• TFIDB EN
  • చైతన్య రావు మాదాడి
    జననం : జూలై 13 , 1989
    ప్రదేశం: కరీంనగర్, తెలంగాణ, భారతదేశం
    చైతన్య రావు ప్రముఖ తెలుగు నటుడు. బందూక్(2015) సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు పొందాడు. కీడాకోలా, హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌లో నటించి మెప్పించాడు. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా యూనివర్సిటీలో MS చేసిన ఆయన సినిమాలపై ఇష్టంతో హైదరాబాబ్‌లోని రామానంద్ యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాడు.

    చైతన్య రావు మాదాడి వయసు ఎంత?

    చైతన్య రావు వయసు 35 సంవత్సరాలు

    చైతన్య రావు మాదాడి అభిరుచులు ఏంటి?

    సినిమాలు చూడటం, సంగీతం వినడం

    చైతన్య రావు మాదాడి ఏం చదువుకున్నారు?

    MS

    చైతన్య రావు మాదాడి ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    కాన్‌బెర్రా యూనివర్శిటీ , ఆస్ట్రేలియా, ఉస్మానియా యూనివర్శిటీ, జ్యోతిష్మతి స్కూల్, కరీంనగర్

    చైతన్య రావు మాదాడి‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    చైతన్య రావు మాదాడి అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Chaitanya Rao Madadi

    Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్‌ సక్సెస్‌ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా?
    Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్‌ సక్సెస్‌ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా? నటీనటులు : చైతన్యరావు, సునీల్‌, హర్ష చెముడు, శ్రద్ధా దాస్‌, మాళవికా సతీశన్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, సమీర్‌ తదితరులు దర్శకుడు : సంతోష్‌ కంభంపాటి సంగీతం : రీ సినిమాటోగ్రాఫర్‌ : బాల సరస్వతి ఎడిటర్‌ : శశాంక్‌ ఉప్పుటూరి నిర్మాతలు : మహిధర్‌ రెడ్డి, దేవేష్‌ శ్రీనివాసన్‌ సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 19న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు. మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే కథానాయకుడు చైతన్యరావు హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే చక్కటి నటన కనబరిచాడు. అయితే ఈ సినిమాకు హీరో కంటే హర్ష చెముడు, సునీల్‌ పాత్రలే కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా హర్ష.. తన కమెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. అటు సునీల్‌ సైతం తన కామెడీతో మెప్పించాడు. వింటేజ్‌ సునీల్‌ను మరోమారు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక రావు నటన పర్వాలేదు. హర్ష, మాళవిక మధ్య వచ్చే కామెడీ ట్రాక్‌ నవ్విస్తుంది. బార్‌ డ్యాన్సర్‌గా శ్రద్ధా దాస్ నటన ఓకే. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సురేఖ వాణి చాలా రోజుల తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సంతోష్‌ కంభంపాటి.. సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఈ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. సినిమాలు తీసేవాళ్లకు తమ జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను చూపించారు. వైవా హర్షను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చైతన్య చెప్పడం, నిర్మాతలు ఇచ్చే సమాధానాలు నవ్విస్తాయి. హర్ష, సునీల్‌లోని కామెడీ టైమింగ్‌ను డైరెక్టర్ చాలా బాగా వాడుకున్నారు. అయితే చైతన్యరావులోని నటుడ్ని సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. కథ కూడా సాదా సీదాగా సాగడం, పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్‌ ట్విస్టులు సినిమాకు మైనస్‌గా మారాయి. సినిమాలో చాలా చోట్ల లాజిక్కులు మిస్‌ అయ్యాయి. కిడ్నాప్ డ్రామా తెరపైకి వచ్చి ట్విస్టులు రివీల్ అయ్యాక కామెడీ డైల్యూట్ అయ్యింది. ఫలితంగా ప్రేక్షకుల్లో కథపై క్యూరియాసిటీ తగ్గిపోయింది. అప్పటి వరకు సినిమా బ్యాక్‌డ్రాప్‌తో కొత్తగా అనిపించిన 'పారిజాత పర్వం'.. డైరెక్టర్‌ చేసిన కొన్ని తప్పిదాల వల్ల రొటీన్‌ మూవీగా మారిపోయింది.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కెమెరా, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. సంగీత దర్శకుడు 'రీ' బాణీల్లో పెప్పీ, మోడ్రన్ స్టైల్ వినిపించింది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ కథకామెడీ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ సన్నివేశాలుపేలవమైన స్క్రీన్‌ప్లేలాజిక్స్‌కు అందని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5 
    ఏప్రిల్ 19 , 2024
    Celebrities Weddings & Divorce: ఓవైపు పెళ్లిళ్లు మరోవైపు విడాకులు.. చిత్ర పరిశ్రమలో ఏంటీ విచిత్రం? భారతీయ సమాజ వ్యవస్థలో వివాహం అనేది ఎంతో కీలకమైంది. పాశ్చాత్య దేశాలను భారత్‌ను ప్రధానంగా వేరు చేసే అంశాల్లో వివాహం కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. కలకాలం ఎంతో హాయిగా జీవించాలనే లక్ష్యంతో కొత్త జంట వైవాహిక బంధంలోకి అడుగుపెతుంటారు. చిత్ర పరిశ్రమలోనూ చాలా మంది సెలబ్రిటీలు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు ఏది చేసినా అది సెన్సేషన్ అయిపోతుంటుంది. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌ చేసినా, పెళ్లి చేసుకున్నా లేదా విడాకులు తీసుకున్నా అవి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. కొన్ని దశాబ్దాల చిత్ర పరిశ్రమ చరిత్ర తీసుకుంటే పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీల కంటే విడిపోయే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. తాజాగా స్టార్‌ హీరో సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి వివాహం చేసుకున్న నేపథ్యంలో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది.  [toc] వైభవంగా సిద్ధార్థ్‌ వివాహం నటుడు సిద్ధార్థ్‌ (Siddharth), నటి అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ అదు సిద్ధు’ అని అదితి క్యాప్షన్‌ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. మహా సముద్రం షూటింగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది క్రమేణా ప్రేమగా మారింది. ఎక్కడ చూసిన ఈ ఇద్దరు తారలు జంటగా కనిపించేవారు. దీంతో వీరి పెళ్లిపై చాలా కాలం నుంచే రూమర్లు వచ్చాయి. తాజాగా పెళ్లి చేసుకొని ఆ రూమర్లకు సిద్ధార్థ్‌ - అదితి జంట చెక్‌ పెట్టింది.  https://twitter.com/UnrealAkanksha/status/1835569675968602477 ఓవైపు పెళ్లిళ్లు.. యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రముఖ నటి శోభితా దూళిపాళను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలేే ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. చైతూ తండ్రి అక్కినేని నాగార్జున తొలిసారి వీరి నిశ్చితార్థ ఫొటోలను నెట్టింట షేర్‌ చేయడంతో విషయం బయటకు వచ్చింది. యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం కూడా ఇటీవల వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే చైతన్య గతంలో స్టార్‌ హీరోయిన్‌ సమంతను వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు.  ‘రాజావారు రాణిగారు’ చిత్రంలో తనకు జోడీగా చేసిన రహస్య గోరఖ్‌ను ఇటీవల పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. గతేడాది మెగా హీరో వరుణ్‌ తేజ్‌,  హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి అంగరంగ వైభంగా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకొని ఈ జంట ఆకట్టుకుంది.  https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531 https://twitter.com/AadhanTelugu/status/1826816125809647850 మరోవైపు విడాకులు ఓవైపు సెలబ్రిటీలు ఎంత ఫాస్ట్‌గా వివాహం చేసుకుంటున్నారో అదే విధంగా తమ భాగస్వామికి విడాకులు ప్రకటిస్తూ షాక్ ఇస్తున్నారు. రీసెంట్‌గా తమిళ స్టార్‌ నటుడు జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచాడు. తనకు తెలియకుండానే విడాకులపై అనౌన్స్‌మెంట్‌ చేశారని ఆయన భార్య ఆర్తి అతడిపై మండిపడటంతో ఈ వ్యవహారంలో ట్విస్ట్ ఏర్పడింది. ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్‌ తన భార్య, రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రముఖ నటుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ జి.వి. ప్రకాష్‌ కూడా పదేళ్ల వైవాహిక బంధానికి చెక్‌ పెట్టి తన భార్య, సింగర్‌ సైంధవికి విడాకులు ఇచ్చారు. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల కూడా గతేడాది తన భర్త చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే పెళ్లిచేసుకోవడం, విడిపోవడం ‌అనేది వారి వ్యక్తిగత విషయాలే అయినప్పటికీ గతంతో పోలిస్తే ఇవి ఎక్కువ కావడం చర్చకు తావిస్తోంది.  గతంలో విడాకులు తీసుకున్న పాపులర్‌ సెలబ్రిటీలు నాగార్జున - లక్ష్మీ దగ్గుబాటి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మెుదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె సినీ హీరో వెంకటేష్ (Venkatesh), నిర్మాత సురేష్ బాబుల సోదరి. వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి వీరు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం. పవన్‌ కల్యాణ్‌ - రేణూ దేశాయ్‌ పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. తొలి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి రేణూ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు. రష్యాకు చెందిన అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఆమెతో జీవిస్తున్నారు.  సుమంత్‌ - కీర్తి రెడ్డి నాగార్జున మేనల్లుడు సురేంద్ర యార్లగడ్డ -సత్యవతిల కుమారుడైన నటుడు సుమంత్ (Sumanth) కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగా ‘తొలి ప్రేమ’ ఫేమ్‌ హీరోయిన్‌ కీర్తి రెడ్డిని ప్రేమించి 2004 ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్‌గానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు. అమీర్ ఖాన్ - కిరణ్ రావు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్ ఖాన్ తన మొదటి భార్యతో విడాకుల తర్వాత డిసెంబరు 28, 2015న కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావు ఖాన్ అనే అబ్బాయి ఉన్నాడు. 16 సంవత్సరాల వివాహ బంధం తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.  మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ అర్బాజ్ ఖాన్, నటి మలైకా అరోరా 1998లో వివాహం చేసుకున్నారు. వారికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు 2002లో జన్మించాడు. ఈ జంట 28 మార్చి 2016న విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 మే 2017న అధికారికంగా విడాకులు తీసుకున్నారు. హృతిక్ రోషన్ - సుసానే ఖాన్ బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్ రోషన్‌, సుస్సేన్ 20 డిసెంబర్ 2000న వివాహం చేసుకున్నారు. 14 సంవత్సరాల వివాహం తర్వాత ఈ జంట 2014లో పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు. కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్ కరిష్మా, సంజయ్ 2003లో వివాహం చేసుకున్నారు. అనేక విభేదాలు, ఆరోపణల కారణంగా ఈ జంట 2014లో అధికారికంగా విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైఫ్​ అలీఖాన్​ - అమృతా సైఫ్ అలీఖాన్ 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్​ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. భరణంగా అమృతాకు ఆస్తిలో సగం వాటా ఇచ్చారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‏ను రెండో వివాహం చేసుకున్నారు. సంజయ్‌ దత్‌ - రిచా శర్మ 1987లో నటి రిచా శర్మతో సంజయ్​ దత్​ వివాహం జరిగింది. 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్‏తో మృతి చెందింది. వీరికి త్రిషాలా కూతురు. 1998లో మోడల్ రియా పిళ్లైతో రెండో పెళ్లి జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. 2008లో మాన్యతా దత్​ను గోవాలో మూడో పెళ్లి చేసుకున్నారు సంజయ్. 
