• TFIDB EN
  • వాల్తేరు వీరయ్య
    UATelugu2h 40m
    వాల్తేరు వీరయ్య( చిరంజీవి) జాలరి పేటలో ప్రజలకు దేవుడు. ఆయన మాటకు తిరుగులేదు. సముద్రపు ఒడ్డున చిరంజీవికి తెలియకుండా కొంతమంది డ్రగ్స్ రవాణా చేస్తుంటారు. వారిని ఏసీపీ విక్రమ్( రవితేజ) అరెస్ట్ చేస్తాడు. అడ్డుపడిన చిరంజీవిని కూడా లాకప్‌లో వేస్తాడు. చిరంజీవి జైళ్లో ఉన్న సమయంలో అనుకోని విషాదం ఎదురవుతుంది. ఆ విషాధానికి కారణం ప్రకాశ్ రాజ్‌ అని తెలుసుకుని పోలీస్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్‌తో కలిసి చిరంజీవి మలేషియా వెళ్తాడు. ఆ విషాదం ఏమిటి అనేది కథ
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    చిరంజీవి
    వాల్టెయిర్ వీరయ్య
    రవితేజ
    ACP విక్రమ్ సాగర్ IPS
    శృతి హాసన్
    రా ఏజెంట్ అతిధి
    కేథరిన్ ట్రెసా
    విక్రమ్ భార్య
    రాజేంద్ర ప్రసాద్
    సీఐ సీతాపతి
    ప్రకాష్ రాజ్
    సోలమన్ అన్నయ్య
    బాబీ సింహా
    మైఖేల్ తమ్ముడు
    బేబీ శ్రేష్టవైష్ణవి మరియు విక్రమ్ మరియు నిత్య కూతురు; వీరయ్య మేనకోడలు
    నాసర్
    కానిస్టేబుల్ కోటేశ్వరరావు
    సత్యరాజ్
    సత్యమూర్తి
    వెన్నెల కిషోర్
    సీతాపతికి అల్లుడు
    సుబ్బరాజు
    ఏడుకొండలు
    సప్తగిరి
    వీరయ్య స్నేహితుడు
    షకలక శంకర్
    వీరయ్య స్నేహితుడు
    ప్రదీప్ రావత్
    వీరయ్య స్నేహితుడు
    రాజేంద్రన్
    గుండు మణి
    జయప్రకాష్
    హైకోర్టు న్యాయమూర్తి
    ప్రభాస్ శ్రీను
    బుజ్జి
    మనోబాల
    ఒక న్యాయమూర్తి
    ఝాన్సీ లక్ష్మి
    లాయర్
    రఘు బాబు
    డిఫెన్స్ లాయర్
    కల్యాణి నటరాజన్
    విక్రమ్ తల్లి
    BS అవినాష్వేలప్పన్ కరుప్పన్ మరియు మైఖేల్ వ్యాపార భాగస్వామి
    మైమ్ గోపి
    ఒక గూండా
    జాన్ విజయ్
    మైఖేల్ సహాయకుడు
    ప్రవీణ్
    పోలీసు అధికారి
    అనీష్ కురువిల్లా
    నేవీ అధికారి
    వినయ్ వర్మ
    పోలీస్ ఎస్పీ
    వాసు ఇంటూరి
    పూజారి
    చమ్మక్ చంద్ర
    ఒక గూండా
    మాథ్యూ వర్గీస్ జాయింట్ కమిషనర్
    కేదార్ శంకర్నిత్య తండ్రి
    ప్రమోదినిసీతాపతి భార్య
    కల్పలత ఒక నిరసనకారుడు
    ఊర్వశి రౌటేలా
    శేఖర్
    స్వయంగా
    సిబ్బంది
    బాబీ కొల్లిదర్శకుడు
    నవీన్ యెర్నేనినిర్మాత
    వై. రవిశంకర్నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    ఆర్థర్ ఎ. విల్సన్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ…. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు లోడింగ్
    వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ…. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు లోడింగ్
    ]రేటింగ్: 3.0/5చిరంజీవి మాస్ యాక్టింగ్ రవితేజ- చిరంజీవి మధ్య సీన్లు ఇంటర్వెల్ ట్విస్ట్ పాటలు నిర్మాణ విలువలుబలాలుసాగదీత సన్నివేశాలు కథలో కొత్తదనం లేమి అంతగా పేలని కామెడీ పంచ్‌లుబలహీనతలు
    ఫిబ్రవరి 13 , 2023
    5 Reasons to watch “వాల్తేరు వీరయ్య”
    5 Reasons to watch “వాల్తేరు వీరయ్య”
    ]సంక్రాంతి రేసులో చిరంజీవి ఎన్నో సూపర్ హిట్స్ కొట్టారు. మరోసారి బాలయ్యతో పోటీకి దిగారు. ఇందుకోసమైనా ఎలా ఉందో చూడాలని ఇద్దరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.చిరు - బాలయ్య క్లాష్
    ఫిబ్రవరి 13 , 2023
    రూ.150 కోట్ల క్లబ్‌లోకి బాస్‌ ‘వాల్తేరు వీరయ్య’ ఈ క్లబ్‌కు బాస్‌ మాత్రం మహేశ్‌ బాబు!
    రూ.150 కోట్ల క్లబ్‌లోకి బాస్‌ ‘వాల్తేరు వీరయ్య’ ఈ క్లబ్‌కు బాస్‌ మాత్రం మహేశ్‌ బాబు!
    ]  ప్రభాస్‌  -   సలార్‌, ప్రాజెక్ట్‌ K, ఆది పురుష్   హీరో    -      సినిమాలు  మహేశ్‌ -   SSMB28, రాజమౌళి సినిమా  అల్లు అర్జున్  -   పుష్ప-2  రామ్‌ చరణ్‌  -  RC15  పవన్ కల్యాణ్ -  హరిహర వీరమల్లు, సుజిత్‌,                    హరీశ్‌ శంకర్‌ సినిమాలు
    ఫిబ్రవరి 13 , 2023
    సంక్రాంతికి విడుదలైన చిరంజీవి సినిమాలు
    సంక్రాంతికి విడుదలైన చిరంజీవి సినిమాలు
    ]సంక్రాంతి బ్లాక్‌ బస్టర్‌ జోష్‌ను చిరంజీవి కొనసాగించాలని చూస్తున్నారేమో. ఈ సారి కూడా వాల్తేరు వీరయ్యతో సిద్ధం అయిపోయారు. విజయంపై మరింత ధీమాాగా ఉన్నారు.వాల్తేరు వీరయ్య
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Ram Charan - Suriya: రామ్‌ చరణ్‌కు ప్రత్యర్థిగా సూర్య.. మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధమైందా?</strong>
    Ram Charan - Suriya: రామ్‌ చరణ్‌కు ప్రత్యర్థిగా సూర్య.. మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధమైందా?
    టాలీవుడ్‌లో మల్టీ స్టారర్‌ చిత్రాలకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. దీంతో స్టార్‌ హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (తారక్‌ - రామ్‌చరణ్‌), వాల్తేరు వీరయ్య (చిరు - రవితేజ), ‘సలార్‌’ (ప్రభాస్‌ - పృథ్వీరాజ్‌ సుకుమారన్‌), కల్కి (ప్రభాస్‌, అమితాబ్‌, కమల్‌) చిత్రాలు ఏ స్థాయి సక్సెస్‌ సాధించాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మరో మైండ్‌ బ్లోయింగ్‌ మల్టీ స్టారర్‌ తెలుగులో రాబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దక్షిణాది స్టార్‌ హీరోలు రామ్‌చరణ్‌, సూర్యలు కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.&nbsp; చరణ్‌కు విలన్‌గా సూర్య! గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ (Ram Charan), తమిళ స్టార్‌ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ రాబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్‌ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే చరణ్‌ - సూర్య మధ్య వచ్చే ఫైట్‌ సీక్వెన్స్‌ క్రేజీగా ఉంటుందని అంటున్నారు.&nbsp; బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.&nbsp; ప్రభాస్‌తో సినిమా తర్వాతే! పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో డైరెక్టర్‌ హను రాఘవపూడి ఓ బిగ్‌ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి కథ చర్చలు కూడా ఇటీవలే ముగిసాయి. స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రం సాగనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్‌ నిర్మించబోయే ఈ సినిమాకు 'ఫౌజి' అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. డైరెక్టర్ హను గత చిత్రాలకు భిన్నంగా పూర్తి యాక్షన్‌ డ్రామాగా ఇది రూపొందనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌తో సినిమా తర్వాతనే రామ్‌చరణ్‌-సూర్య కాంబో మూవీపై హను రాఘవపూడి దృష్టి పెడతారని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చరణ్‌-సూర్య బిజీ బిజీ ప్రస్తుతం రామ్‌ చరణ్‌, సూర్య ఇద్దరూ తమ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాలో నటిస్తుండగా సూర్య 'కంగువ' (Kanguva) చేస్తున్నాడు. సూర్య చిత్రం అక్టోబర్‌ 10న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. అటు రామ్‌చరణ్‌ డిసెంబర్‌లో అందరినీ ఎంటర్‌టైన్‌ చేసే ఛాన్స్ ఉంది. ‘గేమ్‌ ఛేంజర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ డైరెక్టర్‌ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు. స్పోర్ట్స్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ను లాక్‌ చేశారు. ఈ సినిమాకు 'పెద్ది' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కన్నడ స్టార్‌ నటుడు శివరాజ్‌ కుమార్‌ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.&nbsp; మెగా మల్టీస్టారర్‌ లోడింగ్..! మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్‌ (Harish Shankar) ఒకరు. అటువంటి హరీశ్‌ శంకర్‌ తన 'మిస్టర్‌ బచ్చన్‌' సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్‌ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌, రామ్ చరణ్, చిరంజీవిల కోసం ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అది పట్టాలెక్కితే అన్ని పాన్ ఇండియాల కంటే అదే అతి పెద్ద పాన్ ఇండియా అవుతుందని పేర్కొన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ పైకి వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే గతంలో చిరు, రామ్‌చరణ్‌లు కలిసి ‘ఆచార్య’ చిత్రంలో నటించారు. ‘బ్రూస్‌లీ’, ‘మగధీర’ చిత్రాల్లో చరణ్‌ కోసం మెగాస్టార్‌ ఓ స్పెషల్‌ క్యామియో కూడా ఇచ్చారు. అటు పవన్‌ కల్యాణ్‌ సైతం 'శంకర్‌ దాదా MBBS', 'శంకర్‌ దాదా జిందాబాద్‌' చిత్రాల్లో చిన్న క్యామియో పోషించారు.
