• TFIDB EN
  • జివి రామరాజు
    ప్రదేశం: భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
    గొట్టిముక్కల వెంకట రామరాజు తెలుగు సినిమాతో అనుబంధం ఉన్న భారతీయ చలనచిత్ర దర్శకుడు మరియు స్క్రిప్ట్ రైటర్. ఆయన ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణానికి చెందినవారు. రామరాజు తన జీవితంలో అనేక వృత్తులు చేపట్టి చివరకు చిత్ర పరిశ్రమలో నిలిచారు. అతని మొదటి క్రాంతి నటించిన చిత్రం మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, దర్శకులు శేఖర్ కమ్ముల, వివి వినాయక్ మరియు హరీష్ శంకర్ నుండి విమర్శకుల ప్రశంసలు అందుకున్నరు.
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్ పిల్లా నువ్వులేని జీవితం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్.. చిత్రలహరి, విరూపాక్ష వంటి హిట్ చిత్రాల ద్వారా స్టార్ డం సంపాదించాడు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ గురించి మీకు తెలియని కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం. సాయి ధరమ్ తేజ్ ముద్దు పేరు? ధరమ్ సాయి ధరమ్ తేజ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా? పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ సాయి ధరమ్ తేజ్ పుట్టిన తేదీ ఎప్పుడు? October 15, 1986 సాయి ధరమ్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ క్రష్ ఎవరు? లారిసా బొనేసి(Larissa Bonesi). ఈమె తిక్క చిత్రంలో సాయి ధరమ్ సరసన హీరోయిన్‌గా నటించింది. సాయి ధరమ్‌కు ఇష్టమైన సినిమా? గ్యాంగ్ లీడర్ సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, చిరంజీవి సాయి ధరమ్ తేజ్ తొలి హిట్ సినిమా? సుబ్రహ్మాణ్యం ఫర్ సేల్ చిత్రం సాయిధరమ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. చిత్రలహరి, బ్రో, విరూపక్ష వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. సాయి ధరమ్‌కు ఇష్టమైన కలర్? నీలం రంగు సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రుల పేర్లు? విజయ దుర్గ, జీవీఎస్ ప్రసాద్ సాయి దరమ్‌కు ఇష్టమైన ప్రదేశం? దుబాయ్, లండన్ సాయి ధరమ్ చదువు? MBA సాయి ధరమ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? పిల్లా నువ్వులేని జీవితం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ గెలుచుకున్నాడు. https://www.youtube.com/watch?v=G7ptLW3O0Qo సాయి ధరమ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? సాయి ధరమ్ 2024 వరకు 16 సినిమాల్లో నటించాడు.  సాయి ధరమ్‌కు ఇష్టమైన ఆహారం? రొయ్యల పలావు, పప్పు అన్నం సాయి ధరమ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సాయి ధరమ్ ఒక్కో సినిమాకి దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్ అభిరుచులు? ట్రావలింగ్, క్రికెట్ ఆడటం సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరోయిన్? సమంత
    మార్చి 21 , 2024
    Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్? టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్‌లో అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెయిన్‌ హీరోయిన్‌గా, మరికొన్నింటిలో క్యారెక్టర్‌ అర్టిస్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల లీడ్‌ యాక్ట్రెస్‌గా ఆమె చేసిన ‘పొట్టేల్‌’ చిత్రం పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. అనన్య నటనకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. అయితే ఎన్ని మంచి పాత్రలు చేసినా అనన్యకు సరైన అవకాశాలు రావడం లేదన్న అభిప్రాయం చాన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బంపరాఫర్‌ కొట్టేసింది. దీంతో అనన్య ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.  మెగా హీరో సరసన..! మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) నటిస్తున్న తాజా చిత్రం 'SDT 18'. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ (Rohit KP) దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తెలుగు నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు.  ‘విభిన్న పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుతోన్న ప్రతిభావంతురాలు అనన్య నాగళ్లను వెల్కమ్’’ అంటూ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ పోస్టర్‌లో అనన్య అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించింది. చీరకట్టు, బొట్టుతో ముఖంగా చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటోది.  https://twitter.com/Primeshowtweets/status/1855937397583953941 మెగా హీరోతో రొమాన్స్‌! 'SDT 18' ప్రాజెక్టులో ఇప్పటికే హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lakshmi) నటిస్తోంది. ఇటీవల రిలీజైన గ్లింప్స్‌లో ఈ అమ్మడు లుక్‌ ఆకట్టుకుంది. లేటెస్ట్‌గా అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రాజెక్టులో జాయిన్‌ కావడంతో ఆమె రోల్ ఏంటన్న ప్రశ్న అందరిలోనూ మెుదలైంది. అయితే ఇందులో అనన్య సెకండ్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాయిధరమ్‌ తేజ్‌, అనన్యకు మధ్య కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్‌ కూడా ఉండే ఛాన్స్ లేకపోలేదని నెటిజన్లు ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు. అనన్య పాత్రకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే చిత్ర బృందం వెల్లడించే ఛాన్స్ ఉందని అంటున్నారు.  కొత్తవారికి ప్రేరణగా అనన్య! ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే స్టార్‌ హీరోల సరసన చేయడం తప్పనిసరి. ఈ విషయం అనన్య నాగళ్ల (Ananya Nagalla)కు తెలిసినంతగా ఏ హీరోయిన్‌కు తెలీదు. 2019లో వచ్చిన 'మల్లేశం' చిత్రంతో హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్‌' వంటి సైన్స్‌ ఫిక్షన్‌ మూవీతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్‌ హీరోగా చేసిన 'వకీల్‌ సాబ్‌'లో కీలక పాత్రే పోషించినప్పటికీ నటిగా ఆమెకు బ్రేక్ రాలేదు. దీంతో పలు చిత్రాల్లో సైడ్‌ క్యారెక్టర్స్‌ చేసింది. అవకాశం దొరికినప్పుడుల్లా హీరోయిన్‌గా కనిపించి తనను తాను నిరూపించుకుంది. రీసెంట్‌గా వచ్చిన 'తంత్ర', 'పొట్టేల్‌' సినిమాలతో నటిగా మరో మెట్టు ఎక్కింది. స్టార్‌ హీరో చిత్రాల్లో నటించడమే లక్ష్యంగా ఆమె చేస్తున్న కృషికి ఇన్నాళ్లకు సరైన ఫలితం దక్కింది. అనన్య టాలెంట్‌ను గుర్తించిన ‘SDT 18’ టీమ్‌ తమ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి గౌరవించింది. ఈ సక్సెస్‌ అయితే అనన్య కెరీర్‌ మరోస్థాయికి వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనన్య సినీ ప్రయాణం ఈ తరం తెలుగమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది పేర్కొంటున్నారు.  1947-67 బ్యాక్‌డ్రాప్‌లో.. ‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్‌ తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు రోహిత్‌ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మించినట్లు ఇటీవల రిలీజ్‌ చేసిన మేకింగ్‌ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. https://twitter.com/IamSaiDharamTej/status/1846068731665174954 పడిలేచిన కెరటంలా.. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే అతడికి ఊహించని విధంగా యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్‌ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్‌ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు. 
    నవంబర్ 12 , 2024
    Varunlav: కాక్‌టైల్‌ పార్టీలో వరుణ్‌తేజ్‌ను ఆట పట్టించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి కార్యక్రమం.. ఇటలీలో జరుగుతున్న సంగతి సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నాయి. తాజాగా కాబోయే వధువరులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట కుటుంబ సభ్యులకు కాట్‌ టైల్‌ పార్టీ ఇచ్చింది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మెగాబాబు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ త్వరలో లావణ్య త్రిపాఠితో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.  వీరిద్దరు కొంత కాలంగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ కొత్త జంట ఇక్కడ కాదని డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటోంది. వీరిద్దరు తొలిసారిగా అంతరిక్షం సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. అక్కడే వరుణ్, లావణ్యలు ప్రేమలో పడ్డారు.  తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే  పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇటలీలోని టస్కానీలో ఈ కొత్త జంట వివాహం చేసుకోనుంది.  ఈ పెళ్లి కూడా పెద్దగా హడావుడి లేకుండా ఇరుకుటుంబాలకు చెందిన అతికొద్దిమంది కుటుంబ సభ్యుల నడుమ జరగనుంది. నవంబర్ 1న ఈ లవ్ బర్డ్స్‌ పెళ్లి బంధం ద్వారా ఒక్కటి కానున్నారు. అయితే సోమవారం రాత్రి వరుణ్‌తేజ్- లావణ్య జంట కుటుంబ సభ్యులకు కాక్‌టైల్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ బోర్గోసాన్ ఫెలిస్ రిసార్ట్‌లో కాక్టైల్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ పార్టీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు హాజరయ్యారు. అలాగే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఉత్సాహంగా గడిపాడు. కుటుంబ సమేతంగా దిగిన ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ఈక్రమంలో అల్లు అర్జున్ వరుణ్‌ను సరదాగా ఆట పట్టించాడు. నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అంటూ ఫన్నీగా బెదిరించాడు.   మెగా హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్  ఈ పార్టీలో సందడి చేశారు. చాలా రోజుల తర్వాత అటు మెగా ఫ్యామిలీని ఇటు అల్లు ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్‌లో చూడటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ దంపతులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటలీలోనే లావణ్య త్రిపాఠి పేరెంట్స్ దియోరాజ్, కిరణ్ త్రిపాఠిలతో కలిసి దగ్గరుండి పెళ్లి వేడుకకు కావాల్సిన పనులు చేస్తున్నారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వరుణ్- లావణ్య పెళ్లి బంధం ద్వారా ఏకం కానున్నారు. అదే రోజు రాత్రి 8గంటలకు అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 120 మంది వరకు ప్రత్యేక అతిథులు పాల్గొననున్నారు. ఇటలీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక నవంబర్ 5న ఇక్కడ రిసెప్షన్‌ పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ పెద్దలతో పాటు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. 
    అక్టోబర్ 31 , 2023
    ‘ఎన్నోరాత్రులు వస్తాయి గానీ’ సాంగ్‌తో పాటు… తెలుగులో హిట్టైన టాప్ 10 రోమాంటిక్ రీమెక్ సాంగ్స్ ఇవే]10.గువ్వా గోరింకా తో..మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 786 సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ఇది.   ఈ రోమాంటిక్ పాటను సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రం లో రీమేక్ చేశారు. సాయి ధరమ్ తేజ్ సరసన రెజినా నటించింది.
    ఫిబ్రవరి 11 , 2023
    జివి రామరాజు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే జివి రామరాజు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree