• TFIDB EN
  • రమ్య కృష్ణన్
    జననం : సెప్టెంబర్ 15 , 1970
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
    రమ్య కృష్ణ భారతీయ సినీ నటి. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ భార్య. 1985లో వచ్చిన భలే మిత్రులు సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. సూత్రధారులు చిత్రం ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందినప్పటికీ ఈమెకు చాలా ఏళ్లపాటు అవకాశాలు రాలేదు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన అల్లుడుగారు చిత్రం రమ్య కృష్ణ కెరీర్‌కు బ్రెక్ ఇచ్చింది. తెలుగులో దాదాపు అగ్రహీరోలందరి సరసన ఆమె నటించింది. నరసింహ చిత్రంలో సూపర్‌స్టార్ రజినీ కాంత్‌తో పోటీపడి మరి నటించి నీలంబరి పాత్ర ద్వారా రక్తి కట్టించింది. అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, అల్లుడా మజాకా, ఆహ్వానం, ఘరానా బుల్లోడు, ధర్మ చక్రం, మేజర్ చంద్రకాంత్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. దాదాపు దశాబ్దకాలం అగ్రహీరోయిన్‌గా కొనసాగింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. బాహుబలి, శైలజారెడ్డి అల్లుడు, రిపబ్లిక్, రొమాంటిక్, గుంటూరు కారం వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన అద్భుత నటనను కనబరుస్తోంది.
    Read More
    తెలుగులో చిరంజీవి, రమ్యకృష్ణ జంటగా నటించిన చిత్రాలు ఇవేEditorial List
    తెలుగులో చిరంజీవి, రమ్యకృష్ణ జంటగా నటించిన చిత్రాలు ఇవే
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?Editorial List
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు! మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మనసిచ్చిన ఈ హీరో ఇప్పుడు మనువాడేందుకు రెడీ అవుతున్నాడు. గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌పై సైలెంట్‌గా ఉన్న వీరు ఏకంగా పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలిసి సినిమాల్లో నటించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నది వీరొక్కరే కాదు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు. ఆ జంటలేవో తెలుసుకుందాం.  https://twitter.com/tupakinews_/status/1667059120313352192?s=20 https://twitter.com/Pallavi_M_K/status/1664277523608518657?s=20 కియారా- సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ షేర్షా సినిమాతో పరిచయం. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరికి పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నయనతార- విఘ్నేష్ శివన్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నయన్.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. కొంతకాలంగా నడిచిన వీరి ప్రేమాయణం పెళ్లి పీటలెక్కి మరో స్థాయికి చేరుకుంది. 2022లో వీరికి వివాహం కాగా సరోగసి విధానంలో వీరు సంతానాన్ని పొందారు.  Screengrab Instagram:nayanatara నమ్రత- మహేశ్ బాబు నమ్రత, మహేశ్ బాబులది ప్రేమ వివాహమే. వంశీ సినిమాతో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. అప్పుడే మిల్క్ బాయ్ ప్రేమల్లో పడ్డాడు. ఐదేళ్ల పాటు నమ్రతతో ప్రేమాయణం నడిపి చివరికి నాన్న కృష్ణ పర్మిషన్‌తో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. గౌతమ్, సితార.  అలియా భట్- రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్.. ప్రేమ ద్వారానే ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేమలో పడ్డారు. 2022లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ కుమార్తె పుట్టింది.  విజయనిర్మల- కృష్ణ సెలబ్రిటీ కపుల్స్‌లలో ఎప్పటికీ గుర్తుండిపోయే జంట వీరిది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బాపూ ‘సాక్షి’ సినిమాతో వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. అలా సంవత్సరాలు గడిచాక 1969లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.  జ్యోతిక- సూర్య  సౌత్‌లో పేరొందిన సెలబ్రిటీ కపుల్ జ్యోతిక- సూర్య. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంతో అభిమానం, ప్రేమ. 2006లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు(దియా), కుమారుడు(దేవ్).  అమల- నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున, అమల సెలబ్రిటీల జంటకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 1992 జూన్‌లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్ధం, కిరాయి దాదా, శివ, నిర్ణయం సినిమాల్లో ఈ జంట కలిసి పనిచేసింది.  నిక్కీ గల్రానీ- ఆది పినిశెట్టి గొడవలతోనే వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. ‘మలుపు’ సినిమా వీరి జీవితాలను మలుపు తిప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య గొడవలు, మనస్పర్దలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత అర్థం చేసుకుని ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ప్రేమలో పడి 2022, మే నెలలో ఒక్కటయ్యారు. జీవిత- రాజశేఖర్ జీవిత, రాజశేఖర్‌లది విచిత్ర ప్రయాణం. తలంబ్రాలు సినిమాతో వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమా చిత్రీకరణ సమయంలో రాజశేఖర్‌కి గాయాలైతే దగ్గరుండి చూసుకుంది జీవిత. అలా తమ ప్రేమను పెద్దలతో పంచుకుని నిజ జీవితంలోనూ హీరో, హీరోయిన్లు అయ్యారు. 1991లో వీరి వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు. శివానీ, శివాత్మికలు హీరోయిన్లుగా చేస్తున్నారు.  షాలిని- అజిత్ బేబి షాలినిగా గుర్తింపు పొందింది షాలిని. తమిళ స్టార్ అజిత్‌తో ప్రేమాయణం పెళ్లి పీటల దాకా తీసుకొచ్చింది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. దీపిక పదుకొణె- రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాజీరావ్ మస్తానీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అనంతర కాలంలో ప్రేమలో మునిగి తేలి 2018లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంటలు కూడా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్-జయా బచ్చన్, శ్రీకాంత్- ఊహ, అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, శివబాలాజీ- మధుమిత, వరుణ్ సందేశ్- వితిక, రాధిక- శరత్ కుమార్, ఆర్య- సాయేషా సైగల్ కూడా ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
    జూన్ 09 , 2023
    Nayanthara: ‘మీరు చేసిన పనికి నా హృదయం ముక్కలైంది’.. ధనుష్‌పై నయనతార ఫైర్‌ తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి నయనతార (Nayanthara) లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆమె జీవితంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఓ డాక్యుమెంటరీని సైతం రూపొందిస్తుండటం విశేషం. అయితే ఈ డాక్యుమెంటరీకి కోలీవుడ్‌ స్టార్ ధనుష్‌ సమస్యలు సృష్టించినట్లు తెలుస్తోంది. ధనుష్‌ వల్లే డాక్యుమెంటరీ రిలీజ్ ఆలస్యమవుతోందని టాక్‌ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్‌కు ఓ బహిరంగ లేఖ రాసిన నయనతార అందులో అతడిపై విరుచుకుపడింది. ఈ వ్యవహారం కోలీవుడ్‌ సహా భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.  అసలేం జరిగిందంటే? 2015లో నయనతార చేసిన 'నానుమ్‌ రౌడీ' (తెలుగులో నేను రౌడీనే) చిత్రానికి ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నటిగా ఆమెకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాను అప్పట్లో ధనుష్‌ నిర్మించడం గమనార్హం. ప్రస్తుతం రూపొందుతున్న నయనతార డాక్యూమెంటరీ ‘బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ (Nayanthara: Beyond the Fairy Tale)లో 'నానుమ్‌ రౌడీ దాన్‌' పాటలు, ఫొటోలు, వీడియోలను వినియోగించుకోవాలని నయనతార చాలా ఆశపడింది. ఇందుకోసం ధనుష్‌కు పలుమార్లు విజ్ఞప్తులు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ధనుష్ ససేమీరా అన్నారట. దీంతో కెరీర్‌లో ఎంతో కీలకమైన సినిమాను తన డాక్యూమెంటరీలో చూపించలేకపోతుండటంతో నయనతార కోపం కట్టలు తెచ్చుకుంది. ధనుష్‌ను ఏకిపారేస్తూ బహిరంగ లేఖ రాసింది.  ‘నా హృదయాన్ని ముక్కలు చేశారు’ నటుడు ధనుష్‌ (Nayanthara Vs Dhanush)పై రాసిన బహిరంగ లేఖలో నటి నయనతార బహిరంగ విమర్శలు చేశారు. ముఖ్యంగా 'నానుమ్‌ రౌడీ దాన్‌' పాటలు వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు సినీప్రియులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మా జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరం. ఎన్‌వోసీ (NOC) కోసం దాదాపు రెండేళ్ల నుంచి మీతో ఫైట్‌ చేస్తున్నాం. మీరు పర్మిషన్‌ ఇవ్వకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన వెంటనే మీరు పంపించిన లీగల్‌ నోటీస్‌ నన్ను షాక్‌కు గురిచేసింది. అందులో మూడు సెకన్ల క్లిప్స్‌ వాడుకున్నందుకు దాదాపు రూ.10 కోట్లు డిమాండ్‌ చేయడం విచారకరం. ఇక్కడే మీ క్యారెక్టర్‌ ఏమిటనేది తెలిసిపోతుంది. దేవుడే దీనికి సమాధానం చెబుతాడు’ అని రాసుకొచ్చింది.  https://twitter.com/NayantharaU/status/1857680582773551362 ‘ఆసూయ పడకండి’ 'నానుమ్‌ రౌడీ' సినిమాను (Nayanthara Vs Dhanush) ప్రస్తావిస్తూ మరిన్ని విషయాలను లేఖలో నయన్‌ పంచుకుంది. ‘సినిమా విజయం సాధించిన తర్వాత మీ అహం బాగా దెబ్బతిందని సినీవర్గాల నుంచి తెలుసుకున్నా. ఈ లేఖతో నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా. తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయ పడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోండి. ఈ ప్రపంచం అందరిది. ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేని సాధారణ వ్యక్తులు ఇండస్ట్రీలో పైకి వచ్చినా తప్పు లేదు. ఈ విషయంలో కొన్ని కట్టుకథలు అల్లి, పంచ్‌ డైలాగులు చేర్చి తదుపరి ఆడియో విడుదలలో మీరు మాట్లాడవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఇతరుల స్టోరీల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చనే ఉద్దేశంతో మా కథను డాక్యుమెంటరీగా రూపొందించాం. మీరు కూడా దీనిని చూడండి. మీ మంచి తనాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’ అని నయనతార పేర్కొంది.  నవంబర్‌ 18న స్ట్రీమింగ్‌.. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ (Nayanthara: Beyond the Fairy Tale) అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించింది. నవంబరు 18న నెట్‌ఫ్లిక్‌ వేదికగా ఇది విడుదల కానుంది. ఇటీవల ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు స్టార్ హీరో నాగార్జునతో పాటు రానా, ఉపేంద్ర, రాధిక, డైరెక్టర్ అట్లీ వంటి వారు నయనతారతో తమకున్న బంధాన్ని, ఆమెపై ఉన్న అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీలో నయనతార ఫిల్మ్‌ జర్నీతో పాటు డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో ఆమె ప్రేమ, పెళ్లి గురించి చూపించనున్నారు. ఇదిలా ఉంటే నయనతార - విఘ్నేష్‌ కలిసి తొలిసారి ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ చిత్రానికి పనిచేశారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. డాక్యుమెంటరీలో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా విశేషాలు చూపించాలని వీరు భావించగా చిత్ర నిర్మాత అయిన ధనుష్‌ దానికి అంగీకరించలేదు. ఫుల్‌ స్వింగ్‌లో నయనతార ప్రస్తుతం ఫిల్మ్‌ కెరీర్‌ పరంగా నయనతార (Nayanthara Vs Dhanush) దూసుకుపోతోంది. గతేడాది షారుక్ ఖాన్‌తో 'జవాన్‌' చిత్రం చేసి తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ అమ్మడు అడుగుపెట్టింది. అదే ఏడాది 'అన్నపూర్ణి'గా లేడీ ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ఈ లేడీ సూపర్‌స్టార్‌ బిజీ బిజీగా ఉంది. తమిళంలో 'టెస్ట్‌', 'మన్నన్‌గట్టి సిన్స్‌ 1960', 'తని ఓరువన్‌ 2', 'ముకుతి అమ్మన్‌ 2' సినిమాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ‘డియర్‌ స్టూడెంట్స్‌’ అనే చిత్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివర, వచ్చే సంవత్సరంలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే 2022లో డైరెక్టర్‌ విఘ్నేశ్‌ను పెద్దల సమక్షంలో నయన్‌ వివాహం చేసుకుంది. వీరికి సరోగసి విధానంలో పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. 
    నవంబర్ 16 , 2024
    Nayanthara: ధనుష్‌తో వివాదం.. చిరు, రామ్‌చరణ్‌ను ఆకాశానికెత్తిన నయనతార!  తమిళ హీరోయిన్‌ నయనతార (Nayanthara) లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆమె జీవితంపై రూపొందిన ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ (Nayanthara: Beyond the Fairy Tale) డాక్యుమెంటరీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. అయితే ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush)పై ఇటీవల నయన్‌ తీవ్ర విమర్శలు చేసింది. అది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా అదే డాక్యుమెంటరీకి సంబంధించి టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, తండ్రి కొడుకులైన మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌లపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ అంశం సినీ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.  ‘వారంటే నాకెంతో గౌరవం’ లేడీ సూపర్‌ స్టార్‌కు సంబంధించిన 'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' (Nayanthara: Beyond the Fairy Tale) నవంబర్‌ 18న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ డాక్యుమెంటరీ రూపకల్పనకు, తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో సపోర్ట్‌గా నిలిచిన వారికి తాజాగా నాయనతార ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి (Chiranjeevi), రామ్‌చరణ్‌ (Ram Charan) ప్రత్యేక థ్యాంక్స్‌ చెప్పారు. అటు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) పేరును సైతం ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. వీరితో పాటు షారుక్‌ భార్య గౌరీ ఖాన్‌, తెలుగు, మలయాళ, తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. తన డాక్యుమెంటరీ కోసం వారిని సంప్రదించినప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని నయన్‌ అన్నారు. నిర్మాతలు వారి వద్దకు వెళ్లినప్పుడు చాలా పాజిటివ్‌గా రిసీవ్‌ చేసుకున్నారని తెలిపారు. వారందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. వీరంతా అత్యంత విలువైన క్షణాలను అందించారని కొనియాడారు. వీరిందరిపై తనకెంతో గౌరవం ఉందని నయన్‌ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఇన్‌స్టా పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.  View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) ధనుష్‌తో గొడవ ఎందుకుంటే? 2015లో నయనతార (Nayanthara) చేసిన 'నానుమ్‌ రౌడీ' (తెలుగులో నేను రౌడీనే) చిత్రానికి ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌ (Vignesh Shivan) దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ధనుష్‌ (Dhanush) నిర్మాత. 'నానుమ్‌ రౌడీ'తో నయన్‌కు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నటిగా మంచి పేరు రావడంతో పాటు ఎంతో విలువైన ప్రేమ సైతం ఆ సినిమా ద్వారానే దక్కింది. ఈ నేపథ్యంలో తన  ‘బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ (Nayanthara: Beyond the Fairy Tale)ను హైలెట్‌ చేయాలని నయనతార భావించింది. ఆ సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను వినియోగించుకునేందుకు ధనుష్‌ అనుమతి కోరింది. అయితే రెండేళ్ల నుంచి ధనుష్‌ను అడుగుతున్నా ఆయన స్పందించకపోవడం, పైగా డాక్యుమెంటరీ ప్రోమోలో 3 సెకన్ల 'నానుమ్‌ రౌడీ దాన్‌' కంటెంట్‌ను వాడటంపై ధనుష్‌ లీగల్‌ నోటీసులు పంపడం నయనతారను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో ధనుష్‌ను విమర్శిస్తూ బహిరంగ లేఖ రాసింది. ధనుష్‌ చర్యలతో తన హృదయం ముక్కలైందని పేర్కొంది. మీ మంచి తనాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించాలని మండిపడింది.  https://twitter.com/NayantharaU/status/1857680582773551362 నయనతారకు మద్దతుగా మహేష్‌! ధనుష్‌ - నయనతార మధ్య వివాదానికి కారణమైన డాక్యుమెంటరీ (Nayanthara: Beyond the Fairy Tale)పై సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) ఇటీవల స్పందించాడు. డాక్యుమెంటరీ చూసిన మహేష్ అందులో నయన్‌ - విఘేష్ లవ్‌ ఎపిసోడ్‌ చూసి చాలా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా నయన్‌, విఘ్నేష్‌, ఇద్దరు పిల్లలతో ఉన్న డాక్యుమెంటరీ పోస్టర్‌ను మహేష్‌ ఇన్‌స్టా స్టేటస్‌గా పెట్టాడు. మూడు లవ్‌ సింబల్స్‌ను దానికి జత చేశాడు. ఇది ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది. ధనుష్‌ - నయనతార (Nayanthara Vs Dhanush) మధ్య వివాదం కొనసాగుతున్న వేళ మహేష్‌ రియాక్షన్‌ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే నయనతార- మహేష్‌ బాబు కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. వీరి జోడిని తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆశపడ్డారు. మరి భవిష్యత్‌లోనైనా వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. https://twitter.com/GulteOfficial/status/1858556384079761643 దూకుడు ప్రదర్శిస్తున్న లేడీ సూపర్ స్టార్‌! ప్రస్తుతం ఫిల్మ్‌ కెరీర్‌ పరంగా నయనతార దూసుకుపోతోంది. గతేడాది షారుక్ ఖాన్‌తో 'జవాన్‌' చిత్రం చేసి తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ అమ్మడు అడుగుపెట్టింది. అదే ఏడాది 'అన్నపూర్ణి'గా లేడీ ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ఈ లేడీ సూపర్‌స్టార్‌ బిజీ బిజీగా ఉంది. తమిళంలో 'టెస్ట్‌', 'మన్నన్‌గట్టి సిన్స్‌ 1960', 'తని ఓరువన్‌ 2', 'ముకుతి అమ్మన్‌ 2' సినిమాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ‘డియర్‌ స్టూడెంట్స్‌’ అనే చిత్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివర, వచ్చే సంవత్సరంలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే 2022లో డైరెక్టర్‌ విఘ్నేశ్‌ను పెద్దల సమక్షంలో నయన్‌ వివాహం చేసుకుంది. వీరికి సరోగసి విధానంలో పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. 
    నవంబర్ 21 , 2024
    Father's Day Special: నాన్నలతో ఈ స్టార్‌ సెలబ్రిటీల అనుబంధం చూశారా? ఫాదర్స్ డే (Fathers Day 2024)ను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. తమ కూతుళ్లు, కొడుకులు, తండ్రులతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ వారిపై తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన తండ్రి వెంకట్రావుతో కలిసి ఉన్న ఓ పాత ఫొటోను షేర్ చేశారు. ‘ప్రతి చిన్నారికి తన తండ్రే తొలి హీరో. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.  https://twitter.com/KChiruTweets/status/1802187791251509401 మహేష్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara) కూడా తన తండ్రితో కలిసి ఉన్న క్యూట్‌ ఫొటోను షేర్ చేసింది. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా.. ఐ లవ్ యు సో మచ్’ అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి కూడా ఫాదర్స్‌ డే సందర్భంగా ఆసక్తికర పోస్టు పెట్టింది. భర్త అల్లు అర్జున్‌ తన పిల్లలతో ఉన్న ఫొటోలతో పాటు.. మామ అల్లు అరవింద్ (Allu Aravind), తన తల్లిదండ్రులతో దిగిన పిక్స్‌ను పంచుకుంది.  ‘ప్రపంచంలోని ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే’ అనే క్యాప్షన్ ఇచ్చింది.  View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) యంగ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) కూడా ఫాదర్స్‌ డే సందర్భంగా ఓ ఆసక్తికర ఫొటోను షేర్‌ చేశారు. చిన్నప్పుడు తన తండ్రి నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘ది ఓజీ’ ఈ పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చారు.  లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన హీరోయిన్‌ నయనతార (Nayanthara).. తన భర్త విగ్నేష్ శివన్, కవల పిల్లల ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే విషెస్ చెప్పింది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth) కూతురు ఐశ్వర్య.. తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ‘నా హార్ట్ బీట్, నాకు అన్నీ.. లవ్ యు అప్పా’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దిగ్గజ నటుడు, తండ్రి కమల్ హాసన్‌ (Kamal Hassan)తో తాను, చెల్లి అక్షర కలిసి ఉన్న ఫొటోను నటి శృతిహాసన్‌ షేర్‌ చేసింది.  https://twitter.com/shrutihaasan/status/1802221449899610217 మెగా బ్రదర్‌, తండ్రి నాగబాబు (Naga Babu)తో సెల్ఫీ దిగుతున్న ఫొటోను యంగ్‌ హీరో ‘వరుణ్‌ తేజ్‌’ అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.  కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా తన తండ్రితో పాటు భర్త, తనయుడు నీల్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ‘బెస్ట్ పాపాస్‌కి హ్యాపీ ఫాదర్స్ డే. వి లవ్ యు’ అనే క్యాప్షన్‌ ఇచ్చింది. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)
    జూన్ 17 , 2024

    రమ్య కృష్ణన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రమ్య కృష్ణన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree