మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు సినీ పరిశ్రమలోని అగ్రహీరోల్లో ఒకరు. తన అద్భుతమైన నటనా సామర్థ్యం, మెస్మరైజ్ డ్యాన్సింగ్ ప్రదర్శనతో తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి… RRR చిత్రంతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయినప్పటికీ.. అత్యంత డౌన్ టు ఎర్త్‌గా ఉండటంతో ఆయనకు విస్తృత అభిమానం పొందారు. ఈక్రమంలో రామ్ చరణ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
రామ్ చరణ్ ఎవరు?
టాలీవుడ్‌లో స్టార్ హీరో, RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు
రామ్ చరణ్ పుట్టినరోజు ఎప్పుడు?
రామ్ చరణ్ మార్చి 27, 1985న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించారు. మెగాపవర్ స్టార్ వయసు 39 ఏళ్లు.
రామ్ చరణ్ ముద్దు పేరు?
చెర్రీ
రామ్ చరణ్ ఎత్తు ఎంత?
5 అడుగల 8 అంగుళాలు
రామ్ చరణ్ అభిరుచులు?
చరణ్‌కు ఫిట్‌నెస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు జిమ్‌లో సాధన చేస్తుంటాడు. హార్స్ రైడింగ్ అంటే కూడా ఇష్టం
రామ్ చరణ్ హీరోగా ఎన్ని సినిమాలు వచ్చాయి?
రామ్ చరణ్ తన 15 ఏళ్ల కెరీర్‌లో 15 సినిమాల్లో నటించాడు
రామ్ చరణ్ ఏ యాక్టింగ్ స్కూల్‌లో చదివాడు?
తన సినీరంగ ప్రవేశానికి ముందు, చరణ్ ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఈ స్కూలు చాలా ఫేమస్. హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ అందరూ ఇక్కడ నటనను అభ్యసించారు.
రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నాడా?
జూన్ 14, 2012న, రామ్ చరణ్ తన స్నేహితురాలైన కామినేని ఉపాసనను వివాహం చేసుకున్నాడు. ఉపాసన అపోలో హాస్పిటల్స్‌కు CEO.
రామ్‌చరణ్‌కు ఉపాసనకు ఎలా పరిచయం అయింది?
రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ లండన్‌లోని రీజెంట్ యూనివర్శిటీలో తమ చదువును పూర్తి చేసారు, ఆ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారు.
రామ్ చరణ్- ఉపాసనకు ఎంతమంది పిల్లలు?
వీరిద్దరి ఒక పాప జన్మించింది. పాప పేరు క్లింకారా
రామ్ చరణ్ ఎక్కడ నివసిస్తున్నారు?
రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఒక విలాసవంతమైన ఎస్టేట్‌లో నివసిస్తున్నారు.
రామ్ చరణ్ కొత్త సినిమా ఏంటి?
రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు దర్శకుడు శంకర్
రామ్ చరణ్‌కి ఇష్టమైన ఆహారం?
రామ్ చరణ్ వంట చేయడం చాలా ఇష్టం. బిర్యానీ అతనికి ఇష్టమైన వంటకం.
రామ్ చరణ్ వ్యాపారాలు?
గుర్రపు పందేలపై తనకున్న అభిరుచిని సూచించేందుకు చరణ్ హైదరాబాద్‌లో పోలో టీమ్‌ని కొనుగోలు చేశాడు. అతను స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లో వాటా కలిగి ఉన్నాడు.
రామ్ చరణ్‌కు వచ్చిన సినిమా అవార్డులు?
తన కెరీర్ మొత్తంలో, రామ్ చరణ్ అనేక గౌరవాలను అందుకున్నాడు. మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు గెలుచుకున్నాడు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం