• TFIDB EN
  • నవీన్ నూలి
    ప్రదేశం: తెలంగాణ, భారతదేశం
    నవీన్ నూలి తెలుగు సినిమాలో పనిచేసే భారతీయ చలనచిత్ర ఎడిటర్. అతను జెర్సీ (2019)కి ఉత్తమ ఎడిటింగ్‌గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.
    కథనాలు
    నితిన్ (Nithiin) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నితిన్ (Nithiin) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్ తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో నితిన్ ఒకడు. జయం, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయిందే వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజం, స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు నితిన్ దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో లవర్‌ బాయ్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకుంటున్న  నితిన్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. నితిన్ అసలు పేరు? నితిన్ కుమార్ రెడ్డి నితిన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు నితిన్  ఎక్కడ పుట్టారు? నిజామాబాద్ రామ్‌ పొత్తినేని తేదీ ఎప్పుడు? 1988 మే 15 నితిన్ వివాహం అయిందా? శాలిని కందుకూరితో 2020లో పెళ్లి జరిగింది. నితిన్‌కి ఇష్టమైన రంగు? వైట్, రెడ్ నితిన్ తల్లిదండ్రుల పేరు సుధాకర్ రెడ్డి, విద్యారెడ్డి నితిన్ అభిరుచులు? డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడటం నితిన్‌కి ఇష్టమైన ఆహారం? అలుగడ్డ కర్రీ నితిన్  అభిమాన నటుడు? పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి నితిన్‌కు నచ్చిన సినిమా? ఖుషి నితిన్‌కు స్టార్ డం అందించిన సినిమాలు? సై, దిల్, జయం నితిన్  ఏం చదివాడు? ఇంజనీరింగ్  https://www.youtube.com/watch?v=5SzH8VHhUVw నితిన్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 32 సినిమాల్లో నటించాడు నితిన్ సినిమాకు ఎంత తీసుకుంటారు?  ఒక్కో సినిమాకి దాదాపు రూ.10కోట్లు- రూ.15కోట్లు తీసుకుంటున్నాడు. నితిన్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు? జయం, శ్రీఆంజనేయం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు.
    మార్చి 21 , 2024
    Extra Ordinary Man Review: కామెడీతో గిలిగింతలు పెట్టిన నితిన్‌.. మూవీ హిట్టా? ఫట్టా? నటీనటులు: నితిన్, శ్రీలీల, డా. రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర నరేష్, హైపర్ ఆది ఇతరులు దర్శకుడు : వక్కంతం వంశీ నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంగీతం: హారిస్ జయరాజ్ సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ విల్సన్ ఐ ఏఎస్ సి, యువరాజ్ జే, సాయి శ్రీరామ్ విడుదల తేదీ : డిసెంబర్ 08, 2023 'భీష్మ' సినిమా తర్వాత నితిన్ కెరీర్‌లో సరైన హిట్ పడలేదు. నాలుగు పరాజయాల తర్వాత నితిన్ చేసిన లేటెస్ట్‌ చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' (Extra Ordinary Man). వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ మూవీని ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా... రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించారు. వక్కంతం వంశీ రాసిన అత్యుత్తమ కథల్లో ఇదే బెస్ట్‌ అని సినిమా విడుదలకు ముందు నితిన్‌ చెప్పాడు. మూవీ మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు నవ్విస్తూనే ఉంటామని పేర్కొన్నాడు. మరి సినిమా ఎలా ఉంది? నితిన్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.  