• TFIDB EN
  • హైపర్ ఆది
    జననం : జూన్ 06 , 1990
    ప్రదేశం: చీమకుర్తి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    హైపర్ ఆది.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్య నటుడు.1990లో ఏపీలోని ప్రకాశం జిల్లాలో జన్మించాడు. సాప్ట్‌వేర్ ఉద్యోగిగా కొంతకాలం పని చేసి నటనపై ఆసక్తితో జబర్దస్త్‌ షోలో చేరాడు. తన పంచ్‌ డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. టీమ్‌ లీడర్‌ స్థాయికి ఎదిగి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2017లో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ద్వారా వెండితెరపై అడుగు పెట్టాడు. 22పైగా చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించాడు.

    హైపర్ ఆది వయసు ఎంత?

    హైపర్ ఆది వయసు 35 సంవత్సరాలు

    హైపర్ ఆది ముద్దు పేరు ఏంటి?

    హైపర్‌ ఆది

    హైపర్ ఆది ఎత్తు ఎంత?

    5' 7'' (170cm)

    హైపర్ ఆది అభిరుచులు ఏంటి?

    ప్లేయింగ్‌ క్రికెట్‌

    హైపర్ ఆది ఏం చదువుకున్నారు?

    బీటెక్‌

    హైపర్ ఆది సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    బుల్లితెరపై వచ్చే షోలలో కమెడియన్‌గా, స్కిట్‌ రైటర్‌గా చేశారు.

    హైపర్ ఆది రిలేషన్‌లో ఉంది ఎవరు?

    హైపర్ ఆది తన లవర్ విహారికతో సీరియస్ రిలేషన్ షిప్‌లో ఉన్నాడు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోనున్నట్లు తెలిసింది.

    హైపర్ ఆది బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    హైపర్ ఆది‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 2024 వరకూ 22 చిత్రాల్లో నటించాడు.

    హైపర్ ఆది‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    వెబ్‌ సిరీస్‌లు చేయలేదు. అయితే బుల్లితెరపై వచ్చే జబర్దస్‌, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోలలో ఆది కనిపించారు. తన కామెడీతో నవ్వులు పూయించారు.