    జూలై 31 , 2024
    శృతి హాసన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శృతి హాసన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శృతి హాసన్ తన మెస్మరైజింగ్ టాలెంట్‌తో తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో గబ్బర్ సింగ్, క్రాక్, శ్రీమంతుడు, వాల్తేరు వీరయ్య వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అనగనగా ఓ ధీరుడు, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు చిత్రాలకు గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకున్న శృతి హాసన్(Some Lesser Known Facts about Shruti Haasan)&nbsp; గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.&nbsp; శృతి హాసన్ ముద్దు పేరు? కన్నా శృతి హాసన్ వయస్సు ఎంత? 1986, జనవరి28న జన్మించింది శృతి హాసన్ తెలుగులో నటించిన తొలి సినిమా? అనగనగా ఓ ధీరుడు(2011) శృతి హాసన్ హిందీలో నటించిన తొలి సినిమా? లక్(2009) శృతి హాసన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు&nbsp; శృతి హాసన్ ఎక్కడ పుట్టింది? చెన్నై, తమిళనాడు శృతి హాసన్&nbsp; ఏం చదివింది? సైకాలజీలో డిగ్రీ శృతి హాసన్ అభిరుచులు? షాపింగ్, ట్రావెలింగ్ శృతి హాసన్‌కి ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ శృతి హాసన్‌కు అఫైర్స్ ఉన్నాయా? హీరో సిద్ధార్థతో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతం శాంతను హజరికతో ప్రేమలో ఉంది. శృతి హాసన్‌కు&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ శృతి హాసన్‌కు ఇష్టమైన హీరో? షారుక్‌ ఖాన్, రజనీకాంత్ శృతి హాసన్‌ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల&nbsp; వరకు ఛార్జ్ చేస్తోంది. శృతి హాసన్‌ తల్లిదండ్రుల పేరు? కమల్ హాసన్, సారిక ఠాకూర్ శృతి హాసన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? శృతి హాసన్‌ సినిమాల్లోకి రాకముందు సింగర్‌గా పలు స్టేజ్ పర్ఫామెన్సెస్ ఇచ్చింది శృతి హాసన్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/shrutzhaasan/?hl=en శృతి హాసన్ వ్యాపారాలు? శృతి హాసన్ పలు కాస్మోటిక్( Guess and aldo) బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది. https://www.youtube.com/watch?v=mos5_ozTwEE శృతి హాసన్ గురించి మరికొన్ని విషయాలు స్కూళ్లో చదివేటప్పుడు తన పేరు పూజ రామచంద్రన్.శృతి హాసన్‌కు క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉంది.శృతి హాసన్ తన బెస్ట్ ఫ్రెండ్ తమన్నా భాటియా ఒకరికొకరు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి.శృతితో విడిపోతున్నట్లు ఆమె మాజీ ప్రేమికుడు మైఖెల్ కార్‌సెల్ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు.
    ఏప్రిల్ 27 , 2024
    Vishwambhara : 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో చిరంజీవి... సినిమాలో ఇదే కీలకం!
    Vishwambhara : 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో చిరంజీవి... సినిమాలో ఇదే కీలకం!
    మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు చెబితినే ఆయన ఫ్యాన్స్‌ పూనకాలతో తాండవం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చిరుకు ఉన్న క్రేజ్‌ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది ప్రారంభంలో "వాల్తేరు వీరయ్య"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో 'భోళా శంకర్‌' (Bhoola Shankar)గా వచ్చిన సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్‌తో జాగ్రత్త పడిన చిరు తన తర్వాతి చిత్రానికి ఓ సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నారు. బింబిసార ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో "విశ్వంభర" (Vishwambhara) చిత్రంలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైనట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకు అదేంటో ఇప్పుడు చూద్దాం. విశ్వంభర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు చిరంజీవి పక్కన త్రిష హీరోయిన్‌గా కన్ఫామ్ అయింది. స్టాలిన్ చిత్రం తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ జోడీ ఎలాంటి కెమిస్ట్రీని స్క్రీన్‌పై పండిస్తారని చర్చించుకుంటున్నారు. అయితే విశ్వంభర సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిపోనుందని చెప్పుకొచ్చారు. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో చిరంజీవి 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో కనిపిస్తాడని తెలిసింది. ఈ గెటప్‌లో చిరంజీ మునుపెన్నడు కనిపించని లుక్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నాడని టాక్. ప్లాష్ బ్యాక్ నేపథ్యంగా వచ్చే సీన్స్ గ్రాఫిక్స్ విజువ్ వండర్స్‌గా ఉంటాయని సమాచారం. మరోవైపు రీసెంట్‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్  సైతం చేశాడు. ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే పాత్రను డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అద్భుతమైన క్యారెక్టరైజేషన్‌తో పాటుగా ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందని చిన్నపాటి లీక్స్ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని క్రేజీ గెటప్‌లో చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విశ్వంభర చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర చిత్రం కోసం ప్రత్యేకంగా తన బాడీని టోన్ చేస్తున్నారు. యంగ్‌గా కనిపించేందుకు ఎక్కువసేపూ వ్యయామం చేస్తున్నారు. జిమ్‌లో అన్ని రకాల కసరత్తులు చేస్తున్న చిరు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 68 ఏళ్ల వయసులోనూ చిరు ఈ రేంజ్‌లో జిమ్ చేయడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.  ఇక చిరంజీవి ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఎంటర్టైనింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుందట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం.
    ఫిబ్రవరి 26 , 2024
    Devi Sri Prasad Hits: DSP టాప్‌-10 బెస్ట్‌ సాంగ్స్.. ఈ పాటలు వింటే మైమరిచిపోవాల్సిందే..!
    Devi Sri Prasad Hits: DSP టాప్‌-10 బెస్ట్‌ సాంగ్స్.. ఈ పాటలు వింటే మైమరిచిపోవాల్సిందే..!
    టాలీవుడ్ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్‌ ఒకరు. 1999లో విడుదలైన దేవి చిత్రంతో దేవిశ్రీ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పాటలు సూపర్‌హిట్‌ కావడంతో దేవిశ్రీ కెరీర్‌కు తిరుగులేకుండా పోయింది. దేవి సినిమా నుంచి రీసెంట్‌ వాల్తేరు వీరయ్య వరకు డీఎస్పీ ఎన్నో సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ అందించారు. హీరోకు తగ్గట్లు మ్యూజిక్ అందించే దేవి.. మాస్‌, క్లాస్, మెలోడి, ట్రెడిషనల్‌ సాంగ్స్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ఇచ్చిన టాప్‌-10 సూపర్ హిట్ సాంగ్స్‌ మీకోసం.. 1. పూనకాలు లోడింగ్ మెగాస్టార్‌ చిరంజీవి లేటెస్ట్‌ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. ఇందులో అన్ని పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అయితే ‘పూనకాలు లోడింగ్‌’ పాట మాత్రం ప్రేక్షకులను ఉర్రూతలూగించిందనే చెప్పాలి. దేవిశ్రీ సంగీతానికి తోడు చిరు, రవితేజ డ్యాన్స్‌ నిజంగానే థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించింది.&nbsp; https://www.youtube.com/watch?v=4JMpHGMYm1w 2. శ్రీవల్లి సుకుమార్‌ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించింది. సినిమా విజయానికి దేవిశ్రీ ఇచ్చిన పాటలు సైతం ఎంతో దోహదపడ్డాయి. ముఖ్యంగా ‘శ్రీవల్లి’ పాట అప్పట్లో మార్మోగింది. పందిళ్లు, శుభకార్యాలు, వేడుకలు ఇలా ఏ కార్యక్రమమైన శ్రీవల్లి పాట వినిపించాల్సిందే. ఈ పాట ద్వారా సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌కు మంచి పేరు వచ్చింది.&nbsp; https://www.youtube.com/watch?v=txHO7PLGE3o 3. బుల్లెట్‌ సాంగ్ రామ్‌ పోతినేని, కృతి శెెట్టి జంటగా నటించిన ‘వారియర్‌’ సినిమాలో ‘బుల్లెట్‌ సాంగ్’ బాగా హిట్ అయింది. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ పాట మాత్రం మ్యూజిక్‌ లవర్స్‌కు బాగా దగ్గరైంది.&nbsp;దేవిశ్రీ ప్రసాద్ మాస్‌ బీట్‌కు రామ్‌, కృతి డ్యాన్స్‌ తోడవడంతో ఈ సాంగ్‌ ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=WgrLE4Fqxeo 4. జల జల జలపాతం నువ్వు చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో దేవిశ్రీ ఇచ్చిన పాటలు కూాడా అంతే ఆదరణ పొందాయి. ముఖ్యంగా ‘జల జల జలపాతం’ నువ్వు అనే పాట యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయింది.&nbsp; https://www.youtube.com/watch?v=PTpimuHzlvE 5. ఎంత సక్కగున్నావే రామ్‌చరణ్‌లోని గొప్ప నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ‘రంగస్థలం’. ఇందులో చెర్రీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేగాక దేవిశ్రీ ఇచ్చిన పాటల్లో చరణ్‌ తనదైన స్టెప్పులతో అదరగొట్టాడు. ముఖ్యంగా ‘ఎంత సక్కగున్నావే’ పాట అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో సమంత హోయలు, రామ్‌చరణ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ పాటకు మరింత హైప్‌ తీసుకొచ్చింది.&nbsp; https://www.youtube.com/watch?v=NuWs_eKu_ic 6. ప్రేమ వెన్నెల చిరు మేనల్లుడు సాయిధరమ్‌ కెరీర్‌లో మంచి వసూళ్లను రాబట్టిన సినిమా చిత్ర లహరి. ఇందులో తేజ్ నటనతో పాటు దేవిశ్రీ సంగీతానికి ప్రేక్షుకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ‘ప్రేమ వెన్నెల’ పాట సినిమాకే హైలెట్‌ అని చెప్పాలి. లవ్‌ మెలోడీగా రూపొందిన ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. తేజ్‌ కెరీర్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మెలోడి సాంగ్‌గా నిలించింది.&nbsp; https://www.youtube.com/watch?v=tpvNtKjlf5E 7. మైండ్‌ బ్లాక్‌ మహేశ్‌ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. దేవి శ్రీ అందించిన సంగీతం ఈ సినిమాకా బాగా ప్లస్‌ అయింది. ముఖ్యంగా ‘మైండ్‌ బ్లాక్‌’ పాటపై చాలా మంచి హైప్ వచ్చింది. దేవి శ్రీ ఇచ్చిన హై ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌కు మహేశ్‌, రష్మి హై వోల్టెజ్‌ పర్‌ఫార్మెన్స్‌ తోడవడంతో సాంగ్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; https://www.youtube.com/watch?v=ZBDSNy4Yn9Q 8. సీటీ మార్‌ అల్లుఅర్జున్‌ హీరోగా హరీశ్ శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన దువ్వాడ జగన్నాథం చిత్రానికి దేవిశ్రీనే సంగీతం ఇచ్చారు. ఇందులోని అన్ని పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ముఖ్యంగా ‘సీటీమార్‌’ పాట అప్పట్లో ఎంతో క్రేజ్‌ తెచ్చుకుంది. దేవిశ్రీ ఎనర్జీటిక్ మ్యూజిక్‌కు అల్లు అర్జున్‌ క్లాస్‌ స్పెప్పులు జతకావడంతో పాట రేంజ్‌ పెరిగిపోయింది.&nbsp; https://www.youtube.com/watch?v=F5X694sak5U 9. నువ్వొస్తానంటే నేనొద్దంటానా ప్రభాస్‌ హీరోగా చేసిన వర్షం సినిమాకు దేవిశ్రీ ఫీల్‌గుడ్‌ సాంగ్స్‌ను అందించారు. ముఖ్యంగా హీరోయిన్ త్రిష వర్షంలో డ్యాన్స్‌ చేసే పాట ఎప్పటికీ దేవిశ్రీ టాప్‌ సాంగ్స్‌లో ఒకటిగా ఉంటుంది.‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ సాగే ఈ పాట హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. https://www.youtube.com/watch?v=eUrC0jWdu-M 10. నువ్వుంటే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని సినిమాాల్లో కెల్లా కెరీర్‌ స్టార్టింగ్‌లో చేసిన ఆర్య చిత్రం ఎంతో ప్రత్యేకమైంది. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్‌ ఇప్పటికీ సూపర్‌హిట్‌గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ‘నువ్వుంటే’ పాటను ఇప్పటికీ గుర్తుచేసుకొని వినేవాళ్లు చాలా మందే ఉన్నారు. ప్రేమ గొప్పతనాన్ని వర్ణిస్తూ సాగే ఈ పాటలో అల్లుఅర్జున్‌ నటన ఆకట్టుకుంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=Llw7cXHmDDo
    ఏప్రిల్ 04 , 2023
    Urvashi Rautela: బోల్డ్ లుక్‌లో ఊర్వశి రౌటేలా.. సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్ముతున్న కుర్రాళ్లు
    Urvashi Rautela: బోల్డ్ లుక్‌లో ఊర్వశి రౌటేలా.. సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్ముతున్న కుర్రాళ్లు
    బాలీవుడ్ హాట్ డాల్ ఊర్వశి రౌటేలా.. తాజాగా తన హాట్ ఫొటో షూట్ ఫోటోలు షేర్ చేసింది. ఎద సౌష్టవం కనిపించేలా కిర్రెక్కించింది. బికినీలో దిగిన ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది. రోజుకో అందాల ఆరబోతతో అభిమానులను తడిసి ముద్దయ్యేలా చేస్తోంది. హిందీలో స్టార్ హీరోయిన్‌గా స్థిరపడిపోవాలని ఉబలాటపడిన అందాల తార ఊర్వశి రౌటేలా.. అక్కడ విఫలమవడంతో తెలుగులో ఐటెం సాంగ్స్‌లో రెచ్చిపోతోంది. బ్రో, వాల్తేరు వీరయ్య సినిమాల్లో ఐటెం సాంగ్‌ల్లో నర్తించి తెలుగు ఫ్యాన్స్‌కు దగ్గరైంది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసిన ఈ కుర్ర అందం.. 2015 మిస్ దివా యూనివర్స్ టైటిల్‌ని గెలుచుకుంది. అదే ఏడాది భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో కూడ పాల్గొంది సింగ్ సాబ్ ది గ్రేట్ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ.. తెలుగులో బ్లాక్ రోజ్ అనే మూవీలో కూడ నటించింది తమిళ్, కన్నడ చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో కూడ నటించింది గ్లామరస్ ఫోజులతో కుర్రకారు మనసు దోచుకున్న ఊర్వశికి ఇన్‌స్టా‌గ్రామ్‌లో 69 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామకి సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా దక్కింది. ఇన్ని ఘనతలు ఉన్నా ఊర్వశికి రౌటేలాకు మాత్రం రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించిన సరైన హిట్‌ లేక నేల చూపులు చూస్తోంది. సినిమాలు లేకపోతేనేం.. సోషల్ మీడియాలో తన అందాలను దోరగా వడ్డిస్తూ కుర్రకారును పెద్దసంఖ్యలో ఫాలోవర్లుగా మార్చుకుంటోంది.
    డిసెంబర్ 01 , 2023
    Memes on Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్‌పై మీమ్స్.. ఇంత టాలెంట్‌గా ఉన్నారెంట్రా బాబు!
    Memes on Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్‌పై మీమ్స్.. ఇంత టాలెంట్‌గా ఉన్నారెంట్రా బాబు!
    మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. జూన్ 20న జన్మించిన మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి సినీ, రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అగ్ర హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ రామ్‌చరణ్ దంపతులను విష్ చేశారు. దీంతో సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ హడావుడి చేసేస్తున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి ట్విటర్‌లో మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.&nbsp; మెగా లిటిల్ ప్రిన్సెస్ ఆగమనాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇస్తూ ఓ నెటిజన్ వినూత్నంగా పార్టీ అడిగారు. వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘బాస్ పార్టీ’ సాంగ్‌ని ట్యాగ్ చేసి ‘బాసూ పార్టీ ఎక్కడా’ అంటూ అడుగుతున్నారు.&nbsp; https://twitter.com/Nithish13771106/status/1671007811839623170 దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ ఫలించిందంటూ మెగాస్టార్ ఎమోషనలయ్యారు. మెగా ఇంట అన్నీ శుభకార్యాలే జరుగుతున్నాయని, చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. https://twitter.com/Hemanth_RcCult/status/1671006003612225536 లిటిల్ ప్రిన్సెస్ పుట్టిందని తెలియగానే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎలా ఆనందపడ్డారో తెలుపుతూ మరో మీమ్ చేశారు.&nbsp; https://twitter.com/WeLoveMegastar/status/1671021787042447365 లయన్ కింగ్ సినిమాలో కూన సింహాన్ని రాజుగా ప్రకటించే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలా రామ్‌చరణ్, ఉపాసన తమ కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారంటూ ఓ మీమ్ చేశారు. https://twitter.com/s_siechojithu/status/1670955824305569795 రామ్‌చరణ్, ఉపాసనల గారాల పట్టికి తన బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలిస్తే ఎలా ఆశ్చర్యపోతుందోనని చెబుతూ ఓ మీమ్ చేశారు. https://twitter.com/HereFoRamCharan/status/1671203912190406656 తన నాన్న అల్లూరి సీతారామరాజు, తాతా ఇంద్రసేనరెడ్డి, చిన్నతాత గబ్బర్ సింగ్, మామయ్య పుష్పరాజ్ అని తెలుసుకుని మురిసిపోతుంది. https://twitter.com/sunny5boy/status/1671039650897510400 మెగా ప్రిన్సెస్‌ని అరుంధతితో పోలుస్తూ చేసిన మీమ్ తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/always_dasari9/status/1670959463367598082 మనవరాలి రాకతో తాతయ్య చిరంజీవి ఎంతో సంబరపడుతున్నారు. ఇక చిట్టితల్లి పెంపకాన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత చిరుపై ఉంటుందని వివిధ మీమ్స్ షేర్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/BharathRCKajal/status/1671029533041111040 డ్యాన్స్ నేర్పించడం, ఫొటోలు, వీడియోలు క్యాప్చర్ చేస్తుండటం, ఉదయాన్నే నిద్ర లేపి వ్యాయామం చేపిస్తుండటం వంటి పనులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. https://twitter.com/Hemanth_RcCult/status/1670954488969187328 ఇక లిటిల్ ప్రిన్సెస్‌ని స్కూళ్లో చేర్పించే సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి ఓ మీమ్ చేశారు. జై చిరంజీవ సినిమాలో సీన్‌ని స్పూఫ్ చేశారు. ఇది వైరల్ అవుతోంది. https://twitter.com/PriyaRC_4/status/1671024958275997705 ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఎంతో ఫేమస్. కానీ, ఇందులో ఓ విలన్ ‘జయ ఆంటీ తెలుసా నీకు, లల్లూ అంకుల్ తెలుసా నీకు.. వారంతా నా వెనకే ఉన్నారు’ అని అర్థం వచ్చేలా హిందీలో చెబుతాడు. దీనిని మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి అన్వయించారు. మెగాస్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్.. ఇలా వీళ్లంతా నా వెనక ఉన్నారంటూ చెబుతున్న మీమ్ ఇది.&nbsp;&nbsp; https://twitter.com/vj_vijayawada/status/1671070004484386818 అల్లు అర్జున్ కుమారుడు అయాన్. ఇప్పుడు పుట్టిన లిటిల్ ప్రిన్సెస్‌కు వరుసకు బావ అవుతాడు. రామ్‌చరణ్, ఉపాసనకు కుమార్తె పుట్టడంతో అత్యంత ఆనందం పొందిన వ్యక్తి అయానే అంటూ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.&nbsp; https://twitter.com/gnani0414/status/1670985319297212416 పుష్ప సినిమాలో ‘భలే య్యాపీగా ఉండాది కదరా నీకు’ అంటూ చెప్పే డైలాగ్ వైరల్ అవుతోంది. https://twitter.com/gnani0414/status/1671012059625168897 రామ్‌చరణ్‌కి ప్రత్యేక అభిమాని అయాన్. రంగస్థలం చిట్టిబాబు గెటప్ వేసి మామ మీద అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా మరదలు పుట్టాక మామయ్యతో అయాన్ చిట్ చాట్ ఇలా ఉంటుందని మీమ్ చేశారు. https://twitter.com/lokeshBangaram/status/1671441932294422529 మెగా ఫ్యామిలీ చిన్నదేం కాదు. ఎంతో మంది ఉంటారు. వారి మధ్యలో లిటిల్ ప్రిన్సెస్ చేరింది. దీంతో తనపై ప్రేమను ఎలా కురిపిస్తారో ఈ మీమ్ చూస్తే తెలిసిపోతుంది. https://twitter.com/s_siechojithu/status/1671026894760992770 నాయక్ సినిమాలో పోసాని కృష్ణమురళి కామెడీ హైలైట్. అందులో అధికారులు ఓ ల్యాప్‌టాప్‌లో ప్రాపర్టీస్ చూపించి మీవేనా? అని అడిగితే అన్నీ నావేనని ఒప్పుకుంటాడు. ఈ వీడియోను స్పూఫ్ చేశారు. https://twitter.com/KingLeo_007/status/1671348946755805191 చెర్రీకి పిల్లలంటే ఎంతో ఇష్టం. చిన్నపిల్లలు కనిపిస్తే చాలు చరణ్ పిల్లాడిలా మారిపోతాడు. వారితో ఎంతో ముచ్చటగా ఆడుకుంటాడు. ఇప్పుడు తనకే బిడ్డ పుట్టింది. మరి, ఏ రేంజ్‌లో ఫన్ ఉంటుందో ఊహించుకుంటేనే తెలిసిపోతుంది. https://twitter.com/Noori_NN/status/1671045618079506433
    జూన్ 21 , 2023
    Ravanasura Review: విలన్‌ షేడ్స్‌లో అదరగొట్టిన మాస్‌ మహారాజా… ధమాకా తర్వాత మరో హిట్‌..!
    Ravanasura Review: విలన్‌ షేడ్స్‌లో అదరగొట్టిన మాస్‌ మహారాజా… ధమాకా తర్వాత మరో హిట్‌..!
    నటీనటులు: రవితేజ, దక్ష నగర్కర్‌, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, సుశాంత్‌, సంపత్‌, మురళి శర్మ, రావు రమేష్‌ దర్శకుడు: సుధీర్‌ వర్మ రచయిత: శ్రీకాంత్ విస్సా సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, భీమ్స్ సిసిరోలియో మాస్‌ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం భారీ అంచనాలతో ఇవాళ ( ఏప్రిల్‌ 7) థియేటర్లలో విడుదలైంది. మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో నటించిన రవితేజ.. ధమాకా చిత్రం ద్వారా భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అదే ఉత్సాహంతో రావణుసుర చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటివరకు రవితేజ చేసిన సినిమాల్లో కెల్లా రావణసుర ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఇందులో రవితేజ విలన్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌, టీజర్‌ ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో రావణసుర చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రవితేజకు మరో హిట్‌ తెచ్చిపెట్టిందా? అసలు సినిమా స్టోరీ ఏంటి? విలన్‌గా రవితేజ నటనకు ఎన్ని మార్కులు పడ్డాయి? వంటి ప్రశ్నలకు ఆన్సర్స్‌ ఇప్పుడు చూద్దాం. కథ ఏంటంటే: రావణసుర కథలోకి వెళితే... ఫరియా అబ్దుల్లా దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్‌ లాయర్‌గా పనిచేస్తుంటాడు. కోర్టులో న్యాయం జరగకపోతే బాధితులకు బయట న్యాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ ఓ కేసు విషయమై రవితేజ, ఫరియా అబ్దుల్లాను సంప్రదిస్తుంది. తన తండ్రి సంపత్‌ రాజ్‌పై పడిన హత్య అభియోగం వెనక నిజాలు వెలికితీసేందుకు వారి సాయం కోరుతుంది. అయితే మర్డర్స్‌ మాత్రం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఇలా వరుస హత్యలు చేస్తోంది ఎవరు?. మర్డర్స్‌ ఎందుకు జరుగుతున్నాయి?. రవితేజకు హత్యలకు సంబంధం ఏంటి? రవితేజ ఎందుకు విలన్‌గా మారాడు? అనేది సినిమా కథాంశం. ఎలా చేశారంటే: ఈ సినిమాకు రవితేజ నటనే హైలెట్‌ అని చెప్పాలి. ఫస్టాఫ్‌లో కామెడి చేస్తూ నవ్వించే రవితేజ.. విలన్‌ షెడ్స్‌లో కనిపించి మెప్పిస్తాడు. రవితేజ చేసిన నెగిటివ్‌ రోల్‌ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఆ పాత్ర ద్వారా విలన్‌గానూ ఆడియన్స్‌ను మెప్పించగలనని రవితేజ నిరూపించాడు. ఇక యువ హీరో సుశాంత్ కి చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర దక్కింది అనే చెప్పాలి. ఇందులో సుశాంత్ చాలా కొత్తగా కనిపిస్తాడు. తన నటనతో ఆడియన్స్‌ను మెప్పిస్తాడు. &nbsp;హీరోయిన్స్ గా నటించిన ఫైరా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ తమ పరిధిమేర బాగానే నటించారు. ఇక సంపత్‌, మురళి శర్మ, రావు రమేష్‌ నటన కూడా ఆకట్టుకుంటుంది.&nbsp; టెక్నికల్‌గా: ఈ సినిమాను డైరెక్టర్‌ సుధీర్‌వర్మ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. రవితేజ మార్క్‌ కామెడీని చూపిస్తూనే థ్రిల్లింగ్‌ అనుభూతిని కూడా పంచాడు. రవితేజలోని నటుడ్ని సుధీర్‌ చాాలా బాగా ఉపయోగించుకున్నాడు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు మరీ సాగదీసినట్లు అనిపిసిస్తుంది. ఇక విజయ్‌ కార్తిక్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. హర్షవర్ధన్‌, భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్‌ బాగుంది. ముఖ్యంగా&nbsp; బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కొన్ని సీన్లు చాలా రిచ్‌గా అనిపించాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రవితేజ యాక్టింగ్హీరోయిన్స్ గ్లామర్కథబ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్‌ పాయింట్స్‌ &nbsp;సినిమా ఫస్టాప్&nbsp;సాగదీత సన్నివేశాలు చివరిగా: వాల్తేరు వీరయ్య, ధమాాకా చిత్రాల తర్వాత రవితేజ నుంచి మరో డీసెంట్‌ మూవీ రావణాసుర అని చెప్పొచ్చు. ఈ వీకెండ్‌లో మంచి టైంపాస్‌ కావాలనుకునేవారికి రావణాసుర మంచి ఛాయిస్‌. రేటింగ్‌: 2.75/5
    ఏప్రిల్ 07 , 2023
    మెుదటి త్రైమాసికంలో టాలివుడ్‌, బాలివుడ్‌,కొలివుడ్‌, శాండల్‌వుడ్‌ పైచేయి ఎవరిది?
    మెుదటి త్రైమాసికంలో టాలివుడ్‌, బాలివుడ్‌,కొలివుడ్‌, శాండల్‌వుడ్‌ పైచేయి ఎవరిది?
    కొత్త సంవత్సరం ప్రారంభమై దాదాపు 3 నెలలు పూర్తయ్యింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో చాలా చిత్రాలు విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే…. మరికొన్ని అంచనాలు అందుకోలేక డిజాస్టర్లుగా మిగిలాయి. పఠాన్ వంటి ఆల్‌టైమ్‌ బ్లాక్‌ బస్టర్‌తో బాలీవుడ్‌కు పూర్వ వైభవం వచ్చింది. వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు టాలీవుడ్ మేనియాను కొనసాగించాయి. తమిళ్, కన్నడ ఇండస్ట్రీలకు మంచి హిట్లే పడ్డాయి. టాలివుడ్‌ పరంపర గతేడాది ధమాకా వంటి సూపర్‌ హిట్‌తో ముగించిన టాలీవుడ్‌… ఏడాది ఆరంభంలోనే బ్లాక్‌బస్టర్లను అందుకుంది. సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి అభిమానులు పండుగ చేసుకొనే సినిమాలను ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన వీరసింహా రెడ్డి రూ. 110 కోట్లు పెట్టి తెరకెక్కిస్తే రూ. 134 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇదే బ్యానర్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య రూ.140 కోట్లతో రూపొందించగా.. రూ. 219 కోట్లు సాధించింది.&nbsp; చిన్న హిట్లు తెలుగు ప్రేక్షకులను చిన్న సినిమాలు కూడా అలరించాయి. సుహాస్‌ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్‌గా నిలిచింది. రూ.2.5 కోట్లతో తెరకెక్కించగా.. రూ. 12.5 కోట్లు వచ్చాయి. ఇదే సమయంలో చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. రూ.1 కోటి బడ్జెట్‌ పెట్టి నిర్మించగా.. రూ. 9.15 కోట్లు వచ్చాయి.&nbsp; భావోద్వేగాల బలగం మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని బలగం సినిమాతో మరోసారి రుజువయ్యింది. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించారు. సూపర్ హిట్‌ చేసి కలెక్షన్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు. రూ. 1.5 కోట్లతో దిల్‌రాజు నిర్మించగా.. రూ. 18.65 కోట్లు వసూలు చేసింది చిత్రం. ఇంకా థియేటర్లలో అలరిస్తోంది. డిజాస్టర్లు బింబిసార వంటి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది నిరాశపర్చాడు. సరికొత్త కాన్సెప్ట్‌తో అమిగోస్ అనే చిత్రం తెరకెక్కించి విఫలమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఎప్పట్నుంచో హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్‌కి కూడా సరైన హిట్‌ దక్కలేదు. మైఖేల్ సినిమాతో మళ్లీ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు సందీప్. ఇవి మినహా తెలుగులో మంచి హిట్లే దక్కాయి.&nbsp; బాలీవుడ్‌ బాద్షా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్ పరిశ్రమకు చాలాకాలం గ్యాప్ తర్వాత వచ్చిన బాద్షా షారుఖ్ ఖాన్ ఆల్‌ టైమ్ బ్లాక్‌బస్టర్‌ను అందించాడు.ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్లను దాటేశాడు. రూ.250 కోట్లతో తెరకెక్కిన పఠాన్ చిత్రం రూ. 1047 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో బాహుబలి పేరిట ఉన్న రికార్డును చేరిపేశాడు కింగ్ ఖాన్.&nbsp; రొమాంటిక్ హిట్ కింగ్ ఖాన్ తెచ్చిన వైభవాన్ని రణ్‌బీర్ కపూర్ కొనసాగించాడు. తూ జూటీ మై మక్కర్ వంటి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతో హిట్‌ కొట్టాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమా రూ. 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. రూ.151.35 కోట్లు వసూలు చేసింది. అయితే,&nbsp; తెలుగు రీమేక్‌గా రూపుదిద్దుకున్న షెహజాదా మాత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది.&nbsp; షెహ్‌జాదా ఎందుకు ఫ్లాప్‌ అయింది? https://telugu.yousay.tv/why-did-the-remake-of-ala-vaikunthapuram-not-work-out-why-shehzada-is-a-disaster.html తమిళ్‌ సూపర్ స్టార్స్ కోలీవుడ్‌లో కూడా ఈ ఏడాది శుభారంభంతోనే ప్రారంభమయ్యింది. దిల్ రాజు నిర్మాణంలో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తీసిన వారిసు ఇండస్ట్రీ హిట్‌ అయ్యింది. రూ.297 కోట్లు వసూళ్లు సాధించింది ఈ సినిమా. సంక్రాంతి బరిలో అజిత్‌ చిత్రం తునివు కూడా హిట్‌గానే నిలిచింది. కాకపోతే పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చింది అంతే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన సార్ సినిమా సగటు ప్రేక్షకులను మెప్పించింది. రూ.35 కోట్లతో తీర్చిదిద్దితే రూ.115 కోట్లు సాధించింది ఈ చిత్రం. ఇంకా మెుదలుకాలేదు కన్నడలో విడుదలైన ఒకే ఒక్క పెద్ద చిత్రం కబ్జ. దాదాపు కేజీఎఫ్ రేంజ్ ట్రైలర్ చూపించినప్పటికీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆడటం లేదు. ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివన్న వంటి స్టార్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.&nbsp; ఆధిపత్యం ఎవరిది? చిత్ర పరిశ్రమలన్నింటిలో హిట్లు, ఫ్లాపులు ఉన్నాయి. తెలుగులో వరుస బ్లాక్‌బస్టర్లు కొట్టాయి. తమిళ్‌ నుంచి డబ్ అయిన చిత్రాలు కూడా బాగానే ఆదరించారు. కానీ, కలెక్షన్ల పరంగా బాలీవుడ్ దూసుకుపోయింది. ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌ను కొట్టేశాయి. తమిళ్‌లోనూ రూ.100 కోట్ల క్లబ్ సినిమాలు మూడు వచ్చాయి. ఈ పరంగా చూసుకున్నట్లయితే… ఒక్కో విభాగంలో ఒక్కో ఇండస్ట్రీ టాప్‌లో నిలిచిందనే చెప్పాలి. లేదు ప్రస్తుతం కలెక్షన్లే మ్యాటర్‌ అనుకుంటే.. బాలీవుడ్‌ దే పైచేయి.&nbsp;
    మార్చి 20 , 2023
    <strong>Chiru Odela: చిరు - ఓదెల మూవీ స్టోరీ ఇదేనా .. డైరెక్టర్‌కు ఫ్యాన్స్‌ కండీషన్స్</strong>
    Chiru Odela: చిరు - ఓదెల మూవీ స్టోరీ ఇదేనా .. డైరెక్టర్‌కు ఫ్యాన్స్‌ కండీషన్స్
    మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కొత్త ప్రాజెక్ట్‌ ఖరారైంది. తొలి చిత్రం 'దసరా'తో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన యంగ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) ఈ సినిమా (Chiru Odela) ను డైరెక్ట్‌ చేయనున్నారు. యంగ్‌ హీరో నాని ఈ చిత్రాన్ని సమర్పించనున్నట్లు మూవీ యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్‌ చేసిన ప్రీ లుక్‌ పోస్టర్‌లో నెత్తురోడుతున్న చిరు చేతిని చూపించారు. దీంతో ఈ సినిమా చాలా వైలెంట్‌గా ఉండబోతుందని మేకర్స్‌ చెప్పకనే చెప్పారు. కమ్‌ బ్యాక్‌ తర్వాత చిరంజీవి నటించనున్న మోస్ట్‌ వైలెంట్ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు మెుదలయ్యాయి. స్టోరీని కూడా ముందే ప్రిడిక్ట్‌ చేసేస్తున్నారు. ఈ మూవీ ఏ స్థాయిలో ఉండాలో ముందుగానే ఫ్యాన్స్‌ సలహాలు ఇస్తున్నారు.&nbsp; చిరు - ఓదెల స్టోరీ ఇదే! మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల చిత్రాని (Chiru Odela)కి సంబంధించిన ప్రీలుక్‌ పోస్టులో ఆసక్తికర లైన్‌ను చిత్ర బృందం రాసుకొచ్చింది. 'అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు' అని ఆసక్తికర క్యాప్షన్‌ పెట్టింది. దీన్ని బట్టి చూస్తే ఇదో బిగ్‌ రివేంజ్‌ స్టోరీగా కనిపిస్తోంది. తనకు అన్యాయం చేసిన వారిపై మెగాస్టార్‌ చిరు కొదమసింహంలాగా ఈ సినిమాలో విరుచుకుపడతాడని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. తన ఫ్యామిలీ లేదా సమూహం లేదా ప్రజలకు జరిగిన దారుణాలను చూసి కన్నెర్ర చేసిన ఓ సామాన్యుడు ఎలాంటి హింసాత్మక దారిని ఎంచుకున్నాడు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రావొచ్చని నెటిజన్లతో పాటు ఫిల్మ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; https://twitter.com/odela_srikanth/status/1864157520920817831 https://twitter.com/AlwaysRamCharan/status/1864173106480202135 ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే మెగాస్టార్‌ చిరంజీవి కమ్‌ బ్యాక్‌ తర్వాత అతడి స్థాయికి తగ్గ సక్సెస్‌ రాలేదు. ‘ఖైదీ నంబర్‌ 150’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఇండస్ట్రీ హిట్‌గా నిలవలేదు. ఈ నేపథ్యంలో చిరు-ఓదెల ప్రాజెక్ట్‌ ఊరమాస్‌ వైలెన్స్‌తో రానుండటంతో ఒక్కసారిగా మెగా ఆడియన్స్‌ దృష్టి దీనిపై పడింది. చిరు కెరీర్‌లో బిగ్గెస్ట్ మాస్‌ చిత్రాలుగా నిలిచిన ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘ముఠామేస్త్రీ’, ‘ఇంద్ర’ సరసన ఈ ప్రాజెక్ట్‌ నిలబడాలని కోరుకుంటున్నారు. చిరు బిగ్‌బాస్‌ చిత్రంలోని రగ్‌డ్‌ లుక్‌ షేర్ చేస్తూ ఆ విధంగా మెగాస్టార్‌ను మేకోవర్‌ చేయాలని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో వింటేజ్ చిరును మళ్లీ తీసుకురావాలని ఓదెలాకు విజ్ఞప్తి&nbsp; చేస్తున్నారు. 'దుమ్ము లేచిపోవాలి అన్న' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాంగ్స్‌, డ్యాన్స్‌, కామెడీ పక్కన పెట్టి కంటెంట్‌పై దృష్టి సారించాలని కోరుతున్నారు. తమ నమ్మకాన్ని నిలబెట్టి బెస్ట్‌ మూవీ ఇవ్వాలని సూచిస్తున్నారు.&nbsp; https://twitter.com/JohnWick_fb/status/1864188176165654619 చిరంజీవి స్ఫూర్తితో.. మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ బిగ్ ఫ్లాట్‌ఫామ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. ఈ జనరేషన్‌ హీరోలు, డైరెక్టర్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు ఆయనే స్ఫూర్తి. ఈ విషయం పలు సందర్భాల్లో వ్యక్తమైంది కూడా. చిరు తాజా ప్రాజెక్ట్‌ను నిర్మించనున్న యంగ్‌ హీరో నాని కూడా చిరుకి బిగ్‌ ఫ్యాన్‌. చిరు స్ఫూర్తితోనే తాను పెరిగానని, ఆయన సినిమా టికెట్ల కోసం గంటల తరబడి లైన్లలో నిల్చున్నానని ప్రీ లుక్‌ పోస్టర్‌ను షేర్‌ చేస్తూ నాని పేర్కొన్నాడు. అటువంటి చిరంజీవి చిత్రాన్ని సమర్పిస్తున్నందుకు తన జీవితం పరిపూర్ణమైందని చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్నారు. ఇది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే 'ది ప్యారడైజ్‌' అనే సినిమాలో నటిస్తున్నాడు. https://twitter.com/NameisNani/status/1863954922926137824 2025 సమ్మర్‌ బరిలో.. ప్రస్తుతం చిరంజీవి - వశిష్ట కాంబోలో ‘విశ్వంభర’ (Viswambhara) రూపొందుతోంది. ఈ చిత్రం 2025 సమ్మర్‌లో రానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కావాలి. జనవరి 10న రాబోతున్నట్లు గతంలోనే విశ్వంభర టీమ్ అనౌన్స్ చేసింది. అయితే తనయుడు రామ్‌ చరణ్‌ (Ram Charan) నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) కోసం చిరు వెనక్కి తగ్గారు. దీంతో గేమ్‌ ఛేంజర్‌ సంక్రాంతి బరిలో నిలవగా ‘విశ్వంభర’ సమ్మర్‌కు పోస్టుపోన్‌ అయింది. 2025 మే (Viswambhara Release Date)లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో చిరు నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది.
    డిసెంబర్ 04 , 2024
    <strong>Best Cameos in Telugu Movies: క్యామియోలకు జీవం పోసిందే మెగాస్టార్‌ అని తెలుసా? గెస్ట్‌ రోల్స్‌తో ఇరగదీసిన స్టార్స్‌ వీరే!&nbsp;&nbsp;</strong>
    Best Cameos in Telugu Movies: క్యామియోలకు జీవం పోసిందే మెగాస్టార్‌ అని తెలుసా? గెస్ట్‌ రోల్స్‌తో ఇరగదీసిన స్టార్స్‌ వీరే!&nbsp;&nbsp;
    భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం క్యామియో అనే కొత్త ట్రెండ్‌ మెుదలైంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలివుడ్‌ అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్క ఇండస్ట్రీ ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ సత్ఫలితాలను పొందుతున్నాయి. పక్క ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ నటులను తీసుకొని తమ చిత్రాల్లో ఒక పవర్‌ఫుల్‌ క్యామియో లేదా రోల్‌ ఇవ్వడం ద్వారా ఆడియన్స్‌లో హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. తద్వారా సూపర్‌ హిట్‌ విజయాలను అందుకుంటున్నాయి. అయితే ఈ క్యామియోలకు మెుట్ట మెుదట జీవం పోసింది మన మెగాస్టార్ అని చాలా మందికి తెలిసి ఉండదు. రజనీకాంత్‌ ఫిల్మ్‌లో గెస్ట్ రోల్‌ చేయడం ద్వారా అప్పట్లోనే ఈ ఒరవడికి చిరు నాంది పలికారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ క్యామియో చిత్రాలు ఏవి? అన్నది ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; చిరు క్యామియో చిరంజీవి హీరోగా నటించిన 'అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు' చిత్రం తెలుగులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాను తమిళంలో రజనీకాంత్‌తో అల్లు అరవింద్‌ రీమేక్‌ చేశారు. 'మాపిళ్లై' పేరుతో ఇది విడుదలైంది. అయితే ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి అదిరిపోయే క్యామియో ఇచ్చారు. హీరో పెళ్లిని చెడగొట్టడానికి వచ్చిన అల్లరి మూకతో గుడి మెట్ల దగ్గర చిరు ఫైట్‌ చేస్తాడు. ఆ గుండాలలో శ్రీహరి కూడా ఉండటం గమనార్హం. ఇక చిరు తన స్వంత గళంతోనే తమిళంలో సంభాషణలు చెప్పారు. రజినీ తన అత్తని పరిచయం చేసేటప్పుడు చిరు అతడి చెవిలో, 'మీ అత్త బాగుందిరా!' (తమిళంలో అంటాడు. దానికి రజినీ చిరుని 'కొంప ముంచేలా ఉన్నావు! నువ్వు బయలుదేరరా బాబూ!' అని అనటం ప్రేక్షకులని గిలిగింతలు పెడుతుంది. అయితే అప్పట్లో ఈ క్యామియోను ఎవరూ ఊహించలేదు. చిరు, రజనీ పలు చిత్రాల్లో అప్పటికే కలిసి నటించినప్పటికీ ఇలా అతిథి పాత్రలో చేయడం అదే తొలిసారి. ఇప్పుడు ఇదే పరంపరను పలు ఇండస్ట్రీలు అనుసరించడం గమనార్హం.&nbsp; https://twitter.com/i/status/1212794102867083265 అదిరిపోయే క్యామియోలతో వచ్చిన చిత్రాలు మిస్టర్ బచ్చన్‌ రవితేజ, హరీష్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ మూవీ కుర్ర హీరో సిద్ధు జొన్నల గడ్డ ఒక స్పెషల్‌ క్యామియో ఇచ్చారు. సినిమా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ సిద్ధు క్యామియో మాత్రం థియేటర్లలో విజిల్స్‌ వేసేలా చేసింది. &nbsp; కల్కి 2898 ఏడీ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో పలువురు స్టార్స్‌ అదిరిపోయే క్యామియోస్‌ ఇచ్చారు. యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, తమిళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్, దర్శకధీరుడు రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ స్క్రీన్‌పై కొద్దిసేపు మెరిసి ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ ఇందులో ఫుల్‌ లెంగ్త్‌ పాత్రలు పోషించారు.&nbsp; సలార్‌ ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో వచ్చిన ‘సలార్‌’ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమాన్‌ నటించిన సంగతి తెలిసిందే. అయితే అతడిది క్యామియో కాదు. ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా, ప్రత్యర్థిగా ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో నటించాడు.&nbsp; జైలర్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘జైలర్‌’ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు క్యామియో ఇచ్చారు. మలయాళ నటుడు మోహన్‌లాల్‌, కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ అతిథి పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.&nbsp; విక్రమ్‌ కమల్‌ హాసన్‌ హీరోగా లోకేష్‌ కనగరాజన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమ్‌’ చిత్రంలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి, మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటించారు. సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. క్లైమాక్స్‌లో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించి గూస్‌బంప్స్‌ తెప్పించారు.&nbsp; బ్రహ్మాస్త్ర రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో తెలుగు దిగ్గజ నటుడు అక్కినేని నాగార్జున ఓ స్పెషల్‌ క్యామియో ఇచ్చి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేశారు. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లో తన మార్క్‌ చూపించి అదరగొట్టాడు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో స్టార్‌ హీరో రవితేజ ఓ ముఖ్య పాత్రలో నటించారు. తద్వారా చిరుపై తనకున్న అభిమానాన్ని మరోమారు చాటుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.&nbsp; ఆచార్య మెగాస్టార్‌ చిరంజీవి గత చిత్రం ‘ఆచార్య’లో రామ్‌ చరణ్ అతిథి పాత్రలో నటించాడు. అంతకుముందు చరణ్‌ చేసిన ’మగధీర’, బ్రూస్‌లీ చిత్రాల్లో చిరు ప్రత్యేక రోల్స్‌లో కనిపించి సర్‌ప్రైజ్‌ చేయడం విశేషం.&nbsp; లాల్‌ సింగ్‌ చద్దా బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ నటించిన లాల్ సింగ్‌ చద్దా సినిమాలో అక్కినేని నాగ చైతన్య ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించనప్పటికీ చైతూ నటనకు మంచి మార్కులే పడ్డాయి.&nbsp; లైగర్‌&nbsp; విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన ‘లైగర్‌’ చిత్రంలో వరల్డ్‌ ఫేమస్‌ బాక్సర్‌ ‘మైక్‌ టైసన్‌’ క్లైమాక్స్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. అయితే అతడ్ని సరిగ్గా వినియోగించలేకపోయారని దర్శకుడు పూరి జగన్నాథ్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి.&nbsp;
    సెప్టెంబర్ 18 , 2024
    <strong>69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!</strong>
    69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!
    ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ 2024లో విజేతల ఎంపిక ప్రక్రియ మెుదలైంది. దక్షిణాది సినీ పరిశ్రమలైన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ సౌత్‌ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితాను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాలని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా గణనీయ సంఖ్యలో టాలీవుడ్‌ చిత్రాలు, నటీనటులు నామినేషన్స్‌ బరిలో నిలిచారు. ఇంతకీ ఆ తెలుగు చిత్రాలు ఏవి? ఏ విభాగాల్లో ఏ తెలుగు నటులు పోటీలో నిలిచారు? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; నాని.. డబుల్‌ ధమాకా! 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 నామినేషన్స్‌లో హీరో నాని (Nani) డబుల్ ధమాకాగా నిలిచారు. ఉత్తమ నటుడు కేటగిరిలో రెండు సినిమాలకు (దసరా, హాయ్‌ నాన్న) నాని నామినేట్‌ అయ్యాడు. ఇదే కేటగిరిలో టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి (వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ (భగవంత్‌ కేసరి), ధనుష్‌ (సర్), నవీన్‌ పోలిశెట్టి (మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌ రాజ్‌ (రంగమార్తాండ), ఆనంద్‌ దేవరకొండ (బేబీ) నిలిచారు. అటు ఉత్తమ దర్శకుడు విభాగంలోనూ హాయ్‌ నాన్న, దసరా చిత్రాలు ఉండటం విశేషం. ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్‌ (దసరా) ఫిల్మ్‌ఫేర్ అవార్డు రేసులో నిలిచింది.&nbsp; బేబీ చిత్రం హవా! 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ నామినేషన్స్‌లో బేబీ చిత్రం సత్తా చాటింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది విభాగాల్లో నామినేషన్స్‌లో నిలిచింది. ఉత్తమ నటుడు (ఆనంద్‌ దేవరకొండ) కేటగిరితో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్‌ (సాయి రాజేష్‌), ఉత్తమ నటి (వైష్ణవి చైతన్య), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్‌ (విజయ్‌ బుల్గానిన్‌), ఉత్తమ గేయ రచయిత (ఆనంత శ్రీరామ్‌), ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (శ్రీరామ చంద్ర, పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌) విభాగాల్లో బేబి చిత్రం బరిలో నిలిచింది. దీంతో ఫిల్మ్‌ఫేర్‌లో ‘బేబీ’ చిత్రానికి భారీగానే అవార్డ్స్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.&nbsp; https://twitter.com/MassMovieMakers/status/1813445764934431164 ఫిల్మ్‌ అవార్డ్స్‌ కోసం వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే... ఉత్తమ చిత్రం బేబీబలగందసరాహాయ్‌ నాన్నమిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టిసామజవరగమనసలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌ ఉత్తమ నటుడు ఆనంద్‌ దేవరకొండ (బేబీ)బాలకృష్ణ (భగవంత్‌ కేసరి)చిరంజీవి (వాల్తేర్‌ వీరయ్య)ధనుష్‌ (సర్‌)నాని (దసరా)నాని (హాయ్‌ నాన్న)నవీన్‌ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ) ఉత్తమ నటి: అనుష్క (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)కీర్తిసురేశ్‌ (దసరా)మృణాళ్‌ ఠాకూర్‌ (హాయ్‌ నాన్న)సమంత (శాకుంతలం)వైష్ణవీ చైతన్య (బేబీ) ఉత్తమ దర్శకుడు: అనిల్‌ రావిపూడి (భగవంత్‌ కేసరి)కార్తిక్‌ దండు (విరూపాక్ష)ప్రశాంత్‌నీల్‌ (సలార్‌:పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)సాయి రాజేశ్‌ (బేబీ)శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)శ్రీకాంత్‌ ఓదెల (దసరా)వేణు యెల్దండ (బలగం) ఉత్తమ సహాయ నటుడు: బ్రహ్మానందం (రంగ మార్తండ)దీక్షిత్‌శెట్టి (దసరా)కోట జయరాం (బలగం)నరేశ్‌ (సామజవరగమన)రవితేజ (వాల్తేర్‌ వీరయ్య)విష్ణు ఓఐ (కీడా కోలా) ఉత్తమ సహాయ నటి: రమ్యకృష్ణ (రంగమార్తండ)రోహిణి మోల్లెటి (రైటర్‌ పద్మభూషణ్‌)రుపా లక్ష్మీ (బలగం)శ్యామల (విరూపాక్ష)శ్రీలీల (భగవంత్‌ కేసరి)శ్రియారెడ్డి (సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)శ్వేతరెడ్డి (మంత్‌ ఆఫ్‌ మధు) ఉత్తమ గాయని: చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్‌ పాప)దీ (చమ్కీల అంగీలేసి -దసరా)మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం)శక్తిశ్రీ గోపాలన్‌ (అమ్మాడి -హాయ్‌ నాన్న)శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు -సర్‌) ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కుల్‌కర్ణి (సమయ-హాయ్‌ నాన్న)హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (ఖుషి -టైటిల్‌ సాంగ్‌)పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (ప్రేమిస్తున్నా -బేబీ)రామ్‌ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం)సిధ్‌ శ్రీరామ్‌ (ఆరాధ్య – ఖుషి)శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ) ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌: బేబీ (విజయ్‌ బుల్గానిన్‌)బలగం (భీమ్స్‌ సిసిరిలియో)దసరా (సంతోష్‌ నారాయణ్‌)హాయ్‌ నాన్న (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)ఖుషి (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)వాల్తేర్‌ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్) ఉత్తమ సాహిత్యం: అనంత శ్రీరామ్‌ (గాజు బొమ్మ -హాయ్‌ నాన్న)అనంత శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)కాసర్ల శ్యామ్‌ (చమ్కీల అంగీలేసి -దసరా)కాసర్ల శ్యామ్‌ (ఊరు పల్లెటూరు -బలగం)పి.రఘు (లింగి లింగి లింగ్డి -కోట బొమ్మాళి పి.ఎస్‌)
    జూలై 17 , 2024
    Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
    Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star).. గత శుక్రవారం విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ట్రైలర్‌, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన మూవీ టీమ్‌.. వినూత్నమైన ప్రమోషన్స్‌తో మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. కానీ రిలీజ్‌ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమాపై ట్రోల్స్‌, నెగిటివిటీ మెుదలైంది. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది. అసలు సినిమా ఇలా ఎవరైనా తీస్తారా? అంటూ విమర్శలు సైతం వచ్చాయి. ఓ వైపు ఫ్యామిలీ స్టార్‌ బాగుందంటూ చూసినవారు చెబుతుంటే.. నెట్టింట మాత్రం ఇంత నెగిటివిటీ రావడానికి కారణమేంటి? కావాలనే ఈ సినిమాపై నెగిటివిటీని రుద్దుతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; ఆడియన్స్‌ ఏమంటున్నారు? ఫ్యామిలీ స్టార్‌ సినిమాను చూసిన వారంతా సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందంటూ స్పష్టం చేస్తున్నారు. బయట ఎందుకు అంతలా ట్రోల్స్‌, నెగిటివిటీ స్ప్రెడ్‌ చేస్తూన్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ‘ఫ్యామిలీ స్టార్‌’ యావరేజ్‌ కూడా కాదని ఒకటికి రెండుసార్లు చూడాల్సిన సినిమా అంటూ కొందరు యువకులు చెప్పడం విశేషం. https://twitter.com/cult1_rowdy/status/1776852998855262234 https://twitter.com/i/status/1776636730034245707 https://twitter.com/plaasya/status/1777072948597428600 విజయ్‌కు ముందే తెలుసా? ‘ఫ్యామిలీ స్టార్‌’ గురించి ఇద్దరు యూట్యూబ్‌ రివ్యూవర్లు మాట్లాడుకున్న వీడియోను విజయ్‌ ఫ్యాన్స్‌ తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇందులో ఓ రివ్యూవర్‌ మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్‌ సినిమాపై హేట్‌ లేదని చెప్పాడు. అయితే విజయ్‌ దేవరకొండపై మాత్రం బాగా వ్యతిరేకత ఉందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని విజయ్‌ స్వయంగా నిర్మాత దిల్‌ రాజుతో చెప్పినట్లు రివ్యూవర్‌ అన్నాడు. ‘నాతో సినిమా చేస్తే ఓ బ్యాచ్‌ రెడీ అవుతది.. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ దిల్‌రాజ్‌తో విజయ్‌ అన్నాడట. అలాంటి బ్యాచ్‌లు కూడా ఉంటాయా? అని అప్పుడు దిల్‌ రాజు కూడా షాకైనట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/chanticomrade_/status/1776839226312753263 విజయ్‌ను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు? మెుదటి నుంచి విజయ్‌ దేవరకొండకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున యాంటి ఫ్యాన్స్ ఉంటున్నారు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఒక్క సినిమాతో స్టార్ హీరో స్థాయికి చేరడం.. కొంత మంది స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు మింగుడు పడలేదన్నది వాస్తవం. అయితే విజయ్ సహజమైన ప్రవర్తన, మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో… అతడు మాట్లాడే పద్దతి, ఉన్నది ఉన్నట్లు చెప్పే తీరు, కొన్ని అంశాలపై స్పష్టంగా మాట్లాడటం కొందరికి నచ్చలేదన్నిది వాస్తవం. పలు సందర్భాల్లో విజయ్ క్లిప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేసిన సందర్భాలు అనేకం. &nbsp; కారణం ఏదైనా విజయ్‌ నుంచి ఏ సినిమా రిలీజైనా దాన్ని టార్గెట్‌ చేస్తూ సినిమాను వెనక్కిలాగటానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈసారి ‘ఫ్యామిలీ స్టార్‌’కు విజయ్‌పై ఉన్న నెగిటివిటీతో పాటు.. నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు పరుశురామ్‌పై ఉన్న హేట్‌ కూడా తోడైనట్లు కనిపిస్తోంది. అందుకే సినిమా బాగున్నా ఈ స్థాయిలో ట్రోల్స్‌, నెగిటివ్స్‌ బయటకు వస్తున్నాయి.