కథ అభి (నితిన్) సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తుంటాడు. నటుడిగా మంచి పేరు తెచ్చుకొని హీరో కావాలన్నది అతడి కల. ఎక్స్ట్రా ఆర్టిస్ట్‌గా సాగిపోతున్న అభి లైఫ్‌లోకి మెరుపులా లిఖిత (శ్రీలీల) వస్తుంది. అభితో ప్రేమలో పడుతుంది. అంతా సజావుగా సాగుతున్న క్రమంలోనే అభికి హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి.. సైతాన్ పాత్రలోకి ఇన్‌వాల్వ్‌ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్‌లా మారాడు? ఐజీ విజయ్ చక్రవర్తి (రాజశేఖర్)కి సైతాన్‌ సంబంధం ఏంటి ? చివరికి అభి కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే మంచి ఎనర్జీతో ఉన్న అభి పాత్రలో నితిన్‌ చక్కగా ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే అద్భుతమైన బాడీ లాంగ్వేజ్‌ను ప్రదర్శించాడు. ముఖ్యంగా లుక్‌, స్టైలింగ్‌ బాగుంది. ఇక శ్రీలీల పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. నటనకు పెద్దగా స్కోప్‌ లేదు. పాటలకే ఆమె పరిమితమైంది. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రకు రాజశేఖర్‌ పూర్తి న్యాయం చేశారు. హీరోకి తండ్రిగా రావు రమేష్‌ చాలా బాగా నటించాడు. తనదైన పంచ్‌లతో ఫన్ క్రియేట్ చేశారు. ఆది, సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు వక్కంతం వంశీ ఎంచుకున్న స్టోరీ లైన్‌ బలహీనంగా ఉన్నప్పటికీ కథకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను నవ్వించడంలో ఆయన కొంతమేర సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. అయితే తొలి భాగంలో ఉన్న ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ సెకండ్‌హాఫ్‌లో కనిపించవు. సెకండాఫ్‌ కంటే ఫస్టాఫ్‌ బెటర్ అన్న ఫీలింగ్ వస్తుంది. కొన్ని సన్నివేశాలను లాజిక్‌కు చాలా దూరంగా చూపించారు డైరెక్టర్‌. అటు హీరో, హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌ను కూడా బలంగా చూపలేక పోయారు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ ఆశించే వారికి మాత్రం ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. టెక్నికల్‌గా  టెక్నికల్ విషయాలకు వస్తే.. సినిమాటోగ్రఫి, ఆర్ట్ విభాగం, మ్యూజిక్ విభాగాల పనితీరు సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా హారిస్‌ జయరాజ్‌ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి అందించిన ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బాగున్నాయి. అయితే సాగదీత సీన్లు అక్కడక్కడ ఉన్న నేపథ్యంలో ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉండాల్సింది.  ప్లస్‌ పాయింట్స్‌ నితిన్‌ నటనహాస్య సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ బలహీనమైన స్టోరీలవ్‌ ట్రాక్‌ రేటింగ్‌: 2.5/5
    డిసెంబర్ 08 , 2023
    Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్! నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం 'రాబిన్‌ హుడ్‌' (Robinhood). యంగ్‌ డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్‌ సింగిల్‌ 'లుక్‌ ఇస్తే చాలే చాలు.. లక్కీగా ఫీలవుతాను' పాటను రిలీజ్‌ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో నటి శ్రీలీల మాట్లాడారు. 'పుష్ప 2'లో చేసిన ‘కిస్సిక్‌’ పాటతో పాటు అల్లు అర్జున్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'అల్లు అర్జున్‌.. కింగ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌' యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela)కు డ్యాన్సింగ్‌ క్వీన్‌గా పేరొంది. ఆమె నటించిన పాత్రల కంటే వేసిన స్టెప్పులే టాలీవుడ్‌లో ఎక్కువ క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే 'పుష్ప 2'లోని కిస్సిక్‌ ఐటెం సాంగ్‌ కూడా ఆమెను వరించింది. ఇదిలా ఉంటే 'రాబిన్‌ హుడ్‌' సినిమా ఈవెంట్‌లో ఓ విలేఖరి మీ దృష్టిలో డ్యాన్సింగ్‌ కింగ్‌ ఎవరు? అని శ్రీలీలను ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చేందుకు తొలుత శ్రీలీల తటపటాయించింది. అప్పుడు వెంటనే పక్కనే ఉన్న హీరో నితిన్‌ గుడ్‌ క్వశ్చన్ అంటూ వ్యాఖ్యానించాడు. అప్పుడు శ్రీలీల నవ్వుతూ 'మనం ఇద్దరం ఒకే టీమ్ అండి.. గుడ్ క్వశ్చన్‌ అంట పక్క నుంచి' అని అన్నది. ఆ తర్వాత సమాధానం దాటేస్తుండగా నితిన్‌ కలుగచేసుకొని విలేఖరి అడిగిన ప్రశ్నను తిరిగి రిపీట్‌ చేశాడు. దీంతో 'ఇప్పటివరకూ చూసిన వారిలో బన్నీ గారు అండి. బన్నీ గారు ఈజ్‌ డ్యాన్సింగ్‌ కింగ్‌ ' అని శ్రీలీల ఆన్సర్ ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  https://twitter.com/i/status/1861678559686689235 ‘ఎన్నో ఐటెం సాంగ్స్‌ రిజెక్ట్‌ చేశా’ 'పుష్ప 2' సినిమాలో ‘కిస్సిక్’ అనే ఐటెం సాంగ్‌ చేయడానికి కారణాన్ని కూడా శ్రీలీల (Sreeleela) వివరించింది. ఈ ప్రశ్నకు సమాధానం ఆ సాంగే చెబుతుందని అన్నారు. ఇది యావరేజ్‌ ఐటెం సాంగ్‌ కాదని ఆమె శ్రీలీల పేర్కొంది. ఎన్నో సినిమాల్లో ఐటెం సాంగ్‌ చేయాలని అడిగారని కానీ తాను అంగీకరించలేదని చెప్పింది. అయితే ‘కిస్సింగ్‌’ సాంగ్‌ చేయడానికి ఒక స్ట్రాంగ్‌ రీజన్ ఉందని ఆమె స్పష్టం చేసింది. డిసెంబర్‌ 5న మీకు సమాధానం దొరుకుతుందని ఆమె చెప్పింది. ఇక శ్రీలీల నటనను డ్యాన్స్‌ డామినేట్‌ చేస్తుందా? అని మరో విలేఖరి ప్రశ్నంచగా అందుకు ఆమె నిజమే అని సమాధానం చెప్పారు. ప్రస్తుతం పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నానని, అందుకే ఈ ఏడాది సినిమాలకు గ్యాప్‌ తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మంచి స్క్రిప్ట్‌లపై ఫోకస్‌ చేస్తున్నట్లు చెప్పింది. రాబిన్‌ హుడ్‌ సినిమా నటన పరంగా తనకు సంతృప్తి ఇచ్చిందని తెలిపింది.  https://twitter.com/i/status/1861653446795169936 https://twitter.com/i/status/1861679449458229501 శ్రీలీల రెమ్యూనరేషన్‌పై క్లారిటీ రాబిన్‌ హుడ్‌ ప్రెస్‌ మీట్‌లో ‘పుష్ప 2’ ఐటెం సాంగ్ రెమ్యూనరేషన్‌ పైనా ప్రశ్న ఎదురైంది. ఈ ఐటమ్‌ సాంగ్‌ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్‌ తీసుకుందని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఓ భారీ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుందో ఈ పాటకు అంతే మొత్తంలో డిమాండ్‌ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ పుకారుపై శ్రీలీలతో పాటు నిర్మాతలు స్పందించారు. ‘కిస్సిక్‌’ సాంగ్‌ కోసం సినిమా స్థాయిలో రెమ్యునరేషన్‌ తీసుకున్నారట కదా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా ‘ఇప్పటి వరకు రెమ్యునరేషన్‌ మ్యాటరే మా మధ్య జరగలేదని శ్రీలీల, నిర్మాతలు చెప్పుకొచ్చారు. ‘అంత ఇంత అని ఏమి అనుకోలేదు. అవకాశం వచ్చింది చేసేశా. ఇంకా డబ్బుల గురించి మాట్లాడలేదు’ అని శ్రీలీల అన్నారు. నిర్మాత నవీన్‌ యేర్నెని మాట్లాడుతూ ‘రెమ్యునరేషన్‌ టాపికే శ్రీలీల తీయలేదు. మీరు అనుకున్నంత రెమ్యునరేషన్‌ అయితే ఇవ్వలేదు’ అని క్లారిటీ ఇచ్చారు. https://twitter.com/i/status/1861684691021242731
    నవంబర్ 27 , 2024
    Aay Movie Review: ఎన్టీఆర్‌ బావమరిది ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య తదితరులు దర్శకుడు: అంజి కె మణిపుత్ర సంగీత దర్శకుడు: రామ్ మిర్యాల, అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ నటించిన రెండో చిత్రం ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్న ఈ యంగ్‌ హీరో తన సెకండ్‌ హిట్‌ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించిన ‘ఆయ్‌’ చిత్రంలో నయన్‌ సారిక హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి అమలాపురంకు చెందిన కార్తీక్‌ (నార్నే నితిన్‌) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరతాడు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఊరికి వస్తాడు. ఇంటి నుంచి పని చేసుకుంటూనే బాల్య మిత్రులు హరి, సుబ్బుతో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలో పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్‌ సారిక)ని ప్రేమిస్తాడు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పల్లవికి కులం పట్టింపులు ఎక్కువ. కార్తీక్‌ తన కులం వాడేనని భావించి ఇష్టపడుతుంది. అతడి కులం వేరని తెలిసి దూరం పెడుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరిస్తుంది. దీంతో కార్తీక్‌ తట్టుకోలేకపోతాడు. మరోవైపు వారిద్దరిని కలిపేందుకు స్నేహితులు హరి, సుబ్బు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నం ఫలిచిందా? పల్లవితో కార్తీక్‌ పెళ్లి జరిగిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే కార్తీక్ పాత్రలో నార్నే నితిన్‌ ఆకట్టుకున్నాడు. మెుదటి చిత్రంతో పోలిస్తే నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రే అతడికి దక్కింది. హావభావాలు, సంభాషణల్లో అత‌నిలో ప‌రిణ‌తి కనిపించింది. డ్యాన్స్ తోనూ మెప్పించాడు. ఇక పల్లవి పాత్రలో నటించిన నయన్ సారిక తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అచ్చ‌మైన గోదావ‌రి అమ్మాయిగా తెర‌పై సందడి చేసింది. ఫ్రెండ్స్‌ పాత్రల్లో రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కోయ చేసిన కామెడీ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా క‌సిరెడ్డి పాత్ర ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. మైమ్ గోపి, వినోద్ కుమార్‌లు పాత్రల పరిధి మేరకు నటించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అంజి ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దానిని ప్రెజెంట్‌ చేసిన తీరు మెప్పిస్తుంది. అమలాపురం నేపథ్యం, చిన్ననాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, ఆప్యాయతలు ఇలా అన్నింటీని మేళవిస్తూ కథను నడిపించారు. ముగ్గురు స్నేహితులు కలిసినప్పటి నుంచి సినిమాలో సందడి మెుదలవుతుంది. ముఖ్యంగా కార్తిక్ ప్రేమలో పడినప్పటి నుంచి కథ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. హీరో ప్రేమ కోసం ఇద్దరు స్నేహితులు చేసే సాయం, ఈ క్రమంలో వారు పడే ఇబ్బందులు నవ్వులు పంచుతాయి. సాఫీగా సాగిపోతున్న కథలో ట్విస్ట్ తీసుకొచ్చి సెకండాఫ్‌పై ఆసక్తి పెంచాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌లో ఇరు కుటుంబాల పెద్దలను ఇన్‌వాల్వ్‌ చేసి మంచి సందేశం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అయితే రొటీన్‌ స్టోరీ, లవ్‌ట్రాక్‌ను కామెడీ డామినేట్‌ చేయడం, లాజిక్‌ లేని సన్నివేశాలు మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సమీర్‌ కళ్యాణి కెమెరా పనితనం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అమలాపురం పరిసరాలు, గ్రామీణ నేపథ్యాన్ని తన కెమెరాతో చూపించిన తీరు మెప్పిస్తుంది. సంగీతం విషయానికొస్తే పాటలు సినిమాకి ప్రాణం పోశాయి. రామ్ మిర్యాల అందించిన సూఫియానా పాట ఎంతో వినసొంపుగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ్యుసర్లు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.  ప్లస్ పాయింట్స్‌ నటీనటులుకామెడీక్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఊహకందేలా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5  
    ఆగస్టు 16 , 2024

    నవీన్ నూలి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నవీన్ నూలి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree