• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    కె. చక్రవర్తి

    కె చక్రవర్తి తెలుగులో సుప్రసిద్ధ సంగీత దర్శకుడు. ఆయన అసలు పేరు కొమ్మినేని అప్పారావు. ఈయన దాదాపు 960 సినిమాలకు సంగీతాన్ని అందించారు. మూగప్రేమ(1971) చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. వేటగాడు, అమ్మోరు, డ్రైవర్ రాముడు, పదహారేళ్ల వయసు, అడవి రాముడు, జగన్మోహిని, జేబు దొంగ, ఊర్వశి, యమగోల, అల్లరి బుల్లోడు, మామ అల్లుళ్ల సవాల్, నేటి భారతం వంటి హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. సంగీత దర్శకుడిగానే కాకుండా ఆయన పలు చిత్రాల్లో నటించారు. రాజా, నిన్నే ప్రేమిస్తా వంటి చిత్రాల్లో నటించారు. నేటి భారతం, శ్రావణ మేఘాలు వంటి చిత్రాలకు నంది అవార్డులు పొందారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్ రెహ్మాన్ తొలుత చక్రవర్తి దగ్గర పనిచేశారు.


    @2021 KTree