    సెప్టెంబర్ 16 , 2024
    Annapurna Photo Studio Review: ఆహా.. అచ్చమైన పల్లెటూరి ప్రేమ కథ.. మూవీ ఎలా ఉందంటే ? నటీనటులు: చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య, య‌ష్ రంగినేని  ద‌ర్శ‌క‌త్వం: చెందు ముద్దు సంగీతం: ప్రిన్స్ హెన్రీ ఛాయాగ్ర‌హ‌ణం: పంకజ్ తొట్టాడ నిర్మాత: య‌ష్ రంగినేని ‘30 Weds 21’ ఫేమ్‌ చైతన్యరావ్‌ హీరోగా, లావణ్య హీరోయిన్‌గా చేసిన తెరకెక్కిన చిత్రం ‘ అన్నపూర్ణ ఫొటో స్టూడియో ’. ఓ పిట్ట కథ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన చెందు ముద్దు తన రెండో ప్రయత్నంగా ఈ మూవీ తెరకెక్కించాడు. 1980 కాలాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రేమ సాగుతుందని ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. మంచి ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన ఈ సినిమా ఎలా ఉంది?. ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? చైతన్యరావ్‌కు హిట్ తెచ్చిపెట్టిందా? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  కథేంటి కపిలేశ్వరపురం అనే ప‌ల్లెటూరులో చంటి (చైతన్య రావ్‌) త‌న స్నేహితుడితో క‌లిసి ‘అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో’ న‌డుపుతుంటాడు. జ్యోతిష్యుడైన త‌న తండ్రికి చుట్టు ప‌క్క‌ల ఎంతో మంచి పేరు ఉంది. కానీ చంటికి వయసు మీద పడుతున్నా పెళ్లి కాదు. దీంతో స్నేహితులంతా అతడ్ని ఎగ‌తాళి చేస్తుంటారు. ఇంత‌లోనే గౌతమి (లావణ్య) అనే అమ్మాయిని చూసి చంటి ప్రేమిస్తాడు. ఆమె కూడా చంటిని ఇష్ట‌ప‌డుతుంది. ఇక ఈ ఇద్ద‌రి ప్రేమ‌క‌థ కంచికి చేరిన‌ట్టే అనుకునేలోపే విష‌యం చంటి తండ్రికి తెలుస్తుంది. జాతకం ప్రకారం చంటి ప్రాణానికి ప్రమాదం ఉందని గౌతమికి చెబుతాడు. అది తెలిశాక గౌత‌మి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది?  చంటి ఓ హ‌త్య కేసులో నిందితుడిగా ఎలా మారాడు? ఆత్మ‌హ‌త్యకి ఎందుకు ప్ర‌య‌త్నించాడు? చంటి, గౌత‌మి ఒక్క‌ట‌య్యారా లేదా? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే చైత‌న్య‌రావ్  న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. వ‌య‌సు మీద‌ప‌డిన కుర్రాడిగా త‌న‌కి అల‌వాటైన పాత్ర‌లో మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు. వింటేజ్ లుక్‌లో ఆయ‌న క‌నిపించిన తీరు, గోదావ‌రి యాస, కామెడీలో టైమింగ్ మెప్పిస్తాయి. లావ‌ణ్య అచ్చ‌మైన తెలుగ‌మ్మాయిగా అందంగా క‌నిపించింది. ఆమె న‌ట‌న కూడా బాగుంది. చెల్లెలు ప‌ద్దు పాత్ర‌లో ఉత్త‌ర‌, స్నేహితుడిగా ల‌లిత్ ఆదిత్య‌, మ‌రో పాత్ర‌లో మిహిరా మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. స్నేహితుల గ్యాంగ్‌లో ఎప్పుడూ తింటూ క‌నిపించే వైవా రాఘ‌వ పాత్ర కూడా బాగా న‌వ్విస్తుంది.  కొత్త న‌టులతో దర్శ‌కుడు స‌హ‌జ‌మైన న‌ట‌న‌ని రాబ‌ట్టుకున్నారు ఎలా సాగిందంటే క‌థానాయ‌కుడి ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నంతో క‌థ మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డ దొరికిన లేఖ నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్‌ ట్రాక్‌, సన్నివేశాలు చాలా సరదాగా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. అలాగే సినిమాలో ఉన్న అన్ని పాత్రల చేత కామెడీ చేయించాలని ట్రై చేశారు కానీ పూర్తిస్థాయిలో అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగుతూ ఇంటర్‌వెల్‌ ట్విస్ట్‌ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచేస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, పాత్రలు బాగా డిజైన్ చేసుకున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.  డైరెక్షన్‌ & టెక్నికల్‌గా 1980నాటి స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌. కల్మషం లేని పాత్రలు, అందమైన విజువల్స్‌, సంగీతం ప్రేక్షకులను హత్తుకుంటాయి. మాటలతో అక్క‌డ‌క్క‌డా మెరిపించినా.. క‌థ‌, క‌థ‌నాల ర‌చ‌నలో ఆయ‌న మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవాల్సింది. 80వ దశకం కథను చెప్పె క్రమంలో అప్పటి సినిమాలను అనుసరించి స్టోరీని తెరకెక్కించడం అంతగా రుచించదు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా  ఉంది. ముఖ్యంగా కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ప‌ల్లెటూరి అందాల్ని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు శ‌భాష్ అనిపిస్తుంది. సంగీతం కూడా మెప్పిస్తుంది. క‌థ‌లో వేగం పెరిగేలా ఎడిటింగ్ విభాగం మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవాల్సింది. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది. ప్లస్‌ పాయింట్స్‌ 1980 నాటి నేపథ్యంనటీనటులుకథలో మలుపులు మైనస్‌ పాయింట్స్‌ ఎడిటింగ్‌పాత పంథాలో సన్నివేశాలు రేటింగ్‌: 2.75/5 https://www.youtube.com/watch?v=COPhzQh-wc8
    జూలై 21 , 2023
    Keedaa Cola Review: కడుపుబ్బా నవ్వించే ‘కీడా కోలా’.. మరి తరుణ్‌ భాస్కర్‌ హిట్‌ కొట్టినట్లేనా? నటీనటులు: చైతన్య మందాడి, రాగ్‌ మయూర్‌, బ్రహ్మానందం, తరుణ్‌ భాస్కర్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు, రవీంద్ర విజయ్‌, రఘురామ్‌ దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌ సంగీతం: వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్‌ నిర్మాతలు: కె.వివేక్‌, సాయికృష్ణ, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌, ఉపేంద్ర వర్మ సమర్పణ: రానా దగ్గుబాటి విడుదల: 03-11-2023 పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాల ద్వారా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker) తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథలను అందించడంలో తనకు సాటి లేరని చాటి చెప్పారు. సున్నితమైన కథలతో వల్గారిటీ లేని కామెడీని పుట్టించి తరుణ్‌ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. అటువంటి తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన మరో చిత్రం 'కీడా కీలా' (Keeda Cola). ఈ చిత్రం ఇవాళ (నవంబర్‌ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందా? తరుణ్ భాస్కర్‌ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? వంటి ప్రశ్నలకు ఈ రివ్యూలో సమాధానాలు తెలుసుకుందాం. క‌థ వాస్తు (చైత‌న్య‌రావు), వ‌ర‌ద‌రాజు (బ్ర‌హ్మానందం) తాత మనవళ్లు. లాయ‌ర్ అయిన కౌశిక్ (రాగ్ మ‌యూర్‌)తో కలిసి డబ్బు కోసం ఓ ప్లాన్‌ వేస్తారు. తాత కోసం కొన్న శీత‌ల పానీయం కీడా కోలా బాటిల్‌లో బొద్దింక‌ని చూపించి య‌జ‌మానిని బ్లాక్‌మెయిల్ చేయాల‌ని ప‌న్నాగం ప‌న్నుతారు. రూ.5 కోట్ల నుంచి బేర‌సారాలు మొద‌ల‌వుతాయి. మ‌రోవైపు జీవ‌న్‌ కార్పొరేట‌ర్ కావాల‌ని ఆశపడుతుంటాడు. 20 ఏళ్లు జైల్లో ఉండి బ‌య‌టికి వ‌చ్చిన త‌న అన్న నాయుడు (Tharun bhascker) అండ‌తో ఆ ప్ర‌య‌త్నాల్లోకి దిగుతాడు. వీరికి కూడా డబ్బు అవ‌స‌రం పడటంతో నాయుడు, జీవన్‌ కూడా ఓ వ్యూహం ప‌న్నుతారు. మ‌రి వీళ్లంద‌రి ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? డ‌బ్బు సంపాదించారా? వాస్తు గ్యాంగ్‌, జీవ‌న్ గ్యాంగ్ ఎలా క‌లిశారు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే తెర‌పై చూడాల్సిందే. ఎలా సాగిందంటే స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో ప్ర‌థ‌మార్ధం వేగంగా పూర్త‌వుతుంది. నాయుడుగా త‌రుణ్ భాస్క‌ర్ ఎంట్రీతో క‌థ‌లో మ‌రింత వేగం పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస, రోజుకో గంట ఇంగ్లిష్ అంటూ ఆయ‌న చేయించే విన్యాసాలు సినిమాకి ఊపుని తీసుకొస్తాయి. ఇక ద్వితీయార్ధం మ‌రింత సంద‌డిగా అనిపిస్తుంది. కీడాకోలాకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ హీరోగా గెట‌ప్ శీను చేసే సంద‌డి, వాస్తు గ్యాంగ్‌, నాయుడు గ్యాంగ్ ఎదురెదుగా నిలుచుని స‌రెండ‌ర్ అంటూ చేసే హంగామా క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. నాయుడుని అంతం చేయ‌డానికి వచ్చిన షార్ప్ షూట‌ర్స్‌ చేసే హంగామా, బార్బీతో నాయుడు ప్రేమ‌లో ప‌డ‌టం వంటి స‌న్నివేశాలు ద్వితీయార్థంలో హైలైట్‌గా నిలుస్తాయి.  బ్ర‌హ్మానందం పాత్ర వీల్ ఛెయిర్‌కే ప‌రిమిత‌మైనా సంద‌ర్భానుసారంగా న‌వ్విస్తుంది.  ఎవరెలా చేశారంటే? ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌ ఈ సినిమాలో న‌టుడిగానూ అద్భుత నటన కనబరిచాడు. నాయుడుగా ఆయ‌న క‌నిపించిన విధానం, న‌ట‌న‌, కామెడీ టైమింగ్ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. బ్ర‌హ్మానందం పాత్ర ప‌రిధి త‌క్కువే అయినా చివ‌రి వ‌ర‌కూ సినిమాపై ఆయ‌న పాత్ర ప్ర‌భావం క‌నిపిస్తుంటుంది. హీరో చైత‌న్య‌రావు వైక‌ల్యం ఉన్న యువ‌కుడిగా క‌నిపించాడు. మాట‌ల్ని స‌రిగ్గా ప‌ల‌క‌లేని పాత్ర‌లో మంచి న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించాడు. రాగ్‌మ‌యూర్, జీవ‌న్‌, విష్ణు, ర‌ఘు, ర‌వీంద్ర విజ‌య్, గెటప్‌ శీను కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. చిన్న చిన్న పాత్ర‌లు కూడా సినిమాలో న‌వ్విస్తాయి.  డైరెక్షన్ ఎలా ఉందంటే? త‌రుణ్ తీసిన తొలి క్రైమ్ కామెడీ చిత్ర‌మిది. ఈ క‌థ‌ని న‌డిపించిన విధానం, ర‌చ‌నలో ఆయ‌న మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. విజువ‌ల్స్‌, సంగీతం, మాట‌ల‌ు, పాత్ర‌ల హావ‌భావాల‌తో ఆయన న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే త‌రుణ్ భాస్క‌ర్ గ‌త చిత్రాలకీ ఈ సినిమాకీ పోలిక ఉండ‌దు. తొలి రెండు సినిమాల్ని వాస్త‌విక‌త‌కి పెద్ద పీట వేస్తూ ఆయన స‌న్నివేశాల్ని న‌డిపించారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. లాజిక్స్‌ని ఏమాత్రం పట్టించుకోకుండా, న‌వ్వించ‌డ‌మే టార్గెట్ అన్న‌ట్టుగా స్వేచ్ఛ‌గా ఇందులో స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. చెప్పుకోద‌గ్గ క‌థ లేక‌పోయినా, కొన్ని స‌న్నివేశాలు ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగుతున్నా ప్రేక్ష‌కుల్ని మాత్రం కడుపుబ్బా  నవ్వించడంలో తరుణ్ భాస్కర్‌ మరోమారు విజయం సాధించాడు.  టెక్నికల్‌గా  సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. వివేక్ సాగ‌ర్ నేప‌థ్య సంగీతం చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. కెమెరా, ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. త‌రుణ్ భాస్క‌ర్ తెలివైన ర‌చ‌న ఇందులో చాలా చోట్ల క‌నిపిస్తుంది. కొన్ని మాట‌ల్ని హెడ్‌ఫోన్‌లో వినిపించే పాట‌ల‌తో త‌నే సెన్సార్ చేస్తూ న‌వ్వించారు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ న‌టులు హాస్య సన్నివేశాలుసంగీతం మైనస్ పాయింట్స్‌ ఊహకందే కథనంరొటిన్‌ స్టోరీ రేటింగ్‌ : 3.5/5
    నవంబర్ 03 , 2023

    చైతన్య రావు మాదాడి తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    చైతన్య రావు తండ్రి గారి పేరు కరుణాకర్ రావు. ఆయన వ్యవసాయం చేస్తున్నారు.

    చైతన్య రావు మాదాడి ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    30 వెడ్స్ 21 యూట్యూబ్ సిరీస్‌లో నటించడం ద్వారా గుర్తింపు పొందాడు.

    చైతన్య రావు మాదాడి లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    చైతన్య రావు మాదాడి కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    30 వెడ్స్ 21లో ఆయన చేసిన పృథ్వి పాత్ర మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

    చైతన్య రావు మాదాడి బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Chaitanya Rao Madadi best stage performance

    చైతన్య రావు మాదాడి బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Chaitanya Rao Madadi best dialogues

    చైతన్య రావు మాదాడి కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    బిర్యాని

    చైతన్య రావు మాదాడి కు ఇష్టమైన నటుడు ఎవరు?

    చైతన్య రావు మాదాడి కు ఇష్టమైన నటి ఎవరు?

    చైతన్య రావు మాదాడి ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    చైతన్య రావు మాదాడి ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్

    చైతన్య రావు మాదాడి కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    ఆస్ట్రేలియా

    చైతన్య రావు మాదాడి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    32K మంది ఫాలోవర్లు ఉన్నారు.

    చైతన్య రావు మాదాడి సోషల్‌ మీడియా లింక్స్‌

    చైతన్య రావు మాదాడి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే చైతన్య రావు మాదాడి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree