• TFIDB EN
  • విరూపాక్ష (2023)
    ATelugu2h 26m
    రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్‌ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సాయి ధరమ్ తేజ్
    సూర్య
    సంయుక్త మీనన్
    నందిని
    సునీల్
    అబ్బాయి రాజు
    రాజీవ్ కనకాల
    హరిశ్చంద్ర ప్రసాద్; రుద్రవనం సర్పంచ్
    బ్రహ్మాజీ
    RMP డాక్టర్
    రవి కృష్ణ
    కుమార్/భైరవ
    అభినవ గోమతం
    కమల్ కామరాజు
    వెంకట చలపతి
    సాయి చంద్
    పూజారి
    అజయ్
    అఘోరా
    కౌశిక్ మహతా
    రాజశేఖర్ అనింగి
    శ్యామలపార్వతి; సూరి భార్య
    చత్రపతి శేఖర్
    సూరి; పార్వతి భర్త
    సోనియా సింగ్సుధ
    నవీన్ నేని
    నిహారిక అనసూయమ్మ
    సిబ్బంది
    కార్తీక్ వర్మ దండుదర్శకుడు
    బివిఎస్ఎన్ ప్రసాద్
    నిర్మాత
    సుకుమార్
    నిర్మాత
    బి. అజనీష్ లోక్‌నాథ్
    సంగీతకారుడు
    సుకుమార్
    స్క్రీన్ ప్లే
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    SAMYUKTHA MENON: విరూపాక్షలో గ్లామర్‌ డోస్‌ పెంచిన సంయుక్త… ఇక దేనికైనా తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మ
    SAMYUKTHA MENON: విరూపాక్షలో గ్లామర్‌ డోస్‌ పెంచిన సంయుక్త… ఇక దేనికైనా తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మ
    టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ సంయుక్త మీనన్. విరూపాక్షతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.  సంయుక్త మళయాలం చిత్రాలతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ చాలా సినిమాల్లో నటించింది.  బింబిసార చిత్రానికి మెుదట సంతకం చేసినప్పటికీ తెలుగులో విడుదలైన ఫస్ట్ చిత్రం బీమ్లా నాయక్  కల్యాణ్ రామ్ నటించిన బింబిసారతో బ్లాక్‌ బస్టర్ అందుకుంది సంయుక్త. అందులో మోడ్రన్ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో మెప్పించింది.  ధనుష్ నటించిన సార్ చిత్రంలోనూ తళుక్కున మెరిసింది ఈ అమ్మడు. అది కూడా విజయవంతం కావటంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.  ఇప్పటివరకు సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని ఉన్న రోల్స్‌లోనే మెరిసింది సుందరి. గ్లామర్‌ పాత్రల్లో నటించలేదు.  సూపర్‌ హాట్‌గా కనిపించే సంయుక్త బికినీ ఫోటోలు పెట్టి అప్పట్లో అందర్ని షాక్‌కు గురిచేసింది. ఆ పిక్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. విరూపాక్ష సినిమాలో కాస్త గ్లామర్‌కి పనిచెప్పింది ఈ అమ్మడు. హాఫ్ సారీలో అందచందాలు ప్రదర్శించింది సంయుక్త మీనన్.  సాయిధరమ్‌ తేజ్‌తో  చేసిన కొన్ని సీన్లలో బొల్డ్‌గా కనిపించింది. చీరకట్టులోనైనా కావాల్సిన చోట అందాలు ఆరబోసింది. పవన్ కల్యాణ్ బీమ్లా నాయక్‌లో ఆఫర్‌ రావటానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కారణమనే రూమర్స్ ఉన్నాయి. ఆయన కారణంగా అవకాశాలు వస్తున్నాయని టాక్.  చీరకట్టులోనూ ఈ వయ్యారి లుక్ ఇచ్చిందంటే కుర్రాళ్ల మతిపోవాల్సిందే. ఆమె పెట్టె ఫోటోల కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు.  సామాజిక మాధ్యమాల్లో సంయుక్త మీనన్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్‌స్టాలో ఆమెకు 2.6 మిలియన్స్‌ ఫాలోవర్లు ఉన్నారు. సంయుక్త మీనన్‌ ప్రస్తుతం కల్యాణ్‌ రామ్ సరసన డెవిల్ అనే సినిమాలో చేస్తోంది. బింబిసార 2లోనూ కనిపించే అవకాశం ఉంది.  https://telugu.yousay.tv/sanyukta-menon-is-stunning-in-a-saree.html https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html
    ఏప్రిల్ 24 , 2023
    VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్‌ కథాంశంతో  విరూపాక్ష… సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్ కమ్‌ బ్యాక్!
    VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్‌ కథాంశంతో  విరూపాక్ష… సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్ కమ్‌ బ్యాక్!
    సాయి ధరమ్‌ తేజ్‌ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న అనంతరం చేసిన మెుదటి సినిమా విరూపాక్ష. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. యాక్సిడెంట్ తర్వాత మాట కూడా పడిపోయిందని చెప్పిన సాయి… సినిమాలో ఎలా నటించాడు? సుకుమార్ కాంపౌండ్‌ నుంచి వస్తున్న మరో దర్శకుడు సక్సెస్ అయ్యాడా ? లేదా ? సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం దర్శకుడు: కార్తీక్ దండు నటీ నటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్‌, సోనియా సింగ్, రవికృష్ణ సంగీతం:  అజనీశ్ లోక్‌నాథ్‌ సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌ కథ రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్‌ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ. ఎలా ఉందంటే? రుద్రవరం అనే ఊరికి ఓ జంట శాపం పెట్టడంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. సూర్య పాత్రలో సాయిధరమ్, నందినీగా సంయుక్త మీనన్‌ నటించారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. ఈ సీన్లు ప్రేక్షకులకు కాస్త బోరింగ్‌గానే అనిపిస్తాయి. అయితే, ఇంటర్వెల్‌కు ముందు అసలు కథను ప్రారంభించి అదిరిపోయే సన్నివేశాలు పెట్టడంతో సెకాండాఫ్‌పై ఆసక్తి కలుగుతుంది. ఊరిలో ఒక్కొక్కరు చనిపోతుంటే దాని వెనుకున్న రహస్యాన్ని చేధించే అంశాలతో సెకాండాఫ్‌ను నింపేశారు. కథనం చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్ని కచ్చితంగా సీటు అంచుల్లో కూర్చొబెడుతుంది. ప్రీ క్లైమాక్స్‌ వరకు చిత్రం బాగానే ఉంటుంది. చివర్లో కాస్త తడబడ్డారనే చెప్పాలి.  ఎవరెలా చేశారు? సాయిధరమ్ తేజ్‌కి ఇది కమ్ బ్యాక్ సినిమా. నటనలో మరో మెట్టు ఎక్కేశాడు కుర్ర హీరో. సూర్య పాత్రలో లీనమైపోయాడు. సెటిల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు సాయి. సంయుక్త మీనన్‌ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. వరుసగా హిట్లు కొడుతున్న ఈ హీరోయిన్‌ మరోసారి మెప్పించిందనే చెప్పాలి. తన ఖాతాలో మరో హిట్ వేసుకుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సోనియా సింగ్, అజయ్ లాంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.  సాంకేతిక పనితీరు సుకుమార్ కాంపౌండ్‌ నుంచి వచ్చిన దర్శకుడు కార్తీక్ దండు మెుదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఉప్పెనతో బుచ్చిబాబు, దసరాతో శ్రీకాంత్‌ ఓదెల ఎలా ఆకట్టుకున్నారో కార్తీక్‌ కూడా అదేస్థాయిలో మెప్పించాడు. విరూపాక్ష చిత్రాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు కార్తీక్. ఈ చిత్రానికి మరో ప్లస్‌ పాయింట్‌ స్క్రీన్‌ ప్లే. సుకుమార్ స్వయంగా అందించిన స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. చిత్రాన్ని ఎక్కడో నెలబెట్టింది.  విరూపాక్ష చిత్రానికి సంగీతంతో ప్రాణం పోశాడు అజనీశ్‌ లోక్‌నాథ్. కాంతార చిత్రానికి మ్యూజిక్ అందించి మెప్పించిన అతడు.. విరూపాక్షలో అందించిన నేపథ్య సంగీతం పెద్ద అసెట్. చిత్రానికి పూర్తి న్యాయం చేశాడు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. బలాలు కథ, కథనం సాయిధరమ్, సంయుక్త మీనన్ నేపథ్య సంగీతం బలహీనతలు క్లైమాక్స్‌, లవ్‌ ట్రాక్‌ రేటింగ్ 3.25/5
    ఏప్రిల్ 21 , 2023
    <strong>SDT 18: కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో వస్తోన్న మెగా మేనల్లుడు.. రికార్డులు గల్లంతేనా!</strong>
    SDT 18: కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో వస్తోన్న మెగా మేనల్లుడు.. రికార్డులు గల్లంతేనా!
    మెగా హీరో, చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గా తేజ్ అలియాస్‌ సాయి ధరమ్‌ తేజ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. గతేడాది వచ్చిన ‘విరూపాక్ష’తో సాలిడ్‌ హిట్‌ కొట్టిన తేజ్‌ ఆ సినిమాతో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌ చేరిపోయాడు. అదే ఏడాది పవన్‌ కల్యాణ్‌తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. బ్రో తర్వాత ఇప్పటివరకూ ఒక్క ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేదు. కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘SDT18’ ప్రాజెక్ట్ ప్రకటించి అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపారు.&nbsp; ధైర్యాన్నే కవచంగా.. సుప్రీం స్టార్‌ సాయి దుర్గా తేజ్‌ నుంచి కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. నేడు ఈ యంగ్‌ హీరో పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. ‘SDT 18’ వర్కింగ్‌ టైటిల్‌తో ఇది తెరకెక్కనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ మేకింగ్‌ వీడియోతో పాటు పోస్టర్‌ను విడుదల చేసింది. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కండల తిరిగిన దేహంతో ఉన్న సాయి దుర్గా తేజ్‌ బ్యాక్‌ సైడ్‌ లుక్‌ను చూపించారు.&nbsp; https://twitter.com/Primeshowtweets/status/1846065983091536150 రాయలసీమ నేపథ్యంలో.. ‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి దుర్గా తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు రోహిత్‌ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మించినట్లు తాగా రిలీజ్‌ చేసిన మేకింగ్‌ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. https://twitter.com/IamSaiDharamTej/status/1846068731665174954 యాక్సిడెంట్‌తో కోమాలోకి.. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే సాయి దుర్గా తేజ్‌కు ఊహించని విధంగా యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్‌ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత విరూపాక్ష, బ్రో సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్‌ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.&nbsp;
    అక్టోబర్ 15 , 2024
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    పిల్లా నువ్వులేని జీవితం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్.. చిత్రలహరి, విరూపాక్ష వంటి హిట్ చిత్రాల ద్వారా స్టార్ డం సంపాదించాడు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ గురించి మీకు తెలియని కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం. సాయి ధరమ్ తేజ్ ముద్దు పేరు? ధరమ్ సాయి ధరమ్ తేజ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా? పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ సాయి ధరమ్ తేజ్ పుట్టిన తేదీ ఎప్పుడు? October 15, 1986 సాయి ధరమ్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ క్రష్ ఎవరు? లారిసా బొనేసి(Larissa Bonesi). ఈమె తిక్క చిత్రంలో సాయి ధరమ్ సరసన హీరోయిన్‌గా నటించింది. సాయి ధరమ్‌కు ఇష్టమైన సినిమా? గ్యాంగ్ లీడర్ సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, చిరంజీవి సాయి ధరమ్ తేజ్ తొలి హిట్ సినిమా? సుబ్రహ్మాణ్యం ఫర్ సేల్ చిత్రం సాయిధరమ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. చిత్రలహరి, బ్రో, విరూపక్ష వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. సాయి ధరమ్‌కు ఇష్టమైన కలర్? నీలం రంగు సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రుల పేర్లు? విజయ దుర్గ, జీవీఎస్ ప్రసాద్ సాయి దరమ్‌కు ఇష్టమైన ప్రదేశం? దుబాయ్, లండన్ సాయి ధరమ్ చదువు? MBA సాయి ధరమ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? పిల్లా నువ్వులేని జీవితం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ గెలుచుకున్నాడు. https://www.youtube.com/watch?v=G7ptLW3O0Qo సాయి ధరమ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? సాయి ధరమ్ 2024 వరకు 16 సినిమాల్లో నటించాడు.&nbsp; సాయి ధరమ్‌కు ఇష్టమైన ఆహారం? రొయ్యల పలావు, పప్పు అన్నం సాయి ధరమ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సాయి ధరమ్ ఒక్కో సినిమాకి దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్ అభిరుచులు? ట్రావలింగ్, క్రికెట్ ఆడటం సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరోయిన్? సమంత
    మార్చి 21 , 2024
    <strong>Sreeleela: టాలీవుడ్‌లో శ్రీలీల బౌన్స్‌బ్యాక్‌.. బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో!&nbsp;</strong>
    Sreeleela: టాలీవుడ్‌లో శ్రీలీల బౌన్స్‌బ్యాక్‌.. బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో!&nbsp;
    అతి కొద్ది కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించిన నటీమణుల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయమైంది. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ఆకట్టుకొని తెలుగులో వరుస ప్రాజెక్ట్స్‌ చేసింది. రవితేజ, రామ్‌, బాలకృష్ణ, నితీన్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌, మహేష్‌ బాబు చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. ‘భగవంత్‌ కేసరి’ మినహా ఆమె నటించిన చిత్రాలన్నీ నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో ఈ అమ్మడికి ఐరెన్‌ లెగ్‌ అన్న ముద్ర వేశారు. మహేష్‌ ‘గుంటూరు కారం’ తర్వాత పెద్దగా ఆఫర్లు కూడా రాకపోవడంతో శ్రీలీల కెరీర్‌ ఇక ముగిసినట్లేనని అంతా భావించారు. అయితే ‘పుష్ప 2’ కిస్సిక్‌ సాంగ్‌తో ఈ అమ్మడు మరోమారు బౌన్స్ బ్యాక్‌ అయ్యింది. వరుస ప్రాజెక్ట్స్‌ పట్టాలెక్కిస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. నాగచైతన్యకు జోడీగా.. నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా ‘విరూపాక్ష’ డైరెక్టర్‌ కార్తీక్‌ దండు (Karthik Dandu) ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. 'NC24' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్, SVC క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. మైథ‌లాజిక‌ల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా ఎంపికైనట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. తొలుత ఈ పాత్రకు మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary)ని అనుకున్నప్పటికీ శ్రీలీలను ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. లుక్స్‌ టెస్ట్‌ కూడా ఆదివారం (డిసెంబర్‌ 15) జరిగిందని, మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. దీంతో తెరపై చైతూ-శ్రీలీల జోడీ తెరపై ఎలాంటి మాయ చేస్తుందోనని ఇప్పటి నుంచే అక్కినేని ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు. https://twitter.com/klapboardpost/status/1868499773554409475 కోలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ.. ‘అమరన్‌’తో సాలిడ్‌ హిట్‌ అందుకున్న శివకార్తికేయన్‌ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. 'SK25' వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో నటుడు జయం రవి, అధర్వ కీలక పాత్రల పోషించనున్నారు. రూ.150 కోట్ల బడ్టెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలోనూ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను సైతం నిర్వహించారు. తమిళంలో శ్రీలీలకు ఇదే మెుట్ట మెుదటి ఫిల్మ్‌. డాన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆకాష్‌ భాస్కరన్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రానికి 'పురనానూరు' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పీరియాడికల్ యాక్షన్‌ డ్రామాగా ఇది రానున్నట్లు సమాచారం.  https://twitter.com/MovieTamil4/status/1868647066563686816 చేతి నిండా ప్రాజెక్ట్స్‌.. నితీన్‌ లేటెస్ట్‌ చిత్రం ‘రాబిన్‌హుడ్‌’ (Robin Hood)లోనూ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల కాబోతోంది. అలాగే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ - హరీశ్‌ శంకర్‌ కాంబోలో రూపొందుతున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustad Bhagat Singh) సినిమాలోనూ ఈ అమ్మడే హీరోయిన్‌. రవితేజ (Raviteja) హీరోగా నటిస్తోన్న 'మాస్‌ జాతర' (Mass Jathara) చిత్రంలోనూ శ్రీలీలనే హీరోయిన్‌గా చేస్తోంది. 'ధమాకా' (Dhamaka) తర్వాత వీరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం ఇది. ఇవి కాకుండా ప్రస్తుతం చర్చల దశలో మరో మూడు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అఖిల్ అక్కినేని (Akkineni Akhil) అప్‌కమింగ్‌ ఫిల్మ్‌లోనూ కథానాయికగా శ్రీలీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే నవీన్‌ పోలిశెట్టి (Naveen Polishetty) తీయబోయే నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌లోనూ శ్రీలీల నటించే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా రానున్న 'కోహినూర్‌' (Kohinur) చిత్రంలోనూ శ్రీలీల (Sreeleela) ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కువ ప్రాజెక్ట్స్‌ చేతిలో పెట్టుకొని శ్రీలీల దూకుడు ప్రదర్శిస్తోంది.  https://twitter.com/GulteOfficial/status/1868525815597850925
    డిసెంబర్ 16 , 2024
    Pooja Hegde: పూజా హెగ్డేతో నాగచైతన్య రొమాన్స్‌.. మరి హైట్ సెట్‌ అవుతుందా?
    Pooja Hegde: పూజా హెగ్డేతో నాగచైతన్య రొమాన్స్‌.. మరి హైట్ సెట్‌ అవుతుందా?
    టాలీవుడ్‌లో కొన్ని కాంబోలకు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. అలాంటి వాటిలో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), అందాల భామ పూజా హెగ్డే (Pooja Hegde) జోడీ కూడా ఒకటి. వీరి కాంబోలో వచ్చిన ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. వీరి కెమెస్ట్రీ అద్భుతంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత నుంచి వీరు కలిసి నటించలేదు. వీరి కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ త్వరలోనే ఈ జంట కలిసి నటించబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీంతో ఈ జంటను మరోమారు తెరపై చూసేందుకు అక్కినేని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. విరూపాక్ష డైరెక్టర్‌తో.. సాయిధరమ్‌ తేజ్ నటించిన విరూపాక్ష (Virupaksha) చిత్రం టాలీవుడ్‌లో ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ కార్తిక్‌ వర్మ దండుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు ఈ డైరెక్టర్‌తోనే నాగ చైతన్య ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది రాబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను పరిశీలిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ కార్తిక్‌ వర్మ త్వరలోనే ఆమెను కలిసి కథ వినిపిస్తారని అంటున్నారు. చైతూతో నటించేందుకు ఆమె ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చిత్ర బృందం అంచనా వేస్తోంది. మూవీ అనౌన్స్‌మెంట్‌తో పాటే హీరో, హీరోయిన్ల పేరు ప్రకటించాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే నాగచైతన్య కంటే పూజా కాస్త ఎత్తు ఎక్కువ ఉండటంతో రొమాన్స్ పరంగా కాస్త ఇబ్బంది కలగొచ్చేమోనని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; పూజా హెగ్డే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ గత మూడేళ్లుగా పూజా హెగ్డే (Pooja Hegde)కు అసలు కలిసి రావడం లేదు. ప్రభాస్‌తో చేసిన రాధేశ్యామ్​ (Radhe Shyam)తో మొదలైన ఆమె ఫ్లాపుల పరంపర ‘బీస్ట్’ (Beast)​, ‘ఆచార్య’ (Acharya), ‘సర్కస్’ (Circus)​, ‘కిసి కా భాయ్​ కిసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan)​ వరకూ కొనసాగింది. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు హ్యాపీగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపింది. అటు మేకర్స్‌ సైతం ఆమెను కాస్త పక్కన పెట్టారు. అయితే ఈ మధ్యే మళ్లీ పూజాకు ఆఫర్లు మొదలయ్యాయి. ‘దేవా’, ‘సూర్య 44’, ‘దళపతి 69’ సినిమాల్లో ఆమెకు అవకాశాలు దక్కాయి. ఇక చైతూతో ప్రాజెక్ట్​ ఓకే అయితే ఆచార్య తర్వాత ఆమె చేయబోయే మెుదటి తెలుగు సినిమా ఇదే కానుంది.  ‘తండేల్‌’తో వస్తోన్న చైతూ ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య 'తండేల్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతడికి జోడీగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తోంది. లవ్‌ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్‌’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య ఆశలన్నీ ఈ మూవీపైనే ఉంది. ‘బంగార్రాజు’, ‘థ్యాంక్‌ యూ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, గతేడాది వచ్చిన ‘కస్టడీ’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందాయి. దీంతో ‘తండేల్‌’ ద్వారా ఎలాగైన గెలుపు బాట పట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 7న రిలీజ్‌ కానుంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది.&nbsp; డిసెంబర్‌లో చై - శోభిత పెళ్లి! టాలీవుడ్‌ స్టార్‌ నటుడు అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల అనంతరం నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)తో ఏడడుగులు వేయబోతున్నాడు. డిసెంబర్‌ 4న వీరు గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. డిసెంబర్‌ 2న సంగీత్‌, 3న మెహందీ, 4న పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 10న గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేసినట్లు టాక్‌. వీరి వివాహం హైదరాబాద్‌ (Hyderabad)లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ (Annapurna Studios)లోనే జరగబోతోనున్నట్లు సమాచారం. ఈ మేరకు పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సెట్టింగ్‌, డెకరేషన్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. పెళ్లికి అతి తక్కువ మందిని మాత్రమే పిలబోతున్నట్లు తెలిసింది. రిసెప్షన్‌కు మాత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానించనున్నారు.&nbsp;
    నవంబర్ 16 , 2024
    Hidimba Movie Review: ఊహకందని ట్విస్ట్‌లతో  ‘హిడింబ’.. మరి అశ్విన్‌బాబు బ్లాక్‌బాస్టర్‌ కొట్టినట్లేనా?
    Hidimba Movie Review: ఊహకందని ట్విస్ట్‌లతో  ‘హిడింబ’.. మరి అశ్విన్‌బాబు బ్లాక్‌బాస్టర్‌ కొట్టినట్లేనా?
    న‌టీన‌టులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు. ద‌ర్శ‌క‌త్వం: అనిల్ క‌న్నెగంటి సంగీతం:&nbsp; వికాస్ బాడిస‌ ఛాయాగ్ర‌హ‌ణం: &nbsp;బి.రాజ‌శేఖ‌ర్‌ నిర్మాత‌: &nbsp;గంగప‌ట్నం శ్రీధ‌ర్‌ విడుద‌ల తేదీ: &nbsp;20-07-2023 టాలీవుడ్ యువదర్శకులు సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆసక్తిరేపే కథాంశాన్ని సినిమాగా ఎంచుకొని బ్లాక్‌ బ్లాస్టర్‌ హిట్స్‌ అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన విరూపాక్ష, బలగం, బేబి సినిమాలే ఇందుకు ఉదాహరణ. కాగా, తాజాగా విడుదలైన ‘హిడింబ’ సైతం ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే ఉద్దేశంతో తెరకెక్కింది. అశ్విన్‌బాబు హీరోగా అనిల్ క‌న్నెగంటి తెర‌కెక్కించిన సినిమా ఇది. టీజ‌ర్, ట్రైల‌ర్లు ఆస‌క్తిరేకెత్తించేలా ఉండ‌టం, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ దీన్ని స‌మ‌ర్పిస్తుండ‌టంతో ప్రేక్ష‌కుల దృష్టి ఈ చిత్రంపై ప‌డింది. మ‌రి ఈ ‘హిడింబ’ క‌థేంటి? ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి పంచింది? వంటి అంశాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; క‌థేంటి&nbsp; అభ‌య్ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత‌) పోలీస్ శిక్ష‌ణ‌లో ఉండ‌గా ఒకరినొకరు ఇష్టపడతారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోతారు. త‌ర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీస‌ర్ అవుతుంది. అభ‌య్ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్‌ అధికారిగా పనిచేస్తుంటాడు. వీళ్లిద్ద‌రూ ఓ కేసు విష‌య‌మై మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేయాల్సి వస్తుంది. న‌గ‌రంలో జ‌రుగుతున్న అమ్మాయిల సీరియ‌ల్ కిడ్నాప్‌ల‌కు సంబంధించిన కేస‌ది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్ర‌మంలో బోయ అనే క‌రుడుగ‌ట్టిన ముఠాను ప‌ట్టుకుంటారు. అయినప్పటికీ కిడ్నాప్‌లు ఆగవు. ఈ నేపథ్యంలోనే డిపార్ట్‌మెంట్‌కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. మ‌రి ఈ కేసును ఆద్య‌, అభ‌య్ ఎలా ఛేదించారు? అస‌లు ఈ కిడ్నాప్‌లు చేస్తున్న నేర‌స్థుడెవ‌రు? అండ‌మాన్ దీవుల్లో ఉన్న ఓ ఆదిమ తెగ‌కు ఈ క‌థ‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్న‌ది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.. ఎవ‌రెలా చేశారంటే న‌టుడిగా అశ్విన్‌ను మ‌రో మెట్టు పైకి ఎక్కించే చిత్ర‌మిది. ఈ సినిమా కోసం ఆయ‌న మేకోవ‌ర్ అయిన తీరు ఆక‌ట్టుకుంటుంది. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లోనూ, ప‌తాక స‌న్నివేశాల్లోనూ ఆయ‌న న‌ట‌న మ‌రో స్థాయిలో ఉంటుంది. హీరోకి దీటైన పాత్ర‌లో నందితా న‌టించింది. ప్ర‌థ‌మార్థంలో ఓ పాట‌లో రొమాంటిక్ లుక్స్‌తో ఆక‌ట్టుకుంటుంది. ఇక మ‌క‌రంద్ దేశ్ పాండే పాత్ర స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. ఆ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దాడు.&nbsp; ర‌ఘు కుంచె, సంజ‌య్ స్వ‌రూప్‌, షిజ్జు, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ పిళ్లై త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి. ఎలా సాగిందంటే టైటిల్స్ కార్డ్స్‌తోనే ద‌ర్శ‌కుడు అనిల్ క‌న్నెగంటి&nbsp; నేరుగా క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. న‌గ‌రంలో అమ్మాయిలు వ‌రుస‌గా కిడ్నాప్ అవ్వ‌డం, ఆ కేసును ఛేదించేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆద్య‌ను రంగంలోకి దింప‌డం.. ఇలా చ‌క‌చ‌కా క‌థ ప‌రుగులు తీస్తుంది. కానీ, కేసు ఇన్వెస్టిగేష‌న్ ఆరంభ‌మైన‌ప్ప‌టి నుంచి సినిమా ఒక్క‌సారిగా రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలా మారిపోతుంది. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే కేసుకు సంబంధించిన క్లూలు తెలిసిపోతుంటాయి. ఇది ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌దు. మ‌ధ్య‌లో ఓ పాట‌తో నాయ‌కానాయిక‌ల ప్రేమ‌క‌థ‌ను చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. దాంట్లో పెద్ద‌గా ఫీల్ క‌నిపించ‌దు. ప్రీక్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్ మాత్రం సర్‌ప్రైజ్‌. హీరోలోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించే ఎపిసోడ్ అది. ప‌తాక స‌న్నివేశాలు ఊహ‌ల‌కు అంద‌ని రీతిలో ఉన్నా ముగింపు సంతృప్తిక‌రంగా అనిపించ‌దు. డైరెక్షన్‌ &amp; టెక్నికల్ అంశాలు ద‌ర్శ‌కుడు అనిల్ క‌న్నెగంటి ఎంచుకున్న క‌థ‌లో కొత్త‌ద‌నమున్నా, దాన్ని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌పై చూపించ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నా, మొత్తంగా చూసిన‌ప్పుడు దీంట్లో ఏదో వెలితి క‌నిపిస్తుంది. చాలా స‌న్నివేశాలు లాజిక్కుకు దూరంగా ఉన్నాయి. ప్ర‌థమార్ధంలో మాన‌వ అవ‌య‌వాల అక్ర‌మ ర‌వాణా ఎపిసోడ్‌ను ట‌చ్ చేశారు. దానికి ముగింపు ఇవ్వ‌లేదు. ఈ చిత్రానికి నేప‌థ్య సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ క‌థా నేప‌థ్యంట్విస్ట్‌లుపోరాట ఘ‌ట్టాలు,నేప‌థ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ప్లేపాటలులవ్‌ట్రాక్‌ రేటింగ్‌ 2.5/5 https://www.youtube.com/watch?v=MK-pFLfPmyk
    ఆగస్టు 08 , 2023
    Tollywood Actress Bikini Photos: టాలీవుడ్‌ హీరోయిన్లను ఇంత హాట్‌గా ఎప్పుడు చూసి ఉండరు
    Tollywood Actress Bikini Photos: టాలీవుడ్‌ హీరోయిన్లను ఇంత హాట్‌గా ఎప్పుడు చూసి ఉండరు
    యంగ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ బికిని ఆందాలతో చెలరేగిపోతోంది. నటి సమంత కూడా గ్లామర్‌ డోస్‌ పెంచుతోంది. హాట్‌ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తోంది పూజా హెగ్డే సైతం అందాల తెగింపుతో అలరిస్తోంది. బికినీతో ఫ్యాన్స్‌కు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. పెళ్లి తర్వాత మూవీలకు కాజల్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. రకూల్‌ నెట్టింట సొగసుల పంట పండిస్తోంది. హోయలతో సోషల్‌మీడియాను హీటెక్కిస్తోంది. తొలి నుంచి అందాల ఆరబోతకు శ్రుతి ముందుంటుంది. సినిమాల్లో తన మార్క్‌ చూపిస్తుంటుంది. తమన్న కూడా స్కిన్‌ షోతో ఆకట్టుకుంటోంది. ఎద అందాలతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. తాప్సీ పన్ను ప్రస్తుతం హిందీ సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. అక్కడ ఆమెకు కలిసిరావట్లేదు. పెళ్లైన తర్వాత కూడా హన్సికా మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తోంది. బికినితో అలరిస్తోంది. విరూపాక్ష బ్యూటీ సంయుక్త మీనన్ బికినీలో కనిపించి షాకిచ్చింది.&nbsp;
    మే 16 , 2023
    ఈ వారం(April 21) థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
    ఈ వారం(April 21) థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
    వేసవి కాలం వచ్చేసింది. కొద్ది రోజుల్లో విద్యార్థులకు సెలవలు వస్తాయి. పిల్లలు, పెద్దలు దొరికిన కాస్త సమయాన్ని సినిమాలు చూడటానికి కేటాయిస్తారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఒకసారి అవెంటో తెలుసుకోండి. విరూపాక్ష సాయి ధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన విరూపాక్ష ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విభిన్నమైన కథతో కార్తీక్ దండు తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలు చూసే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుందని చిత్రబృందం తెలిపింది. చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీసుకువస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, లుక్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.&nbsp; హలో.. మీరా.. ! గార్గేయి ఎల్లాప్రగడ ప్రధానపాత్రలో నటించిన హలో… మీరా ! చిత్రం కూడా ఈ నెల 21న శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా సాగుతుంది. కాకర్ల శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇది కూడా సస్పెన్స్‌ డ్రామా థ్రిల్లర్‌ కథతో రూపొందింది. తెరపై కనిపించే.. తెర వెనుక వినిపించే పాత్రలకు సినిమాపై ఆసక్తిని పెంచాయి.&nbsp; ఓటీటీ చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు Title CategoryLanguagePlatformRelease DateHow to get rich&nbsp;Series&nbsp;EnglishNetflixApril 18Chimp empire&nbsp;Documentary&nbsp;English&nbsp;Nerflix&nbsp;April 19The marked heart&nbsp;Series&nbsp;EnglishNetflixApril 19Chota bheemSeries&nbsp;HindiNetflixApril 20Tooth pariMovieHindiNetflix&nbsp;April 20Diplomat&nbsp;MovieEnglishNetflixApril 20Satya 2MovieTelugu&nbsp;NetflixApril 21Ready&nbsp;MovieTelugu&nbsp;NetflixApril 21Indian hatch making&nbsp;SeriesHindi&nbsp;NetflixApril 21A tourist guide to loveMovieEnglish&nbsp;NetflixApril 21Garmi&nbsp;SeriesHindi&nbsp;Sony livApril 21Suga&nbsp;Documentary specialHindi&nbsp;hotstarApril 21 https://telugu.yousay.tv/tollywood-cult-movies-shiva-to-dussehra-these-are-the-movies-that-made-the-telugu-audience-drool.html
    ఏప్రిల్ 18 , 2023
    <strong>Tollywood New Directors: టాలీవుడ్‌లో కొత్త డైరెక్టర్ల హవా.. తొలి చిత్రంతోనే బ్లాక్‌ బాస్టర్ విజయాలు!</strong>
    Tollywood New Directors: టాలీవుడ్‌లో కొత్త డైరెక్టర్ల హవా.. తొలి చిత్రంతోనే బ్లాక్‌ బాస్టర్ విజయాలు!
    టాలీవుడ్‌లో కొత్త శకం మెుదలైంది. వినూత్న ఆలోచనలు కలిగిన దర్శకులు కొత్త కథలతో వచ్చి బ్లాక్ బాస్టర్‌ విజయాలను అందుకుంటున్నారు. పూరి జగన్నాథ్‌, హరీష్‌ శంకర్‌, శ్రీను వైట్ల, రామ్‌ గోపాల్‌ వర్మ, వి.వి. వినాయక్‌, తేజ, గుణశేఖర్‌ వంటి స్టార్‌ డైరెక్టర్లు హిట్స్‌ లేక ఇబ్బంది పడుతుంటే కుర్ర దర్శకులు మాత్రం ఫస్ట్ సినిమాతోనే అలవోకగా బ్లాక్‌ బాస్టర్‌ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఫ్రెష్‌ కథలు, వైవిధ్యమైన మేకింగ్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తున్నారు. ఇంతకీ ఆ యంగ్‌ డైరెక్టర్స్ ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అంజి కె. మణికుమార్‌ ఎన్టీఆర్‌ బామ మరిది నార్నే నితిన్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ చిత్రం 'ఆయ్‌' (Aay). అంజి కె. మణిపుత్ర (Anji K. Maniputhra) ఈ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయం అయ్యారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘తంగలాన్‌ ’వంటి పెద్ద హీరోల సినిమాలను తట్టుకొని నిలబడింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. గోదావరి నేపథ్యంలో తనదైన మేకింగ్‌ స్టైల్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించి ప్రసంసలు అందుకున్నారు. అమలాపురం నేపథ్యం, చిన్న నాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, ఆప్యాయతలు, వెటకారం ఇలా అన్నింటిని మేళవిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.&nbsp; యదువంశీ మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.17.76 కోట్లు (GROSS) వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతోనే యదువంశీ (Yadu Vamsi) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఓ గ్రామం నేపథ్యంలో కుర్రాళ్లతో సాగిన ఈ కథను అతడు అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు.&nbsp; ముఖేశ్‌ ప్రజాపతి అంజలి వేశ్యగా నటించిన లేటెస్ట్ వెబ్‌ సిరీస్‌ 'బహిష్కరణ'. ఈ సిరీస్‌ ద్వారా దర్శకుడిగా ముఖేశ్‌ ప్రజాపతి (Mukesh Prajapati) డెబ్యూ ఇచ్చాడు. ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకొని మంచి వ్యూస్‌ సాధించింది. ఇందులో కుల వివక్షను కళ్లకు కట్టాడు దర్శకుడు. ఊరి పెద్ద అయిన వ్యక్తి అణగారిన వారి పట్ల ఎలా వ్యవహించేవారు? మహిళలను ఎలా హింసించేవారు? అన్నది ఈ సిరీస్‌లో చూపించారు. వేశ్య కోణంలో ముకేశ్‌ ప్రజాపతి తెరకెక్కించిన ఈ రివేంజ్‌ డ్రామా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. శౌర్యువ్‌ నాని రీసెంట్‌ చిత్రం 'హాయ్‌ నాన్న'తో శౌర్యువ్‌ (Shouryuu) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక టిపికల్ సబ్జెక్ట్‌ను తీసుకొని అతడు అందంగా ప్రజెంట్‌ చేసిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని అతడు చక్కగా చూపించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. తొలి చిత్రంతోనే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అతడు ఇంపాక్ట్‌ చూపించాడు. 'హాయ్ నాన్న' చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సైతం సాధించింది.&nbsp; కల్యాణ్‌ శంకర్‌ ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్‌ యూత్ ఎంటర్‌టైనర్‌ చిత్రాల్లో 'మ్యాడ్‌' ఒకటి. దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ (Kalyan Sankar) తన తొలి ప్రయత్నంతోనే సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా తనకు మంచి భవిష్యత్‌ ఉందని కల్యాణ్‌ శంకర్‌ తొలి చిత్రంతోనే చాటి చెప్పాడు. కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో ఆకట్టుకునే ఫన్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలోనే కామెడీ సీన్స్‌, డైలాగ్స్‌ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.&nbsp; కార్తిక్‌ దండు ‘విరూపాక్ష’ చిత్రంతో కార్తిక్‌ దండు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఒక డిఫరెంట్ హారర్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. కార్తిక్‌ దండు సినిమాను నడిపిన విధానంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. శ్రీకాంత్ ఓదెల నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు. వేణు యెల్దండి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. హీరో నానితో అతడు సినిమా తీసే అవకాశముంది.&nbsp; ప్రశాంత్ వర్మ అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారారు. 2024 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మహేష్‌, వెంకటేష్‌, నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలను వెనక్కి నెట్టి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; గౌతమ్ తిన్ననూరి నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’తో గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు నాని నటనపై ప్రశంసల వర్షం కురిసింది. గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలోనే గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. ప్రస్తుతం అతడు విజయ్ దేవరకొండతో ‘VD12’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తోంది.&nbsp; బుచ్చిబాబు సానా తొలి చిత్రం ‘ఉప్పెన’తో డైరెక్టర్ బుచ్చిబాబు సానా అందరి దృష్టిని ఆకర్షించారు. డిఫరెంట్‌ లవ్‌స్టోరీతో ప్రశంసలు అందుకున్నాడు. తన తర్వాతి చిత్రాన్ని రామ్‌ చరణ్‌తో అనౌన్స్‌ చేసి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సినిమాలో చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేయనుంది. స్పోర్ట్స్‌ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నటుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ఇటీవల ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కించారు.&nbsp;
    ఆగస్టు 27 , 2024
    <strong>69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!</strong>
    69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!
    ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ 2024లో విజేతల ఎంపిక ప్రక్రియ మెుదలైంది. దక్షిణాది సినీ పరిశ్రమలైన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ సౌత్‌ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితాను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాలని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా గణనీయ సంఖ్యలో టాలీవుడ్‌ చిత్రాలు, నటీనటులు నామినేషన్స్‌ బరిలో నిలిచారు. ఇంతకీ ఆ తెలుగు చిత్రాలు ఏవి? ఏ విభాగాల్లో ఏ తెలుగు నటులు పోటీలో నిలిచారు? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; నాని.. డబుల్‌ ధమాకా! 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 నామినేషన్స్‌లో హీరో నాని (Nani) డబుల్ ధమాకాగా నిలిచారు. ఉత్తమ నటుడు కేటగిరిలో రెండు సినిమాలకు (దసరా, హాయ్‌ నాన్న) నాని నామినేట్‌ అయ్యాడు. ఇదే కేటగిరిలో టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి (వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ (భగవంత్‌ కేసరి), ధనుష్‌ (సర్), నవీన్‌ పోలిశెట్టి (మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌ రాజ్‌ (రంగమార్తాండ), ఆనంద్‌ దేవరకొండ (బేబీ) నిలిచారు. అటు ఉత్తమ దర్శకుడు విభాగంలోనూ హాయ్‌ నాన్న, దసరా చిత్రాలు ఉండటం విశేషం. ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్‌ (దసరా) ఫిల్మ్‌ఫేర్ అవార్డు రేసులో నిలిచింది.&nbsp; బేబీ చిత్రం హవా! 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ నామినేషన్స్‌లో బేబీ చిత్రం సత్తా చాటింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది విభాగాల్లో నామినేషన్స్‌లో నిలిచింది. ఉత్తమ నటుడు (ఆనంద్‌ దేవరకొండ) కేటగిరితో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్‌ (సాయి రాజేష్‌), ఉత్తమ నటి (వైష్ణవి చైతన్య), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్‌ (విజయ్‌ బుల్గానిన్‌), ఉత్తమ గేయ రచయిత (ఆనంత శ్రీరామ్‌), ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (శ్రీరామ చంద్ర, పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌) విభాగాల్లో బేబి చిత్రం బరిలో నిలిచింది. దీంతో ఫిల్మ్‌ఫేర్‌లో ‘బేబీ’ చిత్రానికి భారీగానే అవార్డ్స్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.&nbsp; https://twitter.com/MassMovieMakers/status/1813445764934431164 ఫిల్మ్‌ అవార్డ్స్‌ కోసం వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే... ఉత్తమ చిత్రం బేబీబలగందసరాహాయ్‌ నాన్నమిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టిసామజవరగమనసలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌ ఉత్తమ నటుడు ఆనంద్‌ దేవరకొండ (బేబీ)బాలకృష్ణ (భగవంత్‌ కేసరి)చిరంజీవి (వాల్తేర్‌ వీరయ్య)ధనుష్‌ (సర్‌)నాని (దసరా)నాని (హాయ్‌ నాన్న)నవీన్‌ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ) ఉత్తమ నటి: అనుష్క (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)కీర్తిసురేశ్‌ (దసరా)మృణాళ్‌ ఠాకూర్‌ (హాయ్‌ నాన్న)సమంత (శాకుంతలం)వైష్ణవీ చైతన్య (బేబీ) ఉత్తమ దర్శకుడు: అనిల్‌ రావిపూడి (భగవంత్‌ కేసరి)కార్తిక్‌ దండు (విరూపాక్ష)ప్రశాంత్‌నీల్‌ (సలార్‌:పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)సాయి రాజేశ్‌ (బేబీ)శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)శ్రీకాంత్‌ ఓదెల (దసరా)వేణు యెల్దండ (బలగం) ఉత్తమ సహాయ నటుడు: బ్రహ్మానందం (రంగ మార్తండ)దీక్షిత్‌శెట్టి (దసరా)కోట జయరాం (బలగం)నరేశ్‌ (సామజవరగమన)రవితేజ (వాల్తేర్‌ వీరయ్య)విష్ణు ఓఐ (కీడా కోలా) ఉత్తమ సహాయ నటి: రమ్యకృష్ణ (రంగమార్తండ)రోహిణి మోల్లెటి (రైటర్‌ పద్మభూషణ్‌)రుపా లక్ష్మీ (బలగం)శ్యామల (విరూపాక్ష)శ్రీలీల (భగవంత్‌ కేసరి)శ్రియారెడ్డి (సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)శ్వేతరెడ్డి (మంత్‌ ఆఫ్‌ మధు) ఉత్తమ గాయని: చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్‌ పాప)దీ (చమ్కీల అంగీలేసి -దసరా)మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం)శక్తిశ్రీ గోపాలన్‌ (అమ్మాడి -హాయ్‌ నాన్న)శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు -సర్‌) ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కుల్‌కర్ణి (సమయ-హాయ్‌ నాన్న)హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (ఖుషి -టైటిల్‌ సాంగ్‌)పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (ప్రేమిస్తున్నా -బేబీ)రామ్‌ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం)సిధ్‌ శ్రీరామ్‌ (ఆరాధ్య – ఖుషి)శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ) ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌: బేబీ (విజయ్‌ బుల్గానిన్‌)బలగం (భీమ్స్‌ సిసిరిలియో)దసరా (సంతోష్‌ నారాయణ్‌)హాయ్‌ నాన్న (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)ఖుషి (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)వాల్తేర్‌ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్) ఉత్తమ సాహిత్యం: అనంత శ్రీరామ్‌ (గాజు బొమ్మ -హాయ్‌ నాన్న)అనంత శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)కాసర్ల శ్యామ్‌ (చమ్కీల అంగీలేసి -దసరా)కాసర్ల శ్యామ్‌ (ఊరు పల్లెటూరు -బలగం)పి.రఘు (లింగి లింగి లింగ్డి -కోట బొమ్మాళి పి.ఎస్‌)
    జూలై 17 , 2024
    Abhinav Gomatam: కామెడీ స్టార్‌ అభినవ్‌ గోమఠం గురించి ఈ విషయాలు తెలుసా?
    Abhinav Gomatam: కామెడీ స్టార్‌ అభినవ్‌ గోమఠం గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌లోని టాలెంటెడ్ యంగ్‌ నటుల్లో ‘అభినవ్‌ గోమఠం’ ముందు వరుసలో ఉంటాడు. కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించిన అభినవ్‌.. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ఓ వైపు హాస్య పాత్రలు పోషిస్తూనే మరోవైపు కథానాయకుడిగా, ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌రా’, ‘మై డియర్‌ దొంగ’ చిత్రాలు ఇటీవల రిలీజై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. అతడు లీడ్‌ రోల్‌ చేసిన ‘సేవ్‌ ద టైగర్స్‌ 1 &amp; 2’ సిరీస్‌లు ఓటీటీలో సూపర్‌ హిట్ అయ్యాయి. దీంతో అభినవ్‌ గురించి తెలుసుకునేందుకు టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి ఈ ఆర్టికల్‌లో అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; అభినవ్‌ గోమఠం ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్‌ అభినవ్‌ గోమఠం ఎప్పుడు పుట్టాడు? జనవరి 1, 1986 అభినవ్‌ గోమఠం ఎత్తు ఎంత? 5 ఫీట్‌ 10 ఇంచెస్‌ (178 సెం.మీ) అభినవ్‌ గోమఠం రాశి ఏది? సింహా రాశి అభినవ్‌ గోమఠం స్కూలింగ్‌ ఎక్కడ జరిగింది? హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అభినవ్‌.. తన ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అభినవ్‌ గోమఠం విద్యార్హత ఏంటి? హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో బీటెక్‌ చేశాడు.&nbsp; అభినవ్‌ గోమఠానికి పెళ్లి జరిగిందా? కాలేదు&nbsp;&nbsp; అభినవ్‌ గోమఠం తండ్రి ఏం చేసేవారు? అభినవ్‌ తండ్రి ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగి.&nbsp; అభినవ్‌ గోమఠం కెరీర్‌ ప్రారంభంలో ఏం చేశాడు? నటనపై ఆసక్తితో ఉడాన్‌ థియేటర్‌, అహరం థియేటర్‌ వంటి సంస్థల ఆధ్వర్యంలో పలు నాటకాలు ప్రదర్శించాడు. ఆ తర్వాత లఘు చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.&nbsp; అభినవ్‌ గోమఠం చేసిన తొలి షార్ట్‌ ఫిల్మ్‌ ఏది? ఆర్టిఫిషియల్‌ (2012) అభినవ్‌ గోమఠం చేసిన&nbsp; మొదటి చిత్రం ఏది? మైనే ప్యార్ కియా (Maine Pyaar Kiya) అభినవ్‌ గోమఠంను పాపులర్‌ చేసిన చిత్రం? ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi) అభినవ్‌ గోమఠం ఇప్పటివరకూ చేసిన చిత్రాలు ఏవి? ‘మైనే ప్యార్ కియా’, ‘బిల్లా రంగ’, ‘జగన్నాటకం’, ‘మళ్ళీరావా’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘జెస్సీ’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘సీత’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘రంగ్ దే’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘సెహరి’, ‘విరూపాక్ష’, ‘గూఢచారి’, ‘గాందీవధారి అర్జున’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘కిస్మత్’, ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘మై డియర్ దొంగ’.. అభినవ్‌ గోమఠం ఇప్పటివరకూ చేసిన వెబ్‌సిరీస్‌లు? ‘అర్థమైందా అరుణ్ కుమార్’, ‘తులసివనం’, ‘సేవ్ ద టైగర్స్’, ‘సేవ్ ది టైగర్స్ 2’ అభినవ్‌ గోమఠంపై వచ్చిన వివాదస్పద ఆరోపణలు ఏంటి? టాలీవుడ్‌ నటి కల్పిక.. అభినవ్‌ గోమఠంపై సంచలన ఆరోపణలు చేసింది. అభినవ్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తనను వేధించాడని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అభినవ్‌ కొట్టిపారేశారు.&nbsp; అభినవ్‌ గోమఠం నెట్‌ వర్త్‌ ఎంత? ఏడాదికి రూ.1.5 కోట్లు (అంచనా) అభినవ్‌ గోమఠం ఫేవరేట్‌ హీరో ఎవరు? షారుక్‌ ఖాన్ అభినవ్‌ గోమఠం ఫేవరేట్‌ డైరెక్టర్‌ ఎవరు? మణిరత్నం అభినవ్‌ గోమఠం బెస్ట్‌ డైలాగ్ ఏది? ఈ నగరానికి ఏమైంది సినిమాలో వచ్చే బార్‌ సీన్‌.. అభినవ్‌ను చాలా పాపులర్‌ చేసింది. నలుగురు ఫ్రెండ్స్‌ (విష్వక్‌, కౌషిక్ (అభినవ్‌), ఉప్పు, కార్తిక్‌) బార్‌లో సిట్టింగ్‌ వేస్తారు. ఆ సందర్భంలో అభినవ్‌ వేసే డైలాగ్స్‌ యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సీన్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; అభినవ్‌ : ఈ నగరానికి ఏమైంది. ఓ పక్కన బారు.. ఇంకో పక్కన ఫ్రెండ్స్‌. అయినా ఎవరూ తాగట్లేదేంటి? రేయ్‌.. ఆ వాంట్‌ టూ సే సమ్‌థింగ్‌ రా. విష్వక్‌: వీడొకడు.. అభినవ్‌ : ఎన్నేళ్లు అయ్యిందిరా మనం ఇట్ల కూర్చొని తాగి. ఆల్‌ మోస్ట్ 4 ఇయర్స్‌. ఐ యామ్‌ వెరీ హ్యాపీ. తాగుదాం.&nbsp; ఉప్పు : రేయ్‌.. త్రీ డేస్‌ బ్యాక్‌ పెంట్ హౌస్‌లో కూర్చొని తాగాం మనం. అభినవ్‌ : అది వేరురా.. కార్తిక్‌: లాస్ట్‌ వీకే కదరా.. క్లబ్‌లో ఎంట్రీ కోసం వచ్చి తాగినాం అభినవ్‌ : నేను ఎక్కువ తాగలేదు ఆ రోజు. విష్వక్‌ : టూ డేస్‌ అయ్యింది వీడు మందు తాగాం అని కాల్‌ చేసి.. అభినవ్‌ : అయితే ఏంది ఇప్పుడు.. నేను అనొద్దా ఇట్లా. ఎగ్జామినేషన్‌ హాల్‌లో కూర్చున్నట్లు అందరం సైలెంట్‌గా కూర్చోవాలా. నువ్వేందిరా గ్లాసెస్ వేసుకున్నావ్‌ (విష్వక్‌తో). ఆరింటి తర్వాత కళ్లద్దాలు పెట్టుకుంటే గుడ్లు పెట్టి కొట్టేవాళ్లం నీకు గుర్తు లేదా? ఎందుకు పెట్టుకున్నావ్‌. విష్వక్‌ : పళ్లు రాలతాయ్‌.. అర్థమవుతుందా ఉప్పు : కళ్లల్లో మండే అగ్ని గోళాలను ఆపుకోడానికి ఈ రైబాన్‌ వేసుకున్నాడు చూశావా? అభినవ్‌ : లవ్‌ అయ్యిందా రా? (కార్తిక్‌ తో) కార్తిక్ : లవ్‌ ఏముంది రా.. ఫస్ట్ డెవలప్‌ అవ్వాలి.. పెళ్లి అయ్యాక ఇవన్నీ అయిపోతాయి. నలుగురు ఫ్రెండ్స్‌: డెవలప్‌.. డెవలప్‌.. డెవలప్‌.. డెవలప్‌.. https://youtu.be/qAluEZGqhh8?si=IymIAooV_cchv61s అభినవ్‌ గోమఠంను ఫేమస్‌ చేసిన సింగిల్‌ లైన్‌ డైలాగ్స్‌? ‘ఛీ దీనెమ్మ ఏం టార్చర్‌’ ‘ఏం రా వేడి చేసిందా’ అభినవ్‌ గోమఠం బెస్ట్‌ యాక్టింగ్‌ సీన్‌? ఈ నగరానికి ఏమైంది సినిమాలో అభినవ్‌ పాత్రను పరిచయం చేసే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. ఇందులో అభినవ్‌ తన నటనతో అదరగొట్టాడు. ముఖ్యంగా జంతువులకు డబ్బింగ్‌ చెప్పేటప్పుడు అతడు ఎక్స్‌ప్రెషన్స్‌ నవ్వులు తెప్పిస్తాయి. అభినవ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఓ సారి మీరు చూసేయండి.&nbsp; https://youtu.be/9uiW6XzEEWc?si=SxGSZETzIZbJcyzF అభినవ్‌ గోమఠం చిత్రాలు/సిరీస్‌లకు సంబంధించిన పోస్టర్లు? అభినవ్‌ గోమఠం వైరల్‌ వీడియో ఏది? దావత్‌ అనే షోలో అభినవ్‌ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఇందులో సన్నీ లియోన్‌ ప్రస్తావన రాగా.. ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు ఆమె ప్రీవియస్‌ వర్క్స్‌ చూసేవాడినని చెప్తాడు. ఈ మాటతో యాంకర్‌ రీతు సహా అక్కడ ఉన్న వారంతా ఇరగపడి నవ్వుతారు. ఇందుకు సంబంధించిన వీడియోపై ఓ లుక్కేయండి. https://www.instagram.com/reel/C5ksjvkpqib/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA== అభినవ్‌ గోమఠం రీసెంట్‌ ఫొటోలు?
    ఏప్రిల్ 26 , 2024
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    ఈ ఏడాది టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు, వందల సంఖ్యలో పాటలు విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కొన్ని తెలుగు పాటలు జాతీయస్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తూ అత్యధిక ఆదరణను సంపాదించాయి. 2023లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న పాటలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; మా బావ మనోభావాలు.. ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించిన ఐటెం సాంగ్‌.. 'మా బావ మనోభావాలు..'. వీరసింహారెడ్డి సినిమాలోని ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. ఈ సాంగ్‌లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసి అదరగొట్టారు. సాహితి, యామిని, రేణు కుమార్‌ ఆలపించిన ఈ పాటను రామ జోగయ్యశాస్త్రి రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. https://www.youtube.com/watch?v=DCrO12C5oho ఓ రెండు ప్రేమ మేఘాలిలా 'బేబీ' చిత్రం ఈ ఏడాది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట గుండెల్ని పిండేస్తుంది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సాంగ్‌.. యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలను పొందింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI మాస్టారు మాస్టారు ధనుష్ హీరోగా రూపొందిన 'సార్‌' చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని 'మాస్టారు మాస్టారు' సాంగ్ సంగీత ప్రియులను కట్టిపడేసింది. ఈ పాటను ప్రముఖ కన్నడ గాయని శ్వేతా మోహన్‌ ఆలపించారు.&nbsp; https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 పొట్టిపిల్ల జబర్దస్త్‌ వేణు డైరెక్ట్ చేసిన ‘బలగం’ సినిమాలోని ‘పొట్టిపిల్ల’ సాంగ్ ఈ ఏడాది బాగా వినిపించింది. చాలా ఫంక్షన్లు, యూత్‌ ఈవెంట్లలో మారుమోగింది. ముఖ్యంగా యువత ఈ పాటపై రీల్స్‌ చేసుకొని షేర్‌ చేసుకున్నారు. పొట్టిపిల్ల పాటను సింగర్‌ రామ్‌ మిరియాల ఆలపించారు.&nbsp; https://www.youtube.com/watch?v=CDNb6zyybDg చంకీల అంగీలేసి హీరో నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఈ సినిమాలోని 'చంకీల అంగిలేసి' అప్పట్లో విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు పెద్ద ఎత్తున రీల్స్‌ చేసి సందడి చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ పాటపై అద్భుత రీల్స్‌ చేసి అలరించారు.&nbsp; https://www.youtube.com/watch?v=9O-mBYAqM1c నచ్చావులే నచ్చావులే సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త జంటగా నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'విరూపాక్ష'. ఈ సినిమాతో పాటే ఇందులోని 'నచ్చావులే నచ్చావులే' సాంగ్ మంచి ఆదరణను సంపాదించింది. కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను కార్తిక్ ఆలపించగా.. అజనీశ్‌ లోక్‌నాథ్‌ స్వరపరిచారు. https://www.youtube.com/watch?v=TUGfWIO_fFI ఆరాథ్య విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా చేసిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఆరాథ్య’ సాంగ్‌ యూత్‌కు మరింత బాగా కనెక్ట్‌ అయ్యింది. చాలా మందికి ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లోనూ అధిక వీక్షణలు పొందింది.&nbsp; https://www.youtube.com/watch?v=wlC_eFbxwDo సమ్మోహనుడా.. రూల్స్ రంజన్ సినిమాలోని ‘సమ్మోహనుడా’ సాంగ్‌ ఈ ఏడాది సోషల్‌ మీడియాను షేక్ చేసింది. అమ్‌రిష్ ఇచ్చిన ట్యూన్.. శ్రీయా గోషల్ వాయిస్‌ అందర్నీ కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గానూ నిలిచింది. సాంగ్‌ రిలీజ్ అనంతరం ట్రెండ్‌ అయిన పది రీల్స్‌లో ఐదు ఈ పాటకు సంబంధించినవే కావడం విశేషం. https://www.youtube.com/watch?v=aJQcn34K_S8 నిజమే నే చెబుతున్నా ఊరి పేరు భైర‌వ‌కోన సినిమాలోని 'నిజ‌మే నే చెబుతున్నా' సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. ఈ పాటకు శ్రీమ‌ణి సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. https://www.youtube.com/watch?v=2pgx-tajxwE జ‌మల్ జ‌మాలో యానిమ‌ల్ సినిమాలోని ‘జ‌మల్ జ‌మాలో’ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన ప‌దిహేను గంట‌ల్లోనే ఏడు మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. జ‌మల్ జ‌మాలో పాట నిజానికి ఒక ఇరాన్‌ సాంగ్. ఈ పాట‌ను ఇరానియ‌న్ క‌వి బిజాన్ స‌మాంద‌ర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌టినుంచి ఇరాన్‌లో పెళ్లి వేడుక‌ల‌తో పాటు ఇత‌ర పంక్ష‌న్స్‌లో ఈ పాట త‌ప్ప‌కుండా ఉండ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=PmdyY38g6Rg
    డిసెంబర్ 28 , 2023
    Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
    Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
    ఈ ఏడాది టాలీవుడ్‌ చాలా మంది హీరోయిన్లకు కలిసొచ్చింది. వారు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ప్రత్యేకించి కొందరు మాత్రం ఈ ఏడాది తమ తల రాతలను మార్చుకున్నారు. తమకంటూ స్టార్‌ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. అంతేగాక 2023 ఏడాదిలో తమకు తిరుగులేదని వారు నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు సాధించిన ఘనతలు ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; శ్రీలీల ఈ ఏడాది చాలా బాగా పాపులర్ అయిన హీరోయిన్ల జాబితాలో శ్రీలీల (Sreeleela) ప్రథమ స్థానంలో ఉంటుంది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. రవితేజ పక్కన ‘ధమాకా’లో చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా ఆ తర్వాత వరుసగా రామ్‌తో ‘స్కంద’, బాలయ్య కూతురిగా 'భగవంత్‌ కేసరి', పంజా వైష్ణవ్‌ తేజ్‌తో 'ఆదికేశవ', నితీన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' వంటి చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం మహేష్‌, విజయ్‌ దేవరకొండ, పవన్‌ కల్యాణ్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. కీర్తి సురేష్‌ యంగ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ (Keerthy Suresh)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. నాని సరసన ఆమె నటించిన 'దసరా' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. రూ.100 కోట్లకు పైగా ఇందులో తన నటనకు గానూ కీర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు ‘భోళాశంకర్‌’ సినిమాలో చిరంజీవి సోదరిగా నటించి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ పక్కన ‘మామన్నన్‌’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.&nbsp; రష్మిక మందన్న ఈ ఏడాది రష్మిక మందన్న(Rashmika Mandanna) తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. విజయ్‌తో ‘వారసుడు’ చిత్రంలో నటించిన ఈ భామ.. బాలీవుడ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిస్టర్‌ మజ్నూ’ చేసింది. ఇక రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా ఆమె నటించిన ‘యానిమల్‌’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. సమంత ఈ ఏడాది సమంత (Samantha)కు మిశ్రమ స్పందన ఎదురైంది. ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోగా విజయ్‌ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ మూవీ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు తమిళం, ఇంగ్లీష్‌లో తెరకెక్కుతున్న బైలింగ్విల్‌ ఫిల్మ్‌ ‘చెన్నై స్టోరీస్‌’లోనూ నటించే అవకాశాన్ని సమంత దక్కించుకుంది.&nbsp; సంయుక్త మీనన్‌ ఈ ఏడాది సంయుక్త మీనన్‌ (Samyuktha menon)కు మంచి విజయాలను అందించింది. ధనుష్‌ సరసన ఆమె నటించిన 'సార్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ సరసన ఆమె చేసిన 'విరూపాక్ష' చిత్రం ఘన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో సంయుక్త తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; అనుష్క శెట్టి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్టార్‌ నటి అనుష్క (Anushka Shetty) ఈ ఏడాది మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'మిస్ శెట్టి మిష్టర్‌ పోలిశెట్టి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా అనుష్కకు గట్టి కమ్‌బ్యాక్‌ లభించిందని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. శ్రుతి హాసన్‌ టాలీవుడ్‌లో సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న శ్రుతి హాసన్‌ (Shruti Haasan)కు ఈ ఏడాది కలిసొచ్చిందని చెప్పవచ్చు. చిరంజీవి, బాలకృష్ణలతో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా నానితో ‘హాయ్‌ నాన్న’ చిత్రంలోనూ ఓ పాటలో స్టెప్పులేసి అదరగొట్టింది. అలాగే ప్రభాస్‌ సరసన 'సలార్‌' సినిమాలోనూ శ్రుతి హాసన్‌ నటించింది.&nbsp;
    డిసెంబర్ 19 , 2023
    Village Flavoured Movies: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. ఈ లైన్‌తో సినిమా తీస్తే పక్కా హిట్..!
    Village Flavoured Movies: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. ఈ లైన్‌తో సినిమా తీస్తే పక్కా హిట్..!
    టాలీవుడ్‌లో నయా ట్రెండ్ నడుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమాలు బంపర్ హిట్ సాధిస్తున్నాయి. పల్లెటూరి వాతావరణం, ఆహార్యం, యాస, ఆచార సంప్రదాయాలను ఎన్నో సినిమాలు ప్రతిబింబిస్తున్నాయి. ఇలా వచ్చిన సినిమాలు విజయాన్ని అందుకుంటున్నాయి. గత కొద్ది కాలంగా విలేజ్ ఫ్లేవర్‌తో వచ్చిన సినిమాలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.&nbsp; రంగస్థలం రంగస్థలం అనే గ్రామాన్ని సృష్టించి ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో నదీ పరివాహక ప్రాంతం, పొలాలు, గుడిసెలు.. అంతా పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తన నటనతో రామ్‌చరణ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు.&nbsp; దసరా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మొదటి చిత్రం ‘దసరా’. సింగరేణి బొగ్గు గనుల్లో ఉన్న ‘వీర్లపల్లి’ అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ముఖ్యంగా, ఇక్కడి మనుషుల అలవాట్లు, కట్టుబాట్లు, వేష భాషను సినిమాలో చక్కగా చూపించారు. తెలంగాణ మాండలికంలో డైలాగులు చెబుతూ నాని యాక్టింగ్ ఇరగదీశాడు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను ఈ సినిమా క్రాస్ చేసింది. బలగం అంచనాలు లేకుండా వచ్చి సంచలనం రేపిన సినిమా ‘బలగం’. ఇదొక ఊరి కథ. ప్రతి గ్రామంలోని ఓ కుటుంబంలో ఉండే కామన్ సమస్యను ఇందులో చూపించాడు డైరెక్టర్ వేణు యెల్దండి. గ్రామస్థుల మధ్య సంబంధ, బాంధవ్యాలు; వ్యవహార శైలిని కళ్లకు కట్టినట్లు తీశాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం పెను సంచలనం సృష్టించింది. ఊర్లలో ప్రత్యేకంగా ఈ సినిమాను స్క్రీనింగ్ చేశారు. బండ్లు, బస్సులు, ట్రాక్టర్లు కట్టుకుని థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లారు.&nbsp; విరూపాక్ష పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా ఇది. రుద్రవనం అనే గ్రామంలో జరిగే ఘటనల చుట్టూ సినిమా కథను రాసుకున్నాడు డైరెక్టర్ కార్తీక్ దండు. 1990వ దశకంలో గ్రామాల్లోని పరిస్థితి ఎలా ఉండేది? మూఢ నమ్మకాలను ఎంత బలంగా విశ్వసించేవారు? పల్లెటూరి వాతావరణం వంటి వాటిని ఇందులో చూపించారు.&nbsp; పుష్ప సుకుమార్ తెరకెక్కించిన మరో చిత్రం పుష్ప. శేషాచలం అడవుల్లోని గ్రామాల్లో నెలకొనే పరిస్థితులపై సినిమా తెరకెక్కింది. నటీనటుల వేష, భాష అచ్చం రాయలసీమను ప్రతిబింబిస్తాయి. బాక్సాఫీస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుందీ సినిమా. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ ఇరగదీశాడు.&nbsp; కేరాఫ్ కంచరపాలెం కంచరపాలెం, భీమిలి పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక్కడి ప్రజల జీవనశైలిని నిశితంగా పరిశీలించి చిత్రాన్ని తీయాలని డైరెక్టర్ వెంకటేశ్ మహా భావించాడు. అలా ఓ కథను ఎంచుకుని గ్రామీణ పరిస్థితులు ఉట్టిపడేలా సినిమాను తీశాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; శ్రీకారం వ్యవసాయానికి ఆదరణ కోల్పోతున్న నేపథ్యంలో దాని ప్రాధాన్యతను తెలియజేస్తూ వచ్చిన చిత్రం ఇది. గ్రామాల్లోని రైతుల మధ్య ఉండే అనుబంధాలను ఇందులో చక్కగా చూపించాడు డైరెక్టర్ కిశోర్. శర్వానంద్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది.&nbsp;&nbsp; కాంతార చిన్న చిత్రంగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం రేపింది కాంతార. ఓ మారుమూల అటవీ గ్రామంలోని ఆచారాన్ని ఆదర్శంగా తీసుకుని సినిమాను తెరకెక్కించారు. అడవి, గ్రామస్థులు, వారి అలవాట్లు, జీవన విధానం.. ఇలా ప్రతి కోణంలోనూ పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించారు.&nbsp;
    జూన్ 13 , 2023
    This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
    This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
    అసలు సిసైలన వేసవి నెల ప్రారంభమైంది. ఈ సమయంలో థియేటర్లకు రప్పించి ప్రేక్షకులను చల్లబర్చేందుకు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ వారం(మే 5) బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరోవైపు, ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి వివరాలు చూద్దాం.&nbsp; రామబాణం హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్యం తరువాత గోపీచంద్, జగపతిబాబు, శ్రీవాస్ కాంబోలో వస్తోందీ సినిమా. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. డింపుల్ హయతీ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఖుష్బూ ప్రధాన పాత్రలో నటించింది. మే 5న సినిమా విడుదల కానుంది. ఉగ్రం నాంది హిట్ తర్వాత అల్లరి నరేష్ సరికొత్త కెరీర్‌ని పున: ప్రారంభించాడు. ఈ చిత్రానికి డైరెక్షన్ చేసిన విజయ్ కనకమేడలతో మరోసారి జతకట్టి ఈ సారి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మరో హిట్‌కు ప్రయత్నిస్తున్నాడు.ట్రైలర్ ఆసక్తిని పెంచింది. నాంది మాదిరిగానే ఇందులో మరో ప్రధాన సమస్యను డైరెక్టర్ లేవనెత్తే ప్రయత్నం చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఏటా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు చివరికి ఎటువైపు దారితీస్తున్నాయనే ప్రశ్నకు మే 5న ప్రేక్షకులకు జవాబు చెప్పనుంది. షైన్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ది కేరళ స్టోరీ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన సినిమా ఇది. సుదిప్తో సేన్ డైరెక్షన్ వహించిన ఈ మూవీ మే 5న థియేటర్ల ముందుకు రాబోతోంది. ఆదా శర్మ లీడ్ రోల్‌లో నటించింది. కేరళలో మతం మారిన మహిళలు తీవ్రవాద సంస్థల్లో చేరడం, వాటి పూర్వాపరాల గురించి దాగివున్న నిజాలను ఈ సినిమా వెలికితీయనుందని చిత్రబృందం ప్రకటించింది. దీంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్టోరీకి ఆధారాలు చూపితే రూ.కోటికి పైగా నజరానా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చిత్రబృందం మాత్రం తమ సినిమాను సమర్థించుకుంది. హిందీ భాషలో ఇది తెరకెక్కింది. విరూపాక్ష(మళయాలం) తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న విరూపాక్ష మిగతా భాషల్లోనూ అలరించేందుకు రెడీ అవుతోంది. మే 5న మళయాలం భాషలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, చిత్రబృందం ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. కొచ్చిలో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా వైపు దృష్టిని ఆకర్షిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైంది.&nbsp; అరంగేట్రం కమర్శియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమే ‘అరంగేట్రం’. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వం వహించగా మహేశ్వరి నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. ఓ ముగ్గురు యువకులు, ఆరుగురు యువతుల మధ్య జరిగే కథగా ఇది తెరకెక్కింది. జబర్దస్త్ సత్తిపండు, రోషన్, ముస్తఫా, ఆస్కరి, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, శ్రీనివాస్, అనిరుధ్, ఇందు, లయ తదితరులు నటించారు. విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మే 5న అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.&nbsp;&nbsp;&nbsp; యాద్గిరి అండ్ సన్స్ వాస్తవిక ఘటనల ఆధారంగా ‘యాద్గిరి అండ్ సన్స్’ తెరకెక్కింది. భిక్షపతి రాజు పందిరి దర్శకత్వం వహించాడు. రాజీవ్ కనకాల, మురళీధర్ గౌడ్, అనిరుధ్ తుకుంట్ల, జీవా, యశ్విని నివేదిత తదితరులు నటించారు. మే 5న సినిమా విడుదల కానుంది.&nbsp; OTT విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateClifford the Big Red DogMovieEnglishNetflixMay 2Queen Charlotte a Bridgerton StoryWeb seriesEnglishNetflixMay 2SanctuaryMovieEnglishNetflixMay 4The Larva FamilyAnimated MovieEnglishNetflix&nbsp;May 4MeterMovieTeluguNetflix&nbsp;May 53MovieTeluguNetflixMay 5YogiMovieTeluguNetflixMay 5Rowdy FellowMovieTeluguNetflixMay 5ThammuduMovieTeluguNetflixMay 5AmruthamChandamamaloMovieTeluguNetflixMay 5Match FixingMovieTeluguETV WinMay 5Tu Zuti mai makkarMovieHindiNetflixMay 5FirefliesSeriesHindiZEE 5May 5Shebhash FeludaMovieBengaliZEE5May 5Corona PapersMovieMalayalamDisney HotstarMay 5Sas Bahu aur FlamingoMovieHindiDisney HotstarMay 5
    మే 02 , 2023
    Payal Rajput:&nbsp; ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    Payal Rajput:&nbsp; ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    RX 100 కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతుంది. ఈ సారి మరింత డోసు పెంచారు. “మంగళవారం” అనే టైటిల్‌ పెట్టి పాయల్ రాజ్‌పుత్‌ టాప్‌ లెస్‌ ఫోటోను విడుదల చేశారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో సినిమా రూపుదిద్దుకుంటుంది. పాయల్‌ రాజ్‌పుత్‌ మెుదటి సినిమా నుంచే అందాల ఆరబోతతో&nbsp; హద్దుల్లేకుండా చెలరేగిపోతుంది. RX 100లో కార్తీకేయతో రొమాన్స్‌ చేసి యువతను ఆకర్షించింది ఈ అమ్మడు.&nbsp; ఆ సినిమా తర్వాత RDX లవ్‌, అనగనగా ఓ అతిథి చిత్రాల్లో బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించింది పాయల్‌. అందచందాలు ప్రదర్శించి ఆకట్టుకోవాలని చూసింది.&nbsp; సామాజిక మాధ్యమాల్లోనూ హాట్‌ఫొటోస్‌తో చెలరేగుతుంది పంజాబీ సుందరి. బాత్‌రూమ్‌లో కేవలం టవల్‌పై ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేసి షేక్ చేసింది. ఇటీవల ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న హాట్‌ పిక్స్‌ వైరల్ అయ్యాయి. ఇందులోనూ టాప్‌లెస్‌గా కనిపించింది పాయల్ రాజ్‌పుత్‌.&nbsp; సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కలిసి అలాంటి ఫోజులు ఇవ్వటంపై ట్రోల్స్‌ ఎదుర్కొంది ఈ హీరోయిన్.&nbsp; జిన్నా సినిమాలోనూ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గలేదు. వీలైనంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది.&nbsp; మంగళవారం సినిమాలో మరోసారి బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటిస్తుంది ఈ భామ. శైలజ అనే పాత్రలో టాప్‌లెస్‌గా చేతి వద్ద సీతాకోక చిలుక ఉన్నట్లు కనిపించే ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. RX 100 తర్వాత పాయల్‌ రాజ్‌పుత్‌కు తెలుగులో మంచి హిట్‌ లేదు. అందాల విందు చేసినా ఆఫర్లు మాత్రం పెద్దగా రావటం లేదు.&nbsp; ఆఫర్లు లేని కారణంగానే బోల్డ్ పాత్రల్లోనూ నటించేందుకు పాయల్ రాజ్‌పుత్‌&nbsp; సిద్ధపడుతున్నట్లు&nbsp; తెలుస్తోంది.&nbsp; RX 100, మహా సముద్రం చిత్రాలు తీసిన దర్శకుడు అజయ్‌ భూపతి మంగళవారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.&nbsp; మంగళవారం సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు.&nbsp; అజయ్‌ భూపతి రిలీజ్‌ చేసిన ఈ లుక్‌పై ఆసక్తి నెలకొంది. వర్మ కాంపౌండ్‌ నుంచి వచ్చిన ఈ దర్శకుడు మెుదట్నుంచే విభిన్నమైన సినిమాలు తీస్తున్నాడు.&nbsp;
    ఏప్రిల్ 25 , 2023
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు&nbsp; కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు&nbsp; కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్‌ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్‌ ఇమేజ్‌ ప్రేక్షకులను థియేటర్‌కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్‌ వస్తే తప్ప థియేటర్‌కు ఎవరూ వెళ్లరు. అలా&nbsp; తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్‌తో మూడో రోజు కల్లా దూసుకు పోయిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం.&nbsp; ఉప్పెన మెగాస్టార్‌ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్‌ తేజ్‌ మెుదటి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓపెనింగ్స్‌ ఫర్వాలేదనిపించినా.. హిట్‌ టాక్ రావటంతో మూడో రోజు ఏకంగా రూ. 8.26 కోట్లు కొళ్లగొట్టింది. చిత్రాన్ని రూ.15 కోట్లు పెట్టి తీస్తే రూ.83 కోట్లు వచ్చాయి.&nbsp; ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను విజయ్ సేతుపతి మెుదట ఒప్పుకోలేదు. దర్శకుడు పట్టుబట్టడంతో సైన్ చేశారు. చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను మార్చి కృతి శెట్టిని తీసుకున్నారు. ఆమె కారణంగా మరింత బజ్‌ వచ్చింది. దసరా&nbsp; నేచురల్‌ స్టార్‌ నాని నటించిన పవర్‌ ప్యాక్డ్‌ మాస్ చిత్రం దసరా. లుక్‌, యాసతో నటీనటులందరూ అదరగొట్టారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. రూ. 65 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 110 కోట్లు రాబట్టింది. ఇక మూడోరోజు రూ. 6.73 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. శ్రీకాంత్‌ ఓదెల మెుదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా అలా కనిపించదు. మరో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇచ్చి హిట్‌ కొట్టాడు నాని.&nbsp; విరూపాక్ష సాయిధరమ్ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన విరూపాక్ష హిట్‌ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. మూడోరోజు రూ. 5.77 కోట్లు రాబట్టింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు టాక్ తెలుసుకుందామని సినిమాకు వెళితే అతడి ఫోన్ కొట్టేశారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html లవ్‌ స్టోరీ శేఖర్ కమ్ముల మరో మ్యాజికల్‌ చిత్రం లవ్‌ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడో రోజు రూ. 5.19 కోట్లు వసూలు చేసింది. కులం అనే సున్నితమైన అంశాన్ని ప్రేమకథకు జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు శేఖర్. ఇందులో చైతూ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.&nbsp; బింబిసార కల్యాణ్‌రామ్‌కు మంచి హిట్‌ ఇచ్చిన సినిమా బింబిసార. చరిత్రలోని ఓ కథను తీసుకొని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు రూ. 5.02 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. రూ. 40 కోట్లు పెట్టి తీస్తే రూ. 65 కోట్లు సాధించింది. బింబిసార ఫ్రాంఛైజీలో భాగంగా మరో పార్ట్‌ కూడా వస్తుంది. చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై కల్యాణ్‌రామ్ స్వయంగా నిర్మించాడు.&nbsp; ఇస్మార్ట్ శంకర్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌, పూరి జగన్నాథ్‌లకు మంచి కిక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్‌. మెుదట్నుంచే కలెక్షన్లలో దూసుకెళ్లిన ఈ చిత్రం మూడో రోజు రూ. 4.32 కోట్లు రాబట్టింది. సినిమాకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టగా ఏకంగా రూ. 75 కోట్లు వచ్చాయి. సినిమాలో నటించిన నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వరుస కట్టాయి. మణిశర్మ బాణీలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి.&nbsp; భీష్మ వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబోలో వచ్చిన కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌ భీష్మ. బాక్సీఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం మూడో రోజు వసూళ్లు రూ. 4.31 కోట్లు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతుంది. భీష్మ, ఛలోని మించి ఉంటుందని దర్శకుడు చెప్పాడు. జాతి రత్నాలు కరోనా తర్వాత థియేటర్లలో జనం బాగా ఎంజాయ్ చేసిన సినిమా జాతి రత్నాలు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మస్త్‌ వసూళ్లు వచ్చాయి. బ్లాక్‌బస్టర్ టాక్ రావటంతో మూడో రోజు రూ. 4.28 కోట్లు రాబట్టింది. కేవలం రూ. 4 కోట్లు ఖర్చు చేయగా.. రూ. 65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కార్తీకేయ 2 ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాలీవుడ్‌ను షేక్ చేసింది కార్తీకేయ 2. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లోనూ కోట్లు రాబట్టిన కార్తీకేయ 2 మూడో రోజు కలెక్షన్లు రూ. 4.23 కోట్లు. సినిమాకు అయ్యింది రూ. 15 కోట్లు.. కానీ రూ. 117 కోట్లు కొళ్లగొట్టింది. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని నిఖిల్ చెప్పడంతో ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అఖిల్, పూజా హెగ్డే కాంబోలో లవ్‌ స్టోరీ స్పెషలిస్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తీశాడు. యావరేజ్ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లలో దూసుకెళ్లింది. ఈ సినిమాకు మూడో రోజు రూ. 4.03 కోట్లు సాధించింది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్‌ సినిమాకు హైలెట్. కలెక్షన్ల పరంగా రూ. 51 కోట్లు రాబట్టింది అఖిల్ సినిమా.
    ఏప్రిల్ 24 , 2023
    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
    ఒకప్పుడు టాలీవుడ్‌ అనగానే ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్‌ కృష్ణ గుర్తుకువచ్చేవారు. కానీ చిరంజీవి (Chiranjeevi) రాకతో తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్‌కు ఎన్నో సూపర్‌ హిట్స్‌ అందించిన చిరు.. ఇండస్ట్రీలో అగ్రహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా తన ఫ్యామిలీలోని యువతరానికి ఇండస్ట్రీ తలుపులు తెరిచాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా హీరోల హవా నడుస్తోంది. ప్రతీ ఏడాది మెగా హీరోల నుంచి కనీసం ఒక సినిమా అయినా రావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌ను శాసిస్తున్న మెగా హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.. పవన్‌ కల్యాణ్‌ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో ఒకరిగా క్రేజ్‌ సంపాదించాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (1996) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్‌.. సుస్వాగతం, తొలి ప్రేమ, ఖుషీ మూవీలతో అగ్రహీరోల సరసన చేరిపోయాడు. రీసెంట్‌గా పవన్‌ తీసిన వకీల్‌ సాబ్‌ (Vakeel saab), భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, హరిహర వీర మల్లు సినిమా షూటింగ్‌లలో పవన్‌ బిజీగా ఉన్నాడు.&nbsp; రామ్‌చరణ్‌ చిరు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్‌చరణ్ (Ram Charan).. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. మెుదట చిరుత సినిమా ద్వారా చరణ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మగధీర సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రంగస్థలం (Rangasthalam) సినిమాతో చెర్రీ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దానిని ఆర్‌ఆర్‌ఆర్‌ మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్‌ సినిమాలో చరణ్‌ నటిస్తున్నాడు. దాని తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్‌ సినిమా ఉండనుంది.&nbsp; అల్లుఅర్జున్‌ చిరు మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా అల్లుఅర్జున్‌ (Allu Arjun) సినిమాల్లోకి వచ్చారు. తొలి సినిమా ‘గంగోత్రి’తో బన్ని మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన ఆర్య, బన్నీ, దేశముదురు చిత్రాలతో హీరోగా అల్లుఅర్జున్ స్థిరపడ్డారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమాతో బన్నీ పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు హీరోల్లో బన్నీ తొలిస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) షూటింగ్‌లో బన్నీ బిజీబిజీగా గడుపుతున్నాడు.&nbsp; సాయిధరమ్‌ తేజ్‌ చిరంజీవి సోదరి కుమారుడైన సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కూడా మెగా మేనల్లుడుగానే ఇండస్ట్రీ తలుపు తట్టాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (2014) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.&nbsp;సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌, సుప్రీమ్‌, చిత్ర లహారి సినిమాల ద్వారా సూపర్‌ హిట్స్ అందుకున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ లేటెస్ట్‌ మూవీ విరూపాక్ష ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; వరణ్‌ తేజ్‌&nbsp; మెగా బ్రదర్‌ నాగబాబు కుమారుడిగా వరణ్‌ తేజ్‌(Varun Tej) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం ‘ముకుంద’తో తేజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తేజ్‌ హీరోగా చేసిన కంచె, అంతరిక్షం, తొలిప్రేమ, ఫిదా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తేజ్‌ VT13, గాంధీవదారి అర్జున సినిమాల్లో నటిస్తున్నాడు.&nbsp; పంజా వైష్ణవ్‌ తేజ్‌ పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej) కూడా చిరు సోదరి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ఉప్పెనతోనే ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపొలం మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీసెంట్‌గా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా వైష్ణవ్‌కు షాక్‌ ఇచ్చింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.&nbsp; అల్లు శిరీష్‌ చిరు మేనల్లుడిగా, బన్నీ తమ్ముడిగా అల్లు శిరీష్‌ (Allu Sirish) సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రం గౌరవంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్‌... ఒక క్షణం, ABCD, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకున్నాడు. శిరీష్‌ చేసిన శ్రీరస్తూ శుభమస్తూ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. అయితే శిరీష్‌ లేటెస్‌ మూవీ ఊర్వశివో రాక్షసివో చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp; కళ్యాణ్‌ దేవ్‌ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విజేత సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్‌ దేవ్‌ పర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూపర్‌ మచ్చి, కిన్నెర సాని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.&nbsp;
    ఏప్రిల్ 11 , 2023
    <strong>HBD Naga Chaitanya: నాగ చైతన్య క్రష్ ఎవరో తెలుసా? మీరు అనుకునేవారు మాత్రం కాదు!</strong>
    HBD Naga Chaitanya: నాగ చైతన్య క్రష్ ఎవరో తెలుసా? మీరు అనుకునేవారు మాత్రం కాదు!
    టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోల్లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ఒకరు. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. సాలిడ్‌ విజయాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి కుర్రాడిలా అనిపిస్తూ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇవాళ (నవంబర్‌ 23) నాగ చైతన్య పుట్టిన రోజు. 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో చైతూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనటువంటి ఘనమైన కుటుంబ నేపథ్యం అక్కినేని నాగ చైతన్యకు ఉంది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల వారసత్వాన్ని చైతూ కొణికి పుచ్చుకున్నాడు. 1986 నవంబర్‌ 23న అక్కినేని నాగార్జున, లక్ష్మీ (డి. రామానాయుడు కూతురు, వెంకటేష్‌ సోదరి) దంపతులకు హైదరాబాద్‌లో జన్మించాడు. నాగచైతన్య చిన్నప్పుడే లక్ష్మీతో నాగార్జున విడిపోయారు. దీంతో చెన్నైలో తల్లి వద్దనే చైతన్య పెరిగాడు. అక్కడే పీఎస్‌బీబీ స్కూల్‌లో స్కూలింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌ వచ్చాడు.&nbsp; హైదరాబాద్‌లోని సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో కామర్స్‌ చేశాడు. చదువులో చైతన్య బ్రిలియంట్‌ ఏమి కాదు. తాను జస్ట్ యావరేజ్‌ స్టూడెంట్‌ అని చైతూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.&nbsp; ప్రస్తుతం నాగ చైతన్య (HBD Akkineni Naga Chaitanya)ను చూస్తే చాలా ఫిట్‌గా 38 ఏళ్లు వచ్చినట్లు అసలు కనిపించడు. కానీ టీనేజ్‌లో అతడు చాలా లావుగా ఉండేవాడు. 98 కేజీల వరకూ బరువు ఉండేవాడట. చూడటానికి చాలా బొద్దుగా కనిపిస్తుండటంతో అప్పట్లో అందరూ 'డంబూ' అని చైతూను పిలిచేవారట. అక్కినేని కంటే దగ్గుబాటి ఫ్యామిలీ వారే చైతూనూ బాగా ముద్దు చేశారని సమాచారం.&nbsp; హీరో కావాలన్న కోరిక నాగచైతన్య చిన్నప్పటి నుంచి లేదట. డిగ్రీ మిడిల్‌కు వచ్చాక కూడా కెరీర్‌పై స్పష్టత లేదట. తండ్రితో షూటింగ్స్‌ వెళ్లడం వల్ల సినిమాలపై చైతూకి ఆసక్తి వచ్చింది.&nbsp; సినిమాల్లోకి వస్తానని నాగార్జునకు చైతూ చెప్పగా నీ ఇష్టమని ఆయన బదులిచ్చారు. అయితే బరువు తగ్గాలని మాత్రం సూచించినట్లు తెలిసింది.&nbsp; నాగార్జున సూచనతో ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టిన నాగచైతన్య బాగా బరువు తగ్గాడు. దాంతోపాటు కాలిఫోర్నియాలోని ఓ యాక్టింగ్‌ స్కూల్లో ఏడాదిన్నర పాటు శిక్షణ తీసుకున్నాడు.&nbsp; అలా 2009లో 'జోష్‌' సినిమాతో నాగచైతన్య (HBD Akkineni Naga Chaitanya) తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చేసిన 'ఏం మాయ చేశావే' సినిమా నాగచైతన్య కెరీర్‌ను మలుపు తిప్పింది.&nbsp; సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే తెలుగు నటుడు అనగానే ముందుగా నాగ చైతన్యనే గుర్తుకు వస్తాడు. ఈ మధ్య పర్వాలేదు గానీ మెుదట్లో మెయిన్ స్ట్రీమ్‌ మీడియాకు సైతం చైతూ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు కాదు.&nbsp; సోషల్ మీడియాలో పంచుకుంటే ఇక మన ప్రైవసీ ఏముందని నాగ చైతన్య తరచూ చెబుతుంటాడు. వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ప్రైవేటుగానే ఉండాలని ఈ కుర్ర హీరో అభిప్రాయం. నాగచైతన్య (HBD Akkineni Naga Chaitanya) చూడటానికి సాఫ్ట్‌గా కనిపించినా రేసింగ్‌లో మాత్రం దుమ్మురేపుతుంటాడు. హైస్పీడ్‌ బైక్స్‌, కార్లు అవలీలగా నడిపేస్తుంటాడు వాస్తవానికి రేసర్ కావాలని తొలుత నాగ చైతన్య భావించాడు. కొన్ని పోటీల్లో కూడా పాల్గొన్నట్లు అతడి సన్నిహితులు చెప్పారు. కొన్ని కారణాలతో ఆ ఆలోచన విరమించుకున్నాడు.&nbsp; ప్రొఫెషనల్ రేసర్ కానప్పటికీ ఇప్పటికీ రేసర్‌గానే తనని తాను భావిస్తుంటాడు చైతూ. రేసింగ్ కార్లను కొనుగోలు చేయడం అభిరుచిగా పెట్టుకున్నాడు. ఖాళీ సమయాల్లో ఫుల్‌ స్పీడుతో డ్రైవింగ్‌ చేస్తుంటాడు. ప్రస్తుతం చైతూ గ్యారేజీలో ఫెరారీ, నిస్సాన్‌ జీటీ-ఆర్‌, పోర్షె పనమెరా, పోర్షె కాయన్నే, రేంజ్‌ రోవర్‌ వోగ్‌ లాంటి అత్యంత వేగంగా వెళ్లే కార్లు ఉన్నాయి. వీటితో పాటు ఎంవీ అగస్టా, బీఎండబ్ల్యూ వంటి రేసింగ్‌ బైక్స్‌ కూడా ఉన్నాయి. ఫిట్‌నెస్‌కు చైతూ (HBD Akkineni Naga Chaitanya) చాలా ప్రాధాన్యత ఇస్తాడు. క్రమం తప్పకుండా వర్కౌట్లు చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటాడు. ఇందుకోసం ఇంట్లోనే చిన్నపాటి జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.&nbsp; చైతూకి మెుహమాటం చాలా ఎక్కువ. అతడితో కొద్దిసేపు మాట్లాడితే ఎవరికైనా ఇది తెలిసిపోతుందని ఆయన ఫ్రెండ్స్‌ చెబుతుంటారు.&nbsp; చైతూకి ఫ్రెండ్స్‌ కూడా చాలా తక్కువేనట. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా. బంధుత్వానికి మించిన స్నేహం చిన్నప్పటి నుంచి వారి మధ్య ఉంది.&nbsp; చైతూ మంచితనం, వ్యక్తిత్వం చూసి 'స్వీట్‌ కిడ్‌' అని పేరు పెట్టానని రానా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. చైతూని ఎవరైనా ఇష్టపడతారని పేర్కొన్నారు.&nbsp; చైతూ ఇష్టమైన ఫుడ్ విషయానికి వస్తే ‘బటర్‌ చికెన్‌’ అంటే అతడికి బాగా ఇష్టం. వారంలో కనీసం రెండుసార్లైనా అది ఉండాల్సిందేనని చైతూ చెబుతుంటాడు.&nbsp; నాగ చైతన్య (HBD Akkineni Naga Chaitanya)కు ఓ ఊతపదం ఉంది. బాగా అబ్జర్వ్‌ చేస్తే తప్ప అది గుర్తించలేరు. ఇంతకీ ఆ పదం ఏంటంటే 'యూ నో'. ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన ఓ నటిపై టీనేజ్‌ నుంచి నాగచైతన్యకు క్రష్‌ ఉండేదట. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌. ఏడేళ్ల పాటు ప్రేమించి స్టార్‌ హీరోయిన్‌ సమంతను 2017 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నాడు. అనివార్య కారణాలతే నాలుగేళ్లకే (2021) వారు విడిపోయారు.&nbsp; ప్రముఖ నటి శోభితా దూళిపాళ్లను 2024 ఆగస్టు 8న చైతు నిశ్చితార్థం చేసుకున్నాడు. డిసెంబర్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది.&nbsp; ఇక సినిమాల విషయానికొస్తే విరూపాక్ష డైరెక్టర్‌ కార్తీక్‌ దండుతో చైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఇవాళ (నవంబర్‌ 23) చైతూ బర్త్‌డే సందర్భంగా ఆ మూవీ నుంచి పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.&nbsp; https://twitter.com/chay_akkineni/status/1860218199587062221 'NC 24' వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌తో కలిసి డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్మించనున్నారు.&nbsp;
    నవంబర్ 23 , 2024

    @2021 KTree