    హైపర్ ఆది In Sun Glasses

    Images

    Hyper Aadi

    హైపర్ ఆది అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Hyper Aadi

    Viral Videos

    View post on X

    Hyper Aadi Viral Video

    View post on X

    Hyper Aadi Vial Video

    View post on X

    Hyper Aadi Video

    <strong>Lucky Baskhar Review: మధ్యతరగతి ఆశల్ని మోసిన లక్కీ భాస్కర్… సినిమా ఎలా ఉందంటే?</strong>
    Lucky Baskhar Review: మధ్యతరగతి ఆశల్ని మోసిన లక్కీ భాస్కర్… సినిమా ఎలా ఉందంటే? సినిమా: లక్కీ భాస్కర్నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, రాంకీ, మానస చౌదరి, హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్ మరియు ఇతరులుసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ఎడిటింగ్: నవీన్ నూలిసినిమాటోగ్రఫీ: నిమేశ్ రవినిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యరచన, దర్శకత్వం: వెంకీ అట్లూరివిడుదల తేదీ: అక్టోబర్ 31, 2024 ఈ దీపావళికి ముందు పండగ సందడి తెచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్.’ పాన్ ఇండియా స్థాయి చిత్రంగా, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుల్కర్ - వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రత్యేకతలు ఏమిటి? ఈ కథలో హీరో లక్కీ అవుతాడా? అన్నది తెలుసుకుందాం. కథ భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది&nbsp; కథ. సినిమా ఎలా ఉందంటే? చాలా కాలం తర్వాత బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ నేపథ్యంపై ఓ తెలుగు సినిమా తెరపై ఆవిష్కరించబడింది. 90ల్లో భారత ఆర్థిక వ్యవస్థకు ముడి పడిన హర్షద్ మెహతా కుంభకోణం కథకు కీలకమైన అంశం. దర్శకుడు వెంకీ అట్లూరి సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను, వారి ఆర్థిక చిత్తశుద్ధిని మిళితం చేస్తూ ఈ కథను ఆవిష్కరించారు. కథలోని మలుపులు మరియు పాత్రలు ప్రేక్షకుల హృదయానికి చేరువగా ఉంటాయి. మొదటగా భాస్కర్ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను, అతనికి జరిగిన అవమానాలను కథలో భాగంగా చూపించడం, ఆ తర్వాత అతను కష్టాల్ని దాటుకునేందుకు చేసిన ప్రయత్నాలు అతినికి జీవితంపై నమ్మకాన్ని కలిగిస్తాయి. భాస్కర్ చేసే రిస్క్, దాని వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎదుర్కొంటూ తన తెలివితేటలతో బతికే విధానం ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలు, ప్రథమార్ధంలో భాస్కర్ పడ్డ చిక్కులు ఆకట్టుకుంటాయి. కానీ, రెండవ అర్ధభాగం లో కొన్ని సన్నివేశాలు కొంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటాయి. స్టాక్ మార్కెట్, షేర్ల వంటి అంశాలు సాధారణ ప్రేక్షకులకు అంత సులభంగా అర్థం కావు. భాస్కర్ జీవితంలో వచ్చిన మార్పు, కుటుంబ సమస్యలను పరిష్కరించాలనే తీరు ఆకర్షిస్తుంది. ఎవరెలా చేశారంటే? భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. అతని అభినయం, మధ్య తరగతి వ్యక్తిగా పాత్రలో జీవించడం మంచి అనుభూతినిస్తుంది. సుమతిగా మీనాక్షి చౌదరి తన పాత్రలో నిజాయితీని చూపించింది. రాంకీ, సచిన్ ఖేడేకర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత సాంకేతికంగా, చిత్రం ఉన్నతంగా ఉంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సినిమాకి కీలకంగా నిలిచింది. అతని నేపథ్య సంగీతం కథకు హైప్ ఇచ్చింది. నిమేశ్ రవి ఛాయాగ్రహణం సినిమా వాతావరణాన్ని 90 వ దశకానికి తీసుకెళ్తుంది.&nbsp; వెంకీ అట్లూరి రచన, పాత్రల అభివృద్ధిలో చూపించిన నైపుణ్యం, కథా మలుపుల నిర్వహణ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయి. 90ల కాలంలో ముంబై వాతావరణాన్ని ప్రతిబింబించడానికి రాజీ లేకుండా నిర్మాణ విలువలను ప్రదర్శించారు. బలాలు బలమైన కథ దుల్కర్ సల్మాన్ నటన నేపథ్య సంగీతం, ట్విస్టులు బలహీనతలు సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు చివరగా ‘లక్కీ భాస్కర్’ ఒక ఆకట్టుకునే కథా నేపథ్యంతో, స్మార్ట్ థ్రిల్లర్. భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఆకట్టుకుంటూ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు మంచి అనభూతి పంచాడు. కథలో అనేక ట్విస్టులు, ముఖ్యంగా క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉంటుంది. రెండవ అర్ధభాగంలో కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదించినప్పటికీ, కథనం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆసక్తికరమైన పాత్రలు సినిమాని ప్రేక్షకుల మనసుకు దగ్గర చేస్తాయి. రేటింగ్: 4/5
    నవంబర్ 01 , 2024
    Shivam Bhaje Movie Review: కళ్లు పోయిన హీరోకి దైవ బలంతో చూపు వస్తే.. ఆ తర్వాత ఏం జరింది? నటీనటులు :&nbsp; అశ్విన్‌ బాబు, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, అర్బాజ్‌ ఖాన్‌, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ డైరెక్టర్‌ : అబ్దుల్‌ అప్సర్‌ హుస్సేన్‌ సంగీతం : వికాస్‌ బడిశా ఎడిటర్‌ : ఛోటా కె. ప్రసాద్‌ నిర్మాత : మహేశ్వర రెడ్డి విడుదల తేదీ : ఆగస్టు 01, 2024 ప్రముఖ యాంకర్‌, డైరెక్టర్‌ ఓంకార్ సోదరుడు అశ్విన్‌ బాబు హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘శివం భజే’. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌. అబ్దుల్‌ అప్సర్‌ హుస్సేన్‌ రూపొందించిన ఈ చిత్రంలో హైపర్ ఆది, అర్బాజ్‌ ఖాన్‌, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1న ‘శివం భజే’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ కథనంలో చూద్దాం.&nbsp; కథేంటి చందు (అశ్విన్ బాబు) లోన్ రికవరీ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో శైలజ (దిగంగనా సూర్యవంశీ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్‌లో జాబ్ చేస్తుంటుంది. అయితే&nbsp; ఓ గొడవ కారణంగా చందుకి కళ్లు పోతాయి. శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ పరిణామంతో అతడి కంటికి ఆపరేషన్‌ జరిగి చూపు వస్తుంది. అయితే కొత్త కళ్లు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తుంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరవి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏంటి? శత్రుదేశాలతో ఓ సాధారణ రికవరీ ఏజెంట్‌ ఎందుకు పోరాడాల్సి వచ్చింది? శివుడి అనుగ్రహంతో చందు నిర్వహించిన కార్యం ఏంటి? కథలో డోగ్రా (కుక్క) పాత్ర ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే చందు పాత్రలో హీరో అశ్విన్‌ బాబు అద్భుత నటన కనబరిచాడు. రెండు డైమన్షన్స్‌లో చక్కటి వేరియేషన్స్‌ చూపించాడు. శైలజా పాత్రలో హీరోయిన్‌ దిగంగన సూర్యవంశీ ఆకట్టుకుంది. అశ్విన్‌, దిగంగన మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. ఇక పోలీసు ఆఫీసర్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు అర్బాజ్‌ ఖాన్‌ మెప్పించాడు. హాస్య నటుడు హైపర్‌ అది తన పంచులతో నవ్వులు పూయించాడు. బ్రహ్మాజీ, మురళి శర్మ తమదైన సెటిల్‌ నటనతో మెస్మరైజ్‌ చేశారు. ఇతర నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఒక మిస్టరీ కథకు డివోషనల్ అంశాలను ముడిపెడుతూ దర్శకుడు అబ్దుల్‌ అప్సర్‌ హుస్సేన్‌ చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. ఈ క్రైమ్‌ డ్రామాలోని కొన్ని సస్పెన్స్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. అలాగే శత్రుదేశాల తాడి నేపథ్యంలో అల్లిన స్టోరీ లైన్‌ కూడా మెప్పిస్తుంది. అయితే కథ బాగున్నా స్క్రీన్‌ ప్లే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. అనుకున్న కథను పూర్తి స్థాయిలో తెరపైన ప్రజెంట్‌ చేయలేకపోయాడు. హత్యలకు సంబంధించిన ట్రాక్‌ కూడా చాలా పేలవంగా అనిపిస్తుంది. హీరో అశ్విన్‌ బాబు క్యారెక్టర్‌ను ఇంకాస్త పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేసి ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్‌ లాజిక్స్‌ దూరంగా అనిపిస్తాయి. కథ స్లోగా సాగడం, తొలి భాగంలో ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్‌ మిస్‌ కావడం మైనస్‌గా చెప్పవచ్చు. కథతో సంబంధం లేని సీన్స్‌ ఎక్కువ ఉండటం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్‌లో వచ్చే మెయిన్‌ సీన్స్‌ను ఆయన తన కెమెరా పనితనంతో చక్కగా ప్రజెంట్‌ చేశారు. వికాస్ బడిస సంగీతం పర్వాలేదు. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్‌ అశ్విన్‌ బాబు నటనసస్పెన్స్ సీన్స్‌క్లైమాక్స్‌ మైసన్ పాయింట్స్‌ స్లో నారేషన్‌ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడంఅసందర్భమైన సన్నివేశాలు&nbsp; Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp; .
    ఆగస్టు 01 , 2024
    Gangs Of Godavari Review: విష్వక్‌ సేన్‌- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్! నటీ నటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు దర్శకత్వం: కృష్ణ చైతన్య సంగీతం: యువన్ శంకర్ సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ : 31-05-2024 విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari Review In Telugu). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విష్వక్‌ నటన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా, మే 31న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? విష్వక్‌ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్‌ సేన్‌).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌.. మరోమారు తన మాస్ మెస్మరైజింగ్‌ నటనతో మాయ చేశాడు. లంకల రత్నం అనే మాస్‌ క్యారెక్టర్‌లో జీవించేశాడు. ముఖ్యంగా ఈ పాత్ర విష్వక్‌ నటనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్లలో మాస్‌ జాతరే అన్నట్లు విష్వక్‌ నటన ఉంటుంది. ఇక హీరోయిన్‌ నేహా శెట్టి తనదైన నటనతో మెప్పించింది. విష్వక్- నెహా శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.&nbsp; ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తాయి. అందాల రాణిలా సాంగ్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది.&nbsp; మరో నటి అంజలికి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కింది. రత్నమాల క్యారెక్టర్‌లో జీవించింది. గతంలో ఎన్నడూ చేయని పాత్ర ద్వారా ఈ సినిమాలో అలరించింది. ఆమె &nbsp; ఊరమాస్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. జబర్దస్త్‌ ఫేమ్ హైపర్ ఆది పంచ్‌లు సినిమాలో నవ్విస్తాయి. మిగతా నటీనటులు సహ తమ పాత్రలకు న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యాడు. తన గత చిత్రాలు రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగా సినిమాలకు ఎంతో భిన్నంగా గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిని తీర్చిదిద్దాడు. ప్రతీ పాత్రను కథకు అనుగుణంగా చక్కగా వినియోగించుకున్నాడు. సినిమా ఎండింగ్‌లో తండ్రికూతుళ్ల సన్నివేశాలు, క్లైమాక్స్, డైలాగ్స్‌ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ స్లోగా నడవడం, రొటీన్‌ సన్నివేశాలు, రెగ్యులర్‌ స్టోరీ మూవీకి కాస్త మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలిచింది. యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఎలివేట్‌ చేయడానికి BGM ఎంతగానో ఉపయోగపడింది. అనిత్ మదాడి కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విష్వక్‌ సేన్‌ నటన డైలాగ్స్‌ సంగీతం మైనస్‌ పాయింట్స్‌ రెగ్యులర్‌ స్టోరీ స్లో నారేషన్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp; Public Talk On Gangs of Godavari సినిమా చాలా బాగుందంటూ ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. కొన్ని ల్యాగ్‌ సీన్స్‌ ఉన్నాయని, స్క్రీన్‌ప్లే మాత్రం అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు.&nbsp; https://twitter.com/raghav917252/status/1796382241532334575 చాలా రోజుల తర్వాత హౌస్‌ ఫుల్స్‌ చూస్తున్నట్లు మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఇది మ్యాసివ్ వీకెండ్‌ అంటూ వ్యాఖ్యానించాడు.&nbsp; https://twitter.com/PulakithSai/status/1796399917969412273 ఫస్టాఫ్‌ బాగుందని.. కానీ స్టోరీలో మాత్రం కొత్తదనం లేదని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. అయితే మూవీ ఎక్కడా బోర్‌ కొట్టదని స్పష్టం చేశాడు.&nbsp; https://twitter.com/PinkCancerian/status/1796336006402355622 పుష్ప సినిమా ఫాస్ట్ ట్రాక్‌ వెర్షన్‌లా గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి ఉందని ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఎడిటింగ్ అసలు&nbsp; బాలేదని పేర్కొన్నాడు. రన్‌టైమ్‌ చాలా క్రిస్పీగా ఉందని పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/Kamal_Tweetz/status/1796330322730373525 https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-neha-shetty.html
    మే 31 , 2024
    Rules Ranjann Review: అక్కడక్కడా మెప్పించినా… మొత్తానికే బెడిసి కొట్టింది తారాగణం: &nbsp;కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ డైరెక్టర్: రతినం కృష్ణ నిర్మాతలు: దివ్యంగా లావణ్య, మురళి క్రిష్ణ వేమూరి సంగీతం: అమ్రీష్ సినిమాటోగ్రఫీ: దిలీప్ కుమార్ టాలీవుడ్‌లోని టైర్ 2 హీరోల్లో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు చేసింది 6 సినిమాలే అయినా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. తనతో సినిమా చేస్తే నష్టాలు మాత్రం రావనే భరోసా మాత్రం ఇండస్ట్రీలో కలిగించాడు. ఈ ఏడాది వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ సినిమాలతో అలరించిన కిరణ్ అబ్బవరం తాజాగా రూల్స్‌ రంజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన&nbsp; మీటర్ సినిమా ప్లాప్ కావడంతో.. తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్‌నే కిరణ్ అబ్బవరం ఈసారి ఎంచుకున్నాడు. భారీ తారాగణంతో వచ్చిన రూల్స్ రంజన్ సినిమా ఎలా ఉంది? కిరణ్ మరో బ్లాక్ బాస్టర్ హిట్‌ కొట్టాడా? ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథ మనో రంజన్(కిరణ్ అబ్బవరం) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన జీవితాన్ని కఠినమైన రూల్స్‌ పెట్టుకుని కొనసాగిస్తుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం ముంబైకి ట్రాన్సఫర్ అవుతుంది. అక్కడ మనో రంజన్ పాత స్నేహితురాలు సనా( నేహా శెట్టి) కలుస్తుంది. మెల్లగా ఆమెకు దగ్గరై ప్రేమలో పడిపోతాడు. సనా కోసం తన రూల్స్ అన్ని బ్రేక్ చేసుకుంటాడు. సనాను గాఢంగా ప్రేమిస్తాడు. కానీ సనాకి పెళ్లి ఫిక్స్ అయ్యింది అని తెలియడంతో కథ అడ్డం తిరుగుతుంది. చివరికి మనో రంజన్ ఎం చేసాడు? తన ప్రేమను దక్కించుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలుసుకునేందుకు సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఈ సినిమా పెద్దగా కథ లేకున్నా కామెడీ ట్రాక్‌ ముందుకు సాగింది. ఫస్టాఫ్ స్లోగా నడుస్తుంది. ప్రేక్షకులకు బోర్ కొడుతుందనే టైంలో వెన్నెల కిషోర్ బరిలోకి దిగి తన కామెడీ టైమింగ్‌తో కాసేపు నవ్విస్తాడు. హీరోయిన్‌తో లవ్ ట్రాక్‌తో ముందుకెళ్తుంది.&nbsp; సెకండాఫ్‌కు వచ్చేసరికి తేలిపోయింది. ఫస్టాప్ మాదిరి కామెడీ ట్రాక్ ఉంటే బాగుండేది. అనవసరమైన ఎలివేషన్స్ జొప్పించారనిపిస్తుంది. కొన్ని సీన్లు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. ఇక సెకండాఫ్‌లో హైపర్ ఆది, వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ కాస్త ఊరటనిస్తుంది. ఎవరెలా చేశారంటే? గత సినిమాల కంటే భిన్నంగా కిరణ్ అబ్బవరం నటన బాగుంది. ప్రతి సినిమాలో ఒకేలాగా నటిస్తాడు అనే అపవాదును ఈ సినిమా ద్వారా కిరణ్ చెరిపేసుకున్నాడు. సినిమాలో కంప్లీట్‌గా తన లుక్‌ను మార్చేసుకున్నాడు. మనో రంజన్ పాత్రకు న్యాయం చేశాడు. ఇక నేహా శెట్టి తన పాత్రలో ఒదిగిపోయింది. తన గ్లామర్ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. సమ్మోహనుడా సాంగ్‌లో నేహా పరువాల విందుతో కనువిందు చేసింది. హైపర్ ఆది, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు మంచి అసెట్ అని చెప్పవచ్చు. ఆది కామెడీ పంచ్‌లు కడుపుబ్బ నవ్విస్తాయి. వైవా హర్ష తన పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించాడు. మకరంద్ దేశ్ పాండే, సుబ్బరాజు తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? యంగ్ డైరెక్టర్ రతినం కృష్ణ సాధారణ కథతో మెప్పించలేక పోయాడు. స్టోరీ పట్ల నెరెషన్‌లో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది అనిపించింది. భారీ తారాగణం ఉన్న సరైన రీతిలో వారిని ఉపయోగించుకోలేదనే భావన కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఉన్న కామెడీ ట్రాక్‌నే.. సెకంఢాఫ్‌లో కొనసాగిస్తే బాగుండేది అనిపించింది. అనవసరమైన ఎలివేషన్స్‌కు వెళ్లారనిపిస్తుంది.&nbsp; మొత్తానికి కొద్దిసేపైన ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. టెక్నికల్‌గా.. రూల్స్ రంజన్ మూవీ నిర్మాణ విలువల పరంగా బాగుంది. అమ్రీష్ మ్యూజిక్ బాగుంది. దులీప్ కుమార్ సినిమాటోగ్రఫీ ఇంకాస్త పరిణతి చెందాల్సి ఉంది. బలాలు ఫస్టాప్ కామెడీ ట్రాక్ నెహా శెట్టి గ్లామర్ బలహీనతలు అనవసరమైన ఎలివేషన్స్ సెకండాఫ్ స్టోరీ చివరగా..&nbsp; రూల్స్ రంజన్ అక్కడ అక్కడ నవ్వించే .. కామెడీ ఎంటర్టైనర్ రేటింగ్: 2.5/5
    అక్టోబర్ 06 , 2023

