• TFIDB EN
  • జయరామ్
    జననం : డిసెంబర్ 10 , 1965
    ప్రదేశం: పెరుంబవూరు, కేరళ, భారతదేశం
    జయరామ్ సుబ్రమణ్యం, జయరామ్ అని పిలవబడే ఒక భారతీయ నటుడు, అతను ప్రధానంగా మలయాళం, తమిళ చిత్రాలలో కొన్ని తెలుగు చిత్రాలతో పాటుగా కనిపిస్తాడు. అతను చెండా పెర్కషన్ వాద్యకారుడు, మిమిక్రీ కళాకారుడు మరియు అప్పుడప్పుడు నేపథ్య గాయకుడు కూడా. జయరామ్ 200 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు మరియు పద్మశ్రీ, రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఒక తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌తో సహా అనేక అవార్డులను అందుకున్నారు.
    కథనాలు
    వాణీ జయరామ్ సంగీత ప్రస్థానం: మూడు సార్లు జాతీయ అవార్డు గెలిచిన ఏకైక గాయని
    వాణీ జయరామ్ సంగీత ప్రస్థానం: మూడు సార్లు జాతీయ అవార్డు గెలిచిన ఏకైక గాయని]వాణీ జయరామ్ తెలుగు సినిమా సంగీతంపై విపరీతమైన ప్రభావం చూపారు.
    ఫిబ్రవరి 11 , 2023
    Vani Jairam: వాణీ జయరామ్‌కు పేరు తెచ్చిన సూపర్ హిట్ పాటలు ఇవే..]For More  Web storiesClick here
    ఫిబ్రవరి 11 , 2023
    Bachhala Malli Review: మూర్ఖుడిగా అల్లరి నరేష్‌ సూపర్బ్‌.. ‘బచ్చలమల్లి’తో హిట్‌ కొట్టాడా? నటీనటులు: అల్లరి నరేష్‌, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు కథ, దర్శకత్వం: సుబ్బు మంగదేవి సంగీతం: విశాల్ చంద్రశేఖర్‌ సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎమ్‌.నాథన్‌ ఎడిటింగ్‌: ఛోటా కె ప్రసాద్ నిర్మాతలు: రాజేష్ దండా, బాలాజీ గుత్తా  నిర్మాణ సంస్థ‌: హాస్య మూవీస్ విడుదల తేదీ: డిసెంబర్‌ 20, 2024 అల్లరి నరేష్‌ (Allari Naresh) మాస్‌ రోల్‌లో నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా డిసెంబర్‌ 20న (Bachhala Malli Movie Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? నరేష్‌ నటన బాగుందా? అతడి ఖాతాలో మరో విజయం పడిందా? ఇప్పుడు తెలుసుకుందాం. కథేంటి కథ 1995 - 2005 మధ్య (Bachhala Malli Review) తుని, సూరవరం ప్రాంతంలో సాగుతుంటుంది. బచ్చలమల్లి (అల్లరి నరేశ్‌) చిన్నప్పుడు చదువులో బాగా చురుగ్గా ఉండేవాడు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించి తండ్రి గర్వపడేలా చేస్తాడు. తనకు ఎంతో ఇష్టమైన తండ్రి తీసుకున్న ఓ నిర్ణయం మల్లిని ఎంతగానో బాధిస్తుంది. దాంతో చదువుకు స్వస్థి పలికి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. ట్రాక్టర్‌ నడుపుతూ మూర్ఖుడిగా మారిపోతాడు. మద్యం తాగుతూ ఊరిలో ఏదోక గొడవలో తలదూరుస్తూ బేవర్స్‌గా మారిపోతాడు. అప్పుడే అతడి లైఫ్‌లోకి కావేరి (అమృత అయ్యర్‌) వస్తుంది. ఆమె రాకతో మల్లీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఇంతకీ ఏంటా మార్పులు? కావేరితో అతడి ప్రేమ కథ ఎలా మెుదలైంది? చివరికీ సుఖాంతం అయ్యిందా? లేదా? అసలు తండ్రితో మల్లికి ఉన్న సమస్య ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే బచ్చల మల్లి పాత్రలో అల్లరి నరేష్‌ (Bachhala Malli Review) పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. గమ్యం సినిమాలో చేసిన గాలి శీను పాత్ర తరహాలో బచ్చలమల్లి రోల్‌ కూడా అతడి కెరీర్‌లో గుర్తుండిపోతుంది. మూడు వేరియేషన్స్‌ కలగలిసిన ఆ పాత్రలో నరేష్‌ అదరగొట్టాడు. హావ భావాలు చక్కగా పలికించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో పరిణితి చూపించాడు. హీరోయిన్‌ కావేరి పాత్రలో అమృత అయ్యర్ (Amritha Aiyer) బాగా చేసింది. అమాయకంగా కనిపిస్తూనే మంచి నటన కనబరిచింది. రావు రమేశ్ (Rao Ramesh) పాత్ర సినిమాకి కీలకం. అల్లరి నరేష్‌తో వచ్చే సీన్స్‌లో ఆయన అదరగొట్టారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రావు రమేష్‌ నటన ఆకట్టుకుంటుంది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ సాదాసీదాగా కనిపిస్తూనే విలనిజం బాగా పండించాడు. రోహిణి, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు బలమైన పాత్రల్లో కనిపించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సుబ్బు మంగదేవి కంచెలు తెంచుకున్న మూర్ఖుడి కథగా 'బచ్చలమల్లి'ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచే హీరో పాత్రను ఎస్టాబ్లిష్‌ చేసిన విధానం బాగుంది. చాలా రఫ్‌గా ఉండే హీరో ప్రేమలో పడిన విధానం, ప్రేయసి రాకతో అతడి లైఫ్‌లో వచ్చిన మార్పులు చక్కగా చూపించాడు. తన మూర్ఖత్వంతో ఏమేమి తప్పులు చేశానో హీరో రియలైజ్‌ అయ్యే సీన్స్‌ మెప్పిస్తాయి. బంధాలు తెంచుకోవడం చాలా తేలిక.. నిలుపుకోవడంలోనే మన గొప్పతనం దాగుందన్న సందేశాన్ని దర్శకుడు ఇచ్చాడు. అయితే స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలోనే దర్శకుడు తడబడ్డాడు. కొన్ని సీన్స్‌కు లాజిక్స్‌ ఉండవు. హీరో పాత్రను ప్రభావితం చేసే సన్నివేశాలు చాలా పేవలంగా అనిపిస్తాయి. మూడు పార్శ్వాలుగా కథ చెప్పడం కాస్త గందరగోళానికి గురిచేసింది. అయితే క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ టచ్‌ మాత్రం హృదయాలకు హత్తుకుంటుంది.  సాంకేతికంగా.. టెక్నికల్‌ విషయాలకు వస్తే (Bachhala Malli Review) సినిమా ఉన్నతంగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటల్లో ‘మా ఊరి జాతర్లో’ మెప్పిస్తుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రిచర్డ్ ఎమ్.నాథన్ కెమెరా పనితనం గ్రామీణ నేపథ్యాన్ని పక్కాగా ఆవిష్కరించింది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. నిర్మాణం పరంగా లోటుపాట్లేమీ కనిపించవు.  ప్లస్‌ పాయింట్స్‌ నరేష్‌ నటనకథా నేపథ్యంసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఆసక్తిలేని కథనంలాజిక్స్‌కు అందని సీన్స్‌అక్కడక్కడ పండని ఎమోషన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5 
    డిసెంబర్ 20 , 2024
    KA Movie Review: ‘ క’  సినిమాను హిట్‌ చేసిన టాప్ 5 అంశాలు విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్ తదితరులుదర్శకత్వం: సందీప్, సుజిత్నిర్మాత: చింతా గోపాల్ కృష్ణ రెడ్డిసంగీతం: సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ: సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ టాలీవుడ్‌లోని టాలెండెడ్ యంగ్‌ హీరోల్లో కిరణ్‌ అబ్బవరం ఒకరు. తొలి చిత్రం 'రాజా వారు రాణి గారు'తో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ కుర్ర హీరో కెరీర్‌ పరంగా సత్తా చాటేలా అనిపించాడు. ఆ తర్వాత చేసిన ఏడు చిత్రాల్లో ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం మినహా ఏ మూవీ ఆకట్టుకోలేదు. దీంతో కిరణ్‌ అబ్బవరం పని అయిపోయినట్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో ‘క’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ కుర్ర హీరో. ప్రమోషన్లతతో బాగా హైప్ తీసుకొచ్చాడు. ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ: అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది.  చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ. సినిమా ఎలా ఉందంటే? ఈ చిత్రంలో ప్రధానంగా తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉంది. కథనం, థ్రిల్లర్ మూమెంట్స్, క్లైమాక్స్ బాగున్నాయి.. కథలో ఉన్న బలమైన క్యారెక్టర్లు, వాటి నిర్మాత్మక శైలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నాయి.  కథనంలో ట్విస్టులు కొత్తదనాన్ని జోడించాయి. కిరణ్ అబ్బవరం అభినయ్ పాత్రలో రెండు భిన్న వేరియేషన్స్‌లో చాలా బాగా నటించాడు. నయన్ సారిక హీరోయిన్ పాత్రలో బాగా న్యాయం చేసింది, ఆమె నటన ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. బలగం జయరామ్ అద్భుతంగా నటించాడు. ఇతర ముఖ్య పాత్రలలో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్స్ సందీప్, సుజిత్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో కొత్తదనాన్ని రాబట్టడంలో కొంతవరకు విజయం సాధించారు. స్క్రీన్ ప్లేలో మరింత మెరుగులు దిద్దే అవకాశం ఉన్నప్పటికీ కొంత విస్మరించారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ముఖ్యమైన కాంప్లిక్ట్  పాయింట్ పూర్తిగా క్లారిటీగా వ్యక్తం కాకుండా సస్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొనసాగిన కారణంగా కథలో లోపాలు కనిపిస్తాయి. కథనంలో కొన్ని అనవసర సన్నివేశాలు సస్పెన్స్‌ని దెబ్బతీసినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయాలు సినిమాకి కొంత మైనస్‌గా మారాయి. స్క్రీన్‌ప్లేను ఇంకా మెరుగ్గా మలచి ఉంటే సినిమాకి మరింత ప్రభావవంతంగా ఉండేది. సాంకేతిక విభాగం: ఈ చిత్రం సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ ల సినిమాటోగ్రఫీ, ముఖ్యమైన సన్నివేశాలకు ప్రాణం పోసింది. సామ్ సీఎస్ సంగీతం సినిమాకి బలాన్ని ఇచ్చింది. ఎడిటింగ్ చాలా బాగుంది. చింతా గోపాల్ కృష్ణ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. చివరగా మొత్తం గా చెప్పాలంటే, "క" అనే ఈ చిత్రం ప్రధానంగా సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో సాగుతూ మంచి కథా నేపథ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాన్సెప్ట్ బలంగా ఉండటంతో పాటు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాని  బాగా లేపాయి. సస్పెన్స్ కథలకు ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. రేటింగ్ : 3.5/5
    నవంబర్ 01 , 2024

    జయరామ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే జయరామ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree