• TFIDB EN
  • ఎన్టీ రామారావు
    తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారాకరామారావు(NTR) లెజెండరీ నటులు. తెలుగులో 'మనదేశం'(1949) చిత్రం ద్వారా ఆరంగేట్రం చేశారు. ఆయన సినీ కెరీర్‌లో దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ ప్రత్యేకించి శ్రీకృష్ణుడు, శ్రీరాముడు హిందూ దేవతల పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. ఈ వేషాల్లో ఆయన నటనను చూసి అభిమానులు ఆయన్ను నిజంగా దేవుడిగా ఆరాధించేవారు. 'మాయాబజార్', 'నర్తనశాల', శ్రీకృష్ణార్జున యుద్ధం, లవకుశ, భూకైలాష్, దానవీరశూరకర్ణ వంటి పౌరాణిక చిత్రాల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మిస్సమ్మ, గుండమ్మకథ, మల్లీశ్వరి, కన్యాశుల్కం, రక్తసంబంధం, వేటగాడు, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి వంటి క్లాసిక్ చిత్రాల్లో ఆయన నటించిన తీరు తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసింది. ఆయన నటనకు మాత్రమే పరిమితం కాకుండా అనేక చిత్రాలకు డైరెక్షన్ చేయడంతో పాటు నిర్మించారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన NTR మహాశయుడు తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేశారు.
    Description of the image
    Editorial List
    ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్‌ సిరీస్‌లు చూసేయండి
    NTR టాప్ 15 బెస్ట్ చిత్రాలుEditorial List
    NTR టాప్ 15 బెస్ట్ చిత్రాలు
    యానిమల్ రన్‌టైమ్‌ 3.21 గంటలు.. మరి తెలగులో అత్యధిక రన్‌టైమ్‌ కలిగిన సినిమా ఏదో తెలుసాEditorial List
    యానిమల్ రన్‌టైమ్‌ 3.21 గంటలు.. మరి తెలగులో అత్యధిక రన్‌టైమ్‌ కలిగిన సినిమా ఏదో తెలుసా
    ETV WIN ఓటీటీ యాప్‌లో తప్పక చూడాల్సిన సినిమాలుEditorial List
    ETV WIN ఓటీటీ యాప్‌లో తప్పక చూడాల్సిన సినిమాలు
    ఎన్టీ రామారావు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఎన్టీ రామారావు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree