• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Shivam Bhaje Movie Review: కళ్లు పోయిన హీరోకి దైవ బలంతో చూపు వస్తే.. ఆ తర్వాత ఏం జరింది?

    నటీనటులు :  అశ్విన్‌ బాబు, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, అర్బాజ్‌ ఖాన్‌, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ

    డైరెక్టర్‌ : అబ్దుల్‌ అప్సర్‌ హుస్సేన్‌

    సంగీతం : వికాస్‌ బడిశా

    ఎడిటర్‌ : ఛోటా కె. ప్రసాద్‌

    నిర్మాత : మహేశ్వర రెడ్డి

    విడుదల తేదీ : ఆగస్టు 01, 2024

    ప్రముఖ యాంకర్‌, డైరెక్టర్‌ ఓంకార్ సోదరుడు అశ్విన్‌ బాబు హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘శివం భజే’. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌. అబ్దుల్‌ అప్సర్‌ హుస్సేన్‌ రూపొందించిన ఈ చిత్రంలో హైపర్ ఆది, అర్బాజ్‌ ఖాన్‌, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1న ‘శివం భజే’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ కథనంలో చూద్దాం. 

    కథేంటి

    చందు (అశ్విన్ బాబు) లోన్ రికవరీ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో శైలజ (దిగంగనా సూర్యవంశీ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్‌లో జాబ్ చేస్తుంటుంది. అయితే  ఓ గొడవ కారణంగా చందుకి కళ్లు పోతాయి. శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ పరిణామంతో అతడి కంటికి ఆపరేషన్‌ జరిగి చూపు వస్తుంది. అయితే కొత్త కళ్లు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తుంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరవి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏంటి? శత్రుదేశాలతో ఓ సాధారణ రికవరీ ఏజెంట్‌ ఎందుకు పోరాడాల్సి వచ్చింది? శివుడి అనుగ్రహంతో చందు నిర్వహించిన కార్యం ఏంటి? కథలో డోగ్రా (కుక్క) పాత్ర ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    చందు పాత్రలో హీరో అశ్విన్‌ బాబు అద్భుత నటన కనబరిచాడు. రెండు డైమన్షన్స్‌లో చక్కటి వేరియేషన్స్‌ చూపించాడు. శైలజా పాత్రలో హీరోయిన్‌ దిగంగన సూర్యవంశీ ఆకట్టుకుంది. అశ్విన్‌, దిగంగన మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. ఇక పోలీసు ఆఫీసర్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు అర్బాజ్‌ ఖాన్‌ మెప్పించాడు. హాస్య నటుడు హైపర్‌ అది తన పంచులతో నవ్వులు పూయించాడు. బ్రహ్మాజీ, మురళి శర్మ తమదైన సెటిల్‌ నటనతో మెస్మరైజ్‌ చేశారు. ఇతర నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    ఒక మిస్టరీ కథకు డివోషనల్ అంశాలను ముడిపెడుతూ దర్శకుడు అబ్దుల్‌ అప్సర్‌ హుస్సేన్‌ చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. ఈ క్రైమ్‌ డ్రామాలోని కొన్ని సస్పెన్స్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. అలాగే శత్రుదేశాల తాడి నేపథ్యంలో అల్లిన స్టోరీ లైన్‌ కూడా మెప్పిస్తుంది. అయితే కథ బాగున్నా స్క్రీన్‌ ప్లే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. అనుకున్న కథను పూర్తి స్థాయిలో తెరపైన ప్రజెంట్‌ చేయలేకపోయాడు. హత్యలకు సంబంధించిన ట్రాక్‌ కూడా చాలా పేలవంగా అనిపిస్తుంది. హీరో అశ్విన్‌ బాబు క్యారెక్టర్‌ను ఇంకాస్త పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేసి ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్‌ లాజిక్స్‌ దూరంగా అనిపిస్తాయి. కథ స్లోగా సాగడం, తొలి భాగంలో ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్‌ మిస్‌ కావడం మైనస్‌గా చెప్పవచ్చు. కథతో సంబంధం లేని సీన్స్‌ ఎక్కువ ఉండటం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. 

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్‌లో వచ్చే మెయిన్‌ సీన్స్‌ను ఆయన తన కెమెరా పనితనంతో చక్కగా ప్రజెంట్‌ చేశారు. వికాస్ బడిస సంగీతం పర్వాలేదు. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్‌

    • అశ్విన్‌ బాబు నటన
    • సస్పెన్స్ సీన్స్‌
    • క్లైమాక్స్‌

    మైసన్ పాయింట్స్‌

    • స్లో నారేషన్‌
    • ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం
    • అసందర్భమైన సన్నివేశాలు 

    Telugu.yousay.tv Rating : 2.5/5  

    .

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv