• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    ఆర్పీ పట్నాయక్

    ఆర్. పి. పట్నాయక్ తెలుగులో సుప్రసిద్ధ సంగీత దర్శకుడు. ఆయన అసలు పేరు రవీంద్ర ప్రసాద్ పట్నాయక్. నీకోసం(1999) చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆయన ఎక్కువగా ప్రేమ కథ సినిమాలకు సంగీతం అందించారు. చిత్రం సినిమా ఆయన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. నువ్వునేను, మనసంత నువ్వే, నువ్వులేక నేనులేను, జయం, సంతోషం, దిల్, ఈశ్వర్, శ్రీనువాసంతి లక్ష్మి, నిజం, ఆ నలుగురు వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడిగాను రాణించారు. శ్రీనువాసంతి లక్ష్మి, బ్రోకర్, తులసిదళం వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. దర్శకుడిగా బ్రోకర్, తులసిదళం చిత్రాలను తెరకెక్కించారు. ఆయన కెరీర్‌లో ఉత్తమ సంగీత దర్శకుడిగా మూడు నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు.


    @2021 KTree