• TFIDB EN
  • అనిరుధ్ రవిచందర్
    జననం : అక్టోబర్ 16 , 1990
    అనిరుధ్ రవిచందర్ అనిరుధ్ అని పేరు పెట్టబడిన ఒక భారతీయ సంగీత స్వరకర్త, సంగీత నిర్మాత, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రధానంగా తమిళ చిత్రాలలో పనిచేసే గాయకుడు. అతను వివిధ తెలుగు చిత్రాలకు కూడా సంగీతం అందించాడు. నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు మరియు రజనీకాంత్ మేనల్లుడు. అతను మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, తొమ్మిది SIIMA అవార్డులు, ఆరు ఎడిసన్ అవార్డులు మరియు ఐదు విజయ్ అవార్డులను గెలుచుకున్నాడు.
    కథనాలు
    Andrea Jeremiah: కనిపించి కనిపంచని సొగసులతో ఆండ్రియా అందాల దాడి.. చూడకుండా వెళ్లగలరా?
    Andrea Jeremiah: కనిపించి కనిపంచని సొగసులతో ఆండ్రియా అందాల దాడి.. చూడకుండా వెళ్లగలరా? తమిళ్ హాట్ బ్యూటీ ఆండ్రియా జర్మియా తన తాజా హాట్‌ఫోటోలు షేర్ చేసి టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. విలక్షణ నటనకు పెట్టింది పేరుగా ఉన్న ఆండ్రియా ఒంపుసొంపులతో కుర్రకారు హార్ట్ బీట్ అమాంతం పెంచేసింది. పింక్, బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఫొటో షూట్‌లో ఆండ్రింగా హాట్ లుక్స్‌లో కనిపించింది. ఎద అందాలు కనిపించి కనిపించకుండా చూపిస్తూ కవ్విస్తోంది. ఆండ్రియా జర్మియా తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించి మెప్పించింది.  కార్తి హీరోగా నటించిన 'యుగానికి ఒక్కడు' సినిమాతో పాపులారిటీ సంపాదించింది.  ఆ తర్వాత తెలుగులో సునీల్, నాగ చైతన్య కాంబోలో వచ్చిన తడాఖా చిత్రంలో మెరిసింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఆండ్రియా తన పరువాల విందుతో కుర్రకారుకు కైఫెక్కిస్తుంటుంది. తాజా ఫొటో షూట్‌లో ఇంపైన బ్యాక్ షోతో సొగసుల విందు చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో అందాల ఎర వేసింది పొట్టి షార్ట్‌లో నడుము అందాలను చూపిస్తూ ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి సోషల్ మీడియాలో తరుచూ యాక్టివ్ ఉండే ఈ తమిళ్ తెగింపు.. అందాల ప్రదర్శనతో రచ్చ చేస్తుంటుంది గతంలో ధనుష్, అనిరుధ్ రవిచందర్, ఫహాద్ ఫాజిల్ వంటి సెలబ్రెటీలతో ఆఫైర్స్ నడిపి వార్తల్లో నిలిచింది. ఆండ్రియా తన తొలి చిత్రం 'కందా నల్ల ముదల్'(2005)తో సినిమాల్లోకి ఆరంగేట్రం ఇచ్చింది. స్టైలిష్‌గా కనిపిస్తూ, మంచి నటన కనబరుస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఆండ్రియా జర్మియా ఇండస్ట్రీలోకి రాకముందు సింగర్‌గా కొనసాగింది.  ఆండ్రియా  పదేళ్ల వయసు నుంచే మంచి యాక్టివ్ పిల్ల. 'యంగ్ ఇసాదర్సు' ర్యాప్ బృంందంలో సాంగ్స్ పాడేది.  కాలేజీలోనూ స్టేజ్ పర్ఫామెన్స్ చేస్తూ నటనపై తన అభిరుచిని చాటుకుంది.  ఆండ్రియా స్వస్థలం తమిళనాడులోని అరక్కోణం. ఆమె ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో 1985 డిసెంబర్ 21న జన్మించింది.  తడాఖా సినిమా ద్వారా తెలుగు తెరకు పరచయమైన ఈ సుందరాంగి ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అడపాదడపా తమిళ్‌ నుంచి తెలుగులోకి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో అవకాశాలు రాకపోతేనేం.. అందాల ఆరబోతతో తమిళ్, తెలుగు కుర్రాళ్లను ఆకర్షిస్తునే ఉంది. ప్రస్తుతం ఈ అందాల బామకు చేతినిండ పని ఉంది. పిశాసు-2, నో ఎంట్రీ, వట్టం చిత్రాల్లో నటిస్తోంది
    ఫిబ్రవరి 14 , 2024
    Leo Movie Review: సోషల్ మీడియాలో లియో డిజాస్టర్ టాక్.. మరి సినిమా ఎలా ఉంది? నటీనటులు : విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ తదితరులు దర్శకత్వం : లోకేష్ కనగరాజ్ సంగీతం : అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస  నిర్మాతలు : S.S లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023   తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’. ‘విక్రమ్‌’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీని తెరకెక్కించిన దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ మూవీని రూపొందించారు. దీంతో ఈ సినిమాపై తమిళ్‌తో పాటు తెలుగులోనూ విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అంతేగాక LCU (లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)లో ఈ సినిమా కూడా భాగం కావడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనికితోడు ఇటీవల విడుదలైన లియో ట్రైలర్‌ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. ఇక భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మరి ‘లియో’ మూవీ ఎలా ఉంది? విజయ్‌ ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలు ఈ రివ్యూలో చూద్దాం.  కథ హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలు (అబ్బాయి, అమ్మాయి)తో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. అక్కడి నుంచి పార్తీబన్‌కు కష్టాలు మెుదలవుతాయి. అతడ్ని వెతుకుతూ ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? ఆంటోనీ దాస్, హరోల్డ్ దాస్ (అర్జున్) బ్రదర్స్ ఎవరు? నిజంగా లియో దాస్ మరణించాడా? లేదంటే పార్తీబన్ పేరుతో కొత్త జీవితం మొదలు పెట్టాడా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి మరీ విజయ్‌ ‘లియో’ చిత్రంలో నటించాడు. తనతో సమానమైన ఎత్తు ఉన్న అబ్బాయికీ తండ్రిగా ఇందులో కనిపించాడు. విజయ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. అయితే మూవీలోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ విజయ్‌ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసింది. ఫైట్స్‌లో విజయ్‌ తన మార్క్‌ చూపించాడు. ఇక తల్లి పాత్రలో త్రిష ఒదిగిపోయారు. ఆంటోనీ దాస్ పాత్రలో సంజయ్ దత్, హరోల్డ్ దాస్ పాత్రలో అర్జున్ సర్జాకు ఇచ్చిన ఇంట్రడక్షన్స్ బావున్నాయి. వారు తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. ఇక గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రియా ఆనంద్ చిన్న అతిథి పాత్రలో, మడోన్నా సెబాస్టియన్ కథను మలుపు తిప్పే క్యారెక్టర్‌లో మెప్పించారు.   డైరెక్షన్ ఎలా ఉందంటే 'లియో'లో కూడా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ తన స్టైల్‌ను అనుసరించాడు.  సినిమా ప్రారంభంలో హైనాతో ఫైట్, కాఫీ షాపులో షూటౌట్, 'లియో' ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్స్‌ను ఆయన బాగా తెరకెక్కించారు. అయితే దర్శకుడిగా ఆయన మార్క్‌ సినిమా ఆసాంతం కనిపించదు. ఇంటర్వెల్‌ తర్వాత మాత్రమే అసలు కథ ప్రారంభమవుతుంది. పార్తీబన్‌, లియో ఒక్కరేనా? ఇద్దరూ వేర్వేరా? అని పాయింట్‌ మీద సెకండాఫ్‌ను డైరెక్టర్‌ నడిపించడంతో కాస్త సాగదీసిన భావన అందరికీ కలుగుతుంది. కార్ ఛేజింగ్ యాక్షన్ సీన్ బాగున్నప్పటికీ క్లైమాక్స్ ఫైట్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరింత దృష్టి పెట్టాల్సింది.   టెక్నికల్‌గా  టెక్నికల్ అంశాలకు వస్తే మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్‌ అని చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం మెప్పిస్తుంది. సినిమా అంతటా సన్నివేశాలకు తగ్గట్టు డిఫరెంట్ లైటింగ్ ద్వారా ఆ సీన్స్ మూడ్‌ను మనోజ్‌ పరమహంస సెట్ చేశారు. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం బావుంది. కానీ, 'విక్రమ్', 'జైలర్' చిత్రాలతో పోలిస్తే 'లియో' మ్యూజిక్‌ అంతగా ఆకట్టుకోదు. ముఖ్యంగా పాటల్లో అనిరుధ్‌ మార్క్‌ కనిపించదు. తెలుగు సాహిత్యం కూడా బాలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.   ప్లస్‌ పాయింట్స్‌ విజయ్‌ నటనసినిమాటోగ్రఫీనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ పాటలుసాగదీత సీన్స్‌ చివరిగా : లోకేష్‌ కనగరాజ్‌ గత చిత్రాలతో (ఖైదీ, విక్రమ్‌) పోలిస్తే అంచనాలను అందుకోవడంలో 'లియో' కాస్త వెనకపడిందని చెప్పవచ్చు. యాక్షన్ మూవీ ప్రేమికులకు మాత్రం సినిమా నచ్చుతుంది. విజయ్ అభిమానులను మెప్పిస్తుంది. రేటింగ్‌: 2.5/5
    అక్టోబర్ 19 , 2023
    Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..!  రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్; అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచాయి. ప్రధానంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు ఆడియెన్స్‌ని తెగ ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూ తమ అభిమాన హీరో యాక్టింగ్‌ని ఆస్వాదిస్తున్నారు. అయితే, జైలర్ 2 (Jailer 2) కూడా ఉండబోతోందని చెప్పి ఫ్యాన్స్‌కి మరో ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.  భారీ తారాగణంతో.. జైలర్ మూవీ భారీ తారాగణంతో తెరకెక్కింది. మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. పాత్ర నిడివి కాసేపే అయినా సినిమాపై మంచి ప్రభావాన్ని చూపించారు. నట సింహం నందమూరి బాలకృష్ణతో కూడా జైలర్‌లో ఓ పాత్ర చేయించాలని నెల్సన్ చూశాడట. కానీ, బాలయ్య మాస్ ఫాలోయింగ్‌కి ఆ రోల్ సరితూగక పోవడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో, జైలర్ సీక్వెల్(Jailer Sequel) మూవీలోనూ బిగ్ స్టార్స్ ఉండే అవకాశం ఉంది. మ్యూజిక్ అతడేనా నెల్సన్ దిలీప్ కుమార్ తన కెరీర్‌లో 4 సినిమాలు చేశాడు. జైలర్‌కి ముందు బీస్ట్, డాక్టర్, కోలామావు కోకిల చిత్రాలు తెరకెక్కించాడు. ఈ నాలుగింటికి అనిరుధ్ రవిచందర్‌ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. నెల్సన్‌ తీసిన / తీయబోయే చిత్రాలకు అనిరుధ్‌ ఆస్థాన సంగీత దర్శకుడిగా మరిపోయాడు. జైలర్ మూవీ సక్సెస్‌లో మ్యూజిక్ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. దీంతో జైలర్ సీక్వెల్‌లోనూ అనిరుధ్‌నే కొనసాగించే అవకాశం ఉంది. దీంతో పాటు, తొలి సినిమా నుంచి ఒకే డీవోపీతో వర్క్ చేశాడు నెల్సన్. మరి, జైలర్ పార్ట్2 కి కూడా ఆర్.నిర్మల్ డీవోపీగా ఉంటాడేమో చూడాలి.  వీటికి కూడా సీక్వెల్స్? జైలర్‌తో పాటు తాను తీసిన తొలి మూడు చిత్రాలకు సీక్వెల్ తెరకెక్కించడానికి నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేస్తున్నాడట. కొలామావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు పార్ట్ 2 తీయాలని చూస్తున్నాడట. మరి, వీటిలోనూ వారినే కొనసాగిస్తారా? లేక ఇతర హీరోలను పెట్టుకుంటాడా? అనేది వేచి చూడాలి. అయితే బీస్ట్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి, పార్ట్ 2కి విజయ్ ఏమంటాడో.  రజనీ, విజయ్‌లతో మూవీ కోలీవుడ్‌లో రజనీ, విజయ్‌లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పలేం. వీరిద్దరికీ వీరాభిమానులు ఉన్నారు. కోలీవుడ్‌లోనే కాక తెలుగు, మలయాళం, కన్నడలోనూ ఈ హీరోల సినిమా వస్తుందంటే ఆసక్తితో ఎదురు చూస్తారు. మరి, ఈ హీరోలు ఇద్దరు స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? నెల్సన్ దిలీప్ కుమార్ కూడా రజనీ, విజయ్‌లతో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడట. వీరిద్దరితో సినిమా చేయడం తన కల అని వెల్లడించాడీ డైరెక్టర్. ఈ చిత్రం పట్టాలెక్కితే కోలీవుడ్ చరిత్రలోనే మైలురాయి చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. 4 రోజుల్లో 300 కోట్లు జైలర్ మూవీ తొలి 4 రోజుల్లో రూ.300 కోట్లు కలెక్షన్లను వసూలు చేసింది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.95.78 కోట్లు, రెండో రోజున రూ.56.24 కోట్లు, మూడో రోజున రూ.68.51 కోట్లు, నాలుగో రోజున రూ.82.36 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.302.89 కోట్ల వసూళ్లను రాబట్టింది. 
    ఆగస్టు 14 , 2023
    Jailer Movie Review: జైలర్‌లో విశ్వరూపం చూపించిన రజనీకాంత్‌.. మరి సినిమా హిట్‌ కొట్టినట్లేనా? నటీనటులు: రజినీకాంత్, తమన్నా, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, యోగి బాబు, రమ్యకృష్ణ, వినాయకన్ తదితరులు. డైరెక్టర్: నెల్సన్ దిలీప్ కుమార్ మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్ నిర్మాత: కళానిధి మారన్ గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సరైన సక్సెస్ అందుకోలేదు. ‘బీస్ట్’ మూవీ పరాజయం అనంతరం, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌ చేస్తున్న చిత్రం ఇది. దీంతో వీరిద్దరూ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం(ఆగస్ట్ 10) విడుదలైన ఈ చిత్రం రజినీకి సక్సెస్ ఇచ్చిందా? థియేటర్లలో ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేసిందా? అనే అంశాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటంటే? టైగర్ ముత్తువేల్ పాండ్యన్(రజినీకాంత్) ఒక జైలర్‌గా పనిచేసి రిటైర్ అవుతాడు. భార్య, కొడుకు, కోడలు, మనవడితో సంతోషంగా కుటుంబాన్ని నడుతుపుతుంటాడు. కొడుకు అర్జున్ ఒక నిఖార్సైన పోలీస్ అధికారి. ఓ హై ప్రొఫైల్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో అర్జున్ అదృశ్యమౌతాడు. కొడుకు కోసం వెతకడం ప్రారంభించిన ముత్తువేల్ ఎవరైనా చంపేసి ఉంటారేమోనని భావిస్తాడు. కానీ, ప్రాణాలతోనే ఉన్నట్లు, విలన్ గ్యాంగ్ తన కొడుకును బంధించినట్లు తెలుసుకుంటాడు. వారి నుంచి విడిపించుకోవడానికి ముత్తువేల్ ఏం చేశాడు? విలన్ గ్యాంగ్ చేసిన డిమాండ్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.  https://twitter.com/OnlineRajiniFC/status/1689512670238846976?s=20 ఎలా ఉంది? కమర్షియల్ సినిమాకు రజినీ మార్క్ ఎలివేషన్స్ సినిమాను నిలబెట్టాయి. కొన్ని సన్నివేశాలు రజినీ ‘శివాజీ’ సినిమా గుర్తొచ్చేంతలా ఉంటాయి. ఫస్టాఫ్‌లో నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ దగ్గరపడే కొద్దీ కథ కాస్త సీరియస్ టోన్‌లోకి వెళ్తుంది. చక్కటి ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి రేగుతుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ రజినీ ఫ్యాన్స్‌కి పండగలా ఉంటాయి. ఇక క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. రజినీ మార్క్ యాక్టింగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కుదిరింది. యాక్షన్ డోజ్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సెకండాఫ్‌లో ఓ సౌత్ హీరో కేమియో ఆశ్చర్యపరుస్తుంది. అయితే, కొన్ని చోట్ల కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ‘కావాలా’ పాటపై అంచనాలు పెరగడంతో తెరపై ఊహించిన విధంగా ఉండదు. అక్కడక్కడా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.  https://twitter.com/OnlineRajiniFC/status/1689497366481514496?s=20 ఎవరెలా చేశారు? జైలర్‌గా రజినీకాంత్‌కి ఫుల్ మార్కులే వేయొచ్చు. యాక్షన్ సీన్స్‌లో మ్యానరిజంతో ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు. ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తూనే యాక్షన్ స్ట్రెంత్ చూపించాడు. స్టైల్, కామెడీ టైమింగ్‌తో ఫర్వాలేదనిపించాడు. ఇక, కామెడీతో యోగిబాబు మరోసారి అదరగొట్టేశాడు. రజినీతో వచ్చే సన్నివేశాల్లో హాస్యాన్ని పండించాడు. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విలన్‌గా వినాయకన్ మెప్పించాడు. వైవిధ్యాన్ని చూపిస్తూ భయపెట్టాడు.  టెక్నికల్‌గా.. గత సినిమాల్లో చేసిన తప్పులను నెల్సన్ దిలీప్ కుమార్ సరిదిద్దుకున్నట్లే. జైలర్ విషయంలో నెల్సన్ పక్కగా వ్యవహరించాడు. ఎన్నో గూస్‌బంప్స్ మూమెంట్స్‌ని తెరపై పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాడు. ఇక, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో బలం. రజినీ నడుస్తున్నప్పుడు కూడా విజిల్స్ వేయాలనిపించే నేపథ్య సంగీతాన్ని అందించాడు. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలు సహజంగా అనిపించేలా లైటింగ్, కలర్ టోన్ బాగా నప్పింది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ వేసిన సెట్స్‌ బాగున్నాయి. https://twitter.com/tupakinews_/status/1689519979182612480?s=20 పాజిటివ్ పాయింట్స్ రజినీ ఎలివేషన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ డార్క్ కామెడీ నెగెటివ్ పాయింట్స్ బోర్ కొట్టించే సన్నివేశాలు రేటింగ్.. 2.75/5
    ఆగస్టు 11 , 2023

    అనిరుధ్ రవిచందర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అనిరుధ్ రవిచందర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree