• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Gangs Of Godavari Review: విష్వక్‌ సేన్‌- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!

    నటీ నటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు

    దర్శకత్వం: కృష్ణ చైతన్య

    సంగీతం: యువన్ శంకర్

    సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి

    నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య

    విడుదల తేదీ : 31-05-2024

    విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari Review In Telugu). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విష్వక్‌ నటన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా, మే 31న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? విష్వక్‌ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్‌ సేన్‌).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ. 

    ఎవరెలా చేశారంటే

    యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌.. మరోమారు తన మాస్ మెస్మరైజింగ్‌ నటనతో మాయ చేశాడు. లంకల రత్నం అనే మాస్‌ క్యారెక్టర్‌లో జీవించేశాడు. ముఖ్యంగా ఈ పాత్ర విష్వక్‌ నటనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్లలో మాస్‌ జాతరే అన్నట్లు విష్వక్‌ నటన ఉంటుంది. ఇక హీరోయిన్‌ నేహా శెట్టి తనదైన నటనతో మెప్పించింది. విష్వక్- నెహా శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.  ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తాయి. అందాల రాణిలా సాంగ్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది.  మరో నటి అంజలికి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కింది. రత్నమాల క్యారెక్టర్‌లో జీవించింది. గతంలో ఎన్నడూ చేయని పాత్ర ద్వారా ఈ సినిమాలో అలరించింది. ఆమె   ఊరమాస్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. జబర్దస్త్‌ ఫేమ్ హైపర్ ఆది పంచ్‌లు సినిమాలో నవ్విస్తాయి. మిగతా నటీనటులు సహ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యాడు. తన గత చిత్రాలు రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగా సినిమాలకు ఎంతో భిన్నంగా గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిని తీర్చిదిద్దాడు. ప్రతీ పాత్రను కథకు అనుగుణంగా చక్కగా వినియోగించుకున్నాడు. సినిమా ఎండింగ్‌లో తండ్రికూతుళ్ల సన్నివేశాలు, క్లైమాక్స్, డైలాగ్స్‌ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ స్లోగా నడవడం, రొటీన్‌ సన్నివేశాలు, రెగ్యులర్‌ స్టోరీ మూవీకి కాస్త మైనస్‌గా చెప్పవచ్చు. 

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలిచింది. యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఎలివేట్‌ చేయడానికి BGM ఎంతగానో ఉపయోగపడింది. అనిత్ మదాడి కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు. 

    ప్లస్‌ పాయింట్స్‌

    విష్వక్‌ సేన్‌ నటన

    డైలాగ్స్‌

    సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    రెగ్యులర్‌ స్టోరీ

    స్లో నారేషన్‌

    Telugu.yousay.tv Rating : 3/5  

    Public Talk On Gangs of Godavari

    సినిమా చాలా బాగుందంటూ ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. కొన్ని ల్యాగ్‌ సీన్స్‌ ఉన్నాయని, స్క్రీన్‌ప్లే మాత్రం అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు. 

    చాలా రోజుల తర్వాత హౌస్‌ ఫుల్స్‌ చూస్తున్నట్లు మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఇది మ్యాసివ్ వీకెండ్‌ అంటూ వ్యాఖ్యానించాడు. 

    ఫస్టాఫ్‌ బాగుందని.. కానీ స్టోరీలో మాత్రం కొత్తదనం లేదని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. అయితే మూవీ ఎక్కడా బోర్‌ కొట్టదని స్పష్టం చేశాడు. 

    పుష్ప సినిమా ఫాస్ట్ ట్రాక్‌ వెర్షన్‌లా గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి ఉందని ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఎడిటింగ్ అసలు  బాలేదని పేర్కొన్నాడు. రన్‌టైమ్‌ చాలా క్రిస్పీగా ఉందని పోస్టు పెట్టాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv