్శకుడు కొరటాల శివ కాపీ కొట్టారని ఆరోపిస్తున్నారు. ఆడియన్స్‌ను భలే బురిడి కొట్టించావంటూ దర్శకుడిపై మండిపతున్నారు. ఆ కొరియన్ మూవీ సీన్‌ను మీరు ఓసారి చూసేయండి.
https://twitter.com/chiruthajsp/status/1849093752683716609
ఆ సీన్ కూడా అంతే!
‘దేవర’ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. తొలుత విలన్ గ్యాంగ్‌తో పాటు స్మగ్లింగ్‌లో పాల్గొన్న ‘దేవర’ కొన్ని బలమైన కారణాలతో మంచిగా మారతాడు. అదే సమయంలో సముద్రంలోకి స్మగ్లింగ్ చేయడానికి వస్తోన్న తన వారిలో భయం కలిగిస్తాడు. ఈ క్రమంలో కత్తులతో ఉన్న కుర్చీని తీరం వెంబడి దర్శకుడు చూపించారు. అయితే ఈ సీన్‌ను కూడా కాపీ కొట్టారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. హాలీవుడ్ చిత్రం ‘వికింగ్స్’ (Vikings)లోని ఓ సన్నివేశం కూడా అచ్చం అలాగే ఉందంటూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/BackupBrainy/status/1833835236465029376
దేవర కథ కూడా కాపీనా?
దేవర కథను కాపీ రైట్ ఉన్న నవల నుంచి తీసుకున్నట్లు రిలీజ్‌కు ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాను కాపీరైట్ కొనుగోలు చేసిన ఒక నవలలోని కీలక సీన్స్ ఓ సినిమాలో చూసి బాధపడుతున్నానని తమిళ డైరెక్టర్ శంకర్ ఇటీవల ఆరోపించారు. క్రియేటర్స్ దగ్గర ఉన్న రైట్స్ గౌరవించాలని, అధికారం లేకుండా సీన్స్‌ను కాపీ కొట్టడం మానుకోవాలని శంకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఆయన ఏ సినిమా గురించి ప్రస్తావించారో క్లారిటీ ఇవ్వలేదు. కానీ, శంకర్ ప్రస్తావించిన తమిళ నవల వీరయుగ న్యాయ వేల్పరి కథకు దగ్గరగా దేవర స్టోరీ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
శ్రీమంతుడు విషయంలోనూ..
కథను కాపీ చేశారన్న ఆరోపణలు కొరటాల శివపై రావడం ఇదే తొలిసారి కాదు. మహేష్‌తో చేసిన ‘శ్రీమంతుడు’ (Srimanthudu) మూవీ విషయంలోనూ ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తన స్టోరీని కాపీ కొట్టాడంటూ రచయిత శరత్ చంద్ర కోర్టుకు సైతం వెళ్లారు. అప్పట్లో విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 2012లో 'చచ్చేంత ప్రేమ' పేరుతో స్వాతి మాస పత్రికలో తన స్టోరీ ప్రచురితమైందని రచయిత తెలిపారు. దానిని సినిమా చేద్దామని అనుకుంటున్న క్రమంలోనే కొరటాల శివ ‘శ్రీమంతుడు’ తీసేశాడని ఆరోపించారు.
అక్టోబర్ 24 , 2024
Devara Record: విదేశాల్లో చరిత్ర సృష్టించిన ‘దేవర’.. ఫస్ట్ ఇండియన్ మూవీగా మరో రికార్డు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. మరో రెండ్రోజుల్లో సెప్టెంబర్ 27న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్ నటించింది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించారు. దీనికి తోడు తారక్ ద్విపాత్రాభినయం చేస్తుండటంతో ఈ సినిమా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే రిలీజ్‌కు ముందే దేవర పలు రికార్డులను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. తాజాగా తన పేరిట మరో రికార్డును లిఖించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది.
ఆ రెండు దేశాల్లో అరుదైన ఘనత
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘దేవర’ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ యాక్షన్ డ్రామా తాజాగా మరో ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్‌మోస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ (Devara) నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్స్‌లో, న్యూజిలాండ్‌లో 3 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఇటీవలే నార్త్ అమెరికా టికెట్ల ప్రీసేల్‌లో దేవర రికార్డు సృష్టించింది. ప్రీ సేల్ టికెట్ల విక్రయాల్లో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
బాహుబలి స్థాయిలో క్లైమాక్స్
‘దేవర’ సినిమాలో చివరి 40 నిమిషాలు హైలైట్ అని ఎన్టీఆర్ (NTR) ఇటీవల స్వయంగా చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ దేవర క్లైమాక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మాట్లాడుతూ దేవర క్లైమాక్స్ బాహుబలిని పోలి ఉంటుందని తెలిపారు. ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్‌గా మారింది. మరోవైపు ఈ మూవీపై వస్తోన్న ఫేక్ న్యూస్‌పైనా రత్నవేలు స్పందించారు. ఇందులో తారక్ మూడు పాత్రలు పోషించారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
ఫ్యాన్స్‌కు నాగవంశీ రిక్వెస్ట్
దేవర డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన నిర్మాత నాగవంశీ అభిమానులకు ఎక్స్ వేదికగా ఓ రిక్వెస్ట్ చేశారు. ఈ సినిమాతోనైనా ఫ్యాన్ వార్‌కు ముంగింపు పలకాలని కోరారు. అలాగే ఫస్ట్ స్క్రీనింగ్‌లో సినిమా చూసే వారు సినిమాకు సంబంధించిన సీన్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టవద్దని కోరారు. మీ తర్వాత చూసే అభిమానులూ సినిమాని ఎంజాయ్ చేయనివ్వాలని విజ్ఞప్తి చేశారు. తారక్ అన్నకు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్ అందిద్దామని పిలుపునిచ్చారు. పోస్ట్ చివర్లో 'దేవర సెప్పిండు అంటే సేసినట్టే' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. నాగవంశీ విజ్ఞప్తిని నెటిజన్లు స్వాగతిస్తున్నారు.
https://twitter.com/vamsi84/status/1838795481406726608
రన్‌టైమ్‌లో మార్పులు
‘దేవర’ (Devara) సినిమా నిడివిలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు ఫైనల్ చేసిన నిడివిలో దాదాపు 7 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు సమాచారం. 170.58 నిమిషాల (2: 50 గంటలు) రన్‌టైమ్‌తో (Devara Movie RunTime) ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సురక్షిత ప్రయాణ సందేశం, ధూమపానం హెచ్చరికలాంటివి మినహాయిస్తే ఈ మూవీ లెంగ్త్ 2:42 గంటలుగా ఉండనుంది. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన ఈ సినిమా నిడివి ఇంతకుముందు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు ఉంది. ప్రాధాన్యం లేని సన్నివేశాలను తీసివేసినట్లు తెలుస్తోంది.
టికెట్ల రేటు పెంపు
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర టికెట్ల ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లపై రూ.25 , మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లపై రూ .50 ల పెంచుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా సెప్టెంబరు 27 న 29 థియేటర్లలో మిడ్ నైట్ 1గం.కు బెనిఫిట్ షోస్‌కు, అదేవిధంగా ఉదయం 4 గంటలకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో స్పెషల్ షోస్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాకుండా తొలిరోజున వేసే అన్ని షోలపై రూ.100 పెంచుకోవచ్చని సూచించింది. అటు ఏపీ ప్రభుత్వం టికెట్‌పై రూ.60 నుంచి రూ.135 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మొదటి రోజు ఆరు షో లు.. అక్టోబరు 9వరకూ ఐదు షోల చొప్పున ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పించింది.
దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు విక్రయించారని అంటున్నారు. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్‌లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
సెప్టెంబర్ 25 , 2024
Nayanthara: భర్తతో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్!
తన భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) పుట్టినరోజును పురస్కరించుకొని నటి నయనతార (Nayanthara) తాజాగా కొన్ని స్పెషల్ ఫొటోలు షేర్ చేశారు.
ఇందులో ఆమె ఆయన్ని ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ‘హ్యాపీ బర్త్‌డే మై ఎవ్రీథింగ్. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు. నువ్వు కన్న కలలు నిజం అయ్యేలా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. క్యూట్ కపుల్ అని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
‘నేనూ రౌడీనే’ సినిమా కోసం నయనతార, విఘ్నేశ్ శివన్ తొలిసారి కలిసి వర్క్ చేశారు. ఆ సినిమా చిత్రీకరణలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది.
ఆ స్నేహం కొద్ది కాలంలోనే ప్రేమగా మారింది. అలా సుమారు ఏడేళ్ల పాటు ఈ జంట ప్రేమించుకుంది. 2022లో పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
ఆ తర్వాత సరోగసి విధానంలో ఇద్దరు కవల పిల్లలకు నయన్ జంట తల్లిదండ్రులయ్యారు. ఇద్దరు మగ పిల్లలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్.శివన్, ఉలగ్ దైవాగ్ ఎన్. శివన్ అని పేర్లు పెట్టారు.
ఇక సినిమాల విషయానికి వస్తే విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
‘అన్నపూరణి’ సినిమాకు గాను నయనతార (Nayanthara) ఉత్తమ నటిగా ఇటీవల సైమా అవార్డును సొంతం చేసుకుంది.
నయనతార ప్రస్తుతం టెస్ట్’, ‘డియర్ స్టూడెంట్స్’, ‘తన్ని ఒరువన్ 2’ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
నయనతార వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె పుట్టుకతో మలయాళీ. మల్లువుడ్‌లో జయరాం నిర్మించిన ‘మనస్సినక్కరే’(2003) చిత్రంతో ఆరంగ్రేటం చేసింది.
ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నయన్ పేరు మార్మోగిపోయింది. ఇక అప్పటి నుంచి నయన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో వరుస పెట్టి సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. అన్ని భాషల్లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఈ అసాధారణ నటి తన జీవితంలో అతి పెద్ద తప్పిదాలు కూడా చేసింది. నయనతార వ్యక్తిగత జీవితంలో కూడా కష్ట సమయాలు ఉన్నాయి.
తొలుత తమిళ నటుడు శింబుతో ప్రేమాయణం సాగించింది. శింబు వీరిద్దరి వ్యక్తిగత ఫొటోలను బయటపెట్టడంతో మనస్తాపానికి గురై అతడిని వదిలించుకుంది.
ఆ తర్వాత నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపింది. ‘విల్లు’ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
వీరిద్దరి వ్యవహారం ప్రభుదేవా భార్య దృష్టికి వెళ్లడం, ఆమె ప్రభుదేవా నుంచి విడాకులు కోరడం చకచకా జరిగిపోయాయి.
ఈ క్రమంలో ప్రభుదేవా నయనతారను పక్కనబెట్టాడు. ఈ పరిణామంతో నయనతార హతాశయురాలైంది. ఇది నయన్ జీవితంలో ఒక కోలుకోలేని దెబ్బ.
ప్రభుదేవాతో బ్రేకప్ అనంతరం నయన్ జీవితంలోకి తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ వచ్చాడు. అప్పటి నుంచి ఈ అమ్మడు సినిమాల పరంగా వ్యక్తిగతంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ప్రస్తుతం దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో నయనతార అత్యధిక పారితోషికం తీసుకుంటోంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 18 , 2024