&nbsp; దిల్‌ రాజుపై నెగిటివిటీ దిల్‌ రాజు విషయానికి వస్తే.. గత సంక్రాంతి నుంచి ఆయనపై ట్రోల్‌ మెుదలయ్యాయి. తమిళ స్టార్‌ విజయ్‌తో చేసిన ‘వారసుడు’ చిత్రాన్ని గతేడాది సంక్రాంతికి దిల్‌ రాజు రిలీజ్‌ చేశారు. చిరు (వాల్తేరు వీరయ్య), బాలయ్య (వీరసింహా రెడ్డి)లకు పోటీగా ఈ సినిమాను తీసుకురావడం కొందరికి నచ్చలేదు. ఈ సంక్రాంతికి ‘హనుమాన్‌’ విషయంలోనూ దిల్‌ రాజుపై విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలు వెనక్కి తగ్గాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా హనుమాన్‌కు ఆయన సూచించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.&nbsp; అటు డైరెక్టర్‌ పరుశురామ్‌.. విజయ్‌తో ‘గీతా గోవిందం’ తర్వాత గీతా ఆర్ట్స్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే సడెన్‌గా దిల్‌ రాజు నిర్మాణంలో ‘ఫ్యామిలీ స్టార్‌’ చేయడం కూడా ఒక సెక్షన్‌లో ఆయనపై వ్యతిరేకత రావాడనికి కారణమైంది. ఈ ముగ్గురిపై ఉన్న వ్యతిరేకతే ‘ఫ్యామిలీ స్టార్‌’పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌, నెగిటివిటీ రావడానికి కారణమై ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; ఫేక్ రివ్యూస్ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని పీఆర్ టీమ్స్ పనిగట్టుకుని సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివిటిని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాయి. సినిమా బాగోలేదని, ఈ సినిమా 90mm రాడ్ అంటూ ఘోరంగా ట్రోల్స్ చేశాయి. ఈ ట్రోల్స్ ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఫలితంగా సినిమా వసూళ్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.&nbsp; అయితే అమెరికా, ఇతర దేశాల్లో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో 500K డాలర్లను రాబట్టింది. రిలీజ్‌కు ముందే ట్రోల్స్‌! వాస్తవానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ థియేటర్లలోకి రాకముందే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి కొందరు ఈ సినిమాను టార్గెట్‌ చేశారు. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కథ అని చెప్పి.. హీరో ఎలా రిచ్‌ కాస్ట్యూమ్స్‌ ధరిస్తాడని.. బ్రాండెండ్‌ షూస్‌ ఎలా వేస్తారని విమర్శించడం మెుదలు పెట్టారు. మీడియా సమావేశంలోనూ కొందరు విలేఖర్లు ఇదే విధమైన ప్రశ్నలు వేయడంతో నిర్మాత దిల్‌ రాజు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. మిడిల్‌ క్లాస్ అబ్బాయిని సూపర్‌ మ్యాన్‌గా చూపించారు? అంటూ ప్రశ్నలు వేయగా.. ‘హీరో అన్నాక హీరో పని చేయాలి కదా. హీరో ఒక 20 మందిని కొడతాడు. రియల్ లైఫ్‌లో కొట్టగలుగుతామా? యాక్షన్ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లే కదా. అది సినిమా.. మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఎందుకు? ఎమోషన్‌కి కనెక్ట్ అయితే లాజిక్స్ ఉండవు’ దిల్‌ రాజు బదులిచ్చారు. ‘గుడ్‌ మూవీని చంపే ప్రయత్నం చేస్తున్నారు’ తొలిరోజు నుంచి సినిమాపై వచ్చిన నెగిటివిటీని తగ్గించేందుకు నిర్మాత దిల్‌రాజు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఓ థియేటర్‌ వద్దకు వెళ్లి సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్‌ను మైక్‌ పెట్టి స్వయంగా ప్రశ్నలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా సినిమా చూసిన ఓ ఆడియన్‌ మాట్లాడుతూ.. తనకు సినిమా చాలా బాగా నచ్చిందని దిల్‌రాజుతో అన్నారు. మంచి సినిమాను కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న వారిపై మీరు యాక్షన్‌ తీసుకోవాలని దిల్‌రాజుకు సూచించారు.&nbsp; అయితే దిల్‌ రాజు దీనిపై స్పందిస్తూ.. కేరళలో సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూస్ ఇవ్వకూడదని అక్కడి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడ కూడా అలాంటి చట్టం ఏదైన వస్తే కానీ ఇండస్ట్రీకి మంచి జరగదు అంటూ చెప్పుకొచ్చారు. మేము మంచి సినిమానే తీశాం. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి… కానీ రివ్యూల పేరుతో మీ అభిప్రాయాలను ప్రేక్షకుల మీద రుద్దొద్దు అంటూ చురకలు అంటించారు. https://telugu.yousay.tv/family-star-first-review-vijay-who-played-as-a-middle-class-boy-is-family-star-a-hit-free.html
    ఏప్రిల్ 08 , 2024
    Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు తెలుసా?
    Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు తెలుసా?
    టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ మెుదలైంది. సముద్రం నేపథ్యం ఉన్న సినిమాలు గత కొంత కాలం నుంచి విరివిగా తెరకెక్కుతున్నాయి. తీర ప్రాంత కథలతో వచ్చే సినిమాలకు సక్సెస్‌ రేట్ కూడా ఎక్కువగా ఉండటంతో సీనియర్లతో పాటు యంగ్‌ హీరోలు తీర ప్రాంత కథల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కథలో వైవిధ్యం ఉంటే కొత్త డైరెక్టర్లతో కూడా పని చేసేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన, రాబోతున్న చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; దేవర 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత తారక్‌ నటిస్తున్న చిత్రం ‘దేవర(Devara like movies)’. కొరటాల శివ దర్శకత్వంలో సముద్రపు బ్యాక్‌ డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన మూవీ గ్లింప్స్‌లో తారక్‌ సముద్రపు దొంగల్ని ఊచకోత కోస్తాడు. కాగా ఈ సినిమాలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌, టామ్‌ చాకో, శ్రీకాంత్, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది.&nbsp; తండేల్‌ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘తండేల్‌’(Thandel). ఇందులో చైతూ మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజైన మూవీ గ్లింప్స్‌ అదిరిపోయింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్లు పొరపాటున పాక్‌ జలాల్లోకి ప్రవేశించి వారి చేతికి చిక్కుతారు. వారి బారి నుంచి ఏ విధంగా బయటపడ్డారు? అన్నది మూవీ స్టోరీ. దర్శకుడు చందూ మెుండేటి ప్రేమ కథ, దేశ భక్తి అంశాలను జోడించి ఈ సినిమాను కమర్షియల్‌గా తీస్తున్నారు. ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ(OG MOVIE)’. ఈ సినిమా కూడా ముంబయి సముద్ర తీరం చుట్టూ తిరగనుంది. సముద్రంలో జరిగే అక్రమ రవాణాకు సంబంధించి కథ సాగనున్నట్లు తెలిసింది. ఇందులో పవన్‌కు జోడీగా ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. శ్రియా రెడ్డి, ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, షాన్‌ కక్కర్‌ ప్రధాన పాత్రుల పోషించనున్నారు. మట్కా వరుణ్ తేజ్ హీరోగా, కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మట్కా’. ఈ మూవీ కూడా తీర ప్రాంత నేపథ్యంతో సాగనుందని సమాచారం. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటన ఆధారంగా మట్కా రూపొందుతోంది. ఈ మూవీలో వరుణ్‌ విభిన్న గెటప్‌లలో కనిపిస్తాడని టాక్‌. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. KGF 3 ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో కన్నడ స్టార్‌ యష్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘కేజీఎఫ్‌’. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. అయితే కేజీఎఫ్‌ 3 సముద్ర నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు. RC16 మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రం 'RC 16'. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్.. ఆ తర్వాత RC16ను పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రం కూడా తీర ప్రాంత నేపథ్యంలోనే తెరకెక్కనుందని టాక్‌. ఇందులో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.&nbsp; వాల్తేరు వీరయ్య గతేడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సముద్రంలో చేపలు పట్టుకునే గంగపుత్రుడి పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి నటించాడు. ఇందులో రవితేజ పోలీసు ఆఫీసర్‌గా నటించి సినిమా విజయంతో ముఖ్య పాత్ర పోషించాడు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. ఉప్పెన సముద్రపు బ్యాక్‌డ్రాప్‌తో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఉప్పెన(Uppena)’. పంజా వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మత్సకార కుటుంబానికి చెందిన పేదింటి యువకుడు పాత్రలో వైష్ణవ్‌ నటించాడు. వ్యాపార వేత్త శేషారాయణం (విజయ్‌ సేతుపతి) కూతురు బేబమ్మగా కృతి శెట్టి కనిపించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.&nbsp; ఘాజీ 1971లో భారత్ పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్థానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఓ అప్రకటిత యుద్ధ కథే ఘాజీ(Ghazi). రానా, కేకే మీనన్‌, అతుల్‌ కులకర్ణి, తాప్సీ లీడ్‌ రోల్స్‌లో నటించారు. సంకల్ప్‌ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రానికి కె. కృష్ణ కుమార్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.&nbsp; మహా సముద్రం&nbsp; అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'మహాసముద్రం'. ఇందులో శర్వానంద్‌, సిద్దార్థ్‌, అదితిరావు హైదరీ, అను అమ్మాన్యుయేల్‌ ప్రధాన పాత్రల్లో చేశారు. తీర ప్రాంత నగరం వైజాగ్‌ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం వెనుకబడింది.&nbsp;
    జనవరి 10 , 2024
    Biggest Telugu Hit Movies 2023: ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపిన తెలుగు చిత్రాలు ఇవే!
    Biggest Telugu Hit Movies 2023: ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపిన తెలుగు చిత్రాలు ఇవే!
    గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. రూ.100 కోట్లు కలెక్షన్లు కష్టమంటూ అవహేళనలు ఎదుర్కొన్న టాలీవుడ్ వెయ్యి కోట్ల మార్క్‌ను సైతం అవలీలగా చేరుకుని ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి ఎదిగింది. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఒక్కో ఏడాది ఒక్కో మార్క్‌ను దాటుకుంటూ కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా పలు తెలుగు సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. అందులో టాప్-10 చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; సలార్‌ (Salaar) పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సలార్‌’, క్రిస్మస్‌ కానుకగా విడుదలైన బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.393 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి గణనీయమైన కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం అత్యధిక వసూళ్లతో సలార్‌ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.&nbsp; యానిమల్‌ (Animal) అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. వరల్డ్‌వైడ్‌గా ఇప్పటివరకూ రూ.869 కోట్లను వసూలు చేసింది.&nbsp; వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ఇక ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు చిత్రాల్లో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' ఒకటి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.219 కోట్లు కొల్లగొట్టింది. ఒక్క తెలుగులోనే రూ.159.68 నెట్ వసూళ్లను సాధించింది.&nbsp; ఆదిపురుష్ (Adipurush) ప్రభాస్‌ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.393 కోట్లను వసూలు చేసింది.&nbsp; ఒక్క తెలుగు భాషలోనే రూ.133.28 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఈ చిత్రం విడుదల తర్వాత అనేక వివాదాలను మూటగట్టుకుంది.&nbsp; వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.130కోట్లు.. తెలుగు రాష్ట్రాల్లో రూ.97.64 కోట్ల వసూళ్లను రాబట్టింది.&nbsp; భగవంత్‌ కేసరి (Bhagavanth Kesari) అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా ఇటీవల విడుదలైన చిత్రం 'భగవంత్‌ కేసరి'. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.114.5 కోట్లు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.84.78 కోట్లు రాబట్టింది. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది. బ్రో (Bro) పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో వచ్చిన చిత్రం 'బ్రో'. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.114 కోట్లు రాబట్టింది. ఒక్క తెలుగు భాషలోనే రూ.82.68 కోట్లు వసూళ్లు చేయడం విశేషం. ఈ చిత్రంలోని నటుడు పృథ్వీ పాత్ర ఏపీలో రాజకీయ వివాదానికి కారణమైంది.&nbsp; దసర (Dasara) నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.118.5 వసూళ్లను రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రం తెలుగులో రూ.75.81 వసూళ్లను రాబట్టింది. నాని కెరీర్‌లో రూ.100 కోట్ల మార్క్‌ దాటిన తొలి చిత్రంగా దసరా నిలిచింది. సుకుమార్‌ శిష్యుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. బేబీ (Baby) చిన్న సినిమాగా వచ్చిన 'బేబీ'.. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. యూత్‌ను విపరీతంగా ఆకర్షించి వరల్డ్‌వైడ్‌గా రూ.81.05 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 64.12 కోట్లు వసూలు చేయడం విశేషం.&nbsp;
    డిసెంబర్ 27 , 2023
    Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
    Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
    ఈ ఏడాది టాలీవుడ్‌ చాలా మంది హీరోయిన్లకు కలిసొచ్చింది. వారు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ప్రత్యేకించి కొందరు మాత్రం ఈ ఏడాది తమ తల రాతలను మార్చుకున్నారు. తమకంటూ స్టార్‌ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. అంతేగాక 2023 ఏడాదిలో తమకు తిరుగులేదని వారు నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు సాధించిన ఘనతలు ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; శ్రీలీల ఈ ఏడాది చాలా బాగా పాపులర్ అయిన హీరోయిన్ల జాబితాలో శ్రీలీల (Sreeleela) ప్రథమ స్థానంలో ఉంటుంది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. రవితేజ పక్కన ‘ధమాకా’లో చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా ఆ తర్వాత వరుసగా రామ్‌తో ‘స్కంద’, బాలయ్య కూతురిగా 'భగవంత్‌ కేసరి', పంజా వైష్ణవ్‌ తేజ్‌తో 'ఆదికేశవ', నితీన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' వంటి చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం మహేష్‌, విజయ్‌ దేవరకొండ, పవన్‌ కల్యాణ్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. కీర్తి సురేష్‌ యంగ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ (Keerthy Suresh)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. నాని సరసన ఆమె నటించిన 'దసరా' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. రూ.100 కోట్లకు పైగా ఇందులో తన నటనకు గానూ కీర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు ‘భోళాశంకర్‌’ సినిమాలో చిరంజీవి సోదరిగా నటించి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ పక్కన ‘మామన్నన్‌’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.&nbsp; రష్మిక మందన్న ఈ ఏడాది రష్మిక మందన్న(Rashmika Mandanna) తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. విజయ్‌తో ‘వారసుడు’ చిత్రంలో నటించిన ఈ భామ.. బాలీవుడ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిస్టర్‌ మజ్నూ’ చేసింది. ఇక రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా ఆమె నటించిన ‘యానిమల్‌’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. సమంత ఈ ఏడాది సమంత (Samantha)కు మిశ్రమ స్పందన ఎదురైంది. ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోగా విజయ్‌ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ మూవీ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు తమిళం, ఇంగ్లీష్‌లో తెరకెక్కుతున్న బైలింగ్విల్‌ ఫిల్మ్‌ ‘చెన్నై స్టోరీస్‌’లోనూ నటించే అవకాశాన్ని సమంత దక్కించుకుంది.&nbsp; సంయుక్త మీనన్‌ ఈ ఏడాది సంయుక్త మీనన్‌ (Samyuktha menon)కు మంచి విజయాలను అందించింది. ధనుష్‌ సరసన ఆమె నటించిన 'సార్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ సరసన ఆమె చేసిన 'విరూపాక్ష' చిత్రం ఘన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో సంయుక్త తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; అనుష్క శెట్టి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్టార్‌ నటి అనుష్క (Anushka Shetty) ఈ ఏడాది మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'మిస్ శెట్టి మిష్టర్‌ పోలిశెట్టి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా అనుష్కకు గట్టి కమ్‌బ్యాక్‌ లభించిందని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. శ్రుతి హాసన్‌ టాలీవుడ్‌లో సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న శ్రుతి హాసన్‌ (Shruti Haasan)కు ఈ ఏడాది కలిసొచ్చిందని చెప్పవచ్చు. చిరంజీవి, బాలకృష్ణలతో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా నానితో ‘హాయ్‌ నాన్న’ చిత్రంలోనూ ఓ పాటలో స్టెప్పులేసి అదరగొట్టింది. అలాగే ప్రభాస్‌ సరసన 'సలార్‌' సినిమాలోనూ శ్రుతి హాసన్‌ నటించింది.&nbsp;
    డిసెంబర్ 19 , 2023
    2023 Roundup: గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్‌-10 తెలుగు హీరోలు వీరే!
    2023 Roundup: గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్‌-10 తెలుగు హీరోలు వీరే!
    భారత్‌లో అతిపెద్ద వినోద రంగంగా సినిమాలను చెప్పుకోవచ్చు. దేశంలో సినీ హీరోలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. తమ అభిమాన హీరోకు సంబంధించిన ప్రతీ చిన్న అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ తెగ సెర్చ్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో 2023గాను నెటిజన్లు విపరీతంగా శోధించిన పలువురు టాలీవుడ్‌ హీరోల జాబితా బయటకొచ్చింది. వారిలో టాప్‌-10 హీరోలు ఎవరు? వారు ఏ కారణం చేత ఎక్కువగా శోధించబడ్డారు? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం.&nbsp; ప్రభాస్‌&nbsp; సినీ ప్రేక్షకులు ఎక్కువగా శోధించిన టాలీవుడ్‌ హీరోలలో ప్రభాస్ అగ్రస్థానంలో ఉన్నాడు. బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌.. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కావడం, లేటెస్ట్‌ మూవీ సలార్‌ సైతం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ప్రభాస్‌ ఆటోమేటిక్‌గా మోస్ట్‌ సెర్చ్‌డ్‌ హీరోగా నిలిచారు.&nbsp; జూ.ఎన్టీఆర్‌ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో జూ.ఎన్టీఆర్‌ క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘దేవర’ సినిమా కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ నేపథ్యంలో తారక్, ఆయన నటిస్తున్న సినిమాల గురించి ఫ్యాన్స్‌ విపరీతంగా సెర్చ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ జాబితాలో తారక్ రెండో స్థానంలో నిలిచాడు.&nbsp; అల్లు అర్జున్‌ పుష్ప సినిమా ద్వారా దేశంలోని సగటు సినీ ప్రేక్షకుడికి అల్లు అర్జున్‌ దగ్గరయ్యాడు. ఈ చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా బన్నీ నిలిచాడు. అటు బన్నీ నటిస్తున్న పుష్ప-2 నుంచి పోస్టర్‌, టీజర్‌ వంటి అప్‌డేట్స్‌ రావడంతో బన్నీ మరింత పాపులర్ అయ్యాడు. అతడి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. మహేష్‌ బాబు నెట్టింట ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన టాలీవుడ్‌ హీరోల్లో మహేష్‌ బాబు నాల్గో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘గుంటూరు కారం’ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పాటలు, పోస్టర్లు రిలీజ్‌ అవుతుండటంతో మహేష్‌ పేరు నెట్టింట ట్రెండింగ్‌లోకి వస్తోంది.&nbsp; రామ్‌ చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో రామ్‌చరణ్‌ యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్‌’ సినిమాలో చెర్రీ నటిస్తున్నాడు.&nbsp; పవన్‌ కల్యాణ్‌ టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకరు. ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ పవన్‌ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో పవన్‌ సినిమాల గురించే కాకుండా పొలిటికల్‌గానూ ఆయన సమాచారం తెలుసుకునేందుకు ఎక్కువ మంచి సెర్చ్‌ చేస్తున్నారు.&nbsp; విజయ్‌ దేవరకొండ తెలుగులో మోస్ట్‌ పాపులర్‌ యంగ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ ముందు వరుసలో ఉంటాడు. అర్జున్‌ రెడ్డితో విజయ్ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల ఆయన నటించిన ఖుషి చిత్రం పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది.&nbsp; నాని నేచురల్‌ స్టార్‌ నాని గురించి కూడా 2023 ఏడాదిలో చాలా మంది సెర్చ్‌ చేశారు. ఆయన నటించిన దసరా చిత్రం ఈ ఏడాది సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇటీవల ‘హాయ్‌ నాన్న’ సినిమాతోనూ మరో విజయాన్ని నాని తన ఖాతాలో వేసుకున్నాడు.&nbsp; చిరంజీవి జయాపజాయలతో సంబంధం లేని మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరోల్లో మెగాస్టార్‌ చిరంజీవి ఒకరు. ఆయన గురించి కూడా ఈ ఏడాది చాలా మంది నెటిజన్లు సెర్చ్‌ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్‌ టాక్ తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన ‘భోళా శంకర్‌’ మాత్రం ఫ్యాన్స్‌ను అకట్టుకోవడంలో విఫలమైంది. రవితేజ మాస్‌ మహారాజు రవితేజ తెలుగు స్టార్‌ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇటీవల ఆయన నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. రవితేజ గురించి కూడా ఎక్కువ మంది శోధించారు.&nbsp;
    డిసెంబర్ 14 , 2023

    @2021 KTree