• TFIDB EN
  • టాక్సీవాలా
    UATelugu2h 17m
    శివ (విజయ్‌ దేవరకొండ) ట్యాక్సీ డ్రైవర్‌. ఓ పాత ట్యాక్సీని తక్కువ ధరకే కొనుగోలు చేస్తాడు. కానీ, ఆ కారులో దెయ్యం ఉందని శివ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    @Akhil24

    1 year ago

    తారాగణం
    విజయ్ దేవరకొండ
    శివ
    ప్రియాంక జవాల్కర్
    అనూష అలియాస్ అను
    మధునందన్
    బాబాయి/శివ స్నేహితుడు
    విష్ణుహాలీవుడ్
    రవి వర్మ
    సిసిర ప్రొఫెసర్
    షిజు
    రఘురామ్ (సిసిరా సవతి తండ్రి)
    రవి ప్రకాష్
    శివ సోదరుడు
    కావేరి
    శివ కోడలు
    యమునా
    సిసిర తల్లి
    ఉత్తేజ్
    డాక్టర్
    కిరీటి దామరాజు
    డాక్టర్
    చమ్మక్ చంద్ర
    నకిలీ ఫకీర్ / హాస్పిటల్ సెక్యూరిటీ గార్డు
    చిత్రం శీను
    చిత్రం శీను
    సత్య కృష్ణ
    డాక్టర్
    సిబ్బంది
    రాహుల్ సంకృత్యాన్దర్శకుడు
    శ్రీనివాస కుమార్ నాయుడు (SKN)నిర్మాత
    జేక్స్ బిజోయ్
    సంగీతకారుడు
    సుజిత్ సారంగ్
    సినిమాటోగ్రాఫర్
    శ్రీజిత్ సారంగ్
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>HBD Priyanka Jawalkar: ‘ఆ స్టార్ అంటే క్రష్‌.. గాసిప్స్‌ నేనే షేర్‌ చేస్తా’.. ప్రియాంక జావల్కర్‌ టాప్‌ సీక్రెట్స్‌!</strong>
    HBD Priyanka Jawalkar: ‘ఆ స్టార్ అంటే క్రష్‌.. గాసిప్స్‌ నేనే షేర్‌ చేస్తా’.. ప్రియాంక జావల్కర్‌ టాప్‌ సీక్రెట్స్‌!
    టాలీవుడ్‌కు చెందిన యంగ్‌ హీరోయిన్లలో ప్రియాంక జావల్కర్ (Priyanka Jawalkar) ఒకరు. సెకండ్‌ చిత్రం 'టాక్సీవాలా'తో సాలిడ్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తన అందంతో అందరి దృష్టి ఆకర్షించింది. ఆ తర్వాత సత్యదేవ్‌, కిరణ్‌ అబ్బవరం వంటి స్టార్స్‌తో సినిమాలు చేసిన పెద్దగా కలిసి రాలేదు. రీసెంట్‌గా టిల్లు స్క్వేర్‌ చిత్రంలో స్పెషల్ అప్పిరియన్స్‌ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే ఇవాళ (నవంబర్‌ 12) ప్రియాంక జావల్కర్ పుట్టిన రోజు (HBD Priyanka Jawalkar). 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె లైఫ్‌లోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; ప్రియాంక జావల్కర్‌ను చూసి హిందీ బ్యూటీ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆమె అచ్చ తెలుగు అమ్మాయి.&nbsp; ఏపీలోని అనంతపురంలో 1992 నవంబర్‌ 12 ప్రియాంక జన్మించింది. హైదరాబాద్‌లో ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సు చదివింది. ఆపై స్టాటిస్టిక్స్‌లో 8 నెలల కోర్సు చేసేందుకు అమెరికా వెళ్లింది. అది పూర్తయ్యాక ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో ఆరు నెలల పాటు జాబ్‌ చేసింది.&nbsp; ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో తన ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం మెుదలు పెట్టింది. అవి చూసి ఇంప్రెస్ అయిన ‘కలవరం ఆయె’ టీమ్‌.. ఆమెకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చింది.&nbsp; అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్‌ కాలేదు. కానీ ఈ అమ్మడు అందం, అభినయానికి మాత్రం తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.&nbsp; దీంతో విజయ్‌ దేవరకొండ సరసన ‘టాక్సీవాలా’లో అమ్మడికి ఛాన్స్‌ దొరికింది. ఆ సినిమా సాలిడ్‌ హిట్ అందుకోవడంతో ప్రియాంక పేరు మార్మోగింది.&nbsp; ఆ సినిమా సక్సెస్‌తో ఈ అమ‌్మడికి ఇక తిరుగుండదని అంతా భావించారు. కానీ అనూహ్యంగా తన నెక్స్ట్‌ సినిమా రిలీజ్‌కు ప్రియాంక మూడేళ్ల సమయం తీసుకుంది.&nbsp; టాక్సీవాల సక్సెస్‌ తర్వాత సరైన కథల కోసం ఎదురుచూసినట్లు ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక జావల్కర్‌ తెలిపింది. ఈ క్రమంలో 25 స్టోరీలను రిజెక్ట్ చేసినట్లు చెప్పింది.&nbsp; ‘టాక్సీవాలా’ తర్వాత సత్యదేవ్‌తో చేసి ‘తిమ్మరుసు’ మూవీ చేసింది. ఇది కూడా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇందులో ప్రియాంక నటనకు మరోమారు ఆడియన్స్ ఫిదా అయ్యారు.&nbsp; దాని తర్వాత కిరణ్‌ అబ్బవరంతో చేసిన ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’ కూడా మంచి విజయాన్ని అందుకుంది.&nbsp; ‘తిమ్మరుసు’, ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’ చిత్రాలు ఒకే వారంలో రిలీజ్‌ కావడం విశేషం. తను చేసిన రెండు మూవీస్‌ సెక్సెస్‌ సాధించడంతో ఈ అమ్మడి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ‘తిమ్మరుసు’ సినిమాలో బొద్దుగా కనిపించడంతో ప్రియాంకపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఆమె శరీరాకృతి కొందరు విమర్శలు గుప్పించారు.&nbsp; అయితే ట్రోల్స్‌, గాసిప్స్‌ గురించి తాను అస్సలు పట్టించుకోనని ప్రియాంక జావల్కర్‌ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. తనపై వచ్చే గాసిప్స్‌ను ఫ్రెండ్స్‌కు షేర్‌ చేసి మరి సంతోషిస్తానని తెలిపింది.&nbsp; ఆ తర్వాత ‘గమనం’ అనే ఆంథాలజీ ఫిల్మ్‌లో ప్రియాంక నటించింది. అందులో జారా అనే ముస్లిం యువతి పాత్రలో ఆకట్టుకుంది.&nbsp; ఈ ఏడాది సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'టిల్లు స్క్వేర్‌'లో ఈ అమ్మడు స్పెషల్ క్యామియో ఇచ్చింది. పబ్‌ సీన్‌లో హాట్‌ హాట్‌గా కనిపించి కుర్రకారు హృదయాలను మెలిపెట్టింది.&nbsp; ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ అంటే తనకు క్రష్‌ అని ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పుష్ప చిత్రం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపింది. ప్రియాంక జావల్కర్‌కు బాగా ఇష్టమైన నటి ఐశ్వర్యరాయ్‌. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ అమ్మడు అనర్గళంగా మాట్లాడగలదు.&nbsp; ఈ భామ ఫేవరేట్‌ కలర్స్‌ రెడ్‌, బ్లాక్‌. న్యూయార్‌ అంటే తనకు చాలా ఇష్టమని ఓ ఇంటర్వూలో తెలిపింది.&nbsp; సినిమాల విషయానికి వస్తే భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తానని ప్రియాంక తెలిపింది. అయితే మలాయళంలో వచ్చిన 'ది గ్రేట్ ఇండియన్‌ కిచెన్‌' అంటే బాగా ఇష్టమని తెలిపింది. ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్స్‌ చేతిలో లేకపోవడంతో ప్రియాంక సోషల్‌ మీడియాపై ఈ అమ్మడు ఫోకస్‌ పెట్టింది. హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.&nbsp; ప్రస్తుతం ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 2.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ అమ్మడు ఏ ఫొటో షేర్‌ చేసిన వెంటనే ట్రెండింగ్ చేస్తున్నారు.&nbsp;
    నవంబర్ 12 , 2024
    <strong>Vijay Devarakonda: ఈ తరం గొప్ప నటుడు విజయ్ దేవరకొండ: త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్</strong>
    Vijay Devarakonda: ఈ తరం గొప్ప నటుడు విజయ్ దేవరకొండ: త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో ‘విజయ్‌ దేవరకొండ’ (Vijay Devarakonda) ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా అతడ్ని ఫ్యాన్స్‌ అభిమానిస్తుంటారు. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy), ‘టాక్సీవాలా’ (Taxiwala), ‘గీతాగోవిందం’ (Geetha Govindam) హిట్స్‌తో స్టార్‌ స్టేటస్‌ అందుకున్నాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక విజయ్‌ ఇబ్బంది పడుతున్నాడు. అతడు చేసిన గత మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ దారుణంగా విఫలమయ్యాయి. దీంతో అతడిపై ట్రోల్స్‌, విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఫిల్మ్ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండపై దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ప్రస్తుతం అది టాలీవుడ్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారింది.  ‘ప్రేమతో పాటు ద్వేషమూ చూశాడు’ మ‌లయాళ న‌టుడు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'లక్కీ భాస్కర్‌' (Lucky Bhaskar). వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో త్రివిక్రమ్‌ మాట్లాడుతూ నటుడు విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ తరం గొప్పనటులు అంటూ ఆకాశానికెత్తారు. అంతేకాదు తాను అభిమానించే నటుల్లో విజయ్‌ ఒకరని వ్యాఖ్యానించారు. 'విజయ్ ఎంతో ప్రేమ చూశాడు. అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూసాడు. బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి న‌వ‌ల‌లో ఒక లైన్ ఉంటుంది. మావాడే మ‌హాగ‌ట్టివాడ‌ని. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు అది వ‌ర్తిస్తుంది. మా వాడు మహా గట్టోడు' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  https://www.youtube.com/watch?v=PhzeAy5OUl8 ‘ఖలేజా బాలేదంటే కొట్లాటే’ ‘లక్కీ భాస్కర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) సైతం మాట్లాడారు. దర్శకుడు త్రివిక్రమ్‌ గురించి ప్రస్తావిస్తూ క్రేజీ కామెంట్స్ చేశాడు. పెళ్లి చూపులు హిట్ అయిన తర్వాత తన ఫస్ట్‌ చెక్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తరపున త్రివిక్రమ్‌ ఇచ్చినట్లు చెప్పారు. చెక్ ఇస్తూ నువ్వు స్టార్‌ అవుతావని చెప్పారని పేర్కొన్నారు. ఆరోజు త్రివిక్రమ్ గారిని కలవడం తన లైఫ్‌లో ఒక బిగ్ మూమెంట్ అని చెప్పుకొచ్చాడు. ‘మన్మథుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘జల్సా’ చిత్రాలు ఎంత క్రేజ్ సంపాదించుకున్నాయో మన జనరేష్‌కు బాగా తెలుసాని అన్నాడు. అంతేకాదు త్రివిక్రమ్ డైరెక్ట్‌ చేసిన ‘అతడు’, ‘ఖలేజా’ తన ఫేవరేట్స్ అని తెలిపాడు. ‘ఖలేజా’ను ఎవరైనా ఫ్లాప్ అంటే వారితో కొట్లాడేవాడినని వివరించాడు.&nbsp; https://twitter.com/oneindiatelugu/status/1850807211817369676 దుల్కర్‌ - విజయ్‌ మల్టీస్టారర్‌ లక్కీ భాస్కర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు తన బ్రదర్ దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) కోసం వచ్చానని నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) వ్యాఖ్యానించారు. ‘కల్కి’, ‘మహానటి’ సినిమాల్లో తామిద్దరం నటించిన విషయాన్ని గుర్తుచేశాడు. కానీ తమ ఇద్దరి కాంబినేషన్ సీన్స్‌ పడలేదని పేర్కొన్నాడు. గతంలో ఓ డైరెక్టర్ దుల్కర్ తనతో మల్టీస్టారర్‌ చేయాలని భావించినట్లు చెప్పాడు. అప్పుడు చెన్నైలో కలిసి కథ కూడా విన్నట్లు చెప్పాడు. కానీ ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదని పేర్కొన్నాడు. భవిష్యత్‌లో కలిసి సినిమా చేయోచ్చేమే అంటూ ఒక్కసారిగా ఆడియన్స్‌లో హైప్‌ క్రియేట్ చేశాడు. https://twitter.com/ihsan21792/status/1850579970093129862 పెళ్లి చూపులు కాంబో రిపీట్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్ భాస్కర్‌ రూపొందించిన 'పెళ్లి చూపులు' చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ మూవీ తర్వాత వీరిద్దరు కలిసి మరో చిత్రం చేయలేదు. ఇప్పుడు అందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో విజయ్‌ హీరోగా మరో సినిమా రాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే విజయ్‌కు కథ కూడా చెప్పేశాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ చేసేందుకు రౌడీ బాయ్‌ కూడా ఓకే చెప్పాడని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ ఉంది. యాక్షన్‌తో పాటు, తరుణ్‌ స్టైల్‌ ఆఫ్‌ కామెడీతో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. కాగా, విజయ్‌ ప్రస్తుతం ‘VD12’ ప్రాజెక్ట్ చేస్తున్నారు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.  విజయ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌! ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘VD12’తో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్‌’ తర్వాత విజయ్‌తో దిల్‌రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అలాగే డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ మరో ప్రాజెక్ట్‌ చేయనున్నాడు. పీరియాడికల్‌ జానర్‌లో రాయల సీమ బ్రాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముంది. తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లోనూ మూవీ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో విజయ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌పై ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.&nbsp;
    అక్టోబర్ 28 , 2024
    <strong>Vijay Devarakonda: ఏ తెలుగు హీరో చేయని ఫీట్ చేసిన విజయ్ దేవరకొండ.. ఏమిటంటే?</strong>
    Vijay Devarakonda: ఏ తెలుగు హీరో చేయని ఫీట్ చేసిన విజయ్ దేవరకొండ.. ఏమిటంటే?
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్‌ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్‌ నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీతా గోవిందం’ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌లో విజయ్ కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు. ఫొటోగ్రాఫర్‌గా మారి బాలీవుడ్‌ నటితో రొమాన్స్‌ చేశాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘సాహిబా’ వచ్చేసింది.. మ్యూజిక్‌ కంపోజర్‌, సింగర్‌ జస్లీన్‌ రాయల్‌ (Jasleen Royal) రూపొందించిన 'హీరియో' సాంగ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యింది. దాని తర్వాత ఆమె కంపోజ్‌ చేసిన మరో కొత్త సాంగ్‌ 'సాహిబా' (Sahiba Music Album) తాజాగా మ్యూజిక్‌ లవర్స్‌ ముందుకు వచ్చింది. ఇందులో రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వింటేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో మ్యూజిక్‌ లవర్స్‌ హృదయాలను హత్తుకునేలా ఈ ఆల్బమ్‌ ఉంది. ఈ సాంగ్‌లో విజయ్‌ ఫొటోగ్రాఫర్‌గా కనిపించగా బాలీవుడ్‌ నటి రాధిక మదన్ (Radhika Madan) రాజవంశానికి చెందిన రాకుమారిగా చేసింది. ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ సాంగ్‌లో విజయ్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సాంగ్‌ మధ్యలో ముస్లిం కాస్ట్యూమ్‌లో కనిపించి ఔరా అనిపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. సాహీబా ఆల్బమ్‌ సెన్సేషన్‌ కావడం పక్కా అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. https://www.youtube.com/watch?v=NW6Dgax2d6I&amp;t=224s హీరియోను తలదన్నేలా.. గత కొద్ది రోజుల క్రితం సింగర్ జస్లీన్ విడుదల చేసిన ‘హీరియే’ ఆల్బమ్ (Heeriye Music Album) అద్భుతంగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగించింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ మ్యూజిక్ లవర్స్‌ను అలరించేందుకు ‘సాహిబా’ను జస్లీన్‌ రాయల్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ, రాధిక మదన్ కెమిస్ట్రీ మరో లెవెల్లో ఉందని చెప్పవచ్చు. ఈ ఆల్బమ్&nbsp; ‘హీరియే’ సాంగ్‌ను మించి హిట్ అవుతుందని విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు మ్యూజిక్ లవర్స్ అంచనా వేస్తున్నారు.&nbsp; https://twitter.com/jasleenroyal/status/1855857071662711025 బాలయ్య వాయిస్‌ ఓవర్‌! రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం 'జెర్సీ' ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'VD 12' వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. విజయ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ సినిమాగా ఇది రాబోతోంది. ఈ సినిమాలో విజయ్‌ రగ్‌డ్‌ లుక్‌లో సరికొత్త మాస్‌ అవతారంతో కనిపించబోతున్నాడు. ఇందులో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse), రుక్మిణీ వసంత్‌ (Rukmini Vasanth) నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలో రిలీజ్‌ కానున్న ఈ మూవీ టీజర్‌కు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వాయిస్‌ ఓవర్‌ అందిస్తారని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్‌ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు.&nbsp; విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం విజయ్‌ వరుస ఫ్లాప్‌తో ఇబ్బందిపడుతున్నాడు. ఆయన రీసెంట్‌ చిత్రాలు లైగర్‌, ఖుషీ, ఫ్యామిలీ స్టార్‌ బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి. దీంతో ఎలాగైన హిట్‌ కొట్టాలన్న కసితో విజయ్ ఉన్నాడు. ప్రస్తుతం విజయ్‌ చేతిలో 'VD 12'తో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. 'ఖుషీ' తర్వాత దిల్‌ రాజు నిర్మాణంలో మరో ప్రాజెక్ట్‌ను విజయ్‌ అనౌన్స్‌ చేశాడు. దీనిని యంగ్‌ డైరెక్టర్‌ 'రాజావారు రాణివారు' ఫేమ్ రవికిరణ్‌ కోలా (Ravi Kiran Kola) తెరకెక్కించనున్నాడు. అలాగే రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో ఒక పీరియాడికల్ యాక్షన్‌ డ్రామా కూడా రౌడీ బాయ్‌ చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.&nbsp;
    నవంబర్ 15 , 2024
    <strong>VD 12: శ్రీలంకలో చిల్ అవుతున్న విజయ్‌ దేవరకొండ.. బోట్‌ నడుపుతున్న వీడియో వైరల్‌!&nbsp;</strong>
    VD 12: శ్రీలంకలో చిల్ అవుతున్న విజయ్‌ దేవరకొండ.. బోట్‌ నడుపుతున్న వీడియో వైరల్‌!&nbsp;
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్‌ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్‌ నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించాడు. అటువంటి విజయ్‌కు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్‌’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూట్‌ శ్రీలంకలో జరుగుతుండగా అక్కడ విజయ్‌ చిల్ అవుతున్నాడు.&nbsp; బోట్‌ నడుపుతూ విజయ్‌ చిల్‌! విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో 'VD 12' తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శ్రీలంకలో శరవేగంగా సాగుతోంది. విజయ్ సరికొత్త లుక్‌లో ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అదే సమయంలో షూటింగ్‌ గ్యాప్‌లో తెగ చిల్‌ అవుతున్నాడు. నీటిలో బోట్‌ రైడ్‌ చేస్తూ విజయ్‌ ఎంజాయ్‌ చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సూర్యస్తమయ సమయంలో బోట్‌ రైడ్‌ చేస్తున్న వీడియోను విజయ్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నారు. విజయ్ ఫ్యాన్స్ ఈ వీడియోను విపరీతంగా షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. బోట్ డ్రైవింగ్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) రెండు భాగాలుగా.. 'VD 12' చిత్రానికి సంబంధించి ఇటీవల నిర్మాత నాగవంశీ మాట్లాడారు. దీన్ని రెండు పార్టులుగా అందించనున్నట్లు తెలిపారు. ‘విజయ్‌ దేవరకొండ సినిమా విషయంలో నేను రిస్క్ తీసుకోవడం లేదు. రెండు పార్టులకు సరిపోయే కంటెంట్‌ సిద్ధంగా ఉంది. మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో పార్ట్‌ తెరకెక్కిస్తాం. గౌతమ్‌ తిన్ననూరి కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. సూపర్‌ హిట్‌ అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని తెలిపారు. అయితే విజయ్‌ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రెండు భాగాలుగా రాలేదు. విజయ్‌ చేసిన చిత్రాలన్నీ సింగిల్‌ పార్ట్‌గా వచ్చినవే. నాగవంశీ చెప్పినట్లు అన్ని అనుకున్నట్లు జరిగితే విజయ్‌ కెరీర్‌లోనూ సీక్వెల్స్‌ చూసే అవకాశం లభించనుంది. పవన్‌తో పోటీ! సోమవారం (సెప్టెంబర్‌ 23) హరి హర వీర మల్లు రిలీజ్‌ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్‌ వద్ద పవన్‌, విజయ్‌ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్‌ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అదే రోజున హరిహర వీరమల్లు వస్తుండటంతో బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదని అంటున్నారు. పవన్‌ లాంటి బిగ్‌స్టార్‌ను ఢీకొట్టేందుకు తమ హీరో సిద్ధమంటూ విజయ్‌ ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్‌ చేసే అవకాశం లేకపోదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌! ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘VD12’తో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్‌’ తర్వాత విజయ్‌తో దిల్‌రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అలాగే డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ మరో ప్రాజెక్ట్‌ చేయనున్నాడు. పీరియాడికల్‌ జానర్‌లో రాయల సీమ బ్రాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముంది.&nbsp;
    సెప్టెంబర్ 24 , 2024
    <strong>VD12: విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేసే న్యూస్‌.. కెరీర్‌లోనే ఫస్ట్‌ టైమ్‌!</strong>
    VD12: విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేసే న్యూస్‌.. కెరీర్‌లోనే ఫస్ట్‌ టైమ్‌!
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్‌ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్‌ నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించాడు. అటువంటి విజయ్‌కు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్‌’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.&nbsp; రెండు భాగాలుగా.. విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోంది. 'VD 12' అనే వర్కింగ్‌ టైటిల్‌తో మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడారు. దీన్ని రెండు పార్టులుగా అందించనున్నట్లు తెలిపారు. ‘విజయ్‌ దేవరకొండ సినిమా విషయంలో నేను రిస్క్ తీసుకోవడం లేదు. రెండు పార్టులకు సరిపోయే కంటెంట్‌ సిద్ధంగా ఉంది. మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో పార్ట్‌ తెరకెక్కిస్తాం. గౌతమ్‌ తిన్ననూరి కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. సూపర్‌ హిట్‌ అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని తెలిపారు. అయితే విజయ్‌ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రెండు భాగాలుగా రాలేదు. విజయ్‌ చేసిన చిత్రాలన్నీ సింగిల్‌ పార్ట్‌గా వచ్చినవే. నాగవంశీ చెప్పినట్లు అన్ని అనుకున్నట్లు జరిగితే విజయ్‌ కెరీర్‌లోనూ సీక్వెల్స్‌ చూసే అవకాశం లభించనుంది. ఇప్పటికే ‘VD 12’పై భారీ అంచనాలు ఉండగా నాగ వంశీ కామెంట్స్‌తో ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తున్నారు. ఆకట్టుకున్న ఫస్ట్ లుక్‌! 'VD12' చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో విజయ్‌ మాస్‌ లుక్‌లో కనిపించాడు. 'విధి పిలిచింది.. రక్తపాతం ఎదురుచూస్తోంది.. కొత్త రాజు ఉద్భవిస్తాడు' అని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు ఆసక్తికరమై క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు తమ టీమ్‌ ఎంతో కష్టపడుతోందని లీకైన కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని ఈ సందర్భంగా చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది.&nbsp; డ్యుయల్‌ రోల్‌లో..! ‘VD 12’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అస్పష్టంగా ఉన్న ఖాకీ డ్రెస్‌ పోస్టర్‌ను సైతం గతంలో అధికారికంగా రిలీజ్‌ చేసింది. అయితే తాజాగా రిలీజైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చూస్తే విజయ్‌ దేవరకొండ ఊర మాస్‌ లుక్‌లో కనిపించాడు. ఒక లోకల్‌ గ్యాంగ్‌స్టర్‌ను తలపించాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్‌ ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేదా ఒకే పాత్రను రెండు డైమన్షన్స్‌లో దర్శకుడు చూపించబోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా విజయ్ లుక్‌ చూస్తే థియేటర్‌లో మాస్‌ జాతర కన్ఫార్మ్ అని స్పష్టమవుతోంది.&nbsp; విజయ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌! ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘VD12’ కాకుండా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్‌’ తర్వాత విజయ్‌తో దిల్‌రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అలాగే డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ మరో ప్రాజెక్ట్‌ చేయనున్నాడు. పీరియాడికల్‌ జానర్‌లో రాయల సీమ బ్రాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముంది.&nbsp;
    ఆగస్టు 05 , 2024
    <strong>VD12 Leaked Pic: ‘VD12’ సెట్‌ నుంచి విజయ్‌ దేవరకొండ ఫొటో లీక్‌.. నెట్టింట రచ్చ రచ్చ!&nbsp;</strong>
    VD12 Leaked Pic: ‘VD12’ సెట్‌ నుంచి విజయ్‌ దేవరకొండ ఫొటో లీక్‌.. నెట్టింట రచ్చ రచ్చ!&nbsp;
    యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు యూత్‌లో ఏ స్థాయి క్రేజ్‌ ఉందో అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో స్టార్‌ హీరోల స్థాయికి ఎదిగాడు. అయితే గత కాలంగా ఇండస్ట్రీలో విజయ్‌కు కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్‌’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్దగా దారుణంగా విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ సెట్‌ నుంచి ఓ ఫొటో లీకైంది. ఇందులో విజయ్‌ దేవరకొండ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.&nbsp; విజయ్‌ పిక్‌ వైరల్‌! విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' చిత్రం రూపొందుతోంది. స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో షూటింగ్‌ సెట్‌ నుంచి విజయ్‌ దేవరకొండకు సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇందులో బైక్‌పై వెనక కూర్చుని మాస్‌ లుక్‌లో కనిపించాడు. తలపై లైట్‌ హెయిర్‌, ముఖాన గడ్డంతో మెస్మరైజ్‌ చేసేలా అతడి లుక్‌ ఉంది. ఇది చూసిన విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌తో సంతోషంతో ఊగిపోతున్నారు. మరో బ్లాక్‌బాస్టర్‌ లోడింగ్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ఫొటోను విపరీతంగా షేర్‌ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/king_ntr9999/status/1815611065381896259 థియేటర్లు బద్దలే! ‘VD 12’ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. విజయ్‌ మాస్‌లుక్‌కు అనిరుధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు తోడైతే ధియేటర్లు బద్దలు కావాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాదు ‘VD 12’లో విజయ్‌ లుక్‌ చూస్తుంటే ‘యువ’ సినిమాలో మాధవన్‌ గుర్తుకు వస్తున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రానికి శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అనివార్య కారణాలతో ఆమె ప్లేస్‌లో భాగ్యశ్రీని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె షూటింగ్‌లోనూ పాల్గొంటున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.&nbsp; https://twitter.com/Rebelstarpr/status/1815667163178656207 డ్యుయల్‌ రోల్‌లో రౌడీ బాయ్‌! ‘VD 12’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అస్పష్టంగా ఉన్న ఖాకీ డ్రెస్‌ పోస్టర్‌ను సైతం అధికారికంగా రిలీజ్‌ చేసింది. అయితే తాజాగా లీకైన ఫొటోను చూస్తే విజయ్‌ దేవరకొండ ఊర మాస్‌ లుక్‌లో కనిపించాడు. ఒక లోకల్‌ గ్యాంగ్‌స్టర్‌ను తలపించాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్‌ ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేదా ఒకే పాత్రను రెండు డైమన్షన్స్‌లో దర్శకుడు చూపించబోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా లీకైనా విజయ్ లుక్‌ చూస్తే థియేటర్‌లో మాస్‌ జాతర కన్ఫార్మ్ అని స్పష్టమవుతోంది.&nbsp; క్యూట్‌ లవ్‌స్టోరీ! విజయ్‌ దేవరకొండ ‘VD 12’తో పాటు మరో ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. దర్శకుడు రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీకి దిల్‌రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవి (Sai Pallavi) తీసుకోవాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయిపల్లవిని సంప్రదించగా ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఇటీవల టాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.&nbsp;
    జూలై 23 , 2024
    Vijay Deverakonda: ఆ రోజు చాలా బాధపడ్డా… కానీ ఇప్పుడు 400 మిలియన్ల లవ్ సాధించా
    Vijay Deverakonda: ఆ రోజు చాలా బాధపడ్డా… కానీ ఇప్పుడు 400 మిలియన్ల లవ్ సాధించా
    నేషనల్ క్రష్ రష్మిక మంధాన(Rashmika Mandanna), రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫేయిర్‌ అంటే తెలుగులో ఓ ట్రెండ్ సెట్ చేసింది. వీరు చేసింది రెండు సినిమాలే అయినా సిల్వర్ స్క్రీన్‌ పేయిర్‌గా గుర్తింపు పొందారు. అంతలా వీరి మధ్య కెమిస్ట్రీ కుదురిందని చెప్పవచ్చు. వీరిద్దరు కలిసి నటించినా తొలి చిత్రం 'గీతా గోవిందం'బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఏకంగా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను పరుశురామ్ తెరకెక్కించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాణం అయింది. ఈ చిత్రంలో విజయ్- రష్మిక జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.&nbsp; మరో సినిమా వీరి కాంబినేషన్‌లో రావాలని ఆశపడ్డారు.దీంతో ఈ జోడి మళ్లి కలిసి పనిచేసింది. యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ డియర్ కామ్రెడ్(Dear Comrade) చిత్రాన్ని రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని&nbsp; మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై&nbsp; నిర్మించారు.మించారు.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించాయి. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో సూపర్బ్‌గా నటించాడు. అవుట్‌ అండ్ అవుట్ యాక్షన్‌ సీక్వెన్స్‌తో అలరించాడు. ఈ చిత్రంలో లిల్లి క్యారెక్టర్‌లో రష్మిక మంధాన క్రికెటర్‌గా అద్భుతంగా నటించింది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లకు ప్రేక్షకులు విజిల్స్ వేశారు. ఇద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను కదిలించాయి. ఈ సినిమా తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. సోషల్ మీడియాలో విజయ్ యాంటి ఫ్యాన్స్ ఈ సినిమాపైన కూడా ట్రోల్స్ మొదలు పెట్టారు. అయితే అవేమీ విజయ్ సక్సెస్‌ను ఆపలేకపోయాయి. ఈ థియేటర్లలో రాణించకపోయినప్పటికీ.. ఓటీటీలో దుమ్ము రేపింది. డబ్ అయిన అన్ని భాషల్లో మంచి టాక్ సంపాదించి విజయం సాధించింది. డియర్ కామ్రెడ్ రికార్డు.. తాజాగా.. డియర్ కామ్రెడ్ హిందీ డబ్‌డ్‌ వెర్షన్ రికార్డు క్రియేట్ చేసింది.&nbsp; హిందీలో డబ్ అయిన ఈ చిత్రం యూట్యూబ్‌లో ఏకంగా&nbsp; 40 కోట్ల ప్లస్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇదే విషయాన్ని డియర్ కామ్రెడ్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్‌ ద్వారా తన సంతోషాన్ని ట్వీట్ చేసింది. తెలుగులో ఈ సినిమా కథాంశం ప్రేక్షకులకు ఎక్కకున్నా హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. విజయ్- రష్మిక బాండింగ్ సూపర్బ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు విజయ్ నుంచి రావాలని మెసెజేస్ పెడుతున్నారు. &nbsp; ఈ విషయాన్నీ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది. ఆ రోజు బాధపడ్డాం.. మరోవైపు విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపాడు. 400 మిలియన్ లవ్&nbsp; సాధించాము. 2019లో డియర్ కామ్రెడ్ విడుదలైన రోజున కొంత బాధపడ్డాం. కానీ ఇప్పుడు 400 మిలియన్‌ లవ్ మమ్మల్ని తడిసి ముద్ధచేసింది.&nbsp; ఎన్ని సినిమాలు వచ్చినా తన లైఫ్‌లో డియర్ కామ్రెడ్ చిత్రం ప్రత్యేకమంటూ రాసుకొచ్చాడు. ఇదే పోస్ట్‌ను రష్మిక మంధానకు సైతం ట్యాగ్ చేశాడు. రష్మిక మంధాన సైతం దీనిపై స్పందించింది. విజయ్ దేవరకొండ పోస్ట్ స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టా రీల్‌లో పోస్ట్ చేసింది. విజయ్ బిజీ బిజీ ఇక ఇదిలా ఉంటే విజయ దేవరకొండ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫెమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న VD12 చిత్రాన్ని విజయ్ చేస్తున్నాడు. ఈ సినిమా పిరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకీర్తయన్ డెరెక్షన్‌లో VD14 చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ది లెజెండ్ ఆఫ్ కర్స్‌డ్ ల్యాండ్ అంటూ ఈ సినిమా ట్యాగ్ లైన్‌ ఉంది. ఈ రెండు సినిమాలు విజయ్ కెరీర్‌కు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో ఈ సినిమాలను చాలా జాగ్రత్తగా విజయ్ టెకప్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరోవైపు రష్మిక మంధాన పుష్ప2 ప్రమోషన్‌లో బిజీగా ఉంది. యానిమల్ సినిమా సక్సెస్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లో అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లైన చావా(హిందీ), కుబెరా(తమిళ్) సినిమాల్లో నటిస్తోంది.
    జూన్ 15 , 2024
    Vijay- Sukumar Movie: డైరెక్టర్‌ సుకుమార్‌తో విజయ్‌ దేవరకొండ&nbsp; కొత్త చిత్రం?
    Vijay- Sukumar Movie: డైరెక్టర్‌ సుకుమార్‌తో విజయ్‌ దేవరకొండ&nbsp; కొత్త చిత్రం?
    రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)కు గత కొన్ని ఏళ్లుగా కలిసి రావడం లేదు. ఆయన గత మూడు చిత్రాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోవడంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఆందోళనలో పడ్డారు. అయితే ఈ హీరో కొత్తగా ప్రకటిస్తున్న ప్రాజెక్ట్స్‌ మాత్రం అతడి ఫ్యూచర్‌ మూవీస్‌పై ఎంతో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల విజయ్‌ ఓ పిరియాడికల్‌ మూవీలో నటిస్తున్న ప్రకటించాడు. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రాబోతున్న చిత్రంలో పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ కనిపించనున్నాడు. ఇక లేటెస్ట్‌గా వచ్చిన అప్‌డేట్‌ ప్రకారం స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌తో రౌడీ బాయ్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.&nbsp; ‘విజయ్‌ - సుకుమార్‌ మూవీ పక్కా..’ విజయ్‌ దేవరకొండతో సుకుమార్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు నిర్మాత కేదార్‌ సెలగంశెట్టి (Kedar Selagamsetty) చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటించిన 'గం గం గణేశా' చిత్రానికి కేదార్‌ నిర్మాతగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన.. విజయ్‌ దేవరకొండ, సుకుమార్‌ కాంబోలో ఓ సినిమా రానున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కచ్చితంగా ఉంటుందని నిర్మాత స్పష్టం చేశారు. ఇది విన్న విజయ్ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.&nbsp; Sukumar : Vijay Deverakonda's film will be there. I thought this year RamCharan and Sukumar film might be in progress but didn't happen, Pushpa2 is in progress. Currently, our project [ VD, Sukumar ] will take more time to go on floors, Sukumar Garu after completing his current… pic.twitter.com/2yNpn4tyhG— RatpacCheck (@RatpacCheck) May 20, 2024 గతంలోనే ప్రకటన విజయ్‌ దేవరకొండ, సుకుమార్‌ కాంబోలో కొద్ది సంవత్సరాల క్రితమే ఓ సినిమా రాబోతున్నట్లు ప్రకటన వెలువడింది. నిర్మాత కేదార్‌ సెలగంశెట్టి నేతృత్వంలోని ఫాల్కన్‌ నిర్మాణ సంస్థ వీరి కాంబోలో సినిమా తీసేందుకు అప్పట్లో ప్రయత్నించింది. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే ‘పుష్ప 2’ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని భావించినా సుకుమార్‌.. రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించడంతో ఇక విజయ్‌తో సినిమా లేనట్లేనని సినీ వర్గాలు భావించాయి. అయితే లేటెస్ట్‌గా విజయ్‌-సుకుమార్‌ సినిమా ఉంటుందని నిర్మాత ప్రకటించడం ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; 2026 తర్వాతే..! ప్రస్తుతం డైరెక్టర్‌ సుకుమార్‌.. 'పుష్ప 2' సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ విడుదల తేదీ (ఆగస్టు 15) దగ్గర పడుతుండటంతో శరవేగంగా షూటింగ్‌ నిర్వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంటనే రామ్‌చరణ్‌తో సినిమా మెుదలవుతుంది. చరణ్‌తో మూవీ కంప్లీట్‌ అయిన తర్వాత విజయ్‌తో సుకుమార్‌ సినిమా చేయనున్నట్లు నిర్మాత కేదార్‌ సెలగంశెట్టి తెలిపారు. దీని ప్రకారం విజయ్‌ - సుకుమార్‌ మూవీ పట్టాలెక్కడానికి ఎట్టలేదన్న 2026 వరకూ ఆగాల్సిందేనని టాక్‌ వినిపిస్తోంది. పైగా పుష్ప 3 కూడా ఉండొచ్చని గతంలో బన్నీ ప్రకటించిన నేపథ్యంలో విజయ్‌ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.&nbsp; విజయ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star) తర్వాత విజయ్‌ దేవరకొండ తన నెక్స్ట్‌ ఫిల్మ్‌ను ‘జెర్సీ’ (Jersey) దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరితో కలిసి చేస్తున్నాడు. ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు విజయ్‌ ఓకే చెప్పాడు. ‘టాక్సీవాలా’ (Taxiwaala) ఫేమ్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌తో కలిసి విజయ్‌ ఓ పిరియాడికల్‌ మూవీ చేయబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా పోస్టర్‌ రిలీజ్‌ కాగా అది అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే దిల్‌రాజు నిర్మాతగా రవి కిరణ్‌ కోలాతో కలిసి ఓ యాక్షన్‌ డ్రామా సైతం విజయ్‌ చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాత సుకుమార్‌తో విజయ్‌ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.&nbsp;
    మే 21 , 2024
    Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్‌… స్టోరీ ఇదేనా?
    Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్‌… స్టోరీ ఇదేనా?
    ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy)తో ఒక్కసారిగా స్టార్‌ హీరోగా మారిన విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star)తో వచ్చి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ను మూటగట్టుకుంది. ఇదనే కాదు విజయ్‌ చేసిన గత మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో విజయ్‌ తన క్రేజ్‌ నిలబెట్టుకోవాలంటే సూపర్ హిట్‌ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ యంగ్‌ హీరో తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఇవాళ విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.  హిస్టారికల్‌ మూవీ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda New Movie), డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో 'VD14' సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి విజయ్‌ బర్త్‌డే సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది. ఓ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహం ఉంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని దీని గురించి తెలిపారు. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని పోస్టర్ పై వేశారు. 'ఇతిహాసాలు రాయలేదు.. అవి యోధుల రక్తంలో ఇమిడిపోయాయి' అంటూ మేకర్స్ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు.  https://twitter.com/MythriOfficial/status/1788443050177659232 భారీ అంచనాలు 'VD14' (Vijay Deverakonda Periodical Movie) చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ పోస్టర్‌లో ప్రస్తుతం సెన్సేషన్‌గా మారింది. హీరో విజయ్‌ తొలిసారి చేయనున్న హిస్టారికల్‌ సినిమా కావడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. అటు విజయ్‌ ఫ్యాన్స్‌ కూడా కొత్త మూవీ పోస్టర్‌ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ ఫ్లాపులకు ఈ సినిమా బ్రేక్స్ వేస్తుందని ఇప్పటినుంచే ధీమా వ్యక్తం వేస్తున్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ గతంలోనూ విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేశాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాహుల్‌ చేసిన శ్యామ్ సింగరాయ్‌ మూవీ కూడా తెలుగు ఆడియన్స్‌ విశేషంగా ఆకట్టుకుంది.  ‘VD12’ నుంచి అప్‌డేట్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ.. గౌతం తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో 'VD12' చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా, ఇవాళ విజయ్ బర్త్‌డే పురస్కరించుకొని దర్శక నిర్మాతలు విషెస్‌ చెప్పడంతో పాటు ఓ పోస్టర్‌ ద్వారా షూటింగ్ అప్‌డేట్‌ను కూడా ఇచ్చారు. వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ చిత్రీకరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక భారీ సీక్వెన్స్‌కు సంబంధించిన షూటింగ్‌ జరుగుతున్నట్లు తెలియజేశారు. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. VD12 వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.  https://twitter.com/SitharaEnts/status/1788428225003278352 విజయ్‌ డేరింగ్ డెసిషన్‌! 'VD12' సినిమా కోసం హీరో విజయ్‌ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు.  ఈ సినిమాలో ఒక్క పాట లేకుండా నటించేందుకు విజయ్‌ సిద్ధపడినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉన్నట్లు టాలీవుడ్‌లో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో విజయ్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టులో పాటలు పెడితే కథనం, మూవీ ఫ్లేవర్‌ దెబ్బతింటాయని డైరెక్టర్‌ గౌతమ్‌ భావిస్తున్నారట. దీంతో పాటలు లేకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్‌ చేద్దామని విజయ్‌తో ఆయన అన్నాడట. ఇందుకు విజయ్‌ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. 
    మే 09 , 2024
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    ప్రేమ కథా చిత్రాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కల్ట్‌ లవ్‌ స్టోరీలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఆయా సినిమాలతో పాటు అందులోని పాటలూ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి కొన్ని మెలోడి సాంగ్స్‌ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించాయి. ఆ పాటలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో అవి తప్పక ఉంటాయి. అటు యూట్యాబ్‌లోనూ అత్యధిక వ్యూస్‌తో ఆ సాంగ్స్‌ దూసుకెళ్తున్నాయి. ఇంతకీ ఆ యూత్‌ఫుల్‌ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. మాష్టారు మాష్టారు ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్‌ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులోని ‘మాష్టారు మాష్టారు’ పాట విశేష ఆదరణ పొందింది. ఈ తరం యువత ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. అటు యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్ ‌అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 70 మిలియన్ల మంది ఈ సాంగ్‌ను వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 2. నీ కన్ను నీలి సముద్రం ఉప్పెన సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్‌ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ పాట చాలమందికి ఫేవరేట్. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా జావేద్ అలీ ఆ సాంగ్‌ పాడారు. యూట్యూబ్‌లో 39 మిలియన్ల మంది ఈ పాటను చూశారు.&nbsp; https://www.youtube.com/watch?v=zZl7vDDN8Ek 3. చిట్టి నీ నవ్వంటే&nbsp; జాతి రత్నాలు సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే’ పాట యూత్‌ను ఎంతగానో ఆకర్షించింది.&nbsp;రాధన్ సంగీతం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటను యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా రాశారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను ఏకంగా 145 మిలియన్ల మంది వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=uvCbZxYdLuU 4. ఇంకేం ఇంకేం కావాలి విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ సాంగ్‌ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అటు యూట్యూబ్‌లో ఈ పాటకు 155 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. https://www.youtube.com/watch?v=cC8AmhPUJPA 5. అడిగా అడిగా నాని, నివేదా థామస్‌ జంటగా చేసిన సినిమా ‘నిన్నుకోరి’. ఇందులోని ‘అడిగా అడిగా’ పాట హృదయాలను హత్తుకుంటుంది. గోపి సుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు మ్యూజిక్‌ లవర్స్‌ను మెప్పించాయి.&nbsp; https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU 6. చూసి చూడంగానే 2018లో రిలీజైన ‘ఛలో’ సినిమా నాగశౌర్య కెరీర్‌లోని బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘చూసి చూడంగానే’ పాట అప్పట్లో యమా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆటోల్లోనూ, బస్‌స్టాండ్లలోనూ ఎక్కడ చూసిన ఈ సాంగ్‌ మారుమోగేది. అనురాగ్‌ కులకర్ణి, స్వరసాగర్‌ మహతి ఈ పాటను పాడారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను 205 మిలియన్ల మంది వీక్షించారు. https://www.youtube.com/watch?v=_JVghQCWnRI 7. పూలనే కునుకేయమంటా శంకర్‌ డైరెక్షన్‌లో విక్రమ్‌, అమీ జాక్సన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐ’. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ‘పూలనే కునుకేయమంటా’ అనే పాట కోట్లాది మంది హృదయాలను దోచుకుంది. హరిచరణ్, శ్రేయా ఘోషల్‌ ఎంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. అంతేగాక ఈ సాంగ్‌ను చిత్రీకరించిన లోకేషన్స్‌ కూడా ఆకట్టుకుంటాయి.&nbsp; https://www.youtube.com/watch?v=cjoz0FZ-wWs 8. మాటే వినదుగా విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన ‘టాక్సీవాలా’ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ‘మాటే వినదుగా’ పాట కూడా మ్యూజిక్ లవర్స్‌ను&nbsp; ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ సాంగ్‌ను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని వింటుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc 9. మధురమే విజయ్‌ దేవరకొండ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ‘అర్జున్‌ రెడ్డి’. ఇందులో ‘మధురమే’ పాట మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌గా గుర్తింపు పొందింది. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో విజయ్‌, హీరోయిన్‌ షాలిని పాండే రొమాన్స్‌ను తారా స్థాయిలో చూపించారు. రాధన్ సంగీతం అందించిన ఈ పాటకు సమీరా భరద్వాజ్ స్వరాన్ని అందించింది. https://www.youtube.com/watch?v=YaZuEkCgctA&amp;feature=youtu.be 10. ఎంత సక్కగున్నావే రంగస్థలం సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ పాట అందరినీ కట్టిపడేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ పాటకు సంగీతంతో పాటు స్వరాన్ని కూడా అందించారు. సమంత అందాన్ని పొగిడే క్రమంలో రామ్‌చరణ్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. యూట్యూబ్‌లో 61 మిలియన్ల మంది ఈ పాటను వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=eABViudPBFE
    మే 31 , 2023
    Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ - 10 సీక్రెట్స్
    Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ - 10 సీక్రెట్స్
    టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో విజయ్‌ స్టార్‌ హీరోగా గుర్తింపు సంపాదించాడు. ‘అర్జున్‌ రెడ్డి’కి ముందు పలు సినిమాల్లో విజయ్‌ నటించినప్పటికీ అవి చిన్న పాత్రలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో వచ్చిన అర్జున్‌ రెడ్డి… విజయ్‌ కెరీర్‌ను పీక్స్‌లో నిలబెట్టిందని చెప్పొచ్చు. ఈ సినిమా ద్వారా రౌడీ హీరో అన్న ట్యాగ్‌ను విజయ్‌ సంపాదించాడు. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. విజయ్‌ గురించి తెలియని ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు విజయ్‌ ఏం చేశాడు? అతడి కుటుంబ నేపథ్యం ఏమిటీ? రౌడీ బాయ్‌ కెరీర్‌లో చోటుచేసుకున్న టర్నింగ్‌ పాయింట్స్‌ ఏవి? వంటి టాప్‌-10 ఆసక్తికర విషయాలు మీకోసం.. 1. విజయ్‌ తండ్రి కల విజయ్‌ దేవరకొండ తండ్రి గోవర్ధన రావు.. సినిమా యాక్టర్‌ అవ్వాలని కలలు కన్నారట. దానికోసమే 1986లో మహబూబ్‌నగర్‌ నుంచి హైదరబాద్‌కు ఆయన వచ్చారు. అవకాశాల కోసం గోవర్ధన రావు కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విజయ్‌ తండ్రి తీవ్ర నిరాశ చెందాడు. కానీ కళామ్మతల్లిని విడిచిపెట్టలేదు. సినిమాల్లో ఛాన్స్‌ రాకపోతేనేం అని భావించి టెలివిజన్‌ రంగం వైపు గోవర్ధనరావు వెళ్లారు. పలు సీరియళ్లకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.&nbsp; 2. బాల నటుడిగా.. విజయ్ దేవరకొండ ఆయన తమ్ముడు ఆనంద్ ఇద్దరూ ఏపీలోని పుట్టపర్తి శ్రీసత్యసాయి ఉన్నత పాఠశాలలో చదివారు. ఈ పాఠశాలలోనే విజయ్‌ 10వ తరగతి పూర్తి చేశాడు. టీవీలు, ఫోన్లు లేని ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పాఠశాలలోనే విజయ్ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. ‘షిర్డి సాయి దివ్య కథ’ అనే సీరియల్‌లో బాల నటుడిగా విజయ్‌ మెరిశాడు. అందులో ఒక డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నాడు. అయితే విజయ్‌ స్టార్‌ హీరోగా మారిన తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అయింది.&nbsp; https://youtu.be/iQYaUQ55mo8 3. ఇంగ్లీష్‌ టీచర్‌గా.. విజయ్‌ తల్లి మాధవికి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అందులో విజయ్‌ ఇంగ్లీష్‌ క్లాసులు చెప్పేవాడు. అయితే విజయ్‌ తరచూ క్లాసులకు డుమ్మా కొట్టేవాడు. ఇది గమనించిన తండ్రి గోవర్ధనరావు ఓ రోజు విజయ్‌ను కూర్చోబెట్టి మాట్లాడారు. కెరీర్‌ పరంగా నీకున్న ఆసక్తి ఏంటో చెప్పాలని విజయ్‌ను కోరారు. దీనికి బదులిచ్చిన విజయ్‌ తనకు సినిమాలపై ఇంట్రస్ట్‌ ఉన్నట్లు తెలియజేశాడు. విజయ్‌ మాటలతో సంతోషించిన తండ్రి వెంటనేే అతడ్ని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేర్పించాడు.&nbsp; 4. నటనలో ఓనమాలు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన అనంతరం 3 నెలల పాటు నటనలోని ఓనమాలను విజయ్‌ అవపోసనపట్టాడు. అనంతరం పలు స్టేజీ ప్రదర్శనలు సైతం ఇచ్చాడు. అసైన్‌మెంట్‌లో భాగంగా ‘మేడం మీరేనా’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను కూడా విజయ్ నిర్మించాడు. ఆ తర్వాత కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో ఈ రౌడీ బాయ్‌ మెరిశాడు.&nbsp; 5. తొలి సినిమా ‘నువ్విలా’ సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు విజయ్‌. 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ చేశాడు. 2015లో విడుదలైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో రిషి పాత్రతో మెప్పించాడు. 2016లో ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా నటించి విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఊపందుకుంది. అర్జున్‌ రెడ్డితో పూర్తిగా మారిపోయింది.&nbsp; 6. సెన్సార్‌ బోర్డుపై విమర్శలు అర్జున్‌ రెడ్డి సినిమాపై సెన్సార్‌ బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పలు సీన్లను తొలగించాలని మేకర్స్‌కు సూచించింది. అందుకు అర్జున్‌ రెడ్డి యూనిట్ ‌అంగీకరించడంతో మూవీకి A సర్టిఫికేట్‌ జారీ చేస్తూ విడుదలకు అనుమతించింది. సెన్సార్ బోర్డు తీరుపై అప్పట్లో బహిరంగంగానే విజయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అర్జున్‌రెడ్డి ఆడియో ఫంక్షన్‌లో విమర్శలు గుప్పించాడు. అయితే తాము చేయలేని పనిని విజయ్‌ చేసినందుకు సినీ తారలు అభినందనలు కూడా తెలిపారు.&nbsp; 7. ఒకేసారి 6 సినిమాలు 2018లో విజయ్‌ చేసిన ఆరు సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ రిలీజ్‌ అయ్యాయి. ఏ మంత్రం వేశావే, మహానటి, గీతా గోవిందం, నోటా, టాక్సీవాలా, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాల ద్వారా విజయ్‌ ప్రేక్షకులను పలకరించాడు. అయితే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు. అటు మహానటి సినిమాలోనూ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించాడు.&nbsp; 8. ఫోర్భ్స్‌ జాబితాలో స్థానం 2019లో ఫోర్బ్స్‌ ఇండియా అండర్‌ - 30 జాబితాలో విజయ్‌ స్థానం సంపాదించాడు. అదే ఏడాది గూగుల్‌లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సౌత్‌ ఇండియన్‌ యాక్టర్‌గానూ విజయ్‌ గుర్తింపు పొందాడు.&nbsp; 9. ఇన్‌స్టాగ్రామ్‌ క్రేజ్ 2018లో విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాడు. అనతికాలంలో అత్యధిక ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోల్లో అల్లుఅర్జున్‌ తొలిస్థానంలో ఉండగా, విజయ్ రెండోస్థానంలో ఉన్నాడు. ఇన్‌స్టాలో 18.2 మిలియన్ల మంది రౌడీ బాయ్‌ను ఫాలో అవుతున్నారు.&nbsp; 10. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అర్జున్‌ రెడ్డి సినిమాకు గాను విజయ్‌ దేవరకొండ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆ అవార్డును వేలం వేయడం ద్వారా వచ్చిన రూ. 25 లక్షల నగదును తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విజయ్‌ డొనేట్‌ చేశాడు. అవార్డుల కంటే అభిమానుల ప్రశంసలే తనకు ఎంతో విలువైనవని ఆ సందర్భంలో విజయ్‌ అన్నాడు.&nbsp;
    మే 09 , 2023
    Sid Sriram: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే టాప్‌-10 సిద్‌ శ్రీరామ్‌ సాంగ్స్‌..
    Sid Sriram: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే టాప్‌-10 సిద్‌ శ్రీరామ్‌ సాంగ్స్‌..
    ప్రముఖ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ ఎన్నో హిట్‌ పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. మిస్మరైజింగ్‌ వాయిస్‌తో కోట్లాది మంది సంగీత ప్రియులను ఉర్రూతలూగించాడు. ఇండో అమెరికన్‌ అయినప్పటికీ తెలుగు పాటలను ఎంతో అద్భుతంగా పాడుతూ శ్రీరామ్‌ తనదైన మార్క్‌ చూపిస్తున్నాడు. సిద్‌ శ్రీరామ్ స్వరం నుంచి వచ్చిన టాప్‌-10 తెలుగు హిట్‌ సాంగ్స్‌ను ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. శ్రీవల్లి: పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను సిద్‌ శ్రీరామ్‌ చాలా అద్భుతంగా పాడాడు. అప్పటివరకు పాడిన పాటలకు పూర్తి భిన్నంగా ఈ పాటను ఆలపించాడు. శ్రీరామ్‌ యూనిక్‌ వాయిస్‌ వల్లే ఈ పాటకు అంత హైప్‌ వచ్చింది.&nbsp; https://www.youtube.com/watch?v=txHO7PLGE3o 2. కళావతి సర్కారు వారి పాటలో కళావతి సాంగ్‌ను శ్రీరామ్‌ చాలా బాగా ఆలపించాడు. కమాన్‌ కమాన్‌ కళావతి అంటూ మహేష్‌ చేత స్టెప్పులు వేయించాడు. ఈ పాట రిలీజ్‌ తర్వాత సిద్‌ శ్రీరామ్‌ ఫేమ్‌ మరింత పెరిగింది. https://www.youtube.com/watch?v=SfDA33y38GE 3. మగువ మగువ వకీల్‌సాబ్‌ చిత్రంలోని మగువ మగువ సాంగ్‌ మహిళల గొప్పతనాన్ని తెలియజేసింది. ఈ పాటకు తన స్వరం ద్వారా సిద్‌ శ్రీరామ్‌ జీవం పోశాడు.&nbsp; https://www.youtube.com/watch?v=fqM8DJIZIDw 4. ఇంకేం ఇంకేం కావాలి గీతా గోవిందం సినిమాలోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ పాటను శ్రీరామ్‌ ప్రాణం పెట్టి పాడాడు. ఒక్క ఇంగ్లీష్‌ పదం లేని ఈ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించి ప్రశంసలు అందుకున్నాడు. లిరిక్స్‌లోని డీప్‌ ఎమోషన్స్‌ను శ్రీరామ్‌ తన గొంతులో చక్కగా పలికించాడు. అప్పట్లో యూత్‌ను ఈ పాట విపరీతంగా ఆకర్షించింది.&nbsp; https://www.youtube.com/watch?v=VkmXX_jKmZw 5. ఉండిపోరాదే 2018లో విడుదలైన హుషారు సినిమాలోని ‘ఉండిపోరాదే పాట’ అప్పట్లో చాలా పెద్ద హిట్‌ అయింది. ప్రేమలో విఫలమైన యువకుడి బాధను తన గొంతులో శ్రీరామ్‌ పలికించాడు. దీంతో యువకులు ఈ పాటకు చాలా బాగా కనెక్ట్‌ అయ్యారు.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=wCnUAKzAmVo 6. సామజవరగమన అలా వైకుంఠపురంలో చిత్రంలోని ‘సామజవరగమన’ పాట ఎంత సూపర్‌ హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాట ఘన విజయానికి అల్లు అర్జున్‌ క్లాసీ స్టెప్పులు ఎంతగానో దోహదం చేశాయి. అలాగే శ్రీరామ్‌ కూడా తన స్వరం ద్వారా సాంగ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=OCg6BWlAXSw 7. మాటే వినదుగా టాక్సీవాలా చిత్రంలోని ‘మాటే వినదుగా’ పాట సిద్‌ శ్రీరామ్‌ హిట్‌ ఆల్బమ్స్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ పాట ద్వారా కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాల్లో శ్రీరామ్‌ స్థానం సంపాదించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc 8. అడిగా అడిగా&nbsp; నిన్నుకోరి సినిమాలోని ‘అడిగా అడిగా’ పాట భగ్న ప్రేమికులను ఎంతగానో ఆకర్షించింది. ప్రేయసి ప్రేమను బలంగా కోరుకునే యువకుడి ఫీలింగ్స్‌ను సిద్‌ చాలా బాగా వ్యక్తపరిచాడు. ఈ పాటకు గాను ఈ యువ గాయకుడికి మంచి ప్రశంసలే దక్కాయి.&nbsp; https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU 9. వచ్చిందమ్మ గీతా గోవిందం మూవీలోని ‘వచ్చిందమ్మా’ పాట కూడా మంచి హిట్ అయింది. ఈ పాటలో శ్రీరామ్‌ వాయిస్‌ ప్రేక్షకులను మిస్మరైజింగ్‌ చేసిందనే చెప్పాలి.&nbsp; https://www.youtube.com/watch?v=xVcoYF--0mM 10. ఏమున్నావే పిల్ల నల్లమల్ల సినిమాలోనే ఏమున్నావే పిల్ల పాట ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. సినిమా పెద్దగా ఆడకపోయిన ఈ పాట మాత్రం ఇప్పటికా చాలా మందికి ఫేవరేట్ సాంగ్‌ ఉంది. https://www.youtube.com/watch?v=0K7HpHP2Jk8 &nbsp;&nbsp;
    ఏప్రిల్ 05 , 2023
    Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
    Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
    టాలీవుడ్ అంటేనే ప్రపంచ సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రత్యేకించి, ఈ పరిశ్రమను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో హీరోయిన్‌ల పాత్ర అమోఘం. అద్భుతమైన అభినయంతో పాటు, అందంతో కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కను సైగలతోనే మాట్లాడగల నేర్పుతో అలరిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభతోనే కష్టపడి ఎదిగిన ఈ కథానాయికల అందం, నటన మనం మరిచిపోలేము. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఎక్కువగా వెతికిన టాప్ తెలుగు హీరోయిన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి Sobhita Dhulipala శోభితా ధూళిపాళ&nbsp; టాలీవుడ్ హీరోయిన్ . ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తోంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016) ద్వారా నటిగా పరిచయమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢచారి చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. రీసెంట్‌గా ఆమె హీరో నాగచైతన్యను వివాహం చేసుకుంది. Meenakshi Chaudhary మీనాక్షి చౌదరి.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్‌. హరియాణాలో పుట్టి పెరిగిన మీనాక్షి.. కెరీర్‌ ప్రారంభంలో మోడల్‌గా చేసింది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' (2021) ఫిల్మ్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హిట్‌ 2, గుంటూరు కారం, లక్కీ బాస్కర్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో క్రేజ్‌ సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 9 సినిమాలు చేసింది. Sreeleela శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్. శ్రీలీల చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చింది. MBBS చదివిన శ్రీలీల నటనపై మక్కువతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది. పెళ్లి సందD చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది Samantha సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ప్రధానంగా నటిస్తోంది. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్‌ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. Courtesy Instagram: samantha Rashmika Mandanna నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. కిరాక్ పార్టీ, గీతాగోవిందం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆమె సైమా పురస్కారం అందుకుంది . Sai Pallavi సాయిపల్లవి భారతీయ సినీ నటి. మలయాళం చిత్రం ప్రేమమ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలోని మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్‌ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది. Kiara Advani కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ .  ఆమె హిందీ మరియు తెలుగు భాషా చిత్రాలలో పని చేస్తుంది. ఆమె హాస్య చిత్రం ఫగ్లీ (2014)లో తొలిసారిగా నటించింది. స్పోర్ట్స్ బయోపిక్ MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (2016)లో MS ధోని భార్యగా నటించింది. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిల్మ్ లస్ట్ స్టోరీస్ (2018)లో లైంగికంగా సంతృప్తి చెందని భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది మరియు పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను మేయిన్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. Rukshar Dhillon రుక్సర్‌ థిల్లాన్‌ టాలీవుడ్‌కు చెందిన నటి. 2016లో కన్నడ సినిమా 'రన్‌ ఆంటోని'తో సినీ రంగ ప్రవేశం చేసింది. ‘ఆకతాయి’ (2017) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'కృష్ణార్జున యుద్ధం' (2018), ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (2022), ‘నా సామిరంగా’ (2024) చిత్రాలతో తెలుగులో పాపులర్ అయ్యింది. Samyuktha Menon సంయుక్త మీనన్  తెలుగులో భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్‌తో నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరింది. సంయుక్త మీనన్ తెలుగు కంటే ముందు మలయాళం చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పాప్‌కార్న్, థివాండి వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. Keerthy Suresh కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్‌ దే(2021), సర్కారు వారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహానటిలో ఆమె నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.  Divyansha Kaushik దివ్యాంశ కౌశిక్ తెలుగు చిత్రం మజిలీ (2019)తో తొలిసారిగా నటించింది, దీని కోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం SIIMA అవార్డును అందుకుంది. Pooja Hegde పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. Mirnalini Ravi మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్‌' ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చింద్రా’ చిత్రాల్లో నటించింది. మృణాళిని నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్‌ గురు'లోనూ మంచి నటన కనబరిచి అభిమానులను అలరించింది. Kethika Sharma కేతిక శర్మ తెలుగు సినిమా నటి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగ రంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్‌ లైఫ్‌ (2016)' వీడియోతో పాపులర్‌ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. Chandini Chowdary చాందిని చౌదరి తెలుగులో మధురం సినిమాతో ఆరంగేట్రం చేసింది. 'కలర్ ఫొటో' సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్‌ లుక్‌లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించి సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోయిన్‌ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. Eesha Rebba ఈష రెబ్బ తెలుగు సినీ నటి. 'అంతకు ముందు... ఆ తరువాత'(2013) చిత్రం ద్వరా హీరోయిన్‌గా పరిచయమైనది. బందిపోటు, బ్రాండ్ బాబు సినిమాల్లో హిరోయిన్‌గా గుర్తింపు పొందింది. అయితే ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ సహాయ నటి పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది. అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఈష రెబ్బ సినిమాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించింది. 3 రోజస్, పిట్టకథలు, మాయాబజార్ ఫర్ సేల్ వెబ్‌ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. Priyanka Jawalkar "ప్రియాంక జ‌వాల్క‌ర్ తెలుగు సినిమా నటి. కలవరం ఆయే సినిమా(2017) సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన టాక్సీవాలా చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. మరాఠి కుటుంబానికి చెందిన ప్రియాంక విద్యాభ్యాసం అంతా ఏపీలోనే జరిగింది. ఆమె హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్సిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌ ఉన్న ప్రియాంక ఎన్‌.జె.బిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. టాలీవుడ్‌లో నటనతో పాటు గ్లామర్‌కు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Dimple Hayathi డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవి తేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. Courtesy Instagram: Dimple Hayathi Pujita Ponnada పూజిత పొన్నాడ టాలీవుడ్‌కు చెందిన నటి. విశాఖపట్నంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ నగరాల్లో పెరిగింది. ఊపిరి (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 'రన్‌' (2020) సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఇప్పటివరకూ తెలుగులో 18 చిత్రాల్లో నటించింది. Ananya Nagalla అనన్య నాగళ్ల తెలుగు సినీ నటి. మల్లేశం(2019) సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్', వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్‌లోని రాజా మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేసింది. కొన్నిరోజులు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. Courtesy Instagram:Ananya Nagalla
    డిసెంబర్ 04 , 2024
    <strong>Vijay Deverakonda: </strong><strong>విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్‌ చేసుకొని..!&nbsp;</strong>
    Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్‌ చేసుకొని..!&nbsp;
    టాలీవుడ్‌లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు 'విజయ్‌ దేవరకొండ' (Vijay Devarakonda). ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్‌.. తనకంటూ&nbsp; ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను సృష్టించుకున్నాడు. ‘అర్జున్‌ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’, ‘గీతా గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. కాగా, ఇటీవల విజయ్‌.. తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులతో దిగిన ఎమోషనల్‌ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; ఎమోషనల్‌ పోస్టు రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ.. తల్లిదండ్రులు గోవర్ధన్‌ రావు, మాధవిలతో పాటు సోదరుడు ఆనంద్‌ దేవరకొండతో కలిసి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లాడు. విజయ్‌ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా వరుస షూటింగ్‌ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా గడుపుతోన్న విజయ్‌.. విరామం కోసం అమెరికాకు వెళ్లి కొద్ది రోజులు ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తాజాగా ఇండియాకు వచ్చిన విజయ్‌.. అక్కడ తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన అమ్మనాన్న, సోదరుడితో కలిసి అమెరికా వెకేషన్‌ను.. విజయ్‌ ఎంత బాగా ఆస్వాదించారో ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి గోవర్ధన్‌రావును విజయ్‌ గట్టిగా హగ్‌ చేసుకున్న ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.&nbsp; https://www.instagram.com/p/C8W7M9Jys78/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA== అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా త్రివిక్రమ్‌ కుమారుడు! విజయ్‌ దేవరకొండ తీసిన గత మూడు చిత్రాలు (లైగర్‌, ఖుషి, ఫ్యామిలీ స్టార్‌) బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో విజయ్‌ తన తర్వాతి చిత్రంపై ఫోకస్‌ పెట్టాడు. ‘VD12’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ పెద్ద కుమారుడు రిషి.. ఈ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనిది హీరో ఫేస్ అని అభిమానులు అంటున్నా.. రిషి మాత్రం కెమెరా వెనుక నుంచి తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు త్రివిక్రమ్‌ కూడా ఓకే చెప్పడంతో విజయ్‌ దేవరకొండ సినిమా ద్వారానే రిషి తన సినీ కెరీర్‌ను మెుదలుపెట్టినట్లు సమాచారం.&nbsp; పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న VD12 చిత్రంలో విజయ్‌.. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తారని సమాచారం. ఇందులో సీరియస్‌ పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ కనిపించనున్నాడట. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్‌ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్‌ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. సాయిపల్లవితో రొమాన్స్‌ రౌడీ భాయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda).. దర్శకుడు రవికిరణ్‌ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్‌ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్‌ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే విజయ్‌ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.&nbsp;
    జూన్ 19 , 2024
    విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అర్జున్ రెడ్డి సినిమా విజయంతో రౌడీ బాయ్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. గీతాగోవిందం, ఖుషి వంటి&nbsp; హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న&nbsp; విజయ్ దేవరకొండ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన సంగతులు మీకోసం.. విజయ్ దేవరకొండ అసలు పేరు? దేవరకొండ విజయ్ సాయి. అభిమానులు ముద్దుకు రౌడీ బాయ్, VDK అని పిలుచుకుంటారు. విజయ్ దేవరకొండ ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు విజయ్ దేవరకొండ తొలి సినిమా? నువ్విలా చిత్రం ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాడు. 2016లో వచ్చిన పెళ్లి చూపులు చిత్రం ద్వారా హీరోగా పరిచయం&nbsp;అయ్యాడు విజయ్ దేవరకొండ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్? అర్జున్ రెడ్డి చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గీతాగోవిందం, ట్యాక్సీవాలా, ఖుషి సినిమాలు హిట్స్‌గా నిలిచాయి. విజయ్ దేవరకొండ క్రష్ ఎవరు? ఖుషి సినిమాలో తనతోపాటు నటించిన సమంత తన క్రష్‌గా విజయ్ ఓ సందర్భంలో చెప్పాడు VDKకు ఇష్టమైన కలర్? తెలుపు, బ్లాక్, బ్రౌన్ విజయ్ దేవరకొండ పుట్టిన తేదీ? మే 9, 1989 విజయ్ దేవరకొండకు నచ్చిన పుస్తకం? విజయ్ దేవరకొండ పుస్తక ప్రియుడు. అతనికి 'ది పౌంటెన్ హెడ్' అనే పుస్తకం అంటే ఇష్టమని చెప్పాడు. ఈ పుస్తకంతో పాటు 'అట్లాస్ ష్రగ్ డ్', 'హూ మూవ్డ్ మై చీజ్' అనే పుస్తకాలు చదవదగినవని పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండకు లవర్ ఉందా? విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన ప్రేమలో ఉన్నారని చాలా వార్తల్లో వచ్చాయి. వీరిద్దరు కలిసి పలు సందర్భాల్లో కనిపించడం ఆ వార్తలకు బలానిచ్చాయి. గీతాగోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్ చిత్రాల్లో ఈ జోడి నటించింది. విజయ్ దేవరకొండ వ్యాపారాలు? రౌడీ బ్రాండ్ పేరుతో క్లాత్ బిజినెస్ ఉంది. ఈ బ్రాండ్ బట్టలు మింత్రా ఆన్‌లైన్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. 'కింగ్ ఆఫ్ ది హిల్' అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. వోల్ట్స్‌ అనే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు.&nbsp; విజయ్ దేవరకొండకు ఎన్ని అవార్డులు వచ్చాయి? అర్జున్ రెడ్డి చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు. 2018 ఫోర్బ్స్ ఇండింయా సెలబ్రెటీ 100 జాబితాలో 72వ స్థానం, టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో 4 వ స్థానంలో నిలిచాడు. విజయ్ దేవరకొండ సామాజిక సేవ చేస్తాడా? కొవిడ్ టైంలో మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా వంట సామాగ్రిని అందించాడు. ఇందుకోసం రూ.1.7కోట్లు ఖర్చు పెట్టాడు. ఖుషి సినిమా విడుదల సమయంలో తన రెమ్యునరేషన్‌ నుంచి రూ.కోటి ఖర్చు పెట్టి 100 మంది రైతులకు సాయం చేశాడు విజయ్ దేవరకొండ ఎన్ని సినిమాల్లో నటించాడు? విజయ్ దేవరకొండ 2024 వరకు 14 సినిమాల్లో నటించాడు.&nbsp; విజయ్ దేవరకొండకు ఇష్టమే ఆహారం? చికెన్ బిర్యాని, ఇటాలియన్ పస్తా అండ్ పీజా, కాఫీ. https://www.youtube.com/watch?v=6Z_mp4t0QLU
    మార్చి 19 , 2024
    Balakrishna: బాలయ్య క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌.. క్యూలో త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ వర్మ, బోయపాటి!&nbsp;
    Balakrishna: బాలయ్య క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌.. క్యూలో త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ వర్మ, బోయపాటి!&nbsp;
    టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఒకరు. ఇటీవల ఆయన నటించిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్‌ (Kajal Aggarwal).. కూతురిగా శ్రీలీల (Sreeleela) నటించింది. ప్రస్తుతం డైరెక్టర్‌ బాబీ (Director Bobby)తో బాలకృష్ణ ‘NBK109’ చిత్రాన్ని చేస్తున్నారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా మరో మూవీ కూడా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంతకీ బాలయ్యను మెప్పించిన ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నాని డైరెక్టర్‌తో సినిమా! ఇప్పటికే తన లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను పెట్టుకున్న బాలకృష్ణ.. తాజాగా మరో డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. 'ట్యాక్సీవాలా' (Taxiwala)తో వచ్చి 'శ్యామ్ సింగ రాయ్' (Shyam Singha Roy)తో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్‌ రాహుల్ సంకృత్యాన్‌ (Rahul Sankrityan)కు బాలయ్య దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మధ్యనే రాహుల్.. బాలయ్యను కలిసి ఒక పిరియాడికల్ స్టోరీ లైన్ గురించి చర్చించాడట. ఆ పీరియాడిక్ డ్రామా బాలయ్యకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా కథ.. బాలయ్యకు పూర్తిగా నచ్చితే మూవీ కన్ఫామ్ కానుంది. హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌! నటసింహాం బాలకృష్ణ.. తన ‘NBK109’ చిత్రాన్ని డైరెక్టర్ బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ‘NBK110’వ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu)తో బాలయ్య చేయబోతున్నట్లు న్యూస్ ఇప్పటికే బయటకు వచ్చింది. దీన్ని 'అఖండ' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గ స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా చకా చకా రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈలోపు బాలయ్య తన 109వ సినిమాను పూర్తి చేస్తారు. ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ వంటి బ్లాక్‌ బాస్టర్స్ తర్వాత వీరి కాంబోలో ‘NBK110’ వస్తుండటంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీని తర్వాత బాలయ్య - రాహుల్ సంకృత్యాన్‌ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్‌తో బాలయ్య చిత్రం! టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ కూడా త్వరలోనే సెట్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తన తర్వాతి చిత్రాన్ని బాలయ్యతో చేసే అవకాశమున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్‌.. బన్నీతో ఓ సినిమా తీయాల్సి ఉంది. ‘పుష్ప2’ సినిమా షూటింగ్‌తో బన్నీ బిజీ అయిపోవడం.. తాజాగా పార్ట్‌-3 ఉంటుందని హింట్‌ ఇవ్వడంతో త్రివిక్రమ్‌ తన ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తన తర్వాతి చిత్రాన్ని బాలయ్యతో చేసేందుకు మెుగ్గు చూపుతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కథను సిద్ధం చేయాల్సి ఉందని అంటున్నారు.&nbsp; ఆ డైరెక్టర్లతోనూ చర్చలు! నందమూరి బాలకృష్ణ.. బాబీ, బోయపాటి శ్రీనుతోనే కాకుండా మరికొందరు డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. తనకు 'వీర సింహా రెడ్డి' వంటి హిట్‌ అందించిన గోపీచంద్ మలినేని (Gopichand Malineni)తోనూ బాలకృష్ణ మరో సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే ప్రశాంత్ వర్మ, హరీశ్ శంకర్ వంటి డైరెక్టర్లు కూడా బాలయ్యతో కథకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాలకృష్ణ చకా చకా కొత్త సినిమాలను ఓకే చేస్తున్నారు. ఒకదాని తర్వాత మరొకదానిని సెట్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.&nbsp; హ్యాట్రిక్‌ హిట్లతో ఫుల్ జోష్‌ టాలీవుడ్‌లోని సీనియర్ నటులతో (చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌) పోలిస్తే ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నది బాలయ్య మాత్రమే. బాలయ్య చివరి మూడు చిత్రాలు బ్లాక్‌ బాస్టర్లుగా నిలవడం విశేషం. 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి క్రేజీ హిట్ల తర్వాత బాలకృష్ణ నటించిన సినిమానే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రానికి కూడా అదిరిపోయే స్పందన లభించింది. ఇలా బాలయ్య వరుసగా మూడు హిట్లను అందుకుని హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ మూడు చిత్రాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. బాలయ్య రెమ్యూనరేషన్‌ ఎంతంటే? సినిమా సినిమాకి తన రేంజ్‌ని (Nandamuri Balakrishna Remuneration) పెంచుకుంటూ పోతున్న బాలయ్య ఇప్పుడు తన రెమ్యునరేషన్‌ని మరింతగా పెంచేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.&nbsp; అఖండ ముందు వరకు మోస్తరు పారితోషికాన్ని తీసుకున్న బాలకృష్ణ.. హ్యాట్రిక్‌ విజయాల తర్వాత దానిని ఒక్కసారిగా పెంచేశారట. తన అప్‌కమింగ్‌ సినిమాలు అన్నింటికి రూ.20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. రాబోయే చిత్రాలు సైతం స్టార్‌ డైరెక్టర్లతో ఉండటంతో బాలయ్య ఫ్యూచర్‌ మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. రామ్‌చరణ్‌ (Ramcharan), తారక్‌ (Jr NTR) తరహాలోనే బాలయ్య కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే రోజులు ఎంతో దూరంలో లేవని నందమూరి అభిమానులు అంటున్నారు.&nbsp;&nbsp;
    ఫిబ్రవరి 20 , 2024
    NBK110: బాలయ్య - బోయపాటి చిత్రానికి ముహోర్తం ఫిక్స్‌.. ఇక బాక్సాఫీస్‌కు ఊచకోతే!
    NBK110: బాలయ్య - బోయపాటి చిత్రానికి ముహోర్తం ఫిక్స్‌.. ఇక బాక్సాఫీస్‌కు ఊచకోతే!
    నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ (Bobby) కాంబినేషన్‌లో ఓ సినిమా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ‘NBK109’గా ఇది ప్రచారంలో ఉంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా గ్లింప్స్‌ను ఇటీవలే శివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్‌ రిలీజ్ చేసింది. ఇందులో బాలకృష్ణ ఎప్పటిలాగే పవర్‌ఫుల్‌ గెటప్‌లో కనిపించారు. ఈ చిత్ర నిర్మాణంలో త్రివిక్రమ్‌ సొంత సంస్థ ఫార్చూన్‌ ఫోర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం విశేషం. ‘NBK109’ సినిమా తర్వాత బాలయ్య తన 110వ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; బాలయ్య - బోయపాటి కాంబో రిపీట్‌! టాలీవుడ్‌లో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్‌ ఉంది. వీరి కాంబోలో వచ్చిన సింహా (Simha), లెజెండ్‌ (Legend), అఖండ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. లేటెస్ట్ బజ్‌ ప్రకారం బాలకృష్ణ తన ‘NBK110’ చిత్రాన్ని బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య 110వ చిత్రానికి చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించినప్పటికీ చివరకూ బోయపాటి శ్రీనును ఫైనల్‌ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ‘NBK110’ మూవీ కోసం బోయపాటి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్‌ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కోరిక మేరకు కొన్ని మార్పులు కూడా జరుగుతున్నట్లు టాక్‌. ఈ చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; నెక్స్ట్‌ చిత్రం 'అఖండ 2' కాదా? బాలకృష్ణ 110వ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ (Allu Aravind) నిర్మించనున్నారు. ‘అఖండ’ తర్వాత తమ కాంబోలో సీక్వెల్‌ కూడా ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను అప్పట్లోనే ప్రకటించారు. అయితే ‘అఖండ’ చిత్రాన్ని అప్పట్లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. మరి ఇప్పుడు ఆయన ప్రమేయం లేకుండా 'అఖండ 2' (Akhanda 2) నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు. దీని బట్టి బాలయ్య - బోయపాటి కాంబోలో 'అఖండ 2' కాకుండా మరో కొత్త చిత్రం రూపొందుతుందా? అన్న సందేహం కలుగుతోంది. బాలయ్య, బోయపాటి చిత్రానికి ఏప్రిల్‌ 9 ముహోర్తం కుదరినట్లు తెలుస్తుండగా ఆ రోజే ఈ చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, ‘NBK110’ చిత్రానికి థమన్‌ సంగీతం అందింబోతున్నారు.&nbsp; ఏపీ ఎన్నికల తర్వాతే షూట్‌! ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి మెుదలైన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే రాజకీయాల్లో బిజీ కానున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK109’ చిత్రాన్ని వేగంగా ఫినిష్‌ చేసేందుకు బాలకృష్ణ యత్నిస్తున్నారట. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ షెడ్యూల్‌ను త్వరగా పూర్తి చేసి ఎన్నికల వరకూ తన ఫోకస్‌ను ఏపీ రాజకీయాలపై పెట్టాలని బాలయ్య భావిస్తున్నారట. ప్రస్తుతం బాలయ్య.. ఏపీలో హిందూపురం టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. స్థానికంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటితో చేయనున్న ‘NBK110’ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ ఏపీ ఎన్నికల తర్వాతే జరగనున్నట్లు తెలుస్తోంది.&nbsp;&nbsp; నాని డైరెక్టర్‌తో సినిమా! ఇప్పటికే తన లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను పెట్టుకున్న బాలకృష్ణ.. మరో యంగ్‌ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. 'ట్యాక్సీవాలా' (Taxiwala)తో వచ్చి 'శ్యామ్ సింగ రాయ్' (Shyam Singha Roy)తో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్‌ రాహుల్ సంకృత్యాన్‌ (Rahul Sankrityan) చెప్పిన కథకు బాలయ్య దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మధ్యనే రాహుల్.. బాలయ్యను కలిసి ఒక పిరియాడికల్ స్టోరీ లైన్ గురించి చర్చించాడట. ఆ పీరియాడిక్ డ్రామా బాలయ్యకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా కథ.. బాలయ్యకు పూర్తిగా నచ్చితే ఈ మూవీ కూడా కన్ఫామ్ కానుంది.
    మార్చి 14 , 2024

    @2021 KTree