    హైపర్ ఆది‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    హైపర్‌ ఆదికి ఇద్దరు అన్నలు ఉన్నారు.

    హైపర్ ఆది పెళ్లి ఎప్పుడు అయింది?

    కాలేదు.

    హైపర్ ఆది Family Pictures

    Images

    Hyper Aadi Family

    Images

    Hyper Aadi With His Mother

    హైపర్ ఆది ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ఈటీవీలో వచ్చే బజర్దస్త్‌ షో ద్వారా ఆది పాపులర్‌ అయ్యాడు. తన కామెడీ టైమింగ్‌, పంచ్‌ డైలాగ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాడు. ఆ షోతో ఆది కెరీర్‌ మలుపు తిరిగింది.

    హైపర్ ఆది లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    రారండోయ్‌ వేడుక చేద్దాం (2017) సినిమా ద్వారా హాస్య నటుడిగా వెండితెరపై అడుగుపెట్టాడు.

    తెలుగులో హైపర్ ఆది ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    హైపర్ ఆది కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ధమాకాసినిమాలో డ్రైవర్‌ పాత్ర.

    హైపర్ ఆది బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    హైపర్ ఆది బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    హైపర్ ఆది కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చికెన్‌ బిర్యానీ

    హైపర్ ఆది కు ఇష్టమైన నటుడు ఎవరు?

    హైపర్ ఆది కు ఇష్టమైన నటి ఎవరు?

    హైపర్ ఆది ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు

    హైపర్ ఆది ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లూ, వైట్‌

    హైపర్ ఆది ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    హైపర్ ఆది ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ, రోహిత్‌

    హైపర్ ఆది ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    379K ఫాలోవర్లు ఉన్నారు.

    హైపర్ ఆది సోషల్‌ మీడియా లింక్స్‌

    హైపర్ ఆది కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీతో హైపర్‌ ఆదికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2024 ఏపీ ఎన్నికల్లో పవన్‌ విజయం కోసం పిఠాపురంలో ఆది ప్రచారం చేశారు. అలాగే జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పలు రాజకీయ వేదికలపై ఆది ప్రసంగించారు.
    హైపర్ ఆది వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే హైపర్ ఆది కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree