• TFIDB EN
  • రామ్ చరణ్
    జననం : మార్చి 27 , 1985
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
    రామ్ చరణ్ తేజ్ మార్చి 27, 1985న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. రామ్ చరణ్‌కు ఇద్దరు చెల్లెల్లు శ్రీజ, సుష్మిత. మెగాస్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్ తేజ్ మెగా పవర్‌స్టార్‌గా తనకుంటూ ప్రత్యేక గుర్తుంపు సంపాదించుకున్నాడు. తన తండ్రిని అనుసరించకుండా తనదైన స్టైల్‌తో ముందుకెళ్లాడు. డ్యాన్స్, యాక్టింగ్ విషయంలో సినిమా, సినిమాకు పరణతి చెంది తండ్రికి తగ్గ తనయుడిగా శభాష్ అనిపించుకున్నాడు.
    Read More

    రామ్ చరణ్ వయసు ఎంత?

    రామ్‌ చరణ్ వయసు 40 సంవత్సరాలు

    రామ్ చరణ్ ముద్దు పేరు ఏంటి?

    మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్, చెర్రీ

    రామ్ చరణ్ ఎత్తు ఎంత?

    5'8"(172cm)

    రామ్ చరణ్ అభిరుచులు ఏంటి?

    రామ్‌చరణ్‌కు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. చెర్రీకి కాజల్, బాదల్ ఆశ్వాలంటే ఇష్టం. ఇవికాక విదేశీ బ్రీడ్‌కు చెందిన 25 గుర్రాలు చరణ్ దగ్గర ఉన్నాయి.

    రామ్ చరణ్ ఏం చదువుకున్నారు?

    Bcom Dropout

    రామ్ చరణ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    రామ్‌ చరణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సేయింట్ మేరీస్ కాలజీలో చదువుకున్నాడు

    రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    రానా దగ్గుపాటి రామ్‌చరణ్‌కు బెస్ట్ ఫ్రెండ్‌. వీరిద్దరు కలిసి ఇంట్లో తెగ అల్లరి చేసేవారని చిరంజీవి చెప్పారు.

    రామ్ చరణ్ In Sun Glasses

    Images

    Ram Charan With M. S. Dhoni

    Images

    Global Star Ram Charan

    రామ్ చరణ్ With Pet Dogs

    Images

    Ram Charan With his Dog

    Images

    Ram Charan

    రామ్ చరణ్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Ram Charan

    రామ్ చరణ్ అన్‌ కేటగిరైజ్డ్ వీడియోలు

    Description of the image
    Editorial List
    బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన హిట్ సినిమాల జాబితా
    బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన సినిమాల జాబితాEditorial List
    బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన సినిమాల జాబితా
    పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన హిట్‌ సినిమాల జాబితాEditorial List
    పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన హిట్‌ సినిమాల జాబితా
    పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాల జాబితాEditorial List
    పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాల జాబితా
    <strong>Ram Charan Kadapa Dargah: అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లిన రామ్ చరణ్… తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు!</strong>
    Ram Charan Kadapa Dargah: అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లిన రామ్ చరణ్… తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు! ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌. రెహమాన్‌ (A.R Rahman) ఆహ్వానం మేరకు నటుడు రామ్‌ చరణ్‌ కడపలోని దర్గా (Ram Charan Kadapa Dargah)ను సోమవారం (నవంబర్‌ 18) సందర్శించారు. 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ (ఉర్దూ కవి) సమ్మేళనాన్ని రామ్‌చరణ్‌ ప్రారంభించారు. తొలుత డైరెక్టర్‌ బుచ్చిబాబు సానాతో కలిసి కడపలోని విజయ దుర్గా దేవీ ఆలయాన్ని చరణ్‌ సందర్శించారు. తన తదుపరి సినిమా ‘RC16’ స్క్రిప్ట్‌ని అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. అనంతరం దర్గాకు చేరుకున్న చరణ్‌ ‘మగధీర' టైమ్‌లో దర్గాతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే చరణ్‌ మాలలో ఉండి దర్గాను దర్శించడం వివాదస్పదమవుతోంది. దీనిని సోషల్‌ మీడియా వేదికగా పలువురు వ్యతిరేకిస్తున్నారు. దీనికి మెగా ఫ్యాన్స్‌ దీటుగా సమాధానం ఇస్తున్నారు. చరణ్‌కు ఊరమాస్ స్వాగతం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan Kadapa Dargah) సోమవారం రాత్రి (నవంబర్ 19) 7 గం.లకు హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి కడప బయలుదేరారు. అనంతరం కడప విమానాశ్రయంలో దిగిన రామ్‌చరణ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన గురించి ముందే తెలుసుకున్న మెగా ఫ్యాన్స్‌, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విమానాశ్రయం వద్ద సందడి చేశారు. విమానశ్రయం నుంచి చరణ్‌ బయటకు రాగానే బిగ్గరగా అరుస్తూ పలకరించారు. అనంతరం కడప దుర్గా దేవీ ఆలయానికి బయలుదేరిన చరణ్‌ వాహన శ్రేణిని పెద్ద ఎత్తున అభిమానులు అనుసరించారు. మార్గం మధ్యలో బాణా సంచా కాలుస్తూ తమ హీరో రాకను ఊరమాస్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. మరోవైపు చరణ్‌ కంటే ముందే ఆలయం, దర్గా&nbsp; వద్ద చేరుకున్న మెగా ఫ్యాన్స్ అక్కడ కూడా గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; https://twitter.com/VoiceofAndhra3/status/1858745724977975679 https://twitter.com/i/status/1858523256996688028 https://twitter.com/i/status/1858520994966630608 https://twitter.com/i/status/1858519599362293966 https://twitter.com/i/status/1858539492933521720 https://twitter.com/i/status/1858526070414135792 https://twitter.com/i/status/1858527756038160445 నెట్టింట భారీగా ట్రోల్స్‌ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan Kadapa Dargah) ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పర మతానికి సంబంధించిన దర్గాకు మాలలో ఉండి వెళ్లడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది హిందువులను, ముస్లీములను అవమానించడమేనని నెట్టింట ఆరోపిస్తున్నారు. కొన్ని మతాలకు కట్టుబాట్లు ఉంటాయని దానిని ఎంతటి వారైనా అనుసరించి తీరాల్సిందేనని కామెంట్స్‌ చేస్తున్నారు. ఏ.ఆర్‌. రెహమాన్‌ పిలుపు మేరకు దర్గాకు వచ్చానని చరణ్ అంటున్నారని, అదే రెహమాన్‌ను తిరుమలకు రమ్మని ఆహ్వానించగలవా? అని ప్రశ్నిస్తున్నారు. నీ మాట ప్రకారం రెహమాన్‌ రాగలడా? అంటూ నిలదీస్తున్నారు. చరణ్‌పై ఇప్పటివరకూ ఉన్న గౌరవం ఈ ఒక్క చర్యతో పోగొట్టుకున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1858762953216192664 https://twitter.com/DevikaRani81/status/1858709625107075108 https://twitter.com/kssivakumar/status/1858738287940116977 https://twitter.com/rajeshg117/status/1858718607263313946 https://twitter.com/PrabhasAnna50/status/1858765445567828393 https://twitter.com/bulliguvva_/status/1858755755245195594 https://twitter.com/SRevanuri/status/1858792387415245278 https://twitter.com/nareshchilakara/status/1858748235071750273 https://twitter.com/youngmonkxxx/status/1858756817565667393 ఘాటుగా బదులిస్తున్న చరణ్ ఫ్యాన్స్‌! తమ హీరోగా నెట్టింట జరుగుతోన్న ట్రోల్స్‌కు చరణ్‌ ఫ్యాన్స్‌ గట్టిగా బదులిస్తున్నారు. వాస్తవాలను ప్రస్తావిస్తూ చరణ్‌కు అండగా నిలుస్తున్నారు. అయ్యప్ప మాలలో ఉన్న వారు దర్గాను సందర్భించడం ఇదే తొలిసారి కాదని స్పష్టం చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలైకు వెళ్లే ముందుకు స్వాములు ముందుగా కేరళ ఎరుమెలిలోని వావర్‌ మసీదు (Vavar Juma Masjid)ను సందర్శించే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సైతం నెట్టింట షేర్ చేస్తున్నారు. హిందువు అయితే ఇతర మతస్తుల గుళ్లకు వెళ్లకూడదని రాజ్యాంగంలో ఉందా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. హిందుత్వానికి ఎంతో విలువ ఇచ్చే ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ లాంటి వారే దర్గాలకు వెళ్లారని గుర్తుచేస్తున్నారు. మన ధర్మాన్ని, సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి కాబట్టే చరణ్‌ దర్గాకు వెళ్లాడని సపోర్ట్ చేస్తున్నారు. సెలబ్రిటీల విషయాల్లో వేలు పెట్టి పాపులర్ కావాలని చూడటం ఈ మధ్య బాగా ఫ్యాషన్‌ అయ్యిందని మెగా ఫ్యాన్స్‌ విమర్శిస్తున్నారు.&nbsp; https://twitter.com/mutyala2492/status/1858765282317398031 https://twitter.com/Ryder1162/status/1858736681152618783 https://twitter.com/irah_ranga/status/1858796736900157841 https://twitter.com/mutyala2492/status/1858765966718693462 https://twitter.com/i/status/1858733584565338350 https://twitter.com/Trivikram_Pavan/status/1858747494773256230 https://twitter.com/NBK__MB/status/1858742668500889986
    నవంబర్ 19 , 2024
    Ram Charan Wax Statue: ప్రభాస్, మహేష్‌, బన్నీ సరసన రామ్ చరణ్‌.. ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేయాల్సిందే! మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్‌ (Ram Charan) టాలీవుడ్‌ (Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. ‘చిరుత’ (Chirutha) సినిమాతో తెరంగేట్రం చేసిన అతడు రెండో సినిమా 'మగధీర' (Magadheera) ఇండస్ట్రీ హిట్‌ అందుకున్నాడు. రంగస్థలం (Rangasthalam)తో నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించాడు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR)తో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన ఘనతను సైతం రామ్‌చరణ్ అందుకోబోతున్నాడు.&nbsp; సింగపూర్‌లో మైనపు విగ్రహం నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) అరుదైన గౌరవం దక్కనుంది. ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తోపాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహాన్ని కూడా పెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోషూట్‌ ఇప్పటికే పూర్తయింది. విగ్రహం ఏర్పాటు చేసే విషయాన్ని టుస్సాడ్స్‌ టీమ్‌ ఐఫా వేదికగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై మెగా అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తరహాలోనే అంచెలంచెలుగా ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Nilzrav/status/1840120654193897699 ఫస్ట్‌ తెలుగు హీరోగా రికార్డు! టాలీవుడ్‌ నుంచి ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల మైనపు విగ్రహాలను మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. వాటితో పోలిస్తే ఈసారి చరణ్‌ మైనపు విగ్రహం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే లండన్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియంలో చరణ్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేయబోతున్నారు. మేడమ్ టుస్సాడ్స్ పుట్టిన ఇల్లు అయిన లండన్ మ్యూజియంలో అడుగుపెడుతున్న ఫస్ట్‌ తెలుగు యాక్టర్‌ రామ్ చరణ్‌ కావడం విశేషం. ఈ అరుదైన గౌరవాన్ని చరణ్‌ సొంతం చేసుకోబుతున్నారు. ఆయనకు మూగ జీవాలపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఆయన పెంపుడు కుక్క రైమ్‌ విగ్రహాన్ని అక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేయనుండటం గమనార్హం.&nbsp; చరణ్‌ కంటే ముందే..&nbsp; మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అడుగు పెట్టిన మొదటి తెలుగు హీరో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన మైనపు విగ్రహం బ్యాంకాక్ మ్యూజియంలో పెట్టారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం ఉంది. ఆ మ్యూజియంలోనే శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సైతం ఉంచారు. ఆమె నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'మిస్టర్ ఇండియా'లో గెటప్ తీసుకుని ఆ విగ్రహం రూపొందించారు. ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మ సైతం అక్కడే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఇటీవల దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. పుష్పరాజ్‌ గెటప్‌లో బన్నీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. బాలీవుడ్‌ స్టార్స్‌ విగ్రహాలు బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల మైనపు విగ్రహాలు సైతం మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు అయ్యాయి. వీరిలో కొందరివి లండన్‌లో, ఇంకొంత మంది విగ్రహాలు సింగపూర్, దుబాయ్ మ్యాజియమ్స్‌లో ఉన్నాయి. బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్ ఖాన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌ కండల&nbsp; వీరుడు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, కరీనా కపూర్ ఖాన్, స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ సహా మరి కొందరి మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు.&nbsp; చరణ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ రామ్‌చరణ్‌, తమిళ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా రానున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు (Director Buchi Babu) దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram Charan) నటించబోతున్నాడు. ‘RC16’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్‌ సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. 'పుష్ప 2' రిలీజ్ అనంతరం రామ్‌, సుకుమార్‌ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుంది.&nbsp;
    సెప్టెంబర్ 30 , 2024
    రామ్‌ చరణ్ (Ram charan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు సినీ పరిశ్రమలోని అగ్రహీరోల్లో ఒకరు. తన అద్భుతమైన నటనా సామర్థ్యం, మెస్మరైజ్ డ్యాన్సింగ్‌ ప్రదర్శనతో తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి... RRR చిత్రంతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయినప్పటికీ.. అత్యంత డౌన్ టు ఎర్త్‌గా ఉండటంతో ఆయనకు విస్తృత అభిమానం పొందారు. ఈక్రమంలో రామ్ చరణ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ ఎవరు? టాలీవుడ్‌లో స్టార్ హీరో, RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు రామ్ చరణ్ పుట్టినరోజు ఎప్పుడు? రామ్ చరణ్ మార్చి 27, 1985న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించారు. మెగాపవర్ స్టార్ వయసు 39 ఏళ్లు. రామ్‌ చరణ్ ముద్దు పేరు? చెర్రీ రామ్ చరణ్ ఎత్తు ఎంత? 5 అడుగల 8 అంగుళాలు రామ్‌ చరణ్ అభిరుచులు? చరణ్‌కు ఫిట్‌నెస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు జిమ్‌లో సాధన చేస్తుంటాడు. హార్స్ రైడింగ్ అంటే కూడా ఇష్టం రామ్ చరణ్ హీరోగా ఎన్ని సినిమాలు వచ్చాయి? రామ్ చరణ్ తన 15 ఏళ్ల కెరీర్‌లో 15 సినిమాల్లో నటించాడు రామ్ చరణ్ ఏ యాక్టింగ్ స్కూల్‌లో చదివాడు? తన సినీరంగ ప్రవేశానికి ముందు, చరణ్ ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఈ స్కూలు చాలా ఫేమస్. హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ అందరూ ఇక్కడ నటనను అభ్యసించారు. రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నాడా? జూన్ 14, 2012న, రామ్ చరణ్ తన స్నేహితురాలైన కామినేని ఉపాసనను వివాహం చేసుకున్నాడు. ఉపాసన అపోలో హాస్పిటల్స్‌కు CEO. రామ్‌చరణ్‌కు ఉపాసనకు ఎలా పరిచయం అయింది? &nbsp;రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ లండన్‌లోని రీజెంట్ యూనివర్శిటీలో తమ చదువును పూర్తి చేసారు, ఆ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారు. రామ్‌ చరణ్- ఉపాసనకు ఎంతమంది పిల్లలు? వీరిద్దరి ఒక పాప జన్మించింది. పాప పేరు క్లింకారా రామ్ చరణ్ ఎక్కడ నివసిస్తున్నారు? రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఒక విలాసవంతమైన ఎస్టేట్‌లో నివసిస్తున్నారు. రామ్ చరణ్ కొత్త సినిమా ఏంటి? రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు దర్శకుడు శంకర్ https://www.youtube.com/watch?v=8zpKqO0QMn0 రామ్ చరణ్‌కి ఇష్టమైన ఆహారం? రామ్ చరణ్ వంట చేయడం చాలా ఇష్టం. బిర్యానీ అతనికి ఇష్టమైన వంటకం.&nbsp; రామ్‌ చరణ్ వ్యాపారాలు? &nbsp;గుర్రపు పందేలపై తనకున్న అభిరుచిని సూచించేందుకు చరణ్ హైదరాబాద్‌లో పోలో టీమ్‌ని కొనుగోలు చేశాడు. అతను స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లో వాటా కలిగి ఉన్నాడు. రామ్ చరణ్‌కు వచ్చిన సినిమా అవార్డులు? తన కెరీర్ మొత్తంలో, రామ్ చరణ్ అనేక గౌరవాలను అందుకున్నాడు. మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు గెలుచుకున్నాడు.
    మార్చి 19 , 2024
    RC15: రామ్‌ చరణ్ CEO&nbsp; స్టోరీ ఇదేనా? కథ అయితే మాములుగా లేదు! ‘RRRకు&nbsp; ఆస్కార్ అవార్డు రావడంతో రామ్‌చరణ్ చేసే అప్‌కమింగ్ ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ డైరెక్షన్‌లో ‘RC15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాతో బిజీబిజీగా గడుపుతున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా సినిమా కథ గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మరి ఆ విశేషాలు తెలుసుకుందాం.&nbsp; కథ ఇదేనా? పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న కథను దర్శకుడు శంకర్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ ఇందులో డ్యుయల్ రోల్‌లో చేయనున్నారట. ఈ మేరకు కొన్ని సెట్ ఫొటోలు గతంలో లీక్ అయ్యాయి. గ్రామీణ నేపథ్యానికి చెందిన వ్యక్తిగా ఒక రోల్, IAS అధికారిగా మరొక రోల్‌లో చెర్రీ నటించనున్నారట.&nbsp; తండ్రీ, కొడుకుల చుట్టూ.. ఎన్నికల అధికారి పాత్రలో చరణ్ నటించనున్నాడు. రామ్‌చరణ్ తండ్రి ఓ రాజకీయ పార్టీ అధినేత. దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన పోరు ఉండనున్నట్లు తెలిసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకే హైలెట్‌గా ఉంటాయని సమాచారం. &nbsp; వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపి, వాటిని రూపుమాపే ప్రయత్నంలో CEO గా&nbsp; రామ్‌చరణ్ ఎదుర్కొన్న అనుభవాల గురించి ఇందులో చూపించనున్నారట. సినిమా మొత్తం తండ్రీ, కొడుకుల చుట్టూనే తిరుగుతుందని టాక్&nbsp; సామాజిక కోణం.. శంకర్ సినిమా అంటే అందులో ఓ సోషల్ మెసేజ్ తప్పనిసరిగా ఉంటుంది. సమాజంలోని లోటుపాట్లను సినిమాల ద్వారా ప్రతిబింబించగలడు. దీంతో రామ్‌చరణ్ సినిమాలోనూ ఈ సోషల్ రిలవెన్స్ ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. చారిత్రక కట్టడమైన ‘చార్మినార్’ వద్ద ఇటీవల సినిమా షూటింగ్ జరుపుకోవడం ఇందుకు ఊతమిస్తోంది.&nbsp; శంకర్ మార్క్ ఎలిమెంట్స్.. సినిమా నాణ్యత విషయంలో డైరెక్టర్ శంకర్ అస్సలు రాజీ పడరు. కచ్చితంగా ఉన్నతంగా తీర్చిదిద్దేవరకు అలసిపోడు. సాధారణంగా ఒక పాట షూటింగ్‌ని పూర్తి చేయడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. కానీ, శంకర్ మాత్రం దాదాపు 10 రోజులు కేటాయిస్తాడని సమాచారం. ఈ సినిమా బృందం న్యూజిలాండ్‌లోనూ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.&nbsp; ఎమోషన్స్..&nbsp; తన ప్రతి సినిమాలో శంకర్ ఎమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇందులోనూ బలమైన సీన్స్‌ని రాసుకున్నారట. ముఖ్యంగా తండ్రీకొడుకల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట.&nbsp; గ్రాండియర్ విజువల్స్.. రామ్‌చరణ్ సినిమాను శంకర్ గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నాడు. పాటల చిత్రీకరణలోనూ శంకర్ కాంప్రమైజ్ అవ్వట్లేదు. పాటల కోసం ప్రపంచంలోని ఏ లొకేషన్‌కైనా వెళ్లేందుకు శంకర్ వెనుకాడడు. ఇటీవల న్యూజిలాండ్‌లో చిత్రబృందం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.&nbsp; టైటిల్ ఫిక్స్? శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న RC15 సినిమా గురించి చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు.C.E.O(Chief Electoral Officer) అనే టైటిల్‌ పెట్టారని టాక్. ఇక చరణ్ పుట్టిన రోజున టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పేశాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. క్రేజీ కాంబినేషన్‌ RRR తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమాకు భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు ప్రాజెక్టును టేకప్ చేయడంతో అంచనాలు బలపడ్డాయి. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌జే సూర్య, సునీల్‌, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.&nbsp; బర్త్‌డే కానుక చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శంకర్ లోగోను తీర్చిదిద్దుతున్నారని మార్చి 27 బర్త్‌డే రోజున విడుదల చేస్తామని వెల్లడించారు. సినిమా విడుదలపై కూడా అటు ఇటుగా ఓ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.&nbsp; ఫ్యాన్స్‌‌కి పూనకాలే.. సినిమా ప్రకటించిన తర్వాత షూటింగ్ జరుగుతున్నా చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్‌లు లేవు. దీంతో ఒకొక్క విషయం తెలుస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దిల్‌రాజు కూడా మూవీ&nbsp; అప్డేట్‌పై క్లారిటీ ఇవ్వడంతో ‘పూనకాలు లోడింగ్’ అంటూ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.
    మార్చి 18 , 2023

    రామ్ చరణ్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    రామ్‌ చరణ్ సినీ కుటుంబంలో జన్మించాడు. ఆయన ప్రముఖ టాలీవుడ్ హీరో మెగస్టార్ చిరంజీవి కుమారుడు. రామ్‌ చరణ్ తల్లి పేరు సురేఖ. రామ్‌ చరణ్‌కు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. రామ్ చరణ్ బాబాయి పవన్ కళ్యాణ్ తెలుగులో స్టార్ హీరోగాను.. జనసేన పార్టీ అధినేతగా కొనసాగుతున్నాడు. మరో బాబాయి నాగబాబు కూడా నటుడిగా గుర్తింపు పొందాడు. రామ్ చరణ్ బావమర్ది అల్లు అర్జున్ కూడా తెలుగులో స్టార్ హీరో. ఆయన తాత అల్లు రామలింగయ్య తెలుగులో దిగ్గజ హాస్య నటుడిగా గుర్తింపు పొందారు. రామ్ చరణ్ చెల్లెల్ల పేర్లు.. శ్రీజ, సుస్మిత

    రామ్ చరణ్ పెళ్లి ఎప్పుడు అయింది?

    రామ్‌ చరణ్‌ వివాహం జూన్ 14 న 20012లో ఉపాసనతో జరిగింది.

    రామ్ చరణ్ కు పిల్లలు ఎంత మంది?

    రామ్‌ చరణ్ ఉపాసన దంపతులకు ఒక పాప. పాప పేరు క్లింకారా

    రామ్ చరణ్ Family Pictures

    Images

    Ram Charan with his Cousins

    Images

    Ram Charan and Chiranjeevi

    రామ్ చరణ్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    రామ్‌ చరణ్ స్వాగ్, డైలాగ్ మాడ్యూలేషన్ అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా RRRచిత్రంలో అతని నటన పాన్‌ ఇండియా స్టార్‌ను చేసింది.

    రామ్ చరణ్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన చిరుతమూవీతో చరణ్ తెరంగేట్రం చేశాడు. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ సూపర్ హిట్ మూవీ జంజిర్ రీమెక్ చేసి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అది ప్లాప్‌గా నిలిచింది.

    తెలుగులో రామ్ చరణ్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    మగధీరచిత్రం రామ్‌ చరణ్‌కు తొలి హిట్‌ను అందించడంతో పాటు యూత్‌లో ఫాలోయింగ్‌ తెచ్చిపెట్టింది. ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నింటిని బద్దలు కొట్టింది.

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన రామ్ చరణ్ తొలి చిత్రం ఏది?

    రామ్ చరణ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    రామ్‌ చరణ్ తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా RRRచిత్రంలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది

    రామ్ చరణ్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Stage Performance

    రామ్ చరణ్ రెమ్యూనరేషన్ ఎంత?

    రామ్‌ చరణ్ ఒక్కో చిత్రానికి రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    రామ్ చరణ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    హైదరాబాద్ బిర్యాని, మెక్సికన్, చేపల పులుసు

    రామ్ చరణ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    రామ్ చరణ్ కు ఇష్టమైన నటి ఎవరు?

    రామ్ చరణ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తమిళం

    రామ్ చరణ్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    రామ్ చరణ్ ఫెవరెట్ సినిమా ఏది?

    రామ్ చరణ్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్

    రామ్ చరణ్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    పోలో

    రామ్ చరణ్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    London

    రామ్ చరణ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    ఫెరారీ పోర్టోఫినో (రూ. 3.5 కోట్లు), రేంజ్ రోవర్( రూ. 3.5కోట్లు), రోల్స్ రాయిస్ ఫాంటమ్( రూ. 9 కోట్లు). ఇవికాక ఇంక చాలా కార్లు చెర్రీ దగ్గర ఉన్నాయి.

    రామ్ చరణ్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.500కోట్లు

    రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    23.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు

    రామ్ చరణ్ సోషల్‌ మీడియా లింక్స్‌

    రామ్ చరణ్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • "మూడు ఫిల్మ్‌ఫెర్, రెండు నంది అవార్డులు వచ్చాయి. వీటితో పాటు RRR చిత్రానికి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుండి స్పాట్‌లైట్ అవార్డు జీ సినీ అవార్డ్స్: రంగస్థలం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు"

    రామ్ చరణ్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    రాజకీయాల నుంచి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి చేసిన తొలి సినిమా ఖైదీ నం.150ను చెర్రీ నిర్మించాడు. ఇందుకోసం కొనిదెల ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి నిర్మాతగా మారాడు. ఆచార్య, సైరా వంటి చిత్రాలను నిర్మించాడు. ట్రూజెట్‌, ఆపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్ పోలో క్లబ్‌ వంటి వ్యాపారాల్లో షేర్స్ ఉన్నాయి.

    రామ్ చరణ్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    మిషో, ఫ్రూటీ బ్రాండ్లకు ప్రమోటర్‌గా ఉన్నాడు

    రామ్ చరణ్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    రామ్‌ చరణ్‌కు ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం లేకున్నా ఆయన తన బాబాయి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి బహిరంగంగా మద్దతు తెలిపాడు.
    రామ్ చరణ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రామ్ చరణ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree